ఆహ్వానము
హేతువాద ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్న ఆకాంక్ష కలిగిన హేతువాద మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం. 2013 ఏప్రియల్ 27, 28 తేదీలలో నల్గొండ జిల్లా కోదాడ మండలం, దోరకుంటలోని సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయంలో జరుగు సమావేశానికి హాజరయ్యేవారు ముందుగా తెలియపర్చి హాజరుకాగలరు. ఉదయం 9.00 గంటలకు సమావేశం మొదలవుతుంది కాన సమయపాలన ఖచ్చితముగా పాటించగలరు. హేతువాదము అన్న శీర్షిక క్రింద చర్చ జరుగును గాన తమతమ అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా తయారుచేసుకొని చర్చకు సంసిద్ధులై రాగలరు.
రూట్ : హైదరాబాద్ నుండి వచ్చువారు కోదాడ దిగి 5 కి.మీ. దూరంలోని దోరకుంటకు సర్వీస్ ఆటోలో రాగలరు. విజయవాడ నుండి రాగోరు వారు నల్గొండ లేక కోదాడ బస్ ఎక్కి కోదాడకు 5 కి.మీ. ముందు దోరకుంట చెరువు దగ్గర అని అడిగి దిగి రాగలరు.
No comments:
Post a Comment