సత్యజ్ఞాన సంఘ వ్యవస్థాపకులు, సత్యాన్వేషణాపథగాములు కాగోరువారికి, అందుకు తగిన అవసరమైన గమనరీతి నలవరచుకోవడంలో సహాయకులు, నా జీవన యానంలో భాగమైన ఆలోచనా క్షేత్రంలో మౌలికము, కీలకమూనైన మార్పుకు కారకులు, అనంతరకాలంలో మరికొంత మేర ప్రేరకులు అయిన పెంచలయ్యగారు, వెంకటగిరిలో 25-11-2013న తమజీవన యానాన్ని ముగించారు. కాల ప్రవాహంలో మన మందరం ఒక దగ్గర ఉనికిని, ప్రయాణాన్ని ఆరంభించి, మరోచోట ప్రయాణాన్ని ముగించడం, భౌతిక ఉనికిని కోల్పోవడం అనివార్యమైన ప్రక్రియ. ఏ క్షేత్రంలోనైనా విశిష్టత సాధించి ఉన్న వ్యక్తులు, శారీరకంగా ఉనికిని కోల్పోయినా, వారు విడిచి వెళ్ళిన భావజాలము, వారితాలూకు స్మృతులు సమాజంలో మిగిలే ఉంటాయి. అట్టి వారు మరి కొంతకాలం భావాల రూపంలో కొనసాగుతూ ఉంటారు. మానవేతిహాసంలో, వ్యక్తి ఏమి అనుభవించాడన్నది కాక, ఏమి మిగిల్చివెళ్ళాడన్నదే, తరవాతి తరాల లెఖ్ఖలోకి వస్తుంది.
అది 1981 ప్రాంతం. నేను 1968 నుండి చదువునాపి వివిధ ఆస్థిక సాధనలు చేస్తూ వస్తున్న కాలమది. ప్రసాదు, విజయమ్మ, రాజకుమారి, పిచ్చిరెడ్డి మరికొందరూ నాతో సత్సంగంగా కూడి సాధనలు సాగిస్తున్న రోజులవి. ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా, శాస్త్రవిధానాన్ని తు.చ తప్పకుండా సాధన చేసినా, శాస్త్రోక్త ఫలాలు అందడం లేదేమా? అని పునర్విచారణ చేసుకుంటూ, ఏమి చేద్దాం? ఏమి చేద్దాం? అనీ; ఏదో చేయాలి అనీ మధన పడుతున్న రోజులవి. అలా ఆలోచిస్తున్న క్రమంలోనే, కొంతకాలం జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా, ఎవరికి వారుగా ఒక్కోరకమైన ఆస్థిక సాధనను తీవ్రంగాచేసి ఫలితాలను పరీక్షించి చూసుకుందామని, మూడేండ్ల అనంతరం తిరిగి సమావేశమవుదామని నిర్ణయించుకుని, మనస్సును, శరీరాన్ని అందుకు సన్నద్దం చేసుకునేందుకు క్రమాభ్యాసం కొరకుగా ప్రణాళిక నేర్పరచుకుని సాధన చేస్తున్న రోజులవి.
మాలో ఒకరిగా ఉంటూ సాధనలు చేస్తున్న రాజకుమార్‌గారికి అప్పటికే పెంచలయ్య గారితో పరిచయాలున్నాయి. పెంచలయ్యగారూ తన చిన్న వయస్సులో మాలాగే సాధనలు, అన్వేషణ లంటూ సత్యాన్వేషిగా సాగి సాగి ఒక మజిలీకి చేరి సత్యజ్ఞాన సంఘాన్ని స్థాపించి ఉన్న ఆరంభ దినాలవి. ఆయనతో మాట్లాడితే బాగుండును అన్న సూచన చేశారు రాజకుమార్‌గారు. విజయవాడలోనే ఉంటున్న పెంచలయ్యగారి అనుచరులు సుబ్బన్న గారి ద్వారా పెంచలయ్యగారికి కబురెట్టాం. మాట్లాడుకుందాం రమ్మని ఆస్థిక సాధనల గురించి విచారించుకోవడానికే ఈ సమావేశమని, ఆ విచారణలో తేలిన వైపుకు అందరం కదలాల్సి ఉంటుందని, అందుకు సిద్దపడేట్లయితేనే కలుద్దామని ఒక షరతూ పెట్టి కబురెట్టాం. ఆయనకు అందుకు తనకేమీ అభ్యంతరంలేదంటూ ఒక రోజు బయలుదేరి మా దగ్గరకు వచ్చారాయన.
పరిచయాలయ్యాక, తాత్వికంగా మీరంగీకరిస్తున్న పక్షమేమిటో ప్రకటించి, అది సరైందేనని నాకర్థమయ్యేలా వివరించండి, అని మమ్మల్నడిగారాయన. సరేనంటూ నేనందుకు సిద్దపడి నా పక్షాన్నిలా ప్రకటించాను.
క వేదం ఈశ్వరీయం, సర్వజ్ఞకల్పం. విధేమిటి? నిషిద్దమేమిటి అన్న విషయంలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రయాణించాల్సిందే తప్ప ఎవరిష్టానికి వాళ్ళు సాగకూడదు. అన్నది నా ప్రతిపాదన.
అవునా? ఇంతకూ ఆ వాక్యాల అర్థమేమిటో చెప్పి, అదెలా సరైందో తేల్చండి, అని అడిగారాయన. వేదం ఈశ్వరుని వలన లోకానికి అందింది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక, ఈశ్వరుని చేత అందించబడ్డ వేదమూ అన్ని విషయాలను తెలియ జేయగలిగిందిగా ఉంది. ఇది చేయదగిందా? కాదా అని నిర్ణయించుకోవడానికి వేదము దానికి అనుగుణ్యత గలిగిన గ్రంథాలే ఆధారము. కొలమానము అని నా ప్రతిపాదన వాక్యాలకు అర్థం అని చెప్పాను.
అలాగా! ఈ విషయాలను నీవు తెలిసే చెపుతున్నావా? తెలిసేనని అన్నట్లైతే ఆ విషయాలను ఎలా తెలుసుకున్నావు. నేనెలా తెలిసికోగలను? అని అడుగుతూనే; నీ మొదటి వాక్యంలో రెండు భావాలున్నాయి. ఒకటి ఈశ్వరుడున్నాడనీ, అతడే వేదాన్ని లోకానికిచ్చాడని, నీ రెండోవాక్యం ఆ వేదంలో అన్ని ఉన్నాయనీ అలాంటిది ఇవ్వాలంటే ఇచ్చినవాడు అన్నీ తెలిసినవాడై ఉండాలని. ఇంతవరకు నీవు అంగీకరిస్తున్నట్లేనా అనీ అడిగాడు. మీరు సరిగనే వివరించారు. అంతవరకు నేను పూర్తిగా అంగీకరిస్తున్నవేనని అన్నాను. అలా నా మాటల వెనకనా భావాలేమిటో నా చేతనే అంగీకరింపజేసి, ఇక చెప్పండి, ఆ విషయాలు మీ కెలా తెలిశాయి? అవి సరైన భావాలేనని ఎలా తేల్చుకున్నారు? అని తిరిగి ప్రశ్నించారు.
1. వేదం ఈశ్వర ప్రోక్తమని వేదమే చెపుతోందనీ 2) వేదవేత్తలంటున్నారనీ 3. సాంప్రదాయం వక్కాణిస్తొందనీ 4. ఉపనిషత్తులంటున్నాయని, దర్శన శాస్త్రాలు ఘోషిస్తున్నాయనీ ఇలా నా యోపినంతగా వివరించడం చేశాను. ఇవన్నీ ఓపిగ్గా విని, శాంతంగా, అయితే వేదం ఈశ్వరీయమన్న అభిప్రాయం ఆయా గ్రంథాలు చదవడం ద్వారానూ, అవిబాగా తెలిసిన వారని చెప్పబడుతున్నవాళ్ళు నీ దృష్టికి ఆనిన వాళ్ళు చెప్పగా వినడం ద్వారానూ నీలో ఏర్పడిందన్నమాట! ఇదేనా నీవు చెప్పదలచుకున్నది? అనడిగారాయన.
నిజాయితీగానూ, నిస్సంకోచంగానూ అవునలా ఏర్పడింది. ఈ భావము అనంటునే, అలానే ఏర్పడాలికూడా, నా ప్రతిపాదనలోని మూడో వాక్యంలో శాస్త్రమే ప్రమాణం అంటూ ఆ విషయాన్ని ప్రకటించానుకదా అనీ అన్నాను.
ఏదేని ఒక రచన ద్వారాగానీ, ఒక వ్యక్తి మాటలద్వారాగానీ వారేమంటున్నదీ తెలుస్తుందేగాని, వారంటున్నది అంటే ఆ మాటల ద్వారా ఏర్పడుతున్న భావంలోకి చెందిన వాస్తవ విషయము; వారంటున్నట్లే ఉందనిగాని, లేదని గానీ తెలుస్తుందా? ఉదాహరణకు ఈశ్వరుడున్నాడన్న వాక్యం చదివిన నీకు, ఆ గ్రంథం ఈశ్వరుడున్నాడని అంటుందని తెలిసిందా? ఆ గ్రంథం చెపుతున్న ఈశ్వరుడు తెలియబడ్డాడా? అనడిగారు.
ఈశ్వరుడున్నాడని గ్రంథం చెపుతోందని తెలియడానికీ, ఈశ్వరుడున్నాడని తెలియడానికి తేడా ఉందనిపించినా; ఆ తేడా ఏమిటో అర్థమైయ్యేందుకు కొంత సమయం పట్టింది నాకు. నిశ్శేష్టుడనయ్యేంత ఆశ్చర్యానికిలోనైనాను. అయినా ఏమైనా పొరపాటు పడుతున్నానా? అని మళ్ళీ మళ్ళీ తిరిగి చూసుకున్నాను. ఒక్క విషయం స్పష్టంగా తేలిపోయింది.
ఆయా రచనలు, ఆయా వ్యక్తుల మాటలు సంబంధిత విషయాల గురించి వారంటున్నదేమిటోనన్న అవగాహన కలిగించడానికి సరిపోతాయేగాని, వేటిని గురించి వారు ప్రస్తావిస్తున్నారో వాటి జ్ఞానాన్ని పొందడానికి (ఇవ్వడానికి) పనికిరావు. అన్నదే ఆనాడు నాకు కలిగిన అవగాహన. ఎవరిమాటలైనా, ఏ రచనలైనా మనకు కలిగించగలిగిన అవగాహన ఇంతమాత్రమేనా? అని తరచితరచి చూసుకున్నాను. ఆ సందర్భంలోనే పెంచలయ్యగారు మరో రెండు మాటలడిగారు. చెప్పగలిగిన అనుభవముందా? చెప్పలేని అనుభవముందా?
తెలియజెప్పగలిగిన అనుభవముందా? లేదా? అన్నదే ఆ రెండు మాటలు. వీటిపై ఒకింత జాగ్రత్తగా అనుభవాలను పరిశీలించి చూసుకోగా; భాష ద్వారా ఏమి తెలుస్తుంది? ఏమి తెలియదు? ఎంత తెలుస్తుంది ఎంత తెలియదు? అప్పుడైనా ఆ భాష రానప్పుడేమి తెలుస్తుంది? భాష వచ్చి ఉన్నప్పుడేమి తెలుస్తుంది. అన్న వాటిపై ఒకింత స్పష్టత ఏర్పడింది.
ప్రతి అనుభవాన్ని చెప్పగలమని, చెప్పలేని అనుభవమంటూ ఉండదనీ, అలాగే తెలియని వారికి తెలిసిన వారు తెలియ జెప్పగల అనుభవమంటూ లేదని అర్థమైంది. ఒకటికి నాలుగు సార్లు ఈ సూత్రానికి మినహాయింపులుండే అవకాశముందా అని పరిశీలించి చూసుకున్నాక, ఇది సార్వత్రిక విలువ గల భావనేననీ తేలింది.
అక్కడితో భాషకు సంబంధించిన ఒక సాధారణ సూత్రం రూపుదిద్దుకుంది నాలో.
1) భాష ఒక వ్యక్తి తన భావాలను బైటపెట్టడానికి సాధనం కాగలదనీ, ఆ భాష తెలిసినవారు పరస్పరం ఒకరంటున్నది మరొకరు గ్రహించడానికీ సాధనం అవుతుందనీ తనకు బొత్తిగా తెలియని విషయాన్ని, (అవతలివారు అనుభవం కలిగి చెపుతున్నా, ఎక్కడో విని, చదివి చెపుతున్నా) తెలుసుకోడానికి పనికిరాదనీ, తెలిసిన మాటలాధారంగా గ్రహించే సందర్భంలోనూ అందువల్ల కలిగే జ్ఞానానికీ, ఆ విషయాన్ని సాక్షాత్తుగా గ్రహించడం ద్వారా కలిగే జ్ఞానానికీ తేడా ఉంటుందని, భాషాధారంగా కలిగిన జ్ఞానం నిజానికి పరోక్షజ్ఞానంగానే ఉంటుందనీ, ఆరకమైన జ్ఞానం వల్ల ఏది తెలిసిందనిపిస్తుందో, అదింకా తెలియవలసిందిగానే ఉంటుందని తేలిపోయింది. భాష ద్వారా విషయ సాక్షాత్కారమేకలగనపుడు, ఆ భాష ద్వారా ఎరుకైందన్నది సరైందో కాదో నిర్ణయించగలమన్న ప్రశ్నే ఉత్పన్నంకాదు కదా!
మా మొదటి సమావేశం ప్రారంభమైయ్యాక ఒక నెలయ్యేటప్పటికి, నాలోని అంతర్మధనమేనన్నిక్కడకు చేర్చింది. పెంచలయ్య గారు మరణించిన సందర్భాన్ని పురస్కరించుకుని గతాన్ని స్మరించుకోవడం వారితో తగినంత పరిచయాలున్నవారికి, ఎవరికి వారికి సాధారణంగా జరిగేదే అయినా, నా వరకు నాకు ఆ మా గతాన్ని ఇలా వివేకపథం ద్వారా మీ అందరి ముందూ ఉంచడానికి వెనక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. నిజమైన, నిబద్దతతో కూడిన సత్యాన్వేషకులకు ఈ వివరాలు వారికి సరైన మార్గం చూపడానికీ, ఇప్పటికే నడుస్తూ ఉన్న మార్గాన్ని సరి చూసుకోడానికీ, సత్యాన్వేషణ పేరుతో జరిగే అప మార్గ గమనాన్ని గుర్తించడానికీ ఎంతో కొంత దోహదపడుతుందనే ఈ రచనను మీ ముందుకు తెస్తున్నాను.
అలా; నీదేంటో చెప్పు, అదెలా సరైందోనూ నిర్ధారించు అంటూ ఆయననన్ను ప్రశ్నించడం రూపంలో 1981లో ప్రారంభమైన మా పరిచయం అనంతరం మరింతగా బలపడి దాదాపు 19 సం||లు (2000 వరకు) నిర్విఘ్నంగా, కొనసాగింది. ఈ క్రమంలోనాకంటే ముందునుండే ఆయనతో పరిచయాలున్న వారుగానీ, ఆయన స్నేహితులుగానీ, ఆయన స్థాపించిన సత్యజ్ఞాన సంఘముఖ్యులుగానీ పెంచలయ్యగారితో కలసి కదిలిన దానికంటే, మేమిరువురం కలిసి (జంటగా) నిర్వహించిన కార్యక్రమాలే ఎక్కువ. భావజాల క్షేత్రానికి చెందినంతలో మేమిరువురం అనుకుని నిర్వహించిన కార్యక్రమాలే భావగాంభీర్యతలోనూ, గాఢతలోనూ శ్రేష్ఠమైనవి. వివిధ తాత్విక ధోరణులకు చెందిన పండితులతో మేమిరువురం కూడి చేసినన్ని సైద్దాంతిక చర్చలు, ఆయన ఆయన మిత్రులతో కలిసిగానీ, నేను ఆయనను విడచిగానీ ఆ కాలంలో చేయనేలేదు. మేమిరువురం కలసి రాష్ట్రమంతటా పర్యటనలు చేశాము. ఉత్తరదేశ పర్యటన సందర్భంగా హృషీకేశ్‌లోని పండితులతో ఒకరిద్దరితోనూ ప్రమాణవిచారణ చేశాము.
ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా, 'ఆస్థిక మేధావీ చర్చావేదిక' పేరున నంద్యాల దగ్గరలోని క్రొత్తపల్లి గ్రామంలో ప్రమోదచైతన్యగారి నిర్వహణలో నున్న చైతన్య క్షేత్రంలో అనేక ధోరణులవారితో కూడిన తొలి సమావేశం నిర్వహించాము. అనంతరం దానికొనసాగింపుగా, మరింత పటిష్టమైన నియమనిబంధనలతో కూడిన - తత్వచర్చావేదికను రూపొందించి, దానిపై దాదాపు 20 పైగా ప్రసిద్ద తాత్విక ధోరణులపై చర్చలు నిర్వహించాము.
వివిధ ధోరణులకు చెందిన పండితులతో పరిచయాలు, చర్చలు, స్నేహాలూ కొనసాగిస్తూనే ఉన్నా వారిలో కొద్దిమంది మాత్రం అతి సన్నిహితులుగా ఏర్పడ్డా అందులో సత్యజ్ఞాన సంఘ సభ్యులు, స.మండలి సభ్యులు కాక, నంద్యాల ప్రాంతం నుండి ప్రమోద చైతన్య; నారాయణశెట్టి, పాములేటి, సంజీవరాయుడుగార్లూ, నెల్లూరు ప్రాంతం నుండి మనోహర్ హిందన్నతను, తిరుపతి నుండి సోంప్రకాష్‌గారూ రఘపతిరావ,ు వేదపారాయణ, కె. శ్రీనివాసులుగార్లూ, కాళహస్తి ప్రాంతం నుండి బోధ చైతన్య, అక్బర్‌భాషా, చిరంజీవులు, రామ్మూర్తి, సుబ్రహ్మణ్యంగార్లూ ముందుగా చెప్పవలసినవారుగా ఉన్నారు. వారిలోనూ పెంచలయ్యగారు, నేను, సోంప్రకాష్, శ్రీనివాసులుగారు, మనోహర్‌హింద్, ప్రమోదచైతన్యగారు కలసి, ఉమ్మడిగా సమాజంలో పనిచేయాలన్న దృష్టితో రెండు మూడుసార్లు సమావేశమయ్యాం. అలాంటి కృషికి ప్రణాళిక రచన రూపొందకముందే మనోహర్‌హింద్, ప్రమోద చైతన్యగార్లు అలాటి ఉమ్మడి వేదిక యత్నాల నుండి వైదొలగారు. వారిరువురూ వారిదైన రీతిలో హైందవం వైపు మొగ్గిసాగిపోయారు.
అటుతరవాత నేను పెంచలయ్యగారు, సోంప్రకాష్, శ్రీనివాసులు గారు కలసి మరికొన్నిసార్లు ఈ దిశగా కదలడానికై కొంత కృషి చేశాం. ఉత్తమ సమాజం ఆదర్శంగా 'జనహిత' అన్న పేరుతో పనిచేద్దామనుకుని కొంతమేర భావజాలాన్ని రూపొందించే యత్నం చేశాం. అదీ మా మధ్య తగినంత భావసారూప్యత నెలకొనకపోవడంతో క్రియారూపం ధరించకుండగనే అర్థాంతరంగా ఆగిపోయింది.
ప్రధానంగా మాయిరువురిదీ విచారణ మార్గమే అవడంతోనూ, మిగిలిన బృందంలోని వ్యక్తులకూ విచారించడం, చర్చించడం, పరీక్షించడం అన్న రీతులు అంగీకారమై ఉండడంతోనూ మా మధ్య పలు అంశాలపై మిత్రులంగా ఉంటూనే వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండేవి. అయినా మేమంతా కలసి ఉద్యమించడానికి వీలుగా, ముఖ్యమైన అంశాలవరకైనా ఏకాభిప్రాయానికి రాలేకపోయాము. కనుకనే 20 ఏండ్లపాటు కలసి విచారణ మార్గంలో ప్రయాణించీ ఉమ్మడివేదికను ఏర్పరచుకోలేకపోయాము. నేను మరికొందరు స.మండలి వాళ్ళగానూ, పెంచలయ్యగారు వారి బృందం సత్యజ్ఞాన సంఘంగానూ, సోంప్రకాష్ ధర్మాచరణ మండలిగానూ విడివిడిగానే కొనసాగుతూ వస్తున్నాం. శ్రీనివాసులుగారున్నూ తనదైన రీతిలో సాగుతూ ఉన్నారు.
ఇక పెంచలయ్యగారితో చిన్ననాటి నుండీ స్నేహం చేస్తూ, సత్యజ్ఞాన సంఘంలో ముఖ్యులుగానూ కొనసాగుతున్న వారు చెంచుకృష్ణయ్యగారు, గఫూర్, కృష్ణారావు గార్లూ ఆ సంస్థలో ముఖ్యులే. వీరుగాక వెంకటగిరిలో మరికొంతమందీ పెంచలయ్యగారితో సమావేశమవుతూ ఉన్నవారూ ఉన్నారు.
వీరుగాక, పెంచలయ్యగారికంటె ముందునుండీ ఆస్థికక్షేత్రాలలో ఉంటూ వారి దృష్టిలో జ్ఞానం కలవారి క్రింద పరిగణింపబడుతున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారనిపించింది నా వరకునాకు. అది నిజమో కాదో ఖచ్చితంగా తెలియదు. 1) కంచి కామకోటి పీఠం పరమాచార్య చంథ్రేఖరేంద్ర సరస్వతి, 2. రమణమహర్షి 3. జిల్లెళ్ళమూడి అమ్మ 4. ఒకనాడు శ్రీశైలంలో ఉన్న పూర్ణానంద 5. ఋషీకేశ్ శివానంద సరస్వతి అన్న వీరి పట్ల ఆయన గౌరవభావం ఉన్నట్లు అనిపించేది అప్పుడుప్పుడు వారిగురించిన ప్రస్తావన వచ్చిన సందర్భాలలో ఆ పెంచలయ్యగారు మాట్లాడే మాటలను బట్టి.
సత్యజ్ఞాన సంఘాన్ని స్థాపింపక ముందు 'సత్యాన్వేషి' పేరున పెంచలయ్యగారి రచనలు చిన్న చిన్నవి ఒకటి రెండు ఉన్నాయి. వీరు అన్వేషణ ఆరంభించిన తొలినాళ్ళలో వీరూ, వీరితో పాటు మరో నలుగురు మిత్రులూ కూడా కలిసి ఉండేవారని వారే చెప్పారు నాతో. వారిలో శ్రీనివాసులుగారు, ఈశ్వరయ్య, మరొకాయన (పేరు గుర్తుకురావడంలా) రసవిద్యలోపడి కొట్టుకుపోయినాయనొకరు ఉన్నారు. ఇక ఇక్కడికి ఈ వివరాల ప్రస్తావనను ఆపి, ఇదంతా ఎందుకన్న దగ్గరకు వస్తాను.
పాఠక మిత్రులారా ! ఇక్కడినుండి నేను ప్రస్తావిస్తున్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆమూలాగ్రం పరీక్షపెట్టి చూడండి. అవి మీ జిజ్ఞాసాపథంలో, సత్యాన్వేషణ సందర్భంలో ఎంతో కొంత దోహదపడగల వేమో ఆలోచించుకోండి.
1. పెంచలయ్య గారితో కలసి 1981 నుండి 2000 వరకు అత్యంత సన్నిహితంగా, అనంతరం అంతంత మాత్రంగానే అయినా 2009 వరకూ వెరిసి 27, 28 ఏండ్లు సాగిన పరిచయం, అనుబంధం మాది.
2. నాకంటే ముందు నుండే ఆయనతో స్నేహము, సాన్నిహిత్యమూ ఉన్న వారెందరో ఉన్నప్పటికీ, మేమిరువురం కలిసి తిరిగినంత తిరుగుడుగానీ, చేసినంతగా వివిధ ధోరణులతో సైద్ధాంతిక చర్చలుగాని, నిర్వహించిన సమావేశాలుగాని, ప్రమాణ, పదార్థ క్షేత్రాలకు సంబంధించిలోతైన చర్చలుగానీ, ఆయనతోనూ, ఆయనతో కలసి ఇతరులతోనూ మరెవ్వరూ చేయలేదు.
3. నాతో విచారణకు కూర్చున్నప్పటి నుండే కాక, అంతకుమునుపుకూడా పెంచలయ్యగారు తనదైన ప్రత్యేక రీతిననుసరించే సంభాషించేవారు. దాదాపు ఆయన చివరి రోజుల వరకూ కూడా ఇతరులతో మాట్లాడడానికి ఆ విధానాన్నే వినియోగించారు. అదేమిటో ఊహించగలరా? పెంచలయ్య గారితో పరిచయాలుండి, ఆయనతో లోతుగా చర్చకు దిగిన వాళ్ళలో కొందరికి అది తెలుసు.
తనది చెప్పకుండానే ఇతరులది చెప్పించుకుని పరీక్షించడమన్నదే ఆ విధానం.
నా ఎరుకలోకి రాని గోష్ఠుల్లోగాని, దగ్గర మిత్రులెవరితో గాని ఏమరుపాటుగా తన భావాలనేమైన చెప్పారేమోగాని, నాకెరుకైనంతవరకు, తాను సత్యజ్ఞానం అనుకుంటున్న ముఖ్య విషయాలను గురించి ఆయన ఎననడూ ఇవిగో నా వంటూ ప్రకటించలేదు.
క సిద్ధాంత చర్చలప్పుడు కూడా తనది చెప్పేదికాదనే అనేవారు. ఎందుకని అలా అడిగితే, వినేవాడికి దీనిని గ్రహించే సామర్థ్యం లేదు గనుక అని అనేవారు.
క చెప్పితే విషయం తెలియదు. చూసి తెలుసుకోవలసిందే లేదు తాకి చూపించి తెలపాల్సిందేనని నిక్కచ్చిగా, నిర్మొగమాటంగా చెప్పేసేవారు. ఈ విషయంలో మొదటినుండీ ఈ నాటి వరకూ మాయిరువురి మధ్య విభేదం కొనసాగుతూనే ఉంది.
క జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన మేర్పడుతున్న క్రమమేమిటి? జ్ఞానార్జనా విధానాలు, పరికరాలు ఏమిటి? వాటి ద్వారా ఎన్ని రకాల జ్ఞానం కలుగుతుంది? ఆయా విధానాల ద్వారా కలిగే ఆయా తరహా జ్ఞానాల బలాబలాలేపాటివి? కలిగిన జ్ఞానంలో ఒప్పు జ్ఞానమూ తప్పు జ్ఞానమూ ఉండే వీలుందా? లేదా? కలిగింది ఒప్పుజ్ఞానమో, తప్పుజ్ఞానమో నిర్ణయించుకునేదెలా? తప్పు జ్ఞానం కలగకుండేలా, ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఉండడానికి ఏవైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? వగైరాలన్నంటినీ వివరించే విద్యను - శాస్త్రాన్ని - ప్రమాణ విద్య అంటారు. జ్ఞాన సిద్దాంతమనీ (ఎపిస్టమాలజీ) అంటారు దానినే.
దాంతోబాటు ఆ ప్రమాణాల ద్వారా కలుగుతున్న జ్ఞానాన్ని ఎన్ని రకాల రాశులుగా విభజించుకోవచ్చు? వగైరాలను వివరించే విద్యను పదార్థ విద్య అనంటారు. ఈ రెంటినీ కలిపి మేము (పెంచలయ్యగారూ, నేను) లక్షణ ప్రమాణ విద్య అన్న పేరుతో పిలిచే వాళ్ళం. చూపునిచ్చే విద్య అనీ అంటుండేవాళ్ళాం. సత్యాన్వేషకులుగ సరైన రీతిలో సాగాలనుకునే వారికెవరికైనా ఈ రెండు విద్యలను వినియోగించుకోవడం చేతనైయ్యుండాలి. మేము గానీ, వెనకటి మేధావులలో ఈ విద్యల నెరిగిన వారుగానీ వాడుతున్న పదజాలాన్ని వాడకున్నా వచ్చిన ముప్పేమీ లేదుగాని, ఈ విద్యను సమర్థవంతంగా వినియోగించుకోలేకుంటే మాత్రం ఎంతో కొంత నష్టం ఉంటుంది.
కనుకనే ఈ విషయం వరకు అంటే ఈ విద్య సామాజికావసరం కనుక సమాజానికందించాలి అన్నంతవరకు నేనూ, పెంచలయ్యగారూ ఏకాభిప్రాయం కలిగిఉన్నాం. అంతేకాదు ఒక వ్యక్తి గాని సంస్థ గాని సమాజానికి చేయగల అత్యున్నత సేవ, చూపునిచ్చే విద్య అయిన ఈ విద్యను నేర్పడం ద్వారా వ్యక్తుల్ని చూడగలవారినిగా తయారు చేయడమేనన్న విషయంలోనూ ఏకాభిప్రాయం కలిగే ఉన్నాం.
క ఈ అంశం ఆధారంగానే, తెలియని విషయాలను, చూపి తెలపడం లేదా చూసి తెలుసుకోవడం అన్న విధానం వల్ల మాత్రమే తెలుసుకోవడం సాధ్యపడుతుందనీ చెపుతుండేవాళ్ళం.
క అయితే ఇతరులతో మేము మాట్లాడేటప్పుడు అనుసరించే విధానం మాత్రం ఎవరిది వారిదిగా ఉండేది. నా విధానం, నాది చెపుతాను పరీక్షించు, నీది చెప్పు పరీక్షిస్తాను. సత్యమని తేలిన దానిని ఇరువురం స్వీకరించాలి, అసత్యమని తేలిన దానిని ఇరువురం విసర్జించాలి. తేలనివాటిని అనిర్థారితాల జాబితాలో ఉంచాలి. అన్నది కాగా,
క పెంచలయ్యగారు, తనది చెప్పేదికాదనీ, ఇతరులు దానిని పరీక్షించలేరని ఒక రకంగా తనది పరీక్షింపనక్కరలేదని అన్న దృష్టిని ప్రదర్శిస్తూ, ఇతరుల దానిని మాత్రం నీదేమిటో చెప్పు పరిశీలిస్తాను. తప్పుంటే తప్పంటాను. ఒప్పైతే ఒప్పుకుంటాను అన్న విధానాన్ని అనుసరించేవారు. ఇక్కడ మా యిరువురికీ సంబంధించిన అత్యంత కీలకమైన విషయాన్ని చెప్పాలి. మీరు దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తులో ఉంచుకోవాలి.
క మా యిరువురిలో స్థిరంగా నెలకొన్న విధాన పరమైన ఈ తేడావల్ల, ఆయన తన భావాలను ఇవి నా వంటూ ఎప్పుడూ నాకు చెప్పలేదు. మీవేమిటో చెప్పమని నేనూ ఆయన్ని అడగలేదు.
మరలాటప్పుడు మా మధ్య చర్చలు సాగడానికి వీలేముంది? నేను నా షరతుల ప్రకారం ఆయన లేవనెత్తిన అంశాలపై నా అభిప్రాయాలను చెప్పి పరీక్షించమనేవాణ్ణి. ఆయనకవి సరైనవేననిపించినంతవరకు మా మధ్య సంభాషణ చర్చ రూపాన్ని ధరించేదికాదు. కానీ నా అభిప్రాయంపై ఆయన దోషారోపణలు చేసిన సందర్భంలో, ఆయన లేవనెత్తిన దోషాలను ఖండిస్తూ, నా అభిప్రాయాన్ని నిలబెట్టుకునేందుకు పూనుకునేవాణ్ణి, అలా మా మధ్య జరిగిన చర్చలన్నీ, నేను ప్రతిపాదన చేసిన వాటిపై ఖండన మండనల రూపంలో సాగేటివిగానే ఉండేవి. అయితే నా అభిప్రాయాన్ని ఖండించడానికి ఆయన లేవనెత్తిన ఖండన రూపాలతో ఆయన పరీక్ష కొరకుగా లేవనెత్తినవీ నిజంగా తానలానే తలపోస్తున్నవీ కూడా కలసుండేవి. అలాటి వాటిలో, ఏవి ఆయన సొంత భావనలో, ఏవి కేవలం నా అభిప్రాయాల బలాన్ని పరీక్షించడానికుద్దేశించినవో తేల్చుకోవడం ఒక పట్టాన అయ్యేదికాదు, ఎందుకంటే లక్షణ ప్రమాణ విద్యను నేర్పే సందర్భంలో నేను అదే పద్దతిని అనుసరిస్తున్నవాణ్ణి కనుక, నా పక్షంలో అతడి బలాన్ని పరీక్షించడానికీ, అతని ఆలోచనకు పదునెట్టడానికీ నేను వాడేవీ, నా సొంత భావాలుగా తలంచుతూ వాడేవి. అన్న రెండు రకాలు ఉండడం నాకు తెలిసి ఉన్నదే.
అయితే పెంచలయ్యగారితో పరీక్షా సందర్భంలో అలాటి పరిస్థితి నాకెదురైనపుడు, ఆయనతో, నాతో విభేధిస్తూ మీరు ప్రకటించేవి నిజంగా మీవైయుంటే ఆ మేరకు మీరు తప్పవగాహనలో ఉన్నారని నిర్థారించగలను అంటుండేవాఢిని. ఇక్కడొక సత్యాసత్య వివేచనకు సంబంధించిన సూత్రం - నియమం - ఉంది. అది ఆయనకూ తెలుసున్నదే.
సూత్రం :- 1. ఏదేని ఒక విషయంలో అనేకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడి ఉంటే, అవన్నీ సరైనవేననడం అసాధ్యం. అందులో ఏదో ఒకటి సరైందైయ్యుండవచ్చు. లేదా అన్నీ దోష రూపాలే అయ్యుండవచ్చు. అస్సలు నిజం మరోటైయ్యుండవచ్చు.
2. అలాగే అందులో ఒకటి పరీక్షింపబడి అది సరైందికాదని తేలినంత మాత్రాన ఇతరాలు సరైనవని కానీ, ఇతరాల్లో ఏదోఒకటి సరైందవుతుందని గానీ నిర్థారణైనట్లు కాదు. వీటిలో ఎన్ని సరైనవి కాదని తేలినా మిగిలింది సరైందేనని తేలినట్లుకాదు.
3. అదే మరి వాటిలో ఏ ఒక్కటి సరైందని నిర్థారణైనా, మిగిలినవన్నీ సరికానివని తేలినట్లే. ఈ సూత్రం అర్థమైతే కాని సత్యాసత్య పరీక్షా సందర్భంలో ఎదురయ్యే ఒక అడ్డంకి తొలగదు.
ఈ సూత్రాన్నాధారం చేసుకునే, మీరుగాని నాతో నిజంగా విభేదిస్తున్నట్లైతే మీ పక్షం సరైంది కాదని నిరూపించగలను, అంటుండేవాడిని.
క జ్ఞానక్షేత్రంలో తిరుగాడుతుండే వాళ్ళకు 1. పరీక్షా పద్దతులు తెలిసి ఉండడం 2. రాగద్వేష రహితంగా పరీక్షించడానికీ, పరీక్షింపబడడానికీ, పరీక్షా ఫలితాలను స్వీకరించడానికి సిద్దంగా ఉండడం అన్న రెండు యోగ్యతలు (సామర్థ్యాలు అనీ అనవచ్చు వీటిని) ఉండితీరాలి.
క శోచనీయమైన వాస్తవమేమిటంటే ఈ రెండు యోగ్యతలూ ఉన్నవారు ఆ క్షేత్రాలలో చాలా అరుదుగా ఉంటున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిభాషలో వీటినే 1. శాస్త్రీయ పద్దతి 2. శాస్త్రీయ దృక్పథం అనంటున్నారు.
గమనిక :- భారత రాజ్యాంగంలోనూ దీనికి సంబంధించిన ఒక సూత్రమే పొందుపరచబడి ఉంది. దానినీ, దానిని ఆ రీతిగా రూపొందించిన వారినీ స్మరించుకోవడం సందర్భోచితమేననుకుంటాను.
ఆర్టికల్ 51/ఎ భారత పౌరుని ప్రాథమిక విధుల్ని గురించి నిర్ధేశిస్తొంది. అందులో హెచ్ అన్న ఉపవిభాగ సూత్రం
1) శాస్త్రీయ దృక్పథాన్ని 2. శోధనాతత్వాన్ని 3. సంస్కరణాభిలాషను 4. మానవీయ విలువలను అలవరచుకోవడం భారత పౌరులందరి కర్తవ్యం. అని చెపుతోంది. ఆ సూత్రకర్తలు నిజంగా ప్రాతఃస్మరణీయులు.
ముగింపు :
తలలోపలుకున్న(భాష తెలిసియున్న) వారికైతే పలు మెలకువల్ని అలవరచగల కీలకమైన విచారణా విధానం పెంచలయ్య గారి దగ్గరుంది. తనది చెప్పకుండా, ఎదుటివారిది చెప్పించుకుంటూ, అవకాశమున్నంత వరకు లేదా తనకు ఓపికున్నంతవరకు దానిని ఖండిస్తూ, అన్నవాడే దానిని నిలబెట్టుకునేలా అతని పై వత్తిడి చేస్తూ ఉండడమన్నదే ఆ విధానం.
తర్కరీతుల్లో దానిని 'వితండ' మనీ అంటారు. తనది చెప్పడు, ఇతరులది ఒప్పడు అంటారు చూడండి, అదన్న మాట శిక్షకుడు శిక్షితులకు శిక్షణ గరపే సందర్భంలో, శిక్షితునికి ఏ మేరకు శిక్షణ జరిగిందో గమనించడానికి వాడే ప్రక్రియ అది. అది వితండ యొక్క సాధురూపం. అయితే దానిని పక్ష ప్రతి పక్షాలుగ ఉండి సిద్దాంత చర్చలకు కూర్చున్న వేదికలలో వాడనే కూడదు. అప్పుడది వితండ యొక్క అసాధు రూపం. పెంచలయ్యగారికీ నాకూ ఈ ప్రక్రియను వాడే విషయంలో ఒక దగ్గర విభేదం ఉండేది. అదేమంటే, బోధన సందర్భంలో మాత్రమే వాడవలసిన ప్రక్రియ అది, లేదా ప్రత్యేకంగా ఒక సిద్దాంతాన్ని మాత్రమే పరీక్షకు తీసుకున్న సందర్భంలోనే వాడవలసిన ప్రక్రియ అది. అన్నది నాపక్షంకాగా, సందర్భం ఏదైనా తనది మాత్రం చెప్పేది కాదని, తాను మాత్రం ఇతరులది పరీక్షించడానికి పరిమితమైన చర్చకు కూర్చుంటానని అనేవారాయన. అలాంటి సందర్భాలలో ఎదుటి వారిది చెప్పమని అడిగేందుకు సిద్దమైన ఎవరుగానీ తమది చెప్పడానికీ సిద్దపడి తీరాలి. లేకుంటే సమాన నియమాన్ని అంగీకరించినట్లు కాదు అంటుండేవాణ్ణి నేను. ఆయన పోకడ వల్ల ఏర్పడే ఈ ఇబ్బందిని, ఆయనతో విషయపరంగా చర్చకు కూర్చుని అతి సన్నిహిత మిత్రులు కూడా చవిచూశారు. కనుకనే, సన్నిహితులతో కూడా, ఇంతకూ పెంచలయ్యగారి జ్ఞాన రూపమేమిటి? అన్న ప్రశ్న మిగిలే వుంది.
సుమారు 50 ఏండ్లుగా ఇదే పోకడననుసరించిన ఆయన ఈ మధ్యకాలంలో, ఏమనుకున్నారో ఏమో గాని ఉపనిషత్తులలో సత్యం చెప్పబడి ఉందనీ, ఆ సత్యాన్నే తానెరిగానని, దేవుడు ఉన్నాడనీ, ఆ విషయాన్ని ప్రత్యక్షం ద్వారానూ తెలుసుకోవచ్చనీ ఒక ప్రకటన చేశారు. నిజానికీ విషయం ఆయన గారి సన్నిహితుల్లో ఒకింత కలకలం రేపిందికూడా.
ఏదేమైనా భావజాల పరంగా ఆయనేమిటన్నది ఎక్కువ మందిలో సందిగ్థాన్నే మిగిల్చింది. ఆయన్ని గురించి రకరకాలుగా ఊహించుకుని ఆయనను అంగీకరించిన వారూ, ఆయనను వ్యతిరేకించినవారూ కూడా ఊహనాధారంగానే ఆ నిర్ణయానికి వచ్చారు.
నా వరకు నాకు ఆయనేమిటన్నది సందేహమే. సందేహరహితంగా ఒక అభిప్రాయానికి రాగలంత స్పష్టంగా లేవు ఆయన చివరి రచనలు కూడా ఎంతగా స్వంతగా తెలుసుకోవాల్సిందేనని ఆయనంటూ వచ్చినా, ఆయనతో అతిసన్నిహితంగా గడిపిన వారిలో ఎక్కువ మంది ఆయనపై గురుభావం పెట్టుకుని అనుసరణశీలత కలిగి ఉన్నవారే. అందులోనూ చాల మంది ఆయన ఆలోచనపరంగా చేయమన్న పని చేయనివారే. అది మనవల్ల అయ్యేపనికాదులే అనుకున్నవారే ఎక్కువ.
నాకు తెలిసి ఆయనేమి చెపుతున్నదీ అర్థమైంది అనుకుంటున్నవారు ఎన్. కృష్ణారావు గారు మాత్రమే. పెంచలయ్యగారికీ, కృష్ణారావు గారికి తనది అర్థమైంది అని అనిపించిందో లేదో మనకు తెలియదు.
ఇక ఆయన చరమథలో వ్రాసి ప్రచురించిన పుస్తకాలలో చాలా విషయాలు వాళ్ళేమన్నారు. వీళ్ళేమన్నారు అన్న వివరాలు ఉట్టంకించడానికి సంబంధించినవే. మరికొన్ని వీరివి అనుకోడానికి తగినవిగా ఉన్నాయి. అట్టి వాటిలోనూ ప్రశ్నించదగినవి ఎన్నో ఉన్నాయి. ప్రశ్నను స్వీకరించి సమాధానాలు చెప్పడానికి ఆయనలేరు. ఉన్నంతకాలం ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడెవరైనా ఆ ప్రశ్నలకు సమాధానాలివిగో అని చెప్పినా అవి పెంచలయ్యగారివేనని ఖచ్చితంగా నిర్థారించడానికి అవకాశం లేదు.
సత్యజ్ఞాన సంఘం - భవిష్యత్తు
మేలుకొలుపు పత్రిక ఆరంభ సంచికల్లోనే తాత్విక క్షేత్రాలలో, ఉద్యమ క్షేత్రాలలో దానిని ఆరంభించిన వ్యక్తిపోతే అలాంటి వ్యక్తిలేడు, ఉండడంలేదు. భావజాల క్షేత్రంలో ఇదెంతో ఆందోళన చెందాల్సిన అంశం అంటూ వ్రాశాను. సత్య జ్ఞాన సంఘానికీ ఆ సూత్రం వర్తిస్తుంది. ఇక ముందు సత్యజ్ఞాన సంఘం ఏమికానుంది? చైతన్యవంతంగా కొనసాగుతుందా? నామమాత్రంగా నిలిచి ఉంటుందా? అదీ ఉండదా.
పెంచలయ్యగారి సంపర్కం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన వారి జాబితా రూపొందించి ఖచ్చితంగా అందులో ఒకటిలేదా రెండు స్థానాలలో ఉంటుంది నాపేరు. నా అన్వేషణ సాధన పథంలో ఆయన పరిచయం అది పెద్ద మలుపుకూ, అదీ సరైన మలుపుకు దారితీసింది. శాస్త్రాలనబడేవాటిపైన, జ్ఞానులనబడే వారిపైనా ఉండే ప్రామాణిక బుద్ది అనవసరమైందనీ, సత్యాన్వేషణా పథంలో ఒక్కోసారి అది అవరోధకంగా కూడా అవుతుందని అనుభవం ద్వారా గ్రహించడానికి ఉపయోగపడిందది.
అనంతరకాలంలో కూడా ఆయనిది చెప్పకుండా, నాది పరీక్షించడానికి సిద్దపడడమన్న ఆయన పోకడ నా సొంత భావాల రాపిడికి, అవగాహనను లోపరహితంగా మలచుకోడానికి శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడింది. ఆయనతో పరిచయం ఏర్పడకుంటే నా ఆలోచనా క్షేత్రం ఈ రీతిగా అయ్యేదోలేదో చెప్పలేను. జ్ఞాన క్షేత్రంలో నేను సరైన దారికి మరలేందుకు ప్రధాన పాత్ర పోషించినందులకు ఆయనను కృతజ్ఞతా భావంతో స్మరించుకుంటూ ఈ రచనను ఇప్పటికి ముగిస్తున్నాను.
లక్షణ ప్రమాణ విద్యను సమాజానికందించడానికి గాను సత్యజ్ఞాన సంఘం సిద్దపడితే వారితో కలసి మనస్ఫూర్తిగా 100% త్రికరణశుద్ధితో పని చేయడానికి స.మం సిద్దంగా ఉంటుందని తెలుపుతున్నాను.
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర

No comments:
Post a Comment