ఈ శీర్షికాంశాన్ని శ్రద్దగా పరిశీలిస్తున్న యోచనాశీలురైన మిత్రులారా! హేతువాద పునరుజ్జీవన యత్నాల పేరిట కృషి (విచారణ) ఆరంభమైన నాటి నుండి కొంతమందిమి ప్రతినెలా ఈ విషయంపైనే సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నాము. అటు ఆ సమావేశాలలోనూ పాల్గొంటున్నవారిలో ఆ వివరాలను వివేకపథం ద్వారా గమనిస్తున్న పాఠకులలోనూ హేతువాదం సిద్దాంతకాదు, అదోక మెధడాలజీ (ఆలోచనావిధానము) అన్న దృష్టి కలిగిన వారే అధికంగా ఉన్నారు. నేనూ, నాతోబాటు అతికొద్ది మంది మాత్రం హేతువాద మన్నదీ ఒక సామాజిక స్పృహగలిగిన సిద్దాంతమేనంటూ వస్తున్నాము. ఈ మొత్తాన్ని పరిశీలిస్తున్న వారిలో ఒకరిద్దరు అది సిద్దాంతమైతేనేమి, కాకుంటే నేమి? అదేమటో తెలుసుకుని ఆచరణలో పెట్టుకుంటే చాలాదా? అన్న అభిప్రాయాన్నీ వెళ్ళడించారు.
ఇక్కడ మన మందరం గమనించాల్సిన అంశమొకటుంది. హేతువాదం సిద్దాంతమని గానీ, సిద్దాంతం కాదని గానీ ఎవరూ ప్రస్తావించకుండా ఉండుంటే, ఎవరిమటుకు వారు వారి వారి జీవితాలలో హేతుబద్దంగానో, అహేతుకంగానో ఆలోచించుకుంటూ సాగిపోతుంటే, భావజాల క్షేత్రంలో ఇది ఉండకూడదు, ఇది ఉండాలిలాటి మాటలూ, రాతలూ, తదనుగుణ్యయత్నాలూ, వాదోపవాదాలూ పొడచూపకుండా ఉండుంటే, ఈమూడో పక్షం వాళ్ళన్నట్లు సాగిపోతుంటే సరిపోతుంది. కానీ పరిస్థితులలా లేవు. సహస్రాబ్దాల కాలంగా కలిగిన అనుభవాలు, లభించిన ఆధారాలననురించి ఆలోచించి చేసుకున్న ఊహలు కలిసి ఏర్పడ్డ వాదాలు, వాదనలు వెరసి రకరకాల సిద్దాంత, రాద్దాంతాలు కొనసాగుతూ వస్తున్నై. మానవ జీవితం కూడా, ఏర్పడ్డ అనుబవాలలోనూ, చేసుకున్న ఊహలలోనూ, వినడం, చదవడం ద్వారా అందిన సమాచారంలోనూ సరిచూసుకుని, సరిచేసుకోవలసిన అంశాలుండడాన్ని చవిచూడడంతో, ఆయా విషయాల (భావాల) సబబు, బేససబుల్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్థారించుకోవడం అని వార్యమైంది. అదిగో ఆ అనివార్యతనుండి పుట్టుకొచ్చినవే సత్యాన్వేషణ, అందుకవసరమైన శాస్త్రీయ విచారణ పద్దతి శాస్త్రీయ దృక్పథం అన్నవికూడా.
ఉనికిలో ఉన్న భావాలనన్నింటినీ - సిద్దాంతాలనన్నింటినీ - నిర్థాక్షిణ్యంగా విమర్శించు; విమర్శకు ఏదీ అతీతం కాదు. విమర్శించడానికి సిద్దపడనివాడు, విమర్శను ఆహ్వానించనివాడు హేతువాది అనడానికి తగడు, లాంటి మాటలన్నీ విషయ విచారణ యొక్క అవసరాన్ని, ప్రయోజనాన్ని సూచించేటివే. అయితే అలా విచారణను ఆరంభించాలంటే ముందుగా విచారణకులోను చేయాల్సిన అభిప్రాయాన్ని నిర్థిష్టరూపంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. తార్కిక భాషలో దానినే ప్రతిపాదన, ప్రతిజ్ఞ లేదా విచారణీయాంశము అనంటారు. ఆపై దానిని సంశయించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంశయించక విచారించడం కుదరదు కనుక. అట్టి వాటినన్నింటిని అభ్యుపగమ సిద్దాంతాలంటారు సిద్దాంతం తెలిసినవారు.
ఏ ప్రతిపాదనైనా ఏదో ఒక విషయానికి సంబంధించిందై ఉంటుంది. ఎవరో ఒకరిగానీ, ఒక సమూహం అంగీకరించేదిగానీ అయ్యుంటుంది. అలాంటి ప్రతిపాదనలనే వాదాలు అనంటారు. ఒక నిర్థిష్ట రూపాన్ని సంతరించుకుని ఉన్న ప్రతి ప్రతిపాదనా సిద్దాంత మనడానికి తగిందే అవుతుంది. తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతః ఒక ధోరణికి చెందిన నిశ్చితాభిప్రాయం సిద్దాంతమని సూత్రార్థం.
ఉదా :- దేవుడున్నాడు 2. దేవుడులేడు 3. విశ్వము నియమబద్దము 4. పదార్థము సృష్టింపబడదు, నాశనం కాదు. 5 ప్రతి కార్యానికీ కారణముంటుంది 6. హేతుమంతుడు అవశ్యం నీతివంతుడవుతాడు ఇది రాడికల్ హ్యూమనిజం సిద్దాంతం 7.పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో దోపిడీ అనివార్యము 8. వారసత్వపు ఆస్థిహక్కు ఆర్థిక సమానత్వ సాధనకు అవరోధకము 9. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. 10. భూమి చుట్టూ సూర్యచంద్రాది గ్రహ నక్షత్రాలు తిరుగుతున్నాయి. 11. పరమాణు గర్భంలోని ఎలక్ట్రాను వేగాన్ని అది ఉన్న స్థానాన్ని ఏకకాలంలో ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కావడం లేదు.
మిత్రులారా! ఇలా ఎన్ని ప్రతిపాదనలైనా చెప్పుకుంటూ పోవచ్చు. నా వరకు నేను హేతువాదం పై విచారణ నారంభించినప్పటి నుండి హేతువాదమన్నది, సామాజిక స్పృహకలిగిన, తాత్విక స్థాయి కలిగిన, సక్రమాలోచన అవసరాన్నీ అది ఉన్నప్పుడు, లేనప్పుడు, వ్యక్తి జీవితంలో సమాజ స్థితి గతులలో వచ్చే తేడాపాడాలను, వివరించే భావజాల సంపుటేనంటూ వస్తున్నాను. ముందిది సరైనదోకాదో నిర్థారించుకోండి. వచ్చిన ఇబ్బందేమిటంటే ఈనాడు ఒక రచననుకానీ, ఒక అభిప్రాయాన్ని గానీ ఎలా విచారించాలో (పరిశీలించాలో లేదా పరీక్షించాలో) నన్న అంశాన్ని ముఖ్యమైనదిగాగానీ, కీలకమైనదిగాగాని తలంచకపోవడం జరుగుతోంది ఎక్కువలో ఎక్కువ మందిలో, ఎక్కువలో ఎక్కువసార్లు. హేతువాదం క్రిందకు అనేక విషయాలపై తనదైన రీతిలో ప్రకటింపబడ్డ అనేక అభిప్రాయాలు చేరి ఉంటాయా? లేదా? చేరి ఉన్నాయా? లేదా?
1) హేతువాదం హేతువంటే ఏమిటో వివరిస్తుందా? లేదా? వివరించాలాలేదా? అన్నది అన్ని ప్రశ్నలకూ వర్తిస్తుంది.
2) హేతువాదం హేతుత్వమంటే ఏమిటో చెపుతుందాలేదా?
3) హేతువాదం సహేతుకాలోచన, అహేతుకాలోచన అంటే ఏమిటో వివరిస్తుందాలేదా?
4) అహేతుకాలోచన వల్ల జరిగే అనర్థాలు, సహేతుకాలోచన వల్ల జరిగే ప్రయోజనాలు వివరిస్తుందా? లేదా?
5) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఊహాత్మక నిర్ణయాలకు, ప్రయోగాత్మక నిర్ణయాలకు ఉన్న తేడా ఏమిటో వివరిస్తుందా లేదా?
6. నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి వివరించి మూఢనమ్మకాల్ని వదులుకోమంటుందాలేదా?
7. మనుషుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు కొనసాగుతూ ఉండాలని అంటుందాలేదా?
8. హేతువాద తాత్విక ధోరణి వ్యక్తుల, గ్రంధాల ప్రామాణికతను తృణీకరిస్తుందా లేదా?
9. విజ్ఞాన శాస్త్ర సమాచారం ఆధారంగనే ఊహాత్మక నిర్ణయాలు చేస్తుండాలని చెపుతుందాలేదా?
10. హేతువాదానికి సామాజిక స్పృహ ఉంటుందా? ఉండదా?
11. వ్యక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని, మంచి సమాజం ఏర్పడాలని లక్షిస్తుందా లేదా?
12. మనిషి ఎటువంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలో ప్రస్తావిస్తుందా లేదా?
13. తప్పు జ్ఞానాన్ని వదిలించుకోవలసిన అవసరాన్ని, ఒప్పుజ్ఞానాన్నార్జించాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతుందా లేదా?
14. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ తాత్విక ధోరణుల్ని తనదైన రీతిలో విచారించి, విమర్శిస్తుందాలేదా!
15. హేతువాద ఉద్యమం యొక్క లక్ష్యమేమిటో చెప్పగలరా? ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి అది రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికేమిటో చెప్పగలరా? ఈ వివరాలు చెప్పాల్సిన అవసరముందాలేదా?
మిత్రులారా! ఇలాంటివే మరికొన్ని అంశాలకు చెందిన ప్రశ్నలనూ లేవనెత్తవచ్చు. వీటన్నింటికీ హేతువాదం తనదైన రీతిలో అవునంటూ సమాధానాలు చెపుతుంది. హేతువాదం మ్మీద అంతో ఇంతో అవగాహనున్నవారు ఎవరు గానీ వీటిని గాని వీటిలో కొన్నింటినిగానీ, మరికొన్నింటిని కలుపుకునిగానీ ప్రస్తావించకుండా ఉండలేరు. కనుకనే హేతువాదమనేది వ్యక్తినీ, సమాజాన్ని సక్రమంగా నిలిపి ఉంచాలన్న ఉద్దేశం కలిగిన మంచి సమాజం రావాలనుకునే సామాజిక తాత్విక ధోరణి అని చెప్పాను.
ఒక ముఖ్య విషయం చెప్పనా? హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు గాని, సిద్దాంత మేనంటున్న వాళ్ళు గానీ, మొట్టమొదట ఆ రెండు పదాలకు నిర్వచనాలు (తమవైన అర్దాలు) చెప్పి, అదెలా సరైనవో నిర్ధారించాలి. ఆ పనిని చేయకుండా ఎంతెంత మాట్లాడినా అదంతా, ఆదిలోనే దారితప్పిన ప్రయాణం వంటిదే అవుతుంది. చెప్పుకోడానికి ఒకింత విచారకరమే అయినా, నేనుతప్ప ఆ పని చేసినవారు, ఆంధ్రప్రాంతంలో లేరు. రంగనాయకమ్మ గారు మాత్రం హేతువాద సిద్దాంతం అన్న ప్రయోగం చేశారు. అయితే ఆమె దానిని నాస్తికత్వమేనని అన్నారు. 1899లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్ రేషనలిస్టు ప్రెస్ అసోసియేషన్ వారు హేతువాదం అన్న మాటను ఇలా నిర్వచించారు.
ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ ళీబిగిలీలి ఖిరితీరిదీలిఖి బిరీ శినీలి ళీలిదీశిబిజి బిశిశిరిశితిఖిలి గీనీరిబీనీ తిదీజీలిరీలిజీఖీలిఖి లీగి బిబీబీలిచీశిరీ శినీలి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిబిరీళిదీ బిదీఖి బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి బిదీఖి లిశినీరిబీరీ ఖీలిజీలితీరిబిలీజిలి లీగి లినిచీలిజీరిబిదీబీలి బిదీఖి రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ ళిజీ బితిశినీళిజీరిశిగి.
హేతువాదాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు. అన్ని రకాల శబ్ద ప్రమాణాల (అంటే గ్రంధాల వ్యక్తుల) ప్రామాణికతను తృణీకరిస్తూ, స్వతంత్రంగా, అనుభవం ద్వారా సరిచూసుకోదగిన, నైతికతతో ముడిపడిన తాత్వక విధానాన్ని (వ్యవస్థను) స్థిరపరచుకునే క్రమంలో హేతువు యొక్క సర్వాధిక్యతను అంగీకరించే మానసిక వైఖరినే హేతువాద మంటాము.
వివరణ : పై నిర్వచనంలో కొన్ని కీలకమైన పదాలున్నాయి. తిదీజీలిరీలిబిజీఖీలిఖిజిగ్ష్మి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిరీళిద్ష్మీ బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి ఞ లిశినీరిబీరీ, రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలిలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ, బితిశినీళిజీరిశిగి.
1) జుజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ అంటే అర్థమేమిటి? ఒక వ్యక్తి వెళ్ళడించిన అభిప్రాయాలు లేదా అహేతుక నిర్ణయాలు
2) బితిశినీళిజీరిశిగి అంటే గ్రంధాన్ని వ్యక్తిని ప్రామాణికంగా ఎత్తుకోవడం, స్వీకరించడం, ఇక ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రరీ ఎజంషన్సు అన్న వాక్యాన్ని ఇలా అన్వయించుకోవాలి. ఈ మానసిక వైఖరి అహేతుకవూహల నుండీ, వ్యక్తుల గ్రంధాలపై ప్రామాణిక దృష్టి కలిగి ఉండడం అన్నదాని నుండి ఇండిపెండెంటుగా అంటే విడివిడి లేదా స్వతంత్ర పొంది లేదా వాటిని విడిచి పెట్టి ఉంటుంది.
వెంకటాద్రిగారి, గుమ్మా వీరన్న గారి రచనలలో 'హేతువాదం ఒక వాదం కాదు' అన్నమాటలున్నాయి. భాషాపరంగా ఇది సరైన ప్రయోగం కాదనిపించడంలేదా. ఆవాదం వాదం కాదు అనకూడదు కదా! నాకు తెలిసినంతలో యాదాలాపంగా వాడేసిన పదం, మరల మరల వాడుతూరావడం వల్ల స్ధిరపడిన మాట అది. అలా ఏమీకాదు, సుస్పష్టంగా కావాలనే ఆ పదాన్ని వాడాము అనే ఇప్పటికీ వారనేట్లయితే సిద్దాంతమంటే ఏమిటో నిర్వచించి, హేతువాదమంటే ఏమిటోనూ నిర్వచించి, ఇది సిద్దాంత నిర్వచనం క్రిందికి ఎందుకురాదోనూ తేల్చాలి. వారి విషయమలాఉంచి, ఈ విచారణలో పాల్గొనేవారిలో హేతువాదం సిద్దాంతంకాదు అనదలచుకున్నరోవారు విధిగా హేతువాదమంటే ఏమిటో, సిద్దాంతమంటే ఏమిటో నిర్ణయించి, ఆపై అది దీని క్రిందికి చేరదు అని నిర్ధారించాలి. వెంకటాద్రి గారు హేతువాద మన్నదొక మెధడాలజీ అనీ అన్నారు అంటే ఏమని?
ఈ విచారణ ఒక కొలిక్కి రావాలంటే; కీలకమైన కొన్న పదాలకు ఖచ్చితమైన అర్థాలు - నిర్వచనాలు - చెప్పుకుని తీరాలి. ఎన్నిసార్లు నేనీ విషయాన్ని నొక్కి చెపుతున్నా, ఎవరూ దానిని పట్టించుకోడమేలేదు. వచ్చిన ఇబ్బందంతా ఇక్కడే ఉంది. హేతువన్న పదంతో కలిపి చెప్పే మాటలన్నంటికీ - పదాలకన్నింటికీ - వాటి వాటి అర్థాలను స్పష్టంగా చెప్పుకోకుండా, చర్చలో పాల్గొనే వారంతా వాటికి ఒకే అర్థాలను అంగీకరించుకోకుండా విచారణ సజావుగ సాగనే సాగదు. కనుక అట్టి పదాలను ఎంచుకుని, వాటికి నిర్వచనాలను స్థిరపరచుకోవాల్సిందే. నిజానికి హేతువాద మన్నది ఒక ఆలోచనా విధానము అన్నప్పుడు కూడా దాని అర్థం చెప్పినట్లు కాలేదు. ఏ రకమైన ఆలోచనా విధానమో కూడా చెపితేనే ఆ మేరకైనా అర్థం చెప్పినట్లు వారు ఆ పదానికి ఆ రకంగా అర్థం చెప్పలేదుగానీ, హేతువాదమూ ఒక వాదమేననడానికి అవసరమైన భావజాలాన్నెంతటినో హేతువాదం పేరున ప్రకటిస్తూనే వచ్చారు. మరొక్కమాట! ఎలా వివిధ విషయాలకు సంబంధించిన వివిధ సిద్దాంతాలుంటాయో, ఉండవచ్చునో, అలాగే ఆయా విధానాలన్నిటి పైనా సిద్దాంతాలుండవచ్చు. ఉంటాయి. కొన్ని ఉదాహరణలిస్తాను పరిశీలించండి.
1) సామ్యవాదం (సోషలిజం) అన్నది సమాజంలో ఆర్ధికాంశాలకు సంబంధించి అనుసరించాల్సిన విధానమే. 'సామ్యవాద ఆర్థిక విధానం' అన్నమాట మనకందరికీ తెలిసున్నదే. అయినా దానిని సిద్దాంతమనే అంటున్నాముకదా! ఇంకా సరిగా చెప్పాలంటే 'సోషలిజం' అన్న అంశంపైనే అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలూ ఉండవచ్చు.
2) ప్రజాస్వామ్యం అన్నదీ ఒక పాలనా విధానమే. అయినా అదీ సిద్దాంతంగానే చెప్పబడుతోంది. ఇంకా సరిగా చెప్పాలంటే 'ప్రజాస్వామ్యం' అన్న అంశంపై అనేకులు ప్రకటించిన సిద్దాంతాలూ ఉంటాయి.
3) నీతి అన్న అంశాన్ని తీసుకుంటే నైతికత అన్నదొక మానసిక వైఖరి అని తేలుతుంది. అయితే నీతంటే ఏమిటి అన్న దానిపై అనేక సిద్దాంతాలు (నీతంటే ఇదీ అన్న ప్రతిపాదనలు) ఉన్నాయి.
4. సమాజ శాస్త్రంలో, సమాజమంటే ఏమిటన్న దానిపై, పలువురు పలురకాలుగా నిర్వచించారు. వాటన్నింటినీ సోషల్ సైన్స్‌స్‌లో వివిధ సిద్దాంతాలుగనే పేర్కొంటున్నారు.
5) వివిధ మతస్తులూ ఎవరికి వారు తమదొక జీవన విధానమనే పేర్కొంటున్నారు. నిజానికి వారి, వారిది జీవన విధానమే కదా! అయినా వాటన్నింటినీ సిద్దాంతాలనే అంటున్నాము.
6) సైన్సులో ఒక్కో విషయంపైనా ఒక్కో శాస్త్రజ్ఞుడు చేసిన ప్రతిపాదనలనూ సిద్దాంతాలనే అంటారు.
హైపోధిసిస్ అంటే ఊహాత్మక సిద్దాంతం అనే కదా.
మిత్రులారా! ఇలా జ్ఞాన భాగానికి చెందిన ఏ శాఖా గ్రంథాలను చూసినా, వివిధ సిద్దాంతాలు ఎదురుపడతాయి. అందులో మెధడాలజీకి చెందిన సిద్దాంతాలూ ఉంటాయి. అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే మానవస్వభావం అన్న అంశంపైనా అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలు కనపడతాయి.
ఏ వాదమైనా ఏదో ఒక అంశంపై ఏదో ఒక అభిప్రాయ ప్రకటన (ప్రతిపాదన) రూపంలోనే ఉంటుంది. అట్టివాటి నన్నింటినీ సిద్దాంతాలనే అంటారు. ఇంతగా ఆధారాలతో సహా వివరిస్తున్నా వీటనింటినీ పట్టించుకోకుండానే, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్లు యధాపూర్వం, అంటే ఈ వివరాలు చూడక ముందున్నట్లే పాతభావాన్నే పట్టుకు కూచుంటానంటే ఎవరం చేయగలిగిందీ ఏమీ ఉండదు.
'నికార్సయిన హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రామాణికం కాదు, కారాదు అన్న సూత్రాన్ని అంగీకరించుకునే ఉన్నాంగనుక, మీరు ఎవరికి వారుగా సిద్దాంతమంటే ఏమిటి అన్న విషయంలో తమ పక్షాన్ని (సిద్దాంతాన్ని) ప్రకటించి, అది సరైందేనని నిరూపించే బాధ్యత వహించండి. అది అన్ని రకాలుగా మేలవుతుంది.
ఈ విషయంలో స్పష్టతరావాలంటే ఇదిగో ఈ పదాలకు అర్థాలు - నిర్వచనాలు - నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. హేతువు, హేతుత్వము, హేతుమంతుడు, అహేతుకము, సహేతుకము, కారణము, ఆలోచన, హేతుబద్దాలోచన, ఆధారసహితాలోచన, తర్కము, హేతువాదము, హేతువాది, వాదము, వాదన, దృక్పథము, మానసిక వైఖరి, నమ్మకాలు, మూఢనమ్మకాలు, సిద్దాంతము, వివిధ సిద్దాంతాలు, ఆలోచనా విధానము, జీవన విధానము సత్యము, వాస్తవము అసత్యము, అబద్దము, జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, వ్యవస్థ, వ్యవస్థీకృతము, వ్యవస్థీకృతజ్ఞానము
మళ్ళీ మరోమారు! ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అస్సలు విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు ఎక్కువలో ఎక్కువమందికది అలవాటుగానూ మారిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.
హేతువాదమన్నది తాత్విక స్థాయి కలిగిన సామాజిక దృక్పథాన్ని తెలిపే సిద్దాంతమంటూ నేనిచ్చిన వివరాలలోని దోషమేమిటో నిర్థారించనైనా నిర్థారించండి. లేదా మీ పక్షంగా, సిద్దాంతమంటే ఏమిటో, హేతువాదమంటే ఏమిటో చెప్పి హేతువాదం ఎందుకు సిద్దాంతం కాదో అన్నదైనా నిర్ధారించండి. భావ విప్లవం రావాలంటూ నినదించే మనం - ఎవరైనా- లోపసహితమైన భావాలను వదులుకోడానికీ, సరిచేసుకోడానికీ, సరైన భావాలను చేర్చుకోడానికీ నిరంతరం సంసిద్దంగా ఉండాలి. ఎలాటి భేషజాలూ పొరపొచ్చాలు లేకుండా మంచి భావాలను స్వీకరిస్తుండాలి. నూతన సంవత్సరం, సంక్రాంతి (సరైన మార్పు) దిశగా అడుగులు వేద్దాంరండంటూ ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు - 1
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! అనంతపురం నుండి బి.వి.రాధాకృష్ణమూర్తిగారు, రెండు పుస్తకాలు పంపి, వాటిని సమీక్షించవలసిందిగానూ, సమాజానికి మేలు కలిగేలా స్పందించవలసిందిగానూ ఒక సూచన చేశారు. ఆ పుస్తకాలు 1) డా|| బి.వి. పట్టాభిరామ్ ఎం.ఎ.పి.హెచ్.డి వ్రాసిన, ''మహిమాన్వితమూర్తి శ్రీ సత్యసాయిబాబా'' అన్నదికాగా (2) ఇందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్దాంత ఆదికర్త, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానందయోగీశ్వర్లు, అన్న పేరుతో చలామణి అవుతున్నాయన వ్రాసిన 'హేతువాదము - ప్రతివాదము' అన్నదై ఉంది.
ఆ రెండు రచనలూ ప్రజలను ఆలోచింపజేసేవిగాగానీ, స్వతంత్రాలోచనాశీలతను, విచారణ పద్దతిని బలపరచేవిగాగానీ లేకపోవడమే గాక, అంధానుసరణను రేకెత్తించేవిగనూ ఉండడంతో కొద్దిమంది ముందుకైనా వాటి గురించి తెలియజేయడం వివేకవంతమవుతుందనిపించడంతో నూతన సం||ర ఆరంభ సంచికలో ఆ రెంటిపై వ్యాసాలు ఇలా వచ్చిచేరాయి. ముందుగా మెజీషియన్ పట్టాభిరాం గారి రచనను ఒకింత పట్టిచూద్దాం.
(1) బి.వి. పట్టాభిరాం గారు మెజీషియన్‌గానూ, మహిమలు, మంత్రాలు అబద్దం అంటూ ప్రచారం చేసిన వ్యక్తిగానూ, వ్యక్త్త్తిత్వ నిర్మాణం, వికాసం తరగతులనూ, మనో విశ్లేషకునిగానూ వృత్తిని చేసుకుంటూ ప్రసిద్దులయ్యారు. తత్వశాస్త్రంలో ఎమ్.ఎ, మనస్తత్వ శాస్త్రంలో మరో ఎమ్.ఎ. పట్టాను పొంది, దేనిపైనో పి.హెచ్.డి కూడా పూర్తి చేసినట్లు తెలుపుతున్నాయి వారి మాటలు. ఆశ్చర్యమేమంటే మ్యాజిక్కు, మనోవైజ్ఞానిక శాస్త్రము, తత్వశాస్త్రము అన్నమూడూ అభౌతిక శక్తుల, మహిమల ఊసులేని ఒక రకంగా ప్రజలలో నెలకొని ఉన్న అలాటి భావనలు అపోహలనో, మానసిక వైకల్యం నుండి పట్టుకొచ్చేవనో చెప్పేటివే. వాటిని చదివాక చాలాకాలం అలానే ఉన్నట్లూ, సాయిబాబాలాంటి వారినీ విమర్శించేవాణ్ణి లాంటి మాటల ద్వారా ఆయనే చెప్పుకున్నారు.
(2) వారి తండ్రిగారు - ఆయన ఆధ్యాత్మిక జిజ్ఞాసవు పరోపకారి, వెంకటేశ్వరుని భక్తుడు. ప్రముఖ ఇంజనీరు, సంశయాత్మడుగా పుట్టపర్తి వెళ్ళి, అమాంతంగా బాబా భక్తుడై అక్కడే స్థిరపడిపోయారు అంటూ వ్రాశారు.
3) అలా వాళ్ళ తండ్రి బాబాభక్తుడై పోవడం వల్ల తన అభిప్రాయాల్ని సహేతుకంగా పునఃపరిశీలన చేయాలనిపించిందట.
4) అక్కడి నుండి వీరిలో జిజ్ఞాస ప్రారంభమైందట. ఎందరో భక్తుల్నేగాక, నాస్తికుల్ని, రేషనలిస్టుల్ని కలిశారట.
వారిని మీరు బాబాను కలిశారా? అనడిగారట! వారెవ్వరూ బాబాను కలవలేదు. అక్కడా, ఇక్కడా విన్నవాటిని బట్టే అలా విమర్శించడానికి, దుర్భాషలాడడానికి సిద్దపడ్డారు. ఆ రకంగా వారి విమర్శ నన్ను బాబాను చూడడానికి ప్రేరేపించింది. బాబాను చూశాక నా అజ్ఞానం బైటపడింది. బాబా మహిమాన్వితుడని అర్ధమైంది.
విశ్లేషణ : ''మనస్సులోని మాట'' అన్న పేరుతో ఆ పుస్తకంలోని ముందుమాటలివి. ఈ మాటలన్నింటిలో 'చూడకుండగనే దుర్భాషలాడారు.' అన్న ఒక ముక్క తప్ప మిగిలిన దంతా, ఆలోచనా రహితంగా సత్ససాయిబాబాను సాధారణ ప్రజలనెత్తికెత్తడానికి, వారిని తానెరిగిన మనోవిజ్ఞాన శాస్త్రపు సూత్రాలననుసరించి ప్రభావితం చేయడానికి ఒక ఎత్తుగడగా పనికి వచ్చేదిగనే ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రచనంతా పట్టాభిరామ్‌లో శాస్త్రీయ దృక్పథంలేదనీ శాస్త్రీయ పద్దతి అమలుపరచలేదని నిర్ణయించడానికి రుజువుగా ఉంది. అంత మాత్రమైతే పరవాలేదు. తాను చదివిన, నేర్చిన విద్యల్ని బ్రతుకుదెరవుకే గాక, అధిక సంపాదనకూ మార్గంగా చేసుకుని, ప్రసిద్ధి పొంది ఇప్పుడు పేరును ఇలాంటి అశాస్త్రీయ భావాలను మందినెత్తికెక్కించడానికి పూనుకోవడమే విచారకరమూ, విచారణీయము కూడా. ఈ రచనను ఈ విధంగా తీసుకురావడానికి సత్యసాయి కంపెనీ నుండి ఎంత ముట్టిందో ఈయనకూ - వారికీ మాత్రమే తెలిసుండే విషయం. తనకే తెలియని విషయాలలో, ఇంతటి అవైజ్ఞానికాంశాలను, సరైనవేనంటూ ప్రజలనెత్తికెక్కించబూనినందుకు ఏమి చేయాలతణ్ణి?
ఏ మాత్రం సామాజిక స్పృహగానీ, నిజాయితీగానీ, తానన్న మాటలు సరైనవేనని నిరూపించే బాధ్యత తనపైనే ఉంటుందన్న సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు సిద్దపడేతనంగానీ ఉంటే ఈ పుస్తకంపైనే ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తాము. సిద్దపడగలరేమో చూడాలి. నా హేతుబుద్దికి ఈ రకం వ్యాపారులు స్పందించరనే అనిపిస్తోంది. దేవుని విషయమై ఆయనకున్న అజ్ఞానాన్ని, ఆయన రచనల్లో ఉన్న అసమంజసతను తెలిపే నాలుగైదు అంశాల్ని ప్రస్తావిస్తాను. మొత్తం పుస్తకాన్ని కూడ విశ్లేషించడం సాధ్యపడదు కనుక. విషయ సూచిలో 1వ అంశం 'బాబా భగవంతుడా?' అన్నదిగా ఉంది. దాని క్రింద ఆరు పేజీలు వ్రాశారాయన అందులో
(1) దేవుడంటే ఏమిటో చెప్పలేదు. ఆయన రాతల్ని బట్టి చూస్తే ఏమతధోరణికి చెందిన దేవుణ్ణి గురించీ తగినంతగా ఆయనకు తెలీదని తెలుతోంది.
2) బాబా భగవంతుడనో, కాదనో ఏదీ తేల్చలేదు. అలాగని తేలని, తెల్పలేని విషయమన్న నిర్ణయాన్ని ప్రకటించారా అంటే ఆ పని చేయలేదు. ఎ) బాబావి మ్యాజిక్కులు కావన్నారు. బి) బాబా దగ్గరకు అజ్ఞానం, అహంకారంతో వెళ్ళిన తనకు, అక్కడకు వెళ్ళాక కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు. అంటే అన్యాపదేశంగా, డొంకతిరుగుడుగా సత్యశాయికి మహిమలున్నాయని మనకు అనిపించేలా ఎత్తుగడ ఉందందులో మ్యాజిక్కు, సూత్రాలు, మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు వంటబట్టి వృత్తిగా చేసుకున్నాయనగదా! నిజాన్ని కప్పిపెట్టి లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు చూపే విద్యకలవాడుకదా. అక్కడికది చాలదన్నట్లు; ఒకవేళ ఆయన చేస్తున్నది మ్యాజిక్కేననుకున్నా, లోకంలో ఎందరు మెజీషియన్లు బాబా చేసిన సేవాకార్యక్రమాలు చేస్తున్నారు? అంటూ ఒక కుంటిప్రశ్న లేవనెత్తి సామాన్యులు ఆ రకంగా బాబా గొప్ప వాడని అనుకునేలా పన్నాగం పన్నారు.
ఇక్కడ మన ముందున్న ప్రశ్న 1) బాబా భగవంతుడా? అతను చూపుతున్నది అభౌతికశక్తికి రుజువులా అన్నది మాత్రమే. మన పట్టాభిరామ్ గారు, ఆ విషయాన్ని అతిచాకచక్యంగా మరుగున పెట్టేసి, బాబా మామూలు మనిషికాదని భ్రమపడేలా సీను క్రియేట్‌చేశారు. అది అతనిలోని మతిసెబ్బరితనం, నిజాయితీ లేనితనం, అలా బాబా మామూలోడు కాదు అని అనిపించేలా తన పరపతిని చూసి ప్రచారం చేయడానికి ఎంత ప్రతిఫలం, ఏ రూపంలో పట్టాభిగారికి ముట్టిందనేది ఆయన బయటపెడితే తప్ప మనకు పట్టుబడని విషయం.
(2) పుట్టపర్తి సందర్శన
ఇది 1970 ప్రాంతాల జరిగిన విషయం. పట్టాభిగారికి కాలు విరిగింది. డాక్టర్లు నడుందాకాకట్లు వేశారు. రెండు నెలలాగి చూస్తే కట్టుకట్టుకోలా. మళ్ళా కట్టుకట్టాల్సిందేనని, ఈ సారి గుండెలదాకా కట్టువేశారు. ఈ సమయంలో పట్టాభి గారి తండ్రి, పట్టాభిగారి జాతకం చూపించారు. దాన్ని చూసిన జోష్యుడు 26 ఏండ్లకే చనిపోతాడు ఈ జాతకుడు అని చెప్పాడు. దాంతో ఈయన తండ్రికి భయమేసి వెదికి వెదికి మరో గొప్పపేరున్న జోతిష్యుణ్ణి పట్టుకొచ్చి జాతకం చూపించారు. ఆయన మహాజ్ఞానల్లే పోజెట్టి, 26 ఏళ్ళకి చనిపోతాడని చెప్పిన శుంఠెవడండీ, ఈ జాతకుడు 24 ఏండ్లకే చనిపోవాల్సిందేనన్నాడట. రోజులు గడిస్తున్నై మళ్ళీ కట్టు విప్పారు. ఎక్సరే తీశారు. షరామామూలే. మళ్ళా ఎముక అతుక్కోలా. మళ్ళా కట్టువేసి రెండు నెల్లకిరమ్మన్నారు. (ఈసారికట్టు ఎక్కడిదాకా వేశారో చెప్పడం మరచిపోయారు పాపం పట్టాభిగారు. లెక్క ప్రకారం కళ్ళుముక్కు నోరును విడిచి మొత్తం శరీరాన్ని కప్పుతూ కట్టేసి ఉండుండాలి) తొడ ఎముకలో స్టీలురాడ్డు ధగధగా మెరుస్తూ కనపడిందట ఎక్కరేలో. ఆశ్చర్యమేమంటే అంత చదువు చదివీ ఇంత మాత్రమైనా అబద్ధాన్ని అతికినట్లు చెప్పలేని పట్టాభి ప్రజ్ఞకు జాలిపడాలి. కాలు విరగడంలాటివి అబద్దమని చెప్పలేంగానీ, ఆ తరవాతవన్నీ భూతద్దంలో - పెద్దది చేసి - చూపించినవే. ఇది జరిగాక, పట్టా అన్నగారు, తండ్రిని పుట్టపర్తి పట్టుకెళ్ళారు. కొడుకు కాలు విరిగిన విషయం, అది అతుక్కోని విషయం బాబాకు చెప్పారు. ఆయన భయపడకంటూ ఇంత విభూది ఇచ్చి, పట్టాభికివ్వమన్నారు. డ్రాఫ్టింగు చేస్తే అతుక్కుంటుంది. చాలా ఎడంగా పెట్టి కట్టువేశారు. అని చెప్పారట.
విశ్లేషణ : అబద్దాలాడడానికీ చాలా అనుభవం, అబ్యాసం కావాలి. అదీ ఒక కళే పట్టాభిగారికి దానిలో అంతపట్టులేదన్నది ఈ రచనవల్ల తేలిపోయింది. మూడు మార్లు కట్లువేసిన డాక్టర్లకు ఎముకలు కలపకుండానే కట్టువేశాం అన్నది కనపడలేదన్నమాట? పైగా అది ఎంత ఎడమంటే, వేసిన స్టీలు రాడ్డు ధగధగా మెరిసిపోతూ ఎక్కరేలోనే కనబడేటంత ఖాళీ వదిలి వేశారన్నమాట. ఆ విషయాన్ని గమనించీ, ఆడాక్టర్లుగానీ, ఈయనగానీ, మరెవరుగానీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదన్నమాట! మహామహిమాన్వితుడైన బాబా, దానిని తానే సరిచేయకుండా, మరో ముక్క తీసి అతికించమని అన్నాడన్నమాట! ఆ మాటన్నవాడు అంతటితో గమ్మునుండక, మహిమాన్వితమైన విభూదినీ ఇచ్చి పంపాడన్నమాట.
తరవాతి అంకంలో, డాక్టర్లు మరోముక్క తీసి అతికించడం, పట్టాభిగారినీ బాబా దగ్గరకు తీసుకోవడం, బాబాను కలిసిన సందర్భంలో, పట్టాభినీ కుడికాలు వంగదుకదా అని అడగడం, ఈ పట్టాభి (పిహెచ్‌డి డిగ్రీ అప్పటికే వచ్చి తగలబడిందో లేదో మరి) కాలు వంగడంలేదన్న విషయం బాబాకు ఎలా తెలిసిందని తేగ ఆశ్చర్యపోవడం - అన్నవి రచనలో చూపించారు పట్టాభిగారు. ఇలా పుస్తకంలోని ప్రతి అసంబద్ద, అసమంజస, అహేతుకరాతల్ని విశ్లేషించి సమీక్షించాలంటే అసలు పుస్తకానికి నాలుగింతల రచన అవసరమవుతుంది. తినాకుడవా తగినంత ఉండీ మందిపై బడే కూడబెట్టుకునీ ఇలాంటి రచనలు చేసి మరింత అజ్ఞానాన్ని మందినెత్తిన పెట్టడానికి, అందులోనూ తన స్వార్థ ప్రయోజనాలను పొందేందుకు పూనుకోవడానికి మతి సెబ్బరితనం సామాజిక బాధ్యతలేనితనం, చిన్న నా బొజ్జకు శ్రీ రామరక్ష అనే వైఖరి చాలా ఉండితీరాలి. పట్టాభి వ్యక్తిత్వంలో అది దండిగానే ఉందనిపిస్తోంది.
మరో విషయమేమంటే, పట్టాభి కుటుంబం కావలసినన్ని మూఢనమ్మకాలతోనూ ఉండడమేగాక, సాంప్రదాయక ఆస్తిక పోకడకంటెనూ దిగజారి, బాబాలనూ, అమ్మలను, అవ్వలనూ నెత్తికెక్కించుకునేంతగా వాటిలో కూరుకుపోయి ఉంది. ఇతడూ ఎక్కడా నాస్తికుడిగాలేడు, కొన్ని రకాల మూఢనమ్మకాలను అంతగా నమ్మని వాడిగా ఉన్నాడంతే, పిల్లి శకునాలూ, బల్లి శకునాలు పట్టించుకోవడం లేదు. ఈ రచన ద్వారా అన్యాపదేశంగా బాబా మామూలోడు కాడు, నాలాటి పరిశోధకునికే అంతుపట్టని వెన్నో శక్తులు బాబాలో ఉన్నాయి అలాంటి గొప్ప శక్తులు అన్ని మతాలలోనూ ఉన్నాయి అనేంతవరకు తెగించాడు రచయిత. మద్యమద్యలో తాను నమ్మకాలు లేనివాణ్ణని, బాబాను సందేహిస్తూనే వచ్చాననీ, బాబాను నమ్ముతున్న తన కుటుంబపు అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నానని ముక్తాయింపులూ ఇస్తూ వచ్చాడు. అమాయక పాఠకజనాన్ని మభ్యపుచ్చే ఎత్తుగడే అది అన్నది పచ్చి నిజం. - ఈ వ్యాసంలో పాఠకులు పరీక్షించడానికి వీల్లేనివీ, అబద్దమనడానికి వీల్లేనివీ అయిన కొన్ని సంఘటనల్ని - అద్భుతాలంటూ అతి తెలివిగా పాఠకుల ముందుకు తెచ్చాడు రచయిత. పట్టాభి అంధభక్తుడై నా అయ్యుండాలి, అధికాధిక ప్రయోజనాలనుద్దెశించి అబద్దాలు రాసైనా ఉండాలి.
(3) విమర్శకుల పరిశ్రమ (పేజి 29 నుండి)
దీనర్థం విమర్శకులు విమర్శించడాన్ని ఒక వ్యాపారంగా చేసుకున్నారని కాబోలు, ఆశ్చర్యమేమంటే, ఈయన గారూ వారికి వ్యతిరేకమైన రీతిలో పొగడడాన్ని వ్యాపారంగా చేసుకుని ఉండడం. ఈ పుస్తకం వ్రాయడం ద్వారా ఈ మెజిషియన్ లక్షలాది, బాబా భక్తుల్నేకాక, వివిధ మూఢనమ్మకాలతో జీవితాల్ని చట్టుబండలు చేసుకుంటున్న అజ్ఞానుల్ని తన అభిమానుల్నిగా, వృత్తిపరంగా తన క్లైయింటుల్నిగా సమకూర్చుకున్నాడు. ఇంతకంటే దుర్మార్గమైన వ్యాపారపు ఎత్తుగడ ఇంకేముంటుంది?!
ఈ మూడో వ్యాసంలో హేతువాదులు, నాస్తికులు (1) ఆస్తికుల్ని, అదీహిందూ మతానికి చెందిన వారిని మాత్రమే, చెడామడా తిట్టడమే పనిగా పెట్టుకున్నారనీ, క్రైస్తవ, ముస్లిం మతాలకుచెందిన వారినిగానీ, గ్రంథాలనుగానీ తిట్టేదమ్ముల్లేవనీ,
(2) 1975 సం||లో కాకినాడలో డా|| కోవూర్, ఆర్కె మలాయత్, మరో మెజీషియన్ రామస్వామి అన్నవారిచేత ''బాబాల బండారం బట్టబయలు'' అన్న పేరుతో నాస్తికహేతువాదులు నిర్వహించిన సభకు తానూ హాజరైనాననీ, అనంతరం ఆర్కే మలాయత్, ఎ.టి.కోవూర్‌లతో కోవూర్ వసతిగృహంలో సంభాషణ జరిపాననీ, వారిదంతా వ్యాపారమేనని వారితోనే చెప్పాననీ వ్రాశారు పట్టాభిగారు, అదే వ్యాసంలో తానూ ఒక ప్రసిద్ది చెందిన మెజీషియన్‌నేననీ, కోవూరు, మలాయత్ లాంటి వారు చేసే ట్రిక్కులన్నీతనకు తెలుసుననీ, బాబా చూపే అద్భుతాలు అలాటి ట్రిక్కులు కాదనీ ఢంకాభజాయించారు. ఇక్కడ మూడు నాలుగంశాలున్నాయి.
(1) నాస్తిక హేతువాద సంఘాల వారు బాబాలనూ, అమ్మలనూ చెడమడా తిట్టడమే గాని, విషయం తెలిసి మాట్లాడేవారు కాదు.
(2) మల్కాయత్ ఆస్థికుడే, అయినా వృత్తిగా డబ్బులు తీసుకుని ప్రదర్శన ఇచ్చాడు. మెజీషియన్లలో చాలా మంది ఆస్థికులున్నారు.
3) కోవూరూ దానిని వ్యాపారంగా వాడుకున్నాడే తప్ప అన్ని మతాలనూ సమానంగా ఖండించలేదు.
4) హిందువులు తిడుతున్న పట్టించుకోరు, సహనశీలురు. అదేమరి ముస్లిం మతాన్ని అలా విమర్శించమనండి చూస్తాం?
5) బాబా చేసేవి మేజిక్కులని ఒకప్పుడనుకునే వాణ్ణి, వాటిని దగ్గరగా చేశాక అవిమ్యాజిక్కులు కాదని తేల్చుకున్నాను.
6) సృష్టంతా సైన్సుకులోబడి ఉంటుందనుకోవడం అజ్ఞానం. సైన్సుకు అందనివి ఎన్నో ఉన్నాయి.
సారాంశం : మహిమలున్నాయి. మహిమలు కలవాళ్ళున్నారు. బాబా అవతార పురుషుడు, నాస్తికత తప్పు ఆస్తికతే ఒప్పు.
విశ్లేషణ : పట్టాభిరాంగారికి ఒకింత రచనా చతురత ఉంది. అది చిన్నదాన్ని పెద్దది చేసి చూపడం, ముఖ్యమైన వాస్తవాలను ప్రక్కకు నెట్టేయడం, అంతగా హేతుబుద్దీ, ఇంగితజ్ఞానమూ పనిచేయని వారిని తనకనుకూలంగా ప్రభావితం చెయడం అన్న వాటితో కూడి ఉందా చతురత. కామన్‌సెన్సు (ఇంగితజ్ఞానం) ఒకింత బలంగా ఉన్నవారికీ, శాస్త్రీయ దృక్పథమూ, వైజ్ఞానిక పరిశీలనా పద్దతి, హేతుబద్దత ఉన్న వాళ్ళకు ఆయన రచనలోని డొల్లతనము, నిజాయితీ లేనితనమూ, తెలియని విషయాలలోనూ తెలిసినవాడిగా కనపడాలనే దుగ్ద ప్రస్పుటంగా కనబడుతన్నై. అయినా ఆయన వెళ్ళడించిన వాటిలో నాస్తిక హేతువాదులు ఆత్మపరిశీలన (స్వీయవిమర్శ) చేసుకోవలసిన అంశాలూ ఒకటి రెండు ఉన్నాయి. అవి నా అవగాహన ప్రకారం ఇవే.
1) బండగా, మొండిగా, తగినంత ఆధారాలు, అవగాహన లేకుండగనే తెగబడి మాట్లాడడం, అసభ్యమైన భాషవాడడం.
ఉదా:- ఆ గుంపులో ఒకరు 'బాబానపుంసకుడు' అంటారు. మరొకరు బాబా వ్యభిచారం అనంటారు. వేరొకరు అతడు 'స్వలింగసంపర్కి' అనంటారు. ఇందులో ఏ ఒక్కదానికీ ఆధారాలుండవు. ఆధారాలు చూపడం కష్టమని కామన్‌సెన్సూ చెపుతూనే ఉంది. అయినా బాధ్యత రహితంగా గేలి భాషతో మాట్లాడడం అలవాటుగా మారిపోయింది.
(2) హిందూ పక్షాన్ని విమర్శినంత ఘాటుగా, అసభ్యంగా ముస్లింమతాన్ని తెగనాడే తెగువ - దమ్ము - ఎవరికీ లేదన్నది మరో నిజం. అంతకంటే మరింత నిజమేమంటే, రాజ్యాంగంలోని 25, 26, 27, 28 అధికరణాలలో ఆ వివరాలున్నై. కనుకనే ఈ మధ్య క్రాంతికార్ (హేతువాద సంఘాద్యకక్షుడు) ప్రచురించిన ఇస్లాంపై విమర్శనాత్మక సంకలనం పైనే కోర్టుకు వెళ్ళారు ముస్లింలు. క్రాంతికార్‌పై భౌతికదాడికీ సిద్దమైనారు. అప్పటికి కానీ బుద్దిరాలేదు మన నాస్తికహేతువాద మిత్రులకు.
ఇక్కడ నేను చెప్పదలచింది మత గ్రంథాలు విమర్శకు అతీతం, వాటిని విమర్శించకండి అని కాదు. మత గ్రంథాలూ విమర్శకు అతీతం కాదన్న ఉన్నత న్యాయస్థానం తీర్పూ ఉంది. అయితే విమర్శకు, తిట్ల పురాణానికీ ఉన్న తేడాను గమనించాల్సిఉంది. విమర్శలో గుణదోషవిచారణ ఉండాలి. ఉన్నదాన్ని పెద్దది చెయడంగానీ, చిన్నది చేయడంగానీ చేయకూడదు. అసభ్య, అశ్లీల, వ్యంగ్య పదాల అవసరం విమర్శకు అవసరంలేదు. అదైనా వెంకటాద్రి గారు అన్నట్లు, చదవకుండా (చూడకుండా) విమర్శించడం సరికాదు. ముఖ్యంగా హేతువాదులకది తగదు అంది సర్వధాశిరోధార్యం.
3) కోవూరు లాటివారిని వ్యాపారస్తులనడం, పట్టాభిరాం గారిలోని తెగబడిన తనానికి నిదర్శనం. బ్రతక నేర్చినతనం. ఈ రచనలో 1) స్వార్థప్రయోజనాలు 2) అరకొర (మిడిమిడి) జ్ఞానము 3) సత్యశాయి సంస్థతో అనుకూల సంబంధాలు, అన్నవి ఆయన వెనక పని చేస్తున్నట్లు తెరవెనుకన దోబూచులాడుతున్నట్లు నిశితంగా చూడగలవారికి కనిపిస్తున్నాయి.
ముగింపు : ఇలా రచయిత పోకడను వేలెత్తిచూపి, గమ్మునుండడం బాధ్యతారాహిత్యమే అవుతుంది నాకైనా, ఎవరికైనా. కనుక ఈనా అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యతను నేను స్వీకరిస్తూ క్రింది ప్రకటనను చేస్తున్నాను.
డాక్టర్ బి.వి. పట్టాభిరాంగారు సిద్దపడితే, ఈ రచన ద్వారా ఆయన అమాయకజనాన్ని నమ్మకాలవైపుకు కదిలేలా ప్రభావితం చేయడం జరిగిందనీ, ఇందులోని చాలా అంశాలు, శాస్త్రీయ దృష్టికీ, శాస్త్రీయ పరిశీలనకు పనికి రానివిగా నిర్థారించగలననీ, ఆయనకు అటు ఆస్థికతను గురించిగానీ, ఇటు నాస్థికతను గురించిగానీ, విజ్ఞాన శాస్త్రాల గురించి గానీ సరైన, సరిపడినంత అవగాహన లేదనీ నిర్ణయించడానికి అనువుగా ఉన్నాయని నిర్థారించగలను. ఆయన గాని సిద్దపడితే, (ఆయనతరఫున మరెవరు సిద్దపడ్డా) ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, నిర్ణీత వ్యక్తుల - నిపుణుల - సమక్షంలో నిజనిర్థారణ వేదికను ఏర్పాటు చేయగలను. ఇదినా వాగ్థానం ప్రకటన స.మం తరపునుండి .........
ఈ సంచిక పట్టాభిరాం గారికి రిజిష్టర్డ్ పోస్టు ద్వారా పంపుతున్నాను.
ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికామాటలాడి అన్యుల మనమున్
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతి... అన్న వైఖరి బ్రతకనేర్చినతనాన్ని చూపుతుందేగాని, సత్యధర్మాల పక్షాన ఉండే వైఖరిని చూపించదు. పట్టాభిగారు ఈ విధానాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని నేను నిర్ణయించలేను గాని, ఆయన ఈ రచన సమాజానికి సత్యజ్ఞాన క్షేత్రానికి నష్టం కలిగించేదేనని ఖచ్చితంగా చెప్పగలను.
సత్యాన్వేషణలో..... మీ సురేంద్ర.
విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు -2
విషయం : బి.వి. రాధాకృష్ణ మూర్తిగారు పంపిన రెండో పుస్తకం ''హేతువాదము - ప్రతివాదము'' అన్నది. దాని రచయిత పేరు ఆ పేరుకు ముందనేక విశేషణాలు ప్రకటించారా పుస్తక ప్రచురణ కర్తలు, అవి ఇవిగో.
(1) ఇందూ ధర్మ ప్రదాత; 2. సంచలనాత్మక రచయిత 3. త్రైతసిద్దాంత ఆదికర్త 4. శ్రీ శ్రీ శ్రీ 5. ఆచార్య, 6. యోగేశ్వర
విశ్లేషణ : ఈ అయ్య పుట్టినప్పుడు పెట్టిన పేరేమిటోగాని, ఈయన పెట్టుకున్న, తగిలించుకున్నవి మాత్రం చాలా ఉన్నై.
1. ఇందూ ధర్మ ప్రదాత :- ఏమిటీ సమాసానికి అర్థం? ఇందూ అంటే ఏమిటి? ఎక్కడిదీ అర్ధం? ఇంతకూ ధర్మమంటే ఏమిటి? ఇందూ ధర్మమంటే ఏమిటి? ప్రదాతంటే ఏమిటి? దాతంటే ఏమిటి?
2. సంచలనాత్మక రచయిత :- సంచలనం అంటే ఏమిటి? సంచలనాత్మకతంటే ఏమిటి? రచయిత అన్నమాటకూ సంకలన కర్త అన్నమాటకు అర్థమేమిటి?
3. త్రైత సిద్దాంత ఆదికర్త :- ఏమిటీ త్రైత సిద్దాంతము, సిద్దాంతమంటే ఏమిటి? కర్తంటే ఏమిటి? ఆది కర్త అన్నమాటకు అర్థమేమిటి? ఏదైనా సిద్దాంతానికి కర్త - ప్రవర్తకుడు - ప్రచారకుడు, అనుచరుడు అన్నవాళ్ళుంటారు గాని ఆదికర్తేమిటి?
4. శ్రీ శ్రీ శ్రీ :- ఏమిటీ మూడు శ్రీలముచ్చట ఆస్థిక సంప్రదాయంలో అహంకార ప్రదర్శనకుగాను అర్థం పర్ధం లేనన్ని శ్రీలు తగిలించుకునే పడికట్టుపోకడ (ఆచారం) ఒకటుంది శ్రీ శ్రీ శ్రీ 108; శ్రీ శ్రీ శ్రీ 1008 అని వ్రాసుకుని తరవాత తగిలించుకున్న పేరూ జత చేస్తారు. అలాగే ఈ అయ్యగారికీ, సొంతపేరు రాసుకుంటానికి ఒక శ్రీనే అనవసరమైయ్యుండగా, మూడుశ్రీలు కావలసివచ్చాయి. ఇలా సుత్తి కొట్టుకోడానికి ఇంగితం పని చేయకపోయైనా ఉండాలి, లేని గొప్పలు చెప్పుకునే దురదైనా ఉండుండాలి. అతనికంటే నాలుగాకులు తక్కువ చదివినవాళ్ళు తగిలించైనా ఉండాలి.
5. అచార్య :- ఏమిటీ మాటకు అర్థం, విద్యాలయాలలో ఖచ్చితంగా ఒక విద్యార్హతను తెలుపుతూ ఇచ్చే పట్టా (డిగ్రీ) ఇది. ఇతరత్రా ఆచార్యుడంటే (ఎ) గురువు, (బి) బోధకుడు (సి) ఉపనయనం చేయువాడు (డి) వేదవేత్త, మూడువేదములనెరిగినవాడు లాటి అర్థాలున్నాయి. పేరులోనే గురువు, ఉపాధ్యాయుడు అని పెట్టుకోడు బుద్దున్నవాడెవడూ. ఇకపోతే మూడు వేదములు చదివినవాడనిగాని, విద్యాలయాల ద్వారా పట్టాపొందిన వాడుగాని ఈ పేరుతగిలించుకోవచ్చు. అలా పెట్టుకున్నదేనా ఇది. ఎం.ఎ.బి.ఎఫ్ లా తగనిదితగిలించుకున్నట్లా? ఏ విషయంలో ఆచార్యుడు? ఎవరికి ఆచార్యుడు?
6) యేగీశ్వర్లు :- భారతీయ ఆస్థిక సాంప్రదాయంలో కృష్నుణ్ణి యోగీశ్వరుడు అని సంబోధించడం కనపడుతుంది. యోగమంటే ఏమిటి? యోగంటే ఏమిటి? యోగీశ్వరుడంటే ఏమిటి? యోగీశ్వర్లు!? ఏమిటి? ఎంతటి కీర్తికండూతి? ఎంతటి ఆత్మాధిక్యతా భావము? ఎంతటి దురహం కారము. నిజానికి ఏ వ్యక్తికైనా, అతణ్ణి గుర్తించడానికి ఇన్ని కొమ్ములూ, తోకలూ అవసరమా? ఒక్కమాట! మన రాజ్యాంగం బిరుదులు తగిలించుకోరాదు, తగిలించరాదు అని చెపుతోంది. అవేవీ పట్టించుకోకుండా, ఒకని అర్హతానర్హతల్ని పరీక్షించి చూడకుండా, బిరుదులు తగిలించడం, తగుదునమ్మా అని తగిలించుకోవడం, ఎదురిచ్చి బిరుదులిప్పించుకోవడం, వృత్తిగా ఇంత పుచ్చుకుని బిరుదులిచ్చే వ్యాపారస్తులుండడం ఇలా రకరకాల విధానాల ద్వారా అవసరమైన పేరుకు ముందూవెనకా ఏవేవో తగిలించుకుని తగిలింపించుకుని తృప్తి చెందే, విర్రవీగే మంద ఎక్కువైపోతున్నారీనాడు. ఒక వ్యక్తి వాడికిష్టమై వాడెన్నెన్ని తోకలు తగిలించుకున్నా మన కొచ్చే ఇబ్బందేమీ లేదుగాని, ఆవన్నీ తగిలించుకుని ఇదిగో ఇలా పుస్తకాలు రాసి, ఆ చెత్తనంతా ఆపేరు గొప్ప ఆధారంగా అమ్ముకునేవారి విషయంలోనే అభ్యంతర పడాల్సివస్తోంది.
గమనిక : మీలో కొందరికి ఆ రచనలోని విషయాలు చెప్పి విషయపరంగా విమర్శించక, ఆయన పేరు మీదే ఇంత విమర్శ ఎందుకండీ! అనిపించవచ్చు. నేనిది కేవలం పాఠకులనుద్దేశించి మాత్రమే వ్రాయడంలేదు. ఆయన పాలబడి, ఆయన పల్లకీనిమోస్తున్న వారినీ, ఆయన అనర్హతలను ఒకింత గమనించి గట్టిగా నిలువరించడానికి బలం చాలని వారిని ఉద్దేశించికూడా వ్రాస్తున్నాను. కూపస్థమండూకాల్లాటి బ్రతుకులు వారివి. అట్టి వారి గురించిన వివరాలు ఇలా గ్రంథస్తం కావించడం వల్ల వర్తమాన, భవిష్యత్తరాల ఆలోచనలకు ఒకింత ఆసరానూ అవుతుందనీ అనుకుంటూ రాశానివి. అజ్ఞానమూ, తప్పుజ్ఞానమే అధికంగా ఉండి, సరైన జ్ఞానం అరకొరగా కూడాలేని వాడే 'ప్రబోధానంద'. ఆశ్చర్యం!? ఇంతకూ ఈ 'ప్రబోధానంద' అన్నమాటకున్న అర్థమేమిటి? ఇందులోని ఏ ఒక్కమాటకుగానీ తాత్విక పరిభాష అంగీకరించే అర్థానికి తగుతాడా అతడు? అన్నది అతడూ, అతడిని అనుసరిస్తున్నవారూ ప్రశ్నించుకోవాలని అనుకునీ ఇది వ్రాశాను. మరోమాట! ఈ పుస్తకంలోనే 126 పేజీలో నా గురించిన ప్రస్తావనాచేశాడీయన.
''సత్యాన్వేషణ సంఘము అని పేరెట్టుకుని, దానికి అధ్యకక్షుడనని చెప్పుకొను వ్యక్తి ఒక మారు నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక దానిని అసత్యమన్నాడు. తాము అసత్యవాదులైయ్యుండి, సత్యాన్వేషకులమని పేరు పెట్టుకుని తమను తాము ప్రచారము చేసుకొను ఇటువంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని అప్పుడు నాకు అర్థమైంది, అటువంటి వారు తమకు పూర్తి సైన్సు తెలియకున్నా యధార్థసంఘటనలను ఖండించుచుందురు. ఇవండీ ఆ పేజీలోని ఆయన నా గురించి చెప్పిన మాటలు.
విశ్లేషణ : - ఈ వివరాలైనా ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈయనను గురించి ఈ పుస్తకంలోని మాటలనుబట్టే కాక, నేరుగానూ నాకు కొంత తెలుసు అనడానికే, తేదీ, సం||ము సరిగా గుర్తులేదుగానీ సుమారు 30 సం|| అయ్యుండవచ్చు నంద్యాల ప్రక్కనున్న కొత్తపల్లి గ్రామంలోని ప్రమోదచైతన్యగారి చైతన్య క్షేత్రంలో నేనూ, పెంచలయ్యగారూ కలసి ఆస్థిక మేధావీ చర్చావేదిక నిర్వహించిన తరవాత జరిగిన ఘటన ఇది. తాడిపత్రి నానుకుని ఉన్న ఒక గ్రామంలో చిన్న ఆశ్రమంలో ఈయనుండేవాడు. అప్పుటికింకా ఇన్ని తోకలు, కొమ్ములు చేరలా. ప్రబోధానందయోగీశ్వర్లు పేరున చెలామణి అవుతున్న రోజులు. మాకు చైతన్య క్షేత్రంలో పరిచయమైన తాడిపత్రి నివాసులు, ఈయనతో మాట్లాడడానికి మమ్మల్ని పిలుచుకెళ్ళారు.
విషయం యధాతథంగా గుర్తులేదుగానీ, జన్మగురించిన చర్చ అది. ''తల్లి గర్భంలో పిండం ఏర్పడ్డాక, ఆ శరీరంలోకి జీవుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు'' అనో, అతనికి ప్రాణం ఎప్పుడు వస్తుంది అనో ప్రశ్నించాడీయన. చర్చలో తల్లి ప్రసవించాకనే అన్నది ఆయన సమాధానం. అది ప్రసూతి విజ్ఞాన శాస్త్రం ప్రకారం తప్పు సమాధానం, నేనూ ఆ వైద్యశాస్త్రం తెలిసిన వాణ్ణేనంటూ ఈ విషయంలో నీవు అజ్ఞానివేకాదు, తప్పు జ్ఞానం ఉన్నవాడివి అనీ చెప్పాను. అదిగో ఆ మాటనే ఇక్కడ ''నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక అసత్యమన్నాడు'' అని వ్రాశాడు.
చాలెంజ్ : ఈ విషయంలో ఈనాటికీ నేను ఆయనతో నిజనిర్థారణకు కూర్చోడానికి సిద్దంగా ఉన్నాను. ఈ గ్రంథంలోనే జన్మ గురించి, జన్మ కారణాలను గురించి తట్టెడు అశుద్ధాన్ని పోగేసి మందినెత్తిన పెట్టాడు, సత్యాన్వేషణ మండలి అధ్యకక్షునికి సైన్సు తెలుసా? అని ఎద్దేవాచేశాడు. నాకు సైన్సంతా తెలియని మాట నిజమే గాని గర్భోత్పత్తి, జన్మ, ప్రాణం, వీటికి సంబంధించి పిండోత్పత్తి శాస్త్రం ఏమి చెపుతుందో వరకు సాధారణ జ్ఞానముంది మరింత అవసరమనుకుంటే ఆ విజ్ఞాన శాస్త్రం అందుబాటులోనూ ఉంది ప్రయోగశాలా అందుబాటులోనే ఉంది. ఏమాత్రం నిజాయితీ, నిబద్దత ఉన్నా ఈయన ఈ విషయమై సత్యాసత్యవిచారణకు తాను సిద్దంగా ఉన్నానని సత్యాన్వేషణ మండలి నుద్దేశిస్తూ ఒక బహిరంగ ప్రకటన చేసి, ఆ ప్రకటన ప్రతిని నాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. ఈ సంచికను ఆయనకు రిజిష్టర్ పోస్టుద్వారా పంపుతాను. ఈ ముఖంగానే ఆ పుస్తకంలో ఈయన వ్రాసిన మరికొన్ని అంశాలపైనా నిజనిర్థారణకు నేను సిద్దమని బహిరంగంగా ప్రకటిస్తున్నాను.
ముప్ఫై ఏండ్లనాటి ఆ ఘటన తరవాత, ఈ మధ్య జ్ఞాన విజ్ఞానవేదిక (జనవిజ్ఞానవేదికకాదు) పేరున ఈయన ఈయన అనుచరగణము, కొన్ని కరపత్రాలు, సమావేశాల, పుస్తకాల ద్వారా, లోకమంతా తప్పుజ్ఞానంలో ఉంది. తాము మాత్రమే సుజ్ఞానులం అంటూ ప్రచారం మొదలెట్టారు. ఆ క్రమంలో భాగంగా అభౌతిక శక్తులున్నాయని రుజువు చేస్తామంటూ రోడ్డున పడ్డారు. ఈ విషయాన్నీ అనంతపురంలోని జె.వి.వి. మిత్రులు నా దృష్టికి తేగా, వీరితో సంప్రదించాము. వారి ప్రాంతంలో ఒక తీగ మొక్క ఉందనీ, అది నేలతో సంబంధం లేకుండానే బ్రతికి, పెరుగుతుంటుందనీ, వృక్ష శాస్త్రం చెప్పే పరాన్న జీవి (పారాసైటు) జాతికి చెందిన మొక్క కాదనీ, ఆ మొక్కకు ఆ మొక్క ఉన్న చెట్టుకు ఎక్కడా సంబంధం ఉండదనీ, ఈ తీగ మొక్కకు చెందిన దుంప ఒకటి నేలలో ఉంటుందనీ దుంపకూ తీగకూ సంబంధముండదనీ, అంటూ ఇది అభౌతిక శక్తికి రుజువు కాదా? అని ఆ గుంపు మమ్మల్ని ప్రశ్నించారు. మీరన్నట్లే ఉంటే అదిప్పటికి సైన్సుకు తెలీని విషయమేననీ, భౌతిక సూత్రాలకూ విరుద్దమేనని, పరీక్షించడానికి సిద్దపడదామని అనుకుని, ఈ అంశాలన్నీంటినీ క్లుప్తంగా రాసుకుని సంతకాలు పెట్టుకుని అటుపైన పరిశీలనకు కూర్చుందామనీ అనుకోడం జరిగింది. హైద్రాబాద్ చింతల బస్తీలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సమావేశమయ్యాం. వివరాలన్నీ కాగితం మ్మీద వ్రాసి, పరీక్షలో అభౌతిక పదార్థంఉందని తేలినా, ఆ తీగ మొక్క ఎటువంటి ఆధారంలేకుండానే జీవిస్తొందని తేలినా మేము అది ప్రకటించి, వారి మార్గాన ప్రచారం కావించాలి. వారిపక్షం సరికాదని తేలినా, అంటే అభౌతిక శక్తులు ఉన్నాయని వారు రుజువు చేయలేకపోయినా, ఆ తీగమొక్క వృక్ష శాస్త్రానికి తెలిసిన పరాన్నజీవి జాతికి చెందిందేనని వృక్ష శాస్త్రజ్ఞులు నిరూపించినా, ఆ తీగ నిరాధారంగానే అంటే నేలనుండి, దాని దుంప నుండి సంబంధం లేకుండానూ, అది ఆధారపడి ఉన్న చెట్టు నుండి ఆహారం స్వీకరించకుండానూ జీవిస్తున్నదని, వారు రుజువు చేయలేకపోయినా వారు అభౌతిక శక్తులు లేవని ప్రకటించి మామార్గాన ప్రయాణించాలి. అని వ్రాసి రెండు పక్షాల నుండి దానిపై సంతకాలు చేశాం. నిర్ణీత దినాన మేమంతా రెండు మూడు కార్లు వేసుకుని ఒక 15, 20 మంది వరకు వారురమ్మన్న చోటికి వెళ్ళాం. వారు చూపిన తీగ మొక్కను పరీక్షించి, అది పరాన్న జీవేననీ, దానికి దుంపంటూ అక్కడేమీలేదనీ, చెట్టు కాండం నుండే ఆహారం తీసుకుంటూ బ్రతికేస్తున్నదనీ తెల్చాము. ఆ పక్షంవారికి కళ్ళు తిరిగినై, గుండెలుగుబేలన్నాయి. అడ్డగోలు వాదనకుదిగి, లేబరేటరీలో తేలాలికదా అని కొత్తపాటందుకున్నారు. అరకొర పరిశీలన ఎందుకులే అని నిర్ణయించుకుని రెండు వృక్షశాస్త్ర విభాగాలకు వాటినిపంపి, అది పరాన్న జీవజాతికి చెందిన మొక్కేనని దృవీకరణ పత్రాన్ని తీసుకుని జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రతినిధులకు పంపాము.
సిగ్గుపడే లక్షణంగానీ, నిజాలను స్వీకరించే లక్షణం గానీ లేని ఆ మంద రాత మూలకంగా అంగీకరించిన దానిని విడిచి పెట్టి గమ్మునున్నారు. నా ఈ ప్రకటనను చూసి, ఎవరైనా వారినిదేమిటని అడిగినా, ఏదోకవంకో, అబద్దమో చెప్పుచూడవచ్చు. కనుక అలాంటి పరిస్థితి ఏర్పడితే, వారు అడ్డగోలుగా మాట్లాడకుండా ఉండడానికి వీలుగా ఈ ప్రకటన చేస్తున్నాను. దీనిని పాఠకుల్లో వారితో బేటీపడ్డ, పడదలచుకున్న వారేవరైనా ఉపయోగించుకోవచ్చు.
ఆనాడు మా రెండు పక్షాలమధ్య జరిగిందంతా రికార్డు రూపంలో రాత మూలకంగా భద్రపరచబడి ఉంది. దానినైనా చూసుకుందాం. లేదా ఈ పిచ్చి పుస్తకంలో ఉన్న అంశాలలో మేము తప్పనుకుంటున్న వాటిని పరీక్షకుపెట్టుకునైనా చూసుకుందాం. తేలిన వాటిని తేలినట్లు ఇరువురం ప్రకటించి, వాటిని ప్రచారం చేస్తూ జీవించాలి. అన్నది షరతు. ఎప్పుడు, ఎక్కడ పరీక్షకు కూర్చుందామన్నా నేను - మేము - సిద్దము. ఏ మాత్రం దమ్ము, దగాలేనితనము ఉన్నా దీనికి సిద్దపడకపోవడమన్నదే కుదరదు.
ఈ పుస్తకం 5వ పేజీ నుండి 'హేతువాదము- ప్రతివాదము' అన్న శీర్షికన విషయం మొదలైంది. అందులో మొదటి వాక్యం ఇలా ఉంది. తరువాత వాక్యాలూ కొన్ని ఇలా ఉన్నాయి.
1. వాదము అనుపదము వాక్యము అన్న శబ్దం నుండి పుట్టింది.
ప్రశ్న : ఇది భాషనెరిగిన వారి ప్రకారం తప్పంటాను. అదలా ఉంచుదాం. ఈ మాటసరైందేనని భాషాశ్రాస్తాన్ని చూపించి వారేరుజువు పరచాలి.
2. భాష నుండి భావంపుట్టినట్లు, వాక్యం నుండి వాదన పుట్టింది.
ప్రశ్న : నిజమా? ముందు భాష పుట్టిన తరవాత భావం పుట్టిందా? ఎలా గెలాగు!? రుజువు చేయి తండ్రీ!
3. ఒక విషయమును తెలిసికొను నిమిత్తము ప్రశ్నించి అడగడమును హేతువాదము అంటాము.
ప్రశ్న : ఔరా! హేతువాదులెవరికీతెలియని వారెవరూ చెప్పని అర్థాన్ని చెప్పావు గద తండ్రీ! హేతువాదమంటే ప్రశ్న అనా?
4. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడాన్ని ప్రతివాదము అంటాము.
ప్రశ్న : గొప్పజ్ఞానివే, యోగీశ్వరుడివే. పిచ్చికుదిరింది రోకలికితలచుట్టమన్నట్టు వెనకటికొకడు, అలా ఉందిదిన్నూ, ఇలాటి అపభ్రంశపు మాటలు రాసి, ప్రచురించి మందినెత్తినింత బండపెట్టేరకాన్ని దండించే వ్యవస్థ లేకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం.
వివిధ వాదాల గురించి సంచలనాత్మక రచయిత ఏమంటున్నాడో చూడండి.
ప్రశ్నించడము హేతువాదముకాగా, దానికి జవాబు చెప్పడము ప్రతివాదమట, జవాబు సరైనదైనా దానికి ఒప్పుకోక, కాదని మొండిగా వాదించడము అతివాదము అంటాము, అట,
ఇక ప్రశ్నకు చెప్పబడిన జవాబు సరైనదైనా, కాకున్నా దానిని ఎదురుమాట్లాడక ఒప్పుకోవడాన్ని వింత వాదమంటారట, అలాకాక, చెప్పబడిన జవాబు సరైందా కాదా అని ఏ మాత్రం ఆలోచించక, విచక్షణా జ్ఞానము లేకుండా తనకు తెలిసిందే సరైందనీ, ఇతరులు చెప్పింది సరైంది కాదని, తన భావమునకు వేరుగానున్న వారందరినీ హింసతో అణచివేయాలని చూచువాడు తీవ్రవాది అనబడుతున్నాడు.
విశ్లేషణ : ఈనాలుగు ముక్కల రచనలోనే రచయితకు భాషమీద పట్టుగానీ, భావంలో దిట్టతనంగాని లేవని ఇట్టే తేలిపోతోంది. ఈ రకం రచనల్ని, రచయితలను చూస్తుంటే ఒక సుభాషితం గుర్తుకొస్తొంది.
''తెలివి యొకింత లేని యడ దృప్తుడనై సర్వము తెలిసితినంచు గర్వితమతినై చరించితిన్'' అన్న దానికి సరిపోతారీ రకం. ఈ పుస్తకంలోని భాష పై గాని, భావాలపై గాని చర్చకు మేము సిద్దము.

No comments:
Post a Comment