Monday, June 13, 2016

అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ గారి బీరాలు - ఆర్భాటాలు


1. క్రైస్తవనాడు అన్న పత్రికలో బ్రదర్‌ 'వై.కె.యార్‌' అన్నాయన, అపొ. రంజిత్‌ ఓఫీర్‌పై పుట్టా సురేంద్రబాబు ఫైర్‌ అన్న పేరుతో ఒక ప్రకటన చేశాడు. దానిని ఆధారం చేసుకొని ఓఫీర్‌ గారు ఒక వీడియో ప్రసంగం చేసి వెబ్‌సైట్‌లో పెట్టారు. అందులో ఆయనగారి మాటలిలా ఉన్నాయి. ఆ వివరాలను మండపేట నుండి మిత్రులు పాతూరి రాధాకృష్ణారావు గారు నాకు 'వాట్సాప్‌' ద్వారా పంపారు.

నేను అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని విమర్శకుల రాతలను నేను పట్టించుకోను.

2. రంజిత్‌ ఓఫీర్‌తో కూర్చొని మాట్లాడాలంటే కొన్ని అర్హతలుండాలి. అది ఎవరికి పడితే వారికి సాధ్యం కాదు. అనవసరంగా నా టైం వేస్టుచేసే అవకాశం నేను ఇవ్వను.

3. నాకు నమ్మకం కుదరాలి, మీరు సమర్ధులని? ఎప్పుడు కుదురుతుంది.

4. నేను నా గ్రంథంలో అనేక విషయాలను ఒక క్రమపద్ధతిలో ఒకటొకటిగా ఖంఢించి ఒక పుస్తకం వ్రాయండని పుట్టావారికి చెప్పాను.

5. నేను అనేక గ్రంథాల నుండి ప్రతి విషయానికి అనేక వందల ఆధారాలు చూపుతూ మత సామరస్యాన్ని కల్గించే రీతిలో రెండు గ్రంథాలలో ఒకదాని గురించే చెప్పబడిందని రాస్తే, ఇది ప్రమాదకరమని అంటున్నారు సురేంద్ర. అదెలా ప్రమాదకరమో, ఎవరికి ప్రమాదమో..

6. రంజిత్‌ ఓఫీర్‌ అంటే చిన్నపిల్లవాడు కాదు. నాతో మాట్లాడాలంటే చాలా జ్ఞానం, ఇంగితం, తర్క జ్ఞానం ఉండాలి.

7. ఒక 3వ తరగతి పిల్లవాడు వచ్చి అదీ ఏడుసార్లు పరీక్ష తప్పినవాడు వచ్చి ఒక పి.జి. చదివిన ప్రొఫెసర్‌తో వాదనకు దిగుతానంటే ప్రొఫెసర్‌ ఒప్పుకోడు.

8. నేను ఇలా చెప్పి ఎగగొడుతున్నానని కాదు. ఇప్పటికీ ఒకసారి కాదు లక్షసార్లకు నా ఛాలెంజికి కమిటవుతున్నా.

9. ముందుగా నా పుస్తకాన్ని ఒక క్రమంలో విమర్శిస్తూ ఒక పుస్తకం వ్రాయాలి సురేంద్ర (ఎవరుగాని). దాన్ని నాకు పంపాలి. అది నేను చూసి అతడు సరిజోడి అనిపిస్తే అప్పుడు కూర్చుంటాను చర్చకు.

10. అంతేకాని నా కాలాన్ని, మీ కాలాన్ని వృధాచేసుకోవద్దు.

ఓ  వేదంలోని అగ్ని, వేదంలో శబ్దము, అగ్ని మొదటి పుట్టుక, ఇలాటి అంశాలు బైబిలులోని యేసును గురించి చెప్పిన వాటికి సరిపోలుతున్నాయి కనుక వేదంలో యేసు పోలికలున్న వ్యక్తి కనపడుతున్నాడని నేను చెప్పాను.

ఓ  ఓఫీర్‌ గారూ మీరన్నట్లు అక్కడ చెప్పబడిలేదు అని ఆయన రుజువుచేస్తే అప్పుడు వస్తాను చర్చకు.

11. నిజాయితీ అట! ఆయన పద్ధతి చూడండి. ప్రమాదకరమట- రెంటిలో ఒకే దేవుడున్నాడనంటే మత సామరస్యం ఏర్పడుతుందా? ప్రమాదము ఏర్పడుతుందా? ఎలా ప్రమాదమో పుట్టావారే వివరించవద్దా?

12. ఇవేమీ చేయకుండా నేరుగా బరిలోకే రావాలంటే ఎలా బాబూ! నీ కింకో పనిలేదేమో! నాకు చాలా పనులున్నాయి.

షఫీ గురించి మాట్లాడుతూ ఓఫీర్‌గారు లేవనెత్తిన ప్రధానాంశం


1. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మా అల్లా అంటున్న ముస్లిం సోదరులు, ఆ ముగ్గురి దేవుడి పేరు, బైబిలు 'అల్లా' అని ఎక్కడైనా చెప్పిందేమో చూపండి. బైబిలులో ఆ దేవుడు తన్నుతాను యెహోవా దేవుడను నేను. నా నామమును ఎవరికీ ఇచ్చువాడను కాను. నేను నేనే. యెహోవా దేవుడను. బైబిలు లోని మా పెద్దలంతా దేవుణ్ణి 'యాహవే' అని పిలిచారు. దేవుడి పేరు మార్చవచ్చా? దేవుడు అంగీకరిస్తాడా? అబ్రహాము వగైరాలు అంగీకరిస్తారా? మీరు మీ దేవుణ్ణి 'అల్లా' అని కాకుండా మరో పేరుతో పిలిస్తే మీరు అంగీకరిస్తారా? అలా పేరు మార్చవచ్చా? యాహ్‌వే అని వాళ్ళన్న బైబిలులోని దేవుణ్ణి, బైబిలు 'ఎలోహెం' అని బహువచనంలో చెబుతోంది.

ఓ 'వేదములలో యేసు లేడు. ఇతడు యేసు కాడు' అని మీరనవచ్చు. కాని యేసు పోలికలు ఉన్నాయా లేదా. అని నేనడుగుతున్నాను. యేసుకు బైబిలులో చెప్పబడ్డ మాటలు వేదాలలో చెప్పబడ్డాయని నేను నిరూపించాను. అవికాదు. బైబిలులో ఉన్న మాటలు వేదాలలో లేవు అని మీరు నిరూపించగలగాలి. అలా నిరూపిస్తే నేను గుండు కొట్టుకొని, పిలకపెట్టుకొని హిందువునైపోతా. దానర్థం దానిని మీరు నిరూపించలేరనే. అలాకాక మీరు నిరూపించగలిగితే అన్నమాట తప్పను. రివర్సులో కన్వర్టయిపోతా. అమ్మవడి అంటున్నారు పరిపూర్ణానందగారు, ఆ అమ్మఒడిలోకి వచ్చేస్తా.

ఓ పాత నిబంధన గ్రంథములన్నింటిలో, దేవుని పేరు ఎలోహిం, యాహ్‌వే, యెహోవా అన్నపేర్లే ఉన్నాయి. అబ్రహాము, వగైరాలందరూ ఎప్పుడూ తమ దేవుణ్ణి' అల్లా' అని పిలువలేదు. పిలిచారని మీరు నిరూపించాలి. పిలవలేదని నేను నిరూపిస్తాను.

పాత నిబంధనలోని దేవుని పేరు అల్లా అని నిరూపిస్తే నేను ముస్లింనవుతాను.

1. యేసు వేదములలో లేడు. వేదములలో ఉన్నటువంటి దైవానికీ, యేసుకు అసలు పోలికలే లేవు. ఈయనే ఆయనని అనిపించే మాటలు వేదములో లేవు అని ఎవరైనా నిరూపించగలిగితే, ఎ) నేను వ్రాసిన గ్రంథాన్ని వెనక్కు తీసుకుంటాను, బి) జాతికి క్షమాపణ చెబుతాను, సి) నేను హిందువుగా మారతాను.

2. అలాగే ముస్లిం సోదరులు బైబిలు దేవుని పేరు 'అల్లా' అని బైబిలులో ఉందని రుజువు చేస్తే నేను ముస్లింనవుతాను. అంతేగాని, నేనడిగిన వాటికి సూటిగా సమాదానాలు చెప్పకుండా చర్చకు రమ్మంటే రావడానికి నేను పనిలేనివాణ్ణి కాదు.

సురేంద్ర : ఇవండీ ఓఫీర్‌గారు ఆ వీడియో ప్రసంగంలో మాట్లాడిన మాటలు. హైందవ క్రైస్తవానికి చెందిన అంశాలేవీ నేనిప్పుడు మాట్లాడను. మచ్చుకు నా వాద పద్ధతి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను, అని ఈ ప్రసంగంలోనే ఒకచోట ఓఫీర్‌గారు ప్రకటించారు. నా దెబ్బకు తట్టుకోలేరు, సురేంద్రలాంటి వాళ్ళు అన్నట్లుందీ ధ్వని. ధోరణి. అదిగో దానిపై, ఆయన మాటలలోని ఉండకూడని తనాన్ని, డొల్లతనాన్ని చూపెట్టి, నా పద్ధతెలా ఉంటుందో చూపుతాను., ఎవరి వాదరీతి బుద్ధిమంతులంగీకరించదగిందిగా ఉందో మీరు పరికించండి.

1. షఫీగారి - ముస్లింల - విషయంలో ఓఫీర్‌గారు, ముస్లింలు ఇంకేమి చెప్పినా నేను వినను. బైబిలు దేవుని పేరు 'అల్లా' అని బైబిలులో ఎక్కడుందో చూపితేనే మీ మాటలు వింటాను. ఇంకేవి చూపినా బైబిలు దేవుడు ఖురాను దేవుడు ఒక్కరేనని నేనంగీకరించను. మీరు ఖురాను దేవుని పేరు యెహోవా అని అంగీకరిస్తారా అని అడిగాడు.

సురేంద్ర : ఒక వందమందికి ఖురాను, బైబిలు పాత నిబంధనలను పరిశీలనకు ఇచ్చి రెంటిలోనూ చెప్పబడుతున్నది యెహోవా, అల్లా అని పేర్లతో చెప్పబడింది ఒక్కడ్ని గురించేనా, వేరు వేరు వ్యక్తులను గురించా అనడుగుదాం. వారేమి చెబుతారో విందాం? నా అవగాహన ప్రకారం ఏ మాత్రం చదువు వచ్చినా రెంటిలో అల్లాపేరున, ఎలోహిం, యాహ్‌వే, యెహోవా, జెహోవా అన్న పేర్లతో చెబుతున్నది ఒక్కడ్ని గురించేనని తేలిపోతుంది. అయినా బైబిలు దేవుడే ఖురాను దేవుడని అంగీకరించను. అలా అంగీకరించాలంటే, మరే కబుర్లు చెప్పకుండా బైబిలు ప్రవక్తలు - అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మూసా వగైరాలు బైబిలు దేవుణ్ణి 'అల్లా' అని పిలచినట్లు రుజువుచూపండి. పేరు కలవకున్నా ఇద్దరూ ఒక్కరేనని నేనంగీకరించను. కావాలంటే, ఇద్దరు, ఒక్కరేనని అంటున్న మీరే బైబిలులోని పేరుతో మీ దేవుణ్ణిపిలవటం, ప్రార్థించటం మొదలెట్టండి.

ఈ పేర్లు సరిపోకుంటే ఎంతచెప్పినా నేను వినను. పేరు సరిపోతే ముస్లింనైపోతా అంటూ, పేరునే అసలు విషయంగా - ఎన్ని పోలికలున్నా, అన్నీ సరిపోయినా రెంటిలోనికి ఒక్కడేనని నేనొప్పను అంటున్నారు. ఇది నా వాద పద్ధతి అనీ అంటున్నారు.

నిజంగా అతని వాదపద్ధతి అదే అయితే, అది సరైనదే అనుకుంటూ నిజాయితీ ఉన్నవాడైతే, సురేంద్రతో మాట్లాడే సందర్భంలోనూ తానే అతి ముఖ్యమంటున్న ఆ నియమాన్ని తాను పాటించిచూపవద్దా? వేదంలో యేసుపేరు ఎక్కడుందో చూపకుండా ఎన్ని పోలికలు చూపినా ఒప్పుకోకూడదనేగా, అతను ముస్లింలతో అన్న నియమపు అసలు రూపం. యేసు పేరు చూపాలి ఆయన. యేసు పేరు ఉండని ఆయన్ను నిరూపించమనండి. లేదని నేను నిరూపిస్తాను, ఇంతవరకు అయన నియమం నాకూ అంగీకారమే.

ఓ పాఠకులందరికీ! ఓఫీర్‌ శిష్యులకు కూడా... మిత్రులారా! మీరు కూడా! ఔనండీ ఓఫీర్‌గారూ! మీరు చెప్పిన నియమమేకదా అది. దానిని మీరు అమలు చేసి చూపాల్సిందే అని వత్తిడి చేయండి, మీకీ విషయం అర్థమై బాధ్యత తీసుకోగలిగితే.

మండలికి సంబంధించినంతలో, చర్చావేదిక నియమ నిబంధనలు ఏర్పరచుకోకుండా చర్చించ కూడదన్నది చాలా కీలకమైనది. అందులో ఎ) భాషాపరమైన, బి) వాదపరమైన, సి) నిర్థారణపరమైన నియమాలు ఉండాలి. ఉంటాయి. అవేమిటో ఇరుపక్షాలకూ, నిర్ణేతల పక్షాలకూ తెలిసుండడంతో పాటు, అంగీకారమూ ఉండాలి. అట్టిచర్చా వేదికలే యోగ్యమైనమవుతాయి. పైన ఓఫీర్‌గారు మాట్లాడిన దానివెనుక నిర్థారణ నియమాలకు సంబంధించిన ఒక సూత్రం పనిచేస్తుంది. ఇదిగో అది.

సూత్రం : ఎ) రెండు గ్రంథాలుగాని, ఇద్దరు వ్యక్తులు గాని (అనేక గ్రంథాలూ, అనేక వ్యక్తులూ అనీ అనుకోవచ్చు) ఒకే విషయాన్ని గురించే చెబుతున్నారని నిర్థారించాలంటే ఆ విషయాన్ని గురించి వారందిస్తున్న వివరాలు 1) పరిపూర్ణంగా ఉండాలి, 2) అన్నీ సరిపోవాలి. ఈ రెంటిలో ఎక్కడ లోపమున్నా నిర్థారించటం కుదరదు.

2. అదేమరి అవి/వారు చెప్పుతున్నది ఒకే విషయాన్ని గురించి కాదని నిర్ణయించడానికి ఏ ఒక్క విషయం సరిపోకపోయినా చాలు.

3. రెండు సమాచారాలలో ఇరువురూగానీ, ఏ ఒక్కరైనా ఆ విషయానికి చెందిన కొంత సమాచారం ఇవ్వలేదని తేలినట్లయితే, ఒక్కదాని గురించా? కాదా? అన్నది తేల్చలేము అన్నది నిర్థారణ రూపం కావాలి.

ఓ విజ్ఞులారా! నిర్థారణ నియమాలకు సంబంధించిన సార్వత్రిక నియమమిది. రంజిత్‌ ఓఫీర్‌ గారికీ ఈ విషయంలో ఎంత స్పష్టత ఉందోగాని, దీనికి సంబంధించిన రెండు అంశాలను లేవనెత్తారు. ఆ రెండూ నాకు అంగీకారమే.

1) హైందవ క్రైస్తవంలో రెండు మూడు సార్లు ఒకటి, అర పోలితే అది యాదృచ్ఛికమనుకోవచ్చు. నూటికి నూరుశాతం, మక్కికి మక్కీ రెండు గ్రంథాలు సరిపోతున్నాయి అన్నారు.

2) ఎన్ని సమానమనిపించినా పేరు కలవకపోయినా రెండూ ఒకటేనని నేనంగీకరించను.

ఓ హైందవ క్రైస్తవంలోనే వేదంలో యేసు ప్రతి పేజీలోను నాకు దర్శనమిచ్చాడు అని ఒకచోట, యేసు విషయాలు వేదంలో అక్కడ కొంత అక్కడ కొంత చెప్పబడ్డాయి. వాటన్నింటినీ ఏరికూర్చుకోవాలి అని మరోచోట అన్నారు. ఇది పై నియమాన్ని ఉల్లంఘించటం కాదా.

ఓ ఇప్పటి వీడియోలో మక్కికి మక్కీ 100 శాతం అన్నది వదిలేసి వేదంలోని ప్రస్తావనలలోని వివరాలతో, బైబిలులోని యేసుకు పోలిక ఉందనిపించడంతో అలా రాశాననడంలో డొల్లతనం లేదా? తప్పుడు పోకడ ఉందనిపిస్తుందా లేదా?

రంజిత్‌


ఆ ప్రసంగములోని వాక్యాలు మరొక్కసారి చూడండి.

1. తాను మామూలు వాణ్ణి కాదని పలుసార్లు చెప్పుకున్నారాయన.

2. ఎదుటి వాళ్ళు పసిపిల్లల్లానో, పనికిమాలిన వాళ్ళుగానో కనిపిస్తున్నారాయనకు.

3. ఇదీ నా వాద పద్ధతి. నాతో మాట్లాడాలంటే చాలా జ్ఞానం, చాలా ఇంగితం ఉండాలి. తర్కం తెలిసుండాలంటున్నాడు. విడ్డూరమేమంటే, ఎ) ఓఫీర్‌గారు వినమ్రంగా ప్రకటిస్తున్నాననే సందర్భంలో వినమ్రత ఉండదు. మాటల్లో, హావభావాలలో దర్పమే ఉంటుంది. బి) విజ్ఞప్తిలో విజ్ఞప్తి ఉండదు, వెటకారం, వ్యంగ్యం ఉంటుంది. సి) ఛాలెంజిలో ఛాలెంజి స్వభావం ఉండదు. డి) ఇంగితాన్ని గురించి, తర్కాన్ని గురించి మాట్లాడతారు, అందులో ఇంగితమూ ఉండదు, తర్కమూ ఉండదు.

ఈ మొత్తాన్ని క్రోడీకరిస్తే ఆ సారాంశం ఇలా ఉంటుంది. ఆయన ఆత్మస్తుతి, పరనింద అన్న రెంటిలోనూ దిట్టే. తన గురించి చెప్పుకొనేటప్పుడు ఆత్మస్తుతి తట్టెడుంటుంది. దీనిని (వాడుక భాషలో చెప్పాలంటే సొంతడబ్బా అంటారు, పండిత భాషలో ఒకింత వ్యంగ్యంగా చెప్పాలంటే స్వకుచ మర్ధనం అంటారు. సంస్కారవంతంగా చెప్పాలంటే స్వోత్కర్ష ఎక్కువ అనాలి. గుచ్చేట్లు మాట్లాడాలంటే ప్రగల్భాలరాయుడు లాటి మాటలు సరిపోతాయి).

అదేమరి ఇతరుల గురించి, వాళ్ళ గురించి తనకంతగా తెలియక పోయినా వాళ్ళంతా పనికిమాలినవాళ్ళన్నట్లు, పనిలేనివాళ్ళన్నట్లు, పసివాళ్ళన్నట్లు తెగ మాట్లాడేసుకుంటారు.

ఓ మరోవంక ప్రసంగంలో ఎదుటివాణ్ణి భయపెట్టాలనే వైఖరి కలసిఉంటుంది. కానీ వాదరీతులెరిగిన వారికిగానీ, విషయంపై తగినంత అవగాహన ఉన్నవారికి గానీ అవి ఉడత ఊపులులాటివేనని తెలిసిపోతుంది. 'ఉడతూపులకు వృక్షాలూగుతాయా?' అన్నట్లు అట్టివి సమర్థత కలవాళ్ళ మధ్య ఎందుకూ కొరగావు.

ఇప్పటికి ముగింపుగా నాలుగు మాటలు


1. బహిరంగ సవాలంటే ఏమిటో, అలా దేశంలోని ఎవరికైనా సవాలనడమంటే ఏమిటో ఆయన ఇంగితానికి తెలియనే తెలియదు.

2. తన సవాలుకు ప్రతి సవాలు చేసినవాడు మరో పుస్తకం వ్రాసి ఆయన పరిశీలనకివ్వాలనడం తెలివితక్కువతనం లేదా అతి తెలివి అనాల్సిందే. ఈ మాటతో ఆయనకు తర్కనియమాలు, సూత్రాలు తెలియవని నాకర్థమైపోయింది.

3. ఏంచేస్తారో చూద్దామని హైందవక్రైస్తవంలోని 3 అంశాలు గతంలోని నా రచనలో ప్రస్తావించి ఆయనకు పంపాను. ఎ) సత్యమహం గంభీరః అన్న మాటలకు ఆయన చెప్పింది, వేదం అంగీకరించే అర్థం కాదని విపులంగానే రాశాను. దానిని నిరూపిస్తాను. ఆయన రాసిందే సరైందని ఆయన నిరూపించాలి. బి) భువనశ్య నాభిః! అన్న మాటలున్న మంత్రార్థం ఓఫీర్‌ గారన్నది కాదని ఆయన శిష్యుడు జగదీష్‌ కూడా ఉన్న ఒక విచారణ వేదికలో ఆధారాలతో సహా వివరించి ఈ విషయం మీరున్నారనే ప్రస్తావించాను. మీ ఓఫీర్‌ గారికి ఇదంతా చెప్పండని అన్నాను. ఆ మాట ఓఫీర్‌ గారికీ తెలిపాను. సి) ఓంకారమే క్రీస్తయ్యెను- అన్నది వేదాలలో ఎక్కడుందో చూపాలి. వేదాలలో లేనిది వివేకానందుడు చెబితే ఏమిచేద్ధామో ఓఫీర్‌గారు చెప్పాలి. వివేకానందుడే రైటు అంటే ఆ దృష్టితో మాట్లాడదాం.

4. రామాయణ, భారత, భాగవతాలు 12 సంవత్సరాల నాటికే జీర్ణం చేసుకున్నారని, హైందవ క్రైస్తవంలోని అంశాలు భూలోకంలోని ఏ గ్రంథంలోనూ లేవని, అవి నేరుగా సత్యలోకం నుండి దిగుమతి అయినవని ఆయన అన్నది రుజువు చేయమని, రామాయణంపై నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే చెప్పమని రాశాను.

గమనిక : ఓఫీర్‌గారే, ఈ మధ్యకాలంలో డిబేట్ల పేరున జరిగే సమావేశాలు సరైనవి కావనీ, ఎంపిక చేసుకున్న ఒక్కో అంశంపై ఒక నిర్ణయం వచ్చేదాకా వాదప్రతివాదాలు జరగాలని, అలా ఒకదానితరువాత ఒక అంశం పరీక్షించాలనీ ఆయన ముస్లింల చర్చ విషయంలో చెప్పారు. అది సరైన విధానమే. ఇక్కడా మరొక వాద నియమాలపరమైన సూత్రము ఉంది.

సూత్రం : ఎంపిక చేసుకున్న అంశంపై విచారణ పూర్తయ్యేలోపు మరో అంశాన్ని చర్చకు స్వీకరించరాదన్నదే ఆ సూత్రం.

ఓఫీర్‌గారూ దానినే చెబుతున్నారు గనుక ఒక్కొక్క అంశాన్ని పరిశీలనకు తీసుకుందాం. అవి ఒక కొలిక్కి వచ్చాక మరో అంశం.

అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ గారికి, అయ్యా! దేశానికి ఓఫీర్‌ ఛాలెంజ్‌ అన్న మీరు దేశంలో ఎవరు ప్రతి సవాలు చేసినా ఎక్కడ ఎప్పుడు తారసపడదాం అని మాత్రమే అడగాలి. ఆ చర్చ తేల్చాలి, ఎవరు బలవంతుడో, ఎవరు బలహీనుడో. ఇక్కడ మరే విధానానికి అవకాశం లేదు.

అయినా సరే ! మీ తృప్తికొరకు కొద్ది వివరణ ఇస్తాను. నేను తత్వ చర్చావేదిక పేరున గత 20 యేండ్లలో దేశంలోని ప్రధాన తాత్విక థోరణులకు చెందిన అధ్యయనపరుల్ని సమావేశపరచి, చర్చావేదిక నియమనిబంధనలనూ రూపొందించి చర్చలు నిర్వహించాను. ఆ వివరాలన్నీ దస్త్రాల రూపంలో, కొన్ని వీడియో రికార్డు రూపంలోనూ ఉన్నాయి.

హైందవ క్రైస్తవంపై నా ప్రకటన :


1. దానిలో చాలా చెత్త ఉంది. 2. అందులోని నీ వాద పద్ధతిలో చాలా డొల్లతనం ఉంది. 3. మీ వివరణలలో ఎక్కువలో ఎక్కువ స్వకపోల కల్పితాలే. పులుముడే ఉంది.

No comments:

Post a Comment