Tuesday, August 9, 2016

ఫజులుర్‌ రహ్మన్‌గారు అనుసరిస్తున్న తీరు - ఒకపరిశీలన


యోచనాశీలురైన పాఠకమిత్రులారా! ఫజులుర్రహ్మన్‌గారి విషయం ఒక ముగింపుకు రాకుండా, సాగతీత ధోరణిలో కొనసాగుతూ వస్తోంది. ఈ అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్న వారికి నేనన్నది సత్యమేనని తెలుస్తూనే ఉంటుంది. ఎందుకిలా సాగతీత ధోరణిసాగుతోంది? ఇలా జరగడానికి కారణం ఎవరు? లేదా కారణాలేమిటి? దీనికో ముగింపు పలకాలంటే మనం ఏమి చేయాలి? అన్నదే ఈ వ్యాసంలోని ప్రధానాంశం మిగిలిన పాఠకులతోపాటు, రహ్మన్‌గారినీ, ఇస్లాం పక్షంలోని వారి మిత్ర బృందాన్ని దీనిని పరిశీలిస్తున్న బైబిలు పక్షం వారినీ కూడా 'వాస్తవాలేమిటన్న ప్రధాన దృష్టితో దీనిని పట్టిచూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.

1. ఖురాను విషయంలో నేను రాస్తున్నదానిలో రహ్మన్‌గారిని ఉలిక్కిపడేట్లు చేసిందీ, నా మాటలు సరికావనిపించి స్పందించేలా చేసిందీ, రహ్మన్‌ గారి మాటల్లోనే చెప్పుకుంటే, అన్యమత విశ్వాసులపట్ల - అవిశ్వాసులపట్ల - అతి అసహనాన్ని, ఉగ్రతను రేకెత్తించే భావాలు ఖురానులోనే ఉన్నాయని నేను వివేకపథంలో రాసిన రాతలే.

2. అలాగే మారణహోమానికి దారులు తీస్తున్న మతమార్పిడులు అన్న నా వ్యాసాలపైనా, రహ్మన్‌గారికి అభ్యంతరం ఉంది. మత మార్పిడులు మారణ హోమానికి దారి తీస్తాయనడానికి ఆధారాలేవి? అన్నదీ ఆయన లేవనెత్తిన మరో అభ్యంతరం.

ఓ    ఖురానులో అలాటి వాక్యాలు నాకు కనపడలేదు. అలాంటివి వుంటే చూపించండి! అన్న ప్రశ్న వేశారాయన. దాంతో ఖురానును పరిశీలిద్దాం అనంటూనే, పనిలోపని బైబిలునూ పరిశీలించేస్తే సరిపోతుంది కదా! అని చెప్పి, అందరూ సరేననగా అవిశ్వాసుల పట్ల ఖురాను, బైబిళ్ళ వైఖరేమిటన్నది అధ్యయనం చేద్దాం అనుకుని మొదలెట్టాం ఈ విచారణను. ఇంత వరకు జరిగింది ఇదేనో కాదో గుర్తు చేసుకోండి.

3. విచారణ వేదికలో, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, హేతువాదులు, నాస్తికులు, సత్యాన్వేషులు అన్న ధోరణులకు చెందినవారు పాలుపంచుకున్నారు. ఈ విచారణకు నేపధ్యంగా ఉండగల కొన్ని అంశాలను వాస్తవ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని పరిశీలించడానికి గాను ప్రస్తావిస్తాను.

1. మారణ హోమానికి దారులు తీస్తున్న మత మార్పిడులన్న భావాలను 10 ఏండ్లకు ముందునుండే నేను వ్యక్తం చేస్తూవస్తున్నా. ఈ మధ్య కాలంలో దేశంలో పెచ్చిరిల్లిన, ప్రపంచ వ్యాపితంగా పేట్రేగిపోతున్న ఇస్లాం ఉగ్రవాదానికి చెందిన వార్తలు వివిధ మాధ్యమాల ద్వారా అందుతుండడంతో  ఈ విషయమై మండలి ద్వారా కొంత విచారణ సాగించుదాం అన్న దృష్టితో వివేకపథంలో దీనిపై రాయడం మళ్ళా మొదలెట్టాను.

ఒక్కమాట

నేను చేస్తున్న ఉగ్రవాద విశ్లేషణ ఏదో ఒక మతం వైపు కొమ్ముకాసినవారుగాని, ఏదో ఒకమతంపై వ్యతిరేకత పెట్టుకున్న వారు గాని చేసే విచారణ లాంటిది కాదు. నాది సత్యాన్వేషణ దృష్టితో వాస్తవాలను వెలికి తీసేందుకు గాను చేసే విచారణల కోవకు చెందింది మాత్రమే. కనుక నేను పిడివాదం చేయను. నా దృష్టికివచ్చిన సమాచారం కంటే మెరుగైన సమాచారం కనపడి, అది నా అభిప్రాయాలను లోపభూయిష్టాలని తేల్చితే, ఆ మేరకు పునరాలోచించుకోడానికీ, సవరించుకోడానికీ, ఆ సవరణ ప్రకటన చేయడానికీ కూడా నేను ఎట్టి భేషజాలకు పోకుండా సిద్దంగా ఉంటాను. ఇక చదవండి.

వివేకపధం జూన్‌ 2008 - సంచిక 143 నుండి 152 వరకు 2013 మార్చి - సంచిక 197లోనూ ఈ విషయంపై నాభావాలు విఫులంగా ప్రస్తావించాను. ఆ సందర్భంలోనే హిందూ ఉగ్రవాదానికీ అంకురార్పణ జరిగిందనీ, కనుకనే సంఘ హితైషులు ఈ సమయంలో ఈ విషయాన్ని గతంలో కంటెనూ ప్రమాదకరమైన, ఆందోళన కలిగించే విషయంగా పరిగణించాల్సి ఉందనీ రాశాను. కావాలంటే సంచిక 149లో (1) ఉగ్రవాదం (2) భారత హిందూ - ముస్లింలకు స.మం విజ్ఞప్తి, అన్న రెండు శీర్షికలలో ఆ వివరాలున్నాయి చూడండి . అలాగే సంచిక 197లోనూ ఉగ్రవాదము - ఒక పరిశీలన అన్న వ్యాసం ఉంది. దానినీ పరిశీలించండి.

1) ఒక వ్యక్తిలో మితిమీరిన ఆవేశం (దీనినే ఉగ్రత అంటారు) రావడానికి కారణం అతని స్వభావమే అలాటిదైయుండడం (2) అతణ్ణి ప్రేరేపించిన భావజాలంలోనే ఆ ఉగ్రత ఉండడం అన్నరెంటిలో ఏదో ఒకటి అయ్యుండవచ్చు. రెండూ కలసీ అలాటి పోకడకు దారితీయవచ్చు.

2. ప్రతి మతానుయాయుల్లోనూ ఉగ్ర స్వభావం కలిగినవారూ, శాంతియుతులూ ఉండవచ్చు. కానీ మత భావాలలోనే ఉగ్రతను రేకెత్తించే భావజాలం ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైనది.

3. ఖురాను, బైబిలు, హిందూ గ్రంధాలను ఒకదానితో ఒకటి పోల్చిచూస్తే హైందవంలోకంటే ఖురాను, బైబిలు పాతనింబంధనల్లో పరమత అసహనం తారస్థాయిలో ఉండడమేగాక, హింసాత్మక పోకడకు కావలసిన ప్రేరణ కూడా వాటిలో చాలా ఉంది. ఇది వాస్తవమా? కాదా? అన్నదే మనం తేల్చుకోవలసిన అస్సలంశం.

ఇలా రాసిన నా వ్యాసాల్లో ఫజులుర్రహ్మన్‌గారికి, మరికొందరు ముస్లింలకూ రెండు విషయాలపై అభ్యంతరం ఉంది.

1. మత మార్పిడులు మారణహోమానికి ఎలా దారులు తీస్తున్నాయి?

2. ఖురానులో ఉగ్రవాదానికి ప్రేరణ కలిగించే మాటలెక్కడున్నాయి? అన్నవే ఆ రెండూ

2013 మార్చికి ముందు జరిగిన సమావేశంలో విజయవాడ నుండి వచ్చిన సంషీర్‌ గారూ ఈ మాటలడిగారు.

దానిపై అవిశ్వాసులను, అన్యవిశ్వాసులను వధించమన్న ఖురాను వాక్యాలు అనేకం ఎత్తిరాశాను వివేకపధంలోనే.

ఒకణ్ణి చంపితే మొత్తం మానవజాతినంతా వధించినట్లే (మాయిదా 5-32) వాక్యాన్ని,

''ఇస్లాం స్వీకరణ విషయంలో బలవంతమేమీలేదు'' అన్న వాక్యాన్ని చూపించి ఖురాను మనిషిని చంపవద్దనీ, మత స్వేచ్చ కలిగి ఉండవచ్చనీ అంగీకరిస్తుంది అంటూ అర్ధాలు సాగదీసే ఇస్లాం ప్రచారకులు, ముస్లిం మత పెద్దలూ కొందరున్నారు. ఖురాను ప్రకారం వారికేమి కానుందో తెలిసినవాణ్ణిగా, ఆ రకం వారందరి పట్ల సానుభూతి ఉంది నాకు. ఇస్లాం విషయంలో అల్లా తలంచని అర్ధాలు ఖురాను వాక్యాలకు కల్పించేవారికి ఘోరనరక శిక్ష ఉంది. నావికాని మాటలు నావిగా మహమ్మదు చెప్పినా అతని కంఠనాళం కోసేవాణ్ణన్న మాట ఖురానులోనే ఉంది. అయినా ఇలా విపరీతార్ధాలు పులిమేవారిని విశ్వాసులనాలా? కపటులనాలా?

ఒక ముస్లిం - మరో ముస్లింని వధిస్తే, అదిన్నీ ధర్మశాస్త్రాన్ని అమలుపరిచే సందర్భంలో కాకుండా వేరే కారణంగా, వధిస్తే అది మొత్తం మానవ జాతినంతటినీ చంపినంతటి పాపకృత్యమవుతుందన్నదే ఖురాను వాక్యం. ఇది మనిషిని మనిషి చంపే సందర్భానికి చెందిన మాట కానేకాదు. ముస్లిం కాఫిర్‌ను చంపే సందర్భానికి చెందింది అసలేకాదు. యూదుణ్ణి చంపినప్పటి మాటాకాదు.

ఒక మన ప్రస్తుతాంశానికి వస్తాను.

ఇలా వాద, ప్రతివాదాలు సాగుతూ వస్తున్న క్రమంలో ఒకనాడు ''తననంగీకరించనంత మాత్రాన చంపేయడమేనా''? అని ఒకింత ఆవేశంగానేనన్నమాట లపై స్పందిస్తూ ఫజులుర్‌రహ్మాన్‌గారు.

''తనకు ఒప్పుకోని వాణ్ణి చంపేయమన్న వాక్యం ఉంటే నేనుఇస్లాంను విడిచి బైటికి వస్తాను'' అన్నారు. అప్పుడునేను పదాలు ఇలాగే ఉండాలని లేదు  ఈ అర్ధమొచ్చే మాటలుంటే చాలు కదా అనగా అలాగే! ఆ అర్ధమొచ్చే వాక్యముంటే చాలు అని అన్నారు. ముస్తాక్‌గారు కూడా, నిర్ధిష్టంగా ఆలాటి మాటలుంటే నేనూ ఇస్లాంను విడవడానికి సిద్ధం అన్నారు. నన్ను నమ్మకపోతే తీసేయండి అన్న వాక్యముంటే దానిని విడిచి బైటికి వస్తాను - అని రహ్మన్‌గారు అన్నారు.

దానిపై నేను, అయితే ఖురానును పరిశీలిద్దాం అనగా, ఒక తేదీ ఖరారు చేయండి ఈ విషయం పై ఖురాను అధ్యయనానికి మిగిలిన వాటికంటే ప్రాధాన్యత నిచ్చి పరిశీలించుదాం అన్నారు రహ్మన్‌ గారు. చాలా పెద్ద శ్రమే చేయాల్సివచ్చింది నేను. ఖురాను అంతటినుండి వివిధ సందర్భాలలో వివిధ కారణాలాధారంగా విశ్వాసులు అవిశ్వాసులపట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన ప్రవర్తించమన్న ఆయతులు 215 వరకు వెలికితీశాము నేను, ఖుద్దూస్‌ కలసి. అలాగే హదీసులనుండీ 15, 20 సూక్తుల్నీ ఇలాటివాటినే చూపించాను.

ఇక్కడ ఒక్కమాట చెప్పుకోవాలి. అంతకుముందు నుండే క్రమంగా కొన్ని నెలలపాటు సాగుతూ వచ్చిన అవిశ్వాసులపట్ల ఖురాను వైఖరేమిటన్న అంశంలో సదస్సులో పాల్గొన్న ముస్లింమేతరులైన వివిధ ధోరణుల వారూ, ముస్లింలలో కొందరూ కూడా నేను చూపిన వాక్యాలు అవిశ్వాసులను వధించడాన్ని, వధించమని అల్లా ఆ దేశించడాన్ని తెలిపేటివేనని అంగీకరించినా, రహ్మన్‌గారు మాత్రం మీరు చూపిన వేవీ మనమనుకున్న సందర్భానిని,  అర్ధాన్ని తెలిపేటివికావు. ఇన్నెందుకు, ఒకే ఒక్క సూటైన వాక్యం చూపించండి. ఇప్పటికే అనవసరపు కాలహరణ చాలా జరిగింది అంటూ ఒకింత అసహనాన్నీ జోడించి మాట్లాడారు.

అప్పుడునేను, సదస్సు ఆశించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందులోనూ అందరినీ సరిగా ఆలోచింపజేయాలన్నది మండలి మూల భావనల్లో ఒకటి. కనుకనే దీనిని బృంద చర్చారూపంగా సాగిస్తున్నాము. ఇప్పుడు విషయం మరింత సూటిగా మాట్లాడుకోవలసి వచ్చింది గనుక మనమిరువురమే దీనిపై మాట్లాడుదాం అనడం, ఆయనా సరేననడం జరిగింది.

ముఖ్య గమనిక :- నన్ను ఒప్పుకోనివాణ్ణి చంపేయమన్నమాటగానీ, ఆ అర్ధమొచ్చేమాటగాని ఖురానులో ఉంటే దానిని విడిచిపెట్టేస్తాను. అన్నదే ఎంచుకున్న అంశం రహ్మన్‌గారి నోటివెంటవచ్చిన వాక్యం.

రహ్మన్‌ దీనినే మళ్ళా రిపీట్‌ చేశారిలా :- నన్నునమ్మకపోతే తీసేయండి. అన్న వాక్యముంటే ఇస్లాంను విడిచి పెట్టేస్తాను, ఇది నా బహిరంగ ప్రకటన (పబ్లిక్‌ ప్రకటన చేస్తున్నానది ఓపెన్‌ స్టేట్‌మెంట్‌)

ఆయన్ను ఒప్పుకోకపోతే చంపేయ్‌ అనుంటే దానిని వదిలేయడానికి సిద్దం అన్నది మొదటిమాట ఆ అర్ధమొచ్చే మాటలున్న చాలుకదా అనినేననగా, అలాగే, ఆ అర్ధమొచ్చే మాటలున్నాచాలు అనన్నారు ఫజులుర్రహ్మన్‌గారు

నేను ముచ్చటగా మూడు ఆయతుల్ని ఎత్తిచూపాను. మూటిలో ఏ ఒకటైనా అల్లాను అంగీకరించనందుకే చంపడం జరిగిందనడానికి సరిపోతుంది.

1. ఖిజర్‌ బాలుణ్ణి చంపడం

గమనిక :- మోషేకే అది ఘోరమైన పని అనిపిస్తుంది. అకారణంగా ఎందుకు చంపావా పిల్లవాణ్ణని అడుగుతాడుకూడా. ఖిజర్‌ సమాధానం:- భవిష్యత్తులో అవిశ్వాసియై విశ్వాసులైన తల్లిదండ్రుల్ని కష్టపెడతాడేమోనన్న అనుమానంతోచంపాను అన్నదే.

2. మూసా స్వజనులే కొందరు అల్లాను కాదని, ఆవుదూడను పూజించినందుకు వారిని వారి వారితోనే చంపించడం-

గమనిక :- నా అవగాహన ప్రకారం, అవిశ్వాసుల్ని వారి అవిశ్వాస కారణంగానే, అదీ తనను అంగీకరించని కారణంగానే అమానుషంగా వధింపజేశాడు. అలా అనడానికి, ఈ ఒక్క వాక్యం తిరుగులేని రుజువై ఉంది. దీనికి ఏరకంగానూ మరో సాగతీత అర్ధాలు చెప్పే అవకాశమూలేదు. పైగా ఇక్కడ చంపబడిన వారూ చంపినవారూ కూడా ఒక గుంపు - జాతి- ప్రజలే వారు పరస్పరం రక్త సంబంధీకులు, కుటుంబ సంబంధీకులు కూడాను కేవలం అల్లాను విడిచిపెట్టి, అన్యదేవారాధన చేయడమే ఇక్కడ వారిని వధింపజేసిన కారణం- ఆనాడు వధింపబడినవారు ఖురాను (హదీసుల) ప్రకారం 60 వేల మంది.

తనను అంగీకరింపకపోవడం, మరొకరిని అంగీకరించడం అన్న రెండూ అవిశ్వాసానికి గుర్తులే.

3. ఇక నా మూడో ఉట్టంకింపు హదీసు బుఖారీలోనిది. ఒక యూదుడు ఇస్లాం స్వీకరించి మరల యూదు మతంలోకి తిరిగి వెళ్ళినందుకుగాను  వధించడం జరిగిందన్నది ఆ హదీసుమాట. ఈ మూడు సందర్భాలలో బాలునిది తప్ప మిగిలిన రెండూ అల్లాను నమ్మనందుకుగాను చంపిన ఘటనలే. ఇక బాలుని విషయం బవిషత్తులో అవిశ్వాసి అవుతాడేమోనన్న అనుమానంతో చంపడానికి సంబంధించింది. ఒకటి అవిశ్వాస కారణంగా చంపడం, రెండోది అవిశ్వాసి కావచ్చునన్న కారణంగా చంపడం.

గమనిక :- నిజానికి ఖురానులో అవిశ్వాసులను వధించవచ్చన్న అర్ధాన్నిచ్చేవి ఇంకా చాలా వాక్యాలున్నాయి. అయితే సందేశం వినిపించడం, ఇస్లామేతరులకు మారే అవకాశం ఇవ్వడం అన్న రెండూ అనివార్యంగా మహమ్మదు అనుసరించకతప్పని పరిస్థితి ఉందానాడు. ఎందుకంటే ఉన్న జనానికీ, తానున్న జనానికీనే కదా సందేశం వినిపించాల్సింది? తన పక్షానికి తిప్పుకొనే యత్నం చేయాల్సిందీ ఉన్నజనం లోనుండేకదా! కనుక సందేశం వినిపించడానికీ, ఇస్లాంవైపు మరల్చడానికీ కొంత కాలం ఓపిక పట్టాల్సిందేకదా! ఆ సమయంలో చంపకుండా ఉండడాన్ని ఖురాను - అల్లా అవిశ్వాసులను వుండనిస్తుంది. చంపమనదు అన్న దానికి రుజువుగా చూపనే చూపకూడదు. అది విపరీతార్ధం పులమడమే.

అదలా ఉంచి, ఇస్లామేతరుల్ని చంపలేని పరిస్థితీ, వారే మహమ్మదును అతని అనుచరులను అదుపు చేసే పరిస్థితి వీరే అణగి ఉండాల్సిన పరిస్థితీ ఉన్న సందర్భంలో వచ్చిన ఆయుతులకు అవిశ్వాసులను ఉండనీమంటుంది. చంపకూడదంటూంది అన్నఅర్ధం పులమనే కూడదు. అది వీళ్ళవల్ల కాని పరిస్థితుల్లో చెప్పినమాట. అందుకనే అవిశ్వాసుల్ని ప్రతిసారీ మహమ్మదు, అతని అనుచరులూ వధించారాలేదా? అన్నది మన పరిశీలనాంశం కాదు. ఖురాను అవిశ్వాసుల్ని - అల్లా నంగీకరించని కారణంగా - వధించడం ధర్మ సమ్మతమంటుందా? అనదా? అన్నదే పరిశీలనాంశం అయివుంది అనంటున్నానునేను.

ఇక్కడ మరో ముఖ్యమైన విచారణ నియమాన్ని గురించి ప్రస్తావించుకోవలసి ఉంది. మన పరిశీలన లేదా విచారణ - పరీక్ష - వాది బలానికి చెందిందా? వాదబలానికి చెందిందా ఇది విచారణంతటికీ దిశానిర్దేశం చేయగలంత కీలకాంశమై ఉంది. అందులో మన ప్రస్తుతాంశం ఖురాను ఎవరికెంత తెలుసు అన్నది కానేకాదు. ఖురాను ఏమి చెపుతోంది అన్నది మాత్రమే కనుక విచారణలో పాల్గొన్న వారి వ్యక్తిత్వాలెలాటివి? వారి భాషేమిటి? వారి భావజాలమేమిటి? వగైరా, వగైరాలు వేటితోనూ మన వేదికకు పనేలేదు. ఖురాను వాక్యాలను ఎత్తిచూపేవాడు నాస్తికుడా? ఆస్తికుడా? క్రైస్తవుడా? హిందువా? ముస్లిమా? అన్న వేటితోనూ మనకుపనిలేదు. మనం పరిశీలించాలనుకున్న అర్ధాన్నిచ్చే వాక్యం ఖురానులో ఉందా? లేదా? అన్నదొక్కటే మనం పట్టించుకోవాలి. ఆ విచారణంతటికీ ఇది, ఇదే ఇదొక్కటే లెక్కలోకి తీసుకోవాలి. ఇతరేతర ప్రస్తావనలన్నీ ప్రకరణ భంగం అనడానికి తగినవే. కావాలని చేస్తే అడ్డగోలు పనులే.

ఇంత వరకు నేను మీ ముందుంచిన వాటిలోని ప్రత్యంశాన్ని గమనికలో ఉంచుకుంటేనే, ఈ సందర్భంలో ఫజులుర్రహ్మన్‌గారు అనుసరిస్తున్న రీతిలోని అపసవ్యత అర్ధంకాదు. ఇది కచ్చితంగా ఆయన తెలిసి చేస్తున్న పనే.

1. ఆయన గారి ప్రధాన ఎత్తుగడంతా నేను ముగించిన అంశాన్ని గురించి సభలో ఉన్న వారంతా రహ్మన్‌గారితో, విషయం తేలిపోయింది, ఇస్లాంను విడచి బైటికి రండన్న ధోరణిలో మాట్లాడిన వారే. కనుక వారిని వారి వత్తిడిని వదిలించుకోవాలి ముందు. ఏదో రకంగా వారిని నొప్పించి వారంతట వారుగా వీరిని వత్తిడి చేయడం ఆపేసుకునేట్లు చేయాలి అన్నదే. కనుకనే తనను అడిగిన వారందరిలో ఏదో ఒక దోషముందన్నట్లూ, వారికి ఖురాను వాక్యాల అర్ధాన్ని గ్రహించే సామర్ధ్యం లేనట్లూ, తులనాత్మకత లేని కారణంగా అనర్హులన్నట్లూ మాట్లాడేశారు. మనం ఎత్తుకున్న పరిశీలనాంశానికి సంబంధించినంత వరకు ఇవన్నీ అనవసరపు పోకడలే.

1. కె.బి రాజేంద్రప్రసాదుగారు, సూటిగా మనమనుకున్న అంశం తేలిపోయింది. ఖురానులో అవిశ్వాసుల్ని అవిశ్వాసకారణంగానే వధించమన్న అర్ధాన్నిచ్చే వాక్యాలున్నాయి అని సురేంద్ర రుజువు చేశారు అననగానే పూర్వ నిశ్చితాభిప్రాయాలున్న మీలాటి వాళ్ళకు అర్ధనిర్ణయంచేసే అర్హత ఉండదన్నట్లు మాట్లాడారు. ఫజులుర్రహ్మన్‌గారి ఈ మాటలకు కె.బి.ఆర్‌ చాలా ఘాటుగానే సమాధానం చెప్పారు. మాకు తెలిసిన తెలుగుభాషననుసరించి సురేంద్ర చెప్పింది సరైన అర్ధమే. దానిని కాదనాలంటే మీ సొంత అర్ధాలతో తెలుగుభాషకు మరో నిఘంటువును తయారు చేయండి అని బదులుఇచ్చారాయన.

గమనిక :- విచారణ ఆరంభం నుండీ రహ్మన్‌గారు ఎంతో లౌక్యంగా - వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇతరులచేత మాట్లాడించడం, వీలైనంతవరకు తాను మాట్లాడకుండా ఉండడం, మాట్లాడిన వాళ్ళను, మీరన్నది సరైందేనని రుజువు చేయండనడం అన్న విధానాన్నీ చేపట్టారాయన.

''ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని నిరూపించాల్సిన బాధ్యత స్వీకరించాలన్న'' వాద నియమం అది. అది రహ్మన్‌గారు మండలి ద్వారా తెలుసుకున్నదే. అయినా దాని ఆచరణ రూపం రహ్మన్‌గారనుసరించుతున్నట్లు ఎదుటివారిని బాధ్యులను చేయడం, వీలైనంతవరకు తాను బాధ్యత స్వీకరించకపోవడం అన్నది కాదు. ఆ నియమం మండలి ప్రకారం నిజాయితీగా ప్రశ్నించడానికీ, ప్రశ్నింపబడడానికీ (అడగడానికీ, చెప్పడానికీ) సమానంగా సిద్దపడి ఉండడం అన్నదిగా ఉంటుంది. అందునా విషయ ప్రధానంగా సాగే విచారణల్లో వ్యక్తులలోపాలు, దోషాలు వైపు దృష్టి పెట్టి దానిని ప్రధానం చేసుకుని, విషయ విచారణను ప్రక్కన పెట్టడం గానీ, అ ప్రధానం చేయడంగానీ చేయనేకూడదు.

ఎదుటి పక్షాన్ని ప్రతిపాదించమని అడగడం (వారి ప్రతిపాదనను స్వీకరించడం) ఆ విషయమై తాను అంగీకరిస్తున్నదేమిటో ఎటువంటి వత్తిడులూ లేకుండా ప్రతిపాదించడానికి సిద్దంగా ఉండడం (ప్రతిపాదించడం) ఎదుటి వానిని నిరూపించమని అడిగినంత బలంగానూ, వారడగగల్గినా, అడగకున్నా తానన్న దానిని నిరూపించే బాధ్యత స్వీకరించడం అన్నది ఈ నియమపు అంతరంగంగా ఉండాలి. మండలి వైఖరి అదే.

ఖురాను పరిశీలన ఆరంబిద్దామనుకున్న తరువాత ఈనాటి వరకు ఫజులుర్రహ్మన్‌గారు, నేను (సురేంద్ర) వెళ్ళడించిన అభిప్రాయాలలో ఎవరి పక్షంలో ఏయే అపసవ్యతలు చోటు చేసుకున్నాయో పరీక్షించి చూసుకోడానికై ఒక సమావేశం అవసరమనిపిస్తోంది. ఫజులుర్‌ రహ్మన్‌ గారే కొన్ని దోష రూపాలను ప్రస్తావించారు. ఆ విషయాలు కొన్ని ఇవిగో.

ఎ) అధ్యయన పరులకు, సత్యాన్వేషులకు ఉండకూడని, ఉండాల్సిన లక్షణాలు

1. పూర్వనిశ్చితాభిప్రాయాలుండకూడదు. 2. తెలిసీ తెలియని విషయాలు మాట్లాడ కూడదు.

3. ఉన్న అర్ధాన్ని విడచి అన్యార్ద కల్పన చేయకూడదు. (అపవ్యాఖ్యానం, విపరీత వ్యాఖ్యానం రుద్దడం, పులమడం, సాగదీయడం, మరి కొంత జత చేయడం లాటి మాటలు లేని అర్ధాన్ని చెప్పడం అనే అర్ధంలో వాడేటివే)

4. ఎంపిక చేసుకున్న విషయాన్ని విడిచి, ఇతర విషయాల్ని లేవనెత్తకూడదు. దీనినే ప్రకరణ భంగం చేయకూడదు అనంటున్నాం.

ఒక క్రమంలో విచారణసాగాలి. ఒక్క అంశంపై ముగింపుకు వచ్చాకనే మరో అంశాన్ని విచారణకు స్వీకరిస్తూ పోవాలి అన్నదీ పై నియమంలోనిదే

5. వాద బల పరీక్ష - వాది బలపరీక్ష సందర్భాన్ని బట్టి వేరువేరుగా వుండాలి. విచారణీయాంశం వాద బలానికి చెందిందైనప్పుడు వాదికి సంబంధించిన వాటిని లేవనెత్తరాదు.

6. ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని రుజువు చేసే బాధ్యత వహించాలి.

7. సమష్టి విచారణ వేదికలో, ఎంపిక చేసుకున్న అంశంపై దానికి అనుకూల ప్రతికూల పక్షాలుగ నున్న వారివరకైనా వారి వారి ప్రతిపాదనలను ప్రకటించడానికి, ఆపై తమ ప్రతిపాదన సరైందేనని నిరూపించడానికీ సిద్ధపడి ఉండాలి.

8. విషయ ప్రధానంగా జరిగే విచారణల్లో వ్యక్తిత్వాలను కించపరిచే, నొప్పించే ప్రకటనలు చేయకూడదు. రెండంశాలూ ముడిపడి ఉంటే తప్ప

అతి ముఖ్య గమనిక


మన ప్రస్తుత అధ్యయన గ్రంధం ఖురాను. నిజానికి ఒక మతానికి సంబంధించిన ప్రామాణిక - సిద్దాంత - గ్రంధాన్ని సత్య- ధర్మాల ప్రాతిపదికన కూలంకష విచారణకు తీసుకుంటే అందులో జ్ఞానపరంగా సత్యాసత్యాలేమిటి? అనీ, ఆచరణ - కర్మ - పరంగా ధర్మాధర్మాలేమిటి అన్నవే తేల్చుకోవలసినవవుతాయి.

ఇంతకూ ఏ ప్రయోజనాన్ని కోరి ఇంత శ్రమకు సిద్దపడుతున్నామో స్పష్టతఉండాలి. వ్యక్తి సమాజము ప్రకృతి అన్నవాటి గురించి, వాటి మధ్య ఉన్న (ఉండవలసిన, ఉండకూడని) సంబంధాల గురించీ వాటివల్ల ఏర్పడే వాంఛనీయ, అవాంచనీయ పలాల గురించీ ఆ గ్రంథం ఏమి చెపుతుందో గమనించి, అదిప్పుడు మనం స్వీకరించదగిందిగా ఉందో (స్వీకరించకూడనిదిగా) విడువతగినదిగా ఉందో తేల్చుకోడమే ఈ అధ్యయనపు - విచారణకు - ప్రయోజనం, ఈ దృష్టి చాలా మౌలికమూ, కీలకమూ అయి వుందనడానికి ఆ మత గ్రంధాల పోకడా గట్టిరుజువే. అవన్నీ తనను స్వీకరించమని, అన్యాన్ని విడిచిపెట్టమనీ చెపుతూనే ఉంటాయి. అవునా? కాదా? విచారణ అస్సలు దృష్టి అదే అయినా, పాల్గొనే వాళ్ళననుసరించిగానీ, నెట్టుకొచ్చిన పరిస్థితుల వత్తిడి వలన గానీ ఏదో ఒక ప్రాధాన్యతా క్రమంలో విచారణను ఆరంభించుకుంటాం.

ఆ విధానాన్ననుసరించే ఇస్లాం ఉగ్రవాదానికి ప్రేరణ నివ్వగల భావాలు ఖురానులోనే ఉన్నాయి అన్న అర్ధాన్నిచ్చే నా మాటలు అభ్యంతరకరమైనవి అంటూ ఇస్లాం పక్షంలో నుండి రహ్మన్‌గారు మరికొందరూ మాట్లాడడంతో, అవిశ్వాసుల పట్ల ఖురాన్‌ వైఖరేమిటో పరిశీలిద్దాం అన్నది ప్రధానాంశంగా ముందుకొచ్చింది. అందులోనూ ఒక దశలో, తననంగీకరించకపోతే చంపేయడమేనా? అతనెవరైతే మనకేమిటండీ! అలాటి మాట ఉంటే నువ్వు దానిని వదిలేశేయాలి. లేదా అలాంటి మాటలేదు. నీవు ఆ అర్ధాన్ని దానినెత్తిన పెట్టావని నాకు చెప్పనైనా చెప్పగలగాలి. అని నేను సూటిగా, ఒకింత ఆవేశంగా మాట్లాడినప్పుడు, ఫజులుర్రహ్మన్‌గారూ! అంతే సూటిగా,
F   ఆయన్ని ఒప్పుకోపోతే చంపేయమన్న మాట ఉంటే మాత్రం దాన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నాం అని ప్రకటించారు.
F    దానిపై నేను, నా పాయింటేమిటంటే ఇప్పుడీ మాట్లాడేదంతా ఆ అర్ధాన్నిచ్చే మాటలున్నాయా లేదా అన్నదానికోసమే అనగా, ఆ అర్ధాన్నిచ్చేమాటలున్నా చాలు 100% యాక్సప్టెడ్‌ అన్నారు రహ్మన్‌గారు అప్పుడునేను, అలా అయితే ఈ ఒక్క పాయింటు మీదే కూర్చుందాం. తర్వాత దాని పైన చర్చ పెట్టుకుందాం అని ప్రతిపాదించాను.

అప్పుడు ముస్తాక్‌గారు కూడా, మీరు చెప్పినట్లు అదే స్పిరిట్‌తో గాని ఖురానులో వాక్యాలుంటే మేము దానిని విడిచేయడానికి సిద్దం అని ప్రకటించారు.
F    అప్పుడు రహ్మన్‌గారు ఒక తేదీని నిర్ణయించండి. ఖురాన్‌ అధ్యయన తరగతులకోసం ఒక డేటు కన్ఫర్ము చేసి, ఇదే కంటిన్యూ చేద్దాం అనన్నారు.

నన్ను నమ్మకపోతే తీసేయండన్న స్టేట్‌మెంట్‌ ఉంటే ఈ క్షణంలో దాన్ని వదిలేసి బైటికి వచ్చేస్తాను. ఇది నేను పబ్లిక్‌ ప్రకటన చేస్తున్నాను. అని మరోసారి స్పష్టంగా ప్రకటించారాయన.
F    ఆ సందర్భంలోనే ఖురాన్‌ అధ్యయనం చేద్దాం. ముందీ విషయాన్ని తేల్చుకుందాం అనీ అన్నారు. వివేకపధం పాఠక మిత్రులారా! మీలో ఆనాటి విచారణల్లో పాల్గొన్నవారూ, అందులో పాల్గొనకపోయినా వివేకపథం వాట్సాప్‌ల ద్వారా శ్రద్దగా, నిశితంగా ఈవాద ప్రతివాదాలను గమనిస్తున్నవారూ ఈవ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలించి మా యిరువురి పోకడల్లో ఎవరి పక్షంలో ఎక్కడెక్కడ పైన చెప్పుకున్న అపసవ్యతలు చోటు చేసుకున్నాయో, ఉండవలసినవి లేకుండా పొయ్యాయో గమనించి పత్రికకు తెలుపండి.

1. విచారణీయాంశాన్నే సరిగా గుర్తించినట్లు లేదు. మీరు ఒకసారి తిరిగి చూసుకోండి. మీరు సూచించిన వాక్యాలు మన విచారణీయాంశానికి సంబంధించినవికానే కాదు. అన్నది రహ్మన్‌గారి అభియోగం.

ఎ) వారు ప్రకటించిన దానిని వారే రుజువు చేయాలి కదా! ఆ పని ఇప్పటి వరకు వారెందుకు చేయలేదు?

2. పరిశీలనాంశపు క్షేత్రాన్ని వచ్చినవారందరికీ అవగాహన కొరకుగా తెలియ జెప్పాలనే సదుద్దేశంతో, తప్పని సరి అవసరంగా భావించి అల్లాని ఒప్పుకోనివారుగా ఖురానులో ఎవరెవరు కనపడతారు అన్న వివరణ చేశాను నేను. ఆనాడు దానిపై ఆయనగారు, ఆయన పక్షానికి చెందిన వారూ ఏమీ అనకపోవడమేకాక, అది కరక్టేననీ అంగీకరించారు కూడా. ఇందులో నేను సాగదీసిందేమిటో, పొడిగించిందేమిటో రహ్మన్‌గారే తేల్చాలి. తనని ఒప్పని వాళ్ళ క్రిందికి ఖురాన్‌ ప్రకారం

1. పుట్టుకనుండీ అన్యదైవ విశ్వాసంలో ఉన్నవారు

2. ముస్లింగా పుట్టి అనంతరం ఇస్లాంను - అల్లాను - విడిచినవారు

3. ముందు ముస్లిమే తరునిగ ఉండి - తరవాత ఇస్లాం స్వీకరించి తిరిగి ఇస్లాం నుండి బైటికి వచ్చినవారు

అన్న మూడు రకాలవారు ఎదురవుతారు ఖురానులో వీరంతా అల్లాను కాదంటున్నవారిక్రిందకే వస్తారు. ఇదీ దృష్టిలో పెట్టుకుని ఖురాను చదవండి అనన్నాను నేను. దీనిని సాగతీత పొడిగింపు అంటున్నారు రహ్మన్‌గారు. అదెలానో ఆయనే వివరించి రుజువు చేయాలి.

3. నా వరకు నాకు ఒక అంశం తేలకుండా మరో అంశం చర్చించే ప్రసక్తే లేదు. మండలి కూడా దీనిని 100%  అంగీకరిస్తుందని నాకు తెలుసు అన్నది రహ్మన్‌ గారి మరో ప్రకటన.

సురేంద్ర :- దానిని ఆయన ఎక్కడ పాటించారు? నేను విచారణీయాంశానికి సంబంధించి చక్కగా సరిపోతాయి. అది నాకనిపించిన ఖురాను ఆయతులు రెంటినీ, హదీసు నొకదానిని సభముందుంచి, నా వాదనను ముగించాను. అప్పుడు రహ్మద్‌గారేమి చేయాలి? నావెలా విచారణీయాంశానికి రుజువులు కావో చెప్పి దానిపై తన వాదాన్ని వినిపించాలి. నేను చూపించిన వాక్యాలకు నేను తెలిపిన అర్ధం ఎందుకురాదో వాటి అసత్యం ఏమిటో ఆయన తన వాదం ద్వారా సభముందుంచాలి. అప్పుడు కదా ఖురాను వాక్యాలను నేను చెప్పిన అర్ధం సరైందిగా ఉందో. ఆయన చెప్పిన అర్ధం సరైందిగా ఉందో తెలిసేది, తేల్చగలిగేదీ! ఎంతో బాధ్యతగా నెరవేర్చాల్సిన ఈ పనిని రహ్మన్‌గారెందుకు చేయలేదు. నేను చెప్పిన అర్ధం సరికాదని, ఆవాక్యాల అర్ధం ఇదనీ చెప్పాల్సిందెవరు? ఆయనేకదా? తాను చేయాల్సిన పని చేయకుండా, మీరసలు రుజువు చేయనేలేదు. ఒక్కవాక్యం కూడా చూపలేదు అనంటే సరిపోతుందా? అది ఆ పక్షంవాదన క్రిందికి వస్తుందా?

ఈ సందర్భంలో వాట్సాపులో ఆయన స్పందన ప్రకటన ఎలా ఉందో చూడండి.

1. ఖురాన్‌ పై తాను చేసిన ప్రకటనను సురేంద్రగారు రుజువు చేయలేకపోయారు.

2. విషయాన్ని రుజువు చేయకుండా కాస్త పొడిగించి ఖురాన్‌ పరిశీలన అన్న ఎత్తుగడతో ప్రారంభించి నెలలు గడిచినా అదీ పులమడానికి ఉపయోగించే ప్రకటనలు చేసి చేసి చివరికిపై ప్రకటన దగ్గరకు వచ్చి ఆగారని తెలుస్తోంది.

సురేంద్ర :- ఆయన గారు పైన తాను చెప్పినవాటిని అవి వాస్తవాలేనని రుజువు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. తరవాతే మిగిలిన మాటలన్నీ.

3. వారికి ఖురాను అర్ధం కావడం లేదని నిర్ణయించాల్సింది మేము కాదట! మరెవరో? అలాటప్పుడు చర్చను మాదగ్గర ఎందుకు ప్రారంభించారో? వారిదగ్గరే ప్రారంభించాలి కదా? అని మరో ఎకసికపుమాట! వెనక ముందు చూసుకోకుండగనే అనేశాడాయన.

సురేంద్ర :- నేను వ్యంగ్యాలు మాట్లాడేరకం వాణ్ణి కాదనీ, ఎప్పుడూ విషయవిచారణలో సీరియస్‌గానే ఉంటాననీ ఆయనకూ తెలుసు. నన్నెరిగిన వాళ్ళెవరూ ఈ విషయం వరకు కాదనరనే అనుకుంటాను. అదలా ఉంచి ఖురానులో మనమనుకున్న అర్ధాన్నిచ్చే వాక్యం ఉందోలేదో పరిశీలించడాన్నాపి అన్య ప్రస్దావనెందుకు మొదలెట్టినట్లు? పైగా వ్యక్తిగతంగా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడినట్టు?

రహ్మన్‌గారూ! ఈ విషయంలో నేనన్నదేమిటో, నేనలా అన్నానని మీరన్నదేమిటో పరిశీలనకు పెడదాం. మన ఇరువురిలో ఎవరికి వక్తహృదయం చూడలేని తనముందో. ఎవరిది పులుముడునో తేల్చుకుందాం. సందర్భశుద్ది లోపించిందని ఇతరులను ఎద్దేవా చేసేమీకు అది ఉందో లేదో నూ చూద్దాం.

మరోమాట! పై మీ వాక్యనిర్మాణంలోనూ గంద్రగోళముంది. చూసుకోగలిగితే చూసుకోండి లేదంటే ఈ విషయంపై విచారణ సందర్భంలో ఆ విషయాన్ని సభముందుంచుతాను.

4. మాటవరసకు మేము చెప్పింది నిజమేఅయినా ఆ మాట అనే అధికారం మీకు లేదట!

సురేంద్ర :- మళ్ళా, సందర్భాన్ని, నా ప్రకటనను అర్ధం చేసికోలేకపోయిందిగాక, విరుపు మాటలు కూడా అన్నారు.

5. మాకు అధికారం లేదని ఏ కొలతలనుండి చెపుతున్నారో ఆ కొలతలు నుండి చూసినా కనీసం ఆ విషయాలు మా దగ్గర మాట్లాడకూడదన్న విషయమైనా తెలిసుండాలికదా! అదెందుకు తెలియలేదో?

సురేంద్ర :- దీనిపై నా పరిశీలన చేద్దాం. నా మాటలు మీకేమర్ధమైనాయో? అది నేను అంగీకరించే అర్ధమో కాదో, నా మాటల ప్రకారం మీ ఈ మాటలు ఎలా అనవసరమైనవో పరిశీలనలో పెట్టిచూసుకుందాం.

6. మేము కూడా సత్యాన్వేషణ దృష్టితోనే మిత్ర దృష్టితోనే ఇంతకాలం వస్తున్నాము.

అయితే రుద్దడం విషయంలో మీరు ఇతరులకేమీ తీసిపోరని కచ్చితమైన నిర్ణయానికి, ఈ అంశం మాట్లాడేటప్పుడు, ఇంతవరకూ వచ్చిన సాగతీత ద్వారా గుర్తించగలగాము.

సురేంద్ర :- దీనిపై నేను గతంలోనే సూటిగా స్పందించాను. నన్ను తిట్టగల అతి పెద్ద తిట్టు ఇదనీ, దీనిపై బాధ్యత వహించి నేనలా ఎక్కడెక్కడ చేశానో రుజువుపరచండని, కానీ మీ వైపు నుండి ఉలుకూ పలుకూలేదు. మనం ఏర్పరచుకోవలసి ఉన్న మా సమావేశంలో దీనినీ పరిశీలించి తీరాల్సిందే. ఇంత లేసి తిట్టుతిట్టి పట్టనట్లూరుకుండడం ఏమాత్రమూ నైతికత కానేకాదు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే అది అనైతికం కూడా.

7. అసలు మేమైతే కాలం మీకు సరిచేసుకోడానికి ఉపయోగపడుతుందనుకున్నాము. అదైతే మీకు మరిన్ని ఎత్తులు వేయడానికి వినా సరైన దిశలో చూడనివ్వలేదో, చూసినా మిమ్ములనటుగా కదలన్విలేదో ఆ దేవునికే తెలియాలి.

సురేంద్ర :- రహ్మన్‌గారూ! మీరు ఎంతగా తెగబడి మాట్లాడుతున్నారో? అవన్నీ వాస్తవాలేనని నిరూపించాల్సిన బాధ్యత నుండి మన మిరువురం అంగీకరించిన నియమం ప్రకారం మీరు తప్పించుకోలేరు. నిరూపణకు రండి.

8. సత్యాన్ని చూసే సామర్ధ్యమైనా ఉండాలి లేదా ఆ సామార్ధ్యాన్నైనా పెంచుకోవాలి. అంతకుమించి సత్యాన్ని చూసే ఏ మరో అవకాశం లేదు. అన్నది రహ్మన్‌గారి ఆనాటి ప్రకటనలోని ముక్తాయింపు.

సురేంద్ర :- బాగుందండీ రహ్మన్‌ గారూ! ప్రమాణవిద్యనూ, సత్యాసత్య వివేచనా పద్ధతిని అంతో ఇంతో నా ద్వారా విని, అందులోనూ గ్రహించగలిగినంత గ్రహించిన మీరు మంచి సలహానే అదీ చాలా సాహసంతో కూడిన సలహానే పడేశారు. యుక్తి యుక్తమైన మాట పిల్లాడు చెప్పినా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అట్లు కానిది ఎంతవాడు చెప్పినా గడ్డి పరకతో సమానంగా చూడాలి. అన్న ప్రాతిపదిక ఉన్నవాణ్ణి నేను. కనుక ఈ విషయాన్ని మీరు నాకు చెప్పడం నిజానికి అనుచితమే అయినా, అది అసత్యం కాదుగనక సరైన సూచనగానే స్వీకరిస్తున్నాను. అయితే అట్టి సామర్ధ్యం మన ఇరువురిలో ఎవరికుందో, ఎవరింకా అలవరచుకోవలసీ ఉందో తేల్చుకోవడం మన సందర్భాన్ని బట్టీ తప్పనిసరికదా! రండి కూర్చుని తేల్చుకుందాం. తేలిన దాన్ని స్వీకరించి అలానడుద్దాం. ప్రస్తుతాంశాల వరకు పరిమితమై మీకింకా ఆ సామర్ధ్యలోపం ఉందని చూపిస్తాను. మీరున్నూ ఈ సందర్భంలో నాకాసామర్ధ్య లోపం ఎక్కడుందో చూపించండి.

ముగింపు

1. ఈ స్పందన - ప్రతిస్పందనలపైనే దీనిలో సంబంధ మున్న వారందరితో వారివరకు పరిమితమై ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఇది వచ్చిపడ్డ సమస్య. ఇదయ్యాక అసలు విషయానికి వద్దాం.

2. అవిశ్వాసుల పట్ల ఖురాను వైఖరేమిటి? అదెన్ని రకాలుగా ఉంది? అందులో వధించమనేంత వరకూ కూడా ఆదేశం ఉందా? లేదా? అన్నదే నిజానికి మన పరిశీలనాంశం. ఆ దిశగా పరిశీలన సాగుతూ వస్తున్న క్రమంలోనే ఒక సమావేశంలోతనని ఒప్పుకోకపోతే చంపేయడమేమిటండీ! అలాటిదుంటే దానిని అంగీకరించకూడదు. వదిలిపెట్టాలి లేదా అలాటి మాట లేదనైనా చెప్పాలి అని నేననగానే, అలాటిది ఉంటే వదిలేస్తాను అన్నారు మీరు.

3. అలాటి అర్ధాన్నిచ్చే వాక్యాలున్నాయంటూ నేను చూపించాను. సభలో ఇస్లాం పక్షంలో వాళ్ళల్లో కొందరు తప్ప మిగిలిన అన్ని సమూహాలవాళ్ళూ అంటీ ముట్టని వారు తప్ప - ఆ వాక్యాలకు నేనన్న అర్ధమే వస్తుందన్నారు. దాన్ని మీరంగీకరించాలి. లేదా వాటికి మీ అర్ధమేమిటో చెప్పి అది సరైందేనని వివరించాల్సిన బాధ్యత మీదే. ఆ తరవాత నిర్ధారణ నియమాలననుసరించి మన ఇరువురి వాదనలో ఏది సరైందో నిర్ణయించాల్సింది మూడో (పరిశీలక) పక్షం వారు. అయినా ఇప్పటి వరకు నా అర్ధాన్ని అంగీకరించని మీరు మీరు చెప్పే అర్ధమేమిటో ప్రకటించలేదు. ఇక్కడికిదే మీలోని పెద్ద లోపం కాగా, సమావేశాన్నెందుకు ఏర్పరచలేదు. ఏర్పరచమని మీరెందుకు సురేంద్రను అడగలేదు అంటూ అదరగండంగా మాట్లాడేశారు. నా పని పూర్తి చేశా. నా పని పూర్తి చేశాక సభలో మెజారిటీ (సింహభాగం) ఆమోదించాక, ఇక మిగిలింది మీరు చేయాల్సిన పనేనన్న విషయాన్నైనా గమనించని మీ గ్రహింపు సామర్ధ్యాన్ని గురించి ఏమనుకోగలం? అయిందేదో అయింది. ఇప్పటి నా వాదన తప్పని ఆధారాలు చూపి, దానికి వేరుగా మీ వాదనేమిటో చెప్పి దానిని సరైన ఆధారాలు చూపడానికి సిద్దం కండి.

నా వాదాన్ని ఖండించకుండా, మీ వాదాన్ని స్ధాపించకుండా ఊరుకుంటే దానర్ధం మీరు ఓడినట్టేనన్నది వాద నియమాలలో కీలకమైనది. దీనినే అప్రతిపత్తి - మీ పక్షంలేకపోవడం - అనంటారు.

''విప్రతిపత్తి రప్రతిపత్తిశ్చనిగ్రహస్థానం'' అన్నది తార్కిక నియమం. వాది పక్షాన్ని కాదనేందుకు అవసరమైన తన పక్షాన్ని చూపకుండా ఊరుకుండడం అప్రతిపత్తి

ఆ సందర్భానికి చెందని మరో అంశాన్ని లేవనెత్తడం అన్య ప్రస్ధావన చేయడం విప్రతిపత్తి అనంటారు. మీరు ఈ రెండూ చేశారు. ఒకటి ఆ వాక్యాలకు నాఅర్ధం ఎలా సరైందికాదో, ఏది సరైన అర్ధమో చెప్పకుండా ఊరుకోవడం అప్రతిపత్తి క్రిందికి వస్తుంది.

ఖురాను వాదబల పరీక్ష ప్రకరణం కాగా, దానిని విడచి, సదస్సులలో మిమ్ము ప్రశ్నించిన వారిని, వారి వ్యక్తిత్వాలనూ కించపరుస్తూ మాట్లాడడం విప్రతిపత్తి, అన్యప్రస్ధావన అవుతుంది. ఈ రెంటిలో దేనిని చేపట్టినా ఆ పక్షం వీగిపోయినట్లే మీరు తెలిసో తెలియకో, తెలుసుననుకునో ఈ రెంటినీ వాడేశారు. కనుక వాద నియమాలు తెలిసినవారి ప్రకారం మీరు ఓడినట్లే. మరోమాట! అనవసరంగా, అప్రస్తుతమైన వ్యక్తి విమర్శనెత్తుకుని ప్రశ్నించిన ప్రతివాణ్ణి ఎందరిని ఎన్నో అనేశారు! అవన్నీ అవాకులూ చవాకులూ కావు, బాధ్యతాయుతమైన వాస్తవ ప్రకటన లేనని నిరూపించనైనా నిరూపించండి. ఆ పని చేయగలిగింది కాదనుకుంటే, వివేకాన్ని మేల్కొల్పి పొరపాటున తొందరపడ్డాను మిత్రులారా! అని బహిరంగంగా ప్రకటించనైనా ప్రకటించండి.

మీకూ మిగిలిన పాఠకులకూ కూడా ఖురానును మరోసారి పట్టిచూడడానికి ప్రేరణ కలిగించేదిగా ఉండగల ఒక ప్రకటన చేస్తాను. ఖురాను స్వభావంలో అది ఉందో లేదో చూడండి. అల్లాకు మనుషుల మధ్య సమానత్వం ఇష్టంలేదు. 1. అవిశ్వాసులూ, విశ్వాసులూ సమానులుకారు 2. ముస్లింలలోనూ అల్లానంగీకరించి నమాజు చేసేవాడూ, అల్లా మార్గంలో పోరాడి చనిపోయినవాడూ సమానులుకారు. 3. మహమ్మదూ - మిగిలిన ముస్లింలూ సమానులుకారు. 4. స్త్రీలు పురుషులూ సమానలు కారు. 5. స్వర్గలోకవాసులందరూ సమానులుకారు.

అల్లా! ఏ పూర్వకారణం లేకుండానే మనుషుల్ని అసమానులుగనే సృష్టించాడు. సామాజిక సంబంధాలలోనూ తనరుణ, శిక్షల విషయంలోనూ అసమానత్వాన్నే కనబరిచాడు. మరణానంతరం ఇచ్చే స్వర్గ - నరకలోకాల భాగంలోనూ అసమానత్వాన్నే నిర్ణయించాడు.

అదేమిటని! తల ఉన్నవాడు, హృదయమున్నవాడూ ఎవడైనా ఖురాను వేత్తలనబడే వారి నడిగితే అదంతా అల్లా ఇష్టం నీవెవరివి అడగడానికి? ఆయనిష్టం వచ్చిన రీతిలో పరీక్షిస్తాడు మనుషుల్ని ఆయనిష్టంవచ్చిన రీతిలోనే ఫలితాలనూ ఇస్తాడు.ఆ యన సృష్టి ఆయనిష్టం, సర్వం తెలిసినవాడాయన అంటూ అదరగండంగా, అడ్డగోలుగా మాట్లాడేస్తారు.

ఓ ప్రవక్తా! అవిశ్వాసుల్ని దేవదూతలెలా వధిస్తున్నారో నీవు చూడగలిగితే ఎంత బావుణ్ణు అన్న అల్లా వాక్యం మీ కళ్ళపడిందా? లేదా? ఇప్పటికి కనపడకుంటే మళ్ళా వకపరి వళ్ళు దగ్గరెట్టుకుని చూడండి. రహ్మన్‌గారూ! మీరు ప్రకటించాల్సిన వాటి విషయంలో బాధ్యత స్వీకరించండి. ఎప్పుడు ఎక్కడ కూర్చుందామో చెప్పండి

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర


6 comments:

  1. సురేంద్ర, అబ్దుల్ ఖుద్దూస్ గార్లకు,
    అభినందనలు, మౌఢ్యం మరీ పెచ్చుమీరినవాళ్ళ భావజాలాల త్రుప్పు వదిలించే పని చేస్తున్నందుకు.
    మీరు మీ టపాలలో తెలియజేసిన విషయం గురించి చిన్న వివరణ ఇవ్వవలసినదిగా మనవి.
    కాఫిర్లను ఏం చేయాలో తెలిపిన ఖురాన్ సూక్తులు సంఖ్యలు అన్నీ వీలుంటే ఇవ్వగలరు.
    .....శ్రీనివాసుడు

    ReplyDelete
    Replies
    1. మీ ఈ-మెయిల్ id ఇస్తే ఆ సూక్తులు అన్నీ మీకు పంపుతాను.
      ఏ విషయం పై వివరణ కావాలో స్పష్ట పరచండి.

      Delete
  2. Even though we need to face that stupidity to acknowledge people and alert them about it

    ReplyDelete
  3. అభినందనలు
    అన్యులను , బాహుదైవారాదకులను చంపమని ఉన్న ఖూరన్ reference లను నా email id కి పంపగలరు.
    yadavchinna008@gmail.com

    ReplyDelete
  4. మరియు ఖూరన్ అవిశ్వాసులను చంపమని ఉన్న reference లు కూడ పంపండి
    ధన్యవాదములు

    ReplyDelete