Monday, October 1, 2018

ఇంతకూ బైబిలు ఏమి చెపుతోంది? - 2


ఇంతకూ బైబిలు ఏమి చెపుతోంది? - 2
యోచనాశీలురైన పాఠక మిత్రులారా! గత మాసం ఈ శీర్షికను ఆరంభించుకున్నాం. బైబిలు గోల మనకెందుకులే అనుకునే వారికి ఇలాంటి కూలంకుష, తులనాత్మక పరిశీలనకు సమయాన్ని వెచ్చించడానికి అంతగా ఇష్టముండదు. జ్ఞానార్జన విషయంలో ఉండవలసినంత శ్రద్దా, అవసరమైనంత శ్రమకు సిద్దపడగలిగి వుండడమూ అన్న రెండూ అరుదుగా లేదా చాలా బలహీనంగా వుంటున్న నేటి తరుణంలో ఈ రకమైన, ఎంతో ఓపికతో శ్రమించాల్సిన ఈరీతి అధ్యయనానికి మీలో ఎంతమంది సిద్దపడతారన్నది అనుమానమే. అయినా ఈ వ్యాస సంపుటి, ఒక దస్తావేజు (డాక్యుమెంటు)గా వుండి, ఈనాడు, రేపు కూడా బైబిలుపై తులనాత్మక అధ్యయనం చేయగోరేవారికి, ఎంతో కొంత సహాయకారిగా, మార్గదర్శిగా ఉండగలదన్న శుభచింతనతోనే దీనిని మొదల్టెాను. దీనివల్ల నాకూ ఒకింత వ్యక్తిగత ప్రయోజనం లేకపోలేదు. ఈ రచన కోసం మరొక్కసారి నేను, బైబిలులోని ఎంచుకున్న అంశాల వరకైనా, వచనం, వచనం చదవాల్సి వచ్చింది గనుక ఆమేరకు స్పష్టత పెరుగుతుంది. మొత్తం బైబిలును చదివి 15, 20 ఏండ్లైంది. నాకిది పునశ్చరణగా ఉపయోగపడుతోంది. మరొక్కమాట!మనది ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న సమాజం. అందునా సామ్యవాద, లౌకిక పోకడను స్వీకరించిన సమాజం, అసాధారణమైన వైవిధ్యమున్న జన సముదాయాలతో కూడి కలసి వున్న, ఉండాల్సిన సమాజం. భారత రాజ్యాంగపు ప్రధానాశయం సమానత్వ సాధనే. దానిననుసరించి సమష్టి క్రమాభివృద్ధిగా, అత్యున్నత స్థితికి చేరడం.
ఈ రెండూ ఇప్పికి సాధించబడలేదు సరికదా! ఈ దిశగా ఒడిదుడుకులు లేకుండా నెమ్మదిగానైనా గమనం సాగించే పరిస్థితులూ కొరవడి వున్నాయి. మరింత మరింతగా అసమానతలు పెరిగిపోయేందుకు వివిధ సముదాయాల నుండి యత్నాలు జరుగుతున్నాయన్నది అనుభవాలు (వాస్తవాలు) చెపుతున్న మాట. సమష్టి శ్రేయోభిలాషులెవరికైనా, అందరం బాగుండాలి అని చిత్తశుద్దితో తలంచగలవారెవరికైనా ఈ పరిస్థితులూ,  సమాజం గమనరీతి ఎంతో కొంత ఆందోళన కలిగించకమానవు.
ఎవర్లోబోతే నాకేమిలే (మనకేమిలే) నా (మన) వరకు బాగుంటే చాలు అన్న ధోరణి ఇటు వ్యక్తుల్లోనూ, అటు సంస్థలలోనూ కూడా బలంగా కనపడుతోంది. ఒక సమాజ భవితవ్యానికి సమష్టిశ్రేయస్సుకు, ఉమ్మడి అభివృద్ధికి, భద్రతకు ఆటంకం కలిగించగల పెద్దపెద్ద అవరోధకాలన్నింలోకి  ప్రమాదకరమైన ఆటంకంగా వుండగలదీ భావన. సెల్ప్‌ సెంటర్‌నెస్‌ స్వార్థపరత్వము కలిగించగలంత ముప్పు మరేదీ కలిగించలేదు.
పెద్ద విషాదమేమంటే, ఇటు ఇల్లూ అటు పాఠశాలా, అన్న రెండు జ్ఞాన కేంద్రాలూ వ్యక్తికి ఈ స్వార్ధపరత్వ స్వభావాన్నే అలవరుస్తున్నాయి. ఇది చాలదన్నట్లు సాంకేతిక విజ్ఞానం ద్వారా దగ్గరైన ప్రపంచం కూడా ఇదే పోకడను ప్రదర్శిస్తోంది. ఇన్నిం ప్రభావం ఆధారంగా వ్యక్తి సామాజిక స్పృహకు దూరమై, సాటి మనుషులూ, ప్రకృతీ కూడా తనకు వినిమయాలుగానే భావిస్తున్నాడు. గుంపు లేకుంటే బ్రతకలేడు కనుక రకరకాల గుంపులలో చేరిపోయి, ఆ గుంపు తనదిగా ఇతరాలన్నీ పరాయివిగా భావిస్తూ తాను అంగీకరించిన గుంపుతో తాదాత్మ్యత చెందడం, ఇతరాలను పరాయివిగనే, పరాయివారుగనే తలంచడంతో ఆగక కొందరి విషయంలో శత్రుభావాన్ని కూడా కలిగి వుంటున్నాడు. పెంచుకుంటున్నాడు కూడా. ఈ వైఖరి సమష్టిహితం కోరేవారందరకీ మనోవేదన కలిగించేదిగనే వుోంంది. ఈ అవాంఛనీయ పరిస్థితులనుండి సమాజం బైట పడాలంటే, వ్యక్తి, సమాజము, ప్రకృతి, వాటి మధ్య ఉన్న సంబంధాలు, అందువల్ల ఏర్పడే సమస్యలు, ఉండవలసిన సంబంధాలూ, అందువల్ల వనగూడే ప్రయోజనాలు అన్న వాటిని గురించి సరైన జ్ఞానం (అవగాహన) కలిగించుకుని, దాని ప్రకారం జీవించడాన్ని అలవరచుకోవాలి. ఇంతకంటే, సమష్టి శ్రేయస్సుకు సూటైన సరళమైన దారిమరోటిలేదు.
ప్రస్తుతం భారత దేశాన్ని వైయక్తిక స్వార్ధ పరత్వం అంటే మరింత సంపాదించు, మరింత మరింతగా అనుభవించు అన్న భావం ఉప్పెనలా ముంచేస్తోంది. ఇక సంస్థల విభాగాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మత సంస్థలు, తన పర అన్న భావాన్ని జనంలో బలంగా పాదుకొల్పి, తన గుంపును పెంచుకోవాలనీ వీలైతే ఎదుటి వారి గుంపును తగ్గించాలని, గ్టిగా పూనికప్టి మరీ కృషి చేస్తున్నాయి.
దాదాపు అందరూ బైటికి, వినడానికీ, చూడ్డానికీ ఎవరెన్ని కబుర్లు చెప్పినా, నాటకీయంగా ఐక్యత ఉన్నట్లు ప్రదర్శించినా, అంతరంగంలో మాత్రం తన - పర అన్న దృష్టినే ప్రధానంగా కలిగి వుంటున్నారు. ఆంతరంగిక సమావేశాలలో రూపొందించుకునే కార్యక్రమాలూ, తానూ, తనవి బలపడడానికి, ఎదుటివారు బలహీన పడడానికీ, ఏమి చేయాలన్న దృష్టితో తయారు చేసుకునేవిగానే వుంటున్నాయి. సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు కూడా ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంటున్నాయి. నిస్వార్థ పరత్వంతో మానవీయ దృక్పథంతో చేసే కార్యక్రమాలు అరుదుగానూ, స్వల్పపరిమాణంలోనూ మాత్రమే జరుగుతున్నాయి.
వివిధ మత సంస్థలూ, రాజకీయ సంస్థలూ, మత రాజకీయ సంస్థలూ, కూడా అత్యంత ప్రభావవంతంగా నేను నాది లక్ష్యంగానే ఈ పనులు చేసుకుంటూ పోతున్నై. మినహాయింపు ఘటనలు వెదికితేగాని ఎక్కడో ఒకీ, అరా కనబడడంలేదు. సొంతలాభమూ కోసం, పబ్బంగడుపుకోవడం కోసం, మందను పెంచుకోవడం కోసం తెగ శ్రమించే సంస్థలు మాత్రం కోకొల్లలుగా వుంటున్నేౖ.
ప్రతి మతమూ 'తన - పర' అన్న దృష్టి నుండే మనుషుల్ని విడగొట్టుకుని చూస్తుంది. అవకాశం వుంటే అన్యులను తనలోకి లాక్కోవడానికి యత్నిస్తుంది. అందుకై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించడానికి సిద్దపడుతుంది. ఆ యత్నంలో జరిగే అనుచితాలనూ, హింసనూ కూడా దేవుని కొరకు చేసే పనిలో భాగంగానే తలంచమంటుంది. ముఖ్యంగా ఇస్లాం వైఖరి ఈ విషయంలో ప్రస్పుటంగా కానవస్తుంది. ఒక ముస్లిం దేవుని మార్గంలో పోరాడడం, దేవుని కొరకు పోరాడడం, ఆ క్రమంలో ఎదుటివాణ్ణి చంపినా, తాను చనిపోయినా కూడా అతనికి స్వర్గంలో, సమున్నత స్థానం లభిస్తుందని బోధిస్తుంది. బైబిలు కూడా అలాటి వైఖరినే అంతరంగంలో కలిగి వుంటుంది. కానైతే, దానిలోని పాత నిబంధన మార్గదర్శకత్వానికీ, క్రొత్త నిబంధన మార్గదర్శకత్వానికీ ఒకింత భేదం వుంటుంది. పాత నిబంధన తననంగీకరించని, అన్య దేవీ దేవతల నంగీకరించే వారిని కొట్టేయాలనే చెపుతుంది. అలా క్టొటి వేసిన దాఖలాలూ ఆ గ్రంథంలోనే మెండుగా దొరుకుతై. యేసు బోధనలు మాత్రం ప్రేమించు, క్షమించు, పశ్చాత్తాప పడు లాటిం విషయాలనే బోధించినా, క్రైస్తవం పేరున నాటి నుండి ఈ నాటి వరకు జరిగిన చరిత్రను చూస్తే, వారూ సమాపాయాన్నే కాక, దాన బేధ, దండోపాయాలను అతిగానే వాడినట్లు రుజువవుతుంది. ఆరంభంలో వారు యూదుల చేత ఎంత కౄరంగా హింసింపబడిందీ, వధింపబడిందీ బైబిలే చెపుతోంది. క్రీస్తుకు ముందు నుంచీ వున్న యోహాను మొదలుకుని, యేసు, అతని శిష్యులూ, కడకు ఈనాటి   క్రైస్తవ్యానికి సిసలైన మార్గదర్శకునిగా తలంచబడుతున్న పౌలు వరకు సహజ మరణం పొందలేదు. అమానుషంగా వధింపబడ్డవారే దాదాపు అందరూ క్రైస్తవుల పట్ల యూదుల నిర్వాకం అలా వుంది. క్రైస్తవులు బలపడ్డాక, యూదుల పట్ల క్రైస్తవులనుసరించిందీ, యేసు బోధించిన ప్రేమ, క్షమ, లననుసరించిన వైఖరి కానే కాదు. అదలా వుంచి, క్రైస్తవుల్లో క్రైస్తవులే, నీవు క్రీస్తు విరోధివంటే, నీవు క్రీస్తు విరోధివంటూ కొట్టుకు చచ్చారన్నది కల్పన కాదు, చరిత్రే.
పోపు ఆధ్వర్యంలో, క్రీస్తు పేరున, దేవుని పేరునా జరుగుతున్న దుర్మార్గాలను చూచి సహించలేకే, ప్రొటెస్టెంటు వుద్యమం వచ్చింది. ఆ రెండు సమూహాల మధ్య జరిగింది ప్రేమ, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము అన్న మాటల చాటున జరిగింది దారుణ మారణ కాండే 'హతసాకక్షులు' అన్న పేరున వారే వ్రాసి ప్రచురించిన రచనలాధారంగానే మరణించినవారు (వధింపబడినవారు అనడం సరైన పదమేమో) 10 కోట్ల మందట. అది ఏ నాటిమాట? ఈ నాటిలా  జనాభా 700 కోట్ల మంది వున్నప్పి మాట కాదు. ప్రపంచ జనాభా అంతా కలిసినా 100 కోట్ల లోపే వున్న థలో జరగుతూ వచ్చిన హింసాకాండ అది. అందులోనూ, క్రైస్తవ, యూదు, ముస్లిం సమూహాల మధ్య జరిగిన పోరాల ఫలితంగా జరిగిన మారణకాండ అది.
జాతులకు జాతుల్నే తుడిచిపెట్టేయడం, మొత్తం మానవ జాతినే నాశనం చేయడం దగ్గర నుండి అన్యమత విశ్వాసులతో ఈ నాటి వరకూ ఆ రెండు ధోరణులూ జరుపుతూ వచ్చిన పోరాల ఫలితంగా జరిగినంత మానవ హననం మరే కారణంగా జరిగిన యుద్దాల వల్లనూ జరగలేదన్నది చరిత్ర తెలిసిన వారందరిలో నిర్వివాదాంశం.
ఆ రెండు మతాలలోని నిజమైన మత విశ్వాసి, మతేతరుణ్ణి ప్రేమించడం అసాధ్యం, సహించడం దుస్సాధ్యం. ఆ రెండు గ్రంథాలాధారంగా జయించేవారు సహనంతో మెలగడం కనిపిస్తోంది గదా అనంటే, ఆయా వ్యక్తుల వ్యక్తిగత స్వభావం మృదువైనదై యుండడంవల్లగానీ మతాదేశాలను పాటించే అవకాశం లేని వాతావరణం నెలకొని వుండడం వల్లగానీ మాత్రమే అది అమలవుతుంటుంది. నేను వ్యక్తుల్ని వ్యతిరేకించడం లేదు. మనుషులుగా మెసలుకుంటూ కలిసుండడాన్నే త్రికరణ శుద్దిగా కోరుకుంటున్నాను. నా ప్రతికూలతంతా, మనిషిని మనిషిగా కాక, విశ్వాసి, అవిశ్వాసిగా మాత్రమే చూస్తున్న, చూడమంటున్న బైబిలు, ఖురాను గ్రంథాలపైననే హిందూ మతంపేరున చెప్పబడుతున్న వివిధ ఆరాధనా రీతులకు చెందిన గ్రంధాలలో ఈ తరహా విభజన లేదు. బహుదైవారాధన మూల స్వభావంలోనే ఈ రకమైన అసహనం లేని తనం అంటే సహనశీలత ఉంది. కనుకనే, ఆ రెండు మతాలూ (క్రైస్తవం, ఇస్లాంలు) ఇక్కడ మొలకెత్తిన ఆరంభ థలునూ వాటిని వుండనివ్వడం జరిగింది. దానర్థం హిందూ మతం స్వీకరించదగిందని చెప్పడం నా వుద్దేశం కానే కాదు. సత్యాన్వేషి ఉన్నదున్నట్లు చూడగలగాలి. చూడాలనుకోవాలి. ఉన్నదాన్ని పెద్దది చేసో, చిన్నది చేసో చెప్పేపని చేయనే కూడదు. ఎవరా పని ఏ థలో ఏ స్థాయిలో, ఏ విషయంలో చేసినా, అతడా మేరకు సత్యాన్వేషణా పథం నుండి ప్రక్కకు తొలిగినట్లే. అదే మరి ఆ పని వుద్దేశ పూర్వకంగా చేస్తే, అతని సత్యాన్వేషణా తత్పరతలోనే లోపం వున్నట్లు ఉద్దేశ పూర్వకంగా కాక, మానవతప్పిదం. పొరపాటుగా అి్టది జరిగితే, ఆ విషయం ఎరుకైన మరుక్షణం తనని తాను చక్క జేసుకోడానికి సిద్దంగా వుండాలి. సత్యాన్వేషి - సత్యాన్వేషణకు సంబంధించిన ఈ విధివిధానాలు మీకైనా, నాకైనా, ఎవరికైనా సమానమే.
ఈ విషయంలో (ఏ విషయంలోనైనా) తప్పని తేలినవి విడిచిపెట్టడానికీ, ఒప్పని తేలినవి స్వీకరించడానికీ, అప్పికి తేలనివి తేలనివిగా అంగీకరించడానికీ, ఎప్పికీ తేలనివని తేలినవాటిని ఆ జాబితాలోనే వుంచడానికీ నేను సిద్దంగా వున్నాను. ఆ జీవితం వుాంను. సత్యానికి పెద్ద పీట వేయగల వాళ్ళందరూ విధిగా అలానే వుండాలనీ అంాను.
ఈ రకమైన అధ్యయనం యొక్క పరమ ప్రయోజనం ఏమి?
'ఫలిత మనుద్దిశ్యమందోపినవర్తతే' అన్నది విజ్ఞులమాట. ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా బుద్దిహీనుడు (మందమతి) కూడా ఏ పనీ చేయడు అని ఆ మాట అర్ధం. మనందరి అనుభవంలోనూ అది ఉన్నమాటే కదా! మరలాటప్పుడు, స్పష్టమైన అవగాహనతో అధ్యయనం లాటిం, వున్నత స్థాయి జ్ఞానార్జన యత్నం చేసేవారికి ఎందుకొరకిది అన్న దృష్టి - ఎరుక లేకపోతే ఎలా? అసలు లేకుండా ఉంటుందా? ఉండనే వుండదు కదా!?
అధ్యయనం యొక్క ప్రయోజనాలు రెండుగా ఉంటాయి.
1. ఆ గ్రంథం లేదా రచయిత ఏమి చెప్పదలచాడన్నది యథాతథంగా గ్రహింపుకు తెచ్చుకోవడం (తెలుసుకోవడం) 
2. అధ్యయన పరుడు సత్యాన్వేషి కూడా అయితే ఆ చెప్పబడింది సత్యమో, కాదోనూ తెలుసుకోవడం.
  సత్యాసత్య విచారణకు సంబంధించిన ఒక నియమాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం.

''వక్త హృదయం ఇదేనని (ఫలానా అని) భాషననుసరించి నిర్ధారించుకున్నాకనే, దాని సబబు బేసబబుల గురించి ఆలోచించాలి'' అన్నదే ఆ నియమం. ఈ సూత్రాన్ని బైబిలుకు అన్వయించామనుకోండి. ఆ రూపం ఎలా వుంటుంది? ఫలాని విషయంపై బైబిలు ఏమోంంది అన్నది మొదట తేల్చుకోవాలి. అటు తరవాత, ఆ చెప్పబడిన అభిప్రాయం దానికి చెందిన వాస్తవంతో సరిపోలుతుందో లేదో చూసుకోవాలి. సరిగ్గా సరిపోతే ప్రకితాభిప్రాయం (బైబిలులోని ఆ వచనం) సత్యమవుతుంది. సరిపోకపోతే, ప్రకితాభిప్రాయం అసత్యమవుతుంది. వీటినే పారిభాషికంగా ప్రమ - భ్రమ' అనాంరు. అలా వాస్తవంతో సరిపోల్చి చూడడం సాధ్యపడకపోతే, అప్పికది అనిర్ధారితమని అంగీకరించాలి.

గమనిక :- అధ్యయనానికి పూనుకున్న వ్యక్తి, ఈ నియమాన్ని దృష్టిలో పెట్టుకోకుంటే, పెద్ద అనర్ధం జరిగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదం వుంది. అదే మరి దాన్ని చదివినవాడు వుద్దేశపూర్వకంగా ఉన్న అర్ధాన్ని - వక్త చెప్పదలచుకున్న అర్ధాన్ని - విడచి ప్టిె (కప్పి పుచ్చి) తన కిష్టమైన అర్ధాన్ని ఆ మాటలకు ఆపాదించడం చేస్తే, దానిని పారిభాషికంగా ఛలం అనాంరు. వక్త (రచయిత) ఉద్దేశించని అర్ధాన్ని కల్పించడం. అనుద్ధిష్టార్ధపరికల్పనా ఛలం అన్నది తార్కిక సూత్రం. ఆ పని దుర్మార్గమైనది, వంచనతో కూడుకున్నది. ఆ పని మనమెవరమూ చేయనే కూడదు. కానీ ఈనాడు ఒకే గ్రంథంపై రకరకాల వివరణలూ, వ్యాఖ్యానాలు, భాష్యాలు కూడా వస్తున్నై. ఇక బైబిలు ప్రసంగీకులైతే మరీ విడ్డూరమనిపించేలా, వందల, వేల వివరణలు చేస్తున్నారు తమ తమ ప్రసంగాలలో ఒకరు చెప్పిందానికీ మరొకరు చెప్పిందానికీ పొసగదు. పొంతన వుండదు. పైగా అందరూ పరిశుద్దాత్మ ప్రేరణతోనే మ్లాడుతున్నామాంరు. అక్కడితోనైనా ఆగుతారా అంటే అదీ లేదు. తనకంటే వేరుగా చెప్పే వాళ్ళంతా బైబిలును వక్రీకరిస్తున్నారు. వారిది వాక్య విరుద్దమైన బోధ అంటూ ప్రకించేస్తుాంరు కూడా.

1) స్వస్థతలున్నాయని కొందరూ, ఇప్పడవిలేవని కొందరూ
2) త్రియైక దేవుడని కొందరూ, తండ్రి కుమార పరిశుద్దాత్మలు ముగ్గురూ వేరు వేరు వ్యక్తులని ఇంకొందరూ 
3. జన్మ పాపం వుందని కొందరు లేదని ఇంకొందరు 
4. ధర్మ శాస్త్రం క్టొటివేయబడిందని కొందరూ క్టొటివేయబడలేదని కొందరూ 
5. 1000 ఏండ్ల పాలన మొదలైందని కొందరూ, మొదలవలేదని కొందరూ - ఇలా క్రైస్తవానికి పునాది భావనలు, మూల స్థంభాలు అనదగ్గ వాటి విషయంలోనే బైబిలు బాగా తెలుసనుకుంటున్నవారే విభేదించుకుంటున్నారు. ఇలాటి వాటినన్నింనీ నిశితంగా నిస్పక్షపాతంగా గమనిస్తున్న వారికి పుట్టే ప్రశ్నే, ప్టుటి తీరాల్సిన ప్రశ్నే.
ఇంతకూ బైబిలేం చెపుతోంది అన్నది

ఈ ప్రశ్నకు (సందేహానికి) సరైన సమాధానం కనుగొనాలంటే, బైబిలును ఒక క్రమంలో అధ్యయనం చేయడమే సరైందవుతోంది. అప్పుడు కూడా రాగద్వేషాలు (అనుకూల ప్రతికూల దృష్టులు) లేకుండా పరిశీలించగలిగితేనే ఉన్న విషయాన్ని యథాతథంగా తెలుసుకోడానికి వీలవుతుంది. అందుకు నేను ఎంచుకున్న మీ ముందుకు తెస్తున్న దారి బైబిలులోని ఒక్కోభాగాన్ని తీసుకుని, దానిపై రాగల ప్రశ్నలన్నింనీ వేసుకోవాలి. వాటికి బైబిలు నుండి సమాధానాలు రాబ్టాలి. ప్రశ్నలు లేవనెత్తడమెలాగన్నది మీకు తెలియజేయడానికే గత మాసపు వివేక పథంలో (సంచిక 239లో) సుమారు 120, 130 ప్రశ్నలను లేవనెత్తాను. ఈ సంచికలో క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త పై రాగల కొన్ని ప్రశ్నలను మీ ముందుంచుతున్నాను. మీరూ ఎవరికి వారుగా బైబిలులో ఎంపిక చేసుకున్న భాగం పై ఎన్ని ప్రశ్నలు వేయగలిగితే అన్ని ప్రశ్నలను వ్రాత మూలకంగా సిద్దం చేయాలి. ఆ ప్రశ్నలన్నింకీ బైబిలు ఏమి చెపుతుందో కనుగొనాలి. అదిగో అప్పుడు మాత్రమే బైబిలు ఏమి చెపుతోంది? అన్న దానికి చాలా వరకు సమాధానం లభిస్తుంది. అధ్యయన పరునికి స్పష్టత వస్తుంది.

మత్తయి సువార్త అధ్యాయ క్రమాన్ననుసరించి రాగల ప్రశ్నావళి


1. మత్తయి తాను చెప్పదలచిందాన్ని యేసు క్రీస్తు వంశావళిని ప్రకించడంతో ఎందుకు మొదల్టెటినట్లు? అందులో సువార్త ఏముంది?
2) '3' సంపుటుల రూపంలో 42 తరాల వివరాలు అతడు ఎక్కడి నుండి సేకరించాడు?
3) అంతక్రితమే ఆ జాబితా ఎక్కడైనా సిద్దం చేయబడి వుందా?
4) పాత నిబంధనగా నేడు చూడబడుతున్న దంతా ఒక గ్రంథంగా అతని కాలానికే లభ్యమవుతోందా?
5) బైబిలులో చెప్పబడిన ఈ వంశాను క్రమనికకు, ప్రపంచం అంగీకరించిన చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు దొరుకుతాయా?
6) ఇదంతా ఒక కుటుంబ వంశావళికి చెందిన వివరమేగాని, మానవ సమాజ చరిత్ర కాదు గదా?
7) అబ్రహాము కుమారుడు దావీదు అనడం ఎలా కుదురుతుంది?
8) అలాగే యేసును దావీదు కుమారుడనడమూ సమంజసంగాలేదు కదా?
9) దావీదు సొలోమోనును కన్నాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. అది సరేగాని, వంశావళిని ఆదాము నుండి కదా మొదల్టెాలి? కనీసం నోవహు నుండైనా చెప్పుండాల్సింది.
10) 1వ సంపుటి 14 తరాలు అబ్రహాము నుండి దావీదు వరకు 2వ సంపుటి '14' తరాలు దావీదు నుండి యెకొన్యా వరకు కాగా, '3'వ సంపుటి 14 తరాలు యెకొన్యా నుండి యోసేపు వరకు అనికదా మత్తయి సువార్త చెపుతోంది. ఏసేమో మరియకు ప్టుాడు యోసేపుకు పుట్టలేదు. కనుక ఏ రకంగా చూసినా మత్తయి మొది వచనానికి (అబ్రహాము కుమారుడు దావీదు, అతని కుమారుడు యేసు అన్నది పొసగడం లేదు కదా?
11) ఇంతకూ, ఈ వంశావళి క్రమం కచ్చితత్వం కలిగిన వాస్తవమేనని నిరూపించడం ఎలాగు?
12) బైబిలే సంపుీకరించిన ప్రకారం చూసే, అబ్రాము కుమారుడు దావీదు అనడాన్ని సంపుటిలోని మొది వానికి చివరి వాడు కుమారుడు అన్న పద్దతిని తీసుకున్నారు అనుకుంటే, రెండవ సంపుటిలోని మొదివాడు దావీదుగానీ, దావీదు కనిన సొలోమోనుగానీ, అవ్వాలి. అప్పుడు దావీదు లేదా సొలోమోను కుమారుడు యోకొన్యా అవ్వాలి. అదే ప్రకారం యోసేపు యోకొన్యా కుమారుడవ్వాలి. యేసు మరియకు పరిశుద్దాత్మ వల్ల కలిగినవాడు గనుక అతడెవని కుమారుడనాలో చెప్పి, అదెలా సరైందోనూ వివరించాలి
13) పరిశుద్ధాత్మ అంటే ఏమి? దాని స్వరూప స్వభావాలేమి?
14) పరిశుద్దాత్మ వల్ల గర్భవతి కావడమంటే ఏమి?
15) ఆమె మామూలు స్త్రీ పురుషుల కలయిక కారణంగా గర్భం ధరించినట్లే, 10 నెలలు నిండి కన్నట్లే కనింది కదా?
16) యోసేపుకు ఆమె గర్భవతి అని తెలిసి, ఆమెను విడవడానికే కదా సిద్దపడ్డాడు?
17) ప్రభువు దూత స్వప్నమందు కనపడడమేమి?
18) మేలుకుని వున్నప్పుడే కనపడవచ్చు కదా?
19) యాకోబు కుమారుడు కదా యోసేపు, దావీదు కుమారుడని అనడమేమి?
20) కలలో కనపడ్డ దానిని ప్రత్యక్షమవడమని అనడమేమి?
21) భార్య తన ద్వారా కాకుండానే గర్భవతి అయినదని తెలిసిన యోసేపు రచ్చ జేయకుండా విడచిపెడదామనుకుంటుంటే, కలలో కనపడ్డ దూత, యోసేపు మరియను చేర్చుకొనడానికి 'భయపడకు' అనాండేమి?
22) 'యేసు' అని పేరు పెట్టుదువు అని దూత అన్నదానికి, కన్యకగర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అన్న దానిని ప్రవచనం క్రింద చూపడమేమి?
23) అతనికి ఇమ్మానుయేలనే గదా పేరుపెట్టుండాలి?
24) కనుక ఇమ్మానుయేల్‌ కథకూ, యేసు కథకూ పొంతనేమి?
25) ఇమ్మానుయేలు కథ జరిగిపోయిన కథే కదా? దానికి యేసుకుముడిపెట్టడం సబబుకాదు కదా?
26) యేసు అంటే రక్షకుడని, ఇమ్మానుయేలంటే దేవుడు మనకు తోడని అర్ధమంటూ వివరణ లెందుకు?
27) మరియకు ప్టుటిన వానికి లేఖనాల ప్రకారం ఇమ్మానుయేలు అని పేరు పెట్టేస్తే గొడవ లేకుండా పోయేదికదా?
28) ఏ సందర్భంలో ఇమ్మానుయేలను పేరు ప్రస్తావన చేయబడిందో అది ఆనాడే జరిగిందా? జరగలేదా?
30) ఇమ్మానుయేలు విషయంలో చెప్పిందంతా ఏసుకు వర్తిస్తుందా? వర్తించదా?
31) ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టుదువు అన్నది మరియ గర్భాన ప్టుటిన వాని విషయమే అయితే, మళ్ళా దూతగానీ, మరెవరుగానీ, ఏమీ చెప్పకుండానే, అతనికి ఇమ్మానియేలని పేరు పెట్టడం జరగాలి. అలా జరిగినప్పుడే భవిష్యవాణి నెరవేరినట్లు, అలా జరగలేదు కదా?
32) నిజానికి దూత మరియతో నీకు ప్టుటినవానికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువనిగానీ, పెట్టుముగాని చెప్పడమే సరైందికాదు.
33) ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇతరులెవరైనా వేరు వేరు పేర్లు సూచించినా, వాటన్నింనీ ప్రక్కన ప్టిె వివశత్వంతో  'ఇమ్మానుయేలు' అన్న పేరు పెట్టడం జరగాలి. అలా జరిగుంటే ప్రవచనం నెరవేరిందని అనుకోడానికి అవకాశమైనా ఉండుండేది ప్రవచనం నెరవేరలేదనడానికీ ఆ సమాచారం ఆధారంగా వుంది.
34) ఈ సందర్భానికి చెందిన చిక్కు ప్రశ్న ఒకటుంది. మరియను యోసేపునకు ప్రధానం చేశాక, ఎన్నాళ్ళకు మరియ ప్రసవించిందన్నది ఆనాటి ఇరుగు పొరుగుకు తెలియకుండా వుండేందుకు వీలేలేదు. సాధారణంగా పెళ్ళైన 9 నెలలలోపే బిడ్డను కంటే, ఇరుగు పొరుగంతా కచ్చితంగా ఆ స్త్రీ శీలాన్ని గురించి శంకిస్తారు. అపవాదూ వేస్తారు. ఆ విషయం వాస్తవమా కాదా?
35) ఎవరీ తూర్పు దేశపు జ్ఞానులు ? అధ్యాయం - 2
36) ఆయన నక్షత్రం తూర్పు దిక్కున చూడడమేమి?
37) ఆయన ఎక్కడున్నాడని ఎవరిని అడిగారు?
38) అడగబడిన వారికి యేసు యూదుల రాజని తెలుసా? తెలియదా?
39) అంతలోనే ఈ విషయం హేరోదు రాజుకు ఎలా తెలిసింది? యెరూషలేము అంతికీ ఈ వార్త ఎలా చేరింది?
40) రాజు యాజకుల్ని, శాస్త్రులను సమావేశ పరచడానికి ఎంత సమయం ప్టింది?
41) అంత వరకు తూర్పు దేశపు జ్ఞానులకు ఏసు ఎక్కడున్నదీ ఎందుకు తెలియలేదు?
42) క్రీస్తు బెత్లెహేంలోనే పుడతాడని యాజకులకు, శాస్త్రులకు ముందే తెలిసుంటే, ఆ విషయాన్ని వారు రాజుకెందుకు తెలియపరచలేదు.
43) వారికి వారైనా ఏసును చూడడానికి ఎందుకు పోలేదు?
44) ఇక్కడ చూపిన లేఖనం యేసును చూపిస్తుందా? చూపదా?
45) ఆ లేఖనం ప్రకారం ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి కదా వస్తాడు
46) యేసు ఇశ్రాయేలీయులను పరిపాలించలేదు కదా?
47) ఇదంతా జరిగే వరకు తూ.దే. జ్ఞానులు ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారు?
48) హేరోదు వాళ్ళను రహస్యంగా పలిపించడమెందుకు?
49) నక్షత్రం కనపడిన కాలాన్ని పరిష్కార రూపంగా తెలిసికోవడమంటే ఏమి? ఏ మర్థమౌతోంది?
50) ఆజ్ఞానులనే బెత్లేహేము వెళ్ళి ఏసును కనుగొని తనకు వర్తమానం చెప్పమనడమెందుకు?
51) అప్పుడు వారు వెదక మొదలెట్టడమేమి?
52) వారికి మొదట కనపడ్డ నక్షత్రం - అప్పి వరకు కానరాకుండా ఏమైంది?
53) మళ్ళా కనపడడమేగాక, శిశువు ఉన్న దగ్గరికి వారు నడిచేలా వారి ముందుండి నడవడమేమి?
54) ఇంతకూ నక్షత్రం అంటే బైబిలు అర్ధమేమి?
55) వారానక్షత్రాన్ని అప్పుడు చూడడమేమి?
56) నక్షత్రం ఏసు వున్న ఇంటి ముందరకొచ్చి ఆగడమేమి?
57) ఇదంతా రాత్రి జరిగిందా? పగిపూటనా ?
58) ఇంతలోనే వారు నిద్రించిందేప్పుడు?
59) నిద్రలో కలరావడం, కలలో దేవుడు హేరోదు వద్దకు వెళ్ళవద్దని బోధించడమేమి?
60) ఇదంతా జరుగుతున్నంతసేపు (ఎంత సేపది అన్నదీ గ్టి ప్రశ్నే?) హేరోదు ఏమి చేస్తున్నట్టు?
61) యూదులను - ఇశ్రాయేలులను - పరిపాలించు రాజు అయ్యేవాడు ప్టుాడని తెలిశాక హేరోదు అంత వుదాసీనంగా ఎందుకున్నట్లు?
62) అప్పి దాకా వూరుకుని, అప్పుడు దేవుడు యోసేపుకు మళ్ళా కలలోనే కనపడి, రాజు ఈ శిశువును చంపను యత్నిస్తున్నాడు గనుక ఐగుప్తుకు పారిపొమ్మని చెప్పడమేమి?
63) మళ్ళా నేను చెప్పే వరకు అక్కడే వుండండని అనడమేమి?
64) ఇదంతా ఏ రోజు రాత్రి జరిగింది?
65) అదే రాత్రి మరియను, ఏసును తీసుకుని ఐగుప్తునకు వెళ్ళాడోంంది బైబిలు
66) ఇదంతా కూడా ప్రవక్త చెప్పినది నెరవేరునట్లే జరిగిందట!?
67) జ్ఞానులు మోసగించారని తెలుసుకున్న హేరోదు, జ్ఞానులవల్ల తెలుసుకున్న కాల వివరాన్ని బ్టి, రెండు సం||లోపు పిల్లలందరినీ సంహరించడమేమి?
68) తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్టుటిన ఎన్నాళ్ళకు యెరూషేలేముకు వచ్చినట్లు?
69) హేరోబు 2 సం||లోపు పిల్లలందరినీ చంపడం ఎందుకు?
70) రోమాలో అంగలార్పు, రాహేలు యేరుపు, వగైరాలకు, ఇర్మియా ప్రవచనానికీ, హేరోదు పిల్లలను చంపడానికీ సంబంధమేమి?
71) హేరోదు చనిపోయాక, నీవు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమని, ఏసును చంపజూచినవారంతా చనిపోయారని కలలో కనపడి చెప్పిన దేవుడే, మరలా కలలోనే కనపడి గలీలియ ప్రాంతంలోని నజరేతును ఊరికి వెళ్ళమని చెప్పడమేమి.
72. యోహాను బాప్తిస్త్మమిచ్చు దినములన్న కాలానికి ఏసు వయస్సెంత?
73) యోహాను బాప్తిస్త్మం ఇచ్చే పని ఎందుకు మొదల్టెాడు?
74) యేసుకు, యోహానుకు మధ్య వయోభేదమెంత?
75) పరలోక రాజ్యము - మారు మనస్సు - వగైరాలన్నీ యెహావాకు సంబంధించినవేనా?
76) ఎవరి నామమున బాప్తిస్మం ఇచ్చాడు? అప్పికి ఏసు ప్రకటమవలేదు కదా?
77) ఈ ప్రకటన అరణ్యంలో చేయడమేమి? జనం మధ్యలో కదా చేయాలి?
78) యెషయా ప్రవచించిన మాటలు సందర్భం ఏమి? అది ఈ యోహానుకు సంబంధించిన భవిష్యవాణి అని ఎలా నిర్ణయించగలము?
79) యోహాను ఆహారము, వస్త్రధారణ వివరాలతో పనేముంది?
80) యోహాను చేత యెరూషలేము, యూదయ, యోర్ధాను నదీ ప్రాంతము వారందరూ బాప్తిస్మం పొందుచున్నారన్నారు కదా? ఎంత మంది పొంది వుాంరు?
81) బాప్తిస్మం తీసుకోడానికి వచ్చిన పరిసయ్యులు, సద్దూకయ్యలను సర్ప సంతానమని ఎందుకన్నట్లు?
82) రాబోవు వుగ్రతను అన్నాడు ఏమివుగ్రత? ఆ నాటి వారికి - రాబోవు వుగ్రత అంటే ఏమిో తెలుసా?
83) ఎక్కడున్నాయి ఆ వివరాలు?
84) బుద్ది చెప్పినవాడెవడు? అనడిగారు కదా! అలా ఎవరి ప్రేరణ వల్ల గాని వారు బాప్తిస్మం తీసుకున్నారా?
85) బాప్తిస్మం అన్న పదం, దాని క్రింద చేసే పని గురించిన వివరాలు లేఖనాలలో ఎక్కడున్నై?
86) సున్నతికి బాప్తిస్మానికీ ఏమైన సంబంధం వుందా? ఏమి సంబంధం?
87) సున్నతి ప్టుటిన '8' వ నాడు చేసే పని కదా! బాప్తిస్మం ఏ వయస్సులో చేయాలో నిర్ణయముందా? ఏ వయస్సులో ఎవరికైనా ఇవ్వవచ్చునా?
88) పాత నిబంధనలో బాప్తిస్మాన్ని గురించిన వివరాలేమి?
89) అన్య జనులకు బాప్తిస్మం ఇచ్చినట్లు పాత నిబంధనలో దాఖలాలున్నాయా?
90) అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకో వద్దంటున్నాడేమి?
91) గొడ్డలి, చెట్ల వేరు - నరకడం - అగ్నిలో వేయడం అన్న పోలికలు దేనిని గురించి చెప్పడానికి?
92) మారు మనస్సు పొందడమంటే ఏమి? దేని నుండి దేనివైపు మారుమనస్సు పొందాలి? ఆ వివరాలెక్కడున్నై?
93) నా వెనుక వచ్చువాడు నాకంటె శక్తివంతుడు, అన్నంత వరకు బాగుందిగానీ అతని చెప్పులు మోయటకైన నేను పాత్రుణ్ణి కాదు అనడమెందుకు?
94) యోహాను అంత అనర్హుడెందుకైనాడు? ఇది నిజమైతే అి్ట వాని ద్వారా ఏసు బాప్తిస్మం ఎందుకు పొందాడు?; ఇంతకూ ఇది అతిశయోక్తి కాదా?
95) ఆయన పరిశుద్దాత్మతోనూ, అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడన్నాడు కదా? యేసు అలా ఏమి ఇవ్వలేదు కదా?
96) ఆయన చేట ఆయన చేతిలో వుండడమంటే ఏమి?
97) తన కళ్ళము అంటే అర్ధమేమి?
98) ఆరని అగ్ని అంటే ఏమి? దానితో పొట్టును కాల్చడమంటే ఏమి?
99) యోహాను చేత బాప్తిస్మం పొందాలని యేసు ఎందుకు అనుకున్నాడు?
100) అసలింతకూ ఆ కాలాన యోహాను కాక బాప్తిస్మం ఇచ్చివారు మరెవరైన వున్నారా? ఎందరున్నారు?
101) ఇంతకూ యోహానుకు బాప్తిస్మమిచ్చే అర్హత (అధికారం) ఎలా వచ్చింది?
102) యోహాను బాప్తిస్మం పొందాడా? లేదా?
103) ఏసు బాప్తిస్మం ఎందుకు పొందాల్సి వచ్చింది?
104) యోహాను ఏసుకు బాప్తిస్మమివ్వడానికి ఎందుకు వెనకాడాడు?
105) ఏసు నీళ్ళ నుండి బైటికి రాగానే; ఆకాశము తెరవబడిందట! అంటే ఏమి?
106) దేవుని ఆత్మ పావురం వలె దిగిరావడమేమి?
107) ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేనానందించుచున్నానన్న శబ్దం ఎవరిది? ఎవరికి వినపడింది? యేసుకా? యెహానుకా? అనేక జనులకూనా? వివరాలెక్కడున్నాయి?
108) అపవాది చేత శోధింపబడాలన్నది యోహావా ప్రణాళికలో భాగమా? సాతాను ప్రణాళికలో భాగమా?
109) శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి తీసుకెళ్ళడమేమి? ఎందుకు?
110) ఇక్కడ ఆత్మ అన్నమాట దేనిని - ఎవరిని - సూచిస్తుంది?
111) 40 రాత్రింబగళ్ళు (దినములు) ఉపవాసం ఎందుకున్నట్లు? ఏసును అలా వుండమని ప్రేరేపించిందెవరు?
112) 40 దినాల తరవాత ఆకలిగొనడమేమి? అంతకులోపు ఆకలేకాలేదా?
113) ఆకలిగొన్నప్పుడు వచ్చిన ఆశోధకుడెవరు? నీవు దేవుని కుమారుడవైతే అని ఎందుకు ప్రశ్నించాడు?
114) సాతానుకు, ఈయన నా ప్రియ కుమారుడు, అన్న దేవుని వాక్యం వినపడలేదా?
115) ఇంతకూ అపవాదికి యేసు రక్షకుడని, యెహోవా పంపగా వచ్చిన వాడని తెలుసా? తెలియదా?
116) ఇంతకూ శోధింపబడుటకు ఆత్మ చేతనే కొని రాబడిన యేసు, ఏ శోధనకు గురైనాడు? తనను గురించి ఏమి నిరూపించుకున్నాడు?
117) ఈ రాళ్ళను రొట్టెలు చేయమన్న సాతానుకు, అతడా పని చేయ(లే)డని తెలుసా? తెలియదా?
118) ఏసు అతడు నిరూపించమన్నది నిరూపించక మరెదో లేఖనాన్ని చూపించి తప్పించుకోడం ఎందుకు? రొట్టెల్ని చేసేస్తే పరీక్ష పూర్తయ్యేది కదా!
119) పరిశుద్ద పట్టణమంటే యెరూషలేమనేనా? అపవాది యేసును లాక్కుపొయ్యాడా? ఏసే అతని వెంట వెళ్ళాడా?
120) దేవుని కుమారునివైతే గోపురం పై నుండి దూకమన్నాడు. ఇక్కడ కూడా ఏసు దూకి చూపించక, 'దేవుని శోధింపకుమని వుంది' అంటూ మరో లేఖనాన్ని వుదహరించడమెందుకు? అసలింతకూ దేవుని శోధించడమేమి? ఏమి శోధింపబడినట్లు? నెగ్గినట్లు?
121) అపవాది యేసును కొండపైకి లాక్కుపోతుంటే, ఏసు ఎందుకు ప్రతిఘించలేదు?
122) ఈ లోకరాజ్యములన్నీ కొండ మీది నుండి ఎలా చూపించగలిగాడు? ఏసు ఎలా చూశాడు? దానర్ధం కనుచూపు మేర ఉన్న - కింకి ఆనినంత - అన్న అర్ధమేనా? నిజంగా భూలోక మంతినీ చూపించాడా?
123) శోధింపబడుటకు ఆత్మే ఏసును అరణ్యానికి పట్టుకెళ్ళాడు కదా? మళ్ళా శోధింపవద్దని వచనాలున్నాయని యేసే అనడం సరికాదు కదా?
124) శోధించడానికి వచ్చిన సాతాను, శోధింపకు అని అనగానే యేసును విడిచిప్టిె పోవడమేమి?
125) ఇదంతా ఇలా జరగాలని దేవుని చిత్తమా? దానికదే జరిగిందా? 126) దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడమేమి? ఇది మన ఇంగితానికి తప్పనిపించడం లేదా? ఆహారం వల్ల జీవిస్తున్నామేగాని, దేవుని మాట వల్ల జీవించడం ఒక్క రుజువైనా వుందా? దేవుని మాట వల్లనే అనేకులు, జాతులకు జాతులు కూడా నాశనమైపోయాయి కదా?
127) ఇదంతా అయ్యేదాకా కనపడకుండా వున్న దేవదూతలు సాతాను వెళ్ళిపోయాక వచ్చి పరిచర్యలు చేయడమేమి?
128) అస్సలు అప్పుడు పరిచర్యల అవసరమేమి?
129) యోహానును చెరపట్టడమేమి? ఆ ప్రాంతం వారంతా పశ్చాత్తాపపడి అతని నుండి బాప్తిస్మం తీసుకుంటున్నాడింరి కదా?
130) యేసు యోహాను చేర గురించి విని, అక్కడి నుండి పారిపోయి వేరే దేశంలో నివాస మెందుకున్నట్లు?
131) తన పనే చేస్తున్న యోహాను రక్షణ విషయం యోహోవా ఎందుకు ప్టించుకోనట్లు?
132) ఆ చుట్టు పట్ల దేశాల జనులు గొప్ప వెలుగును చూశారట! ఏమి వెలుగు? యోషయా ప్రవక్త ఎక్కడీ మాటలన్నాడు. లేఖనాలలోని ఆ సందర్భం ఏమి? అది ఏసుకు అన్వయిస్తుందా? లేదా?
133) యోహాను ప్రకించిన దానికే, ఏసూ ప్రకించాడు. ''పరలోక రాజ్యము సమీపించి యున్నది మారు మనస్సు పొందుడి'' అన్నదే ఆ సందేశం (సువార్త)
134) దేవుడు, దేవుని ఆత్మ, ఆత్మ, పవిత్రాత్మ అపవిత్రాత్మ, పరిశుద్దాత్మ అన్న పదాల అర్థాలేమి?
135) అవి - అి్టవి, వున్నాయనడానికి రుజువేమైనా వుందా?
136) అస్సలు సిసలైన సువార్త ఏసు ప్రకారం, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడు అన్నదే అవుతోంది కదా? అవునా కాదా?
137) సీయోను, (పేతురు) అంద్రియలు, ఏసు, మనుషుల్ని పట్టడం నేర్పుతాననగానే చేస్తున్న పనిని కుల వృత్తిని వదిలేసి ఏసును వెంబడించడం ... ఏమనిపిస్తోంది?
138) మారు మనస్సు పొందుడని చెప్పక, నన్ననుసరించమని అన్నాడెందుకని?
139) తనో బృందాన్ని ఎంచుకుంటున్నాడనే కదా?
140) అలా కచ్చితంగా 12 మందినే ఎంచుకోవాలి, ఎంచుకుాండు, అన్న ప్రవచనం - లేఖనాధారం - వుందా?
141) పిలవగానే వెంటబడిపోవడం విడ్డూరంగా లేదూ?!
142) అలాగే రెండోజిత్‌ యాకోబు, యోహానులను పిలుస్తాడు, వాళ్ళు అందరినీ వదలి ఈయన్ను వెంబడిస్తారు. ఈ మొది నలుగురూ జాలరులే. జాలరులనే ఎంచుకోడానికి కారణమేమైన వున్నదా?
143) ఏసు జనులు తనవైపు దృష్టినుంచుటకు ఎంచుకున్న విధానం స్వస్థత కలిగించడం, మహిమలు చూపించడం అన్నదే కదా!
144) అలా జనులను ఆకర్షించి, తాను చెప్పదలచుకున్నది చెప్పడం చేస్తూ వచ్చాడు. నిజమా కాదా?
145) రాజ్యమును గూర్చిన సువార్తను 'గాస్పల్‌ ఆఫ్‌ కింగ్‌డమ్‌' ప్రకించాడన్నది వాక్యం. దేవుని రాజ్యమును గూర్చి అవి అనువాదం చేశారు. ఇంతకూ ఏసు దేవుని రాజ్యాన్ని గురించి ఏమైనా వివరాలు ప్రకించాడా? ఏమి వివరాలు?
146) ఆ చుట్టు పక్కల ప్రాంత ప్రజలు కూడా సువార్త కొరకు ఆయన దగ్గరకు రాలేదు. తమ తమ ఈతి బాధలు తొలగించుకోడానికే వచ్చారు. వారిని స్వస్థపరచాడు. అలా వారిని రాబ్టి, తాను చెప్పదలచింది చెపుతూ వచ్చాడు. ఇది నిజమా కాదా?
147) కొండమీది ప్రసంగం (ఇది లోకంలో చాలా ప్రసిద్ది చెందింది). మత్తయి 5-3 నుండి 10 వరకు '8' ప్రవచనాలున్నై నిజానికి అవి అర్ధమైనట్లున్నయే గాని, అందులో కొంత అస్పష్టత చోటు చేసుకునే వుంది. ఇదిగో గమనించండి.

5వ అధ్యాయం 

1) ఆత్మ విషయమై దీనులగు వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది (5:3)
ప్రశ్న : 1) ఆత్మ విషయమై అంటే అర్ధమేమి? దీనులు అన్న దానికి ఆంగ్లంలో పూర్‌ అని వుంది.
2) ఆత్మ విషయంలో దీనుడంటే అర్ధమేమి?
3) ధన్యుడు అన్నమాటకు అర్ధమేమి? ధన్యులు = బ్లెస్‌డ్‌ అని వుంది. ఆశీర్వదింపబడిన అనా దానర్ధం?
4) పరలోక రాజ్యము - కింగ్‌ డమ్‌ ఆఫ్‌ హెవెన్‌ హెవెన్‌ అంటే ఆకాశము అన్న అనువాదము ఉంది. హెవెన్‌ అంటే స్వర్గం అని కదా?  బైబిలులోని పరలోకము, స్వర్గము, నరకము, పరదైసు అన్న పదాల అర్ధాలు స్పష్టంగా తెలియాలి.
5) హేతుబుద్దితో చూస్తే, భూలోకానికి వేరైనవన్ని పరలోకాలే అవుతాయి కదా?
6) ఇంతకూ పరలోకం గురించిన వివరాలేమైనా ఏసు చెప్పాడా? ఎక్కడ? ఏమివి? పోనీ పాత నిబంధనలో ఏమైనా వివరాలున్నాయా?
2) దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు (5:4)
ప్రశ్న :- ఇక్కడ దుఃఖమన్న మాటకు అర్ధమేమి? ఏ కారణం వల్ల, ఎటువిం దుఃఖం అనుభవించే వారు ధన్యులవుతారు. దుఃఖితులు ధన్యులవడమేమి? ధన్యులవ్వాలంటే - ఆశీర్వదింపబడాలంటే - దుఃఖితులెందుకు అవ్వాలి? దుఃఖితులు ఓదార్చబడడమేమి? ఎందుకు? ఎలా? ఓదార్చబడతారు? ఉదాహరణకు, భార్య / భర్త చనిపోయి ఒకరు దుఃఖపడుతున్నారు. వారు ఆశీర్వదింపబడడమంటే ఏమి? ఓదార్పు పొందడమంటే ఏమి? ఇలా రకరకాల దుఃఖాలు మనకు తెలిసిన వాటిని పేర్కొని ఈ సూత్రాన్ని అన్వయించడం కుదురుతుందా? కుదరదా?  ఇంతకూ ఈ వచనం అమలవుతుందా? లేదా?
3) సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనెదరు (5:5)
ప్రశ్న :- ఇక్కడా స్పష్టత లేదు. ఎవరు సాత్వికులనబడతారు? ఫలాని వారు సాత్వికులా? కాదా నిర్ణయించడమెలా? ఏసేమైనా కొలతలనిచ్చాడా? ఫలాని వాడు సాత్వికుడని నిర్ణయించామనుకున్నా, వాడు భూలోకమును స్వతంత్రించుకొనడమేమి? ఈ స్వతంత్రించుకొనడమన్న మాటకు అర్ధమేమి? అి్ట సాత్వికడెవరైనా మన ఎరుకలో వున్నాడా? వాడు భూలోకమును స్వతంత్రించుకోవడం జరిగిందా? అంతా అయోమయంగా లేదా?
4) నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు (5:6)
ప్రశ్న :- 'నీతి' అన్నదానికి ఇక్కడున్న అర్ధమేమి? నీతి విషయంలో ఆకలి దప్పులు కలిగి వుండడమంటే ఏమి? వారు ధన్యులవడమంటే ఏమి? అి్ట వారికి తృప్తి కలిగించడమంటే ఏమి? లోకంలో ఎక్కడైనా అి్టవారు, అి్ట ఫలము పొందినట్లు కనపడుతోందా? ఇదే అమలవుతుంటే, అవినీతి ఎందుకుంటుంది?
5) కనికరము కలవారు ధన్యులు - వారు కనికరము పొందుదురు (5:7)
ప్రశ్న :- కనికరమంటే అర్ధమేమి? మామూలుగా ఇతరుల పట్ల మనం చూపే జాలి, దయ అన్న అర్ధమేనా అది. ఎవరిపట్ల కనికరము చూపాలి? ఎవరి పట్లనైనానా? అలా చూపడం సాధ్యపడుతుందా? అలా కనికరం చూపకపోతే ఏమవుతుంది? కనికరం చూపేవారు కనికరం పొందుతారన్న మాటకు అర్ధమేమి? ఇక్కడ కనికరం చూపినవానికి అందే కనికరం ఎక్కడ అందుతుంది? ఇక్కడేనా? పరలోకంలోనా? ఇది నిజమో కాదో నిర్దారించుకునేదెలా? జీవితంలో కొన్ని సందర్భాలలో, కొందరి ప్లా కనికరం చూపీ కొందరిపట్ల చూపకుంటే అి్ట వారి పరిస్థితి ఏమి? ఈ వివరాలేమైనా ఏసు చెప్పాడా?
ఇంతకూ ఇవన్నీ లేఖనాలాధారంగా చెప్పబడినవా? ఏసు సొంత మాటలుగా చెప్పబడినవా?
6) హృదయ శుద్ధి కలవారు ధన్యులు - వారు దేవుని చూచెదరు (5:8)
ప్రశ్న :- హృదయ శుద్ది కలిగి వుండడమంటే ఏమి? వివరాలెక్కడైనా వున్నాయా? కల్లా కపటం లేని వారనేనా? ఎత్తుగడలూ, పన్నాగాలూ లేనివారనా? ఆలోచనలు దోష రహితంగా వున్నవారనేనా? ఫలాని వారు హృదయ శుద్ది కలవారో, కాదో నిర్ణయించే పద్దతేమైనా చెప్పబడిందా? అి్ట వారు దేవుణ్ణి చూస్తారన్నాడేమి? దానర్ధం దేవుణ్ణి చూడనివారంతా హృదయ శుద్ధి లేనివారనేనా? దేవుణ్ణి వీరూ చూడలేరన్న మా అంది కదా? దాన్నేమి చేద్దాం?
  ఇక్కడ చూడడమన్న పదానికి కలలో చూడడమన్న అర్ధముందా? నేరుగా చూడడమనేనా? అలా దేవుని చూసినవారెవరైనా బైబిలులో వున్నారా? ఈనాటి లోకంలో వున్నారా? ఈ వాక్యం సత్యమో కాదో నిర్ణయించడమెలా?
7) సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు (5:9)
ప్రశ్న :- సమాధాన పరచడమంటే ఏమి? బాధపడుతున్న వారిని ఓదార్చడమనా? సానుభూతి చూపడమనా? బాధలు తొలగించడమనా? అందులో ఏది చేసినా సరే అనా? ఇంతకూ ఒకరిని సమాధాన పరచడమంటే ఆచరణలో ఏమి? ఏయే విషయాలలో సమాధానపరచడం సరైందవుతుంది?   ఎదుటివారి కోర్కెలను తీర్చడమూ దీని క్రిందికి వస్తుందా? ఏయే అంశాలు దీని క్రిందికి వస్తాయో తెలీడం లేదు. ఆవివరాలేమైన ఏసు తెలిపాడా? లేఖనాధారం వుందా? అి్ట వారు దేవుని కుమారులనబడడతారంటున్నాడేమి? ఆ లెక్కన లోకంలో దేవుని కుమారులనదగ్గవారు ఎందరున్నారు? ఎందరైనా ఎవరైనా దేవుని కుమారులవ్వ వచ్చుకదా?
దేవుని కుమారులు అన్నమాట ఎందరికి వర్తిస్తుంది బైబిలు ప్రకారం? వివరాలు కావాలి.
8) నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది (5:10)
ప్రశ్న :- ఇంతకూ 'నీతి' అంటే ఏమి? బైబిలులో వివరం వుందా? నీతి కొరకు హింసింపబడడమంటే ఏమి? ఇప్పుడు లోకంలో అన్యాయానికి గురైన వారందరూ నీతి కొరకు హింసింపబడినవారేనా? అవినీతిపై పోరాడుతూ హింసింపబడ్డవార నా దీనర్ధం? అవినీతి పరులచే బాధింపబడ్డవారినా ? రెండు రకాల వారూ దీని క్రిందికి వస్తారా? ఈనాడు మనం దీని ప్రకారం జీవించాలన్నా, ముందు దాని అర్ధమేమిో స్పష్టంగా తెలియాలి కదా! ఒకడు నీతిగా బ్రతుకుతున్నాడు. అతడు ఎవనిచేతా హింసింపబడలేదు. అి్ట వాడు ఈ రకం క్రిందికి వస్తాడా? రాడా? ఇంతకూ పరలోక రాజ్యము వారిది అంటే అర్ధమేమి? చనిపోయాక దేవుని రాజ్యంలో నివాసముాంరనేనా? అి్ట వారికి ఈ లోకంలో లభించేదేమి? కష్టాలేనా? ఇక్కడ నీతివంతుడు సుఖశాంతుల్ని అనుభవించారనుకోండి. అి్ట వానికి పరలోకం ఉంటుందా వుండదా? ఈ వాక్యం నుండి మనం గ్రహించాల్సిందేమి? ఇది సత్యమో కాదో నిర్ణయించేదెలా?
9. ప్రధాన ప్రసంగం అయ్యాక ఒక సాధారణ ప్రకటనా చేశాడు యేసు.
నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్దముగా చెడ్డమాట లెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. లోగడ ప్రవక్తలనూ జనం హింసించారు. అన్నదే ఆ ప్రకటన.
ప్రశ్న :- ఈనాడు దానిని మనం ఎలా అన్వయించుకోవాలి? ఉదా :- 1) పి.డి. సుందర్రావు,  వర్సెస్‌ రంజిత్‌ ఓఫీరు గార్లుకు దీనిని అన్వయించాలనుకుంటే దాని రూపం ఎలాగుంటుంది?
2) మల్లెం దేవసహాయంగారు వర్సెస్‌ ప్రవీణ్‌ పగడాల గార్లను ఎంచుకుంటే అదెలా వుంటుంది?
3) కరుణాకర్‌ వర్సెస్‌ విజయకుమార్‌ గార్లకు వర్తింపజేస్తే అదెలా వుంటుంది?
4) ఫజులూర్‌ రహ్మాన్‌ వర్సెస్‌ ప్రవీణ్‌ పగడాల వారికి అన్వయిస్తే ఎలా వుంటుంది?
5) సురేంద్ర బాబు వర్సెస్‌ క్రైస్తవ బోధకులకు అన్వయిస్తే ఆ చిత్రం ఎలా వుంటుంది?
గమనిక :- ఇలా పై '9' వ సూత్రాన్ని వివిధ క్రైస్తవులకూ - ఇతరులకు అన్వయిస్తే, ఆ పరిస్థితి ఎలా వుంటుంది? అందులో క్రైస్తవుల వైఖరి ఎలా వుంటే వాక్యానుగణ్యత ఏర్పడుతుంది విచారించాలి. ఈనాటి సంఘ కాపరుల్లో ఈ మాట ప్రకారం మసలుకోడానికి నిజాయితీగా సిద్దపడగల వారెందరున్నారు?
1) క్రైస్తవుడు - మారుమనస్సు పొంది క్రీస్తును అనుసరించువాడు - లోకానికి ఉప్పైయున్నాడు అంటున్నాడు ఏసు. అంటే ఏమి? ఉప్పవడమంటే వాస్తవ జీవితంలో ఏమని అర్ధం చేసుకోవాలి? ఉప్పదనం లేకపోవడమంటే ఏమి? అది లేకుంటే బైట పారవేయడానికీ, తొక్కెయడానికే గాని మరెందుకూ పనికిరాదంటున్నాడు. దీనిని ఎలా అన్వయించాలి?
2) క్రైస్తవుడు లోకానికి వెలుగై యుండాలట! జీవితంలో దాని ఆచరణ రూపం ఏమి?
3) కొండ మీద నుండు పట్టణం మరుగై యుండనేరదు - అన్న మాటకు అర్ధమేమి? ఎందుకీ పోలిక చేసినట్లు?
4) మనుషులు - క్రైస్తవుని సత్క్రియలు చూసి, పరలోకమందున్న తండ్రిని (దేవుని) మహిమను గుర్తించాలట.
5) ఏసు ధర్మశాస్త్రాన్ని - ప్రవక్తల వచనాలను నెరవేర్చుటకే తాను వచ్చినట్లు సూటిగా, నిశ్చయాత్మకంగా చెప్పాడు. గదా! ధర్మ శాస్త్రం క్రిందికి దేనిని తీసుకోవాలి? అలాటిది నిర్ధిష్ట రూపంలో పాత నిబంధనలో ఉందా? దేవుని పేరున చెప్పబడ్డ, ఆజ్ఞలు, సూచనలు, కట్టడులు లాటి వాటినన్నింనీ ఏరుకుని కట్టగట్టు కోవడమేనా?
6) అలాగే ప్రవక్తల వచనాల క్రిందికి ఏయే వచనాలు వస్తాయి? ఈ రెండూ తేలకుంటే, ఏసన్న మాటలు సరైనవో కావో తేలదు కదా?
7) 'ధర్మశాస్త్రమంతా నెరవేరువరకు' అన్న పదం అర్ధం కావడం లేదు కదా? ఏవేవి, ఎప్పిలోపు నెరవేరతాయి?
8) ధర్మశాస్త్రపు ఆజ్ఞులలో మిగుల అల్పమైన దానిని అతిక్రమించినా పరలోక రాజ్యములో అల్పుడవుతాడట! అంటే దానర్ధమేమి? పరలోక రాజ్యంలోనూ, అల్పులు - మధ్యమస్థాయి వాళ్ళు, ఉన్నతులు ఉంారనే కదా?
9) అలాగే ఆ ఆజ్ఞలను గైకొని, ఇతరులకూ బోధించేవాడు, పరలోకాన గొప్ప వాడనబడతాడట!
కనుక ఆజ్ఞలు అందులో ఉత్తమ, మధ్యమ - అధమ విలువ కల ఆజ్ఞలు వున్నట్లే కదా! వాటి వివరాలేవి?
10) శాస్త్రులు, పరిశయ్యులు అన్నవారెవరు? వారి నీతి ఏది? ఏమి? వారి నీతి కంటే క్రైస్తవుని నీతి అధికమవడమంటే ఏమి? ఈనాడు దీనిని మనమెలా కొలిచి చూడగలము? వారితో సమానమే అయినా, క్రైస్తవుడు పరలోక రాజ్యం ప్రవేశించడని చెపుతున్నట్లుంది ఇక్కడి ఏసు మాట! దాన్నేమి చేద్దాం? ఈ కొలతకు తూగే క్రైస్తవులు ఎంత మంది ఉంారు?
11) నరహత్య చేయువాడు విమర్శకు లోనగునన్నది వెనకి మాట అంటున్నాడు ఏసు. ఇక్కడ మనకు అర్ధం కావలసిందేమిటంటే దేనిని నరహత్య అంారు? పాత నిబంధనలో జరిగిన, జరిగించిన మారణకాండ, ఆ తరహా మానవ హననం ఇక్కడ చెప్పిన నరహత్య క్రిందికి వస్తుందా? రాదా?
12) విమర్శకు లోనవడమంటే ఏమి? ఎవరు విమర్శిస్తారు?; ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందది? ఆ వివరాలు లేఖనాలలో ఎక్కడున్నాయి? దానిని అంగీకరిస్తూనే, ఏసు విమర్శకులోనయ్యే మరికొన్ని పనుల గురించీ ప్రస్తావిస్తున్నాడు.
13) తన సోదరుని మీద కోపపడు ప్రతివాడూ విమర్శకులోనగును.
  ఇక్కడ సోదరుడన్నమాట, ఎవరిని సూచిస్తుంది? సాటి క్రైస్తవుణ్ణా? ఒకే తల్లి కడుపున ప్టుటిన వారినా?
  నాకు తెలిసి, సాటి క్రైస్తవుణ్ణి అనే అర్ధం చెపుతారనుకుంటున్నాను. ఇంకా చూడండి,
14) తన సహోదరుని చూచి వ్యర్దుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును.
  ఇక్కడ మహాసభ అన్నమాటను ఎలా అర్ధం చేసుకోవాలి?
15) సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
  ఈ నరకాగ్ని వివరాలు బైబిలు పాత నిబంధనలో ఎక్కడవున్నాయి? విశ్వాసి కూడా, ఈ నియమాన్ని పాటించకుంటే నరకానికే నన్నమాటను, ఈనాడు (ఆనాటి నుండీ) పరస్పరం తిట్టుకున్న, కొట్టుకున్న చంపుకోడానికీ సిద్దపడిన, చంపుకున్న క్రైస్తవులమేనంటున్నవారికి అన్వయిస్తే ఎలా వుంటుంది?
16) వీటి విషయంలో ఎంత జాగ్రత్త చెపుతున్నాడో యేసు చూడండి. దేవునికి (బలిపీఠము వద్ద అర్పణం ఇస్తున్న సందర్భంలోనైనా సరే, నీకు, నీ సహోదరునికి విరోధం వున్న సంగతి గుర్తుకొస్తే, అర్పణమివ్వడాన్ని కూడా ఆపి, మొదట నీ సోదరునితో సమాధానపడమంటున్నాడు.
ఈ సూత్రాన్ని అదీ ఏసు నేరుగా ధర్మశాస్త్రాన్నీ ప్రస్తావించి క్రైస్తవుడు, ఇతర క్రైస్తవునితో ఎలా వుండాలో, దానికి ఎంత ప్రాధాన్యత నివ్వాలో చెపుతున్న ఈ సూత్రాన్ని, ఒక్కొక్క క్రైస్తవునికీ వర్తింపజేసి చూస్తే నరకాగ్నీకిలోనవని వారెందరు తేలతారు?
ఉదాహరణకు 1) మన పి.డి సుందర్రావు గారు - రంజిత్‌ ఓఫీరుగార్లు 2) మల్లెం దేవ సహాయం గారు - ప్రవీణ్‌ పగడాల గారు - ఇలా వందల మందిని చెప్పుకోవచ్చు. వారందరికీ ఏసు పలికిన ఈ పలుకుల పై గురి వున్న్లా లేన్లా? ఇంతకూ ఇలాగే జరుగుతుందనడానికి నమ్మకం తప్ప మరేదైనా రుజువుందా? ఇది సత్యమేననడానికి దారేది?
17) 5-25, 26 వున్న వాక్యాలు ఈ లోక తీర్పుకు సంబంధించినవే కదా? అంతకు ముందు వచనాలూ ఈ లోక విమర్శను గురించేనా? అవి పరలోకానికి చెందినవా? కొన్ని అక్కడివి, కొన్ని ఇక్కడివి చెప్పడం ఎందుకు?
18) వ్యభిచారం చేయవద్దన్నది ప్రధాన ఆజ్ఞలలో ఒకి - దానికి శిక్ష మరణదండనేనని యెహోవా చెప్పాడు కదా! ఏసు దానిని అంగీకరిస్తూనే, 'వ్యభిచారం' అన్న మాట యొక్క అర్ధాన్ని విస్త్రృత పరచాడు. అంటే తన ప్రకారం అది ఎక్కడెక్కడ అన్వయిస్తుందో స్పష్టంగా చెప్పాడు. (5:27 టు 32)   వున్న వచనాలు ప్రామాణికమైనవేనని క్రైస్తవులు అంగీకరించక తప్పదు కదా! ఆ లెక్క ప్రకారం ఇప్పుడున్న క్రైస్తవులలో ఎంత మంది వ్యభిచారం చేయని వారి క్రింద మిగులుతారు? ఎందరు వ్యభిచారం చేసిన వారి క్రింద జమవుతారు? దీని ప్రకారం మీకు మీరు తీర్పు చేసుకో గలుగుతారా?
19) మీమాట అవునంటే అవునా, కాదంటే కాదు అనే వుండాలన్నది ఏసు మాట! అంటే ఎి్ట కుట్రలూ కుతంత్రాలూ వుండకూడదు. పన్నాగాలు, గోడమీద పిల్లి వాలు వుండనేకూడదు. దీనిని అతిక్రమించే మాటలన్నీ దుష్టుడు చేసిేవే (5:37) ఈ కొలతతో కొలిస్తే క్రైస్తవులలో ఎందరు దుష్టులు కానివారు తేలతారు?
గమనిక :- ఈ '5' వ అధ్యాయమంతా ఏసు, తననంగీకరించువాడెలా వుండాలో సూచిస్తున్నది. ఎప్పుడు ఒకడు క్రైస్తవుడు కాగలడో నిర్ణయించడానికి పనికి వచ్చేవి. ఇవి ఇతరులు చూడడం కోసం కాదు. తనను తాను చక్క జేసుకోడానికి గాను చెప్పబడినవి మాత్రమే.
పాఠకమిత్రులారా!
బైబిలును కూలంకుషంగా లేదా ఆ మూలాగ్రం పట్టి చూద్దాం అనుకునే వాళ్ళకు మార్గదర్శకంగా, ఉండగల ఒక పద్దతిని మీకు పరిచయం చేసే యత్నమే ఇది. ఇంతకంటేనూ బలమైన, శాస్త్రీయ మనదగిన అధ్యయన పద్దతీ మండలి దగ్గర వుంది. పరిశోధనా తత్వం కల శోధకులెవరైనా వీటిని వాడుకోవడమేగాక, స్వయంగా ఎవరికి వారూ తమ తమ సొంత పద్దతులనూ రూపొందించుకుని శోధించవచ్చు. పోయిన నెల, ఈ నెలసంచికలలో నేను మీ ముందుంచిన విధానంలో, పరిశీలనకు తీసుకున్న గ్రంథంలోని ఒక్కొ భాగంపై వేయగలిగినన్ని ప్రశ్నలను వేయడం అన్నదే వుంటుంది. ఆ ప్రశ్నలాధారంగా, ఆ గ్రంథం అందించే సమాచారాన్ని గమనించాలి. అప్పుడు దాదాపుగా ఆయా విషయాలపై ఆ గ్రంథం ఏమంటున్నదీ తెలుస్తుంది. ఎక్కడెక్కడ సరిపడినంత సమాచారం లేదోనూ తెలుస్తుంది.
నేను 'ఇంతకూ బైబిలేం చెపుతోంది' సంచిక - 239లో పాత నిబంధన పై కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. ఈ సంచిక 240లో క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 6 అధ్యాయాలను చదువుతూ సుమారు 170 ప్రశ్నలు లేవనెత్తాను. అందులో అనవసరమైన ప్రశ్నలేమైన వున్నాయేమో గమనించండి. అనవసరమైందనాలంటే, ఆ ప్రశ్నకు సమాధానం తెలియక్కరలేనిదై వుండడమో, ఆ సమాధానం మరో ప్రశ్న ద్వారానే వచ్చేసినదై యుండడమో, జరిగితే, అప్పుడది అనవసరమైన ప్రశ్నేనని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పుకున్నాకనూ, ఆ భాగంలో తెలియని అంశమేదైనా మిగిలిపోయినట్లైతే, ఇంకా అడగవలసిన ప్రశ్నలున్నాయని అర్ధం. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెపితే, ఇక ఆ భాగంలో తెలియవలసిందేమీ మిగిలి లేదని చెప్పవచ్చు.
మరొక్కమాట 
మన మీ శీర్షికకు ఇంతకూ బైబిలు ఏమి చెపుతోంది? అన్న పేరు పెట్టుకున్నాము కదా! దీనినే ఒక ప్రశ్నగాభావిస్తే, దానికి సరిపడే సమాధానం చెప్పడం కష్టమవుతుంది. ఎందుకనంటే ప్రశ్నలోనే ఒకింత స్పష్టత - నిక్కచ్చితనం - కొరవడి వుంది కనుక భాషా నియమాలు తెలిసిన వారికీ విషయం మామూలుగానే అర్ధమవుతుంది. ప్రశ్నలో స్పష్టత లేదనింపించినప్పుడు, స్పష్టత కలిగించుకున్నాకనే సమాధానం చెప్పేందుకు సిద్దపడాలి. అదే సరైన విధానం.
భాషా నియమం :- వక్త హృదయం ఇదేనని నిర్ణయించుకున్నాకనే దాని బాగోగుల గురించి ఆలోచించాలి. స్పందించాలి.
ప్రశ్న అర్ధమైందనుకున్నాకనే సమాధానం చెప్పేందుకు యత్నించాలి. అప్పుడు కూడా ప్రశ్న ఏ విషయంలో ఎంత సమాధాన్నాశిస్తోందో, ఆ విషయంలో అంత సమాధానం చెపితేనే సమాధానం సరిగా చెప్పినట్లు.
ఇంత వరకు ఈ నియమం సరైందో కాదో, అవసరమో కాదో ఆలోచించండి. నాకు తెలిసి, ఇది నిర్వివాదాంశం. ఎవరికైనా అవసరమే ఈ సూత్రాన్ని మన శీర్షికకు అన్వయిస్తే,
బైబిలు ఏమి చెపుతోంది? అనగానే, బైబిలు ఏదో ఒకే ఒక్క విషయాన్ని గురించే చెప్పి వున్నట్లైతే, ఇదిగో ఈ మాట చెప్పింది అని చెప్పేయవచ్చు. కానీ, అది అనేక విషయాలలో, తనదైన అభిప్రాయాలను ప్రకించి వున్నట్లైతే, నీవు అడుగుతున్నది ఏ విషయంలో బైబిలు ఏమి చెపుతోందని అడగదలచుకున్నావో దానిని కూడా ప్రశ్నలో చూపించాలి. అప్పుడే, అడిగిందానికీ సమాధానం చెప్పడం సాధ్యపడుతుంది. కనుక ఈ నాడు మనం - అంటే బైబిలును కక్షుణ్ణంగా అవగాహన చేసుకుందామనుకుంటున్న వాళ్ళం. ప్రశ్నకు ముందు ఫలానా విషయంలో అని అనుకుని అధ్యయనం చేయాలి. అలాగే బైబిలు ప్రతినిధులమంటున్నవారినీ, అలా విషయాన్ని చూపించే, ఆ విషయంలో బైబిలు ఏమి చెపుతుందని అడగాలి? బైబిలు ప్రతినిధులూ, ప్రశ్నననుసరించి, సరిపడినంతే అంటే ఎక్కువా, తక్కువా కాకుండా సమాధానం చెప్పాలి. ఈ సందర్భంలో
1) ప్రశ్న అనవసరమైందనిపిస్తే, ఎందుకది అనవసరమైందో సహేతుకంగా సమాధానం కనుగొనాలి.
2) ప్రశ్న సరైందేననుకుంటే, అటూ ఇటూ అంశాలను జత చేయకుండా సరిపడినంత సమాచారం ఇవ్వాలి.
3) ప్రశ్న సరైందే అయినా, సమాచారం లభించకుంటే, ఆ విషయాన్నే ప్రకించాలి. నమోదు చేయాలి.
4) ప్రశ్న సరైందే అయ్యుండి, కొంత సమాచారామే లభ్యమైతే, అసంపూర్ణ సమాచారం వుందనే ప్రకించాలి.
5) అప్పుడు కూడా, ఆ ప్రశ్నకు బైబిల్లోనే వేరు వేరు సమాధానాలున్నా, బైబిలు ప్రతినిధులు, అదే ప్రశ్నకు వేరు వేరు సమాధానాలు చెప్పినా? ఇంతకూ ఆ విషయంలో బైబిలేం చెపుతున్నట్లు? అన్న ప్రశ్న వుత్పన్నమవుతుంది? ఎవరికైనా ఆ ప్రశ్న ప్టుటి తీరాలి.
6) బైబిలే అనేకాభిప్రాయాలు చెప్పుంటే, బైబిల్లోనే భావాలపరంగా ద్వైదీభావన నెలకొని ఉన్నట్లు.
7) బైబిలు ప్రచారకులు - ఒకే విషయంపై భిన్నాభిప్రాయాలు వెళ్ళడిస్తుంటే, ఎవరు చెపుతున్నది బైబిలు చెపుతున్నదో తేలనట్లు.
గమనిక :- బైబిలు విషయంలో ఈ రెండు రకాల పరిస్థితీ వున్నట్లు వాస్తవ పరిశీలనలు తెలుపుతున్నై.
1) బైబిలులోనే కొన్ని విషయాలపై భిన్న వ్యక్తీకరణలు వున్నాయి.
2) బైబిలు జ్ఞానులం అంటున్న వాళ్ళూ అనేకాంశాలలో ఒకే విషయంపై భిన్నాభిప్రాయాలు ప్రకిస్తూ తనదే వాక్యానుసారమైన బోధ, ఎదుటి వారిది వాక్య విరుద్ద బోధ అని బల్లగుద్ది మరీ అనేస్తున్నారు.
ఏ మాత్రం నిజాయితీ, నిబద్దత వున్నా, 'బైబిలు ఇదిగో ఇదే చెపుతోంది' అన్నది నిర్ధారించి ప్రపంచం ముందుంచాల్సిన బాధ్యత అవసరం బైబిలును తలకెత్తుకుని, మంది తలలకూ ఎక్కించాలన్న వారిపైనే ఉంది.
ఇదంతా బైబిలు అధ్యయనంలో ఒక పార్వ్శం మాత్రమే. ఆయా విషయాలపై బైబిలు ఏమంటుందీ కనుగొనడం వరకు కధనడిచినట్లు. ఆపై మరింత కీలకమైన రెండో పార్వ్శం మొదలౌతుంది. ఆ విషయం పై బైబిలు చెపుతున్నది సత్యమా? కాదా? అన్నది. అదీ సజావుగా పూర్తైతే బైబిలులో తప్పులున్నాయో లేదోనూ, ఏవి తప్పులో, ఏవి ఒప్పులోనూ తేలిపోతుంది.
ఏమి చెపుతోందన్నది ఇదమిద్దంగా తేలితే అది బైబిలు సిద్దాంతం అవుతుంది.
దానినే సత్యాసత్య విచారణకు లోను చేయాల్సి వుంటుంది. ఆ విచారణ మౌలికంగా రెండు విభాగాలుగా తేలినవీ - తేలనివి అన్న రెండు విభాగాలను సిద్దం చేస్తుంది. అందులోనూ తేలిన వాటిలో 1) తప్పులని తేలినవీ 2) ఒప్పులని తేలినవీ అన్న రెండు రాశులుాంయి. అలాగే, తేలని వాటిలోనూ 1) అప్పికి తేలనివి 2) ఎప్పికీ తేలనివి అన్న రెండు రాశులుాంయి.
మిత్రులారా ! సిద్దాంత విచారణ క్షేత్రానికి సంబంధించి ఇదే మండలి అవగాహన. బైబిలు బాగా తెలిసినవాళ్ళం, అంటున్న వాళ్ళకూ, బైబిలును మరింత బాగా తెలుసుకుందామనుకుంటున్న వాళ్ళకూ నేను సూచించేదేమంటే, అత్యంత ప్రధానమనుకున్న విషయాలవరకైనా ఒక జాబితాను తయారు చేసుకుని, వాటి వరకు, పైన నేను సూచించిన రీతిలో ప్రశ్నావళిని తయారు చేసుకుని వాటిననుసరించి బైబిలు నుండి బైబిలేమోంందో గమనించి వెలికితీయాలి. ఆ తరువాత ఆ వ్యక్తీకరణలను సత్యాసత్య విచారణకు లోను చేయాలి. కొంతకాలం దీనిపై కొన్ని వ్యాసాలు నేనూ వ్రాస్తాను. ఈ అధ్యయన కార్యక్రమంలో పాల్గొనడానికి మీలో ఎవరికైనా అభిరుచి వుంటే, వారి పేర్లు మాకు తెలియపరచండి. బైబిలు అనుకూల, ప్రతికూల, నిస్పాక్షక పక్షాలు మూటినీ పత్రికా ముఖంగానే నేను ఆహ్వానిస్తున్నాను.
1) సృష్టి - ప్రళయము 2) వ్యక్తి - సమాజము - ప్రకృతి  3) ఆత్మ - వివిధ ఆత్మలు  4) ప్రవక్తలు - ప్రవచనాలు 5) దేవుడు - దేవదూతలు (సాతాను - పరిశుద్దాత్మ, గేబ్రియేలు) 6) బైబిలు ఎన్ని సృష్టులను అంగీకరిస్తుంది?
7) స్వర్గము - నరకము ఇలా అంశాలను ఎంపిక చేసుకుంటూ, వాటి విషయంలో బైబిలు ఏమి చెపుతోంది అన్నది ముందు కనుగొనాలి.

2 comments:

 1. కలియుగాంతం ఎలా అవుతుంది ?
  ---------------------------------------------
  కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".

  రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో  పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.

  అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే

  చిన్ని శ్రీ కృష్ణుల నుంచి
  -------------------------------
  2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.

  గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి )
  --------------------------------------------------
  ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.

  నా జన్మ రహస్యం తెలిసింది.
  నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.
  నన్ను " తథాగతుడు" అని అంటారు.

  గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి )
  ------------------------------------------------
  ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.

  ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.

  ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.

  తథాగతుడు అంటే
  --------------------------
  యదా రాజా - తథా ప్రజా
  యదా భగవంతుడు - తథా భక్తులు
  యదాగతుడు - తథాగతుడు

  యదా భగవంతుడు - శ్రీ రాముడు
  తథా భక్తులు - పాండవులు
  యదాగతుడు - శ్రీ కృష్ణుడు
  తథాగతుడు - గౌతమ బుద్ధుడు

  అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి
  అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు
  త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.

  త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.

  యదా భగవంతుడు
  --------------------------
  త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.

  తథా భక్తులు
  -----------------
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.

  యదాగతుడు
  ------------------
  శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.

  తథాగతుడు
  ----------------
  కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.

  తదుపరి
  చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.

  తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.

  వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.

  కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.

  కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?
  -------------------------------------------------
  కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.

  మహాయుగం ఆయుష్షు    :    43,20,000

  కృతయుగం ఆయుష్షు      :   17,28,000
  త్రేతాయుగం ఆయుష్షు     :    12,96,000
  ద్వాపరయుగం ఆయుష్షు  :      8,64,000
  కలియుగం ఆయుష్షు.       :      4,32,000

  కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరములకు కొంచెం అటు ఇటుగా.

  ReplyDelete
 2. కలియుగాంతం ఎలా అవుతుంది ?
  ---------------------------------------------
  కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".

  రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో  పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.

  అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే

  చిన్ని శ్రీ కృష్ణుల నుంచి
  -------------------------------
  2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.

  గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి )
  --------------------------------------------------
  ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.

  నా జన్మ రహస్యం తెలిసింది.
  నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.
  నన్ను " తథాగతుడు" అని అంటారు.

  గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి )
  ------------------------------------------------
  ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.

  ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.

  ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.

  తథాగతుడు అంటే
  --------------------------
  యదా రాజా - తథా ప్రజా
  యదా భగవంతుడు - తథా భక్తులు
  యదాగతుడు - తథాగతుడు

  యదా భగవంతుడు - శ్రీ రాముడు
  తథా భక్తులు - పాండవులు
  యదాగతుడు - శ్రీ కృష్ణుడు
  తథాగతుడు - గౌతమ బుద్ధుడు

  అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి
  అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు
  త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.

  త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.

  యదా భగవంతుడు
  --------------------------
  త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.

  తథా భక్తులు
  -----------------
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.

  యదాగతుడు
  ------------------
  శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.

  తథాగతుడు
  ----------------
  కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.

  తదుపరి
  చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.

  తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.

  వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.

  కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.

  కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?
  -------------------------------------------------
  కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.

  మహాయుగం ఆయుష్షు    :    43,20,000

  కృతయుగం ఆయుష్షు      :   17,28,000
  త్రేతాయుగం ఆయుష్షు     :    12,96,000
  ద్వాపరయుగం ఆయుష్షు  :      8,64,000
  కలియుగం ఆయుష్షు.       :      4,32,000

  కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరములకు కొంచెం అటు ఇటుగా.

  ReplyDelete