Monday, November 1, 2010

మంచి ఉపన్యాసకుడు కావాలంటే ???

మంచి ఉపన్యాసకుడు

1. ఆరంభ సంబోధన :- 1. గౌరవనీయులైన సదస్యులారా, 2. వేదికపైనున్న పెద్దలకు సభాసదులకు, 3. సోదర సోదరీమణులారా, 4. అన్నలారా, తమ్ముల్లారా, అక్కలారా, చెల్లెళ్లారా, 5. యోచనా శీలురౖైెన మిత్రులారా, 6. ఉద్యమబంధువులారా, 7. మిత్రులారా, 8. సహచర మిత్రులారా, 9. అభ్యుదయా కాంకక్షులారా, 10. సభకు నమస్కారం, 11. సభాయైనమ:

వ్యక్తిపరమైన (ఆత్మాశ్రయ) విషయాలు

2. ఎ : సుస్వరం :- మంచి ఉపన్యాసకునికి అవసరమైన వాటిలో సుస్వరం - మంచి కంఠం ఉండటం - మొట్టమొదటిది.


బి : స్వరస్ధాయి :- శ్రోతలు తనకెంత దూరంలో ఉన్నారో గమనించి వారు హాయిగా వినగలిగే స్వరస్ధాయిని ఎంచుకోగలగడం, కొనసాగించగలగడం మంచి ఉపన్యాసకునికి ఉండవలసిన మరో లక్షణం లేదా సామర్ధ్యం.

నోట్‌ : మైక్‌ వాడేటప్పుడు, వాడనప్పుడు కూడా ఈ సూత్రం పనిచేస్తూనే ఉంటుంది.

సి. స్ఫుటత్వం :- వత్తులు, పొల్లులు, హ్రస్వాలు, దీర్ఘాలు, అనునాసికాలు, తాలవ్యాలు, దంతవ్యాలు, ఓష్టాలు లాంటి ఆయా శబ్ధాలను పుట్టించగలిగే స్థానాలనెరిగి శబ్దోచ్ఛారణ చేయడాన్నే స్ఫుటత్వం అంటారు. స్ఫుటత్వం వక్తపై అనుకూలాభిప్రాయం ఏర్పడడానికి విషయాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి చాలా వరకు దోహదపడుతుంది.

డి. స్పష్టత :- చాలా మంది స్ఫుటత్వానికి స్పష్టతకు తేడా లేదు కదా అని అనుకుంటుంటారు. ప్రసంగంలోని వాక్యాలు, పదాలు సక్రమ కూర్పుపై ఆధారపడి ఉంటాయి. ఆ కూర్పు గనక సరిగా లేకుంటే అర్ధబేధం రావడమేకాక అర్ధం చేసుకోవడమూ కష్టం అవుతుంది. పలు మార్లు పదాలు ఒకదానిలో ఒకటి దూరినట్లు మాట్లాడుతారు కొందరు. దాంతోపాటు ఉరుకులు పరుగులెడుతుంటుంది వారి భాషణం. వీరిని అతివేగులంటారు. వీరు మాట్లాడేది బాగా అలవాటు అయిన వారికి తప్ప అర్ధం కాదు. బాగా మనస్సు పెట్టి వింటూ ఆయా సందర్భాలననుసరించి ఇదైఉంటుందిలే మాట్లాడింది అని ఊహించుకుంటూ వినాల్సిందే అట్టి వారి మాటల్ని. ఆ తొందరకు తోడు అక్షరాలను మింగేయడం కూడా జతకూడితే ఇక వినేవారి పరిస్ధితి దుర్భరం, దయనీయం కూడా. ఇలా మాట్లాడడానికి అలవాటు పడినవాళ్ళు మనం ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోరు. పట్టించుకున్నా పట్టుబట్టి సరిచేసుకునే యత్నం చేయరు. మామూలు విషయాలలోనే వీరితో మాట్లాడడం, వీరు మాట్లాడుతుంటే వినడం చాలా కష్టసాధ్యం అనుకుంటే ఇక ఈ రకం గనక ఉద్యమాలలో ప్రసంగాలు చేసే పాత్ర స్వీకరిస్తే ఆ ఉద్యమమూ దాని భావజాలం అఖాతంలో పడిపోయినట్లే.

కనుక మంచి ప్రసంగీకుడు కావాలనుకున్నవాడు పదాలను, అక్షరాలను ఒక దానిలోకి మరొక దానిని జొప్పించడం చేయనేకూడదు. అలాగే అతి వేగంగా మాట్లాడడమూ నిలిపివేయాలి.

అస్పష్టభాషణం క్రిందికి చేరాల్సిన మరో రకం ఉంది. వీరు అతి నిదానులు. వాక్యంలోని పదానికీ పదానికీ మధ్య విపరీతమైన విలంబన చేస్తుంటారు. వారు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఒక వాక్యంలా వినడమే సాధ్యపడదు మనకు. పదాలు పదాల మధ్య ఖాళీలతోటి సాగిపోతుంటుంది వీరి భాషణం. వారన్న మాటలన్నిటినీ దగ్గరదగ్గరగా కుదించుకుని అర్ధం చేసుకుంటూ సాగుతుండాలి వినేవారంతా. కనుక మంచి ప్రసంగీకుడు కాదలచుకున్నవాడు అధిక అల్పవేగాలను విడచి, అక్షరాలను మింగేయకుండా, మొదటి అక్షరం ఎంత స్పష్టంగా ఉచ్ఛరించామో చివరి అక్షరాన్నీ అంతే స్పష్టంగా ఉచ్ఛరిస్తూ, ప్రసంగించాల్సి ఉంటుంది.

అతివేగము అతి నెమ్మది కాక ప్రతి అక్షరాన్ని స్పష్టంగా తగినంత స్వరస్ధాయిలో మితవేగంతో ఉచ్ఛరించడాన్నే స్పష్టత ఉండడం అని అంటాము.

ఇ :- సందర్భానికి తగినంత భావోద్వేగాన్ని ప్రసంగంలో ఉండేట్లు చూడడం ప్రసంగం రక్తికట్టడానికీ, శ్రోత విషయాన్ని చక్కగా గ్రహించడానికీ, ఉపయోగపడడమేకాక ప్రకరణాంశపు స్వరూపస్వభావాలకు ఆకృతినిచ్చి ప్రసంగానికి న్యాయం చేసినట్లు అవుతుంది. కొందరు కోపాన్ని, శాంతాన్ని కూడా ఒకేస్వరంతో ప్రకటిస్తుంటారు.

గమనిక :- కనుక మంచి ఉపన్యాసకుడు 1. యోగ్యమైన స్వరస్ధాయిని, 2. ఉచ్ఛరణలో స్ఫుటత్వాన్ని, 3. స్పష్టతను, 4. సందోర్భోచితమైన భావోద్వేగాన్ని కలిగిఉండాలి. ఇంతవరకు భాషాపరంగా మంచి వక్త గమనించి, అలవర్చుకోవల్సిన అంశాలను (వక్తకు సంబంధించిన వాటిని ఆత్మాశ్రయాలు అంటారు.) ప్రస్తావించడమైనది. మంచి గొంతు, భాషమీద పట్టు, తగినంత భావోద్వేగం, స్పష్టమైన మరియు స్ఫుటమైన ఉచ్ఛారణ అన్నవి భాషకు సంబంధించినంతలో మంచి ప్రసంగీకునికి ఉండాల్సిన సామర్థ్యాలు. ప్రతి వ్యక్తి ఏదో ఒక శైలికి అలవడి ఉంటాడు గనుక ఆ శైలిలోనే ఈ ఉండవలసిన లక్షణాలు లేకున్నా ఉండకూడని లక్షణాలున్నా మనస్సు పెట్టి చాలా తీవ్రమైన కృషి చేస్తేనే గాని మంచి ఉపన్యాసకునిగా మారడం సాధ్యపడదు.

ముఖ్యగమనిక హెచ్చరిక :- ఉద్యమక్షేత్రాలలోని ప్రచార విభాగంలోగాని, అధ్యయన శిక్షణాకేంద్రాలలోని, బోధకులలోగాని (ప్రచారకులు, శిక్షకులు) అవలక్షణాలు కలిగిన వ్యక్తులు చేరితే ఆ ఉద్యమం సగానికి సగం బలం కోల్పోయినట్లే. గత రెండు థాబ్దాల పైబడి ఎంతో సరుకున్న పండితుల్ని రాష్ట్రస్థాయి నేతల్ని కూడా, ప్రసంగ నైపుణ్యతలు లేనివారిని చూస్తూ వస్తున్నాం. అంతటి వారైయుండీ తమలోని ఈ లోపాన్ని ఎంత కాలానికీ పట్టించుకోకపోవడం ఒక రకంగా కడువిడ్డూరమనిపించే విషయం. విచారాన్ని కలిగించే విషయం కూడా. సూటిగా చెప్పకుంటే వారీ విషయాన్ని గురించి వినరు, మార్చుకోరు. అలాగని సూటిగా చెబితే లోపాన్ని గ్రహించుకోకపోగా చిన్నబుచ్చుకుంటారు. కొందరైతే మరొకడుగు ముందుకువేసి సంబంధాలను తెంచుకోడానికీ సిద్ధపడతారు. చెప్పినవారిపై అనవసరపు వ్యతిరేకతనూ పెంచుకుంటారు.

ఆ విషయాలనలా ఉంచండి మిత్రులారా! మీరు గనుక మంచి ఉపన్యాసకునిగా మారదలచుకుంటే మాత్రం, పట్టుబట్టి పై చెప్పిన వాటిలో ఉండకూడని వాటిని తొలగించుకోవడానికి, ఉండాల్సిన వాటిని జతకూర్చుకోవడానికి కొంతకాలం గట్టి పూనికతో సాధనచేయాల్సి ఉంటుంది. ఈ రోజునుండే అందుకు సిద్ధంకండి. ఈ సామర్ధ్యాలు లేకుంటే మీ దగ్గర విషయపరంగా ఎంత సరకు ఉన్నా అంతా నిరుపయోగమే. ఇప్పటికి వ్యక్తికి సంబంధించిన (ఆత్మాశ్రయమనదగ్గ) జాగ్రత్తలు చెప్పుకున్నాం. ఇక విషయపరమైన విషయాలను గురించి చెప్పుకోవలసి ఉంది. విషయపరంగా చూస్తే ...

3. ఎ. ప్రకరణభంగం చేయరాదు :- విషయపరంగా చెప్పుకోవలసి వస్తే ఉపన్యాసకునికి ఉండవలసిన ప్రధమ అర్హత ప్రకరణభంగం చేయకుండడం. అంటే ఎంపికైన విషయానికి పరిమితమయ్యే మాట్లాడగలగడం. ఇక్కడ గనక తప్పు జరిగిందా! ఇక ఆపై జరిగేదంతా అపసవ్యతే. దారితప్పిన ప్రయాణమే. ప్రకరణభంగం కావడానికి పలు కారణాలుండే వీలుంది. అందులో; మాట్లాడాల్సిన అంశంలో స్పష్టమైన, లోతైన అవగాహన లేకపోవడం చాలా ప్రధానమైనది. మరోకారణం, తాను చెప్పవలసిన విషయానికంటే వేరే విషయంపై తనకు ఎక్కువ పట్టుండడం లేదా ఇష్టముండడం. ఇంకో కారణం ప్రసంగీకునిగా పేరుపొందాలన్న దుగ్ధ ఉండి, అవకాశమున్న చోట్లంతా ప్రసంగీకునిగా స్థానం సంపాయించుకోవడం, తీరా ప్రసంగాంశంగా, నిర్వాహకులు వారి సందర్భానికి తగిన అంశాన్నిచ్చి మాట్లాడమనడం అది ఇతగానికి అంతగా తెలిసినది కాకపోవడం. మరోరకం - చెప్పాల్సిన విషయానికి సంబంధించిన వివరణలోనికి పోయి తిరిగి ప్రధాన విషయంలోకి రాకపోవడం.

గమనిక :- ఇలాంటి సందర్భాలలో ఉపన్యాసకండూతికలవాళ్ళు ప్రకరణభంగం చేయడమేకాక నానా చెత్తంతా శ్రోతలనెత్తిన గుమ్మరిస్తారు. నిజానికి ప్రకరణభంగం జరిగిందంటే కచ్ఛితంగా ఆ వక్తకు సందర్భశుద్ధి లేదనే అర్ధం. ప్రకరణభంగం జరగడానికి, ప్రసంగం ఎందుకు చేయాలన్న దృష్టిలో లోపం ఉండడం కూడా కారణం కావచ్చు. అంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నదీ, దానివల్ల తానే ప్రయోజనం ఆశిస్తున్నది అన్న దగ్గర అతనికి స్పష్టత లేదనే అర్ధం. అలాగే అవసరం తనది కానప్పుడు చేసే ప్రసంగాలలో తెచ్చిపెట్టుకున్నతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

బి. సమయస్ఫూర్తి :- సమయభంగం చేయరాదు (ప్రకరణభంగానికి సరిపోయే కొన్ని ఉదాహరణలు ఇక్కడ చేర్చాలి.)

నిర్ణీత సమయానికి మించి మాట్లాడకుండడం, తనకు కేటాయించిన సమయాన్నతిక్రమించకుండా ప్రసంగాన్ని ముగించగలగడం మంచి ఉపన్యాసకులకుండే మరో గొప్ప సామర్ధ్యం. నిజానికీ సామర్ధ్యం వక్తకు భాషపై పట్టుండడాన్నేగాక ప్రసంగాంశంపై పట్టుండడాన్నీ తెలియజేస్తుంది. ఒకవేళ ఆ ప్రసంగ విషయం విస్తారమైనదై ఉన్న సమయంకొద్దే అయినపుడు ఆ కొద్ది సమయంలోనే ప్రసంగాన్ని పూర్తి చేయాలంటే వక్తకు పై రెండు సమర్ధతలేకాక క్లుప్తీకరణ సామర్ధ్యం అంటే సంగ్రహంగా, సంక్షిప్తంగా చెప్పగలిగే శక్తి ఉండడం అవసరం. అలాగే శ్రోతలు విషయావగాహనలో అంత సమర్ధులు కానప్పుడు లేదా తగినంత సమయం ఉండి, ప్రధాన ప్రసంగాంశము ఒక్కటే ఉండి, ప్రధాన వక్త తానే అయినపుడు పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే ఉండాలి. అది సక్రమంగా చేయాలంటే వివరణాత్మకంగా చెప్పగలిగే శక్తితోబాటు అందుకవసరమైనంత విస్తృత సమాచారం ఉన్నవారై ఉండాలి. నిజానికి మంచి ప్రసంగీకునికి ఈ రెండు సమర్ధతలూ ఉంటాయి. మంచి ఉపన్యాసకునిగా తయారవ్వాలనుకునే వారెవరైనా సరే ఈ రెండు రకాల సామర్ధ్యాలను సంపాదించుకోవలసి ఉంటుంది. లేదా పెంపొందించుకోవలసి ఉంటుంది.

కొంతమంది ప్రసంగీకులలో, ఈయన ఎన్నో విషయాలు తెలిసినవాడనిగానీ ఈయనకన్నీ తెలుసనిగానీ నలుగురితో అనిపించుకోవాలన్న దుగ్ధ ఉంటుంది. నిజానికది చాలా సందర్భాలలో అతడికి ఎన్నటికీ మంచి ఉపన్యాసకునిగా కాకుండా అడ్డుపడే అంశంకూడా. ఈ రకం, వినేవాళ్ళు దొరికినప్పుడల్లా అక్కడ మాట్లాడుకుంటున్నది మరో అంశమైనా, తానూ జొరబడి ఏదో ఒకటి మాట్లాడేస్తూంటారు. సమయము సందర్భమూ చూడకుండా అలా మాట్లాడేవారిని అప్రస్తుత ప్రసంగి అని గాని అసందర్భప్రలాపి అనిగాని అంటారు. నిజంగా మంచి వక్తకాదలచుకుంటే ఈ అవలక్షణాన్ని ఆమడదూరంలోనే ఉంచండి. లేదా కనుచూపుమేరలో ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడండి.

పైనచెప్పుకున్నట్లు సమయాన్నతిక్రమించకుండా ప్రసంగాన్ని ముగించడం (ముగించగలగడం) మంచి ఉపన్యాసకులలో ఉండే మరో ముఖ్యమైన యోగ్యత లేదా సామర్ధ్యం. లేదా మంచి లక్షణమిది. అన్ని సందర్భాలకు వర్తించే విషయమే అయినా, ఒక సభ ఏర్పడి అందులో అనేక వక్తలు ప్రసంగించాల్సిన సందర్భంలోనైతే మిగిలిన అన్ని అంశాలకంటేనూ అధిక తమ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లోనూ అధిక ప్రసంగాలు చేసేవారు, తనకిచ్చిన సమయంకంటే ఎక్కువ సమయం మాట్లాడేవారు, అసలు ప్రసంగీకునిగనే పనికిరారు. ఆ పరిస్థితిని గురించి మరింత ఖచ్చితంగా చెప్పాలంటే అతడు 1. తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు. అదే సమయంలో 2. ఇతరుల స్వేచ్ఛను హరించి వారి హక్కులను కాలరాశాడు వారి కాలాన్ని కాజేయడమేకాక 3. సభనంతటినీ అస్తవ్యస్తం చేసివేశాడు. 4. సభామర్యాదను మంటగలిపాడు 5. వచ్చిన శ్రోతల నిర్వాహకుల వ్యయప్రయాసలన్నిటినీ వ్యర్థంచేసే పనికి పూనుకున్నాడు.

గొప్ప విషాదమూ విచిత్రమూ ఏమిటంటే, ఇప్పడు జరుగుతున్న సభలు, సమావేశాలలో ఎక్కువసార్లు ఈ పరిస్థితే కనబడుతోంది. దీనిని నిర్వాహకులూ పట్టించుకోవడంలా. ఒకవేళ వారు లబోదిబో అంటున్నా సభాధ్యకక్షుల స్థానంలో ఉన్నాయనా పట్టించుకోవడంలా. వచ్చిన వక్తల్లో చాలా మందికి అసలీస్పృహే ఉండదు. ఎంతకూ తనని ప్రదర్శించుకోవాలన్న దుగ్దేగాని, సభాప్రయోజనాల గురించిగాని సాటివక్తల వక్తవ్యాలను గురించిగాని కించిత్తు ఆలోచన చేయరు ఈ రకం.

మరోరకం ప్రసంగీకులున్నారు. వీరు డాబునూ, దర్పాన్నీ కనబరుస్తూంటారు. సభాసమయానికి రారు, సరికదా తనకిచ్చిన సమయానికీరారు. ఆలస్యంగారావడం, తనకొరకు సభనిరీక్షిస్తుండడం, అన్న రెండూ గొప్ప విషయాలుగా భావిస్తూంటారు వీళ్ళు. ఒక నిష్ఠురసత్యం చెప్పనా! తనకు కేటాయించిన సమయానికి సిద్ధంగా లేని వక్త ప్రసంగాన్ని ఎత్తివేయడం, ఉత్తమనిర్వాహకులు చేయవలసిన ఖచ్చితమైనపని. అది సభామర్యాదను కాపాడడం కూడా. అంతేకాక అది సభాసమయంలో శ్రోతలకున్న హక్కును కాపాడడం కూడా. నిజానికి, పదీ, పదకొండుగంటల మధ్య మాట్లాడాల్సిన వక్త ప్రసంగం కొరకు, ఆ ప్రకటనను ఆధారం చేసుకుని ఒక శ్రోత ఆ గంట కొరకు తన పనుల్ని ఆపుకుని, కొంత శ్రమనూ, ఖర్చునూ భరించి సమావేశానికి వచ్చాడనుకోండి. ఇక్కడ తమ ప్రకటనపై ఆధారపడి సభకు వచ్చిన ఆ శ్రోత హక్కుల్ని అతను పొందేలా బాధ్యత వహించాల్సింది నిర్వాహకులే. ఆ బాధ్యతనుండి తప్పించుకునే స్వేచ్చ వారికి లేదుగాకలేదు.

ఈ సమయభంగం చేసే వాళ్ళల్లో సమయానికి సభకు రానివాళ్ళు కొందరైతే, తమకిచ్చిన సమయానికి ఆరంభించీ గడువులోపు ముగించని వాళ్ళు కొందరు. ఒకటోరకాన్ని గురించి పైన చెప్పుకున్నాం. ఇక రెండోరకంవారు కాలం విలువ తెలియనివారు. ప్రసంగాంశపు విలువగాని ప్రసంగరీతిగాని ఎరుగనివారు. వీరిలో కొందరైతే వేదికపైకి వచ్చాక, వేదికపైన ఉన్న పెద్దలు దిబ్బారావుగారికి, ఆ ప్రక్కనే ఆశీనులైఉన్న మహోపాధ్యాయులు, నాకు గురుతుల్యులు పరమానందయ్యగారికి, ఈ ప్రక్కనున్న జగమెరిగిన జంధ్యంలేని బ్రాహ్మలు జంబూకశాస్త్రిగారికి అంటూ మొదలెట్టి తనకిచ్చిన నాలుగు నిమిషాలలో మూడున్నరనిమిషాలు దీనికే ఖర్చుచేస్తారు. లెక్క ప్రకారం నాలుగో నిమిషం కాగానే ఆపాలన్న ఇంగితం లేకపోగా, ఆపేవారెవరన్న ధీమా, ఆపరు, ఆపలేరు, ఆపినా, ఆగనుగదా! అన్న దృష్టితో ఉంటారీరకం. అది చాలదన్నట్లు, నా గురించి నాలుగు ముక్కలని మరో అంకానికి .... తెర తీస్తారు. అదేం కర్మమోగాని పాపం తన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉందనిపిస్తుంది ఈ రకానికి. మన అదృష్టం బాగుండి అధ్యక్షస్థానంలో ఒకింత ముక్కుసూటి మనిషి కూర్చుని టైం, టైం అని హెచ్చరిస్తే, ఇదిగో వస్తున్నాన్నంటూ అప్పుడు మొదలెడతాడు అసలు విషయాన్ని గురించి చెప్పడం. ఇందులోనే కొందరు ఉగ్రనరసింహులు ఉంటారు. వారు టైం చూసుకోండి ముగించండి అని సూచన చేసిన వారిపై పెద్దా చిన్నా తెలీదా! మంచి మర్యాదా తెలీదా! వక్తను ఇలా అవమానిస్తారా! అంటూ ఉగ్రులైపోతూంటారు కూడా.

సి. సంభాషణలో రకాలు

1. మితభాషణం :- మంచి ఉపన్యాసకునికి ఉండాల్సిన (ఉండే) మరో సామర్ధ్యం మితభాషణం చేయగలిగి ఉండడం. మితభాషణం చేయగలగడాన్ని విషయపరంగా చెప్పుకోవాలంటే వక్తకు ఉండాల్సిన మౌలికమైన అర్హత అనాలి. ఎందుకంటే చెప్పనక్కరలేనిది ఏమాత్రంలేని, చెప్పవలసినదే అదంతా ఉన్న, సంభాషణనే మితభాషణం అంటారు. మితభాషణం చేయాలంటే వక్తకు భాషపై పట్టు, ప్రసంగాంశంపై పట్టు, క్లుప్తీకరణ విశ్లేషణ ప్రక్రియలపై పట్టు, ఉండితీరాలి. అప్పుడు మాత్రమే వక్త మితభాషణం చేయగలుగుతాడు. మితభాషణం చేయడమన్నది ఉత్తమస్ధాయినందుకున్న ఉపన్యాసకులలోనే నిలకడగా ఉండగలుగుతుంది.

వివరణ :- భాషణం అన్నది మూడు రకాలు. అల్పభాషణం, అతిభాషణం, మితభాషణం అంటారు వాటిని.

2. అల్పభాషణం :- అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడడం అని దానర్ధం. ఈ పరిస్ధితికి కారణాలనేకం.

ఎ. ప్రసంగాంశంపై పట్టులేకపోవడం :- ప్రసంగాంశంపై తగినంత అవగాహన లేదా సమాచారం లేనివారు తనకావిషయం అంతగా తెలియదని తెలిసినవాళ్ళు, అనవసరపు విషయాలు మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం ఉన్నవారు, నాలుగు ముక్కలు మాట్లాడి ఊరుకుంటారు. తాము చెప్పవలసినంత చెప్పలేకపోయామన్న స్పృహా ఉంటుంది వీరికి. ఇట్టి వారు పట్టుబడితే మంచి ప్రసంగీకులయ్యే అవకాశం ఉంది. వీరు ఒకింత శ్రద్ధ పెట్టి అవగాహన పెంచుకునే యత్నం చేస్తే సరిపోతుంది.

బి. ఆత్మన్యూనతాభావం కలవాళ్ళు :- వీరు నిజానికి తాము చెప్పగలమనుకుంటున్న దానికంటే ఎక్కువ చెప్పగలిగీ, చెప్పలేను అన్నదృష్టిలో ఉంటారు. కొందరైతే, ఎదుట తనతో సములు, చిన్నవారు ఉన్నారని అనిపించినపుడు చక్కగానే మాట్లాడుతారు. అదే మరి సదస్సులో ఎంతో తెలిసినవాళ్ళు, లేదా తనకంటే ఎక్కువ తెలిసిన వారు ఉన్నారనిపించినపుడు ఆత్మన్యూన్యతాభావానికి లోనై చెప్పగలిగినంత చెప్పలేకపోతారు.

సి. నిరాసక్తులు :- ప్రసంగాంశం పట్ల తగినంత అభిరుచి లేనప్పుడు, అవసరం లేదనిపించినప్పుడు ఇతరుల వత్తిడిపై మాట్లాడాల్సివచ్చినపుడు, విషయం తెలిసిందేఅయినా తగినంత మాట్లాడరు. ఇక్కడ జరిగేది అల్పభాషణమే. అంటే మొక్కుబడిగా మాట్లాడే సందర్భాలలో ఎదురయ్యే పోకడన్నమాట ఇది.

3. అతిభాషణం :- అవసరానికి మించిన (అనవసరమైన) వాగుడంతా అతిభాషణం క్రిందికే వస్తుంది. అతిభాషణం చేయడానికీ అనేక కారణాలుండే వీలుంది. అందొకటి అవగాహనారాహిత్యం.

ఎ. నిజానికి ప్రకరణాంశంపై తగినంత అవగాహన లేనపుడు అతిభాషణం చేసే పరిస్థితి రాకూడదుకదా! అవును, అది నిజమే అయినా; వ్యక్తిలో తెలిసినవాడుగా గుర్తింపబడాలన్న దుగ్ధ, శృతిమించితే విషయాన్ని విడచి ఏదోఒకటి మాట్లాడుతాడు. అతిభాషణలో ప్రకరణభంగం, అన్య ప్రస్తావన, సాధారణంగా జరుగుతుంటుంది. కొందరైతే పడికట్టు పదాలు వాడుతూ, పాండితీ ప్రకర్షనను, ప్రదర్శించడానికై తనకే తెలియని పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. తెచ్చిపెట్టుకున్న, కొట్టుకొచ్చిన సంభాషణేనని తెలిసినవారికి తెలిసిపోతూనే ఉంటుందీరకం సంభాషణ.

బి. అతిభాషణాన్నే వాచాలత, ప్రగల్భించడం, వాగాడంబరం లాంటి మాటలలో విజ్ఞులు, భాషాభిజ్ఞులు ప్రస్తావించారు గతంలోనే. అతి భాషణులు భావజాలక్షేత్రంలో కార్యకర్తలుగా అనర్హులు. ఎందుకంటే వీరికి మంచి భావాలను సమాజానికి అందించాలన్న ఉద్ధేశ స్పష్టతగాని, తీవ్రతగాని ఉండనే ఉండదు. ఉద్దేశ స్పష్టత, తీవ్రతఉన్నవారు అనవసర ప్రసంగాలు చేస్తూ తన కాలాన్ని వ్యర్ధపర్చుకోరు. మరికాస్త వివేకం తోడైతే ఇతరుల కాలాన్ని వ్యర్ధపర్చరు. కనుక అతిభాషణం అల్పభాషణం కంటే ప్రమాదకారి కూడా. ఇందులో తెలియని విషయాలు మాట్లాడడం తెలిసినవాడల్లే పోజు పెట్టడం అసలు విషయాన్ని విడచి అనవసరపు విషయాలన్నీ మొదలుపెట్టడం వగైరా లక్షణాలు ఉండడం వల్ల తాను చెడి మరింత మందిని చెరిచే రకం కిందికి వస్తుందీపోకడ. కనుక మంచి ఉపన్యాసకునిగా రూపొందాలనుకుంటున్న మిత్రులారా అతిభాషణానికి అమడ దూరంలో ఉండండి.

ఉపన్యాసకులు

ఎ. మితభాషణం :- మితభాషణం అంటే తక్కువగా మాట్లాడడము అని అనుకుంటుంటారు సామాన్యంగా. ఆ అర్ధం సరికాదని మీకిప్పటికే తెలిసే ఉంటుంది. మితభాషణమంటే ఎక్కువా, తక్కువా కాకుండా సరిపడినంత మాట్లాడడమని అర్ధం. ఉత్తమ ప్రసంగీకునికి ఉండాల్సిన ఉత్తమ మరియు మౌలిక లక్షణాల్లో మొదటిది

1. వీరు అవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండరు. అవసరం రానంత వరకు మాట్లాడరు.

2. అవసరమేర్పడినప్పుడైనా ఈ సందర్భానికి సరిపడినంతే మాట్లాడుతారు.

3. వీరి ప్రసంగం వెనుక భావప్రసారం చక్కగా జరగాలన్న దృష్టి ఉంటుంది.

4. గుర్తింపు పొందాలన్న దృష్టి అప్రధానంగా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మాట్లాడుతున్నంత సేపూ వీరి దృష్టి విషయం మీద విషయాన్ని అందుకోవడానికి కూర్చున్న శ్రోతలపైనా అక్కడ ఉన్న పరిస్థితులపైనా ఉంటుంది.

5. కనుకనే మితభాషులు భావప్రసారానికి అనుకూల పరిస్థితులున్నాయో లేదో చూసుకోవడం అట్టి అనుకూలత లేకుంటే తగిన వాతావరణాన్ని కల్పించడానికి తనవంతు యత్నం చేయడం చేస్తారు. భావప్రసారం జరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడకుంటే సంభాసించడం మొదలెట్టరు. మధ్యలో అట్టిది ఏర్పడితే ఆపేస్తారు. భావప్రసారానికి తగినంత వాతావరణం అంటే సంభాషించడం మితభాషణలో ఒక కీలకాంశం.

బి. ఇక మితభాషణం చేయాలంటే ఒక ప్రసంగీకునికి ఎప్పుడు సాధ్యపడుతుంది?

1. ఏ విషయం చెప్పాల్సిఉందో విస్పష్టంగా తెల్సి ఉండాలి. తెలియజెప్పాలన్న దృష్టి ఉండాలి.

2. ఆ విషయం పై తగినంత అవగాహన ఉండడంతోపాటు ఆ సందర్భంలో ఎంత చెప్పాలో అన్న అంచనా ఉండాలి.

3. ఎదుటివారి అవగాహనా సామర్ధ్యం భాషాస్ధాయికి తగిన రీతిలో ఇతనికి భాషా పటిమ ఉండాలి. ఒక చిన్న నమూనా చూపుతాను. మీరు ఆలోచించండి.

ఎ. ఒకడు నాలుగు ముక్కలే మాట్లాడాడు. దానిని అతిభాషణం అనవచ్చా ? అల్పభాషణం అనవచ్చా?

మితభాషణం అనవచ్చా? ఎలా? ఎందుకు? సమాధానాలు రాయండి.

బి. ఒకడు నాలుగైదు గంటలు మాట్లాడాడు దానిని అతిభాషణం అనవచ్చా? అల్పభాషణం అనవచ్చా?

మితభాషణం అనవచ్చా? ఎలా? ఎందుకు?

గమనిక :- నిన్ను నీవు మితభాషిగా రూపొందించుకోవాలంటే మొట్టమొదట నీకునీవుగా నేను మితభాషణమే చెస్తాను అన్న ప్రతినపూను. వెంటనే నీపై పెద్ద వత్తిడి వచ్చి పడుతుంటుంది. మాట్లాడాలనుకుంటున్న విషయంపై తగినంత అవగాహన తప్పనిసరియై అవుతుంది. ఆ వత్తిడి నిన్ను సావధానచిత్తంతో చదివేలా చేస్తుంది. స్పష్టంగా తెలిసిందనిపించేంతవరకూ వత్తిడి చేస్తూనే ఉంటుంది. భాషపై పట్టు తప్పనిసరి అవుతుంది. కనుక క్రమంగా భాషపై పట్టు సాధించేలా వత్తిడి ఉంటుంది. నిర్ణయించిన సమయంలోనే మాట్లాడాల్సి ఉంటుంది కనుక సందర్భం తక్కువ సమయానికి చెందిందైతే క్లుప్తీకరించడం, అధికసమయముంటే విశ్లేషించడం అన్న రెండు ప్రక్రియలు అలవడతాయి.

అత్యంతకీలకాంశం

ఉపన్యాసకునిగా రూపొందడం ఉపన్యాసాలివ్వడమెలాగన్నది చదివితేనో, వింటేనో, ఉపన్యాసాలివ్వడాన్ని చూస్తేనో వచ్చేదికాదు. అది చేస్తూ నేర్చుకోవాల్సింది. అభ్యాసం ద్వారా మాత్రమే వంటబట్టేది. గనుకనే దాన్ని అభ్యాసిక విద్య అనంటున్నాము. మంచి ఉపన్యాసకునిగా తయారవ్వాలన్నా ఉపన్యాసకునిగా రూపొందించాలన్నా ఉన్నది ఒకే ఒక మార్గం.

1. స్వరం దగ్గర నుండి పైన వ్యక్తిపరంగా చెప్పుకున్న సామర్ధ్యాలు

2. విషయపరంగా దిగువ చెప్పుకున్న సామర్ధ్యాలను అభ్యాసం చేస్తూ, చేయిస్తూ వంట పట్టేట్లు చూసుకోవడమే.

కనుక ఉద్యమ క్షేత్రాలలో అంటే భావప్రసారం ప్రధాన భూమిక వహించే క్షేత్రాల్లో ఉత్తమ ప్రసంగీకుల పాత్ర అత్యంత కీలకమైనది.

ఈనాడు ఉద్యమాలన్నీ ఉపన్యాసకుల కొరతతో తల్లడిల్లుతున్నాయి. అదే సమయంలో వాచాలురతో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల మితభాషులతో బలహీనంగా ఉంటున్నాయి.

1. ఒక వ్యక్తి తనకు తాను మంచి ఉపన్యాసకునిగా రూపొందాలన్న దృఢసంకల్పం చేసుకోనంతకాలం ఎందరెన్ని యత్నాలు చేసినా అతన్ని మంచి ఉపన్యాసకునిగా చేయలేరు.

2. అతనికి తాను మంచి ఉపన్యాసకునిగా రూపొందగలనన్న ఆత్మవిశ్వాసం, తన కృషిపై నమ్మకం ఉండాలి.

3. ఆరంభయత్నాలలో చెప్పదలచుకున్న విషయాన్ని చిన్న భాగాలుగా ఎంచుకుని ఆ విడివిడి అంశాలపై మాట్లాడడంతో మొదలెట్టడం మంచిది. 4,5 ఉపన్యాసాలు చేసే వరకూ ముందుగా రిహార్సల్స్‌ చేసుకున్నా మంచిదే.

4. తప్పులు దొర్లుతాయేమోనన్న గుంజులాటలుండకూడదు. ఎలాగూ కొన్నిలోటుపాట్లు ఉండనే ఉంటాయి ఆరంభంలో. అస్సలు ఏ అభ్యాసక విద్య అయినా అభ్యాసం వల్ల మాత్రమే క్రమంగా లోపరహితత్వం దిశగా కదిలి స్ధిరపడుతుంది. మరో నిజం చెప్పనా! మంచి ఉపన్యాసకుడవడానికి తగిన వాడుకూడా ఒకటో అరో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అయితే అలా జరగడం చాలా సహజం సహజం. అని ఎరిగివున్న వాడవడంతో వాటినంతగా పట్టించుకోడు. కనుక వెనుక పీకుడునాపి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం మొదలెట్టేయండి. అతి తక్కువ సమయంలోనే ఉపన్యాసకునిగా కాగలుగుతారు.

గమనిక :- మాట్లాడడం మొదలెట్టకపోయినా మంచి ఉపన్యాసకుడు కావడానికి పైన చెప్పుకున్న జాగ్రత్తలపై మనస్సు పెట్టే అలవాటు చేసుకోకున్నా ఈ క్షేత్రంలో ఎదుగూ బొదుగు లేకుండా మిగిలిపోతారు. పట్టుదల, శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైనా చేస్తారన్నది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. బలహీనుల వల్ల ఏమీ కాదన్నది నిజం.

5. నీ సమయాన్ని వేదిక మీద ఉన్నవారిని పేరు పేరునా సంబోధించడానికీ, నిన్ను పరిచయం చేసుకోవడానికీ ఖర్చు పెట్టకు. ఒక్క చిన్న మాటలో అస్సలు విషయంలోకి వచ్చెయ్‌. సాంప్రదాయంలోని ఉత్తమ ప్రసంగీకులు ఈ విషయంలో ఒక మంచి వరవడిని ఏర్పరిచారు. ''సభాయైనమ:'' సభకు నమస్కారం అంటూ విషయంలోకి వచ్చే విధానం అది.




ఉత్తమ ప్రసంగీకుడు

బి. ఇక మితభాషణం చేయాలంటే ఒక ప్రసంగీకునికి ఎప్పుడు సాధ్యపడుతుంది?

1. ఏ విషయం చెప్పాల్సిఉందో విస్పష్టంగా తెల్సి ఉండాలి. తెలియజెప్పాలన్న దృష్టి ఉండాలి.

2. ఆ విషయం పై తగినంత అవగాహన ఉండడంతోపాటు ఆ సందర్భంలో ఎంత చెప్పాలో అన్న అంచనా ఉండాలి.

3. ఎదుటివారి అవగాహనా సామర్ధ్యం భాషాస్ధాయికి తగిన రీతిలో ఇతనికి భాషా పటిమ ఉండాలి. ఒక చిన్న నమూనా చూపుతాను. మీరు ఆలోచించండి.

ఎ. ఒకడు నాలుగు ముక్కలే మాట్లాడాడు. దానిని అతిభాషణం అనవచ్చా ? అల్పభాషణం అనవచ్చా?

మితభాషణం అనవచ్చా? ఎలా? ఎందుకు? సమాధానాలు రాయండి.

బి. ఒకడు నాలుగైదు గంటలు మాట్లాడాడు దానిని అతిభాషణం అనవచ్చా? అల్పభాషణం అనవచ్చా?

మితభాషణం అనవచ్చా? ఎలా? ఎందుకు?

గమనిక :- నిన్ను నీవు మితభాషిగా రూపొందించుకోవాలంటే మొట్టమొదట నీకునీవుగా నేను మితభాషణమే చెస్తాను అన్న ప్రతినపూను. వెంటనే నీపై పెద్ద వత్తిడి వచ్చి పడుతుంటుంది. మాట్లాడాలనుకుంటున్న విషయంపై తగినంత అవగాహన తప్పనిసరియై అవుతుంది. ఆ వత్తిడి నిన్ను సావధానచిత్తంతో చదివేలా చేస్తుంది. స్పష్టంగా తెలిసిందనిపించేంతవరకూ వత్తిడి చేస్తూనే ఉంటుంది. భాషపై పట్టు తప్పనిసరి అవుతుంది. కనుక క్రమంగా భాషపై పట్టు సాధించేలా వత్తిడి ఉంటుంది. నిర్ణయించిన సమయంలోనే మాట్లాడాల్సి ఉంటుంది కనుక సందర్భం తక్కువ సమయానికి చెందిందైతే క్లుప్తీకరించడం, అధికసమయముంటే విశ్లేషించడం అన్న రెండు ప్రక్రియలు అలవడతాయి.

అత్యంతకీలకాంశం

ఉపన్యాసకునిగా రూపొందడం ఉపన్యాసాలివ్వడమెలాగన్నది చదివితేనో, వింటేనో, ఉపన్యాసాలివ్వడాన్ని చూస్తేనో వచ్చేదికాదు. అది చేస్తూ నేర్చుకోవాల్సింది. అభ్యాసం ద్వారా మాత్రమే వంటబట్టేది. గనుకనే దాన్ని అభ్యాసిక విద్య అనంటున్నాము. మంచి ఉపన్యాసకునిగా తయారవ్వాలన్నా ఉపన్యాసకునిగా రూపొందించాలన్నా ఉన్నది ఒకే ఒక మార్గం.

1. స్వరం దగ్గర నుండి పైన వ్యక్తిపరంగా చెప్పుకున్న సామర్ధ్యాలు

2. విషయపరంగా దిగువ చెప్పుకున్న సామర్ధ్యాలను అభ్యాసం చేస్తూ, చేయిస్తూ వంట పట్టేట్లు చూసుకోవడమే.

కనుక ఉద్యమ క్షేత్రాలలో అంటే భావప్రసారం ప్రధాన భూమిక వహించే క్షేత్రాల్లో ఉత్తమ ప్రసంగీకుల పాత్ర అత్యంత కీలకమైనది.

ఈనాడు ఉద్యమాలన్నీ ఉపన్యాసకుల కొరతతో తల్లడిల్లుతున్నాయి. అదే సమయంలో వాచాలురతో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల మితభాషులతో బలహీనంగా ఉంటున్నాయి.

1. ఒక వ్యక్తి తనకు తాను మంచి ఉపన్యాసకునిగా రూపొందాలన్న దృఢసంకల్పం చేసుకోనంతకాలం ఎందరెన్ని యత్నాలు చేసినా అతన్ని మంచి ఉపన్యాసకునిగా చేయలేరు.

2. అతనికి తాను మంచి ఉపన్యాసకునిగా రూపొందగలనన్న ఆత్మవిశ్వాసం తన కృషిపై నమ్మకం ఉండాలి.

3. ఆరంభయత్నాలలో చెప్పదలచుకున్న విషయాన్ని చిన్న భాగాలుగా ఎంచుకుని ఆ విడివిడి అంశాలపై మాట్లాడడంతో మొదలెట్టడం మంచిది. 4,5 ఉపన్యాసాలు చేసే వరకూ ముందుగా రిహార్సల్స్‌ చేసుకున్నా మంచిదే.

4. తప్పులు దొర్లుతాయేమోనన్న గుంజులాటలుండకూడదు. ఎలాగూ కొన్నిలోటుపాట్లు ఉండనే ఉంటాయి ఆరంభంలో. అస్సలు ఏ అభ్యాసక విద్య అయినా అభ్యాసం వల్ల మాత్రమే క్రమంగా లోపరహితత్వం దిశగా కదిలి స్ధిరపడుతుంది. మరో నిజం చెప్పనా! మంచి ఉపన్యాసకుడవడానికి తగిన వాడుకూడా ఒకటో అరో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అయితే అలా జరగడం చాలా సహజం సహజం. అని ఎరిగివున్న వాడవడంతో వాటినంతగా పట్టించుకోడు. కనుక వెనుక పీకుడునాపి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం మొదలెట్టేయండి. అతి తక్కువ సమయంలోనే ఉపన్యాసకునిగా కాగలుగుతారు.

గమనిక :- మాట్లాడడం మొదలెట్టకపోయినా మంచి ఉపన్యాసకుడు కావడానికి పైన చెప్పుకున్న జాగ్రత్తలపై మనస్సు పెట్టే అలవాటు చేసుకోకున్నా ఈ క్షేత్రంలో ఎదుగూ బొదుగు లేకుండా మిగిలిపోతాడు. పట్టుదల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైనా చేస్తారన్నది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. బలహీనుల వల్ల ఏమీ కాదన్నది నిజం.

5. నీ సమయాన్ని వేదిక మీద ఉన్నవారిని పేరు పేరునా సంబోధించడానికీ, నిన్ను పరిచయం చేసుకోవడానికీ ఖర్చు పెట్టకు. ఒక్క చిన్న మాటలో అస్సలు విషయంలోకి వచ్చెయ్‌. సాంప్రదాయంలోని ఉత్తమ ప్రసంగీకులు ఈ విషయంలో ఒక మంచి వరవడిని ఏర్పరిచారు. ''సభాయైనమ:'' సభకు నమస్కారం అంటూ విషయంలోకి వచ్చే విధానం అది.

6. 30, 40 ఏండ్లుగా ప్రసంగాలు చేస్తూ వేల ప్రసంగాలు విన్న అనుభవంతో ఒకరీసూచనలు చేస్తున్నారు. చూడండి ప్రసంగం మొదలెట్టిన వాళ్ళు

1. ఇప్పటికే కాలతీతమైంది.

2. మిమ్ము పెద్దగా విసిగించము

3. నాముందు మాట్లాడిన ఆయనే అన్నీ చెప్పేశారు. ఇక చెప్పేదేముంది.

4. ఫలానా వక్త అంతటివారు ఇంతటివారు వారి ముందు నేనెంత

5. ఈ విషయంలో నేనంతగా ప్రవేశంలేనివాణ్ని

6. భోజన సమయమైనది. ఆకలిమీదుండుంటారు.

7. భోజనం చేసి వచ్చారు. నిద్ర ముంచుకు వచ్చే సమయమిది. ఇలాంటి దిక్కుమాలిన వాక్యాలతో మొదలెడుతూంటారు తమ ప్రసంగాల్ని. ఇది వక్తగా అనర్హతను తెలిపే పోకడే. మిత్రులారా ఇలాంటి అనవసరమైన ఎత్తుగడలు చేపట్టకండి శ్రోతలకు మీపట్ల చులకన భావం కూడా ఏర్పడుతుంది. ఇలాంటి వాటివల్ల అంతకంటే జరిగేదేమీ ఉండదు ఈ రకం పోకడలవల్ల.

సభారంజకత్వం :- శ్రోతల్ని ఆకట్టుకోవడం సభికుల్ని మంత్ర ముగ్ధుల్నిచేయడం అన్నది ఒక కళే గొప్ప సామర్ధ్యమే. అది యోగ్యమైన భావంతో కూడియున్నప్పుడు మంచి ప్రయోజనకరమవుతుంది. అయినా భావప్రధానంగాని సంభారంజకత్వం కాలక్షేపానికి పనికివస్తుందికాని ప్రజల్ని అవగాహనా పరుల్ని చేయడానికి పనికిరాదు. వక్తగా పేరొందడం మనలక్ష్యం కారాదు. మంచి వక్త అయితేగాని భావజాల వ్యాప్తిని శక్తివంతంగా చేయలేము గనుక వక్త అవ్వడం లక్ష్యసాధనకొరకు మాత్రమే. భాషాభిజ్ఞత భావప్రసారం కొరకేగాని భాషాభిజ్ఞునిగా పేరుతెచ్చుకోవడానికి కాదు కారాదు. ఉద్యమక్షేత్రాలలో ఇది మరింత కీలకమైనది. ప్రస్తావిస్తున్న విషయానికి చెందిన సందర్భాలను అనుభూతిచెందుతూ మాట్లాడగలిగిన వక్త తప్పనిసరిగా మంచి ఉపన్యాసికుడే అవుతాడు. భావాలు గుండెలోతుల్లో నుండి వస్తుంటే ఆ వ్యక్తీకరణకు సహజత్వం ఉంటుంది. సహజత్వంతో కూడిన ఉపన్యాసం కంటే మంచి ఉపన్యాసం మరి ఇంకేముంటుంది!

వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడాల్నా, ఒక దగ్గరుండి మాట్లాడాల్నా, కూర్చుని మాట్లాడాల్నా అన్న సందేహం కొందరికుంటుంది. ఇక్కడ ఖచ్చితమైన పద్ధతంటూ ఏమీలేదు. నీకు ఏది సుఖంగా సహజంగా అనిపిస్తుందో ఆ విధానాననుసరించడం మేలు. అయితే ఆ విధానం ఆ సందర్భానికి తగినదిగా ఉండేట్లు చూసుకోవడం అవసరం. ఇలాగని ఇతర విధానాలు సరికాదన్న దృష్టికి రాకు, అలా అనకు. సైద్ధాంతిక స్ధాయి సంభాషణల విషయంలో మాత్రం కదలకుండా స్థిరంగా ఉన్న స్థితిలో మాట్లాడడమే మంచిది. వీలైనంతవరకు పిట్టకథలూ, జోకులూ, మషాలాలు లేకుండా ఉండడమే మంచిది. భావప్రధానంగా విషయప్రధానంగా ప్రసంగించే వ్యక్తుల అవసరమే ఉద్యమాల అవసరం. మనకు మషాలా దట్టింపులు అనవసరం .

ఊతపదాలు : ఉపన్యాస చక్రవర్తులు, ప్రసంగకేసరులు, వాగ్భ్రహ్మలు కూడా అలవాటునో పొరపాటునో కూడా కొన్ని పదాలు వాడేస్తుంటారు. మరింత నిజం ఏమిటంటే ఆ పదాలు వాడకుంటే వారి ప్రసంగం సజావుగా సాగనే సాగదు. అందుకే వాటిని ఊతపదాలు అని అన్నారు. అంటే వారి ప్రసంగానికి ఆ పదాలు ఊతంగా అవసరమౌతాయన్నమాట. మనం తరచుగా వింటుంటే ఊతపదాలలో కొన్నింటిని రాయగలం. ఇందులో మీరు దేని ఊతంగాని అవసరపడి వున్నారేమో చూసుకోండి. ఇలాంటి మరికొన్ని ఊతపదాలను మీ అనుభవంలో ఉంటే వ్రాసుకొని ఉంచండి.

ఊతపదాలు : అంటే, ఏమిటంటే, మరేమిటంటే, నేననేదేమిటంటే, ఎందుకంటే, నాయొక్క, ఆయొక్క, మరే, ఏదయితేఉందో, దానియొక్క, వారొక్క ఆ, మనం వెళుతుంటే ఆ, ఇలా ప్రతి ఒకటీ రెండు మాటల మధ్య ఆ, ఊ అనడం వీటితోబాటు ముఖమూ, చేతులూ, మెడ, తల, వివిధ రీతుల్లో కదలిస్తూ మాట్లాడడం చూస్తూంటాం. మేనరిజం అని అంటున్నారు వీటిని. మరీ బిర్రబిగుసుకుని మాట్లాడడమూ మేనరిజం కిందకే వస్తుంది. ఒక విచిత్రమైన కదలికలోగాని సంభాషించలేని తనాన్ని మేనరిజం అనంటున్నారు.

ఊతపదాలు ఊతంగా అవసరమయ్యే భంగిమలు అవయవాల కదలికలు అన్నవి అనవసరపు చేష్టలే. కనుక మంచి ప్రసంగీకుడు కాదలచుకున్నవాడు అప్పటికే అంటుకునియుంటే అట్టివాటిని పట్టుబట్టి వదిలించుకోవాలి-అప్పటికే అంటిఉండకుంటే ఎప్పటికీ అంటకుండా నిరంతరం జాగ్రత్తపడుతూ ఉండాలి. వక్తల అవలక్షణాల జాబితాలోనివే ఈ రెండున్నూ మాట్లాడిందానికంటే అధికంగా చేతులు ఊపుతూ విదిలిస్తూ ఉంటారు కొందరు అది ఒక అవలక్షణమే.

శరీరంలోని అవయవాల కదలికలు ముఖకవళికలు అనేక భావాలను స్పష్టీకరించడానికి తోడ్పడతాయి. వాటినే యోగ్యమైన హావభావాలని అంటారు. బాడీ లాంగ్వేజ్‌ అనంటున్నారు దానినే. భావాన్ని వెల్లడి చేయడానికి తగిన భాషా పదాలతో పాటు అవసరమైన భావోద్వేగం, శారీరక భంగిమలు, కదలికలు అవసరమౌతాయి. వాటన్నిటి కలపోతే మంచి ప్రసంగం కనుకనే ఉపన్యాసం ఒక కళగా చెప్పబడుతోంది. కోపాన్ని శాంతంగా చెప్పడం, శాంతవచనాలు అశాంతితో, ఆవేశంతో మాట్లాడడం లాంటి విడ్డూరాలు అప్పుడప్పుడూ సమావేశాలలో ఎదురవుతుంటాయి. అలాగే కోపాన్ని వ్యక్తపరిచే, ఆందోళనలను తెలియజేసే, దు:ఖాల్ని అసహనాల్ని వగైరా ఎంతో వైవిద్యం, వైరుద్యంగల భావాలను వెల్లడిచేసే సందర్భాలలో దానికి తగిన పదాలను వాడుతూనే ముఖంలోగాని, స్వరంలోగాని ఎటువంటి హావభావాలు లేకుండా మాట్లాడగలిగే విచిత్ర మానవులు జాగ్రత్తగా పట్టి చూస్తే ప్రసంగాలు చేసే సందర్భంలో మనకు తారసపడుతుంటారు. ఇంతటి నిర్వికారులు అతీత మానసిక స్థితిలో ఉన్న వారు ప్రసంగాలకు పనికిరారు. అట్టి వారి ప్రసంగాలు వినాల్సిన పరిస్థితి దాపురించిందనంటే ఆస్థిక భాషలో చెప్పుకోవాలంటే మన ఖర్మ కాలిందనాల్సిందే కనుక ఉద్యమ క్షేత్రాలకు ఎంతో అవసరమైన ప్రసంగ నైపుణ్యతలను చేకూర్చుకుని ఉద్యమాల భావాజల వ్యాప్తికి జనజాగరణకు శక్తివంతమైన సాధనాలుగా మనని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంది.

మరొక్క మాట చెప్పి ఇప్పటికీ రచనను ఆపుతాను - ఆశయాన్ని పండించే వక్తలు గొప్పగా నవ్వుకునే, నవ్వాపుకోలేని విషయాలను తాము ఏ మాత్రం నవ్వకుండా మాట్లాడడం మంచి లక్షణం అన్న ఒక అభిప్రాయం ఉపన్యసించడంలో మెలకువల క్రింద చెప్పబడుతూ వస్తుంది. అది తప్పననుగాని సహజంగా మనిషి ఏ విషయాన్ని చెబుతున్నాడో దాని కనుగుణ్యంగా ప్రవర్తించడమే ఉత్తమం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం చెప్పేవాడు సీరియస్‌గా చెబుతున్నట్లు మామూలుగా చెబుతున్నట్లు ఉండి నవ్వు తెప్పించే సన్నివేశం ఉండవచ్చు. అట్టి సందర్భాలలో మాత్రమే పై సూత్రం అన్వయిస్తుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా అంతగా నవ్వురాని మాటలు మాట్లాడి తెగపగలబడి నవ్వేస్తూ ఉంటారు కొందరు. ఇలాంటి విపరీతాలకు స్వస్తిజెప్పి సరళంగా, సహజంగా, సందర్భోచితంగా హావభావాలను జోడించి మాట్లాడడమే సరైందనిపిస్తుంది. ఈ విషయంలో ఒక సూచన (సలహా) ఇందులో ఏ విధానం ఉత్తమం అన్న చర్చకు దిగకుండా సహజంగా, అతి, అల్పంకాని రీతిలో మీదైన శైలిని ఏర్పరచుకోండి. అనుకరణను మానండి. అనుకరణ అతికించుకున్నట్లే ఉంటుంది. కనుక మొదట్లో విషయంపై పట్టు, ఆపై భాషపై పట్టు, తర్వాత మీదైన శైలిలో ప్రసంగం, ఇదండి మంచి ఉపన్యాసకుడు కావడమెలా! అన్నదానికథాకమామీషు.

త్రైమాసిక సమావేశ విశేషాలు

యోచనాశీలురైన మిత్రులారా!

ముందు అనుకొన్న ప్రకారం త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో 29.10.10 ఉదయం 9గం||లకు మొదలయ్యాయి. ఈ సమావేశములో మండలి విస్తరణ, కార్యకర్తల తర్ఫీదు పై విస్తృతంగా చర్చించడము జరిగింది. సభ్యులు అందరూ విడివిడిగా తమ తమ అభిప్రాయాలను ప్రకటించి చర్చించుకోవడం జరిగింది. చర్చానంతరం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

1. సంస్ధ భావజాలాన్ని మరింత అర్ధం చేసుకొని, ఆ వెలుగులో జీవిస్తూ, ప్రజలలోకి తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే రీతిలో తన్ను తాను తయారు చేసుకోవడం, తనలాంటి వారిని తయారు చేయడం.

2. సభ్యులందరు సంస్ధ భావజాలంలోని ఒక్కో అంశాన్ని లోతుగా అధ్యయన తరగతులలో తర్ఫీదు పొందడం, ఆ అంశంపై తమ తమ ప్రాంతాలలో కరపత్రాలు పంచి, సమాజంలో ఉపన్యసించడం చేయాలనుకొన్నాం.

3. సభ్యుల ఇంటికి మండలి బోర్డు వుండాలనుకొన్నాం (నోట్‌ : ఫ్లెక్సిగాని, రేకుబోర్డుగాని, స్క్రీన్‌ ప్రింట్‌బోర్డ్‌గాని తగిలించవచ్చు)

4. వివేక పధం మాస పత్రికలో మండలి సభ్యుల యోగ్యమైన (మండలి భావజాలానుగుణ్యత కలిగిన) రచనలకు అవకాశము ఇవ్వాలనుకొన్నాము.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక

రాష్ట్ర ప్రథమ సమీక్ష సమావేశ విశేషాలు

30వ తేది ఉదయం 10 గంటలకు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర ప్రథమ సమీక్షా సమావేశము జరిగింది. దాదాపు 3లేక 4 జిల్లాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సుమారు 75, 80 మంది సభ్యులు హాజరు అయినారు. రాష్ట్ర కమిటి నుండి పుట్టా సురేంద్రబాబు, డా||. వి. బ్రహ్మారెడ్డి, రామకృష్ణరాజు, రాజేంద్రప్రసాద్‌, బాలగంగాధర్‌, వెంకట్రామయ్య, జంపా క్రిష్ణకిషోర్‌ గార్లు తదితరులు హాజరు అయినారు. అలానే ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్ధ బాధ్యులుగా శ్రీ ఎస్‌.కె. మున్వార్‌ అహ్మద్‌గారు వేంచేశారు. తొలుత సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరాజు గారు కార్యదర్శి నివేదికను ప్రసంగించారు.(అందించారు). అందులో ముఖ్యంగా రాష్ట్ర బాడి రిజిస్ట్రేషన్‌ వివరాలు, ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వారితో అయిన అగ్రిమెంట్‌ ఇప్పటి వరకు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కార్యక్రమ వివరాలు కక్షుణ్ణంగా అందించారు. ఆ తరువాత అన్ని జిల్లాల బాధ్యులు తమ తమ జిల్లాలలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక పేరన జరిపిన కార్యక్రమాల వివరాలను సభకు నివేదించారు.

తరువాత వక్తగా పుట్టా సురేంద్రబాబు మాట్లాడుతూ వేదిక ప్రాధాన్యతను వివరిస్తూ వేదిక స్వరూప స్వభావాలు, లక్ష్యము, కార్యాచరణ ప్రణాళికలో ఏకాభిప్రాయం కలిగించుకోటానికి ఏర్పడిన సదస్సు అన్నారు. ఇక ఆయన మాటల్లోనే చూడండి.

మనమందరం సంఘజీవులం. ప్రాదేశిక ఎల్లలు కలిగి ఒక ఒడంబడికకులోనై జీవిస్తున్న వారిని సమాజం అంటాము. సమాజాలను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలలో గుర్తిస్తున్నాము. భారత సమాజము యొక్క ఒప్పందం భారత రాజ్యాంగమే. నిరక్షరాస్యుల నుండి అక్షరాస్యుల వరకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు భారత రాజ్యాంగము తెలియకపోవడం. తెలిసిన కొద్ది మంది ఆ రాజ్యాంగాన్ని ఆచరించక పోవడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఒప్పందంలో ఏముందో తెలియకుండానే అమలుపరచడం, ఆచరించడం జరిగిపోతుండడం.

భారత రాజ్యాంగములో ముందుమాట, ప్రస్తావన, అవతారిక అన్నపేరున ఉన్న భాగం భారత రాజ్యాంగం మొత్తానికి ప్రాతిపదికవంటిది. మనది సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్ధ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్న రీతిని మనం ఎంచుకొన్నాం. ప్రజాస్వామ్యం అంటే అందరి అంగీకారంతో లేక ఎక్కువ మంది అంగీకారంతో అందరూ అమలుపరచాలన్నది. ప్రజాస్వామ్యము సరైనరీతిలో అమలవ్వాలంటే ప్రజల చేతులో నిర్ణయాధికారం, ప్రభుత్వం చేతిలో నిర్వహణాధికారం మాత్రమే ఉండాలి. ఇలా వుండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికైన అధికారులను అవసరమైతే రీకాల్‌, రిఫరెండమ్‌ చేసే అవకాశము ఆయా నియోజక వర్గ ఓటర్లకు వుండాలి.

మన స్ధానిక ప్రభుత్వాలు గ్రామ, మండల, జిల్లా, పంచాయితీలు, మున్సిపాలిటీలు కలుపుకొని గ్రామసభలు-వార్డు సభలు జరిగితేనేగాని నిర్ణయాధికారం ప్రజలదికాదు. దీనినే 73, 74 రాజ్యాంగ సవరణలను అమలు చేయడం అంటున్నాము.

ఎంతవరకు గ్రామసభలు, వార్డు సభలు పూర్తిస్ధాయిలో క్రియశీలం కావో అంతవరకు ప్రజాస్వామ్యం అమలులోనికి రానట్టే. కళ్ళముందు పాలన, పాలనలో పర్యవేక్షణ, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం అన్నవి అమలుకావాలంటే అధికార వికేంద్రీకరణ జరిగితీరాలి.

సంపద ఏ ఒక్కరిదికాదు. గుత్తాధిపత్యం ఉండకూడదు. సంపద వాటాలో ప్రతిఒక్కరికి భాగస్వామ్యముండాలి. ఇదే సామ్యవాదము. పౌరులకు ఈరకమైన అవగాహన కలిగించడం ప్రభుత్వవిధి. భావప్రకటనా స్వేచ్చ ఇవ్వడమంటే సమాచార హక్కు చట్టం అమలు అయినట్లే.

ఈ దేశంలో మానవ వనరులకు కొదవలేదు. కాని 4 గురు కలసి 4 నిమిషాలు పని చేయరు, అన్న విషయాన్ని వివేకానందుడు ఏనాడో చెప్పాడు. ఎవరికన్నా మంచి పేరు వస్తుందనే భయంతో కలసి పని చేయడం మానివేసే వ్యక్తిత్వాలు ఉన్నాయి.

సామాజిక సమస్యలపై పోరాడే వాళ్ళను ఉద్యమకారులంటున్నాము. సామాన్యమానవుడు సమాజం నుండి తనకేమి వస్తుందో చూస్తుంటే ఉద్యమ కారుడు తను సమాజానికి ఏమి ఇవ్వగలనోనని చూస్తుంటాడు. మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. మిమ్ములను మీరు గుర్తించడము వేరు. ఇతరులు మిమ్ములను ఎలా గుర్తించాలో అనుకోవడం వేరు. గుర్తింపుకై పనిచేసేవారు, గుర్తింపుకోరకుండా పని చేసేవారు ఇద్దరూ సామాజికాభ్యుదయం కోరేవారైనా, కలసి పనిచేయడం కంటే నాస్థానం ఏమిటన్న విషయంలో గుర్తింపు కోరేవారు దూరమౌతుంటారు. సమాజం బాగుపడాలన్నతపన గల వ్యక్తులు గుర్తింపు కోరిక నుండి బైటపడతారు.

అవగాహన, సంసిద్ధత, క్రియాశీలత కలిగి వుంటేనే అనుకొన్న పనులు అనుకొన్నట్లు జరుగుతాయి. తప్పు అవగాహన, అసంపూర్ణ అవగాహన అంటే లోప, దోష అవగాహన వుంటే పనిజరగదు. అందుకే ''సమ్యల్‌ జ్ఞాన పూర్వికా సర్వ పురుషార్ధసిద్ధిః'' అన్నారు. కలసిపనిచేయాలనుకొనే వారి మధ్య ఎంపిక చేసికొన్న భావములో సమాన అభిప్రాయం వుండాలి. విచారణలో భిన్నాభిప్రాయాలుండాలి. ఆచరణలో ఏకాభిప్రాయముండాలి.

బాహ్యవత్తిడి నుండి పనిఎంతో కాలం జరగదు. ''స్వతంత్రఃకర్త కార్యకర్త'' అన్నారు. కార్యకర్త అంటే ఆ ఫలానా విషయంలో అవగాహన కలిగినవాణ్ణి, ఇష్టపడే వాణ్ణి, కలిగే లాభనష్టాలునావే అన్న భావన కలిగియున్నవాణ్ణి అని అర్ధము. ఏ ఉద్యమ సంస్ధ చూచినా ఒకటో, రెండో తలకాయలభాగము మిగిలిన అందరూ శరీరంగా ఉంటున్నవారే. ప్రధాన ప్రసంగం చేయాలంటే రాష్ట్ర నాయకులను పిలవవలసిందే అని అనుకొనే వారికి ఆ ఉద్యమం ఇంకా అందలేదని అర్ధము. గౌరవార్ధము రాష్ట్ర నాయకులను పిలవడం వేరు, విషయం చెప్పాలంటే వారే వుండాలి అంటము వేరు. కనుక మీ మీ జిల్లాలలో జరిగే సమావేశాలకు ప్రక్క జిల్లా వారిని ప్రసంగీకులుగా పిలవడము. మీరు ఆ జిల్లాలకు ప్రసంగీకులుగా వెళ్ళడము జరిగితే ఆ జిల్లాల మధ్య పరస్పర అవగాహన పెరగటానికి, మిత్రసాన్నిద్యము పెరగటానికి తద్వారా ఉద్యమాన్ని మరింత వేగంగా ప్రజలలోకి తీసుకొని వెళ్ళటానికి అవకాశాలు మెండుగా వుంటాయి.

ఏ సంస్ధలలో అద్యయన శిక్షణా తరగతుల కొరత వుంటుందో ఆయా సంస్ధలు నెమ్మది నెమ్మదిగా వెనుకబడిపోతుంటాయి. ఉద్యమకారులు ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిన విషయమేమిటంటే తాము ఉద్యమానికి బరువు అవుతున్నామా? ఉద్యమ బరువు తాము మోస్తున్నామా? అని ఉద్యమానికి బరువు అయిన వారి వలన ఆ ఉద్యమంచనిపోతుంది. అలానే సమయసృహ కలిగిన సంస్ధలు అతి తక్కువనే చెప్పాలి. ఉద్యమకారులైన మీరు ఈ మూడు ప్రతిజ్ఞలు చేయగలరేమో చూసుకోండి. అవి 1. సమయపాలన 2. మాటకు కట్టుబడి వుండడం 3. చేస్తానన్న పని మనస్సుపెట్టి చేయడం. మరొకరితో ముడిపడివున్న ఏ పనికైనా ఈ మూడు నియమాలు ప్రాణప్రదమైనవి. ఇవి కష్టసాధ్యమేగాని, అసాధ్యముకాదు. అనవసరమూకాదు. ''సారీ'' సాంప్రదాయం మనకొద్దు. అదొక స్టేటస్‌ సింబల్‌గా, గొప్పవిషయంగా ఫీల్‌ అవుతుంటారు. సారీ చెప్పను అన్న వాగ్ధానము చేసుకోండి బాధ్యత తెలుస్తుంది. బలహీనులు ఏ వాగ్ధానమూ చేసుకోలేరు, ఏ పని చేయలేరు. ఏ పనైనా మొండివారివల్లే అవుతంది. కనుక ఉద్యమకారుడు మొండి తనం కలిగియుండాలి. దాన్ని నడిపించే జ్ఞానం సరైంది అయివుండాలి. సమాజంలోని ''అరిసేకుక్క కరవదు'' ''కరిసేకుక్క అరవదు'' అన్న రెండు ఆలోచనలు తప్పుడివే. ఉద్యమకారుడు ఎంత చెప్పాడో అంతా చేసేవాడైతేనే ఉద్యమ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. ప్రతివాడు నాయకుని స్ధానంలో వుండాలని కోరుకొంటాడు. అలాకోరుకోవడం తప్పుకాదు. కాని ఆస్ధాయికి రావాలంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడకుండా రాలేడు. అనుచర నాయకత్వంపోవాలి. '' సహచర నాయకత్వం రావాలి'' సఫలతకు సూత్రం '' ఎంత పనికి అంతయత్నం''. కొండంత పని గోరంత యత్నం. ఇంకా సఫలత ఎక్కడ? తగిన సమయంలో తగినంత చేయకపోవడం వలన కూడా సఫలత పొందలేము. పనికి సరైన ఫలితం రావాలంటే కొన్ని కారణ సామాగ్రిలు ఉండాలి. అవి కర్త, ఉద్ధేశము, పరికరాలు, విధానము, పని- ఫలితము. కర్త అంటే ఆ ఫలితం కోరేవాడని అతని ఉద్ధేశము స్పష్టత, తీవ్రత కలిగివుండాలి. అలానే పరికరాలు, ఆ పరికరాలు శుద్దము, శక్తివంతమై యుండాలి. అలానే విధానము సరైనది, సమగ్రమైనది అయ్యుంటేనే ఆ పని తగిన (అనుకొన్న) ఫలితాన్నిస్తుంది.

ప్రతి కార్యకర్త త్రిశుద్దులు కలిగివుండాలి. 1. లక్ష్యశుద్ధి 2. చిత్తశుద్ధి 3. డొక్కశుద్ది. లక్ష్యశుద్ధి అంటే గోల్‌ సెట్టింగ్‌ ఏమి తను పొందాలో తెలిసుండాలి, చిత్తశుద్ధి అంటే నిజాయితి కలిగుండాలి. ఉత్యమక్షేత్రాలకు ఊపిరి ఇదే. ఇక డొక్క సుద్ది అంటే సబ్జెక్ట్‌ కలిగివుండాలి. సంస్ధలు నిలబడటానికి దానిలోని కార్యకర్తలు సామాన్య ప్రజల విశ్వసనీయత పొంది వుండాలి. విశ్వసనీయత పొందలేని ఏ సంస్ధ నిలబడలేదు. పైకి రాలేదు. ప్రజల విశ్వసనీయత సంస్ధలకు ప్రాణప్రదమైందని వేరుగా చెప్పనవసరము లేదు. ప్రతిసంస్ధకు ఉపన్యాసకుల కొరత వుంది. అధ్యయన శిక్షణా తరగతుల ద్వారా మాత్రమే ఆ కొరత తీర్చుకోగలుగుతాము.

ఇక సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఉపలక్ష్యాలను (సాధనలను) లక్ష్యాలను పరిశీలిద్దాము. మనం కక్షుణ్ణంగా పరిశీలించినట్లైతే గత 60 సంవత్సరముల నుండి సామాజిక ఉద్యమమే జరగలేదని చెప్పుకోవచ్చు.

1. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సమాచార హక్కుచట్టాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళడమే లక్ష్యంకాదు. అలానే దరఖాస్తులు పెట్టడం మన పనికాదు.

2. సమాచార హక్కు చట్టం మనకొక సాధనము మాత్రమే.

మొదటి థలో ఒక సంవత్సరము సమాచార హక్కు చట్టాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళాలి. ప్రజలు సహచట్టాన్ని ఉపయోగించుకొనేటట్లు చేయడం మన బాధ్యత. నేర్పడం కొరకు మాత్రమే దరఖాస్తులు పెడతాము. మన పని వాళ్ళ పని చేసి పెట్టడంకాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొనేలా అలవాటు చేయడం మాత్రమే. అలానే అధికార యంత్రాంగాన్ని సరిచేయడం. ఆ అధికారులు దరఖాస్తులకు సమయం దాటకుండా సమాచారము ఇచ్చేటట్లు అలవాటుగా మార్చడానికి మాత్రమే దరఖాస్తులు పెడతాము, పెట్టిస్తాము.

సమాచార హక్కుచట్టం ఎవ్వరికీ వ్యతిరేకంకాదు. ఒక్క అవినీతి పరులకు విషయాన్ని మరుగునపెడదామన్న మోసకారులకు తప్ప. ఇది ప్రజల చట్టం ఇలానే ప్రజలకు, సమాజానికి మేలుకూర్చే విద్యా హక్కు చట్టము, బాల్య వివాహ నిరోధ చట్టము, వినియోగదారుల రక్షణ చట్టము లాంటి వాటిని ఉపయోగంలోకి వచ్చేటట్లు కృషి సలపాలి.

ఇక రెండవ థలో గ్రామాభ్యుదయ సంఘాల నిర్మాణం చేయాలి. ప్రతి గ్రామంలో నెట్‌వర్క్‌ వుండాలి. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక జిల్లా కమిటీలు ఎలా ప్రతి (ఎక్కువ) మండలాల ప్రాతినిధ్యంతో ఏర్పాటు చేస్తున్నామో అలానే ప్రతి మండల కమిటి ఆ మండలంలోని అన్ని గ్రామాల ప్రాతినిధ్యంతో ఏర్పరచాలి. ఆ గ్రామ సభ్యులే ఆ గ్రామాభ్యుదయ కర్తలు అవుతారు. ఒక సంవత్సరము లోపల మండల కమిటీలు ఏర్పడేలా లక్ష్యం పెట్టుకోవాలి.

ఇక మూడవథలో గ్రామాభ్యుదయ కార్యకర్తలతో గ్రామకమిటి (సభ్యులు 10కి తగ్గకుండా) ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ సభ్యులు ఆ గ్రామంలోని ప్రతి యింటికి తిరిగి '' మా అధికారం మాకు, మా సొమ్ము మాకు'' ఇచ్చే వారికే ఓటు వేస్తామన్న నినాదం తీసుకొని రాగలగాలి. 2014 సంవత్సరమునకు ప్రజాప్రతినిధులకు రాజ్యాంగము 243, 243ఎ అధికరణము 73, 74 సవరణల చట్టం ప్రకారం స్ధానిక ప్రభుత్వాలకు పూర్తి అధికారాల బదలాయింపు జరుపుతామన్న పార్టీకే తమ ఓటు అన్ననినాదంతో, ఇలాంటి ఎజెండాతో మందుకు వొచ్చిన పార్టినే గెలిపించుకొని ప్రతిగ్రామం తమ అధికారం తాము తమ సొమ్ము తాము పొందడం వలన గ్రామాభ్యుదయం జరగాలి. గ్రామాభ్యుదయం జరగకుండా దేశాభ్యుదయం జరిగినట్టు కాదు. ఇదే మన అంతిమ లక్ష్యం.

మన అంతిమ లక్ష్యం చేరటానికి ఉద్యమకారులను వెతుకు, గమనించు, సమీకరించు, సంఘటిత పరచు, పోరాడు అన్న క్రమంలో ''కలిసిపోదాం కలుపుకుపోదాం, చేయి అందిద్దాం చేయి అందుకొందాం'' అన్న నినాదంతో ఉద్యమాన్ని మరింత మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ముగించారు.

తరువాత ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ నుండి ముఖ్యఅతిధిగా పాల్గొన్న శ్రీ మున్వార్‌ అహ్మద్‌ గారు మాట్టాడుతూ 1964లో అపార్డ్‌ సంస్ధ స్ధాపింపబడిందని ప్రతి సం||రము వేలాదిమందికి గ్రామాభివృద్ధిపై శిక్షణా తరగతులు జరుగుతున్నాయన్నారు. అన్ని జిల్లాల బాధ్యులు ఇలా సమావేశము అవ్వటము తనకి చాలా ఆనందాన్ని కలిగించిందని, తమ అపార్డ్‌ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ గరపటానికి తాము సిద్దమని అన్ని జిల్లాల కార్యకర్తలు తగు విధంగా ఉపయోగించుకోగలరని, అవసరమైతే ప్రాంతాల వారీగా శిక్షణా తరగతులు గడుపుతామని వాగ్ధానము చేస్తూ ముగించారు.

తరువాత వక్తగా డా||వి. బ్రహ్మరెడ్డి గారు మాట్లాడుతూ తన జీవితానుభవాల నుండి తాను నేర్చుకున్న పాఠాలు వివరిస్తాననీ, మాకు ఉపయోగపడే అంశాలుంటే తీసుకోండని అత్యంత విలువైన విషయాలు ప్రస్తావించారు. వారి మాటల్లోనే చూడండి. అందరూ సమాజం బాగుండాలనే కోరుతున్నా ఐకమత్యం లేకపోవడానికి కారణం కొందరు ఫలానా పని చేస్తేనే సమాజం మారుతుందనగా మరికొందరు వారి కిష్టమైన పనిని చెబుతూ దీని వలనే సమాజం మారుతుందంటారు. ఇంకొందరు నాకున్న పరిస్ధితులలో ఈ పనేసరైందనగా ఇంకొందరు వివేకం అంగీకరించిన పని వలనే రాదగిన మార్పు వస్తుందంటారు. నిజంగా ఏ పని చేస్తే సమాజంలో రాదగిన మార్పు వస్తుందో ప్రాక్టీసులో పెట్టి (టెస్ట్‌) పరీక్షించాలి. కాని ఎవ్వరూ పరీక్షకు సిద్దపడడంలేదు. ఏ సంస్థను తన పనులు మానుకొని రమ్మనిపిలవడం లేదు. అందరం కలసి ఒక కార్యక్రమం చేయగలమా? అని చూస్తున్నాము. ఆర్‌.టి.ఐ (స.హ.చట్టం) సాధనంగా అనేక సమస్యలు సమాజాన్నుండి విడిపోతాయి. నాకు అర్ధమైన సమస్య మా సంఘంలోని కొంతమందికి అర్ధం కాకపోతే, అర్ధమైన వాళ్ళతో కలిసి చేసుకొంటూపోవడం చేయవలసినపని. అర్థంకాని వారితో పోరాడుతూపోతూంటే నాశక్తి దానికే సరిపోతుంది. నాసంఘం వాళ్ళు నాశత్రువులుకాదు. పదేపదే చెబుతున్నాను ప్రాక్టీసులో పెట్టి చూడండి మీకే తెలుస్తుందని. అయినా కొంత మంది పట్టించుకోరు.

అద్భుతంగా విషయం చెబితే మారతారా? అని ప్రశ్నించుకుంటే చెబితే కాదు అవతలవారు వింటే, అర్ధమైతే, అంగీకరిస్తే, ఇష్టపడితే, ఖచ్చితంగా చేయాలని నిర్ణయిస్తే, చేస్తే మారతారు. అర్థంకాకపోతే మిగిలిన స్టేజస్‌కు పోరు గనుక అర్థం అయ్యేటట్లు చేయడం మన బాధ్యత. అర్థమైన తరువాతే ఇష్టపడినాడా? లేదా అన్నది.

తరగతుల నిర్వహణలో క్రొత్తవారు పాతవారు కలసి వుంటారు. క్రొత్త వారికి అర్థంకాదు పాతవారికి బోరుకొడుతుంటుంది. ఇది ఒక సమస్య. సాధారణంగా గంటకంటే ఎక్కువ వినలేరు. లేదంటే విషయం (సబ్జెక్ట్‌) మారాలి. కనుకనే విద్యార్ధులకు వివిధ పీరియడ్స్‌లో వివిధ విషయాలు (సబ్జెక్ట్స్‌) క్లాసులు నడుపుతుంటారు. కాని ఆత్మనియంత్రణ కలిగినవారికి చెప్పకలుగుతాం. పిల్లవాళ్లకు మొహం కడగటం అలవాటు చేయాలి. ఆత్మనియంత్రణ కలిగే వరకు బైట నుండి వెంటపడి కడిగించాలి. తరువాత అలవాటు అయితే వాడే చేస్తాడు. ఈ పద్దతిలోనే కార్యకర్తలను తయారుచేసుకోవాలి.

గంటకు ఒక క్లాసు చొప్పున తయారు చేసి చెప్పాము. అయినా ఉత్తీర్ణత పొందలేకపోయామ్‌. అలా కాకుండా మనం చెప్పిన విషయం మరల త్రిప్పి నాకు చెప్పగలిగితేనే ఉపయోగం ఉంటుందన్న దగ్గరకు వచ్చాము. ఎవరుగాని ప్రక్క వాళ్ళతో పోల్చుకోకూడదు. నీకు నువ్వే పోలిక అంటే నీకు నువ్వే కంపేరు చేసుకొని అభివృద్ధి సాధించాలి.

మంచి అభిప్రాయాలు అంది పుచ్చుకోగలగాలి. చాలా మందికి అందాలి. మార్పు చెందించేవాడుగా వుండాలిగాని మంచివాడు అనిపించుకొంటే సరిపోదు. మనం ఆ పని చేయగలమని నమ్మకం కలగకపోతే వాళ్ళు మన వెంటరారు. కనుక మన దగ్గర క్వాలిటి మరియు క్యాంటిటి వుండాలి. మొదట వ్యక్తులను జమచేసుకోవాలి. తరువాత శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ పొందిన తరువాత వారు నా ఎదుట ముందు మాట్లాడాలి. ఈ విధంగా ఉపన్యాస శిక్షణ ఇచ్చి తయారు చేసుకోవాలి.

ఇంత సమయంలో ఇంత మందిని తయారు చేసుకోవాలని జురిళీ పెట్టుకోవాలి. సమయము, సంఖ్య స్పెసిఫిక్‌గా వుండాలి. అది ఎంత పనో కొలుచుకోగలిగి వుండాలి. ఎప్పటి వరకు పూర్తి చేయగలనో నోట్‌ చేసికొని వాస్తవానుగుణ్యత ఉందో లేదో చూచుకోవాలి. 100 మందిని చేర్చగలననుకొంటే 150 మందిని లక్ష్యంగా పెట్టుకోవాలి. లక్ష్యం పెద్దది పెట్టుకోవాలి. అదే సరైన విధానం.

ఊనీలి లీలివీరిదీ గీరిశినీ శినీలి లిదీఖి - మొదట లక్ష్యం స్పష్టంగా పెట్టుకోవాలి. ఉదాహరణకు సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే మొదట స్పష్టంగా సమయము, స్ధలము అనుకోవాలి తరువాత ఎవరెవ్వరిని మాట్లాడించేది చూడాలి. మనం సాధారణంగా వాడుతుంటాం అది 'అయితే' ఈ పని అవుతుంది. అది 'అయితే' పలానాదికాదని 'అయితే' అనే పదము చాలా ప్రమాదకరమైనది. అయితే వుందంటా మనం చెప్పలేమని అర్ధము.

ఏదైనా ఒకటి సాధించాలంటే దాని సాధనలో మన బలాలు, బలహీనతలు, అవకాశాలు భయాలు ఏమిటని ఆలోచించాలి. మొదట బలహీనతలతో మొదలు పెట్టాలి వాటిని బలాల క్రిందికి మార్చుకోగలగాలి. అలానే అవకాశమును బలం క్రిందకి మార్చుకోవాలి. తరువాత భయాలు పోగొట్టుకొని బలం పెంచుకొంటే అనుకొన్నదేదైనా సాధించగలుగుతాము.

అసలు సమాజం కొరకు నేనెందుకు పని చేయాలి? అన్న ప్రశ్నను నా మీద నేను వేసుకొని చూడాలి. ఈ ప్రశ్నను యితరులు మనకు వేస్తే మనలో మార్పురాదు. ఆ ప్రశ్న మన మీద మనం వేసుకొంటే అప్పుతో పుట్టాను ఆ ఋణం తీర్చుకోవాలనో, మన గురించి మనం చూచుకోవడం మాత్రమే తప్పనో, సంఘ జీవిగా అందరి సేవలు పొందే నాకూ చేయాల్సిన బాధ్యత వుందనిపిస్తుంది.

నా వరకు నాకు పెద్ద వాళ్ళను మార్చడం కుదరదనిపించింది. అందుకే కాలేజి, స్కూల్‌ పిల్లలను తీసుకొంటున్నాను. కాలేజీలలోని పిల్లలను మనం ఎలా కావాలో అలా మార్చుకోవొచ్చు. మీడియా మనకు వ్యతిరేకంగా యువతను తయారు చేస్తుంది. స్కూలు పిల్లలు వెంటనే నాయకత్వానికి పనికిరారు. కనుక వెంటనే వీలైనంత త్వరగా నాయకత్వానికి రాగలిగి వినగలిగే వయసు వారిని తీసుకోవాలి. 100కి పది మంది మనం చెప్పేది వినకలిగి అర్థం చేసుకొని అంగీకరించి ఇష్టపడి మారితే చాలు.

కాలేజి పిల్లలకు ఎలా మొదలుపెట్టాలి ఎలా చెప్పాలన్న దగ్గర నాకు ఒక స్కీమ్‌ వుంది. దాని ప్రకారం కాలేజీలకు వెళ్ళి ముందుగా ఆ పిల్లలకు ఉపయోగపడేది చెప్తాను. అంటే వారు బాగుపడేది ఎట్లో అది చెప్తాను. 1. ఇంటర్వ్యూలో ఎలా పాస్‌ (చీబిరీరీ) అవుతారు. 2. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 3. మంచి మానవ సంబంధాలు అనే వాటిని నేర్పుతానంటూ కొన్ని కొన్ని విషయాలు చెబుతాను.

ఉపన్యాసం చివరిలో ''అద్భుతంగా జీవించడం ఎలా'' అన్న విషయంపై 6 గంటలు క్లాసు వుంటుంది మీలో అభిరుచి వున్న వారు పేర్లు ఇవ్వవచ్చునంటూ ముందే నిర్ణయించుకొన్న తేది, స్థల వివరాలు చెబితే కొన్ని పేర్లు వస్తాయి.

ఆ క్లాసు చివరిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మీరు మాట్లాడుతుంటే (రీచీలిలిబీనీ ఇస్తుంటే) వస్తుంది. అది ఈత, కత్తిసామువలె అభ్యాసిక విద్య అని వివరించి మీలో అభిరుచి గలవారికి తరిఫీదు ఇస్తామంటే కొంత మంది తయారౌతారు వాళ్ళను స్కూల్స్‌కు పంపి ఉపన్యాసాలిప్పిస్తూ కార్యకర్తలుగా తయారు చేసుకోవొచ్చు.

అలానే చట్ట సభలు లాంటి బలమైన స్ధానాలలో, అన్ని నియంత్రణ స్ధానాలలో మంచివాళ్ళుండాలి. కనుక రాజకీయాలలోకి మనం పోకపోయినా సరైన వాళ్ళను పంపాలి. మంచి రాజకీయులను తయారు చేసి వాళ్ళను నడుపుతూ వుండాలంటే నడిపించే వారుండాలికదా! కనుక నేను రాజకీయాలలోకి వెళ్ళను.

సంఘాలకు అవి పని చేస్తున్న తీరునుబట్టి కొన్ని రకాలుగా విభజించుకోవొచ్చు. 1. ఉనికిని కాపాడుకునే సంఘాలు 2. సమస్యను ప్రచారం చేసే సంఘాలు 3. సమస్యను పరిష్కరించడానికి పని చేసే సంఘాలని, మొదటి రకం సంఘాలు మీడియాలో మాత్రమే ఉంటాయి. ఏ సంఘాల వెంటనైనా మీడియా పడాలిగాని, మీడియా వెంట సంఘాలు పడకూడదు. జనం సమస్యలు జనం తెలుసుకొనేటట్లు చేయాలి. అలానే పరిష్కరించుకొనేటట్లు మార్గదర్శకం చేయాలిగాని, మనం ఆ సమస్యలు తీర్చుతూ కూర్చోడమంటే కుక్కపనిగాడిద చేసినట్లు.

మానవ స్వభావం ఎలా వుంటుందంటే, కొడుకు చెప్పినట్టు చేస్తూ వుంటే బాగుంటూ వుంటుంది. అతడు ప్రశ్నిస్తుంటే మనకు కోపం వస్తూ వుంటుంది. ప్రశ్న వేస్తుంటేనే అభివృద్ధి చెందుతుంటారు. కనుక ఉద్యమాలలో ప్రశ్నించమనాలి, ప్రశ్నించడం నేర్పాలి.

ఒక సంవత్సరము తరువాత మనం స.హ.చట్టం పై పని చేయకపోయినా అది నడుస్తూనే వుండాలి. అదే మన ఎచీవ్‌మెంట్‌. మంచి మానవ సంబంధాలు నెరుపుతూ మనిషిని మార్చగలంగాని, పిర్యాదులు చేసి మనిషిని మార్చలేమని గుర్తుంచుకోవాలి. తన లాంటి వారిని తయారు చేయడమే ఉద్యమకారునికి అత్యుత్తమమైన పని. 10 సంవత్సరములు అవిశ్రాంతిగా పని చేసి విద్యార్ధులను కార్యకర్తలుగా మార్చుకోగలిగానంటే 10 సంవత్సరముల అనంతరం డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, రాజకీయ నాయకులుగా మారిన ఈ విద్యార్ధులే ఉద్యమానికి కార్యకర్తలుగా వుంటారు. తద్వారా నియంత్రణ స్థానాల్లోకి మంచి వారిని పంపేవారిగా, మంచి వారినే కొనసాగించేవారుగా మనం వుంటూ మన అంతిమ లక్ష్యమైన దేశాభ్యుదయాన్ని పొందవచ్చు అంటూ ముగించారు.

కార్యక్రమ కొనసాగింపులో శ్రీ కన్నెబోయిన అంజయ్య, శ్రీ శంకర శివరావు, మోషేగార్లు సమాచార హక్కు చట్టంపై పాటలు పాడి సభను అలరించారు.

తరువాతవక్తగా యమ్‌. వి.ఎఫ్‌. సంస్ధ బాధ్యులైన రాజేంద్రప్రసాద్‌గారు మాట్లాడుతూ గత 20 సంవత్సరముల నుండి బాలకార్మిక నిర్మూలన, విద్య పై ఆధారపడి వున్న వ్యక్తి సాధికారితను సాధించుటకై 5 సంవత్సరముల నుండి పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి పని చేయకూడదన్న విషయంపై తమ సంస్ధ పని చేస్తుందని వివరించారు. అలానే పిల్లలు రాత్రిపూట చదువకోవడం కాదు బళ్ళో మాత్రమే పగటి పూట చదువుకోవాలన్న అంశం పై ఉద్యమించి రాత్రి బడులు మూయించామన్నారు.

సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక కార్యక్రమాలతో తమ కార్యక్రమాలు ముడిపడి వున్నాయని అర్థమైంది. గనుక కలసి పని చేస్తున్నామన్నారు. ఈ ఐక్యవేదిక సాధనంగా గ్రామ స్వరాజ్యం చూడాలనుకొన్నామన్నారు. కనుక లక్ష్య సాధన కొరకు ఏకలక్ష్యంతో ఏక నాయకత్వం క్రింద పటిష్టమైన నిర్మాణంతో పని చేయటానికి సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ఉందని భావించడం వలన దానితో కలసి పని చేయగలుగుతున్నామన్నారు.

వేదిక ప్రజలలో విశ్వసనీయత సాధించుటే ముఖ్య కార్యక్రమమని, అది జరిగితే అన్నీ జరిగినట్లే, అది జరగకుండా ఏమీ జరిగినట్లు కాదన్న భావనను తెలియజేస్తూ వేదిక ప్రజలలో విశ్వసనీయత సాధిస్తుందని ఆశిస్తున్నానంటూ ముగించారు.

తరువాత వక్తగా బాలగంగాధర్‌గారు మాట్లాడుతూ 2005 నవంబరులో ష్ట్రఊ| మీద పూనాలో జరిగిన సమావేశాలకు లోక్‌సత్తా తరపున హాజరైనామన్నారు. స.హ చట్టానికి వచ్చిన విలువ గత 63 సంవత్సరములలో ఏ చట్టానికి రాలేదన్నారు. గ్రామస్వరాజ్యం సాధించటానికి గ్రామాల వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళాలన్నారు. నీవు ఏమి కాదలుచుకొన్నావో ఒక 'కల'గని దాన్ని పొందటానికి ఆక్షణం నుండి ప్రయత్నించమనే అబ్దుల్‌కలామ్‌ గారిని గుర్తు చేస్తూ 20 సం||ముల తరువాత కలంటూ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సాధించిన విజయం వలన మనం హాయిగా వున్నామని ప్రజలందరూ తలపోస్తున్నారని కలగని ఆ కల నిజం కొఱకు ఈ రోజు నుండి కృషి చేద్దామన్నారు. కంటికి దూరమైతే కాలికి దూరమౌతుందా అన్న పెద్దల మాటలను గుర్తు చేస్తూ మనమే దాని దగ్గరకు వెళ్ళాలి. అడుగులు వేస్తుంటే లక్ష్యం దగ్గరవుతూ వుంటుందని అలా అడుగులు వేయాలని కోరుతూ శెలవు తీసుకొన్నారు.

తరువాత వక్తగా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రామకృష్ణరాజుగారు మాట్లాడుతూ స్వామి వివేకానంద కోడ్‌ చేసిన సూక్తిని వినిపించారు. వఊనీళిరీలి గీనీళి ఖిళి దీళిశి జిరిఖీలి తీళిజీ ళిశినీలిజీరీ బిజీలి ఈలిబిఖి శినీబిదీ బిజిరిఖీలివ ఇతరుల గురించి జీవించనివారు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమన్నారు. గ్రామంలో ఎవ్వరైనా తిండి లేక చనిపోయారంటే అది ఆ గ్రామంలో తిండి గింజలు లేక కాదు ఆ గ్రామస్తులను హృదయము లేనివారని అర్థమని గుర్తుచేస్తూ తాము విద్యా విషయంలో ఆర్థికంగా సహాయపడి అమెరికాకు పంపిన విద్యార్ధినిని గుర్తు చేసుకొంటూ ఆ మహిళ ఈ రోజు బాగా సంపాదించి ఎవ్వరికైనా సహాయ పడగలదానిగా ఎదగటాన్ని వివరించారు. అలానే ఒక ప్రకటన కూడా చేశారు. ''అరవింద్‌ కెజరివాల్‌ గారి పబ్లిక్‌ కాజ్‌ రేసెస్‌ ఫౌండేషన్‌ మరియు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సంయుక్త నిర్వహణలో స.హ.చట్టము పై పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమము చేపట్టామని, అది ది. 6.11.10 ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు రామానుజాచార్య హాల్‌, మొదటి అంతస్తు, మహేశ్వరీ కాంప్లెక్స్‌, మాసబ్‌ ట్యాంక్‌ వద్ద జరుగుతుందని స.హ చట్టం పై కంప్లెంట్స్‌ని చర్చించవొచ్చని తెలియపరిస్తూ ముగించారు.

తరువాత వక్తగా సత్యాన్వేషణ మండలి అధ్యకక్షులు వెంకట్రామయ్య గారు మాట్లాడుతూ సమాజ పునర్‌ నిర్మాణమేధ్యేయంగా ఈ ఉద్యమం మొదలైందన్నారు. రాజ్యాంగములో విలువైన సూత్రీకరణలున్నా అమలులో అనేక కష్టనష్టాలను భరిస్తున్నామన్నారు. రాజకీయం అంటే నిర్వచనం మారిందని సీట్లకే పరిమితమైన థ ఏర్పడిందన్నారు. సమాజహితము జరగాలంటే వ్యక్తి నిర్మాణము జరిపి కీలకస్థానాలలోకి అలాంటి మంచి వారు పంపబడాలన్నారు. స.హ చట్టాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్ధానిక ప్రభుత్వాలకు అధికారాల బదలాయింపు జరపాలని 2014కు గ్రామాలను ఆ డిమాండ్‌ చేసే థకు పట్టుకు రావాలన్నారు. సమాజం సంస్కరింపబడాలంటే ముందు నీవు సంస్కరింపబడాలి. సంస్కరించుకోవాలి ప్రతి వారు తన్ను తాను సంస్కరించుకోవాలని కోరుతూ విరమిస్తూన్నానన్నారు.

తరువాత జెవివి బాధ్యులు జంపా క్రిష్ణ కిషోర్‌గారు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కమిటిని సభకు పరిచయం చేశారు.

తరువాత సమావేశ అధ్యకక్షులైన వెంకట్రామయ్య గారి కోరికపై సర్వోదయ ప్రసాద్‌గారు తమ సందేశాన్నిస్తూ, తమ సర్వోదయ సంస్థ, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికతో కలసి పని చేయడానికి తమ అధ్యకక్షులైన సుబ్బారావు గారు కూడా అంగీకరించినందున తమ పూర్తి శక్తియుక్తులు వేదికకు ఉపయోగించి పని చేస్తామని వాగ్ధానం చేశారు. అలానే ఆ రాత్రి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో సభికుల కోరికపై సర్వోదయ సంస్ధ గురించి దాని కార్యక్రమాల గురించి వివరించి ఆహుతులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

వేదిక పై నున్న రాష్ట్ర నాయకుల ప్రసంగాలు ముగించిననంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధ్యులను తమ సలహాలను, అనుభవాలను వివరించండని కోరగా కొన్ని జిల్లాల బాధ్యులు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు క్లుప్తంగా తెలియపరుస్తున్నాము.

మూర్తిగారు (పశ్చిమ గోదావరి జిల్లా) మాట్లాడుతూ మార్పుకోసం పని చేసే వారితో కలసి పని చేస్తుంటానన్నారు. గునపాన్ని అరగతీస్తూ సూదిని చేయాలన్న ఆ కాంక్షతో పని చేస్తున్న ముసలమ్మ కథను చెప్పి సభను ఉత్తేజపరిచారు. పని ఎంతటి పెద్దదైనా మనం చేస్తూపోతుంటే మన తరువాత తరాల వారైన ఫలితాలు పొందుతారన్న నమ్మకాన్ని కలిగించారు.

రామకృష్ణా రెడ్డి (కర్నూలుజిల్లా) మాట్లాడుతూ నేను నా మాటవింటున్నానా? నేనే నా మాట విననప్పుడు ఎదుటవారు ఎందుకువినాలి అని ప్రశ్నించుకొంటూ ప్రతివారు తామన్నమాటకు కట్టుబడి నిలవాలన్నారు. సమయపాలన, అన్నమాటకు నిలబడడం, చేస్తానన్న పని మనస్సు పెట్టి చేయడం నవ్వుతూ చేయాలన్నారు. ఏడుస్తూ చేయకూడదంటూ గ్రామ ప్రాంతాలలోకి గ్రూపులుగా పోవడం మంచిదన్న సూచన మరియు నా స్వప్రయోజనాలకాన్నా సంస్ధ ప్రయోజనాలే మిన్న అన్న భావనే సరైందని తెలియజేస్తూ ముగించారు.

స్వర్ణ ప్రసాద్‌ (కడపజిల్లా) కార్యక్రమాలు హృదయపూర్వకంగా జరగాలి, యాంత్రికంగా కాదన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావంతో అంతిమ లక్ష్యం అయిన గ్రామాభ్యుదయం పొందగలమన్నారు. కలసిపోదాం, కలుపుకుపోదాం, చేయి అందిద్దాం, చేయి అందుకొందాం అంటూ '' అతడు ప్రమాణం చేయగా నష్టము వాటిల్లినను మాట తప్పడు'' అన్న బైబిల్‌ వాక్యంతో ముగించారు.

నర్శింహులు (రంగారెడ్డి జిల్లా) మిగతా సంస్థలను ఎలా కలుపుకొని పోవాలన్నది ఈ సమావేశంలో తెలుసుకొన్నామన్నారు. తమ 18 మండలాలలో 461 గ్రామాలున్నాయని రాష్ట్ర కమిటి నుండి వచ్చి పార్టిసిపేషన్‌ చేస్తూ వుంటే బాగుంటుందన్నారు.

టి.వి. భాస్కర్‌ (గుంటూరు జిల్లా) మనం చేయవలసిన పని మన చేతిలోనే వుంటుందంటూ టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు, ప్యాకెట్‌ క్యాలెండర్స్‌, ఆర్‌.టి.ఐ వెబ్‌సైట్‌లో తెలుగులో ఏర్పాటు చేయాలని, సినిమా ధియేటర్స్‌లో స్లయిడ్స్‌ రూపంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవొచ్చన్న సూచనచేశారు.

జి. వెంకటేష్‌ (రంగారెడ్డి జిల్లా) అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానన్నారు.

శోభానాయుడు (అనంతపురం జిల్లా) హక్కులకై పోరాడు బాధ్యతకై నిలబడు అన్న నినాదముతో ముందు కెళుతున్నానన్నారు. కర్నూలు జిల్లా బాధ్యులు తమకు తెలిసిన అనంతపురం జిల్లా అడ్రసులు ఇస్తే వారిని కలుపుకొని అనంతపురం జిల్లా కమిటి నిర్మాణము చేస్తామన్నారు. చీళిబీదిలిశి క్యాలెండర్లు మరింత ఉపయోగపడతాయన్నారు.

సత్యన్నారాయణ రెడ్డి (నిజామాబాద్‌ జిల్లా) ఎన్‌.జి.వోలతో పని చేయించుకొనేటప్పుడు వాళ్ళ వెనుకటి స్ధితి (ఔబిబీది వీజీళితిదీఖి) గమనించాలన్నారు. కేవలం ఆర్ధిక ఇబ్బందులే సమాజంలోకి వెళ్ళటానికి ఇబ్బంది అయితే వారికి తగిన విధముగా సహాయపడగలగాలన్నారు.

కోట ప్రసాద్‌ (కృష్ణాజిల్లా) ఉద్యమంలోకి యువతను చేర్చుకునే క్రమంలో కాలేజీలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొంటే బాగుంటుందన్నారు. కమిటిలో బాధ్యత తీసుకొని పనిచేయని వారిని ఎలా కంట్రోల్‌ చేయగలమో సూచించమన్నారు.

శంకర శివరావు (అనంతపురం జిల్లా) ప్రజలలోకి ఎలా వెళతారు? ప్రజలను ఎలా ఆకట్టుకొంటారు? కళాబృందాలు వెళ్ళిన తరువాత మనం గ్రామాలలోకి పోవాలన్న సూచన చేశారు.

వాసుదేవరావు (నిజామాబాద్‌) జిల్లా ప్రధాన బాధ్యులకు, రాష్ట్ర నాయకులకు సెల్‌ఫోన్‌ సంబంధాలు వుంటే బాగుంటుందన్నారు. ప్రచారం చాలా అవసరమన్నారు. స్టిక్కర్ల్‌లో సెల్‌ నెంబర్లు వుంచి అతికించడము వలన మరింత ప్రయోజనముంటుందన్నారు. అలానే యిమెయిల్‌ ఐడి వుంటే అందరకు అన్ని విషయాలు వెంటనే తెలుస్తాయన్నారు.

హనుమంతరావు గారు (ఖమ్మంజిల్లా) యీ సమావేశము వలన అనేక విషయాలపై క్లారిటి పెరిగిందన్నారు. రాష్ట్ర నిర్ణయాల ప్రకారం మా జిల్లాలో అమలు పరుస్తామన్నారు. నాయకత్వం నమ్మకం కలిగిస్తూ వుంటే ఉద్యమాలు మరింత ముందుకు నడుస్తాయన్నారు.

చివరగా శ్రీ పుట్టా సురేంద్రబాబు మాట్లాడుతూ ఉద్యమాలు మానవ వనరులు, ఆర్ధిక వనరులు లేకపోతే మూలపడతాయి. ఆర్ధిక వనరులు సరిపడినంతలేవు. మానవ వనరులు ఫరవాలేదు. ఉద్యమాలలో ఉన్న మనమే ఆర్ధిక వనరులు సమకూర్చొకొందామనుకొన్నాం అంటూ కొన్ని జిల్లాల బాధ్యతలు, ఆర్థిక పరంగా చూడగలమని వాగ్థానం చేసిన వారి పేర్లను వివరించారు. ఇంకా ఎవరైనా ఇలా జిల్లా పేరెంట్‌రోల్‌ పాత్ర పోషించే వారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మెదర్‌ జిల్లా వేదకుమార్‌ గారు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రప్రసాద్‌గారు, ప్రకాశంజిల్లా డా|| నాగేశ్వరరావుగారు, కర్నూలుజిల్లా డా|| వి. బ్రహ్మారెడ్డిగారు, చిత్తూరుజిల్లా సోమ్‌ప్రకాష్‌గారు, ఒంగోలు ప్రాంతానికి మాధవి, శ్రీనివాస్‌గార్లు వాగ్ధానం చేసియున్నారన్నారు. ఉద్యమ క్షేత్రాలు కొన్ని మెలకువలు అంటూ కొన్నిటిని సూచించారు.

1. మీరు సమావేశం ఏర్పాటు చేసినా, మీరు సమావేశానికి వెళ్ళినా సభామర్యాదలు పాటించండి, పాటింపజేయండి.

2. భావజాల పరమైన విలువైన సమావేశాలకు పుస్తకము, కలము లేకుండా వెళ్ళవద్దు.

3. మనమే ఏర్పాటు చేస్తున్న సమావేశం అయితే వచ్చినవారు వ్రాసుకోటానికి జాగ్రత్తలు వహించండి.

4. ముఖ్యమైన సమావేశాలకు వెళ్ళేటప్పుడు వేరువేరు పనులతో ముడి పెట్టుకొనిపోవద్దు.

5. ప్రసంగీకునిగా వుంటే మీ కిచ్చిన సమయానికి హాజరుకావాలి. వక్త స్థానంలో వుంటే కేటాయించిన సమయం మించి మాట్లాడరాదు.

6. సమావేశంలో శ్రోతలు తమలో తాము మాట్లాడడం వక్తను అవమానపరచడమే.

7. ప్రశ్నించమంటే ఉపన్యసించవొద్దు (ప్రశ్నించడమంటే ఉపన్యసించడంకాదు)

8. సమావేశం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడవద్దు. ఇతరులను మాట్లాడనీయవద్దు.

9. ఉత్తమస్ధాయి ఉద్యమకారుడు నిరంతరం తెలుసుకొంటానికి తెలపటానికి సిద్ధంగా వుంటాడు.

10. ఉద్యమ కార్యం చేసినందుకు ప్రతిఫలం ఆశించడం మంచిదికాదు.

అదనపు పరిచయాలతో కలసి మండల కమిటీ నిర్మాణాలు జరుగుతూ వుండాలి. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రథమ వార్షిక సమీక్షా సమావేశాలు జనవరి 30, 31 తేదీలలో సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయం దోరకుంటలో జరుగుతాయి. అపార్టులో జరుగు శిక్షణా తరగతులకు ప్రతి జిల్లా నుండి ప్రధమ విడతగా 10 మంది హాజరు అయ్యేటట్లు ఆయా జిల్లాల బాధ్యులు బాధ్యత వహించాలి. అలానే తరువాయి విడతలలో 50 మందిని ఆయా జిల్లాల నుండి శిక్షణా తరగతులకు పంపటానికి సిద్ధము చేసికొని వుండాల్సిందిగా కోరటం జరిగింది.

సమవేశం చివరలో భవిష్యత్‌ కార్యాచరణ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి.

ఎ) 1. కమిటీలు ఏర్పడని జిల్లాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టి కమిటీల ఏర్పాటుకు కృషిచేయాలి.

2. 13,14 తేదీలలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో మరియు 27, 28 తేదీలలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సన్నాహక సమావేశాలు జరపాలి.

3. నవంబరు ఆఖరి లోగా హైదరాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, చిత్తూరు, అనంతపురములలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలి.

4. నవంబరు 18 నుండి 22 వరకు ప్రధమ విడత శిక్షకులకు శిక్షణా తరగతులు రాజేంద్ర నగర్‌, అపార్డు కేంద్రంలో జరుగుతాయి.

5. హైదరాబాదులో ఐక్యవేదిక ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలి.

6. ఆర్థికపరమైన లావాదేవీల కొరకు బ్యాంకు ఖాతా తెరవాలి.

బి) 1. సమాచార హక్కు చట్టపు అమలుకు అత్యంత కీలకమైన కమీషనర్ల నియామకం గురించి ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు, శాసన సభకు చట్టం అంగీకరిస్తున్న రీతిలో 1+10 కమీషనర్ల నియామకం చేయాల్సిందేనంటూ అన్ని జిల్లాల నుండి మిత్ర సంఘాలు లేఖలు వ్రాయాలి. వ్రాయించాలి.

2. జిల్లా కమిటీలు తమ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో 4(1), 4(1)బిలు అమలు విషయంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న విషయంపై సమాచారాన్ని కోరుతూ దరఖాస్తులు పెట్టడం, పెట్టించడం చెయ్యాలి.

3. రాష్ట్ర కమిటీ వీలయినంత త్వరగా రాష్ట్రం మొత్తానికి వర్తించే సమాచార హక్కు చట్ట వినియోగ ఉద్యమ ప్రణాళికను రూపొందించి రాష్ట్రమంతటా కార్యాచరణను ఆరంభించాలి.

4. ఆర్థిక వనరుల సవిూకరణకై సమిష్టిగా ఏజిల్లా కా జిల్లా బృందాలు గట్టిగా కృషిచేయాలి.

ఎ) 12 నెలల పాటు నెలకింత చొప్పున ఇవ్వగల వాళ్ళను గుర్తించి నిధిని సేకరించాలి.

బి) 100, 500, 1000, 10000, 50000, 1,00,000 అన్న మొత్తంలో ఇవ్వగల వారి నుండి పై నిధి సేకరణ జరగాలి.

సి) జిల్లాకు వేయికి తగ్గకుండా సభ్యత్వం చేర్పించాలనే లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

5. జిల్లాకు తొలి థలో 10 మందిని, మలి థలో 50 మందిని ఆపైన ఎప్పటికప్పుడు లభించినంత మందిని శిక్షణకై సిద్ధం చెయ్యటం ఉద్యమ సఫలతకు కీలకమైన అంశంగా గుర్తించడం జరిగింది.

6. జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. దానితోపాటు సభ్యులంతా తమ ఇళ్ళకి సమాచార హక్కు చట్ట ప్రచార ఐక్యవేదిక బోర్డులు పెట్టుకోవాలి.

7. ఐక్య వేదికకు తక్షణం ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసుకోవాలన్న నిర్ణయం జరిగింది.

గమనికలు : 1. సమాచార హక్కు చట్ట ప్రచార ఐక్యవేదిక రిజిష్టర్‌ చేయటం జరిగింది.

2. ఐక్య వేదిక తరపున 10 పాటలతో ఉద్యమ గీతాల సి.డి.ని ఏర్పాటు చేశాము.

3. 2011 జనవరి 30, 31న ఐక్య వేదిక ప్రధమ వార్షిక సమావేశం జరుపుకోవాలి.

4. ఆ నాటికి వీలైనన్ని మండల కమిటీలు, పట్టణ కమిటీలు ఏర్పడాలి.

5. సమాచార హక్కు చట్ట వినియోగంలో తగినంత అభివృద్ధిని సాధించాలి.

6. ఒక వెయ్యి మందికి శిక్షణా తరగతులు పూర్తిచెయ్యాలి.

రిపోర్టర్‌

కోట ప్రసాదశివరావు

(సత్యాన్వేషణ మండలి ప్రధానకార్యదర్శి)

2 comments: