సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా వారీ కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు, కొవ్వూరు, తాళ్ళపూడి మండలాల్లో అవగాహన సదస్సులు డిసెంబర్ నెలలో వరుసగా 22, 23, 24 వ తేదీలలో మండల పరిషత్ కార్యాలయాల సమావేశపు హాలులో జరిగినవి. ఈ మూడు సమావేశాలు జిల్లా అధ్యకక్షులు శ్రీ తోటకూర కృష్ణమూర్తి రాజుగారు, మహిళా అధ్యకక్షురాలు శ్రీమతి కొండా నిర్మల గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఉండ్రాజవరం వాస్తవ్యులు శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు తమవంతు సహకారం అందించారు. ప్రధానవక్తగా గుంటూరుజిల్లా ఐక్యవేదిక శాఖ కోశాధికారియైన శ్రీ యర్రం శెట్టి జగన్‌మోహనరావుగారు ఐక్యవేదికను పరిచయం చేస్తూ రాజ్యాంగం మరియు స.హ.చట్టంలోని ముఖ్యమైన అంశాలు వివరించి, సమష్టిగా ఉద్యమించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు. ప్రతిచోట సమావేశానికి 25 నుండి 30 మంది సభ్యులు హాజరవటం జరిగింది. ఈ సమావేశాలకు హాజరయిన సామాజిక సృహ కలిగిన పలువురు తమ వంతు సహకారాన్ని అందచేస్తామని, వారి వారి గ్రామాల్లో కూడా స.హ.చట్టం ఆవశ్యకతను, 73, 74 రాజ్యాంగ సవరణల ప్రాధాన్యతను వివరిస్తామని వాగ్ధానం చేశారు. ఆ విధంగా వాగ్ధానం చేసిన వారిలో 22 వ తారీకు జరిగిన నిడదవోలు మండల సమావేశంలో పిల్లా వెంకట సత్తారాజుగారు, వి.వి సత్యనారాయణగారు, బండారు వెంకటరామారావుగార్లు ఉన్నారు. ఈనాడు ముందడుగు తరపున ఆకారపు శ్రీనివాస్‌గారు హాజరై, స.హ.చట్టం సాధించిన విజయాలు చెప్పారు. వెంకట సత్తిరాజుగారు ఈ చట్టం పశ్చిమ బెంగాల్లో, కేరళలో సమర్ధవంతంగా అమలు అవుతున్నదని మనం దీన్ని ఎంతగా ఉపయోగించుకొంటే అంత ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
23వ తారీకు జరిగిన కొవ్వూరు మండల అవగాహన సదస్సుకు వచ్చిన ప్రముఖుల్లో శ్రీ తలగల రామారావు, శ్రీ కె. బుజ్జిబాబు ఉండ్రాజవరం ఉపాధ్యాయులు శ్రీ పి. సాంబశివరావు, శ్రీ జి. వెంకటేశ్వరరావులు ఉన్నారు.
24వ తారీకున జరిగిన తాళ్ళపైడి మండల అవగాహన సదస్సుకు వచ్చిన ప్రముఖులలో ఎం. రామారావు, మద్దుకూరి శ్రీనివాసరావు, ఎల్.వి రామకృష్ణ, మల్లిపూడి జార్జి, నాగేశ్వరరావులు ఉన్నారు.
మరలా అవగాహన సదస్సులు పిబ్రవరి మొదటివారంలో జరపగలమని జిల్లా అధ్యకక్షులు తోటకూర క్రిష్ణమూర్తిరాజుగారు తెలిపారు.
ఉద్యమ మిత్రులారా!
సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక కృష్ణాజిల్లా కమిటీ జనవరి ది. 10.1.12 నుండి ది.13.1.12 వరకు కృష్ణాజిల్లాలోని 4 మండలాల్లో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక అవగాహన సదస్సులు నిర్వహించింది. వివరాల్లోకి వెళితే...
జనవరి ది.2.1.12 నుండి. 9.1.12 వరకు కృష్ణాజిల్లాకమిటి వీరులపాడు, కంచికచర్ల, చందర్లపాడు, నందిగామ మండలాల్లోని 92 గ్రామాల్లో పర్యటించి ఆ 4 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ గ్రామ పర్యటనలో ప్రకాశం జిల్లా నుండి ఎం. మాధవి, నటుకుల శ్రీనివాసరావు గార్లు మరియు గుంటురుజిల్లా నుండి పెరికెల మోషే మరియు పశ్చిమగోదావరి నుండి జ్యోతిలు పాల్గొన్నారు.
ముందుగా ది. 10.1.12న వీరుల పాడు మండల అవగాహన సదస్సు కొణాతాల పల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో జరిగింది. దీనికి షుమారు 50 మంది వరకు హాజరు అయినారు. తుఫాను వాతావరణం వలన కేవలం 5,6 గ్రామాలు ప్రాతినిధ్యము మాత్రమే లభించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యకక్షులు పుట్టా సురేంద్ర బాబు గారు విచ్చేయగా కృష్ణాజిల్లా నుండి నేను, సాయిబాబ, విజయలక్ష్మి, సదాలక్ష్మి గార్లు హాజరైనాము. పశ్చిమ గోదావరి జిల్లా నుండి తోటకూర క్రిష్ణమూర్తి రాజుగారు, గుంటూరు జిల్లా నుండి వై. జగన్‌మోహనరావు, శీలం నాగర్జునగార్లు హాజరైనారు. గొట్టిపాటి శ్రీనివాసరావు గొట్టిముక్కలవారు ఈ సభకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
రెండవ రోజు ది. 11.1.12న కంచికచర్ల మండల అవగాహన సదస్సు కంచికర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సదస్సుకు షుమారు 40 మంది వరకు హాజరైనారు. తుఫాను వాతావరణం వలన దీనికి కూడా 6 గ్రామాల కంటే ఎక్కువ ప్రతినిధులు రాలేదు. ఆమర్ల వెంకటేశ్వరరావు గొట్టిముక్కల వారు సభకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
మూడవ రోజు 12.1.12న చందర్లపాడు మండల అవగాహనా సదస్సు చందర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి 11 గ్రామాల నుండి షుమారు 35 మంది వరకు హాజరుఅయినారు. సమావేశానంతరం ఎక్కువ మంది శిక్షణా తరగతులకు హాజరు కాగలమని పేర్లు ఇచ్చారు. కోనంగి శ్రీనివాసరావు, చందర్లపాడు వారు ఈ సభకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
చివరిగా ది. 13.1.12న నందిగామ మండల అవగాహనా సదస్సు నందిగామ ఎన్.జి.వో హామ్‌లో జరిగింది. ఈ సమావేశానికి 7,8 గ్రామాల నుండి షుమారు 80, 90 మంది హాజరయినారు. ఈ అన్ని సమావేశాలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యకక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబుగారు పాల్గొని సభకు లోతైన అవగాహన కలిగించారు. కురగంటి హనుమంతరావు, కీిసర వారు ఈ సభకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రకాశం జిల్లాలో అవగాహనా సదస్సులు డిశంబరులో 2 మండలాలలో జరిపించాలనుకున్నాం.
మొదటి అవగాహనా సదస్సు మార్కాపురంలో 45 మందితో 9 గ్రామాల ప్రాతినిద్యంతో శ్రీ నటుకుల శ్రీనివాసరావుగారి ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. అలాగే రెండవ అవగాహనా సదస్సు అర్ధవీడు మండలంలో 60 మందితో 6,7 గ్రామాల ప్రాతినిధ్యంతో జరిగింది. ఈ రెండు సమావేశాలలో శ్రీ నటుకుల శ్రీనివాసరావుగారు సభికులకు లోతైన అవగాహన కలిగించారు. అలానే దేవరాజు గట్టు గ్రామంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌లో మాట్లాడి 200 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు.
రిపోర్టర్ : కోట ప్రసాద శివరావు (కృష్ణాజిల్లా ప్రధానకార్యదర్శి)
No comments:
Post a Comment