Sunday, December 1, 1991

ప్రమాణ వివేచన -1

 సంపుటి-1                                    సంచిక-10                                            1-12-91.
మానవ జీవన యానానికి చుక్కాని వంటిదగు జ్ఞానాన్నీ, జ్ఞాన సాధనలనూ గురించి వివరించేముందు దానికి చెందిన గతాన్ని స్మరించడం, అధవా పూర్వీకుల ధోరణులను గూర్చి పాఠకులకు కనీసంగానైనా పరిచయం చేయడం సందర్భో చితంగా ఉండ గలదు.
ప్రమాణ వివేచన అన్నది వాస్తవంగా, శరీరంలోనే  సహజంగా నిర్మితమై యున్ప ఆయా జ్ఞాన పరికరాలనూ, వాటి పనుల తీరు తెన్నులనూ సమగ్రంగా అవగాహన చేసికోవడమే ఐయున్నది. దానితో పాటే సహజంగానే ఏర్పడి మొత్తం -జ్ఞాన ప్రక్రియలో అంతర్భూతంగానే ఉన్న విచక్షణా శక్తి, దానికాధారమైన హేతురూపజ్ఞానమూ వాటి తీరు తెన్నులూ క్రూడా అర్థం చేసికోవలసి యున్నది. ఈభావాలనే నేను ప్రమాణ వివేచన-తర్కవిద్య- అన్న పేరున తెలియజేస్తున్నాను. వీటినే మరోలానూ చెప్పుకోవచ్చు.
వాటి వాటి క్షేత్రాలలోని విషయాలను ఆయా ఇంద్రియాలు స్వీకరించి, మెదడుకు పంపడంద్వారా అనుభవ రూపాన్ని పొంది తెలివిచే గ్రహింపబడి, విశ్లేషించబడి నిశ్చయరూపాన్ని పొందుతున్నాయి. అంటే జ్ఞానేం ద్రియాలు పని చేయడమూ, తద్వారా అందిన సమాచారాన్ని పూర్వానుభవ సామర్థ్యంతో విచారించి నిర్ణయించు కోవడమూ నన్నది,  తలలో జరుగుచున్న కార్య క్రమ మన్నమాట. ఈక్రమంలో(!) ఇంద్రియార్థ సన్నికర్ష, (2) అనుభవమూ, తద్గ్రహణా, (8) గతజ్ఞానంతో సరిచూసుకుని ఒక నిర్ణయానికి రావడమూ (4) అదిన్నీ  స్మృతిరూపంగా నిక్షిప్తం చేయబడి వర్తమాన, భవిష్య జీవితాలను నడుపు వివేకరూపంగా-బుద్ధిశక్తిగా-ఉండడమూ జరుగుతోంది. ఈ బుద్ధి శక్తి స్వాభావికింగానే హేతుబద్ధత కలిగి ఉంది.
                ఎట్లు విషయగ్రహణా, హేతుబద్ధతా అన్న రెండూ, శరీరంలో స్వాభావికంగానే ఏర్పడి యున్నవో అట్లే ప్రస్తుతాంశమైన ప్రమాణ వివేచనలోనున్నూ ప్రమాణములూ , తర్కమూ కూడా విడదీయరానివిగానే ఉన్నాయి. తర్కశాస్త్రం(తర్కం)పై  ఒక విపరీత భావన బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందుచే జిజ్ఞాసువు తేన పాఠకులలోనూ అట్లే ఏర్పడి యుండుటకు వీలున్న ఆ దోష దృష్టిని పోగొట్టిన పిదపనే అసలు విషయాన్నివారి వారి పరీశీలనలకు అందించడం సర్వదా
2
సమీచీనమూ,, శేయస్క_రమూ కాగలదు. కనుకనే ఈ విషయం ముందుగా చెప్చవలసి వచ్చింది. మీరందరూ ముందీ విషయాన్ని చక్కగా అర్థం చేసికోవలసి ఉంటుంది
జ్ఞానేంద్రియ వ్యాపారంలో బుద్ధికున్న స్థానమే, విషయ పరిశీలనలో తర్కానికి ఉంది.తర్కాన్ని విడచి పరిశీలించడమంటే బుద్ధిని విడచి జ్ఞానార్థన చేయడం వంటిదే ఔతుంది. అయితే తర్కం ప్రస్తుతం రెండురూపాల్లో ఉంది. (1) కేవలతర్కమూ (2) అనుభవాంగ తర్కమూనని. వాటిని సందర్భం వచ్చినప్పడు విపులంగా వివరిస్తాను. వాటిలో ఒకటవది విడువదగినదిగానూ, రెండవదైన అనుభవాంగ తర్కము సర్వులూ, సర్వదా స్వీకరించవలసినదిగానూ ఉన్నాయి. ఈవిషయం ఇంతవరకూ స్పష్టంగా ఆర్ధం ಪೆಸಿಟ್Kಶಿಗಿತೆ మిగిలిన విచారణ సులభమవుతుంది. సక్రమమైన జీవనానికి సక్ర మమైన-వా స్తవ-జ్ఞానం ఆధారంగా ఉందన్నది నిర్వవా డాంశము. అట్టి సత్యజ్ఞానమునే ఎప్పడూ పొందుచుండవలెనన్నచో తర్క ప్రమా ణములను గూర్చి తెలిసికొని, వినియోగించు కోవలసి యున్నది. అయితే ఈ విషయం ఇంతవరకూ స్పష్టంగా అర్ధం చేసుకోగలిగితే మిగిలిన విచారణ సులభమవుతుంది. సక్రమమైన జీవనానికి సక్రమమైన –వాస్తవ్-జ్ఞానం ఆధారంగా ఉందన్నది  నిర్వివాదాంశం. అట్టి సత్యజ్ఞానమునే ఎప్పుడూ పొండుచుండువలెనన్నచో తర్క ప్రమాణములను గూర్చి తెలిసికొని, వినియోగించుకోవలసి యున్నది. అయితే ఈ రెండు విషయాల్ని గూర్చి సమగ్రమైన అవగాహన పొందడం మిక్కిలి కష్టంతో కూడుకున్న పనిగాను ఉంది. గత చరిత్రను చూస్తే అనేకవేల ఏండ్డుగా ప్రతిసంప్ర దాయ ప్రవర్తకుడూ, సిద్ధాంతకారుడూ కూడా వారి వారి సిద్ధాంతాల కనుగుణ్య మెన రీతిలో తర్కాన్సీ, ప్రమాణ స్వరూపాల్చి ఏర్పరచుకునే యత్పం చేసినటు కనబడుతోంది. అలా ఏర్పడినవే తర్కం పేరుతొనున్న వివిధరీతులూ.
ప్రధానంగా తర్కశాస్త్రం అన్న పేరనే రెండు దర్శనములున్నా [న్యాయ వైశేషికములను తర్కశాస్ర మంటారు. వీటిని సిద్ధాంతరూపములుగా అంగీకరించి అనుసరించువారీని తార్కికులు లేక నైయాయికులు అంటారు] ప్రతి దర్శన కారుడూ తనపరిధిలో తర్కాన్నీ, ప్రమాణాల్నీ ప్రతిపాదించారు. (1) నైయాయికుల తర్కం, (2) అద్వైత తర్కం, (8) బౌద్ధతర్కం, (4) సాంఖ్యతర్కం () జైన తర్కం (8) నాస్తిక తర్కం (T) ద్వైత తర్కం (8) పాశ్చాత్య తర్కం. ట్లా యనేకంగా ఏర్పడ్డావి. వాటి మధ్య కొద్దిగానో, గొప్పగానో తేడాలున్నా అన్నిటిలోనూ హేతుదృష్టి, విశ్లేషించి, పరీక్షించి, నిర్ధారించడమూ నన్నది సామా న్యంగానే ఉంటూ వచ్చింది. అలా సామాన్య నియమాన్ని కలిగియుండి కూడా తర్కాన్నీ ప్రమాణాలనూ రకరకాలుగా ఎలా ప్రతిపాదించగలిగారు? అసలెందు క్లలా చేయవలసివచ్చింది? ఈ అంశాన్ని ముందుగా అర్థం చేసికోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయా ప్రతిపాదన లన్నింటి వెనుకా ప్రతిపాదించువారి కాధారంగా నున్నది స్వీయ జీవితమేకనుకనూ, ఆ జీవితంలో జ్ఞానేంద్రియాల
3
స్వరూప స్వభావాలూ అందరకూ ఒక్కరకంగానే ఉన్నవి కనుకనూ, వాస్తవంగా వైరుధ్యానికీ, వైవిధ్యానికీ కూడా తావుండరాదు కదా? మరెందుకు, ఎలా ఇన్ని తేడాలేర్పడ్డాయి? నిష్పాక్షికంగానూ, లోతుగానూ విచారించగలిగితే కొన్ని విష యాలు గోచరంచగలవు.
(1) ప్రధమ కారణం ఆయా సిద్ధాంతకారుల అవగాహనలలోని అసమగ్రత.  (2) ముందుగానే కొన్ని సిద్ధాంతాలేర్పరచుకుని వాటిని నిలబెట్టుకొనుటకే తర్కాన్ని తయారు చేసికోవటం, (3) ఎదుటి పక్షావ్ని నిగ్రహించుటే లక్ష్యంగా కలిగి అందుకే తర్కాన్ని తయారు చేసికోవడం. ఎప్పడైతే తర్కం యిలా అవగాహనా లోపం కలవారిచేతనూ, రాగద్వేష సంకలితమైన మనస్సుగలవారల చేతనూ తయారు చేయబడిందో ఆనాడే అది తన సహజ వివేకరూపాన్నీ, ప్రయోజనాన్నీకూడా కోల్పోయింది. ఆయా తర్క పద్దతులందు పాక్షికత, చోటుచేసికుని ఉంది.కనుకనే నాటినుండి నేటివరకూ ప్రతితార్కికుడూ మరోతార్కికుని తనదైన శైలిలో తప్పు పట్టగలుగుతున్నాడు. అట్లుగాక అనుభవాంగ రూపమైన తర్కాన్ని ఉన్న దుస్నట్లుగా ప్రతిపాదించగలిగితే లోకంలో ఎవ్వరూ, ఏనాడూ దానిని కొట్టివేయ జాలరు. ఎప్పడైనా ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి సామర్థ్యం ఉంటుంది.
ఇప్పడు మనం చేయబోయే విషయ పరిశీలనలోనూ ఎన్నో దోషా దోషాలు ప్రస్తావించవలసి ఉంటుంది గనుక అనుభవంలో ఎట్లుంది? అన్న కొలత నుండే అందరమూ ప్రతిపాదిత విషయాలను పరికించవలసి ఉంటుంది. అదే ఆద్యంతమూ మన పరిశీలనకు వేదిక గానుండగలదు. ఉండాలికూడా. అట్టుగాక నేను చెప్పిన విషయాన్ని ఎవరుగానీ, ఆయా సాంప్రదాయ గ్రంధాలలో చెప్పినవాటినే ప్రమాణాలుగా పెట్టుకొని పరిశీలించడం మొదలిడితే వాస్తవం తెలియడం కష్టతర మరొతుంది. అట్టివారిని ముందుగా నే నడిగే ప్రశ్నేమంటే ఆయా శాస్త్రాలలో చెప్ప బడ్డ వాటికి ప్రామాణికత ఎలా ఏర డింది? అని. వాటిని ప్రామాణికములేనని నిరూపించిన పిదపనే వాటి ఆధారంతో నేను చెప్పిన విషయాన్ని కొలిచిచూడడం ఉచితంకాగలదు. కానినాడు వారి పరిశీలనలన్నీ నేలవిడిచిన సాము వంటివే కాగలవు.
మరో దృష్టినుండి ఆలోచిస్తే ప్రమాణాదులలోని వైవిధ్యానికి మరో కారణమూ కనిపిస్తుంది. అది వారి వారి అనుయాయులకు బోధించుటకుగాను అవగాహనా సౌలభ్యం కొరకుగా వారు వారు ఏర్పరుచుకున్న విభజన అయ్యుండచ్చు. నిజంగా అట్లు జరిగే ఏర్పడిఉన్న తేడా లైతే వాటిని అర్ధం చేసికోవడమూ, సర్దుకుపోవడమూ
4
కూడా కష్టమేమీకాదు. ఈ ప్రమాణ వివేచన మన్నది ఆవిషయముయొక్క గాఢతా, జటిలతలను బట్టి నిదానంగానూ కూలంకషంగానూ, పంచుకుంటూ, అవగాహన చేసి కుంటూ మాత్రమే చేయదగియున్నది. ఇందు రచయిత-వక్త _ పాత్ర చాలా కొద్ది మాత్రమే. అదే మంటే విషయాన్ని ఒక క్రమంలోనూ, తగి నంత స్పష్టంగానూ, శ్రోతచే శ్రవణం చేయించడమే. పఠితలకు తగినంత సమాచా రాస్నందించడం మాత్రమే నన్నమాట. అటుపిమ్మట వినిన-చదివిన_ విషయాన్ని సమగ్రంగానూ, నిష్పాక్షికంగానూ పరిశీలించి నిర్ణయించుకోవలసిన పని శ్రోతపైనే ఉన్నది. మననమూ, నిదిధ్యాసనమూ రెండూ ట్రోత బాధ్యతే. అప్పడే అది అతనికి అనుభవాంగ రూపమౌతుంది. గతంలో జ్ఞానపీఠ మను పేర ప్రకటించిన ఒక సంచిక ఈ సందర్భంలో గుర్తుచేసుకోవడం మిక్కిలి ప్రయోజనకారి కాగలదు. అందులో విషయాన్ని చెప్పాలకున్నవారూ, వినాలనుకున్న వారూ కూడా అనుసరించ వలసిన నియమావళి విపులీకరింపబడింది.
సహజంగానే ఆయా విషయాలు గ్రహించినప్పడు దానిని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. తెలుస్తున్న విషయాలను పరిశీలించి ఒక అభి ప్రాయానికి రావడం సహజ ప్రక్రియగా నున్నప్పడు, ఇప్పడు నేను బెప్పబోయే విషయాన్ని కూడా మీరందరూ అలా పరిశీలనా దృష్టితోనే చూస్తారు. అందుకే ఇచ్చట మీకో హెచ్చరిక చేయవలసి వస్తోంది. అదేమంటే, వీ విషయాన్ని గూర్చి న్యాయ నిర్ణయం చేయాలన్నా చేయు వారు న్యాయ నిర్ణేతలుగా- న్యాయమూర్తిగా ఉండగలగాలి. న్యాయవాదిగా ఉన్నంతకాలం ఎవరూ సరైన న్యాయం చేయలేరు. ఆప్పడు వారి వారి మేథస్సులన్నీ తమ పక్షాన్ని నిలుపుకొనుటకే వినియోగిసారు. అనుకోకుండానే, నీ పక్షంలోనే న్యాయముంటే తప్ప ఏ న్యాయవాదైనా స్వపక్షాన్ని నిలుపుకొనుటకే యత్నిస్తాడు. రాగ ద్వేషాలు లేకుండా-నిష్పక్షపాతంగా-నిర్ణయిం చగల స్థితిలో ఉన్నప్పడు, (అది ఒకే పక్షాన్ని స్వీకరించిన వారి వల్ల కాక న్యాయ మూర్తిగా నుండగలిగిన వారివల్లనే సాధ్యపడుతుంది.] తీసుకున్న నిర్ణయమే వాస్త వానికి దగ్గరగా ఉండగలుగుతుంది. సాంప్రదాయక తర్కాన్ని [ఏదో ఒక తర్క ధోరణికి కట్టుబడి] ప్రామాణికంగా స్వీకరించిన పిదప నీవు శుద్దంగా ఉండుట కష్టము. ఈ కారణమే ఇంతకాలమూ సత్య నిర్ధారణకు అడ్డుపడుతూ వచ్చింది.
ఇక్కడ మార్పు రాక, అంటే అనుభవాంగ తర్కాన్ని ప్రమాణంగా స్వీకరించక సత్యాన్ని నిర్ధారించడం కుదరదు. - ఈ విషయంలో మీకేమైనా అభి
5
ప్రాయ భేదముంటే మాకు తెలుపండి. స్పందన-ప్రతిస్పందన శీర్షికన ఆయా విష యాలలోని నిజానిజాలను పరిశీలించిచూద్దాము.
ప్రమాణములనగా జ్ఞానోత్పత్తికి అసాధారణ కారణము లనుకున్నాము కదా! జ్ఞాన మన్నదొక కార్యరూపము, పుడుతోంది కనుక. ప్రతి కార్యోత్పత్తికీ పరికరములూ, పనీ సామాన్య కారణాలు గానే ఉంటాయి. ఆ రకమైన పరికరాలూ, ఆ రకమైన పనీ, ఆ రకమైన కార్యానికి అసాధారణ కారణాలౌతాయి. కనుకనే ప్రస్తుతాంశమునందునూ ప్రమకు-జ్ఞానానికి-జ్ఞానేంద్రియములూ, ప్రక్రియలూ కూడా కరణములు (సాధకములు] అవుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రమాణ మంటే జ్ఞాన సాధకమనాలా? యదార్ధ జ్ఞాన సాధక మనాలా? అన్నది పరిశీలించ వలసి ఉంది. వెనుకటి వాళ్ళీ విషయంలో కొందరు జ్ఞాన సాధకమనీ, మరి కొందరు యదార్ధ జ్ఞాన సాధకమనీ, రెండురకాలుగానూ అభిప్రాయపడ్డారు. ఈ దృష్టి భేదం వల్ల కూడా తర్క ధోరణులు వేరు వేరుగా మారాయి. ఎవరి అభిప్రా యాల్ని వారు మాటి మారీకి పునరుద్దాటిస్తూన్నంత కాలం ఈ విషయంలో వాస్తవం తేలదు. రెండు పక్షాలలో అనుభవానికేది సరిపోతుందో చూసుకోవాలి గాని నాది నాదేనంటే ఎలా? దీనినే విశ్లేషించి చూపడానికి యత్నిస్తాను. మీరూ పరిశీలించి చూసుకోండి.
సంస్కృత భాషలో ప్రమ, భ్రమ అన్న రెండు పదాలున్నాయి. ప్రమ అనగా ఒప్పు జ్ఞానమనీ, భ్రమ అనగా తప్పుజ్ఞానమనీ ఆ పదాలకు రూఢ్యర్థం ఉంది. దానిననుసరించి ప్రమాణమనగా ప్రమాకరణమనీ, అనగా యదార్ధ జ్ఞాన సాధకమనే అర్ధాన్ని స్వీకరించా మనుకోండి. అప్పడు మనం నిర్దేశించే-అంగీకరించే ప్రమాణాలన్నీ యదార్ధ జ్ఞాన సాధకములేనని నిరూపించవలసి ఉంటుంది. మరో వంక భ్రమతప్పు జ్ఞానాని-కి సాధకమేమో చెప్పవలసి ఉంటుంది. భ్రమ కూడా ఒక రకమైన జ్ఞానమే నన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే. [Note :అవగాహసకూ, జ్ఞానార్జనలో ఎల్లప్పడూ ఉపయోగించుకో గలందులకూ ఒక విషయాన్ని యీ సందర్భంలో చెప్పడం మంచిదనిపిస్తున్నది. అజ్ఞాన మన్న పదం రెండు సందర్భాలకు సరిపోతుంది. బొత్తిగా తెలియని తనానికి, తప్పుగా తెలిసి ఉండడానికీ, ఎలానంటే రెండు సందర్భాలలోనూ ఉన్నది తెలియక పోవడం
జరుగుతోంది. అయితే వాటిని రెండని ఎందుకనాలి? శుద్ధంగా తెలియ లేదు అన్న స్థితిలో ఆ వ్యక్తి తెలుసుకుంటానికి వీలుంది. ఈ విషయం తనకి తెలియలేదు అన్న దృష్టి ఉంటు ది కనుక.  మరి రెండోదైన తప్పు తెలివి  కలవారిలో తనకు
6
విషయం తెలిసి పోయింది. అన్న భావం ఉంటుంది. ఇకవారు తెలిసికునే అవకాశమే ఉండదు. బొత్తిగా తెలియని తనం కంటే తప్పగా తెలియడం ఆద్యంతమూమూ ప్రమాదకరమైయున్నది. జ్ఞానార్థనలో ప్రారంభకులూ, కొంత పరిశ్రమ చేసిన వారు, పూర్తయిందను కున్నవారూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఉండడం సర్వధా శ్రేయస్కరము. జ్ఞానార్థనాపరుడు అప్పటికా విషయంలో తనకెంత తెలిసిందో, ఎక్కడనుండి, తెలిసికోవలసి ఉందో స్పష్టంగా గమనించి ఉండాలి. అప్పడే ఆతని జ్ఞానార్థనా యత్నం ఫలవంతమవుతుంది. చక్కగా వ్యక్తం చేయబడీ తప్పగా వ్యాఖ్యానించబడుతున్న గీతా శ్లోకాన్నొక దాని నిచ్చుట చెప్పితే విషయం మరింత వివరణాత్మకంగా ఉంటుంది.
అజ్ఞానేనా  వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః "II
"అజ్ఞానముచే నావరింపబడిన జ్ఞానంచే మోహితులౌతున్నారు జనులు" అన్న అర్ధాన్నిస్తోందా వాక్యము. జ్ఞానమే మనిషిని కదిలిస్తోంది అన్న అనుభవాన్ని బట్టి చూస్తే అజ్ఞానం-తెలియని తనం-మనిషిని మోహితుల్ని చేయలేదు, ప్రయత్న పరుల్నీ చేయజాలదు. మరిక్కడ అజ్ఞానానికే అర్ధం చెప్పకోవాలి? క్రితం నే చెప్పిన రెండవ అర్థాన్నే. తప్పుగా తెలియడమన్నదే ఒప్పు తెలివికి సాధించు కోడానికి గల మార్గాన్ని మూసి వేస్తోంది. కప్పివేస్తోంది. మరి మోహితులవడమేమి? తప్పగా తెలియడంలో ఉన్నది తెలియక పోవడమూ, తెలిసింది అనుకో వడమూ కలిసి ఉన్నాయి. యీ ఉన్నది తెలియకనే తెలిసిందనుకోవడం వలన ఆ విషయమై ఇక తెలిసికోవడం అన్నదే ఏర్పడదు. ఇదే కప్పి వేయడమంటే, విపర్యయ-భ్రమ-జ్ఞానమే వాస్తవాన్ని కప్పివేయ గలదు. చక్కగా ఒకటి, రెండు సార్లు చదివి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లోపాలున్నాయనిపిస్తే సహేతుకంగా పత్రికకు వ్రాయండి.] సరే అసలు విషయానికి వద్దాం. భ్రమ కూడా జ్ఞాన రూపమే ఐనప్పడు అదీ ఒక కార్యరూపమే అవుతుంది. దానికీ అసాధారణ కారణం ఉండితీరాలి. ఆకరణాలూ, పద్దతీ ఏమీటి? వాటినే పేరుతో పిలవాలి? యదార్ద జ్ఞాన సాధకమే ప్రమాణ మన్న నిర్వచనం చేసేవారు, ఈ సందేహానికి సహా ధానం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పక్షం వారైనా మూడు పదాలకు అర్ద నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. (1) జ్ఞానము, (2) యదార్థ జ్ఞానము, (3) అయదార్ధ జ్ఞానము. ఈ మూడు పదార్థాల జ్ఞానం లేక ప్రస్తుత విషయాన్ని పరీక్షించుట కుదురదు. భిన్న ధోరణులు కల వారు పత్రికను పరిశీలిస్తున్నారు గనుక
7
వారు గానీ, మీరు గానీ ఈ మూటి అర్జాల్నీ మీమీ దృష్టుల నుండి నిర్వచించండి. భిన్న మార్గీయులైన ఆయా తార్కీకులు ప్రతిపాదించిన నిర్వచనాలు రెండు, మూడు మీ ముందుంచుతాను గమనించండి. న్యాయ, వైశేషిక దర్శనాలను ప్రామాణిక గ్రంధాలుగా స్వీకరించు తార్కికులు-వీరిని నైయాయికులంటారు-చెప్పిన నిర్వచనం ప్రకారం, ప్రత్యక్షంలో భ్రమకు తావు లేదు.
సూ:- ఇంద్రియార్డ సన్నికర్షోత్పన్నం జ్ఞానమ్, "అవ్యపదేశ్య మవ్యభిచారి వ్యవసాయాత్మికం ప్రత్యక్షం!! ఇంద్రియములూ, విషయములూ సంబంధ పడగా ఏర్పడ్డ జ్ఞానమే, వినికిడి జ్ఞానం కాకుండానూ, తెలియబడుతున్నది మార్పుకు లోనుగాకుండానూ, సంశయ రహితంగానూ ఉన్నప్పడే ప్రత్యక్ష మవుతుంది. అని పై సూత్రార్థం. ఈ సూత్రం ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. (1) ఇంద్రియార్థ సన్నికర్షవల్ల జ్ఞాన మేర్పడుతుందని, (2) ఆజ్ఞానము అవ్యప దేశ్యాది మూడర్హతలు కలిగి యున్ననే ప్రత్యక్ష ప్రమ అవుతుందని, ఈ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంలో వ్యపదేశ జ్ఞానం గానీ, భ్రమజ్ఞానం గానీ సంశయ జ్ఞానం గానీ  ఉండవు. అదే మరి సాంఖ్య దర్శన కారుని మతం ప్రకారమైతేనో.
అసన్ని కృష్ణార్థ పరిచ్చిత్తి ప్రమా! -
బుద్దికి, ఫలానా కొత్త విషయం మేదస్పుకు చేరింది అని తెలియడాన్నే ప్రమ అంటారు. అని సూత్రార్ధం. ఇక్కడ ప్రమ అనగా ఇంద్రియార్థ సన్నికర్షవలన పుట్టిన జ్ఞానమనే అరం వస్తోంది. అయితే మరి ఆ తెలుస్తున్నది ఉన్నది ఉన్నట్లేనా అన్న నిర్ధారణేమీ వారి సూత్రం ద్వారా లభించదు. పై నైయాయిక మతాన్నంగీకరించినట్లైన ప్రత్యక్షంలోనే గాక, ఏ ప్రమాణంలోనూ భ్రమలుండవు. సాంఖ్యాదుల ప్రకారం కలుగుతున్న జ్ఞానానికే ప్రమ అని పేరు. అందు తప్పు జ్ఞానమూ, ఒప్పు జ్ఞానమూ ఉండవచ్చు. మరొకరి దృష్టి నుండి ప్రమకు అనధిగతత్వమూ, అబాధితత్వమూ ఉండాలి. తెలియనిది తెలియడం, తెలిసింది మార్పుకు లోనుగాకుండడం అన్న స్థాయిగల ఆయా విషయ జ్ఞానాన్నే ప్రమ అంటామని వారి అభిప్రాయం. మరో వర్గం వారికి ప్రత్యక్షమే ప్రమాణం అంటే ఇంద్రియాలే-పరికరాలేజ్ఞానసాధకాలు. మన మనుకునే అనుమానాది ప్రమాణ ములు ప్రమాణములే కాదు. వాటి వలన జ్ఞాన మేర్పడదు అని, అంటే పరోక్ష జ్ఞానమన్న పదమే తప్పని దాని అరం.
8
పరిశీలకులను పరిశీలనకు తగిన విధంగా సంసిద్దులను చేయవలసియుండుట చేతనూ, అది బహు ప్రయాసతో కూడియున్న విషయమగుటచేతనూ ఈ ప్రమాణ వివేచనకు పీఠికగానున్న ఈ వ్యాసము ఒకింత దీర్ఘమైంది. మేలుకొలుపులో క్రమంగా వస్తున్న ఆయా విషయాలను భిన్న సిద్ధాంతాభిమానులైన తార్కికులొకవంకా, ప్రాధమిక పరిచయాన్ని పొంద యత్నించు జిజ్ఞాసువు లొకవంకా పరిశీలించే వారుగా ఉండుటచే ఇరువరకూ అందుబాటులో ఉండే విధంగా భాషను మలచడం కొంత శ్రమతో కూడుకున్న పని. వెనుకటి వారు ఉపయోగించిన భాషా పదాలు వాడక తప్పదు. వాటిని ఉపయోగిస్తూనే వాటి అర్థాలలోని దోషాదోషాలు చూడడమంటే బహు క్లిష్టమైన పని ఔతుంది. ప్రకరణ విషయం నాకు అనుభవ రూపంలో స్పష్టంగానే ఉన్నప్పటికీ రెంరు స్థాయిలలోని పరిశీలకులకూ అందుబాటులో ఉండగల వాక్య నిర్మాణానికై నేపడ్డ శ్రమ ఎంత వరకు ఫలవంత మవుతుందో మీ స్పందనలను బట్టి గాని నిర్ధారించ వీలులేదు.




No comments:

Post a Comment