Wednesday, January 1, 1992

ప్రమాణ వివేచన - 2

 సంపుటి – 2                                  - సం క్రాంతి సంచిక -1                            1-1-92

1
ప్రమాణములు పరికరములననుసరించి పద్ధతుల ననుసరించీ ఏర్పడతాయనుకున్నాము కదా. పద్ధతులననుసరించి  ప్రమాణములేమో వివరించలేదంటూ ఒకరిద్ధరు లేఖలు వ్రాశారు. ఆ లేఖలనుబట్టి విషయాన్ని మరో విధంగా చెప్పినచో బాగుంటుందనిపిస్తోంది. పరిశీలించి గత సంచికలో ఈ విషయం చెప్పానో లేదో కూడా గమనించండి.
 i) పరికరముల ననుసరించి ప్రమాణములారు. 1) రూపాదులకు నేత్రమూ, రసాదుకులకు జిహ్వ అలానే ముక్కు, త్వక్కు,  చెవి ప్రమాణములౌతాయి. ఇంత వరకు బాహ్య విషయజ్ఞాన సాధనములివి. ఆరవదిగా అంతరింద్రయమొకటి. దీనిని మనస్సందాము. మొత్తం పరికరములు 6. కనుక ప్రమాణములారు. పద్ధతులను-ప్రకార భేదాన్ని-బట్టి ప్రమాణములను భిన్న సిద్ధాంత (2 కారులు, విభిన్న రీతులుగా ప్రతిపాదించారు. అందరు చెప్పినవి కూడా క్రోడీకరిస్తే ప్రత్యక్షమూ,అనుమానమూ, శబ్ధమూనన్న 3 ప్రమాణము లేర్పడతాయి. చిన్నచిన్న తేడాలున్నాయనుకుంటూ వాటినే ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ది, ఐహ్యము,సంభవము అన్న పేర్లతో మొత్తం 8 ప్రమాణములుగా మరికొందరు వర్గీ కరించారు.పద్ధతుల ననుసరించి ప్రమాణము లివే. నా దృష్టి నుండి ఇవి ముఖ్యంగా రెండు.
(1) ప్రత్యక్ష పధ్ధతి (2) పరోక్ష పద్ధతి. ఈ పరోక్ష పద్ధతిని మళ్ళా కనీసం  రెండు భాగాలుగా చూడాల్సి వస్తున్నది. వాటినే అనుమానము, శబ్దము అన్న పేర్లతో పిలుస్తున్నాము. ప్రత్యక్షమూ, ఆనుమానమూ, శబ్ధమూనని ప్రకార బేధంచే ప్రమాణాలు మూడన్న మాట.  Note :- పరికరముల ననుసరించిన  ఆరు ప్రమాణాలూ ఒక్క ప్రత్యక్ష పద్ధతిలో ఇమిడి పోతాయి.
వేటివలన జ్ఞానం కలుగుతున్నది? అని ప్రశ్నించుకుంటే ఆయా ఇంద్రియముల వలన అనీ, ఏ ప్రకారం జ్ఞానం కలుగుతోంది.? అని ప్రశ్నించుకుంటే         ప్రత్యక్ష,అనుమానాదుల ద్వారాననీ సమాధానం వస్తుంది. అలానే ప్రత్యక్ష పదార్ధ మేది అని ప్రశ్నించుకుని యింద్రియాన్ని సూచించినా లక్షణం చెప్పినట్లు కాజాలదు. ప్రక్రియా విశేషాన్ని ఇంద్రియార్ధ సన్నికర్ష జరిగి సన్నికఱ్శలోనున్నంత వరకు తెలియడం అని చెప్పి తీరాలి. అలానే రూప జ్ఞానం ఎలా కలిగింది? అంటే ప్రత్యక్షాదుల వలన అంటే లక్షణం చెప్పినట్లుకాక, నేత్రం వలన అన్నప్పుడే కరణనిర్దేశం చేసినట్లవుతుంది. విషయాన్ని పరిశీలించి అర్ధం కాకుంటే
2
ప్రశ్నించండి. స్పందనకు లేఖ వ్రాయండి. జ్ఞాన ప్రకరణంలో పశీలించవలసిన మరో అంశముందిక్కడ, చూడఁడి.
మనిషి తనకు కలుగుతున్న అనుభవాలనూ, వాటిననుసరించి తాను చేస్తున్నపనులనూ సమీక్షించి చూసుకుంటే ఆనుభవాలూ, వాటి నుండి కలుగుతున్న జ్ఞానమూ రెండు రకములుగా నున్నట్లు బోధపడుతుంది. (1) యదార్ధ జ్ఞానము (1) తద్వతి తత్ర్పకారకానుభవం, (2) అయదార్థ జ్ఞానము-తదభావ వతి తత్ర్ప కారకానుభవం. అంటే (1) ఎట్టి విషయమో అట్టి ప్రతిబింబమే అనుభవ రూపాన్ని పొందడం, దీనినే ప్రమ ఆంటాము. అట్లుగాక (2) ఉన్న విషయానికి భిన్న మైన ప్రతిబింబం అనుభవరూపంగా నుండడం. దీనినే భ్రమ ఆంటాము. అసలలా ఎందుకు జరుగుతుంది? ఆడే భ్రమలకు కారణా లేమిటని అడిగినట్లు. ఆది సందర్భం వచ్చినప్పడు ఆనుకుంటాము. జీవితంలో సహజంగానే జరగుతున్న జ్ఞాన ప్రక్రియలో భ్రమకూడా చోటు చేసుకుంది కనుకనే, దాని వలన జీవితానికి నష్టమూ, ప్రమాదమూ ఏర్పడుతోంది కనుకనే. అసలీ ప్రమాణ, తర్క విచారణ అవసర మైంది మనిషికి. వీటి పట్ల సామాన్య జ్ఞానం ప్రతి మనిషికి ఉంది. భ్రమ రహితంగా, వాస్తవ జ్ఞానాన్నే నిరంతరం పొందవలసిన అవసరం ఉంది గనుకనే ఆయా పరికరాలు , ప్రక్రియలూ, భ్రమలకు కారణాలూ, వీటిని గురించిన విశేషజ్ఞానం పొందటంతప్పనిసరి అయింది మనిషికి.  Note :- జిజ్ఞాసువుకు జ్ఞానార్థనలో, కలిగినది తప్పు జ్ఞానమా? ఒప్పు జ్ఞానమా!. నిశ్చయించుకోవడం అతి ప్రధానమూ, జ్ఞానా నా ప్రక్రియలో ఆయా విషయాలకు ముగింపు కూడా అవుతుంది. ఈ పాఠ్ క్రమాన్నలా ఉంచి పాఠకులు గమనించ వలసిన మరి కొంత సమాచారాన్ని అందించి ఈ సంచిక ముగిస్తాను.
తర్క ధోరణులనేక మున్నాయనీ, అలా వివిధ రీతులేర్పడడానికి వారి వారిలోని ఆవగాహనాలోపమో, స్వపక్ష మండన దృక్పథమో, పరపక్ష ఖండనే లక్ష్యముగా పెట్టుకొనుటో కారణాలుగా ఊంటాయని గమనించాము. అలా తర్క రీతుల మాదిరే తార్కికులలోనూ (1) అతి తార్కికులు, (2) మధ్యమానుసారులు (3) మంద వేగులు అను మూడురకాల , వారుంటారు. Note :- ఈ పేర్లు నచ్చ కుంటే మరో పేరు పెట్టుకోండి. 3 రకాల తార్కి కులుంటారన్నదే గమనించవలసిన అసలు విషయం.
ప్రతి మనిషీ జ్ఞానేంద్రియాలా, మెదడూ, వాటి పనుల తీరు తెన్నుల ననుసరించి స్వాభావికంగానే విచక్షణా శీలిగా నున్నాడు. అట్లా సహజంగానే ఏర్పడి  యున్న తార్కిక శక్తిని కొందరు అక్కరలేనంతగా ఉపయోగిస్తుంటారు. వీరినే ఆతి తార్కికులనేది. (2) మరో రకము వారు తర్కాన్ని అవసరమైనంత మేర జీవితా సుభవాల నతిక్రమించకుండా ఉపయోగించుకుంటారు. వీరినే మధ్యమానుసారులు అంటాము. ఈ తరహా తర్కాన్నే గత సంచికలో నేను అనుభవాంగ తర్కము అన్నది. ఇక మూడో రకం వారున్నారే. (సమాజంలోనూ సాంప్రదాయ ప్రచారకులలోనూ, భిన్న ధోరణుల ప్రచారకులలోనూ,వీరే ఎక్కువగా ఉండటం దురదృష్ట కరం). వీరు తర్కాన్ని పూర్తిగా విడువరు, [తర్కించడం మానవ స్వభావం కనుక.] అలా ఆని అవసరమైనంత మేర అనగా పరిశీలించవలసిన అంశాలలో పరిశీలనలు పూర్తయ్యేంత వరకూ దానిని ఉపయోగిస్తారా అంటే అదీ లేదు. పోనీ యితరులు పరిశీలిస్తానంటే అంగీకరిస్తారా? అబ్బే అలా ఆయితే ఇక అనుకోవడ మెందుకు?  వీరి పనీ, వీరి తార్కికతా కూడా మునగానామ్, తేలానామ్‌గా ఉంటుంది. పూర్తి విశ్వాసులూ కారు, విచారణశీలురూ కారు. నేడు సమాజాన్ని ప్రమాదపు నదిలో ముంచెత్తుతున్నదీ మూడవ తరహా తార్కికులే. వీరు తాము చెప్పగలము అనుకు న్నంత వరకు హేతు బద్దంగానే మాట్లాడుతుంటారు. ఋజువులు లేకుంటే ఎలా గయ్యా! అని ఎదుటివారి నడుగుతూనే ఉంటారు. తాము చెప్పగల విషయం ముగి సిందనుకోండి. అప్పటికింకా మిగిలి వున్న సందేహాల నెవరైనా అడిగితే మాత్రం తర్కించకు, తర్కానికవధుల్లేవు, నిలకడా లేదు. తర్కం పనికిరాదు అంటూ మరో పాటందుకుంటారు. ముందు ముందా యా పరిశీలనలతో వీరు మనకధికంగానే ఎదురు పడతారు గనుక తార్కికుల్లోని ఈ రకాలను గుర్తులో ఉంచుకోండి ప్రస్తు తానికి.
ఇక ఒకటవ రకం వాళ్ళన్నారు చూశారూ! వారికిక ఇది అవసరమా? అనవసరమా అన్న స్పృహే ఉండదు. చిన్న చిన్న విషయాలనైనా తర్కించుతూ రోజులకు రోజులే వెచ్చించగలరు వీరు. లోకం ఏమైపోతున్నా వీరికేమీ పట్టదు. ఒక రకంగా తర్క కండూతి వీరిది. తర్కించకుండా ఉండ లేరు. ఆ తర్కానికి హద్దే ఉండదు. మరో ఆశ్చర్య కరమొన విషయమేమంటే అలా రోజులూ, నెలలూ, సంవత్సరాలూ కూడా తర్కిస్తూనే గడిపివేయ గలరు వీరు. అయినా విషయం మాత్రం ఒక కొలిక్కిరాదు. వీరి వరకు వీరికి ఆనందంగానూ, బహు తృప్తిగానూ, గొప్ప ఘన కార్యం సాధించినట్లున్నూ తర్కిస్తూ జీవితం గడిపివేస్తుంటే. తర్కనున్నది విషయ పరిశీలనకూ, వివేక సామర్థ్యాన్నిపెంచుకొనుటకూ కేవల మొక సాధనం మాత్రమేనన్న దృష్టండదు ఈ రకం వారిలో. వీళ్ళలో మరల వెండు రకాల వాళ్ళున్నారు. (1) విషయ పరిజ్ఞానం కలిగున్నవారు, (2) అదీ లేనివారు. ఇరువురూ తర్కానంద స్వాములే. తర్కం వీరికి జ్ఞాన సాధనంగా కాక ఆనంద సాధకంగా ఉంటుంది. వీరిలో రెండో రకం వారు తాము చెడి,  యితరులనూ చెడగొడుతుంటారు . మరి ఒకటో రకం వారు మాత్రం తామేమీ నష్టపోడు. వారి పాలబడిన వారు మాత్రం జీవితాన్నీ, విలువైన కాలాన్నీ చాలా నష్టపోతారు. మీమీ అనుభవాల నుండీ, సమాజాన్ని పరిశీలించడం నుండీ పై విషయాలు గమనించి రూడి పరచుకునే యత్నం చేయండి. అట్టి తర గతుల వ్యక్తులు లేరు అనిపిస్తే నాకు వ్రాయండి. అట్టి వారిని కలిసే ఏర్పాటు చేస్తాను. అలానే మీరూ ఈ మూడు రకాల వారిలో చేరి ఉన్నారో చూసుకోండి.
మరోమాట. తర్కమన్నమాట వ్యవహారంలో రకరకాలుగా వాడుతున్నప్ప టికీ, తర్కశాస్త్రము అన్న ప్రయోగంలో మాత్రమే దానికి సరైన అర్థం చెప్ప బడింది. ప్రమాణై అర్థ పరీక్షణం న్యాయం! అన్నది తర్కలక్షణం. ప్రమాణాదులచే (హేతూదాహరణలే ఇక్కడ ప్రమాణ శబ్దంచే సూచితం]. అంటే ఆధార సహితంగా విషయాన్ని పరీక్షించి నిర్ణయించే ప్రక్రియావిశేషాన్నే తర్కమంటామని పై వాక్య భావం. సత్యనిర్థారణకై మనిషి చేయు క్రమబద్ధమైన మానసిక ప్రక్రియే తర్క మంటేఈ అర్ధాన్ని ఆర్థం చేసుకోగలిగితే మానవ జీవితంలో తర్కం పాత్రేమిటో, ప్రాధాన్యతేవిటో బోధపడుతుంది. తర్కాన్ని గూర్చి చులకనగా మాట్లాడే వారెవరైనప్పటికీ తర్కమంటే ఏమో వారి కర్థం కాలేదనాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిన మరో అంశముంది. అది వెనుక చెప్పకున్న అతి తర్కమో, అటూ ఇటూగాని- మందవేగుల_ తర్కమో కాకుండా ఉండాలి. కేవలం ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి విలువుంది. తర్కపద నిర్వచనం మరో రకంగానూ చెప్పబడింది. అవిజ్ఞాతతత్వే అర్ధే కారణోపసత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః / తెలియబడని విషయంయొక్క యదార్థ స్థితిని గ్రహించుటకై కొన్ని ఆధారాలతో ఊహ చేయడం తర్కము అనీ సూత్రార్థం. ఈ సూత్రం అనుమాన ప్రమాణంలో- పరోక్ష జ్ఞానవిషయంలో తర్క దృష్టియొక్క పాత్రను, అవసరాన్నీ సూచిస్తోంది. ఆందుతున్న ఆధారాన్ని బట్టి అందుబాటులో లేని విషయాన్ని నిర్ధావించుటకై చేయు ఊహనే తర్కమంటారని అర్థం.
తర్కం శాబ్దీ ప్రమ- శబ్ద ప్రమాణం వల్ల కలుగుతున్న జ్ఞానం-విషయంలో కూడా అవసరమూ కాదా? పనికొస్తుందా లేదా? ఆలో చించి స్పందనకు వ్రాయండి. అలానే, తర్కబద్ధం కాని సిద్ధాంత ముంటుందా? ఉంటుందంటే ఎలాగో, అదే సిద్ధాంతమో చెప్పండి. ఉండదన్నారనుకోండి! ఇక మీరెప్పడూ తర్కం పనికిరాదనీ, తర్కించకండనీ ఎక్కడా అనకూడదన్న విషయం గమనించండి. సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళపై కుహనాగురువులు చల్లిన బురదగానీ, తర్కబద్ధంగా యోచించడమనే పనిపట్ల అమాయకులైన తమ తమ అనుయాయులలో కల్పించిన వ్యతిరేకతగానీ, అంతింతనలేము. యదార్ధ శతృవులైన ఈ పండితమ్మన్యుల వల్ల అటు సమాజానికీ, ఇటు విజ్ఞానకాయానికి జరిగిన ఆపకారం మరే రకమైన శతృవులవల్లనూ జరుగలేదన్నది పచ్చి నిజంసృష్టిలోని సమస్థ -
పదార్ధములందునూ శుద్ధమూ, వికశిత రూపమూ, శక్తిపంతమూనైన మానవ మేధస్సును ఉపయోగించుకోనీకుండా అడ్డుపడుతున్న బాధ గురువుల నేమనాలి? ఏమన్నా ప్రయోజనం లేదు. ఏరివేయాలి.
ఇప్పటికే కొందరు తర్కజ్ఞులకు అసలు విషయం చెప్పవయ్యా ఎందుకీ ఉపోద్ఘాతం" అని అడగాలనిపిస్తూండవచ్చు. తార్కికులకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రతి తార్కికునికీ ఎదుటివాడు ప్రతిపాదించే విష యాన్ని సందేహించి పరిశీలించే ప్రవృత్తి అలవాటుగా మారి ఉంటుంది. వారికి నేచెప్పేదేమంటే పత్రికోద్దేశం ప్రమాణ నిర్దేశమో, తార్కికులతో చర్చించడమో మాత్రం కాదు గనుకనూ, భిన్న స్థాయిలోని పాఠకులకు-జిజ్ఞాసువులకు ఆయా విషయాల్ని క్రమంగా ఆందించడమెలా అన్నది కూడా పరిగణించవలసి ఉంది కనుకనూ రచనా విధానం వివరణాత్మకంగా ఉండుంటే ఉచితమౌతుంది. ఈ ప్రమాణ విద్యనూ, ఆధ్యాత్మిక-విద్యనూ కూడా బోధించడమూ, గ్రహించడమూ, మరో తార్కికునితో చర్చించడమూ కూడా తేలికైన విషయమేమీ కాదు. ఈ విషయమూ తార్కికులకున్నూ తెలియనిది కాదనుకొందును.
Note :- 1) ప్రత్యక్షగోచరం కాని డానీ తర్కంద్వారానే గమనించాలి,సాధించాలి ఆన్న నిర్ణయానికి ప్రాచీన తాత్వికులు ఎక్కువమంది వచ్చినారని పిస్తోంది నాకు. వచ్చినా రచనలు చూస్తుంటే. మీరేమంటారు.

2) ప్రత్యక్ష గోచరం కాని పరమాణువుల ఉనికినీ, వాటి ధర్మాలను వైజ్ఞానికులే ఆధారంతో ప్రతిపాదించి ఉంటారో యోచించండి. మీ యోచనలను స్పందనకు వ్రాయండి.

No comments:

Post a Comment