Saturday, February 1, 1992

ప్రమాణ వివేచన – 3

సంపుటి-2                                                        సంచిక-2                                       1-2-92
తర్కప్రమాణములను గురించిన మేలుకొలుపు అభిప్రాయాలపై రెండు స్పందనలందాయి. i] చాలా విలువైనన విషయాన్ని సమాజానికందించే  యత్నం చేస్తున్నారు ఈ విషయంలో మేలుకొలుపుతన పేరు సార్ధకం కుంటున్నది అనీ, 2) ఈ తర్క ప్రమాణములు నేడు సమాజ వికాసమునకు అవసరం. ఏమి సాధి౦చాలని వ్యర్ధమైన ఈ రచనలు చేస్తున్నారు? అనీ. మొదటి అబిప్రాయం నా భావాల కనుగుణమైనదే కనుక దానినలా ఉంచి, రెండో అభిప్రాయాన్ని గూర్చి  కొంత  విశ్లేషణ చేస్తాను. సత్య దృష్టి నుండి పరీక్షించి ఒక నిర్ణయానికి రండి.
                మానవ జీవితంలో తర్కం పాత్ర-జ్ఞాన ప్రక్రియలో దాని పాత్ర-ఏమిటన్నది నిజ జీవితాన్ని యధాతధంగా  చూడగలిగితేగాని , వ్యక్తి వికాసానికి, సామాజిక వికాసానికి తార్కికతకూ ఉన్న సంబంధం బోధపడదు. ప్రారంభ సాధకులలోనూ, సాధారాణ మానవుల-అనుయాయులలోనూ ఆయా సిద్ధాంత ప్రచారకులూ, మార్గదర్శకులూ కలసి తర్కంపై ఒక వ్యతిరేక భావనను బలంగా నాటుకొనేటట్లు చేయగలిగారు. దాని ప్రభావం సామాన్యులపైనేగాకుండా, రాను రాను, ఆయా శాస్త్రములందూ, విషయాలందూ నిష్ణాతులైన విద్యావంతులపై గూడా గణనీయంగానే పడింది.  వర్తమాన సమాజంలొ, అట్టి ప్రభావంలో నున్న తర్కమంటే చెడ్డదనో, మరో రకంగా, తిని కూర్చునే వాళ్ళు తోచక చేసే వాగ్విదాలకు పనికి వచ్చేదనొ ఒక తప్పు అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్న వారిచే వ్యక్తీకరింపబడినదే పై రెండో అభిప్రాయం. అయితే ఇక్కడ మరో విషయమూ గమనించవలసి ఉంది. అలా తర్కంపై వ్యతిరేకాభిప్రాయం గాని, ఉదాసీనతగానీ, ఏర్పడటానికి
2
తర్కం తరచుగా, దాదాపుగా, తన స్వీయ క్షేత్రాన్ని విడచి అక్కరలేని విషయాలలోనూ, అక్కరలేనంతగానూ ఉపయోగించడమో [ఈ పని అతి తార్కికులు చేస్తుం టారు) అవసరమైనంతవరకైనా ఉపయోగింపబడక పోవడమో (ఈ పని మంద వేగులు చేస్తుంటారు] జరుగుతోందన్నమాట. ఇలాటి వాటిని పదేపదే అనుభవాల ద్వారా గమనిస్తున్న జనసామాన్యంలో తర్కంపై అలాంటి వ్యతిరేకత ఏర్పడడంలో ఆశ్చర్యమేముంది.
అయితే ఒక విద్య దుర్వినియోగం చేయబడుతున్నంత మాత్రానో, సక్ర మంగా వినియోగించుకోలేకపోయినంత మాత్రానో అది విద్యే కాకుండా పోతుందా?ఏ మాత్రం వివేకంతో ఆలోచించగలిగినా అలా కాదని చెప్పగలం. అదలా ఉంచి ఈ తార్కికతను మానవ జీవితంనుండి వేరు చేద్దామన్నా కుదిరే విషయం గాదు వాస్తవంగా. ఎందుకని? తర్కం సహజంగానే మానవ మేధస్సులో జరిగే జ్ఞాన ప్రక్రియలో ఇమిడి ఉంది. నిశ్చయాత్మకమైన బుద్ధి ఆయా విషయాలను నిశ్చ యించడానికి, గహణ, విశ్లేషణ, వివేచన అన్న పనులపైనే ఆ ఫారపడుతుంది. ఇది సంఘంలో ఎవరో ఏర్పరచింది కాదు. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఏర్పడి ఉన్న విధానమది. తర్కమూ, తార్కికతా మనిషికి సహజాతము లన్నది వాస్త వమో కాదో మీ మీజీవితాలనుండి గమనించండి. తర్కమన్న మాటకు అనవసరమైన అర్థాలు మనమే కల్పించుకుని, ఆ కొలతలనుండి దానిని నిరర్ధకమూ, దురర్ధకమూ నని కొట్టివేయ బూనడం సబబు. కాదు. హేతుబద్దమైన పరిశీలనారూపమైన అనుభావాంగ తర్కాన్ని విడిచిన వారు జీవితంలో ఎంతో కోల్పోతారు. విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖలలోనూ తర్కం-హేతుబద్ధ యోచన-ఆయా విజ్ఞానాభివృద్ధికి ప్రాణప్రదంగా ఉంటున్నది. అదలా ఉంచండి.
తర్కం జీవితావసరం, వికాస హేతువు కాదని చెప్పదలచుకున్న వారు కూడా తార్కికంగానే దాని అనవసరాన్ని నిర్ధారించే యత్నం చేస్తారు, తర్కం ఎందుకవసరం లేదో నిరూపించడానికి వారి కాధారమైనది మళ్ళా తర్కమే. ఇదెలా ఉందంటే తర్కాన్ని చంపాలనుకున్న వారు తర్కాన్ని బ్రతికించవలసి వస్తోం
3
దన్నమాట. మొత్తమ్మీద ఏమర్థమవుతోంది? ఏ విషయాలను గూర్చి సమగ్రంగా అర్థం చేసికోవాలనుకున్నా, నిర్థారణలకు రావాలనుకున్నా మేధస్సుకున్న ఒకే ఒక్క ఆధారం తర్క ప్రక్రియే. ఏ మానవుడైనా తార్కికంగానే ఆయా నిర్ధారణలకు వస్తాడు.
Note :- తర్కమంటే హేతూదాహరణల సామర్ధ్యంతో ఆయా విషయాలకు చెందిన    అవగాహసకు రావడానికై మేధస్సు చేసే మేధో ప్రక్రియ అనే నా యభిప్రాయం. నిజంగా నిజం కూడా అదే.
మనం యింత వివరంగా చెప్పిన పిదపనూ పిడివాదంతో- అదీ ఒక రక మైన తర్కమేనన్నది గమనించకుండానే- తర్కమెందు కవసరం లేదో తర్కించడం ప్రారంభిస్తారు మరికొందరు. వారిదాడి యిలా ఉండవచ్చు. సహజంగానే ఉన్న దానిని గూర్చి మళ్ళా తర్కం నేర్చుకోండి అని మీరెందుకు చెప్పడం? ఉన్నదాన్ని తెచ్చుకోండనడం వ్యర్ధ ప్రసంగం కాదా? సిద్ధ వస్తువుకై సాధనలేమిటి? వగైరా.
వారు నిజంగా ఉన్న విషయం చూడదలచుకుంటే కొన్ని విషయాలు పరి శీలించి చెప్పండని వారి నడగాలి. 1) తార్కికత జ్ఞాన ప్రక్రియలో సహజంగానే ఇమిడి ఉందా లేదా? ఉందన్న వాస్తవం వారు అంగీకరిస్తే తర్కం అనవసరమన్న మాట మీరెప్పడూ అనరాదు. 2) అది సరేనయ్యా, తర్కం సహజంగా ఉన్నదే కనుక నేర్చుకోవలసిన, నేర్పవలసిన అవసరంలేదు అంటున్నాము ఆన్నట్టైతే, మనిషి తనలో ఏర్పడి ఉన్న వనరులనే వినియోగంలోకి తేవడానికీ, వాటి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికీ, వాటిని సందర్భానుసారం-సమయోచితంగా- ప్రయోగించుకోడానికీ వాటిచేత క్రమబద్ధంగా విశేష పరిశ్రమ చేయించడం అవసరం. సహజంగా అదే పరికరాలున్న మేధావికీ, సామాన్యునికి ఉన్న తేడా ఏమిటి? ఎందు వల్ల ఆ తేడా ఏర్పడింది? అలానే ఆయా విషయాలకు చెందిన సామాన్య జ్ఞానానికి విశేష జ్ఞానానికీ తేడా ఏమిటి? అడెట్లా ఏర్పడింది? ఈ విషయాలను స్వానుభవం ద్వారా గ్రహించగలిగితే తర్కం ఒక విద్యగా కూడా ఎందుకు నేర్వవలసి ఉందో బోధ పడుతుంది.
4
పూర్వీకుల పరిశోధనాంశాలను యధాతధంగా (మొత్తమూ సత్యమేననే దృష్టితో) స్వీకరించుట ఎంత దోషయుక్తమో, అవి అక్కరలేనివిగా, పనికిరానివిగా భావించి విడచివేయడం కూడా అంతే దోషయుక్తము. గతం నుండి సంక్రమించిన విజ్ఞానాన్ని పరిశీలించడమూ, తన అధ్యయనంలో భాగంగా స్వీకరించడమూ నిరర్ధకమనే ఆలోచన విద్యావిధానానికి గొడ్డలిపెట్టు కాగలదు. ప్రతివ్యక్తి ఆయా విషయాలను స్వయంగా గ్రహించడం అసాధ్యం కానప్పటికీ,  ప్రతిదీ అలానే సాధిస్తాననడం అవివేకమూ, మూర్ఖతా కూడా అవుతుంది. అంతేకాక అధిక వ్యయ ప్రయాసలూ, కాలహరణము కూడా. ఒక్క విషయ మాలోచించండి. ఒక క్రమ బద్దమైన అభ్యాసరూపమైన పరిశ్రమ చేయని మేధస్సు చూసే చూపుకూ, చేసే నిర్ణయాలకూ, ఆ ప్రక్రియలో నిపుణత్వం సాధించిన మేధస్సు చూసే చూపుకూ, నిర్ణయాలకూ తేడా ఉంటుందా? ఉండదా? ఆలోచించండి. ఒక వృత్తాన్ని గీశామనుకోండి. దానికి ప్రారంభమూ, ముగింపు ఒక్కటా కాదా? ఆలోచించి చెప్పండి.
జీవితం సక్రమంగా సాగాలంటే బుద్ధి నిరంతరం వివేచనచేసి నిర్ణయాలు తీసికోవలసి ఉంటుంది. సమస్యను సరిగా చూడాలన్నా, సరైన పరిష్కారాన్ని కనుగొనాలన్నా వివేకం పాత్రే మౌలికమైనది. తర్కబద్దంకాని వివేకముండదన్నదో వాస్తవం. తర్కం యొక్క ఆవశ్యకతా, జ్ఞాన ప్రక్రియతో తర్కానికున్న సంబంధమూ, తర్కించే స్వభావం మనిషికి సహజాతమైనదే ఐనప్పటికీ దానినుపయోగించుటలో నిపుణతకై దానినో విద్యగా నేర్వవలసిన అవసరమూ అన్న వాటిని గురించి నేచూపిన ఆధారాలతోబాటు మీమీ యనుభవాలనుండిన్నీ ఆధారాలు లభిస్తాయేమో చూసి ఒక నిర్ణయానికి రండి. తర్కం తప్ప మరేదీ అక్కరలేదనో, తర్కం అక్కరలేనిదనో రాగద్వేష రూపమైన తొందరపాటు నిర్ణయాలకు రాకుండా నిదానంగానూ, నిష్పాక్షికంగానూ- తర్కమూ నిత్యజీవితంలో దాని పాత్ర- అన్న దానిని యభాతథంగా గమనించే యత్నం చేయండి. మీ మీ అభిప్రాయాలను సహేతుకంగా పత్రికకు వ్రాయండి. పై సంచికలో , మరికొంత విశ్లేషణ చేద్దాము.
5
ప్రస్తుతాంశమైన ప్రమాణ ధివేచనలో మరికొన్ని విషయాలు మీ ముందుంచు తాను. గమనించండి. ప్రమాణమన్న పదం పరికరాలకూ-పద్దతులకూ కూడా అన్వయిస్తుంది అన్న నా ప్రతిపాదనపైనే వివరణలు కోరుతూ కొందరు లేఖలు వ్రాశారు. వాటిని దృష్టి నిడుకునే గత సంచికలో కొంత వివరణ చేశాను. ఆ వివరణానంతరమ్నూపరికరముల ననుసరించి ప్రమాణములారు. ఇంద్రియములే అవి" పద్ధతుల ననుసరించి ప్రమాణములు మూడు (ప్రత్యక్షమూ, అనుమానము,శబ్దము)అన్నారు. ఇక్కడో విషయం తెలియవలసి ఉంది. పరికరముల ననుసరించి ప్రమాణములగు ‘6’టినే ప్రత్యక్ష ప్రమాణముగా నేను తెలిసికొని ఉన్నాను. మరి పద్దతుల ననుసరించి ప్రమాణములను వాటిల్లో ప్రత్యక్షమును కూడా లెక్కించినారు. మీ దృష్టిలో ప్రత్యక్షమనునది శోత్రనేత్రాది 6' ప్రమాణముల కంటె వేరా? ఒక్కటేనా? వేరే అయితే ఆప్రత్యక్షరూపమేమో తెలుపండి. శ్రోత్రాదులే ప్రత్యక్ష ప్రమాణమనుకుంటే పద్దతుల ననుసరించీ ప్రమాణములుంటాయని రెండు రకముల విభజనెందుకు? పద్దతుల ననుసరించిన ప్రత్యక్షానికీ, పరికరముల ననుసరించిన ప్రత్యక్షానికీ తేడా ఏమో తెలుపండి. అంటూ ఒకరిద్దరు వ్రాశారు.
పై సందేహాలకు సమాధానం చెప్పాననే నాకనిపిస్తున్నప్పటికీ నాభావం ఎదుటి వారికి అందవలసినంత స్పష్టంగా అందిచో లేదో? అన్న దృష్టి నుండి మరి కొంత వివరణ అవసరమనిపిస్తోంది. పద పదార్థము లెలా సంబంధపడి ఉంటాయో  పదార్ల నిర్వచనం ఎలా చేస్తే సమగ్రమవుతుందో తెలిసికోవలసిన అవసరముందిక్కడ. ఏ అర్ధాన్ని (అనుభవంలో ఉన్న దానినిఅనుభవానికాధారమైన దానినీ అర్ధమంటాము.) సూచించడానికి ఒక పదానికది అర్ధమవుతుంది. పదానికీ అర్థానికి సాంకేతిక సంబంధముంటుంది. పరిణితి చెందిన బాషలో నున్న పర్యాయపదాలూ (ఒక పదానికనేకార్థాలు) అన్నవాటిని మినహాయిస్తే ప్రతి పదమూ
ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఈ పదానికిదే అర్దము అన్న నివేకం కలిగియుండుటే విజ్ఞానం కలిగియుండడమంటే.
6
. Note :- పదాని కర్థం పదార్థం. అది తెలియడమంటే ఆ పదంచే సూచింప బడుతున్న విషయం అనుభవంలో ఉందన్నమాట. ఆయా విషయాలు తెలియడ మంటే ఏమిటో ఈ విషయం అర్థమైతేగాని తెలియదు. జిజ్ఞాసువుకు పదార్థాలు తెలియడమంటే ఏమో తెలియకపోతే గ్రంథాధ్యయనంలోనూ, శ్రవణం చేయుట లోనూ ప్రమాదపడే వీలుంది.
పద పదారముల నిర్ధారణ ఎలా చేయవలసి ఉంటుందో దృష్టాంత పూర్వకంగా చూద్దాము,
ప్రక్క ఒక నలుపు చుక్క వుంది. దానిని చూపి నలుపు పదార్థమది అన్నాను. మళ్ళా దానినే చూపించి రంగు అనబడే పదార్థము అనియూ, మూడవ సారి అది ఒక గుణము అనియూ, చెప్పాను. ఒకే విషయాన్ని చూపుతూ నలుపు, రంగు, గుణము అన్న మూడు పదాలు వాడాను. మూడు పదాలు ఒకే అర్ధాన్ని చూపుతున్నాయి కనుక అవి పర్యాయ పదములా? కాదనాలి. ఎందుకని నలుపున్న ప్రతిచోటా గుణముంటుదిగానీ, గుణమున్న ప్రతిచోటా నలుపుండదు. పులుపును చూపీ గుణమన వచ్చుగదా. అలానే నలుపన్న దానిని చూపి రంగన వచ్చుగానీ,  రంగున్న ప్రతిచోటా సలుపే ఉండాలన్న నియమం లేదు. అలానే గుణము. రంగు అన్నది కూడా. దీనిని బట్టేంతెలుస్తోంది పై మూడు పదములకూ మూడు పదార్లములున్నవనే గదా! (అయితే మూడు పదాలకూ ఉన్న మూడు వేర్వేరు పదార్థమ లను కనుగొనడమెలా అన్నది మీరే పరిశీలించండి. (పై మూటిలో ఒకటికంటే మరొకటి అధిక దేశవర్తిగానో, న్యూన దేశవర్తిగానో ఉంటున్నది. గమనించండి.)
ఆలానే పద్దతుల ననుసరించి ప్రమాణ నిర్వచనమూ, పరికరాల ననుసరించి ప్రమాణనిర్వచనమున్నూ చేయవలసి ఉంటుంది. పరికరము (జ్ఞానేంద్రియములు) ఈ విధానంలో పనిచేయుట ద్వారా ఈ రకమైన జ్ఞానం కలుగు తున్నది కనుక విధానము సనుసరించిన్నీ, ఈ రకమైన జ్ఞానమీ ఈ యింద్రియము వలనే కలుగుంది కనుక ఈ జ్ఞానమునకీ యింద్రియం ప్రమాణమని పరికరముల ననుసరించీ పేర్లు  పెట్టబడ్డాయని లోగడ చెప్పాను. అదెలానో చూద్దాం. ప్రత్యక్షమూ, అను
7
మానమూ, శబ్దమూ ... వగైరా .. ఇలా కదా ప్రమాణాలకు పేర్లున్నాయి. పరికరములననుసరించే ప్రమాణ పదార్ధాన్ని చెప్పవలసివస్తే. నేత్రమూ, శ్రోత్రమూ, ఇలా ఆ జ్ఞానేంద్రియాల పేర్లనే చెప్పితే సరిపోతుంది. అప్పడు వాటిచే కలుగుతున్న ప్రమలనూ క్రమంగా నేత్రప్రమ ఆకృతి, రంగ మొదలైనపనీ, శ్రోత ప్రమ. శబ్దజ్ఞానమనీ... ఇలా ప్రమాణ వర్గీ కరణమూ, ప్రమాణవర్గీ కరణమూ చేయవలసి ఉంటుంది. ఈ ఆరిటి ద్వారా కలుగుతున్న ప్రమనే ప్రత్యక్ష ప్రమ అన్నాము అంటే ఇందాకే చెప్పకున్నట్లు నలుపు, ఎరుపు, తెలుపు పదములన్నీ రంగు అన్నమాటచే చెప్పకున్నట్లు అవుతుంది. అయితే రంగు అన్న పదార్థానికీ, ఎరుపు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా ఎలా గమనించామో, అలానే ప్రత్యక్ష మన్న పదార్థానికీ, కన్ను, ముక్కు వగైరా పదార్థాలకూ ఉన్న తేడా కూడా గమనించాల్సి ఉంటుంది. ఎలా ఎరుపు పద నిర్వచనం రంగుకు సరిపోదో అలానే ఇంద్రియం ప్రమాణమన్న నిర్వచనం ప్రత్యక్షమన్న పదానికి సరిపోదు. కనుక ప్రత్యక్షమన్న పదం పరికరానికి పెట్టింది కాదుప్రత్యక్షంలో పరికరాలు సామాన్యంగా ఉంటాయి. ఎలా ఎరుపు రంగు, నలుపురంగు మొదuనవో అలానే నేత్ర ప్రత్యక్షమూ, శ్రోత్ర ప్రత్యక్షమూ మొదలగునవిన్నూ. ప్రత్యక్షంలో ఆరు యింద్రియములూ సామాన్యమై జ్ఞానం కలుగుతున్న పద్దతి విశేషమైయుంటుంది. విశేషాన్ని బట్టే ఆయా పద నిర్వచనాలు చేయవలసి ఉంటుంది. లక్షణంలో అసాధారణత్వం (అతివ్యాప్తి, అవ్యాప్తి అసంభవతలు లేని స్థితి) ఉండి తీరాలి.
 మరోకోణం నుండిన్నీ పరిశీలిద్దాం. ప్రత్యక్ష పదార్దమేదందాము? ఇంద్రియమా, ఇంద్రియములా ? అనుభవంలో అనేక రకాల జ్ఞానము అనేక ఇంద్రియాల ద్వారా కలుగుతున్నది కనుక ఇంద్రియములనాలి. అప్పడు ప్రత్యక్ష ప్రమాణమని గాక ప్రత్యక్ష ప్రమాణములు అనాల్సి వస్తుంది. అలానే అందామను కున్నా ఉన్న ఆరింద్రియాలూ ప్రత్యక్షంలోనే చెప్పబడ్డాయి కనుక మరి అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము ? ప్రత్యక్షంలోని ఇంద్రియాలనే చెబుదామంటే అది దోష యుక్త లక్షణమవుతుంది. కనుక వాటితో ఏ యింద్రియాన్నీ మరో ప్రమకు కరణంగా చెప్పడం కుదురదు. మరి మిగిలిన ప్రమాణము
8
లెలా సిద్దిస్తాయి? ఆలోచించండి. ఏ దృష్టినుండి ప్రమాణాలకు పేర్లు పెట్టుంటారో తెలుస్తుంది. అన్ని ప్రమలకూ పరికరములు సామాన్యములే. పద్దతులే విభేస్తు న్నాయి. పరికరాలుండడమూ, పనిచేయడమూ అన్నంతవరకూ, ఏర్పడితేగానీ ఏదో ఒక కార్యోత్పత్తి జరగదు. అనుభవమూ, జ్ఞానమూ పలరూపాలే గనక అట్టి దేర్పడుటకు ఏదో పరికరం ఏదో క్రమంలో పనిచేయ వలసి ఉంటుంది. పరికరాన్ని బట్టి ఫలితం మారితే అసాధారణత్వం పరికరంలోనూ, పని తీరుసు బట్టి ఫలితం మారితే అసాధారణత పనిలోనూ, చూసి తీరాలి. అట్టిదే ఈ విషయం కూడాఇంతా చేస్తే నా ప్రతిపాదన ప్రమాణ పదము ప్రకరణాన్ని బట్టి పరికరాలకూ, పద్ధతికి కూడా వర్తిస్తుందనీ, ప్రత్యక్షాది ప్రమాణ పదములు విధానముల ననుసరించి ఏర్పడినవనీ మాత్రమే. గమనించి అవసరమను కున్న ప్రశ్నలు వేయండి. -
గమనిక :- తర్కజ్ఞులైన శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యల వారు వేసిన ప్రశ్నలను దృష్టి నిడుకునీ ఈ వివరణ లివ్వడం జరిగింది. ప్రశ్న, తెలుసు కోడానికీ, పరీక్షించటానికికూడా పనికివస్తుంది. ప్రమాణ, తర్కములను క్రొత్తగా పరిశీలిస్తున్న వారి అవగాహనా సౌలభ్యతను దృష్టి నిడుకునో, విషయాన్నెలా నిర్ధారిస్తారో తెలుసుకుందామనో వారీ ప్రశ్న వేశారనుకుంటాను. ఏ దృష్టి నుండి అడిగినప్పటికీ పరిశీలించే చెప్పవలసిన నాకూ, పరిశీలించి నిర్ణయించు కోవలసిన మీకూ-పాఠకులకూ-కూడా మరింత అవగాహనకు ఈ ప్రశ్నావళి తోడ్పడగలదు. ఈ సందర్భంలో పాఠకులుగానే ఉన్న మిగిలిన తర్కజ్ఞులనూ నేను కోరేదేమంటే మీరున్నూ మీమీ కోణము నుండి విషయాన్ని పూర్వ పక్షం చేస్తే మరింత విశాలంగా, విస్తృతంగా ప్రకరణ విషయ క్షేత్రాన్ని దర్శించుటకు వీలవుతుంది. అందరూ స్పందిస్తారనీ ఆశిస్తూ ప్రస్తుతానికీ వ్యాసం ముగిస్తాను.

- సశేషం,

No comments:

Post a Comment