Wednesday, April 1, 1992

ప్రమాణ వివేచన - 5

సంపుటి-2                                 సంచిక-4                                            1-4-92
జ్ఞానార్థనలోనూ, విషయ పరిశీలనా, నిర్ధారణల సందర్భంలోమా ప్రమాణ తర్క విద్యలందు నిపుణత్వం కలిగియుండడం ఎంత అవసరమో గమనించసరిత కాలం వ్యక్తి వీటినొ విద్యగా నేర్వడానికి సిద్ధపడడు. ఆ లోపమే ఈనాడు తర్క విద్యను జీవితాపసరంగా చూడనీయకుండా చేస్తోంది. అటూ తార్కికులలోనూ, ఇటి తర్కజ్ఞానంలేని ఆయా ధోరణుల ప్రచారకులలోనూ కూడా తర్క ప్రమాణములను గూర్చి తప్పు భావనే చోటు చేసికుని ఉందీనాడు. ఆ విద్యలో ప్రవేశమున్న వారిలో ఎక్కువమంది దానిని, గతంలోనే మనమనుకున్నట్టు స్వీయ జీవిత యానానికి చుక్కానివంటిదనికాక, ఒక వృత్తిగా-బ్రతుకుతెరవుగానూ, ఆసలు దాని పూర్వాపరాలే తెలియనివారు అదో క్కలేನಿ అంశంగానూ పరిగణిస్తున్నారు. అయినా జీవస్వభావంలోనే ఉన్న తర్కించే గుణం వల్ల ఆస్తవ్యస్తపు తర్కాన్ని (అదీ తర్కమేనన్న స్పృహ కూడా లేకనే) తమ తమ పిడివాదాలు నిలబెట్టుకుంటానికి ప్రయోగిస్తుంటారు. ఆయా విషయాలకు చెందిన మిడిమిడి జ్ఞానంతోనూ, తెలిసీ తెలియని తర్కంతోనూ వారు వెచ్చించే కాలమూ, పడే శ్రమా కూడా నిష్ప్రయోజనకరమో,  దుష్ప్రయోజనకరమో అవుతున్నయన్న వివేకమూ వీరికుండదు.  తర్కం ఎందుకక్కర లేదో  తర్కంచే వీరిని  చూచి ఏమనుకోవాలి నిష్కర్షగా  చెప్పాలంటే దురభిమాన దుర్విదగ్దులైన అమాయకులు వీరు. వీరిని వీరి అమాయకత నుండి బయటపడవేయడం కూడా మిక్కిలి కష్టమౌతోంది. ఎందుకనగా ఆయా విషయాలలో తామింకా అల్పజ్ఞులమేనన్న విషయాన్నీ తెలిసికోనీయదు వీరి దురభిమానంతర్కశాస్త్ర వాద ప్రక్రియలలో ఒకటైన జల్చవాద ప్రక్రియ లక్ష్యాలలో ఇట్టివారినుద్దరించాలనే ఆకాంక్ష కూడా ఒకటేమో ననిపిస్తుంది నిశితంగా ఆలోచిస్తే. ఇట్టివారిని పోటీకి-పరీక్షకు-పెట్టి పదేపదే ఓటమికి గురిచేయుట అన్న ప్రక్రియద్వారా డ తడవ వ్యక్తులలో కొందరినైనా అత్మవిమర్శనాశీలురనుగా చేయవచ్చు. నిజమైన పట్టుదల గలవారైతే మాత్రం వారి ఓటమే వారిని ప్రయత్నపములను చేసి ఆయా విద్యలందు నిపుణులనుగా చేయగలదు. ఆయితే ఈ విధానంలో ఒక ప్రమాదమూ ఉంది. సత్యమన్నిటికంటె విలువైనదనియూ, ఆట్టి సత్యజ్ఞానాన్ని తాను పొందాలనియూ కోరుకునే వారికే ఈ విధానంవల్ల మేలు కలుగుతుంది. అట్లు కానివారిలో ఇది-ఓటమి- ఎదుటివారిపై ద్వేషాగ్నులను రగుల్కొలిపి మరింత మూర్ఖులనుగా మార్చివేస్తుంది. ఇక్కడ్ మీకో విషయాన్ని-జరిగినదే సుమండీ
చెప్పాలనిపిస్తోంది. నేనూ ఒకరకంగా ఈ కోవకు చెంది ఉన్నవాడినే ఒకప్పడు. కాకుంటే అప్పట్లో ఆయా విషయాలపై నాకున్న అతి అభిమానం దురభిమాన - స్థాయికి చేరి ఉండకపోవడంవల్లనూ, సత్యం అన్నిటికంటే విలువైనదనీ, దానివద్ద యిష్టాయిష్టాలకు విలువలేద్దన్న వివేకం ఉన్నవాడినగుటచేతనూ ఆనాటికి నేననుసరి స్తున్న విషయాలను-ఓటమికి గురైనంతవరకు-సమూలంగా విడచివేశాను. సత్యమూ, ధర్మమూ నన్నవి తప్ప మిగిలిన వాటిని అభిమానించనవసరంలేదన్న దృష్టిని పెంచుకుని జీవితాధ్యయనాన్నీ జీవికనూ సాగిస్తూ వస్తున్నాను. ఈ పద్దతిలో ఎదురైన గెలుపోటములు రెండూ మానావమానములకు, హేతువులుగా కాక వికాస హేతువులుగానే నాకుపయోగపడుతున్నాయన్నది నిరంతరం నేను గమనిస్తున్న అంశం. మీరూ ఈ అంశాన్ని చక్కగా విచారించి ఈ స్వభావంవల్ల - ప్రయోజనముంటుందో లేదో తేల్చుకోండి.
ఈ దృష్టినుండే గతసంచికలో తర్కం ఒక విద్యగా నేర్వనక్కరలేదనుకునే వారికొరకు కొన్ని ప్రశ్నలు వేశాను. వివేచనలోనూ, తార్కికతలోనూ, యదార్థ  నిరూపణలోనూ తమకు తామే సమర్ధులమనుకునే అట్టి వారిని మరల ఈ సంచిక  ద్వారానూ పోటీకి ఆహ్వానిస్తున్నాను. పోటీకి సిద్ధపడండి. మీరు గెలిచినా, నేను గెలిచినా యిరువరకూ మేలే. మీరే గెలిస్తే బినమ్రంగా నా ఓటమి సంగీకరించి విశేష జ్ఞానానికై మరింత కృషి చేసి ఎదుగుతాను. మీరోడినా నిజాయితీగా ఆ ఓట్టమిని అల్పజ్ఞతగా స్వీకరించి విశేషజ్ఞానానికై యత్నించండి. విద్యావిషయమైన స్పర్ధ ఇరుపక్షాలకూ హితకారి కాగలదు. అయితే ఆ స్పర్ధ ద్వేషకారణం కాకుండా ఇరువురం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. స్పర్థయా వర్థతే విద్యా-అన్న సూక్తిని స్వీకరించే ఈ పోటీ అన్నది గమనించండి. ఏడో ఉపాయంతో అందరం వివేకవంతులం కావాలన్నదే నాయాకాంక్ష. సరే గతసంచికలో నేను ప్రస్తావించిన ప్రశ్నావళినే మరోసారి గుర్తు చేసికుందాం.
1)     ప్రమాణము లెన్ని వాటివాటి కార్యక్షత్రముల వివరమేమి?
2)      భ్రమ స్వరూపస్వభావాలూ, రక్షాలూ, కారణాలూ చెప్పకోండి చూద్దాం?
3)     పదార్ధాలెన్ని? వాటిని నిర్ధారించుట ఎలా?
 4) మానవుడు పొందవలసిన దేమి? దానిని పొందుట ఎలా ?
Note :- పాఠకులందరూ ఈ అంశాల్ని పరిశీలించి సమాధానాలు పొంద వలసే ఉన్నప్పటికీ, నా ఉద్దేశం ప్రకారం ఇతరుల యోచనలను అధ్యయనం
3
చేయనక్కరలేదన్న వారికొరకే ఇది ప్రత్యేకింపబడింది. హేతుబద్ధతా (తార్కికత). యోచనాశీలతా నాకూ ఉన్నాయి, ఇతరుల యోచనలనూ, తర్కరీతులనూ గ్రహించేదేమిటి ? అనే పక్షీయులు ఇతరుల యోచనలను తమపై పడనీయ కుండా యోచించి పోటీలో పాల్గొనండి. జిజ్ఞాసువు లందరకూ ఈ అంశాలు ఎరుగ వలసినవే యగుట వలన ఇష్టమున్నవారు వారి యోచనలనూ పత్రికకు పంపండి. ఆ విధంగా ఈ శీర్షిక సమగ్రమూ, సార్థకమూ కూడా కాగలదు.
ప్రకరణాంశమైన ప్రమాణ వివేచనలో ప్రమాకరణం ప్రమాణమనీ, అసాథారణ కారణం కరణమనీ చెప్పకున్నాము. ఆ కరణత్వం-అసాధారణ కారణం కాగల అర్హత-సందర్భాన్ని ಬಜ್ಜಿ 1) పరికరాలకూ (ఇంద్రియాలకు), : 2) పద్ధతులకూ (ప్రక్రియా విశేషాలకూ) ఉంటుందనీ ఆనకున్నాము. దీనిపై గత సంచికలలో తగినంతగానే పరిశీలనలు సాగించాము కూడా. పాఠకులనుండి సండే హాలుగానీ, సూచనలుగానీ మార్చి సంచిక తరువాత రాలేదు కనుక ఆపై పరిశీలించ వలసిన విషయాన్ని ప్రారంభిస్తున్నాను.
ప్రమాకరణం ప్రమాణమన్న మాటలోని కరణ విషయాన్ని చర్చించాము కదా! ప్రమ అన్న పదాన్ని గూర్చీ కొంత పరిశీలన చేయవలసి ఉంది. దానివల్ల ముందు ముందు మనం పరిశీలించవలసిన అనేక విషయాలలోని వాస్తవా వాస్తవా లను గంచడం సుళువౌతుంది.
ప్రమ అన్నమాటకు యదార్థజ్ఞానం అన్న రూఢ్యర్ధం ఉంది వ్యవహారంలోజ్ఞానరూపాలే అయిన సంశయాన్నీ, స్మృతినీ మినహాయించితే (ఆ రెండూ జ్ఞాన రూపాలా కాదా అన్నది మీరూ, యోచించండి. సందర్భం వచ్చినపుడు పరిశీలిద్దాం) కలుగుతున్న జ్ఞానం ఒప్పుజ్ఞానమనీ, తప్పుజ్ఞానమనీ రెండు రకాలు. మనకు వెనుకటి వాళ్ళు యదార్థజ్ఞానమును ప్రమ అనీ, అయదార జ్ఞానమును భ్రమ అనీ అన్నారు. విభజన కొరకు రెండు పదములూ అవసరమే కనుక ఇంతవరకు మనకూ ఆథ్యం తరం లేదు. కానీ ప్రమాణ పద విచారణలోనున్న 'ప్రమ"కు యదార్థజ్ఞానమన్న అర్ధాన్ని చెప్పకుంటే, [ప్రమాకరణంలోని కరణమను మాటకు ఇంద్రియమో, విధానమో ఏదో ఒకదాని నర్థంగా చెప్పకున్నా) కలుగుతున్న జ్ఞానమంతా యదార్ధమే ననవలసి వస్తుంది. ఆయితే జరుగుతున్న జ్ఞానక్రమాన్ని పరీశీలిస్తే ఆయా యింద్రియాలద్వారా, ఆయో పద్ధతుల వలన కలిగిన జ్ఞానాన్ని మరల వాస్తవమా కాదా? పరిశీలించుకోవలసి వస్తున్నది. మరో కొలతకు-పరీక్షకు-కలిగిన జ్ఞానాన్ని
4
లోనుచేసే అది యదార్ధ జ్ఞానమో, భ్ర మ జ్ఞానమో నిర్ణయించుకుంటున్నాం, సహజ
క్రమమిలానే ఉంది. ఎతో ప్రధానమైన ఈ అంశాన్నీ పరిగణనలోని తీసుకోకపోవడం వల్లనే భిన్నభిన్న ధోరణులవారు. ఎవరి ప్రమాణాలను వారు పెట్టుకుని, అన్యులవి అప్రమాణములనుకుంటున్నారు. ఆయా సిద్ధాంత చర్చలలోనూ, సత్యా విష్కరణ చేయబూనినప్పడున్నూ వాస్తవం నిర్ధారింపబడకుండ అడ్డుపడుతున్నదీ అంశమే. ఎందుకంటే యదార్థజ్ఞాన సాధకమన్నది ప్రపంచంలోని ఎవ్వరికైనా, 3. కాలమండైనా ఒక్కటే ఆయ్యుండుట ఆవసరమూ, తప్పనిస కూడా. లేనిచో యదార్థమన్నది - సత్యమన్నది - వ్యక్తిగతమైపోతుంది. అప్పడిక తప్పొప్పుల ప్రస్తావనే పొసగదు.

ఆలానే ప్రమాకరణం ప్రమాణంలోని ప్రమకు యదార్థజ్ఞానమనుకుంటే, మరి భ్రమకూడా ఒక రకమైన జ్ఞానరూపమే కనుక దానిని సాధించుటకున్నూ ఏదో ఒక పరికరమూ, ఒక క్రమంలో పని జరగడమూ అవసరమయ్యే ఉంటున్నది. మరి ఆ పరికరాలేవి?  ఆ పద్దతులేవి?  వాటినే పేర్లతో పిలవాలి. ఈ అంశాన్ని విచారించేముందు ప్రమాణంలోని ప్రమకు యదార్థజ్ఞానమన్న అర్ధాన్ని స్వీకరించిన వారినుండేమైన ప్రతిపాదనతొస్తాయేమో గమనించుదాం. దీనిపై విశేష పడిశీలన పై సంచికనుండి. - (సశేషం)

No comments:

Post a Comment