పంపుటి – 2 సంచిక – 5 1-5-92
ప్రమాణాల్ని గురించిన సమగ్రమైన అవగాహన లేకుండా ఆయా విషయాలను గురించి
తెలుసుకోవడంలో ప్రమాదపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అసలు తెలియడమంటే ఏమో సరిగా
తెలియకుండానే సామాన్యుల నుంచి మేధావుల వరకూ, ప్రాచీన కాలనుండి నేటివరకూ అనేకమంది తమకు
నిజంగా తెలియని
విషూలెన్నింటినో తెలిసినవాటిగనే ఎంచుతున్నారు. జ్ఞానార్థనలో ఎంతో ప్రమాదకరమైన ఈ
అంశాన్ని వారు గుర్తించుటలేదు సరికదా ! వారిచే ఆ విషయం గంపజేయడం కూడా మిక్కిలి
కష్టసాధ్యమై పోతోంది. ఎందుకంటే ఇట్టి వారు ఆయ విషయాలు అప్పటికే తమకు
తెలిసిపోయినవనే తమకు తెలిసిపోయినవనే నిర్ణయానికొచ్సి ఉంటున్నారు కనుక. ఇట్టి
ప్రమాదకర పరిస్థితి నుండి మేల్కొలపబడిన పిదప వాస్తవాన్ని(అప్పటికి నిజంగా తానున్న
స్థితిని) గమనించిన యదార్ధ జిజ్ఞాసువైన ఒక మేధావి పల్కిన పల్కులీ సందర్భంలో(ఆత్మ
పరిశీలనాశీలురం కాగలిగితే) మనకూ ప్రయోజనకారులు కాగలవు. ఆలోచించండి.
తెలియని ఒకింత
లేని సర్వస్వం తెలిసినంచు తృప్తుడనైకరిభంగి చరించితిన్
ఇప్పుడు జ్వల మతులు సన్నిధినించుక
బోధశాలినై తెలియని వాడనైతి మయ్యె నితాంత గర్వమున్
ఈ పద్యాన్ని
విన్న వాళ్ళూ, చదివిన వాళ్ళూ చాలా మంది ఉండవచ్చు. మీలో అయితే దీని సారాంశాన్ని హృదయానికి
పట్టించుకున్న వాళ్ళూ చాలా అరుదు. నిజంగా ఏ జిజ్ఞాసువైనా దీనిని తన హృదయంగమం
చేసికోగలిగితే అది అతని జ్ఞానార్జనలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. మాట వరసకు మనమెంత,
మనకు తెలిసిందెంత అని అంటున్నా ఎవరికి వారు ఆయా విషయాలలో తనకు
సరైన-సంపూర్ణమైన జ్ఞానం కైసి ఉందనే భావించుకుంటున్నారు. ఎందుకంటే, ఆయా విషయాలలో తాను తెలిసిన
వాడిననేనన్న భావన అంతర్గతంగా లేకుంటే చర్చలూ, నిర్ణయాలూ
చేయత్నించడు మనిషి. కానీ ఈనాడు లోకాన్ని చూడగలిగితే ఏ య్ద్దర్ని పరిషీలించినా-
అదంతే, ఇదింఏ అంటూ వాద ప్రతివాదాలు చేస్తూండడం కనిపిస్తుంది.
అయితే యదార్ధంగా చర్చ అన్నది ఏ యిరువురి మధ్య సాధ్యపడుతుంది? అన్నది కూడా ప్రముఖమైన చర్చనీయాంశంగానే ఉంది. చర్చ ప్రారంభించ
2
దలచుకున్న
వారందరూ ముందుగా ఈ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం అవసరం. లేకుంటే నిరర్ధకమైన, పిడివాద రూపమైన వాగ్వివాదాలే
జరుగుతాయి. నేడు సర్వే సర్వత్రా గోచరిస్తూ, సమయాన్నీ,
మానసిక సమతౌల్యాన్నీ కూడా హరించి వేస్తున్న ప్రమాదకరమైన అంశమిది.
“అజ్ఞానేనావృతం తేన ముహ్యంతి
జంతవః” అన్న వ్యాస వచనం కూడా, ఈ విషయాన్ని సూచిస్తూ చేసిన హెచ్చరికలాంటిదే. అజ్ఞానంచే
జ్ఞానం కవ్పివేయబడుతోంది. దానిచే జనులు మోహితులౌతున్నారు. (కింకర్తవ్య మూఢతా
మోహస్య లక్షణం) అజ్ఞానం అంటే ఏమీ తెలియకపోవడమన్న అర్థం కాదిక్కడ. ఏమీ తెలియనితనం
జ్ఞానాన్ని కప్పివేయజాలదు. అలా తెలియనివాడు ఆయా విషయాలు తనకు తెలియవనే
అనుకుంటుంటాడు, కనుక అతనికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి
తెలియకనే తెలుసనుకుంటున్నాడే, వాడిఆజ్ఞానాన్సే అజ్ఞానం అంటున్నది గీత. గీతలో చెప్పబడింది
గనుక ఆ మాట విలువైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. నాటి గీతాకారునికిన్నీ ఈ విషయం
తెలిసే ఉందన్నదీ, ఈనాడు తమను
తామే మేధావుల మనుకుంటున్న- వెనుకటి వాళ్సందరూ అజ్ఞానులే ననుకునే అనేక
సిద్దాంతాల ప్రచారకులన్ను ఈ విషయం తెలిసి లేదన్నదీ గమనించమంటున్నాను. ఇంత
మాత్రమైనా తెలియకనే తామెంతో తెలిసిన వాళ్ళమనుకుంటున్నవారిని జాలిపడాలి నిజంగా. ఏవో
నాలుగు గ్రంధాలు- నేటి భౌతిక విజ్ఞానానికి చెందినవిగానీ, నాటి
ఆధ్యాత్మిక గ్రంథాలనబడేవిగానీ చదివి [కేవలం చదివిమాత్రమే. కనీసం వాటివరకైనా
అధ్యయనం చేసిందీలేదు) స్వయం ధీరులమూ, సిద్ధాంతకారులమా
ననుకుంటూచేసే దురహంకార పూరిత చర్చలూ,
ప్రతిపాదనలూ, ప్రచారాలూ
కూడా దాదాపు - అజ్ఞాన జనితాలై, రాగద్వేష సంకలి జ్ఞానార్థనలో
అద్భుతాల్ని సృష్టిస్తుంది. మాటవరసకు మనమెంత,
మనకు తెలిసిం తాలై మానవ
సంఘాన్ని పెడదారుల పట్టిస్తున్నాయి. సంఘహితైషులూ, సమ్యగ్వివేకులూనైన
వారెల్లరూ ఇట్టివారిని ప్రతిఘటించో,
మేలుకొలిపో వారిని సరైన
మార్గా నికి మళ్ళించాల్సి ఉంది. ఈ మాట ఎవ్వరిపైనగానీ వ్యతిరేకత నిడుకుని అంటున్నది
కాదు. మానవ వికాసానికిది ప్రతిబంధక మన్న దృష్టినుండి చెబుతున్నది మాత్రమే
విషయాన్ని నిదానంగా గానూ, కూలంకషంగానూ పరీకించి మంచిని గించగల
నిర్ణయానికి రండి. మంచి హృదయంకల మేధావులందరూ ఒకటి కావాలన్నదే నా యాకాంక్ష. సరే
విషయానికొస్తాము. తెలియకనే తెలుసనుకుంటున్నాడే వాడు, తనకున్న
అజ్ఞానాన్నే-తప్ప తెలివినే-జ్ఞానంగా అభిప్రాయపడడం వలన
3
జరిగే ప్రమాదం అంతింతనలేము. ఏమంటే అట్టివాడు ఆయా విషయాలు తనకు తెలిసిపోయినవనే
నిశ్చయానికి రావడంవల్ల వాటిని గూర్చి తెలుసుకునే యత్నమే చేయడిక. పోనీ, తనవరకు
చెడి అంతటితో ఊరుకుంటాడా అంటే, అదీ లేదు. జీవ స్వభావంలోని
గుర్తింపు పొందాలనే గుణంవల్ల తెలిసింది ఎదుటివానికి చెప్పాలన్న తృష్ణ ఏర్పడి, ఆయా
విషయాల్ని ఎదుటివారికి తెలిపే యత్నం ప్రారంభిస్తాడు మానవుడు. మరి నిజమేమో
తెలిసిందనుకుంటున్నాడే గానీ, అసలు తెలియదు. అతనికి
జీవధర్మం వల్ల తెలుపకుండా ఉండలేడా యొ. ఆపై ఏమి జరుగుతుందో ఆలోచించ గలిగితే
ఆలోచించండి, గుడ్డివాడు మరో పదిమంది గ్రుడ్డివాళ్ళకు
దారిచూపుతాడన్న మూట యిక. నురో ఉపనిషదృషి ఈ అంశాన్ని తన జీవితాధ్యయనం నుండి మరింత
స్పష్టంగా గ్రహించినట్లగుపిస్తుంది అతని రచన చూస్తూంటే. ఉపనిషత్సాహిత్యమంతా
అనాగరికుల వాచాలతే ననుకునే నేటి నవీన మేధావుల మనుకునేవారి బుద్ధిలేనితనానికి
విచారించగలం, సానుభూతి చూపగలం వారి అవివేకానికి. అంత
మాత్రమే. అంతకు మించి వారి విషయంలో మనమేమీ చేయలేము. ఎందుకంటే నిజంగా తెలియని ఎన్నో విషయాల్ని ఈ
తరహా వ్యక్తులు తెలుసుననుకుంటుంటారు. రాగద్వేషాలు విడచి (వెనుకటి వాళ్ళు
చెప్పిందంతా బంగారమనో, చెత్త అనో అభిప్రాయం పెట్టుకోకుండా) ఈ
విషయాన్ని పరికించండి. ఈ మాటెందుకంటున్నానంటే వెనుకటి వాళ్ళపేరన ఉన్న సాహిత్యంలో
చెత్త కూడా తగినంతగానే ఉంది కనుక. ఇక్కడ పనిచేయవలసింది వివేకం మాత్రమే. -
- అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితమ్మన్యమానాః
దంద్రమ్యమాణాః
పరియన్షిమూథాః అంధేనైవ నీయమానా యధాంథాI
–
విద్యకాని విద్య అవిద్య, తెలియకనే తెలుసుననుకునేతనం.
(తప్పు తెలివీ లేక భ్రమ) అందులో మునిగి చరిస్తున్నారు కొందరు. అయితే వారు తమకు
తామే ధీరులం, పండితులం
" అని
ఎంచుకుంటున్నారు. ప్రకటించుకుంటున్నారు. వీరి చుట్టూ తిరుగుతూ, వీరి
వెంటబడిపోతున్నారు మరికొందరు మూఢులు. వీరిని చూస్తుంటే గుడ్డివాని వెంటబడిపోతున్న
గ్రుడ్డి వారివలె అగుపిస్తున్నది అన్నది శ్లోక భావం. తమాషా ఏమంటే ఈ కోవకు చెందిన
పండితమ్మన్యులున్నూ ఈ శ్లోకాన్నే వర్ణంచి అమాయకులకు చెప్పడం జరుగుతోంది. ఇక్కడనే
పాఠకులకూ, విమర్శకులకూ, జిజ్ఞాసువులకూ
ఓ సంశయం పుడుతోంది. విషయం తెలిసినవాడూ,తెలుసుననుకుంటున్నవాడూ
(జ్ఞానీ-అజ్ఞానీ కూడా) ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. మరి
4
వారిరువురిలో
అసలైన వాడెవరో నిర్ధారించడం ఎలా ? అన్నదే ఆ సందేహం. ఇదీ
- పైకి చిన్న విషయంలా అనిపిస్తున్నా, నేడున్న
ఏ సి దాంతానికి చెందినవారూ దీని నంత పధానంగా గమనించకపోయినా మొటమొదట
తేల్చుకోవలసిన ఆంశమేయిది. ఇక్కడ కూడా ప్రమాణ వివేచనావశ్యకత రంగప్రవేశం చేస్తోంది.
తెలియడమంటే ఏమిటో, ఆ తెలియడాలెన్ని రకాలో, సత్యా
సత్యాలు నిర్ణయించే శక్తి ఏ రకంగా ತಶಿಸಿ మూత్రమే ఏర్పడుతుందో
స్పష్టంగా తెలిసి మాత్రమే ఏదో రకంగా తెలిసికునో, అసలు
తెలియకుండగనే తెలిసిందనుకుంటూనో చేసే చర్చలూ,
సిద్ధాంతాలూ కూడా కేవలం
నిష్ఫలాలైతే పరవాలేదు. అవి తరచు దుష్ఫలితాల్ని అందిస్తాయి సమాజానికి. వీటికి
సంబంధించిన ప్రశ్నలనే గత సంచికలో నేను ప్రస్తావించింది. తెలియడమంటే ఏమో, సత్యం
తెలియడమంటే ఏమో చక్కగా తెలిసి, ఆ విధానాల ద్వారా సత్యాన్ని
గమనించినవారే సైద్ధాంతిక చర్చలకు
యధార్ధంగా అర్హులై ఉంటారు. మిగిలినవారి వాదనలన్నీ - వారంతటి వారుగా సమాజంచే
గుర్తింపబడుతున్నప్పటికీ- ఊకదంపుడులే అవుతాయి
ఈ సందర్భంలోనే పాఠకులందరకూ మరో హెచ్చరిక చేయడేమూ ఉచితమనిపిస్తోంది. ఎదుటి
వారినుండేదైన ప్రతిపాదన విన్నప్పడు మనం. (1)
అవి తనకవసరం లేని విషయమైనప్పడో, (2) అప్పటికే ఆ ఏషయం మనకు పూరిగా అవగాహనమైయున్నప్పడో, (3) అసలేమీ అర్థంకానప్పడో మాత్రమే మనం ఆవిషయమై తగినంతగ స్పందించము. ఈ మాట ని మేనని
మీరంగీకరిస్తే.ప్రమాణ వివేచన పైగానీ,
గత సంచికలో నేనడిగిన
ప్రశ్నలపైగానీ మీ నుండి తగిన స్పందన ఎందుకు రావడంలేదో నా కర్థకాని విషయం. నిజంగా
జీవితానికిది అనవసరమనిపిస్తోందా? ఇప్పటికేపూర్తిగా తెలిసి
ఉందా? అసలేమీ బుర్రకెక్కడం లేదా? మరింకేదైనా కారణముందా? పత్రికకో
రూపునివ్వడానికి ఎంతో మానసిక శ్రమా,
కాలమూ కూడా ఖర్చు చేయవలసి
వస్తోందన్నదో నిప్పులాంటినిజం. యదార్థంగా ఏ లాభము కోరనినాకు స్వీయశ్రమ నిరుపయోగమవు
తున్నదేమోనన యోచన పుట్టినప్పుడల్లా కొంత బాధాకరంగానే ఉంటుంది.
ఆశ్చర్యో వక్తాకుశలో న్చలబ్ద్యా ఆశ్చర్యో జ్ఞాతాకుశలాసు శిష్టః
తెలియ జేప్పడంలో (చెప్పడంలో
కాదు) కుశలుడైన వక్తా, గ్రహించడంలో (వినడం లోకాదు) కుశలుడై న
శ్రోతాలభించడం ఆశ్చర్యపడవలసిన అంశమే నన్నది ఈశోక తాత్పర్యం. విద్యా విధానాన్ని
కాసివడపోస్తేగానీ గుర్తించలేని సూక్ష్మ విషయం ఇది
5
సరే ప్రకరణ విషయాని కొస్తాను. గతసంచికలో,
ముందు సంచికలో ప్రస్తావించిన
అంశాలపై సందేహాలూ సూచనలూ రాలేదు కనుక మరి కొంత ముందుకు సాగుదాం అంటూ వ్రాశాను.
తరువాత శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారినుండి మరో లేఖ అందింది. ప్రమాణవివేచన
మన్నది. పరుగులిడకుండ అధ్యయనం చేయవలసిన జటిల విషయమగుటచే మరల ఒక అడుగు వెనకకు
వెళ్ళి పునర్విమర్శ చేద్దాం విషయాన్ని,
మరింగంటి వారి లేఖ కూడా
ప్రచురిస్తున్నాను నిదానంగా పరిశీలించండి.
సురేంద్రగార్కి, నమస్కారములు. సంచిక-8, 1-3–92. అందినది. అందులో నా లేఖ ప్రచురించినారు. సంతోషం. ఐతే మీ సమా
ధానం స్పష్టంగా లేదు. ప్రత్యక్షమనునది. శ్రోత్రాదులు '6' కంటే
వేరా? ఆ ఆరూ మాత్రమేనా?
'6' మాత్రమే
అయితే ప్రత్యక్షం మొదటి వర్గంలోనే చేరాలి. రెండవ వర్గములోనూ ప్రత్యక్షమును మీరు
చేర్చినారు. అది కుదరదు.
ఆ ఆరిటికంటే
వేరుకూడా ప్రత్యక్షము అంటే అది ఏదో చెప్పాలి అన్నాను. దీనికి మీరు జవాబు
చెప్పలేదు. ఒక విషయ మడిగితే మరికొంత మీ
అభిప్రాయాన్నిక్రోడీకరించడం నాకు (ఆడిగిన వ్యక్తికి) అనవసరం. రంగు-ఎరుపు సామాన్య
విశేష వాచకొలన్నాను. పర్యాయ పదాలని ఎవరన్నారు?
ప్రమాణ మింద్రియమని
ఎవరన్నారు?. ప్రమాణవ్యత్పత్తి మీరు ప్రదర్శించిన
రెండువిధాలుగా కనుపించినా ప్రమాకరణమను అర్దమేగాని వేరర్ధము రాదు. 'యేన' అన్నా, అనేన’ అన్నా
కరణార్ధంలో ల్యుట్ ప్రత్యయ మని చెప్పడానికేకదా. మొదటి ప్రశ్నకు జవాబు రానిదే ఇక
అడగలేను. సెలవ్. అంటూ వ్రాశారు. సరే.
పాఠకుల కిచ్చటో విషయం చెప్పాలి. అర్హమైనా కాకున్నాచదువుకుంటూ పోవడమూ, చదివేశానను
కోవడమూ పరిపాటిగా ఉంటున్న రోజులివి. ఆధ్యయన శీలురు ముందీ మార్గాన్ని విడచి, ప్రతి
పదారాన్నీ గ్రహించుతూ, వాక్యసారాంశాన్నీ గ్రహించాల్సి ఉంటుంది. అదే
సరైన అధ్యయనరీతి. పద పదార్ధ జ్ఞానం లేని వారికి వాక్యార్ధ జ్ఞానం కలుగదన్నది
భాషాస్వభావానికి చెందిన ప్రాధమిక నియమాలలో ఒకటి. దీనిని గమనించి ఈ ప్రశ్న మనది
కొదు గదా అని యను కోకుండా, పరిశీలనకిదో ఆవకాశంగా భావించి
ప్రశ్ననూ, సమాధానాన్నీ పరిశీ లించండి. ‘శ్రీ
మరిగంటివార్కి, ఆర్యా,
విషయాన్ని కేవలం . మనమిరువురమే పరిశీలించడం లేదు కనుకనూ పది
మందికీ, ఈ విషయంతో పరిచయాన్నీ,
ప్రవేశం
కలిగించడం పత్రిక ఉద్దేశం కనుకనూ సమాధానం
మరి కొంత
6
సమాచారంతో
కూడి వివరణాత్మకంగా ఉండడం అనివార్యం. అవసరం కూడా. , అదలా
ఉంచండి. చర్చా సందర్భంలో యిరు పక్షాలూ ఒక విషయాన్ని గమ నించి ఉండడం ప్రయోజనకారి
కాగలదు. అదే మంటే మన మనుకుంటున్న మాట ఎదుటి వాడు చెప్పలేదు కనుక ఆస్పష్టంగా ఉంది
అనడం కాక, ఎదుటి వాడు చెప్పాలను కుంటున్న భావము-(తానేమి చెప్పాలనుకుని
ఆ మాటలు ప్రయోగిస్తు న్నాడన్న దృష్టినుండి) ఏమిటన్నది ప్రధానంగా చూడవలసి ఉంటుంది,అట్లు
కానప్పడు అది క్రమంగా జల్పాకృతిని పొంది చలాన్ని కూడా ప్రయోగించడం వరకూ సాగుతుంది.
(జల్పవాదమంటే గెలుపు కొరకే చేసేవాదం-నా మాటే నిలవాలన్న దృష్టితో చేసేది, చలమంటే
వక్త ఉద్దేశానికి భిన్నమైన అర్ధాన్నిఅతని మాటలకు కల్పించి దోషచూప బూనడం. Misister Protection. ఇవి పాఠకులు గమనించవలసిన అంశాలుగనుక వివరించడమైనది) సరి,
'6' ఇంద్రియాలద్వారా ఏర్పడే
ప్రత్యక్ష జ్ఞానం కంటే అన్యంగా ప్రత్యక్ష ముందా? ఉంటే
అదేమిటి? అనేది మీ ప్రశ్న. మొట్ట మొదట నా ప్రతిపాదనేమిటి? ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ
అన్న పేర్లు పరికరాలయందలి విశేషాలనుబట్టికాక,
పద్దతులందలి తేవాలను దృష్టి
నిడుకుని ఏర్పరచ బడ్డవని. ఇక్కడ మీకు అభ్యంతరమేమో ప్రశ్నించండి. ప్రత్యక్షం 6. ఇంద్రియాలకంటే
వేరైనదా? చెప్పండంటూ దానిని మీరు. మరో మార్గం పట్టించారు. నా
దృష్టంతా ఆ పదాలు ఏ విషయాన్ని ప్రత్యేకించుట
కేర్పడి ఉంటాయో వివరించడంమాత్రమే. పర్యాయ పదాలు కానంతవరకు ఒక పదానికీ, మరోపదానికి
తేడా వాటి అర్ధమునందలి తేడా లను బట్టే ఏర్పడుతుందనేది భాషాస్వరూపానికి వేదిక
వంటిది. [ నేనీ మాట
లంటుండగనే నేనడిగిందొకటైతే మీరింకేదో వివరిస్తున్నారు,
అనకూడదు. విషయ పరిశీలనకు అవసరమైన
అంశాలు-మొత్తం క్షేత్రావలోకనకుగాను,
పరిగణనలోనికి తీసుకోవడం
తప్పనిసరి. అప్పడే ఆయా విషయాలకు చెందిన యదార్ధాన్ని స్పృశించడానికి వీలవుతుంది.]
బాషాభిజ్ఞులకెవరికైనా ఈ విషయంలో ఆభ్యంతరముండవలసిన పనిలేదు. ఇక్కడ మీకూ అభ్యంతరం
లేకుంటే ప్రత్యక్షమునుండి వేరుపరచుట కనుమానమన్న మాటనూ, అలానే
శబ్దమన్న మాటనూ ప్రయోగించారన్న నా ప్రతిపాదనలోని దోషాన్ని ప్రశ్నించండి.
ప్రత్యక్షానుమాన శబ్దాదిపదార్దములు పరస్పర వ్యావర్తకాలు. ఏలక్షణాన్ని బట్టి వాటి
యందలి తేడాలు తెలియబడుతున్నాయి? పరికరాలందలి తేడాలా? పద్దతులందలి
తేడాలా? నా
సమాధానం
పద్దతులందలి తేడాలను తెలిపే పదాలే అవి అని. దీనిని విడచి
7
ప్రత్యక్షమనునది
'6' ఇంద్రియాలకంటే వేరా?కాదా? అంటూ
ప్రక్క ప్రశ్నవేశారు. అయినా దానికీ నేను సమాధానం చెప్పాను. ప్రత్యక్ష జ్ఞానకరణ
మింద్రియం అనుటలో దొసగేమి లేదని, అయితే పద్దతులందలి తేడాలను
బట్టే ప్రత్యక్షాది పదములు పుట్టాయి అన్న నా భాహన్ని పరిశీలకులూ గ్రహించుట కొరకు
నాకు ఉచితమనిపించిన [విషయాన్ని చెప్పడానికి ఎవరికైలీ, ఎత్తుగడ్డావారి
కుంబాయి) విధానాన్ని నేననుసరీంచడంలో అనౌచిత్యమేమీ లేదనుకుంటాను. ప్రమాకరణం ప్రమాణం
అనుటలోని కరణ పదం ఇంద్రియ బోధకంగాకాక విధానాల కన్వయించ డమే సబబనీ, ఈ
సందర్భంలో ఇంద్రియాన్నే కరణమన్నట్టేతే మిగిలిన ప్రమాణాలకూ ఇంద్రియాల చూపవలసి
ఉంటుందనీ చెప్పతూ, అవునో కాదో పరిశీలించుటకై విషయాన్ని మీ–వారి-ముందుంచాను.
విశేషోత్పత్తి-కార్యోత్పత్తిపరికరాలను బట్టీ,
పనులనుబట్టి కూడా
ఏర్పడుతుందనేది మనందరి అనుభవంలో నున్న విషయమే. కరణ మింద్రియమని ఎవరన్నారు? అని
ప్రశ్నించారు. మీ రన్నారని నేననలేదు. ఇంద్రియం-పరికరం-కరణం కాకుంటే మరి దేనికి
కరణత్వం సాధ్యమో చెప్పండంటున్నాను. మీరుగానీ,
మరెవరుగానీ పనిముట్టునో
ప్రక్రియా విశేషాన్నో కార్యానికి అసాధారణ కారణంగా చెప్పితీరాలి. మరో-మూడో కారణం
కనబడదు. అదలా ఉంచండి.
పద-పదార్థ వివేచన ప్రకరణాంశమైనపుడు,
భాషలోని పర్యాయ. పదాల్ని
మినహాయించితే ప్రతి పదానికీ విశేషార్థం ఉంటుంది. సామాన్యమూ, విశేషమూ
భిన్న పదార్ధములేనన్నది భాషావిషయం తెలిసినవారిలో నిర్వివాదాంశము. సామాన్యాన్ని, విశేషాన్నుండి
వస్తుపరంగా వేరు చేయలేనప్పటికీ, ఆ రెండు పదార్థాలూ-‘ పదస్య అర్ధః పదార్థః’ ఒకటేననడం
కుదురదు. అవినాభావ సంబంధమున్న రెండు పదార్ధములే సిద్దిస్తున్నపుడు, వ్యాప్యవ్యాపక
భావసంబంధమున్న పదార్థాలు రెండనడంలో దోసమేమీ లేదు. ఎరుపు నలుపూ విశేష వాచకాలై
అన్యోన్యాభావ సంబంధంలో ఉంటాయి. మరి రంగు పదార్థమో రెంటి యందు వ్యాప్యవ్యాపక
భావసంబంధంలో ఉంటుంది. కనుక రంగు అంటే ఎరుపనో,
నలుపనో అర్ధం కాదు. ఆ రెండూ
వేరు వేరు పదార్థాలే. అలానే ప్రత్యక్షమూ-దానిలోని ఆరు ఇంద్రియాలూ. ఇక్కడ అస్పష్టత ఏమో, దోషమేమో
ప్రశ్నిచండి. అంతేకాక మీ లేఖలోనే వాటిని పర్యాయ పదములని ఎవరన్నారు?అని
ప్రశ్నించారు. పర్యాయపదములు కానప్పడు అవి వేరువేరు అర్ధములను కలిగియున్న
పదములన్నదే మీ యభిమత
8
మూ
అవుతున్నది. నా ప్రధమ ప్రతిపాదననుండి ప్రత్యక్షం ఇంద్రియాలకంటే భిన్నమా? అభిన్నమా? అన్నదిచర్చనీయాంశంకాదు.
ప్రత్యక్షాది ప్రమాణముల పేర్లు పరికరాలందలి తేడాలనుబట్టి ఏర్పడినవా, విధానములందలి
తేడాలనుబట్టా - అన్నదే వర్తమానవిషయం. ఆ దృష్టినుండే విధానమైశేషికతే వాటి కాధారం
అని ప్రతిపాదించాను. సరి. లేఖ వ్రాయలేనన్నారు. అయ్యా, కేవలం
మనయిరువురి కోసమే మనసంభాషణలు ఆని నేననుకోను. అవి పత్రికోద్దేశానికి సహకారులుగా
ఉండగలవన్నదే నా ఆశయము. ప్రశ్నలేలేకుంటే పరిశీలనలో సమగ్రతలోపిస్తుంది.. ప్రమాణవిద్యలుప్తమై, అవి
అసలక్కరే లేదనుకొను దృష్టికూడా సమాజంలో పాదుకొంటున్న సమయంలో, వాటి
విలువ గమనించినవారి బాధ్యతదృష్ట్యా (మీ మాట నిలచిందా, నామాటనా? అన్నది
ప్రక్కకు పెట్టి) విషయపరిశీలన సాగించడం ఉచితమని నా యభిప్రాయము, యధాభిమతంగా
హితకరమైన నిర్ణయంచేయండి ఈ సందర్భంలో మీకూ,
పాఠకులకూ, నాకూ
కూడా ఒక సంతోషకరమైన వార్తే మంటే శ్రీవంగీపురం
రామానుజాచార్యులవారు తార్కికాంశాలపై సందేహాలకు సమాధానాలు వ్రాస్తామని
అంగీకరించారు. మీకభ్యంతరం లేకుంటే మీరూ వారూ కలసి ఆ శీర్షికను నడపవచ్చు. పాఠకులు
కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచు కుంటారని ఆశిస్తాను. పాఠకులారా! గత సంచికలోని నా
ప్రశ్నలకూ సమాధానాలు వ్రాయండి.
సశేషం.
No comments:
Post a Comment