సంపుటి – 2 సంచిక . 6
1.6-92
తర్కము (తార్కికతా తర్కజ్ఞతా) ప్రతి వక్కడి జీవితంతోనూ సహజంగానే ముడివడి
ఉంది. ఈ నిజాన్ని సక్రమంగా
గుర్తించనంతకాలం ఆ విషయంలో సామర్థ్యాన్ని (ఆవగాహననూ, కౌశల్యాన్నీ)
పెంచుకునే యత్నం తగినంతగా చేయడు మనిషి. ఎందుకంటే ఏ మాత్రం అవకాశమున్నా శ్రమించడాని
కిష్టపడని వాడు. శ్రమలలో కెల్ల శ్రమవంటిదైన మేధో ప్రక్రియారీతులను (ఆలోచనలనూ, ఆలోచనారీతులనూ
ఆ ప్రక్రియలో యిమిడియున్న పరికరాలనూ,
పోటి బలాబలాలను) స్పష్టంగా
తెలిసికోవడం అన్న పనికి అసలే యిష్టపడడం లేదు. కనుకనే ఈ విషయంలో (జీవితాని
కాద్యంతమూ అవసరమై యున్న మేధస్సు స్వరూప స్వభావాలను అర్థం చేసుకునే విషయంలో)
మేధావులనుకునే వాళ్ళను కూడా కదిలించడం కష్టమపుతోంది.
[Note :- మేధావులు రెండు రకాలు. (1) అనేక
విషయాలు తెలుసు కున్నవారు. (3) తెలుసుకునే వాటి (మనస్సు)
స్వరూప స్వభావాలు తెలుసుకున్న వారు. ఇందు మొదటి రకంవారు తగినంతగానే ఉండవచ్చుగానీ, రెండవ
తరగతి వారి సంఖ్య బహు స్వల్పము. ఈ రెండో తరగతి మేధావిత్వాన్ని గూర్చే ఈ శీర్షికలో
మనం ముచ్చటించాలనుకుంటున్నది. రెండు తరగతులని ఎందుకంటున్ననో ఈ ఉదాహణను బట్టి
గమనించండి. (A) శాస్త్రజ్ఞత-శాస్త్రీయత *: (B) తర జ్ఞత-తార్కికత. అన్న పదార్రాల తేడాలను గమనించండి. (А)లో
ఒకటి ఆయా విద్యలందలి పరిచయాన్నీ, రెండవది వ్యక్తిలో ఉండే
స్వభావాన్నీ తెలుపుతుంది. ఆలానే Bలోనూ, శాస్త్రజ్ఞుడు
కావడం అంత కష్టమేమీ కాదు గానీ, శాస్త్రీయ దృక్పథం ఏర్పడడం
మాత్రం ఆంత సులభం కాదు. అలానే తర్క శాస్త్ర్మం తెలిసి ఉండడం, తార్కిక
స్వభావం కలిగి ఉండడమున్నూ.]
తెలిసిన వనుకుంటున్నవన్నీ తెలియవలసినట్లే తెలిసినవా? ఆ
తెలిసినవీ వాస్తవ రూపంగా లెలిసినవా?
భ్రమరూపాలా? అన్నది
తేల్చుకోడాని కవసరమైన విద్య ప్రమాణ విద్య. అది సరిగా తెలియనంతకాలం తెలిసినవాటి
యదార్ధా యదార్ధాలు నిర్ధారించడం కష్టమవుతుంది. కనుకనే అన్ని విద్యలనూ ప్రామాణీకరించగల
ప్రమాణ విద్య విద్యా కాయానికే ప్రాణస్థానీయమై (గుండెకాయ వంటిదై] ఉంది. ప్రమాణబద్ధం
కాని విద్య విశ్వాస రూపమై సమాజంలో క్రమంగా, అంథానుకరణను
పెంచుతుంది. కనుక ఆయా విషయాలను తెలుసుకునేటప్పడు తీసుకోవలసిన
2
జాగ్రత్తలూ, పాటించవలసిన నియమాలూ చక్కగా అమలు చేయనిచో కలిగే
జ్ఞానం సరైనదేనని నిర్ణయించడం కుదరదు. ఈ విషయం మీ కర్థమయ్యేందుకుగాను ఈ మధ్య
జరిగిన ఒకటిరెండు సంఘటనలను వివరిస్తాను. చక్కగా పరిశీలించి పై జాగ్రత్తలూ, నియమాలూ
ఏమై ఉంటాయో ఆలోచించండి.
నంద్యాల ప్రాంతంలోని "మేలుకొలుపు" పాఠకులూ, పూర్వ పరిచయ మున్న సత్సంగ మిత్రులూ కలిసి
నన్నచటి కాహ్వానించడమూ నేను వెళ్పడమూ జరిగింది. లోగడే నన్నెరిగియున్న వాళ్ళకు నేను
చెపుతున్నదేమిటో, నా విధాన మేమిటో కొంత అవగాహన కలిగేఉన్నప్పటికీ, క్రొత్త
వాళ్ళకున్న ప్రధాన సమస్య,నేనే వర్గానికి చెందినవాడినో ఒక పట్టాన వాళ్ళకు
అంతుబట్టక పోవడం. దాదాపుగా మెల్లచూపు (పాకి కదృష్టి] కలవాటుపడి ఉన్న సమాజం
(నిజంగా-సహజంగా- వారు మెల్ల చూపువారు కాదు. అయినా సమాజాన్ని
నడిపేవారు (గురువులూ, నాయకులూ) ప్రజలను క్రమంగా మెల్లచూఊపు చూఊడడాని
కలవాటు చేసి అదే అసలైన చూసే పద్ధతి అని నమ్మించ గలిగారు) నేనే వర్గానికి చెందిన వాడినో ముందుగా
తెలిస్తే తప్ప నా వాక్యాలకు విలువనూ, అర్ధాన్నీ నిర్ణయించడానికి సిద్ధపడటం లేదు.
అలాగే వాడిన భాషద్వారా ఏ భావం పుడుతుందో చూద్దామని గాక ఆ భాషా శైలీ,ననుసరించైనా సరే(కమ్యూనిష్టుల శైలీ, వేదాంతుల
శైలీ, ఇలా...) ఆయా వ్యక్తులపై ఒక అభిప్రాయన్నేర్పరచుకొని అటు తర్వాతే
విషయాన్ని పరిశీలించడానికి ఇష్టపడుతున్నారు.ఈ వక్రదృష్టి
మేమెరిగిన అన్ని సంఘాలలోనూ సామాన్యుల నుండి మేధావుల వరకు బీరుపోకుండా స్వానుభవంలో
ఎదురైంది.
ఎవరప్పారన్నది విడచి ఏమి చెప్పారన్నది పరిశీలనాంశంగా స్వీకరించనంత కాలం
వాస్తవాన్ని చూసే అవకాశాలు సన్నగిల్లుతాయి. అని నేను ప్రతిచోటా పదే పదే
చెపుతుండడమూ, మళ్ళీ మళ్ళీ ఎందుకండీ చెపుతారు? మేమేమన్నా
పసివారమా ఇంత మాత్రం అర్లం చేసికోలేకపోవడానికి అని అనేక సందర్భాలలో వారు కొంత
విసుగును కూడా వ్యక్తం చేయడం, అటువంటి సందర్భాలలో నాలో నేను
నవ్వకుంటూనో, విచారిస్తూనో ఆ విషయాన్ని దానికున్న ప్రాముఖ్యత
దృష్ట్యా మరల మరల హెచ్చరిస్తూండడం నాకు పరిపాటిగా కూడా మారిపోయింది.ఇంతా చెప్పి
నేను మరల మీకు చెప్పేదేమంటే, జిజ్ఞాసువులూ పరిశీలకులూ
ఐన పాఠక మిత్రులారా! అనవసరంగా నన్నేదో
వర్గానికి చెందిన వానినిగా ఎంచి[ఒక వేళ
అలా మీరే నిర్ణయానికివచ్చినా అది మెల్ల చూపేనన్నదో వాస్తవం] అటుపిమ్మట
3
నా మాటల బాగోగులను పరిశీలించడం మొదలిడితే మాత్రం మీరు చేసే నిర్ణయాలు నిజానికి
బారెడటో యిటోగా ఉండే ప్రమాదముంది. కనుక నా గురించి మీలో కదులుతున్న ఆలోచనల్నీ, సందేహాల్నీ
ఆవలుంచి చెపుతున్న విషయాన్ని చూడండి. సరే నంద్యాలలో ఉన్నాం కదా!
సమావేశాన్ని సామూహిక చర్చలా ప్రారంభించాను. మిమ్మల నేమైన అడగమంటారా? నన్నేమైన
అడుగుతారా? అన్నది నా మొదటి మాట. వచ్చిన వారిలో ఒకరు
అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా ఆని అడిగారు. ఆ రెంటిలో ఏది సత్యమని అడిగారు సరె.
ఇంతకీ ఆ రెంటి గురించి ఏమైన విన్నారా?
అని అడిగాను. విన్నాను, విన్నంతలో ద్వైతం సరిగా
ఉందనిపిస్తోంది ఆన్నారాయన. మరి నన్నెందు కడుగుతున్నారు? అని
నా ప్రశ్న. మీరు తేలిసిన వారుగదా మీరేమి చెపుతారోనని. నిజంగా నన్ను తెలిసిన
వానినిగా విశ్వసిస్తున్నారా? అని ఆడిగాను. అవునన్నారు.
మరి మీకు సరిగా ఉందనిపించింది నేను కాదంటాననుకోండి అపుడు మీరెలా స్పందిస్తారు? అని
అడుగుతూనే, ఆద్వైతం సరైనది అన్నాను. అబ్బే,అదెలాగండీ, అది
నా జీవితంలో ఏ రకంగానూ పొసగడం లేదు అన్నారు. నేచెప్పినా
అంగీకరించనపుడు నన్నడగడమెందుకు? నన్ను తెలిసినవాడివి అనడ
మెందుకు ? అని ప్రశ్నించాను. ఆయనే మరో ప్రశ్నవేశారిది యిక్కడితో ఆపి.
జీవుడు స్వతంత్రుడా? అస్వతంత్రుడా? అని.
జీవుడంటే మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. ఆత్మ అన్నారు. అదేనండి బాబూ! ఆత్మ అంటే
ఏమిటనే నేనడుగుతోంది. మళ్ళీ “నేను" అని అనబోకండి అన్నాను. మరెలాగండి చెప్పడం,
నావరకు నాకు తెలుస్తూనే ఉంది
గానీ చెప్పడం కుదురుటలేదు అన్నారు. సరేలెండి, ఇంతకీ ఆ తెలుస్తున్నది
స్వతంత్రమైనదిగా తెలుస్తున్నదా?
అస్వతంత్రమైనదిగానా? అని
అడిగాను. అస్వతంత్రమైనదిగానే ఉంది చాలవరకు అన్నారు. మరింక మీ సందేహమేమిటి? అని
ఆడిగాను. కొన్ని కొన్ని పనులు"అనుకున్నవి చేస్తున్నాం, చేయగలుగుతున్నాం
గదా! అన్నారు. మరింకేం? ఆ పాటి స్వతంత్రం కూడా ఉందన్నమాట. అన్ని
విషయాలలోనూ మనిషి పూర్తి స్వతంత్రుడూ కాదు. అస్వతంత్రుడూ కాదు. ఇది బాగానే ఉంది
కదా! ఆనుభవానికీ సరిపోతూనే ఉంది అన్నాను. ఇంతకీ మీ అభిప్రాయం చెప్పారుకాదు
అన్నారు. మీ అనుభవానికి భిన్నంగా నా అభి ప్రాయం చెప్పినా అదెలాగండీ అంటున్నారు కదా? ఇంక
చెప్పీ ఏమి ప్రయోజనం? ఆలోచించండని అగాను,
4
Note – ఈ శీర్షికలో ఈ
ప్రస్తావనెందుకు? అని మీలో కొందరకైనా అనిపిస్తూండవచ్చీపాటికే.
కానీ ఈ అంశాలన్నీ ప్రమాణ తర్కాలతో పుడిపడే ఉన్నాయన్నది ఎంతమందికి తెలుస్తోంది?
మరొకరు జన్మలున్నాయా లేదా? అని అడిగారు. దేనికి? ఎవరి
? అని అడి గాను. జీవుడికి అన్నారు. జీవుడు మీ సిద్ధాంతం
ప్రకారం నిత్యుడు కదా? మరి జన్మంటే ఏమిటి? అని
అడిగాను. శరీరాన్ని విడచి మరో శరీరాన్ని పొందడం అన్నారు. అసలది సంభవమో కాదో
నిర్ణయించడమెలా? తెలిసి నిర్ణయించాలా? తెలియకుండగనేనా? అన్నాను.
తెలిసే నిర్ణయించాలన్నారు. అయితే ఆ విషయం నాకు తెలీదు. మరెవ్వరికీ తెలిసేందుకూ
వీలులేదు " అన్నాను. ఎందుకని అని అడి గారు. ఈ
జీవితంలోనే-బ్రతికుండగనే-శరీరం వేరుగా-తాను (ఆత్మ) వేరుగా ఉన్నట్లు తెలిసినప్పడే
శరీరం ఉన్నా లేకున్నా ఉండే వస్తువొకటి (శరీర భిన్న మైన దాని ఉనికి) ఉందనడం
సాధ్యపడుతుంది. ఒకవేళ ఎవరైనా అలాటి అనుభవం నాకుంది అన్నా, అది
కలలాంటి కాల్పనికానుభవమో (భ్రమో), యదార్ధమో చూడవలసి ఉంది. అంటూ
ఒక పరీక్షా విధానం చెప్పాను. ఎవరిట్టి అనుభవం నాకుంది అంటారో వారిని, జీవుడు
వేరైన దేహంలో ప్రాణముంటుందా? గుండె కొట్టుకుంటుందా?శ్వాసక్రియ
జరుగుతుంటుందా? అని అడగమన్నాను. మనమే ఆయా పరీక్షలన్నీ నిర్వహించవచ్చు ఆయన అంగీకరిస్తే అని ముగించాను. ఇంత చర్చ జేసినా వారికి నాపై ఒక
నిశ్చితాభిప్రాయం ఏర్పడడంలేదు. నా పోకడ నేనో నాస్తికుల్దేమోనన్న అభిప్రాయాన్ని
కలిగిస్తోంది; నా రచనలూ,
శైలీ, ఆయా
గ్రంధాల నుండీ ఉటంకింపులూ, పత్రిక ముఖ చిత్రంలోని అంశాలూ ఇవినేనొక
ఆస్తికుణ్ణేమోనన్న సందేహాన్ని పుట్టిస్తున్నాయి. నేనెవరినో తెలిస్తేగాని నా
మాటలకర్ధాలు చెప్పకోవడం యిష్టం లేదాయె. ఇదీ వారి సమస్య. నేనెవరై తే మీకెందుకయ్యా! నా మాటలలోని గుణ
దోషాలు చూడరాదా? అంటానునేను. ఈ సమయంలో ప్రమోద చైతన్యగారు
రంగప్రవేశం చేసి వారెవరై తేనేమి? వారి ప్రశ్నలు
పరిశీలించదగినవిగానూ, సమాధానాలు పొందవలసినవిగానూ ఉన్నాయా లేదా? ఆలోచించండని
హెచ్చరించి నా పని సులువు చేశారు. .
ఆ సందర్భంలోనే K. v. రెడ్డిగారు ఇంతకీ మీరు
చెప్పేదేమిటి? మీ రచనలు చూస్తుంటే ఏదో సామాజిక శాస్త్రం
చెపుతున్నట్టుతో స్తోంది. అంత మాత్రంతో సరిపెట్టుకోలేక పోతున్నాము. దీని వెనుక
అంతరంగంలో మీరు మరో విషయాన్ని కలిగి ఉన్నారనిపిస్తోంది. అదేమిటి? సూటిగా
చెప్పండన్నారు?
5
అయ్యా, ఒక
ప్రశ్నకు - ఆలోచించి సమాధానం చెప్పండి. ఆపై నావిషయం చెపుతాను అని, ప్రతి
మనిషీ స్వాభావికంగానే తాను వినిన, చూచిన అంశాలపై బాగోగులు
విచారించి ఒక నిశ్చయానికి వస్తుంటాడు. సరిగా నిర్ణయించే సామర్థ్యం లేనివారు చేసే
(తీసికునే] నిర్ణయాలు సాధారణంగా నాస్తవానికి బారెడటూ, ఇటూగా
ఉంటుంటాయి.మరి ఇప్పడు మీరందరున్నూ నేను చెప్పబోయే విషయాల బాగోగులు
నిర్ణయించబోతారు. బాగుందనో, లేదనో నిర్ణయానికి వస్తారు. గమనించిన విషయం
సరిగా ఉందో లేదో నిర్ణయించడమెలాగన్నది మీకు స్పష్టంగా తెಲಿಸಿ ఉంటే చెప్పండని అడిగాను. నా
ప్రశ్న అర్థమైందా? అంటూనే తెలిసిన విషయాలలోని
తప్పోప్పులను
నిర్ణయించగల సార్వత్రికమైన కొలతేమైనా ఉందా?
ఉండాల్సిన అవసరముందా? ఉంటే
మీరందరూ . ఆలోచించుకుని సరైన కొలతను చూపిస్తే నా విషయాన్ని మీనుందుంచుతాను.
అట్లుకాకుంటే ఎవరి కొలతలు.వారివై కొందరకు నేను చెప్పింది వాస్తవంగానూ, మరికొందరకవాస్తవంగానూ
అనిపిస్తుంది కదా! ఆలోచించండని చెప్పాను.
కొద్దిసేపు వారిలో వారు చర్చించుకున్నారు. ఒక కొలతంటూ తేలలేదు.
విసుగనిపించిందను కుంటాను. ఇంతకీ మీ విషయం చెపుతారా! లేదా? అని
అడిగారు, కొలతలు లేకుండగనూ,
కొలతల గురించి తెలియకుండగనూ
కొలుస్తానంటున్నారు. అది సరైన పద్ధతేనా అని అడిగాను. ఇవన్నీ ఎందుకండీ? ఎవరి
సామర్థ్యాన్నిబట్టి వారు నిర్ణయించుకుంటారు. మీదేదో మీరు చెప్పరాదా! అని
అన్నారాయన. కొలతల గురించి తెలియకుండా కొలుస్తాననడమూ, సరే
కొలవండనడమూ రెండూ తెలివి తక్కువ పనులే కనుక అట్టిపని నేను చేయను అన్నాను. అంటే మా
దగ్గర సరైన కొలతలు లేకుంటే (సత్యా సత్యాలు నిర్ణయించడమెలా అన్నది తెలియకుంటే] మీ
విషయం చెప్పరన్న మాటేగా అన్నారు. చెప్పను ఆన్నాను. ఇదో వింతదోరణిలాగుంది. మరి
మీరక్కడ వరకూ వచ్చిందెందుకు? అని అడిగారు. ఈ విషయంలో గూడా
సమాజాన్ని మేలుకొలపాలనే అన్నాను.
ఇదంతా కాలహరణంతో కూడిన దండగమారి పనిలా
తోచిందేమో! అయ్యా, అవన్నీ అలా పెట్టండి. ఒక్క ప్రశ్న వేస్తాను
సూటిగా సమాధానం చెప్పండి అన్నారు. ఆలోచించి సరే అడగండి అన్నాను. ఈ ఉపాదికి
భిన్నమైన దేదైనా ఉనికి కలిగి ఉందంటారా?
లేదా? అని
అడిగారు. ఉందనో, లేదనో చెపుతాననుకోండి. అందువల్ల ప్రయోజన
మేమిటన్నాను. అదుగో మళ్ళీ ప్రక్కడారి తొక్కుతున్నారు. సూటిగా సమాధానం
చెప్పండన్నారు. సరేనండీ! ఇంతకీ
6
మీ
ప్రశ్న సరిగా అర్థమైతేనేగా నేను సమాధానం చెప్పగలిగేది. ఉపాది అంటే ఈ శరీరమేనా? అని
అడిగాను. ఈ ఒక్క శరీరం మాత్రమే కాదు,
దృశ్యమాన మవుతున్న
విశ్వమంతా: అన్నారు. ఆంటే విశ్వానికి. భిన్నమైన (విశ్వానికతీతంగా ఆని కూడా వారే
చెప్పారు.) దాని ఆస్తితాన్సి గురించేనా మీరడుగుతున్న ది
అని తిరిగి ప్రశ్నించాసు. అవునన్నారు. అలా అయితే అట్టి దాని ఉనికి నాకు తెలిసి
లేదు. మరెవరికీ తెలిసి ఉండటానికి వీలులేదు.
అని
సమాధానం చెప్పాను. (అసలీ ప్రశ్న తప్పు ప్రశ్న అన్నది ఎందరకు తెలుసంటారు? యిప్పటికైనా
మీలో ఎవరికైనా ఈ విషయం తట్టిందా? తెలిస్తే ఎందువల్ల ఇది తప్పు
ప్రశ్నాన్నది ఎందరకు తెలుసంటారు? ఇప్పటైకైనా మీలో ఎవరికైనా ఈ విషయం తట్టిందా? తెలిస్తే ఎందువల్ల ఇది తప్పు ప్రశ్నో పత్రికకు వ్రాయండి.) వెంటనే ఆయన కొంత
ఆవేశంగానే, మీరు చాలా తప్పు మాట్లాడారు మీకు తెలీదనండి.
అంతేగాని మరెవరికి తెలియదంటానికి మీరేవరు?
అన్నారు.
నాలో నేను నవ్వనేనేమి సమాదానం చెప్పానో అడెక్కడికి
తీసుకుపోతుందో వారుగానీ, మీరు గానీ గమనించారా? అని
అడిగి, ఉదయం నుండి నేను మొత్తకుంటున్నదీ, మీరు
అనవసరమని భావిస్తున్నదీ అయిన కొలమానానికి (ప్రమాణాలకు] సంబంధించిన ప్రశ్నే యిది.
ఇంకెవరకూ తెలియదనడానికి మీకున్న ఆధారం [ప్రమాణం లేక కొలత)ఏమటన్నదే వారి ప్రశ్న
సారాంశమున్నూ. అక్కడున్న వారిలో ప్ర. చైతన్య మాత్రమే ముందుగా, విషయాన్ని
నేనెక్కడ నుండి ఎక్కడకు తీసుకు వచ్చిందీ గమనించగలిగారు. పిదప మరికొందరకున్నూ అర్థ
మైందనుకోండి. ఇంత జరిగినా (అంతకుముందే మాటల మధ్యలో రెడ్డిగారు నేను విషయానికి
ప్రాధాన్యత నిస్తానుగానీ విషయికి (వ్యక్తికి) కాదు అని రెండు మూడుసార్లని ఉన్నారు)
నా సమాధానంలోని లోపమేమిటనిగానీ, దానిలోని బలమెంతని గానీ
ఆలోచించకుండగనే ఆ చర్చ నాయన ముగించారు. అదేమంటే ఇక అడగవలసిందేమీ లేదు. నాకు
కావలసిన సమాధానం లభించిందన్నారు. అప్పటి కాయనెక్కడకు చేరుకున్నారో నాకర్థమవుతూనే
ఉంది. 1) ఇతనీ విషయం తెలియనివాడు అనో, అనాత్మ
వాది అనో నిర్ణయానికి వచ్చి ఉండాలాయన. అదే ఆయనకు కావలసిన సమాధానం. నాకా ఊహ రాగానే
ఆయన పొరపాటుగా నిర్తయించు కున్నారనుకుని; ఆయ్యా
భోజనానంతరం అందరం కలుద్దాం. నేననుకొటున్నది కొద్దిసేపు చెపుతాను. జాగ్రత్తగా
విని ఆపై ఒక నిరయానికిరండి అన్నాను.
సరేనన్నారు
గానీ, మరల ఆయన రాత్రి 9
గం. వరకూ రాలేదు. ఏదైనా
పనిబడి
ఆగారో, అనవసరమనుకున్నారో
తెలియదు.
7
అలాటిదే మరో సంఘటన జరిగింది. బాబూరావుగారు. వీరు సహృదయులూ,సంస్కరణాభిలాషులూ కూడా, పత్రిక
పోకడనుబట్టి, ఆయనకు నేనెవరై ఉంటానన్నది సందేహంగా ఉండి
ఉండవచ్చు. దాంతో ఆ సందేహాన్ని తీర్చుకోవడానికిగాను, సురేంద్రగారూ, చాతుర్వర్ణ్య
వ్యవస్థను మీరంగీకరిస్తారా లేదా? అని అడిగా రొకనాడు. ఏం, ఎందుకడుగుతున్నారు? అన్నాను.
ఏం లేదులే చెప్పండి అన్నారు. ఇప్పడు చెప్పనులెండి దానికి తగిన సమయం రావాలి
అన్నాను. సరే మీ యిష్టం అని అప్పటికి ఊరుకున్నారు. మరి కొంతకాలం తరువాత మరో
సందర్భంలో కలసినపుడు నా ప్రశ్నకు సమాధానం రాలేదు అంటూ హెచ్చరిం చారు. అయ్యా, విషయాల్ని
పరిశీలించేముందు"ఏవేవో అభిప్రాయాలు
పెట్టుకుని గానీ, ఆవేశంతో గానీ ఉండకూడదు. అది
సత్యాన్వేషణను ప్రక్కదారి పట్టిస్తుంది. అప్పడు వాస్తవాలను గమనించడం కుదరదు. మీరు
ఒకింత ఆవేశపరులుగానూ, పై విషయంలో ఒక అభిప్రాయం
పెట్టుకునీ ఉన్నారు. కనుక ప్రస్తుతం నేనేమి చెప్పినా పరిశీలన సవ్యంగా
సాగదు అంటూనే, నిజాయితీగా చెప్పండి మీలో ఆవేశంపాలు ఒకింత
ఎక్కువగా ఉందా లేదా? అని అడిగాను. వారు నిజంగా నిజాయితీపరులే, మీ
మాట నిజం. అయినా ఆలోచనలేని ఆవేశం కాదు నాది అన్నారు. చాతుర్వర్ణ్వ వ్యవస్థపై ఒక
అభిప్రాయానికి వచ్చి వుండడమూ, ఒకింత ఆవేశాత్మక స్వభావం
ఉండడమూ వల్లనే ఆనాడూ, ఈనాడూ కూడా ఆ విషయం చర్చించడానికి నేను
సిద్ధపడడం లేదు అన్నాను. అప్పడాయన సరే మీ యిషం
అన్నారనుకోండి.
పాఠకులారా ! " ఇక్కడా, పైనంద్యాల
సంఘటనలోనూ జరిగిందేమిటో మీరాలోచించగలరా! రెడ్డిగార్నీ, బాబూరావుగార్నీ
కూడా ఈ విషయం నిదానంగా పరిశీలించి సత్య నిర్ణయేం చేయండని అడుగుతున్నాను, మీరూ
పరిశీలించి విషయాన్ని అర్థం చేసికోండి.
1) K. V. రెడ్డిగారు ఆస్తిక
మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే సమాజం సంస్కరింపబడాలన్న అభిప్రాయంతోబాటు
ఆసంస్కరణమన్నది అందరూ ఆస్తిక మార్గానికి మరలడం ద్వారానే సాధ్యమన్న నిర్ణయంలో ఉన్నారు.
నాస్తిక వ్యతిరేకత ఉంది వారిలో.. నాస్తికుడుగా ఉంటూ
మంచివాడుగా ఉండడం ఎలా సాధ్యం? (ఇది నిజమో కాదో నిజాయితీగా
వారే ఆత్మ విమర్శన చేసుకోవలసి ఉంటుంది.] ఆలానే,
- బాబూరావుగారు నాస్తిక మార్గావలంబులు. వారూ సమాజ
హితకాంక్ష కలిగి యధాశక్తి అందుకై యత్నిస్తున్నవారే. ఆస్తిక మార్గం సమాజానికి
కలిగించినంత
8
(ముఖ్యంగా కుల వ్యవస్థ) నష్టం
మరే విధానం వల్లనూ జరగలేదనీ, అది కన్ను లుండి చూడగలిగితే
చారిత్రిక వాస్తవమనీ దృఢ నమ్మిక కలిగిన వ్యక్తి ఆయన. వీరేగాక ఈ రెండు దృక్పధాలకు
చెందినవారూ మేలుకొలుపు చదువుతున్నారు. (ఒక నవలలా పైపైన చదివి పారేసే వారూ చాలామంది
ఉండవచ్చు పాఠకుల్లో. వారితో పోలిస్తే అనుకూలంగానో, ప్రతికూలంగానో విషయాన్ని నిశితంగా పరిశీ లించే
వారు ఎంతో మేలు] పై యిరువురూ నా వివరాలకై (నేనే మార్గం వాడినో తెలుసుకునేందుకు)
యత్నించారు. అప్పటి కందిన సమాచారాన్ని బట్టి చూస్తే పత్రిక ముఖ చిత్రమూ, శైలీ
నేను హిందూ సమాజానికి చెందిన ఆస్తికుణ్ణై
ఉండ వచ్చునేమోనన్న ఊహనూ, పత్రికలోని కొన్ని అంశాలు
నాస్తికుణ్ణేమోననిపించేట్ల గానూ ఉన్నాయి. సమాజం-మనిషి- మారాలి అంటూ లోకంలో
జరుగుతున్న జరగకూడని వాటిని గూర్చి వ్రాస్తున్నానొక వంక, ఆస్తికులకూ, నాస్తికులకూ
కూడా నేనెవరై ఉంటానో నన్నది సందేహమే. (ఇక్కడో తమాషా చెప్పనా? నేను
తమ వర్గం వాణ్ణైతే ఇహ గొడవేమీ లేదు. అంతా బాగానే
ఉంది] నేనెవరో నిశ్చయంగా తేలితేగాని నా మాటలు స్వీకరణ యోగ్యాలో కాదో
నిర్ణయించుకోవడం కుదరదు అంటోంది వాళ్ళ మనస్సు. పైకి మాత్రం యిరు వర్గాలూ, ఎవరు చెపితే నేమండి, ఏమి
చెప్పారో చూడాలి గాని అంటూనే ఉన్నారు. మరి నేనే వర్గానికి చెందిన వాజ్జో
కనిపెట్టమంటోంది మనస్సు. ఇంతా జేసి వ్యక్తిగతంగా చూస్తే యిరు వరూ ధార్మికులే, సంస్కరణాభిలాషులే.
అయితే ఒకర్ని ఒకరు మంచి వారుగాఅంగీకరించలేరంతే.
ఇదంతా ఎందుకొచ్చిన సౌద అనిపిస్తూండవచ్చు మీకు. అన్ని సిద్ధాంతాల వాళ్ళ తన్ను
లాటలకూ, పరస్పర నిందారోపణలకూ ప్రాణం పోస్తూ చూపుండీ గ్రుడ్డి
వాళ్ళను చేస్తున్న ప్రమాదకరమైన ఆంశమిది. ఆంతెందుకు, యిప్పటి
నా ఆలోచనా ధోరణికి ప్రేరణ కర్తలూ, ఒరవడి దిద్దిన వారూ, అభిపాయం
పెట్టుకుని చూడకూడదని వారి విద్యార్థులకు నిరంతరం చెపుతుండేవారు ఆయిన ఒకరు
(మేమీరువురం అతి సన్నిహితంగా సంవత్సరాల తరబడి విచారణలూ, అనేక
వ్యక్తులతో చర్చలూ కలసి సాగించాం] ఈ మధ్య నాకూ ఆయనకు తెలిసిన వారితో, ఇంతకూ
సురేంద్ర ఆత్మ ఉన్నదంటాడా? లేదంటారా?
అంటూ ఒక సందేహన్ని
వెలిబుచ్చారట. ఆయనకూ, నా మాట్లల కర్ణాలు స్వీకరించడానికి, ముందుగా
ಸೆಸೆ వర్గీయుణ్ణో తెలుసుకోవడం అవసరమని పించిందన్నమాట, అది
తెలియకుండా నా మాటలు
9
వాస్తవాలో
కాదో నిర్ణయించడం యిష్టం లేదన్నమాట. అంత ప్రమాదకరమైన అంశమిది, తెలుసికోవడమెలా
? అన్నది నేడు మనిషికి తెలియకుండాపోయింది.
(1) K. V. రెడ్డిగారు వారి పద్ధతిలో
నన్ను ప్రశ్నించి నా సమాధానాన్ని సరిగనూ,పూర్తిగనూ గ్రహించకుండగనే ఒక
నిర్ణయానికి వచ్చారు. నేను అనాత్మ వాదినని. కనుక అనాత్మ వాదులైన తార్కికులతో
సంభాషణలనవసరం అని అనిపిసూంటుందిక వారికి. ఆలోచించవలసిన ప్రశ్నలే నేను
అడుగుతున్నప్పటికీ,అవి బుర్ర
వున్న, ప్రతిపాడూ తెలుసుకోవలసిన, తేల్చుకోవలసిన
విషయాలే అయినప్పటికీ, వేలికేస్తే కాలికీ, కాలికేస్తే, వేలికి
ముడి పెట్టి తిమ్మిని బమ్మిని చేస్తు న్నట్టుంటుందికవారికి నా పద్ధతి.
(2) అలానే బాబూరావుగార్కిన్నీ, నేను
వర్ణ వ్యవస్థ సరైనది అంటే చాలు, ఇక నా మాటలన్నీ మోసపూరితాలూ, సమాజం.
కొంపమంచడానికై వేసే ఎత్తు గడలుగా కనుపిస్తాయిక వారికి. ఎందుకని? వర్ణ
వ్యవస్థ పట్ల వారికీ విపరీతమైన ద్వేషభావముంది. దానినంగీకరించేవాడు మంచివాడుగా
ఉండటం అసంభవం
ఒకరు నేను నాస్తికుణ్ణి. గనుక ఇక సంస్కరణ వాదిగా ఉండడం భూటకమనీ, మరొకరు, నేను
ఆస్తిక వర్గీయుణ్ణి గనుక అందునా హిందువును (కుల వ్యవస్థనంగీకరించేవాడు) కనుక సమాజం
బాగు అన్నమాట నా విషయంలో నీటిమీద రాతలాంటిదనీ,
అనుకుంటున్నారు.సాధారణంగా
సమాజపు కొలతలు [కొలతలు తెలీని వారి కొలతలు) ఇలానే ఉంటాయి.ఆయితే
తాము తప్పు కొలతలు కొలుస్తున్నామేమో నన్న స్పృహే వీరికుండదు.
సైద్ధాంతిక
విశ్లేషణలకీ కొలతలు సరిపోవు,
(1) ముందుగా
అభిప్రాయాలు పెట్టుకుని చూడడమూ,
(2) ఇష్టా
యిష్టాలతో ముడి పెట్టి పరిశీలించడం,
(3) విషయాన్ని
సరిగా స్వీకరించకుండగనే నిర్ణయాలు చేయబూనడం వగైరాలన్నీ కొలతలు తెలియని తనానికి
ఉదాహరణలే. ఎందుకంటే వస్తువు. యాదార్థ్యం వీటన్నిటినీ అంటనిది.
నిజంగా వాస్తవాన్ని తెలుసుకోవాలనుకుంటూనే పై వక్ర దృష్టులవల్ల తమకు
తేలీకుండానే వాస్తవానికి దూరమవుతున్నామని వారెప్పటికి గ్రహించగలరు. అట్టి యెడల
వారి దృష్టిని సరిచేయడం ముందు చేయవలసిన పని ఔతుందో, లేక
మీకు నచ్చినట్లు మీరు కొలుచుకోండి,
మీరేమైతే నాకేమి? అనుకుని
విషయాన్ని వారి
10
ముందుంచడం సబబౌతుందో అందరూ యోచించండి. నిత్య వ్యవహారంలో సామాన్యజ్ఞానం కల
వ్యక్తైనా కొలతలు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే వస్తువులను తెచ్చుకుంటాడు.
ఒక వేళ అలా చేయకుంటే తానే నష్టపోతాడు. అయితే
మరెందువల్లనో, మరింత జాగరూకుడై యుండవలసిన సందర్భంలో (సత్యా
సత్యాలూ, ధర్మాధర్మాలు
నిర్ణయించే సందర్భంలో] మరీ గుడ్డిగాను,
తొందర పాటుతోనూ
వ్యవహరిస్తున్నాడు. పరిశీలించకండి,
యోచించకండి, ప్రశ్నించకండి
తర్కించకండి అంటూ రొద పెట్టే నవీన వేదాంతుల (నిజంగా వారు వేదాంతులూ, మార్గదర్శకులూకారు)
మార్గదర్శకుల పాత్ర ఎక్కు వుందీ మార్గాన్ని తయారు చేయడంలో.
ఏ విద్య వుంటేగాని మిగిలిన విద్యల విలువలను నిర్ధారిండం కుదరదో ఆ విద్య తెలియక
పోవడమట్లుంచి తెలియనక్కరలేదన్న దృష్టితో తెలుసుకోడానికి ఇష్టపడక పోవడం నిజంగా
విచారించదగ్గ విషయం.
"ప్రమాణ వివేచన" అన్న శీర్షిక ప్రారంభించి ఒక పాఠంలా విక్షయాన్ని చెప్పకు పోకుండా ప్రమాణ
వివేచన ప్రారంభించడానికి ముందే అవసరమైన అంశాలనూ ఒక్కొక్కటిగా చెప్పకుంటూ
వస్తున్నాను. ఎందుకంటే ఈ విద్యను గ్రహించడానికి, పరిశీలించడానికి
కూడా మనిషి మానసికంగా ముందు తయారు కావలసి ఉంది.
మన ప్రస్తుత సమాజపు
దౌర్భాగ్యం వల్ల ప్రమాణ విద్యకు కనీస గుర్తింపు కూడా లేకపోయినప్పటికీ, యదార్థంగా
మిగిలిన అన్ని విద్యలూ ఒక ఎత్తు, వాటి వాటి యదార్ధ విలువల్ని
నిర్ధారించే విద్య ఒక్కటే ఒక ఎత్తు అవుతుంది.
ఈ విద్యా విషయకమైన స్థాయి భేదాలవల్లనే (మానసిక సామర్థ్యాన్ని బట్టి) మనుషులకు
ఒక్కొక్కరికొక్కో విషయం సత్యంగానూ అనుసరించదగినది గానూ అనిపిస్తుంది. ఏమి
చేపుతున్నానో తెలుస్తూనే ఉన్నదనుకుంటాను. భిన్న భిన్న ధోరణుల యందు మనకభిమానం అతిగా
ఉండడానికీ, వాటివాటిని (నిజంగా అవి అంత విలువైనవి
కానప్పటికీ) పట్టుకుని వేలాడడానికి ఈ ప్రమాణ తర్క విద్యలందు సమగ్రమైన అవగాహన లేక
పోవడమే కారణం. ముందీ విషయాన్ని జిజ్ఞాసువు స్పష్టంగా గ్రహించగలిగితే (అయా వస్తువుల
యదార్థ విలువల్ని నిర్ణ యిండానికి,
తూనికలు కొలతలు ఎంత అవసరమో
గ్రహించ గలిగితే) గాని ఈ విద్యార్జన యందు సరైన శ్రద్ధ ఏర్పడదు.
11
జిజ్ఞాసువు (తెలుసుకోవాలనుకునే వాడు) ముందుగా తెలియడమంటే ఏమిటో, ఎలా
తెలిస్తే గాని, తెలిసినట్లుగాదో, తెలుసుకునేందుకు
తనకు ఏవేవి అక్కరవతున్నాయో, వాటిని ఉపయోగించడమెలానో, వాటి
వాటి క్షేత్రాలూ, బలా,
బలాలు ఎట్టివో ముందు
స్పష్టంగా తెలిసికోవాలి. ఈ విషయానికి చెందిందే ప్రమాణ విద్య అంటే ఆపై తెలిసింది
సరిగా ఉందో లేదో నిర్ణయించుకోడానికుపయోగ పడేదే తర్కవిద్య
లేక న్యాయవిద్య. తర్కానికి లక్ష్యం సత్యావిష్కరణే. " ప్రమాణై అర్ధ పరీక్షణం న్యాయం".
అర్ధాన్ని పరీక్షించి
నిరయించేదే న్యాయం-తర్కం. యుక్తాలోచననే తర్క మంటాము. "అన్వీక్షకీ న్యాయవిద్యా" అనుసరించి చూపించేది. దేని
ననుసరించి? అనుభవాన్ని-ఆధారాలను-అనుసరించి విషయాన్ని
చక్కగానూ, నిశితంగానూ,
నిష్కర్షగానూ పరిశీలించి ఒక
నిర్ణయానికి రండి.
No comments:
Post a Comment