సంపుటి - 2 సంచిక
. 10 1-10-92
ప్రమాణ క్రమాన్ననుసరించి
ప్రత్యక్షం తయవాత చెప్పకోవలసిందీ, కుడి ఎడంగా ప్రత్యక్షమంతశక్తి గలిగిందీ అనుమాన ప్రమాణం. ప్రత్యక్షం అన్ని
ప్రమానాలకూ ఆధారమైయున్నప్పటికి జ్ఞానార్జనలో, విశ్వాంవేషణలో
ప్రముఖ పాత్ర వహిస్తున్నది అనుమాన ప్రమాణమే. దీని క్షేత్రం కూడా బహు విస్తృతమైనది.
ప్రత్యక్ష ప్రమాణ క్షేత్రం బహు చిన్నది. అది తానున్న కాలంలో, తానున్న దేశంలోనున్న విషయాలను గ్రహించుటకు మాత్రమే పరిమితమై వుంటుంది.
ఎప్పటికప్పడు ఏ మనిషికైనా ప్రత్యక్షం వర్తమాన విషయం మాత్రమే కాగలదు, మరి జీవితమో గతంతోనూ, భవిష్యత్తతోనూ సంబంధపడి
ఉన్నదాయె, స్వాభావికంగానే గవేషణా ప్రవృత్తికల మనిషి తన
ఆధ్యయన కేతంలో [పస్తుత మేర్పడియున్న పరిస్థితులాధారంగా గతంవైపుకూ, భవిషత్తు వైపుకూ దృష్టి సారిస్తు న్నాడు. ఆనాదిగా విశ్వాన్వేషణ సాగిస్తూనే
ఉన్నాడు మానవుడు. ఈ అన్వే షణలో అతనిని నిరంతరం కదిలిస్తున్నది హేతుబద్దమైన ఊహే.
నాటి మేధావుల తాత్విక దృక్పధాలకూ, నేటి విజ్ఞాన
శాస్త్రజ్ఞులైన ప్రకృతి పరిశోధకుల ప్రతిపాదన లకూ. ఈs ఆనుమాన
ప్రమాణాంతర్గతమైన ఊ హే ఆయువుపట్టు. అయినా ఆయూ సిద్దాంత ప్రతిపాదకులైన వారిలో
ప్రముఖంగా రెండు పంథాలు కనుపిస్తాయి పరిశీలిస్తే.
కొన్ని ఆధారాలతో, పత్యడానుభవాల ద్వారా ఏర్పరచుకున్న
కొన్ని సాధారణ సూత్రీకరణల ననుసరించి-ఒకానొకదాని ఆస్తిత్వాన్ని ఊహించడం వరకూ
యిరువురూ సమానమే అయినా ఆయా ఊహాత్మక సిద్దాంతాల నిర్ధారణకు మరికొన్ని ప్రయోగాల
నాశ్రయించి ప్రత్యక్షంగా బుజువు పరచుకునేంత వరకు సాగుతుంది వైజ్ఞానిక పద్దతి.
అందువల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు రెండు (1) ఏనాటికై నా
పరోక్షజ్ఞాన స్థాయినుండి ఆ పరోషజ్ఞాన స్థాయికి ఎదగగలుగు తోంది విజ్ఞానము. (2)
ఆధార సహితమైనవే తమ తమ ఊహలనుకుంటూ సిద్ధాంతాలు చేసుకున్న వాటిలో
కొన్నింటిలోని ఆధార రాహిత్యాన్నీ, దుష్ట హేతు వలనూ గమనించి ఆ
భ్రమలనుండి 3 టపడే వీలుకలుగుతోందా విధానం వల్ల.
మరి అదే సనుయంలో వేదాంతము, ఆధ్యాత్మ విద్య, ఆస్తికత, మతము వగైరాల పేరున ప్రచారంలో నున్న తాత్విక
ధోరణులై శైS ప్రయోగాల ద్వారా - . నిర్ధారించుకునే పద్ధతి
నవలంభించకపోవడం వల్లనూ; ఒక ఊహాత్మక సిద్ధాంతాన్ని so
- నిర్ధారించుటకు మరికొన్ని ఊహలనే ఆధారం చేసికుని సాగడం వల్లనూ
కేవలం * . . . . છCG૦ సిద్ధాంతాలన్నీ అనుమాన, శబ్ద ప్రమాణ విషయాలై పరోక్షజ్ఞాన
స్థాయి నుండో, భ్రమాత్మక స్థితినుండో బైటపడలేక పోతున్నాయి.
Note:- ఈ సందర్భంలో మరో
ముఖ్య విషయాన్నీ గమనించాలి. సత్యాన్యాన్వేషి. విజ్ఞాన శాస్త్రావిష్కరణలు మాకాధారం
అని చెప్పకుంటుండే నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు వగైరాలు కూడా తమ తమ అభిప్రాయాలకు ఆధారంగా ఊహనో మరో వ్యకి
మాటనో (అనుమాన,శబ్ద ప్రమాణాలను) ఆధారంగా తీసుకుంటున్నారు. ఈ
విషయంలో మతస్తులు అంధ విశ్వాసులు అని చెపుతూ తామూ అదే మార్గంలో పయనిస్తున్నామని
గమనించను, వీరు. ఉదా:- "గోరా
అన్నీ చెప్పే ఉన్నాడు," "మార్క్స సిద్ధాంతాన్ని
మరల పరిష్కరించవలసిందేమీలేదు. “M.N. రాయ్ నిర్ధారితాంశాలు
మరల సరిచూడవలసిన పని లేదు.” ” మా విజ్ఞానాన్ని పరీక్షించ వలసిన పనిలేదు"
లాటి అభిప్రాయాలన్నీ మతస్తులకున్న అభిప్రాయాల్లాటివే. ఎవరు ప్రయోగం
ద్వారా విషయాన్ని నిర్ధారించుకోరో, ప్రయోగానికి-పరీక్షకు-
అంగీకరించరో వారంతా పెడ మార్గం పట్టిన వారేనన్నది నిర్వివాదాంశము. వారు మేధావులూ,
సత్యసంధులూ ఐయండవచ్చు గాక.
అనుమాన ప్రమాణాంతర్గతమైన ఊహ
ద్వారా ఏర్పరచుకున్న నిర్ణయా లను ప్రత్యక్షంలో సరి చూసుకోనంత కాలం ఆ జ్ఞానానికి
విజ్ఞాన స్థాయి చేకూరదు. పైగా ఆవూహాత్మక సిద్దాంతాలే క్రమంగా విశ్వాసులైన వారిలో
మూఢ నమ్మకాలుగా రూపొందుతాయి. ఈ విషయాన్ని కేవలం మతాలకే పరిమితం చేయక్కరలేదు. ఏ
సిద్ధాంతానికైనా అన్వయించి చూసుకోవచ్చు,
ఉదాహరణకు మార్క్సు సిద్ధాంత లక్ష్యమైన కమ్యూన్ ఊహాత్మకమైనదే.
కమ్యూనిష్టు అనుయాయులలో నేడది పిడివాద రూపంలో అంధ విశ్వాసప్రాయమై మతస్తుల
స్వర్గంలాంటిదేగానే స్థిరపడి ఉంది.
ప్రస్తుతం అనుమాన ప్రమాణంలోని
ఊహా స్వరూపం వ్యవహారంలో ఉన్నకాల్పనికమైన భావనా రూపం కాదనీ, అలానే సంశయ రూపనూ కాదనీ, కొన్ని ఆధారాలతో (పారిభాషికంగా వీటినే లింగములంటారు.] ఒక దాని
అస్తిత్వాన్ని ఊహించడం అనీ అనుకున్నాము. దానినే మరికొంత విపులీకరిస్తాను. పరస్పరం
సాహచర్య నియమంలో ఉండే రెండు పదార్థాలను గురించి లోగడ మనకు తెలిసి ఉందనుకోండి.
(సాహచర్య నియమం అంటే దీనిని విడచి అది ఉండదు. ఇందుంటే అదీఉంటుంది అనడానికి తగిన
సంబంధం ఏ రెంటి మధ్య ఉన్నదో ఆ రెంటికీ ఉన్న సంబంధం సాహచర్య నియమం ఆంటారు.) ఇప్పడు
అందులో ఏ ఒక్కటి కనిపించినా రెండో దానిని స్మరిస్తాము. ఇందుంది గనుక అదీ ఉంటుంది
అన్న నిశ్చయానికి వస్తాము. తర్కంలో దీనికి ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం ఉంది. పర్వతము
నిప్పు కలిగి ఉంది. పొగ కనబడుతోంది కనుక, ఎక్కడ
3
పొగ ఉంటే అక్కడ నిప్ప ఉంటుంది. ఆ
రెంటి మధ్య సాహచర్య నియమముంది. ఇక్కడ పొగ ప్రత్యక్షంలో ఉంది. పొగా నిప్ప కలసి
ఉంటాయన్న వివేకం గతానుభవాల ద్వారా (వంటయిల్లు వగైరా) కలిగే ఉంది. దానిని స్మరించడం
ద్వారా యిప్పడు కనబడుతున్న పొగతోబాటు కనబడని నిప్పు ఉనికినీ ఊహిస్తాము. ఆ వూహ
కాల్పనికమూ, సందిగ్డమూ
కాక నిశ్చయ రూపంలో ఉంటుంది. కనుకనే అనుమాన ప్రమాణంలోని ఊహను జ్ఞానంగానే
స్వీకరిస్తాము.తెలిసింది అనే అంటాము.
అయితే ఇక్కడ గమనించవలసిన
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అనుమతి ప్రమలో సామాన్య పదార్థం మాత్రమే తెలుస్తూంటుంది.
పొగ ఉన్నదగ్గర నిప్ప ఉంటుందని తెలుస్తుందే గానీ ఆ నిప్పు ఎలా ఉందో తెలియదు. ఇప్పడు
కనడుతున్న పొగకూ, గతంలో
తెలిసి ఉన్న పొగకూ ఉన్న తేడా తెలుస్తూనే ఉంటుంది మనకు. కానీ గతంలో తెలిసి ఉన్న
నిప్పకూ ప్రస్తుతం పొగ దగ్గర ఉన్న నిప్పకూ గల తేడా తెలియదు. ఎందుకంటే నిప్పు
ఉన్నదన్న విషయం తెలిసిందే గానీ అదెలా ఉందో యింకా తెలియవలసే ఉంది కదా ఇక్కడ. విశేష జ్ఞానం ప్రత్యక్షం ద్వారా
మాత్రమే కలుగుతుందనేది ఇక్కడ గమనించవలసిన విషయం. అనుమానంలో ఏది ఉందని
తెలిసిందంటున్నామో అదింకా తెలియ వలసే ఉందని గమనించక పోయామా గొప్ప ప్రమాదంలో
పడిపోయినట్లే. అనుమాన ప్రమాణం ద్వారా తెలిసే విషయం దానిని గురించి పూర్తిగా
తెలుసుకునేందుకు ప్రేరణగా ఉండాలేగానీ,విషయం తెలిసిపోయింది.
మరింక తెలియవలసిందేమీ లేదు అన్న భ్రమలోనికి నెట్టివేయరాదు. మత ధోరణులకూ, వైజ్ఞానిక పంధాకూ ఉన్న మౌలికమైన తేడా యిక్కడే ఉంది. మతం అనుమాన ప్రమాణం
ద్వారా గ్రహించిన విషయాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయదు. అసలు
నిర్ధారించుకోవడానికి వీల్లేని వాటిని కూడా సైద్ధాంతిక రూపంలో ప్రచారం చేస్తుంది.
అదే శాస్త్రీయ పద్ధతిలోనై తే అనుమాన ప్రమాణ విషయం అన్వేషణకు ప్రారంభం మాత్రమే.
తేడాను గమనిస్తున్నారనుకుంటాను. ఇక్కడ ఆగి
మరోమారు పై విషయాన్నే విషయాన్నే పరిశీలించండి. జిజ్ఞాసువూ, పరీక్షకుడూ కూడా అత్యంత మెలకువగా ఉండవలసిన చోటిది.
అనుమాన ప్రమాణం నిత్య జీవితంలో
ప్రతి క్షణమూ ఎలా ఉపయోగకారిగా ఉంటున్నదో అలానే దానివల్లే తరచుగా ప్రమాద పడే
పరిస్థితుల్లూ ఏర్పడుతున్నాయి. దాదాపుగా తాత్విక సిద్ధాం తాలన్నీ దీని నాధారం
చేసికొనే రూపుదిద్దు కున్నాయి. పరీక్షకు సిద్ధంకమ్మన్నప్పడవి "మాది పరీక్షింప వలసిన
పనిలేదు"
4
అనే మొండివైఖరిని ప్రదర్శించి మత
రూపాన్ని పొందాయి. (Not – మతమంటే చెడ్డదనే అర్థంలోనేనామాట అనడం లేదు. ప్రతిపాదితాంశాలకు ఋజువలను
వెతుక్కునేదకు యిష్టపడని, సిద్ధపడని విశ్వాస ప్రాతిపదేకను
స్వీకరించే స్వభా వాన్నే ఇక్కడ నేను మతమన్న మాట ద్వారా సూచిస్తోంది. గమనించగలరు.
నాస్తికోదులల్లోనూ మతస్తులున్నారని తేలుతుంది ఈ విషయం గమనిస్తే. అందుకే నాస్తికాదులూ
మతాలే నేడు)
ప్రయోగించి సరిచూసుకోడానికి వనరులు లేని కాలంలో ఏర్పడ్డ
అనేక సిద్ధాంతాలు నేటికీ వాస్తవాలుగానే చలామణీ అవుతున్నాయి అనుయాయుల్లో. ఈ చెలామణి
ఎంత మొండిగా, బండగా
అనుసరించబడుతోందంటే నేడవి ప్రయోగం ద్వారా తప్పులని పదే పదే నిర్ధారింప్బడినా
వాస్తవాన్నంగీక్రించటానికి, అసత్యాలను విడవడానికి సిద్ధంగా
లేరు ఆయా సిద్ధాంతానుయాయులు. ఉదా:- జల పరమాణువులనేవి లేవనీ, ఆసలు
జలమన్నదే రెండువాయువుల సమ్మేళనమనీ కొద్దిపాటి పదార్థ విజ్ఞానం తెలిసిన
విద్యార్థికైనా నేడు తెలుసున్న విషయమే. అలానే ఆకాశం అంటే ఏమీలేదన్న అర్థమో,
మరొకటి ఉండటానికి వీలున్నదన్న అర్ధన్నో సూచిస్తుందేగాని అదొక
ద్రవ్యంకాదు అంటే వినే సాంప్రదాయకులెందరున్నారు? అలానే
కమ్యూనిస్టుల కమ్యూన్ లేక సమసమాజమన్నది కూడా అంటే ఆశ్చర్యంగా లేదా మీకు?
ఇవన్నీకూడా ప్రత్యక్షం కంటే
అనుమాన ప్రమాణానికి అధిక విలువనివ్వడంవల్ల ఏర్పడ్డ ప్రమాదరూపాలే. ఊహద్వారా ఏర్పడ్డ
పరోక్షరూపమైన జ్ఞానాన్ని మరల మరో ప్రమాణం ద్వారా అపరోక్షరూపానికి
మార్పుచేసుకోవాలన్న వివేకం లేకపోవడమే (ఒక రకమైన అజ్ఞానమే అది) ఈ ప్రమాదాలన్నింటికీ
ప్రధాన కారణం. సరే యిప్పటికింత వరకు గమనించండి. పైసంచికలో అనుమాన ప్రమాణంలోని
విభాగాలూ, వాటి స్వరూప
స్వభావాలు విపులీకరిస్తాను.
అనుమాన ప్రమాణం, దానిద్వారా తెలిసే విషయం యొక్క
స్వరూపం, దానికున్న స్తాయి. అన్నవాటిని యధాతధంగా గమనిస్తే
యిలా ఉంటుంది.
అనుమానం ద్వారా తెలిసే విషయం
లోగడ తెలిసినట్టిదే. ఆ తెలియడానికాధారం వ్యాప్తిస్మరణం. వ్యాప్తిసరణం మంటే, స్మృతిలో ఏ రెంటి సంబంధం ఉన్నా
ప్రస్తుతం వాటిలో ఒకటి ప్రత్యక్షంలో ఉంటే ఆ రెండో దాని ఉనికి స్మృతిలో ఉన్న సంబంధ
బలం వల్ల స్మరించడమని అర్ధం. కనుక అనుమాన ప్రమాణం యొక్క స్వరూపం సంబంధ
స్మరణమవుతోంది. ఈ సంబంధములన్నవి ద్రవ్య,గుణ క్రియలలో
వేటిలోనైనా ఉండ వచ్చు. సామాన్య విషయమే తెలుస్తుందిగానీ ఉన్నది
5
ఉన్నట్లు తెలియదు. అది తెలియవలసే
ఉంటుందింకా. ఏది తెలిసిందంటున్నామో అనుమానం ద్వారా, అదింకా పరోక్షంలోనే ఉందన్న మాట. అనుమాన ప్రమాణం యొక్క
పరిమితిని గుర్తిస్తే అదెంత విశాల క్షేత్రాన్ని కలిగిఉన్నా దానిస్థాయి (బలం] చాలా
పరిమిత మైనదేనని తెలుస్తుంది.
ప్రమాకరణం ప్రమాణం అన్నది గుర్తులోనే ఉందనుకుంటాను. మరిప్పుడు అనుమాన ప్రమాకరణం
పనిముట్టా? పద్ధతా! మరొకటా? ఆలోచించండి.
అలానే రెంటి సంబంధ జ్ఞానం గతంలో కలిగి ఉండవలెనంటే ఏమిటి? రెండు
వస్తువుల సంబంధ జ్ఞానం గతంలో కలిగి ఉండవలెనంటే ఏమిటి? రెండు
వస్తువుల సంబంధ జ్ఞానమా? పరిణామ క్రమంలోని రెండు రకాల సంఘటనల
జ్ఞానమా? యిలా ఎన్నో అంశాలను విశ్లేషించి చూడవలసి ఉంది. దీని
క్షేత్రాన్ని అవగాహన చేసికోవాలంటే, ఆవివరాలు పై సంచికలో. ఈ
లోపు మీ మీ ఆలోచనకందిన వాటిని స్పందనకు పంపండి.
No comments:
Post a Comment