సంపుటి-3 సంచిక-3 1-3-93
1
అనుమాన ప్రమాణాన్ని ఇతర ప్రమాణాల నుంచి వేరు చేసి (దాని పరిధుల్ని
నిర్ధారించి) చూడడానికి ప్రయత్నిస్తున్నాము కదా! నిదానంగాను ,కూలంకుశంగానూ పరిశీలించి అధం
చేసుకోవలసిన విషయమిది. ఏదో ...సూత్రం చెప్పి పూర్తి చేహ్సామనుకుంటే అది ఆచరణలో
సరిచూసుకుంటానికి, జీవితంలో వినియోగించుకుంటానికి సరిపోదు.
పైగా ప్రమాదపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీని విషయంలో.
అనుమాన ప్రమాణంలో హేతువు
కీలకమైనది. దాని ఆధారంగానే మనం ప్రత్యక్ష ప్రమాణంలో లేని దానిని తెలుసుకుంటాము.
ఇప్పుడు మనకు గోచరిస్తున్న హేతువుకూ, దీని ద్వారా తెలుసుకుంటున్న సాధ్యానికి గత
సంబంధం ఉండాలి. ఆ రెంటికీ ఉన్న సంబంధాన్ని అవినాభావ సంబంధమనీ, సాహచర్య నియమం అనీ, వ్యాప్తి అనీ పారిభాషికంగా
అంటారు.
ఇక్కడ మరో మూడు మాటలను అర్ధం
చేసుకోవలసి ఉంది. అవి పక్షం,సపక్షం,విపక్షములు. పక్షమంటే ఇప్పుడు
మనకు హేతువు ఎక్కడ కనిపిస్తున్నదో, ఎక్కడ సాధ్యాన్ని
ఊహిస్తున్నామో అది, ఆ స్థలం పక్షమనబడుతుంది. “ సందిగ్ధ
సాధ్యవాన్ పక్షః 1”. ఇప్పుడు హేతువాధారంగా సాధ్యాన్ని ఊహించడానికి ఎఐ రెండూ కలసి
ఉంటాయని గతంలో నేవెక్కడ వాటిని తెలుసుకున్నావో అది. ఆ స్థలం-సపక్షం. “నిశ్చిత
సాధ్యవాన్ సపక్షః1” సాధ్యము లేదు కనకనే హేతువూ లభించడం లేదు అనడానికి వీలయిన
ప్రదేశము విపక్షము అవుతుంది. ఇంత వరకు అర్ధమైఅతే విదివడని బంధం కల రెంటి గురించి,
వాటి సంబంధాన్ని గురించి గతంలో తెలిసి ఉండటం సాధ్యాన్ని ఊహించడానికి
అసాధారణ కారనము అవుతుంది. దీనినే లింగ పరామర్శ అంటాము. ఇదే అనుమాన ప్రమాన స్వరూపము
అనుకోవచ్చు.
ఎట్టి అధారాన్ని సరైన హ్ఏతువుగా
స్వీకరించవచ్చు? స్వీకరించాలి? గతంలోని తార్కికులు స్వీకరించారు?
అన్న ఈ అంశమే అనుమాన ప్రమాణాన్ని నిర్దుష్టం చేయడానికి
ముఖ్యమవుతుంది. హేతువుకు పక్ష సత్యము, సపక్ష సత్యము,విపక్ష సత్యము అన్న యోగ్యత ఉండాలి. అంటే ఒక దానిని అనుమానించడానికి అక్కడ
హేతువు ఉండాలి. దానిని పక్ష సత్యమంటారు. హేతువు సాధ్యాలున్న
విషయం గతంలో మనకు తెలిసిందెక్కడో దాన్ని
సపక్షంంటాము గదా, అక్కడ హేతువుండడాన్ని సపక్ష సత్యమంటారు..
ఇకపైన పేర్కొన్న విపక్షంలో హేతువు లేకపోవడాన్నే విపక్ష సత్యము అంటారు. తార్కిక
పరిభాషలో అంతగా పరిచయం లేని వారికొరకు ఈ విషయాన్నే వేరే మాటల్లో చెప్పుకోవచ్చు.
అనుమాన
2
ప్రమాణింలోని
పక్షం ద్వార్ణాంతికానికి-సపక్షం-దృష్టాంతానికీ లేక ఉదాహరణకు సమానార్థకాలే. హేతువూ, సాధ్యమూ
రెండూ లేని తావు విపక్షం.
మరో కోణం నుండే హేతువును అర్థం చేస్తుకోవచ్చు. ఏ పదార్థమైనా దాని లక్షణం
ద్వారానే తెలియ వలసి ఉంటుంది. అలానే సరైన హేతువుకూ లక్షణ నిర్దేశం చేయవలసి
ఉంటుంది. అది దూషత్రయ రహితంగా ఉండాలి. దూషణ త్రయమంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవములే. శాస్త్రాధ్యయనం చేయగోరు జిజ్ఞాసువులు పరిభాషను అర్ధం చేసుకొని
ఉండటం అవసరం. అందుకే ఈ వివరణలు.
ఒక విషయాన్ని (వస్తువు,గుణము,
క్రియ,సంబంధం మొదలగు మాటల అర్ధాలను]
తెలుపడానికి నిర్వచనరూపంగా మనం వెలిబుచ్చే మాటలు ఆ వస్తువు యొక్క అసాధారణ
ధర్మాన్ని తెలుపగలగాలి. దానినే దాని లక్షణ మంటాము. అలా అసాధారణ ధర్మంగా మనం
చూపించదలచుకున్న లక్షణం చూచే వస్తువు నందు ఉన్నా మరో వస్తువులో కూడా ఉందనుకోండి.
లక్షణం అతి వ్యాప్తి దోషంతో కూడి ఉందని అర్ధం. ఏరకమెన వసువును తెలుపడానికి ఆలక్షణం చెప్పామో ఆ రకమైన
వస్తువులందన్నీ చోట్లా ఆలక్షణం లేనట్లయితే (కొన్ని చోటులందే ఉంటే) చెప్పిన
లక్షణానికి అవ్యాప్తి దోషమ్లున్నట్లు. చెప్పిన
లక్షణం-అసాధారణధర్మం-చూపుత్తున్న
వస్తువులో బొత్తిగా లేకున్నచో నిర్వచనానికి అసంభవదోషమున్నట్లు. ప్రతిపాదన సరైందా
కాదా (సత్యమా- అసత్యమా,దోషయుక్తమా-దోషరహితమా) అన్నది నిర్ధారించటానికి ఈ పరీక్ష అతి ముఖ్యమూ,
సార్వత్రికమూ ఐయున్నది.
ఇప్పుడు పై “హేతువు”ను అతి
వ్యాస్త్యాదులతో సరిపోల్చి చూద్దాం. విపక్షంలో హేతువుండుట (పక్ష సపక్షాల్లో
ఉన్నప్పటికీ) అతి వ్యాప్తి దోషమవుతుంది. సాధ్యం లేని చోట హేతువు గోచరించుట అని
అర్ధం. పక్ష, సపక్షములందన్నితావులా, ప్రతిసారీ హేతువు గోచరించనిచో
హేతువుగా చూపుతున్నదానికి అవ్యాప్తి దోషమున్నట్లు, ఈ రెంటికి
భిన్నంగా హేత్వాభాసలు సాధ్యాన్ని సిద్ధింపజేయుటలో అసంభవ దోషాన్ని కలిగుంటాయి.
Note:- ఈ విద్యలో పరిచయమున్న
వారు పరిశీలించి అభిప్రాయం వ్రాయండి. పరిచయం లేని నిదానంగా మళ్ళా మళ్ళా చదివి
అర్ధం చేసికునేందుకు యత్నించండి. అర్ధం కాకపోయినా చిన్నబుచ్చుకోవలసిన పని లేదు.
తర్కశాస్త్రమే కర్కశమైనది. ఎక్కడ అర్ధమైనట్లనిపిస్తోందో, ఎక్కడ
సందిగ్ధంగా కనబడుతుందో స్పందనకు వ్రాయండి. మళ్ళా మరో తీరులో వివరించుకుందాం.
అసలింతకూ ఈ ప్రమాణ వివేచన జ్ఞానార్జనకు తప్పనిసరి అవసరం అని పాఠకుల్లో ఎందరు
గమనించారో నా వరకు నాకు సందిగ్ధమె. దీని అవసరాన్ని గ్మనించిన వారికి మాత్రం ఉపయోగపడగల సూచన ఒకటే చేస్తాను.
(1) భారతీయ తర్కశాస్త్రం(A) న్యాయ వైశేషికాలు (B) తర్కశాస్త్ర సంగ్రహం (2) బౌద్ధ తర్కం న్యాయ బిందు (3) కళాశాలల్లో B.A.
తర్కశాస్త్రం పేరున ఉన్న పాఠ్యగ్రంధాలు కలిపి అధ్యయనం చేయగలిగితే ఈ
విద్య యందు కనీస పరిచయం కలుగవచ్చు. తర్క సంగ్రహానికి బాల ప్రియ సహితం అంటూ
వ్యాఖ్యతో వంగీపురం రామానుజాచార్యులు తెలుగు చేశారు. వారి రచనాశైలి, బోధనా పద్ధతి సరళంగానూ, ప్రయోజనకాంగాను ఉన్నాయి. ఇహ
అందులో కొన్ని దోషాలు దొర్లాయి. అది ఆనాటి శాస్త్రకారుల అవగాహన స్థాయికి
సంబంధించిన విషయం. వాటిని గురించి జిజ్ఞాసువు క్రమంగా తెలుసుకోవచ్చు. న్యాయ
వకిశేషిక దర్శనాలు పండిత గోపదేవ్ తెలుగు చేశారు. న్యాయబిందుకు మాత్రం తెలుగు
లభించలేదు. వీలుంటే త్వరలో మేమే వెలయిస్తాము. తెలుగు అకడెమీ, సాహిత్య అకాడమీ, తి.తి.దేవస్థానం లాటి సంస్థలు ఎంతో
విలువైనట్టీ,బుద్ధివైశారద్యాన్ని కలిగించగలట్టీ ప్రమాణ,
పదార్ధ, తర్క శాస్త్రాలను అనువదించి
ముద్రించటం సమాజానికి వారు చేయగలా ,చేయవలసిన బాధ్యతాయుత
కార్యం. అది గొప్ప నిర్వాహం కూడా కాగలదు. సరే ప్రతి
పాదితాంశాన్ని విడచి ఎక్కడకోపోయాం. అయినా అకారణంగా మాత్రం కాదు. ఈ విద్య సమాజానికి
అందుబాటులో ఉండడం ఎంత అవసరమో నాకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఆ ఆతురతే నన్నిలా
ఆలోచింప జేసింది. దీని నిలా ఉంచి అనుమాన ప్రమాణానికి సంబంధించిన మరికొన్ని
పరిశీలనాంశాలు మీముందుంచి తాత్కాలికంగా ఈ సంచికతో అనుమాన ప్రమాణాన్ని ముగిస్తాను.
నిత్య జీవితంలో మనం అనుమాన ప్రమాణాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో చూసుకుంటే
తప్ప అనుమాన ప్రమాణ పరిధుల్ని (అది పని చేయగల-పని చేయలేని) చోటులను ఇదమిత్తంగా
నిర్ధారించడం కుదరదు. పెన చెప్పకున్న మూడు యోగ్యతలున్న హేతువులు ఎల్లవేలా మనకు
సాధ్యాన్ని అనుమానించడానికి ఉపయోగపడతాయి. ప్రమాదపడే అవకాశములున్న(లోపభూయిష్టములైన)
అతివ్యాప్తి, అవ్యాప్తి అనే దోషయుక్తములైన హేతువులు కూడా నిత
జీవితంలో వినియోగంలోనే ఉంటున్నాయి. ఇంకా విపులంగా చెప్పాలంటే,ఎక్కువ
భాగం ఈ రకమైనవే అనుమానంలో చోటుచేసికుంటున్నాయి. అనుమాన ప్రమాణ పరిధుల్ని వివేచించే
సందర్భంలో దాని శక్తి పరిమితుల్ని సరిగా గ్రహించాలంటె కిలకమూ, మౌలికమూనైన
పై అంశం సుస్పష్టంగా గ్రహించడం అవసరం. గతంలో అనుమాన ప్రమాణం పె జరిగిన అనేక తర్క
వితర్కాలకు ఈ అంశమే ఆధారంగా ఉంటూ వ న్చింది. ఈ అంశానికి తగిన విలువనిచ్చి పరిగణనలోకి తీసికొనక పోవడం
వల్లనే గతంలో జరిగిన ప్రమాణమీమాంసలో ప్రతి పక్షంవారూ , ఎదుటి పక్షం వారు చూపిన అనుమాన
ప్రమాణంలోని హేతువు దోషయుక్తమైనదేనంటూ చర్చలు కొనసాగించారు. ఈ సందర్భంలో మరో
విషయాన్ని గుర్తు చేసికోవడం మంచిది.
సాద్శ నిశ్చయానికి ఆధారమైన హేతువు సరైనదా కాదా? అన్నది
ఎప్పడు తెలుస్తుంది? ఆ సందర్భంలో అసలు జ్ఞానం కలిగిందా?కలిగితే
៩៦៩ ఏమి జ్ఞానం కలిగింది?
ఆ కలిగిన జ్ఞానం సామాన్యరూపమా? విశేషరూపమా? అన్నది
ముందు తేల్చుకోవలసింది. ఆపైన కలిగినజ్ఞానం యదార్థమైనదా? భ్రాంత్యాత్మకమా
అన్నద్ది సరిచూసుకోవలసి ఉంటుంది. ఇక్కడవరకు పరిశీలన కొనసాగిన పిదపనే హేతుపు సరై
నదో కాదో నిర్ధాంగించడానికి వీలవుతుంది. మానవ జీవితంల్లో సాధారణంగా ఈ క్రమంలోనే వినియోగంలో ఉంటోంది అనుమాన ప్రమాణం.
మరోకోణంనుండి దీనిని వివరించుకుంటే అవగాహనకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ
హేతువును గతంలో సరైనది, సరికానిది (సద్దేతువు-హేత్వాభాస) છ8) రెండుగానే
విభాగించడం జరిగింది కానీ బ్రతుకులో అది పని చేసున తీరునుబట్టి దానిని మూడుగా చెప్పకుంటే బాగుంటుందనిపిసుంది (1)బలమైనది, 2)
బలహీనమైనది [దీన్లో అతివ్యాప్తి రూపంలోనో, అవ్యాప్తి
రూపంలోనో దోష ముండ వచ్చు (3) పనికిరానిది (దుష్ట హేతువు,హేత్వాభాస]. 1వది సలక్షణ రూపం కాగా
రెండవది ఉపయోగపడుతూనె ఉన్నా నిక్కచ్చిగా సపద సత్వము, విపక్షాసత్వము
అన్న కొలతలకు నిలుస్తుందని చెప్పలేము,
మూడవది కేవలం
భ్రాంత్యాత్మకమై ఉంటుంది.
చివరగా కొన్ని ఉదాహరణలు తీసికొని పరిశీలిద్దాం. మీకూ అర్థమవుతుంది బ్రతుకులో
అది పనిచేస్తున్న తీరూ, పైన నేను వ్రాసిన మాటలలోని వాస్తవమూ,
(1) అందరకూ తెలిసిన ఉదాహరణం
ఒకటుంది ధూమాగ్నులకు సంబంధించింది. ఎక్కడ పొగ గోచరిస్తుందో అక్కడ నిప్పు వుంటుంది." అన్నదే అది. ఇక్కడ పొగ హేతువు. అగ్ని సాధ్యము.
(2 నేనెరిగిన ప్రముఖ తార్కికులౌకరు, అనుమాన
ప్రమాణం పై వారితో చర్చిస్తున్నపుడు చూపిన ఉదాహరణలు రెండున్నాయి. (1) రామలక్ష్మణులు
(2)బంట్రోతు-ఆఫిసరు- ఇందులో లక్ష్మణుడు హేతువు-రాముడు సాధ్యము, బంట్రోతు హేతువు-ఆఫీసరు
సాధ్యము.
(3) న్యాయదర్శనం ప్రకారం మూడు
రకాల హేతువుల ఆధారంగా అనుమాన ప్రచూణం పనిజేస్తుంటుంది. కార్యాన్నిబట్టి కారణాన్సి , కార్యాన్ని, సాదారణీకరణల
ద్వారా మరికొన్నింటినీ, అనుచూనించగలమని గౌతముని అభిప్రాయం.
(4) అయితే న్యాయ వైశేషికాన్ని ఆధారం చేసికుని తర్కించే నైయాయికులలో ఎక్కువ భాగం కార్యాన్ని
బట్టి కారణాన్నిఊహించటమే సరైన పద్ధతి అంటారు.
“వ్యాప్యారోప
పేణ వ్యాపకారోపస్తర్క”
(5) మానవుడు మర్త్యుడు—మరణధర్మం
కలవాడు అన్న సాధారణీకరణాన్ని అనుసరించి వెంకట్రావు చస్తాడు- మనుష్యుడు గనుక అనే
న్యాయ ప్రయోగం తార్కికులంగీకరించేదే. ఇదీ అనుమానే వారి భావం. అయితే రెంటి మధ్య
విడదీయరాని సంబంధం-వ్యాప్తి-ఉండాలి గదా అనుమానానికి. ఇక్కడ రెండేవి? అని
అడిగేవారు కొందరన్నారు ఈ విషయంలో. . .
(6) సైకిలు పార్టు ఒకటి రోడ్డు
మీద కనబడింది. సైకిల్ స్మృతికి వచ్చింది. ఇక్కడ జరిగిన స్మరణవిషయము ఏదైనా
ప్రమాణములోని భాగమా? కాదంటే ఎలానో చెప్పండి. అవునంటే ఏ
ప్రమాణంలోనిదో చెప్పండి. ఇక్కడ అవయవిని తెలుసుకోవడం జరిగిందా, జరగలేదా
? ;
(7) గోడప్రక్కనుండి సైకిలు
హ్యాండిలు, సగం వరకు చక్రమూ కనుపిస్తున్నాయి. అక్కడ సైకిలు ఉందన్న జ్ఞానం కలిగింది.
దీనికాధారమైన స్కృతి ఏదైనా ప్రమాణంలో భాగమా? ఏ ప్రమాణంలోనిది?
ఇచ్చటేమైనా అవయవాన్ని బట్టి
అవయవిని తెలుసుకోవడం జగిందా?
(8) టేపు రికార్డర్లో ఒక పాట
వినబడింది. పాడింది ఘంటసాల అని తెలిసింది-స్మృతిద్వారా, అది
ఏప్రమాణానికి చెందుతుంది?
(9) వాకిట్లో ఒకరి గొంతు
వినబడింది, పలానా వారు వచ్చారని తెలిసింది, ఇది
ఏప్రమాణ విషయం?
(10) మరల గుర్తించడం
(ప్రత్యభిజ్ఞ] లోని స్మరణకూ, హేతువునాధారం చేసికుని సాధ్యనిశ్చయం చేయడంలో ఉపయోగపడే స్మరణకు
ఉన్న తేడాపాడాలేమిటి?
(11) A విలువ B విలువ కంటే ఎక్కువ, B-C కంటె
అధిక విలువ గలది కనుక A-C కంటె విల్లువైనది అని
సాధేంచగలమా, ఇది ఏదైన ప్రమాణాధారంలో సాధించవలసి ఉంటుందా?
(12) "అ" అనునతడు “ఈ"ని మలయుద్ధంలో ఓడించాడు.
"ఈ" "ఊ"ని జయించాడు కనుక 'అ'_'ఊ' ని
జయించగలడు అని చెప్పగలమా?
ప్రమాణ వివేచనలో మీ మీ అవగాహనా స్థాయి ఏమిటో పరిశీలించుకోండి. ప్రమాణాలు, వాటి
పరిధులూ సరిగా తెలియనంతకాలం సత్యాసత్యాలు పరీక్షించి తేల్చుకోవడం అసాధ్యం.
తేల్చుకోలేము.
“విడివడనీరెంటి"
సంబంధ జ్ఞానం ఆధారంగా
వర్తమానంలో ఒకటి ప్రత్యక్షమై, రెండవది ప్రత్యక్షం కానపుడు ఆ రెండవదాని ఉనికిని ఊహించటం[సాధ్యం
పరోక్షంగా ఉండటం, ఊహ నిశ్చయంగా ఉండటం జరగాలి]. అనుమాన ప్రమాణ క్రమం,
సందేహాలూ, విమర్శలు ప్సందనకు పంపండి. పై
సంచికలో శబ్ద ప్రమాణాన్ని గురించిన విచారణ ప్రారంభించుకుందాం.
No comments:
Post a Comment