Wednesday, April 1, 2009

''పరిణామవాదమా? సృష్టివాదమా?'' వేదికదృష్ట్యా మిగిలివున్న పనులు



(1) సి.టి.ఎఫ్‌. క్రైస్తవ యోచనాపరుల వేదిక పేరున ప్రకాష్‌గారు బాధ్యత తీసుకుని, సుధాకర్‌గానిరీ కలుపుకుని మా వేదికలో పాల్గొన్న విషయం, క్రమంగా వారు వేదిక క్రమాన్ని విడచి మండలిని రెచ్చగొట్టే పనికి పూనుకోవడం జరిగింది. అందుకు, సత్యాన్వేషణ మండలి ఏమాత్రం తొణకకుండా, వారు పట్టించాలన్న పెడత్రోవ పట్టకుండా, శాస్త్రీయ విచారణా పద్ధతిని, వేదిక అనుసరించాల్సిన క్రమాన్ని అంటిపెట్టుకుని, 3 అంశాలను వారి ముందుపెట్టి, వాటిని నిరూపించండి అనడుగుతూ వచ్చింది. అవి : (1) సి.టి.ఎఫ్‌. నాపై సంధించిన 13 అంశాల లేఖకు బాధ్యత వహిస్తున్నవారి వివరాలు మాకందించాలి, (2) బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించాలి, (3) స్వస్థత ప్రార్థనల మహత్తును నిరూపించాలి. ఈ మూడు విషయాలకు ఉచితరీతిన సమాధానాలు చెప్పి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ప్రకాష్‌గారిపైనే వుంది. లేదా, 13 అంశాల లేకకు, ఇదిగో మేమూ బాధ్యులమేనంటూ ఎవరైనా ముందుకొస్తే, అప్పుడు వారంతా కలసిగానీ, వారిలో ఎవరుగానీ, అందుకు పూనుకోవచ్చు.

ప్రకాష్‌గారి తల్లిదండ్రులు అస్వస్థులై వుండడంతో మధ్యలో ఈ వత్తిడెందుకని రెండు నెలలుగా ఆగాము. సి.టి.ఎఫ్‌.నుండీ త్వరలో మా సమాధానం పంపుతామన్న కబురూ వచ్చింది. ప్రకాష్‌గారి మాతాపితరులు స్వస్థులవ్వాలన్నీ, కొంతమేరనైనా స్వస్థత చేకూరి వుంటుందని తలుస్తాను.
సి.టి.ఎఫ్‌. మెయిల్‌లో, ప్రకాష్‌గారా పనిలో వున్నారు, మేము మరో కార్యక్రమం వత్తిడిలో వున్నాము. వారు సి.టి.ఎఫ్‌.కు అధికార ప్రతినిధేలాంటి మాటలు వ్రాయడం ద్వారా పరోక్షంగా సంభాషిస్తున్న మరో వ్యక్తి ఎవరో నాకింతవరకు తెలియజేయలేదు. ఊరు, పేరు ప్రకటించని ఈ రీతినే నేను ఆదినుండీ ప్రశ్నిస్తూ వచ్చాను. ఇప్పటికైనా వారు తమ సి.టి.ఎఫ్‌.లో, నాతో జరిగే వివాదంలో పాలుపంచుకోదలచినవారి వివరాలు వెంటనే పంపడం కనీస విజ్ఞత.
మళ్ళా ఇతరేతరాంశాలను ప్రస్తావించకుండా, పై మూడంశాలపై స్పందించి, బాధ్యతతో వాటిని నిరూపించే పనికి సిద్ధపడవలసిందిగా ప్రకాష్‌గారినీ, వారి సి.టి.ఎఫ్‌. సభ్యులను ఆహ్వానిస్తున్నాను.
(2) ఫజులుర్‌ రెహ్మాన్‌గారూ, నేనూ కలసి ఆరంభించి కొంతవరకు సాగించిన ఈ వేదిక నియమాలు ఎలా సి.టి.ఎఫ్‌. వాళ్ళకు వర్తిస్తాయో, అలానే ఇస్లాం (ఖురాన్‌) పక్షం వాళ్ళకూ వర్తిస్తాయి. కనుక ఆ పక్షం నుండి వేదికలో పాల్గొన్న (1) అసఫుద్దీన్‌, (2) గౌస్‌, (3) రహమాన్‌ (కాకినాడ), మరియు వారితోపాటు వచ్చి పాల్గొన్న తారిఖ్‌, మల్లిక్‌ మొదలైనవారందరికీ వారి వారి సృష్టివాదాల్ని ప్రకటించి అది సరైందేనని (అదే సరైందని) నిర్ధారించాల్సిన బాధ్యత వుంది. ఆ బాధ్యతను ఏ పక్షంవారు స్వీకరించకున్నా, అందులోని ఎవరు స్వీకరించకున్నా అది వారిలోని నిజాయితీలేనితనాన్ని, అవగాహనలేని తనాన్ని తెలియజేస్తోంది. ఆ నిజం, ఆయా భావజాలాన్ని ప్రచారంచేసే అర్హత వాళ్ళకు లేదుగాక లేదని తెలుస్తోంది. ఇది అర్థంకానంత జటిల విషయమేమీకాదు. అర్థంకానట్లు నటించడమో, పట్టించుకోకుండా ప్రక్కదార్లు పట్టడమో చేస్తున్నారు వాళ్ళంతా అని అనాల్సిందే.
ఆమధ్య మా కేంద్రంలోనే, ఫజులుర్‌ రహ్మాన్‌గారు వెంటబెట్టుకుని వచ్చిన వహీద్‌ (కాకినాడ) గారు గ్రూపుతో భగవద్గీత, ఖురాన్‌ల దేవుడు ఒక్కడేనా? అన్న విషయంపై చర్చించి, ఒక్కడు కాదు అని తేల్చాం. రహ్మాన్‌గారూ, వహీద్‌గారు కూడా ఆ విషయాన్నంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ మొన్నటికి మొన్న రహ్మాన్‌గారు మార్చి 15న హైద్రాబాద్‌లో ఒక సమావేశం పెట్టి బైబిల్‌, వేదం, ఖురాన్‌లను పోల్చిచూపుతూ వేదమూ, బైబిలు, మహ్మద్‌ను గురించిన వివరాలిస్తున్నాయి అంటూ వైదికుల్నీ, క్రైస్తవుల్ని గూడా పిలిచి మాట్లాడించే యత్నం చేశారు.
ఫజులుర్‌ రహ్మాన్‌గారిపేరున ముద్రించబడ్డ పాకెట్‌ బుక్‌ సైజు పుస్తకమొకటి మార్చి 15 మధ్య నాకందింది. దాన్లో వేదం, ఉపనిషత్తులు, గీత, పురాణాల నుండి ఉట్టంకింపులతో, ముద్రారాక్షసాలు, అపవ్యాక్యానాలతో కూడి ఇస్లాంవైపుకు జనాన్ని రాబట్టాలన్న దృష్టిని కలిగి వుందది. వాళ్ళకే తెలియని, వాళ్ళుగా పట్టిచూడని గ్రంథాలనుండి ఉట్టంకింపులు, మహమ్మదు నంగీకరించండి అని నచ్చచెప్పడానికి హిందూ, క్రైస్తవ గ్రంథాల నుండి ఉట్టంకింపులు, చేయడం ఎంత తప్పుడు విధానమో, సరైన వాడెదురుపడితే అది తమ నెత్తికే మోయలేని బండలా ఎలా తయారవుతుందో వాళ్ళెరగరన్నది నాకు తెలుస్తూనే వుంది. అందులోదే, సత్యాన్ని గ్రహించడానికి, స్వీకరించడానికి సన్నద్ధంగా వుండాలి మనిషి, అన్న సూక్తీ వుంది, మరందుకు వారంతా సిద్ధమేనా?

No comments:

Post a Comment