ముఖ్య గమనికలు
మండలి రూపొందించిన 'నూతన వివాహవిధి' స్వరూపం మీముందుంది. నా అవగాహనకందినంతలో 'వివాహవిధి' అన్నది ఆచరణలోకి వచ్చాక 'ఇదిగో ఇది సమగ్రమైనది' అనదగ్గది ఇప్పటివరకు ఎక్కడా ఏర్పడలా. అలాగే సర్వులూ ఆమోదించేలా ఏ ఒక్కటీ స్థిరపడలా- మారుతున్న దేశకాల పరిస్థితులు, జీవితావసరాలు, సామాజికావసరాలు, విలువలపట్ల అవగాహనలో వస్తున్న మార్పులు, వగైరా, వగైరాలన్నింటి ప్రభావంవల్ల ఏ విధివిధానం ఉనికిలోకి వచ్చినా క్రమంగా ఎక్కడోచోట ఏదోరూపంలో, ఎంతోకొంతమేర మార్పులూ, చేర్పులకు లోనవుతూనే వచ్చింది. ఇప్పుడూ, ఇకముందూ కూడా ఆ క్రమం అలానే కొనసాగుతుంది.
ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకునే మా యీ నూతన వివాహవిధిలో ఎక్కువభాగం సర్వసాధారణాంశాలకు స్థానం కల్పించాము. అయినా దీనిని మరింత పరిపుష్టం చేయాల్సిన, మరికొంత మెరుగుపరచాల్సిన అవసరం వుందనే అనుకుంటున్నాము. అందుకు, అవగాహన, సామాజిక స్సృహ కలిగి పూర్వ నిశ్చితాభిప్రాయాలనుండి జనించిన రాగద్వేషాలకు లోనుకాకుండా, నాలుగు కాలాలపాటు ప్రజలు వినియోగించుకోగల విషయాలను అందించగల యోచనాపరుల చేయూతనూ అందుకోవాలన్న సదాశయంతోనే తొలివిడతగా ఒక వెయ్యి కుటుంబాలకు ఆ సమాచారాన్ని పుస్తక రూపంలో అందించి, మీ విలువైన సూచనలను అందించండంటూ అందులోనే ప్రకటించాము. మరింతమందికీ ఈ విషయాన్నందించి, వారి వారి సూచనలనూ అందుకోవాలనే దృష్టితో ఈనెల వివేకపథాన్ని దానికొరే ప్రత్యేకించాము. ఎంతో వ్యయప్రయాసలతో కూడిన మా యీ శ్రమ సఫలం అవడానికి మీవంతూ సహకారాన్నందించవలసిందిగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అర్థంపర్థం లేని ఆచారాలకు, సెంటిమెంట్లకు సంబంధించకుండా, జీవితంతో ముడిపడి, వివాహవేదికకు సందర్భోచితంగా వుండే మార్పులు, చేర్పులను వెంటనే మాకు తెలియజేయండి. త్వరలో 'వివాహం-పూర్వాపరాలు-విధివిధానాలు' అన్నదానికి చెందిన తగినంత సమాచారంతో ఒక మంచి పుస్తకాన్ని సమాజానికి అందించాలన్న నిర్ణయంలో వున్నాము. ఈ మంచిపనిలో మీరూ పాలుపంచుకోండి.
వివేకపథం జిల్లా పాఠకుల సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఆయా జిల్లాల పాఠకుల నుండి తగినంత స్పందన లేదన్నదో చేదునిజం. పాఠకులలో కనీస కదలిక ఎందుకుండడంలేదో మాకంతుబట్టడంలేదు. నిజానికి వివేకపథంలోని భావజాలంవల్లే అనంగీకారత వుంటే, అట్టివారు, పత్రిక పంపకండంటూ ఒక చిన్న కార్డు ముక్కైనా వ్రాసి పడేయడం కనీస బాధ్యత. ఈ సంచిక చూశాకైనా పత్రిక పంపకండనైనా వ్రాయండి, లేదా జిల్లా పాఠక సమావేశాలకైనా సిద్ధంకండి. లేదా రాలేకపోవడానికి తగిన కారణాలనైనా తెలుపండి.
మండలి త్రైమాసిక సమావేశాలు జులై 12, .... తేదీలలో జరపాలనుకున్నాము. సమావేశాలు దోరకుంట మండలి కేంద్ర కార్యాలయంలో 10 రాత్రికిగానీ, 11 ఉదయానికిగానీ అక్కడికి చేరాలి. చర్చనీయాంశాలుగ : (1) జిల్లా పాఠక సమావేశాల సమీక్ష-మలి కార్యక్రమాలు, (2) కార్యకర్తల శిక్షణ, అధ్యయన తరగతులు, (3) ....
No comments:
Post a Comment