1) 18-8-2009 మంగళవారం సత్యాన్వేషణ మండలి సభ్యులు శీలం నాగార్జునరావు, శివారెడ్డి, జగన్‌మోహన్‌రావుగార్లు మంగళగిరిలోని బి.సి. బాలికల వసతి గృహములో 8, 9, 10 తరగతులు చదివే బాలికలకు, చదువు నేర్వడంలోని మెళకువలు నేర్పారు.
2) 21-8-2009 శుక్రవారం సత్యాన్వేషణ మండలి సభ్యులు శీలం నాగార్జునరావు, కోట ప్రసాద్, జగన్‌మోహన్‌రావు, శివారెడ్డిగార్లు పెనుమాక గ్రామంలో బి.సి. బాలుర వసతి గృహములో 8, 9, 10 తరగతులు చదివే బాలురకు చదువు నేర్వడంలోని మెళకువలు నేర్పారు.
3) 30-8-2009 ఆదివారంనాడు సత్తుపల్లి వెల్‌కమ్ హోటల్‌లో సత్యాన్వేషణ మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కోట ప్రసాద శివరావుగారి ఆధ్వర్యంలో సత్సంగం జరిగింది.
4) 30-8-2009 ఆదివారం సాయంత్రం 4 గంటలకు నూజివీడు మండలంలోని తుక్కులూరు గ్రామంలో 'వైధవ్యం-ఒక శాపమా' అనే అంశంపై సత్యాన్వేషణ మండలి కోశాధికారి శ్రీ యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు సమన్వయకర్తగా, శ్రీమతి గుత్తికొండ అహల్యాదేవి, శ్రీమతి పద్మజగార్ల నిర్వహణలో చర్చావేదిక జరిగింది. శీలం నాగార్జునరావుగారున్నూ వక్తగా దీనిలో పాల్గొన్నారు.
5) 22-8-09 శనివారం హైద్రాబాద్‌లో శ్రీ టి.వి.రావుగారి ఇంట్లో 'గ్రామాభ్యుదయం' అనే అంశంపై సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైనవారిలో శ్రీ పుట్టా సురేంద్రబాబు, కోట ప్రసాద శివరావు, చెరుకూరి వెంకట్రామయ్య, డా|| వి. బ్రహ్మారెడ్డి, డా|| కె. నాగేశ్వరరావు, శ్రీ కె.ఎస్.రామ్, టి.వి.రావు మొదలైనవారు వున్నారు. పునఃసమావేశం సెప్టెంబరు 12, 13 తేదీలలో హైద్రాబాద్‌లో జరుపుకోవాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment