Sunday, November 1, 2009

మిత్రసంస్థల అధ్యయన శిక్షణ తరగతులు-1



యోచనాశీలురైన ఉద్యమ మరియు పాఠక మిత్రులారా!
ఒక సంతోషకరమైన వార్తచెప్పాలి ముందుగా. సమాజం బాగుండాలి. సమాజంలో కొనసాగుతున్న (ప్రచలిత మవుతున్న) భావజాలంలోని అశాస్త్రీయాంశాలను వెలికితీసి ప్రజలు వాటిబారిన పడకుండేలా వారిని చైతన్యపరచాలనీ, అలాగే వున్న భావజాలంలోని అశాస్త్రీయాంశాలను వెలికితీసి ప్రజలు వాటిబారిన పడకుండేలా వారిని చైతన్యపరచాలనీ, అలాగే వున్న భావజాలంలోని శాస్త్రీయాంశాలను వారిలో బలంగా నాటుకునేలా గట్టి పూనికతో పనిచేయాలనీ తలంచే సంస్థలలో కొన్ని ఒక్కటై స్థిరంగా కొంతకాలంపాటు ఎంపిక చేసుకున్న అంశాలపై ఎంపిక చేసుకున్న ఉద్యమ సహచరులతో కూడి అధ్యయన, శిక్షణ తరగతులు నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఉద్యమ నిర్మాణానికీ, బలానికీ కూడా ఆధారస్థానమైన సమర్థులైన కార్యకర్తల నిర్మాణం దిశగా పని మొదలెట్టాలనుకోవడం, మనందరికీ మిక్కిలి సంతోషకరమేకదా.

ఆ దిశగా తొలి సమావేశంలో నవంబర్‌ 1న జె.వి.వి. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటైంది. శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ పద్ధతి అన్న రెండంశాలపై నేను, గోగినేని బాబుగారితో కలసి వచ్చినవారికి కొంత సమాచారాన్నందించే విధంగా ప్రసంగించాలనుకున్నాం. సమావేశం ఉదయం 10-30 గంటలకు ఆరంభమైంది. టి.వి.రావుగారు సభను ప్రారంభిస్తూ ఈనాడు మీడియా (టి.వి.లు) మనవైపు చూస్తున్నాయి. మన కార్యక్రమాలకు చోటు కల్పించడానికి సిద్ధంగానూ వుంటున్నాయి. మనవైపు నుండే తగినంతమంది వక్తలు, ప్రతినిధులు అందుబాటులో వుండడం లేదు. పండితుల వేషభాషలతో తెరమీద, లోకంలోనూ కనబడుతూ అశాస్త్రీయ భావనలను ప్రచారంచేస్తూ, దానినో వృత్తిగనూ స్వీకరిస్తూ సమాజానికి భారంగా తయారైన వారిని సరైనరీతిలో ఎదుర్కోవాలంటే ముందుగా మనలో అనేకమందిమి, అటు వారు ప్రచారం చేస్తున్న అశాస్త్రీయ భావనల గురించీ, ఇటు ప్రత్యామ్నాయంగా ప్రచారం చేయాల్సిన సరైన భావనల గురించి లోతైన అవగాహన కలిగించుకోవడమేగాకుండా, సమర్థవంతంగా దానిని మీడియాకనుగుణ్యమైన రీతిలో ప్రకటించే ఒడుపునూ సంపాదించుకోవలసి వుంటుంది. మనమూ (ఉద్యమాలూ) మీడియాను శాస్త్రీయ భావజాల వ్యాప్తికి శక్తివంతంగా వినియోగించుకోగలగాలి. అందుకొరకే ఈ అధ్యయన తరగతులు మనలోనే వున్న లోతైన అవగాహనకల కొందరితో మళ్ళామళ్ళా మాట్లాడడం మొదలెట్టాక విషయపరంగా తెలుసుకోవలసింది చాలా వుంది అన్న విషయం బోధపడింది నాకు. మీరూ శ్రద్ధగా, పట్టుదలతో ఈ అధ్యయన వేదికలో పాల్గొని అవగాహనను, నిపుణతను సంపాదించుకోండి అని చెప్పి, గోగినేని బాబుగార్ని మాట్లాడవలసిందిగా కోరారు.
ఈ మధ్యలో చిన్న సూచన అంటూ; పోయిన మేలో ఒకటి రెండు నిర్ణయాలు తీసుకున్నాం. అవి (1) ఎంపిక చేసుకున్న వాళ్ళకే వేదికను పరిమితం చేసుకుందాం. వారివరకు గైర్హాజరీ లేకుండా తరగతులకు విధిగా రావలసి వుంటుంది, (2) ప్రతి ఒక్కరూ అధ్యయనాంశంపై కొంత పరిశీలన చేసి రావలసి వుంటుంది అని. కనుక ఆ మేరకు అనుకున్న వారందరూ వచ్చారా? అధ్యయనాంశాన్ని గురించి ఎంతోకొంత తెలుసుకొని వచ్చారా? కనీసం మేమందించిన సమాచారాన్నైనా చదువుకుని వచ్చారా? అనడిగాను. కొద్దిమంది చదివామన్నారు. కొందరు సమాచారం మాకందలేదన్నారు. మరికొందరు పనుల వత్తిడిలో చూడలేకపోయామన్నారు. అలాగైతే ఎలా? ఏయే కారణాలు చూపిగానీ, చేయాల్సినంత శ్రమ చేయకుండా వస్తే, మన తరగతులు అనుకున్నంతగా ఫలప్రదం కావుగదా? ఏం చేద్దాం చెప్పండి అనడిగాను.
గోగినేని బాబుగారు ప్రతిసారీ ఆరంభంలో ఈ క్రమశిక్షణ చర్యలంటూ మొదలెట్టుకోవడం అంతబాగుండదు. కొంత వెసులుబాటుతో మొదలెడదాం. ఎవరి స్వేచ్ఛనూ మనం కాదనకూడదుగదా అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మీ యిష్టం, ఎక్కువమంది ఎలా చేద్దామంటే అలానే చేద్దాం. ఆ చేస్తున్న క్రమమే అవసరమైన మార్పులు, చేర్పుల్ని సూచిస్తుందెలానూ అనన్నాను. మరికొందరూ అస్సలు జరగనీయండి, అంతా అనుకున్నట్లే జరగాలటే, పనే మొదలవకపోవచ్చుననడంతో, సరే! అలానే కానిద్దాం అనుకుని మొదలెట్టుకున్నాం. సమావేశపు సమాచారమూ, తయారై రావలసిన విషయానికి సంబంధించి అందుబాటులో వున్న సమాచారమూ, తరగతులలో పాల్గొనే వారందరికీ సక్రమంగా చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాం. ఆ బాధ్యతను తాత్కాలికంగా టి.వి.రావు, కె.బి.ఆర్‌.ప్రసాద్‌, కె. ప్రసాద్‌గార్లు తాము వహిస్తామన్నారు. బాబుగారు మాట్లాడడం మొదలెట్టారు.
గోగినేని బాబుగారు : వేదిక లక్ష్యం మీడియాలో మనం ఆయా విషయాలను సరళంగా, క్లుప్తంగా, స్పష్టంగా చెప్పడాన్ని అలవరచుకోవడం.
మనకు ప్రతిపక్షంగా వున్నవాళ్ళు కొన్ని ఆరోపణలను, తప్పుడు ప్రచారాలను చేస్తూ వస్తున్నారు. వారి కుహనా ఎత్తుగడలను ధీటుగా త్రిప్పికొట్టగల సమాచారాన్ని, అవసరమైన మెళకువలను మనం సంపాదించుకోవలసి వుంది. అలాంటి ఆరోపణలు కొన్ని.
1) సైన్సు పాశ్చాత్యం నుండి వచ్చింది. అది స్వదేశీయంకాదు అని సాంప్రదాయకుల ఆరోపణ. ఇక్కడ మన వైఖరేమిటి?
2) సైన్స్‌ విలువలు లేవు. మతం దగ్గరకు రాకుంటే విలువల గురించి మాట్లాడుకోలేము.
3) సైన్స్‌ ఎంతో మందిని హతం చేసింది. ఆటంబాంబు, ఆయుధాలు వగైరాల ద్వారా.
4) పాశ్చాత్యయమైన సైన్స్‌ను నెత్తికెత్తుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను ప్రక్కకు నెట్టేస్తున్నారు.
5) ఇన్ని చెపుతున్నారుకదా! మీరు దేనినైనా సృష్టించగలరా? పదార్థాన్ని తయారుచేయగలరా?
6) మా గ్రంథాలు చదవకుండానే మమ్ము విమర్శించే, తప్పుబట్టే అధికారం, అర్హత మీకెక్కడిది?
7) సైన్స్‌కు సౌందర్య దృష్టి-ఈస్తటిక్‌ సైన్స్‌ - వుండదు. అది మనిషిని యాత్రిక ప్రాయం చేసేస్తుంది.
8) డార్వినిజంలోని సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిటెస్ట్‌ అన్న సూత్రం అనైతికతకు దారితీయదా?
ఇవీ, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు అవతలి పక్షం వాళ్ళు. అట్టివాళ్ళను యదార్థాలు చెపుతూనే ఎలా ఎదుర్కోవాలో మనం అభ్యాసం చేయాల్సి వుంది.
ఇందుకు ముందుగా మనకు సైంటిఫిక్‌ మెథడ్‌ అన్నదానిపట్ల తగినంత అవగాహన అవసరమవుతోంది. మరో ముఖ్య విషయాన్ని మీరందరూ గమనించండి. మూఢనమ్మకాలను పోనాడాలన్న దగ్గర మనందరికీ స్పష్టత వుంది. అయితే దానితోబాటు 'చెడ్డ విజ్ఞానం' () పట్లకూడా మనం కడుజాగరూకులమై వుండాలి. గతంలో మతం సైన్స్‌కు వ్యతిరేకంగా తన దౌష్ట్యాన్ని చూపేది. కాని ఇప్పుడది సాధ్యపడక పోవడంతో, మా మత గ్రంథాలలోనూ సైన్స్‌ వుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికి సైంటిస్టులకు తెలీని సైన్స్‌ కూడా వాటిలో వుంది. అన్న క్రొత్త ఎత్తుగడను మొదలెట్టారు. కొద్దిపాటి తార్కిక ప్రజ్ఞనూ సంపాదించుకుని, అమాయకులను అదరగండంగా బెదరగొట్టే కుటిల పోకడలూ పోతున్నారు. ఉదా : శ్రీనివాస గార్గేయ అన్నతను సుప్రీంకోర్టు జడ్జిమెంటును కాదంటారా? అది కోర్టు ధిక్కారం క్రిందికి వస్తుంది అని నేనూ పాల్గొన్న ఒక టి.వి.కార్యక్రమంలో బెదిరించే పనికి పూనుకున్నాడు. పరిశోధనాంశాల సత్యాసత్యాలు, తప్పొప్పులూ తేల్చాల్సింది విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలేగాని, కోర్టులు కావు. వివాద విషయాలలో న్యాయాన్యాయాల గూర్చి కొన్ని పరిమితులకు లోబడి తమ నిర్ణయాలు ప్రకటించడమే కోర్టులు చేయగలిగింది. ఆ నిర్ణయాలకైనా చాలా పరిమితులున్నాయి. కనుకనే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, అనేకులతో కూడి ధర్మాసనాలు అవసరమవుతున్నాయి. కనుక జ్యోతిషం శాస్త్రమో కాదో నిర్ధారించాల్సింది, నిర్ధారించగలిగిందీ కోర్టులు కాదు. ఆ క్షేత్ర విజ్ఞానులు చేసే ప్రయోగ ఫలితాలే ఆ పని చేయగలుగుతాయి అని చెప్పాను. మారుమాటాడకుండా ఊరుకున్నాడు. అలా అవతలివారి అడ్డగోలు పోకడలకు గట్టిగా అడ్డుకట్ట వేయాలంటే మనకు సంబంధితాంశాలలో లోతైన అవగాహన అవసరం.
సైన్సంటే, పొందుపరచబడ్డ విజ్ఞానమే.
నాలెడ్జి అంటే (జ్ఞానమంటే) ఏమిటి? ఫ్యాక్ట్‌ అంటే ఏమిటి? సత్యమంటే ఏమిటి? వాస్తవం (రియాలిటీ) అంటే ఏమిటి? ఏది నిజము, ఏది నిజం కాదు? ఏది జ్ఞానము? ఏది జ్ఞానంకాదు? లాంటి అంశాలతో స్పష్టమైన అవగాహన చాలా అవసరం.
మనలోనే చాలామంది శాస్త్రీయ పద్ధతి అంటే అదేదో స్థిరరూపంలో తయారై వుంది అనుకుంటుంటారు. ఈ అవగాహన సరికాదు. అది క్రమానుగతంగా అభివృద్ధి చెందుతూ, మార్పులు పొందుతూ వస్తున్న విధానము. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే విజ్ఞాన శాస్త్రపు పరిణామ క్రమాన్ని తడిమిచూడాల్సి వుంటుంది.
చాలామంది గ్రీకులు ఆధునిక విజ్ఞానానికి ఆద్యులు అనుకుంటుంటారు. అది నిజంకాదు. వారికంటే ముందే ఈజిప్టువాళ్ళు ప్రయోగాలకు, పరిశీలనలకు (ఎక్స్‌పెరిమెంట్‌, అబ్జర్వేషన్‌లకు) నాందీవాచకం పలికారు.
ఆ దిశగా పరిశోధించి వారు సూర్యచంద్రుల్ని గురించి, వాటి చక్రభ్రమణ రీతిలో సాగే చలనాల్ని గురించి కొన్ని అభిప్రాయాలకు వచ్చారు. అవి నిర్ణీత అవధుల్లో తిరిగి అదే స్థానాలలోకి వస్తుంటాయని కనుగొన్నారు.
అటు తరువాత చెప్పుకోవలసిన పరిశీలకులు గ్రీకులు. వారు ఎంపిరికల్‌ మెథడ్‌ని అంటే ప్రత్యక్ష పరిశీలనా పద్ధతిని ఎక్కువగా వినియోగంలోకి తెచ్చారు.
ప్లేటో నుండి ఆరంభించుకుంటే, ప్లేటో నిర్ధారణలన్నీ తార్కిక నిగమన రూపాలే. అవే సరైనవన్న దృష్టిని కనబరచాడతడు.
అతని శిష్యుడే అరిస్టాటిల్‌. గ్రీకు దేశీయుడైన ఇతణ్ణి చాలాకాలం నాటి సమాజం సర్వజ్ఞుడన్నట్లుగా భావిస్తూ వచ్చింది. అతడు తడమని విషయం లేదన్నట్లుంటుంది అతని రచనల్ని చూస్తుంటే. బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో అతిశయోక్తి లేదుకానీ, అందు ప్రకటించిన భావాలలో ఈనాటి మన అవగాహననుబట్టి ఎన్నో తప్పులున్నాయి. అయినా అతడి కంట్రిబ్యూషన్‌ ఒకటుంది. జ్ఞానార్జనలో 'పరిశీలన' అన్నది చాలా కీలకం. ప్రత్యక్షాధారిత సమాచారానికి ప్రాధాన్యతనివ్వాలన్నాడు.
ఈ సందర్భంలో మతపోకడ గురించి కొద్దిగా చెప్పుకోవాలి.
ప్రతి మతం ఒక ప్రామాణిక గ్రంథాన్ని కలిగి వుంటుంది. దానిని ప్రశ్నించగూడదని, ప్రశ్నించనక్కరలేదనీ అంటుంది. ఎందుకనంటే, దానిని చెప్పింది సర్వజ్ఞుడైన దేవుడు కనుక. విశ్వసించి పయనించడమే అని శాసిస్తుంటుంది.
మరి అదే సమయంలో సైన్స్‌ ప్రశ్నించమంటుంది. తాను ప్రశ్నించుకునే పరిశీలించి సమాధానాలు రాబడుతూ వుంటుంది. అరిస్టాటిల్‌ తరువాత వైజ్ఞానికాభివృద్ధికి అరబ్బులెంతో కృషిచేశారు.
ఒక గమనిక : మన దేశాన్ని అస్సలు ప్రస్తావించకుండా వుండక్కర్లా. ఇక్కడా తలగలవాళ్ళు తల చేయాల్సిన పని చేస్తూనే వచ్చారు. ఆర్యభట్టు ఖగోళపరంగా కొంత కృషిచేశాడు.
విజ్ఞాన క్షేత్రం అనుభవాలను సరిచూసుకుంటూ, సరైన నిర్ణయాలకురావడానికి పరిశీలనకు తోడు గణితమూ చాలా అవసరమన్న సంగతిని తెలుసుకుంది.
ఈ థలో 'అల్‌ ఖతైం' అన్న పరిశోధకుడు 'ప్రయోగం' అత్యంత కీలకమైనది అన్న భావనను బలంగా పైకి తెచ్చాడు.
తరువాతి థలో ప్రయోగంలోనూ పొరపాట్లు చోటుచేసుకునే అవకాశం వుందిగదా! మరి దాన్నుండి బైటపడడం ఎలా అన్న ప్రశ్న వేసుకుని మరిన్ని ప్రయోగాలు, మరింతమంది చేయడం మేలు అన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ఆలోచనకు రావడం వైజ్ఞానిక క్షేత్రాలలో, జ్ఞానార్జనా పద్ధతిలో వచ్చిన గొప్ప మార్పు, విప్లవం అననాలి.
దీని తరువాత మానవ తప్పిదాలు జరక్కుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న ప్రశ్న పుట్టింది. దానికి సమాధానంగా ప్రయోగంలో మానవుని పాత్రను తగ్గించి, పరికరాల, విధానాల పాత్రకు ప్రాధాన్యతనీయడం మేలు అనుకున్నారు.
ఈ సందర్భంలో డెరార్టేను గుర్తుచేసుకోవాలి. ఏకంగా ఆయన 'డిస్కోర్సు ఆఫ్‌ మెథడ్‌' అన్న ఒకరచనే చేశాడీవిషయంలో.
అయినా, అతని రచనలోనూ ఒక పెద్ద దోషం చోటుచేసుకుందని ఈనాటి మనకు తెలుసు. అదేమంటే, తార్కికునిగా మనం (డిటక్షన్‌) ద్వారానే అంతా తేల్చేయవచ్చు అన్నాడతడు.
తరువాత మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసింది గెలీలియోను : అతడు ప్రయోగపద్ధతికో స్థిరాకృతినిచ్చాడు. ప్రయోగపరంపర ద్వారా, అంటే ఒకే విషయానికి సంబంధించి పలు ప్రయోగాలు చేయడం ద్వారా, ఆయా విషయాలకు సంబంధించి కొన్ని సాధారణ సూత్రాలను రాబట్టవచ్చునన్నాడు. నిజానికి వైజ్ఞానిక ప్రగతిపథంలో ఇదీ ఒక గొప్ప మలుపే.
ఇక ఆధునిక విజ్ఞానానికి వైజ్ఞానిక పద్ధతిపరంగా పెద్ద ఊపునిచ్చింది యూరప్‌.
పలు ప్రయోగాలు చేసి రాబట్టిన సాధారణ సూత్రాలాధారంగా ప్రెడిక్టు- ఇది జరిగితే తరువాత ఏమి జరగనుందో ముందుగనే చెప్పగలగడం (ఓళిజిలిశితిజిజి) తో బాటు సరిచూసుకోవడమూ అవసరమన్న భావన (వెరిఫైబిలిటీ వుండాలన్న భావన) శాస్త్రీయ పద్ధతిలో వచ్చిన మరో గొప్ప విప్లవం.
న్యూటన్‌ వచ్చాక కలిగిన విజ్ఞానం ఆధారంగా, కొన్ని లాస్‌-నియమాలను-రూపొందించుకోవడం మొదలైంది.
ఆ సూత్రం ఆధారంగా డార్విన్‌ థియరీ సరైందేననాలంటే మిస్సింగ్‌ లింక్స్‌ మనకు ఎదురుపడాలి. కొన్ని దొరికాయి కూడా.
19వ శతాబ్దంలో శాస్త్రీయ పద్ధతంటూ ఒకటుందా? అన్న చర్చ సైంటిస్టుల మధ్యనే జరిగింది.
కార్ల్‌ పాప్లర్‌ అన్నాయన, ఫిలాసఫీ ఆఫ్‌ సైన్స్‌-ఫిలాసఫర్‌ అన్న దానిపై రచన చేశాడు.
ఇప్పటికి నిజమైంది రేపటికి నిజమే అవుతుందని ఎలా చెప్పగలం? అన్న భావమూ ఉనికిలోకి వచ్చింది.
ఒప్పని నిరూపించడంకంటే తప్పని నిరూపించినదానికే మరింత విలువ వుంటుంది.
ఈ సందర్భంలో జ్యోతిష పండితులు మాది శాస్త్రం కాకుంటే గ్రహణాలెప్పుడొస్తాయో ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాం అని అదేదో గొప్ప ప్రశ్న అన్నట్లు అడుగుతుంటారు. గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పడానికి పెద్దగా పరిశోధనలు, గ్రహ చలనాలు, భ్రమణాలు, వేగాలు వగైరాల వివరాలేమీ తెలుసుండఖ్ఖర్లా. దానికి ముడి పరిశోధన చాలు. ఆకృతులు ఎంతెంత కాలానికి వస్తున్నాయో కొంతకాలం చూసి ఆవృతుల కాలంలోని క్రమాన్ని గుర్తించగలిగితేచాలు. కానీ గ్రహణాలు ఎందుకొస్తున్నాయో చెప్పడానికి చాలా తెలుసుండాలి. ఈ వివరం వారికి తెలీదన్నది వారడిగిన ప్రశ్ననుబట్టే కనిపెట్టవచ్చు.
ముగ్గురు సైంటిస్టుల నుండి మూడు ప్రిడిక్షన్స్‌ రావు. మూడు థియరీలు వస్తాయి. అదే మన జాతకం శాస్త్రజ్ఞుల నుండైతే ఎవరి ప్రిడిక్షన్‌ వారిదే. ఇక్కడే వుంది వారి పక్షంలోని అశాస్త్రీయత, వారిలోని అజ్ఞానము.
డిస్ప్రోవ్‌ అయినప్పుడే సైన్స్‌ అవుతుంది. శాస్త్రీయ పద్ధతి వెరిఫైబిలిటీ దగ్గరకొచ్చి ఆగిపోలేదు. దానికి మరో అదనపు నియమమూ ఒచ్చి చేరింది. 'ఫ్యాలిపైజిలిటీ' కూడా వుండాలన్నది నేటి శాస్త్రీయ పద్ధతి అవగాహన.
విశ్వమంతా నాలుగు బలాల సమాహారం అన్నది ఒకనాటి భావన. అంతా ఒక్కటే కావచ్చుగదా అన్న ఊహ వైజ్ఞానిక క్షేత్రంలో ఉనికిలోకి వచ్చింది. గ్రాండ్‌ యూనిఫికేషన్‌ థియరీ అనంటారు దానిని.
కోపర్నికస్‌, గెలీలియో, కెప్లర్‌, న్యూటన్‌ వగైరాలు ఆయా కాలాలలో అప్పటికున్న విజ్ఞానాన్ని గొప్ప కుదుపు కుదిపిన వాళ్ళే అయినా, అనంతర కాలపు పరిశోదనా ఫలితాలు వారి ప్రతి పరిశోధనలలో ఎన్నింటినో తప్పులని తెలుస్తూ వచ్చింది.
న్యూటన్‌ ప్రకారం ప్రదేశం సమతలంగా వుంటుంది. గమనం వక్రంగా వుంటుంది.
ఐన్‌స్టీన్‌ ప్రకారం స్థలమూ వక్రంగనే వుంటుంది.
థామస్‌ కూమ్‌ అన్నతడు ప్యారడైజ్‌ షిప్టు అన్న మాటవాడాడు.
సైన్స్‌ సైంటిఫిక్‌ మెథడ్‌ ప్రకారం నడవదు. సైంటిఫిక్‌ మెథడ్‌ కూడా మారుతూ వుంటుంది. ఈ విషయంలో మనకు స్పష్టమైన అవగాహన వుండాలి. లేకుంటే మనం నిర్వర్తించాల్సిన పని శక్తివంతంగా పూర్తిచేయలేము.
వాస్తవం-జ్ఞానం-సత్యం అన్నవాటిని గురించి తెలుసుండాలి.
సత్యం జ్ఞాన విషయమే ఊజీతిశినీ రిరీ శినీలి బీళిదీశిలిదీశి ళితీ దిదీళిగీజిలిఖివీలి అనంటూ గొప్పగా చెప్పాడు ఎం.ఎన్‌.రాయ్‌.
ష్ట్రలిబిజిరిశిగివ వాస్తవం; ఓబిబీశిరీ నుండి జ్ఞానం; చదీళిగీజిలిఖివీలి నుండి సత్యం వస్తాయి.
సత్యం దగ్గరకు ఎప్పటికీ చేరలేము - దానికి దగ్గరగా, మరింత దగ్గరగా వెళుతుండడమే మనం చేయగలిగింది.
ఔబిఖి సైన్స్‌ అన్నాను చూడండి - దానికో ఉదాహరణ హోమియోపతి. అది సైన్స్‌ కాదు. సైన్స్‌గా చెలామణి అవుతుంది.
లెప్టిస్టులంతా సైన్స్‌కు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలి.
విశ్వం వుంది. దానిలో నియమాలున్నాయి. అది నిరంతరాయమైనది. పరంపరగా సాగే ఘటనల సమాహారమైనది.
అబ్జర్వేషన్‌ నుండి ఉబిగీరీ (నియమాలు) రాబడతాం. అబ్జర్వేషన్‌ పరిథి పెరిగే కొలది నియమాలు (ఉబిగీరీ) మారుతుంటాయి.
కాంతి వంగుతుందని ఈనాడనకూడదు. స్థలం వంగుతోందనాలి.
మన ప్రతిపక్షంవాళ్ళు ప్రాణాన్ని సృష్టించగలరా? అని అడుగుతుంటారు. సృష్టించుతునే వున్నాడు మానవుడు అని చెప్పాలి. ఈ.శ్రీ.జు.ను సృష్టించగలుగుతున్నాం. 62 ఏళ్ళ క్రితమే మిల్లర్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అమైనో ఆమ్లాన్ని సృష్టించారు. దానర్థం ప్రాణానికాధారమైన ద్రవ్యాల్ని సృష్టించామనే.
విజ్ఞాన శాస్త్ర క్షేత్రంలో ఒక మర్యాద వుంది. ప్రతి పరిశోధకుడూ తన పరిశోధనా పత్రాన్ని సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురిస్తాడు, విజ్ఞానుల్ని సమీక్షించమంటాడు. దోషాలుంటే అంగీకరిస్తాడు. సరిక్రొత్త ఉత్సాహంతో పునః పరిశోధనలో లీనమవుతాడు. ఉదాత్తమైన ఈ విధానం ఎక్కడ, తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళంటూ తమవి పరీక్షించనక్కరలేని విషయాలంటూ హఠమెత్తే మత పండితులు బండపోకడలెక్కడ - రెంటికీ తూర్పు పడమరలకున్నంత ఎడం వుంది. జ్ఞానానికీ మధ్యనున్నంత అంతరముంది అంటూ ముంగించారు.

No comments:

Post a Comment