Sunday, November 1, 2009

సి.టి.ఎఫ్‌. బండారం



పరిణామవాద పక్షీయులన్నంతా అయ్యింది. సురేంద్రగారూ! మీ పిచ్చిగాని బైబిలుపక్షంవాళ్ళు వాళ్ళ సృష్టివాదాన్ని ప్రతిపాదించి, నిరూపించడానికి ఎందుకొస్తారండీ. బైబిలు సృష్టివాదం తప్పులతడకేకాదు. విశ్వాన్ని గురించి ప్రకృతిని గురించి ముతకరూపంలోనైనా తెలియని థలో, తెలియనివారు ప్రకటించిన పిట్ట-పిచ్చి-కథే అది అన్నది గింత ఆధునిక విజ్ఞానమూ, ఇంగిత జ్ఞానమూ కలిగున్న వాళ్ళెవరైనా ఇట్టే తేల్చేయగలిట్టి ఉట్టి గాలిపోగేసినమూట అది.
ఇక డా|| ఆనంద్‌, ప్రకాష్‌, సుధాకర్‌లాంటి, అంతో ఇంతో ఆధునిక విజ్ఞానం తెలిసిన వారికా విషయం తెలియదనుకోవడం మీ అవివేకం.

క్రైస్తవ మత ప్రచారంపేర పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఛోటా, మోటా సంస్థలన్నీ డబ్బు సంపాదన తప్ప మరో ఉద్దేశం కలిగున్నవికాదు. కనుకనే పిచ్చిజనానికి, రకరకాల పిచ్చులు లేపి తాము మాత్రం తెగబడి సంపాదించడం, భోగించడమే పరమంగా సాగుతున్నాయవి. నిశిత పరిశీలనాసక్తికల మీకివి తెలియవని ఎలా అనుకోము అంటూ మాట్లాడారు.
ప్రేమ గురించి, త్యాగాన్ని గురించి, బలిదానాన్ని గురించి, నిరాడంబరత గురించి తెగవదరే వీరంతా కళ్ళకేమైన నల్లగుడ్డలు కట్టుకున్నారా? పాత నిబంధన గ్రంథం ఆధారంగానూ, క్రీస్తు కాలంలో, క్రీస్తు తరువాత, పోపుల పరిపాలనలో, ఇస్లాం ఆరంభమై ప్రాచుర్యంలోకి వచ్చే కాలంలోనూ బైబిలువాదులు చేసిన ఆరాచకాలు, హత్యాకాండ, హింసాకాండ చరిత్ర అంతా ఎక్కడచూసినా కనపడుతుంది. ఒకవంక యూదులకు క్రైస్తవులకు మధ్య జరిగిన మారణకాండ, మరోవక కాథలిక్కులకూ-ప్రొటెస్టెంట్‌లకూ మధ్య జరిగిన హత్యల పరంపర, వేరొకవంక ముస్లిములకూ క్రైస్తవులకు, యూదులకు మధ్య జరిగిన యుద్ధాలు, ఇతరేతర మతాలవాళ్ళు ఎదురైనపుడు జరిగిన పోరాటాలూ మొత్తం కలగలుపుకుని చూస్తే మతాలు, 'మత ప్రచారం, మత వ్యాప్తి' కొరకు సాగించినంత మానవ హననం, మానవజాతి చరిత్రలో మరిదేనివల్లనూ సాగలేదన్న చారిత్రక వాస్తవం బైటపడుతుంది.
'ప్రపంచ క్రైస్తవ హతసాకక్షులు' అన్న పేరుతో బహుళ ప్రాచర్యం పొందిన రచననిండా క్రీస్తు శిష్యులతో మొదలెట్టి చంపబడ్డవాళ్ళ సంఖ్య ఉజ్జాయింపుగా గణింపబడింది (క్రీస్తు చంపబడిందీ యెహోవా పెంచుకున్న సమూహానికి చెందిన వాళ్ళద్వారానే). వారి అంచనా ప్రకారం ఒక్క 20వ శతాబ్దిలోనే క్రైస్తవహతసాకక్షులు 10 కోట్ల మంది. అన్ని మతాలు, అన్ని ప్రాంతాలలోనూ, మానవేతిహాసంలో చేసిన హత్యాకాండను గనుక యథాతథంగా లెక్కించగలిగితే; 'జాతులకు, జాతుల్నే నాశనం చేసివేశాం' అన్న పాతనిబంధన, మరియు ఖురాన్‌ దైవవాక్కులనూ పరిగణించితే, అలా మత వ్యతిరేకతతో పరస్పరం చంపుకున్న వాళ్ళ మొత్తం సంఖ్య ఎంతుండవచ్చునో ఊహించగలరా? అదే మీ ఈనాటి ప్రపంచ జనాభా సంఖ్యకేమీ తీసిపోదనే నేననుకుంటున్నాను. అంతటి ప్రేమమయమైన చరిత్ర మతానిది. వళ్ళూ, హృదయమూ ఉన్నవారెవరికైనా వళ్ళు జలదరించాల్సిన సమాచారం అది. అంతలేసి చేసే, సిగ్గెగ్గులు లేకుండా ప్రతి మతమూ తనది సర్వమానవ సౌభ్రాతృత్వమని వగలు పోవడాన్నేమనుకోవాలి. ఒకవంక ఒకే మతంలోని వాళ్ళే, వాళ్ళలో వాళ్ళకు పడక కొట్టుకుచస్తూ, విశ్వమానవ శ్రేయస్సు గురించి మాట్లాడడాన్నేమనాలి!?
ఈ నేపథ్యమంతటితోపాటు, మరో ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని-ఎవరూ అంతగా పట్టించుకోని వాస్తవాన్ని గుర్తించడం, గుర్తింపజేయడం చాలా అవసరం. ఆనాటి భౌతికవాదులు, నాస్తికులుగానీ, నేటి ఆధునిక భౌతిక విజ్ఞానులుగానీ, ఆ విజ్ఞానాన్ని ఆసరా చేసుకుని కొనసాగుతున్న ఆధునిక భౌతికవాదులుగానీ మతాలు, మతస్తులు చేసినరీతి హత్యాకాండ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు, పైపెచ్చు మతస్తులే-ప్రతిమతము-తనతో విభేదించే వారినందరినీ అవిశ్వాసులు, నాస్తికులుగ ముద్రవేసింది; ఇందులో నిజమైన భౌతికవాదులు చాలా కొద్దిమందే. మతాలే, తమకు వ్యతిరేక మతాలతోపాటు, ఈ సిసలైన నాస్తికుల్ని తుడిచిపెట్టే పని చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా-పనికట్టుకుని మరీను-ఇదంతా చారిత్రక వాస్తవం. అందరంగీకరించే చరిత్రలోనే కాకుండా, ఆయా మత ప్రామాణిక గ్రంథాలలోనూ ఈ వివరాలు దండిగా దొరుకుతున్నాయి. కనుక దీనిని మతస్తులూ కాదనడానికి వీలులేదు.
ప్రతి మతం వెనకా అది ప్రవచించే భావజాలం ఎలావున్నా, ఇంతటి మకిలి, పంకిలం, మలినం, కుళ్ళు ఆచరణలో చోటుచేసుకుని వుందన్నదో నిప్పులాంటి నిజం. ఇంత పెద్దెత్తున జరక్కున్నా ఉన్నంతలో తాముందే గింత గనుక ఉన్నంతలో ఎంతోకొంత హింసాకాండ భారతదేశంలోని మతాల మధ్యా జరిగిందన్నదీ మరవకూడని నిజం. అస్సలు మత అంతస్వభావంలోనే పరమతాన్ని సహంచలేనితనముంది. నిజాన్ని గమనించనంతకాలం మతంవల్ల జరిగే ప్రమాదాలనుండి మానవజాతిని బైటపడేయడం సాధ్యంకాదు.
ఏ మతస్తునికీ మనిషి యథాతథంగా కనపడడు. ఎందుకని? అతడు ఆ మతం అందించిన రంగద్దాలు పెట్టుకుని చూస్తుంటాడు గనుక. ఉదా : ఒక మతంలోని ధీరుడు, యోధుడు ఆ మతంకోసం పోరాడి అసువులు బాస్తే అతడు ఆత్మ బలిదానం చేసిన మహాత్ముడవుతాడు. ఆ పోరాటంలో అతడు ఎదుటిపక్షాన్ని ఎంతమందిని హతం చేస్తే అంత ధర్మరక్షణ చేసినవాడై ఆ మత దైవానికి ప్రీతిపాత్రుడవుతాడు. అవతలి మతంవానికి వీడే అత్యంత కౄరుడూ, రక్తపిపాసి, హంతకుడూ అవుతాడు. ఇది అన్నిపక్షాలవరూ అంగీకరించే పోకడే. అవునోకాదో ఆయా మతాలవారినీ, చరిత్రను, యుద్ధాల చరిత్రనూ అడిగిచూడండి.
యోచనాశీలత, మానవీయ విలువలూ కల మిత్రులారా! మతాలు నిర్వహించిన, నిర్వహిస్తున్న మహాకౄరమైన, వికృతమైన పాత్రను గురించి మరెంతో వివరించాలన్న ఉద్వేగం కలుగుతున్నా మనమెత్తుకున్న సందర్భం మరొకటవడంలోనూ దానికి ఇంతమాత్రం చెప్పుకున్నా సరిపోతుంది కనుకనూ దీనినిక్కడకాపుతాను. ఈ విషయంలో మరిన్ని వివరాలు అవసరమనుకుంటే దానికో ప్రత్యేక శీర్షికను పెట్టుకుందాం. అదలా వుంచి నా ఈ వివరణలు అవాస్తవాలనదలచుకున్న వాళ్ళుంటే ఆధారాలతో స్పందించండి. దానిపైనా లోతైన విచారణ చేద్దాం.
ఇక ప్రస్తుతాంశమైన సి.టి.ఎఫ్‌. ధీ(భీ)రుల పోకడకు సంబంధించిన అంశాలను కొంతవరకు విశ్లేషిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి.
నోట్‌ : నిజానికి మా వేదిక సాగించిన ''పరిణామవాదమా? సృష్టివాదమా?'' అన్న చర్చనీయాంశం అన్నిమతాలకు చెందిన సృష్టివాదులకూ, అన్ని ధోరణులకు చెందిన భౌతికవాదులకూ సమానంగా వర్తిస్తుంది. ఏదో ఒక పేరున బోర్డుపెట్టి వినండంటూ మొదలెట్టిన ఈ రెండు క్షేత్రాలకు చెందినవారూ తమపక్షాల్ని ప్రతిపాదించి నిర్ధారించాల్సిన బాధ్యత నుండి తప్పుకోకూడదు. ఎవరు ఏ కారణం చూపి తప్పించుకున్నా అది ఎగవేత ధోరణి, దిగజారుడుతనమో, పలాయనవాదమో అవుతుందంటే.
శోచనీయమైన విషయమేమంటే, వైదికం సర్వోన్నతం అంటూండే హిందూ పక్షీయులు ఆదినుండీ అంటీముట్టని పోకడపోయారు. వేదం సర్వఃకల్పిం అనే ఆర్యసామాజికులుగానీ, వేదంలో అన్నీ వున్నాయని వదరుతుండే వివిధ పండిత ప్రకండులుగానీ తమదైన సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి ముందుకేరారూ. పెద్ద గంద్రగోళానికి దారితీయగల గొప్పవాస్తవం ఏమంటే భారతీయం అనబడే సాహిత్యంలో సృష్టి క్రమాన్ని గురించి ఏకోన్ముఖంగా చెప్పలేకపోవడం. రకరకాలుగా చెప్పి వుండడం. మిగిలిన రెండు ప్రధాన మతాలైన బైబిలు, ఖురాను మతానుయాయులకు ఈ గంద్రగోళం లేదు. అది తప్పా ఒప్పా అన్నదలా వుంచి సృష్టి ఇదిగో ఇలా జరిగింది అనడానికి తగినరీతి వ్యాక్యానాలున్నాయి ఆ రెండు గ్రంథాలలో. అందునా ఖురాన్‌లోకంటే బైబిల్‌లో ఒక దగ్గర గుదిగుచ్చబడి వుందా సమాచారమంతా. అదే ఖురాన్‌ దగ్గర కెళ్ళితే మనమే గ్రంథాన్నంతా వెదికి ఏరుకుని గుదిగుచ్చుకోవాలి.
అందుకనే మా వేదికలో పరిణామవాద విచారణ ఒక కొలిక్కి వచ్చిందని నిర్ణయించుకున్నాక, ముందుగా బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి విచారించే పనిచేద్దామనుకోవడం జరిగింది. అందుకు అనుకూలంగా, చాలా ధీమాగా, విస్పష్టంగా ఎవరు పిలిచినా వచ్చి మా సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపిస్తాను అని సుధాకర్‌గారు సత్యోదయంలో ప్రకటించారు. సందర్భం వచ్చింది గనుక....
సుధాకర్‌గారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవాల్సి వుంది.
1. 'మేలుకొలుపు' మార్చి-'97 సంచికలో సుధాకర్‌గారి ప్రస్తావన చేశాను. అంటే 1997 జనవరి, ఫిబ్రవరినాటి నుండి వారిలా పరిచయాలు మొదలయ్యాయినాకు. ఏప్రియల్‌ 97, 15, 16, 17 తేదీలలో క్రైస్తవంపై చర్చావేదికను నిర్వహించాము. అందులో ఇతర క్రైస్తవేత్తలతోబాటు సుధాకర్‌గారూ పాల్గొన్నారు.
1) ఆనాటి వేదికలో ఈయన అభిప్రాయాలతో బైబిలుపక్షంవాళ్ళే విభేదించారన్నదో నిప్పులాంటి నిజం.
2) బైబిలులో వెల్లడించబడ్డ భావాలలో అసత్యాలు వున్నట్లు తేలితే బైబిల్‌ను తగులబెట్టిస్తాను అని వేదికమీద ప్రకటించడం, దానిపై ఆనాడే అదే వేదికనుండి, అలాగే కానీండి, బైబిలు భావాలు సత్యాలైతేనూ, ఇప్పటికీ స్వీకరించదగిన, కాలం చెల్లని అంశాలలోనే కూడి వుంటే నేను సువార్తీకుణ్ణై ఆ భావాల ప్రచారంలో తను మన ధనాలను ఖర్చుచేస్తూ జీవితాన్ని గడుపుతాను అని ప్రకటించి, సుధాకర్‌గారూ, ఆయన సంస్థవాళ్ళూ కాల విలంబన లేకుండా ముందీ విషయం తేల్చేందుకు సిద్ధపడి, ఇంతేలాకనే వారి ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. అది విజ్ఞుల సామాజిక బాధ్యత కూడా అని పత్రికాముఖంగానూ ప్రకటించాను. (చూడండి. మేలుకొలుపు-మే, 1997, పేజీ-5). ఇప్పటికీ ఆయనందుకు పూనుకోలా. ఎందుకోగాని మధ్యలో అప్పటివరకూ తానన్న ఆ సంస్థ నుండి బైటకొచ్చేశారు.
3) ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా నేనో సైంటిస్తును, పరిశోధకుణ్ణి అంటూ తనను తాను పరిచయం చేసుకోవడంతో మొదలెడుతుంటారాయన. అటు బైబిలు వాక్యాలకూ, ఇటు సైన్సు సూత్రాలకూ ఆ రెండు పక్షాలవారూ అంగీకరించని అర్థాలు, వ్యాఖ్యానాలు చేస్తూ, అదే తన ప్రత్యేకతన్నట్లు, ఈ వివరాలు తన పరిశోధనా ఫలితాలన్నట్లు మాట్లాడతారు.
4) వారూ, ఆనాటి వారున్న సంస్థలో వీరికంటే పైవారూ ఆయన జయచంద్రగారూ కలసి మేము నిర్వహిస్తున్న ప్రమాణ విచారణ తరగతులలో పాల్గొన్నారు కొద్దికాలం. ప్రత్యక్షానుమాన ప్రమాణాల విచారణ ముగిసి, శబ్దప్రమాణంపై విచారణ ఆరంభమయ్యాక, శబ్దప్రమాణపు 'శక్తీ పరిమితుల'గురించి కొంత వివరణ చేశాక, ప్రామాణిక గ్రంథాలనంటిపెట్టుకునేవారి బలహీనతేమిటో ఒకింత మనస్సుకు తట్టి ఇక సమావేశాలకు రావడం ఆపేశారు. ఆ వత్తిడి కారణంగానే అటు తరువాత తాను తర్కాన్ని గురించి తెలుసుకున్నట్లు, నేర్చుకున్నట్లు మాటల సందర్భంలో ఆయనే నాతో అన్నారు.
5) మొన్నటికి మొన్న సత్యోదయంలోనూ ఎవరడిగినా వచ్చి బైబిలు సృష్టివాదాన్ని నిరూపించడం తనకు నల్లేరుమీద బండిలా చాలా సుళువైన పనన్నట్లు ప్రగల్భించడం ఆయనలోని విపర్కయాగ్రహానికినో మచ్చుతునక మాత్రమే.
1997 నుండి ఈనాటి వరకు ఆయనగారందుకు తానై పూనుకోకపోగా, గత సం||ర కాలంగా మా వేదిక వత్తిడి చేస్తున్నా ముందుకు రాలేదన్నది బహిరంగ వాస్తవం. తమకంటే తక్కువ తెలిసిన వారిదగ్గరో, అసలేమీ తెలియనివారి దగ్గరో తెగబడి, అంతా తేలిపోయింది. సైన్స్‌ కూడా బైబిలుదగ్గరకే వచ్చేసింది అని అదరగండంగా మాట్లాడే వారి విపరీతపోకడనేమనుకోగలం.
ఏమండీ సుధాకర్‌గారూ! ఆనాటి మాటకు కట్టుబడి బైబిల్‌లో అసత్యాలు లేవని తేల్చడమో, ఈనాటి మా ఉమ్మడి వేదిక క్రమానికి కట్టుబడి బైబిలు సృష్టివాదాన్ని ప్రకటించి అది సరైందని నిరూపించడమో చేయడానికి. ఇంత వత్తిడి, రచ్చ, చర్చ ఎందుకండీ! మీ సి.టి.ఎఫ్‌. వాళ్ళే ప్రగల్భించినంత పటిమ మీకైనా వుంటే ఇతరేతరాంశాలన్నింటినీ ప్రక్కనబెట్టి కేవలం బైబిలు సృష్టివాదం ప్రతిపాదించి, అది సరైందేనని నిరూపించడానికి సిద్ధపడొచ్చుకదా!
2. డా|| ఆనందకుమార్‌ గురించీ రెండు మాటలు మాట్లాడుకోవడం ఇప్పుడు సందర్భోచితం.
బహుశా 94 ప్రాంతాలలోననుకుంటా, ఆనంద్‌ మాకు పరిచయమయ్యాడు. నా దగ్గరకొచ్చేనాటికి చిన్మయామిషన్‌, రజనీష్‌ సంస్థలలో కొంతకాలముండి, ఏవేవో కారణాలవల్ల వాటి నుండి బైటపడి ఒకింత నిరాశా నిస్పృహలతో కూడిన థలో అతనున్నాడు. జీవితాన్ని మండలి కార్యక్షేత్రంలో వినియోగించదలచినట్లు చెప్పాడు. యుక్తవయస్సులో వుండి వివాహ విముఖతను కనబరచడం చూసి, కొంత గట్టిగా అడిగీ, ఎన్‌.వి.బ్రహ్మంగారి ద్వారా కొంత వినీ, అతని వెనకా ఒక ప్రేమకథ వుందని తెలిసి, అతనిష్టపడుతున్న అమ్మాయితోనూ, అటూ ఇటూ పెద్దలతోనూ మాట్లాడి వివాహం జరిపించాను. అటుపైన వారిరువురూ డాక్టర్లే అవడంతో, వైద్యవృత్తి ఉదాత్తమైనది, కనుక మా దగ్గరుండిగానీ, మీకిష్టమైన తావునగానీ ఆ వృత్తిలో వుండి సమాజసేవ చేయండి అని సూచించాను. అలాగేనని దంపతులిరువురూ చిల్లకల్లు చేరారు. కొద్దిరోజుల్లోనే ఇక్కడికంటే బాపట్ల బాగుంటుంది మాకు వెళ్ళమంటారా? అనడిగారు. అలాగే, మీ మనస్సుకెక్కడ నచ్చితే అక్కడే పనిచేయండని చెప్పి పంపాను. బాపట్ల చేరిన పిదప ఆనంద్‌ క్రమంగా క్రైస్తవ సంస్థల ప్రభావానికి లోనూ, వారి కుటుంబ సంబంధీకులే నడుపుతున్న క్రైస్తవ ప్రచార సంస్థలో వుంటూ గ్రామాలలో ఉచిత హోమియో వైద్యం చేయాలనుకుంటున్నాననీ, ఏం చేయమంటారనీ అడిగాడు. స్వతంత్రంగా హాస్పిటల్‌ పెట్టుకుని చేయగలంత చేయొచ్చుగదా!  ఆ దిశగా ఆలోచించి చూడు అనన్నాను. భార్య నైటింగేల్‌ మాత్రం మిషనరీలవైపు పోకుండా, ప్రభుత్వ హోమియో వైద్యురాలిగా ఉద్యోగం సంపాదించుకుని ఆ దారిన స్థిరపడగా, ఆనంద్‌ స్వతంత్రంగా డిస్పెన్సరీ ద్వారాకంటే, సంస్థద్వారానైతే ఎక్కువ గ్రామాలలో నిరంతరాయంగా వైద్యసహాయం చేయవచ్చు. స్వంత డిస్పెన్సరీ అయితే పొట్టకూటి వృత్తిగా మాత్రమే వుంటుంది అంటూ, ఏమిచేయమంటారు? అని మళ్ళా అడిగాడు. మత భావాల ప్రభావం ఏమీ లేకుంటే, పడదనుకుంటే, వైద్య ప్రజలకొరకు అన్న దృఢత్వం వుంటే, ఏ సంస్థలో వుంటే ఏమి? తృప్తికలిగేంతగా వైద్యసేవలందించు. అయితే ఒక్కవిషయం. నీ ఈ ఉచిత వైద్యసేవలను ఆ మత సంస్థ మత ప్రచారానికి సాధనంగా వాడుకోకుండా చూడాల్సి వుంటుంది అని చెప్పాను. అలాగే! అలా జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నాడు. అలా అయితే సరే! వెళ్ళి మనసున్నచోటే పనిచేయమని చెప్పాను. కొంతకాలమయ్యాక, మళ్ళా ఒక సమస్యతో నా దగ్గరకు వచ్చాడు. కేవలం వైద్యం చేయడానికైతే ఇక్కడ కుదరదు. మతబోధ, ప్రసంగాలు కూడా చేయాల్సి వుంటుంది అన్న షరతు పెడుతున్నారు మావాళ్ళు. ఏమి చేయాలో పాలుపోవడంలేదు. వైద్యసేవ మాత్రం బాగా చేయవచ్చనిపిస్తోంది. కనుక మార్గదర్శనం-దిశానిర్దేశనం-చేయండి అనడిగాడు. వైద్యాన్ని సాధనంగా మతప్రచారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వారితో కలసి పనిచేయడంకంటే. ''వైద్యసేవ, ప్రజారోగ్యం'' అన్న దృష్టితో చేయగలిగినంత చేసుకుంటూ పోవడమే సరైందవుతుంది ఆనంద్‌. నీవూ బాగా ఆలోచించుకుని నచ్చినట్లు చేయి అని చెప్పాను. కారణాలేమోగాని, ఆ సంస్థనుండి విడివడి, భార్య పనిచేస్తున్న పీలేరుకు వెళ్ళాడు. ఈ క్రమం జరుగుతున్న థలోనే అతడు త్రికరణశుద్ధిగా క్రైస్తవంవైపు మొగ్గాడోలేదోగానీ, క్రైస్తవ ప్రచారంవైపు కదలడం మొదలెట్టాడు.
నా సంగతి, పెంచలయ్యగారి సంగతి తెలిసున్న అతను, వివిధ క్రైస్తవ ప్రచారకుల నుండి, తర్కము, సైన్స్‌ తెలిసి ధీమాగా మాట్లాడుతుండే వాళ్ళను ఎంచుకుని వారికీ మీకు మధ్య చర్చలు జరిపేందుకు యత్నిస్తూ వచ్చాడు. మా ఇరువురినీ ఒప్పించగలిగితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రచారానికి చాలా అనుకూలత ఏర్పరచినట్లు, పెద్ద అడ్డంకిని తొలగించినట్లు అవుతుందని అతని ఉద్దేశం. ఆ యత్నంలో భాగంగానే ప్రకాష్‌ అన్నాయనను తెరమీదికి తెచ్చాడు. చాలాసార్లు ఆనంద్‌ విడిగా మా సమావేశాలకు వచ్చినపుడు, నన్ను కలసినపుడూ, ఆనంద్‌! నీకు నీవుగా బైబిల్‌ ఏమిటో, బైబిల్‌ పోకడేమిటో తేల్చుకుని, అవి సరైనవో కావో అన్న విషయంలో మాతో మాట్లాడు. ఎవరెవరినో పట్టుకొచ్చి, వారికీ మాకూ చర్చలుపెట్టి ఏదో సాధించాలనుకోవడం పిచ్చిపని. నీకు నీకుగా అది సరైందో కాదో తేలాలి. అందుకు తేల్చుకునే యోగ్యమైన పద్ధతేమిటో తెలిసి, దానిద్వారా తేల్చుకోవాలి. నీకోసంగా ముందు నీవాపనిచేసిచూడు. ఎవళ్ళనో పట్టుకొచ్చి, మాకూ వారికీ పోటీపెట్టి ఎవరు నెగ్గుతారో చూద్దామనుకునే పద్ధతి సరైందికాదు-అన్న సూచన పలుసార్లు చేశాను.
నాకు తెలిసినంతలో, ఆనంద్‌ ఎంతోకొంతమేరనైనా మండలి భావజాలపు పునాది, నిర్మాణాల్ని గురించి ఎరిగినవాడే. కొంతమంది సత్యాన్వేషణ మండలికి చెందిన వాణ్ణనే తననితాను పరిచయమూ చేసుకుని వున్నవాడు. నా అంచనా సరైందే అయితే అతడు వంచకుడు కాదు. బ్రతుకుదెరవో, సౌకర్యాలో, సాంఘిక హోదానో, వైద్యసేవలందించగలుగుతున్నాన్న దృష్టో, అన్నీ కలగలసోగాని, మండలి పోకడకు దూరమై, బలహీనపడుతూ వస్తున్నాడు. మాకు చెప్పలేక, తన మనస్సుకూ పూర్తిగా నచ్చచెప్పుకోలేక, విషయాన్ని 'విచారణలోనే వుందింకా' అన్నదగ్గర కూచోబెట్టి, తేలితేకదా దేనిని వదలాలో. వదలకూడదో నిర్ణయించుకోవలసింది? అన్న తర్కం పెట్టుకుని తననితాను మభ్యపెట్టుకుంటున్నాడు. నిజమైన సత్యాన్వేషణోతత్పరత వుంటే తేలనివాటి విషయంలో ఎటూ భుజంకాయకుండా, తేలనిది, దేనిని పట్టుకోను అన్నదగ్గరుండాలి. అతడక్కడ లేడు. క్రైస్తవాన్ని పట్టుకుని లోకంనెత్తిన పెట్టే పనికి పూనుకున్నాడు. అదిగో అందుకే అతడు క్రమంగా జరిపోతూ వస్తున్నాడు. దారితప్పాడు అనన్నాను, అంటున్నాను. మా సంబంధాల రీత్యా నిజంచెప్పాలంటే అతనిపై నా వత్తిడంతా ఆప్యాయతతో కూడిన వేదన పూర్వకమైనదే. శాంతచిత్తంతో, ఎలాంటి భేషజాలకు తావీయకుండా, వెనకటి ఆనంద్‌లా కూచుని అంతరావలోకనం చేసుకోగలిగితే, నేను యదార్థాలే చెపుతున్నాన్నది చూడగలడతడు. ఆనంద్‌! ఒక్క విషయం. చిన్న జీవితం, నాల్గునాళ్ళ ముచ్చుట. బ్రతకడానికీ, అంతో యింతో సమాజ రుణం తీర్చుకోడానికీ సరిపోయే విద్య చేతిలో వుంది. ఏదో ఒకనాడు, ఆత్మపరిశీలన చేసుకోగలిగితే మత ప్రచార రూపంలో సమాజానికి ఎంత అనవసరపు బరువు నెత్తికెత్తావో నీకే తెలుస్తుంది. అదే జరిగిననాడు, హృదయమున్న వాడివైతే మాత్రం చాలా మానసిక క్షోభను అనుభవిస్తావు. శాంతచిత్తంతో ఆలోచించుకుని, చరిత్రలో గతంలో జరిగిన మానవ మారణకాండలో పెద్దభాగానికి కారణమైన బైబిల్‌ పట్టునుండి బైటపడి, కేవలం మనిషిగా వుండగలిగేందుకు సిద్ధపడు. ఇప్పటికీ నాకు తెలిసినంతలో వివేకపథమతే. మావాడివిగా నేను నీకు చేయగల హితసూచనా అదే.
ఇదే సూత్రధారి పాత్ర పోషిస్తున్న ప్రకాష్‌ గారి గురించీ నాలుగు మాటలు చెప్పుకోవాలి.
1) ఆనంద్‌ ద్వారా ప్రప్రథమంగా నాకెదురుపడిన నాటినుండి ఏ విషయంలోనూ అతడు రుజుత్వాన్ని ప్రదర్శించిన జాబితాలు నాకెదురవలా.
2) ఆయన ఎత్తుగడలోని ప్రధానదోషం, ఏ నియమాల్ని ఇతరుల్ని పాటించమంటారో, దానినాయన పాటించకపోవడం.
3) తార్కిక భాషననుసరించి ఆయనగారి వాదపద్ధతి వితండం. తనదెప్పుడూ చెప్పడు. స్వమత స్థాపనాహీనోవితండం!
4) ఎవరైనా అమాయకత్వంతో పొరపాట్లో, తప్పులో చేస్తుంటే వాటిని మనం సానుభూతితో అర్థంచేసుకుని, అతణ్ణి మిత్రునిగనే స్వీకరించి, సరిచేసే యత్నం చేయవచ్చు. ప్రకాష్‌గారి విషయంలో అది కుదరనే కుదరదు. ఆయన అమాయకులు కాదు. ఎలా చెప్పగలమంటే ఆయా ప్రత్యేక సందర్భాలలో సర్వులూ అనుసరించాల్సిన నియమాలను ఎదుటివారిని పాటించమంటూ విస్పష్టంగా సూచిస్తారు. అంటే ఆ మేరకు వున్న నియమాన్ని గురించి ఆయనకు తెలుసున్నట్లేగదా! కానీ ఎన్నడూ ఇతరుల్ని పాటించమన్న సాధారణ సూత్రాన్ని తాను పాటించరు. మాట మృదువుగా, సున్నితంగా వుంటుందిగానీ, పట్టిచూస్తూ దానివెనక ఎంతో కాఠిన్యత, ఆధ్యాత్మికత, ఇతరుల్ని చులకనగా చూడడము అన్నవి దోబూచులాడుతూ కనిపిస్తాయి. పలుసార్లు ఆయా సందర్భాలలోనే, నేరుగా సభాముఖంగానే ఆ విధానం, ఆ భాష సరిచేసుకోండని చెప్పానుకూడా. నా తార్కిక బుద్ధికి ఆయనలోని ఆ వుండకూడనితనం పొరపాటునో, తొందరపాటునో జరుగుతూ వచ్చిందికాదు. అది ఐచ్ఛికంగా, ఏర్పరచుకున్న ఎత్తుగడలోనిదే.
5) మతాన్ని, దైవ విశ్వాసాన్ని విడిస్తే నీతి, నియమాలకు వివరణిచ్చుకోడమే కష్టమైపోతుందన్న భావాన్ని వెలిబుచ్చినాయన ఒక్కదగ్గరా నీతినిగాని, నియమాన్నిగాని పాటించకపోవడాన్ని చూసి ఏమనుకోవాలి?!
6) మా వేదికలో పరిణామవాదంపై చర్చలు జరుగుతున్న క్రమంలో రెండు సందర్భాలలో ఒకసారి, నేనొచ్చి వేదిక మొత్తాన్ని తల్లక్రిందులు చేసేశానని తన గుంపులో ప్రగల్భించడం ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళలోనే కొందరు విన్నారు. ఇంతకూ ఆరోజు మాట్లాడిన ఉష్ణగతిక శాస్త్ర నియమాల విచారణలో ఆయన మాట్లాడింది నమోదై వుంది. అది తప్పభిప్రాయమే. విశ్వం ఏ సిష్టం క్రిందికి వస్తుందని ఆయన పట్టి పట్టి మరీ చెప్పారో అదీ తప్పే.
7) చర్చలో పాల్గొనేవారూ, నిర్వాహకులు ఏయే నియమ నిబంధనల్ని పాటించమని ఆయనే చెప్పారో వాటిని ఆయనెన్నడూ పాటించడు.
8) నడుస్తున్న విషయాన్ని విడచి అన్య విషయాన్నెత్తుకోవడం తప్పుగదా అని ఎద్దేవా చేసిన, ఆయన ఈనాటి నే నడువలసిన క్రమానికి నాల్గుప్రక్కల నుండి ఎందరు పట్టుకుని గుంజినా రావడంలా.
ప్రకాష్‌గారితో ముడిపడి జరిగిందంతా సమీక్షించుకుంటే, ఆ సందర్భాలన్నీ ఆయన పద్ధతులు తెలీనివారుకాదనీ, కావాలనే పద్ధతుల్ని పాటించడంలేదనీ తేలుతుంది. ఆ వివరాలన్నీ ప్రత్యేకంగా పై సంచికలో మీ ముందుంచుతాను. ఈ వ్యాసం ఇక్కడికి చేరేసరికి, రహమాన్‌గారినుండి లేఖ అందింది. ఆ వివరాలివిగో చూడండి.
రహ్మాన్‌గారి లేఖ :- సురేంద్ర గారికి పజులుర్‌ రహ్మాన్‌ వ్రాయునది.
మనం కలసి నిర్వహించిన కార్యక్రమాలలో జన విజ్ఞాన వేదికలో జరిగిన నిర్ణయం ప్రకారం ''బైబిలు సృష్టివాదాన్ని'' మన డయాస్‌ నుంచి చెప్పించవలసిన బాధ్యతను ఆనంద్‌గారు వేసుకున్నారు. చర్చావేదిక నియమ నిబంధనలు తేల్చుకుంటే బాగుంటుందని ఆనంద్‌గారు వేసుకున్నారు. చర్చావేదిక నియమ నిబంధనలు తేల్చుకుంటే బాగుంటుందని ఆనంద్‌గారు ఆరోజు కోరటం జరిగింది. దానికి మీరు స్పందిస్తూ - మీరు వ్రాసి పంపండి. మేము మీకూ అందిస్తామని తెలియజేశారు. కాలక్రమంలో సందర్భం వచ్చినపుడల్లా ప్రస్తావిస్తున్నా ఆనంద్‌గారు అటువైపు శ్రద్ధ చూపలేదుగాని, తమదైన డయాస్‌ (వేదిక)లో సత్యోదయంలో 'పరిణామ సిద్ధాంతం'పై ఒక సమావేశం మాత్రం జరిపారు. దానికి మనమూ హాజరయ్యాము.
అయితే బైబిలు సృష్టివాదం గూర్చి మీరు మరల మరలా ఏకరువు పెడుతూనే వస్తున్నారు. నన్నూ వత్తిడి చేశారు. మొత్తానికి మన వత్తిడో, వారు చెప్పిన వాగ్దాన నెరవేర్పోగానీ, 2009 నవంబర్‌ 14వ తేదీన సమావేశం ఏర్పాటుకు ఆనంద్‌, ప్రకాష్‌గార్లు తమ సంసిద్ధత తెలియజేశారు.
అయితే, కార్యక్రమం ఇరుపక్షాలకు యోగ్యమైన హైదరాబాద్‌లోని మా సెంటర్‌లో ఏర్పాటుచేస్తే బాగుంటుందని నేను చెప్పినా వారు ఏకీభవించలేదు. అలాగనీ, బలమైన కారణాలూ తెల్పలేదు. సత్యోదయంలోనైతేనే తాము సిద్ధపడతామని అన్నారు. కనీసం, అక్కడైనా నిర్వహణ కార్యక్రమం సమన్వయ కర్తగా నేనుంటానని తెలియజేశాను. (అస్సలు మన మిరువురం చూసుకోవలసిన సమావేశం అది. అయితే మీకూ-ప్రకాష్‌ ఆనంద్‌లకు మధ్యకొంత గ్యాపే వుందికాబట్టి నేను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది). దానికీ వారు సుముఖత వ్యక్తంచేయలేదు.
మొత్తానికి ఇప్పటివరకు నేను వారిని కలసిగానీ, ఫోన్‌ ద్వారాగాని మాట్లాడినదానినిబట్టి...
1) మనం కలసి నిర్వహించినదాని కొనసాగింపు కార్యక్రమంగా బైబిలు సృష్టివాదం చెప్పడానికి వారు ఇష్టపడకపోవడం.
2) జనవిజ్ఞానవేదికలో ఆరోజు నిర్ణయించుకున్న భవిష్యత్కార్యక్రమానికి కట్టుబడి లేకపోవడం.
3) బైబిలు సృష్టివాదాన్ని చెప్పడానికి సిద్ధమేనంటూనే, మన డయాస్‌ ద్వారా చెప్పడానికి ఇష్టపడకపోవడం.
4) బైబిలు సృష్టివాదాన్ని తమ స్వంత వేదికద్వారా మాత్రమే నాస్తికపక్షాలతో మాట్లాడతామనడం.
5) వివేకపథంలో ప్రకటించిన పేర్లతోపాటు 14వ తేదీ నవంబర్‌ 2009 సమావేశానికి ఆహ్వానించుటకుగాను, వారి ఫోన్‌ నంబర్లు, మరికొందరు నాస్తికపక్షీయుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు తీసుకుని, వారే స్వయంగా కాంటాక్టుచేసి ప్రోగ్రాం చేయడానికి సిద్ధపడడం జరుగుతోంది.
ముగింపు : ఆరోజు జనవిజ్ఞానవేదికలో అనుకున్న ప్రకారం 'బైబిలు సృష్టివాదాన్ని' తెలపడానికి సిద్ధపడినవారు, వివేకపథం మరియు నాద్వారానూ నాస్తికపక్షీయులపేర్లు, ఫోన్‌ నెంబర్లు తీసుకుని మన డయాస్‌ను వ్యతిరేకిస్తున్నవారు, ఆ విషయంలో వారినిగూర్చి మనమేదో ఊహాగానాలు చేయడానికి ఆస్కారమియ్యకుండా, ఆ విషయాన్ని వారే ముందుగా వివేకపథం ద్వారా తెలిపివుంటే బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆనంద్‌గారు ఈ విషయంలో నైతిక బాధ్యత వహించి ఏ విషయమూ తెలియజేస్తే, మనం కలసి నిర్వహించిన కార్యక్రమాల కొనసాగింపు ఎలా వుండాలో మీరూ నేనూ కలసి నిర్ణయించుకోడానికి వీలవుతుందని నా అభిప్రాయం అంటూ ముగించారు. నాటి నుండి మా వేదికలో పాల్గొంటూ వచ్చిన అన్ని సముదాయాలకూ, వివేకపథం ద్వారా వివరాలను అందుకుంటూ విషయాలనో గమనిస్తున్న పాఠకమిత్రులకు;
1. ఈ మొత్తం ప్రహసనంలో సుధాకర్‌గారి పాత్ర తెరమీదివరకు చూసుకుంటే చాలా చిన్నది. ఆయన ఒకటి రెండుసార్లు పరిణామవాదం అంగీకరించదగిందికాదనీ, బైబిలు సృష్టివాదం సరైందేననీ ప్రకటించి ఆ పక్షాన్ని నిలబెట్టగలను ఎప్పుడైనా, ఎక్కడైనా, అన్నంతవరకే పరిమితమై వుంది. కనుక ఆయనను అడిగితే ఇదిగో పిలుస్తున్నాం, వచ్చి ఆపని చేయండి అని మాత్రమే విషయపరంగా మనమెవరమైనా అడగగలిగింది. సంభాషణ మధ్యలో ఒకటి రెండు దూకుడు మాటలు వ్యక్తుల నుద్దేశించి మాట్లాడినా వాటినంత ప్రధానంగా సాగదీసుకోవలసిన పనిలేదు (అదే పరిశీలనాంశంగా ఎదుటపడకున్నంతవరకు).
2. నిశితంగా, జాగ్రత్తగా చూడగలిగితే ఆనంద్‌ పాత్రా అంతంత మాత్రమే. అతడు ఎక్కువలో ఎక్కువ వార్తాహరుని పాత్ర పోషించాడేగాని, ఏనాడూ ప్రతిపాదకుని పాత్ర పోషించలా. దానర్థం, అతనికేమీ బాధ్యతలేదనికాదుగానీ, ఆ పక్షపు పోకడ మొత్తానికీ అతణ్ణి బాధ్యుణ్ణి చేయడం అంత న్యాయంకాదనే. అయినా జరగాల్సిన క్రమం జరక్కుండా అడ్డుకొట్టి, ఆపై పట్టించుకోకుండా ఊరుకున్నదానికి మాత్రం బాధ్యుడతడే.
3. ఇక సి.టి.ఎఫ్‌.కు అధికారిక ప్రతినిధిగా చెప్పుకున్నవారూ, సి.టి.ఎఫ్‌.వారమనేపేర అది నిజమేనన్న అంగీకారం పొందినవారూ, మా వేదికలో బైబిలుపక్షానేగాక, ముస్లింలపక్షానా కొంత పూసుకుని 'పరిణామవాదంపై' సృష్టివాదుల పరిశీలనలో ప్రధానపాత్రధారిగా పాల్గొన్నవారూ అయిన ప్రకాష్‌గారే దీనంతటికీ (ఆపక్షంలోని అపసవ్యతల కన్నింటికీ) బాధ్యత వహించితీరాలి. ఇది నిజమేననడానికి; ఆనంద్‌ కనుక్కుని చెపుతాను అనడాన్ని, ప్రకాష్‌గారు ఇటు వేదికలోనూ, అటుపై వివేకపథంఓలనూ, అన్నీ తానేఅయి మాట్లాడడాన్ని, రహమాన్‌గారు అడుగుతూ వచ్చింది; సమాధానం చెపుతూ వచ్చింది ప్రధానంగా ప్రకాష్‌గారే అవడాన్ని ఆధారాలుగా తీసుకోవచ్చు.
కనుక రహ్మాన్‌గారూ, నేను కలసి నిర్వహించిన వేదికలో దాని క్రమానన్ననుసరించి బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి అది సరైందేనని నిరూపించడమో, అలా చేయకుంటే బైబిలు ప్రచారం చేయడం అనే ప్రజల్ని మభ్యపెట్టే పనినాపి, ఆ పని చేస్తున్నవారిని ఆపే పని మొదలెట్టడం ఆయన కర్తవ్యం.
గమనిక : పై సంచికలో ప్రకాష్గఆరు ఈ రెండేండ్ల కాలంలో మాట్లాడిన ముఖ్యమైన సందర్భాలను ఒకచోట గుదిగుచ్చి మీకందించే పనిచేస్తాను. ఈ మొత్తం వ్యవహారాన్ని త్వరలో ఒక పుస్తకం రూపంలోకి తెచ్చి అందిస్తాను.

No comments:

Post a Comment