Thursday, July 1, 2010

సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక కార్యక్రమాల వివరాలు

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక :

యోచనాశీలురైన పాఠక మిత్రులారా ! ఐక్యవేదిక ఆచరణ విభాగపు తీరుతెన్నులు యథాతధంగా చెప్పుకోవాలంటే సంతృప్తి- అసంతృప్తుల మేళవింపుగా వున్నాయి. మొత్తంమీద పరిస్థితిని సవిూక్షిస్తే దాని దిశా గమ్యం నిరాశ వైపుకు గాక, ఆశావిధంగానే సాగుతుందనిపిస్తోంది. పురిటి నొప్పుల నదిగమించి ఉనికిలోకి వచ్చిన ఈ మన వేదిక నిజానికి మరికొన్ని బాలారిష్టాల్నుండి బయటపడాల్సి ఉన్నా, వివిధ సంస్థలు, వివిధ సామాజిక లక్ష్యాలు గల ఎందరితోనో కూడివున్న ఈ ఐక్యవేదిక ఈపాటైనా చైతన్యవంతంగా వుండటం చిన్న విషయమేమీ కాదు. పట్టు సడలకుండా ఒక్కో ఆటంకాన్ని దాటుకుంటూ క్రమంగా వేగాన్ని పుంజుకుంటూ సాగుతోంది అన్న నిజం ఐక్యవేదికల అవసరాన్ని గుర్తించిన వారందరకు ఆనందాన్నిస్తోంది. ఆమేరకు అభ్యుదయ కాంక్షగల మీరూ ఈ సంతోషాన్ని పంచుకోండి.

ఉద్యమ క్షేత్రాల్లో ఉన్నవారందరూ నిరంతరం, తుదివరకు గుర్తుంచుకోవలసిన భావన ఒకటుంది. ఉద్యమకారునికి లేదా క్రియాశీలత, దక్షతగల పనిమంతులెవ్వరికైనా తలపెట్టిన పని పూర్తయ్యేంతవరకు సాధించగలనన్న ఆశ, ఇంకా సిద్ధించలేదన్న అసంతృప్తి వెంటనంటి వుండాలి.

ఆశ చచ్చినా, తృప్తి కలిగినా ఇక ఆ విషయంలో అతడు చేయగలిగింది పెద్దగా ఏవిూ వుండదు. మానవ స్వభావం రీత్వా ఇది అందరికీ వర్తించే సాధారణ సూత్రమే.

అలాగే ఒక వ్యక్తి ఒక పనిలో తనంత తానుగా చొరబడాలంటే, ఆ పని అతనికి తనదిగా అనిపించాలి. కనీసం తన వాళ్ళకు చెందినది అనైనా తోచాలి. మరో రూపంలో దీనిని చెప్పుకోవలసి వస్తే అది ఏదో రూపంలో ఎంతో కొంత తన అవసరం తీర్చేదిగానో, తన వాళ్ళ అవసరం తీర్చేదిగానో అనిపించాలి. (గమనిక : అవసరం తీర్చడం, ఇది ఒక నష్టాన్ని పూడ్చటం లేదా కష్టాన్ని తొలగించడం ; ఒక లాభాన్ని చేకూర్చడం లేదా సుఖాన్నివ్వడం, ఈ రూపంలోనే ఉంటుంది సాధారణంగా.)

జీవిత అవగాహనకు తప్పనిసరే అయినా మొత్తంగా దీన్నే మరింత వివరించుకోవడానికి ఇది సందర్భం కాదు గనుక, ప్రస్తుతానికి దీనిని ఇక్కడ ఆపి ప్రకరణాంశానికి వస్తాను.

మన ఈ సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ప్రజా స్వామ్యానికి ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూర్చుకోవడం ప్రధాన ఆశయంగా రూపొందింది. అందుకై వివిధ థల్లో వివిధ ఉప లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవలసి వుంది. ఈ ఐక్య వేదికను సరిగా అర్ధం చేసుకోవడానికి తెలుసుకోవలసిన ప్రధానాంశాలు.

1. ఇది స్థానిక సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఏర్పడింది కాదు.

2. మౌళిక సంస్కరణల ద్వారా వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారాన్ని సాధించాలనుకొంటోంది.

3. ప్రజా సమస్యలకు తాను పరిష్కర్తగా కాక, ప్రజల్ని అవగాహనా పరులు, సమర్ధులు అయ్యేటట్లు చెయ్యటం ద్వారా ప్రజలే పరిష్కర్తలుగా రూపొందాలన్న దృక్ఫధంతో క్రియాత్మకంగా పనిచేయాలనుకొంటోంది. చూస్తూ.. చూపిస్తూ..., చేస్తూ.. చేయిస్తూ... ఇదే మన కార్యాచరణ పథకపు సారరూపం.

4. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలన్న దృష్టితో ఉన్న వేదిక ఇది. నిజానికి ప్రజా ఉద్యమం దాని సరైన యత్నంలో ఏర్పడాలంటే, ఉద్యమంలోకి ప్రజలే పెద్ద ఎత్తున ప్రవేశించాలి. అందుకై ఆ దిశగా ప్రజల్ని ఉద్యమంలోకి పెద్దఎత్తున ప్రవేశపెట్టే పని మనం చేయవలసి ఉంది. అందుకని ఉద్యమ నిర్మాణానికి పెద్దపీట వేసి కదులుతున్నాం మనం. ఉద్యమ నిర్మాణం, ప్రజా ఉద్యమమనడానికి తగిన స్థాయిలో జరగాలంటే గ్రామ స్థాయి వరకు సమాజం అంతటి నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి ప్రవేశించాలి. ఆ పనిని తొలి థగా జిల్లా కమిటీలు ఏర్పరచు కోవడంతో మొదలు పెడుతున్నాం. జిల్లా కమిటీలు అంటే ఏదో నామమాత్రంగా పది మంది కూడి పదవులు చేపట్టడం కాదు. మండల స్థాయినుండి చైతన్యంతో ఒక సంవత్సరం పాటు గట్టిగా తిరిగి పనిచేసేవారితో కూడి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడే వారితో ఏర్పడేదే అది. ఇప్పటికి ఖమ్మం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లా కమిటీలు ఏర్పడ్డాయి. గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురంలలో సన్నాహక కమిటీల జిల్లా పర్యటనలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా, గుంటూరుజిల్లా మహాసభలు జూలై 11న జరగనున్నవి. కమిటీలు ఏర్పడిన నాలుగు జిల్లాల వివరాలు ఇవిగో ఇలా ఉన్నాయి.

1. ఖమ్మం, 2. కృష్ణా, 3. నెల్లూరు, 4. కర్నూలు.

విజయవంతమైన ఖమ్మం జిల్లా స.హ. చట్టం ప్రచార ఐక్య వేదిక జిల్లా సదస్సు

అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఖమ్మం జిల్లా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా సదస్సు విజయవంతంగా జరిగింది. ఖమ్మం పట్టణం లోని రోటరీ కృత్రిమ అవయవాల కేంద్రం నందు 12-6-2010 శనివారం నాడు జిల్లా లోక్‌సత్తా అధ్యకక్షుడు తమ్మా హనుమంతరావు అధ్యక్షతన ఈ సదస్సు ప్రారంభమైంది.

జిల్లాలోని 46 మండలాల్లో 36 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సుమారు 120 మంది ప్రతినిధులు కార్యక్రమానికి హజరయ్యారు. రెండు సెషన్స్‌గా నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్ర ప్రతినిధులుగా పుట్టా సురేంద్రబాబు, శ్రీనివాస మాధవ్‌లు హాజరై ప్రసంగించారు.

ఆర్‌.టి.ఐ. యాక్టివిస్ట్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ ఉదయం సెషన్‌లో ప్రసంగించారు. ఆద్యంతం ఒక ప్రవాహంలా సాగిన ఆయన ప్రసంగంలో సమాచార హక్కు చట్టం 2005 లోని ప్రతి సెక్షన్‌ను సభికులకు కూలంకుషంగా వివరించారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి, వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న అవినీతి మహమ్మారి భరతం పట్టడానికి స.హ.చట్టం పదునైన ఆయుధంలా ఉపయోగపడుతుందని ఆయన పలు ఉదాహరణలను జోడించి సభను ఆకట్టుకున్నారు. పలువురు ఆర్‌.టి.ఐ. కార్యకర్తలు అనేక సమస్యలను ప్రస్తావించి సందేహ నివృత్తి చేసుకున్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే పలు చట్టాల్లో స.హ.చట్టం చాలా మేలైనదని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వాలు, కమీషనర్లు ఆశించిన రీతిలో ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోక పోవడం, విఫలం కావడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఐక్య కార్యాచరణ ద్వారా ఉద్యమించడం హర్షణీయమని మాధవ్‌ ప్రశంసించారు.

ఈ సదస్సుకు జిల్లా మారుమూల ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, స.హ.చట్టం కార్యాచరణలో పాలుపంచుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. లోక్‌సత్తా ఆర్గనైజేషన్‌, సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం, వినియోగదారుల సంక్షేమ మండలి, ఎ.ఎస్‌.డి.ఎస్‌. సంస్థ, రైలు, బస్సు ప్రయాణీకుల సంఘం, ప్రజానాట్యమండలి, డైనమిక్‌ యూత్‌ అసోసియేషన్‌, ఎఫర్ట్‌ ఆర్గనైజేషన్‌, నేత్రదాన ఉద్యమ సంస్థ, జిల్లా శాంతి సంఘం, హోప్‌ ఫర్‌ హార్వెస్ట్‌ సంస్థ, షార్ప్‌ ఆర్గనైజేషన్‌, సవన్స్‌ ఆర్గనైజేషన్‌, ప్రణతి ఆర్గనైజేషన్‌ తదితర సంఘాలు ఐక్య వేదికలో ఉమ్మడి స.హ. ప్రచారానికి ముందుకు వచ్చాయి. మధ్యాహ్నం సెషన్‌లో ఐక్య ఉద్యమ కోర్‌ కమిటీ సభ్యుడు పుట్టా సురేంద్ర బాబు ప్రసంగిస్తూ ఐక్య ఉద్యమాల ఆవశ్యకతను ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయిలో సుమారు 100 ప్రజా సంఘాల ఐక్యతకు బాధ్యతగా పనిచేస్తున్న రెండు వేదికలు ఐక్యమవటంతో స.హ.చట్టం ప్రచార ఐక్య వేదిక ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన వ్యవస్థ నిర్మాణానికి స.హ.చట్టం బలంగా పనిచేయడం ద్వారా సాధించవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. మంచి వాళ్ళకు దేశం గొడ్డుపోలేదని, వీరు ఐక్యమై ముందుండి పనిచేయడానికి ఐక్య వేదికలు అవసరం ఎంతో ఉందని సురేంద్ర అన్నారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేయడానికి ముందుకు వచ్చిన సంస్థలను ఆయన అభినందించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు శ్రీ కటారి ప్రభాకరరావు తొలుత సభా ఉద్ధేశ్యాన్ని వివరించి అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. ప్రసంగాల అనంతరం ప్రజాస్వామ్య బద్దంగా రెండవ నామినేషన్స్‌ రాకపోవడంతో ఎన్నికల అధికారి హోదాలో పుట్టా సురేంద్రబాబు జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం అధ్యకక్షులు కె.అంజయ్య వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం

అధ్యకక్షులు : శ్రీ తమ్మా హనుమంతరావు (లోక్‌సత్తా)

ఉపాధ్యకక్షులు : శ్రీమతి నాగూర్‌ బి (ఆర్‌టి.ఐ. యాక్టివిస్ట్‌)

శ్రీ కె. రాంబాబు (ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు)

శ్రీ కె.వి. రంగారెడ్డి (లోక్‌సత్తా)

శ్రీ ఎస్‌.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ (ఎ.ఎస్‌.డి.ఎస్‌. సంస్థ)

ప్రధాన కార్యదర్శి : శ్రీ శరత్‌చంద్ర (జన విజ్ఞాన వేదిక)

జాయింట్‌ కార్యదర్శులు : శ్రీ పి. ముత్తయ్య (ఆర్‌.టి.ఐ. యాక్టివిస్ట్‌)

శ్రీ తుమ్మలపల్లి ప్రసాద్‌ (హేతువాద సంఘం)

శ్రీమతి బి.యువతీమణి (లోక్‌సత్తా)

శ్రీ చిచ్చర్ల వెంకటేశ్వర్లు (ఎ.ఎస్‌.డి.ఎస్‌. సంస్థ)

శ్రీ మహంకాళి శ్రీనివాసరావు (లోక్‌సత్తా యూత్‌ ఆర్గనైజర్‌)

కోశాధికారి : శ్రీ మహేష్‌్‌ (ఆర్‌.టి.ఐ. యాక్టివిస్ట్‌)

మహిళా ప్రతినిధులు : శ్రీమతి డి. అనూరాధ (హోప్‌ సంస్థ)

శ్రీమతి ఎం. కమల (లోక్‌సత్తా)

రాష్ట్ర ప్రతినిధి : శ్రీ కటారి ప్రభాకరరావు (జన విజ్ఞాన వేదిక)

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు :

అన్ని మండలాల అధ్యకక్షులు (ఆర్‌.టి.ఐ. యాక్టివిస్ట్‌లు)

ఈ సమావేశంలో ఈ క్రింది తీర్మానాలు చేశారు :

1. మండల కమిటీల ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా వేసి కమిటీ బాధ్యుల నుండి రిసోర్స్‌ పర్సన్స్‌ను గుర్తించి మండల కమిటీలను ఎన్నుకోవాలి.

2. మున్సిపల్‌ ఎన్నికల నేపధ్యంలో అన్ని మున్సిపల్‌ కేంద్రాలలో మున్సిపల్‌ కమిటీ, పట్టణ కమిటీలను ఏర్పాటు చేయాలి.

కృష్ణా జిల్లా ఐక్యవేదిక సదస్సు

సమాచార హక్కు చట్టం 2005 ప్రధానంగా ప్రజలకోసం రూపొందించబడిన చట్టమని, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అవినీతిని అంతమొందించే లక్ష్యంగా ప్రజలందరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం వుందని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ పుట్టా సురేంద్ర బాబు అన్నారు. స్థానిక సాయిదత్తా టవర్స్‌లోని సమావేశపు హాలులో జరిగిన జిల్లా స్థాయి ప్రచార ఐక్యవేదిక ముఖ్య మరియు మండల కార్యకర్తల సమావేశం 26-6-2010 శనివారం జంపా క్రిష్ణకిషోర్‌ అధ్యక్షతన జరిగింది. సురేంద్రబాబు ప్రసంగంలో రాబోయే రోజుల్లో నిస్వార్ధం, విశ్వసనీయత, కృషి, అంకితభావం, చిత్తశుద్ధి గల చురుకైన సామాజిక కార్యకర్తలతో పెద్దఎత్తున, గ్రామ గ్రామాన ఈ సమాచార ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నామని అన్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని పర్యవేక్షించేందుకు నేడున్న ముఖ్య కమీషనర్‌ మరియు ముగ్గురు కమీషనర్ల స్థానంలో ప్రాంతాల వారీగా పది మంది కమీషనర్లను ఏర్పాటు చేయాలని, వారు కూడా ప్రజా జీవితంలో మచ్చలేని వారై వుంటే, రాజకీయాలకు అతీతంగా విధివిధానాలను నిర్వహించగలిగిన వారైతే అప్పుడే ఈ చట్టం ప్రజల్లోకి వెళుతుందని, ఆ విధంగా ప్రజలు ఈ చట్టాన్ని వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మరో రాష్ట్ర కన్వీనరు జంపా క్రిష్ణ కిషోర్‌ ప్రసంగంలో 1,03,000 కోట్ల రాష్ట్ర జడ్జెట్టులో ఈ సమాచార హక్కు చట్టాన్ని గ్రామాల్లోకి తీసుకొని వెళ్ళేందుకు ప్రభుత్వం తగినన్ని నిధులు సమాచార హక్కు చట్టానికి కేటాయించాలని, తగినంత మంది సిబ్బందిని ఏర్పాటుచేయాలని కోరారు. ఇప్పటికే ప్రచార మాద్యమాలు ఈ చట్టంపై ప్రత్యేక కథనాలతో ప్రజలను చైతన్య పరుస్తున్నాయని కూడా అన్నారు. జిల్లా కన్వీనర్‌ కోట ప్రసాదశివరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో ఉన్న సెక్షన్లను గురించి హాజరైన కార్యకర్తలకు వివరించారు. సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉన్నాయని, ఇందులో 6,7,8,9,11 సెక్షన్లు చాలా ముఖ్యమైనవని, వీటిని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని అన్నారు. చట్టంలోని మరితర ముఖ్యాంశాలను ఆయన సోదాహరణంగా వివరించారు.

కృష్ణాజిల్లాకు పూర్తిస్థాయి కమిటీని ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యకక్షులుగా జంపా క్రిష్ణ కిషోర్‌ (విజయవాడ), ఉపాధ్యకక్షులుగా అంకెం జితేంద్ర (మచిలీపట్నం), కర్లపాటి వెంకట శ్రీనివాసరావు (జగ్గయ్యపేట), ప్రధాన కార్యదర్శిగా కోట ప్రసాద శివరావు (విజయవాడ), కార్యదర్శులుగా పారేపల్లి సాయిబాబు (నందిగామ), బద్రి సుధారాణి (తిరువూరు), ఎన్‌.పురుషోత్తం బాబు (గుడివాడ), కోశాధికారిగా ఈదర రవీంద్రప్రసాద్‌ (పెనమలూరు) లతో పాటు దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (పోరంకి), అహల్యాదేవి (నూజివీడు), డా. వి.భవానీశంకర్‌ (మచిలీపట్నం), డా.బి.ఆర్‌.కె.రెడ్డి (విజయవాడ), డా.హేమసుందర్‌ (మచిలీపట్నం), తుర్లపాటి రామమోహనరావు (అవనిగడ్డ), జాన్‌పాల్‌ (నిడమానూరు), చింతాబత్తిన జేమ్స్‌బాబు (తిరువూరు), ఎం.ఎం.ఎం. మోహనరావు (విజయవాడ), ఆర్‌.ఎస్‌.నాయుడు (విజయవాడ), రమణ ప్రసాద్‌ (కంచికచర్ల), పల్లె జ్యోతి (వెలగలేరు), చిల్లపల్లి పార్వతి (గన్నవరం), బండ్ల సాంబశివరావు (న్యాయ విభాగం), కోట పిచ్చిబాబు (పెడన), వల్లూరు పూర్ణచంద్రరావు (విజయవాడ), గోగినేని శ్రీధర్‌ (విజయవాడ), మోత్కూరి వెంకటేశ్వరరావు (విజయవాడ), కళ్ళేపల్లి మధుసూధనరావు (విజయవాడ) తదితరులతో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పరచుకోవడమైనది.

అడ్వయిజరీ కమిటీ : ఎ.వి.అప్పారావు (విజయవాడ), వేములపల్లి వామనరావు (విజయవాడ), ఎం.ఆర్‌.ఎస్‌.ప్రకాశరావు (విజయవాడ), డి.సాంబశివరావు (విజయవాడ), చింతపల్లి వెంకటనారాయణ (కైకలూరు), ఎ.ఎస్‌.ఆర్‌.కృష్ణ (నూజివీడు), కొండపావులూరు ముఖర్జి (నూజివీడు), డా. సామల రమేష్‌బాబు (నడుస్తున్న చరిత్ర), డా. మద్దుకూరి విజయకుమార్‌ (గన్నవరం), టి.సి.కేశవరావు (విజయవాడ), డా.సి.హెచ్‌.సూర్యం (అవనిగడ్డ).

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక

ఎస్‌.పి.ఎస్‌.ఆర్‌. నెల్లూరుజిల్లా

తేది 29-5-2010న నెల్లూరు, కస్తూర్భా కళాక్షేత్రంలో గద్దె జోసఫ్‌ గారి అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశములో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానము జరిగినది. ఈ సమావేశమునకు వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి ప్రతినిధులు, న్యాయవాదులు, సమాజసేవకులు, సమాచార హక్కు ఉద్యమకారులు సుమారు 30 మంది హాజరైరి. గద్దె జోసఫ్‌ గారిని కన్వీనరు గాను, మరో ఆరు మందిని సభ్యులుగాను ఎన్నుకుంటూ తాత్కాలిక జిల్లా కమిటీ ఏర్పడినది.

తేది 4-6-2010న కన్వీనరు గద్దె జోసఫ్‌గారి అధ్యక్షతన తాత్కాలిక కమిటీ సమావేశము జరిగినది. ఈ సమావేశములో ఐక్యవేదిక జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు చేయవలసిన ఏర్పాట్లు, తేది నిర్ణయము, సభ నిర్వహణ ప్రదేశము ఆహ్వానించవలసిన అతిధులు మొదలగు విషయములపై చర్చ జరిగినది.

జిల్లా స్థాయి అవగాహనా సదస్సు నిర్వహణ గురించి తేది 15-6-2010, మరియు తేది 23-6-2010న రివ్యూ సమావేశములు జరిగినది.

తేది 27-6-2010 ఆదివారము ఉదయము 10 గంటలకు నెల్లూరు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అవగాహనా సదస్సు జరిగినది. దానికి కన్వీనరు గారైన గద్దె జోసఫ్‌ గారు అధ్యక్షత వహించిరి. ఈ సదస్సు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ శ్రీకాకాని గోవర్ధనరెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ జి.వి. జయరామయ్య గారు, సీనియర్‌ సివిల్‌ జడ్జి మరియు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీ జి. సత్యప్రభాకరరావు గారు విచ్చేసి స.హ. చట్టం యొక్క ఆవశ్యకతను ఉపయోగించుకోవలసిన విధానాన్ని, జరుగుతున్న జాప్యానికి గల కారణాలను, స.హ. చట్టం వల్ల కలిగే ఫలితాలను గూర్చి వివరించారు. రిసోర్సుపర్సన్‌ అయిన శ్రీ రాకేష్‌ గారు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా చట్టాన్ని గూర్చి సెక్షన్‌ వారీగా వివరిస్తూ, అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో వివరించి. ఈ సదస్సుకు సుమారు 200 మంది హాజరైరి. జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనములు ఏర్పాటు చేయబడినవి.

భోజనానంతరము ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనరు శ్రీ పుట్టా సురేంద్రబాబు గారు ఉద్యమ పుట్టుక, ఆవశ్యకత, జరుగుతున్న తీరును గూర్చి కక్షుణ్ణంగా వివరించిరి. తదుపరి జిల్లా స్థాయి కమిటీ ఎంపిక రాష్ట్ర కన్వీనరు గారి సమక్షంలో జరిగినది. శ్రీ అరిగెల నాగేంద్రసాయి (అడ్వకేటు) అధ్యకక్షులుగాను, గద్దె జోసఫ్‌ (అడ్వకేటు) ప్రధాన కార్యదర్శి గానూ, వై. సుమన్‌ ప్రచార కార్యదర్శిగాను, శ్రీ పి.యం. భాను గారు కోశాధికారిగాను ఎంపిక కాబడినారు. అలాగే ముగ్గురు ఉపాధ్యకక్షులు, ఐదుమంది కార్యదర్శులు, 32 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగాను, ఆరు మంది సలహా సంఘం సభ్యులుగాను ఎంపిక కాబడినారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు యన్‌. నారాయణ, గాలి శ్రీనివాసులు, యన్‌. సుబ్రమణ్యం, ఎ. శ్రీధర్‌బాబు, సుధీర్‌, సతీష్‌కుమార్‌, కె. శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు.

జనవిజ్ఞాన వేదిక ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సదస్సును జయప్రదం చేయడానికి విశేష కృషి సల్పినది.

తేది 3-7-2010 శనివారము నాడు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం, వింజమూరులో మండలస్థాయి స.హ. చట్టం విూద జిల్లాలో మొట్టమొదటి అవగాహనా సదస్సు వై.ఆర్‌. జూనియర్‌ కళాశాలలో జరిగినది. ఈ సదస్సుకు గ్రామీణ నవ నిర్మాణ వేదిక ఛైర్మన్‌ వి. నరేంద్రబాబుగారు అధ్యక్షత వహించిరి. ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె జోసఫ్‌, ఉపాధ్యకక్షులు జి. సుబ్బారెడ్డి, ప్రముఖ న్యాయవాది జి. సుభద్రాదేవి హాజరై స.హ. చట్టాన్ని గూర్చి వివరంగా వివరించిరి. కళాశాల కరస్పాండెంట్‌ బండి చిన రామలింగారెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపాల్‌ రామలింగారెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు విచ్చేసి వారి సందేశములనిచ్చిరి. ఈ సదస్సుకు కళాశాల విద్యార్ధులు, సిబ్బంది, గ్రామస్తులు, 100 మంది విచ్చేసి సభను జయప్రదము గావించిరి.

స.హ. చట్టం ప్రచార ఐక్య వేదిక నిర్మాణం - కర్నూలు జిల్లా

కర్నూలు పట్టణము నందు 6-6-2010 తేదీన కర్నూలు పట్టణము నుండి, ఇతర 3 మండలాల నుండి వచ్చిన సభ్యులు సమావేశమునకు హాజరు కావడం జరిగినది. ఆ యొక్క సమావేశమునకు ముఖ్య అతిధులుగా సత్యాన్వేషణ మండలి వ్యవస్థాపకులు పుట్టా సురేంద్రబాబు గారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యకక్షులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి గారలు పాల్గొని సమాచార హక్కు ప్రాధాన్యతను, ఉద్యమ నిర్మాణాన్ని గురించి మాట్లాడారు. 9 మందితో సన్నాహక కమిటీని ఏర్పరచి, కన్వీనర్‌గా ఎమ్‌. రామకృష్ణారెడ్డి గారిని ఎంపిక చేయటం జరిగింది. జె.వి.వి., లోక్‌సత్తా, ఎ.ఐ.వై.ఎఫ్‌., జె.డి.డబ్ల్యు.ఎ మొదలగు సంస్థల సభ్యులు పాల్గొనడం జరిగినది.

7-6-2010 తేదీన జరిగిన సన్నాహక కమిటీ సమావేశంలో 13-6-2010 తేదీన దూపాడు ప్రజా వైద్యశాల యందు సభ్యులు శిక్షణా శిబిరం జరుపుకోవాలని తీర్మానించుకొని దాదాపు 30 మంది సభ్యులు శిక్షణా శిబిరానికి హాజరు కావడం జరిగినది. సమాచార హక్కు చట్టంపై అవగాహన శిక్షణతో పాటు సమాజం కోసం మనం ఎందుకు పనిచేయాలి? పనిచేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎలా పనిచేయాలి? అనే విషయాలపై డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి గారు సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగినది. 27-6-2010 తేదీన జరిగే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా మహా సభను జరుపుకోవాలని, జిల్లా మహాసభను జయప్రదం చెయ్యడం కోసం 5000 కరపత్రాలను అచ్చువేయించి 18-6-2010 తేదీన నంద్యాల పార్లమెంటు పరిధిలోని 12 మండలాల్లోనూ, టాటా సుమో జీపుతో ప్రచారం చేయడం, 24-6-2010 తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలోని 13 మండలాలను టాటా సుమో జీపుతో ప్రచార కార్యక్రమము నిర్వహించటము జరిగినది. 26-6-2010 తేదీన నంద్యాల, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కలసిన ప్రజలను, వివిధ ప్రజా సంఘాల నాయకులను సెల్‌ఫోన్ల ద్వారా సంప్రదించి 27-6-2010 తేదీన జరిగే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా మహాసభను జయప్రదం చెయ్యాలని, ఆయొక్క మహాసభలో పాల్గొనాలని కోరటం జరిగినది.

27-6-2010 తేదీన స్థానిక పి.వో.డబ్ల్యు కర్నూలు ఆఫీసు నందు ఉదయం 11 గంటలకు స.హ.ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో 16 సంస్థల సభ్యులు, మేథావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్ధులతో జిల్లా మహాసభ ప్రారంభమైనది. ఆ సభకు ఎం. రామక్రిష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించడం, ముఖ్య అతిధులుగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి గారు, హైకోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీనివాస మాధవ్‌ గార్లు పాల్గొనడం జరిగినది.

డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని చైతన్యవంతులై తమ సమస్యల పరిష్కారాల కొరకు పోరాడే విధంగా వారిలో ఉద్యమ స్పూర్తిని కలిగించాలని, సమాజహితం కోరేవారు విడివిడిగా, బలహీనంగా ఉన్నారని, సమాజానికి కీడు చేసేవారు సమిష్టిగా, బలంగా వున్నారని, కాబట్టి కలసివచ్చే అంశాలపై కలిసి పనిచేసి సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై పోరాటం చెయ్యటానికి మనం సమాచార హక్కు చట్టం 2005 ను ఒక సాధనంగా వుపయోగించుకోవాలని, అందుకోసం ఈ వేదిక అవసరమైనదని, ప్రజలకు తమ కర్తవ్యాలను తెలియజేసి ఉద్యమింపజేయాలని సభ్యులకు ఉద్యమ స్పూర్తిని కలిగించడమైనది.

శ్రీనివాస మాధవ్‌ గారు మాట్లాడుతూ స.హ.చట్టం ప్రజలు సాధించుకున్న చట్టమని, దేశంలోని 5000 చట్టాలు వున్నా వాటి పనితీరు అసంతృప్తిగా వున్నదని, అలా కాకుండా స.హ.చట్టాన్ని రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే వున్నదని, ప్రజలు సమాచారాన్ని అడిగే హక్కుగా - ప్రభుత్వానికి చెప్పే బాధ్యతను ఈ చట్టం తెలియజేస్తున్నదని, కావున ప్రజలు పెద్దఎత్తున ఈ చట్టాన్ని ఉపయోగించుకొనే విధంగా ప్రజలను చైతన్యం చెయ్యడానికే ''సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక'' ఏర్పడటం జరిగినదని, ఈ వేదిక ప్రజలను చైతన్యపరిచి ప్రజలచేత సమాచారం కోసం దరఖాస్తులను ఎలా చేయించాలి ? సమాచారం ఎవరు అడగాలి ? సమాచారం అంటే ఏమిటి ? సమాచార హక్కు అంటే ఏమిటి ? సమాచారం కోసం ఎవరిని అడగాలి ? సమాచారంను ఏ రూపంలో పొందవచ్చు, ఎన్ని రోజుల లోపల సమాచారం ఇవ్వాలి ? దరఖాస్తు ఫీజు ఎంత ? సమాచారం రాకపోతే ఏమిచేయాలి ? ఎవరిని అడగాలి ? గడువులోపల సమాచారం ఇవ్వని అధికారులపై జరిమానా విధించే అధికారం, దరఖాస్తుదారునికి నష్టపరిహారం ఇప్పించే అధికారం సమాచార హక్కు కమీషన్‌కు ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా, జె.వి.వి., యంగ్‌ ఇండియా, ఎం.వి.ఫౌండేషన్‌, ఎ.ఐ.వై.ఎఫ్‌., జై భారత్‌, వి.పి.హెచ్‌.వి., జె.వి.డబ్ల్యు.ఎ., ఎం.ఆర్‌.పి.ఎస్‌., మాల మహానాడు, ముస్లిం యూత్‌ ఫెడరేషన్‌, సమాచార హక్కు పరిరక్షణ వేదిక, ఎయిడ్‌ ఇండియా, సి.ఆర్‌.పి.ఎఫ్‌. జె.ఆర్‌.డి.యి.ఎస్‌., ఎ.ఎఫ్‌.ఇ.ఎస్‌. మొదలగు సంస్థల నుండి సభ్యులు పాల్గొని జిల్లా మహాసభను జయప్రదం చేసి తదనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగినది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం

అధ్యకక్షులు : ఎం. రామకృష్ణారెడ్డి (జె.వి.వి.)- 9492569080

ఉపాధ్యకక్షులు : వై.ఎం. శ్రీకాంత్‌ లాల్‌ (సి.ఆర్‌.పి.ఎఫ్‌)

హరిహర రెడ్డి (ఎం.వి. ఫౌండేషన్‌)

వై. చంద్రబాబు (మాల మహానాడు)

పి. రామకృష్ణారెడ్డి (ఎఐవైఎఫ్‌)

ప్రధాన కార్యదర్శి : ఎన్‌.కె.జయన్న (లోక్‌సత్తా) - 9989245817

సహాయ కార్యదర్శులు : కె.వి. కుమార్‌ (యంగ్‌ ఇండియా)

బి. ఎల్లప్ప (విపిహెచ్‌వి) (పి.హెచ్‌)

ప్రేమరాజు (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

ఎస్‌.పి.నరసింహుడు (జెడిడబ్ల్యుఎ) (పి.హెచ్‌)

కోశాధికారి : అరుణ కుమారి (సమతా)

కార్యవర్గ సభ్యులు :

1. పి. సావిత్రమ్మ (యంగ్‌ ఇండియా ప్రాజెక్టు)

2. ఎం. వెంకటేశ్వర్లు (యంగ్‌ ఇండియా ప్రాజెక్టు)

3. జి.శేషమ్మ (యంగ్‌ ఇండియా ప్రాజెక్టు)

4. కె.ఎస్‌.లక్ష్మి (యంగ్‌ ఇండియా ప్రాజెక్టు)

5. కె. జగదీష్‌ (ఎయిడ్‌ ఇండియా)

6. లక్ష్మీ నారాయణ (ఎం.వి.ఫౌండేషన్‌)

7. కృష్ణ (ఎం.వి.ఫౌండేషన్‌)

8. సుదర్శన్‌ (ఎఐవైఎఫ్‌)

9. జి. రవిరాజు (ఎఐవైఎఫ్‌)

10. ఎన్‌. బాలు (ఎఐవైఎఫ్‌)

11. అశోక్‌ (ఆశా ఫర్‌ ఎడ్యుకేషనల్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటి)

12. శ్రీనివాసులు (ఆశా ఫర్‌ ఎడ్యుకేషనల్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటి)

13. ఎల్ల మధు (ఆశా ఫర్‌ ఎడ్యుకేషనల్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటి)

14. పి. రహమాన్‌ (జె.వి.వి.)

15. పి. రామకృష్ణ (జె.వి.వి.)

16. పి.ఎం. రంగస్వామి (జె.వి.వి.)

17. మాగంటేశ్వరప్ప (జె.వి.వి.)

18. బి. రాజేంద్రప్రసాద్‌ (ఎం.బి.సి.ఎస్‌)

19. శేషగిరి (ఎం.బి.సి.ఎస్‌)

20. సుధాకర్‌ (జెడిడబ్ల్యుఎ) (పి.హెచ్‌)

21. హిమబిందు (జెడిడబ్ల్యుఎ) (పి.హెచ్‌)

22. ఆంజనేయులు (జెడిడబ్ల్యుఎ) (పి.హెచ్‌)

23. ఎ. జంబన్న (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

24. దర్గయ్య (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

25. పుల్లయ్య (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

26. తిరుపాలు (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

27. బాబూరావు (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

28. వెంకటేశ్వర్లు (ఎం.ఆర్‌.పి.ఎస్‌)

29. కె. వెంకటేశ్వర్లు (వి.పి.హెచ్‌.వి.) (పి.హెచ్‌)

30. సురేష్‌ (వి.పి.హెచ్‌.వి.) (పి.హెచ్‌)

31. విశ్వనాధ్‌ (వి.పి.హెచ్‌.వి.) (పి.హెచ్‌)

32. రవికుమార్‌ (వి.పి.హెచ్‌.వి.) (పి.హెచ్‌)

33. రంగస్వామి (వి.పి.హెచ్‌.వి.) (పి.హెచ్‌)

34. డి.ఎస్‌. అహ్మద్‌ (ముస్లిం యూత్‌ ఫెడరేషన్‌)

35. సుందర్‌రావు (జీవన్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ)

36. వై.ఎన్‌.ఎల్‌. మూర్తి (ఎం.ఎం.నాడు)

37. వై. అయ్యన్న (ఎం.ఎం.నాడు)

38. జి. ప్రసాద్‌ (ఎం.ఎం.నాడు)

39. బి. శ్రీను (ఎం.ఎం.నాడు)

40. కె. జాన్సన్‌ (ఎం.ఎం.నాడు)

41. యూసఫ్‌ ఆఫ్తాబ్‌ (లోక్‌సత్తా)

42. ఎన్‌. పరమేశ్వరుడు (లోక్‌సత్తా)

43. అశోక్‌ (లోక్‌సత్తా)

44. బుడ్డన్న (లోక్‌సత్తా)

45. జాన్‌ (లోక్‌సత్తా)

46. రాధాకృష్ణ (లోక్‌సత్తా)

47. సయ్యద్‌ రఫి (లోక్‌సత్తా)

48. తిప్పన్న (జై భారత్‌)

జూన్‌ నెల ఐక్యవేదిక యత్నాలు

1. ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (అపార్డు) అనే ప్రభుత్వ శాఖ వారితో కలిసి ఆర్‌.టి.ఐ. విూద అవగాహన, శిక్షణా తరగతులు నిర్వహించే విషయమై సంభాషణలు జరిగాయి. వారు అనుకూలంగానే స్పందించారు. కార్యక్రమానికి రూపకల్పన చేసుకోవలసి ఉంది.

2. సమాచార కమీషన్‌ నూతన కమీషనర్ల నియామకం త్వరలో జరగవలసి ఉంది. ఆ విషయంలో చట్టం అనుమతించిన మేర 1+10 కమీషనర్లను నియమించాల్సిందిగా రాజకీయ పార్టీల ద్వారా, సభ్య సంస్థల ద్వారా, ప్రజల ద్వారా ప్రభుత్వం విూద వత్తిడి తెచ్చే యత్నాలు చేశాము, చేస్తున్నాము.

ముఖ్య గమనిక : ఈ సమాచారం అందిన మీరున్నూ అవినీతి నిర్మూలనోద్యమంలో మీవంతు బాధ్యతగా కమీషనర్లను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీకి (ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు మరియు సమాచార శాఖామంత్రి గీతారెడ్డి గారికి) ఉత్తరాలు వ్రాయండి. అనేక మందిచేత రాయించండి.

3. జూలై 6 నుండి 12 వరకు మిర్యాలగూడ లోని డాక్టర్‌ మువ్వా రామారావు గారి ఆధ్వర్యంలో (జ్యోతి హాస్పటల్‌) స.హ. చట్టం మరియు ప్రాథమిక ఆరోగ్యం, విద్యుత్‌ పొదుపు తదితర విషయాలపై పాటలను రికార్డు చేసే వర్కుషాపు పెట్టుకున్నాము.

4. ఇప్పటికే ఉద్యమ ప్రచార విభాగం ద్వారా ''ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక చేపట్టిన ఉద్యమం'' ఆరంభయత్నాలు అన్న పుస్తకం, ''సమాచార హక్కు చట్టం'' అనే పుస్తకాన్ని ప్రచురించగలిగాము. క్రమంగా ఉద్యమ భావజాలానికి సంబంధించిన రచనలను ప్రచురించనున్నాము.

5. జూలై 23,24,25 తేదీలలో సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయంలో (దోరకుంట - కొదాడ) ఐక్య వేదికకు చెందిన యిరు పార్శ్వాలైన ఉద్యమ నిర్మాణం, స.హ.చట్టం అనే రెండు అంశాలపై ప్రసంగీకులను తయారు చేసుకొనే వర్కుషాప్‌ జరుపబోతున్నాము.

(గమనిక : మీ మీ జిల్లాల నుండి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు వరకు వక్తలు కాగోరుతున్నవారు దానిలో పాల్గొనండి. ఆ తరగతులకు వచ్చేవారు ముందుగానే మన రెండు రచనలను చదువుకొని రావాలి.)

6. రాష్ట్ర స్థాయిలో ప్రధమ విడతగా ఉద్యమ మూల నిధిని ఏర్పరచుకొనే ప్రయత్నం జరుగుతోంది. ఆరంభ నిధిగా ఒక 50 లక్షలు సమకూడితే ఉద్యమ కార్యానికి ఆటంకం లేకుండా వుంటుంది. 2014వ సంవత్సరం వరకు చేయ సంకల్పించిన ఉద్యమానికి ముందుగా కనీసం ఒక సంవత్సరం పాటు అంతరాయాలు లేకుండా సాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్యుకోవలసి వుంది. అటుపై మలిథ యత్నాలు చేసుకోవచ్చు.

(గమనిక :ఈ సంచికలో ఆర్థిక వనరుల ఏర్పాటుకై చేసిన విజ్ఞప్తి ఉంది. మనసు పెట్టి దానిని చదివి, విజ్ఞతగల మరియు మందిబాగు కోరగల పౌరులుగా మీవంతు భాగస్వామ్యాన్ని అందించండి.)

త్రిసభ్య కమిటీకి రాసే ఉత్తరాల నమూనా

విషయం : సమాచార కమీషనర్లు నియామకం గురించి.

1. ప్రజలకు బలాన్నివ్వటానికి పుట్టిన స.హ. చట్టం అమలులో కమీషనర్ల పాత్ర చాలా కీలకమైనది. చట్ట నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఆలోచించే కమీషనర్ల సంఖ్య 1+10 వరకు ఉండే వీలు కల్పించారు. మనది పెద్ద రాష్ట్రము. అందులోనూ ఊడలు దిగిన అవినీతితో కూడిన ప్రభుత్వ కార్యాలయాలు, అధికార యంత్రాంగము ఆరెంటిలో చట్టం ఆశించిన మేర పారదర్శకతను, జవాబుదారీతనమును ఆచరణలోకి తేవాలంటే యోగ్యులు, సమర్ధులైన తగినంత మంది కమీషనర్లు ఉండితీరాలి.

ఒక వంక వందల, వేల కోట్ల దుర్వినియోగం, కుంభకోణాలు జరుగుతుండగా 10 మంది కమీషనర్ల జీతభత్యాలకు, స.హ.చట్ట ప్రచారానికి నిధులు లేవు అనడం కంటే సిగ్గుచేటు ఇంకేమి ఉండదు. మీరు సమాజం కోసం బ్రతికిన పెద్దతరం రాజకీయ నాయకులతోనూ కలిసి నడిచినవారేకాక, ఈ తరం రాజకీయాలను చాలా చూస్తున్నారు. వయసులోనూ పెద్దవారు. ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూర్చగల ఈ చట్టానికి బలాన్నిచ్చే విధంగా పూర్తి సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా కమీషనర్లను ఎంపిక చేసి చరిత్రలో ప్రజల హృదయాలలో చిరస్తాయిగా నిలిచిపోగలరు.

విజ్ఞతకో విజ్ఞప్తి

సమాజం బాగుండాలన్న నిజమైన ఆకాంక్ష, ఆ దిశగా జరిగే కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు సిద్ధపడే హృదయము, ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు వున్న వారిని దృష్టి నిడుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నాము.

గత 30 ఏళ్ళ పైబడి సత్యాన్వేషణ మండలి సమాజ హిత కార్యాలను శక్తివంచన లేకుండా చేస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే గత 20 ఏళ్ళుగా మాసపత్రికను ప్రచురిస్తూ వస్తోంది. పత్రికను 15 ఏండ్ల పాటు ఉచితంగానే అందరకూ పంపుతూ వచ్చాము. ఇప్పటికిన్నీ నామమాత్రపు చందాను నిర్ణయించినా చందా పంపినా, పంపకున్నా పత్రికను పంపుతూనే వస్తున్నాము. ఇది పాఠకులైన విూ అందరకు తెలిసివున్న విషయమే.

మండలికి సంస్థాగతంగా ఒక నియమం వుంది. ''ప్రజలను విరాళాలు అడుగవద్దు - ఇచ్చినా తీసుకోవద్దు'' అని. చేయగల శక్తి ఉన్నంతలో మనమే సమాజానికి రుణం చెల్లించుకుని పనిచేద్దాం. ఇదే ఆ నియమం. ఇప్పటి వరకు అంటే 35 ఏండ్ల పైబడి ఆ నియమాన్ని నిజాయితీగా పాటిస్తూ వచ్చాము. మండలి సంబంధంగా మండలి ఉన్నంత కాలం ఆ నియమం ఉంటుంది.

మండలితో పరిచయాలు, సాన్నిహిత్యం వున్నా ఎందరో ఎన్నోసార్లు తామూ మండలికి, మండలి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయాలనుందన్న అభిలాషను వ్యక్తం చేశారు. అట్టి వాటినన్నింటినీ మేము మర్యాదపూర్వకంగానే తిరస్కరిస్తూ వచ్చాము. ఆర్థికాంశాల్లో మండలి వైఖరికి చెందిన నిజమిది.

ఈనాడు ''సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక'' పేరున సామాజిక హిత కాంక్షగల అనేక స్వచ్ఛంద సంస్థలు ఒకటై సమాజ పునర్నిర్మాణ దిశగా ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేయడానికి పూనుకున్నాయి. ఉద్యమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం వివేక పథం సంచికల ద్వారా మీకు అందించాము. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక చేపట్టిన ప్రజా ఉద్యమం పేరున ఒక పుస్తకాన్ని, సమాచార హక్కు చట్టాన్ని గురించిన మరో పుస్తకాన్ని ప్రచురించాము. రాష్ట్రాన్ని ఒక మొత్తంగా (యూనిట్‌గా) తీసుకుని ప్రారంభించిన ఈ ఉద్యమానికి వేల సంఖ్యలో కార్యకర్తలు, లక్షల సంఖ్యలో సమాజం బాగు కోసం నేనూ ముందుంటాను అనే మంచి మనుషులు అవసరపడతారు. క్రమంగా జిల్లా, మండల స్థాయి కమిటీలేగాక గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు కావలసి ఉంది. 25 వేల గ్రామాలకు, వందల సంఖ్యలో మున్సిపాలిటీలకు ఉద్యమాన్ని విస్తరింపచేయాలంటేను ప్రజలను అవగాహనా పరులను చేయాలంటేను పెద్దఎత్తున దీర్ఘకాలం పాటు భావజాల వ్యాప్తికొరకై ప్రచారం చేయాల్సి ఉంటుంది. ప్రచార సామాగ్రికే కొన్ని కోట్ల రూపాయలు అవసరపడతాయి.

ఇది ఒక సత్యాన్వేషణ మండలికి గాని, ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థలు మాత్రమే గాని చేయగలిగింది కాదు. కనుక దీనికి ప్రజల నుండే పెద్దఎత్తున స్పందన రావలసి ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం నుండే ప్రజలు ఉద్యమానికి తమ వంతు చేయూత నిచ్చినప్పుడే ఇట్టి పెద్ద పనులు కుంటుపడకుండా సాగగలుగుతాయి.

అనర్హులకు దానం చేసినా, అకాలంలో దానం చేసినా అది అపాత్రదానమే అవుతుంది. అపాత్రదానం చేయడం చేయకూడని పనే. అర్హులకు దానం చెయ్యక పోవడం సకాలంలో అవసరమైనప్పుడు దానం చెయ్యకపోవడమూ చేయకూడని పనే. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయడానికి స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను రాబట్టడానికి మనస్సు, పట్టుదల కల ఎందరో మంచివాళ్ళు పూనుకున్న ఈ వేదిక ఏ మాత్రం అనర్హమైనది కాదు. ఖచ్చితంగా అర్హమైనదే. అలాగే ఎంతో వ్యయంతో కూడుకున్న ఈ పనికి ఈ సమయంలో చేయినందించడం, సకాలంలో తోడుపడడమే అవుతుంది.

శక్తికి మించిన దాతృత్వం తనకు మాలిన ధర్మం అవుతుంది. శక్తి ఉండి మంచి పనికి తోడ్పడక పోవడం లోభితనం అవుతుంది. కనుక అదీ అధర్మమే. కనుక వివేకవంతులైన మీరంతా మీ అంతరాత్మ సాక్షిగా మీ మీ శక్తి ననుసరించి (శక్తికి మించకుండా) అందించగల ఆర్ధిక సహకారాన్ని అందించండి.

మా వరకు మేము మా మా మానసిక, శారీరక శక్తులను, కాలాన్ని మాత్రమే గాక మాకున్న ఆర్థిక వనరులను కూడా కొంత వరకు ఈ మహాయత్నంలో వినియోగించటానికి సిద్ధపడి వినియోగిస్తూనూ వస్తున్నాము. మీరూ ఈ ఉద్యమానికి వనరుగా ఉండటమే గాక మీ మీ పరిచయాలలో వున్న వారి సహకారం అందించేలా ప్రేరణ కలిగించాల్సిందిగా కోరుతున్నాము. నిజానికిది మా వైపు నుండి అభ్యర్ధనే అయినా ఆ కార్యక్రమానికున్న విలువ దృష్ట్యా దాతృత్వం కల మంచివారందరకు ఒక సరైన, చక్కని అవకాశం కూడా.

నేరుగా డబ్బులు రూపంలో కాకుండా వాగ్దానాలు చేయండి. ఉద్యమ మహాయత్నం నిరంతరాయంగా సాగాలంటే ఆర్థిక వనరులు రావడానికి నిరంతరాయత ఉండాలి. ఇదొక వాస్తవం. తాత్కాలిక కాలావధిగా నాలుగేండ్ల పాటు సాగించాలనుకున్న ఈ మహా యత్నానికి అంతకాలమూ ఆర్థిక వనరులు అవసరం వుంటుంది. అదీగాక ఆర్థికాంశాలు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత అవకతవకలు చోటుచేసుకొనే అవకాశాలు చోటుచేసుకుంటాయని అనుభవాలు చెబుతున్నాయి. కనుక అట్టివి జరుగకుండా చూడటానికి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవలసి ఉంది.

ఈ రెండు కారణాల రీత్యా వదాన్యుల నుండి ప్రధానంగా వాగ్దానాలనే ఆహ్వానిస్తున్నాము. అదిన్నీ నిర్ణీత అవధుల్లో, నిర్ణీత పరిమాణంలో సహకారం అందించడానికి వాగ్దానం చెయ్యమంటున్నాం.

1. నెలకింత గాని, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఇంతని గాని డబ్బు రూపంలో వాగ్దానం.

2. జిల్లా కార్యాలయానికి అద్దె భరించడం. 6 నెలలు లేదా సంవత్సర చొప్పున వాగ్దానం.

3. జిల్లా బాధ్యతలు నిర్వర్తించే వారు పూర్తి సమయాన్నిచ్చే వారై యుంటారు. వారికి గౌరవ వేతనం.

4. ప్రచారానికి కనీసం 12 వాహనాలు అవసరపడతాయి. వాహనాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వవచ్చు. ఉద్యమ కార్యం పూర్తయ్యాక ఆ వాహనం వారికే చెందుతుంది.

5. వాహనానికి అయ్యే ఇంధన వ్యయం భరించడానికి వాగ్దానం చెయ్యొచ్చు.

6. పుస్తక ప్రచురణ, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, సి.డి.లు వగైరా ప్రచార సామాగ్రి వ్యయం.

7. సభలు సమావేశాలు జరుపుకొనేందుకు అయ్యే వ్యయం (ఏర్పాట్లకు, భోజనాలకు వగైరా)

8. కేబుల్‌ టి.వి., సినిమా హాలు, సమావేశ మందిరం యజమానులు వాటిద్వారా ప్రచారానికి చేయూతనివ్వడం.

9. కుటుంబ పోషణ బాధ్యతగల పూర్తి సమయాన్నిచ్చే కార్యకర్తలకు కుటుంబ పోషణకై నెలవారీ కనీస వేతనం ఇవ్వడం కొరకు.

10. డబ్బులు మాకిచ్చి ఊరుకోవడం గాక మీరే మీ చేతుల మీదుగానే ఆయా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను గమనిస్తూ ఆర్థిక సాయం అందించండి.

(ముఖ్య గమనిక : ప్రతి ఉద్యమానికి రెండు రకాల వనరులుండటం తప్పనిసరి. ఒకటి మానవ వనరులు, 2. ఆర్థిక వనరులు. ఈ రెండింటిలో దేనిలోనైనా మీరంతా భాగస్వాములు కండి. నిజాయితీతో ఆలోచిస్తే పౌరులందరి పైనా సమాజాభివృద్ధికి ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత ఉందన్నది తెలుస్తున్నది.)

''సొంత లాభం కొంత మానుకు ఇంత మేల్‌ తలపెట్టవోయ్‌'' అన్నది అన్ని కాలాలకు వర్తించే మాట. ఒక్క నిజం చెప్పనా ! వేల ఏండ్లుగా వివిధ మత సంస్థలు ఆర్థిక ఇబ్బందులేమీ లేకుండానే గాక ఎంతో సంపదతోనూ కొనసాగగలుగుతున్నాయి. కారణం ఏమిటంటారు ? ఆ మతానుయాయి తన ఆదాయంలో ఇంత శాతం అంటూ మతానికి కేటాయించే విధానం అమలులో ఉండటమే. ముఖ్యంగా క్రైస్తవం 10 శాతం, ఇస్లాం 2.5 శాతం, విశ్వాసిని దైవ కార్యానికై త్యాగం చెయ్యమంటున్నాయి. నిజానికి సాంఘిక జీవనం గడుపుతున్న ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వవలసిన వారుగానే ఉంటాడు. విూరూ సమాజం బాగుండాలని నిజంగా కోరుకున్న వారైతే, మీ మీ ఆదాయాల నుండి ఎంతో కొంత శాతం, 1 నుండి 10 శాతం వరకు ప్రజోపయోగకరమైన పనులకు కేటాయించ గలిగితే మంచి పనులకు నిధుల కొరత ఉండనే ఉండదు. అయితే ఇక్కడ జాగరూకత వహించాల్సింది మనమందించిన సాయం మంచి పనులకే వినియోగం అవుతుందా ? లేక మంచి పనుల పేరిట స్వాహా చేయబడుతుందా ? అన్నది చూసుకోవలసి ఉంది. పాత్రదానం చేసితీరాలి. అపాత్రదానం చెయ్య కూడదు. పెద్దల మాటకు అర్ధమిదే. మీ నికరాదాయంలో ఎంత శాతం సమాజ కార్యానికై వెచ్చించ గలరో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించండి.

No comments:

Post a Comment