ముఖ్య గమనిక :
సామాజిక నియంత్రణ స్థానాలలోనికి సుశికక్షుతులు, సామాజిక సృహకలిగిన వారిని ప్రవేశపెట్టాలని సత్యాన్వేషణ మండలి తాత్విక భావజాలంలోని ఒక ముఖ్యమైన భావన. రాజకీయ క్షేత్రము, ప్రభుత్వ నిర్వహణ విభాగము, విద్య, వైద్య రంగాలు, మంచి సమాజం కోసం పాటుపడే రంగాలు, నియంత్రణ స్థానాలలోనూ కీలకమైనవి. అందులోనూ పాలన, నిర్వహణ, ప్రజా చైతన్య క్షేత్రాలు అత్యంత కీలకమైనవి. కనుక ఆ మూడు స్థానాలలోకి సామాజిక సృహ, కార్యదక్షత కల వ్యక్తుల్ని ప్రవేశ పెట్టాలన్న పనిపెట్టుకుంది సత్యాన్వేషణ మండలి. ఐక్య మిత్రమండలి లోని కొందరు అనుభవజ్ఞులు కూడా దీని అవసరాన్ని గుర్తించి ఈ విషయంలో కొంత కృషిచేద్ధాం అన్న నిర్ణయానికి వచ్చారు. ముందుగా నిర్వహణ భాగంలోకి కొందరిని సిద్ధం చేద్దాం అనుకోవడం జరిగింది. ఆ పనిలో భాగంగా ఉద్యమ కుటుంబాల నుండి అంటే మన పిల్లల్నే సివిల్స్ పరీక్షలకు సిద్ధం చేద్దామనుకున్నాము. ఇప్పటికే గోపీచంద్‌గారబ్బాయి రవికిరణ్ (సురేంద్ర) మా అబ్బాయి విమలాదిత్య సివిల్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. మరికొందరు అందుకు సిద్ధమవుతున్నారు. సత్యాన్వేషణ మండలి కార్యదర్శి కోట ప్రసాద్ కుమార్తె దివ్య, బ్రహ్మారెడ్డి గారు పంపిన అరుణ అన్న ఇద్దరూ సివిల్స్ చదువుతున్నారు. సామాజిక సృహకలిగిన ఉత్సాహవంతుల్ని మరికొందర్ని ఇందుకు సిద్ధం చేయాలన్న ఉద్దేశ్యంతో పత్రిక ద్వారా ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాము. నీతివంతమైన జీవితము, సామాజిక సేవ అన్న రెంటినీ బలంగా ఇష్టపడే వాళ్ళు ఒక బృందంగా కృషిచేస్తే బాగుంటుంది అన్నదే ఈ ప్రకటన వెనుక మా ఉద్దేశ్యము. దీనిపై స్పందించాలనుకున్న వారు సత్యాన్వేషణ మండలితో సంపర్కములోకి రావచ్చు. మండలిని సంప్రదించవచ్చు. పాఠకులు, మిత్ర సంస్థలు ఈ ప్రకటనపై శ్రద్ధపెట్టి ఆలోచించగలరని ఆశిస్తున్నాము.
- మీ సత్యాన్వేసణ మండలి
నివేదన - వేదన - నిష్టూరము
యోచనాశీలురైన పాఠక మిత్రులారా !
గత సంచికలో (జూన్, జూలై 167-168 సంచిక) విజ్ఞతకో విజ్ఞప్తి అన్న పేరున మీ ముందుకో విషయాన్ని తెచ్చాను. ఆ నా నివేదనకు కనీస స్పందన కూడా రాకపోవడం నన్నెంతో వేదనకు లోనుచేసింది. పత్రిక గత 20 ఏండ్లుగా ప్రజలలో ఏ అవగాహన పెంచడానికి కృషిచేస్తూ వచ్చిందో, ప్రజలను ఏ దిశగా కదిలించడానికి యత్నిస్తూ వచ్చిందో, ఆ అవగాహన కాని, ఆ దిశగా కదలిక గాని కనీస స్థాయిలోనైనా కలిగించలేక పోయామా? అన్న ప్రశ్న నన్ను అతితీవ్రంగా కలచివేసింది. ఎంతో నిబద్దతతో, శక్తికి మించీ చేసిన శ్రమ వ్యర్ధమై పోయినప్పుడు వ్యక్తిలో కలిగే ఆవేశము, నిర్వేదమూ రెండూ నాలో మెదలాడాయి. ఎవరి స్వేచ్ఛ వారిది. ఎవరి పరిమితులు వారివి అన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు కనుక ఈ విషయంలో మిమ్ములను నేననుకున్న దిశగా నియంత్రించడం ఎలాగూ కుదరదు. కానీ నాకున్న స్వేచ్ఛను మాత్రం వాడుకోగలను.
గత సంచికలోని నా విజ్ఞప్తికి మీరు స్పందించలేదంటే , ఒకటి.. పత్రికను చదవకుండానే అవతల పారేస్తున్న వారైనా అయి ఉండాలి. చదివి ఆవల పారేస్తున్న వారైనా అయిఉండాలి. ఈ రెండు పనులు పత్రిక పంపుతున్న వాళ్ళు పడుతున్న శ్రమరీత్యా గానీ, పత్రికలోని విషయాల విలువ రీత్యా గాని చాలా నిందించాల్సిన పోకడలు. సంఘ జీవిగా, మంచి పౌరునిగా, వివేకవంతునిగా ఒక వ్యక్తి చేయలేని, చేయకూడని పనులు. కానీ అది జరిగింది. కనుక నిరర్ధక శ్రమగా తీసుకున్నా, అనర్హులకు పంపడం సరికాదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నా, అవసరం లేని వాళ్ళకు అందించడం తెలివి తక్కువ పని అనుకున్నా పత్రిక పంపకుండడం మేలు. మండలికున్న ఆర్థిక వనరులు తేరగా వచ్చినవీ కాదు. మండలి ఈ పని తిన్నదరక్క చేస్తున్నదీ కాదు. ఈ అన్ని కారణాల వల్ల నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ విషయం మీకు తెలియజేయడం ఉచితము, బాధ్యత కూడా. కనుక ఈ ఆఖరి సంచిక మీకు పంపుతున్నాను. ఇకపై వివేక పథం మీకు పంపబడదు. మీ కాలాన్ని, స్వేచ్ఛననుసరించి, వివేక స్థాయిననుసరించి దీనిపై స్పందించండి. ఇది ఎంతో వేదనతో నానుండి వచ్చిన నిష్టూరము. ఉంటాను... సెలవు ..
- సత్యాన్వేషణలో మీ సురేంద్ర
గమనిక : ఇప్పటికే సంవత్సర చందాలు పంపిన వారు తమ వివరాలను కార్డుద్వారా తెలిపినచో వారికి కొనసాగించబడుతుందని మనవి.
ఉద్యమ సమాచారం
సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికలో ఉన్న, మరియు ఉండాలనుకుంటున్న యోచనాపరులకు :
ఉద్యమ మిత్రులారా !
ఐక్య వేదిక ఉద్యమ నిర్మాణ కార్యక్రమాలు ఆరోగ్యంగా ముందడుగు వేస్తూ వస్తున్నాయి. గత సంచిక ద్వారా, మీకందిన వివరాల తర్వాత జిల్లా కమిటీలు జూలై 25 నాటికి మరో మూడు జరిగాయి. జూలై 11న ప్రకాశం, గుంటూరు జిల్లా కమిటీలు ఏర్పడగా, 25న పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఏర్పడింది. ఆగస్టు 15 లోపల, జూలై 28న రంగా రెడ్డి, ఆగస్టు 10న తిరుపతి, ఆగస్టు 12న నల్గొండ, ఆగస్టు 14న నిజామాబాద్ జరుపుకోవాల్సి ఉంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, తూర్పుగోదావరి, మెదక్, అనంతపూర్‌లు తొలి విడత కార్యక్రమంలోనే వున్నాయి. ఆగస్టు నెలాఖరుకు జిల్లా కమిటీల పని పూర్తిచేయాలన్నది రాష్ట్ర కమిటీ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ లక్ష్యం సక్రమంగా నెరవేరాలంటే ఆయా జిల్లాల బాధ్యత తీసుకున్న సంస్థలు, స్థానికంగా వున్న మిత్ర సంస్థలను, కలసి రాగలవారిని కలుపుకొని గట్టిగా పూనుకోవలసి ఉంది. ఈ కబురు అందుకున్న వివేక పథం పాఠకులలోనూ ఎవరికైనా ఈ ఉద్యమంలో పాల్గొనాలని వున్నా, కనీసం స.హ.చట్టం ప్రచారం కొరకు ఇష్టమున్నా వెంటనే ఐక్య వేదికతో సంప్రదించండి. ఈ విషయంలో మాతో సంబంధాలు ఏర్పరచుకోనివారికి పై నెల నుండి వివేకపథం పంపడం కుదరదు. కనుక పత్రిక ద్వారా విడుదలయ్యే సమాచారం అందదు. కనుక ఏది మంచిదని తోస్తే ఆపని చెయ్యండి. ఐక్య వేదిక జిల్లా బాధ్యులు ఈ పత్రిక అందిన వెంటనే మీ మీ జిల్లాలో వివేకపథం పంపవలసిన వారి చిరునామాల లిస్టు మాకు పంపండి. ఇది తక్షణం జరగాల్సిన పని.
ఆగస్టు 15 నుండి 'స.హ.చట్ట వినియోగం' అన్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాపితంగా ఒక క్రమాన్ననుసరించి ఆరంభించుకుంటున్నాము. అందుకు సన్నద్దులుగా వుండండి. ఇది జరిగితే ఉద్యమ నిర్మాణపు తొలిథ యత్నాలు చాలావరకు పూర్తయి, ఉద్యమ కార్యాచరణ తొలిథ యత్నాలు ఆరంభమైనట్లు. దీనితోపాటే ఉద్యమ మలిథ యత్నాలు ఆరంభించుకోవలసి ఉంది. ఉద్యమ మలిథ యత్నాలు సమర్ధవంతంగా చేయగలగాలంటే అవగాహన, కార్యకుశలత గల మరింత మంది కార్యకర్తలు అవసరపడతారు. అందుకై అధ్యయన శిక్షణా తరగతులు వెంటనే నిర్వహించుకోవలసిన అవసరముంది. ఇప్పటికే అటు బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇటు సత్యాన్వేషణ మండలి కేంద్రంలోనూ శిక్షణా తరగతులు ఆరంభించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి జిల్లాలకు 10 మంది శిక్షణ పొందిన ప్రసంగీకుల అవసరం ఉంది. కనుక మీ మీ జిల్లాల నుండి (ప్రతి సంస్థ నుండి ఒక్కరైనా ఉండేలా) ఇట్టి వారిని ఎంపిక చేసి కేంద్రానికి తెలియపరచినచో ఏ జిల్లాకు ఆ జిల్లాలో గాని, రెండు మూడు జిల్లాలకొక చోట గాని శిక్షణా తరగతులు నిర్వహించుకోవచ్చును. శిక్షణ మూడు రోజులైతే బాగుంటుంది. రెండు రోజులకు తక్కువైతే అంతగా ప్రయోజనముండదు.
ఆ యా జిల్లాల బాధ్యులు, ఐక్యవేదికలోని భాగస్వామ్య పక్షాల ముఖ్యులు ఈ విషయంపై దృష్టిపెట్టి శిక్షణకు తగిన వ్యక్తుల్ని ఎంపిక చెయ్యవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ఉద్యమ నిర్మాణ మలిథ కార్యక్రమాల క్రిందికి పట్టణ కమిటీలు వెయ్యడం, అటుపై మండల కమిటీలు వెయ్యడం అన్న లక్ష్యాలు ఉన్నాయి. మున్సిపాలిటీల ఎన్నిక గడువు సమీపిస్తోంది కనుక ముందుగా జిల్లాల్లోని మున్సిపాలిటీలలో పట్టణ కమిటీల పని పూర్తిచేయాలి. కమిటీ నిర్మాణంలో అనుసరించాల్సిన సాధారణ విధానం జిల్లా కమిటీల విధానమే. పట్టణాలలోని ప్రతి వార్డు ప్రాతినిధ్యం ఉండేలా పట్టణ కమిటీ ఏర్పడాలి. అందుండి ప్రధాన బాధ్యుల (కార్య నిర్వాహక వర్గపు) ఎంపిక జరగాలి. ప్రధాన బాధ్యులు పట్టణ కార్యక్రమాలకు తగినంత సమయం ఇవ్వగలిగి ఉండాలి. అటుపై మండల కమిటీల ఏర్పాటు మొదలెట్టాలి. తగినన్ని మానవ వనరులున్న తావున రెండూ చేయవచ్చు.
ఒక సంతోషకర వార్త :
అపార్టు (గ్రామీణాభివృద్ధి సంస్థ శిక్షణాలయం వారి)తో జూలై 28న ఒక మౌఖిక ఒప్పందానికి వచ్చాము. దానిని మరింత నిర్ధిష్ట రూపంలో వ్రాత మూలకంగా స్థిరపరుచుకోవలసి ఉంది. ఆ సంస్ధ కమీషనర్ ఫణికుమార్ గారు, డిప్యూటి డైరెక్టర్ కుమార్ రాజా గారు ఇరువురూ మనలా సామాజిక స్పృహ కలిగిన వారై ఉండటం మాకెంతో సంతోషాన్ని, బలాన్ని కలిగించింది. చేయగలంతమంది కలసి చేద్దాం అన్న భావాన్ని వారు వెలిబుచ్చారు. మన పక్షం నుండి రామకృష్ణం రాజు గారు, బ్రహ్మారెడ్డిగారు, రాజేంద్రప్రసాద్ (ఎం.వి.ఎఫ్) గారు, క్రిష్ణ కిషోర్, నేను పాల్గొన్నాము. సమావేశం ఇరు పక్షాల వారికి సంతృప్తినిచ్చింది. రెండు సంస్థలూ కలసి పనిచేయడానికున్న స్థానాలు, పరిమాణాల గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావలసి ఉన్నది. అదిన్నీ 10, 15 రోజులలోపు పూర్తిచేస్తే మంచిదని రెండు బృందాలు అనుకున్నాయి. సమాజం బాగుండాలి, మరింత బాగుండాలని కోరుకునే వాళ్ళకు ఇలా అభ్యుదయ శక్తులు ఒకటొకటి దగ్గిర పడటం సంతోషించదగ్గ వార్తే గదా ! సంతోషించగల వాళ్ళు సంతో షించండి.
మరో విజ్ఞాపన :
ఉద్యమ నిర్మాణం విస్తరిస్తున్న కొలది, ఉద్యమ కార్యాచరణ ఊపందుకుంటున్న కొలది మానవ వనరులు, ఆర్ధిక వనరులు కూడా ఇబ్బడిముబ్బడిగా కావలసి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకుంటే మానవ వనరులు కొంతవరకు అందుబాటులో ఉన్నా, ఆర్థిక వనరుల పరిస్థితే ఒక కొలిక్కి రాలేదు. ఎక్కడికక్కడ, ఎవరికి వారు ఈ మహాయత్నంలో నేనూ పాలుపంచుకొంటాను, మరి కొందరిని భాగస్వాములను చేస్తాను అని ముందుకొస్తే తప్ప ఈ భాగానికి స్థిరత్వం రాదు. సత్యాన్వేషణ మండలి వరకు అడిగే అలవాటుగాని, పుచ్చుకునే అలవాటు గాని లేకున్నా సాధించాల్సిన పెద్ద పనికి, వనరులు పెద్దఎత్తున అవసరపడతాయి గనుక ఈ విజ్ఞప్తి సమాజ సంక్షేమం దృష్ట్యా మీ ముందుంచుతున్నాను. తగిన సమయంలో తగిన విధంగా స్పందించడం విజ్ఞుల వైఖరి అవుతుంది.
జూలై 31న స.హ.చట్టం వినియోగ కార్యకర్తలపై హత్యాయత్నాలు, జరిగిన హత్యలు అన్న అంశాల్ని తీసుకొని హైదరాబాద్‌లో ఒక రౌండు టేబుల్ సమావేశం నిర్వహించాము. సమాచార కమీషన్ నుండి ప్రధాన సమాచార కమీషనర్ జన్నత్ హుస్సేన్ గారు, కమీషనర్ దిలీప్ రెడ్డి గారు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు వినియోగానికి కమీషన్ పరిధిలో క్రియాశీలంగా పనిచేస్తామని హామీ ఇస్తూ కమీషన్ పరిధిలోనికి రాని వివాదాల విషయంలో తాము చేయగలిగిందేమీ ఉండదని వారు అన్నారు.
ఐక్యవేదిక ప్రచారానికి అవసరమయ్యే 10 పాటలతో సి.డి. రికార్డింగ్ పూర్తయింది. ఆగస్టు 15 నాటికి ఆ సి.డి.లు అన్ని జిల్లాలకు అందుబాటులోనికి రావచ్చు.
ఉద్యమ నిర్మాణం చెయ్యడం ఒక ఎత్తయితే, ఆ నిర్మాణమైన ఉద్యమాన్ని, నిలకడగా, క్రమాభివృద్ధిగా, క్రియావంతం చెయ్యడం మరో ఎత్తు. ఈ థ చాలా కీలకమైనది. ఇక్కడ ఏ మాత్రం స్తబ్దత చోటుచేసుకున్నా ఇంతవరకు చేసిన శ్రమకు తగిన ఫలితాలు రావు. కనుక ఉద్యమాన్ని నిరంతర క్రియాశీలతతో, చలనశీలంగా ఉండేట్లు చూడడంలోనే జిల్లా బాధ్యుల, కార్యకర్తల కుశలతంతా ఇమిడి ఉంటుంది. అందుకు కార్యక్రమాలలోకి దిగడం ఒక్కటే సరైన వైఖరి అవుతుంది.
ఈ మహాయత్నం ఏ ఒక్కరిదీ కాదు. ఒక్కరో, ఇద్దరో పూనుకుంటే అయ్యేది కాదు. ఇది అందరిదీ, అందరం లేదా ఎందరో పూనుకొని మరెందరినో కలుపుకుంటూ సాగితేగాని కానిది. ఈ వాస్తవాన్ని, అవసరాన్ని గుర్తించి మీ మీ సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి సన్నద్ధం కండి.
- ఉద్యమ బాటలో మీ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక
ఉత్తమ ప్రసంగీకుల కొరత ఈనాడు ప్రతి క్షేత్రములోనూ ఉంది. అందునా భావ ప్రసార క్షేత్రాల తావున ఉద్యమాలకు ఆ కొరత మరింతగా ఉంది. ఉన్నంతలోనైనా ఎక్కువలో ఎక్కువ ప్రసంగీకులు వాస్తవానికి అవసరం లేకున్నా, మరోవంక వద్దని చెబుతున్నా, ఆత్మకథ చెప్పుకోవడానికే తమకు కేటాయించిన సమయంలో అధిక సమయాన్ని ఖర్చుచేస్తుంటారు. మిగిలిన సమయంలో కొంత ఎదుటివారిలోని దోషాలను, లోపాలను చూపటానికి వాడేస్తుంటారు. భాషమీదగాని, భావంలో గాని పట్టు లేకుండగనే అనర్గళంగా, తెగ ఊగిపోతూ మాట్లాడేస్తుంటారు. మాట్లాడతానన్న లేదా మాట్లాడమన్న విషయాన్ని విడిచి ఎంతసేపైనా మాట్లాడగలగడం ఇప్పటికున్న ప్రసంగీకులలో ఎక్కువ మందికున్న అసాధారణ, అపసవ్య సామర్ధ్యం. అట్టివారి పాలబడిన సందర్భంలో మనపై మనం జాలిపడాలి. పడికట్టు పదాలు, నాటకీయ భంగిమలు, ఆవేశాలు, ఉద్వేగాలతో కూడిన ప్రసంగాలను చూస్తుంటే వృత్తి కళాకారుల కంటే రెట్టింపు సమర్ధత కల నటనాథారీణులు వీరని తేలిపోతుంది. ఈ థలో ఉద్యమాలకు ఊపునివ్వడానికి తప్పనిసరైన పటిమ, పలుకు గల ప్రసంగీకుల్ని తయారుచేసుకోవలసిన నేపధ్యం నుండి ఉపన్యాసకులకు అవసరమైన కొన్ని కీలకాంశాలను ఇలా గుదిగుచ్చాను. గ్రహించి వాడుకోండి.
మంచి ఉపన్యాసకుడివి కాగోరుచున్నావా ?
అయితే ... ఇదుగో ఈ విషయాలను వంటబట్టించుకో.
1. ప్రసంగీకునికి ప్రాథమిక అర్హత మంచి గొంతు ఉండడం. దానిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగి ఉండడం.
2. ఆయా సందర్భాలలో స్వర స్థాయి ఎంత ఉండాలో ఎరిగి, సక్రమంగా దానిని ఆచరణలో పెట్టగలిగి ఉండడం.
3. ఉచ్ఛారణలో మాటల వేగం ఎక్కువ, తక్కువ గాకుండా ఉండడం. అతి వేగం వలన మాటమీద మాట, అక్షరం మీద అక్షరం పడిపోతున్నట్లుండి వినేవాడికి చెబుతున్న దేమిటో అర్థంకాక విసుగనిపిస్తుంది. ఆ పరిస్థితి వచ్చాక అతడిక వినడం మానేస్తాడు. దీనికి పూర్తి వ్యతిరేకంగా కొందరు ఒక పదం వాడి రెండో పదం పలకడానికి చాలా వ్యవధినిస్తారు. దానివల్ల పదాలు వినపడుతుంటాయే కాని వాక్యంగా, సజావుగా అర్ధం కాదు. దూరం దూరంగా అతడు ప్రయోగించిన పదాలను శ్రోత తిరిగి దగ్గర దగ్గరగా కూర్చుకొని అర్ధం చేసుకోవలసి వస్తుంది. ఈ పని భాషపై పట్టుండి, అవసరమై ఉన్న కొద్దిమంది చేయగలుగుతారు. మిగిలిన వారంతా ఇలాంటి ప్రసంగాల విషయంలోనూ విషయం అర్థం కాని తనముండటంతో వినడం మానేస్తారు.
4. ఈ లోపం లేకుండా ఉండాలంటే ఉపన్యాసకుడు ఉచ్ఛారణ పరంగా స్ఫుటత్వాన్ని కలిగి ఉండాలి. స్ఫుటత్వమంటే వత్తులు, పొల్లులు, దీర్ఘాలు, సంయుక్తాక్షరాలు, దంతవ్యాలు, తాలవ్యాలు, అనునాశికాది ఉచ్ఛారణ స్థానాలనెరిగి అక్షరాలను ఉచ్ఛరించడం అని అర్థం. అలాగే ఉచ్ఛారణలో స్పష్టత కూడా ఉండాలి. స్పష్టత అన్నది స్ఫుటత్వపు ఆధారాన్ని కలిగి ఉంటుంది గానీ, పదాలను స్పష్టంగా ఉచ్చరించడం, పదబంధాలను ఎక్కడ ఆపాలో తెలిసి ఉచ్చరించడం, మొదటి అక్షరం ఎంత స్ఫష్టంగా, సరిగా అన్నామో చివరి అక్షరం వరకు స్వర స్థాయి తగ్గకుండా, అనవసరమైన స్వర స్థాయిని ప్రయోగించకుండా ఉండడం స్ఫుటత్వం కంటే వేరుగా చెప్పుకోతగి ఉంది.
గమనిక : కనుక ప్రసంగీకుడు ఉచ్ఛారణలో 1. స్వరస్థాయిని, 2. స్ఫుటత్వాన్ని, 3. స్పష్టతను కలిగిఉండాలి. ఇంతవరకు శబ్దోచ్ఛారణ పరంగా వక్త తీసుకోవలసిన జాగ్రత్తలు కాగా, ఇక భావాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్ధాం.
1. ప్రకరణ భంగం చెయ్యకుండడం మంచి ప్రసంగీకునికి ఉండాల్సిన మొదటి అర్హత. ప్రసంగాంశం ఏమిటో తెలుసుకొని లేదా ఎంచుకుని ఆ విషయానికి అన్యమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం ప్రకరణ భంగం చెయ్యకుండడం. ప్రసంగాంశాన్ని విడిచి ఇతరేతరాంశాలను ప్రస్తావించడం ప్రకరణ భంగం చెయ్యడం.
ఎ) ప్రకరణ భంగం జరగడానికి అనేక కారణాలుండే వీలుంది. అందులో ఒకటి ప్రసంగాంశంపై సరైనంత, సరిపడినంత సమాచారంతో కూడిన అవగాహన లేకపోవడం.
బి) ప్రసంగాంశం తానెంచుకున్నది గాక ఇతరులు నిశ్చయించినదై, దానికంటే వేరు విషయం తనకు ఇష్టమై ఉండడం లేదా ప్రధానమైనదనిపించడం.
సి) ప్రసంగించే అవకాశాల కోసం ఎదురు చూస్తూ, ఏ అవకాశం దొరికినా, తాననుకున్న విషయంలోకి జారివచ్చి దానిని గూర్చే చెప్పబూనడం.
గమనిక : ప్రకరణ భంగం జరిగిందంటే ఉపన్యాసకునికి సందర్భశుద్ధి లేదనే అర్ధం. ప్రసంగాంశంపై పట్టు లేదనీ చెప్పవచ్చు. ప్రసంగించడానికి సంబంధించి నిర్ధిష్టమైన ప్రయోజనం కలగాలన్న దృష్టి లేదనీ చెప్పవచ్చు.
2. తనకు కేటాయించిన సమయాన్ని మించకుండా మాట్లాడగలగడం, ప్రసంగాంశంపై అతనికున్న పట్టును తెలియజేస్తుంది. నిజానికి ఆ ప్రసంగ విషయం విస్తారమైనదై, కేటాయించిన సమయం తక్కువగా ఉండి, అవగాహన తగినంతగా ఉండే నిర్ణీత సమయంలోనే ప్రసంగాన్ని పూర్తిచేయాలంటే ఆ ప్రసంగీకునికి క్లుప్తీకరించే సామర్ధ్యం కూడా ఉండాలి. అలా కాక సమయం తగినంతగా ఉన్నప్పుడు ఉన్న సమయాన్నంతటిని వినియోగించుకోవాలంటే విషయాన్ని వివరణాత్మకంగా చెప్పే నేర్పు ఉండాలి. స్థాయి కలిగిన ప్రసంగీకునిలో సంక్షిప్తంగాను, వివరణాత్మకంగాను చెప్పగల నిపుణత - సామర్ధ్యం - ఉంటుంది. ఎన్నో తెలిసిన వాడు, అన్నీ తెలిసిన వాడు అని అనిపించుకోవాలన్న దుగ్ధ కూడా వినేవాళ్ళు దొరికిన చోటల్లా అన్నీ మాట్లాడేలా చేస్తుంది. ఈ రకం కూడా తరచుగా ప్రకరణ భంగం చేసేస్తుంటారు. తానొక్కడే వక్తగా నున్నప్పుడు కొంత అదనపు సమయం తీసుకున్నా పరవాలేదు గాని, ఒక సభలో మరి కొందరు వక్తలు ఉండి, వారి వారి సమయాలు ముందుగానే నిర్ణయించబడి ఉన్నప్పుడు, తనకిచ్చిన సమయానికి మించి మాట్లాడేస్తుండేవాడు సూటిగా చెప్పాలంటే ప్రసంగీకునిగా పనికిరాడు. అతడు తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు. ఇతరుల స్వేచ్ఛను, కాలాన్ని హరించాడు. కనుక అట్టి వైఖరి భరించదగింది కూడా కాదు.
చాలా మంది ఉపన్యాసకులు సమయ భంగం చెయ్యడానికి ఒక కారణం ఉపన్యాసం ప్రసంగాంశంతో మొదలెట్టక, వేదికపైనున్న వారిని గురించి మాట్లాడడంతో మొదలెట్టి ఆపైన తనగురించి చెప్పుకోవడం వరకు సాగదీసి, ఇక తనకిచ్చిన సమయం అయిపోవచ్చిన తరుణంలో ప్రసంగాంశానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకం (మంద) వ్యక్తులకు సభలోనున్న వారు తాను చెప్పింది వింటున్నారా లేదా అనిగాని, శ్రోతలకు విషయావగాహన కలిగించాలని గాని దృష్టి ఉండదు.
ప్రజాసభలు నిర్వహించడానికి సలహాలు
ఓ నిశ్బబ్ద విప్లవం ఢిల్లీలో యిప్పుడే ప్రారంభ మయింది. ఈ మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో యిప్పుడు జరుగుతున్న దేమంటే తమ ప్రాంతాన్ని పరిపాలించే విషయంలో ప్రజలే ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఆ నిర్ణయాలను శిరసావహిస్తున్నారు. నమ్మశక్యంగా లేదా?
త్రిలోక్‌పురి, సందర్‌నగరిలో నివాసముంటున్న ప్రజలకు వాళ్ళవార్డు కౌన్సిలర్ వద్ద నుండి ఒకరోజు ఉత్తరం అందింది - తన వార్డులో ఉంటున్న ప్రజలు ఆదేశించినట్లే పనులను నిర్వహించడానికి తాను నిర్ణయించుకున్నట్లు. భారతదేశంలో ప్రజాపాలన వట్టిభూటకంగా తయారయింది. ప్రజలు అయిదేళ్ళకొకసారి తమ నాయకుణ్ణి ఎన్నుకొని, తర్వాత అయిదేళ్ళు అతని ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. నేను దీన్నిమార్చాలని నిర్ణయించు కున్నాను. ఇక విూదట విూరు చెయ్యమన్న పనులనే చేస్తాను.'' అది ఉత్తరం సారాంశం.
స్వరాజ్ అభియాన్ అనే సంస్థ పై రెండువార్డుల కౌన్సిలర్లతో కలిసి ఈ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కవార్డును 10 విభాగాలుగా విభజించారు.ఒక్కొక్క విభాగం (మొహల్లా) లో నివసించే ప్రజలంతా ఆ మొహల్లా సభలో సభ్యులు. (మొహల్లా సభని మనం ప్రజాసభ లని పిలుచుకోవచ్చు.) ఒక్కొక్క ప్రజాసభ రెండు నెలల కొకసారి సమావేశమవుతుంది. వార్డుకౌన్సిలర్, మునిసిపల్ అధికారులు ఆ సభకు హాజరవుతారు. పురపాలక సంఘనిధులు ఆ వార్డు విభాగంలో ఎలా ఉపయోగించాలో ఆ సమావేశంలో ప్రజలు నిర్ణయిస్తారు.ఇప్పటి వరకు కొందరు అధికారులు, రాజకీయనాయకులు ఆనిర్ణయాలు చేసేవారు. ఇప్పుడు అలాకాదు. విూరు నేరుగా ప్రజాసభ సమావేశంలోకి వెళ్ళి విూ ప్రాంతంలో రోడ్డు రిపేరు చేయించమని అడగవచ్చు. డిమాండు చేయవచ్చు. విూ డిమాండు ఆ సమావేశం రికార్డులో చేరుతుంది. అవసరమైన నిధుల్ని కౌన్సిలర్ అక్కడికక్కడే మంజూరు చేసేస్తారు.అయితే యీవిధంగా వచ్చిన అభ్యర్ధనలు, ఉన్న నిధులకంటే ఎక్కువగా ఉంటే, ఏ పనులకు ముందు నిధులు ఖర్చుచెయ్యాలి అన్న విషయంపైన ఆ సభలో ఓటు తీసుకొని నిర్ణయిస్తారు.
ప్రజాసభ సంతృప్తి వ్యక్తం చెయ్యనిదే, పనులుపూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించము అని కౌన్సిలర్లు ప్రకటించారు. ఈపద్ధతి అవినీతిపై చావుదెబ్బ కొట్టింది. ఇంతకు ముందు, వేసిన కొద్దిరోజులకు నాశనమయి పొయ్యేరోడ్లు ఇప్పుడు పూర్తికాలం ఉపయోగపడుతున్నాయి.
సాంఘిక భద్రతను సమకూర్చే వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్‌ల లబ్దిదారుల జాబితాలన్నీ ప్రజాసభల్లోనే తయారవు తున్నాయి. ఎవరు నిజంగా పేదలో, ఎవరు వాస్తవంగా వీటికి తగినవారో అన్న విషయం సభలో నలుగురి మధ్య తేలిపోతుంది - దాపరికం లేదు. ఇంతకుముందు కౌన్సిలర్‌కు కావలసిన వారికే యీ పెన్షన్‌లు ముట్టేవి.
ఈరెండు వార్డుల కౌన్సిలర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అభినందించారు. అంతేకాదు ఢిల్లీ నగరంలోని అన్ని వార్డుల్లో యీవిధానాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించమని గవర్నర్, మునిసిపల్ కమీషనర్‌ని కోరారు. స్ధానిక పోలీసు అధికారులు కూడ ఆసభల్లో పాల్గొనేటట్లు చూడమని పోలీసు కమీషనర్‌ని గవర్నర్ ఆదేశించారు.
ప్రజాసభ ఎలా జరుగుతుంది ?
ళీ ఒక్కొక్క మునిసిపల్ వార్డును 10 విభాగాలు చేస్తారు. ఒక్కొక్క విభాగాన్ని మొహల్లా అంటారు. స్ధూలంగా ఒక్కొక్కవార్డులో 40,000 మంది ఓటర్లు ఉంటున్నారు. కాబట్టి ఒక మొహల్లాలో 4000 మంది ఓటర్లు (అంటే 1500 కుటుంబాలు ) ఉంటారన్న మాట.
ళీ మొహల్లాలోని ప్రతి ఓటరూ మొహల్లా సభ (ప్రజాసభ)లో సభ్యుడే.
ళీ ఈ సభ (ప్రజాసభ) రెండు నెలలకొకసారి సమావేశమవుతుంది.
ళీ విూటింగు జరిగే తేది, టైం,సమావేశ స్థలమూ తెలియజేస్తూ, ముందే మీటింగు నోటీసును ప్రతి కుటుంబానికీ అందజేస్తారు. ఈ నోటీసు సాధారణంగా ప్రతి ఓటరుకూ కౌన్సిలర్ రాసే ఉత్తరంలాగ ఉంటుంది.
ళీ ఈ సమావేశానికి కౌన్సిలర్ అధ్యక్షత వహిస్తారు. అది బహిరంగ సమావేశం. బయట వాళ్ళు కూడ సమావేశానికి రావచ్చు, కాని వాళ్ళు ప్రేక్షకులే.ఓటు ఉన్న మొహల్లా సభ సభ్యులకు మాత్రమే సభలో పాల్గోనే హక్కు ఉంటుంది.
ళీ సందేహాలను తీర్చడానికి, ఫిర్యాదులకు సమాధానాలు యివ్వడానికి మునిసిపల్ అధికారులు సమావేశానికి రావడం అవసరం. వాళ్ళు హాజరుయ్యేటట్లు కౌన్సిలర్ ప్రయత్నిస్తారు.
ళీ సమావేశం ప్రారంభంలోనే తెల్లకాగితాలను సభ్యులకు యిస్తే - వాటిపైన తమపేరు, తాము ఏ విషయంపైన సభలో మాట్లాడదలచు కున్నదీ వ్రాసియిస్తే, అధ్యకక్షుడు ఒక్కొక్కరిని వేదిక విూదికి పిలుస్తారు. దీనివల్ల ఒకేసారి అందరూ మాట్లాడడానికి ప్రయత్నించడం, సభలో గందర గోళం ఏర్పడం జరగకుండా ఉంటుంది.
ళీ సభ్యులు సమస్యలను సభముందు ప్రస్తావిస్తారు. అందరూ కలిసి చర్చించి, పరిష్కారాలు సూచిస్తారు. ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో చెబుతారు. అవసరమయిన మేరకు అధికారులు స్పందిస్తారు. పనులను పూర్తి చెయ్యడానికి కాలవ్యవధిని నిర్దేశించవచ్చు. అవసరమయినంత మేరకు కౌన్సిలర్ అక్కడికక్కడే నిధులను మంజూరు చేస్తారు.
ళీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేందుకు అర్హులైన వారిపేర్లను ఆ సభలోనే ఖరారు చేసి, జాబితాలు రూపొందింస్తారు.
ళీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా, లేక ఓటింగ్ ద్వారా, చేసుకోవచ్చు.
ళీ సభలో సభ్యులు నేరుగా కౌన్సిలర్‌ని గాని, హాజరైన మునిసిపల్ అధికారులనుగాని ప్రశ్నించవచ్చు.
ళీ కౌన్సిలర్ - అధికారులు, సభ్యుల ప్రశ్నలపై, కంప్లెయింట్‌లపై స్పందించవచ్చు. వివరణలు యివ్వవచ్చు. పరిష్కారాలు సూచించవచ్చు. తమవిధినిర్వహణలో ఉండే పరిమితులను, అవకాశాలను తెలియజెయ్యవచ్చు.
ళీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేసిన తర్వాత కాంట్రాక్టర్ కి అందవలసిన మొత్తాన్ని చెల్లించడానికి కౌన్సిలర్ ఒక నిబంధనకు లోబడి నడుచు కోవాలి. స్ధానిక సభ్యులు ఆపనిపట్ల సంతృప్తిని తెలిపిన తర్వాత మాత్రమే చెల్లింపు జరగాలి.
ళీ ప్రజాసభ ఒక నియమాన్ని ఆచరిస్తుంది. సభ్యులు తమ అవసరాలేమిటో నిర్ణయిస్తారు. వాళ్ళ ప్రతినిధి (కౌన్సిలర్) తన పరిధికి లోబడి, చట్టానికి లోబడి, నిధులు ఉన్నంతలో, ఆ అవసరాలను తీరుస్తాడు.
ళీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన కార్యక్రమ వివరాలు ప్రతి కుటుంబానికి తెలియజెయ్యాలి.
ళీ తదుపరి సమావేశం జరగవలసిన తేది, సమావేశ స్థలము యిప్పుడే నిర్ణయించాలి. ముందు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కార్యాచరణ రిపోర్టును కౌన్సిలర్ సభకు అందజెయ్యాలి.
ఇప్పటి వరకు కలిగిన అనుభవం
ప్రజల అభ్యర్ధనలు (డిమాండ్లు) చాలతక్కువ. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. అయినప్పటికి ప్రజల్లో అసంతృప్తి మిగిలే ఉంటున్నది- ఎందుచేతనంటే తమకు అవసరం కాని వాటిపై డబ్బునంతా ఖర్చు పెడుతుండడంచేత. ప్రజలే నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వాళ్ళ అవసరాలన్నీ కొద్దిపాటి మొత్తాలతో తీరేవిగానే ఉంటాయి. ఒక ఉదాహరణ - త్రిలోక్ పురి మొదటి ప్రజాసభలో అందిన అన్ని డిమాండ్లపై ఖర్చుచేసినా, 14 లక్షల రూపాయలకు మించలేదు. పెద్ద సమస్య ఏదయినా ఎదురైనప్పుడు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న డిమాండు ఎదురైనప్పుడు, ఒక మంచి పరిష్కారం ఏమిటంటే - వాస్తవ పరిస్థితులను వివరించి, ఉన్న వనరుల వివరాలను సభ్యులకు చెప్పడంతో సభ్యులు, చర్చల ద్వారా, ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేయాలో నిర్ణయించుకుంటారు. తమ ప్రాధాన్యతలను తేల్చుకుంటారు.
ళీ మునుపు యీపనులన్నీ కౌన్సిలర్‌గాని, ఆయన చుట్టుఉన్న వారుగాని చెప్పినట్లు జరిగేవి. ఇప్పుడు అతి సామాన్యుడైన సభ్యుడు కూడ, ప్రజాసభలకి అడుగుపెట్టి, ఫలాన పని చేెయండి అని అడగవచ్చు. ప్రతి సభ్యుడి అభ్యర్థనా వ్రాసుకొని, కౌన్సిలర్ తన అధికారాలకు లోబడి, పరిష్కరించడం జరుగుతుంది.
ళీ సంకల్పం ఉన్నా, ఓటర్లందరినీ తృప్తి పరచగలగడం ఏ కౌన్సిలర్ కయినా అసాధ్యం. ఉన్న నిధులు పరిమితం కాబట్టి. ఒక వర్గం ప్రజలను తృప్తిపరచి నప్పుడు, మరొక వర్గానికి అసంతృప్తి, కోపతాపాలు కలగవచ్చు. ఈ ప్రజాసభ మంచి అవకాశాన్ని కౌన్సిలర్‌కి కలిగిస్తున్నిది- ఆయన ప్రజల్నే నేరుగా అడగవచ్చు, ఉన్న నిధుల్ని ఎలా ఉపయోగ పెట్టాలో నిర్ణయం చెయ్యమని. అవసరమైతే, ప్రత్యక్షంగా, ఓటు ద్వారా తమ ప్రాధాన్యతలను నిర్ణయించమని అడగవచ్చు.
ళీ మునిసిపల్ అధికారులు తమను పట్టించుకోవడం లేదన్నది చాల మంది కౌన్సిలర్‌ల అభిప్రాయం. ఈ అధికారులు అసాధ్యమైన వాగ్దానాలు చేసి వాటిని ఆచరణలో పెట్ట లేకపోవడం జరుగుతుంది. ప్రజాసభలు చురుగ్గా ఉన్న చోట్ల ఈ పరిస్ధితి మారిపోయింది. తాము చేసిన వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చారో సభ ముందు వివరించాలి కాబట్టి అధికారులు యిప్పుడు విధులు నిర్వర్తించడానికి పూనుకుంటున్నారు. ఒక ఉదాహరణ - ఒక ప్రజాసభ సమావేశంలో ఒక వనిత యిలా చెప్పింది. ''నేను అనేక పర్యాయాలు ఎ.యస్.ఐ.నీ, కౌన్సిలర్‌నీ, కలిసి మాట్లాడాను. గత సంవత్సరంలో పని చేస్తామని ఎన్నోసార్లు చెప్పారు. కాని మురికి కాలువను శుభ్రం చేయించ లేదు. ప్రజాసభలో ఒకసారి మూడు రోజుల్లో చేయిస్తామని ఎ.యస్.ఐ. చెప్పారు. ఈ పర్యాయం మాట నిలబెట్టుకోక పోతే ఏమిచెయ్యాలి అని సభ్యులడిగారు. ఎ.యస్.ఐ అన్నారుకదా- రాబోయే సమావేశం లోపల నా వాగ్దానం నిలబెట్టుకో లేకపోతే విూరిచ్చే శిక్షను అనుభవిస్తాను అని. ఆ మురికి కాలువ మూడు రోజుల్లో శుభ్రమయింది.
ళీ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల లబ్దిదారుల జాబితాలను ఈ ప్రజాసభలు తయారు చేసే పద్ధతి కుతూహలంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం పేదల కోసం చేపడుతుంది. మునుపు కౌన్సిలర్‌గాని అతని తాబేదార్లుగాని లేక వాళ్ళ పార్టీకి సన్నిహితులయిన వాళ్ళకే అవి దక్కేవి. ఇప్పుడు లబ్దిదారుల ఎంపిక సభలో చర్చించి నలుగురి ముందు నిర్ణయిస్తారు. ఒక సంక్షేమ పథకం విషయం ప్రజాసభలో చర్చకు పెట్టగానే, తమకే కావాలని అందరు సభ్యులూ చేతులెత్తుతారు అని అనుకున్నారు. కాని ఆలా జరగలేదు. బాదర్‌పూర్ ఖాదర్ గ్రామ ప్రజలు నిరుపేదలు, వ్యవసాయం చేసుకునో, కూలినాలి చేసుకునో జీవిస్తారు. అక్కడ జరిగిన ప్రజాసభలో దాదాపు 100 మంది బాదర్‌పూర్ వాళ్ళు పాల్గొన్నారు. ఆ సమావేశంలో పెన్షన్ పథకం ప్రకటించినప్పుడు, ఆగ్రామస్తులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని, 8 మంది స్త్రీల పేర్లు సూచించారు - ఆ ఎనిమిది మంది భర్తలు లేని వాళ్ళు, ఏ జీవనోపాధీ లేని వాళ్ళు, నిరుపేదలు. ఆ పెన్షన్ పథకం కింద ఇంకా కొంత మందికి అవకాశం ఉంది అని కౌన్సిలర్ ప్రకటించి నప్పటికీ, ఆ ఎనిమిదిమందే లబ్దిపొందడానికి అర్హులు అని ఆ గ్రామస్తులు ఏకగ్రీవంగా చెప్పారు. వారి నిజాయితీకి, సత్య సంధతకూ ఆ సభలో ఉన్నవాళ్ళు ఆనంద భాష్పాలు రాల్చారు. ఇందులో దాగిన వాస్తవం ఒకటుంది. ఏ వ్యక్తీ నిజంగా పేద కాకుంటే, తనపేరును ఆ జాబితాలో చేర్చడానికి ఒప్పుకోడు, ఎందుకంటే, పేద వాడుగా నలుగురిలో ముద్రపడ్డ తర్వాత తాను అక్కడ గౌరవ ప్రదంగా జీవించే అవకాశం ఉండదు.
ళీ ఈ ప్రజాసభలు రాజకీయ నాయకులను విశ్రాంతిగా ఉండనీవు. మునుపు అయిదు సంవత్సరాల వరకు వాళ్ళను ప్రశ్నించేవాళ్ళు ఉండే వారు కాదు. ఇప్పుడు నెలనెలా ప్రశ్నిస్తారు.
ళీ మన దేశంలో పాలనా వ్యవస్థను ప్రశ్నించే వేదికలు లేవు. వాళ్ళు పూర్తి బాధ్యతారాహిత్యంతో పని చేస్తారు. ఇప్పుడు యీ ప్రజాసభలు వాళ్ళను ప్రశ్నించే వేదికలయ్యాయి. ఈ సభలు ప్రజలనూ, ప్రజలెన్నుకున్న ప్రతినిధులనూ ఒక వేదిక విూదికి చేర్చాయి. పాలనావ్యవస్ధ కూడ ఆవేదిక విూదికి చేరక తప్పదు. ఆ వేదిక విూదికి రాకుంటే వాళ్ళు బహిష్కరించబడతారు.
ళీ తన ఓటరుతో తరచూ ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోడానికి కౌన్సిలర్‌కి అనువైన అవకాశాన్ని ప్రజాసభ కలిగిస్తున్నది. ప్రతి ఓటరుకూ ప్రతి నెలా రెండు ఉత్తరాలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నది- 1. విూటింగు నోటీసు పంపడానికి, 2. ప్రజాసభ చేసిన నిర్ణయాలను తెలియజెయ్యడానికి. విూటింగుకు రాని వాళ్ళకు కూడ జరుగుతున్న విషయాలు తెలుస్తాయి. యీ ఉత్తరాల ద్వారా ప్రజాసభ విషయాలు ఆప్రాంతంలో విస్తృతంగా ప్రజలు చర్చించుకుంటారు. దీనివల్ల కౌన్సిలర్ పేరు సర్వత్రా వ్యాపిస్తుంది. ఆయనకు రాజకీయ లబ్ది కలుగుతుంది.
తరచూ అడిగే ప్రశ్నలు
ళీ మొహల్లా సభ అంటే ఏమిటి? (మనందీనిని ప్రజాసభ/ జనసభ/ గ్రామసభ అనవచ్చు)
మునిసిపల్ వార్డులోని ఒక చిన్న ప్రాంతం (మొహల్లా) లో నివసించే వాళ్ళంతా కలిసి ప్రజాసభగా ఏర్పడతారు. అక్కడ నివసించే వాళ్ళందరూ తప్పకుండా సమావేశానికి హాజరు కావాలన్న నిబంధన లేదు. సమావేశంలో ఉన్నవాళ్ళు కలిసి ప్రజాసభ అవుతుంది.
ళీ ఏప్రాంతంలో నయినా ప్రజాసభను ఏర్పాటు చేసుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?
ళీ ఆ ప్రాంతం లోని కౌన్సిలర్ దీనికి సిద్ధపడాలి. క్రింది సూచనలను ఆయన అంగీకరించాలి.
ళీ మునిసిపల్ బడ్జెట్‌తో (తన స్వంత నిధులతో సహా) ఆ ప్రాంతంలో అన్ని విభాగాల్లో ఏ ఏ పనులు జరగాలో నిర్ణయించ వలసింది ప్రజాసభే. ఒకవేళ మునిసిపాలిటీ ఏ పనినయినా అక్కడ జరపదలిస్తే, వారు దానిని ప్రజాసభ ముందుంచి, వారి అనుమతి పొందాలి.
ళీ పూర్తి అయిన ఏ పనికి సంబంధించిన బిల్లునయినా కాంట్రాక్టరుకు చెల్లించవలసి వచ్చినప్పుడు, ఆపని సంతృప్తికరంగా జరిగింది అని ప్రజాసభ తన సమావేశంలో నిర్ణయించందే, ఆ బిల్లును చెల్లించకూడదు.
ళీ ఇక విూదట పేదల సంక్షేమం కోసం ఉద్దేశించి ఏ పథకం అమలు చేయడంలో నయినాసరే, లబ్దిదారుల జాబితాను ఖరారు చేసేది ప్రజాసభే.
ళీ మునిసిపల్ అధికారులను, ప్రభుత్వ అధికారులను (వీలయినంత మందిని) ప్రజాసభ సమావేశానికి కౌన్సిలర్ తీసుకు వస్తారు.
ప్రజా సభను నిర్వహించే బాధ్యతను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాసంఘం, (ఎన్.జి.ఒ) ఒకటిగాని రెండు మూడు కలిసి గాని, తీసుకోవచ్చు. ప్రజాసంఘాలు (ఎన్.జి.ఒ.) ఈ బాధ్యతను పూర్తిగా స్వీకరించాలి. అన్ని పనులు అవే నిర్వహించాలని దీని అర్ధంకాదు. వాళ్ళు వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు. అయినా ప్రజాసభ సమావేశం జరిపే బాధ్యత అంతిమంగా వాళ్ళదే.
కౌన్సిలర్ ఎందుకు అంగీకరించాలి?
కౌన్సిలర్ కి రెండు లాభాలుంటాయి. అతనికి ఓట్లు అవసరం. ప్రజాసభ ఓటర్లను కౌన్సిలర్ వద్దకు చేరుస్తుంది. ప్రజాసభ యంత్రాంగం ద్వారా, రెండు నెలలకొక పర్యాయం ప్రతి ఓటరుతో మూడు పర్యాయాలు కౌన్సిలర్‌కి సంబంధం ఏర్పడుతుంది. 1. ప్రతి ఓటరును ప్రజాసభకి రమ్మని ఆహ్వానించడం ద్వారా 2. ప్రజా సభలో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుసు కోవడం ద్వారా 3. ప్రతి కుటుంబానికి ప్రజాసభలో జరిగిన విషయాలు అందించడం ద్వారా. కౌన్సిలర్‌కి రాబోయే ఎన్నికల్లో, ఓటర్ల దగ్గర కెళ్ళి ఓట్లు అడిగే అవసరం తప్పుతుంది. కౌన్సిలర్లకు ప్రజా సభలో పాల్గొనడం ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రజల గౌరవాన్ని పొందుతారు. ఇంతకు ముందు ఆ ప్రాంతంలోని అన్ని సమస్యలకు కౌన్సిలర్‌ని నిందించేవారు. ఇప్పుడు కౌన్సిలర్‌లు, ఉద్యోగుల విధి నిర్వహణ విధానాన్ని ప్రజాసభల దృష్టికి తెచ్చి, పనులు పూర్తి చెయ్యడంలో పాలనా యంత్రాంగాన్ని బాధ్యులుగా చెయ్యగలుగుతున్నారు.
ళీ చట్ట ప్రకారం కౌన్సిలర్లకు అధికారాలు ఉండవు. కాని ప్రజలు ప్రతి పనికీ కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళేవారు. ఆయనే నేరుగా పని చేసి పెట్టలేరు. మునిసిపల్ అధికారులపై ఆధారపడక తప్పదు. కాని కౌన్సిలర్‌కి మునిసిపల్ ఉద్యోగులపైన అధికారం ఉండదు. వారు కౌన్సిలర్ చెప్పే మాటలు గౌరవ భావంతో వినేవారే గాని ఆయన యిచ్చే ఆజ్ఞలను పెడచెవిని పెట్టేవారు. కౌన్సిలర్ అవినీతిపరుడనో, దద్దమ్మ అనో ప్రజలు భావించేవారు. ఇప్పుడు వారం వారం పనులు పూర్తి చెయ్యడంలో అధికారులను బాధ్యులు చేస్తూ ఉండడంతో, వారు తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. అందుచేత కౌన్సిలర్‌లను నిందించడం పోయింది. అధికార యంత్రాంగం తమ విధులు నిర్వహించడానికి పూనుకున్నారు.
అధికారులు ప్రజాసభలకు ఎందుకు వస్తారు?
కౌన్సిలర్ వాళ్ళను రమ్మని పిలుస్తారు. ఆయన ప్రజల ప్రతినిధి కాబట్టి మునిసిపల్ అధికారులు రావడానికి అంగీకరించాలి. కొందరు అంగీకరించరు. పోలీసులు కూడ ప్రజాసభకు వెళ్ళాలని గవర్నర్ ఆర్డరు జారీ చేశారు. అందువల్ల పోలీసు అధికారులు వస్తారు.
ప్రజాసభ ఆదేశాలను అధికారులు ఎందుకు ఖాతరు చెయ్యాలి? శుష్క వాగ్దానాలు చేయవచ్చా?
అవును చెయ్యవచ్చు. ప్రజాసభ సమావేశం ఒక్కసారి మాత్రం జరిగేదయితే శుష్కవాగ్దానాలు చెయ్యవచ్చు. ఈ సమావేశాలు వారం వారం, రెండు నెలలకొకసారి జరిగేవి కాబట్టి పనులు చెయ్యని అధికారుల్ని నిలదీస్తారు. వాళ్ళ గౌరవం డెబ్బతింటుంది. అందుచేత ప్రజాసభ ఆదేశాలను పెడచెవిని పెట్టేందుకు సాహసించరు.
కౌన్సిలర్ ని కలుసు కోవడం ఎలా?
కౌన్సిలర్‌ని కలుసుకునేటప్పుడు క్రింది విషయాలను మనసులో ఉంచుకోండి.
ళీ ఆయన విూకు ఇంతకు ముందే వ్యక్తి గతంగా తెలుసా? తెలిసి ఉంటే, విూరు ఒంటరిగా వెళ్ళి, ఆయన్ని కలుసుకొని, ప్రజాసభ ఏర్పాటు చేసే విషయాన్ని ఆయనతో చర్చించవచ్చు.
ళీ విూకు ఆయనతో వ్యక్తి గతంగా పరిచయం లేకుంటే, పరిచయం ఉన్న ఒక మిత్రుణ్ణి వెతికి ఆయనతో కలిసి వెళ్ళండి.
ళీ ఆయన తో పరిచయమున్నవాళ్ళు ఎవరూ విూకు తటస్తపడక పోతే, ఆందోళన చెందకండి. విూతో పదిమందిని తీసుకెళ్ళండి. మొదట యీ పదిమందికీ ప్రజాసభ గురించి బాగా వివరించండి- వాళ్ళు ''ప్రజాసభ'' ఆలోచనని అంగీకరించేందుకు ప్రయత్నించండి. తర్వాత కౌన్సిలర్ ను కలుసుకోడానికి టైం అడగండి. పదిమందీ కలసి ఆయన దగ్గరకు వెళ్ళి తమవార్డులో కూడ ప్రజాసభ ఏర్పాటు చేయడం మంచిదని అందరూ భావిస్తున్నారని చెప్పండి.
ఇప్పటికీ కొందరు కౌన్సిలర్‌లు తమ వార్డుల్లో ప్రజాసభల్ని ఏర్పరచి ఉన్నారని తెలియ జెయ్యండి.
ళీ కౌన్సిలర్ కి దక్కే రాజకీయ లబ్దిని వివరించండి.
ళీ అక్కడ ప్రజలకు, ఆప్రాంతానికి సమకూరే లాభాలేమిటో చెప్పండి.
ళీ ఆయన సుతరామూ ఒప్పుకోపోతే, మనం మన ప్రయత్నాన్ని ప్రస్తుతానికి విరమిద్దాం.
ళీ ఆయన అసంధిగ్ధంగా ఉంటే, ఆయనతో మరోసారి సమావేశానికి అవకాశం తీసుకొని, మరుప్రయత్నంలో విూతో స్వరాజ్ అభియాన్ వాలంటీర్‌ని తీసుకెళ్ళండి.
ప్రజాసభ జరిగిన తర్వాత తీసుకోవలసిన చర్యలేమిటి?
ళీ ఆ సభలో జరిగిన విషయాల (మినిట్స్) రికార్డును శుభ్రంగా వ్రాసుకోవాలి. ఒకకాపీని కౌన్సిలర్‌కి పంపాలి. కాపీలను క్రింద సూచించిన వారికి పంపండి.
1. గవర్నర్ 2.మునిసిపల్ కమిషనర్ 3. మునిసిపల్ జోనల్ డిప్యూటీ కమిషనర్ 4. సంబంధిత ప్రభుత్వ శాఖాధిపతులకు 5.ప్రజాసభలో తీసుకున్న నిర్ఱయాలను కార్యరూపం లోనికి తేవలసిన అధికారులకు 6. పోలీస్ కమిషనర్ 7. లోకల్ పోలీస్ అధికారికి 8. ఆ ప్రాంతంలోని ప్రతి యింటికీ ఒక్కొక్క కాపీ అందజెయ్యాలి.
ఒక ప్రజాసభ సమావేశం నిర్వహించడానికి ఖర్చు ఎంత అవుతుంది? ఎవరుయిస్తారు?
క్రింద ఉదహరించిన ఖర్చులకు డబ్బు అవసరం అవుతుంది.
1. విూటింగ్ ఏర్పాటు చెయ్యడానికి టెన్ట్ కావాలి. ఒక స్కూలు బిల్డింగులో గాని లేక ఉచితంగా అందుబాటులో ఉన్న మరో బిల్డింగ్‌లో గాని సమావేశం ఏర్పాటు చేసుకుంటే టెస్ట్ ఖర్చు ఉండదు.
2. మైక్ కావాలి. మంచి సౌండ్ సిస్టమ్ అవసరం. దాన్ని అద్దెకు తెచ్చుకోవచ్చు. లేక ఆప్రాంతంలో ఉన్నవారెవరయినా ఉచితంగా వారంవారం యిస్తే మరీమంచిది.
3. కరపత్రాలు విూటింగు పిలుపుకు ఒకటి, సమావేశం మినిట్స్ పంపడానికి రెండవది, సాధారణంగా యీరెంటికీ అయ్యే ఖర్చును కౌన్సిలర్ భరించాలి - ఎందుకంటే రెండూ ఆయన పేరు విూదనే వెళ్ళతాయి - ఈ కరపత్రాల వల్ల లాభం పొందేది ఆయనే. కాని ఆయనకు ఆఖర్చును భరించడం యిష్టం లేక పోతే, మనం చిన్న చిన్న మొత్తాలను మిత్రుల నుండి వసూలు చెయ్యవచ్చు. కొన్ని సమావేశాలకు ఈ ఏర్పాటు సరిపోతుంది. స్థానికులు ముందుకు రావడంగాని జరుగుతుంది.
మొదటి ప్రజాసభ సమావేశం ఏర్పాటు చెయ్యడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?
ళీ సమావేశానికి ఆహ్వానాన్ని ప్రతి యింటికీ అందజెయ్యడం.
ళీ ఉదయం పూటగాని సాయంత్రం వేళగాని, అందరూ యిళ్ళల్లో ఉండే సమయంలో, కొందరు వాలంటీర్లు యింటింటికీ వెళ్ళి, ప్రజాసభ ఉద్ధేశాన్ని వివరించి, వాళ్ళను సమావేశానికి వచ్చే విధంగా ప్రోత్సహించడం అవసరం. ఇలా కొన్ని పర్యాయాలు జరిగితే, వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్ళ వలసిన అగత్యం తప్పుతుంది. తర్వాత ఎవరి ద్వారానయినా కర పత్రాన్ని పంపితే సరిపోతుంది.
ళీ డిప్యూటీ కమిషనర్‌కీ, స్ధానిక అధికారులకీ కౌన్సిలర్ ఉత్తరాలు రాయాలి - తాను ప్రజాసభను ఏర్పాటు చేసినట్లు, సమావేశానికి వాళ్ళను ఆహ్వానిస్తూ, వాళ్ళ సహకారాన్ని అర్ధించడం మర్యాదగా ఉంటుంది. భవిష్యత్తులో జరిగే ప్రజాసభ సమావేశాలకు ఆహ్వానాన్ని ఫోన్ ద్వారా చెబుతామని, వాళ్ళను సమావేశంలో పాల్గొనమని తన అభ్యర్ధనను వారికి ఉత్తరంలోనే వ్రాయాలి.
ళీ తాను ప్రజాసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్‌కీ, గవర్నర్‌కి తెలియజెయ్యడం సముచితం.
ప్రజలను సవిూకరించడం ఎలా?
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా సవిూకరించవచ్చు. కొన్ని సూచనలు - కరప్రతాలు పంచడం. ఇంటింటికి వెళ్ళి ప్రజాసభ ఆలోచనలుతెలియజెయ్యడం. ఏదైన పార్కులో, ఓసాయంత్రం, ప్రజాసభ వీడియో ప్రదర్శించడం. ప్రజాసభ జరిగే రోజు ఉదయం, అంతకు ముందు రెండుమూడు రోజులనుండి, ప్రకటనలు యివ్వడం. (టాంటాం వెయ్యవచ్చు)
సమావేశానికి ఆహ్వానం, కరపత్రాలు తయారు చేసే విధానంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. రెచ్చగొట్టే విధంగా అవి ఉంటే, ఎక్కువ మంది సభలకు వస్తారు.
కరపత్రాన్ని ఎలా రూపొందించాలి?
చూడ్డంతోనే ప్రజలను ఆకట్టుకొనే విధంగా విషయాన్ని ఆకర్షణీయంగా వివరిస్తే, సభలో ఎక్కువ మంది పాల్గొంటారు. అందులో ఎక్కువ విషయాలు స్ధానిక సమస్యల చర్చలే ఉండాలి. ఎలాగంటే - మునిసిపల్ ఇంజనీర్‌ని సభముందు హాజరు కమ్మని మయూర్ విహార్ సమన్లు జారీ చేసింది.'' లేక ''మొట్టమొదటిసారిగా మునిసిపల్ నిధులనూ అధికారులనూ శాసించే హక్కు ప్రజలకు దక్కింది.''
సమావేశం వివరాలను ఎలా రికార్డు చెయ్యాలి?
నిర్ణయాలను రాయడంలో మెలకువలు పాటించాలి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సృష్టంగా ఉండవు. సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలలో ఉన్న అర్ధాన్ని గ్రహించాలి. సమావేశం చివర్లో ఆనాటి సమావేశపు వివరాల రికార్డును (మినిట్స్) చదివి వినిపించడం చాలమంచిది. అన్ని విషయాలను సరిగ్గా రికార్డు చేసినట్లు సభికులు తెలుసుకుంటారు.
ప్రజలు నిర్ణయాలు చెయ్యగలరా?
ఇటువంటి సమావేశాల్లో ప్రజలు, తమతమ పార్టీల పక్షాన కీచులాడుకుంటారే గాని, నిర్ణయాలు చెయ్యలేరు అన్నది పలువురి అభిప్రాయం.
ఇంతవరకు జరిగిన ప్రజాసంఘ సమావేశాల్లో యీ అభిప్రాయం నిజంకాదని తేలింది. ప్రస్తుత సమస్యలు, తక్షణ అవసరాలకు సంబంధించినంత వరకు ప్రజలు విజ్ఞతతో ప్రవర్తిస్తారు. గుంటలు పడిన రోడ్డుకు యిరువైపులా నివాసముండే స్ధానికులు, పార్టీలు ఏవైనా, ఆరోడ్డు మరమ్మత్తులు తప్పకుండా చేయించాలనే కోరతారు. వాళ్ళు గట్టిగా కేకలు వేయవచ్చు. బిగ్గరగా అరవొచ్చు గాని చివరికి నిర్ణయాలు చేస్తారు.
అందరి ఆమోదంతో, సమావేశాల ఆరంభంలోనే, ఒక సాంప్రదాయాన్ని ప్రవేశ పెడితే సభలు విచ్ఛిన్నం కాకుండ ఉంటాయి. - ఏమిటంటే,
ఏ విషయాన్ని అయినా ప్రస్తావించాలను కున్న సభ్యుడు తనపేరును ఒక కాగితం విూద రాసి, సభను నిర్వహించే వ్యక్తికి అందజేస్తే, ఆయన ఒక్కొక్క పేరును పిలిచినప్పుడు, వెళ్ళి మైకులో మాట్లాడవచ్చు. వ్యతిరేక పార్టీకి చెందిన వ్యక్తి ఎవరయినా కౌన్సిలర్‌ని నిందించాలను కున్నా, అతను మైకు దగ్గరకువచ్చి, దూషించి, తిరిగి వెళ్ళిపోతాడు. సమావేశం భగ్నం కాకుండ జరిగిపోతుంది.
దీని వెనక ఉన్న వారు ఎవరు?
స్వరాజ్ అభియాన్ అనే బానర్ క్రింద యిది నిర్వహించ బడుతున్నది. స్వరాజ్ అభియాన్ ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదు. అది రిజిష్టరు అయిన సంస్థకాదు. దానికి సెక్రటరీ, ప్రెసిడెంట్ లేరు. దానికి ఒక వర్కింగ్ కమిటీ ఉంది. అదే అన్ని నిర్ణయాలు చేస్తుంది. ఎవరయితే ఒక వార్డులో ప్రజాసభ నిర్వహించే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు వర్కింగ్ కమిటీ సభ్యులైపోతారు. వర్కింగ్ కమిటీ కనీసం నెలకొక సారి అయినా సమావేశం అవుతుంది. అవసరమైనప్పుడు ఎన్నిసార్లయినా కలుస్తుంది.
మేము మా బానర్లను ప్రజాసభల్లో ఉపయోగించవచ్చా?
ప్రజాసభ ప్రజల అసెంబ్లీ ఏ ప్రజాసంఘం అయినా తన బానర్‌ని ఉపయోగించు కుంటే చిక్కులేదు. అయితే యీ ప్రజాసభ ఆప్రజాసంఘం ఆధీనంలో ఉండే సంస్థ అన్న అభిప్రాయం కలిగే ప్రమాదముంది. కౌన్సిలర్ ప్రమేయంతో నడిచే కార్యక్రమంగా దాన్ని రూపొందిస్తే, దానిలో వచ్చేకీర్తి, అపకీర్తి కూడ ఆయనకీ దక్కుతుంది. ఆ ప్రాంతంలో రూపొందిస్తే, దానిలో వచ్చేకీర్తి, అపకీర్తి కూడ ఆయనకే దక్కుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజాసంఘాలూ (ఎన్.జి.ఓ.) తమ బానర్స్ ప్రదర్శించి నా సమస్య ఉండదు.
కౌన్సిలర్ ఆమోదించక పోతే నేను చేయగలిగిందేమిటి?
ప్రస్తుతానికి ఎక్కడయితే కౌన్సిలర్లు ఆమోదం తెలుపుతారో ఆప్రాంతాల్లో ప్రజాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఆశిస్తున్నదేమిటంటే - ఢిల్లీ లోని కౌన్సిలర్లు 50 మందికి మించి ఆమోదిస్తే, మిగిలిన వారి విూద వత్తిడి పెరుగుతుంది. వాళ్ళూ అంగీకరించే అవకాశం కలుగుతుంది. విూరు 100/150 మందిని సవిూకరించి, అందరూ కలిసి జట్టుగా ఏర్పడి, కౌన్సిలర్‌ని కలిసి గట్టిగా, మర్యాదగానే అంగీకారం తెలపమని కోరితే ప్రభావం కనబడుతుంది.
ప్రజాసభ సమావేశం ఎక్కడ జరగాలి - వేదిక ?
నిర్దేశించిన ప్రాంతం (మొహల్లా) పరిధిలో ఎక్కడయినా జరపవచ్చు - ఒక పార్కులోగాని, సత్రంలోగాని, ప్రజలకు అభ్యంతరాలు లేని ఏ బహిరంగ ప్రదేశంలోనయినా వీధిలోనైనా సమావేశం జరుపుకోవచ్చు.
అధికారులు రాక పోతే ఏమి చెయ్యాలి?
అధికారులు హాజరయ్యేటట్లు ప్రయత్నించడం కౌన్సిలర్ విధి. అధికారులు రాకపోతే కౌన్సిలర్‌ని నిలదీయవచ్చు.
ప్రజా సభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చెయ్యక పోతే ఏమి చెయ్యాలి?
ఏ శాఖకు సంబంధించిన తీర్మానాలు అమలు చెయ్యడం ఆశాఖాధికారుల బాధ్యత. అమలు చెయ్యని వాళ్ళను మందలించడం కౌన్సిలర్ బాధ్యత. ప్రజాసభ చేసిన తీర్మానాలను అమలు కాకపోయినందుకు అధికారులనూ, కౌన్సిలర్‌ని బాధ్యులుగా చేయాలి. కొన్ని సందర్భాల్లో అమలు చెయ్యని అధికారుల జీతాలను మరుసటి ప్రజాసభ సమావేశంలో నిలుపు చేస్తామని, లేక వాళ్ళను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తామని ప్రజలు మందలిస్తారు. నిజానికి ఆలాంటి అధికారాలు ప్రజలకు లేవు. అయినా అధికారులు భయపడతారు. అవమాన భయంతో పనులు పూర్తి చేస్తారు.
ప్రజాసభలకు చట్టబద్దత ఉందా?
లేదు. దీనికి చట్టం యొక్క రక్షణలేదు. అయితే చాలవార్డుల్లో ప్రజాసభలు పని చెయ్యడం ప్రారంభిస్తే, మనమందరం కలిసి ప్రభుత్వం పైన వత్తిడితెచ్చి, ప్రజాసభలకు గుర్తింపు నిచ్చే చట్టం చేయించవచ్చు.
ఇప్పటి వరకు ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది?
ఢిల్లీ లెప్ట్‌నెంట్ గవర్నర్ దీన్ని చాల ప్రశంసించారు. స్ధానిక పోలీసు అధికారులు ప్రజాసభల్లో పాల్గొనాలని ఆర్డరు జారీచేశారు. ఢిల్లీ మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ కూడ ప్రజాసభల్ని మెచ్చు కున్నారు. అవి ఏర్పరచిన చోట్ల వాటికి అవసరమైన మద్దతు యిస్తామని వాగ్దానం చేశారు.
ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాసభను సమర్ధించడంగాని, వ్యతిరేకించడంగాని చేస్తున్నదా?
లేదు. దానికి భిన్నంగా, రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్‌లు కూడ ప్రజాసభలతో చేతులు కలుపుతున్నారు.
ప్రజాసభల పరిధిలోకి ఏమేమి వస్తాయట
ఢిల్లీ మునిసిపాలిటీలోని అన్ని శాఖలూ వస్తాయి. రోడ్లు, పార్కులు, పారిశుధ్యం, మునిసిపల్ ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాలు, మునిసిపల్ పాఠశాలలు, వీధి దీపాలు మొదలైనవన్నీ, పోలీసు శాఖ కూడ ప్రజాసభల్లో పాల్గొంటుంది. రేషన్, డి.జె.బి. లాంటి ప్రభుత్వశాఖలను కూడా పాల్గొనమని కోరాము. కాని అది మునిసిపల్ కౌన్సిలర్ పరిధిలోకి రావు కాబట్టి వారు అప్పుడప్పుడు మాత్రం ప్రజాసభ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ప్రజా సభల వల్ల లాభాలేమిటి?
ళీ ప్రజలకు అవసరంలేని, వాళ్ళకు ప్రమేయంలేని పథకాలపై ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అయ్యేది యింతకు మునుపు. ప్రజాధనం వృధా కాకుండా ప్రజాసభ అడ్డు కోవడమే కాకుండ ప్రజలకత్యవసరమైనదిగా గుర్తించిన పథకాలపై ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది.
ళీ ప్రజాసభ సంతృప్తి ప్రకటించిన తర్వాతే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతాయి కాబట్టి అవినీతి కొంత వరకు అదుపులో ఉంటుంది.
ళీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజంగా పేదలైన వాళ్ళకే దక్కుతాయి - లబ్దిదారుల జాబితాలు బహిరంగ సమావేశాల్లో తయారవుతాయి కాబట్టి.
ళీ ప్రజల్లో ఎవరికన్నా వ్యక్తిగతంగా అన్యాయం జరిగి ఉంటే అటువంటి వ్యక్తి దాన్ని వివరించి చెప్పి, న్యాయం కోరవచ్చు - అన్ని శాఖల అధికారులూ ప్రజాసభ సమావేశంలో ఉంటారు కాబట్టి.
ళీ రాజకీయ వాదులకీ, ప్రభుత్వాధికారులకూ, జనసామాన్యానికీ (మంచి వాళ్ళకీ, చెడ్డవాళ్ళకీ కూడ) ప్రజాసభ వేదిక అవుతున్నది. సమస్యలకు సత్వర పరిష్కారాలు దొరుకుతాయి. భవిష్యత్తులో ప్రజాసభలు పెద్దపెద్ద సమస్యలకు, జఠిలమైన సమస్యలకు పరిష్కారాలు చూపవచ్చు - ప్రజా సభలకు ప్రభుత్వం ఎక్కువ అధికారాలు అప్పగించి పుష్టికలిగించి నప్పుడు.
ళీ గతంలో, రెండు ఎన్నికల మధ్యకాలంలో, రాజకీయ నాయకుల్లో జవాబుదారీ తనం లోపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి వారం బాధ్యతా యుతంగా మెలగవలసి వస్తున్నది. అసలు ప్రజల సమస్యల పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంతో మెలిగే అధికారులు యిప్పుడు ప్రజల సమస్యల పట్ల బాగా స్పందిస్తున్నారు.

No comments:
Post a Comment