ఆర్యా! రాజ్యాంగ సభ పనిని వెనక్కి వెళ్ళి చూస్తే, అది మొదటిసారి సమావేశమయిన 9 డిశంబరు 1946 నుండి ఇప్పటికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులయ్యాయి. ఈ కాలంలో రాజ్యాంగ సభ మొత్తం విూద 11 సమావేశాలు నిర్వహించింది. ఈ 11 సమావేశాల్లో, మొదటి 6 సమావేశాలు ''లక్ష్యాల'' పై తీర్మానం చేయడానికి, ప్రాథమిక హక్కులపై కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడానికి, కేంద్ర రాజ్యాంగమూ, దాని అధికారాలూ, రాష్ట్రాల రాజ్యాంగమూ, మైనార్టీలు, షెడ్యూల్డు, ఏరియాలు, షెడ్యూల్డు తెగలు పై తీర్మానాలు చేయడానికి వినియోగమయ్యాయి. 7 నుండి 11వ సమావేశాలు వరకు రాజ్యాంగ ముసాయిదాను పరిశీలించడానికి వినియోగింపబడ్డాయి. రాజ్యాంగ సభ ఈ 11 సమావేశాలకు 165 రోజులు వాడుకొంది. వీటిలో సభ రాజ్యాంగ ముసాయిదా పరిశీలనకు 114 రోజులు ఉపయోగించింది.
ఇక ముసాయిదా కమిటీ విషయానికి వద్దాం. 29 ఆగస్టు 1947న రాజ్యాంగ సభవారిచే ఇది ఎన్నుకోబడింది. ఈ కమిటీ 30 ఆగస్టున తన మొదటి సమావేశం జరుపుకొంది. 30 ఆగస్టు నుండి ఇది 141 రోజులు సమావేశమయింది. ఈ సమయంలో రాజ్యాంగ ముసాయిదా తయారీలో ఇది నిమగ్నమయింది. రాజ్యాంగ సలహాదారు తయారు చేసిన రాజ్యాంగ ముసాయిదా, ముసాయిదా కమిటీకి ఒక పాఠంలా అందజేయబడింది. ఇందులో 243 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు ఉన్నాయి. వీటిపై ముసాయిదా కమిటీ పనిచేయాలి. ముసాయిదా కమిటీ తయారుచేసి సభకు ఇచ్చిన మొదటి రాజ్యాంగ ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. దీని పరిశీలన సమయం ముగిసిన తరువాత రాజ్యాంగ ముసాయిదాలో ఆర్టికల్సు 386కు పెరిగాయి. దీని తుది రూపంలో రాజ్యాంగ ముసాయిదాలో 395 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు చోటు చేసికొన్నాయి. ఈ రాజ్యాంగం ముసాయిదాకు వచ్చిన సవరణల సంఖ్య దాదాపుగా 7635. వీటిలో సభలో ప్రవేశపెట్టబడిన సవరణల మొత్తం సంఖ్య 2473.
ఈ వాస్తవాలు నేను ఎందుకు చెపుతున్నానంటే ఒక సందర్భంలో తన పని పూర్తి చేయడానికి సభ చాలాకాలం తీసుకుంటూ వుంది అని ఆరోపించారు. ఇది చాలా తీరకగా పని చేస్తూ వుందనీ, ప్రజాధనం దుబారా చేస్తూ వుందని ఆరోపించారు. రోము నగరం తగలబడిపోతుండగా నీరో పిడేలు వాయిస్తూ కాలంగడుపుతున్నట్లుగా వుందని ఆరోపించారు. ఈ పిర్యాదు న్యాయమైనదేనా? ఇతర దేశాల్లో రాజ్యాంగ సభలు తమ రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ఎంతకాలం తీసికొన్నదీ గమనించాలి. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. అమెరికన్ కన్‌వెన్‌షన్ 25 మే 1787 సమావేశమయింది. 17 సెప్టెంబరు 1787 అంటే నాలుగు నెలల్లో తన పని పూర్తి చేసింది. కెనడా దేశపు రాజ్యాంగ సభ 10 అక్టోబరు 1864న సమావేశమయింది. రాజ్యాంగం, 1867 మార్చి నెలలో చట్టం ఆమోదింపబడింది. 2 సంవత్సరాల 5 నెలలు పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగ సభ 1891 మార్చి నెలలో సమావేశమయింది. రాజ్యాంగం 9 జూలై 1900న చట్టంగా ఆమోదించబడింది. 9 సంవత్సరాలు పట్టింది. దక్షణాఫ్రికా 1908 అక్టోబరులో సమావేశమైనది. రాజ్యాంగం 20 సెప్టెంబరు 1909న చట్టమయింది. ఒక సంవత్సరం పట్టింది. అమెరికన్, దక్షిణాఫ్రికను సభలకంటే, మేము ఎక్కువ సమయం తీసికొన్నమాట నిజమే. కాని కెనడా సభవారికంటే ఎక్కువ సమయం తీసికోలేదు. ఆస్ట్రేలియా సభకంటే చాలా తక్కువ సమయం తీసుకొన్నాము. పట్టిన సమయాలపోలిక చేసేటప్పుడు, రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి : అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రాజ్యాంగాలు, మన రాజ్యాంగం కంటే చాలి చిన్నవి. మన రాజ్యాంగంలో, నేను ముందుగా చెప్పినట్లుగా 395 ఆర్టికల్సు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగంలో 7 ఆర్టికల్సు మాత్రమే. వీనిలో మొదటి నాలుగింటిని విభాగాలుగా చేసారు. ఈ విభాగాలు సంఖ్య 21. కెనడా రాజ్యాంగంలో 147, ఆస్ట్రేలియా దానిలో 128, దక్షిణాఫ్రికా దానిలో 153 విభాగాలు ఉన్నాయి. రెండవది : అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రాజ్యాంగ నిర్మాతలకు సవరణల సమస్య లేదు. ప్రవేశపెట్టిన వెంటనే ఆమోదింపబడ్డాయి. ఈ రాజ్యాంగ సభ 2473 సంవరణలతో వ్యవహరించవలసి వచ్చింది. ఈ వాస్తవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొంటే - కాలయాపన అనే ఆరోపణ పూర్తి ఆధారరహితం అనిపించకపోదు. ఇంత తక్కువ సమయంలో ఇంత బృహత్కార్యాన్ని పూర్తి చేసినందుకు ఈ సభ తనను తాను అభినందించుకోవచ్చు.
ముసాయిదా కమిటీ చేసిన పని విశిష్టతను గమనిద్దాం. నజీరుద్దీన్ అహ్మద్ గారు దీనిని సమూలంగా ఖండించడమే తన విధిగా భావించారు. ఆయన అభిప్రాయంలో ముసాయిదా కమిటీ చేసిన పని మెచ్చుకోదగినది కాదు. పైగా అందుకు చాలా దిగువుగా ఉంది. ముసాయిదా కమిటీ చేసిన పని గురించి ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగివుండే హక్కు వుంది. నజీరుద్దీన్ గారు కూడా తన అభిప్రాయం కలిగి వుండడం ఆహ్వానించదగిందే. నజీర్ అహ్మద్ గారు, ముసాయిదా కమిటీలోని ఇతర సభ్యుల కంటే తనే ఎక్కువ తెలివితేటలు కలవానినని భావిస్తారు. ఆయన భావాన్ని ముసాయిదా కమిటీ సవాలు చేయడానికి ఇష్టపడడం లేదు. రాజ్యాంగ సభ ఆయనను ఈ కమిటీకి తగినవాడనిముసాయిదా కమిటీ చేసిన పని విశిష్టతను గమనిద్దాం. నజీరుద్దీన్ అహ్మద్ గారు దీనిని సమూలంగా ఖండించడమే తన విధిగా భావించారు. ఆయన అభిప్రాయంలో ముసాయిదా కమిటీ చేసిన పని మెచ్చుకోదగినది కాదు. పైగా అందుకు చాలా దిగువుగా ఉంది. ముసాయిదా కమిటీ చేసిన పని గురించి ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగివుండే హక్కు వుంది. నజీరుద్దీన్ గారు కూడా తన అభిప్రాయం కలిగి వుండడం ఆహ్వానించదగిందే. నజీర్ అహ్మద్ గారు, ముసాయిదా కమిటీలోని ఇతర సభ్యుల కంటే తనే ఎక్కువ తెలివితేటలు కలవానినని భావిస్తారు. ఆయన భావాన్ని ముసాయిదా కమిటీ సవాలు చేయడానికి ఇష్టపడడం లేదు. రాజ్యాంగ సభ ఆయనను ఈ కమిటీకి తగినవాడని నియమించినపుడు, ముసాయిదా కమిటీ ఆయనను తమ మధ్యకు స్వాగతించి తీరుతుంది. రాజ్యాంగ నిర్మాణంలో తనకు స్థానం లేదంటే - అది ముసాయిదా కమిటీ తప్పుకాదు.
నజీరుద్దీన్ అహ్మద్‌గారు, ముసాయిదా కమిటీ పట్ల తన అసహ్యాన్ని చూపించడం కోసం, దీనికొక కొత్తపేరు పెట్టారు. డ్రాఫ్టింగు కమిటీకి బదులు డ్రిప్టింగు కమిటీ అన్నారు. ఈ ఆక్షేపణతో ఆయన నిస్సందేహంగా ఆనందించి వుండాలి. అదుపు లేక కొట్టుకుపోవడానికి, అదుపుతో కొట్టుకుపోవడానికీ తేడా వున్నట్లు ఆయనకు సరిగా తెలిసివుండదు. (ఈజీరితీశి అంటే ప్రవాహానికి కొట్టుకుపోవడం) ముసాయిదా కమిటీ కొట్టుకుపోయినట్లయితే దానికి పరిస్థితులపై అదుపు లేక కాదు. చేపను పట్టే అదృష్టానికి, సాధారణంగా గేలం వేయడం లాంటిది కాదు ఇది. మనం వెదికే చేపను పట్టడం కోసం, మనకు పరిచితమయిన నీళ్ళలో పరిశోధించడం వంటిది. నజీరుద్దీన్ అహ్మద్‌గారు ముసాయిదా కమిటీకి ఇదొక ప్రశంసగా ఇవ్వనప్పటికీ - ముసాయిదా కమిటీకి ఇదొక ప్రశంసగా స్వీకరిస్తున్నాను. సవరణలను వెనక్కి తీసి వేయడంలో ధైర్యాన్ని నిజాయితీని చూపించి ఉండకపోతే, ముసాయిదా కమిటీ, లేనిపోని వ్యర్థ అభిమానానికి కర్తవ్య వైఫల్యానికి లోనయివుండేది. తనకు ఉత్తమమనిపించినవి తప్ప లోపభూయిష్టమైనవీ, పునరుక్తులుగా వచ్చినవి వెనక్కి తీయించింది. ఇది పొరబాటు అంటే - ఇటువంటి పొరబాట్లు చేయడానికి ముసాయిదా కమిటీ సిగ్గుపడదనీ - వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళుతుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.
ముసాయిదా కమిటీ చేసినపని, ఒకే ఒక రాజ్యాంగ సభ సభ్యుడు మినహా, అందరూ ఏకగ్రీవంగా సంతృప్తి ప్రకటించారు. ఇందుకు ఆనందిస్తున్నాను. ఇంత మంచి మాటలతో తమ సేవలకు తక్షణ గుర్తింపు లభించినందుకు ముసాయిదా కమిటీ వారు సంతోషపడుతున్నారని నమ్ముతున్నాను. ముసాయిదా కమిటీలోని నా సహచరులూ, రాజ్యాంగ సభలోని సభ్యులూ నా పై కురిపించిన ప్రశంసల వర్షానికి, నేను ఉప్పొంగిపోతున్నాను. వీరికి కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు. ఎస్.సి.ల ప్రయోజనాలను కాపాడాలని తప్ప మరే పెద్ద ఆశతోనూ, నేను రాజ్యాంగ సభలోనికి రాలేదు. ఇంత బాధ్యతాయుతమైన పనిని నాకు అప్పగిస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. రాజ్యాంగ సభ నన్ను ముసాయిదా కమిటీకి ఎన్నుకొన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ముసాయిదా కమిటీ నన్ను అధ్యకక్షునిగా ఎన్నుకొన్నప్పుడు మరీ ఆశ్చర్యం కలిగింది. ముసాయిదా కమిటీలో నా మిత్రుడు సర్ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ గారితో, నా కంటే పెద్దలూ, శ్రేష్ఠులూ, సమర్ధులూ ఉన్నారు. నాపై ఇంత పెద్ద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి నన్ను తమ పనిముట్టుగా ఎన్నుకొని, దేశానికి సేవ చేసే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, రాజ్యాంగ సభ, ముసాయిదా కమిటీ వారికి నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను, (హర్షధ్వానాలు)
నాకిచ్చిన గౌరవం నిజానికి నాకు చెందదు. ఈ గౌరవంలో కొంత సర్. బి.ఎన్.రావు గారిది. వీరు రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా పని చేసారు. ముసాయిదా కమిటీ పరిశీలనకు వీరు ఒక రాజ్యాంగపు చిత్తుప్రతిని తయారు చేసారు. మిగిలిన గౌరవం ముసాయిదా కమిటీ సభ్యులకు చెందాలి. లోగడ నేను చెప్పినట్లుగా, ఈ సభ్యులు 141 రోజులు సమావేశమయ్యారు. కొత్త సూత్రాలను రూపొందించే బుద్ధి కుశలత వారికి లేకపోయినా, వివిధ అభిప్రాయాలను సహనంతో ప్రోదిచేసే శక్తి లేకపోయినా, రాజ్యాంగ నిర్మాణ బాధ్యత ఇంత విజయవంతంగా ముగింపుకు వచ్చేదికాదు. ఈ రాజ్యాంగానికి ముఖ్య లేఖరి ఎన్.ఎన్. ముఖర్జీ గార్కి, ఈ గౌరవంలో ఎక్కువ భాగం చెందుతుంది. చాలా క్లిష్టమైన ప్రతిపాదనలను, అతి సులభంగా, అతి స్పష్టమైన చట్టరూపంలో పెట్టే ఆయన శక్తి అసమానమైనది. ఆయనలో కష్టపడే గుణం కూడా అసమానమైనదే. ఆయన రాజ్యాంగ సభకు పెన్నిధి వంటివాడు. ఆయన సహాయం లేకపోతే రాజ్యాంగ సభ రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడానికి ఇంకా ఎన్నో ఏళ్ళు తీసికొనేది. ముఖర్జీ గారి చేతికింద పని చేసే సిబ్బందిని పేర్కొనకుండా వుండలేను. వారు ఎంత కష్టపడి పనిచేసారో నాకు తెలుసు. ఒకోసారి అర్ధరాత్రి తరువాత కూడా పని చేస్తూనే వుండేవారు. వారి కృషికీ, వారి సహకారానికీ, వారందరికీ ధన్యవాదాలు చెపుతున్నాను. (హర్షధ్వానాలు)
రాజ్యాంగ సభ రకరకాల మనుషుల గుంపుగా, సిమ్మెంటు చేయబడని రాళ్ల పేవ్‌మెంటుగా, ఇక్కడొక నల్లరాయి అక్కడొక తెల్లరాయిగా ఉన్నట్లయితే ఈ ముసాయిదా కమిటీ బాధ్యత చాలా కష్టసాధ్యమైవుండేది. ఇందులో ప్రతి సభ్యుడూ లేదా ప్రతి గ్రూపూ తమ కోసం తమకొక చట్టం అంటే ఇది కష్టసాధ్యమే కాదు. అసాధ్యం కూడా. గందరగోళం తప్ప మరేమీ జరిగివుండేది కాదు. రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ వలననే ముసాయిదా కమిటీ, కో ఆర్టికలుకూ, సవరణకు ఏం జరుగుతుందో తెలిసికూడా, రాజ్యాంగాన్ని సభలో నెగ్గించగలిగింది. సభలో ఈ రాజ్యాంగ ప్రతి సవ్యంగా నెగ్గుకురావడానికి, ఘనత అంతా కాంగ్రెసు పార్టీదే.
సభ్యులందరూ పార్టీ క్రమశిక్షణా పగ్గాలకు లొంగి వుంటే రాజ్యాంగ సభలో చర్చలన్నీ చాలా చప్పగా, పేలవంగా జరిగి వుండేవి. పార్టీ క్రమశిక్షణ, ఈ సభను నిర్దయగా తాబేదార్లకూటమిగా మార్చివుండేది. అదృష్టవశాత్తూ కొందరు తిరుగుబాటుదారులున్నారు. వారు కామత్ గారు, డా. పి.ఎస్.దేశ్‌ముఖ్‌గారు, సిధ్వాగారు, ప్రొ. సక్సేనా గారు మరియు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవగార్లు. వీరితో పాటుగా నేను ప్రొ.కె.టి.షా గారిని మరియు పండిట్ హృదయనాథ్ కుంజ్రు గారిని పేర్కొనితీరాలి. వారు లేవనెత్తిన అంశాలు చాలా వరకు సిద్ధాంతపరమైనవి. వారి సలహాలను నేను ఒప్పుకోనంత మాత్రాన వాటి విలువ తగ్గదు. సభా కార్యక్రమాన్ని జీవవంతం చేయడంలో వారిసేవ ఏ మాత్రం తక్కువ కాదు. వారికి నేను కృతజ్ఞుణ్ణే. ఏ సూత్రాల పై రాజ్యాంగం ఆధారపడివుందో - వాటిని వారికి వివరించే అవకాశం నాకు లేకుండాపోయింది. ఈ రాజ్యాంగాన్ని పాస్ చేయించడం లాంటి యాంత్రిక కార్యం కంటే ఇది చాలా ముఖ్యం.
అధ్యక్షా! ఈ సభ కార్యకలాపాలను నిర్వహించిన తీరునకు చివరగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సభా సభ్యుల పట్ల మీరు చూపించిన సౌజన్యము, మర్యాదా, ఈ సభా కార్యకలాపాల్లో పాలుపంచుకొన్నవారెవరూ మర్చిపోలేరు. ముసాయిదా కమిటీ సవరణలు పూర్తిగా సాంకేతికపరంగా ఉన్నాయని వాటిని త్రోసిపుచ్చాలనే సందర్భాలు ఏర్పడ్డాయి. అవి నాకు చాలా ఆందోళన కలిగించిన సమయాలు. రాజ్యాంగ నిర్మాణ కార్యాన్ని న్యాయ సాంకేతికత ఓడించకుండా చూసినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. రాజ్యాంగాన్ని ఎంత ఎక్కువగా సమర్ధించవచ్చునో అంత ఎక్కువగా నా మిత్రులు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యరుగారు టి.టి. కృష్ణమాచారి గారు సమర్ధించారు. కాబట్టి, ఈ రాజ్యాంగ యోగ్యతల గురించి నేను మాట్లాడను. ఎందుచేతనంటే నాకొకటి అనిపిస్తుంది. ''రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్ళయితే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం; రాజ్యాంగం ఎంత చెడ్డదయినా దానిని అమలుపరిచే వాళ్ళు మంచివాళ్ళయితే - అది మంచిదవడం కూడా అంతే ఖాయం''. రాజ్యాంగం పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపం పై మాత్రమే ఆధారపడి వుండదు. రాజ్యాంగం దేశానికి శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలను మాత్రమే అందించగలదు. ఈ మూడు శాఖలు, ప్రజలపైనా, వారు ఏర్పాటు చేసికొన్న రాజకీయ పార్టీలపైన ఆధారపడి పనిచేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజల కోరికలకు, వారి రాజకీయాలకు పనిముట్లుగా వుంటాయి. భారత ప్రజలూ, వారి పార్టీలు ఎలా నడుచుకొంటాయో ఎవరు చెప్పగలరు? అవి తమ ఆశయాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలను అనుసరిస్తాయా? లేదా వాటిని సాధించుకోవడానికి విప్లవ విధానాలను అనుసరిస్తాయా? వారు విప్లవ విధానాలను అనుసరిస్తే - రాజ్యాంగం ఎంత మంచిదయినా - ఇది విఫలమయిపోతుందని చెప్పడానికి ఏ జ్యోతిష్కుడు అవసరం లేదు. ప్రజలూ, వారి పార్టీలు ముందు ముందు ఎటువంటి పాత్ర పోషిస్తాయో తెలియకుండా, రాజ్యాంగం పై తీర్పు చెప్పడం వృధా.
ఈ రాజ్యాంగానికి ఖండన ముఖ్యంగా రెండు స్ధానాల నుండి వచ్చింది. ఒకటి కమ్యూనిస్టు పార్టీ. రెండు సోషలిస్టు పార్టీ. వారు ఎందుకు రాజ్యాంగాన్ని ఖండిస్తున్నారు? ఇది నిజంగా చెడ్డ రాజ్యాంగమైనందువల్లనా? ''అందుకు కాదు'' అని చెప్పడానికి సాహసిస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీ వారు కార్మిక నియంతృత్వ సిద్ధాంతం పై ఆధారపడిన రాజ్యాంగం కావాలంటున్నారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పై ఆధారపడిన రాజ్యాంగం కాబట్టి వారు దీనిని ఖండిస్తున్నారు. సోషలిస్టులకు రెండు అంశాలు కావాలి. మొట్టమొదటి వారు కోరుకునేది. వారు అధికారంలోకి వస్తే ప్రయివేటు ఆస్తులన్నింటిని పరిహారం చెల్లించకుండా, సంఘపరం కాని, జాతీయం కాని చేసే స్వేచ్ఛ రాజ్యాంగం వారికివ్వాలి. వారి రెండో కోరిక రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా వుండాలి. వాటి పై ఏ విధమైన పరిమితులూ ఉండరాదు. అలావుంటే - ఒకవేళ వారు అధికారంలోకి రాకపోతే - వారు అంతులేని స్వేచ్ఛ కలిగివుంటారు, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే కాదు, దానిని తిరగబెట్టడానికి కూడా.
ఈ ముఖ్య కారణాలతోనే రాజ్యాంగ ఖండన జరుగుతూ వుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతమే రాజకీయ ప్రజాస్వామ్యానికి ఒకే ఒక ఆదర్శమని నేను చెప్పడం లేదు. పరిహారం లేకుండా ప్రయివేటు ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు అనే సూత్రం చాలా పవిత్రమైనదనీ - ఈ సూత్రాన్ని ఉల్లంఘించకూడదని నేను చెప్పడం లేదు. ప్రాథమిక హక్కులు ఎప్పుడూ పరిపూర్ణంగా వుండవనీ - వాటి పై పరిమితులు ఎప్పుడూ ఎత్తివేయబడవనీ - నేను చెప్పడం లేదు. నేను చెప్పదలచుకొన్నదేమిటంటే - రాజ్యాంగంలో పొందుపరచిన సూత్రాలు, ఈ తరం వారి అభిప్రాయాలని మాత్రమే. ఇది అతిశయోక్తి అని మీరు అనుకొంటే ఇవి ఈ రాజ్యాంగ సభ సభ్యుల అభిప్రాయాలని చెపుతాను. వాటిని రాజ్యాంగంలో పొందుపరచినందుకు ముసాయిదా కమిటీని ఎందుకు నిందించాలి? రాజ్యాంగ సభ సభ్యుల్ని మాత్రం ఎందుకు నిందించాలని అడుగుతున్నాను. జాపర్సన్ అమెరికాలో పెద్ద రాజకీయ వేత్త. అమెరికా రాజ్యాంగ నిర్మాణంలో చాలా పెద్ద పాత్ర తీసికొన్నాడు. ఆయన చాలా విలువైన కొన్ని అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. వీటిని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ మరిచిపోరానివి. ఒక చోట ఆయన ఇలా అంటాడు.
''మనం ఒక్కొక్క తరాన్ని ఒక ప్రత్యేక దేశంగా భావించవచ్చు. మెజారిటీ కోరికకు కట్టుబడే హక్కు ఆ తరానికి ఉంది. కాని తరువాతి తరాన్ని కట్టుబాటు చేసే హక్కు మాత్రం లేదు. ఇతర దేశవాసుల్ని కట్టుబాటు చేసే హక్కు లేదు''. మరొక చోట ఆయన ఇలా అంటాడు.
''దేశం ఉపయోగం కోసం స్ధాపించిన సంస్ధలను ముట్టుకోరాదు. మార్చకూడదు వాటి అంతానికి జవాబుదారి చేయరాదు అనేది బహుశా ఒక రాజు యొక్క అధికార దుర్వినియోగం నుండి రక్షణగా తీసికొన్న చర్య కావచ్చు. ఎందుచేతనంటే ప్రజల పట్ల ధర్మాధికారులుగా వ్యవహరించడానికి వీటికి ఎన్నో ఉచిత హక్కులు కల్పించబడ్డాయి. కాని దేశం పట్ల ఈ భావం పూర్తిగా తప్పు. ఇంకా మన న్యాయవాదులూ, మత గురువులూ సాధారణంగా ఇదే భావాన్ని బోధిస్తున్నారు. మన పూర్వ తరాలు మన కంటే ఎక్కువగా ఈ భూమిని స్వేచ్ఛగా ఉంచాయని ఊహిస్తున్నారు. మనపై మనం చట్టాల్ని విధించుకొనే హక్కువుంటే దాన్ని మనం మార్చకూడదంటే - అదే కుదిరి మనం భవిష్యత్తు తరాలకు బరువు బాధ్యతలు విధిస్తూ చట్టాలు చేయవచ్చు. వాటిని మార్చే అధికారం భవిష్యత్తు తరాలకు లేదు అంటే - ఈ భూమి శవాలకు మాత్రమే చెందుతుంది. సజీవులకు మాత్రం కాదు''.
జాఫర్సన్ చెప్పినది కేవలం సత్యమే కాదు. సంపూర్ణ సత్యంగా నేను భావిస్తున్నాను. ఇందులో వివాదానికి తావులేదు. రాజ్యాంగ సభ జాఫర్సన్ చెప్పిన ఈ సూత్రాన్ని పాటించకపోయినట్లయితే - ఈ సభ నిందార్హమవుతుంది. శిక్షార్హం కూడా అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇది అలా చేసిందా? (పాటించలేదా) ఎంత మాత్రం చేయలేదు. రాజ్యాంగ సవరణకు చేసిన ఏర్పాటును ప్రతి ఒక్కరూ పరిశీలించాలి. రాజ్యాంగానికి ఇదే తుది రూపం. ఇక మార్పులుండవు అని ఈ సభ దీని పై తమ ముద్ర వేయలేదు. దీనికి సవరణలు చేసికొనే అధికారాన్ని ప్రజలకు కెనడాలో మాదిరిగా నిరాకరించలేదు. ఆస్ట్రేలియా, అమెరికాలలో మాదిరి అసాధారణ షరతులకూనిబంధనలకూ లోబడి సవరణలు చేయాలని అనలేదు. మన రాజ్యాంగ విమర్శకులకు నేనొక సవాలు చేస్తున్నాను. ఏ రాజ్యాంగ సభ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో - రాజ్యాంగ సవరణకు ఇంత సులభ విధానాన్ని ఏర్పాటు చేసిందేమో రుజువు చేయమని ఈ విమర్శకుల్ని కోరుతున్నాను. రాజ్యాంగంతో అసంతృప్తి చెందిన వారు మూడు వంతులలో రెండు వంతుల మెజారిటీతో సవరణ చేసుకోవచ్చు. వయోజన వోటింగు పై ఎన్నిక కాబడిన పార్లమెంటులో తమకు అనుకూలంగా రెండు వంతుల మెజారిటీ లేకపోతే - రాజ్యాంగం పట్ల వారి అసంతృప్తి సామాన్య ప్రజానీకం పంచుకోవడం లేదని అర్ధం.
రాజ్యాంగ ప్రధానమైన ఒకే ఒక అంశం గురించి, ఇక్కడ నేను ప్రస్తావించాలను కొంటున్నాను. ఇందులో కేంద్రాధికారం ఎక్కువగా వుందనీ - రాష్ట్రాలు పురపాలక సంఘాల స్థాయికి దిగజారాయని ఒక తీవ్ర ఆక్షేపణ వుంది. ఇది అతిశయోక్తి కాదు. కాని దురవగాహన పై ఆధారపడిన ఆక్షేపణ. రాజ్యాంగం సరిగా ఏది చేయడానికి ఏర్పాటు అయిందో అది అర్ధం చేసుకోని దురవగాహన. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి, ఏ ప్రాథమిక సూత్రం పై అవి ఆధారపడి వున్నాయో దృష్టిలో వుంచుకోవాలి. ఫెడరిలిజంలో ప్రధాన సూత్రం ఏమిటంటే - శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారం, కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ కావాలి. ఈ పంపిణీ కేంద్రం చేసే చట్టాల వల్ల కాదు. రాజ్యాంగం ద్వారానే జరగాలి. ఇదే రాజ్యాంగం చేస్తూ వుంది. మన రాజ్యాంగంలోని రాష్ట్రాలు, తమ శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారాలకు కేంద్రం పై ఆధారపడవు. ఈ విషయంలో కేంద్రమూ, రాష్ట్రాలూ సరిసమానంగా వున్నాయి. ఇటువంటి రాజ్యాంగం, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఎలాకట్టబెడుతుంది? రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ రంగాల్లో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారాలను అప్పగించి వుండవచ్చు. ఇతర ఫెడరల్ రాజ్యాంగాలలోని వాటికంటే ఇవి ఎక్కువ కావచ్చు. ఇంకా మిగిలిపోయిన అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి. రాష్ట్రాలకు కాదు. కాని ఈలక్షణాలు ఫెడరలిజమ్ తత్వాన్ని రూపొందించవు. ఫెడరలిజానికి ప్రధాన గుర్తు ఏమిటంటే - నేను ముందుగా చెప్పినట్లుగా - రాజ్యాంగం ద్వారానే కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య శాసన నిర్మాణ, కార్య నిర్వాహక అధికారాలు పంపిణీ, ఇదే సూత్రాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచాం. ఈ విషయంలో ఎంత మాత్రం పొరబాటు లేదు. అందుచేత రాష్ట్రాలు కేంద్రానికి దిగువగా ఉంచబడ్డాయని చెప్పడం తప్పు. కేంద్రం తన యిష్టానుసారం ఈ పంపిణీ హద్దుల్ని మార్చలేదు. న్యాయశాఖ కూడా మార్చలేదు. ఎందుకంటే, ఈ దిగువ విధంగా చెప్పాము. ''కోర్టులు మార్పులు చేయవచ్చు. ప్రత్యామ్నాయాలు ఇవ్వలేవు. క్రొత్త వాదనలూ, క్రొత్త దృక్పథాలూ ముందుకు వచ్చినపుడు, అవి పాత భాష్యాలను పునర్విమర్శచేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సరిహద్దు రేఖను కొంచెం మార్చవచ్చు. అయినా కోర్టులు ఉల్లంఘించరాని హద్దులున్నాయి. ఖచ్చితంగా చేసిన అధికార పంపిణీని అవి తిరిగి కేటాయించలేవు. అవి ఉన్న అధికారాలను విస్త్రృతం చేయవచ్చు. అంతేకాని, అవి ఒక దానికి స్పష్టంగా ఇచ్చిన అధికారాలను మరొకదానికి ఇవ్వలేవు.
కాబట్టి ఫెడరలిజాన్ని భంగపరుస్తూ కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టుబెట్టామనే మొట్టమొదటి నిందారోపణ అర్ధరహితం. రెండవ ఆరోపణ ఏమిటంటే - కేంద్రానికి రాష్ట్రాలను లెక్కచేయకుండా వ్యవహరించే అధికారలున్నాయనడం. ఈ ఆరోపణను అంగీకరించాలి. ఇంత మితిమీరిన అధికారాలను కలిగివున్నందుకు రాజ్యాంగాన్ని అభిశంసించే ముందు, కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే - ఈ మితిమీరిన అధికారాలు రాజ్యాంగానికి సాధారణ లక్షణంగా వుండవు. ఈ అధికారాల వాడుక, ఆచరణ ఆత్యయిక పరిస్ధితులకు మాత్రమే ఖచ్చితంగా పరిమితం చేయబడ్డాయి. రెండవ విషయం ఏమిటంటే - అత్యయిక పరిస్ధితి ఏర్పడినప్పుడు కేంద్రానికి మితిమీరిన అధికారాలు ఇవ్వకుండా తప్పించుకోగలమా? అత్యయిక పరిస్ధితిలో కూడా, కేంద్రానికి మితిమీరిన అధికారాలు ఇవ్వడాన్ని సమర్ధించలేని వాళ్ళు. దీనికి మూలకారణాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారన్న మాట. ది రౌండ్ టేబిల్ అనే ప్రసిద్ధ పత్రికలో ఒక రచయిత ఈ సమస్యను అతి స్పష్టంగా చర్చించాడు. ఈ పత్రిక డిశంబరు 1935 నాటిది. దాని నుండి ఈ దిగువ భాగాన్ని ఉదహరిస్తున్నాను. రచయిత ఇలా అంటున్నాడు.
''రాజకీయ విధానాలు హక్కులకూ విధులకూ చెందిన సమస్య. పౌరుడు ఎవరికి లేదా ఏ అధికారానికి తన విధేయతను చూపించాలి అనేది ప్రధాన సమస్య. సాధారణ వ్యవహరాల్లో ఈ సమస్య రాదు. ఎందుకంటే చట్టం తన పని సజావుగా చేసుకుపోతుంది. మనిషి, ఇక్కడ ఒక అధికారానికి విధేయుడై తన పని చేసుకొంటాడు. కాని సంక్షోభం వచ్చినపుడు, హక్కులమధ్య సంఘర్షణ ఏర్పడవచ్చు. అప్పుడు అంతిమ విధేయత విభజింపరానిదిగా కనిపిస్తుంది. నిబంధనలకు న్యాయపరంగా అర్ధం చెపుతూ, ఆఖరి ప్రయత్నంగా, ఈ విధేయతా సమస్యను నిర్ధారించలేము. లాంఛనాలు ఎగిరిపోయిన పిమ్మట ప్రధాన ప్రశ్న ఏమిటంటే - ఏ అధికార శక్తి పౌరుని చివరి విధేయతను శాసిస్తుంది? అది కేంద్ర ప్రభుత్వమా? లేక రాష్ట్ర ప్రభుత్వమా''? ఈ సమస్యకు ఈ ప్రశ్న అతికీలకమైనది. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఇచ్చే జవాబు పై ఈ సమస్య పరిష్కారం ఆధారపడి వుంటుంది. అత్యయిక సమయంలో పౌరుడు కేంద్రానికే విధేయత చూపించాలి. రాష్ట్రాలకు కాదు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇందులో సందేహం లేదు. ఎందుచేతనంటే కేంద్రం మాత్రమే సమష్టి లక్ష్యాల కోసం పనిచేయగలదు; మొత్తం పై దేశం యొక్క సాధారణ ప్రయోజనాల కోసం పని చేయగలదు అందుచేతనే, అత్యయిక పరిస్ధితిలో ఉపయోగించుకోవడానికి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ అత్యయిక అధికారాల వల్ల, ఇంతకూ రాష్ట్రాల పై విధించిన బాధ్యత ఏమిటి? ఈ దిగువ చెప్పిన దానికంటే ఎక్కువేమీ కాదు - అత్యయిక పరిస్ధితిలో రాష్ట్రాలు తమ స్వంత స్థానిక ప్రయోజనాలు, అభిప్రాయాలతో పాటు, దేశ ప్రయోజనాలను కూడా పరిగణనలోనికి తీసికోవాలి. ఈ సమస్యను అర్ధం చేసుకోని వారు మాత్రమే - ఇందుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తారు.
ఇక్కడ నేను దీనిని ముగించవచ్చు. కాని నా మనస్సు మన దేశ భవిష్యత్తు గురించిఆలోచిస్తుంది. మన దేశ భవిష్యత్తు పై కొన్ని ఆలోచనలను మీ ముందు ఉంచడానికి ఈ అవకాశాన్ని నేను తీసుకోవాలనిపించింది. 26 జనవరి 1950 నాడు ఇండియా స్వతంత్ర దేశమవుతుంది. (హర్షధ్వానాలు) ఈ దేశ స్వాతంత్య్రానికి ఏమి జరుగుతుంది? ఈ దేశం తన స్వాతంత్య్రాన్ని కాపాడుకొంటుందా? మళ్ళీ పోగొట్టు కొంటుందా? ఇది నా మనస్సులోనికి వచ్చిన మొదటి ఆలోచన - అంటే భారతదేశం ఎప్పుడూ స్వతంత్రంగా లేదని చెప్పడం కాదు. తనకున్న స్వాతంత్య్రాన్ని తాను ఒకసారి పోగొట్టుకొంది అని నా భావం. మరోసారి కూడా దీనిని పోగొట్టుకొంటుందా? ఈ దేశ భవిష్యత్తు గురించి ఈ ఆలోచన నన్ను చాలాకలవరపరుస్తూ వుంది. నన్ను బాగా బాధిస్తున్నదేమిటంటే - ఇండియా తన స్వాతంత్య్రాన్ని లోగడ ఒక సారికోల్పోయిందన్నది కాదు; తన ప్రజల్లోనే కొందరు చేసిన ద్రోహం, అవిధేయతల వలన ఈ దేశం స్వతంత్య్రాన్ని కోల్పోవడం. మహమ్మద్ చినకాశిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించినపుడు, దాహర్ రాజు యొక్క సేనాధిపతులు, మహమ్మద్ చినకాశిం ఏజంట్లు నుండి లంచాలు తీసికొన్నారు. రాజు తరుపున పోరాడడానికి నిరాకరించారు. మహమ్మద్ ఘోరీని, ఇండియాను ఆక్రమించమనీ, పృధ్వీరాజుతో పారాడమనీ, సోలంకిరాజుల సహాయమూ, తన సహాయమూ అందిస్తాననీ - ఆహ్వానించింది జయచంద్ - శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతుంటే - ఇతర మహారాష్ట్ర పెద్దలూ, ఇతర రాజపుత్రరాజులూ మొగలాయి చక్రవర్తుల పక్షాన యుద్ధం చేసారు. బ్రిటీషు వారు సిక్కు ప్రభువుల్ని నాశనం చేస్తూవుంటే - సిక్కుల ప్రదాన సేనాధిపతి గులాబీసింగు మౌనంగా వూరుకొన్నాడు. సిక్కు రాజ్యాన్ని కాపాడడానికి ఎంతమాత్రం సహాయపడలేదు. 1857లో భారతదేశంలో చాలా భాగం ఆంగ్లేయుల పై స్వాతంత్య్ర యుద్ధాన్ని ప్రకటిస్తే - సిక్కులు మౌన ప్రేక్షకులుగా నిలబడి వేడుక చూసారు.
చరిత్ర పునరావృత్తమవుతుందా? ఈ ఆలోచనే నాకు ఆందోళన కలిగిస్తూ వుంది. కులాలు, తెగల రూపంలో ఉన్న మన పాత శత్రువులతో పాటు వివిధమైన పరస్పర విరోధమైన రాజకీయ తత్త్వాలతో అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాము. ఈ వాస్తవం నన్ను మరీ కలచివేస్తుంది. భారతీయులు తమ తత్త్వాలకు అతీతంగా దేశాన్ని చూస్తారా? లేక దేశానికి అతీతంగా తమ తత్వాలను చూస్తారా? నాకు తెలియడం లేదు. కాని ఒకటి నిశ్చయం. దేశానికి అతీతంగా పార్టీలు తమ తత్త్వాలను చూసినట్లయితే మన స్వాతంత్య్రం తప్పక కోల్పోగలదు. ఇది నిశ్చయం - స్ధిర నిశ్చయంతో మనమీ ప్రమాదాన్నుంచి దేశాన్ని కాపాడాలి. మన చివరి రక్తపు బొట్టువరకూ మన స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడానికి కంకణం కట్టుకోవాలి.
26 జనవరి 1950న ఇండియా ప్రజాస్వామిక దేశమవుతుంది, అంటే ఆ రోజు నుండి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ఇండియా కలిగి యుంటుందని అర్ధం. ఇదే ఆలోచన నా మనస్సుకు వచ్చింది. తన ప్రజాస్వామిక రాజ్యాంగానికి ఏమి జరుగుతుంది? దీనిని మన దేశం నిలబెట్టుకోగలదా? దీనిని మళ్ళీ కోల్పోతుందా? ఇది నా మనస్సులోకి వస్తున్న రెండో ఆలోచన. మొదటి ఆలోచన కలిగిస్తున్నంత ఆందోళనా ఇదీ నాకు కలిగిస్తుంది.
ఇండియాకు ప్రజాస్వామ్యమంటే తెలియదు అని చెప్పడం నా భావం కాదు. పూర్వం ఒకానొకప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలుండేవి. రాజరికాలు ఉన్నప్పటికీ ఇవి వుండేవి. ఈ ప్రభుత్వాలు ఎన్నుకోబడేవి. పరిమితంగా వుండేవి. అవి సర్వాధికారాలతో వుండేవి కావు. అంటే ఇండియాకు పార్లమెంటులు లేవనీ - పార్లమెంటరీ విధానం తెలియదనీ నా ఉద్దేశం కాదు. బౌద్ధ సంఘాలంటే పార్లమెంటులే. ఈ సంఘాలకు పార్లమెంటరీ విధాన నిబంధనలు అన్నీ తెలుసు. వాటిని పాటించాయి. ఆధునిక కాలానికి తెలిసిన విధానాలు వాటికీ తెలుసు. సీట్ల సర్దుబాటు గురించి వాటికి నిబంధనలున్నాయి. చట్టాలు ప్రవేశపెట్టడం గురించి నిబంధనలున్నాయి. తీర్మానాల గురించి ''కోరం'' గురించి, విప్స్ గురించి ఓట్ల లెక్కింపు గురించి, బాల్లెట్ బాక్సులో వోటు వేయడం గురించి, అభిశంసన తీర్మానం గురించి, క్రమబద్దీకరణ గురించి వగైరాల గురించి వారికి నిబంధనలున్నాయి. పార్లమెంటరీ విధానానికి ఈ నిబంధనలను బుద్ధుడు సంఘ సమావేశాలకు ఆచరణలో పెట్టినా - బుద్ధుడు ఆనాడు దేశంలో పని చేస్తున్న రాజకీయ సభల నిబంధనల నుండే, వీటిని గ్రహించి వుండాలి.
ఈ ప్రజాస్వామిక విధానాన్ని భారతదేశం కోల్పోయింది. రెండోసారి కూడా దీనిని కోల్పోతుందా? నాకు తెలియదు. ఇండియా వంటి దేశంలో ఇది అసాధ్యం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం చాలా కాలంగా వాడుకలో లేని మూలంగా ఇది ఏదో కొత్తగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వుంది. ఇప్పుడే పుట్టిన మన ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అలా వుంచుకొంటూనే ఆచరణలో నియంతృత్వానికి దారితీయవచ్చు. ఈ దిగజారుడు ప్రారంభమయితే - రెండో ప్రమాదం మరీ పెద్దదిగా వుంటుంది.
స్వరూపంలోనే కాదు ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో కూడా మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నా దృష్టిలో మొట్టమొదట మనం చేయవలసింది. మన సాంఘిక, ఆర్ధిక లక్ష్యాలను సాధించుకోవడానికి మనం రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండడమే. రక్తపాతంతో కూడిన తిరుగుబాటు పద్ధతులను మనం విడిచిపెట్టాలి. సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి పద్ధతుల్ని విడిచిపెట్టాలి. సాంఘిక, ఆర్ధిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగబధ్ద పద్ధతులు లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంభించడంలో అర్ధం వుంది. కాని రాజ్యాంగ పద్ధతులు అందుబాటులో ఉండగా, రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంభించడంలో అర్ధం లేదు. ఈ రాజ్యాంగేతర పద్ధతులు అరాచకత్వానికి వ్యాకరణం లాంటివి. వీటిని మనం ఎంత త్వరగా వదలుకొంటే మనకు అంత మంచిది.
మనం చేయవలసిన రెండో పని జాన్‌స్టువర్టు చేసిన హెచ్చరికను పాటించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఆసక్తి కలవారందరికీ ఆయన ఈ క్రింది హెచ్చరిక చేసారు. తమ స్వాతంత్య్రాలను ఏ గొప్ప మనిషి పాదాల వద్ద సమర్పించకూడదు. తమ సంస్ధలన్నింటిని తిరగబెట్టగలిగే అధికారాలు అతనికివ్వకూడదు. దేశానికి జీవితాంతం సేవలు చేసిన మహాపురుషులకు మనం కృతజ్ఞులమై వుండడంలో తప్పులేదు. కానికృతజ్ఞతకు కూడా కొన్ని హద్దులున్నాయి. ఐరిష్ దేశ భక్తుడు డేనియర్ ఓ కాన్నెల్ చెప్పినట్లుగా తన ఆత్మగౌరవానికి భంగకరంగా ఏ మనిషీ కృతజ్ఞుడుగా వుండలేడు. తన శీలానికి భంగం కలిగేలా ఏ స్త్రీ కృతజ్ఞురాలుగా ఉండలేదు. తన స్వాతంత్య్రానికి భంగం కలిగేలా, ఏ దేశమూ కృతజ్ఞతగా ఉండలేదు. ఈ హెచ్చరిక, ఇతర దేశాల విషయంలో కంటే - మన దేశం విషయంలో చాలా అవసరం. ఎందుకంటే ఇండియాలో భక్తి లేదా భక్తి భావం లేదా వీరపూజ - రాజకీయాల్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో ఇతర దేశాల రాజకీయాల్లో అది పోషించే పాత్రకంటే, మన దేశంలో చాలా ఎక్కువ. మత విషయంలో భక్తి - ఆత్మ విముక్తికి ఒక మార్గం కావచ్చు. కాని రాజకీయాల్లో - భక్తి లేదా వీరపూజ - దివాళా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికి సూటిదారి.
మనం చేయవలసిన మూడోపని కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో మనం సంతుష్టిపడరాదు. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాంఘిక ప్రజాస్వామ్యం చేయాలి. సాంఘిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే - రాజకీయ స్వాతంత్య్రం నిలబడదు. సాంఘిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? స్వతంత్రం, సమానత్వం, సోదరత్వములను జీవన సూత్రాలుగా గుర్తించిన జీవనశైలియే సాంఘిక ప్రజాస్వామ్యం. స్వతంత్ర సమానత్వ సోదరత్వ సూత్రాలను, ఈ త్రయంలో విడివిడిగా చూడకూడదు. ఈ మూడింటి సమన్వయ రూపమే సాంఘిక ప్రజాస్వామ్యం. ఒక దాని నుండి మరొక దానిని విడదీస్తే - ప్రజాస్వామ్య, లక్ష్యాన్నే కూలద్రోసినట్లు స్వతంత్రం, సమానత్వం నుండి ఎన్నడూ వేరు కాలేదు. అలాగే సమానత్వం కూడా స్వతంత్రం నుండి వేరుకాలేదు. అదే మాదిరి స్వతంత్ర, సమానత్వాలు సోదరత్వం నుండి వేరు కాలేదు. సమానత్వం లేకుండా స్వతంత్ర మనేది ఎక్కువమందిపై తక్కువ మంది ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వతంత్ర సమానత్వాలు సహజరీతిలో వుండవు. వీటిని అమలు చేయడానికి ఒక కానిస్టేబులు అవసరమవుతాడు. భారతీయ సమాజంలో రెండు అంశాలు పూర్తిగా లేవని మనం గుర్తించాలి. వీటిలో ఒకటి. సమానత్వం సాంఘిక రంగంలో అసమానతలని శ్రేణి అనే సిద్ధాంతంపై, మన సమాజం ఏర్పడింది. ఇందులో కొందరికి ఔన్నత్యం, మరికొందరికి అధమత్వం ఆర్ధిక రంగంలో కొద్దిమంది మహాధనవంతులు, చాలా మంది మహాదరిద్రులు ఉన్న సమాజం. 26 జనవరి 1950న, మనం పరస్పర వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాల్లో మనం సమానత్వాన్ని కలిగి వుంటాము. సాంఘిక ఆర్ధిక జీవితంలో అసమానతను కలిగి వుంటాము. రాజకీయాల్లో ఒక మనిషికి ఒకే వోటు, మరియు ఒక వోటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాము. మన సాంఘిక ఆర్ధిక జీవితంలో, మనకు గల సాంఘిక ఆర్ధిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒకే విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే వుంటాము. ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటాము? మన సాంఘిక, ఆర్ధిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటాము? మనం చాలా కాలం దీనిని నిరాకరిస్తూ పోతే - మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తున్నామన్న మాట. ఈ వైరుధ్యాన్ని వీలయినంత తొందరలో మనం తొలగించాలి. లేనట్లయితే అసమానతలతో బాధపడేవారు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్ధను విధ్వంసం చేస్తారు. ఈ రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంది.
మనలో లేని రెండో అంశం. సోదరత్వ సూత్రానికి గుర్తింపు, సోదరత్వం అంటే ఏమిటి? సోదరత్వమంటే అందరు భారతీయుల మధ్య ఒక సమష్టి సహోదర భావం. భారతీయులందరూ ఒకే ప్రజ అనే భావం. సాంఘిక జీవితానికి ఈ సూత్రం ఐక్యతనూ, సహానుభూతినీ కలిగిస్తుంది. దీనిని సాధించడం కష్టమే. అమెరికా సంయుక్త రాష్ట్రాల గురించి అమెరికన్ కామన్ వెల్త్ అనే గ్రంధంలో జేమ్సు చ్రైస్ చెప్పిన కథ ఇది ఎంతకష్టమో తెలియజేస్తుంది.
ఆ కథ ఇది : ఈ కథను నేను చ్రైస్ మాటల్లోనే చెపుతున్నాను. అది ... కొన్ని సంవత్సరాల క్రింతం అమెరికన్ ప్రోటెస్టంట్ ఎపిస్కోపల్ చర్చివారు మూడు సంవత్సరాల కొకసారి జరిగే సమావేశం తమ ప్రార్ధనల పై పునర్విమర్శచేసారు. ఒక చిన్న వాక్యంతో కూడిన ప్రార్థనల్లో - తమ ప్రజలందరికీ ఒక ప్రార్ధన ప్రవేశపెట్టడం మంచిదని భావించారు. ఒక ప్రసిద్ద న్యూ ఇంగ్లాండు దైవ భక్తుడు ఈ ప్రార్ధన ప్రతిపాదించాడు. ''ఓ ప్రభువా! మా దేశాన్ని దీవించు'' పరిస్ధితుల ఒత్తిడిలో ఒక మధ్యాహ్నం ఆ ప్రార్ధన అంగీకరించబడింది. ఈ వాక్యాన్ని మర్నాడు పునః పరిశీలనకు పెట్టారు. దానిపై మతాభిమానవహితులు ఎన్నో అభ్యంతరాలు లేవదీసారు. దేశం అనే మాట జాతీయ ఐక్యతపై వదిలివేసారు. దానికి బదులుగా ప్రార్ధన ఇలా మారింది. ఓ ప్రభువా! ఈ సంయుక్త రాష్ట్రాలను దీవించు''
ఈ సంఘటన జరిగినప్పుడు అమెరికా ప్రజల్లో సహానుభూతి లేదు. అమెరికా ప్రజలు తామందరూ ఒకే దేశమని అనుకోలేదు. సంయుక్త రాష్ట్రాల ప్రజలు తామందరూ ఒక దేశమని అనుకోలేకపోయినప్పుడు భారతీయులు తామందరూ ఒకే దేశమని అనుకోవడం ఎంత కష్టమో ఊహించండి రాజకీయ స్పృహకల భారతీయులు!! భారతదేశ ప్రజలు'' అన్న మాటను కోపగించుకొన్న రోజులు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. భారతదేశము అనే మాటను వారు అభిమానించారు. మనం ఒకే దేశమని నమ్ముతూ ఒక పెద్ద భ్రమకు లోనవుతున్నామని నా అభిప్రాయం. ఎన్నో వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒకే దేశం ఎలా కాగలరు? సాంఘిక, మానసిక రంగాల్లో మనమింకా ఒకే దేశం కాదని ఎంత త్వరగా మనం గ్రహించితే - అంత మేలు. అప్పుడు మాత్రమే మనం ఒకదేశంగా ఉండవలసిన ఆవశ్యకతను అర్ధం చేసుకొంటాము. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా కష్టమే అవుతుంది. సంయుక్త రాష్ట్రాలలో జరిగిన దానికంటే కూడా చాల కష్టం. సంయుక్త రాష్ట్రాలకు కులం సమస్య లేదు. ఇండియాలో కులాలున్నాయి. కులాలు దేశ వ్యతిరేతికమైనవి. ఇందుకు మొదటి కారణం సాంఘిక జీవితంలో ఇవి వేరుపాటును తీసుకువస్తున్నాయి. కులాల మధ్య విద్వేషాన్ని, అసూయను వృద్ధి చేస్తున్నాయి కనుక ఇవి దేశ వ్యతిరేకమైనవంటున్నాను. నిజంగా మనం ఒక దేశంగా మారాలంటే - మనం ఈ కష్టాలన్నింటినీ అతిగమించాలి. ఒక దేశం అన్నప్పుడు, అక్కడ సోదరత్వం ఉండాలి. సోదరత్వం లేకపోతే - సమానత్వం స్వాతంత్య్రం అనేవి లోతుకు వెళ్ళని పై పై రంగుపూతలు మాత్రమే.మనముందున్న కర్తవ్యాల గురించి, ఇవి నా భావాలు. ఇవి కొందరికి రుచించకపోవచ్చు. ఈ దేశంలో రాజకీయాధికారం చాలా కాలంగా కొందరికీ ఏకస్వామ్యంగా (ఖళిదీళిచీళిజిగి) వుందనడంలో అబద్దం లేదు. చాలా మంది బరువుమోసే పశువులుగానే కాదు, బలిపశువులుగానూ ఉన్నారనడంలో అబద్దం లేదు. ఈ ఏకస్వామ్యం కేవలం వీరి అభివృద్ధి అవకాశాలను నిర్మూలించడమే కాదు. వారికి జీవితమంటే అర్ధమే తెలియకుండా చేసింది. ఈ అణగద్రొక్కబడిన వర్గాలు పాలితులుగా ఉండి ఉండి అలసిపోయాయి. తమని తాము పాలించుకోవాలని చాలా అసహనంగా వున్నాయి. అణగద్రొక్కబడిన వర్గాల్లో తమ సొంత గుర్తింపుకై పడే ఆరాటం ఒక రకపు పోరాటంగా కాని లేదా ఒక వర్గ పోరాటంగా కాని మారనివ్వకూడదు. అది ఇంటిని ముక్కలు చేయడానికి దారి తీస్తుంది. అది నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తం అవుతుంది. అబ్రహం లింకన్ చెప్పినట్లుగా ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా తానే చీలికలయితే - అది ఎక్కువ కాలం నిలబడలేదు. వారి ఆశను నెరవేర్చడానికి ఎంత త్వరగా ప్రయత్నం జరిగితే కొద్ది మందికైనా అంతమంచిది. దేశానికి అంతమంచిది. ఈ స్వాతంత్య్ర రక్షణకు అంత మంచిది. ఈ ప్రజాస్వామిక రక్షణకు అంత మంచిది. జీవనరంగాలన్నింటిలో, సోదరత్వమూ, సమానత్వమూ ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యం. అందువల్లనే, నేను వాటి గురించి ఇంత నొక్కి వక్కాణిస్తున్నాను.
ఇంకా ఎక్కువ సేపు మాట్లాడి ఈ సభకు విసుగు కలిగించదలచుకోలేదు. స్వాతంత్య్రం అనేది, నిస్సందేహంగా ఒక సంతోషకర విషయం. కాని ఈ స్వాతంత్య్రం మనపైన, పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టిందన్న విషయం మరిచిపోకూడదు. ఏదైనా మనకు చెడు జరిగితే దానికి ఆంగ్లేయులే బాధ్యులు అని నిందించే అవకాశం ఇక మనకు లేదు. ఇక మీదట ఏదైనా చెడు జరిగితే - మనల్ని మనం తప్ప మరెవర్నీ నిందించలేము. కొన్ని విషయాలు చెడును కలిగించే - పెద్ద ప్రమాదం వుంది. కాలం త్వరగా మారిపోతూ వుంది. మనతో పాటు ప్రజలు కొత్త సిద్ధాంతాలవైపు కదులుతున్నారు. ప్రజల చేత నడపబడే ప్రభుత్వమంటే విసుగు చెందుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతున్నారు. అది ప్రజల యొక్క ప్రభుత్వమైనా, ప్రజల చేత గడపబడే ప్రభుత్వమైనా, వారు పట్టించుకోవడం లేదు. ఈ రాజ్యాంగంలో, ప్రజల యొక్క, ప్రజల కొరకు, ప్రజల చేత నడపబడే ప్రభుత్వ సూత్రాన్ని పొందుపరచడానికి ప్రయత్నించాము. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించడంలో మనం అలసించకూడదు. అలా అలసించినట్లయితే - ప్రజల చేత నడపబడే ప్రభుత్వానికి బదులుగా ప్రజల కొరకు ప్రభుత్వాన్ని వీరుకోరుకొనేలా చేస్తుంది. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి తీసికొనే చొరవలో మనం ఎంతమాత్రం బలహీనంగా ఉండరాదు. దేశానికి సేవచేసే మార్గమిదొక్కటే. ఇంతకు మించినది నాకు కానరావడం లేదు.
ఉలకరూ - పలకరేఁ?
ఒక వంక త్వంశుంఠంటే త్వంశుంఠంటూ, మరోవంక స్వయంగా ధీరులమని ప్రకటించుకుంటూ ఎవరింట్ల్లో వారు తేగ వీరాలాపాలాడే వాస్తు పక్షాల వాళ్ళు, తీరా రండి పరీక్షకు కూర్చుందాం అనంటే ఒక్కరూ ఉలకడంలా, పలకడంలా. అలాగే అభౌతిక శక్తులున్నాయంటూ తెగ వదరుతుండే వివిధ ఆస్థిక పక్షాల పండితమ్మన్యులూ నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునున్నారు. ఇక్కడికిది ఒక పార్శ్యం కాగా ఇన్ని వివరాలు అరటి పండు వలచి పెట్టినట్లు పట్టుకొచ్చి ఇంటి ముంగిటకు పత్రికనందిస్తే పాఠకులూ ఉలకరూ పలకరు!
తెలిసినవారే సమాజానికేదైనా తెలియ జెప్పడానికి అర్హులవుతారన్న జ్ఞాన (విద్య) క్షేత్రానికి చెందిన ప్రాథమిక నియమంగానీ, తెలియడమంటే ఏమిటో, తెలిసింది సత్యమో కాదో సరిచూసుకోవడమెలాగో గమనించి గాని తెలియని పండిత వేషధారులే దండిగా సమాజమంతా విస్తరించి ఉన్నారు. ఎవరికి వారు వారి పాలబడిన అమాయక, అజ్ఞాన జనాన్ని వివిధ ప్రలోభాలకులోను చేసి, ఆశాభయాలను కల్పించి, కానని వాడు కానని వారికి దారులు చూపుటన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. నిరాడంబర జనాన్ని ఇంద్రియ నిగ్రహణ, నిజాయితీలకు పెద్దపీట వేసిన ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ఉంటూ, దానికి ప్రతినిధులమని ప్రకటించుకుంటూ 'త్యాగేనైకేనమృతత్వ మానశు' అన్న తాత్విక దృష్టిని తుంగలో తొక్కి భోగైక జీవన లక్షణంతో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా అదీ దొంగ వ్యాపార క్షేత్రంగా మార్చేశారు. సన్యాసుల, సాధువుల, యోగుల, రాజయోగుల పేర్లతో వివిధ వేషధారణతో మందినెత్తికెక్కి చిందులేస్తున్నారు. మరో వంక స్వస్థత కూటాలు, ప్రార్థనా మందిరాల పేరున సంస్ధలను వెలయించి పరీక్షలు పాసవడానికీ, పెన్ను సరిగ్గా రాయడానికీ, దగ్గరనుండి సర్వ కార్యాలకూ ప్రార్థనలంటూ మైకులదరగొట్టే బొంకు మందా పెరిగి పోయారు. ఏసు నోరునంటాడొకాయన, ఏసు చేయినంటాడింకొకడు. ఆయనకు ఈ తరం ప్రతినిధినంటారు. మరొకడు ప్రభువు పేరున సింహం గర్జిస్తోందంటాడింకొకాయన. అది సాతాను సింహ గర్జనేనంటాడు మరొకడు. ఒకడు క్రైస్తవాన్ని దుమ్ముదులిపానంటుంటే, వాడెంత? వాడి గురువునే ప్రభువు పేరున తొక్కిపారేశానంటుంన్నాడింకొకడు. ఈరకమంతా పిల్లకాకులు, పెద్దకాకులు, ముంగిసలు, తోడేళ్ళు మాదిరి మసలుతూనే, మానవత్వాన్ని గురించి తెగ ప్రవచనాలు చేసేస్తుంటారు. చరిత్రను చూస్తే 'ఒకవంక నీవలె పొరుగు వానిని ప్రేమించు' అన్న సూత్రాన్ని వల్లిస్తూనే క్రీస్తు నంగీకరించనివారిని, అంగీకరించే వారిలోనే తామన్నట్లు అనుసరించని వారినీ కోట్ల మందిని కిరాతకంగా పొట్టనబెట్టుకున్న వాస్తవాలు కనపడతై. యూదులు క్రైస్తవుల్ని, క్రైస్తవులు ముస్లిముల్ని, ముస్లింలు వారిరువురినీ బలి పశువులుగా చేసినవైనాలు వారి వారి మత గ్రంధాలనుండే కొట్టొచ్చినట్లు కనిపిస్తే. ఇక భారత దేశంలో ఒక వంక ''సర్వ దేవ నమస్కారాం కేశవం ప్రతి గచ్చతి'' అంటూనే పరస్పరం కొట్టుకు చచ్చిన ఘటనలు కోకొల్లలు. అంతగా పట్టించుకోవడంలేదు గానీ, నిజంగా నిశితంగా పట్టి చూస్తే ఇక్కడామతాంతరీకరణల కథ పెద్దదేనని తేలుతుంది. షన్మతాల వారు పరస్పరం ఒకరి మతం నుండి ఒకరి మతంలోకి మారినట్లు రుజువులు దండిగనే దొరుకుతై అద్వైతులు ధ్వైతులుగా, శైవులు వైష్ణవులుగ, వైష్ణవులు శైవులుగా, ఆస్థికులు నాస్తికులుగ, నాస్థికులాస్ధికులుగ, బౌద్ధులుగ ఇలా సకల వర్గాల సమూహాలతోనూ అటునుండిటు, ఇటునుండటూ మారడాలు, మార్పించడాలు జరుగుతూనే వచ్చినై. వీటన్నింటివెనక, అన్నింటికీవర్తించే విడ్డూరమనదగ్గ కథ, నిజం ఏమిటో తెలుసా?
ఇందులో ఏ ఒక్కపక్షానికీ తాము చెపుతున్న దైవం, పరలోకం మరియు మనిషి సాధించాల్సిన సాధ్యంగా చెపుతున్న మోక్షం, గురించిన జ్ఞానం లేకపోవడం. ఈ గుంపులో జ్ఞానులుగ చెలామణి అవుతున్న వారినెవరిని గాని మీకీ విషయం ఎలా తెలిసింది? అని అడిగినా, నిలవేసినా, వారంతా ఏకోన్ముఖంగా చెప్పగలిగిందీ, చూపించగలిగిందీ ఒక్కటే. మాకీ విషయం ఫలానా గ్రంధంవల్ల తెలిసింది అనే. అని మాత్రమే.
అంటే అంతా వ్యపదేశమాత్ర- వినికిడి - జ్ఞానులేనన్నమాట. ఒక వేళ ఈనాడు ఎవరుగాని అంతకంటే అధికంగా, అదరగండంగా ఇంకేమైన వదరుబోతుతనంతో వదరుదామనుకుంటారేమో, విషయజ్ఞుల చెంత అవన్నీ గుండులేని తుపాకీ చప్పుళ్ళవంటివే అవుతాయి. అదంతా ఊకదంపుడు వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే, ఆయా మతగ్రంధాలన్నీ (ప్రతివక్కటీ) నిర్ధ్వింద్వంగా ఈ విషయాలు తెలుసుకోడానికి గ్రంథాన్ని విశ్వసించడం వినామరో మార్గంలేదు అని ప్రకటించేశాయి. అంటే అవన్నీ నమ్మక తప్పని విషయాలని వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలే నిర్ధేశిస్తున్న విషయంపై ఈ నమ్మకం గాళ్ళంతా తమకది బాగా తెలుసని బొంకుతున్నారన్నమాట. పండిత వేషాలు, గండపెండేరధారణలు, సన్యాస వేషధారణలు, పరమహంసలు, యోగులు, అవధూతలు, బాబాలు, బాలసాయిలు, అమ్మలు ఇలా లెక్కకుమిక్కిలి నామధేయాలతో, అందుకుతగిన వేషధారణతో ఉన్న వీళ్ళంతా తాము దేవుని గురించో, అభౌతికాంశాల గురించో తెలిసిన వాళ్ళమనే చెప్పుకుంటూ, ప్రచారం చేయించుకుంటూ ఉంటున్నారు. నా అవగాహన ప్రకారం వీళ్ళంతా, వాళ్ళు వాళ్ళు చెపుతున్న అభౌతికాంశాల విషయం తెలియనివాళ్ళే. ఆయా విషయాల గురించి ఆయా గ్రంథాలేమి చెపుతున్నాయో చూసో, కంఠస్థం చేసో తెగ వదరుతుండే వాళ్ళే. పుస్తకంలో ఉన్న విషయాలను చదివో, కంఠస్ధం చేసో చెప్పడానికి చదవడం చేతనైతే సరిపోతుందన్న కనీస ఇంగితం గాని, చదవడం వల్ల తెలియడానికీ, అలా తెలిసిందాన్ని అనుభవం ద్వారా తెలుసుకోడానికి మధ్య నున్న అంతరం చాలా ఉందన్న వివేకంగాని ఇసుమంతా లేని వీళ్ళంతా జ్ఞానులుగా, వేత్తలుగ, గురువులుగా చెలామణి అయిపోతున్నారు. - 'బాధ గురువులు కోకొల్లలు - బోధ గురువులు అరుదు' అన్న సూక్తి దీనినుండి వచ్చిందే.
వ్యవస్థలో ఎవడుగాని వాడన్నమాట సబబైందేనని రుజువు పరచాల్సి ఉంటుందన్న నిబంధన లేకపోవడం ఒక వంకా, పరిపాలనలో వివిధ అధికార స్ధానాలో ఉన్న వాళ్ళకే ఏదో ఒకరకమైన మూఢనమ్మకం తలకెక్కి ఉండడం మరోవంకా జతకూడి, ఇట్టి అవాచ్య వాచ్యులపై కట్టడి కరవైపోయింది. సత్యాసత్య నిర్ధారణతో పనిలేని ఈ ప్రవచనాలు అమాయకజనాన్ని కట్టగట్ట గలిగినంత కట్టగట్టి జ్ఞానవేషదారులైన ప్రవచకుల చేతి కందిస్తున్నాయి. ఈ రకం సంతతోకూడిన సంస్ధలన్నీ అమాయకజనం గట్టిగా, వీరావేశంలో చేసిన దానాలు, దక్షిణల వల్ల కోట్లాది రూపాయలకు సొంత దారులైపోతున్నారు. ఈ మధ్యనే చనిపోయిన పుట్టపర్తిబాబా ఏమి శ్రమ చేస్తే అంత సొమ్ముకు సొంతదారు కాగలుగుతారు న్యాయబద్ధంగా? ఒక విడ్డూరం చెపుతాను.
దానమిచ్చిన వాడు దాసోహమంటున్నాడు. వారిచ్చింది పుచ్చుకున్న ఈయన మహాదాతగా, త్యాగిగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ప్రజలిచ్చిందానితో కూడు, గుడ్డ, గూడులతో పాటు, అత్యంత విలాసవంతమైన, భద్రమైన జీవితం గడుపుతుండే ఆధ్యాత్మిక కేంద్రాలునడుపుతుండే అన్ని మతాల మతాధిపతులూ, గురువులూ అపరిగ్రహం గురించి, నిరాడంబరత గురించి ఇంద్రియ నిగ్రహాన్ని గురించీ, త్యాగాన్ని గురించి, ధర్మాన్ని గురించి, నీతి న్యాయాల గురించీ తెగ ఆవేశంగా ప్రసంగాలు చేస్తుంటారు.
''గమ్మునుంటే గిల్లుతుంటారు. కస్సుమంటే తుస్సుమంటారు''. వదలరు, పట్టుకోరు, సత్యాన్వేషణ తత్పరతతో సంవాదానికీ సిద్దంకారు. జిగేషా ప్రవృత్తితో జల్పానికే సిద్దపడతారు. (వితండానికిది సందర్భం కాదుగనక అదెలానూ కుదరదు) ఏమి మనుషులో ఏమిటో? జిజ్ఞాసతో తెలుసుకోవడానికి గాని, జ్ఞానిగా తెలపడానికి గాని, సైద్ధాంతికునిగా సిద్ధాంత చర్చకుగానీ సిద్ధం కాకుండగనే బహుగా వదరుతుండే రకాన్నేమి చేయాలి? గజశునక న్యాయాన్ననుసరించి సాగిపోనైనాపోవాలి. లేదా తొండాన పట్టినేలకేసికొట్టనైనా కొట్టాలి. అంత దనుక ఈ సమస్య తీరదు. అనిపిస్తోంది.
వివిధ ఆస్థిక పక్షీయులకు (వారు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, యూదులా, మరొకరా, మరొకరా అన్న వ్యత్యాసమేమీ నాకులేదు) అభౌతికశక్తుల ఉనికిని అంగీకరించే వాస్తు, జ్యోతిష పక్షాల వాళ్ళకు అభౌతిక శక్తులతో పని లేకనే వాస్తు ఉందనేవాళ్ళకు, ఈ పత్రికాముఖంగా విచారణకు రండని కబురందిస్తున్నాను.
నాపక్షం ఇదిగో :
1. అభౌతికశక్తుల ఉనికి అనిర్ధారితము. అనిర్ధారణీయము. మనకున్న జ్ఞానగ్రహణ పరికరాలు, విధానములకున్న పరిమిత సామర్ధ్యాలననుసరించి అభౌతికాలను గుర్తించడమే సాధ్యపడదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భౌతికాలలోనూ అతీంద్రియాలెన్నో వున్నాయి.
2. వాస్తు జ్యోతిషాలకు ఒక ప్రామాణిక గ్రంథమంటూ లేదు. అనేక కాలాలలో అనేక దేశాలలో అనేకులు ఎవరికి తోచింది, వారు చెపుతూ, వ్రాస్తూ వచ్చారు వాటిని. అవన్నీ పరస్పరం సమాన, అసమాన, మరియు ప్రతికూల భావాలతో ఉన్నేౖ.
3. వాటిలో వాస్తు వరకు చూస్తే, నిర్మాణ సాంకేతిక విజ్ఞానం (దారు, శిలా, లోహ, మిశ్రమాలకు సంబంధించిన పదార్ధ విజ్ఞానం) కొంతవరకు ఉంది. అయితే సాంకేతిక విజ్ఞానం విషయంలో ఈనాడు మనం ఆనాటి స్ధాయి కంటే ఎంతో ఉన్నతమైన స్థాయికిచేరాం. కనుకనే సాంకేతికాంశాల వరకు వెనకటి వాస్తు శాస్త్రాలను పరిగణలోకతీసుకోవడం లేదు. వాస్తు పండితులూ ఆ విషయంలో ఆధునిక నిర్మాణ సాంకేతిక విద్యనే అనుసరిస్తున్నారు.
4. ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞానం (సివిల్ ఇంజనీరింగ్)లో లేని, అది పట్టించుకోని క్షేత్రాల గురించే ఈనాటి వాస్తు పక్షాలన్నీ వాస్తును చెపుతున్నేౖ.
5. పంచభూతాలను చెప్పే గౌరువారుగానీ, వారిని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ప్రాచీన వాస్తే సరైందంటున్న సాంప్రదాయక వాస్తు పక్షాల వాళ్ళు చెప్పే దిక్పాలకులు, ఇతర అధి దేవతలు, వగైరాలుగానీ ఉన్నారనడానికిగానీ, వారు గృహస్తు జీవితంలో అతని గృహనిర్మాణాన్ననుసరించి శుభా శుభ ఫలితాలను కలిగిస్తుంటారనడానికి గానీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
గమనిక : ఈ విషయాలలో శాస్త్రీయమనదగ్గ స్ధాయిలో నిర్ధారణలకు సిద్దపడాల్సిన అవసరం బాధ్యతకూడా అన్ని పక్షాలకు, సామాజిక స్పృహగల విజ్ఞులకూ ఉంది. కనుకనే అలాంటి విశేష పరిశీలనకు మేము సిద్ధమంటున్నాము.
జ్యోతిషం : దీనికీ ఒక ప్రామాణిక గ్రంథమంటూలేదు. 'సూర్య సిద్ధాంతమేవ ప్రామాణ్యం' అన్న ఒక వాక్యం ఉంది.
2. సూర్య సిద్ధాంతాన్ని పరిశీలనకు తీసుకుందామంటే మాకు ఎట్టి అభ్యంతరాలు లేవు. మీదే ఆలశ్యం
3. ఖగోళ విజ్ఞానమనదగ్గదాన్ని, ఫలితజ్యోతిష్యమంటున్నదాన్ని వేరు వేరుగా చూడాలి. నాకు తెలిసినంతలో సూర్య సిద్ధాంతం సిద్ధాంత భాగం. అందు ఫలితాలు, జాతకాల భాగం లేదు.
4. షడంగాలలో ఒకటైన జ్యోతిషం అన్న దానిలోనూ, ఈ నాడు జ్యోతిష్యం పేరున చెపుతున్న జాతకాల గొడవలేదు. వేద మంత్రాలలోనూ, జాతకాల గొడవలేదు.
గమనిక : ఈ విషయంలో నాతో విభేదించేవారు ఈ నాలుగాంశాలలో వారి పక్ష మేమిటో వ్రాత మూలకంగా ప్రకటించాలి ముందు.
5. సిద్దాంత భాగంలోనే వాస్తవ విరుద్ధాంశాలుంటే ఇక ఆ పై జ్యోతిష్యాన్ని గురించి విచారణ జరపడం అనవసరం. ఇది చాలా కీలకాంశం.
6. అదలా ఉంచి ఎవరుగానీ 'జ్యోతిషం రుజువు చేయదగిందే, రుజువు చేయగలను' అని అనేట్లయితే మమ్మల్ని సంప్రదించండి. నిర్ధారణకు కూర్చోడానికి వారంగీకరించే లేదా అవసరమనే షరతులు ఏమిటో మాకు వ్రాయండి.
అభౌతిక శక్తుల ఉనికి అనిర్ధారితం, అనిర్ధారణీయం అనే మా పక్ష ప్రతిపాదన ఈ వాస్తు జ్యోతిష్కులకూ వర్తిస్తుంది.
సత్యావిష్కరణైకతత్పరత గాని మీ కుంటే నిజాల నరయడానికి, పరిశోధనా దృష్టితో మిత్రులంగనే ఈ పనికి పూనుకోవచ్చు. ఉంటాను. సెలవు.
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర
No comments:
Post a Comment