యోచనాశీలురైన మిత్రులారా! శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఎవరికి వాళ్ళుగా, వారి వారి అవగాహనలను గమనించుకుంటూ ఇతరత్రా లభించిన సమాచారాన్ని కలుపుకుని 5 పేజీలకు (ఎ4) తగ్గకుండా వ్యాసాలు రాసుకురావాలని నవంబర్ 22 రాజమండ్రి సమావేశంలో నిర్ణయించుకున్నాం. అలసత్వం వల్లగానీ, పనులవత్తిడి వల్లగానీ, విషయ క్లిష్టత వల్లగానీ డిశంబర్ 22 నాటి సమావేశానికి చాలామంది ఆ పని పూర్తి చేసుకురాలేదు. పసల భీమన్నగారు, పేరిలింగంగారూ, కెమెరా విజయ్ కుమార్ గారు మాత్రం కొంతవరకు రాసుకొచ్చారు. భీమన్నగారి వ్యాసం 'శాస్త్రీయదృక్పథం' అన్నదానికి పరిమితం కాక, అనేకాంశాలపై ప్రసంగంలా ఉందనీ, విజయ్‌కుమార్ గారి రచనలో శాస్త్రీయ దృక్పథానికి చెందిన కీలకాంశాల జాబితా మాత్రమే ఉందనీ విచారణలో అనుకున్నాము. అటు తరువాత శాస్త్రీయ దృక్పథంతో ముడిపడి ఉన్న అనేకాంశాలపై విచారణ సాగించి, పై సమావేశం నాటికైనా అందరమూ శాస్త్రీయ దృక్పథాన్ని గురించి తగినంతగా రాసుకువద్దాం అని తీర్మానించుకున్నాం. నేనూ ఆనాటికే వ్యాసం తయారు చేద్దాం అనుకున్నాను మొదట. అటు తరవాత, నూతన సంవత్సరం రాబోతోందికనుకనూ, జనవరి (సంక్రాంతి) ప్రత్యేక సంచికగా వివేకపథాన్ని తీసుకువద్దామనిపించడం వల్లనూ, శాస్త్రీయ దృక్పథాన్ని అర్ధం చేసుకోడానికి మార్గదర్శకాలుగా (కరదీపికగా) ఉండే రీతిలో కొన్ని ముఖ్యాంశాల పట్టిక వరకైనా పాఠకుల ముందుకు తేవడం ప్రయోజనకరంగా ఉంటుందనిపించడం వల్లనూ ఇదిగో వ్యాసం ఇలా మీ ముందుకొచ్చింది.
శాస్త్రీయ దృక్పథం (ప్రధానాంశాల పట్టిక - సంక్షిప్తవివరణ)
1. ఏదైనా ఒక విషయాన్ని గమనించాలన్నా, దానిని వివరించాలన్నా, ముందా విషయ క్షేత్రాన్ని గమనించి గిరిగీసుకోవాలి. దీనినే పారిభాషికంగా క్షేత్రదర్శనం చేయడం అంటారు. అధికరణము, ప్రకరణము అన్న పదాలూ దీనిని సూచించేటివే. ఎంపిక చేసుకున్న అంశము అని వాటి అర్థం.
2. కనుకనే శాస్త్రీయ దృక్పథం అన్న విషయం ఏ క్షేత్రానికి సంబంధించిందో ముందుగా తెల్చుకుని దాని పరిధిని నిర్ణయించుకోవాల్సి వస్తోంది. ఈ పని చేయకుంటే, అవసరమైన విషయాలు తగినంతగా చెప్పుకోలేకపోవడమో, అనవసరమైన విషయాలు అంటే ఈ క్షేత్రంలోనివి కాని విషయాలు చెప్పుకోవడమో జరిగే అవకాశం ఏర్పడుతుంది.
3. దీనిని గురించి వివరించే వారితోపాటు, వినే, పరిశీలించే వారికి కూడా ఈ వివరం తెలిసుండాలి. విచారణ పద్దతికి సంబంధించి ప్రకరణ భంగం చేయకుండడం, ప్రకరణ భంగం జరక్కుండా చూసుకోవడం, జరిగిందోలేదో చూసే పద్దతి తెలిసుండడం చాలా చాలా అవసరం. పారిభాషికంగా దీనిని 'లక్షణ పరీక్ష' అనంటారు. అందులో మూడు భాగాలుంటాయి. ప్రకటించిన దానిలో (అది ప్రసంగం కావచ్చు, రచన కావచ్చు)
'అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము' అన్న మూడు దోషాలున్నాయా లేవా? అన్నది పట్టిచూడడం దీని పని.
ఎ) అతివ్యాప్తి :- చెపుతానన్న విషయాన్ని విడచి ఇతరేతరాల గురించీ చెపుతుంటే అతని వ్యక్తీకరణలో అతివ్యాప్తి దోషం - అక్కరలేని విషయాల గురించి చెప్పడం - అన్నదోషం ఉందంటాము.
బి) అవ్యాప్తి :- చెప్పవలసిన విషయాన్నంతటినీ చెప్పకుండా ముగిస్తే, ఆ వ్యక్తీకరణలో అసంపూర్ణత - అవ్యాప్తి - అనే దోషం ఉందంటాము.
సి) అసంభవం :- ఇది మరీ ఘోరమైనది. చెపుతానన్న, చెప్పాల్సి ఉన్న దాన్ని విడిచి - అస్సలు పట్టించుకోకుండా - వేరు వేరు విషయాల గురించి వివరిస్తుండడం అంటే అతడు చెపుతున్న దానిలో చెప్పాల్సిందేమీ లేకుండడం.
గమనిక :- ఈ మూటిలో ఏది జరిగినా జరగాల్సింది జరగలేదనేకదా! అందులో అతి వ్యాప్తి, అసంభవాల్లో ప్రకరణ భంగం జరుగుతుంది. అవ్యాప్తిలో సమగ్రత - సరిపడినంత - ఉండదు. ఇంత వరకు మీకు స్పష్టంగా అర్థమైతేనే మీరు ఏమేమి చెప్పాలో, ఏమేమి చెప్పనక్కరలేదో, ఏమి చెప్పకూడదో నన్న స్పష్టతరాదు. అలాగే ఎదుటి వారు చెప్పిన దానిలోని దోషాదోషాలు చూడడమూకుదరదు. కనుకనే ఏ విషయ ప్రతిపాదనకైనా, విచారణకైనా అధికరణాన్ని దాని క్షేత్రాన్ని (పరిధిని - విస్త్రృతిని) నిర్థారించుకోవడం అత్యంతకీలకమవుతోంది. ఇది నిజమోకాదో తేల్చుకోండి.
క మరైతే, ఇప్పుడు మనం విచారించుకుందామనుకున్న 'శాస్త్రీయ దృక్పథం' అన్నదాని క్షేత్రమేది?
1. ఇది జ్ఞాన భాగానికి చెందింది. దృక్పథాలు తలలో - మనస్సులో - ఏర్పడే భావరూపాలు.
2. కలిగిన ప్రతిజ్ఞానాన్ని దృక్పథం అనము, అలాగే ఏర్పడ్డ ప్రతి అభిప్రాయాన్ని దృక్పథం అనము. ఒక థలో ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలనే దృక్పథాలు అనంటాము.
3. జ్ఞానక్షేత్రంలో ఒక క్రమమూ, వివిధ థలూ ఉంటాయి. వాటి గురించిన అవగాహన ఉంటే గాని, శాస్త్రీయ దృక్పథం యొక్క క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించడం కుదరదు. కొద్దిగా ఆ వివరాలు చెపుతాను జాగ్రత్తగా గమనించండి.
జ్ఞానక్షేత్రం - వివిధ అంశాలు
1. విడివిడి అంశాలకు చెందిన అనుభూతులు :- ఆయా జ్ఞానేంద్రియాల ద్వారా వేటి కవిగా మనకు తెలియబడే వాటిని అనుభూతులు అనంటాము. జ్ఞానం పుట్టుక అన్నది జరిగే ఆరంభథ ఇది.
2. భావనలు :- కలిగిన అనుభూతులు స్మృతి కేంద్రంలో నిల్వ ఉండేదీ, గుర్తుకు చేసుకుంటే గుర్తు కొచ్చేది ఏమిటో వాటినే 'భావన'లు అంటారు. ఉదా : చింతపండు నోట్లో వేసుకున్నాం. నాలుకలోని రసనాడుల ద్వారా మెదడుకు చేరిన సమాచారం మనకు ఒక అనుభూతిని కలిగించింది. అది భాష ఏర్పడ్డాక వారి వారి భాషా సంకేతాల రూపంలోగానీ, భాష రాక (లేక) ముందు యథాతధముద్రల రూపంలోగాని స్మృతికేంద్రంలో నిక్షిప్తం అవుతుంది. నిలిచి ఉంటుంది. అవెప్పుడైనా వాటంతటవిగానీ, మనం గుర్తుచేసుకోవాలనుకున్నప్పుడు గానీ, దానిని గుర్తుకు తెచ్చే బాహ్య పరిస్థితులెదురైనప్పుడు గానీ గుర్తుకు వస్తుంటుంది. అలా ఏది స్మృతిలో ఉండి, స్మరణ రూపంలో గుర్తుకు వస్తుందో ఒక్కసారి మీ మీ అనుభవాలను గుర్తుచేసుకోండి. చింతపండుకు సంబంధించి నాలుక ద్వారా అందిన సమాచారం మీలో ఏ అనుభూతిని కలిగించిందో, అది గుర్తొచ్చింది కదూ! దానినే 'భావన' అనంటారు. అనుభూతుల తాలూకు నిల్వ ఉండేది, గుర్తుకొచ్చేది ఏదో దానిని 'భావన' అంటాము.
3. అభిప్రాయాలు :- (భావములు) :- అనుభూతి జ్ఞానరూపమే, భావనా జ్ఞానరూపమే, అభిప్రాయ మన్నదీ జ్ఞానరూపమే అయినా ఆ మూటికీ తేడా ఉంది. ఇవి ఒక క్రమంలో ఒక దాని ఆధారంతో మరొకటి ఏర్పడుతుంటాయి. ఏదేని ఒక విషయానికి సంబంధించి పలు అనుభవాలు, పలుమార్లుగా కలిగితే వాటన్నంటి క్రోడీకరణ రూపంగా మెదడు (మనస్సు) ఏర్పరచుకునే భావాలను అభిప్రాయాలంటాము. ఇవి వివిధంగా ఏర్పడుతుంటాయి.
ఉదా : 1. చింతపండుతిన్నాము = ఒక అనుభూతి కలిగింది. భాషలో 'పులుపు' అన్న పదం వాడామాఅనుభూతికి గుర్తుగా. ఇప్పుడు 'పులుపు' అనగానే ఏది గుర్తుకొస్తోందో దానిని 'పులుపు' అన్న భావన అన్నాము. అవునా? కాదా?
గమనిక : మిత్రులారా! దృక్పథం అన్న దాని దగ్గరకు రావడానికిగాను గమనించాల్సిన అంశాల్ని పట్టి చూస్తున్నాం. ఇక్కడేమాత్రం తొందరపడినా, అశ్రద్దగా ఉన్నా క్షేత్ర నిర్ణయం చేయడంలో పొరపాటు జరిగిపోతుంది. అలా జరగడమంటే ఏమిటో తెలుస్తొందా. అది విచారణ ప్రక్రియలో - మార్గంలో - తొలి అడుగే తప్పుబడడమన్నమాట. కనుక దానితో బాటు నేను చెపుతున్న క్రమం కూడా అలాగే ఉందో లేదోనూ పరికించండి.
క మళ్ళీ ముందుకు సాగుదాం. అలా చింతపండును పలుమార్లు తిన్నాం. 'పులుపు' అనుభూతి ప్రతిసారీ దానికదిగా మళ్ళీ మళ్ళీ కలుగుతూనే వచ్చింది. దానితో బాటు ఇప్పుడు 'చింతపండు పుల్లగా ఉంటుంది' అన్న భావము ఏర్పడుతుంది. అదిగో ''అలా చింతపండు పుల్లగా ఉంటుంది.' అన్న రూపంలోని జ్ఞానాన్నే 'అభిప్రాయము' అనంటాము. ఈ క్రమంలో అనేకసార్లు తిన్న చింతపండు రుచి ఒకేలాగ ఉందనిపించవచ్చు. కొద్దిపాటి తేడాలున్నట్లూ గమనింపుకు రావచ్చు. మొత్తమ్మీద పులుపుగా ఉంటుందన్న అభిప్రాయమే ఉన్నా, నిజంగా అనేకమార్లు తిన్న వివిధ చింతపండు రుచిలో తరతమ భేదాలు గనక నీగమనింపులోకి వస్తే. ఆ అనుభూతాల సాధారణ రూపంగా, చింతపండు పులుపుల్లోనూ తేడాలుంటాయి. (ఉండొచ్చుకాదు) అన్న అభిప్రాయం ఏర్పడుతుంది.
గమనిక : ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జరిగే ప్రక్రియే - జ్ఞానసాధకాలుగ అంగీకరించవలసిన మరో రెండు ప్రక్రియలున్నాయి. వాటిని అనుమాన, శబ్ద ప్రమాణములంటారు. ఈ రెండు ప్రమాణాల ద్వారా క్రొత్త 'అనుభూతులు' ఏర్పడవుగానీ, ఉన్న అనుభూతులతో ముడిపెట్టిగానీ, ఏర్పడి ఉన్న అభిప్రాయాలతో ముడిపెట్టుకునిగానీ, మరికొన్ని అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి.
ఉదా : వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టీ ఆయా విషయాలపై (అవి మన అనుభూతిలో లేనివైనా) మనలో అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. ఇది మీ అనుభవంలో ఉందో లేదోనూ చూసుకోండి. యముడున్నాడు స్వర్గనరకాలున్నాయి. రంభా వూర్వశులున్నారు. అలాంటి వాళ్ళెవరూలేరు. సమసమాజం వస్తుంది. లాంటి అభిప్రాయాలన్నీ అలా ఏర్పడేటివే, ఏర్పడినవే. ఊహలాధారంగా (అనుమాన ప్రమాణాదారంగా) నూ అలాంటి అభిప్రాయాలు ఏర్పడే వీలుందో లేదో ఆలోచించండి.
దృక్పథాలు :- ఇవీ అభిప్రాయాల రూపంలో ఉండేవే అయినా, అభిప్రాయాలన్నీ దృక్పథాలు అనడానికి సరిపోవు. నిజానికి దృక్పథాలు ఏర్పడ్డ అభిప్రాయాలాధారంగా - మన ఇష్టాయిష్టాలు (స్వభావం), సాంఘికీకరణ ద్వారా మనలో విలువలుగా ఏర్పడి ఉన్న అభిప్రాయాలు కలగలిసిన మనం అంటే మన మూర్తిమత్వం (వ్యక్తిత్వం) ఆయా విషయాలు, వ్యక్తులపై ఏర్పరచుకునే వాటిని దృక్పథాలు అనంటారు. ఆయా అభిప్రాయాలననుసరించి వాటికాధారంగా ఉన్న విషయాలను మనం చూస్తున్న తీరును 'ధృక్పథం' అంటారు. వాటి విషయంలో ఎలా మెలగాలనుకుంటున్నామో దానిని మానసిక వైఖరి అనంటాము. వాటిని చూస్తున్న తీరును 'దృక్పథం' అనుకోగా, వాటిపట్ల ఎలా ఉండాలనుకుంటున్నామో దానిని ఆ దృక్పథం పునాదిగా- నేపథ్యంగా - ఏర్పడ్డ వైఖరి అనంటున్నాము.
ఉదా :- రాముడు అమాయకుడు అన్న అభిప్రాయం ఏర్పడింది నీలో. అది అనేకసార్లు అతణ్ణి ఆయా విషయాలలో అతడు ప్రవర్తిస్తున్న తీరును అనుభవరూపంలో గమనించడం ద్వారా ఏర్పడింది. (అభిప్రాయాలు అలాగేగదూ ఏర్పడతాయనుకున్నాం) దీనిని గమనించిన ఇరువురి వ్యక్తులకు అతని పై రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకరేమో అతడు మంచివాడు అన్న దృష్టిని ఏర్పరచుకున్నాడు, మరొకడు అతడు అసమర్థుడు అన్న నిర్ణయానికి వచ్చాడు. (ఇలా జరిగే వీలుందా లేదా?)
ఎ) ఇందులో ఒకడు మంచివాడు, బలవంతుడూ, ఇతరులకు సాయం చేసే స్వభావం కలవాడనుకోండి. ఇప్పుడతడు అమాయకుడు అసమర్థుడు అని తాననుకుంటున్న వాని విషయంలో ఏదైనా సాయం చేద్దాం అనుకుంటుంటాడు. ఇందులో అతడు అమాయకుడైన అసమర్థుడన్నది దృక్పథం క్రిందికి వస్తుంది. అతనికేదైనా సాయం చేద్దాం అన్నది ఆ దృక్పథం ఆధారంగా ఏర్పడ్డ మానసిక వైఖరి అవుతుంది. దృక్పథమూ ఒక మానసికవైఖరేనన్నది గుర్తుంచుకోవాలి.
బి) అదే మరి ఆ బలహీనుడైన వ్యక్తి మోసగాడనుకోండి. అతడు చెడ్డవాడు బలహీనుడు అన్న అవగాహనకలిగింది ఈ మంచి బలవంతుడికి. అతనిపై ప్రతికూల దృష్టి ఏర్పరచుకున్నాడు. దానిని దృక్పథం అనాలి. అతణ్ణి పోలీసులు పట్టుకుంటే మేలు అనిగానీ, అతని మోసాలకు ఎవరూ చిక్కకుండా ఉంటే బాగుంటుంది అనిగాని, అవకాశముంటే అతణ్ణి పట్టుకుందాం, పట్టిద్దాం అనిగానీ, అతడి గురించి నలుగురికీ తెలియచేద్దాం అనిపిస్తుంటే అది అతని పట్ల ఏర్పడ్డ దృక్పథాన్నుండి మనస్సు ఏమి చేయాలనుకుంటుందో, ఏమి జరగాలనుకుంటుందో అది అతని మానసిక వైఖరి అనంటాం.
గమనిక :- ఈ థలోని అభిప్రాయాలలో దేనిని దృక్పథం అనాలి. దీనిని మానసిక వైఖరి అనాలి అన్న దానిని ప్రతి సందర్భంలోనూ విడగొట్టి చూపడం ఒకింత క్లిష్టమైనదవు తోంది. అయినా ఒక సాధారణ సూత్రంగా; అతణ్ణి గురించి ఏమనుకుంటున్నావన్నది దృక్పథంగానూ, అతని విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నావన్నది మానసిక వైఖరిగానూ చెప్పుకోవచ్చు. మన మన వ్యక్తిత్వాలననుసరించి ఒకే విషయంపై వివిధ దృక్పథాలు ఏర్పరచుకోవచ్చు. ఏర్పడవచ్చు.
శాస్త్రీయ దృక్పథం
1. దృక్పథమంటే ఆయా వ్యక్తుల్ని, విషయాలను చూస్తున్నతీరు అని చెప్పుకున్నాంకదూ! అవి అభిప్రాయాల రూపంలోనే ఉంటాయి. అనుభూతులనుండి పుట్టిన భావనలు, వాటి ఆధారంగా ఏర్పడ్డ అభిప్రాయాలు (భావములు) అన్నవాటి ఆధారంగా వాటిని మనం చూస్తున్న తీరును దృక్పథం అంటాము. దృక్పథాలూ ఈ క్రమాన్ననుసరించి మూడో థలో ఏర్పడేటివి. ఇక దృక్పథాలననుసరించి, వాటి విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నామన్నది 4వ థ అభిప్రాయము అవుతుంది. ఎవరైనా దృక్పథాన్ని మానసిక వైఖరిని ఒకే విభాగం క్రింద చెప్పుకున్నా ఖచ్చితంగా కాదనాల్సినంత అవసరమేమీ లేదు.
క మనం వాటి వాటిని చూస్తున్న తీరే. వాటిపట్ల ఎలా ఉండాలో నన్న భావానికీ దారితీస్తుంటుంది. మీమీ అనుభవాల్లో ఇది ఇలాగే ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించి తేల్చుకోండి.
క మానవ జీవితం మొత్తం జ్ఞానము - దానిననుసరించి సాగే పనులు అన్న రూపంలోనే ఉంటుంది. జ్ఞానమన్నదానిని వివేకము - ఇష్టాయిష్టాలు అన్న రెండుగా విడగొట్టి చూసుకుంటే జీవితావగాహనలో మరింత స్పష్టత ఏర్పడుతుంది.
క మన జ్ఞాన పరిధిలోకి చేరిన ఆయా విషయాలు, వ్యక్తుల పట్ల మనం ఏర్పరచుకునే దృక్పథాల వల్ల, వారిని వాటిని మనం చూస్తున్న తీరువల్ల ఏర్పడే మన పనులవలన సమాజానికి, ప్రకృతికి మేలు జరగడానికీ, కీడు జరగడానికీ కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నదున్నట్లు తెలుసుకోడానికీ, కార్యాచరణకు సంబంధించి సరైన నిర్ణయాలకు రావడానికీ అవసరమైన చూపునే సరైన చూపు అనంటారు. సరైన చూపు అన్నా శాస్త్రీయ దృక్పథం (వైజ్ఞానిక దృక్పథం) అన్నా ఒక్కటే.
దృష్టుల్లో రకాలు
1) ప్రధానంగా దీనిని రెండుగా విభజించుకోవచ్చు. పాక్షిక దృష్టి - నిస్పాక్షిక దృష్టి అనందాంవాటిని
2) పాక్షిక దృష్టిలో మళ్ళా రెండు భాగాలుంటాయి. ఒకటి అనుకూల దృష్టి రెండు ప్రతికూల దృష్టి
3) నిస్పాక్షిక దృష్టి అన్న దానిని బహుముఖాలుగా విభజించి చూసుకోవచ్చు. నిజానికీ మాటకు అనుకూల, ప్రతికూల దృష్టులు లేకుండా అని అర్ధం. దాని అన్వయరూపాలు మాత్రం అనేకం.
ఎ) సత్యాసత్యాలు గమనించాల్సిన, స్వీకరించాల్సిన సందర్భంలో నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండడమంటే సత్యపక్షాన్ని స్వీకరించడానికీ, అసత్యపక్షాన్ని విసర్జించడానికీ సిద్దంగా ఉండాలన్న దృష్టి కలిగిఉండడం.
బి) అలాగే ధర్మాధర్మాలు నిర్ణయించాల్సిన, స్వీకరించాల్సిన సందర్భంలో నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండడమంటే ధర్మపక్షాన్ని స్వీకరించడానికీ, అధర్మ పక్షాన్ని విసర్జించడానికీ సిద్దపడాలి అన్న దృష్టి కలిగి ఉండడమని.
4) నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండాలంటే ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులలో ఎవరి పక్షం సరైనదో నిర్ణయించాల్సి వస్తే ఆ ఇరుపక్షాలను తన - పర అన్న దృష్టితోగాని, శతృమిత్ర దృష్టితోగాని, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అన్న దృష్టితో గానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న దృష్టితోగానీ, ఆశాభయాల దృష్టితోగానీ, కీడు మేలు అన్న దృష్టితోగాని గతంలో అతనేమిటి అని గాని ఇలా ఆపక్షాలతో ముడిపడిన ఎట్టి వ్యత్యాసాలను పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా చూడాలి అన్న దృష్టి కలిగి ఉండడాన్ని నిస్పాక్షిక దృష్టి అనంటారు.
5) ఈ నిస్పాక్షిక దృష్టి అంటే ఏ పక్షంవైపుకూ మొగ్గకుండడం అన్న దానికి విపరీతార్థమూ తీయవచ్చు. నిర్లిప్తంగా ఉండడం, తటస్తునిగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం లాటివీ ఏ పక్షాన్నీ వహించకపోవడం క్రిందికే వస్తాయికదా! అని అపార్థాన్ని గుంజవచ్చు. కానీ మన సందర్భం అదికాదు. ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోమని చెప్పడానికి వెనక ఏ ప్రయోజనాకాంక్ష ఉంది? అన్నది చూస్తే, వ్యక్తిని సరైన ప్రవర్తనకు దారి తీయించే సరైన అవగాహనకు, నిర్ణయాలు చేసుకోడానికీ తగిన సమర్థుణ్ణి చేయడానికిఉద్దేశించింది అని తెలుస్తుంది.
6. పాజిటివ్ ధింకింగ్, (పాజిటివ్ యాటి ట్యుడ్) అన్నమాట వ్యక్తిత్వ నిర్మాణ బోధనలో ప్రముఖంగా వినబడుతోంది. అంతా మన మంచికే అన్న సామెత ఉంది చూడండి. అది పాజిటివ్ థింకింగ్‌కి పరాకాష్ట. అలాంటివి కథల్లో బాగుంటాయి కాని వాస్తవ జీవితానికి పనికిరావు. అయితే దానిని ఆ అర్థంలో కాకుండా ప్రతికూల పరిస్థితులు - వైఫల్యాలు వచ్చినప్పుడూ, నీరసపడకుండా, నిష్క్రీయా పరుడవుకాకుండా, ఆత్మస్థైర్యంతో, ఆశావహ దృక్పథంతో ఉండడం అన్న అర్థంలో తీసుకుంటే అది మేలు కలిగించవచ్చు.
ఒక్కమాట! ఆశావహదృక్పథం, ఆత్మస్థైర్యం వారి వారి వాస్తవ సామర్థ్యాలకు అనుగుణంగా లేకుండా, అతి అయ్యిందనుకోండి. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దానినే ఆత్మాథిక్యతా భావం, (సుపీరియారిటీ కాంప్లెక్సు) అంటారు. మనం ఏర్పరచుకునే దృక్పథాలు (చూసే చూపు) వివేక జనితమైందిగా, సరైన అవగాహన పునాదిగా ఏర్పడింది లేదా ఏర్పరచుకున్నదిగా ఉండాలి.
ఇష్టాయిష్టాలు : స్వభావజనితమైన ఇష్టాయిష్టాలు, వివేక చోదితమైన ఇష్టాయిష్టాలు అన్న రెండుగా ఇష్టాయిష్టాలను విభజించుకుంటే, స్వభావజనితమైన ఇష్టా ఇష్టాలను వివేకపు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం, మంచిది అన్న దృస్టికి రావడంఅన్నిటికంటే కీలకమైంది. ఉత్తమమైంది అవుతుంది. ఒక రకంగా సరైన చూపు (శాస్త్రీయ లేదా వైజ్ఞానిక) దృక్పథం అంటే ఇదేనని చెప్పుకోవచ్చు.
మరోమాట! ఆశావహదృక్పథం అన్నదానికి వ్యతిరేక దృష్టిని, నిరాశావహదృక్పథం, ప్రతికూల చింతన నెగెటివ్ థింకింగ్ లేదా నెగెటివ్ యాటిట్యూడ్ అనంటున్నారు. ఇది ఆత్మన్యూనతా భావానికి దారితీస్తుంది. దానినే శాస్త్రీయంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు అంటున్నాము. సరైన దృష్టి కొన్నిసార్లు, అప్పటి వాస్తవ పరిస్థితుల్ని బట్టి ఆ పని అసాధ్యమనో, మన వల్ల కాదు అనో ఆలోచింపజేయవచ్చు. అదిగాని తగినంతగా కాక, అతి అయితే, అప్పుడు ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. విషయం అర్థమవుతోందా మిత్రులారా! మానవుడి ప్రవర్తనను శాసిస్తున్న మానసిక క్షేత్రానికి చెందిన అతికీలకాంశాలను విచారించుకుంటూ వస్తున్నాం. మనసు బెట్టి పట్టుకుని, వంటబట్టించుకోవలసిన విషయాలివి. తెలుసుకుని ఊరుకునే విషయాలు కావివి. వంటబట్టించుకుని అలవరచుకోవలసిన అభ్యాసిక విద్యల కోవకు చెందిన విషయాలివి. మళ్ళీ మళ్ళీ చెపుతున్నాననుకోకండి. మళ్ళీ మళ్ళీనే కాదు, మళ్ళా మళ్ళా కూడా అనుకుంటుండాల్సిన విషయాలు.
నీవెంతో అంతగా నీగురించి నీకు అంచనా ఉండాలి. అది సరైందిగా ఉండాలి. అంటే వాస్తవాన్నే చూపించేదిగా ఉండాలి. ఆ అవగాహనాధారంగా నిన్ను నీవు, ఇతరాన్ని నీవు ఎలా చూసుకోవడం సరైందవుతోందో అన్న దానిని చెప్పేదే ఈ దృక్పథం క్రిందికి వచ్చేదంతా.
తత్వశాస్త్రంలో అత్యంత మౌలికమైన భావన వకటుంది. వర్తమానంలో ఉండు అని బి ఇన్ ప్రెసెంట్ (ఔలి రిదీ చీజీలిరీలిదీశి) భగవద్గీతలోనూ ఈ అర్దాన్నిచే (భావాన్ని సూచించే) సూత్రమొకటుంది.
అశోచ్చా నన్వశో చస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే!
గతాసూన్ అగతా సూంచ నా- ను శోచంతి పరడితాః!
ఒక వంక విచారించదగని వాటి గురించి విచారిస్తున్నావు. మరోవంక మాటలు మాత్రం పండితులు - విజ్ఞులు, ప్రజ్ఞావంతులు - చెప్పేవిగా ఉంటున్నాయి. పండితులు ఆచరణలో గతాన్ని గురించిగానీ, భవిష్యత్తును గురించిగానీ ఆందోళన చెందరు అంటే గడచిపోయిన వాటిని గురించీ, ఇంకారాని వాటిని గురించిగానీ ఆలోచిస్తూ కూర్చోరు. వర్తమానంలో జీవిస్తూంటారు. అన్నది సూత్రార్థం సరైన దృక్పథం ఉన్నవారి వైఖరిని (ప్రవర్తనారీతిని) సూచించే మరొక సూక్తీ బహుళప్రాచుర్యంలో ఉంది.
వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింపదగున్,
కని కల్ల నిజము లెరిగిన మనుజుడెపో ధన్యతముడు మహిలో సుమతీ!
వినడం, విచారించడం, స్వీకరించడం అన్న విషయంలో విజ్ఞుల ఈ రకమైన ప్రవర్తన వెనక పనిచేస్తుండేది సరైన దృష్టి కోణమే. ఈ మానసిక వైఖరికి సంబంధించిందే మరో మాట ఉంది.
యుక్తి యుక్త ముపాధేయం వచనం బాలకాదపి
అన్యతృణమివ త్యాజ్య మప్యుక్తం పద్మజన్మనా!!
సబబైన మాట (యుక్తి సహజమైనమాట) పిల్లవాడు చెప్పినా స్వీకరించదగిందే అవుతుంది. అలాకానిమాట సరైన ఆధారం లేని మాట బ్రహ్మ చెప్పినా (ఎంతవారు చెప్పినా) గడ్డిపరక పారేసినట్లు పారేయాలి. ఈ సూక్తిలో ఎవరు చెప్పారన్నదాన్ని బట్టి విషయానికి విలువరాదు, విలువనివ్వనూరాదు. ఏమి చెప్పారో, అదేపాటి తూగుతుందో అన్నదాన్ని బట్టే విలువివ్వడం సరైనరీతి. అలానే ప్రవర్తిస్తానని నిర్ణయించుకోవడం అతని సరైన మానసిక వైఖరి అవుతుంది. అలా ప్రవర్తించడమే సరైనది అన్న దృష్టి కలిగి ఉండడాన్ని సరైన దృక్ఫథం కలిగి ఉండడమనే అంటాము. ఆధునిక హేతువాద థోరణికి చెందిన సంస్థ హేతువాద దృష్టి ఎలా ఉండాలన్న దానిపై ఒక నిర్వచనాన్ని విడుదల చేసింది. అందులోనూ మనకు - ఈ సందర్భానికి వర్తించే భావన ఉంది.
హేతువాదం : యోగ్యమైన ఆధారాలతో కూడి చేసే యోచన సర్వోన్నతమైనదని నిర్నిబద్దంగా అంగీకరిస్తుంది. యోగ్యమైన ఆధారాలు లేని గ్రంథాల, వ్యక్తుల మాటలను ప్రామాణికమైనవిగ స్వీకరించదు. వాటి ప్రభావం నుండి విడిగా ఉంటుంది. అంటూ హేతువాది మానసిక వైఖరి ఎలా ఉండాలో, నిర్వచించింది. వ్యక్తులుగానీ, గ్రంథాలుగానీ ప్రామాణికంకారాదు అన్న భావన సరైన దృక్పథంలో భాగమే.
ఇదే విషయాన్ని కాళిదాసు స్పష్టంగా గమనించి సూటిగా ప్రస్తావించాడు కూడా.
పురాణ మిత్యేవ నసాధుసర్వం -
పాతదంతా బంగారమే (ఓల్డ్ ఈస్ గోల్డ్) ఆనిర్వచనం - ఈ మధ్య వచ్చిందంతా గతమంతా ఘనం కాదు అనుకునే సాంపదాయకుల పోకడ సరైన దృష్టి నుండి ఏర్పడిందికాదని చెపుతుందీ సూక్తి. ఒక విషయానికి అదెంత ప్రాచీనం అన్నదాన్నిబట్టి గానీ, అదెంత ఆధునికం అన్నదానిబట్టిగానీ విలువల నాపాదించడం సరైందికాదు. విలువలు ఏర్పడవు కూడా. అది ప్రాచీనమైన (సనాతనమైన) దైనా, ఆధునికమైనదైనా, అదేపాటిదో నిర్ణయించడం, సరైన పరీక్ష జరిపే చేయాల్సి ఉంటుందన్న వైఖరి - దృష్టి - వివేక పథకులకుంటుందన్నది కవి హృదయం.
క ప్రసిద్ది చెందిన ఆధునిక తాత్వికులలో ఒకడైన జిడ్డు కృష్ణమూర్తి, గురువుల, శాస్త్రాల బంధం నుండి బైటపడి అనుభవాలను పరిశీలించి చూసుకుంటూ జీవితాన్ని మలచుకోవలన్న సుభాషణం వెనకా సరైన దృక్పథపు ఛాయలున్నాయి.
మిత్రులారా! వివరించుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది వ్యాసం. అందుకిది సందర్భంకాదు. పైగా శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఎవరికి వారుగా ఆలోచించుకుని, స్వంత ప్రయత్నంతో వ్యాసం తయారు చేసుకురావాలనుకున్నాం కూడాను. కనుక, చివరికేలాగ మా అందరివీ కలిపి చూసుకుని, నా దగ్గర మిగిలి ఉన్న వాటినీ చేర్చి చూసుకుని, వీలైనంత సమగ్రంగా ఉండేలా ఒక చిన్న పుస్తకాన్ని తీసుకురానున్నాం కనుక, చెప్పాల్సింది కొంతమిగుల్చుతాను. శాస్త్రీయ దృక్పథం ఊపిరంతా స్వతంత్రాలోచనాశీలత; తులనాత్మకబుద్ది అన్న రెండూ అవసరమన్న అవగాహన, దగ్గరే ఉంది. మిగిలిన ఉండాల్సినవన్నీ ఈ రెంటి మూలంగా, ఆధారంగా, జతపడేటివే. సమకూడేటివే. అందుకనే, శాస్త్రీయ దృక్పథం అలవడేందుకు వీలుగా ఎవరికి వారుగా స్వంతంగా ఆలోచించుకుని, సమాచారం సేకరించి, దానిలో ఏది ఎంత సమంజసంగా ఉందోనూ చూసుకుని రమ్మంటున్నాను.
విషయాలు తెలుసుకునేప్పుడెలా ఉండాలి. ఆచరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడెలా ఉండాలి. అన్న రెండంశాలలో వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్న మూడుగా ఉన్న దాన్ని గురించి తెలుసుకునేటప్పుడు - దానితో వ్యవహరించే తీరు గురించి నిర్ణయించేందుకు ముందు నీవు వ్యక్తి - ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి అన్న దాన్ని గురించిన విచారణే ఇక్కడ చేయాల్సింది మీ ఆలోచనకు పదును పెట్టగల, వత్తాసునివ్వగల కొన్ని వివరాలను మీ ముందుంచాను. వాటినీ ఉపయోగించుకుని వ్యాసం తయారు చేయండి.
ముఖ్యగమనిక : ఏ వ్యక్తిలోనైనా ఆయా విషయాలను అతనిదైన చేసే కోణం ఉంటూ ఉంటుంది. దానికీతని 1) అవగాహన స్థాయి 2) వ్యక్తిత్వంలో చోటు చేసుకుని ఉన్న విలువల స్థాయి 3) స్వభావంలోని ఉద్రేకాల స్థాయి కలసి కారణాలవుతుంటాయి. దృక్పథం (చూస్తున్నతీరు) ఆ జీవితం, అన్ని విషయాలతోటీ ముడిపడి ఉంటుంది. కనుక దృక్పథం పాత్ర చాలా విస్త్రృతమైనదవుతోంది. విశేషరూపాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి కనుక, కొన్ని సాధారణ రూపాలుగా వాటిని వర్గీకరించి అర్థం చేసుకుంటే బాగుంటుంది.
1. శాస్త్రీయ దృక్పథం కలవాడు జ్ఞానాన్ని ఆర్జించే సందర్భంలో ఎలాటి దృష్టి కలిగిఉంటాడు?
క వీటినీ, ఇలాటి మరికొన్నింటినీ, ఆయా సందర్భాలనూ ఉదహరించుకుంటూ వివరణాత్మకంగా పరిశీలించే, 'శాస్త్రీయదృక్పథం' (సరైన చూపు) అన్న శీర్షికాంశానికో చక్కని రూపు వస్తుంది.
క సరైన చూపున్నవాడు స్వీయజీవితం విషయంలో ఎలాటి వైఖరి కలిగి ఉంటాడు, సామాజిక సంబంధాల విషయంలో, ప్రకృతి సంబంధంగా ఎలాటివైఖరి కలిగి ఉంటాడు అన్నదీ శాస్త్రీయ దృక్ఫథపు అన్వయానికి పనికివస్తుంది.
క ఒక్కో అంశాన్ని తీసుకుని ఆ విషయంలో సరైన చూపంటేఏమిటి? అది ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తుంటాడు. అది లేనివాని వైఖరి ఎలా ఉంటుంది. పరిశీలిస్తూ పోతుంటే, ఈ విషయంలో లోతైన అవగాహన కలుగుతూ ఉంటుంది.
యోచనాశీలురైన మిత్రులారా! ఈ విషయం ప్రతివ్యక్తికీ, ఆజీవితం ప్రయోజనాన్ని, మేలును కలిగించగలిగిందిగా ఉంది. కనుక ఎవరికి వారుగా దీనిని గురించి తగినంత అవగాహన కలిగించుకునే యత్నం చేయండి. ఎక్కడైనా ఒక్క విషయంపైనే అనేకాభిప్రాయాలూ, విరుద్ధభిప్రాయాలు కూడా చోటు చేసుకున్నాయంటే అక్కడే ఈ 'సరైన చూపు' అన్నదాంట్లో లోపాలు, దోషాలు చోటు చేసుకుని ఉన్నాయనే.
సరైన జ్ఞానాన్నార్జించడానికీ, కలిగింది సరైన జ్ఞానమేనోకాదో నిర్ణయించుకోడానికీ, వ్యక్తిపరమైన విదానపరమైన రెండు క్షేత్రాలలోనూ దోషాలు, లోపాలు లేకుండా చూసుకోవాలి. అందులో వ్యక్తిపరంగా లోపాలు, దోషాలు లేకుండా ఉండాన్నే శాస్త్రీయ దృక్పథం అనీ, విధానపరమైన దోషాలు లేకుండా ఉండడాన్నే శాస్త్రీయ పద్దతి అనంటారు. మరింత లోతుగా మరోసారి చెప్పుకుందాం. ఉంటాను సెలవ్.

No comments:
Post a Comment