Wednesday, April 1, 2015

వాస్తు పిచ్చి


యోచనాశీలురైన మిత్రులారా!
వాస్తు పిచ్చి అలా, అలా విస్తరిస్తూ రాజకీయాలనూ చుట్టుముట్టేసిందీనాడు. వాస్తంటే ఏమి? ఏది వాస్తు? అన్న విషయాలలో వాస్తువేత్తలుగ చలామణి అవుతున్న వారిలోనే ఏకాభిప్రాయం లేదన్న నిప్పులాిం నిజమే వాస్తుకు శాస్త్రీయ స్థాయి లేదన్న వాస్తవాన్ని ప్టిస్తోంది. అలానే వాస్తు శాస్త్రాలుగ సాంప్రదాయకులంగీకరిస్తున్న గ్రంథాలలోనూ కొన్ని విషయాలలో ఏకాభిప్రాయము మరి కొన్నిం భిన్నాభిప్రాయాలూ ఉన్నాయన్నది వాిని చదివిన వారేవరికైనా ఇట్టేతెలిసిపోతుంది. అందుకే వాస్తు నిజ నిర్ధారణ ఐక్యవేదిక పేరున, వాస్తు (క్షేత్రానికి) కు ఒక ప్రామాణిక గ్రంథం లేదనీ, వాస్తు శాస్త్రాలపేరున రకరకాల గ్రంథాలున్నాయని ప్రకించాం మేము. దీనిని కాదనదలచుకున్నవారు మాతో సత్యాసత్య నిర్ధారణకు సిద్దం కావచ్చు.

ఒక్కమాట! యోగ్యమైన పద్ధతుల ద్వారా ప్రయోగాత్మకంగా నిర్ధారణ జరగని వేినీ శాస్త్రీయాలు అనకూడదు. వైజ్ఞానిక ప్రపంచంలో ఇది సర్వామోదం పొందిన సూత్రము (అందరూ అంగీకరించిన సూత్రము) నిర్వివాదాంశము (ఎవరూ కాదనరాని, కాదనలేని సూత్రము). కనుకనే శాస్త్రీయ సిద్దాంతాలు (ప్రతిపాదనలు, అభిప్రాయాలు) అన్న వాన్నింకీ ఒక సాధారణ నియమం జత చేయబడి ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఆ ప్రయోగం చేసినా, ఆ సిద్దాంతం చెపుతున్న ఫలితాలే వస్తాయి. రావాలి. అలా జరక్కుంటే అదింకాతేలని, తేల్చుకోవలసే ఉన్న ప్రతిపాదనగానే పరిగణించాలి, అన్నదే ఆ నియమం. అంటే ఏమి? ఇది- ఈ నియమం- సార్వదేశీయం, సార్వకాలీనం, సార్వజనీనం అనేకదా? వాస్తు శాస్త్రాలు గానీ, వీిని తెగ చదివేశాం, వాస్తువేత్తలం అనే వారు గానీ, ఈ విధానానికి సిద్దంకావడం లేదు. ఈ మాటను గుర్తుంచుకోండి.
ఈనాటి వాస్తువేత్తలనండి, వ్యాపారులనండి, వీరున్నూ లోగడ ఇలాగే జరిగింది, ఇప్పుడూ అలానే జరుగుతుంది అనే గదా తమ తమ వ్యాపారాలు (సలహాలు, సూచనలు) చేస్తున్నది! అయితే వైజ్ఞానికుల పోకడకూ వాస్తుశాస్త్రీయమంటున్న వారి పోకడలకు మూలంలోనే వైరుధ్యం (పొసగనితనం) ఉంది. వైజ్ఞానికులు ఒక సిద్దాంతాన్ని ప్రకించేటప్పుడూ, పరిశీలనకు స్వీకరించేటప్పుడూ కూడా పై నియమాన్ని 100% అమలు చేస్తుాంరు. ఆయా సిద్దాంతాలను వేటికి వాటిని, వాటి కవిగా పునః ప్రయోగానికి లోను చేసి, సిద్దాంతానుకూల ఫలితాలు ఏర్పడుతున్నాయో లేదో చూసుకుాంరు. మళ్ళా మళ్ళా చూసుకోడానికి సిద్దంగానూ ఉంారు. ప్రయోగ ఫలితాలలో తేడాలొస్తే ఆ సిద్దాంతాన్ని ప్రక్కన బెట్టడమో పరిశీలన కొనసాగించడమో, తప్పుడు సిద్దాంతంగా తేలిందని ప్రకించడమో చేస్తుాంరు. అందరూ ఈ ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుందన్న విషయంలో వారిలో ఎి్ట భేదాభిప్రాయాలూ ఉండవు. ఎి్ట అభ్యంతరాలూ ఉండవు. పైగా పరస్పర సహకారమూ అందించుకుాంరు. ప్రయోగ ఫలితాలను సరిచూసుకునే సందర్భాలలో
కనుకనే ప్రపంచ వైజ్ఞానికులలో తేలిన, తేల్చిగలిగిన అంశాలలో ఎి్ట వివాదాలూ లేవు. అవి తప్పనితేలిన అంశాలలోనూ వారిలో ఏకాభిప్రాయమే ఉంటుంది. మన మొత్తం విచారణకూ ఇదే మార్గదర్శకసూత్రం.
అస్సలు విషయం 
1. ఈనాడు వాస్తు శాస్త్రీయమైనదేనంటున్న సమూహంలో రకరకాల వాళ్ళున్నారు. కొందరు
   ఎ. సాంప్రదాయక పక్షం వాళ్ళు  బి. మరికొందరు సాంప్రదాయేతరులు
2. మళ్ళా ఈ సాంప్రదాయ పక్షం వాళ్ళలో జ్యోతిశాస్త్రంతో వాస్తుకు పనిలేదనేవాళ్ళు జ్యోతిశాస్త్రంతో పని ఉందనేవాళ్ళు.
3. వాస్తన్నది నిర్మాణ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమేననేవాళ్ళు, నిర్మాణ సాంకేతిక విజ్ఞానం కాదనేవాళ్ళు సాంకేతికాంశాలతో పని లేదనేవాళ్ళు.
4. జాతకాన్ని బట్టే వాస్తు చూడాలనేవాళ్ళు, వాస్తును సరిచేస్తే జాతక ఫలితాలు మారుతాయనేవాళ్ళు, ఇందులోనే మరికొందరైతే జాతకాన్ని బట్టే వాస్తు ప్రాప్తిస్తుందనేంతవరకు పోతుాంరు.
స్త్ర  'థ మారితే దిశ మారుతుంది' కాదు కాదు, 'దిశ మారితే థేమారుతుంది'. అనే రెండు రకాల నానుడులు పై పక్షాలపోకడలను సూచించేివే.
5. పై నాలుగు రకాల పోకడలను కలగలుపుకుని కలగూర గంప పండితులూ ఉంారీ సాంప్రదాయక పక్షంలో. సాంప్రదాయ పక్షంలో శాస్త్రాలలో విచిత్ర మనిపించే ఒక ప్రకటన ఉంది. వాస్తు శాస్త్రోపదేశకులుగా 18 మంది పేర్కొనబడ్డారు. వేరు వేరు గ్రంథాలలో ఈ 18 మంది పేర్లలో తేడాలూఉన్నాయి. జ్యోతిశాస్త్ర ప్రవర్తుకులుగా పేర్కొనబడిందీ ఈ శ్లోకాలలోనివారే. కాకుంటే శ్లోకంచివరి పాదంలో వాస్తుశాస్త్రోపదేశకాః! అనో వాస్తు శాస్త్రప్రవర్తకాః! అనో వాస్తు పుస్తకాల్లో ఉంటే, జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకాః! అని జ్యోతి శాస్త్ర గ్రంథాలలో ఉంటుంది.

ఈ సందర్భంలో అంతే విడ్డూరమనిపించే మరో విషయాన్ని చెప్పుకోవాలి మనం :

ఈ రెండు రకాల శ్లోకాలనూ ఉట్టంకిస్తున్నది ఆ వాస్తు శాస్త్రొపదేశకులుకాదు. వారిని ప్రామాణికులూ ఆద్యులూ అనంటూ, తరవాత్తరవాత వాస్తు శాస్త్రాల పేరన రకరకాల వైరుధ్యాలూ, వైవిధ్యాలతో రచనలు చేసిన ఆయా వాస్తు గ్రంధాల రచయితలే. ఇక్కడ విడ్డూర పడవలసిందేమంటే, ఆ శ్లోకాలలో ఉన్న వారిని వాస్తు శాస్త్రప్రవర్తుకులన్న వీరిలో ఎవరుగాని ఆ 18 గురి రచనలలోని వాస్తు సూత్రాలలేమిో చూపించనే చూపించరు. ఈ రెండో శ్రేణి రచనల్లో అి్టవి మహా ఉంటే ఒకీ, అరా ప్రస్తావనలు మాత్రం ఉండవచ్చునంతే.

ఇక సాంప్రదాయేతర వాస్తు సమూహంలోని రకాల వివరాలు 

1. వీరిలోనూ వాస్తు, నిర్మాణ సాంకేతిక విజ్ఞానశాస్త్రం అనేవాళ్ళు కొందరున్నా, ఎక్కువలో ఎక్కువమంది, అది పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు సంబంధించిన విషయంగా పరిగణించేవారే ఉన్నారు.
2. పంచభూతాల వ్యవహరమే వాస్తు వ్యవహారమంతా అనేవాళ్ళు కొందరైతే, పంచభూతాలనలా ఉంచి, అష్ట దిక్పాలకులకథే వాస్తంటే అనే వాళ్ళు కొందరు.
3. శాస్త్రాలున్నాయా? లేదా? ఉన్నాయనుకుంటే, వాిలో ఏది సరైంది వగైరాలన్నీ మా కనవసరమండీ, మా పరిశోధన, మా ప్రయోగ ఫలితాల ఆధారంగా నాదైన వాస్తు చెపుతున్నాను నేను అనేవాళ్ళు ఇంకొందరు.

ఒక్క విషయం చెప్పుకుంటే ఈ వివరాలకో సంపూర్ణతరాదు.

ఈ రకరకాల వాళ్ళలోనూ శాస్త్రాల పేరులు చెప్పబడుతున్న వాిని శ్రద్ద ప్టిె తగినంతగా చదివినవారు బహుకొద్ది మంది మాత్రమే. ఎక్కువలో ఎక్కువ మంది నాలుగుముక్కలు బ్టీప్టో, ముక్కున పట్టుకునో అజ్ఞానులైన, జ్ఞానశూన్యులైన సామాన్య జనాలముందు తెగ పెచ్చిరిల్లిపోతూ, ధన సంపాదనా చేసుకుంటుాంరు.
ఈ మధ్య కాలంలో, విశ్వ విద్యాలయంలో వాస్తు జ్యోతిషాలపై డిగ్రీ, డిగ్రీ అనంతర చదువుల రూపంలో తరగతులు (బోధన) నడుస్తుండడంతో, అందులో చేరిన వారికి మాత్రం, ఆయా వెనుకి గ్రంధాల నుండి ఎంపిక చేసుకున్న భాగం వరకు వాస్తు శాస్త్రాలనబడేవాిలోని విషయాలు కొంత వరకు తెలిసి ఉండే అవకాశం ఏర్పడింది. అయినా ఈ సమూహంలోని రకరకాల వైఖరులకు చెందిన ఎవరూ శాస్త్రీయ దృక్పథంగానీ, శాస్త్రీయ పద్దతిని గాని కలిగున్నవారు కారు. ఆ బోధనా విభాగమే అది కలిగిలేదు.
ముఖ్య గమనిక : 
ఈ మాటనడం ఒకింత సాహసంతో కూడుకున్నదీ, మా విషయం నీవెలా చెప్పగలవు? అని వారికి ఎదురాడే అవకాశాన్నిచ్చేదీగా ఉంది. అది నిజమే అయినా, ఈ విషయంలో ఆ పక్షంలోని వివిధ రకాల వైఖరులు కలవారందరికీ స.మం. వేదిక నుండీ, వ్యక్తిగతంగా నేనూ ఒక ఆహ్వానం పలుకుతున్నాను. మీలో శాస్త్రీయదృక్పథము కలిగుండి, శాస్త్రీయ పద్ధతి నెరిగి ఉండి, నిజనిర్ధారణకు సిద్దమనే వారెవరుగానీ, మీ రంగీకరించే వాస్తు ప్రతిపాదన లేమిో ప్రకించి అవి శాస్త్రీయాలనదగ్గవేనని నిరూపించడానికి సిద్దంకండి. అంతి శ్రమకు సిద్దమైనందుకు ప్రతిఫలంగా మేమే మిచ్చుకోవాలో, చేయాలో అడగండి (చెప్పండి).
వాస్తు విషయమై మా పక్షం
1. వైజ్ఞానిక క్షేత్రాలలో నిరూపిత స్థాయికి చేరిన విషయాలలో, కొన్ని వినియోగ రూపానికి చేరతాయి. అి్ట వాిని అప్లైడ్‌సైన్స్‌స్‌ (వినియోగ విజ్ఞానం) అనంటున్నారు. వాస్తు నిర్మాణాలతో ముడిపడి ఉండి వినియోగ రూపంగా చూడబడుతోంది కనుక ఇదిన్నూ వినియోగ విజ్ఞాన విభాగానికి చెందిందే అవుతుంది.
2. ప్రాచీన వాస్తు శాస్త్రాలుగా చెప్పబడుతూ, అందుబాటులో ఉన్న గ్రంథాలలో కచ్చితంగా రెండుగా విడదీసి పరిశీలించవలసిన, అర్ధం చేసుకోవలసిన అంశాలున్నాయి.
1. భౌతిక పదార్థాలకు, నిర్మాణానికి సంబంధించినవి
2. అభౌతికాంశాలకు సంబంధించినవి
నిర్మాణపరమైన విభాగంలో నిర్మాణాకృతులకు సంబంధించిన వివరాలు, నిర్మాణానికి అవసరమైన ముడి పదార్థాల వివరాలు సాంకేతిక విజ్ఞానం క్రిందికి (సివిలింజనీరింగ్‌ క్రిందికి) వస్తాయి. ఆ భాగం వరకు ఒకనాి సాంకేతిక విజ్ఞానమే అవుతుందది. ఆ మేరకు చేయాల్సిన నిర్మాణాలకు ఈనాికీ అవి సరైన జ్ఞానరూపాలే. ఈ నాి వరకు వివిధ పరిశోధనల ద్వారా సుసంపన్నం అవుతూ వచ్చిన ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పునాదిగా చెప్పుకోవలసినవి అవే.
వివాదాంశపు అసలు క్షేత్రం 
ఈ నాడు వాస్తు పక్షం వాళ్ళు వాస్తు చూడమంటున్నది, చూస్తాము, సరిచేస్తామంటున్నది, ఈ నిర్మాణ పరమైన సాంకేతికాంశాల విషయంలోకాదు. ఈ విభాగానికి పూర్తిగా వేరైన అభౌతికాంశాలకు సంబంధించిన విషయంలోనే ఆ పక్షంలోనే ఉన్న వాస్తంటే సివిలింజనీరింగేనంటుండే వాళ్ళూ, ఇంి నిర్మాణ సాంకేతికాంశాలను చెప్పడానికి పూనుకోవడంలేదు. ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళనందుకు పిలవడం లేదు. వాస్తు విచారణ సందర్భంలో ఆద్యంతమూ (పరిశీలన మొదల్టెిన దగ్గర నుండి అది ముగించేవరకూ) గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకాంశమిది. వాస్తు పేరున జరిగే గోష్ఠులు, చర్చలు, పరీక్షలు, అధ్యయన తరగతులు వగైరా సంర్భాలన్నింలోనూ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే అి్టవి నిర్వహించుకోవాలి.
వాస్తుతో అభౌతికాంశాల వివరాలు
1. పంచభూతాలు, 2. అష్టదిక్పాలకులు, 3. నవగ్రహాదిపతులు 4. వాస్తుపురుషాంగ దేవతలు
గమనిక : పంచభూతాలు అన్న పేరున ప్రకృతి మూలధాతువుల్ని పరిగణించేవారు కొందరు.ప్రపంచ ప్రాచీన ప్రకృతి పరిశోధకులలో ఎక్కువ మంది పంచభూతాలతో ఏర్పడిందే ప్రపంచమంతా అన్న భావానే కలిగి ఉండేవారు. కొద్దిమంది ఆ భూతాలనాలుగేననే వారూ ఉండేవారు. ఆ వివరాలలోకి విచారణలోకి మన మిప్పుడు వెళ్ళనక్కరలేదు. ఎందుకంటే, మూలకాలు ఏమిటనే అన్వేషణలో ఆధునిక భౌతిక పదార్ధ విజ్ఞానులు ఈ నాికీ వాిని వెదుకుతునే ఉన్నప్పికీ, పంచభూతాలే మూలద్రవ్యాలన్నది బండతప్పన్నంతవరకు తేల్చివేశారు. కనుక ప్రాథమిక ద్రవ్యాలుగా (నిరవయవ ద్రవ్యాలుగా) వాిని ప్రస్తావించుకోవడం అవివేకం. కాస్త కటువుగా చెప్పుకోవాలంటే బుద్దిలేని తనం మాత్రమే.
ఉదా :- ఫృద్వివ్యప్తేజో వాయురాకాశ కాలదిగాత్మమనాంసి నవద్రవ్యాణి అన్న న్యాయదర్శన సూత్రం అశాస్త్రీయం  ఉదా : ) జగత్తు పాంచభౌతికమన్నదీ అలాిందే. ఉదా : 3) సత్వ రజస్తమ సామ్యావస్థా ప్రకృతిః అన్న సాంఖ్య సూత్రమూ అశాస్త్రీయమైనదే. అవసరమైతే వీి పై మరోసారి విచారణకు పూనుకుందాం.
1. అష్టదిక్పాలకులు :- 1. ఇంద్రుడు, 2. అగ్ని 3. యముడు, 4. నిరుతి, 5. వరుణుడు 6. వాయు దేవుడు 7. కుబేరుడు, 8. ఈశుడు  వీరు క్రమంగా, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం అన్న ఎనిమిది దిక్కులకు అదిపతులు లేదా అభిమాన దేవతలు.
2. నవగ్రహాలు :- 1. సూర్యుడు, 2. చంద్రుడు, 3. అంగారకుడు, 4. బుధుడు, 5. గురుడు 6. శుక్రుడు, 7. శని, 8. రాహువు 9. కేతువు.
గమనిక :- అతి పోకడలు పోయే ఈనాి అదరగండపు జ్యోతిశాస్త్రజ్ఞులు (వ్యాపారులు) మరి ఈ నాడు ఆధునిక భూగోళ విజ్ఞానులు కనుగొన్న యేరేనస్‌, నెప్ట్యూన్‌, ఫ్లూోల మాటేమిరా? అనడిగితే వాికీ ఇంద్ర, వరుణ, యమ గ్రహాది దేవతల గ్రహాలవి అని వదరుతుాంరు. అంటే వెనకి వాస్తు, జ్యోతిశాస్త్ర గంథ్రాల రచయితలకు తెలీనివీ, వారు ప్రస్తావించనివీ శాస్త్రాలవేనంటూనే, వాికి జత చేసి మొత్తం విషయాన్ని చిందరవందర చేస్తుాంరు.
వీటి విషయంలో ఆధునిక ఖగోళ విజ్ఞానం ఏమి చెపుతోంది ?
1. నక్షత్రాలు, నక్షత్రరాశులు మన భూమికి సంబంధించినవి కావు.
2. సూర్యుడు గ్రహం కాదు. నక్షత్రం. సూర్యుడు భూమి చుట్టూతిరగడం లేదు. కాగా భూమితో సహా మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి.
3. రాహువు, కేతువులన్న గ్రహాలు లేవు. ప్రాచీనులు ప్రస్తావించని గ్రహాలు, ఉపగ్రహాలూ మన సూర్య కుటుంబంలోనే మరికొన్ని ఉన్నాయి. చంద్రునికంటెనూ పెద్దవైన ఉపగ్రహాలూ ఉన్నాయి.  వీన్నికంటే వాస్తు జ్యోతిశాస్త్రాలలోని అంశాలతో మనం విబేదిస్తున్నదీ, శాస్త్రీయాలేనని తేల్చండి బాబులూ నని వారి నడుగుతున్నదీ, వీి వెనక ఆ పక్షపు వారంతా, ఉన్నాయి పని చేస్తున్నాయి. అవే అసలు పాత్రధారులు అంటున్నవీ అయిన అభౌతిక శక్తుల విషయాన్ని గురించి మాత్రమే.
మనం అడగాల్సిందీ - వాళ్ళు తేల్చాల్సిందీ :
1. మీరనే అభౌతిక శక్తులు ఉన్నాయని నిర్దారించండి.
2. వాికీ - గృహ నిర్మాణ రీతికి, గృహ నిర్మాతకు లేదా గృహస్తుకు, అతనికిసంబంధించిన వారికీ కలుగుతాయంటున్న శుభా శుభాలకూ కార్య కారణ సంబంధ ముందని తేల్చండి.
3. అలా ఒక ప్రతిపాదనను, అది సరైందో కాదో పరీక్షించి నిర్ధారించడానికి మీ పక్షం, మీరంగీకరించే శాస్త్రాలు, ఏ విధానాన్ని సూచిస్తున్నదీ ఇదమిద్దంగా (స్పష్టంగా, సూిగా)  ముందుగా ప్రకించండి.
ముఖ్య గమనిక :- ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలలో, అవి ప్రపంచంలోని ఏ దేశాలు అనుసరిస్తున్నవైనా, వాిలో ఎక్కడా అభౌతికాంశాల ప్రస్తావనలేదు. ఇక వాికీ మనిషి జీవితంలో ఏర్పడే మంచి చెడులకూ సంబంధముందన్న ప్రశ్నే జనించదు కదా.
  ఈ విషయం నిజమా ? కదా?
1. ఈనాడు వాస్తు వేత్తలుమంటున్న వారూ, తమ సొంతానికి ఒక భవంతిని నిర్మించుకోవాలనుకుంటే, తామంగీకరిస్తున్న పుస్తకాలను తిరగేసి వాి నుండి సాంకేతికాంశాలను, నిర్మాణానికి వాడే పనిముట్లను, పదార్థాలను ఎంచుకోవడం లేదు.
2. వారున్నూ ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి చెందిన, సివిల్‌ ఇంజనీర్లనూ, పనిముట్లనూ, పదార్థాలను (ముడి సరుకులు వస్తువులనే) ఆశ్రయిస్తున్నారు.
3. ఆ నిపుణుల నుండి వినియోగించుకున్న వాికి తోడు తాము వాస్తంటున్న అంశాలనూ జత చేసుకుంటున్నారు. ఈ భాగమంతా పైన మనం సూచించిన అభౌతికాంశాలకు సబంధించింది మాత్రమే.
1. అలాగే సివిలింజనీరింగ్‌ పట్టభద్రులు ఒక ఇంిని నిర్మాణం చేసుకోవాలనుకున్న సందర్భంలోనూ, నిర్మాణ పరమైన విజ్ఞానం కొరకు ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్నే ఆధారం చేసుకుంటున్నారు. అనుసరిస్తున్నారు.
2. అి్ట సందర్భాలలో వీరూ, వాస్తు పండితులను పిలిపించుకుంటూ, వాస్తుచెప్పమంటున్నారు.
3. అలాిం సందర్భంలో వాళ్ళు చెపుతున్నది నిర్మాణపరమైన, పనిముట్లకు సంబంధించిన, వాడే పదార్థాలు వస్తువులకు సంబంధించిన అంశాలను గురించి కానేకాదు. వీరి పాత్రంతా పైన మనం చెప్పిన అభౌతికాంశాలకు సంబంధించింది మాత్రమే.
1, ఇక అటు సివిలింజనీరింగూ, ఇటు వాస్తు తెలియని సామాన్య జనంలో ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళు, నిర్మాణపరమైన అంశాలకు ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞానాన్ని సివిల్‌ ఇంజరీంగ్‌ను, వాస్తు కొరకు వాస్తు గ్రంధాలనో, అవి తెలిసిన వారిగా చలామణి అవుతున్న వారినో ఏర్పరచుకుంటున్నారు.
2. అంటే నిర్మాణ సాంకేతిక విజ్ఞానానికి వాస్తు పండితుల అవసరం లేదని, పనికిరాదనీ, వాస్తుపరమైన ఏర్పాట్లకు ఆధునిక శాస్త్రాలలో వివరాలులేవని, ఇంజనీర్లందుకు పనికిరారనీ అంగీకరిస్తున్నారనే కదా!
ఇక్కడకు ఏమని తేలినట్లు ?
1. వాస్తు ఉందనేవాళ్ళు, లేదంటున్నవాళ్ళు కూడా, ఈనాడు వాస్తోంంది నిర్మాణ సాంకేతికాంశాలకు చెందిన వివరాలను కానేకాదు.
2. ఇరువురూ, అన్ని పక్షాల గృహ నిర్మాతలు పైన నేను పేర్కొన్న అభౌతికశక్తుల ప్రమేయము. అందువల్ల ఏర్పడే ఫలితాలు అన్నవాి వివరాల కొరకే వాస్తు అవసరం అని అంగీకరిస్తున్నారు.
3. అభౌతిక శక్తుల ఉనికినీ, వాికీ, నిర్మాణ రీతులలో చోటుచేసుకున్న వివిధాంశాలకు వాితో కార్యకారణ సంబంధముందన్న అంశాన్ని, ఆ సంబంధమే శుభాశుభాల నిస్తుంటుందన్న విషయమూ ఆ పక్షం వాళ్ళే నిరూపించాలి.
గమనిక : విచారణకు ఎంపిక చేసుకోవాల్సిన- చేసుకున్న- ప్రకరణేమిటన్నది ప్టించుకోకున్నా, ప్టించుకుని, దీనికిసంబంధం లేని వాితో జతకలిపినా ఆ పై జరిగేదంతా శాస్త్రీయ విచారణే కాకుండా పోతుంది.
ఇప్పుటికి తుది పలుకు
1. ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దాలైయుంటేనూ, ప్రాథమిక పౌరవిధులలోని 51 ఎ/హెచ్‌ లోని శాస్త్రీయ దృక్పధాన్ని శోధనాతత్వాన్ని సరైన మార్పులకు సిద్దపడే వైఖరినీ కలిగి ఉంటే, ఈ అంశాలను బోధనాంశాలుగా చేర్చనేకూడదు. తప్పదనుకుంటే పరిశోధనాంశాలుగా పరిశోధనా కేంద్రాలకు పరిమితం చేయాలి. అప్పుడు కూడాతప్పని తేలిన పంచభూతాల, నవగ్రహాల, భూకేంద్ర సిద్దాంతాలను విడిచిపెట్టేందుకైనా అంగీకరించాలి. ప్రజాధనంతో ఏ ప్రభుత్వము, ఏ ప్రజాప్రతినిధీ, రాజ్యాంగం ప్రకారం తనకందిన వ్యక్తిగత విశ్వాస ఆరాధన స్వేచ్ఛలోని పనులను చేపట్టనేకూడదు. ఒక ముఖ్యనాయకుడు ఉదాహరణకు ముఖ్యమంత్రిగాని, ప్రధానమంత్రిగాని, తన మతానికీ, విశ్వాసానికీ చెందిన కార్యక్రమాలకు ప్రజాధనాన్ని ఖర్చు ప్టిె దానికి పరిష్కారంగా, ఇతర మతాలవారికీ వారి వారి విశ్వాస కార్యక్రమాలకూ కొంత ప్రజాధనాన్ని ఇవ్వమనడం, కేయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమేకాక, మరింత పెద్దతప్పు కూడా.
2. అది ఏ మత ప్రాతిపదికన, ఉనికిలోకి వచ్చిన అభిప్రాయాలైనా, అభౌతికాంశాల ప్రస్తావనలన్నీ విశ్వాస మూలకాలే, అజ్ఞాన జనితాలే, ఇప్పికీ అనిర్థారితాలే. కొన్నైతే అనిర్దారణీయాలు కూడా. ఇది మండలి పక్షం.
ఆహ్వానం, హెచ్చరిక, సవాలు :
ఈ విషయమై మాతో విభేదిస్తూ, అటు వాస్తు విషయంలోగానీ, ఇటు జ్యోతిష విషయంలోగానీ, మతాలలోని ఇతరేతర అభౌతికాంశాల విషయంలోగానీ నిజ నిర్ధారణకు సిద్దపడగలవాళ్ళను మిత్ర దృష్టితోను, సత్యస్థాపనోద్దతితోనూ నిరూపణకొరకైన విచారణకు రమ్మని ఆహ్వానిస్తున్నాం.
స్త్ర  బహుమతి :- ఇంతి జఠిలమైన అంశాన్ని నిరూపించిన వారికి వారి శ్రమకు, వారి నిబద్దతకూ ప్రతిఫలంగా ఆ ఉపకారానికి కృతజ్ఞతాసూచకంగా 5 లక్షల బహుమానం అందించగలను.
స్త్ర  హెచ్చరిక :- మా అవగాహననుసరించి, మీకే తెలియని విషయాల గురించి నాలుగు పుస్తకాలు చదివో వాిలోని నాలుగంశాలను పట్టుకునో ప్రజలనెత్తిన పెనుభారంగా తయారు కాకండని, అది తప్పని హెచ్చరిస్తున్నాము.
స్త్ర  సవాలు :- మండలి అవగాహన నుండి, పైన వివాదాంశంగా మేము స్పష్టంగా పేర్కొన్నవన్నీ ఇప్పికీ అనిర్దారితాంశాలే. మా ఈ అభిప్రాయం తప్పని నిరూపించగలమనుకుంటున్నవాళ్ళతో సమాన నియమాల ప్రాతిపదికన సవాలుకు సిద్దం. ఈ ప్రక్రియకు సిద్దపడే వాళ్ళుంటే వారికంగీకారమైనంత పందేనికీ మేము సిద్దం. 1 కోి రూపాయల వరకు పరిమితమై.
వాస్తు అశాస్త్రీయం అంటుండే మిత్ర సంస్థల కోహిత సూచన :-
మీ మీ సంస్థలలోని కార్యకర్తలను, కనీసం ఎంపిక చేసుకున్న కొద్దిమందికైనా ఈ శాస్త్రాలపై అధ్యయన శిక్షణాతరగతులు నిర్వహించుకుని, మీసంస్థను బలోపేతం చేసుకోవచ్చు కదా? ఎంతకాలం ఇతరులపైనా, ఎవరో ఒకరిపైనా ఆధారపడి, వాడు చెప్పిందే ప్రామాణికమంటూ దెవుళ్ళాడతారు. ఈవిషయంలో శిక్షణ గరపడానికీ, అధ్యయనం చేయించడానికి మండలి సిద్దంగా ఉంది. దానిని సద్వినియోగ పరచుకోండి ఉంాను మీమీ స్పందనలకై ఎదురుచూస్తుాంము. ఇప్పికి సెలవ్‌.
సత్యాన్వేషణలో 
మీ సురేంద్ర

No comments:

Post a Comment