Wednesday, April 1, 2015

ఆస్తికత, నాస్తికత, విజ్ఞాన శాస్త్రము - నైతిక విలువలు - యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు


గత సంచిక (214)లో ఆస్తికత, నాస్తికత, విజ్ఞాన శాస్త్రము - నైతిక విలువలు అన్న నా వ్యాసం ముగింపులో శాస్త్రీయ దృక్పథము, దాని ప్రస్తుతస్థితి గురించి ఈ సంచికలో చర్చిద్దామనుకున్నాము. ఈ శాస్త్రీయ దృక్పథము అనే పదం ప్రస్తావనకు రాగానే అది కేవలం మతస్థులకు, మతవాదులకు అవగాహన కలిగించవలసిన అవసరమైన విషయంగా మతేతరులు భావిస్తుాంరు. కాని అవగాహన ప్రకారం మతస్థులు, మతవాదుల్లోనే కాక మతేతరులుగా తమను తాము భావించుకునే వారిలో కూడా ఈ విషయంలో చాలామందిలో అవగాహనలోపం కనిపిస్తుంటుంది. కారణం ఏమంటే శాస్త్రీయ దృక్పథం అనగానే కేవలం దైవభావనను, మతాల్ని, మూఢనమ్మకాల్ని వ్యతిరేకించే అంశంగానే వారు భావించటమే. ఈ శాస్త్రీయ దృక్పధం గురించిన నా అవగాహన తగినంత ఉన్నందునే వాిని వ్యతిరేకించగలుగుతున్నామని వారి అభిప్రాయం. మతాల్ని, వాికాధారమైన దైవభావనను వాి పిలకలైన మూఢనమ్మకాల్ని వ్యతిరేకించడానికి శాస్త్రీయ దృక్పథము కలిగి ఉండడం అవసరమే అయినా, అలా వ్యతిరేకించే వారందరూ శాస్త్రీయ దృక్పధాన్ని కలిగి ఉన్నారని చెప్పలేము. ఇది అంగీకరించడానికి ఇబ్బందిగా ఉన్నా వాస్తవం వాస్తవమేగదా. అంగీకరించాలి మరి. శాస్త్రీయ దృక్పథము పరిశీలనకు సంబంధించిన విషయము. సరియైన పరిశీలన ద్వారా వ్యక్తులపైన, విషయాలపైన మనం అభిప్రాయాలను ఏర్పరచుకునే తీరునే ఇది సూచిస్తుంది. పరిశీలనలోనే దోషాలుండి, దాని ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవటం జరిగితే దానిని తొందర పాటు నిర్ణయం అనవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు కారణం శాస్త్రీయ దృక్పధం లేకపోవడమూ ఒకి. కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయం కూడా మంచి ఫలితాల్నివ్వచ్చు. అంతమాత్రాన శాస్త్రీయ దృక్పధం ఆ నిర్ణయం వెనుక పని చేసిందని అనకూడదు.

మనకు ఒక్కసామెత ఉంది. అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే అన్నం అంతా ప్టి చూడనక్కర్లేదు. ఒక్క మెతుకు ప్టి చూస్తే చాలని అంారు. ఏవో ఒకి రెండు అనుభవాలు ఆధారంగానో, వాిని సరిగా విశ్లేషించుకోకుండానే, ఆ అనుభవాల ఆధారంగా నిర్ణయానికొచ్చేసేవారు చాలా మంది ఈ సామెతను చెప్పటం నేనెరుగుదును. కాని ఆ సామెతను ఏర్పరచినవారు కూడా ఏ ఒక్క అనుభవమేకాక పెక్కు అనుభవాల ఆధారంగానే ఆ నిర్ణయానికొచ్చారని మరువరాదు. మన హేతువాదుల్లోనూ శాస్త్రీయ దృష్టిలోపించవచ్చు అనడానికి తగిన ఒక ఉదా|| చూడండి.
ఒక ప్రముఖ హేతువాది వ్రాసిన పద్యాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

తరచు గుడికి పోయి గొణుగుచుండెడివాడు
చెడ్డ పాపమేదొ చేసి వుండు ........

ఈ పద్యాన్ని హేతువాదులు, నాస్తికులు తమ వ్యాసాల్లో, ప్రసంగాల్లో తరచు ప్రస్తావిస్తుాంరు. తత్ఫలితంగా గుడికి వెళ్ళే వారంతా చెడ్డవారే అన్న భావాన్ని పాఠకుల్లో, శ్రోతల్లో కలిగించానికి ప్రయత్నిస్తారు. కాని దీనిలో వాస్తవం లేదు. ఎలాగంటే మంచి ప్రవర్తన గలవారూ, శీలవంతులు, నీతివంతులు, ఆస్తికుల్లోనూ ఉన్నారన్నది మనందరి అనుభవంలో ఉన్నదే. చెడ్డవారు అస్తికుల్లోనూ ఉన్నారు. నాస్తికుల్లోనూ, హేతువాదుల్లోనూ ఉన్నారు. అంతా దేవుడు చూస్తూనే ఉంాడంటూనే చెడ్డపనులు చేసే ఆస్తికులకు, చెడ్డపని చేసేటప్పుడు దేవుడు గుర్తుకేరాడు. కాని దేవుని మీద నాస్తికులు ఏమైనా విమర్శ చేస్తే మాత్రం మా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ రగడ లేవతీస్తారు. కాని అలాిం రగడలను, దేవుడున్నాడంటూనే తప్పు పనులు చేసే ఆస్తికులందరి మీద కదా లేవదీయాలి. కాని అలాచేయరు. ఎందుకంటే అలా మా మనోభావాల్ని దెబ్బతిన్నాయంటూ ఎలుగెత్తుతున్నది కూడా ప్రస్తుత సమాజంలోని ఆస్తికులే.  మరి అలా తప్పులు చేసేవారు దేవున్ని చిన్నచూపు చూసినట్లే కదా! మరోకోణంలో చూస్తే, దేవుని పూజ చేసే వారందరూ అవినీతిపరులు, పాపాలు చేసేవారు కానక్కర్లేదు. వారికి దైవ భక్తి పేరున జరిగే తంతంతా చిన్నతనం నుంచి అలవాటు చేయబడింది. ప్రతిరోజూ దేవుడికి దండం పెట్టేవారిలో చాలామంది యాంత్రికంగా ఆపని చేస్తుాంరు అంతేకాని అంతకు పూర్వం చేసిన తప్పుల్నించి రక్షించమని కాదు. అదలా ఉంచితే, మనం నీతిని పాించాలంటే దేవుని భయంతోకాదు, వివేకం ఆధారంగా పాించాలి, సాి సమాజంలో మనం మంచిగా ఉంటూ, ఇతరులనూ మంచిగా ఉండమని ప్రోత్సహించాలి అని చెప్పే నాస్తికులూ, హేతువాదులూ కూడా తప్పులు చేస్తున్నారు. కొందరైతే అవినీతిపనులు కూడా చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారు, తెలియకా చేస్తున్నారు. ఈ కారణంగానే సుబ్బరాజుగారు లాిం ప్రముఖ హేతువాది హేతువాద సంఘంలోని హేతువాది ఒక్కర్ని అయినా చూపించగలరా? అని ప్రశ్నించగలిగారు. మరి పై పద్యాన్ని ప్రస్తావిస్తూ ఆస్తికుల పట్ల హేళన భావం ప్రదర్శిస్తూ, అలాిం భావాన్ని ప్రసారం చేస్తూ ఉండటం శాస్త్రీయ దృక్పధం కలిగి ఉండటమౌతుందా?  ఇలాిం సందర్భాలలో ఆత్మ విమర్శ (స్వయం విమర్శ) చేసుకోవాలి. దానికి శాస్త్రీయ దృక్పధం, నిజాయితీ, నిక్కచ్చితనం కలిగి ఉండడం చాలా అవసరం.
అంతేకాదు సమాజంలోని రుగ్మతల్ని పోగొట్టడానికి ఏ ఒక్క వ్యక్తో చాలడు.ఏ ఒక్క సంఘమో సరిపోదు. అభ్యుదయశక్తులన్నీ ఏకమయి, అసాంఘిక శక్తుల్ని ప్రతిఘించాలి అనే సూత్రాన్ని అర్ధం చేసుకున్న సంఘాలెన్ని ఉన్నాయి? ఒక వేళ అర్ధం చేసుకుంటే అవి ఎందుకు కలిసిపనిచేయలేకపోతున్నాయి. అంటే వాిలో శాస్త్రీయ దృక్పధము కరువయినందువల్లే తమ తమ ప్రాబల్యాన్ని (అహాన్ని) వదులుకోవల్సివస్తుందనే భయం (అభద్రతాభావం) వల్లే అవి ఐక్యకార్యాచరణకు సిద్ధం కాలేకపోతున్నాయి.
సమావేశాల్లోగాని, అధ్యయన తరగతుల్లోగాని, మనుషుల్లో చైతన్యం తీసుకురావడమే మన లక్ష్యం అని పదే పదే చెప్పుకోవటంతోపాటు ప్రణాళిక బద్దమైన కార్యాచరణకూ పిలుపివ్వాలి కదా! అందులో నెలవారీ, ప్రాంతాలవారీ కార్యక్రమాలు ఉండాలికదా? అలా లేని ఉద్యమాలు, కేవలం సంవత్సరానికి ఒకి, రెండుసార్లు అధ్యయన తరగతుల పేరన జరిపే సమావేశాలతో సమాజంలో చైతన్యం తెస్తామనుకోవటం శాస్త్రీయ దృక్పథం ఎలా అవుతుంది. సమాజాన్ని చైతన్యపర్చటం ఎంతపెద్ద పనో, ఎంత సీరియస్‌గా ఆ ప్రయత్నం జరగాలో వారు ఆలోచించాలి.
మార్చవలసింది మత వాదుల్ని, మారవలసింది మతవాదులు అనే అభిప్రాయంతో వున్నవారి కార్యక్రమాలు, ఎవరితో జరగాలి? మతవాదులతోనా?, హేతువాదులతోనా? అన్న ప్రశ్నే పుట్టనివారికి శాస్త్రీయ దృక్పధం ఉందని ఎలా అనుకోగలం? మతవాదుల్ని మార్చాలనే లక్ష్యం నిజంగా మనకు ఉంటే మతవాదులకు అవగాహనా సదస్సులు నడపాలి, వారిని కలుపుకునే కదా చర్చావేదికలు జరపాలి వారి సందేహాలను తీర్చానికి సిద్దపడి ఉండాలి. అంతేకాని వారికి ఆలోచించటమేరాదు. ప్రశ్నించటమే రాదు అనటం అశాస్త్రీయ వైఖరి కాదా. మండలి మొది నుండీ ఒకి మతవాదులతో చర్చలు జరగాలి అనీ, రెండు మనలో మన మధ్య అవగాహన పెంచుకునే అధ్యయన తరగతులు జరగాలనీ అంటూ వస్తుంది. నా అవగాహన ప్రకారం ఇది అత్యంత ముఖ్యమైన విషయం.
మనవాళ్ళలో శాస్త్రీయ దృక్పదం లోపిస్తున్నమరో సందర్భాన్ని గుర్తుకు తీసుకువస్తాను. ఒక సంస్థ తిరుపతిలో ఉంది. సంస్థ నిర్వాహకుని పేరు వెంకటేశ్వరరావు అనుకుందాం. అతని కొడుకు పేరు నారాయణ అనుకుందాం. ఈ వివరాల ఆధారంగా అతడు ఒక మతవాదే అనే నిర్ణయానికి వచ్చామంటే అది అశాస్త్రీయ వైఖరేకదా! మతవాది అనే నిర్ణయానికి రావానికి చూపించే ఆధారాలు - తిరుపతి అనే పుణ్యక్షేత్రంలో (ఆస్తికుల దృష్టిలో) అతని నివాసం . అతడు దేవుని పేరుతో పిలవబడుతున్నాడు. అతని కొడుకు పేరూ దేవునిదే. కావున అతడు ఆస్తికుడే, మతవాదే అని కనక నిర్ణయం జరిగితే, ఆ నిర్ణయం అశాస్త్రీయమైనదా? కాదా? అలాకాక అతడు మతవాదా, లేక మతేతరవాదా అని నిర్ణయించాలంటే ఏం చేయాలి? అతనిని దగ్గరగా చూడాలి (పరిశీలించాలి) అతనితో సంభాషించాలి. అతని ప్రసంగాలు వినాలి, రచనలు చదవాలి. అతని కార్యక్రమాలు చూడాలి. ఇవేవీ చేయకుండా అతడు ఉండే నివాసాన్ని బ్టో, పేరును బ్టో, బంధువులను బ్టో అతని గురించి నిర్ణయించామంటే అది అశాస్త్రీయమే అవుతుంది గదా. ఇలాి పొరపాటు నిర్ణయాలకు రావటం తాత్విక వ్యవహారాల్లోనే కాదు, మన దైనందిన కార్యకలాపాల విషయాల్లోనూ కూడా జరుగుతుంటుంది.
నా జీవితంలో మరొక అనుభవాన్ని పాఠకుల దృష్టికి తెస్తాను. నాకు సన్నిహితుడైన ఒక మార్క్సిస్టు పక్కా భౌతిక వాదే అనటంలో నాకు సందేహం లేదు. కాని అతని దృష్టిలో వెంకాద్రిగారూ, సురేంద్రగారూ ఇద్దరూ భావవాదులే. కాని అతడు ఈ నిర్ణయానికి రావటం వెనుక భావవాదమంటే ఏమిో అవగాహన ఉండి కాదు. వారు ఇద్దరూ మార్క్సిజాన్ని విమర్శించినవారు, గతితార్కి భౌతికవాదాన్ని ప్రశ్నిస్తున్నవారు కనుక భావవాదులే అవుతారు. ఇది ఎంత అశాస్త్రీయవైఖరి? ఇదే విధంగా వెంకాద్రిగారి దృష్టిలో సురేంద్రగారూ భావవాదే. ఎలా అంటే సురేంద్రగారు కూడా హేతువాదుల, మానవవాదుల అవగాహనను ప్రశ్నిస్తున్నారు కనుక. నా వ్యాసాలు చూసి నన్నూ భావవాదేనన్నా ఆశ్చర్యం లేదు.
కొంతమంది హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు తమ యిళ్ళలో జరిగే కార్యక్రమాల్లో సాంప్రదాయ తంతులు నడిపిస్తున్నారు, ఎవరైనా ఆక్షేపిస్తే, తమ కుటుంబ సభ్యుల, బంధువుల, స్నేహితుల వత్తిడికి తలొగ్గక తప్పలేదని చెప్తుండటం జరుగుతుంది. లేదా బహిరంగంగా ఆదర్శపద్ధతిలో జరుపుతూ, బంధువుల సమక్షంలో మరోసారి సాంప్రదాయతంతును అనుసరించడం చూస్తుాంం. ఈలాిం సందర్భాలలో వారు చెప్పేదొకి, చేసేదొకి అనీ కనీసం ఇంో్ల భార్యా బిడ్డల్ని మార్చుకోలేనివారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారని వారిని విమర్శించ బడుతుాంరు. అంటే విమర్శకుల ఉద్ధేశ్యంలో వీరు సమాజానికి ఏ మంచిని అనుసరించమని చెప్తున్నారో, ఆ మంచిని కుటుంబ సభ్యుల చేత ముందు అంగీకరింపచేసి అనుసరించాలని, ఒక వేళ కుటుంబ సభ్యులు అంగీకరించకున్నా, తాను అనుకున్న పద్దతిలో జరిపించాలని, అలా చేయకుంటే ఆచరణలో దారి తప్పినట్టేనని వీరివాదం. నా దృష్టిలో అది అశాస్త్రీయం. చాటుమాటుగా అలా చేసే వారిని నేను సమర్థించనుగాని, తన అభిప్రాయాలకు భిన్నంగా కుటుంబ సభ్యుల అభిప్రాయాలున్నప్పడు కొన్ని సందర్భాలలో సర్దుబాటు చేసుకోవడం వివేకవంతం. లేదా వీరు మొండి పట్టుదలకు పోతే, కుటుంబ సభ్యులు కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తే ఎవరి మాట నెగ్గాలి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుత సామాజిక వ్యవస్థలోని పురుషాధిపత్య పరిస్థితుల్లో, మగహేతువాదులు (అభ్యుదయం సంఘాల్లో అత్యధిక భాగం మగవారే కనబడుతుాంంరు) భార్యలను ఒప్పించితీరాల్సిందే ననీ. అలా ఒప్పించలేకుంటే ఆచరణలో లోపం ఉన్నట్లు అనీ వారి అభిప్రాయం. సమాన భావనకు, సర్దుబాటు భావనకు వ్యతిరేకమైన ఇలాిం ఆచరణ అశాస్త్రీయమే. కుటుంబ సభ్యుల్లో మార్పును అవగాహన ద్వారా తీసుకురావాలే కాని, ఆధిపత్య భావనతో కాదని అలాిం విమర్శకులు గ్రహించాలి. ఎందుకంటే హేతువాద సంఘంలోని వారు ఆచరణ విషయంలో ఇలాిం విమర్శలనే ఎదుర్కొంటున్నారు. అదిన్నీ సాి హేతువాదుల నుండే ఇలాిం విమర్శలు రావడం శోచనీయం.


No comments:

Post a Comment