Saturday, August 1, 2015

సత్యాన్వేషి శ్రీ ఎన్‌.వి.బ్రహ్మం గారికి నివాళి

హేతువాది, మానవతావాది, సత్యాన్వేషి అయిన శ్రీ నాసిన వీరబ్రహ్మం (ఎన్‌.వి.బ్రహ్మంగా సన్నిహితులకు పరిచయం) గారు జూలై 27వ తేదీన రాత్రి చిన గంజాంలో తుదిశ్వాస విడిచారు. ఆయన జన్మస్థలం చీరాల తాలూకా గోసనపూడి. తల్లి హనుమాయమ్మ, తండ్రి వెంకటస్వామిలకు 1926లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య- సీతారావమ్మ, కుమారులు- జిగీష్‌, గవేష్‌, కుమార్తె -మనీషా ఉన్నారు.
హైస్కూలు విద్యార్థి థనుండే ఆయన తెలుగు, సంస్కృత సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు. తెలుగులో ఆయన భర్తృహరి శతకాన్ని అనువదించారు. స్వతంత్రాలోచనాపరుడుగా ఆయన ఆ థనుండే సనాతన మార్గం నుండి హేతువాద భావాలకు మళ్ళారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి ప్రభావంతో ఆయన హేతువాదిగానూ, ఎం.ఎన్‌.రాయ్‌ ప్రభావంతో మానవతావాదిగానూ, ప్టుా సురేంద్రబాబుగారి ప్రభావంతో సత్యాన్వేషకునిగానూ జీవితం గడిపారు. ప్రముఖ హేతువాది రావిపూడి వెంకాద్రి గారితో కలసి చీరాల, చుట్టుప్రక్కల గ్రామాల్లో హేతువాద ఉద్యమం వ్యాప్తికి కృషిచేశారు. ఆయన తన జీవితకాలంలో మెదడుకు మేత, రాయిస్టు దర్శనం, కలలో దేవుడు, హోమియో దర్శనం, కళాశాస్త్ర వివాదంలో హేతువాదం, హేతుబుద్ధి కలవారు హోమియోను కాదనగలరా? విం రచనలు చేశారు. 1958లో ఆయన రచించిన 'బైబిలు బండారం' (ప్రస్తుతం 'బైబిలే పలుకుతోంది' గా పునర్ముద్రించబడింది) అప్పి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే నిషేధించబడి, 1962లో సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఎం.ఎన్‌.రాయ్‌ సిద్ధాంతమైన రాడికల్‌ హ్యూమనిజంలోని 22 సూత్రాలను సమీక్షించి, మార్చుకోవలసిన అవసరం ఉందని, అంతేగాక మానవవాదంలో 'కళ'కు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఇతర మానవ వాదులతోనూ విభేదించాడు. ప్రారంభంలో 'మనీషా విద్యావిహార్‌' అనే స్కూల్‌ను విజయవంతంగా నడిపినప్పికీ, తరువాత థలో హోమియో వైద్యుడిగా స్థిరపడ్డారు. హోమియో వైద్యవిధానం శాస్త్రీయత విషయంలో ఇతర హేతువాదులు, మానవవాదులతో ఆయన విభేదించారు. 1992లో సత్యాన్వేషణ మండలికి తాను పరిచయమైనప్పినుండీ చివరి వరకూ సభ్యునిగా కొనసాగడమే గాక, అనేకమంది సభ్యుల్నీ మండలికి పరిచయం చేశారు. 'బైబిలే పలుకుతోంది' గ్రంథాన్ని పునర్ముద్రణకు సత్యాన్వేషణ మండలికి ఉచితంగా హక్కుల్ని ఇచ్చి ఆయన వారసులు కూడా సత్యాన్వేషణ మండలి పట్ల ఆయనకున్న అభిమానాన్ని వారూ చారు. బ్రహ్మంగారు లేని లోటు భర్తీచేసుకోలేనిదైనప్పికినీ, ఆయన ఆలోచనలనుండి స్ఫూర్తిని అందుకోవడమే ఆయనకు మండలి అందించే అసలైన నివాళి.
ఇట్లు
సత్యాన్వేషణ మండలి

No comments:

Post a Comment