Tuesday, September 1, 2015

అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికి 3వ లేఖ


అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికి
అయ్యా! మీరు హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా వెల్లడించిన భావాలలో దోషాలుంటే చూపండని 'యూట్యూబ్‌' ద్వారా చేసిన మీ ఛాలెంజ్‌ ప్రకటనకు స్పందిస్తూ, నేను ఇప్పికి రెండు రిజిష్టర్డ్‌ లేఖలు వ్రాశాను. ఈనాి వరకు మీ నుండి ప్రత్యుత్తరం రాలేదు. భారత దేశానికి నా సవాలంటూ ప్రకించిన మీలాి వారిలా మా పలుకూ లేకుండా ఊరుకోవడం సబబు కాదు. మీలో ఏమాత్రం నిజాయితీ గానీ, గుండె నిబ్బరం గానీ ఉంటే వెంటనే నా ప్రతి సవాలును స్వీకరించి ఉండాల్సింది. నా లెఖ్ఖ ప్రకారం మీ రచనలో పలు దోషాలున్నాయి. అందులో మీరు సరైనవని నిరూపించలేనివి, నేను సరికావని నిరూపించగలిగినవి కొన్ని ఉన్నాయి. కనుక చర్చకు కూర్చుంటే మీరు క్రైస్తవాన్ని విడచి నావెంట రాక తప్పదు. ఇది నా అంచనా. ఈ నిజం మీకూ తట్టే ఉంటుందనిపిస్తోంది నా తాత్వాక యోచనకు.
నాకు తెలిసి వాదనియమాలలో, ఒక పక్షం వీగిపోయిందని నిర్ధారించడానికి ఒక పద్ధతి వుంది. 'విప్రతిపత్తిరప్రతిపత్తిచ్చ నిగ్రహ స్థానం' అన్నది సూత్రం. అడిగిందొకటైతే, మరొక ప్రస్థావన చేసినా, అడిగిందానికి బదులాడక మౌనంగా ఉన్నా అి్టవారు ఓడినట్లేనన్నది ఆ సూత్రార్థం. అది వాదనియమాలెరిగిన వారందరూ అంగీకరించిందే. ఆ విధానాన్ని బ్టి చూస్తే ఇప్పికే మీరు ఓడినట్లు. అయినా అలా దీనిని ముగించడం నాకిష్టం లేదు. నిజానికి నా లక్ష్యం మిమ్ము ఓడగొట్టడం కాదు. మీరెంచుకున్న విధానం నిజాయితీతో కూడుకున్నది గానీ, నిజమనదగ్గది గాని కాదని లోకానికి తెలియజెప్పాలన్నదే నా అభిమతం. ఈ విషయంలో, ఇలాిం వైఖరిని అవలంభించిన వారందరినీ నిలువరించాలనీ, అి్ట ప్రచారపు ఎత్తుగడలను నిర్మూలించాలని నిర్ణయించుకునే మీతో మొదల్టెానాపని, ఈ పోకడ పోయిన వాళ్ళందరకూ ఈ కబురందిస్తున్నాను. వారు ఎవరికి వారుగా గాని, మీరందరూ కలసికట్టుగా గాని నాతో చర్చకు సిద్ధపడేట్లు చేయాలన్నదే నా ఉద్దేశము.
ఇప్పికైనా మీరుసిద్ధపడి విచారణకు రాకుంటే, ఈ మొత్తం కథనంతా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతాను. అవసరమైతే పదుగురి ముందు పెట్టయినా మిమ్ము చర్చకు సిద్ధం చేస్తాను. చర్చలో ఎలాగూ  మీరు వ్రాసిన వాిలో అనేక దోషాలు, ఎత్తుగడలు ఉన్నట్లు రుజువవుతుంది. కనుక మీరు క్రైస్తవాన్ని విడచి నావెంట నడవక తప్పదు. మీ నుండి వెంటనే సముచిత రీతిలో సమాధానంగానీ రాకుంటే, నేను మలి థయత్నాలనారంభిస్తాను. నాయీ యత్నం మీలాి మరెందరికోనూ గుణపాఠం కావాలనీ, కాగలదనీ తలుస్తాను.
ఈ లేఖ నకళ్ళు మరికొందరికీ పంపుతున్నాను. వివేకపథం 219లో ఎలానూ వస్తుంది. ప్రస్తుతానికి మీలా ఇతర మత గ్రంథాలలో అదీ ముఖ్యంగా వేదము, ఉపనిషత్తులు, పురాణాలలో 'యేసును గురించి' వివరాలున్నాయని, ముహమ్మదును గురించిన వివరాలున్నాయని అంటున్నవాళ్ళు కొద్దిమంది నాదృష్టికి వచ్చారు. ఈరకం వారి పోకడంతా విపరీతపు పోకడే. వారలా అనుకోవడానికి కారణం...
1. ఆయా గ్రంథాలను పొరపాటుగా - తప్పుగా - అర్థం చేసుకొని ఉండడం.
2. మత ప్రచారానికో, మత మార్పిడుల కొరకో, ఎంచుకున్న కుిలోపాయం అయ్యిండడం.
గమనిక : ఈ రకంవారి రచనలు, ప్రసంగాలు విన్నాక - గమనించాక - వారు పొరపాటుగా ఆ పనికి పూనుకోలేదని, మత వ్యాప్తి, మత మార్పిడుల కొరకే, అమాయకుల్ని త్వరగా, సులభంగా బుట్టలో వేసుకోడానికి వీలవుతుందనుకొనే, అందుకు పూనుకున్నారనీ నిర్ధారణ అయింది నావరకు నాకు.
అడిగేవారుండరులే అన్న ధీమా, అడిగినా భావప్రకటనా స్వేచ్ఛక్రిందనో, మత ప్రచార స్వేచ్ఛ క్రిందనో న్టెివేయవచ్చులే అన్న అజ్ఞానజనిత తప్పుడు సాహసము అన్నదే వారింతికి తెగబడానికి కారణం. నిజానికి ఈ రకమైన రాతలు, మాటలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)ఎ కి చెందిన భావప్రకటనా స్వేచ్ఛ క్రిందకు గాని, ఆర్టికల్‌ 25, 26, 27ల క్రిందనున్న మత ప్రచార స్వేచ్చ క్రిందకు గాని రాకపోగా ఆ ఆర్టికల్స్‌ నిషేధిస్తున్న అనైతికత మరియు ప్రలోభపెట్టడం అన్న దుర్వినియోగం క్రిందికి వస్తాయి. అంతేగాక, అి్ట మాటలు అబద్దపు ప్రచారం క్రిందకూ వస్తాయి. ఆ గ్రంథాలకు చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగనూ, వారిని ఆవేశపరిచేందుకూ కారకాలవుతాయి.
హైందవ సాహిత్యంలో నుండి క్రీస్తును నిలబ్టెాలనుకోవడం సరికాదన్న బొంకూరి జాన్‌ గారు, పి.డి.సుందర్రావు గారు, అలాి మరికొందరు క్రైస్తవ మతబోధకులు ఈ విషయంలో మీకంటే చాలా నిజాయితీతో ఉన్నారనక తప్పదు. మీరంతా ఇప్పికైనా నిజాన్నంగీకరించి సత్యంవైపుకు కదలడానికి సిద్ధపడడం కనీస విజ్ఞత. కనీస నైతికత కూడా.
1. ఎ) పరవస్తు సూర్యనారాయణ, వారి బృందం, బి) గుండాబత్తిని దేవదానం, వారి బృందం, సి) రంజిత్‌ ఓఫిర్‌, వారి బృందం, డి) ఇంకా నా దృష్టికి రాని ఈ తరహా పోకడకల వాళ్ళందరికీ నా యీలేఖ సమానంగా వర్తిస్తుంది.
2. ఖురాన్‌ పక్షంలోనూ ఇలాి వైఖరి కలవాళ్ళున్నారు. వారికీ ఈ లేఖ అంతే సమానంగా వర్తిస్తుంది.
ఎ) సత్య సందేశ కేంద్రం - కాకినాడ వారు, బి) అల్‌ ఫారూక్‌ పబ్లికేషన్స్‌ - కడప (హిందూ ధర్మ గ్రంథాలలో ముహమ్మద్‌), సి) ముస్తాక్‌ అహ్మద్‌ గారు వారి బృందం, డి) ఇంకా నా దృష్ట్గికి రాని ఇస్లాం ప్రచారకుల్లో ఈ వైఖరి కలవాళ్ళు.
గమనిక : మీ గ్రంథాలలో (వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలలో) మా యేసు, మా దేవుడు, మా ప్రవక్త అంటుండే వాళ్ళందరకూ సత్యాన్వేషణ మండలి, అలాగా! ఏదీ ఎక్కడ ఎలా ఉంది? రండి ! చూపించండి? పరిశీలిద్దాం రండి! అని ఆహ్వానం పలుకుతోంది. సత్యస్థాపనకు పెద్ద పీట వేయాలన్న దృష్టి ఉంటే మాత్రం ఈ ఆహ్వానాన్ని కాదనటం కుదరదు.
- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

No comments:

Post a Comment