þ వాళ్ళ నుండి ఉలుకూపలుకూ లేదు. ఆ సంస్థకు అధికార ప్రతినిధినన్న ప్రకాష్‌గారుగానీ, ఎవరు పిలిచినా ఒచ్చి క్రైస్తవ సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపిస్తానని 'సత్యోదయం' సమావేశంలోనూ, బైబిల్‌లో ఒక తప్పుచూపినా దానిని తగలెట్టేస్తానని విజయవాడలో మండలి తత్వచర్చావేదికలోనూ మాటల్లో అతి సాహసాన్ని కనబరచిన సుధాకర్‌గారుగానీ, మాతోనూ చాలాకాలం సన్నిహితంగా వుండి క్రైస్తవాన్ని భుజానికెత్తుకున్నదేకాక, నేనూ, రహమాన్‌గారూ కలసి గత సం||కాలంగా జరుపుతున్న వేదికలో పాల్గొంటూనే, పరిణామవాదంపై చర్చ ఒక ముగింపుకు వచ్చిన సందర్భంలో, తరువాతి సమావేశం 'క్రైస్తవ సృష్టివాద ప్రతిపాదన-పరీక్ష' కొరకే అనుకునే సమయంలో చర్చావేదిక నియమ నిబంధనలు నిర్ణయమయ్యాక సిద్ధాంత చర్చ చేయడం సరైందికదా అంటూ, క్రైస్తవాన్ని ప్రతిపాదించే పనిని పక్కనబెట్టే పని తెలివిగా చేపట్టిన ఆనంద్‌గానీ, þ పారిపోడంలేదు, భయపడడంలేదు, పనుల వత్తిడిలో వున్నాం, అదవగనే ఖచ్చితంగా మా పక్షాన్ని ప్రతిపాదించుతాం అని ఇ-మెయిల్ ద్వారా ప్రకటించిన పేరు, వివరాలు వెల్లడించని మరో అజ్ఞాత þ ప్రతినిధిగారుగానీ, కిమ్మిన్నాస్థిగా ఊరుకున్నారెందుకో అర్థంకాదు. అర్థంకాదంటే ఊహకందటంలేదనిగాదు. ఊరుకోడం వెనక ఒకటికంటే ఎక్కువ కారణాలుండవచ్చన్న ఒక నిజం వుందిగనుక, ఖచ్చితంగా ఏమయ్యుంటుందో తేలలేదనే. నా ఊహకందినంతలో, వారిలో నిజాయితీగానీ, సత్యానికి పెద్దపీట వేయాలన్న అభిలాషగానీ బలంగా లేవు.
అదలా వుంచి, 154 సంచికలో రహ్మాన్‌గారికీ, వారిని వత్తిడి చేయాల్సిన బాధ్యత నాకున్నంతా మీకూ వుందని వ్రాశాను. దానిపై రహ్మాన్‌గారికీ, þ వారికీ మధ్య సంభాషణ జరిగింది. రహ్మాన్‌గారికి అర్థమైంది. þ వారు క్రైస్తవ సృష్టివాదాన్ని వేదికపై ప్రతిపాదించడానికి సిద్ధంగా లేరనీ, దానిని దాటవేయడానికి దారులు వెతుక్కుంటున్నారనీ. రహ్మాన్‌గారు నాకు ఫోన్‌చేసి, þ వారు వారి వాదాన్ని ప్రకటించటానికి సిద్ధంగా లేరు. వారు మండలి సిద్ధాంతాన్ని ప్రకటింపజేయమని నన్ను కోరారు. మీరంగీకరిస్తే సమావేశం ఏర్పరుస్తాను అని అన్నారు.
ఆశ్చర్యం! గత సంచికలో రహ్మాన్‌గారికి నేను సూచించిందేమిటి? ఆ నా సూచనలో ఉన్నదే సబబుతనం ఏమిటి? అసలు, దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతనివ్వకుండా రహ్మాన్‌గారు þ వారి కుటిల వ్యూహంలో పరికరంగామారి, వారి తరఫున ఎందుకు మాట్లాడినట్లు? నేనాయనను గమనిస్తున్నంతలో, ఫజులర్ రహ్మాన్‌గారు జరుగుతున్న వాటిని సూక్ష్మంగా, నిశితంగా పట్టిచూడడంలో దిట్టతనం కలిగినవారే. తన మేధస్సుకున్న ఆ గట్టితనాన్ని, నిష్పక్షపాతంగా ఆచరణలో చూపెట్టకపోవడం!? ఆశ్చర్యమేమరి.
చివరిసారిగా þ వారికి ముఖ్యంగా ప్రకాష్ సుధాకర్, ఆనంద్‌గార్లకు, (1) మీరు లేవనెత్తిన 13 ప్రశ్నలు నావికూడా, అనేవాళ్ళ అడ్రస్‌లు వెంటనే మాకివ్వండి; (2) క్రైస్తవ సృష్టివాదాన్ని ప్రతిపాదించి పరీక్షకిచ్చి నిరూపించండి; (3) స్వస్థత ప్రార్థనల మహత్యాన్ని ప్రయోగరీత్యా నిర్ధారించండి.
ఈ పనులు చేయలేకుంటే నిజాయితీగా క్రైస్తవాన్ని విడచి అన్వేషణా పథం పట్టండి, కనీసపక్షం, మీకే తెలియని విషయాలను మందినెత్తికెక్కించే తప్పుడుపని దుర్మార్గమైనా చేయడం ఆపనైనా ఆపండి.
ఒక్కమాట! జీవితం నాల్గునాళ్ళ ముచ్చట. దీనికై మందినెత్తిన ఇంతింత గంద్రగోళపు బరువుల్ని పెట్టాల్సిన అవసరముందా! ఇంగితమూ, మానవత్వమూ ఉన్నవారంతా ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయమిది. ఉంటాను. ఇప్పటికి సెలవ్. సత్యాన్వేషణలో, మీ సురేంద్ర.
No comments:
Post a Comment