Tuesday, May 1, 2012

ఐక్యవేదిక ఉద్యమ సమాచారం


ఉద్యమ మిత్రులారా !, స.హ.కార్యకర్తలారా !


ముందనుకున్న ప్రకారం మే 5,6 తేదీల సమావేశాలు హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయములో జరిగాయి. సంక్షిప్తంగా ఆ వివరాలిలా వున్నాయి.

5వ తేదీన కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి డా.బ్రహ్మారెడ్డి, రామకృష్ణరాజు, వేణుగోపాలరెడ్డి, వెంకట్రామయ్య, కృష్ణమూర్తిరాజు, రాజేంద్రప్రసాద్‌, లోకనాథ్‌, సత్యనారాయణ, నటుకుల శ్రీనివాస్‌, జంపా క్రిష్ణకిషోర్‌, సురేంద్ర, కోట ప్రసాదు గార్లు హాజరయినారు.


1. రాష్ట్ర కార్యాలయాన్ని మరింత పటిష్టంగా వ్యవస్థీకరించటం.

2. ప్రధాన కార్యదర్శి పనుల భారాన్ని పంచుకోడానికి మరొకరికీ ఆ బాధ్యతను అప్పగించడం.

3. ప్రధాన పాత్రధారులుగా వుంటున్న ఎంపిక చేసుకున్న బృందం 'సిలబస్‌ - శిక్షణా క్రమం' అన్న వాటిపై 2 రోజులు వర్కుషాప్‌కై సిద్ధం కావడం.

4. జిల్లా బాధ్యులకు, శిక్షకుల శిక్షణ పొందిన వారికి ఉద్యమ నిర్వహణ పరమైన అవగాహన కలిగించడానికి, మెలకువలకు అవసరమైన సాధన శిబిరాన్ని నిర్వహించడం.

5. పరస్పరం తగినంత ఐక్యంగాలేని జిల్లా కమిటీల విషయంలో వారిమధ్య సయోధ్యను ఏర్పరచడానికి రాష్ట్రం నుండి ఒక ఉప సంఘాన్ని ఎంపిక చేసుకొని ఆ పనులప్పగించడం.

6. రాష్ట్ర కార్యాలయం ఎక్కడుండాలి? అన్న దానిపైన ఒక నిర్ణయానికి రావడం.

7. ఆర్థిక పరమైన లోటును, భర్తీచేసుకొనేందుకు తీసుకోవలసిన చర్యలు.

8. 2 సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో అనుకున్నవి, జరిగింది, ఇక జరగాల్సింది అన్న విషయంపైనా చర్చ.

9. 6వ తేదీ సమావేశాన్ని ఏఏ అంశాలకు పరిమితం చేసి నర్వహించుకోవాలన్నది.

10. జరిగిన 2 సం||ల ఆర్థికాంశాల జమా ఖర్చుల విషయం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం గురించి.

ఎ) ప్రధాన కార్యదర్శిపైనున్న అదనపు భారాన్ని తగ్గించడానికి, ఆ పనిభారాన్ని పంచుకోవలసిందిగా జంపా క్రిష్ణకిషోరు గారిని కోరటం, వారంగీకరించటం జరిగింది.

బి) కార్యాలయ నిర్వహణ, వ్యవస్థీకరణలన్న రెండు మరింత సక్రమంగా జరపడానిక గాను విజయవాడలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుండే ఉద్యమ కార్యాన్ని ప్రధానంగా నిర్వహించాలనుకోవడం జరిగింది. రాజధానిలోను, అనుబంధ రాష్ట్ర కార్యాలయ విభాగాన్ని నిర్వహించుకోవాలని, అందుకై జె.వి.వి. కార్యాలయాన్నే తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించటం జరిగింది.

సి) జూన్‌ 8,9 తేదీలలో ఉద్యమ భాగస్వామ్య సంస్థలలో నుండి ఎంపిక చేసుకున్న కొద్దిమందితో శిక్షకులకు శిక్షణ పూర్తిచేసుకున్న వారినుండి కొద్దిమందిని కలుపుకొని దోరకుంటలో సిలబస్‌ సవిూక్ష, శుద్ధరూప నిర్మాణములన్నవాటి కొరకు అభ్యాసం చేయాలనుకున్నాము. దానికి 1. డా. బ్రహ్మారెడ్డి, 2, రాజేంద్రప్రసాద్‌, 3. లోకనాథ్‌, 4. వేణుగోపాలరెడ్డి, 5. సురేంద్ర, 6. వెంకట్రామయ్య, 7. బాలగంగాధర్‌, 8. కోటప్రసాద్‌, 9. నటుకుల శ్రీనివాస్‌, 10. క్రిష్ణకిషోర్‌, 11. కృష్ణమూర్తి రాజు గార్లతో పాటుగా మరికొందరిని కూడా పిలవాలని అనుకోవటం జరిగింది.

డి) జూన్‌ 22, 23 తేదీలలో మే6న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వచ్చిన వాళ్ళను, మరికొందరు క్రియిశీలంగా పనిచేయగలవారిని కలుపుకొని, కార్యకర్తల నైపుణ్యాలను పెంచే అభ్యాసము కొరకు జెవివి కార్యాలయంలో సమావేశము కావాలనుకున్నాము.

అవగాహనలో స్పష్టత, పనిచెయ్యటంలో నిబద్దతలన్న రెంటిని మెరుగుపర్చుకోవటానికి ఉద్దేశించినవే నిన్న జరిగిన 5,6 తేదీల సమావేశాలు మరియు వచ్చే జూన్‌ 8,9 - 22,23 తేదీలలో జరగనున్న సమావేశాలున్నూ. 16 జిల్లాల నుండి ప్రాతినిధ్యము, 45 మంది హాజరి, 10 గంటలకు 10 నిమిషాల ముందే సమావేశాన్ని ఆరంభించుకోవడమూ, వచ్చిన వారంతా సావధానంగానూ, ప్రాధాన్యతనిచ్చి సాయంత్రం వరకు మనసుపెట్టి విచారణలో పాలుపంచుకోవడమూ అన్నది వేదిక ఆరోగ్యాన్ని పుంజుకుంటున్నదానికి సూచనననుకోవచ్చు. నావరకు సంతోషంగానే ఉన్నది.

అలాగే ది.6-5-2012న స.హ.ప్రచార ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం స్థానిక జన విజ్ఞాన వేదిక ఆఫీసులో ఉదయం 10 గం.లకు మొదలైంది. 16 జిల్లాల నుండి సుమారు 45 మంది బాధ్యులు, ఉత్సాహవంతులు పాల్గొన్నారు.

ముందుగా రాష్ట్ర అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతున్నా సంతృప్తికరంగా లేవన్నారు. అలానే సవిూక్ష అంటే ఏమిటో? దాని అవసరాన్ని వివరించి డా||బ్రహ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరారు.

డా||బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా మనం ఏమి చేయాలనుకున్నాం? ఏమి చేశాము? ఏ రకంగా చేయగలమో చూచుకోవాలన్నారు. స.హ.ప్రచార ఐక్యవేదిక రెండు ఐక్య మిత్రమండలుల కలయికగా వివరించారు. చేయాలనుకున్న పని స్పష్టంగా, నిర్థిష్టంగా, ఇంతపని, ఇంతకాలంలో జరగాలన్న నిర్ణయము వాస్తవానుగుణ్యత కలిగి వుందో, లేదో, అలానే సాధించటానికి యోగ్యమైనదా? కాదా? అన్న విషయాలను స్మార్ట్‌ (ఐఖజుష్ట్రఊ)అనాలసిస్‌ చేసుకోవాలన్నారు.

అలానే అనుకున్న పనిని అంచెల వారీగా అమలు పరచడానికి, వ్యక్తిగతంగా మనకు గాని, జిల్లాకు గాని, రాష్ట్రానికి గాని ఉన్న అవకాశాలు ఏమిటి, అలానే బలాలు ఏమిటి? బలహీనతలు, భయాలు ఏమిటో స్వాట్‌ (ఐఇంఊ) అనాలసిస్‌ చేసుకోవాలన్నారు. అలానే చేసిన పనిని రికార్డు చేయాలి. ఆ రికార్డుల ఆధారంగా రిపోర్టులను తయారు చేయాలని, ఆ రిపోర్టులే భవిష్యత్‌ ప్రోగ్రామ్‌కు ఆధారంగా వుంటాయన్నారు. అన్నిటిలోకి ముఖ్యమైనది కమిట్‌మెంట్‌ అన్నారు. కమిట్‌మెంట్‌ అంటే అన్న మాటకు కట్టుబడి వుండటం. చేస్తానన్న పనిని మనస్సుపెట్టి చేయడం, సమయపాలన పాటించటం అని వివరణ యిచ్చారు.

మనందరి లక్ష్యం, స్పష్టంగా, నిర్ధిష్టంగా వుంటేనే గాని కలసి పనిచేయడం కుదరదంటూ స్మార్ట్‌ (ఐఖజుష్ట్రఊ) అనాలసిస్‌, స్వాట్‌ (ఐఇంఊ) అనాలసిస్‌ బాధ్యుల చేత చేయించే పనికి పూనుకొన్నారు. ముందుగా స.హ.ప్రచార ఐక్యవేదిక లక్ష్యం ఏమిటో ఎవరికి వారు వ్రాయ వలసిందిగా కోరి పేపర్లు అందజేసి అందరూ వ్రాసిన లక్ష్యాలను సభకు చదివి వినిపించారు. కుడి ఎడమగా అందరి భావాలలోని సారాంశాన్ని 3 పాయింట్లుగా వివరించారు.

ఐక్యవేదిక లక్ష్యాలు : 1. సమాచార హక్కు చట్టమును సాధనంగా తీసుకొన్నామని. 2. 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగములో చేర్చబడిన అధికరణము 243ను అమలుపరచుకోవటానికి చేయవలసిన కృషి (అంటే స్థానిక ప్రభుత్వాలకు పూర్తిస్థాయిలో అధికారాలను, నిధులను కేటాయించే విషయం) 3. పై విషయాలన్నీ సక్రమంగా అమలుపరచటానికవసరమైన గ్రామ సభలు, వార్డు సభలు చైతన్యవంతంగా నిర్వహించుకొనే వీలుగా ప్రజలను మేలుకొల్పడం. (ప్రజలు తమ యజమాన్యత్వాన్ని తామే గుర్తించేటట్లు చేయటం) అన్న మూడు సంస్థ ఆశయాలుగా తేల్చబడింది.

అలానే స్వాట్‌ అనాలసిస్‌ కూడా బాధ్యుల చేత చేయించారు. అందరికి పేపర్లు ఇప్పించి నాలుగు పార్టులుగా, మనకున్న బలాలు, బలహీనతలు అనుకూలాంశాలు (అవకాశాలు), ప్రతికూలాంశాలు (భయాలు) వ్రాయించి, ముందుగా బలహీనతలను పరిశీలించి వాటిని వదిలించుకొంటే ఆ అంశాలు బలాలవుతాయని, అవకాశాలను ఉపయోగించుకోవాలని, భయాలను విశ్లేషణచేసుకొని అతిగమించాలని, ఇలాచేస్తే బలాలు పెరుగుతాయని వివరించారు.

సభికులు ఉత్సాహంగా ఈ అనాలసిస్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా తెలియపరిచారు. ఆ అభిప్రాయాలను మొత్తం కలిపి ఏవి ఎన్ని రకాలుగా వచ్చినాయో ఎనలైజ్‌చేసి వ్రాయటానికి కొంతమందికి అప్పగించటం జరిగింది.

కార్యవర్గం తీసుకొన్న ముఖ్య నిర్ణయాలు :

1. స.హ.ప్రచార ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి గారైన రామకృష్ణరాజు గారికి కార్యభారము పెరిగినందున ప్రస్తుతము ఉపాధ్యకక్షుడుగా కొనసాగుతున్న జంపా క్రిష్ణకిషోర్‌ గారిచేత కరస్పాండెన్స్‌ విజయవాడ నుండే జరిపించాలని నిర్ణయించడం జరిగింది.

2. జూన్‌ 22,23 తేదీలలో మరల తిరిగి కార్యవర్గ సమావేశం జనవిజ్ఞాన వేదిక ఆఫీసులోనే జరుగుతుందని, ఆసమయానికి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులే కాకుండా టి.వో.టి. పూర్తిచేసుకున్న ఉత్సాహవంతులైన కార్యకర్తలు హాజరు అవ్వాలని స.హ.ప్రచార ఐక్యవేదిక ఆశయాలు, ఆదర్శాలు, స్మార్ట్‌ అనాలసిస్‌, స్వాట్‌ అనాలసిస్‌ల గురించి అందరూ కలసి చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.

మే నెలలో సుమారు 20వ తేదీ తరువాత టి.వో.టి. శిక్షణా తరగతి ఉంటుంది. ఈ విషయాన్ని అన్ని జిల్లాల బాధ్యులు గుర్తించి తమ జిల్లా నుండి యోగ్యమైన వారిని పంపవలసిందిగాను, ముందుగా మాకు తెలియజేయవలసిందిగాను కోరుచున్నాము.

మే 10,11,12 తేదీలలో దోరకుంట నందు ప్రాథమిక శిక్షణకు నల్గొండ జిల్లా నుండి శివరాజుగారి ఆధ్వర్యాన సుమారు 20 మంది, అలానే ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి నుండి శిక్షకులు పాల్గొన్నారు.

- రిపోర్టర్‌ : కోట ప్రసాద శివరావు

No comments:

Post a Comment