1. రాష్ట్ర ప్రభుత్వానికీ సీల్డ్ కవర్లలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన ఆస్తుల వివరాలను స.హ.దరఖాస్తు దారు తనిఖీచేయవచ్చు. - తమిళనాడు హైకోర్టు తీర్పు.
2. జరిమానా విధించబడిన ప్రజా సమాచార అధికారి వ్యక్తిగత హోదాలో మాత్రమే హైకోర్టుకు రావాలి. ఆయన తరపున రాష్ట్ర ప్రభుత్వము అప్పీలు చేయరాదు. - పంజాబు, హర్యానా హైకోర్టు తీర్పు.
3. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే ప్రజలు ప్రజాస్వామ్యంలో తమపాత్రను సమర్థంగా పోషిస్తారు. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని నిజమైన, ప్రభావవంతమైన భాగస్వామ్య ప్రజాస్వామ్యంగా మార్చవచ్చు. ప్రజాస్వామ్యానికి స.హ.చట్టం మౌలికమైనది. - మద్రాసు హైకోర్టు.
4. ప్రజలే యజమానులు. మనం సేవకులం మాత్రమే. ప్రజల నమ్మకంపైనే మన అధికారం ఆధారపడి వుంది. - జస్టీస్ మార్కండేయ కట్టా (సుప్రీంకోర్టు న్యాయమూర్తి)
5. చైతన్యవంతమైన సమాజమే అవినీతి రహిత దేశాన్ని నిర్మిస్తుంది. పాలనలో పారదర్శకత సాధనకు ప్రజలంతా కలసికట్టుగా పోరాడాలి. - జస్టీస్ అరుళ్‌నాగరాజ్, కర్నూలు హైకోర్టు.
6. అవినీతిపై పోరాడటానికి పారదర్శకత, జవాబుదారీతనాల సాధనకు బాధ్యతాయుతమైన పౌరుల చేతుల్లో వున్న ప్రభావంతమైన ఆయుధం సమాచార హక్కు - సుప్రీంకోర్టు,
7. స.హ.చట్టం రాకముందు ప్రభుత్వ కార్యక్రమాలు, పాలసీలపై ప్రజలకు సమాచారం అందేది కాదు. దీంతో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయి. స.హ.చట్టం ప్రజా ప్రతినిధులు, అధికారులను, సామాన్యునికి జవాబుదారీగా చేసింది. స.హ.చట్టంతో ప్రశ్నిస్తారన్న భయంతో న్యాయవ్యవస్థ కూడా కేసులను త్వరగా పరిష్కరిస్తుంది. - జస్టీస్ చెల్లప్ప, కర్నాటక హైకోర్టు.
8. పరిపాలనాపరమైన అడ్డంకులను సాకుగా చూపించి సమాచారాన్ని తిరస్కరించరాదు. తగినంత సిబ్బంది లేదనే వాదనను కూడా ఒప్పుకోం. - మద్రాసు హైకోర్టు.
9. ఉపాథి హామీ పథకములో ఎన్నో అక్రమాలను వెలుగులోనికి తేవడంలో స.హ.చట్టం ఎంతో ఉపకరించింది. పథకం సమర్థ అమలును, అర్హులకు లబ్దిచేకూర్చడానికి స.హ.చట్టాన్ని ఉపయోగించాల్సిందే. - జస్టీస్ మదన్ బి.లోకూర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
10. రాష్ట్ర సహకార సంఘాల చట్టం క్రింద నమోదైన సహకార సంఘాలన్నీ ప్రభుత్వ యంత్రాంగాలే. స.హ.చట్టం క్రింద అవి సమాచారం ఇవ్వాల్సిందే. రిజిష్ట్రేషన్ దగ్గర ప్రారంభిస్తే ప్రతి థలోనూ అవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే వుంటాయి. కాబట్టి వాటికి చట్టం వర్తిస్తుంది. - విస్తృత ధర్మాసనం, కేరళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.
సేకరణ : యర్రంశెట్టి జగన్మోహనరావు.
No comments:
Post a Comment