Saturday, September 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? - 7

ముందుగా : - షరా మామూలే. రిజిష్టరు పోస్టు ద్వారా పంపిన 190వ సంచిక గోడకు కొట్టిన బంతిలా తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. ఆ కవరు పైన ఒక వాక్యం పి.డి గారిదే వ్రాయబడి ఉంది. నల్గొండ మీటింగ్సు పబ్లిక్‌లో ఛాలెంజ్‌ చేసినా రాని నీకు .... అన్నదే ఆ అసంపూర్తి వాక్యం. ఇక చదవండి. 


పి.డి.సుందర్రావు గారి భాగోతం - మరికొన్ని వివరాలు

జయశాలి సింహగర్జన (7వ ముద్రణ) నుండి :- (1) యోచనాశీలురైన మిత్రులారా! పై పుస్తకం పేరు దగ్గరే, (ముఖపత్రం పైనే) ''నూతన సహస్రాబ్ది అజ్ఞానం'' పై జయశాలి సింహగర్జన అన్న మాటలున్నాయి. నూతన సహస్రాబ్ది అంటే ఏమిటి? దాని అజ్ఞానమంటే ఏమిటి? దాని పై ఆయన గారి గర్జనేమిటి? ఆ వివరాలు ఇవ్వకుండా చదువరికి అదెలా అర్థమవుతుంది? ఆ పుస్తకంమొత్తం చదివినవారెవరైనా, పై మూడు ప్రశ్నలకు సమాధానం వ్రాయండి చూద్దాం.

(2) ఆ పుస్తకపు ముఖ చిత్రంలోనే ఈయనగారు, పళ్ళు బిగబట్టి, మూతిబిగించి, మెడనిక్కించి, రొమ్ము విరుచుకుని ప్రదర్శించిన హావభావాలూ, దానితోబాటు ఆయన వెనక సింహపు బొమ్మ వేయించుకోవడం, పుస్తకం పేరుగా ''జయశాలి సింహగర్జన'' (ప్రపంచమేధావులారా... ఖబడ్దార్‌) అన్నది పెట్టడం చూస్తే ఈయన చాల వరకు మృగస్వభావం కలవాడనే అనిపిస్తోంది. దాదాపుగా, తనకు సరిపడే విధంగానే తయారు చేసుకున్నారు కవర్‌ పేజీని. ఇక లోపలి మొదటి పేజీలో ''విశ్వవిజ్ఞాన సార్వభౌమ, దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, జయశాలి'' అన్న బిరుదు నామాలు తగిలించుకుని, తన పేరు వేయించుకున్నారు. ఇంతకూ ఎవరు అంటగట్టిన బిరుదులవి? లేక తనకు తానే తగిలించుకున్నతోకలా? ఇంతకూ విశ్వవిజ్ఞాన సార్వభౌముడంటే ఏమిటి? విశ్వవిజ్ఞాన మహారాజు, విశ్వవిజ్ఞాన చక్రవర్తి, విశ్వవిజ్ఞాన సార్వభౌమ ఏమిటీ బిరుదులు? దైవజ్ఞాని అంటే ఏమిటి? ఆత్మజ్ఞానంటే ఏమిటి?

ఎవడికివాడో, వాడి అనుయాయుల, వందిమాగధుల చేతనో తగిలించుకుని ప్రకటించుకున్న ఇలాటి వాటికి వెంట్రుక ముక్కకున్నంత విలువుండదు. ఈయన గారి 'జయశాలి' అన్న తోకను అనేకులు 'కనపడితే కత్తిరిస్తాం' అని బహిరంగంగానే ప్రకటించారు. జయశాలి కాడతడు 'భయశాలి' మాత్రమే అనీ అనేశారు. మగతనముంటే పోటీకి నిలబడు అనీ పిలిచారు. ఈయన గారికి నిజాయితీ ఎలాగూ లేదనుకోండి! కనీసం సిగ్గు, లజ్జ లాటి పదాలకు సరిపడే గుణమన్నా ఉండుంటే వాటివల్ల జనించే రోషంతోనైనా, రండిరా! చూసుకుందాం! అనైనా అనుండేవారు. అలాటి వైఖరి గత 20 ఏండ్లుగా ఏ సందర్భంలోనూ ఈయన గారి వైపు నుండి కనబడలేదు. ఈ జయశాలి (ప్రక. 6-2) సాతాను ప్రతినిధేననీ బైబిలాధారంగనే కొందరు క్రైస్తవులే నిగ్గదీశారు. అబ్బే గజచర్మంగాళ్ళు గిచ్చిళ్ళకూ, గిళ్ళుళ్ళకు ఎక్కడ చలిస్తారు?! ఎందుకు చలిస్తారు?

పిట్టలదొర

హైందవ సంస్కృతిలో, అందునా ఆంధ్రప్రాంతపు తెలుగు గ్రామీణ కళాకృతులలో 'పిట్టలదొర' వేషం, కేతిగాని వేషం హాస్య రసపోషకంగా పేరెన్నికగన్నాయి. భుజాన ఒక కట్టెతుపాకెట్టుకుని, (పాడైపోయిన) పాంటు, కోటు, హేటు ధరించి (ఆంగ్లేయుల వేషం) దొరల్లే ఇంటింటికీ అడుక్కుంటానికి వచ్చే బిచ్చగాని పాత్ర పిట్టలదొరది.

''తాము విక్రమార్కునివంశస్తులమనీ, బంగారపు గుమ్మడి కాయలు అడిగినోడి కల్లా ఇచ్చేశామనీ, ఇంటపట్టక రోడ్డున పారేశాము, పదులసంఖ్యలో కోటలు కట్టామనీ, యుద్ధంలో లక్షలమందిని చంపేశాము? ఈ రోజు కూడా ఒక వెయ్యి మందిని ఇప్పుడే చంపి ఆకలిగ ఉంటే ఇలావచ్చామని, మీకేమైన బంగారం కావాలంటే చెప్పండి కోటకుపోయి పంపిస్తామనీ... ఇలా సాగుతుందా పాత్రభాషణ. అంతా అయ్యాక, తల్లి ఒక గుక్కెడు మంచినీళ్ళు, ఒక ముద్ధ చద్దన్నం ఉంటే పెట్టమ్మా తల్లి''తో ముగుస్తుంటుందది. దాదాపు మన ప్రధాన పాత్రధారి పి.డి.సుందర్రావుగారి సింహగర్జన పుస్తకంలోగానీ, సి.డిల ప్రసంగాలలో గాని ఆయన ప్రగల్భాలు చూస్తున్నప్పుడల్లా ఆధ్యాత్మిక క్షేత్రాలలోనూ పిట్టలదొరలుంటారన్నమాట గుర్తుకు వస్తోంది.

ఒకపాతికో, యాబైయ్యో ఖర్చుపెట్టి తలకుతట్టిన ప్రసిద్ధులకెల్లా పిచ్చి ఉత్తరాలు వ్రాసి రిజిష్టర్డ్‌ పోస్టు చేయడం, అవతలివాళ్ళు స్పందించకున్నా, మేము మీ అంత వాళ్ళంకాదు, తగిన వాళ్ళను వెతుక్కొండని ఎగతాళిగా స్పందించినా అదంతా గొప్పేననుకుంటూ వాళ్ళందరినీ ఓడించేశానని (విన్నవారేమైనా అనుకుంటారనికూడా లేకుండా) ప్రకటించుకుంటూ వస్తున్నాడాయన. ఈయన క్యారెక్టర్‌ని అర్థం చేసుకున్న వాళ్ళలో కొందరు అతని విధానాన్ని అరువు తెచ్చుకుని, సుందర్రావుకు చాలెంజ్‌, అతడుగానీ ఒక వారంలోగా స్పందించకున్నా, సవాలును స్వీకరించి సభకురాకున్నా ఓడినట్లేనని ప్రకటన చేస్తాం. అనీ కరపత్రాలు, ప్రెస్‌మీట్‌ల ద్వారా తెలిపి, ఈయనెలాగూ రాడు గనుక సుందర్రావును ఓడించాం. అని మలి ప్రకటనలూ చేసేశారు. వాటినన్నింటినీ ఇంటర్నెట్‌లోకీ ఎక్కించేశారు. ఇలాంటి తిక్క పనులకూ నెట్‌ చక్కగా ఉపయోగపడుతుండడం దానికదే ఒక విషాదం.

యుగాంతం - ?

అటు ఎక్కిరాల వేదవ్యాస్‌ అన్నాయన ప్రకటించిన 1999 యుగాంతపు ప్రకటనను, ఈ మధ్య కాలంలో టి.విల వాళ్ళు 2012 యుగాంతం పేరున జరిపిన కార్యక్రమాలను పట్టుకుని, యుగాంతం వాళ్ళన్నట్లు 2012లో కాదు. ఛాలెంజ్‌ అని తన ప్రసంగాల ద్వారా ప్రకటించి, ఆ తేదీలకు యుగాంతం కాలేదు గనుక బైబిలూ, బైబిలు రక్షకుణ్ణని తనకు తానే చెప్పుకుంటున్న తానూ, సర్వజ్ఞులం అన్నట్లు జబ్బలు చరచుకోడాన్ని చూస్తే నాకైతే నవ్వాగడంలేదు. వేదవ్యాస్‌ అన్నాయన మంత్రాలు, మాయలు, యోగ సిద్దుడులాటి పిచ్చి నమ్మకాల భ్రాంతిలో పడిపోతున్నాయన, రుజువుల్లేని అభిప్రాయాలెన్నంటినో వనరులున్నాయి కదా అని పుస్తకాలకెక్కించి మంది నెత్తిన పెట్టిన తిక్కవేదాంతతడు. అతడి మాటల్ని అతడి వెంటపడ్డ నలుగురు గుడ్డి మంద తప్ప మరెవరూ ఏనాడూ పట్టించుకోలా. ఆ నలుగురైనా వేదవ్యాస్‌ అన్నట్లు 1999 నాటికి అంతా అయిపోతుంది గనుక, ఉన్నదంతా దానధర్మాలు చేసి చావుకు సిద్దమే అయినాకాలా. ఈ రోజు గడిస్తే బావుణ్ణు మళ్ళా వందేళ్ళు బ్రతకొచ్చుననుకుంటూ అలా అవదులే అన్న భరోసాతోనే అంతా భద్రంగానే ఉంచుకున్నారు.

ఇక 2012 యుగాంతం కార్యక్రమాన్ని విడుదల చేస్తున్న టి.విల వాళ్ళు 2013లో చేయాల్సిన కార్యక్రమాలనూ ఒప్పందాలరూపంలో ఖరారు చేసుకుంటునే వచ్చారు. వారెవ్వరికీ యుగాంతం గురించిన భయాలు లేవు సరికదా అవన్నీ మషాలా దట్టించిన ప్రచార కార్యక్రమాలని ఇలాంటి వారందరికంటే స్పష్టంగా తెలుసు. వాళ్ళు యాంకర్ల ద్వారానాటకీయంగా సంచలన వార్తలంటూ ప్రచారం చేయించిన దానిని గట్టిగా పట్టుకుని, టి.వి వాళ్ళకు ఛాలెంజ్‌ 2012 యుగాంతం కాదని బైబిలాధారంగా నేను ప్రకటిస్తున్నాను. ఖలేజా ఉంటే, మగతనముంటే, ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే 2012 నాటికి యుగాంతమవుతుందని రుజువు చేయండంటూ ఈయన గారి జోకర్‌ ప్రసంగాలను కర్ణా కర్ణిగావిని, కడుపుబ్బ నవ్వుకునేంటత హాస్యం కూడా ఇందులో ఏమీలేదులే అనుకుని గమ్మునున్నారు. ఇహనేం, మన కేతి దొరకు అలుసు దొరకనే దొరికింది! వాళ్ళంతా హడలిచచ్చారు. అని ప్రసంగించడం మొదలెట్టారు. ఈ నాటికీ, పాడిందే పాటరా, పాచి పళ్ళ దాసరా! అన్నట్లు పిచ్చి జనంముందు తెగ రెచ్చిపోతున్నారు.

పబ్లిషర్సు - వారి స్పందనలు

అదే పుస్తకంలో, పి.డిఎస్‌.ఆర్‌గారు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలను తన పుస్తకాన్ని ప్రచురించమని కోరినట్లుంది? వారీ పిచ్చి పుస్తకాన్ని చూసి, అయ్యా, ఇంతోటి పుస్తకాన్ని ప్రచురించేంత వాళ్ళం కాదు మేము. మీ పుస్తకాన్ని ప్రచురించగల సమర్థులను వెతుక్కోండి! అని సమాధానం రాస్తే, వాటినీ, అదో గొప్పన్నట్లు ప్రచురించుకున్న ఈ '... దొర' నే మనుకోవాలి? ఇంగిత జ్ఞానంలోనే ఏమైనా కొరతుందా? అని శంకించి, ఒకింత, జాలిపడాలి. ఇతడు సరే, ఇతగాని చుట్టూ ఉన్న వారు కూడా 'అతనికంటే ఘనుడు ఆ చంటిమల్లన్న' అన్నట్లు ఇదంతా, సుందర్రావుగారి గొప్పతనమేననుకోవడాన్ని చూస్తుంటే జాలి కట్టలు తెంచుకుని పొంగుకొస్తోంది. ఒక వంక నాసా శాస్త్రజ్ఞుడు 2012 యుగాంతం రాదని ప్రకటించాడంటూనే హాలివుడ్‌ సినిమా ప్రచారం కోసం టి.విలు కల్పించిన ప్రచారమిది అనీ తానే చెపుతూనే, నాసా శాస్త్రజ్ఞులమాటలు విన్నారేగాని, ఈ టి.వీ వాళ్ళు నా మాటలు పట్టించుకోలేదు... నేనూ చెప్పాను కదా 2012 యుగాంతం కాదని అంటూ వాపోవడమెందుకో?! ఇంతకూ యుగాంతమవుతుందని ఎవరనుకున్నారయ్యా పిచ్చాయనా?!? అని ఒక్కడికీ అడగాలనిపించలా! పాపం. ఏ కళనున్నాడో గానీ, టి.వి వాళ్ళొక వీధి కుక్కలాంటి వాళ్ళనీ, నాసా వాళ్ళు మరో వీధి కుక్కలాటి వాళ్ళనీ, తాను కూడా మరో వీధి కుక్కలాటి వాడినేననీ మంచిపోలికే పోల్చుకున్నాడు '... దొర'! ఈ వ్యవహారం నాసా వాళ్ళకు ఏరకమైన సూటి సంబంధంలేదు గనుక వాళ్ళనీపోలికలో భాగస్తుల్ని చేయలేం. ఇక మరో వీధికుక్క అనబడ్డ టి.వి వాళ్ళకు ఇదంతా 'యాడ్సు'కు చెందిన ప్రచార వ్యాపారంలో భాగమని చాలా చాల స్పష్టంగా తెలుసు కనుక వారినీ ఈ పోలికలో భాగస్తుల్ని చేయడానికి ఇంగితం (కామన్‌సెన్సు) అంగీకరించడం లేదు. ఇక ఈయన గారు తనను గురించి తానే పోల్చుకున్నాడు గనుక, మన కలా అనరని అనిపించకున్నా, ఆయన తన గురించి చెప్పుకున్న మాటగనక దానిని ఆ పోలికను - తీసేస్తాడో ఉంచుకుంటాడో మరోసారి ఆలోచించుకొమ్మని సలహా మాత్రం ఇవ్వగలం.

క్రీస్తు తరవాత తానేనంటున్న (అప) జయశాలి.

బైబిలు తెలిసిన వాడొక్కడు లేడంటాడొక ప్రక్కన, క్రీస్తు తరవాత 100 ఏండ్ల నుండీ క్రైస్తవం బ్రష్టుపట్టిందంటాడు. దానిని రక్షించడానికి తాను వచ్చానంటాడు, వాడెవడో క్రీస్తు పూర్వంనాటి ఒక ప్రవక్త డి.ఎన్‌.ఎ. నుండి తాను పుట్టానంటాడు. భూమిని తలక్రిందులు చేయడానికే వచ్చానంటాడు. ప్రపంచ ప్రజలకు, రాజ్యాధినేతలకు వణుకు పుట్టిస్తున్నానంటాడు, రెండంచుల ఖడ్గాన్నంటాడు, ఇంటర్నేషనల్‌ ఛాలెంజింగ్‌ డైనమిక్‌ స్పీకర్‌నంటాడు ఇన్నిన్ని పనికి మాలిన, పసలేని కూతలు కూస్తున్న ఈయనను ఇంతకాలం భుజాలకెత్తుకుని మోస్తున్న బానిస మనస్తత్వం కల బృందాలననుకోవాలి. ప్రజల్ని వణికించడమేమిటి దొరా! ఏ ప్రజలు వణుకుతున్నారు నిన్ను చూసి? రెండంచుల ఖడ్గమేమిటి? అసలీ కత్తుల గొడవేమిటి? బూతులు తిడుతూ బైటకిరారా మగాడివైతే, అన్న వారి పిలుపూ వినిపించలేదా నీకు ?!

గమనిక : ఒకింత బైబిలు పై పట్టున్న ఎందరో క్రైస్తవ బోధకులు ఈయన అబద్ధపు క్రీస్తే, సాతానుప్రతినిధేనని ప్రకటించేశారు కూడా.

ఇంతకూ క్రైస్తవుల్ని నడిపించే వాడెలాగుండాలంటోంది క్రొత్త నిబంధన గ్రంథం?

(1) ఎఫెసీయులకు :- మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలినడచుకొనుడి. ... ప్రేమగలిగి నడచుకొనుడి. మీలో జారత్వమేగాని, ఏ విధమైన అపవిత్రతయేగాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తగూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరించవలెనుగాని, మీరు భూతులైనను పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. (5-1 నుండి 4 వరకు)

(2) కొలస్సయులకు :- మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వీటినన్నింటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి.

గమనిక :- ఇలాంటి సువార్తలన్నీ తనకు వర్తించవని కాబోలు పి.డి వారి ధీమా? అవును కదూ! క్రీస్తు తరవాత బైబిలు తెలిసినవాడు తానేనని కదా అయ్యగారి అహం!

(3) ధెస్సలూనీకయులకు :- సహోదరులారా! మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా! మేము మీలో ఎవనికినీ భారము కాకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

సురేంద్ర :- బ్రతుకు దెరవుకు మన పి.డి వారేమి శ్రమ చేయుచున్నట్లు? ఆయన బృందం ఏమి చాకిరి చేయుచున్నట్టు? 'ధనవంతుడు పరలోక రాజ్యము ప్రవేశింపడు' అన్న ఏసు మాటకానీ, ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అన్నమాట కానీ ఈనాటి సంఘస్థాపకులకు అన్వయిస్తే, వీరెవరూ క్రీస్తన్న దేవుని రాజ్యంలో ప్రవేశింపరన్నట్లే అవుతుంది.


పి.డి సుందర్రావు - ఇతర క్రైస్తవ సంఘాలు


(1) పి.డి సుందర్రావుగారు పోపు దగ్గరనుండి, తన వెంటనుంటున్నవారు. తక్క మిగిలిన క్రైస్తవ కూటాలవారందరూ అపవాది ప్రభావానికి లోనైనవారేనంటున్నారు. లేదా, బైబిలు తెలియనివారే క్రీస్తును విడిచిన వారేననో అంటున్నారు.

(2) ఆయా క్రైస్తవ సంఘాలకు చెందిన కొందరు సారధులు, బోధకులు, ప్రచారకులు పి.డి కే బైబిలు అర్థం కాలేదనీ, పి.డి క్రైస్తవుని వేషంలో ఉన్న అపవాది ప్రతినిధేననీ, ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు ఉదహరిస్తాను చూడండి.

(ఎ) కావలివాని బూరధ్వని (1) 1992 నవంబర్‌, డిశంబర్‌ సంచికలో ఎడిటర్‌ ఐజాక్‌ ఎబినేజర్‌ కుసుమ అన్నాయన, 20వ శతాబ్దపు అబద్దపు బోధకులు అన్న శీర్షిక క్రింద ''ఎవడీజయశాలి'' ప్రకటన 6:2? అంటూ, ఈ వ్యక్తి ఏసుక్రీస్తేనని, క్రైస్తవుడని క్రీష్టియన్‌ గాస్పెల్‌ సొసైటీ, ఏ. పి., హైద్రాబాదు వారు భ్రమపడుచున్నారు. అందుకనే వారు తమ బ్యానరుమీద, వారి పత్రిక ''భూతలక్రిందులు'' అట్ట మీద, వారి పేరుల ముందు, వారి పుస్తకాల మీద ఈ బొమ్మను వేసుకుని ఊరేగుచున్నారు. వాక్య వెలుగులో దీనిని పరిశీలిస్తుంటే సాతాను క్రీస్తును అనుకరించుచున్నట్లుంది. ఇంటర్నేషనల్‌ డైనమిక్‌ ఛాలెంజింగ్‌ స్పీకర్‌ గారైన పి.డి సుందర్రావుగారు సాతాను గుర్రమును క్రీస్తని క్రైస్తవుడని భ్రమపడుచున్నారు.

(2) చిలకరింపును, ఆదివారపు ఆరాధనను, క్రిస్టమస్‌ను, త్రిత్వమును మొ|| ప్రవేశపెట్టింది సాతానేనని ఎబినేజర్‌ కుసుమ అభిప్రాయం.

(3) ఈ ప్రకటన 6:2 జయశాలే 100% సాతాను. సందేహం లేదు సుమా

ఈ ఐజక్‌ ఎబినేజర్‌ కుసుమ గారే సూటిగా సుందర్రావుగారి నుద్దేశించి ఇలా వ్రాశారు.

పి.డి యస్‌ గార్కి స్పెషల్‌ : - అయ్యా తమరు కాకినాడ జాన్‌సన్‌ ఐజక్‌ను (నన్ను) చిత్తు చిత్తుగా ఓడించేశానని ఒక తప్పుడు ఉత్తరం వ్రాశారు కదా! ఆ జాన్‌సన్‌ ఈ ప్రకటన 6:2 ని గూర్చి ... ''ఈ తెల్లని అశ్వము ఒక అబద్దపు ఆత్మ, మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, తెల్లని గుర్రము క్రీస్తు విరోధి ఆత్మ బయలు వెళ్ళుటను సూచించుచున్నది''. అనే వ్రాశారు. కనుక నన్ను ఓడించితే, మీ మిత్రుడైన అతనినీ ఓడించినట్లే అయ్యిందికదా!

ఈ ఐజాక్‌ ఎబినేజర్‌ కుసుమ అన్నాయనే 'సత్యమునకై పోరాటం' అన్న మాసపత్రిక మే, జూన్‌ సంచిక (89)లో పి.డి సుందర్రావుగారిని సాతాను ప్రతినిధి అనంటూ, తానే ఈయుగానికి దేవుని నోరును అని చెప్పుకుంటున్న 'సింహనాదం' పుస్తక రచయిత అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారి పైనా ఒక విమర్శ చేశారు. ఓఫిర్‌గారు క్రొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడిందని, అందులో పరమ తండ్రిపేరు ఈసూస్‌ క్రిస్టోస్‌ అని వ్రాయబడిందని అంటున్నారు. 'యెషువ మెస్సీయ' అనే నామమును తమగుడ్డి అనుచరులకు మరుగు చేయడానికే ఆయన ఇలా నాటకమాడుతున్నాడు. అదే రచయిత ఆది కాండం 20:7, పౌలు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడని అంటున్నాడు. పాపం ఈ దొంగ అపొస్తలునికి, అబద్ద ప్రవక్తకు, చెత్త సంస్కర్తకు అ.పొ.20 : 7 గ్రీకులో ఎలా వ్రాసి ఉందేమో తెలియలేదేమో? అస్సలు గ్రీకు బైబిలులో ఆదివారం అనే పదం లేని సంగతి ఈ కలియుగ అపొస్తులునీ తెలియలేదేమో లూకా, గ్రీకులో ఈసన్‌క్రిస్టోస్‌ అని వ్రాశాడంటున్న ఈ అబద్ద బోధకునికి, దమస్కురోడ్డులో సౌలును పడగొట్టిన మెస్సీయ తన పేరును ఏ భాషలో చెప్పాడో వ్రాయలేదే? వ్రాస్తే తన తప్పుడు బోధకు గండిపడిపోతాదని గ్రహించే ఉంటాడు మేధావి కదా! అక్కడ దేవుని నోరు సాతాను నోరుగా ఎలా మారిపోయిందబ్బా! అంటూ, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న వారందరికీ జాగ్రత్తగా మసలుకోండి! బోధకులను ప్రశ్నించండి అని హెచ్చరికా చేశాడు.

ఇక పి.డి సుందర్రావుగారిని, ఈ ఓఫిర్‌గారే అతడు జయశాలి కాదు భయశాలి అనీ, క్రీస్తు ప్రతినిధి కాడు సాతాను ప్రతినిధి అనీ, బైబిలు సరిగా తెలిసినవాడు కాడు, 1000 ఏండ్ల పరిపాలన విషయమై బైబిల్‌ ఆధారంగా చర్చకు రావయ్యా సుందర్రావ్‌, సవాలనీ, సుందర్రావును చర్చకు పట్టుకురాగలిగినవాళ్ళకు లక్ష బహుమానమిస్తాను అనీ బహిరంగ ప్రకటనే చేశాడు.

ఇక క్రైస్తవ యోచనాపరుల సమాఖ్య సిటిఎఫ్‌ వారు వీరితో మాకు ఎన్నో అంశాలలో ఏకీభావం లేదనంటున్నారు.

అనిల్‌ ఒక దొంగ, సాగర్‌ ఒక బచ్చా, స్వస్థతలున్నాయంటున్న వారంతా దొంగలే, కె.ఎ.పాల్‌ ఒక పెద్ద దొంగ, అస్సలు బైబిలు సరిగా తెలిసిన వాడీ నాడు నేను తప్ప ఒక్కడూ లేడు అని తెగబడుతున్నారు మన సుందర్రావుగారు.

పి.డి సుందర్రావుగారిలోని అడ్డగోలుతనం, అదరగండపుతనం, పిల్ల తనం ఎక్కడుందో తెలుసా

ఒకవంక 1900 సం||రాల నుండే బైబిలును ఎవరూ కక్షుణ్ణంగా చదవలేదనీ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటూనే ప్రపంచ క్రైస్తవుల తరఫున రావిపూడి వెంకటాద్రి గారితో పోటీకి సిద్దమయ్యాను అని, గ్రేట్‌ ఛాలెంజింగ్‌ మహా సభ పేరున మే 1-1990న ప్రకటన చేశారు. ఒక వంక ఈ సుందర్రావుఎవడండీ అని పలు క్రైస్తవ సంఘాలు అంటుండగా, రావయ్యా సుందర్రావు బైబిలునీ కెంత తెలుసో, నాకెంత తెలుసో తేల్చుకుందాము మరి కొన్ని సంఘాల వారు జబ్బలు చరుస్తూ పోరుకు పిలుస్తుండగా, పి.డి. సుందర్రావు అబద్దపు క్రీస్తు ప్రతినిధి అని ఇంకొకరంటుండగా, డాంబికాలాడవద్దు, బూతులు మాటాడవద్దు, సంపదకు అధిపతివికావద్దు, అనీ, చేసిన పనికి ఈలోకంలోనే భోగంగానీ, కీర్తి గాని అందుకుంటే, పనికి ఫలితం ఇక్కడే ముట్టింది. చెల్లుకు చెల్లు అనీ క్రొత్త నిబంధన వాక్యాల ద్వారా క్రీస్తూ, అతని సువార్తీకులే చెపుతుండగా, అటు క్రైస్తవులేగాక, ఈ మొత్తం డ్రామానంతా తిలకిస్తున్న క్రైస్తవేతరులు యూదు, ఇస్లాం, హిందూ ఆస్థికులూ, ఆస్థికేతరులైన వివిధ సంఘాల వారూ కూడా నవ్విపోతారని గాని, గేలిచేస్తారని గాని కించిత్తూ బిడియపడకుండా ప్రపంచ క్రైస్తవుల తరఫున తానీ సభలో పాల్గొంటున్నానని పి.డిసుందర్రావుగారు ప్రకటించుకోడం దగ్గరుంది.

మగతనముంటే ఒకఅమ్మా అయ్యకు పుట్టుంటే లాటి సంస్కారహీనమైన అవాకులూచవాకులు పేలే వదరబోతు దనంతో సుందర్రావుగారూ! ఇదిగో ఇప్పుడు ఇంకో మాట చెపుతున్నాను. ఏమన్నా మీ వల్లవుతుందేమో తేల్చుకోండి!

ప్రపంచ క్రైస్తవులందరి ప్రతినిధిగా ఎలాగూ నిలబడలేరు గానీ, కనీసం ఆంధ్ర రాష్ట్రంలోని అదీ విూ సంగతి తెలిసున్న, నేనెంచుకున్న 5,6 సంస్ధల నుండి మిమ్ము వారందరి ప్రతినిధిగా అంగీకరిస్తున్నట్లూ మన మధ్య జరిగే పోటీ పర్యవసానాలు తామందరం స్వీకరించడానికి తామంగీకరిస్తున్నట్లు ఒక ఆమోద పత్రాన్ని తీసుకురాగలరేమో చూడండి. ఆ పని చేయగలిగితే

ఇదిగో ఇది మీకు నేను విసురుతున్న సవాలు. లేదా పలుకుతున్న ఆహ్వానం.

ఆధునిక విజ్ఞానం ప్రకారం                                                            బైబిలు విజ్ఞానం ప్రకారం

(1) ఆధునిక ఖగోళ విజ్ఞానం - ఆధారాలు                                 X  బైబిలు ఖగోళ విజ్ఞానం - ఆధారాలు

(2) ఆధునిక భౌతిక స్థూల, సూక్ష్మ పదార్థ                               X  బైబిలు భౌతిక స్థూల - సూక్ష్మ పదార్థ

విజ్ఞానం - ఆధారాలు విజ్ఞానం - ఆధారాలు

(3) ఆధునిక జీవ రసాయన పదార్థ విజ్ఞానం                            X బైబిలు జీవరసాయన పదార్థ విజ్ఞానం

- ఆధారాలు - ఆధారాలు

(4) ప్రపంచ - విశ్వ - పరిణామ క్రమం                                    X ప్రపంచ పరిణామ క్రమం

దాని భవిష్యత్తు - దాని భవిష్యత్తు

(5) మానవ శరీర నిర్మాణ విజ్ఞానం                                       X మానవ శరీర నిర్మాణం - బైబిలు

ఆధునికం

(6) ఆధునిక సామాజిక విజ్ఞాన పరిణామ                             X బైబిలు సామాజిక విజ్ఞానం

క్రమం

(7) ఆధునిక సమాజపు మానవసంబంధాల                        X బైబిలు సమాజపు మానవ సంబంధాలు (పాత-క్రొత్త 
                                                                                         నిబంధనలు)

విజ్ఞానం - వివిధ సిద్ధాంతాలు

ఇవేగాని, ఇలాంటివి మరికొన్ని కలుపుకుని గానీ, వీటిలోనే కొన్నింటిని ఎంచుకుని గాని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను వ్రాత మూలకంగా సిద్ధపరచుకుని, అందులో ఎవరెవరివి ఏవేవి, ఎన్నెన్ని సరైనవో, సరికానివో చూసుకుందాం. నేను సర్వ జ్ఞానిని, సర్వ జ్ఞానబాండారం బైబిలు అంటున్న నీ మాట సరైందని తేలితే, నా కుటుంబానికి మరియు మండలి సామాజిక కార్యక్రమాలకు కొంత అట్టే పెట్టుకుని, కడమ స్థిరాస్తులను అమ్మైనా నీ ఇష్టాన్ని బట్టి, నీ సత్తాను బట్టి 4, 5 కోట్ల రూపాయల వరకు పందెం ధనంగా సిద్ధం చేయగలను. అంతేడుపు గనక ఏడవలేననుకుంటే ఇదిగో ఈ ఒక్క దానికైనా కూలబడగలవేమో చూడు.

(1) వెంకటాద్రి గారితో బహిరంగ సవాలంటూ, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అన్నదానిని నగ్న సత్యంగా సైన్సు ప్రకారం నిరూపించగలను అన్నమాటకు సంబంధించిన బైబిలు సృష్టివాదాన్ని తీసుకుని పరీక్షకు సిద్దమైనా నాకభ్యంతరం లేదు.

(1) కోటికి సిద్దం (2) నేను నిన్ననుసరించడానికి సిద్ధం. ఇంత వరకైనా గెంతలేకుంటే నాకు కోటిచ్చి మాత్రం నీవు నావెంటనడవాలి. డొంక తిరుగుడు పోకడలనాపి నాతో పద్ధతి ప్రకారం చర్చకి (పోటీకి) రాగలరేమో తేల్చుకోండి.

పాఠక మిత్రులారా!

వేదిక షరతులంటూ గతంలో పి.డి సుందర్రావుగారిచ్చిన జాబితా ఆయన లేఖతో పాటు

ఇవి 3-8-2001 తేదీతో పి.డి సుందర్రావుగారు, జయగోపాల్‌గారికి 19.7.2001 నాటి జి.డి సారయ్య గారి ఉత్తరానికి సమాధానమంటూ వ్రాసిన లేఖలోని విషయాలు:-

1989 సం|| బైబిలు బండారం రచయిత శ్రీ ఎన్‌. వీరబ్రహ్మం బైబిలును, క్రైస్తవ్యాన్ని అవమానపరచినందుకు ముఖాముఖిగా చర్చించుటకై బహిరంగ చర్చా వేదికకు ఆహ్వానించితిని. దానికి తగిన ఖర్చులన్నీయు నేను భరించడమైనది. క్రైస్తవ్యాన్ని అవమానపరచడమేపనిగా పెట్టుకున్న వీరబ్రహ్మంగారు, రచనలకు మాత్రమే పరిమితమై బహిరంగ వేదికకు హాజరుకాలేదు.

ఆనాటి భారత హేతువాద సంఘాధ్యకక్షులు, బైబిలులోని ప్రారంభ వాక్యము పచ్చి అబద్దమని, బైబిలును, క్రైస్తవ్యాన్ని అవహేళన చేసినందుకు 1989 సం||లో వెంకటాద్రిగారిని కూడా బహిరంగ చర్చా వేదికకు రిజిష్టర్డు లెటరు ద్వారా ఆహ్వానించగా వారి సమ్మతిని తెలియజేస్తూ, 1990 మే 1వ తేదీ సాయంకాలం 6 గంటలకు సాన్‌పోర్టు మైదానము విజయనగరం వచ్చుటకు అంగీకరించిరి....

ఇరువర్గాలకు చెందిన న్యాయమూర్తులను బహిరంగ వేదికపై కూర్చుండ బెట్టుట జరిగింది. సం|| ముందుగా చర్చకువస్తానని ఉత్తరం వ్రాసిన వెంకటాద్రి గారు ఆదినము గైరుహాజరు అగుట జరిగినది. ఎంతో ధనము, శ్రమ, వ్యయపరచినా ఆఖరి నిముషములో ఆయన రాకపోవడము విచారకరము.

ఇకపోతే బోనకల్లు ప్రభాతవార్తలో, 1998 మే 10 హేతువాదులకు బైబిల్‌వర్సిటీ డైరెక్టర్‌ సవాల్‌ అన్న పేరుతో, వెంకటాద్రిగానీ, ఎడమెరుకు గాని తనతో వాదించాలన్న మా మాటలను పత్రికవారు హేతువాదులు మరెవరైనా అని పొరపాటుగా ప్రచురించడం జరిగింది. అందువలన ఈ క్రింది షరతులకు మీరంగీకరించితే బహిరంగ చర్చావేదికకు నేనిప్పటికీ సిద్దమే

ఆనాడు సుందర్రావుగారు సూచించిన షరతులు :

(1) ప్రస్తుత జాతీయ హేతువాద సంఘ అధ్యకక్షుని చర్చకు నిలవబెట్టవలెను.

(2) మేమిరువురము చర్చకు అంగీకరిస్తూ సంతకము చేసిన పత్రములు మార్చుకొనవలెను.

(3) సుమారు 2, 3 గంటలు సాగే చర్చలో బైబిలులోని ఒకే విషయమై (వెంకటాద్రి గారివలె) చర్చించుటకు గాను ముందుగా అంశమును తెలుపండి. ఎందుకంటే బైబిలు అంతటిపై చర్చకు జీవితకాలము సరిపోదు.

(4) ఇరువర్గాలకు చెందని న్యాయమూర్తులను ఏర్పాటు చేయాలి. ప్రజాబహిరంగ వేదిక విజయవాడ, పి.డబ్ల్యుడి. గ్రౌండులో గానీ, హైద్రాబాద్‌ జింకానా గ్రౌండులోగాని ఏర్పాటు చేయాలి.

(5) గ్రౌండు, పోలీసు అనుమతి, సౌండు, లైటు, స్టేజ్‌, ప్రొటెక్షన్‌ మున్నగునవన్నీయు ముందుగనే ఏర్పాటు చేయవలెను. ఈ బహిరంగ చర్చకు ఖర్చులన్నీ మీరే భరిస్తూ, 6 మాసములముందుగా 2 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిటు చేయడం ఈ సొమ్ముతో ఇరువురి మధ్య సాగే బహిరంగ చర్చ యధాతథంగా పేరున్న టి.వి ఛానల్‌ ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చేయాలి.

(6) మత స్వాతంత్య్రమున్న ఈ దేశంలో వాస్తవాల పేరిట నిజాలను కూడా అవాస్తవాలుగా మీరు బైబిలును, క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నందుకుగాను బహిరంగ వేదికపై భారత హేతువాద సంఘ అధ్యకక్షుడు తన వాదనను ఒక గంట ముందుగా వినిపించవలెను. పిమ్మట నా వాదనను మరొకగంట, అటుపిమ్మట న్యాయమూర్తుల అనుమతితో చెరొక పదినిముషాలు తీసుకొనవలెను తుది తీర్పు న్యాయమూర్తులకు విడిచిపెట్టవలెను.

(7) ధారావాహికంగా సాగే చర్చ అంతటినీ ప్రత్యేకంగా వీడియో తీయించవలెను.

(8) తుది తీర్పులో ఓటమి ఎవరి పక్షాన ఉండునో లేక చర్చలో విఫలమైన వారు బహిరంగ వేదికపై ప్రజల ముందు న్యాయమూర్తుల సమక్షమున క్రైస్తవుల పక్షమున వాదించి ఓడినవారు హేతువాదిగా, హేతువాదుల పక్షాన వాదించి ఓడిన వారు క్రైస్తవునిగా మారుచున్నానని వేదికపై ప్రకటిస్తూ స్వయంగా వ్రాసి ఇచ్చిన పత్రాన్ని న్యాయమూర్తులకు అందజేయాలి.

(9) మొత్తం కార్యక్రమ మంతయు భారత రాజ్యాంగానికి గానీ, చట్టానికి గానీ విరుద్దంగా సాగకుండా, ఏ భారతీయుని మత విశ్వాసాన్ని కించపరచకుండా, వారి మనో భావాలను గాయపరచక శాంతి యుతంగా జరుగునట్లు పర్యవేక్షించగలరు.

(10) చర్చకు వస్తానన్న ఇరువురిలో ఏ ఒక్కరు చర్చకు హాజరు కాకపోయినా ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించవచ్చు.

గమనిక : పై షరతులలో ఏ ఒక్క దానిని మీరు అంగీకరించకపోయినా నేను చర్చకు రాను. పై అంశాలను ఒకింత విశ్లేషణ చేస్తాను, పి.డి గారి అనుకూల ప్రతికూల కూటాల వాళ్ళుగానీ, ఓఫిర్‌ గారూ వారి బృందంగానీ, ఇతర మతాల మరియు మతేతర సంస్థలలోని వారుగాని, తలున్నవారి వరకు తలదూర్చండందులో. అటుపై మీ తలపులను నాకూ పది మందికీ అందించడానికి వీలుగా స్పందించండి.

సుందర్రావుగారి షరతులపై - సురేంద్ర విశ్లేషణ

ముందుగా ఒక్కమాట :- ఆయన షరతుల పట్టికను పట్టి చూశాక చర్చంటే ఏమిటన్నది గానీ, చర్చావేదికంటే ఏమిటన్నదిగానీ, అందులో పాల్గొనే వాద ప్రతివాదుల పాత్ర లేమిటన్నవి గాని పి.డిఎస్‌.ఆర్‌. గారికి తెలియని విషయలేనన్నది నా వరకు నాకు తేలిపోయింది. చర్చా వేదిక స్వరూపస్వభావాలుగానీ, చర్చావేదిక నియమనిబంధనలుగానీ, చర్చావేదికలో చోటు చేసుకుని ఉండే పాత్రల వివరాలు గానీ తెలియనే తెలియని సుందర్రావుగారు విశ్వ విజ్ఞాన సార్వభౌముణ్ణనీ, సత్యసంపూర్ణుణ్ణనీ తనకుతానే కితాబులిచ్చుకోవడం ఖచ్చితంగా విపర్యయ దురహం క్రిందికి వస్తుంది. ఇక పరిశీలించండి.

1. ప్రస్తుత జాతీయ హేతువాద సంఘ అధ్యకక్షుని చర్చకు నిలువ బెట్టవలెను :-

జాతీయ హేతువాద సంఘమేమిటి? భారత హేతువాద సంఘం అని కదా అనుండాల్సింది. అది సరే. ఒక వంక బైబిలు పేరెత్తితే ఊరుకోను, తాటతీస్తాను, తొక్కేస్తాను. దాని జోలికొస్తే మట్టి కరిపిస్తాను అనీ, మొన్నటికి మొన్న నల్గొండ సభలో ఎవడైనా నాస్తికుడుంటే రండి! ఛాలెంజ్‌ అనీ, అంటూనే ఫలాని ఆయనతోనైతేనే మాట్లాడతాననడమేమిటి? అవతలివాళ్ళు మారెండు మూడు సంస్థల వాళ్ళం సిద్ధంగా ఉన్నాం చర్చకు అని అన్నప్పుడు, అలాగని వ్రాతమూలకంగా ఒప్పందానికి రండి, మీ తరఫున ప్రతినిధిని పంపండి, అని కదా అడగాలి. వారిష్టమొచ్చిన వ్యక్తిని తమ ప్రతినిధిగా పంపుకుంటారు వాళ్ళు. అతనోడిపోతే ఒప్పందపు నిబంధనలను వాళ్ళు పాటిస్తారు.

వెంకటాద్రి సం|| ముందే చర్చకు సిద్దమని అంగీకరించి గైర్హాజరైనాడని సుందర్రావు గారన్న మాటలపై వివరణ కోరుతూ లోగడే అలా వెంకటాద్రి గారంగీకరించిన లేఖను చూపమని అడిగాను. ఆ లేఖ ఇప్పటికీ సుందర్రావుగారు బైటపెట్టలా. ఇంతకూ అలాంటి లేఖ ఉన్నట్లా? లేనట్లా?

ఈయన ఏర్పాటు చేసిన ఆవేదికకు నియమనిబంధనలు ఇరుపక్షాలు కలసి రూపొందించుకుని అంగీకరించినవై ఉండాలి కదా. అలాగే వెంకటాద్రిగారికీ, వీరికీ మధ్య ఏర్పాటు జరిగిందని ఆధారాలు చూపాల్సిన బాధ్యత సుందర్రావుగారిపైనే ఉంది కదా. ఎందుకంటే అలాంటిది జరగలేదని వెంకటాద్రిగారు బైబిలు గణాచారం లాంటి వ్యాసాల్లో వ్రాశారు. వెంకటాద్రి గారు అబద్ద మాడుతున్నారని గనక రుజువు చేయకుంటే, పి.డి.ఎస్‌ గారే అబద్దం ఆడుతున్నట్లు నిర్ణయించుకోవలసి వస్తుంది కదా! ఇప్టఇకైనా ఆలేఖ చూపకుంటే ఈయన డంబాచారి అనితీరాల్సిందే.

2. ఇరుపక్షాలు చర్చకు అంగీకరిస్తున్నట్లు సంతకం చేసిన పత్రాలు మార్చుకోవాలన్నదీ అంత సరిగా - సమగ్రంగా - లేదు. చర్చా వేదిక ఏర్పాటుకు సంబంధించి (1) చర్చనీయాంశం లేదా అంశాలు ఏమిటన్నది (2) చర్చా వేదిక నియమ నిబంధనలేమిటన్నది (3) చర్చావేదికలో ఎవరెవరు ఏయే పాత్రలు పోషించనున్నది (4) న్యాయ నిర్ణేతలెవరన్నది, నిర్ణయపద్దతులేమిటన్నది, పందెపు రీతి, రివాజులేమిటన్నది, వివరంగా వ్రాసి వేదికలో పాల్గొనే పక్షాల ప్రతినిధులంతా సంతకాలు చేయాలి. అది సరైన పద్ధతి అవుతుంది.

3. చర్చనీయాంశాన్ని (బైబిలంతటినీ కాకుండా) ఒక్కదానినెంచుకుని చర్చించాలి. అన్నదీ తప్పకాదు గాని అంతసరైన షరతు కాదు. ఎందుకంటే మనం పరిశీలించాలనుకుంటున్నది సర్వమానవులకూ, సదాకాలం, ఎట్టి మార్పులూ చేసుకోకుండగనే ఒప్పుజ్ఞానం విషయంలోనూ, ధర్మోపదేశం విషయంలోనూ సరిపోతుంది అనబడుతున్న గ్రంధాన్ని, కోట్లాది మంది అమాయకజనాన్ని గొర్రెల మందను తోలుకెళుతున్నట్లు తోలుకెళుతున్న బైబిలు బోధకులకందరికీ ఆధారంగా ఉన్న భావజాలాన్ని కనుక తగినంతకాలం కేటాయించుకుని కక్షుణ్ణంగా పరిశీలించడం, పరీక్షించడమే సరైనదీ, అవసరమైనదీ అవుతుంది.

అలాకాక, ఏదో ఒక్క విషయానికి చెంది బైబిలు ప్రకటిస్తున్న భావాన్ని పరీక్షించి చూసినపుడు దాని వరకకు అది సరైందే అయినా, సరికానిదైనా బైబిలు సిద్దాంత విచారణ పూర్తయినట్లుకాదు. కాకుంటే అలా ఎంపిక చేసుకున్న భావం తప్పని తేలితే బైబిలు దైవగ్రంథం కాదని తేలిపోతుంది. అది కూడా ఆ అభిప్రాయం ఖచ్చితంగా దేవునిదిగా చెప్పబడి ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. అలాకాక ఎంచుకున్న ఆ అభిప్రాయం ఆ విషయానికి సంబంధించినంత వరకు సరైందేనని తేలినా, బైబిలంతా సత్యధర్మాల ప్రకటనలే (ఒప్పులే) ఉన్నాయనడం కుదరదు. ఈ వివేకం లేకపోయినా, ఈ సూత్రాన్ని అంగీకరింపకపోయినా బైబిలు విచారణ శాస్త్రీయంగా (సరైనరీతిలో) సాగదు. చేయడం కుదరదు. బైబిలులో సత్యమని అంగీకరించడానికి గాని, నిర్ధారించడానికి గాని వీలులేని అంశాలేమైనా ఉన్నాయా?

అధర్మాలు అనడానికిగాని, ఈ నాడు స్వీకరించడానికి వీల్లేనివి అనడానికి గాని, ఏనాడూ స్వీకరించకూడదు అనడానికి గానీ వీలైన పనుల గురించి, ఆచరించమని చెప్పిన భావాలేమైనా ఉన్నాయా? అన్నదే మనముందున్న అస్సలైన విచారణ లక్ష్యం. కనుక బైబిలును కూలంకషంగా పరిశీలించడం, పరీక్షించడం పూర్తి చేయకుండా బైబిలు మొత్తంగా ఆదరణీయం అన్నమాట ఎవరూ ప్రకటించకూడదు. అదే సమయంలో బైబిలును మొత్తం మొత్తంగా నెత్తికెత్తుకో నక్కరలేదు అనడానికి అందులో ఒక్క దోషం అంటే ఒక్క అసత్య ప్రకటనగానీ, ఒక అధర్మ ప్రకటనగానీ ఉందని తేలినా సరిపోతుంది. (దీనిపై మరింత విచారణ చేయాల్సి ఉంది. ఎవరుగాని లోతుగా దీనిని అర్థం చేసుకోడానికి సిద్ధపడితే రాబోయే సంచికలలో ఈ అంశాన్ని మరింతగా వివరించేపనిచేస్తాను. నా ఈ మాటను చాలా కీలకమైందిగా గమనించి గుర్తుంచుకోండి. విడిగా మండలిని కలిసినా మంచిదే.

4. ఇరువర్గాలకు చెందని న్యాయమూర్తులను (మన ఉభయులకు చెందనివారిని) ఏర్పాటు చేసుకోవాలి అన్నది కూడా సమగ్రమైన షరతుకాదు. ఎందుకంటే న్యాయమూర్తి స్థానానికి అర్హుడవడానికి వాది ప్రతివాదులిరువురకూ చెందని వాడైయుండాలన్న దొక్కటే సరిపోదు. ఉదాహరణకు న్యాయమూర్తిగా దారినపొయ్యేదానయ్యనో పరిశీలినాంశం పై సరిపడినంతైనా అవగాహన లేనివాణ్ణో, విచారణ పద్ధతులెరుగనివాణ్ణో, న్యాయం చెప్పాలన్న దుగ్ధలేనివాణ్ణో ఏర్పరచుకున్నామనుకోండి. అతడు ఇరువురికీ చెందని వాడైనప్పటికీ న్యాయనిర్ణయం చేయగలడంటారా? కనీస ఇంగితజ్ఞానమున్నా అదెలా కుదురుతుంది అనేయగలం. కనుక న్యాయ నిర్ణయం చేసేందుకు తగిన అన్ని అర్హతలూ ఉన్న వారిని (ఒక్కరిని కాకుండా పెక్కురను) ఏర్పరచుకోవడం అన్న విధాలా మంచిది. సాధారణంగా చెప్పుకోవాలంటే న్యాయనిర్ణేతలకు క్రింది యోగ్యతలు, సామర్థ్యాలు ఉండాలి.

(1) చర్చనీయాంశం పై తగినంత అవగాహన ఉండడంగానీ, ఆ విషయంలో విశేషజ్ఞుల్ని పిలిపించుకుని వారి ద్వారా అవసరమైన సమాచారాన్ని రాబట్టుకుని నిర్ణయాలు చేయడానికనువుగా వాటిని సరిచూసుకోగల సామర్థ్యం ఉండడం గానీ అవసరం.

(2) న్యాయమూర్తి పాత్రకు నిష్పాక్షిక దృష్టి ఉండడం, సత్యధర్మాలకే తప్ప ఇతరాలవైపుకి వంగకుండడం అతని వ్యక్తిత్వ లక్షణమై ఉండాలి.

(3) ఏ విషయాని కా విషయాన్నిగా, విషయాన్ని విషయంగా చూడగల నేర్పుకలిగి ఉండాలి. అంటే పెద్దవాడు చెప్పాడా, చిన్నవాడు చెప్పాడా అని గాని, ప్రసిద్ధుడు చెప్పాడా, అప్రసిద్దుడు చెప్పాడా అనిగానీ, శతృవుచెప్పాడా, మిత్రుడు చెప్పాడా అని గాని, తనవాడు చెప్పాడా- పరాయివాడు చెప్పాడా అనిగాని పట్టించుకోకుండా ఏమి చెప్పాడు? అది వాస్తవంతో సరిపోతుందా లేదా? అన్నంతవరకే పరిగణనలోకి తీసుకొని, నిర్ణయాలు ప్రకటించే నేర్పు కలిగి ఉండడం అని అర్ధం ఈ అంశాన్ని విధం తెలిసిన ఒకాయన ఇలా సూత్రీకరించాడు చూడండి.


యుక్తియుక్తముపాధేయం వచనం బాలకాదపి!

అన్యతృణమివ త్యాజ్యమప్యుక్తం పద్మజన్మనా!!


సబబైన మాట పిల్లవాడు చెప్పినా స్వీకరించదగిందే అవుతుంది. అట్లు కానిది ఎంతవాడు చెప్పినా (బ్రహ్మ చెప్పినా) గడ్డిపరకతో సమంగా విడిచివేయాలి. ఇలాటి అవగాహన మన పి.డి గారికి ఉన్నట్లు అనిపించడంలా. ఆయన షరతుల్ని బట్టి చూస్తే.

(4) ఈ నాలుగో షరతు క్రిందనే 'ప్రజాబహిరంగ చర్చావేదిక' ఏర్పరచాలనీ, అది గూడా నానాజాతి సమితి (సంతగోల) చేరడానికి వీలైన పి.డబ్ల్యు.డి గ్రౌండ్సులో గాని, జింఖానా గ్రౌండ్సులో గాని ఏర్పాటు చేయాలని చెప్పారాయన. ఈ అభిప్రాయం కూడా, సిద్దాంత విచారణలుగానీ, సిద్దాంత పరీక్షలుగానీ ఎలాంటి ప్రదేశాలలో ఎలాటి వాతావరణంలో, ఎటువంటి వ్యక్తుల మధ్య జరపాల్సుంటుందన్న అవగాహన కనీసంగానైనా పి.డి.యస్‌కు లేదన్న వాస్తవాన్ని పట్టిస్తోంది. నిజానికి ఎన్నో విషయాలు తెలియని స్థితిలో ఉండే, అన్నీ తెలిసినవాణ్ణన్న భ్రాంతిలో తెలుసుకునేందుకు నిరంతరం తెరచిఉంచుకోవాల్సిన జ్ఞాన వాకిలిని, తనకై తానే మూసివేసుకున్న ఆయన్ను చూస్తే జాలేస్తోంది. నిజానికి ఏ సిద్దాంత పరీక్షలైనా, ఎటువంటి ఇతర శబ్దాలు, ఇతర ఆలోచనలు లేని వాతావరణంలో అందుకు సంబంధించిన పరిమిత వ్యక్తులతో కూడి, యోగ్యమైన, అనుల్లంఘనీయమైన నియమనిబంధనలతో కూడి ఉండాలి. ఇతరులకు అనుమతి నిరాకరింపబడి ఉండాలి.

(5) నాలుగో షరతులోని అవాంఛనీయతే, 5వ షరతుకు దారితీసింది. దానిలో చెప్పిన గ్రౌండు, పోలీసు అనుమతి, స్టేజి, భద్రత, రక్షణ జాగ్రత్తలు అన్నవి సిద్దాంత చర్చలకు అనవసరం. న్యాయనిర్ణయాన్ని లక్షించిన సిద్దాంత పరీక్ష అన్నది కోర్టు హాలు స్వభావం కలిగిన, ప్రయోగ - పరీక్షా - శాల వంటిదిగా ఉండాలి. సాధారణ ప్రజలు అంటే పరిశీలనాంశం విషయంలో తగినంత అవగాహనగానీ, సత్యాసత్యాలు తేల్చుకోవాలన్న లక్ష్యంగాని లేనివాళ్ళు వేదిక దరిదాపుల్లో కూడా ఉండకూడదు.

ఇక ఖర్చుల విషయం. దీనికి ఖచ్చితమైన పద్దతంటూ ఏమీలేదు. ఇరు పక్షాలూ కలసి భరిద్దామనుకోవచ్చు.గెలిచిన పక్షం భరించాలనుకోనూవచ్చు. దానికి పూర్తి విరుద్దంగా ఓడిన పక్షంపైనే ఆ భారం పెట్టనూ వచ్చు ఇవేమీ కాకుండా, నిర్వాహక పక్షమే ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకోవచ్చు.

విషయనిష్ఠ, పరస్పర విశ్వాసం, నిబద్ధత ఉండాలి ఇలాంటి వాటికి పూనుకునే వారిలో, తప్పని సరైన అంశాలు, నమోదు చేసి దస్తావేజుల్లాగ భద్రపరచుకోవలసిన అంశాల వరకు నిక్షిప్తం చేసే పనికి పూనుకోవాలనేగాని, మిగిలిన చిన్న చితకల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అనవసరం.

అలాగే జరిగేదాన్నంతటినీ టి.వి ఛానల్లు ప్రత్యక్షప్రసారం చేయాలన్నది షరతుగా ఉండాలనడం అవివేకమేకాదు. అడ్డగోలు తనమూ, ఎగవేత వ్యూహము కూడా యధాతథంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలన్నంత వరకు నియమం పెట్టుకుంటే సరిపోతుంది. అంతవరకైతేనే అది ఆచరణ సాధ్యమైన మరియు అవసరమైన నిబంధన కూడా అవుతుంది.

(6) ఆరో షరతు, సందర్భ శుద్ధిలేని షరతు మన ప్రస్తుత వేదికకు సంబంధించి పెట్టుకోగూడని షరతు. ఈ షరతు వేదిక ప్రధానాశయమైన వాద బలాలను పరీక్షించడానికి గానీ, వాది బలాబలాలు పరిశీలించడానికి గాని పనికిరాకపోవడమేకాక, అవరోధకంగా కూడా తయారవుతుంది. ఎలాగంటే ఇరుపక్షాలు ఎవరికి తోచింది వారు చెరోగంటా మాట్లాడేశారు. మళ్ళీ చెరో పది నిముషాలు మాట్లాడారు. ఈ ప్రక్రియంతటిలో అస్సలు చర్చ స్వభావం ఎక్కడుంది? పరిశీలన, పరీక్ష ఎక్కడ జరుగుతుంది?

అస్సలు బైబిలులో చెప్పబడ్డ విషయాల సబబు బేసబబుల్ని పరీక్షించడం లక్ష్యంగా ఏర్పరచిన వేదికలో బైబిలు ప్రతిపాదనలపై విచారణ జరగాలేగాని, ఇతర సంస్థల ప్రతిపాదనలెందుకు? కనుక వెంకటాద్రో మరో వ్యక్తో బైబిలులో,పలాని అంశాన్ని గురించి ఏమి చెప్పబడింది? అని అడగడమో, బైబిలు పక్షం వాళ్ళు చెప్పినవి బైబిలులో ఉన్నాయో లేదో చూడడమో, చేస్తూ, ఆ ప్రకటనలు సరైనవేనని నిరూపణ చేయమనే కదా అడుగుతుండాలి. బైబిలు పక్షీయులే బైబిలును ప్రకటించి - ప్రదర్శించి - అందులోనివన్నీ సరైనవేనని నిరూపించాలి. అదే బైబిలు విచారణంటే వాదనియమాలుగానీ, నిర్ధారణ నియమాలు గానీ తెలిసిన వారెవరైనా కాదనలేని సాధారణ సూత్రమిది.

ఉదాహరణకు, ''ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను'' అన్నది బైబిలు ప్రకటితాభిప్రాయంగా, అంటే సృష్టి ఆరంభాన్ని గురించిన బైబిలు సిద్ధాంతంగా చెప్పినట్లు అది అబద్దం కాదనీ, నిజమేననీ బైబిలు పక్షీయులు. సైన్సు ప్రకారమేనగ్న సత్యంగా నిరూపిస్తాను అని పి.డి.యస్‌గారే అన్నట్లు దానిని నిరూపించాలి. అలా చేయకుండా, అది అబద్దమని నిరూపించు చూస్తాను అని ఎదుటివారి నడగడం, విధం తెలియని తనమైన అయ్యుండాలి. కుటిల ఎత్తుగడైనా అయ్యుండాలి.

ప్రతిపాదకుడే, తాను ప్రకటించిన అభిప్రాయం సరైందేనని నిరూపించే బాధ్యత స్వీకరించాలన్నది వాద నియమాలన్నింటిలోకీ మౌలిక మూ, కీలకమూ, ప్రాథమికమూ అయిన నియమం.

ఈ సూత్రాన్ని విడచి, బైబిలు పక్షీయులు ఈ మాట అసత్యమని నిరూపించమని ఇతరులనడగడమూ, అది అసత్యమని మేము నిరూపిస్తాము అని బైబిలేతరులు అనడమూ అన్న రెండూ విధం తెలియని పోకడలే. కనుక 6వ షరతులో, చర్చగానీ, రుజువు పరచేయత్నాలుగానీ, న్యాయ నిర్ణయ పద్దతులుగాని చోటు చేసుకున్న దాఖలాలు కనబడ్డం లేదు కనుక ఆ షరతూ చర్చావేదిక నియమనిబంధనలకు తగిందిగా లేదు.

(7) దారావాహికంగా జరిగే చర్చనంతటినీ ప్రత్యేకంగా వీడియో తీయించాలి. ఇందులోని ధారావాహికంగా అన్నపదం ఏ అర్థాన్నిస్తుంది? ఇక్కడ ఆ పదం వాడాల్సిన అవసరమేముంది. చర్చనంతటినీ రికార్డు చేయాలి అనంటే సూటిగా ఉంటుంది కదా! ధారావాహికంగా అన్నపదం 'సీరియల్‌' అన్న దానికి అనువాదంగా వాడుకలో ఉంది. ధపదఫాలుగా, (కొంతొకసారి, కొంతకొసారి అనే పద్దతిన) చాలకాలం మళ్ళా మళ్ళా సాగే కథనాలకు ఆ పదం సరిపోతుంది. తెంపులేకుండా సాగే అన్న అర్థంతో వాడినట్లుంది పి.డి.యస్‌ గారు భాష విషయాన్నలా ఉంచితే, ఈ నియమం తప్పనిసరి అనుకుందాం.

(8) ఎనిమిదవ షరతులో నున్నూ భాషా పరమైన దొసగులున్నాయి. వాటినలా ఉంచితే, 'తుది తీర్పు' అన్న పదం విషయపరంగా అనేక తీర్పులు జరిగిన, జరిగే సందర్భాలలోనే వాడాలి. కనుక ఎందుకీ పదం వాడారో ఆయనే చెప్పాలి. ఎందుకంటే, విన్నమాటకు అర్థాన్ని అన్న వాడి నుండే స్వీకరించాలి. తానన్నమాటకు అర్ధం చెప్పే బాధ్యత అన్నవాడే స్వీకరించాలి. ఆ అర్థం భాష అంగీకరించేదిగా ఉండాలి అన్నది భాషా నియమాలకు సంబంధించిన కీలక సూత్రం.

ఓడినవారు గెలిచిన వారి పక్షాన్ని స్వీకరించాలి. స్వీయ పక్షాన్ని విడిచిపెట్టాలి అని చెప్పాలనికాబోలు అంతరాశారు పి.డి.యస్‌ గారు హేతువాదులుగానీ, ఇతరులెవరైనాగాని, దీనికి సిద్దపడకపోతే, ఎందుకు సిద్దపడరో వారే చెప్పాలిగానీ, నా వరకు నేను ఈ నియమానికి కట్టుబడి ఉంటాను. అలా అని వ్రాసిస్తాను.

(9) ఈ తొమ్మిదవ షరతు దానికదే ఒక పిచ్చి ప్రకటన ఒక సిద్దాంత భావాన్ని విచారణకు స్వీకరించిన వేదికతో భారతరాజ్యాంగానికి గానీ, భారతీయుని మత విశ్వాసానికిగానీ, చట్టానికి గానీ నేరుగా ఎలాంటి సంబంధమూ ఉండదు. ఎలాగంటే.

విష్ణువే దేవుడు అన్నది వైష్ణవమతస్థుల విశ్వాసం ఒకవైష్ణవుడూ - వైష్ణవేతరుడు విష్ణువే దేవుడన్నది విచారణకు పెట్టుకుందాం అనుకున్నారు. అందులో విష్ణువు దేవుడన్న నిర్ణయం వచ్చినా, విష్ణువు దేవుడు కాదన్న నిర్ణయం వచ్చినా అదంతా ఆవేదికకు పరిమితమైన విషయమే అవుతుందిగాని, అది ఎవరి మనోభావాలను కించపరచినట్లుగానీ, రాజ్యాంగానికీ, చట్టానికీ వ్యతిరేకమైనట్లుగానీ కానేకాదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా మతసాహిత్యాలన్నీ గంటా పథంగా తమ గ్రంథం చెపుతున్నవాడే అస్సలైన దేవుడు, ఇతరాలు చెపుతున్న వాళ్ళు కాదు అనే చెపుతున్నాయి. ఆ మాటల్ని బట్టుకుని మా దేవుణ్ణి దేవుడు కాదంటున్నావు. మా మనోభావాలు దెబ్బ తింటున్నాయి. అని అననేకూడదు. అలాంటిదంతా అనవసరపు రాద్దాంతాలను రేకెత్తించి జనాలను ఆవేశ పరుల్ని చేయడానికి పన్నిన కుటిల పన్నాగాల క్రిందికేవస్తాయి. కనుక ఎంపిక చేసుకున్న అంశాలను విడచి అనవసరపు విషయాలు ముచ్చటించకూడదు అన్న షరతు వరకు పెట్టుకుని, దానినత్రికమించిన వారు వోడిపోయినట్లే అవుతుంది అన్న షరతునూ పెట్టుకోవచ్చు.

నిర్ధారణ నియమాలలో విప్రతిపత్తిరప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానం అన్న ఒక సూత్రం ఉంది. ఎంపిక చేసుకున్న విషయాన్ని విడచి అన్య విషయ ప్రస్తావన చేసినా, అడిగిందానికి బదులిడక అంటే ఆ విషయం తెలియకున్నా ఓటమి పొందినట్లేనని సూత్రార్థం ఇలాంటి విధి విధానాలన్ని తెలిసిన వారితో కూడిందే యోగ్యమైన చర్చావేదిక అవుతుంది. ఎవరి మనోభావాలను గాయపరచకలాంటి షరతుల్ని విధించుకోనేకూడదు. ఎందుకంటే ఆ మత గ్రంథంలోని కొన్ని అభిప్రాయాలు తప్పులని తేలాయనుకోండి. ఆ మేరకు ఇరుపక్షాలు దానిని తేలిన విషయంగా స్వీకరించాలేగాని, ఆ మతస్థుల నమ్మకాలను తప్పుపడుతోందీ నిర్ణయం కనుక అలాంటి నిర్ణయాలు చేయొద్దులాంటి నిబంధనలు పెట్టనేకూడదు. శాంతియుతంగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది బుద్దున్న వాళ్ళంతా అంగీకరించాల్సిందే. అందుకు మొదటి జాగ్రత్తగా చేయాల్సిన పని బహిరంగంగా నిర్వహించకుండడమే

10) ఇక ఈ పదవ షరతు విషయ నిష్ట, నిజాయితీ, సత్యాన్ని ఆవిష్కరించాలన్న తపన లేనివాళ్ళ విషయంలో అదీ కొన్ని సందర్భాలలో అవసరమవుతుంది. అలాటప్పుడు కూడా అనుకోని, మరియు అనివార్యమైన ఆటంకాలెదురవడం వల్ల రాకపోవడం జరిగితే దానిని ఓటమిగా పరిగణించకూడదు. నిజానికలాటప్పుడు ఓటమిక్రిందే పరిగణించాలనడం మూర్ఖత్వమే కాదు, క్రూరత్వము, సంస్కారరాహిత్యమూ కూడా.

ఇక ఆయన గారి చివరిషరతు గమనిక రూపంలో ఉంది. పై వాటిలో దేనిని అంగీకరించకున్నా నేను చర్చకురాను. అన్నది మరింత విధం తెలియనిపోకడ అస్సలు ఏ చర్చావేదికకైనా ఇరు పక్షాలు కూర్చుని సాధారణ పద్దతులు తెలిసినవారినీ కూర్చుండ బెట్టుకుని, ఆ వేదికకు సంబంధించిన నిబంధనావళిని, పందెపు రీతిని ఏర్పరచుకుని, ఆ మొత్తాన్ని ఒప్పందం రూపంలో వ్రాసుకుని సంతకాలు చేసి ఖరారుపరచుకోవాలి. అంతేగాని ఎవరికి తోచిన షరతుల్ని వారు ఏక పక్షంగా ప్రకటించి, అలాగైతేనే చర్చ, ఏమిటండీ అనడం అదేరకంగానూ అంగీకరించదగిందికాదు.

గమనిక : - పది సూత్రీకరణలతో కూడిన అరపేజీ రాతలోనే అయ్యగారి సత్యసంపూర్ణత్వము, విశ్వవిజ్ఞాన సార్వభౌమత్వమూ, శాస్త్రీయపోకడా అడ్డగోలుగా బైటపడిపోతుండగా, ఇక సిద్దాంత చర్చ పరిస్థితేమిటోగదా!

పి.డి.యస్‌ గారికీ, ఆయన బృందానికీ, వందిమాగదులకూ, రంజిత్‌ ఓఫిర్‌గారికీ, వారి బృందానికీ, అలాగే వాళ్ళిద్దరూ బైబిల్‌ సరిగా తెలిసిన వాళ్ళుకాదంటున్న బైబిలు పక్షానికే చెందిన ఇతరుకూటాల పెద్దలకు, బైబిలును కాదనాలనుకున్న పక్షాల వారికీ కూడా సమానంగా తెలిసుండాల్సిన కొన్ని ప్రాథమికాంశాలను ప్రస్తావిస్తాను. పత్రికను జాగ్రత్తగా పరిశీలిస్తున్న వారందరూ వీటిని పరికించి చూసి, ఇవి అవసరమైనవోకావో చెపుతూ, ఇలాంటివింకేమైనా అవసరమైనవి ఉన్నాయనిపిస్తే వాటిని గురించి మాకు తెలియపరచండి.

ఇంతకూ బైబిలంటే ఏమిటి?

(1) వివిధ కాలాలలో వివిధ వ్యక్తులచే వ్రాయబడ్డరచనలుగ అంగీకరింపబడుతున్న అనేక పుస్తకాల సంపుటే బైబిలంటే. గుదిగుచ్చబడిన, కట్టగా చేర్చబడిన అనేక పుస్తకాలే బైబిలంటే.

(2) ఇది ప్రధానంగా పాత, క్రొత్త నిబంధన గ్రంథాలన్న పేరున ముద్రింపబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథము అన్న పేరుతో తెలుగులో పిలువబడుతోంది.

(3) అనేకపాత్రలు, వారి వారి మాటలు, చేతలకు సంబంధించిన వివరాలతో కూడి ఉన్న రచన అది.

(4) వివిధ కాలాలతోనూ, వివిధ ప్రదేశాలతోనూ ముడిపెట్టబడి, జరగడానికి వీలున్న, జరగడానికి వీల్లేనివనిపించే ఘటనలను వివరిస్తూ ఇటు చరిత్ర అనడానికీ, అటు కాల్పనికం అనడానికీ వీలుగా ఉన్న రచన అది.

(5) బైబిలు దైవగ్రంథమా? కాదా? అన్నది పరిశీలనాంశంగా తీసుకుని (1) అది దైవ గ్రంథమనే పక్షమూ, (2) అది దైవగ్రంథం కాదనే పక్షమూ వందల సం||లుగా వాదులాడుతూనే ఉన్నాయి. కానీ యోగ్యమైన పరీక్షావేదికను ఏర్పరచుకుని ఇప్పటి వరకు ఏనాడూ దానిని పూర్తిగా పరిశీలించిన దాఖలాలు లేవు. ఈనాడైనా ఆ పని సజావుగ పూర్తి చేయాలంటే ముందుగా వేదికలోని పక్షాలవారి వరకైనా కొన్ని విషయాలలో స్పష్టత, ఏకాభిప్రాయము ఏర్పడాలి.

(1) ఇంతకూ దైవ గ్రంథమంటే ఏమిటి? దానిలోని ప్రతి వాక్యమూ దైవవాక్కేనని అనడమా? ఈ దృష్టిని అంగీకరిస్తే ఎటువంటి పరీక్షలు చేయకుండగనే సాధారణ దృష్టి నుండే అది దైవ గ్రంథం కాదు అనవచ్చు. ఎలాగంటే, ఆ మొత్తం రచనలో (1) దేవుని పాత్ర పలికినమాటలు, (2) దేవుడు చెప్పమన్నాడంటూ అటు దేవదూతల పాత్రలు గాని, ఇటు ప్రవక్తల పాత్రలుగానీ, అటు దర్శనాలు కలిగాయన్న పాత్రలుగానీ పలికిన మాటలు.

(3) యెహోవా విశ్వాసులుగనున్న పాత్రలు, అవిశ్వాసులుగనున్న పాత్రలు, అన్య దేవతల విశ్వాసులుగనున్న పాత్రలు, సాధారణ జనంగా ఉన్న పాత్రలు పలికిన మాటలూ అందున్నాయి.

(4) సాతాను పేరున చెప్పబడ్డ వాని మాటలూ, అతని ప్రభావానికి లోబడినవంటున్న పాత్రల మాటలూ ఉన్నాయి.

(5) ఆత్మలు, దుష్టాత్మలు, దయ్యాలు, పరిశుద్ధాత్మ, ప్రత్యేకింపబడిన ఏసు, అతని బోధనలను ప్రచారంచేసిన సువార్తకుల మాటలు అందులో ఉన్నాయి.

| ఇవీ, ఇలాంటి మరికొన్ని పాత్రల మాటలతో కూడిన రచన - పుస్తకం - అది కనుక బైబిలు దైవ గ్రంథం అనేవాళ్ళు ఉన్న మొత్తంలో నుండి దేవుడన్నవీ, దేవుడు అనిపించినవీ, దేవుడు అంగీకరించినవీ అనడానికీ వీలైన వాక్యాలనన్నింటినీ విడగొట్టి, దైవగ్రంథం క్రింద ఆ రాశిని మాత్రం చూపాలి. ఈ విధానమే బైబిలు దైవ గ్రంథం అనదలచుకున్న వారికి ఎంతో కొంత మేరకైనా వాదన కొరకైనా బలాన్నివ్వగలుగుతుంది.

స్పందన - ప్రతిస్పందన

చిన్న సూచన : స్పందనలనేకం అందుతున్నాయి. అవన్నీ ఒక క్రమంలో స్థలానుకూలతను బట్టి ప్రచురిస్తూ ఉంటాను. ప్రచురణపరమైన సాధ్యాసాధ్యాల దృష్ట్యా స్పందించిన వారంతా ఒకింత ఓరిమి వహించాల్సిందిగా కోరుతున్నాను.

స్పం : 1. భువనగిరి నుండి మూర్తి గారి జనార్థన్‌; సురేంద్ర గారికి మీ ఛాలెంజిని ఇటు క్రైస్తవులుగాని, అటు ఇస్లాంవారు గాని ఎదుర్కొనుటకు సిద్దంగాలేరని పత్రిక కథనం ద్వారా తెలిసింది. మీ ఛాలెంజ్‌ని కొనసాగించండి. యిష్టమున్నవాళ్ళే వాదనకు దిగుతారని భావిస్తాను. సత్యం కోసం నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీ సత్యశోధన కృషికి నా అభినందనలు.

ప్ర.స్పం :- 1. మిత్రులు జనార్ధన్‌ గారికి, సత్యం కోసం నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలన్న మీ మాట అక్షర సత్యం. చూద్దాం ఏమి జరుగుతుందో పత్రికను జాగ్రత్తగా చదివే వాళ్ళలో మీరొకరు. స్పందిస్తూ ఉండండి.

స్పం :- 2. వేమూరి నుండి హాజరత్‌ ఆలీగారు; మీ పత్రిక వివేకపథం అందుతునే ఉంది. పట్టువిడువని విక్రమార్కునిలా ఈ మత వాదులతో సవాళ్ళు విసురుతున్నందుకు అభినందనలు.

ప్ర.స్పం :- 2. మిత్రులు ఆలీగారికి; పత్రికపై స్పందిస్తూ ఉండండి. మీరెరిగిన మత, మతేతర చింతకులకు ఈ విషయం తెలుపండి.

స్పం :- 3. భద్రాచలం నుండి భాను ప్రసాద్‌గారు, వివేకపథం ఫటాఫట్‌గా ఉంది. అందరకూ ఎక్కడో చోట చురకలు పడుతునే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో నిరుద్యోగ యువత చదువు వచ్చినారాకున్నా బైబిలు ఉపాధి పథకంలో చేరి ఇంటింటా బైబిలు అనేదాన్నీ దాటిపోయి ప్రతి వ్యక్తికీ బైబిలు అందించే కార్యక్రమం తీసుకున్నారు. కదిలినా మెదిలినా బైబిలు వారి వెన్నంటి ఉంటోంది. సర్వశక్తివంతమైన బైబిల్‌ను నమ్ముకుంటే, తమ సమస్యలన్నీ ఫటాఫట్‌ మని పేలిపోతాయన్న నమ్మకాన్ని గొర్రెల మందలాంటి సామాన్యులకు కలుగజేగలగారీ ప్రచారకులు. బైబిలు ప్రచారమనే ఉద్యోగంతో ఉపాధి పొందగలిగారు. 1 సంవత్సరంలో క్రొత్త మోటారు సైకిల్‌ రెండో సం|| చర్చి నిర్మాణం, 3వ సం|| బంగళా, 4వ సం|| మరిన్ని చర్చిల నిర్మాణం, సొంత కూటాల ఏర్పాటు వగైరాలతో క్రైస్తవం ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. వీరక్రైస్తవులెందరో తయారై దూల సుందర్రావుల్లాగా వీరాలాపాలాడుతున్నారు. వారి ధన జన, వాగాడంబరాల బలంమ్ముందు హిందూ, ముస్లింలు తుస్సుమంటున్నారు. ఇన్నాళ్ళకు సురేంద్రగారు అందరినీ సమాధాన పరిచేందుకు సన్నద్దమైనందుకు అభినందనలు.

ప్ర.స్పం :- 3. మిత్రులు, సమాజహితైషులు భాను ప్రసాద్‌గారికి, సమయోచితంగా స్పందిస్తూ ఉండండి. ఆయా మత ధోరణుల వారికి ముఖ్యంగా పి.డి. యస్‌ గారికీ, ఓఫిర్‌గారికీ లేఖలు వ్రాస్తూ ఆనకలు నాకూ పంపండి. మీ ఎరుకలో ఉన్న యోచనాపరులకూ ఈ శీర్షిక కబురందించి స్పందించమని చెప్పండి.

స్పం :- 4. ఖమ్మం నుండి క్రాంతికార్‌ సం|| క్రితం వ్రాసిన లేఖ ఇది ప్రస్తుత సందర్భంతో ముడిపడి ఉంది. గనుక దీనిని ప్రచురిస్తున్నాను. ప్రియమైన సురేంద్రకు, హైద్రాబాద్‌ నుండి అబ్దుల్‌ రషీద్‌ అన్నాయన వచ్చినన్ను కలిశారు. ఈ నాటి శాస్త్రీయ పరిశోధనలన్నీ 14 శతాబ్దాల నాటి ఖురాన్‌లో విభజింపబడి ఉన్నాయనీ, వాటినీ సూరాలతో సహా శాస్త్రీయంగా నిరూపించుతాననీ గట్టిగా చెప్పారాయన నేనాయనకు మీ పేరు సూచించి, మీతో మాట్లాడమన్నాను, అలాగేనన్నారాయన. అందుకే మీకీ విషయం తెలియబరుస్తున్నాను.

ప్ర.స్పం :- 4. మిత్రులు క్రాంతికార్‌ గారికి మీరన్న ఆ రషీద్‌ గారిప్పటి వరకు నన్ను కలవలేదు. ఆయనతో సంప్రదించే అవకాశముంటే ఆయనతో మాట్లాడి నన్ను కలవమనండి. చర్చావేదికకు సంబంధించినంతలో బైబిలుకు వర్తించే అన్ని షరతులూ ఖురాన్‌కు, వేదానికీ కూడా వర్తిస్తాయని లోగడే ప్రకటించి ఉన్నాను గనుక, పి.డి.యస్‌ గారితోవలెనే, రషీద్‌ గారితోను చర్చకు కూర్చోడానికి నేను (మండలి) సిద్దమేనని తెలపండి. నడుస్తున్న శీర్షికపైనా స్పందిస్తూ ఉండండి.

స్పం :- 5. ఆకేటి సూరన్నగారు తూ.గోదావరి జిల్లా నుండి ఇలా వ్రాస్తున్నారు. మీ 186 వ సంచికలోని, ఏదైనా ఒకటి ఉందన్నాలన్నా లేదనాలన్నా మొదట, అదంటే ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎంతుంది? ఎలా ఉంది? దాని గుణగణాలేమిటి? దాని క్రియ లేమిటి? అన్న విషయాల వివరం తెలుసుండాలి. ఇక దేవుని విషయంలోనైతే అతనితో మనకున్న సంబంధమేమిటి? అన్నది తెలుసుండాలన్న మీ సూత్రం ప్రతిపాదనలు చేసే వారికి కనువిప్పు కలిగించేదిలా ఉంది. అలాగే సరైన చర్చా వేదిక ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? అన్న మీ వివరణతో కూడా నేను ఏకీభవిస్తున్నాను.

2. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 ఎ/హెచ్‌ ని ఉట్టకించడము సందర్భోచితంగా ఉంది. ఇప్పుడున్న సమాజం చాలవరకు దైవ విలువలపై ఆధారపడి ఉంది. మానవ విలువలు మృగ్యమైపోయాయి. మూఢనమ్మకాలు మనుషులను నాశనం చేసేస్తున్నాయి. ఇదంతా కొంతమంది దోపిడీకి ఉపకరణంగా పనిచేస్తూనూ ఉంది.

3. వివేకపథం 188 పేజీ 18లో జ్ఞాన ప్రక్రియల గురించి చెపుతూ జ్ఞానానికీ, దైవభావనకు సంబంధం లేదని చక్కని వివరణ ఇచ్చారు.

4. నా సలహా ఏమంటే, ఇలాంటి చర్చలకంటే, మీ అన్వేషణలో మీరు కనుగొన్న సత్యాలను నలుగురికీ తెలియజేయడం ఎక్కువ మేలును కలిగిస్తుందేమో ఆలోచించండి.

5. 188 సంచికలోనే 11, 13 పేజీలలో, సత్యాన్వేషణ అంటే దేవుని అన్వేషించడం కాదని, అంటూనే క్రీస్తు, అల్లాల విషయంలో నా వరకు నాకు వారిద్దరూ ఉన్నారో లేదో నన్నది అనవసరపు విషయమేనంటూనే, మళ్ళా అటువంటి చర్చలు ఏర్పరుస్తూ, ఉన్నారో లేదో తేలని పక్షం వాణ్ణినేను, మీరెవరైనా ఉన్నాడో లేడో తేల్చితే తేలిన సత్యాన్ని స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పడం పరస్పర విరుద్దంగా ఉందనిపిస్తోంది. ఆలోచించండి.

6. తేలని, రుజువులు లేని నమ్మకాల విషయంలో ఉన్నాడు, లేడనే వాళ్ళతో వాద ప్రతివాదనల రూపంలో చర్చలు నిర్వహించడం ఏ మేరకు అవసరమో, ప్రయోజనకరమో ఆలోచించండి.

ప్ర.స్పం :- 5. మిత్రులు సూరన్నగారికి మీరు పత్రికలు జాగ్రత్తగానే పరిశీలిస్తున్నట్లు అనిపిస్తోంది మీ లేఖను బట్టి. జాగ్రత్తగా పరిశీలిస్తూ తగిన విధంగా స్పందిస్తూ ఉండండి. ఆస్థిక పక్షం వాళ్ళకూ లేఖలు వ్రాస్తూ నకలు నాకూ పంపండి. మీరు 5వ పాయింటులో లేవనెత్తిన విషయాలపై, నా పక్షంలో వైరుధ్యమేమీ లేదన్నదే నా సమాధానం. మిగిలిన పాఠకులూ ఆ సంచికనోసారి చూసి వైరుధ్యం ఉందనిపిస్తోందా? లేదనిపిస్తోందా వ్రాస్తే బాగుంటుంది. కొంత కాలం ఇతరుల స్పందనకై ఆగి ఆ తరవాత నా పక్షాన్ని వివరిస్తాను.

స్పం :- 6. వివేక పథం 188లో జగదీశ్వర్‌ గారి స్పందన దానిపైనా ప్రతిస్పందన ప్రచురించాను. దానిపై తిరిగి స్పందిస్తూ నల్గొండ జిల్లా నుండి జగదీశ్వర్‌ గారు మరోలేఖ వ్రాశారు. సురేంద్ర గారికి నమస్కారం.

ఓఫిర్‌గారితో చర్చ ప్రస్తావన : మీరు ఓఫిర్‌గారు వ్రాసిన హైందవక్రైస్తవం గ్రంథాన్ని విచారణకు స్వీకరిద్దాం వారిని చర్చకు సిద్దపడమన్నారు. దానికి నేను మీరు ఆయన వ్రాసిన గ్రంథాన్ని చదివారా? అని ప్రశ్నించాను. అందుకు మీరు, చదవడం కాదండీ! ఆ గ్రంథం మొదటి నుండి చివరి వరకకు ఆయన చెప్పిన విషయాలను చర్చించుకుంటూ వెళదాం, విచారణలో తేలిన విషయాలను స్వీకరించి, తేలని విషయాలను విడిచిపెట్టాలి అనన్నారు.

అయ్యా! సురేంద్రబాబుగారూ, మీరు చెప్పిన విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఓఫిర్‌గారు మీ దగ్గరకువచ్చి మీతో చర్చించుకుని తాను చెప్పిన విషయాలను నిర్ధారించుకోవలసిన అవసరం లేదు. తాను సత్యమని అంగీకరించిన విషయాలు గ్రంథంగా ప్రచురించారు. ఇప్పటికే అది బహు ప్రజాదరణ పొంది తృతీయ ముద్రణకు సిద్దపడుతుంది. అనేక మంది హిందువులు సైతం ఆ గ్రంధాన్ని ప్రశంసించారు. మీరు ఆ గ్రంధాన్ని చదివి వేదాలలో ఆయన చెప్పిన వచనాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి, ఆవచనాలకు ఆయన చెప్పిన వ్యాఖ్యానం సమంజసమా కాదా అని పరిశీలించండి. అందులో మీరు వేటిని అంగీకరిస్తున్నారు, వేటితో విభేదిస్తున్నారో? ఎందుకు విబేధిస్తున్నారో తెలియజేయుటకై మీకు రెండు గ్రంథములను పంపించాను. కానీ ఇంత వరకు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.

హైందవ క్రైస్తవం పై మీ అభిప్రాయాన్ని గానీ, మీ స. మండలి అభిప్రాయాన్ని గానీ తెలుపండి. ఇది సరైన చర్చా విధానం. అంతేకాని, ఓఫిర్‌గారితో విచారించాలి అనే పదమే అభ్యంతరకరం. మీతో విచారించాల్సిన అవసరం మాకు లేదు. మీతో విచారించిన తరవాతనే పుస్తకం ముద్రించాలనే పద్దతి లేదు.

అయ్యా! సురేంద్రబాబుగారు, మీరు బైబిలును విచారించాలనుకుంటున్నారు. అయితే ముందుగా బైబిలును పూర్తిగా చదవండి. అందులో ఉన్న ఖబిరిదీశినీలిళీలి బీళిదీశిలిదీశి పై మీ ధర్మ సందేహాలను అడగమని నేను చెప్పాను. అంతేగాని అక్షరాలు చదవొద్దు అని నా భావం కాదు. రామాయణంలో పిడకల వేటలా ఉండొద్దు అని నా ఉద్దేశం.

బైబిలులో అనేక విషయాల ప్రస్తావన ఉంది. వాటన్నింటినీ విచారించుకుంటూ పోతే ఎన్ని సం||లైనా సరిపోదు. కాబట్టి అన్నింటిలో ముఖ్యమైన, కేంద్రకమైన కారకమైన విషయాన్ని పరిశీలించండి.

మరో ప్రాముఖమైన విషయము బైబిలు గ్రంథకర్త ఎవరు? ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. బైబిలును విచారించాలనుకునేవాళ్ళకు బైబిలుపై కనీస పరిజ్ఞానము ఉండాలి. బైబిలు గ్రంథకర్త దేవుడే.

2 పేతురు 1:20, 21 ప్రకారం ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగాని, మనుజుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవాడై దేవుని మూలముగా పలికిరి. దేవుడు దాదాపు 40 మంది ప్రవక్తలను వివిధ కాలాలలో (బిసి 1500 నుండి ఎడి. 100) సుమారు 1600 సం||లు వివిధ ఖండాలలో ఉన్న వారిని ప్రేరేపించి వ్రాయించిందే బైబిలు ఇన్ని సం||లలో ఇన్ని ప్రాంతాల వారితో, ఇంత మంది ద్వారా ఒకే విషయాన్ని కొనసాగిస్తూ వ్రాయడం దేవునికే సాధ్యం. కాబట్టి బైబిలు గ్రంథకర్త దేవుడే అని చెప్పడానికి ఇది ఒక కారణం ప్రవక్తలు కేవలం దేవుని చేతిలో కలం వంటి వారు మాత్రమే.

మీరు దేవుని చాలా హేళనగా మాట్లాడారు అని నేనన్నందుకు, నేనెక్కడ మాట్లాడాను ఎత్తి చూపండి అంటూనే ఇక ఇప్పుడు మాట్లాడుతున్నానని నా నా కూతలు కూసి మీ బుద్ధి బైట పెట్టుకున్నారు. ఈ దురభిప్రాయాలన్నంటికీ కారణం అపార్థాలు వక్రభాష్యాలు, అర్థ సత్యాలు మాత్రమే. బైబిల్‌పై అన్ని దురభిప్రాయాలు పెట్టుకుని సత్యాన్వేషణ ఎలా చేస్తారు? విమర్శించడం కొరకే సత్యాన్వేషణ అయితే దానికి నేను వ్యతిరేకం. సత్యం కొరకే అయితే దానిని నేను స్వాగతిస్తాను. సత్యాన్వేషణ ముసుగులో అర్థం లేని విమర్శలను కట్టిపెట్టండి. ఇలాంటి అయోగ్యమైన విమర్శలకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు.

బైబిలు అడుగు వారికి సమాధానం చెప్పమన్నది (1 పేతురు 3 : 15, 16) నిరీక్షణకు హేతువు చూపమనే వారికే గాని మీలాటి కుట్రపూరిత విమర్శలకు కాదు.

యేసు రెండవ రాకడను నువ్వాపగలగావా? అన్న నా సవాలుకు మీ స్పందన చూస్తే నాకు చాలా జాలివేసింది. దీనిని బట్టి మీకు బైబిలు ఓనమాలు కూడా తెలియవని నాకు అర్థమైంది. మీరు అజ్ఞానాన్నే జ్ఞానమని భ్రమపడుతున్నారు.

ఏసు గురించి సరిగా తెలియాలంటే, యుగాంతం దేవుడు సృష్టి ఎందుకు చేశాడన్నది తెలియాలంటే, దేవుని విశ్వప్రణాళిక, దేవుని వ్యక్తిత్వం తెలుసుకోడానికి, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, యుగాంతం తరువాత ఏమి జరగనుందో తెలుసుకోడానికి మహిమ ప్రపంచం అన్న ఓఫిర్‌గారి రచనలు చదవండి.

సామెతలు : 18 : 13 సంగతి వినక ప్రత్యుత్తర మిచ్చువాడు తన మూఢతను బైలుపరచి సిగ్గునొందును. ఇంతలేసి మాటలంటున్నా ఆ దేవుడు ఎందు కూరుకుంటున్నాడు? అనడిగారు. ఆ దేవుడు మీ దేవుడు అన్న పదాలే అసందర్భం. దేవుడు కొందరికే దేవుడెలా అవుతాడు? అయితే అందరికీ దేవుడైయుండాలి. లేకుంటే దేవుడే కాకుండా పోయుండాలి. అయితే కొందరీ విషయాన్ని అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ విజ్ఞులు అలా అసంబద్దంగా మాట్లాడకూడదు. దేవుడు మిమ్మేమీ అనడం లేదని ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. మీరిప్పుడు దేవుని నుండి గానీ మరణం నుండి గానీ తప్పించుకున్నారా ఏమిటి? అయినా ఉడత ఊపులకు వేపలు కదులుతాయా? మిమ్మల్ని ఏమీ అనకపోవడానికి కారణం దేవుని అంతరంగ సౌందర్యం. దేవుడు ఎవరినీ బలవంతం చేయడు, ఎవరి వ్యక్తిగత స్వేచ్చను హరించడు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. అయితే మీ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది దేవుడు మీ ఎడల చూపిస్తున్న అపార ప్రేమ, దయ, ఓర్పు దానిని సద్వినియోగం చేసుకుంటారో లేదో మీ ఇష్టం.

దేవుని నోరు ఏసు / జవాబు అన్నవి మీకు సంబంధించినవికావు. అవి క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తాయి

నిరక్షరాశ్యులు కూడా దేవుని తెలుసుకున్నారు. కనుక బైబిల్‌ చూడకమునుపే దేవుణ్ణి తెలుసుకోవచ్చు.

బైబిలు దేవుడు కల్పితుడా? పులుముడుపనా? అని ప్రశ్నించారు. మీరు 100 సం|| క్రితం లేరు. కొంతకాలం తరవాత ఉండరు. కాని దేవుడు శాశ్వతుడు. విమర్శలు కూడా ఒక స్థాయిలో ఉండాలి సురేంద్రగారూ!

క్రీస్తు అవతారం గురించి చెప్పబడిన ప్రవచనాలను తెలుపమన్నారు. కొత్త నిబంధనలోని చాలా వాక్యాలు ఆ విషయాన్ని తెలిపేటివే కనుక నిజాయితీగా దానిని పరిశీలించండి. మీకు దేవుడు సహాయం చేయునుగాక!

ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. మేము అన్నపుడు క్రైస్తవులని అర్థం

నేనేమీ మిమ్ము భయపెట్టడం లేదు. ఒక వేళ బైబిలు దేవుడే సత్యమని తేలితే అంగీకరించాల్సి వస్తుందని మీరు భయపడుతున్నారేమో!

దేవుడు మీరన్నట్లు ఏనాడూ చేసుకున్న నిబంధనల్ని అతిక్రమించలేదు.

ప్ర. స్పం :- మిత్రులు జగదీశ్వర్‌ గారికి విషయ గాంభీర్యత, అంశాల ప్రత్యేకత, నిర్ధిష్టత లేని ఇంతంత లేఖలు పత్రికలో ప్రచురించడం సాధ్యపడదు. స్థలాభావం రీత్యానే కాకుండా, అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. కనుక సూటిగా, లోతుగా విచారించడానికి తగిన వనుకునే ఒకటి రెండంశాలకు పరిమితమై విచారణ చేస్తూపోదాము. పత్రికలో మొత్తం వేయకుండా మీకు విడిగా లేఖ వ్రాయడం వరకు అయితే ప్రయాసేగాని అంతగా వ్యయమూ, స్థలాభావములన్నవి ఉండవు. గనుక మరో వంక అలా చేస్తూ ఉండవచ్చు. పత్రికలో మాత్రం విస్తారమైన సాధారణ లేఖలు వేయడం సాధ్యపడదు.

మీ లేఖ మొత్తం నుండి విచారణ సాగించడానికి తగిన రెండంశాలను ఉట్టంకిస్తాను.బైబిలంతా విచారించడానికి చాలా కాలం పడుతుందని మీరు అన్నారు కనుక, ఇలా మొదలెట్టి సాగుదాం.

బైబిలులో యోహావా పేరుతోనూ, తండ్రి అని పిలవబడుతూను చెప్పబడ్డ వ్యక్తి, బైబిలులోని సమాచారం ఆధారంగా ఆపార ప్రేమ, దయకలవాడేనా? వెంకటాద్రి గారన్నట్లు (నేనన్నట్లు) క్రూరకర్ముడా?

బైబిలు దేవుడు తనను తాను అందరి దేవుడనని చెప్పుకున్నాడా? కొందరిని ప్రత్యేకించుకున్నాడా?

ఈ రెండంశాలకు పరిమితమై బైబిలు నుండి ఆధారాలు చూస్తూ వద్దాం తేలిందాన్ని ఇరువురం అంగీకరిద్దాం ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలంటే, దేవుని పేర బైబిలులో ఉన్న మాటలు, చేతలను ఎత్తి చూడాల్సి ఉంటుంది. దీనికి మీరు సిద్దంకండి.

ముఖ్య గమనిక : బైబిలు దేవుణ్ణి నెత్తికెత్తుకున్న మంది నెత్తికెత్తుకున్న వారెవరైనా ఈ అంశాల వరకు నాటి చర్చకు సిద్దపడవచ్చు. అలాగే బైబిలు దేవుడు ప్రేమకలవాడు కాడు. క్రూరుడే అనదలచుకున్న వాళ్ళూ బైబిలు నుండి ఆధారాలు చూపుతూ లేఖలు వ్రాయండి.

బైబిలు దేవుడే సత్యమని తేలితే అంగీకరించాల్సి వస్తుందని భయమా? అన్నారు. ఆ విషయంలో నాకు ఇసుమంత భయంగాని, చింతాకంత చింతగాని లేవు సరికదా! అదే తేలితే అలా తేల్చిన వారికి కొంత గురుదక్షిణ కూడా ఇచ్చుకుని వారి మార్గదర్శకత్వంలో జీవితాన్ని గడుపుతాను. సంతోషంగా! వేరుగా తేలితే విడిచి పెట్టి అలా తేల్చడానికి సాయపడిన వారి వెంట మీరూ, మీ ఓఫిరుగారూ, ఇతర క్రైస్తవ బోధకులూ నడవడానికి సిద్దమా కాదా అన్నదే అస్సలు ప్రశ్న ముందుగా మీ విషయం చెప్పండి.

మరో ముఖ్య విషయం :- రంజిత్‌ ఓఫిర్‌గారి కొన్ని రచనల్ని కక్షుణ్ణంగానే చదివాను నేను యీ చదివాకనే అభిప్రాయం రాయడంలో సరిపెట్టుకోక, వాటిని పూర్తిగా చర్చించాల్సి ఉందని మీకు తెలిపాను. ఆయనతో బేటీ ఏర్పాటు చేస్తానని మీరన్నారు. ఒకటి రెండు అభిప్రాయాలు ప్రకటిస్తున్నాను. ఇతరేతరాంశాలనాపి, వీటి పై స్పందించండి.

ఏ మతానికి ప్రాతినిధ్యం వహించే వాడైనా తన దేవుని ఉనికిని ప్రామాణీకరించడానికి గానీ, సిద్దింపజేయడానికి, నిలబెట్టుకోడానికి గానీ మరో మత గ్రంథాన్ని ఆశ్రయించడం, ఆధారంగా చూపడమంత బుద్ధి తక్కువ పని మరొకటుండదు. అది విధం తెలిసిన వారి ప్రకారం ఆత్మహత్యసదృశం. ఈ విషయంలో ఓఫిర్‌గారి కంటే పి.డి.యస్‌ గారు సేఫ్‌ప్లేస్‌ (భద్రస్థానం)లో ఉన్నారు.

హైందవ క్రైస్తవం అన్న పుస్తకాన్ని రాయడం ఆయనకాయనై ఒక అఘాయిత్యం చేసుకోవడమే. అదాయన అమాయకంగా అయినా చేసుండాలి. మాయకంగానైనా పూనుకునుండాలి. ఏదేమైనా అంతగా ఓఫిర్‌గారు వ్రాసి ప్రచురించి విచారణకు రమ్మంటే గమ్మునుండడం మాత్రం నిజాయితీ లేనితనమో, బాధ్యతారాహిత్యమో, వంచనా వృత్తో అయ్యుండక తప్పదు. ఇంతకూ ఆయన చర్చకు వస్తారో. లేదో మేమింకా ఆయన్నడగలేదు. గనుక తేలని విషయమే నేరుగా భవిష్యత్తులో మీరు పట్టించుకోకుంటే మేమే వారిని పిలుస్తాము.

స్పం :- 7. బాపట్ల నుండి మోషే పి.డి.యస్‌ కు రాసిన లేఖ నకలునాకొకటి పంపారు. దానితో బైబిలు నేనే బాగా తెలిసినవాణ్ణి క్రీస్తుకు ఈయుగపు వారసుణ్ణి బైబిలును తప్పని ఎవరైనా అంటే తొక్కేస్తాను, గక్కేస్తాను ప్రపంచంలో ఎవడికైనా దమ్ముంటే రావచ్చని సవాలు చేస్తున్న పి.డి సుందర్రావుగారూ! అలాగైతే నేను న్నానండీ సత్యాసత్యాలు నిగ్గుతేల్చి సమాజానికి కందించి ఒకింత మేలు చేయాలన్న ఆశయంతో ఉన్నవాణ్ణి, పైగా అది సత్యమని తేల్చినందుకు మీకు ఒక కోటి రూపాయలు బహుమానంగా ఇచ్చి, అలా తేలిన సిద్దాంతాన్ని సమాజానికి ఉచితంగా బోధిస్తాను అన్న సంసిద్ధతనూ తెలియజేస్తూ రండి కలసి తేల్చుకుందాం అని మిమ్మల్ని పిలుస్తున్న సురేంద్రబాబుగారితో మారు మాట్లాడక, కాలయాపన చేయక వేదికపై చర్చించి సత్యాన్ని నిరూపించి, మీరుత్త్త మాటల రకం కాదు చేతల రకం కూడ అని మీ సత్తా ఏమిటో లోకానికి తెలియజేయక కబుర్లతో కాలయాపన చేస్తారేమిటి? పైగా ప్రక్కవారితో, లెక్కకురాని మాటలెందుకండీ మాట్లాడించేది ? సుందర్రావుగారు మీ పోకడ గమనిస్తున్నవారు నవ్వుకుంటారన్న స్పృహ కూడా లేదా ఏమిటి?.....

బైబిలు అనే దైవగ్రంధాన్ని బట్టి పరిపూర్ణులైన వారికే జ్ఞానాన్ని ప్రకటిస్తామంటున్నారే, మరి మీ ప్రసంగాలలో మీ సవాళ్ళ మాటేమిటి? అది సరే! బైబిలు ప్రకారం తెలిసిన వారికే ప్రకటించమని ఎక్కడుంది? అలా బైబిలులో ఎక్కడుందో చూపించగలరా? ఒకవేళ అలా ఉన్నా అది బైబిల్‌ తప్పు చెప్పినట్లు కాదా? తెలిసిన వారికే చెప్పమన్నట్లైతే బైబిల్‌ ఎందుకు వ్రాసినట్టు? మీ ప్రకారమే అయితే బైబిలు తప్పని మీరే చెప్పినట్లు కాదా? క్రీస్తుకు ఈ యుగపు వారసుణ్ణి అన్నారు కదా! మరి క్రీస్తు ఇలా చేయలేదే పరిశయ్యలు, సద్దూకయ్యలు, ప్రధాన యాజకులతో చర్చించాడు. వారడిగిన వాటిని సావధానంగా సమాధానం చెప్పాడు. మరిక్రీస్తు దృష్టిలో వారు పరిపూర్ణులా? అపరిపూర్ణులా? మీరు ఆయన వారసులన్నది నిజమైతే ఆయనలాగే చర్చలో పాల్గొని చర్చించేందుకు, అడిగిన వాటికి సావధానంగా సమాధానాలు చెప్పేందుకు సిద్దంకండి. లేదంటే క్రీస్తే చెప్పినట్లు అబద్దపు ప్రవక్తలు, దొంగక్రీస్తులు వస్తారు జాగ్రత్త సుమా అని హెచ్చరించిన దానికి రుజువు మీరే నేమో అన్న నిర్ణయానికి రావలసి ఉంటుంది.

ఇంతకూ మీరెందుకు భయపడుతున్నట్లు? బైబిలు తప్పనా? లేక, ఒప్పని నిరూపించగల సత్తా మీకు లేదనా? వాడు చాలడు వీడు చాలడు లాటి చచ్చుమాట లెందుకండీ, పట్టి చూసినప్పుడు కదా ఎవరిసత్తా ఏమిటో తెలిసేది. ఒక్క మాట! మీ దేవుడు, అన్నమాటకు కట్టుబడని వారిని నేరస్తులుగ పరిగణించి శిక్షించడా? అలాటి నమ్మకం మీకు లేదా? ఆయనంటే భయమూ, భక్తి మీ కుంటే నిరూపించడానికి సిద్దం కండి.

ప్ర. స్పం :- 7. మోషేగారికి, మీ లేఖ పై పి.డియస్‌ గారెలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నేను గమనించిన దాన్ని బట్టి గానీ, నాలాగే ఆయనను గమనిస్తూవస్తున్న ఇతరులను బట్టిగానీ, గదిలో కూర్చునో, వందిమాగదుల రక్షణ వలయంలో కూర్చునో ఊరకే బీరాలు పలకడం రంకెలు వేయడం తప్ప ఆయన చేస్తున్నదీ, చేయగలిగిందీ కూడా ఏమీ లేదు. ఆయన్ను గుంజీ లాక్కొచ్చీ వేదిక మీద బలవంతంగా కూర్చోబెడితే గాని సిద్దపడేట్లు కనిపించడంలా పరిస్థితి. పి.డి.సుందర్రావుగారూ ఆయన సంస్థా వ్యూహత్మకంగా ప్రాపగాండా కొరకు చేస్తున్న పనే ఇదంతా అనిపిస్తోందోకప్రక్క. ఇంత జరుగుతున్నా ఏందన్నా ఇదంతా, వినలేక చస్తున్నాం, తలెత్తుకో లేక ఇదైపోతున్నాం. ఈ ఒక్కసారికి పోటీకి సిద్దపడవే అనడిగేవాడు ఆయన గుంపు మొత్తంలో ఒక్కడంటే ఒక్కడూ కనపడడంలా. ఆయనకెలాగూ పట్టింపు ల్లేవు. నలుగురు నవ్విన నాకేమి అన్నదగ్గరే ఉన్నాడాయన ఆది నుండీ ఆయనంతటాయనెలాగూ రాడు. ఆయన్ని పట్టుకురావడమెలాగన్నదే నా ముందున్న ప్రశ్న. నా వరకు నేను ఒక క్రమంలో యత్నిస్తున్నాను. మనం పట్టుకొచ్చి నిలబెట్టగలమో, ఆయన దొరక్కుండా తప్పించుకోగలడో కాలమే తేల్చుతుంది. నేను ఈ శీర్షిక క్రింద వ్రాస్తున్న విషయాలపై స్పందిస్తూ ఉండండి. పత్రికకు వ్రాసే లేఖల నకళ్ళను బైబిలు పక్షంలో ఎవరిని ఉద్దేశిస్తే వారికే పంపుతుండండి.

స్పం :- 8. : మీ వివేకపథం 190వ సంచిక మాసపత్రిక చదివాను. అందులో పి.డి సుందర్రావుగారి విషయం వ్రాస్తూ అనాలనుకుంటే అనిల్‌ను అనక, అనిల్‌ను అనుసరించే అభిమానుల అమ్మా, అబ్బా ఏం చేశార్రా? అన్నారు.

పి.డి సుందర్రావుగారి బహిరంగ సభలో అనిల్‌ మనుష్యులు వచ్చి గొడవ చేశారు. కావున పి.డి సుందర్రావుగారు వారినుద్దేశించి వారికి రోషము వచ్చి, అనిల్‌ను తీసుకొని వస్తారని వారికి రోషము తెప్పించుటకు ''మీరు ఒక అబ్బకు, అమ్మకు పుట్టుంటే'' అనే మాట ప్రయోగించారు. ఎవరైనా పుట్టేది ఒక అబ్బకు, అమ్మకు అనే విషయం అందరికి తెలుసు పి.డి సుందర్రావుగారికి తెలియకపోవటం ఏమిటి? మీరు చెప్పటం ఏమిటి?

మీరు ఒక అబ్బకి, అమ్మకి పుట్టుంటే అంటే ఇక్కడ దీని అర్థం మీరనుకునే మీ తండ్రికి, మీతల్లికి పుట్టుంటే అని అర్థం. విపరీతార్థాలు గుంజితే ఎలా? మీరు నన్ను తండ్రి అని మీ మాసపత్రికలో వ్రాశారు. అంతమాత్రానా నేను నీకు తండ్రిని కాదు, నీవు నాకు కొడుకువు కాదు. కావున అక్షరార్థము తీసుకొనకూడదు. దాని భావము గ్రహించాలి.

స్టీఫెన్‌ హాకిన్స్‌ తల్లిదండ్రుల గొడవెందుకెత్తావురా! అనివ్రాశారు. స్టీఫెన్‌ హాకిన్స్‌ తల్లిదండ్రులు అతడిని సరియైన క్రమశిక్షణలో పెట్టలేదు కనుక వారి ప్రస్తావన వచ్చిందని గ్రహించాలి.

ఇకపోతే నేను మీతో మాట్లాడినప్పుడు (దాదాపు 8 నెలల క్రితం) ''మొగతనముంటే'' అనే మాట మాట్లాడలేదు. అది మీరు కల్పించి వ్రాసిన మాట మాత్రమే దానిని ఆసరాగా తీసుకొని జగన్మోహన్‌గారు ''మగతనముంటే లాంటి లేని భాష ఉపయోగించాడు''. జగద్గురు అని వ్రాయుట విచారకరం. జగన్మోహన్‌ గారికి పత్రికా ముఖంగా తెలియజేయడమేమనగా మీరు 190వ సంచికలో ఈ విధంగా అన్నారు.'' పి.డి సుందర్రావు గార్ని చర్చలోకి తీసుకొచ్చే బాధ్యతను నిలబెట్టుకోవడం''.

నేను పి.డి సుందర్రావుగారిని చర్చలోకి తీసుకొని వస్తానని ఏనాడు సురేంద్రబాబుగారితో అనలేదు. సురేంద్రబాబు గారు కూడా పి.డి సుందర్రావుగారిని చర్చలోకి తీసుకొని రావలసిన బాధ్యత నీది అని నాతో ఫోన్‌లో చెప్పినప్పుడు, నేను పి.డి సుందర్రావుగారిని చర్చలోకి తీసుకొని వస్తానని అనలేదు. మీ సత్యాన్వేషణ మండలి తరఫున పి.డి సుందర్రావుగారికి సవాలు చేయమని ఆనాడే సురేంద్రబాబు గారికి ఫోన్‌లో చెప్పాను

సురేంద్రబాబుగారికి తెలియజేయడమేమనగా, మీరు 190వ సంచిక 16వ పేజిలో యిలా వ్రాశారు.

''నీవెందరికి ఉత్తరాలు వ్రాశావన్న దానికి ఏమీ విలువ లేదయ్యా! నీవెందరితో యుద్ధం చేశావు (సిద్దాంతచర్చ చేశావు) అన్నదే'' పి.డి సుందర్రావుగారు అనేక ప్రముఖులకు సవాలు ఉత్తరాలు వ్రాశాడు (రావిపూడి వెంకటాద్రి, ఎన్‌.వి. బ్రహ్మం, డా|| వేదవ్యాస్‌ మొదలగువారు) వారిలో ఎవ్వరూ సిద్దాంత చర్చకు రాలేదు. ఇకరాని వానితో యుద్ధం చేయడమేమిటి? ఆలోచించండి.

పి.డి సుందర్రావుగారు బహిరంగ సభలలోను, మా టివిలోను, టి.వి-5లోను, టి.వి.9లోను, జయశాలి టి.విలోను (ఇది ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళేది) సవాలు చేస్తుంటే, మీరు 24 పేజీల వివేకపథం మాస పత్రికలో సవాలు చేయుటను బట్టి చూస్తే మీ పత్రికకు విలువలేదని, మీ పత్రిక సముద్రంలో కాకిరెట్టలాంటిదని, ఉడుత ఊపులకు మ్రాను కదులునా! అని పాఠకులు గ్రహించగలరు కదా! ఈ నా లెటర్‌ 191వ సంచికలో తప్పక ప్రచురించగలరు. ఇట్లు : ఎ. జగద్గురు, కర్నూలు

ప్ర. స్పం :- 8. మిత్రులు జగద్గురుగారికి, భాష, సంభాషణల్లో సభ్యతా సంస్కారాలు లేకుంటే పరిస్థితి అసాధారణ స్థాయిలో ఆవేశానికి లోనైనప్పుడో కావాలనుకుని, ఒక ప్రయోజనాన్నాశించి మాట్లాడినప్పుడో, అసలా వ్యక్తి స్వభావతఃనే సంస్కారహీనుడు, మొరటుమనిషి అయ్యున్నప్పుడో మాత్రమే ఏర్పడుతుంది. పి.డి సుందర్రావుగారిని జాగ్రత్తగా పట్టి చూస్తే, అతడలామాట్లాడడానికి కారణం, ఆయన పైన చెప్పిన మూడో రకానికి చెందిన వాడైయ్యుండడమేననిపిస్తోంది.

సభలో ఎవరో ఏదో గొడవ చేస్తే, వాళ్ళను ఒక అబ్బా అమ్మకు పుట్టారటరా మీరు అని అనేస్తారన్నమాట. గొడవనాపే యత్నాలు చేస్తే చేయొచ్చుగానీ, ఈ బూతులు తిట్టే పనెందుకండీ జగద్గురుగారు. పైగా ఎవరైనా ఒక అమ్మ ఒక అబ్బకు గాక మరో రకంగా ఎలా పుడతారు? ఈ విషయం తెలియకుండనే మాట్లాడావా సుందర్రావుగారా మాట! తెలిసే మాట్లాడారు అంటూ సాగదీసుడొకటా!

అంతటితో ఆగక, ఆయా పెద్దాయన మాటలకర్థం, మీరనుకునే మీ తండ్రికి మీ తల్లికే పుట్టుంటే అని వివరణొకటి! నేనూ ఆ అర్థాన్ని బట్టే అంతటి తప్పుడు కూత కూశావేంటిరా అన్నది. మీరిచ్చిన అర్థం దేనిని తెలుపుతోందో తెలుసా? వాళ్ళ తల్లి వ్యభిచారిణి అన్న అర్థాన్నిస్తుందది. అదే అర్థాన్నిచ్చే ముతక మాట వాడితే 'లంజకొడుకువుకాకుంటే' అన్నట్లన్నమాట. అనే ముందు కొద్దిగనైనా వెనక ముందు లాలోచించుకోవద్దా?. బజారుమనిషిలా మాట్లాడితే తప్పులేదుగాని, ఏమిటలా బజారు మనిషిలా మాట్లాడావు అంటే తప్పైందా! మీరన్న అర్థాన్ని అంగీకరించే ఆ మాట చాలా తప్పు మాట అన్నది నేను. ఇక విపరీతార్థం గుంజిందెక్కడ?

ఇక స్టీఫెన్‌ హాకిన్స్‌ గురించి అతని తల్లిదండ్రులు అతన్నెలా పెంచితే మీ పెద్దాయన కేమిటంట? వాళ్ళే పేర్లు పెట్టుకుంటే ఈయనకేమిటంటా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెంచుకుంటారు. ''మతస్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నాం. ఒళ్ళు, నోరు దగ్గరెట్టుకుని మాట్లాడండని ఇతరులకు సుద్దులు చెప్పే మీ పి.డి.ఎస్‌గారి బుద్దికేమైంది? గడ్డేమైన కరిచిందా? స్టీఫెన్‌ హాకిన్స్‌ని ప్రపంచ వైజ్ఞానిక లోకం మేధావిగా, విజ్ఞానిగా గుర్తిస్తున్నది అతని పేరును బట్టో, తల్లితండ్రులను బట్టో, వారి పెంపకమూ ఈయన అలవాట్లను బట్టో కాదు గదా! వైజ్ఞానికరంగంలో అతడు చేసిన కృషిని గుర్తించి ఆ పని చేస్తోంది. మన అనుభవంలో ఉన్న ప్రకృతి, దాని స్థితి గతి అలా ఉండడానికి దానిలోని అంతర్గత కారణాలు చాలు, దేవునితో పనిలేదు అన్నంత మాత్రాన, అసభ్యంగా అతణ్ణి, అతని తల్లిదండ్రుల్ని తిట్టేస్తాడా ఈయన. ప్రభుత్వానికి గనక వివేకము, న్యాయనిబద్ధత ఉండుంటే, అలాంటి మాట అన్నందుకు ఈయన్ని బొక్కలో పెట్టి బొక్కవిరగేయ్యాలి. ఏం చేస్తాం రాజ్యం పరిస్థితి అలా వుంది. విజ్ఞాన శాస్త్రాలను, వైజ్ఞానికుల్ని ఈ బైబిలు జ్ఞాని ఎడాపెడా తిడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకోడాన్నేమనుకోవాలి.

ఇక 'మొగతనముంటే' అన్నమాట మీరనలేదని ఇప్పుడంటున్నారు. అన్నారని నేనన్నాను. దానికిప్పుడు ఎవరిది నిజమో నిర్థారించే ఆధారం లేదు మన ఇద్దరివద్దా. కనుక ఆ విషయమై అనవసరపు సంభాషణ చేయవద్దు. ఇక సుందర్రావుగారిని చర్చకు సిద్ధంచేసే బాధ్యత నుండి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు. వల్లగాక ఎగగొట్టడమో, కాడి క్రింద పడవేయడమోనే చేయగలరు. అంతో ఇంతో నైతిక బాధ్యత ఉందనుకునే కదా, సుందర్రావుగారికి లేఖ వ్రాశారు. ఆయన దానిని అవతల పారేశారు. మీరు ఫోను చేస్తే స్పందించలేదు. మీ మాటకు వీసమెత్తూ విలువివ్వడం లేదని గమనించాకనే, ఏమీ పాలుబోక, ఒకవంక మీకు మీకే చిన్నతన మనిపిస్తున్నా, ఇకనేనాయన్నడగను, మీరే యత్నించండి అని నాతోనే అని వున్నారు. నన్నింతగా వత్తిడి చేసి ముగ్గులోకిదించిన మీకు, నాచేత ఇంత కాలాన్ని, వ్యయప్రయాసలను ఖర్చు చేయిస్తున్న మీకు ఆయన్ను వత్తిడి చేయాల్సిన నైతిక బాధ్యత ఉందో లేదో మీ అంతరాత్మనడిగి చూడండి.

నేను చెపుతున్నదీ అదే కదా! ఒక ఉత్తరముక్కరాసిపారేసి, వాళ్ళు రాకుంటేనో, సమాధానం చెప్పుకుంటేనో నిజాయితీగానీ, విధం తెలిసిన తనంగానీ ఉంటే యుద్ధం జరగలేదనాలిగాని ఓడిపోయారని, చిత్తు చిత్తుగా ఓడించేశాననీ ప్రకటించడం, ప్రచారం చేసుకోడం ఏమిటండీ! విడ్డూరంకాకుంటే! అలా గొప్పలు (సొంత డబ్బా) కొట్టుకోడాన్ని చూసి మీలాంటివాళ్ళు సిగ్గుపడాలి. లేదా ఆయన్ను అంతగా సొంతసుత్తి కొట్టుకోకుండా ఆపనన్నాఆపాలి. రెంటినీ విడిచి యుద్ధానికి రాకుంటే ఏమి చేస్తాం అంటూ ఈ ముక్తాయింపేమిటి?

మీరో, ఆయనో, మరోకాయనో వారి వారి కిష్టం వచ్చిన దగ్గర నోటి తీట తీరేలా ఏదేదో వాగేస్తుంటే, అవతలివారు పరిగెత్తుకుని వచ్చేయాలన్నమాట యుద్ధానికి. ఇంగితం సరిగా పని చేస్తున్నవాడెవడూ ఆ మాటనలేడు.

ఆయన అనేక టి.విల ద్వారా, సొంత ఛానల్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా సవాలు చేస్తుంటే, మీరు 24 పేజీల వివేకపథం పత్రికలో సవాలు చేయడం చూస్తుంటే, మీ పత్రికకు విలువ లేదని, అది సముద్రంలో కాకిరెట్టలాంటిదనే లాటి సంధి ప్రేలాపనలు ఎందుకు చేస్తున్నారు. నావెంటపడి మరీ, దమ్ముంటే నీపత్రికలో ప్రకటించు అని యాగీ చేసింది. మీరేకదా! అది సరే ఆయనను సవాలు చేయడానికి టెలిఛానళ్ళు, నెట్‌లు, వెబ్‌లు ఎందుకండి సుందర్రావుగారూ? ఎవరైనా ఉన్నారా పోటీకి వచ్చేవాళ్ళు అన్న ప్రకటనకర్తకు ప్రకటన విస్తారంగా చేయాల్సిన అవసరం ఉందేమోగాని, నేనున్నాను అని తెలియజేయడానికి టి.వి ఛానళ్ళు, నెట్‌లు ఎందుకండీ, నేను పి.డిసుందర్రావును ఛాలెంజ్‌ చేశాను అని నలుగురికి తెలపాలన్న దుగ్ద ఉన్నోడు కావాలనుకున్న మేర తన ప్రచారం తాను చేసుకుంటాడు. నావైపు నుండి నిజానికి ఒక్కలేఖ రాస్తే చాలు ''నేను మీ సవాలును స్వీకరిస్తున్నా''నని ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా ఆయన పోటికి సిద్ధపడిపోవాలి.

మీ పి.డి అందుకు సిద్దం కాకపోగా, నాతో పోటీ ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు మాట్లాడడానికి యత్నం చేయకపోగా, మళ్ళా తనదైన పాతబాణీలోనే వందిమాగదుల (సొంత మూక, సొంతమైకు కూర్చుకుని, అవాకులు చవాకులు పేలుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. మీ ఉడత ఊపుల సామెతేమిటి తండ్రీ! ఉడత ఊపో, హనుమంతునితోపో తేలిసేది రంగంలోకి దిగి ఒక తోపైనా తోశాక కదా!

సజావుగా సిద్దాంత బలాబలాలు పరిశీలించి చూసుకుందాం రండి అన్న వానితో, అలాగేరావయ్యా పరిశీలించుకుందాం అని సౌమనస్యంగానే ఆవిచారణ చేయవలసిందిపోయి, 25 ఏండ్లుగా ఒక్కడంటే ఒక్కనితోనూ చర్చను సాగించకుండానే జబ్బలు, తొడలు చరుచుకుంటూ, రంకెలు వేస్తుండే వాడిని ఏమనాలి?

ఒక ప్రసంగంలో మగాడెవడైనా ఉంటే రండిరా! అనంటాడు, మరో ప్రసంగంలో వాడైతే చాలడు, వీడైతే చాలడు వెంకటాద్రే కావాలి అనంటాడు. ఇంకోదాంటో నీవు అన్వేషివి. నేను సత్యసంపూర్నుణ్ణి నీతో నాకు సవాలెంటిరా అనంటాడు, మరో ప్రసంగంలో అక్కడున్న సదస్సులనుద్దేశించే నాస్థికుడెవడైనా ఇక్కడుంటే లేచి నిలబడండిరా పోటీకి అనంటాడు, ఇంకో వేదికలో ఇండియావాడు నాకు చాలడు, ఇంటర్నేషనల్‌ ఫిగరైయుండాలంటాడు. చేతులుదురద పుడుతున్నాయంటాడు, స్వైరవిహారం చేస్తున్ననంటాడు. ఇలా ఎడాపెడా చెడా వాగుతుండేవాణ్ణి ఏమనాలో తలకు తట్టడం లేదా జగద్గురుగారూ!

| దేనికదే చెప్పుకోవాలి. బైబిలు పేరిట, క్రీస్తు పేరిటా వ్యాపారాలు చేసుకుంటుండే దొంగతొత్తు కొడుకుల్ని ఎడాపెడా వాయించడం వరకు మా జాతివాడే ఆయన. ఆపని వరకు నాకంటే పెద్ద ఎత్తున చేస్తున్నవాడుకూడా.

| నాబైబిలు నాగొడవ అంటూ ఇతర గ్రంథాల జోలికిపోకుండడం, ఆ గ్రంథాలలో క్రీస్తునో, యోహొవానో వెతుకులాడే పని చేయకుండడం, అలాంటి పని చేస్తున్న వాళ్ళను తప్పురా ఆ పని బుద్ధి హీనుల్లారా అని ఈసడించడం అన్నవీ నా లెఖ్ఖన చక్కనైన పనులే.

| బైబిల్‌ నిండా సూచన క్రియల వివరాలున్నాయి. ముఖ్యంగా క్రీస్తు, ఆయన తరువాతి సువార్తకులు ఎన్నో సూచన క్రియలు (అసాధారణ క్రియలు) చేసిన దాఖలాలున్నై ఆ విషయాన్నలా ఉంచి, ఈనాడు వరం పొందమంటున్న వాళ్ళంతా అట్టి వాళ్ళు కానేకాదు. ఆ రకమంతా దొంగమందే, అబద్ధపు క్రీస్తు ప్రతినిధులేనంటూ, ఒక నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెపుతూ, ఇప్పుడు స్వస్థత వరాలు లేవు అంటున్న విషయంలోనూ మీ సుందర్రావుగారు మా గుంపుమనిషే.

| ఈ విషయంలో రంజిత్‌ ఓఫెర్‌గారు భ్రాంతుడైనా అయ్యుండాలి, అబద్దీకుడైనా అయ్యుండాలి. ఏసుతో నిత్యం 20 ఏండ్లుగా మాట్లాడుతున్నానన్న ఆయన మాట సంధి ప్రేలాపనలాటిదో, మోసపూరితమైనదో మాత్రమే. ఈ విషయం వరకు బైబిలాధారంగా చూస్తే క్రీస్తు ఎవరితోనూ (రెండో రాకడకు పూర్వం) మాట్లాడేఅవకాశం లేదు. ఇంత చిన్న విషయాన్ని, అర్థం చేసుకోడానికి కష్టమేమీ లేని విషయాన్ని ఎలా వింటున్నారో ఆయన వెంట పోయేగుంపు నాకైతే అర్థం కావడంలా. విశ్వాసం గుడ్డిదనీ, విచక్షణను కోల్పోయి ఉంటుందనీ అనగల మంతే.

ఫజులుర్‌ రహ్మన్‌ గారికి గుర్తు కోసం :

మిత్రులు రహ్మన్‌ గారికి ఏమైంది సి.టి.ఎఫ్‌ ప్రకాష్‌ గారితో మీరు మాట్లాడతానన్న విషయం? మీరు చేసిన ప్రయత్నము, అందుకు ఆయన ఏమన్నది కూడా పత్రికకు వ్రాయండి. ప్రకాష్‌, నా అంచనాలకు వేరుగా, మీరాశించినట్లు తన బైబిలు సృష్టివాదాన్ని వ్రాత మూలకంగా మనమిరుపురం కలసి గతంలో నిర్వహించిన వేదికకు ఇవ్వగలిగితే అదే వేదికను మరల ఏర్పాటు చేద్దాము. ఆ వేదికల్లో పాల్గొన్న పక్షాలకూ కబురందించి వేదికలో తిరిగి పాల్గొనమని ఆహ్వానిద్దాము. ఈ విషయంలో మండలి తన దైన సొంత విధానంలో కాక, ఆ వేదిక స్వభావానికి తగినట్లుగా మాత్రమే ప్రవర్తించగలదు.

No comments:

Post a Comment