సంపాదకీయం :
జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, వారి తీర్పులను హేళనచేస్తూ, నిందిస్తూ బహిరంగ సమావేశంలో మాట్లాడిందే గాకుండా ఈ విషయం దేశమంతటికీ తెలియాలి, జాగ్రత్తగా రికార్డు చేయండని తన అనుచరులకు సూచించాడు పి.డి.
1. డా|| బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ : ''రాజ్యాంగం కంటే రాజ్యాంగ విధేయత ముఖ్యమైనది'' అన్నాడు.
2. రాజ్యాంగంలోని 51/ఎ అధికరణం ద్వారా మనం, పౌరుల ప్రాథమిక విధుల్ని నిర్దేశించుకున్నాం. అందులో మొదటిది, రాజ్యాంగమునకు బద్దుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట అన్నదై ఉంది.
ఎ) పి.డి.సుందర్రావు రాజ్యాంగం పట్ల అవిధేయత కనపరిచాడు.
బి) జాతీయ పతాకాన్ని గురించి అత్యంత హేళనగా మాట్లాడాడు.
సి) రాజ్యాంగ నిర్మాతలను కాపీరాయుళ్ళు, సొంత తలలేనివాళ్ళంటూ నిందించాడు.
డి) జాతీయ జెండాలన్నీ తన సంస్థ వాకిటిముందు వంగాలన్నాడు.
ఇ) సుప్రీంకోర్టును, వాటి తీర్పులను, న్యాయమూర్తులను నిందిస్తూ మాట్లాడాడు.
వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పనికివచ్చే చట్టాలు ఇవిగో...
1. ఐపిసి (ఇండియన్ పీనల్ కోడ్)153/బి : జాతీయ సమైక్యతకు భంగము కలిగించు నిందారోపణలు
గమనిక : దీని క్రిందికి వచ్చు నేరము బెయిలు ఇచ్చుటకు వీలు లేనిది. మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష, మరియు జరిమానా కూడా విధింపతగినది. అదే మరి ఇలాంటి నేరము మత సంబంధ సమావేశ స్థలములలో గాని చేసినట్లయితే అప్పుడు శిక్షను 5 సం||ల వరకువిధించవచ్చు.
పి.డి.సుందర్రావు పై అనుచిత వ్యాఖ్యలు క్రైస్తవమత ప్రచార సమావేశంలోనే చేసిఉన్నాడు.
2. క్రిమినల్ ప్రొసీజర్, మైనర్ యాక్టులోని, ''ద ప్రెవెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్ టు నేషనల్ హానర్ యాక్టు'' 1971/2 క్రింద శిక్షించవచ్చు.
3. మరో రకంగా చూస్తే దీనిని దేశద్రోహ నేరంగాను పరిగణించవచ్చు.
దీనిపై ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా
ఎ) కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశాను. దానిపై ఎఫ్.ఐ.ఆర్ తయారు చేయడమూ జరిగింది.
బి) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి దీనినో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా - సుమోటోగా స్వీకరించి న్యాయవిచారణ జరిపించాల్సిందిగా విజ్ఞాపన పత్రం పంపాను. సుమోటోగా స్వీకరించడానికి అవసరమైన సమాచారాన్ని సి.డి.రూపంలోనూ అందజేశాను.
వివేకపథం పాఠక మిత్రులారా !
సమాజం చచ్చుబడిపోయి వుంది. జాతి మొత్తం గౌరవించాల్సిన విషయాలను గూర్చి ఒక వ్యక్తి అనుచితంగా, అవహేళనగా, బహిరంగంగా మాట్లాడినా, ఆ విషయం జెమిని న్యూస్ టి.వి. ద్వారా దేశ వ్యాపితంగా ప్రసారం చేయబడ్డా, ఎవరికీ చీమకుట్టినంతయినా బాధకలక్కపోవడాన్ని ఏమనుకోవాలి? నిజానికి జాతి గౌరవానికి ప్రతీకలైన వాటిపై ఈగవాలినా సహించనే కూడదు. ఇప్పటికైనా మేలుకొని మత్తు వదుల్చుకుని, పి.డి.సుందర్రావు లాటి చీడను, పీడను వదిలించుకొనేందుకు గట్టిగా యత్నించాలి. ఇకముందెవ్వరూ అలా నోరుజారకుండేలా ఇతగానిని శిక్షింపజేయాలి. కనుక వందలాదిగా విజ్ఞాపనలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపాలి. న్యాయస్థానాల ద్వారా పోరాడి అతణ్ణి కఠినంగా శిక్షింపచేయాలి. వెంటనే పూనుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆన్‌లైన్ ద్వారా, లేఖల ద్వారా విజ్ఞాపనలు చేయండి. వాటి నకలును వివేకపథం అడ్రస్‌కు పంపండి. బాధ్యతగల భారత పౌరులుగా ప్రవర్తించండి.
- సత్యాన్వేషణలో
మీ సురేంద్ర.

No comments:
Post a Comment