యోచనాశీలురౖౖెన పాఠక మరియు హేతువాద మిత్రులారా! ఒక సం|| పాటు ప్రతినెలా రెండు రోజులు హేతువాద సిద్దాంతంతో ముడిపడి ఉన్న భావజాలాన్ని, అందుకవసరమైన పదజాలాన్ని గురించి లోతుగా విచారించి అవగాహన చేసుకునే పనిచేద్దాం అని నిర్ణయించుకున్న ప్రకారం, అందుకు సిద్దపడిన 10, 12 మందిమి జూలై 13, 14 తేదీలలో విజయవాడలో కలిశాం. వివేకపథం 198లో ఎత్తిరాసిన అభిప్రాయాలలో 15, 20 అంశాలపైనా, 200 సంచికలో వ్రాసిన పదాల వివరణపైనా విశ్లేషణాత్మకంగా విచారణ సాగించాము. బృందచర్చలో పాల్గొన్నవాళ్ళంతా ఒక్క విషయాన్ని మాత్రం ఏకోన్ముఖంగా అంగీకరించారు. ఈ విచారణ పద్ధతి అద్భుతంగా వుంది. అవగాహనలో స్పష్టత రావడానికి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. లోగడే ఈ విచారణ విధానాన్ని ఎరిగివున్న వారు కాక క్రొత్తగా చర్చలో పాల్గొన్న వారు మాత్రం మేమెప్పుడూ చూడలేదీపద్ధతి విచారణ అంటూ ఆశ్చర్యాన్నీ, ఆనందాన్ని కూడా వెలిబుచ్చారు.
సమావేశానికి 1) చార్వాక వెంకటేశ్వర్లు 2) త్రివేది 3) డా. రవీంద్ర 4) కె. సత్యనారాయణ 5) కెమెరా విజయకుమార్ 6) మాధవి 7) మోషే 8) పి. సత్యన్నారాయణ 9. విజయమ్మ 10) ఝాన్సీ 11) భగత్‌సింగ్ 12) కె. ప్రసాద్ 13) సురేంద్ర 14) రాజేంద్ర ప్రసాద్ గార్లు హాజరయ్యారు.
ఆగష్టులో జరగనున్న సమావేశానికి ఎవరికి వారు సొంతంగా 198 సంచికలోని ప్రతిపాదనల బాగోగులనూ, పారిభాషిక పదాల అర్థాలను వ్రాసుకుని రావలసి ఉంటుందనీ తీర్మానించుకున్నాం.
ఒక ప్రతిపాదన రూపమైన వాక్యాన్ని చదివాక, అందులో ప్రతిపదమూ అర్థమైందో లేదో చూసుకోవాలనీ వాక్యం అర్థమైందో లేదోనూ గమనించాలనీ, అటు పిమ్మట ఆ వాక్యం ద్వారా రచయిత ప్రకటించిన అభిప్రాయం సరిగా ఉందో లేదోనూ పరీక్షించి నిర్థారించుకోవాలని నిర్ణయానికి వచ్చారందరూ.
ష సిద్దాంతాన్ని లేదా ప్రకటితాభిప్రాయాన్ని పరీక్షించే పద్ధతంటూ - 'లక్షణ పరీక్ష'- అన్న దానిని గురించి వివరించి, దానినెలా వినియోగించాలో కొంత అభ్యాసం చేయించాను.
సూత్రం :- ప్రకటితాభిప్రాయానికి మూడు రకాల దోషాలుండకూడదు. అతివ్యాప్తి, అవ్యాప్తి , అసంభవ దోషాలంటారు వాటిని, వాటిలో ఏ ఒక్క దోషమున్నా ఆ ప్రతిపాదన సవరించుకోవలసిందిగానే ఉందన్నట్లు. మూడు దోషాలను చూడడమెలానో ఒక ఉదాహరణ ద్వారా గమనిద్దాం.
ఉదా :- 'ఆధార సహితాలోచననే హేతుబద్దాలోచన అంటారు. అన్నది ఒక ప్రతిపాదన అనుకుందాం.
1) ఏ ఆలోచనైనా ఆధారసహితంగానే ఉంటుంది కనుక, హేతుబద్దాలోచన కూడా ఆధారసహితాలోచనే అవుతుంది కనుక పై ప్రతిపాదనకు అసంభవ దోషం లేదంటాము.
2) అయితే, ప్రతి ఆలోచనా ఏదో ఆధారంతోనే ఉంటుంది గనుక, అహేతుకాలోచన కూడా ఆధారసహితాలోచనే అవుతుంది కదా! కనుక పై ప్రతిపాదన సహేతుకాలోచనల గాక, అహేతుకాలోచనలకున్నూ అన్వయిస్తున్నది (సరిపోతున్నది). కాబట్టి ఆ ప్రతిపాదనకు అతివ్యాప్తి దోషం ఉందంటాము. ప్రకటితాభిప్రాయం చూపాలనుకొన్న వాటినే కాక ఇతరాన్ని కూడా చూపుతుంటే దానికి అతివ్యాప్తి దోషం ఉందంటాం.
3) ప్రతిపాదన హేతుబద్దాలోచనలన్నింటినీ చూపుతోంది కనుక దానికి అవ్యాప్తి దోషం లేదంటాము. కనుక ప్రతిపాదనకు అతివ్యాప్తి దోషం లేకుండేందుకు వీలుగా దానిని సవరించాల్సి ఉంటుంది. ఎలాగంటే, ఎట్టి ఆధారము ఆలోచన ద్వారా సరైన నిర్ణయాలకు చేర్చగలదో అట్టి ఆధారాన్నే హేతువంటారు. అటి యోగ్యమైన ఆధారంతో కూడిన ఆలోచననే హేతుబద్దాలోచన అంటారు. అని గనక ప్రతిపాదన ఉంటే అది అ హేతుకాలోచనలను విడగొట్టి సహేతుకాలోచనలను మాత్రమే చూపగలుగుతుంటే ప్రతిపాదన ఇలా ఉండాలి. 'యోగ్యమైన ఆధారంతో కూడి ఉన్న ఆలోచననే హేతుబద్దాలోచన' అంటారు.
ముఖ్యగమనిక :- సిద్దాంత గ్రంథాలను అధ్యయనం చేయడానికి పూనుకున్నప్పుడు మొట్టమొదటగా చేయాల్సింది, ఆ సిద్దాంత కారుడు ఏయే విషయాలపై ఏయే అభిప్రాయాలను ప్రకటించాడో విడివిడిగా వేరు చేసి చూడడం. ఆ పని చేయనంతకాలం సైద్దాంతిక పరిశీలనే ఆరంభం కానట్లు. ఒక రచనలో ఎన్ని అభిప్రాయప్రకటనలున్నాయో గమనించడం దగ్గరనుండే దానిని అర్ధం చేసుకోవడంగానీ, విచారించడంగాని మొదలెట్టాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆదిలోనే దారి తప్పినట్లు.
ఇక విషయానికి రండి. వివేకపథం 198లో వెంకటాద్రి, గుమ్మావీరన్న గార్లూ మరికొందరూ హేతువాదంపై వెలిబుచ్చిన భావాలను, వాక్యాల రూపంలో విడగొట్టి మీ ముందుంచాను, ఇక అందులోనే నా భావాలనూ కొన్నింటిని ప్రకటించాను. ఇక సంచిక 200లు ద్వారా పారిభాషిక శబ్దాలకునేనంగీకరించే అర్థాలుగా వాక్యాలరూపంలో కొన్ని ప్రతిపాదనలు చేశాను. ప్రకటితాభిప్రాయాలను ఎలా పరిశీలించాలోనూ ఈ సంచికలో ప్రస్తావించాను. ఇక ఇప్పుడు మీరంతా చేయవలసింది, మావిగా ప్రకటించిన ఆ అభిప్రాయాల దోషాదోషాలను విచారించడం, ఆ అంశాలలో మీరుగాని మాతో విభేదిస్తుంటే, మీ భావాలనూ స్పందన ద్వారా వివేకపథానికి అందించండి. కనుక మనస్సు పెట్టి ఈ విచారణ కార్యక్రమంలో మీరూ భాగస్వాములుకండి.
మరికొన్ని ముఖ్యమైన పదాలకు నేను అంగీకరిస్తున్న అర్థాలు
1. దృక్పథము :- దృష్టికోణము, చూసేచూపు అన్న అర్థాన్నిచ్చే పదమిది
వ్యక్తి తనకు కలిగిన జ్ఞానం ఆధారంగాగాని, సమాజం నుండి సంక్రమించిన భావనల ఆధారంగాగానీ ఆయా విషయాలను పట్టించుకునే, వాటిని స్వీకరించే, విషయంలో తనదైన మానసికవైఖరిని కలిగి ఉంటాడు. ఏర్పరచుకున్న, అందిన విలువలూ ఆ మానసిక వైఖరి రూపొందడానికి కారకాలు, ప్రేరకాలు కావచ్చు.
ష ఆయా విషయాలను వ్యక్తులు చూసే చూపునే దృక్పథం అనంటారు.
2) శాస్త్రీయం :- నిజానికీ పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. ఏదైనా మరొక విషయంతో ముడిపెట్టినప్పుడే సంపూర్ణమైన అర్థాన్నివ్వగలుగుతుంది. శాసనాత్, శంసనాదితి శాస్త్రః! అని వ్యుత్పత్తి అంటే అదంతేననడానికి వీలైన, మేలును కలిగించగల అనిదానర్థం. అట్టిదేదై ఉంటుంది. ఏదో ఒక అభిప్రాయం అయ్యుంటుందన్నది సాధారణార్థంలో స్వీకరింపబడుతోంది.
ప్రకటితాభిప్రాయం నిగ్గు తేలినది, నిగ్గు తేల్చుకోదగింది అని చెప్పదగ్గ స్థాయి కలదైనప్పుడు దానిని శాస్త్రీయం అనంటాము. నిర్ధారితము సరైనది అన్న పదాలు సరైన పర్యాయాలు.
3) శాస్త్రీయ దృక్పథం :- సరైన చూపు అని ఒక్కముక్కలో చెప్పుకోవచ్చు. ఒకింత వివరణగా చెప్పుకోవాలంటే, ఆయా విషయాలను గమనించేటప్పుడుగానీ, వాటి గురించి నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భంలోగానీ, పూర్వనిశ్చితాభిప్రాయాలు (ముందేర్పరచుకున్న అభిప్రాయాలు) లేకుండా ఉండడాన్ని సరైన చూపు కలిగి ఉండడం అంటాము. మంచిదనో, చెడ్డదనో, శతృవనో మిత్రుడనో, పెద్దలనో పిన్నలనో, ఇష్టమైనదనో, అయిష్టమైనదనో, లాభమనో నష్టమనో, కష్టమనో సుఖమనో ఇలా అనుకూల ప్రతికూల దృష్టులు లేకుండా విషయాలను, వ్యక్తులను ఉన్నదున్నట్లుగా చూడడమే సరైందన్న మానసిక వైఖరి కలిగి ఉండడాన్నే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడమంటారు. నిస్పాక్షిక దృష్టినీ సరైన చూపు అనే అనవచ్చు.
ష రాగద్వేషాలు లేకుండా విషయాలను గమనించడం, ఒప్పులను స్వీకరించడం, తప్పులను విడిచిపుచ్చడం, తేలనివాటిని తేలనివిగనే తలంచడం అన్నదే. జ్ఞానార్జనా క్షేత్రంలో సరైన వైఖరి అన్నది కూడా శాస్త్రీయ దృక్పథం సరైన చూపు క్రిందికే వస్తుంది.
శాస్త్రీయ పద్ధతి :- ఇది వైజ్ఞానిక క్షేత్రాలలో రూఢిగా వినియోగంలో ఉన్న మాట. సరైన పద్ధతి అనే దీని అర్థం. దేనిని సరైన పద్ధతంటారో చెప్పుకోకుండా కేవలం సరైన అన్న పదం వాడినంత మాత్రాన దానిని గురించి చెప్పినట్లూ అవదు. విన్న వానికి సరైన రీతిలో అర్థమూకాదు. కనుక దీనిని గురించి కొంత వివరించుకోవడం అవసరం. వైజ్ఞానిక క్షేత్రాలలో ఈ పద్ధతి క్రమాన్ని ఇలా చెపుతుంటారు.
1) పరిశోధనాంశం (ఆజీళిలీజిలిళీ) 2) సమాచారసేకరణ (ఈబిశిబి ్పుళిజిజిలిబీశిరిళిదీ) 3) పరికల్పన (కగిచీళిశినీలిరీరిరీ) 4 ప్రయోగము (జూనిచీలిజీరిళీలిదీశి) 5. సరిచూచుట (ఙలిజీరితీరిబీబిశిరిళిదీ) 6. నిర్థారణ (ఓరిదీబిజి ్పుళిదీబీజితిరీరిళిదీ) అన్న మెట్ల ద్వారా ఒక విషయానికి చెందిన నిగ్గుతేలిన జ్ఞానాన్ని ఆర్జించే క్రమాన్నే శాస్త్రీయ పద్దతి అంటున్నాం.
గమనిక :- శాస్త్రీయ దృక్పథం మనిషి నాశ్రయించి - అతని మానసిక వైఖరిని గురించి తెలిపే పదం కాగా, శాస్త్రీయపద్దతి అన్నది ఆయా విషయాలకు చెందిన సరైన జ్ఞానాన్ని ఆర్జించడానికి ఉపయోగించే పద్దతిని గురించి చెప్పే మాటగా ఉంది. విషయాన్ని విషయంగా చూడడానికి ఎట్టి మానసిక వైఖరి కలిగి ఉండాలో దానిని శాస్త్రీయ దృక్పథం అనీ, సత్యాన్ని తెలుసుకోడానికి ఏ విధానాన్ని అనుసరించాలో దానిని శాస్త్రీయపద్దతి అనీ అంటారు.
5. ప్రయోగం:- ప్రత్యక్షానుభవ జ్ఞానాన్నే కాక, ఊహాత్మకంగా నిర్ణయించుకున్న అభిప్రాయాలనుగాని, వినీ, చదివి తెలుసుకున్న అంశాలను గానీ, వాటి సబబు బేసబబుల గురించి తెలుసుకోడానికి గాను చేసే వాస్తవాల పరిశీలనా ప్రక్రియనే ప్రయోగమంటారు.
6. వాదము (ఆజీళిచీళిరీరిశిరిళిదీ) :- విచారణకు స్వీకరించిన అభిప్రాయ ప్రకటనను వాదమంటారు. ప్రతిజ్ఞ, ప్రతిపాదన, ఏదేని ఒక విషయంపై ఒక పక్షం వారు ప్రకటించు అభిప్రాయము
7. వాదన (జుజీవీతిళీలిదీశి) :- ప్రకటితాభిప్రాయం సరైందేననడానికిగానీ, సరికాదనడానికిగానీ పక్షప్రతిపక్షాలు ఆధారాలు, యుక్తులతో కూడి చేసే భాషణను వాదన అంటారు.
8. సిద్దాంతము :- ఆయా విషయాలకు సంబంధించి నిర్ణయరూపంగా ప్రకటించే అభిప్రాయాన్ని సిద్దాంతమంటారు.
ష సిద్దాంతమన్నమాట అనేక అర్థాలలో వినియోగంలో ఉంది. 1) ఊహాత్మక సిద్దాంతాలు, 2) ప్రయోగాత్మక సిద్దాంతాలు 3) నిరూపిత సిద్దాంతాలు 4) ఆస్థిక, నాస్తిక సిద్దాంతాలు 5) వివిధ శాస్త్రాలకు చెందిన సిద్దాంతాలు, .... ఇలా రకరకాల భావాలు, భావజాలాలు కూడా సిద్దాంతాల పేరున చెలామణిలో ఉన్నాయి.
సిద్దః అంతః నిశ్చయః యస్మిన్ సిద్దాంతః :- కడకు తేలేనిశ్చయరూప భావం సిద్దాంతం
రాద్దాంతః :- రాద్దః సిద్దః అంతః నిశ్చయః యస్మన్ రాద్దాంతః :- సిద్దాంత మన్నదే దీని అర్ధం కూడా.
నిర్ణయః :- నితరాంమతేరంతం నయతీతి నిర్ణయః :- బుద్దిని కడముట్టించునది, ఆలోచన ఒక ముగింపుకు రావడాన్నే నిర్ణయమంటారు.
సిద్దాంతమన్న పదాన్ని తర్క శాస్త్రంలో మరో విధంగా నిర్వచించారు గమనించండి.
సిద్దాంతము :- తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతః. ఏదైనా శాస్త్రమునందు ప్రకటింపబడిన లేదా ఒక ధోరణికి చెందిన వారు ప్రకటించిన అభిప్రాయమును సిద్దాంతమంటారు.
గమనిక :- ఏదేని ఒక విషయంపై నిర్థిష్ట రూపంలో చేయబడిన ప్రతిపాదనను సిద్దాంతమంటారు. అలాటి ప్రతిపాదనలనేకం కూడి ఉన్న ధోరణినీ సిద్దాంతమనవచ్చు. అలాటప్పుడు, ఆలోచనా క్షేత్రానికి చెందినదీ, జీవితంతో ముడిపడి ఉన్న ఎన్నో విషయాలకు చెంది తనదైన అభిప్రాయాలు కలిగి ఉన్నదీ అయిన హేతువాదాన్ని సిద్దాంతం కాదనడం ఎలా కుదురుతుంది. హేతువాదమన్నది అనేకాభిప్రాయాల సమాహారంగా ఉన్న ఒకతాత్విక ధోరణి అని తీరాల్సిందే.
సిద్దాంతాలు నాలుగు రకాలు :- 1) సర్వతంత్ర సిద్దాంతాలు 2) ప్రతితంత్ర సిద్దాంతాలు 3) అధికరణ సిద్దాంతాలు 4) అభ్యుపగమసిద్దాంతాలు.
1) సర్వతంత్రం :- ఎట్టి అభిప్రాయ ప్రకటన - ప్రతిపాదన - ప్రయోగరీత్యాసరైందని తేలుతుందో, ఎవ్వరూ కాదనడానికి వీలులేనిదో, అంటే అందరూ అంగీకరించిన, అంగీకరింపక తప్పనిదో అది సర్వతంత్రం.
గమనిక :- సత్యాలనడానికి తగిన అభిప్రాయాలన్నీ సర్వతంత్రాలనాల్సిందే. అవి దేశాన్ని బట్టి గానీ, కాలాన్ని బట్టి గానీ, వ్యక్తులను బట్టిగాని మారవు.
ఉదా :- పరమాణువులు ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రానుల కూడిక వల్ల ఏర్పడుతాయి.
2) ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాను మాత్రమే ఉన్న మూలకాన్ని ఉదజని అంటాము.
3) పదార్ధంగానీ, శక్తిగానీ పుట్టదు, నశించదు. సృష్టించబడదు. నాశనం చేయబడదు.
4) పరమాణువుకు పగిలే గుణం ఉంది. అది పగలగొట్టదగిందే.
5. తొమ్మిదిని ఎన్ని సార్లు హెచ్చవేసినా (గుణించినా) ఫలాన్ని కూడితే తొమ్మిదే వస్తుంది.
6) భూగోళం మొత్తంమ్మీద ప్రతి నిముషం ఎవరో ఒకరికి సూర్యోదయం అవుతున్నట్లు అనిపిస్తునే ఉంటుంది. అదే సమయంలో మరొకరికి సూర్యాస్తమయం అవుతున్నట్లనిపిస్తుంది.
2) ప్రతితంత్రం :- ఒక ధోరణివారు అంగీకరిస్తున్నదీ వేరొక ధోరణి వారంగీకరించనిదీ ప్రతితంత్ర సిద్దాంతం.
1) విశ్వానికి ఆరంభము - అంతమూ ఉంది.
2) గతితార్కిక నియమాలు విశ్వంలోని ప్రతిదానికీవర్తిస్తాయి.
3) హేతువాది అవశ్యం నీతిమంతుడుగానే ఉంటాడు.
4) జీవజాతులన్నింటికీ పూర్వీకులు ఒక్కరే. ఒకే పూర్వజాతి నుండే అన్ని జాతుల జీవులు వచ్చాయి.
5) నిర్జీవం నుండే జీవం ఏర్పడింది. లేదా; జీవ పదార్థమూ, జడ పదార్థమూ ఒక దాని నుండి ఒకటి రావు.
3) అధికరణ సిద్దాంతం :- ఒక దాని నిరూపణ మరొక దాన్నీ నిరూపణ చేయగలిగిన రూపంలో ఉన్నది అంటే ఇది తేలితే అదీ తెలుతుంది, లేదా, ఇది తేలితే గాని అది తేలదు అనడానికి వీలైన ప్రతిపాదనను అధికరణ సిద్దాంతం అంటారు. యత్సిద్దౌ అన్యప్రకరణ సిద్దిః సో -ధికరణ సిద్దాంతః !
1) ఖురాన్‌లోని వాక్యాలన్నీ దైవప్రోక్తాలే. ఆ మాటన్న మహమ్మదు అబద్దం చెప్పడు గనుక.
2) ఖురాన్ నమ్మదగినది దైవప్రోక్తం గనుక (దేవుడున్నాడనీ, ఖురాన్ అతడే చెప్పాడని తేలాలి కదా ముందు)
3) విశ్వం విస్తరిస్తోంది అన్నది అధికరణ సిద్దాంతమే. ఎందుకంటే, విశ్వం విస్తరిస్తుందనాలంటే విశ్వంలోని ద్రవ్యరాశికలవన్నీ ఒక దానికొకటి దూరమవుతున్నాయని తేలాలి.
గమనిక :- రెడ్‌షిప్టు ఏర్పడుతున్నట్లు రుజువైతే అది విశ్వం విస్తరిస్తోంది అన్న దానినీ రుజువు చేస్తుంది.
4) అభ్యుపగమ సిద్దాంతం :- విచారణ కొరకుగా లేదా చర్చ కొరకుగాను స్వీకరింపబడ్డ ప్రతిపాదనను అభ్యుపగమ సిద్దాంతం అనంటారు. నిజానికి పరీక్షకు స్వీకరించే థలో, నిజానికవి మిగిలిన మూడు రకాల సిద్దాంతాలలో దేనికోవకు చెందినవైనప్పటికీ అభ్యుపగమాలనే అనాలి. విచారణ సక్రమంగా జరిగి నిర్ధారణ జరిగాకనే అవి ఏ సిద్దాంత స్థాయికి చెందినవో తేలుతుంది.
గమనిక :- సిద్దాంతాలన్నీ కడకు రెండు స్థాయిలకు చెందినవిగానే నిరూపితమవుతాయి. 1) సత్యాలనదగ్గవి 2) ఆస్థాయిలేనివి. అందులోనూ రెండవ రకం తప్పులని తేలినవి, ఇంకాతేలనివి అన్న రెండు రాశులను కలిగి ఉంటాయి. అందుకే వైజ్ఞానిక క్షేత్రాలలో మొదటి డిగ్రీ ధియరిస్ (నిరూపిత సిద్దాంతాలు) రెండవ డిగ్రీ దియరీస్ (అనిర్థారిత సిద్దాంతాలు) అన్న రెండు శ్రేణులుగా వాటిని చూడడం జరుగుతోంది. ఇక ఈ నిరూపితాలు రెండుగా చెప్పబడుతున్నాయి. ఒప్పులని తేలినవి, తప్పులని తేలినవీ అనంటున్నారు వాటిని (ఆజీళిఖీలిఖి ఞ ఈరిరీచీజీళిఖీరిలిఖి ఊనీలిబిజీరిలిరీ) ఏదేమైనా ఒప్పులని తేలినవన్నీ సర్వతంత్రాలనడానికి సరిపోతాయి. కడమ వాటి ఎన్నిగా విడగొట్టుకున్నా అవన్నీ ఒప్పులని తేలిన వాటికి వెలుపలివిగానే ఉంటాయి.
అపరీక్షతాభ్యుపగ మాః తద్విశేష పరీక్షణార్ధమభ్యుపగమ సిద్దాంతః!
గమనిక :- హేతువాదం అన్నది ఒక సిద్దాంతం కాదు అంటున్న వాళ్ళు, అనదలచుకున్నవాళ్ళు, ముందుగా సిద్దాంతమన్నమాటకు అర్ధమేమిటో విస్పష్టంగా చెప్పగలగాలి. సిద్దాంతమన్నమాట అటు వైజ్ఞానిక శాస్త్రాలలోనూ, ఇటు సామాజిక శాస్త్రాలలోనూ, తత్వ శాస్త్రాలలోనూ వినియోగంలో ఉంది. వారంతా ఆ మాటను ఏ అర్ధంలో వాడారోనూ పట్టి చూడాలి. అటు తరువాత హేతువాదమంటే ఏమిటో, ఆ శీర్షిక క్రిందికి ఏయే అంశాలకు చెందిన భావజాలం వస్తుందోనూ వివరించి (తేల్చి) అదంతా సిద్దాంతం అనకూడనిదేననీ నిర్ధారించాలి. ఈ పనేమీ చేయకుండా, 'అది సిద్దాంతం కాదు' అని ఒక మాటనేసి ఊరుకుంటే దానికేమీ విలువ ఉండదు. ఈ విషయాన్ని తెలిపే ఒక ప్రసిద్ద సూత్రం భారతీయ తాత్విక క్షేత్రంలో ఉంది.
ష సూ :- లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్దిః నతు ప్రతిజ్ఞా మాత్రేణ!
కేవలం మాట అన్నంత మాత్రాన ప్రయోజనమేమీ లేదు. ఆ మాట ద్వారా చెప్పబడ్డ అభిప్రాయం సరైందేననాలంటే దేనిని గురించి చెప్పదలచావో దాని లక్షణాన్ని చెప్పి, అది ఏ ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చో అదిన్నీ చెప్పాలి. అలా లక్షణాన్ని, ప్రమాణాన్ని గురించి చెప్పకుండా చేసిన అభిప్రాయ ప్రకటన కాసుకు కొరగాదు.
ష 'సిద్దాంతం' అన్నమాట దగ్గర కూర్చుని ఉన్నాం కనుక, దానిని సజావుగ అర్థం చేసుకోడానికి లేదా విచారించడానికి అవసరమైన - పనికివచ్చే- నిర్థిష్టము, నిర్థుష్టము అన్న మరో రెండు పదాలను గురించి ప్రస్తావిస్తాను, జాగ్రత్తగా పరిశీలించి చూడండి.
ష 9) నిర్ధిష్టము :- అభిప్రాయాన్ని ప్రకటించడానికి ఉద్దేశించిన వాక్యము - మాటలు - చెప్పదలచుకున్న అభిప్రాయాన్ని (విషయాన్ని) విస్పష్టంగా, పూర్తిగా చెప్పగల రూపంలో ఉండాలి. పదాల కూర్పు వ్యాకరణ బద్దంగాను, పదాలు సూటిగా అర్థాన్ని తెలుపగలవిగాను ఉండాలి. ఇదమిద్దంగా, సూటిగా, స్పష్టంగా, ఖచ్చితంగా, ఊగిసలాట లేకుండా, నిశ్చితరూపంలో, ఖరాఖండిగా, కుండ బద్దలు కొట్టినట్లు రూఢిగా, తెగేసినట్లు, మొదలైన మాటలు వాడినప్పుడు మనకు అర్థమయ్యేది కూడా ఈ 'నిర్థిష్టంగా' అన్న మాటకున్న అర్ధంలోనే, అస్పష్టతగానీ, సరదిగ్దతగాని లేకుండా అనిదానర్ధం.
ష 10. నిర్దుష్టము :- భావంలో దుష్టత్వం లేకుండా ఉండడాన్ని తెలుపుతుందీపదం. అభిప్రాయం దోషరహితంగా ఉంటే ప్రతిపాదన నిర్దుష్టంగా ఉంది అనంటాము.
వివరణ :- అత్యంత కీలకమైన విషయమేమంటే ప్రతిపాదన నిర్థిష్టంగా లేకుంటే వాక్యార్థాన్ని గ్రహించడమే సాధ్యం కాదు. అలాటప్పుడు విచారించడమే మొదలవదు. కనుక ప్రతిపాదన నిర్థిష్టరూపంగా ఉండడం విచారణ ఆరంభంకావడానికి అవసరం. అదే మరి, ఆ ప్రతిపాదన నిర్థుష్టమా? కాదా అన్నవిషయంపై పరిశీలనైతే, పరీక్ష పూర్తయ్యాకగాని తెలియదు. ఈ విషయాలు అర్థమై, దానిని వినియోగించే నేర్పూ అలవడితేనే అభిప్రాయాన్ని ప్రకటించడం విషయంలోనూ, సరైన అభిప్రాయాలను సమకూర్చుకోగలగడంలోనూ తగినంత సామర్థ్యం చేకూరుతుంది.
ష భావజాల క్షేత్రంలో ఆద్యంతం అమలవుతూ ఉండాల్సిన సూత్రమిది. ఎందుకంటే పైన చెప్పుకున్న నాలుగు రకాల సిద్దాంతాలను (ప్రకటితాభిప్రాయాలను) అర్ధం చేసుకోవాలన్నా, సరిగా ఉందో లేదో పరీక్షించాలన్నా ఈ రెండు పదాల అర్థాలననుసరించే చేయాల్సి ఉంటుంది. సందర్భం వచ్చినపుడు వీటికెంత బలముంటుందో అర్థం కావడానికి ఒక ఉదాహరణను చెపుతాను.
ఉదా :- ఖురాన్‌లోని వాక్యాలు రెండు రకాలని ఖురానే చెపుతోంది. అవి స్పష్టార్ధబోధకాలు, అస్పష్టార్ధ బోధకాలు అన్నవి. అంటే కొన్ని వాక్యాలు సరళంగా, స్పష్టంగా అర్థమయ్యేవిగా (నిర్థిష్టంగా) ఉంటాయి. అట్టి వాటికి మరొకరి వివరణలక్కరలేదు. మరికొన్ని అస్పష్టార్థ బోధకాలు. వాటి అర్థం నిర్థిష్టరూపంలో ఉండదు. కనుక వాటి అర్థం అల్లాకు మాత్రమే తెలుసు. అన్నది ఆ మాటల అర్థం. ఆ ఒక్కవాక్యం వల్ల మన మీ నాడు ఖురాన్ వ్యాఖ్యాతల్ని నిలువరించవచ్చు. స్పష్టార్థ బోధకాలకు మీ వివరణలతో పనిలేదు. అస్పష్టార్థబోధకాలకు వివరణ చేసే అర్హతగాని, అధికారంగాని మీకు లేదు. ఒక్క ప్రవక్తకు మాత్రమే వివరణకు అధికారం ఇవ్వబడింది.
కనుక ఈనాడు మనమెవరంగాని మొట్టమొదట నిర్ధిష్టార్థ ప్రతిపాదకంగా ఉండే పదాలను వాక్యాలను వాడాలన్న నియమాన్ని అంగీకరించితీరాల్సిందే. అందుకనే ముఖ్యమైన పదాలకు అర్థాలు చెప్పుకునే పని మొదలెట్టాం.
11) రుజువు :- ప్రకటితాభిప్రాయం సరైందేనని నిర్ధారించగల ఆధారాన్ని రుజువు అంటారు.
12) ఉదాహరణము :- ప్రకటితాభిప్రాయాన్ని రుజువుపరచడానికి ఎంపిక చేసుకున్న సరైన ఘటనను ఉదాహరణ అంటారు. ఏ అనుభవం ఆధారంగా (దేనిని చూడడం ద్వారా) ఆ అభిప్రాయం పుట్టిందో, అట్టి దాన్నే ఆ అభిప్రాయం సరైన దేననడానికి రుజువుగా చూపుతాము. సజాతి సామ్యం ఉదాహరణం
13) ఉపమానం :- దేనిని గురించి చెప్పదలచుకున్నామో దానిని రుజువు పరచగలదానిని కాక, మరొకదానిని పోలిక కొరకు స్వీకరిస్తే దానిని ఉపమానం అంటాము. విజాతి సామ్యం ఉపమానం.
వివరణ :- వైజ్ఞానిక, సైద్దాంతిక క్షేత్రాలలో రుజువు పెట్టదగింది ఉదాహరణ మాత్రమే ఉపమానం ప్రకటితాభిప్రాయం యొక్క సబబు బేసబబుల్ని రుజువు చేయడానికి పనికిరాదు. అట్టిదే మరొకటి - సజాతి - దానికి ఉదాహరణకాగా, అట్టిది కానిదే - విజాతి - ఉపమానంలో ఉంటుంది. కనుక ప్రకటితాభిప్రాయాన్ని రుజువు చేయగలిగింది ఉదాహరణ మాత్రమే. ఉదాహరణనే దృష్టాంతం అంటారు. ఉపమానాన్ని దృష్టాంతం అనకూడదు. విషమ దృష్టాంతాన్ని ఉదాహరణగా చూపనేకూడదు. ఉదాహరణకు ఒక పర్యాయపదం 'అచ్చు' అంటే అలాటిదేనని ఇంత ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే తరచుగా ఉదాహరణకు అంటూ విషమ దృష్టాంతాలనో, పిట్టకధలనో చెపుతూ ఉంటారు చాల మంది. ఉదాహరణకు తగినదైతే ఒక్క ఉదాహరణ చాలు ప్రకటితాభిప్రాయాన్ని రుజువు చేయడానికి మరో ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందంటే ముందు చెప్పింది ఉదాహరణకు తగింది కాదనే అర్థం. అనుభవ దారుఢ్యం ఉన్నవారే సరైన ఉదాహరణ చూపగలుగుతారు.
14. స్వేచ్చ :- ఇది అనేకార్థాలలో వాడబడుతున్నా, దాని సూటి అర్థం స్వ + ఇచ్చ అనే అంటే ఇష్టము అనే. స్వేచ్చ అన్న పదం ప్రధానంగా మానసిక క్షేత్రానికి సంబంధించి వాడవలసింది. స్వతంత్రాభిప్రాయము కలిగిఉండుట మానసికబంధం లేని తనాన్ని కలిగి ఉండుట అన్న అర్థాన్ని తెలిపే పదమది. విశృంఖలత అనీ అర్థముంది దీనికి. నానార్థాలలో స్వతంత్రత అన్నదీ ఉన్నా, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అన్న పదాల్ని కలిపి వాడినప్పుడు స్వేచ్చ అన్నది ఖచ్చితంగా మానసిక బంధం లేనితనాన్ని, స్వతంత్రత అన్నది భౌతికబంధం లేనితనాన్నీ మాత్రమే చూపుతాయి. మానసిక - ఆలోచన పూర్వకమైన నిర్ణయాలకు రావడం విషయంలో పరాధీనత లేకపోవడాన్ని, స్వాధీనత కలిగి ఉండడాన్ని స్వేచ్చ అంటారు.
15. స్వాతంత్య్రము :- స్వతంత్రుడు అంటే తన అధీనంలో తానున్నవాడు అని అర్థం. అనుకున్నట్లు ప్రవర్తించగలిగి ఉండడాన్ని స్వతంత్రత అనంటాము. పరతంత్రుడు - పరాధీనుడు అన్న పదం ఇతరుల అధీనంలో ఉండడాన్ని, బంధితుడై ఉండడాన్ని తెలుపుతుంది. అలా పరాధీనుడు కాక, తన వశంలో తానుండడాన్నే స్వతంత్రమంటారు.
ఇదీ మనో సంబంధంగానూ, శరీర సంబంధంగానూ వాడబడుతున్న పదమే. అయినా ఖచ్చితమైన రూపంలో చెప్పాలంటే మానసిక పరాధీనత లేని స్థితిని 'స్వేచ్చ' అనీ, శారీరక పరాధీనత లేకుండా స్వవశుడై ఉండడాన్ని స్వతంత్రత అనీ అనాలి. భౌతిక అస్వతంత్రత - (పరాధీనత) కంటే, మానసిక పరాధీనతే బలమైంది. చాలసార్లు ప్రమాదకరమైంది కూడా. విశ్వాసరూపాలన్నీ మానసిక పరాధీనతను తెలిపేటివే.
16. సంపూర్ణస్వేచ్చ :- ఏ రకమైన పరాధీన మనస్కత లేకపోవడం అనిదీనర్ధం. కించిజ్ఞుడూ, సంఘజీవి అయినందున ఏ మానవుడూ సంపూర్ణ స్వేచ్చను కలిగిలేడు, ఉండలేడు, పొందలేడు కూడా. కట్టుబాటు అన్నది స్వేచ్చకు అడ్డుపడుతుంది. సాంక్రమిక భావజాలమూ స్వేచ్చకు అడ్డుపడగలిగిందే, ఇతరుల జ్ఞానాన్ని స్వీకరించే పరిస్థితీ స్వేచ్చకు పరిమితుల్ని విధించేదే. వ్యక్తులను గానీ, రచనలను గానీ ప్రామాణికంగా స్వీకరించడమూ స్వేచ్చకున్న పరిమితుల్ని తెలిపేటిదే.. 'మానవుడు స్వేచ్చాపిపాసి' అన్న రాయ్ మాటను గుర్తు చేసుకుందాం. స్వేచ్చ కావాలన్న దప్పిక (పిపాస) లేదా తీరని కోర్కె కలిగి ఉంటాడు మనిషి అనిదానర్ధం. ఇక్కడ రాయ్ స్వేచ్చాభావన అంతాతాననుకున్నట్లే జరగాలన్న కోర్కెను చూపుతుంది. దాని సరైన అర్థంలో, మానసిక పరాధీనత లేని స్థితిని, స్వాధీన మనస్కులై ఉండడాన్ని తెలుపుతుందామాట.
17. బంధము :- ఇది రెండు రూపాలలో అంటే మానసిక పరంగా, శారీరపరంగానూ ఏర్పడవచ్చు. బంధం అంటే ఒకటి మరొకదాని అదుపులో (నియంత్రణలో) ఉండేట్లు చేసేది అని అర్థము. ఒకదాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలను నిరోధించగలదాన్ని బంధము అంటారు.
ష ఇష్టంలేనిపని చేయాలన్న నిర్ణయానికి వ్యక్తిని తీసుకుపోగలిగినచో అతడు మానసిక స్వేచ్చ కోల్పోయాడనే అనాలి.
ష ఇష్టమున్న పనిని చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడతడు భౌతికంగా స్వతంత్రుడుగా లేడని. ఈ రెండు సందర్భాలలో ఒకటి లేదా ఒకడు బంధంలో ఉన్నాడనే చెప్పవచ్చు.
గమనిక :- బంధం అన్నమాట నుండి పుట్టిందే సంబంధం అన్నదీ. నిజానికాపదం సరైన బంధం అన్న అర్థాన్నిస్తుంది. కానీ వాడుకలో శతృసంబంధాలు, మిత్ర సంబంధాలు లాటి పదాలు వినియోగంలో ఉంటున్నాయి. సాధారణ లక్షణంగా, ఒకదానిచర్య మరొకదాని స్థితి, గతులలో మార్పును తీసుకొనివస్తే ఆ మార్పుకులోనైంది బంధంలో ఉందంటాము. కట్టు, కట్టుబాటు, అధీనపరచులాటివి పర్యాయాలు.
18) భావబంధము :- నీవి కానివి ఇతరుల నుండి సంక్రమించినవి అయిన భావాలు, అభిప్రాయాలు నిన్ను అదుపు చేస్తుంటే దానినంటారు భావబంధమని. తెచ్చిపెట్టుకున్న భావాల వల్ల నీ ఇష్టా ఇష్టాలు అదుపు చేయబడుతుంటే, అప్పుడతని మనసు భావ బంధంలో ఉందంటాము. మానసిక స్వేచ్చలేని తనాన్ని భావబంధమంటారు.
మత విశ్వాసాలన్నీ 'భావ బంధ' రూపాలే. తనకు తెలీని, తనవికాని అభిప్రాయాలకు కట్టుబడి ఉండడం భావ బంధానికి సరైన ఉదాహరణ. ఇది ఆస్థిక, నాస్థిక భావాలు రెంటికీ వర్తిస్తుంది.
19) అనుభవము :- సాక్షాత్తు జ్ఞానానికి ఆధారమైన దానిని అనుభవం అంటున్నాము. సాధారణ వాడుకలో అనుభవం ఉన్నవాడు అన్నది జ్ఞానం కలవాడు అన్న దానికి పర్యాయంగా వాడబడుతున్నా వాస్తవానికి అనుభవం వేరు జ్ఞానం వేరు. ఇంద్రియార్థ సన్నికర్ష వలన మెదడులోనికి ఆయా ఇంద్రియాలు పంపించిన సమాచారం ప్రతిబింబించడాన్ని అనుభవం అంటారు. 'అనుపశ్చాత్ భవమితి అనుభవం' ఇంద్రియార్థ సన్నికర్షననుసరించి పుట్టింది అని దానర్ధం. కలిగిన అనుభవాలనే గ్రహణ కేంద్రం గుర్తిస్తుంటుంది. దానిని అనుభూతి చెందడం అంటాము. అనుభవ స్థితిలో జ్ఞానముండదు. అనుభూతి స్థితిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానమేర్పడుతున్న క్రమంలో జ్ఞానం ఏర్పడడానికి ముందు థను అనుభవం అంటారు. అనుభవజ్ఞుడు, అనుభవజ్ఞానం కలవాడు అన్న పదాలు ఆ అర్థాన్ని చూపేటివే.
20) అనుభూతి :- అనుభవాన్ని గమనించినప్పుడున్న మానసిక స్థితి ఇది. ఈ థలో ఆయా విషయాలకు సంబంధించిన స్పృహ - ఎరుక - కలుగుతూ ఉంటుంది. అనిపిస్తుండడాన్నే అనుభూతి అనంటారు.
21) సానుభూతి :- స + అనుభూతి = సానుభూతి అన్న మాటే అయినా, అవతలి వాళ్ళు విచారకరపరిస్థితులలో ఉన్నప్పుడు వారి పట్ల మనం చూపించే దయ, జాలి, కరుణ వెనుకనున్న దానిని సానుభూతి అంటున్నాం.
22) సహానుభూతి :- అవతలి వాడు ఎట్టి అనుభూతి స్థితిలో ఉన్నాడో, దానిని గమనించిన వాడూ అట్టి అనుభూతికే గనకలోనైతే దానిని సహానుభూతి అంటారు. ఎదుటి వానికి సంతోషంగా ఉంది. నీకూ సంతోషం కలగాలి, అతనికి దుఃఖంగా ఉంది. నీకూ దుఃఖం రావాలి. అలానన్నమాట. సహ అనగా తోడ్తో అని కూడి అని అర్థం. అతనితో పాటు, దానితోపాటు వాటికెలాటి అనుభూతి కలుగుతున్నదో అలాంటి అనుభూతే వేరొకరికీ కలగడాన్నే సహానుభూతి అంటారు. సానుభూతి సహానుభూతి పర్యాయాలుకావు.
సహానుభూతిని తెలిపేదే సమరసత్వం (సామరస్యం) అన్నదీనూ. సమానమైన రసం ఉత్పత్తి కావడమని దానర్ధం. అతనికి శాంతిగా ఉంటే నీకూ శాంతిగా ఉండడం, అతనికి అశాంతిగా ఉంటే నీకూ అశాంతిగా ఉండడం.
No comments:
Post a Comment