1) బాపట్ల నుండి మోషే ఇలా వ్రాస్తున్నాడు. మిత్రులు సురేంద్రగారికి,
గతంలో మీరు వ్రాసిన హేతువాదం మీది వ్యాసాలు, ఇప్పుడు గత మూడు నెలలుగా వివేకపథంలో వస్తున్న ''హేతువాద ఉద్యమ పునరుజ్జీవన యత్నాలు'' అన్న వ్యాసాలు జాగ్రత్తగా పరిశీలించాను. వాటి పై నాలో పుట్టిన ఆలోచనలను వివేకపథం పాఠకుల ముందు ఉంచితే బాగుంటుందనిపించి ఈ వ్యాసం పంపుతున్నాను. ఏ మాత్రం అవకాశమున్నా దీనిని వివేకపథంలో ప్రచురించండి.
హేతువాద మన్నది ఒకతప్పుడు పోకడ అన్న భావాన్నీ, హేతువాదులు తప్పుడు భావజాలాన్ని, పెడవాదనను సమాజంలోకి ప్రవేశపెడుతున్నారన్న భావాన్నీ, విశ్వాసాలమాటున ప్రజలను ఆకట్టుకుంటూ, బ్రతుకులు నెట్టుకొస్తున్న ఆస్థిక పక్షంవాళ్ళు హేతువాదంపైనా, హేతువాదులపైనా ప్రజలలో కలిగించగలిగారు. ప్రశ్నించడం, విచారించడం, నిగ్గుతేల్చుకోవడం అన్న ప్రక్రియను ప్రక్కనబెట్టి, నమ్మకమనే, ఇంకా సరిగా చెప్పాలంటే మూఢనమ్మకమనే బండను జనం నెత్తిన పెట్టారు. ఇక్కడ ఆస్థికప్రచారకులు చేసింది కుటిల పన్నాగమే అయినా, హేతువాదానికి, హేతువాదులకు జనాన్ని దూరం చేయడం విషయంలో మాత్రం వారు గొప్ప విజయమే సాధించారు. హేతుబద్దాలోచనను (తర్కాన్ని) వాడుకుంటూనే అది పనికిరానిదిగ జనాన్ని నమ్మించగలిగారు.
అహేతుకాలోచనతో కూడిన నమ్మకాలవైపు ప్రజల్ని నెట్టారు.
అయితే, దీనికి మన హేతువాద మిత్రులపోకడ కూడా కొంతవరకు కారణమనక తప్పదు. ఎందుకంటే, హేతువాదులు, ప్రజలకు విశ్వాసానికీ, వివేకానికీ ఉన్న తేడానుగానీ, నమ్మకానికీ - మూఢనమ్మకానికీ మధ్య నున్న తేడానుగానీ, అర్థమయ్యేలా ఎరుకపరచలేకపోయ్యారు. అంతేగాక, ఆస్థికులు నమ్మమని చెప్పి పరలోకం, ఆత్మవగైరాలు నిజానికి బ్రతుకుతో సంబంధంలేనివీ, ఎవరికీ తెలియనివీ, తెలియడానికి వీల్లేనివి, తెలుసుకోవలసిన అవసరం కూడా లేనివి అన్న నిజాన్నీ, జనానికి అందించలేకపోయ్యారు. కనీసం విశ్వాసం కంటే విచారణ మార్గమే విలువైనది, బలమైనది అని గానీ, నిజ జీవితంలో ప్రతి మనిషీ అవసరమైన చోట కొద్దో గోప్పో హేతుబద్దాలోచననే వాడుకుంటున్నాడనిగాని తెలుపలేకపోయారు. చేయాల్సిన ఆ పని చేయకపోగా, దేవుడు లేడన్న ఒకే ఒక బండవాదననే హేతువాదం పేరన చూపించబూనడంతో, అదే ఆపోకడే ప్రజలకు వారిని దూరం చేసింది. వివిధ విశ్వాసాలలో బడికొట్టుకుపోతున్న అమాయకజనాన్ని చూసి గేలిచేసి తృప్తిపొందే వైఖరి కొందరు హేతువాదుల్లో అలవాటుగా మారి ఉంది. అది ఆ దురలవాటు పోవాలి.
ఈ విషయాన్ని వెంకటాద్రి గారూ గమనించారు గనకనే, హేతువాదమంటే కేవలం వ్యతిరేకవాదమనే అపోహ ప్రచారంలో ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత హేతువాద మిత్రులందరి మీద ఉంది అని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాక, మతస్థులు దేవుడున్నాడని పిడివాదం చేస్తున్నట్లే, మనం కూడా దేవుడు లేడని పిడివాదం మొదలెడితే వారికీ మనకూ తేడా లేనట్లే మనది విశ్వాసం కాదు, కాకూడదు, కనుక లేడన్న నిర్ణయానికి ఎలా వచ్చామోనన్నది సరైన రీతిలో చెప్పగలగాలి, అనీ అన్నారు.
ఒక ముఖ్య విషయాన్నీ మనమంతా గుర్తుంచుకోవాలి. శాస్త్రీయరచనలకు, స్థిరమైన నిర్థిష్టార్ధ్థాలను తెలిపే పదజాలం ఉండాలి. ఈ మాటెందుకంటున్నానంటే, గతంలో హేతువాదం పేరున వచ్చిన రచనల్లో ''హేతువనేది విశ్వక్రమంలోని లయ, హేతుత్వమంటే దానియొక్క ప్రతిధ్వని అన్న వాక్యముంది. అది చదివితే మనకేమి అర్థమొస్తోంది? విశ్వంలో ఒక క్రమముందనీ, దానిలో ఉండేలయనే హేతువంటున్నాడనే కదా! అంటే లయ అన్నా హేతువన్నా ఒకటేనంటున్నట్లేనా? లేక వేరేదాంతో లయకున్న సంబంధాన్ని బట్టి దానిని హేతువంటున్నట్లా? రచయిత భావమేమిటో సూటిగా అర్థం కావడం లేదిక్కడ.
నాకు తెలిసి ఈ సందర్భంలో హేతువన్న మాట ఆలోచనకు ఆధారమైన దానిని చూపి అనాల్సిందిగా ఉంది. అంటే ఆలోచించి సరైన నిర్ణయాలకు రావడానికి సరిపడే ఆధారాన్ని హేతువంటామన్న మాట తప్పు నిర్ణయాలకు దారితీసే ఆధారాలనే హేత్వాభాస అంటాము. కనుకనే ఆధారాల బలాబలాలను బట్టే వాటిని మనం సహేతుకాలోచనలు, అహేతుకాలోచనలంటున్నాము. వెంకటాద్రిగారే అన్న మరో మాటను గమనించండి. ''హేతువాదం తప్పనేవారు కూడా హేతురీత్యానే, తర్కరీత్యానే ఆలోచిస్తుంటారు'' దీనర్థం హేతువనేది ఆలోచనతో ముడిపడి ఉన్నదనేకదా!
మరలాటప్పుడు సంగీత, నృత్య, వాయిద్యాలతో ముడిపెట్టి వాడేపదమైన లయను హేతువనడం ఎలా కుదురుతుంది? ఇక రెండో పదం హేతుత్వమంటే విశ్వక్రమం యొక్క ప్రతిధ్వని అన్నది. వెంకటాద్రి గారే మరోచోట, ఆలోచనలోని క్రమపద్దతినే హేతుత్వమంటున్నామనీ అన్నారు పదాల్ని ఇలా ఎడాపెడా వాడితే అది పాఠకుల్ని అయోమయంలోకి నెడుతుంది. కనుకనే విలువైన విషయలు చెప్పబూనినప్పుడు పదాలు నిర్థిష్టార్ద బోధకాలుగ ఉండాలంటున్నాను. కాబట్టి విశ్వంలోని క్రమమేమిటో, దాని ప్రతిధ్వని ఏమిటో, వాటికీ హేతుత్వానికీ సంబంధమేమిటో ఆయనే వివరించాలి. మామూలుగా చదివితే అర్థం కావడంలేదు.
హేతుత్వమనేది హేతువనదగిన దానికి ఉండాల్సిన లక్షణం అవుతుంది. ఆ లక్షణంలేనిది అహేతువు - హేత్వాభాస - అవుతుంది. హేతువాది నిర్థిష్టార్థాలనిచ్చే పదాలనే వాడాలి. లేకుంటే ఆస్థికులకూ, అసత్య భావాలను ప్రకటించేవారికీ, శాస్త్రీయాలోచన ఉండాలంటుండే మనకూ తేడాలేకుండ పోతుంది. అంతేకాక, ఏ ఆశయ సిద్ధికోసం హేతువాద ఉద్యమాన్ని ఆరంభించామో అది నెరవేరదు. అది నిజమో కాదో ఆలోచించండి.
మరో సందర్భంలో మానసిక వ్యాధి ఉన్న వారికి మాత్రమే లేనివి ఉన్నట్లూ, ఉన్నవి లేనట్లూ అనుభూతి కలుగుతుందనీ, అనేశారాయన, ఇది నిజమా? ఎండలో తారురోడ్డుమీద పోతున్నప్పుడు మనలో ఎవరికైనా రోడ్డు మీద నీళ్ళున్నట్లు అనిపిస్తుంది. నీటిలో సగం మునిగిన కర్ర వంగినట్లూ కనపడుతుంది. అలాటప్పుడు మనమంతా మానసిక రోగులమన్నట్లేనా? ఇలాటివి తొందరపాటు ప్రకటనల క్రిందికి రావా?
''విశ్వంలో క్రమం లేకుండా ఉండుంటే వాటి జ్ఞానం మనకు కలిగేది కాదని'' మరో చోట అన్నారు. మరి విడివిడిగా ఉన్నవీ, క్రమంగాలేనివీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా! నిజజీవితంలో క్రమాన్నీ, క్రమరాహిత్యాన్నీ గమనించేకదా ఆ పదాలు వాడుతున్నాం? కనుక క్రమముండబట్టే అవి తెలుస్తున్నాయనడం అనుభవవిరుద్ధంగా అనిపిస్తోంది కదా!
వెంకటాద్రి గారే ఒక చోట, మొదటి సత్యంకంటే సమగ్ర సత్యాన్ని మానవుడెల్లప్పుడూ తెలుసుకుంటూ ఉంటాడనీ, మరోచోట సత్యం జ్ఞాన విషయమనీ, ఇంకొకచోటైతే ప్రయోగాల ద్వారా, ప్రమాణాల ద్వారా పునఃపరిశీలించి రుజువు చేసుకుంటూ, నిజాన్ని ధృవపరచుకుంటుండాలని హేతువాది అంటాడనీ ఇలా సత్యాన్ని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ పోయారు. ఒక రకమైన జ్ఞానాన్నే- రుజువుకు నిలబడ్డజ్ఞానాన్నే- సత్యమనాలన్నంత వరకు, అలా రుజువు చేసుకుని కలిగిన జ్ఞానాన్ని సరైందో కాదో ధృవపరచుకుంటూనే సాగాలన్నంతవరకు అందరం అంగీకరించాల్సిందేగాని, సత్యాలు మారతాయన్నది అంగీకరించదగిందిగా అనిపించడంలేదు. ఎందుకంటే సరైన పద్ధతుల ద్వారా సత్యమని నిర్థారింపబడ్డది ఎప్పటికీ మారనేమారదు.
మొత్తంగా చూస్తే హేతువాదంపై వెంకటాద్రి గారు వెళ్ళడించిన వాటిలో నా కంగీకారమైనవీ, అంగీకారం కానివీ, అర్థం కానివీ అన్న మూడు రకాల భావాలు కనపడుతున్నాయి. ఇదంతా అలా ఉంచి ముఖ్యంగా విచారించుకోవలసిందేమంటే, ఆయన హేతువాదం ఒక సిద్దాంతం కాదని అంటున్నారు. దానర్థం, హేతువాదమన్న సిద్దాంతం లేదుగనుక హేతువాదికి సిద్దాంతమేమీ లేదనే కదా! అంటే హేతువాదులు ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంటారేగాని, వారికి నిర్థిష్టమైన భావజాలం ఉండదని. ఈ ప్రకటన బాగుందంటారా?
నా అవగాహన ప్రకారం హేతువాదమంటే, ఆలోచనా క్రమంలో ఇమిడి ఉండే అంశాలను, సక్రమాలోచనకు పాటించవలసిన మెలకువలను, లేకనియమాలను వివరించి ప్రతి మనిషీ వాటిని గురించి తెలుసుకోవలసిన, నేర్వవలసిన, ఆచరించవలసిన అవశ్యకతను, అందువల్ల కలిగే ప్రయోజనాన్ని, లేకుంటే కలిగే నష్టాన్ని గురించి వివరించే సిద్దాంతమని, మానవ జీవితం కావలసినవి తెచ్చుకోవడం, నిలిపి ఉంచుకోవడం, పోవలసినవి పోగొట్టుకోవడం, రాకుండా చూసుకోవడం అన్న పనుల రూపంలోనే ఉంటుంది. ఇదంతా మనిషి గతానుభవాలను నెమరువేసుకుని, భవిష్యత్తుకు బాట వేసుకోవడం రూపంలోనే ఉంటుంది.
ఈ పనంతా ఆలోచనా ప్రక్రియకు సంబంధించినదే.
ఆలోచనంటే మానసికంగా చూడడమనే అర్థం. సక్రమాలోచనంటే సరిగా చూడడమనే. అందిన సమాచారం లేదా కలిగిన జ్ఞానం ఆధారంగా అటు గతంలోకో, ఇటు భవిష్యత్తులోకో చూడడానికి మెదడు చేసే పనినే ఆలోచన అంటారు. సక్రమమైన ఆలోచనే సరైన నిర్ణయాలకు దారి తీస్తుంది. సరైన నిర్ణయాలననుసరించి పనులు చేస్తేనే ఫలితాలూ సరిగా ఉంటాయి. ఎట్టి జ్ఞానమో అట్టి క్రియ, ఎట్టి క్రియో అట్టి ఫలితము అన్నది సార్వత్రిక నియమం. అందుకనే హేతువాదమన్నది సక్రమాలోచన అంటే హేతుబద్దాలోచన చేయమంటూ, ఎలా చేయాలో నేర్పుతానంటుండే సామాజిక దృక్పథంకల సిద్దాంతమది అంటున్నాను.
హేతుబద్దంగా ఆలోచించ వద్దనే వాళ్ళంతా బుద్దిలేనివాళ్ళే. ఎందుకంటే గతంలోకి చూడాలన్నా, భవిష్యత్తులోకి కదలాలన్నా ఆధారసహితమైన ఆలోచనే దిక్కు మనిషికి. అది ఏ మేరకు సరిగా లేకుంటే ఆ మేరకు జీవితం ఒడిదుడుకులతోనే సాగుతుంటుంది. ఆలోచన ద్వారా సరైన నిర్ణయాలకు రావడానికి తగిన (బలమైన) ఆధారాన్నే హేతువంటాము. ఆధారంగా తీసుకున్న దానికాబలాన్నిస్తున్న లక్షణాన్నే హేతుత్వం అంటాము. అలాగే హేతువనడానికి తగని ఆధారాన్నే అహేతువు హేత్వాభాస - అంటాము. హేతువుతోకూడుకున్న ఆలోచన సహేతుకాలోచన, హేతువనడానికి తగని దానితో కూడుకున్న ఆలోచన అహేతుకాలోచన. ఆయా విషయాలను గురించి హేతుబద్దంగా ఆలోచించగలిగినవాడు అంటే హేతువనడానికి తగిన ఆధారాన్ని కలిగి ఉన్న వాడు హేతుమంతుడు. అన్ని విషయాలలో హేతుమంతుడనడానికి తగినవాడు, ఏ ఒక్క విషయంలోనూ అహేతుకంగా ఆలోచించి ఉండనివాడు ఉండడు.
ప్ర.స్పం :- 1. యోచనాశీలుడైన మోషేకు నీ లేఖ పాఠకుల్ని, హేతువాదులలో వెంకటాద్రి గారి భావాలతో ఏకీభవిస్తున్న వారినీ, విభేదిస్తున్నవారినీ కూడా ఆలోచింపజేసేదిగనే ఉంది గనుక వారి నుండి ఎలాటి స్పందన వస్తుందో చూద్దాం.
స్పందన :- ఎం.కె. గౌరవ్ పిఠాపురం నుండి ఇలా వ్రాస్తున్నారు.
హేతువాదం సిద్దాంతం కాదు ఎందుకంటే, సమాజహితం కోసం ప్రతిపాదింపబడిన భావాలన్నీ ప్రామాణికమైన సిద్ధాంతాలు కానవసరంలేదు. అలాకాకుండా ఆయా కాలమానాలకు అనుగుణంగా సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకునే ప్రగతి గాముకులు తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాల్ని అనుసంధానించుకుని ముందుకు సాగిపోతారు. అంతమాత్రంలో వారి నిజాయితీని అనుమానించడం మనలోని నైచ్యానికి ప్రతీక అవుతుందే కాని ఔన్నత్యానికి కాదు.
హేతువాదం అనేది వ్యక్తిగత జీవన విధానానికి సంబంధించిందే తప్ప, వ్యక్తుల నిర్వచనాలకు లోబడే సిద్దాంతమని నేననుకోవడం లేదు. అటువంటి సిద్ధాంతంగా హేతువాదాన్ని గుదిగుచ్చడం మంచిదని భావించడమూ లేదు. అలా హేతువాదాన్ని కూడా ఒక సిద్దాంతంలో బంధిస్తే అదీ ఒక క్రొత్త మతమై కూర్చుంటుంది. హేతువాద ఆలోచనా రీతుల్ని పరిచయం చేసేందుకు అవసరమైన వైజ్ఞానిక దార్శనిక దృక్పధాన్ని, ప్రశ్నించే విమర్శనాత్మక దృక్కోణాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నానికి బదులు హేతువాదానికి కూడా ఒక గుదిబండ భావజాలాన్ని తగిలించడానికి ప్రయత్నించడం సబబుకాదు.
దార్శనిక దృష్టికల భావజాల వ్యాప్తికి సూత్రీకరణల అవసరంలేదు. ఎప్పటికప్పుడు ఆధునిక విజ్ఞాన సారాన్ని అందుకుంటూ, భావజాలంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ, తదనుగుణమైన ఆలోచనకు, ఆచరణకు ప్రాధాన్యతనిస్తూ, ముందుకు సాగడం హేతువాదులకుండాల్సిన లక్షణం. ఇది ముందుగానే సిద్దం చేసుకున్న సిద్దాంత చట్రంలో ఇమిడే లక్షణం కాదు. అలా బలవంతంగా భావజాలంలో ఇమడ్చబడ్డ సిద్దాంతాలన్నీ ఈ సరికే మనిషిలో మతోన్మాదానికి సమానమైన భావనియంతృత్వాన్ని ప్రవేశపెడుతున్నాయి.
హేతువాదం, ఏ వ్యక్తికావ్యక్తి నిబద్దతతో కూడిన ఆంతరిక వ్యాయామం ద్వారా స్వయంగా గ్రహించవలసిన వివేకవంతమైన ఆలోచనా సరళికి సంబంధించిన వివేచనా పూర్వక జీవన విధానమే కాని నిర్వచనాలకు పరిమితమైన భావజాలంకాదు. అందుకే మిత్రులు వెంకటాద్రి గారన్నట్లు, హేతువాదానికి మార్గదర్శక గ్రంథాలు తప్పితే ప్రామాణిక గ్రంథాలనేవి ఉండవు.
ఇక హేతువాద ప్రచారోద్యమాలకి సరిపడ సాహిత్యం మనకు అందుబాటులో లేదనే కొంత మంది వాదనకూడా నిజం కాదు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకంటే, మన దేశంలోనూ, అందునా ఇతర రాష్ట్రాలకంటె మన రాష్ట్రంలోనూ శాస్త్రీయ సాహిత్యం బాగానే అందుబాటులో ఉంది. హేతువాద భావజాలాన్ని సమర్థిస్తున్న భిన్న ఆలోచనాధోరణులకు చెందిన సంస్థలు అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని ఇతర ఆర్థిక వనరుల్నీ సమన్వయం చేసుకుని పరిమితులతో కూడిన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.
వీలయితే, అలా నిజాయితీగా పాటుపడుతున్న హేతువాద నాస్తిక సంఘాల చైతన్యయుత సాహిత్యాన్ని వారి ప్రజా ప్రచురణల్ని వ్యాప్తి చేసే నిర్మాణం పై దృష్టి పెట్టడం భావవికాసోద్యమాలకు దోహదం చేసే సమష్టి కార్యాచరణను కాంక్షించే కార్యకర్తల బాధ్యత కావాలేకాని, ఏకరూప భావజాలంతో ప్రామాణికగ్రంథాలను కూర్చడానికి హేతువాదం మత గ్రంథం కాదు.
గమనిక :- ఈ మధ్య రాష్ట్రంలో హేతువాదానికి సిద్దాంతాన్ని ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని సంఘాలకు స్పష్టత చేకూర్చే ఉద్దేశంతోనే ఇది వ్రాయడమైనది.
ప్ర.స్పం :- యోచనాశీలుడవైన గౌరవ్‌కు, మరియూ అతని భావాలనంగీకరిస్తున్న, విబేధిస్తున్న పాఠకులకు :- లేఖను రెండుగా విడదీసి అర్థం చేసుకుంటే బాగుంటుందనిపిస్తోంది.
1) వ్యక్తులను, సంస్ధలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు, 2) విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాటలు
ఒకటవ అంశం మమ్మల్ని అంటే గత మూడు నాలుగు మాసాలుగా హేతువాద సిద్ధాంత భావజాలాన్ని గుదిగుచ్చాలంటూ హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాల పేరిట ప్రయత్నాలు చేస్తున్న వారినీ, ముఖ్యంగా నన్ను ఉద్దేశించిందిగా ఉంది. అట్టివాటిని మచ్చుకు కొన్నింటిని రాస్తున్నాను. లేదా మొత్తంలోని భావాలను మీరు ఎవరికి వారుగా వ్రాయండి చూద్దాం.
1) నేను, హేతువాదం సిద్దాంతం కాదనడం సరికాదు. అది ఒక సిద్దాంతమే నంటున్నాను. అది తప్పంటున్నాడు గౌరవ్.
2) దానినో సిద్దాంతంగా తయారు చేయాలనుకోవడం హేతువాదానికి ఒక గుది బండను తగిలించడమే.
3) భావజాల రూపంలో సిద్దాంతాలుగ తయారు చేయబడినవన్నీ మతోన్మాదానికి సమానమైన భావనియంతృత్వాన్ని తెచ్చిపెడతాయి. కనుక అట్టి పని చేయకండి.
4) మొదటిపేరాలో ఎవరో ఎవరి నిజాయితీనో శంకించేపని చేస్తున్నట్లు, అది సరికాదన్నట్లు అర్థాన్నిచ్చే మాటలున్నాయి. అవి ఎవరిని ఉద్దేశించి అన్నవో స్పష్టంగా అర్థం కావడం లేదు.
5) హేతువాదం నిర్వచనాలకు లోబడే సిద్దాంతం కాదు. దానినో సిద్దాంతంగా తయారు చేయడం మంచిదికాదు.
6) సిద్దాంతాన్ని రూపొందించేపనినాపి, ఉన్న సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి పూనుకోవడమే హేతువాదుల బాధ్యత.
ఏక రూప భావజాలంతో సిద్దాంత - ప్రామాణిక - గ్రంధాన్ని రాయడానికి హేతువాదం ఒక మతం కాదు.
రెండవ అంశం :-
1) హేతువాదానికి సరిపడినంత సాహిత్యం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉంది.
2) హేతువాదం నిర్వచనాలకి పరిమితమైన భావజాలంకాదు. అది వ్యక్తిగత జీవనానికి సంబంధించినది మాత్రమే.
3) హేతువాదాన్ని సిద్దాంతంలో బంధిస్తే అది ఒక క్రొత్త మతమై కూర్చుంటుంది.
4) దార్శనిక దృష్టికల భావజాల వ్యాప్తికి సూత్రీకరణల అవసరంలేదు.
పాఠకమిత్రులారా !
ఇవి గౌరవ్‌లేఖలోని కొన్ని అభిప్రాయాలు. దీని పై ఇక్కడ ఇప్పుడు నేను విమర్శను ఆరంభించడం లేదు.
విమర్శకు ముందు అవసరమైన కొన్ని మాటలను చెపుతాను. అవి సరైనవో కావో అతనూ, మీరూ తేల్చండి.
1) పదపదార్ధ జ్ఞానం లేనివానికి వాక్యార్ధ జ్ఞానం కలుగదు.
2) వక్త - రచయిత - హృదయం మనకు చేరిందని నిర్ణయించుకున్నాకనే, దాని బాగోగుల గురించి ఆలోచించాలి.
3) వక్త హృదయాన్ని సరిగా గ్రహించడానికి వీలుగా, అవసరమైన లేదా ముఖ్యమైన పదాలకు అర్థాలను అన్న వారినే అడిగి తెలుసుకోవాలి. ఆ పైన అతనన్న అర్ధం భాష అంగీకరిస్తున్నదో లేదో చూసుకోవాలి.
4) ఒక అభిప్రాయాన్ని ప్రకటించిన వాడు, ఆ అభిప్రాయం సరైందేనని నిరూపించే బాధ్యత తీసుకోవాలి. అంతేగాని, నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. దానిపై చర్చ వద్దు అని అనకూడదు.
5) తాను వెలిబుచ్చిన భావం సరైందేనని నిరూపించలేకపోయినా, సరికానిదని విచారణలో తేలినా దానిని చెప్పడం మానడమో, విడిచిపెట్టడమో చేయాలి. నాది నాదేనంటూ దానినే పట్టుకుని కూర్చోరాదు.
గమనిక :- 1) గౌరవ్ లేఖలో ఎన్ని అభిప్రాయాలున్నాయో అతను - మీరూ తేల్చండి ముందు అటు పైన ఒక్క దానినే విచారణకు తీసుకుందాం.
2) లేఖలో ముఖ్యమైన పదాలేమిటో, వాటి అర్థాలేమిటోనూ తేల్చుకోవాలి. అర్థాలు చెప్పే బాధ్యత గౌరవ్ స్వీకరించాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కల అంశం. భాషా నియమాలలో మొదటిది కూడా.
3) గౌరవ్ లేఖ, పొరపాటున తప్పు మార్గం పట్టిన మనల్ని - నన్ను - సరిచేయడానికి ఉద్దేశించిందిగా ధ్వనిస్తోంది. అందులో మేము ఏమి చేయడానికి పూనుకున్నామో అది తప్పన్నట్లు దానివల్ల మరోబండ ప్రజలపై పడుతుందన్నట్లు చెప్పడమేగాక, ప్రత్యామ్నాయంగా ఏమి చేస్తే బాగుంటుందోనూ సూచించారతను ఆ విషయాన్నే లేఖ చివరివాక్యం ద్వారా తెలియపరిచాడు కూడాను. ఇప్పటికాగుతాను అతనూ (మరికొందరూ) సిద్దపడితే విచారణ మొదలెట్టుకోవచ్చు.
కనుక హేతువాదం విషయంలో ఏర్పడ్డ అపోహల్ని తొలగించుకోవలసిన అవసరం మనందరికీ ఉంది.

No comments:
Post a Comment