1. జ్ఞానేంద్రియాల వివరాలు :
యోచనాశీలురైన మిత్రులారా ! క్రమాన్ననుసరించి జ్ఞానేంద్రియ వ్యవస్థ, అది పనిచేస్తున్న తీరు - పరికరాల వివరాలు, శరీరనిర్మాణ శాస్త్రం నుండి తీసుకుని చూద్దామనుకున్నాం. నిపుణులతో సమావేశం కాలేదు గాని కొన్ని వివరాలు సేకరించాం.
సాంప్రదాయకంగా (స్థూలంగా) అందరం అంగీకరించిన ''5'' జ్ఞానేంద్రియాలను ఆ శాస్త్రం అంగీకరిస్తోంది. ఆ ఐదిం ద్వారా తెలియబడని మరో 4, 5 విషయాల గురించి ప్రస్తావిస్తోందది.
1) బ్యాలెన్స్‌కు చెందిన ఎరుక : బ్యాలెన్స్‌కు సరైన తెనుగు పదం తరవాత చూద్దాం. ఇప్పికి 'సమతుల్యత' అన్న మాటను వాడుతున్నాను. ముందు వెనకలకు గానీ, ప్రక్కలకు గానీ వాలుతున్నామా? వాలివున్నామా? అన్నది మనకు స్పృహలో వున్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఒకవేళ అన్యాపదేశంగా ఉండి దానిని గమనించకున్నా, దానిపై మనస్సుప్టిె ఎలావుంది స్థితి అన్నది చూసుకుంటే ఎలా వున్నామో తెలుస్తుంటుంది. ఇలా సమతుల్యతను, తూలుడును, వాలుడును తెలుసుకోడానికి ఉపకరించే పరికరం లోపలి చెవిలో ఉంది. దానిని 'సెమీసర్క్యులర్ కెనాల్సు' అని ఆంగ్లంలో అంటున్నారు. అసంపూర్ణ లేదా అర్థవృత్తాకార కాలువ గ్టొాలన్నమాట అవి. మూడున్నాయి. మన సమతుల్యతను, ఏటవాలుల్ని గమనించడానికి ఉపయోగించే వాటర్ లెవల్ లేదా స్ప్‌ిం లెవల్ ఉందిచూడండి, అలాి పరికరమేనన్నమాట ఇదిన్నూ.
2) శరీర ఉష్ణోగ్రతను గ్రహించడానికి శరీరంలో తగిన వ్యవస్థ ఉంది. అది స్పర్శేంద్రియం ద్వారా గమనించే ఉష్ణం కాదు. బాహ్యంగా చల్లి ప్రదేశంలో ఎ.సి. గదిలో వున్నా శరీరంలో జ్వరం వున్నప్పుడు జ్వరంగా వుందని తెలుస్తుంటుంది చూడండి, అదన్నమాట. చర్మం ద్వారా గమనించే శీతోష్ణాలకు వేరుగనే వైద్యశాస్త్రం దీనిని ప్రస్తావిస్తోంది.
3) శరీరావయవాల కంపము, అదురుపాటు, గుండెదడ లాి వాిని ఎరిగే వ్యవస్థ గురించీ ప్రస్తావిస్తోందా శాస్త్రం.
4) బరువును, వత్తిడిని తెలుసుకునే దానిని గురించీ చెబుతూ అది ప్రెషర్ - టెన్షన్ (లాగుడు, నెట్టుడు అన్న రెండూ వత్తిడికి చెందినవే) ద్వారా తెలుస్తుందోంంది.
5) పెయిన్ : నొప్పికి చెందిన జ్ఞానమూ ఈ ఐదు ఇంద్రియాలకు సంబంధించింది కాదు అనంటుందా శాస్త్రం.
స్త్ర ఆయా ఇంద్రియాల సమాచారాన్ని అందిపుచ్చుకునే లేదా ఆయా ఇంద్రియాలు తమకందిన సమాచారాన్ని చేరవేసే కేంద్రాలు మెదడులో వేరువేరుగా వున్నాయి. సమాచారం అక్కడకు ముందుచేరి అక్కడనుండి విశ్లేషించబడి నిర్ణయించే కేంద్రానికి చేరవేయబడి ఆయా విషయజ్ఞానం కలుగుతుంటుందన్నంత వరకు గతంలో మనమనుకుంటున్న రీతే ఉంది.
ఈ విషయంలో వెంకాద్రి గారు చాలా దూకుడుగా అస్సలు ఐదింద్రియాలు మాత్రం ఎక్కడున్నయ్, అంతా ఒక్క చర్మేంద్రియం పనే ఇదంతా అన్నదే సరైన అవగాహన అన్న తీర్మానం చేసేశారు. ఒకరంటే ఒక్కరు అదేిం అలా అనేశారు? అనడిగిన పాపానపోలా. స్వతంత్రాలోచనా పరులం, ఎవరినీ ప్రమాణంగా స్వీకరించం అంటుండే హేతువాదులనబడేవాళ్ళు. చర్మాన్ని, మాంసాన్ని, స్నాయువులను, కొవ్వును ఇలా శరీరంలోని అన్ని ద్రవ్యాలను, వస్తువుల్ని కూడా చర్మం క్రింద కప్పేద్దామనే!? గొప్ప విజ్ఞానమే! గొప్ప దార్శనికతే.
నిజానికి ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం కానీ, సాంప్రదాయకుల అవగాహన ప్రకారం గానీ, ఆయా విషయాల సమాచారాన్నందించేవి నాడులే. చర్మం అని వైద్యశాస్త్రం అంటున్నది జ్ఞానేంద్రియం కాదు. నిజానికి స్పార్శక నాడులు చర్మమంతా విస్తరించి ఉంాయి. అవి స్పర్శను, చల్లదనాన్ని, వెచ్చదనాన్ని, రాపిడిని ప్రధానంగా ప్టిస్తాయి. ఆ నాడి చెడినా, దానికి మత్తుకలిగించినా చర్మం బాగానే ఉంటుంది గాని స్పర్శ ఉండదు. వెంకాద్రి తానేదన్నా చెల్లుబడవుతుందనో, తననంగీకరించని వారంతా అవగాహనాశూన్యులనో అనుకుని చేస్తున్న పనులే ఇవన్నీ. నిజానికి ఆయా విషయాలను ప్టించే పరికరాలు వేరే వేరే. అవి ఒకదాని పని ఒకి చేయలేవు. ఈ ముఖంగా నేను వెంకాద్రి గారిని ప్రామాణికునిగ నెత్తికెత్తుకున్న వారందరికీ ఉద్యమ శ్రేయస్సు దృష్ట్యా చేస్తున్న హితసూచనేమంటే, మునుముందుగా ఆయన్ను నెత్తినుండి క్రిందకు దించండి. వేరొకరిని కూడా నెత్తికెక్కించుకోకండి. స్వతంత్రంగా ఆలోచించడం అలవర్చుకోండి.
విచారణ క్రమాన్ననుసరించి హేతువాదమంటే ఏమి? సిద్ధాంతమంటే ఏమి? హేతువాదం సిద్ధాంతమా? కాదా? అన్న అంశాల్ని విచారించాల్సి ఉంది. శ్రద్ధగా మనస్సుప్టిె నిదానంగా పరిశీలిస్తూ సాగితేగాని అర్థంకాని స్పష్టత చేకూరని అంశాలివి. కనుక మనస్సుప్టిె జాగ్రత్తగా పరిశీలించండి వీిని.
1. వెంకాద్రి హేతువాదం అన్నదొక సిద్ధాంతం కాదు. అదొక మెథడాలజీ - విధానం - అంటున్నారు.
2. నేను అదొక సామాజిక స్పృహ కలిగిన తాత్విక ధోరణికి చెందిన సిద్ధాంతం అంటున్నాను. సామాజిక తత్వశాస్త్రంలో భాగమైన సిద్ధాంతం అనంటున్నాను.
గమనిక : ఇలాి సందర్భాలకు వర్తించే విచారణ నియమం ఒకటుంది. ఏదైనా ఒక విషయంపై అనేకుల మధ్య భిన్నాభిప్రాయాలేర్పడితే అక్కడితో చర్చనాపి, విచారణను 'వాస్తవాలతో సరిపోల్చడం' అన్నవైపుకు (దగ్గరకు) చేర్చాలి. కనుక ఆయనా, నేను కూడా ముందుగా సిద్ధాంతమంటే ఏమిో, హేతువాదమంటే ఏమిో స్పష్టంగా (ఇదమిద్దంగా) ప్రకించాలి. అటుతరువాత ఆ రెండు వేరు వేరని ఆయన, రెండూ వేరు కాదని నేను వాిని సరిపోల్చి చూపాలి. ఈ విషయం ఒక కొలిక్కి రావడానికి అంతకంటే మార్గం లేదు.
స్త్ర ఒకవేళ మా ఇరువురిలో ఎవరో ఒకరు అందుకు సిద్దపడలేక పోతే అప్పుడేమి చేయాలి?
సమాధానం : అందులో ఏ ఒక్కరైనా తానన్నది సరైందేనని నిర్థారించగలిగితే దానితో విభేదించే ఇతరాలన్నీ సరైనవి కావని తేల్చినట్లే అవుతుంది. ఎందుకంటే ఒక విషయానికి సంబంధించి ఒక సత్యమే ఉంటుంది కనుక. దీనికి సంబంధించిన ఒక నియమము - సూత్రం - ఒకటుంది.
స్త్ర ఒక విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమై, వాిలో ఏది సరైందన్న విచారణ మొదల్టెాక అందులో ఒకి సరికాదని తేలినా మరొకి సరైందని తేలినట్లు కాదు. అందులో ఎన్ని సరికానివని తేలినా సరైందేదో తేలినట్లు కాదు. అదేమరి అందులో ఏ ఒక్కీ సరైందని నిర్ధారణైనా, మిగిలినవన్నీ సరికానివని తేలినట్లే అన్నదే ఆ నియమం. ఈ అభిప్రాయం నియమంగా పనికివస్తుందో, లేదో, తేల్చుకోండి మీరూ.
స్త్ర వెంకాద్రిగారు గానీ, వారి పక్షాన్ని అంగీకరించిన వారుగానీ ఏమిచేయాలి?
వారు హేతువాదాన్ని ఒక విధానమంటున్నారు కనుక, విధానానికి ఉండాల్సిన లక్షణాన్ని దానికున్నట్లు నిర్ధారించాలి. సిద్ధాంతం కాదంటున్నారు కనుక సిద్ధాంత లక్షణాలేవీ దానికి లేవని నిర్ధారించాలి. ఈ రిెం బాధ్యతా వారిపై ఉంది. ఏ విధానానికైనా పరికరాలు - ఒక క్రమంలో ఒక దగ్గర పని మొదలై ఒక దగ్గర ముగియడమూ, అది కూడా నిర్ధిష్ట ఫలితాన్ని ప్టుించేదిగా ఉండడమూ అన్నది సాధారణ లక్షణం. నిజమా? కాదా? మరిప్పుడా పక్షం ; హేతువాదమన్న విధానానికి అవసరమైన పరికరాలేమిో, పని ఎక్కడ ఎలా మొదలై ఎలా సాగి ఎక్కడ ముగుస్తుందో - ఏ ఫలితాన్ని సాధించడానికది ఎక్కడ వాడబడిందో, వాడబడుతూఉందో స్పష్టంగా ప్రకించాలి. అదేోం చూపకుండా అదొక విధానం, అదొక విధానం అని ఎన్నిసార్లంటే ఏముంది?
వెంకాద్రి అది సిద్ధాంతం కాదు, అదొక విధానం అంటూ గత 20, 30 ఏండ్లుగా వందలసార్లు అంటున్నా, ఆమాట హేతువాదులం అనుకుంటున్నవారు వింటూనే వున్నా ఒక్కరంటే ఒక్కరూ విధానం అంిరిగాని, ఆ విధానపు రూపురేఖలు ఎక్కడా ప్రస్పుటంగా చూపించనేలేదేమి? అని అడగనే లేదు. ఒక విధానం గురించి వివరించడానికి పరికరాలు, క్రమబద్దమైన పని - ఫలితము అన్న వాిని తప్ప ఇంకేమీ ప్రస్తావించనఖ్ఖర్లా. గొప్ప విచారకరమూ - విడ్డూరమూ కూడా అయిన అంశమేమంటే - ఇదీ హేతువాద విధానమంటే, అనిగాని, ఈ ఫలితాన్ని సాధిస్తుందా అనిగాని, ఈ వైజ్ఞానిక క్షేత్రంలో వాడుతున్నారు దీనిని అనిగాని ఎక్కడా ప్రకించలేదాయన.
మరో విడ్డూరం, - అడ్డగోలుతనం - ఆ పక్షంవారి పోకడలో ఉంది. హేతువాదమంటే అదొక మానసిక వైఖరి అని ఒకసారీ, ఆలోచనా విధానమని ఒకసారీ, భావవిప్లవోద్యమమని ఇంకొకసారి సిద్ధాంతాలు రాబట్టే పద్ధతని మరోసారీ ఇలా ఎలాపడితే అలా మ్లాడేస్తూ వస్తున్నారు. హేతువాది అలావుాండు, ఇలా వుాండు, అనడమే కాకుండా అది వ్యక్తుల గ్రంథాల ప్రామాణికతను కాదంటుంది. ప్రయోగరీత్యా నిర్ధారించుకొమ్మంటుంది అనీ అంటున్నారు.
అక్కడక్కడా వారే వెలిబుచ్చుతూ వచ్చిన భావాలన్నింనీ గుదిగుచ్చితే అది ఒక మెథడాలజీ అన్నది తేలకపోగా, సామాజిక స్పృహ కలిగి, వ్యక్తుల తలకాయల్ని సక్రమపరచాలనుకుంటుండే భావాల సమాహారం 'రీలిశి ళితీ రిఖిలిబిరీ' అని నిఖ్ఖచ్చిగా తేలిపోతుంది.
వెంకాద్రి గారికీ, వారి బృందానికీ కూడా సిద్ధాంతమన్న పదంపైనే వ్యతిరేక భావన ఉన్నట్లుంది. హేతువాదమే గాక, మానవవాదం కూడా నిజానికి సిద్ధాంతం కాదు. అదొక ఆలోచనా విధానం అనే అక్కడక్కడా అంటూవచ్చారు. ఇదంతా అవగాహనా రాహిత్యంనుండి ప్టుిన తాత్విక గందరగోళం మాత్రమే. ఈ నామాట తొందరపాటుతో కూడిన ఆరోపణ అనిగనక అనదలుచుకుంటే అనవసరపు రచ్చలు, అసందర్భాంశాల వివరణలు, వ్యంగ్యోక్తులు ఆపి, హేతువాద విధానం ఏమిో నిర్ధిష్ట రూపంలో ప్రకిస్తే సరిపోతుంది. ఎన్నిసార్లామాట అడుగుతున్నా, చేయాల్సిన ఈ పనిమాత్రం వారు చేయడం లేదు.
మరొక్క మాట. వారే ఉట్టంకించిన అంతర్జాతీయ సంస్థ వారి హేతువాద నిర్వచనం గానీ, రేషనలిజం 'జీబిశిరిళిదీబిజిరిరీళీ'పై పలువురు ప్రకించిన అభిప్రాయాలు గానీ, ఆలోచనా ధోరణి, మానసిక వైఖరి లాి ప్రయోగాలు గానీ హేతువాదాన్ని - ఒక తాత్విక ధోరణి అని అనుకోడానికే అనుకూలంగా ఉన్నాయి.
గమనిక : ఈ వివరాలతో వ్యాసం ముగిస్తే నావంతు కర్తవ్యాన్ని నిర్వహించినట్లు కాదు. ఆయన ఏమిచేయాల్సి ఉందన్నానో నేనూ అదే చేయాల్సి ఉందికదా, పద్ధతి ప్రకారమైతే.
ప్రతిపాదకులే తమ ప్రతిపాదన సరైందేనని నిర్ధారించే బాధ్యత వహించాలన్నది అందరికీ వర్తించే నియమం. అదీగాక పద్ధతెరిగిన వారికి వాదరీతిలో పరమత ఖండనతో పాటు స్వమతస్థాపన అన్నది ఉంటుంది.
నా పక్షం :
1. సిద్ధాంతమన్న మాటకు ఏ అర్థం చెప్పుకోవాలి? ఆ అర్ధమే ఎందుకు చెప్పుకోవాలి? అన్నది నిర్ధారించాలంటే, అందుకు ముందుగా మరికొన్ని సాధారాణాంశాలను వివరించుకోవలసి ఉంది.
2. ఎ. ఆ పదానికి భాష అంగీకరిస్తున్న అర్థం లేదా అర్ధాలు ఏమి? అని చూడాలి.
బి. ఆయా విజ్ఞానశాస్త్ర క్షేత్రాలలో లేదా సిద్ధాంతమన్న మాటను రూఢిగా వాడే రచనల్లో దాని అన్వయం (బిచీచీజిరిబీబిశిరిళిదీ) ఎలా ఉంది? అనైనా ప్టిచూడాలి.
3. సిద్ధాంతాలుండే క్షేత్రాలు ప్రధానంగా రెండు. విజ్ఞాన శాస్త్రాలు - తత్వశాస్త్రాలు. వాిలోని అధికరణాలు - వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్నవే.
గమనిక : 1. ఒక ప్రత్యేక పరిశోధనాంశాన్ని గురించి ఆయా పరిశోధకులు నిర్దిష్టరూపంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లేదా ప్రతిపాదనలనే సిద్ధాంతాలాంరు.
స్త్ర శాస్త్రాలను పుస్తకాల రూపంలోగాని, అంతర్జాలంలో గాని పరిశీలించండి. సిద్ధాంతం - థియరీ - అన్నదానికి నిర్వచనాలెలా వున్నాయో తెలుస్తుంది.
2. వైజ్ఞానిక క్షేత్రాలలో ఒక్కో పరిశోధనాంశంపై అనేక సిద్ధాంతాలూ ఉండవచ్చు. ఉదాహరణకు : ఎ) పరమాణువు అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుందన్న దానిపై అనేక నమూనాలున్నాయి. బి) విశ్వం ఎలా వునికిలోనికి వచ్చిందన్న దానిపై వివిధ సిద్ధాంతాలున్నాయి.
3. సిద్ధాంతాలు, నియమాలు, సూత్రీకరణల రూపంలో తప్ప శాస్త్రీయ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేయలేము, ప్రకించలేము, అర్థం చేసుకోలేము, వివరించుకోలేము. కనుకనే వివిధ ప్రకృతి విజ్ఞాన శాస్త్రాలలోనూ, సామాజిక శాస్త్రాలలోనూ, తాత్వికాంశాల పరంగానూ సిద్ధాంతాలే ఉంటున్నాయి.
స్త్ర ప్రతి అభిప్రాయాన్నీ సిద్ధాంతమనక్కరలేదుగాని, ప్రతి సిద్ధాంతమూ ఏదో ఒక ప్రత్యేకాంశానికి చెందిన అభిప్రాయ ప్రకటన రూపమే.
4. ఒక్క ప్రతిపాదననూ సిద్ధాంతమంటున్న సందర్భాలున్నాయి.
ఉదాహరణ : ఎ. మహావిస్ఫోటన సిద్ధాంతం (లీరివీలీబిదీవీ శినీలిళిజీగి), బి) గురుత్వాకర్షణ సిద్ధాంతం.
5. ఎ) ఉష్ణగతిక శాస్త్రం - ధర్మోడైనమిక్స్ - లోని 'శక్తి - ద్రవ్య' నిత్యత్వ సిద్ధాంతం.
బి) విశ్వంలో క్రమత తగ్గుతూ క్రమరాహిత్యం పెరుగుతోంది - ఎంోపి ఇంక్రీజెస్ - అన్న సిద్ధాంతం
సి) ఎక్కువ ఉష్ణోగ్రత నుండి తక్కువ ఉష్ణోగ్రత వైపుకు ఉష్ణప్రవాహం, ఉష్ణ సమతాస్థితి ఏర్పడే వరకు కొనసాగుతుంది.
6. విశేష సాపేక్ష సిద్ధాంతం (రీచీలిబీరిబిజి జీలిజిబిశిరిఖీరిశిగి శినీలిళిజీగి). కాంతి వేగం స్థిరమైనది. ద్రవ్యరాశి కలదేదీ కాంతి వేగంతో ప్రయాణించలేదు.
7. సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఎ) స్థలము - కాలము వక్రీభవనం చెందుతాయి (రీచీబిబీలి- శిరిళీలి బీతిజీఖీబిశితిజీలి). బి) కాంతికి కణధర్మం ఉంది.
8. ఎ) విశ్వం వ్యాకోచిస్తోంది, వ్యాకోచిస్తూనే ఉంటుంది. బి) విశ్వం యధాతధంగా స్థిరంగా ఉంది. సి) విశ్వం వ్యాకోచిస్తుంది, తిరిగి సంకోచిస్తుంది. అలా సంకోచ వ్యాకోచాలు అనాదిగా జరుగుతునే వచ్చాయి. అనంతంగా జరుగుతునే ఉంాయి.
9. అనిశ్చయతా సిద్ధాంతం (శినీలిళిజీగి ళితీ తిదీబీలిజీశిలిదీరిశిగి ళిజీ తిదీబీలిజీశిబిరిదీశిగి చీజీరిదీబీరిచీజిలి) .
10. విశ్వంలో కాలబిలాలు వున్నాయి (లీజిబిబీది నీళిజిలిరీ).
విశ్వ నిర్మాణమూల థాతువులు (ఓతిదీఖిబిళీలిదీశిబిజి చీబిజీశిరిబీజిలిరీ)
1. విశ్వం పాంచభౌతికం - ప్రాచీన భారతీయులలో అధికుల సిద్ధాంతమిది. 2. విశ్వం చతుర్భూత నిర్మితం - అరిస్టాిల్ - మరికొందరు భారతీయ చింతకుల సిద్ధాంతం. 3. విశ్వం సత్వరజస్థమస్సులనే మూి కూడిక. సాంఖ్య సిద్ధాంతం. 4. 92 మూలకాల చేత నిర్మితమైందన్నది, ఒకనాి ఆధునిక విజ్ఞానం. 5. ఎలక్ట్రాన్, ప్రోాన్, న్యూానులే మూలథాతువులన్న సిద్ధాంతం. 6. క్వార్కులనబడేవే మూలకణాలన్న సిద్ధాంతం. 7. గువాన్లనబడేవే ప్రాథమిక కణాలన్న సిద్ధాంతం.
గమనిక : ఈ విషయంలో అసలు వాస్తవం లేదా నిజం ఏమిటన్నది ఈనాికీ మనకు తెలియదు.
సామాజిక శాస్త్రాలలోని సిద్ధాంతాలు
1. రాజ్యం - సమాజ పాలనా వ్యవస్థ - ఎలా వుండాలన్న దానిపై వివిధ సిద్ధాంతాలు. 2. నీతిశాస్త్రంలో నీతిని గురించి చెబుతున్న వివిధ సిద్ధాంతాలు. 3. అర్థశాస్త్రంలో ఆర్థిక వ్యవస్థల గురించి చెబుతున్న సిద్ధాంతాలు. 4. సమాజ పరిణామం ఎలా జరిగిందన్న దానిపై వివిధ సిద్ధాంతాలు. ఉదా : మోర్గాన్ సిద్ధాంతం, ఏంగెల్స్ సిద్ధాంతం. 5. ఉత్తమ సమాజమంటే ఏమిటన్న దానిపై వివిధ సిద్ధాంతాలు. 6. జాతుల సిద్ధాంతము. 7. ఆర్య ద్రావిడ సిద్ధాంతము వగైరా వగైరాలు.
తత్వ శాస్త్రాలలోని వివిధ సిద్ధాంతాలు
1. ఆస్తిక సిద్ధాంతము - వివిధ ఆస్తిక సిద్ధాంతాలు.
2. నాస్తిక సిద్ధాంతము - వివిధ నాస్తిక సిద్ధాంతాలు.
3. ఆస్తిక, నాస్తికేతర సిద్ధాంతాలు ఉదా : అజ్ఞేయవాదం, శుద్ధ భావవాదం, అద్వైత వాదం.
4. ఎ) చేతనం నుండి జడం వచ్చిందనే సిద్ధాంతం.
బి) జడం నుండి చేతనం వచ్చిందనే సిద్ధాంతం.
సి) జడ చేతనాలు రెండూ అనాది నిత్యాలనే సిద్ధాంతం.
డి) ఈశ్వరుడు జగత్తుకు నిమిత్తకారణమనే సిద్ధాంతం.
ఇ) ఈశ్వరుడు జగత్తుకు అభిన్న నిమిత్తోపాదాన కారణమనే సిద్ధాంతం.
ఎఫ్) పరిణామ సిద్ధాంతం. ఉన్నవి ఒక క్రమంలో వికసిత దిశగా మారుతున్నవనే సిద్ధాంతం.
జి) ఉన్నది - ఆదిమ పదార్థం - ఉన్నట్లుగానే ఉంది. రకరకాలుగా వ్యక్తమవుతోంది. అదే వివర్తవాద సిద్ధాంతం.
హెచ్) కారణం నశించి కార్యం పుడుతుందనే సిద్ధాంతం,
ఐ) కారణం నశించకనే కార్యం పుడుతుందనే సిద్ధాంతం.
జె) కార్యం పుట్టక ముందే కారణంలో సూక్ష్మరూపంలో ఉంటుందనే సిద్ధాంతం.
కె) కార్యం పుట్టక పూర్వం ఏ రకంగానూ కారణంలో వుండదు. అది క్రొత్తది (అపూర్వం) అనే సిద్ధాంతం.
ఎల్) దేహమే ఆత్మ అనే సిద్ధాంతం.
ఎం) ప్రాణమే ఆత్మ అనే సిద్ధాంతం.
ఎన్) అన్నీ కలసిన రూపమే ఆత్మ అనే సిద్ధాంతం.
గమనిక : వివిధ ఆస్తిక సిద్ధాంతాలు, వివిధ నాస్తిక సిద్ధాంతాలు ఇలా బహు సంఖ్యాకంగా వున్నాయి సిద్ధాంతాలు. ఇలా ఇవన్నీ వివిధాంశాలపై శాస్త్రాల రూపంలో గుదిగుచ్చబడి, వివిధ వ్యక్తులు ప్రకించినవై సిద్ధాంతాలనబడుతున్నాయి.
మిత్రులారా ! ఇప్పి వరకు భాష ద్వారా సిద్ధాంతాల పేరున మనకందుతూ ఉన్న వాినన్నింనీ వాి పేర్ల వరకు రాస్తూ జాబితా తయారు చేసినా అక్కడికదే కొన్నివేల సంఖ్య అవుతుంది. వాిలోని సామాన్యాంశాన్ని బ్టి జాబితా తయారు చేసినా అవైనా వందల సంఖ్యలోనే ఉంాయి. స్పష్టత కొరకుగాను మరో విషయాన్నీ చెప్పాలిక్కడ. ఆయా విధానాలు, పద్ధతులు (ళీలిశినీళిఖిరీ) మీదా అనేక సిద్ధాంతాలుాంయి. మెథడాలజీ - విధాన విజ్ఞాన శాస్త్రం లోకి వెళితే ఆ వివరాలుాంయి. తర్కశాస్త్రమూ అలాిదే. ఒకవంక అది సక్రమాలోచనా నియమాల శాస్త్రం అని అంగీకరిస్తూనే అద్వైత తర్కం, బౌద్ధ తర్కం, పాశ్చాత్య తర్కం పేరున అనేక సిద్ధాంతాలున్నాయి. ఆలోచన అన్నది పనే. కనుక అది ఒక విధానంలోనే - పరికరాలతో కూడే జరుగుతుంటుంది. కనుక 'విధానం' అన్న అంశంపైనా సిద్ధాంతాలుండవచ్చు. విధానం గనుక సిద్ధాంతం కాదనడం సరికాదు. ఇదంతా మేమిరువురం చెబుతున్న వాిలో ఏది సరైందో తేల్చుకోడానికి గాను, పరిశీలకులు చూడాల్సిన క్షేత్రాన్ని మీముందుంచే పనే. ఇలా చూడడం చేతరాకపోయినా, చేతనయ్యీ చూడకపోయినా మా ఇరువురిలో ఎవరంటున్నది వాస్తవానికి అనుగుణ్యత కలిగుందో (సరైందో, సత్యమనదగి ఉందో) నిర్థారించడం సాధ్యపడదు. తగినంత ప్రాధాన్యతనిచ్చి ప్టించుకొని చూస్తేగాని, అర్థంకాని, నిర్థారించుకోలేని అంశాలివి. శ్రద్ధప్టిె పరిశీలించండి ఈ క్షేత్రాన్ని. ఎంతోకొంతైనా సొంతబుద్దిని వాడండి.
ఇప్పుడు హేతువాదం ఒక సామాజిక తత్వసంబంధమైన సిద్ధాంతమేననాలంటే ఏమిజరగాలి? ఏమి తేలాలి?
1. అది ఏదేని విషయంపై నిర్థిష్ట రూపంలో అభిప్రాయ ప్రకటన చేసిఉండాలి.
2. అలాగే అనేక విషయాలపైనా ఒక క్రమంలో భావాలను వెల్లడించైనా ఉండాలి.
3. వ్యక్తినుద్దేశించిగాని, సమాజాన్నుద్ధేశించిగానీ ఇది వదలగొట్టుకో, దీనిని తెచ్చిపెట్టుకో అని చెప్పిఉండాలి.
4. ఏవైనా సమస్యల గురించి ప్రస్తావించి ఉండాలి. అందుకు కారణాలను ప్రస్తావించి ఉండొచ్చు.
5. వ్యక్తుల హితాన్ని, వ్యక్తులను చూపుతూగాని, సమాజాన్ని చూపుతూగాని కోరుతున్నదా? లేదా? అన్నది తేలాలి.
6. వ్యక్తుల్ని ఏమైనా చేయమనడం గానీ, ఏమైనా చేయవద్దనడం గానీని చేస్తుందా? లేదా? చూడాలి.
స్త్ర ఏదైనా ధోరణిని, భావజాలాన్ని పరిశీలించినప్పుడు : వ్యక్తి-సమాజము - ప్రకృతి అన్న వాిని ప్టించుకుంటూ వాిమధ్య అప్పికి ఉన్న సంబంధాలను, అందులో ఉండగూడని వాిని, ఉండవలసిన వాినీ ప్రస్తావిస్తూ తెచ్చుకోవలసిన వాినీ పేర్కొంటూ, మానవులకు తనదైన రీతిలో కార్యక్రమాన్ని నిర్దేశిస్తూ ఉండేవాిని తత్వశాస్త్రాలు - తాత్విక ధోరణులు లేదా సిద్ధాంతాలు అనాంరు. ఈ వివరం తెలియనంత కాలం, హేతువాదం సిద్ధాంతమా, కాదా? అన్నది గానీ, సిద్ధాంతమైతే ఏ క్షేత్రానికి చెందిన సిద్ధాంతమన్నది కానీ నిర్థారించుకోలేము.
స్త్ర 1. నా అవగాహన ప్రకారం సామాజిక తత్వ శాస్త్ర క్షేత్రానికి చెందిన సిద్ధాంతమది. 2. అందునా జ్ఞాన విభాగంలో, వ్యక్తిలో రావలసిన మార్పులను ప్రధానాంశంగా చేసుకొని అనేక భావాలను వెల్లడిస్తున్న సిద్ధాంతమది.
స్త్ర హేతువాద సిద్ధాంతానికి ప్రధాన లక్ష్యం వ్యక్తిని పరాధీనమనస్కత నుండి బయటపడవేసి అతనిలో స్వతంత్రాలోచనాశీలతను నెలకొల్పాలన్నదే.
స్త్ర ఇతరుల భావాలనంగీకరించి, అనుసరిస్తుండడాన్నే పరాధీన మనస్కత అంటున్నాం. తన అనుభవాలపైనా, వాి ఆధారంగా ఆలోచించి చేసుకున్న నిర్ణయాలపైనా నిలబడి ఉండడాన్ని, వాి ఆధారంగానే ప్రయాణించడాన్ని స్వాధీన మనస్కత అంారు.
గమనిక : ఆచరణ భాగాన్నలాఉంచి, నిర్ణయాలు ఇతరులవా? తనవా? అన్నదే ఇక్కడ కీలకాంశము. అలాగే ఏ మనిషీ అన్ని విషయాలలో కేవలం స్వీయానుభవాలాధారంగానే జీవికను సాగించడం సాధ్యపడదు గనుక, ఎంతోకొంతమేర ఆయా విషయాలలో తెలిసిన వారి నిర్ణయాలను స్వీకరించక తప్పనిస్థితీ ఉంటుంది అన్న నిజాన్ని గమనించి, అలా ఇతరుల జ్ఞానంపై ఆధారపడి నడవవలసిన సందర్భాలలో ఎలాి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాి విశ్వాసాలు తప్పనిసరవుతాయో, అంతగా ప్రమాదకారులు కావో - మరెలాి వాిని విశ్వసించాల్సిన అవసరం లేదో, వేివల్ల నిజంగా ప్రయోజనం లేదో, విశ్వసించాకనూ సరిచూసుకోడానికి అవకాశము లేదో అి్టవాిని వేరుపరచి చూడగలగాలి.
అద్వితీయ హేతువాద యోధుడు రావిపూడి వెంకాద్రితో గౌరవ్ ఇంటర్వ్యూ
గమనిక :
హేతువాది 350 సంచిక చదువుతుంటే ఈ వ్యాసమూ ఎదురైంది. దాన్ని చదివాక ఒకింత సమీక్షిస్తే బాగుండుననిపించింది. వెంకాద్రిని ఎత్తిచూపుతున్న నాకు ఈపని సందర్భోచితమని అనిపించింది. చదవండిక.
''అద్వితీయ హేతువాద యోధుడు రావిపూడి వెంకాద్రితో ఇంటర్వ్యూ'' అన్నది శీర్షిక. ఇంటర్వ్యూ ఎం.కె.గౌరవ్ చేశారు. ఆయన 18 ప్రశ్నలడిగారు. ఆ వ్యాసంలోని ప్రశ్నల సంఖ్యనే ఇక్కడ ఉట్టంకిస్తున్నాను.
ప్రశ్న 3 : మొదినుండీ మార్క్సిజంపై మీరింతగా నిప్పులు చెరగానికి కారణం?
వెంకాద్రి సమాధానం : మతాల్లాగే మార్క్సిజం కూడా విస్కృతంగా వ్యాపించి విలువలకు, స్వేచ్ఛకు సమాధిపేర్చానికి ప్రయత్నిస్తూ హేతువాద, భౌతికవాద, మానవవాద భావాలను విస్మరించడంతో దాన్ని విమర్శించక తప్పలేదు.
సురేంద్ర : మార్క్సిజం 1. విలువలకు, స్వేచ్ఛకు సమాధి కడుతోందన్నది ఆయన ఆరోపణ. 2. అది హేతువాద, భౌతికవాద, మానవవాదాల్ని విస్మరించిందన్నది మరో ఆరోపణ. మార్క్సిజమంటే ఏమిో చెప్పి అది ఈ ఐదింకి ఎక్కడ వ్యతిరేకంగా ఉందో నిర్ధారిస్తానంటే సమావేశం ఏర్పాటుచేస్తాను.
గమనిక : మార్క్సిజాన్నుండి మాత్రమే ఈ విషయాల్ని తేల్చాలి. మార్క్సిస్టు వ్యాఖ్యానాల నుండిగానీ, మార్క్సిస్టులమనుకొంటున్న, అంటున్న వారి పోకడలను గాని ఎత్తిచూపకూడదు. మన ప్రకరణం సిద్ధాంత విచారణే.
ప్రశ్న 4. ఆర్గనైజ్డ్ ఎథిక్స్‌కు లోబడలేనని ప్రకించుకున్న మీరే ఇన్ని సంవత్సరాలుగా ఆర్గనైజేషన్ చేపట్టడం ఆశ్చర్యం కలిగించలేదా?
వెంకాద్రి : తప్పని పరిస్థితి నెట్టుకొచ్చింతరువాత ఇక ఇప్పుడు ఆ విషయంపై ఆశ్చర్యపడి ప్రయోజనం లేదనుకుాంను.
సురేంద్ర : ప్రశ్నలోనే కొంత లొసుగుంది. అయినా ఆయనకాశ్చర్యం కలగడమెందుకు. అలా అన్నాయన ఇలాచేసినందుకు ఆరిెంనీ గమనించిన వారికి కదా 'అయితే గియితే, ఆశ్చర్యం కలగాలి?' దాన్నలా ఉంచుదాం.
నీతి సామాజికమేనని వెంకాద్రే అన్నారొకచోట. (రుజువు కావాలంటే వెదికి చూపిస్తాను) ఇంతకు ఆర్గనైజ్డ్ ఎథిక్స్ క్రిందికి ఏమేమి వస్తాయి. వాికి కట్టుబడనని వెంకాద్రి ఎప్పుడు, ఎందుకన్నట్లు? పరిస్థితులు ఏమి వత్తిడిచేస్తే కట్టుబడను అన్నదానికి కట్టుబడ్డట్లు? ఇప్పుడీ ప్రశ్నద్వారా పాఠకులలో ఎటువిం భావవిప్లవాన్ని సాధించదలచినట్లు? ఇంతకు సంస్థాగత నియమనిబంధనలను పాించడం సరైందాంరా? సరికాదాంరా? ఈమధ్య నార్ని వెంకట సుబ్బయ్యగారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకించారే, అది సంస్థాగత ఎథిక్స్‌తో ముడిపడిన అంశమా, మరోినా.
ప్రశ్న 5 : మార్క్సిజం లాగనే మానవవాదం కూడా ఓతరహా వ్యవస్థీకృత విధానానికి పరిమితమైందనే విమర్శపై మీ స్పందనేమి?
వెంకాద్రి : మానవవాదం మార్గమేగాని, వ్యవస్థీకృత విధానం కాదు. మానవేతర మార్గగాములే దానిపై విమర్శలకు ఒడిగడతారు.
సురేంద్ర : నిజానికి విమర్శ లోకంలో ఉన్నదేనా? ఎవరు ఎక్కడ ఎప్పుడలా మానవ వాదాన్నెత్తిచూపి విమర్శించారో ప్రశ్నించిన వారినడగాలి. నిజానికి వెంకాద్రే, అవునా? ఎవరలా అన్నారు? అనడుగుండాల్సింది. దాన్నలా ఉంచుదాం. వీరిరువురు మ్లాడుతున్న మానవ వాదమంటే రాయ్ చెప్పిన 22 సూత్రాల సిద్ధాంతమేనా? మరోా? ఇది తేలకుండా చదువరికి ప్రశ్న సరైందో కాదో అర్థం కాదు. సమాధానమూ వాస్తవాన్ని ప్టిచ్చేదో, కాదో తేలదు. ఇంతకు మానవవాదం ఎక్కడైనా అమలయ్యిందా? అదెలాి ఫలితాలనిస్తుందో గమనించడానికి. ఎక్కడో పుస్తకాలలో పడివున్న దానిపై ఈ చర్చ ఎందుకు? ఆంధ్రలో మానవవాదులెవరు? ఎందరు? వారంతా అనుసరిస్తున్న మార్గమేమి? నిజానికీ మార్గం, పద్ధతి నడిచేదారి అన్నామంటేనే వ్యవస్థీకృతమైనట్లు. అట్లే నడవాలి అనడానికి తగిందే దారి అనబడుతుంది కనుక. వెంకాద్రి బృందం రచనల్లో ఈ 'వ్యవస్థీకృతమైన' అన్నమాట చాలా పేలవమైంది. ప్రమాదకరమైంది కూడా.
స్త్ర నా అవగాహన ప్రకారం విజ్ఞానం (ఒప్పు జ్ఞానం) వ్యవస్థీకృతం కాకపోవడమూ. అజ్ఞానం (తప్పు జ్ఞానం) వ్యవస్థీకృతం కావడము అన్న రెండూ ప్రమాదకరమైన సామాజిక స్థితులే.
ప్రశ్ప 7 : ప్రధాన హేతువాద సంఘం చీలిపోవడానికి కారణమేమి?
వెంకాద్రి : ఈ ప్రశ్న చీలిపోయిన వారినే అడగాలి.
సురేంద్ర : ప్రశ్నేమి. సమాధానమేమి? మీ అభిప్రాయం ప్రకారం సంస్థ ఎందుకు చీలిందన్నది కదా! చెప్పమంది గౌరవ్? చీలినవాళ్ళ నడగమనడమేమి? చీలిన వాళ్ళనూ అడుగుతారు. అడగదల్చుకున్న వాళ్ళు నిష్పాక్షికులూ, నిజాన్నరయదలచుకున్న వాళ్ళూనైతే. కుతూహలం కొద్దీ అడిగేవారైతే అంతగా ఎలాగూ ప్టించుకోరు. ఒకవేళ వెంకాద్రి గారికి ఈ ప్రశ్న అప్రస్తుతం అనిపించితే అనిపించ వచ్చు. అది సహేతుకం కూడా. ఎందుకంటే 3,4 థాబ్దాల క్రితం జరిగిపోయినది, ఇప్పుడు తెలుసుకున్నా జరిగే అదనపు ప్రయోజనము ఏమీలేనిది అన్న దృష్టి కొందరిలోనైనా ఉండే వీలున్నది కనుక. అప్పుడాయన గతజలసేతుబంధనమెందుకు వృధాప్రయాసే కాని - అని అనుండాల్సింది.
ప్రశ్న 8 : మీ రచనా వ్యాసంగంలో అవాంఛనీయమైన కరుకుదనం ఉంటుందని, వ్యక్తులపై కటువైన విమర్శలుాంయనే వాదనపై మీ భావనేమి?
వెంకాద్రి : అవాంఛనీయమైన కరుకుదనం నా రచనల్లో ఎక్కడా లేదు. అవసరం అనుకున్న సందర్భాలలోనే నా రచనల్లో, ప్రసంగాలలో కరుకుదనం చోటుచేసుకుంటుంది.
సురేంద్ర : నేరుగా ఈ అంశంతో ముడిపడి వెంకాద్రితో తలపడి ఉన్నవాణ్ణి నేను. ఈయన ఇలా వెకిలిగా మకిలిప్టిన మనస్సుతో, గేలి భాషతో నాతోనేనా ప్రవర్తించింది? ఎవరితోనైనా ఇలానే ఉంాడా? తెలుసుకోవడం కోసం కొన్ని రచనలు చదివాను, కొందరిని కలసి విచారించాను కూడా. గలీజు భాష ఈయన గారి శైలికి సంబంధించిందేనని తేల్చుకున్నాను. పక్షపాత రహితంగా ఎవరు సిద్ధపడ్డా ఆ విషయం రుజువు చేస్తాను.
ఇక్కడ ప్రశ్నను కూడా కొంత పరిశీలించాలి. రచనా వ్యాసంగంలో అనవసర ప్రయోగం - రచనల్లో, ప్రసంగాలలో అననడం సరళంగా ఉంటుంది. అయినా అది తప్పుకాదు. పృశ్చకుని స్వేచ్ఛకు సంబంధించిందే అది. దానికంటేనూ విమర్శలుాంయనే 'వాదన' అన్నమాటలోని వాదనేమి? అలాిదొక వాదనుందా లోకంలో. విమర్శలుాంయనే 'ఆరోపణ, అభియోగం' లాి పదాలు సందర్భోచితంగా ఉంాయి.
గౌరవ్ అడిగిన ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం ఎంత పెద్ద అబద్దమో తెలుసుకోవానికి ఒక్క రచననుండే పెక్కు ఉదాహరణలిస్తాను.
1) పుస్తకం పేరు ''ఆది శంకరాచార్య వ్యక్తిత్వం - తత్వం'' అయితే పుస్తకం తొలిపేజీల్లోనే, శంకరుడి తత్వాన్ని సాకల్యంగా పరిశీలించడానికీ రచన ఉద్దేశింపబడలేదు అని అన్నారు రచయిత. మరలాటప్పుడు పుస్తకానికాపేరు పెట్టడం సరికాదుకదా.
2) ఎ) శంకరాచార్యుని తల్లిదండ్రులెవరు? బి) అతడెక్కడ ప్టుాడు, సి) ఎప్పుడు ప్టుాడు? డి) ఏమేమి చేశాడు ? ఇ) ఏమేమి రాశాడు? ఎఫ్) ఎప్పుడు, ఎక్కడ మరణించాడు? ఎలా మరణించాడు ... ఇలా కొన్ని ప్రశ్నలు లేవనెత్తి- ఈ ప్రశ్నలకు శంకర చరిత్రలుగా చెప్పబడే గ్రంథాలు ఒకేరకం సమాధానాలు చెప్పలేదు. ఇప్పికీ ఆ ప్రశ్నలకు రూఢీఅయిన సమాధానాలు లేవు. శంకరుని చరిత్రను అభూత కల్పనలతో నింపేశారు. దాన్ని చరిత్ర అనుకోడానికీ వీల్లేదు అని తీర్మానం చేశారు. అలా తీర్మానం చేసిన వెంకాద్రే ఆ అభూత కల్పనల్లో తనకు నచ్చిన వాిని పరమసత్యాలుగా ప్రకిస్తూ, వివరిస్తూ శంకరుడు పరమచెత్త వ్యక్తిత్వం కలవాడని, పులుముడు పనికి పూనుకున్నాడు.
3) శంకరాచార్య వ్యక్తిత్వం - తత్వం వివరిస్తానని మొదల్టెినాయన ఉపనిషత్తులలోని ఒక మాటను పట్టుకొని ఏ భాష భాషించాడో చూడండి.
''నైవస్త్రీ నపుమానేష నచైవాయం నపుంసకః
యద్య చ్ఛరీర మాదత్తే తేనతేన సయుజ్యతే''
గమనిక : పై సగం వెంకాద్రి ఉట్టంకింపు. క్రింది సగం ఆ శ్లోకంలోని మిగిలిన భాగం. సందర్భం జీవుడన్న పదం భాషలో మనం వాడుతున్న పుంలింగ శబ్దమా; స్త్రీలింగ శబ్దమా, నపుంసక లింగ శబ్దమా అన్నదానికి సమాధానంగా అవేవీ ఆ పదంచే సూచించే దానికి వర్తించవు. జీవుడు ఏఏ శరీరాలను ధరిస్తాడో ఆ శరీరాలకు వర్తించే లింగంగా పరిగణింపబడతాడు అనిచెప్పే సందర్భం. ఇక్కడ వారి అవగాహన సరైందా కాదా అన్నది మన విచారణీయాంశం కాదు. శంకరాచార్యుడు తత్వం - వ్యక్తిత్వం అన్న అధికరణానికి దీనికి సంబంధం ఏమి అన్నది. దానిపై వెంకాద్రి మాటలు సందర్భోచితాలా, కావా అన్నదినే. ఆ సంస్కృత వాక్యంపై ఈయన భాషచూడండి.
లేనిదాన్ని పట్టుకొని పీకులాడి, పీకులాడి వదిలారు. ఆ పీకులాటను పట్టుకొని ఇప్పికీ కొనసాగిస్తున్న బ్రహ్మంబ్రమరాలకు బ్రహ్మం పరిపరి విధాలుగా తోస్తుంది. ఆ తోచడంలో ఒక్క చతుర్ముఖ బ్రహ్మేమి 'ఖర్మ' స్త్రీ, పుంస, నపుంసక లింగాలు మొదలు, లింగ రాహిత్యం దాకా బ్రహ్మస్వరూపం మారింది. పెడితే అతుక్కొని, పెరికితే ఊడిపోయే లింగం బ్రహ్మానిది. దానికి స్వంత లింగమంటూ లేదు. బ్రహ్మవాదులకు లింగ పరంగా తప్ప వస్తువులు అర్థం కావు. అందుకే లింగంలేని బ్రహ్మ వారికర్థం కాలేదు.
''బ్రహ్మ ఏ లింగమైతే ఏమిటాం? బ్రహ్మానికి వేదాల్లో లింగముంది. రుగ్వేదంలో బ్రహ్మ పులింగమే. బ్రహ్మానికి లింగం ఊడిపోయింది ఉపనిషత్తుల్లోనే....
ఈ భాష సభ్యతాయుతంగాను, సందర్భోచితంగాను, పుస్తకం పేరుకు తగిందిగాను ఉందనే అనిపిస్తోందా?
శంకరాచార్యుని శీలం
1. యేసు అధవకు పుట్టగా, శంకరుడు విధవకు ప్టుాడు.
2. మొహమ్మదు 12 మందిని చేసుకున్నా ఒక్కరికీ పిల్లల్ని పుట్టించలేదు.
3. తమ పెళ్ళాలకు పిల్లల్ని ప్టుించలేని దేవుళ్ళు ఇతరుల పెళ్ళాలకు మాత్రం పిల్లల్ని పుట్టిస్తారు.
4. శంకరుడు రాజుగారి నూరు మంది భార్యలను వారికి అనుమానం వచ్చేదాకా, అలుపులేకుండా అనుభవించాడు. వాళ్ళకు అనుమానం రాకుండుంటే ఆ వ్యాపారం ఇంకెన్నేళ్ళు సాగించేవాడో.
5. శంకరుడిలా వేషాలు వేసుకొని ఇళ్ళల్లో జొరబడి కామ కండూతిని, లైంగిక కుతిని తీర్చుకోడానికి ....
6. శంకరుడు కామకళ నేర్చుకున్నది ముండమోపుల వద్దనే.
7. శంకరుడు చేశాడని చెబుతున్నది వ్యభిచారం కాదు. రేప్.
8. శంకరుడు వ్యభిచారానికి వజ్రోలియోగాన్ని అడ్డంపెట్టుకున్న శృంగార యోగి.
9. శంకరుడు మండలమిశ్రుని భార్యను బంధించిన రీతిని కిడ్నాపింగ్ అందామా? సామాన్యుడాపని చేస్తే లేపుకెళ్ళాడు, తగులుకెళ్ళాడు అని అంాం.
10. రాజు భార్యలను రేప్ చేసిన మహానుభావుడు శారదను మరేం చేశాడందాం.
11. అరవిందునికి, ఫ్రెంచి మదర్‌కు ఉన్న సంబంధమేమిటని గోపీచంద్‌ను ఆరా తీశాను.
12. శంకరుడు లంజకు పుట్టడానికి ఆధారమేమిటని ప్రశ్నిస్తున్నారు ఛాందసులు.
గమనిక : ఇలాి అసభ్యకరమైన భాషను ఇంకెన్నింనో వెంకాద్రి రచనల నుండి ఉట్టంకించవచ్చు. శంకరాచార్యుని వ్యక్తిత్వం - తత్వం గురించి రాస్తానంటూ మొదల్టెి యేసు జననాన్ని, ప్రవక్త పిల్లలు ప్టుించలేని తనాన్ని, శంకరుని తల్లి లంజరికం చేసిందనాన్ని వీటన్నింనీ సందర్భోచితమైన కరుకుతనం క్రిందనే చేర్చాలో వద్దో బుద్దున్న హేతువాదులే తేల్చుకోవాలి.
స్త్ర దేనికదే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో వెంకాద్రిలో నిశిత విమర్శ - అందుకవసరమైన అధ్యయనము కూడా ప్రకటమవుతుాంయి. మన సమీక్ష మాత్రం దేనికి దానినిగా ప్టించేది మాత్రమే.
ప్రశ్న 9 : ప్రగతిశీల ఉద్యమాలలో స్తబ్దత చోటుచేసుకుందనే వాదనను మీరంగీకరిస్తారా?
వెంకాద్రి : అది ఉద్యమాల తీరు, దేశపరిస్థితుల తీరు అర్థం చేసుకోలేని వారి దుందుడుకు అభిప్రాయమని నా భావన.
సురేంద్ర : వెంకాద్రిది తప్పు భావన అని, ఉద్యమాలు ముఖ్యంగా హేతువాద ఉద్యమం స్తబ్దతకే కాదు, పడకనే పడిఉందని, ఏ మాత్రం వాస్తవాలను చూడగలిగినా తెలిసిపోతుంది. ఒక సవాలు - పరీక్ష కోసమే చెప్తాను. ఈయన, మేడూరి, గుమ్మా వీరన్న అన్న ముగ్గురు ఉద్యమ బాధ్యతల్ని విడిచిప్టిె ఊరుకోమనండి చూద్దాం. ఉద్యమాన్ని వీళ్ళు మోసుకెళ్తున్నారా, అది నడుస్తోందా తేలిపోతుంది. ఒక సంవత్సరం గడువు, కనీసం 6 నెలలు. వెంకాద్రి సిద్ధపడతారో లేదో చూద్దాం.
ప్రశ్న 10 : ప్రస్తుత పరిస్థితుల్లో జ్ఞానపునర్వికాసోద్యమం సాధ్యమా?
వెంకాద్రి : ప్రస్తుత పరిస్థితుల్లోనే కాదు ఎలాిం పరిస్థితుల్లోనైనా భావవికాసోద్యమం సమాజానికి అవసరం.
సురేంద్ర : ఇదో విచిత్రం. ప్రశ్న ఏమి? సమాధానమేమి? ఉద్యమావసరం ఉందా? లేదా అని అడిగాడా గౌరవ్. సాధ్యమా, కాదా అనడిగితే సాధ్యమేననో, కాదనో, మరో మధ్యేమార్గ సమాధానమో చెప్పాలి గాని ఎప్పుడూ అవసరమేనాండేమి.
ప్రశ్న 11 : నాస్తికులుగా, హేతువాదులుగా, భౌతికవాదులుగా చలామణి అవుతున్న వారిలో సైతం వైజ్ఞానిక, తాత్విక గందరగోళానికి కారణం? (దీనికి సరైన సమాధానం ఆ మూడు గుంపులకూ ఆ విషయాలలో తగినంత అధ్యయనం లేకపోవడం. అవునా కాదా?)
వెంకాద్రి : వైజ్ఞానికుల్లో గందరగోళం ఉండడం సహజం. అది వారి వారి స్థాయీబేధాల్ని బ్టి ఉంటుంది.
సురేంద్ర : మళ్ళా అదే వరస. ప్రశ్నేమిటని సమాధానం చెప్పే ఆయన ప్టించుకోడు. అడిగిందానికి సమాధానం చెప్పాడా లేదా అన్నది అడిగినాయనా ప్టించుకోడు. ఎవరిలో గందరగోళం, ఎందుకుందని అన్నాడు గౌరవ్? ఈయన వైజ్ఞానికుల్లో గందరగోళం ఉంటుందదంతే అంటున్నాడు. (ఉదా : మహానగరం మురికినేమిచేద్దాం అన్నది ప్రశ్న. మంగళగిరి మడ్డామదానికి జిడ్డెక్కువన్నది సమాధానం, బాగుంది కదూ?)
ప్రశ్న 17 : హేతువాద ఉద్యమంలో నేి తరం పాత్ర పలచబడడానికి కారణం ?
వెంకాద్రి : 1. రాజకీయాల సరళి. 2. విద్యావంతులమనే భ్రమలో మునిగితేలే వాళ్ళు.
సురేంద్ర : పోనీలే అన్యాపదేశంగా నైనా భావితరం హేతువాద ఉద్యమంలో తగినంతగా లేరు అని అంగీకరించారు. పాతతరం, పాతనీరులానే పోయిందని లోగడే తేల్చేశారు. ఇక ఉందెవరో? అయినా, ఆయన చెప్పింది సరైన సమాధానమేనా. నా అవగాహన ప్రకారమైతే, ఉద్యమ భావజాలాన్ని అది అవసరపడి ఉన్న జనం దగ్గరకు చేర్చకపోవడం ప్రధాన కారణం. ఆ పనికి అవసరమయ్యే ఉద్యమ కార్యకర్తల నిర్మాణం జరక్కపోవటం మరో కారణం అవునా, కాదా ఆలోచించండి.

2. హేతువాదం సిద్ధాంతమా? కాదా?

No comments:
Post a Comment