Thursday, October 1, 2015

స్పందన - ప్రతిస్పందన

వివేకపథం 208 సంచిక నుండి ''హేతువాద సంఘంకు సత్యాన్వేషణ మండలికి మధ్య'' శీర్షిక క్రింద శ్రీ యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు రాస్తున్న శీర్షికపై స్పందనలను ఆహ్వానిస్తున్నాము. స్పందనలు సూిగా, సంక్షిప్తంగా, విషయపరంగా రాస్తే మంచిది. ఆ విషయంపైనే కాక హేతువాదంపైన పత్రికలో వస్తున్న విషయాలపై మీ స్పందనలను వివేకపథంలో ఆహ్వానిస్తున్నాం.

మిత్రులు కె.బాబూరాజేంద్ర ప్రసాద్‌ గారు తమ స్పందనగా సుదీర్ఘ  లేఖ వ్రాశారు. స్థలాభావం వలన పూర్తి లేఖను గాక వారి అనుమతితో దానిలోని ముఖ్యాంశాల వరకు ప్రచురిస్తూ దానిపైన జగన్‌ ప్రతిస్పందనను ప్రచురిస్తున్నాము  - ఎడిటర్‌

కె.బి.ఆర్‌.ప్రసాద్‌ గారి లేఖ సారాంశము :
1.  వెంకాద్రి గారి భావాలను విమర్శించటంలో సురేంద్రగారికి మిత్రభావనే తప్ప అన్యభావన లేదు. కేవలం సమాజంలోకి తప్పుభావాలు ప్రచారం కాకూడదనే అభిప్రాయం తప్ప.
2.  హేతువాద సంఘం కోరకుండానే మళ్ళీ మళ్ళీ వారిసిద్ధాంతాన్ని విమర్శించడం వారి కోపానికి కారణం. 
3.  సురేంద్రబాబు గారితో సంబంధంలోకి రావడానికి హేతువాద సంఘం వారికి ఇష్టంలేదు. రావిపూడి వారి రచనల్లో చిన్న లోపాలున్నా వాివల్ల నష్టంజరిగే అవకాశం లేదు అనేభావన వారికి ఉందని నేననుకుంటున్నాను.
4.  రచనలు, అవి ఎవరిని ఉద్దేశించి, ఎవరికోసం రాయబడినవో వారి స్థాయికి తగ్గట్లు ఉండాలి.
5.  రావిపూడి  వారి రచనల్లో దోషాలు చూపించగలిగే సామర్ధ్యం ఒక్క సురేంద్రబాబుకే తప్ప ఇతరుల్లో కనపడ్డంలేదు. అలా విమర్శించే స్థాయి అందరికీ సాధ్యం కాదు. అందరికీ అవసరమూ లేదు. రావిపూడివారి రచనలు సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే స్థాయిలో ఉంటున్నాయి.
6.  మండలి సభ్యులలో ఎవరూ కూడా సురేంద్రగారి ప్రమేయం లేకుండా ఏ ఒక్క విషయంపైనైనా 20 మందికి క్లాస్‌ చెప్పలేరు. సురేంద్రబాబుగారికి ఉన్నంత స్థాయి అందరికీ రాదు. అవగాహనల్లో తేడాలుాంయి మరి.
7.  తమతో హేతువాద సంఘానికున్న భేదాలను సురేంద్రగారు ఎత్తిచూపినా వాిని పరిశీలించడానికి కూడా ముందుకు రావడానికి హేతువాద సంఘం ఇష్టపడటం లేదు. అందువలన అలా ఎత్తిచూపడం వ్యర్థప్రయాస.
8.  హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందంటున్న వారు స్వయంగా హేతువాద ఉద్యమంలో ఎందుకు పాలుపంచుకోవటం లేదు? నాస్తికులుగా జీవిస్తున్నప్పుడు ఆ జీవితంయొక్క ఆవశ్యకతను సామాన్య ప్రజలకు చెప్పవచ్చుకదా.
9.  ఎంత ఎదిగినవారైనా ప్రాథమిక మానవీయలక్షణాలు - ఇష్టాఇష్టాలు, ఉద్వేగాలు తొంగిచూస్తూఉంాయి. వాినుండి పూర్తిగా విముక్తిపొందడం సాధ్యం కాదు. ఈ లేఖలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే. హేతువాద సంఘానికి దీనితో ఎటువిం సంబంధం లేదు.
జగన్‌ ప్రతిస్పందన :
మిత్రులు రాజేంద్ర ప్రసాద్‌ గారికి లేఖారూపంలో మీ స్పందన పంపినందులకు ధన్యవాదములు. నా ప్రతిస్పందనను అంశాల వారీగా క్లుప్తంగా తెలియజేస్తున్నాను.

1.  మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సురేంద్ర గారికే కాదు, ఉద్యమకారులందరికీ సాి ఉద్యమకారుల పట్ల మిత్ర భావనే ఉండాలి. భావజాలాల్లో సారూప్యతను మితృత్వం ద్వారానే సాధించుకోగలుగుతాం.
2.  తమ భావాలపట్ల పాఠకుల సలహాలను, అభిప్రాయాలను, విమర్శలను, భావవిప్లవోద్యమంలో ఉన్నవారు కోరుతున్నట్లు, ప్రత్యేకించి ప్రకించుకోనఖ్ఖరలేదు. భావసంఘర్సణ జరిగితేనే భావాల్లో తప్పొప్పులు బయటపడతాయి. 9వ అంశంలో మీరు సూచించినట్లు భావవిప్లవ ఉద్యమకారులు ఉద్వేగాలనుండి బైటపడాలి. అంతేగాక సద్విమర్శలను సహృదయంతో స్వీకరించి  పునరాలోచన చేసుకోవాలి. నా అవగాహనలో వారికోపం వారి భావాలను విమర్శించినందులకు కాదు. వారు దానిని వ్యక్తిగతంగా అన్వయించుకున్నందువలననే సమస్య వస్తుంది.
3.  సురేంద్ర బాబుగారితో సంబంధంలోకి రావటం హేతువాద సంఘానికి ఇష్టంలేదని, వారి పత్రిక పాఠకులకు అర్థమవుతూనే ఉంది. కాని భావజాల విమర్శలు చేసేటప్పుడు వారి వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేదు. అలా అనుమతి తీసుకోవాలంటే వెంకాద్రిగారు వ్రాసిన ఎన్నో విమర్శనాత్మక గ్రంథాలు వెలుగుచూసేవే కావు. లోపాలు చిన్నవా పెద్దవా అన్న విషయాన్నట్లుంచితే  మీరు ఇరు సంస్థల భావజాలాల్ని కనుక ప్టిచూస్తే మౌలికాంశాల అవగాహనల్లోనే విభేదాలున్నట్లు తెలుస్తుంది. వాిని సరిపెట్టుకోవడం భావవిప్లవ లక్ష్యం దిశగా మిమ్మల్ని సాగనివ్వదు.
4.  మీరు చెప్పిన దానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. కాని నా అవగాహనలో నాకు వారిరువురితో వ్యక్తిగతంగాను, ఉద్యమ క్షేత్రంలోను ఉన్న పరిచయంతో వారు వారి వారి రచనలు మేథావుల స్థాయికి చెందినవనే అంటుాంరు. కాని భాష విషయంలో మాత్రం సురేంద్రబాబు గారి రచనల కంటే వెంకాద్రి గారి రచనలు సరళంగా ఉన్నట్లు అనిపిస్తాయి.
5.  ఎవరి రచనల్ని అయినా ఎలా అధ్యయనం చెయ్యాలో, ఎవరి ప్రసంగాలనైనా ఎలా అర్థం చేసుకోవాలో ''పదపదార్థ విచారణ'' విద్య అభ్యసించిన వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. ప్రస్తుతం మీరన్నట్లు మనకు సురేంద్రగారు ఒక్కరే ఆ విద్య తెలిసిన వారుగా కనిపిస్తున్నారు. అలా ఒక్కొక్కరే కాకుండా తనలాగ  మరింత మంది తయారు కావాలనే ఉద్దేశ్యంతోనే తాను మొదలుప్టిెన ''హేతువాద పునరుజ్జీవన యత్నాలు'' అధ్యయనం శిక్షణ తరగతులను కూడా పదపదార్థ విచారణతో ప్రారంభించారు. ఈ విచారణే సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం  నుండి ఒక కార్యక్రమంగా చేస్తూ వస్తుంది.
6.  సురేంద్రబాబుగారైనా, వెంకాద్రి గారైనా, ఎం.ఎన్‌.రాయ్‌ అయినా ఎవరి స్థాయి వారిదే. వారిలాగా వారి సహచరులు లేరు అనుకోవటం కంటే వారిని స్పూర్తిగా  తీసుకొని వారు చేసినంత కృషిచేస్తే వారితో సమానులే కాదు వారిని మించిన వారుకూడా ఉద్యమ క్షేత్రంలో తయారవానికి అవకాశం ఉంది.
7.  సురేంద్ర గారు తమ భావజాలంపై చేస్తున్న విమర్శలను హేతువాద సంఘం ప్టించుకోవటం లేదని నేను అనుకోను. కాని వారు ఆ విమర్శలను స్వీకరించవలసిన రీతిలో కాక ఉద్యమకారులు తీసుకోకూడని వ్యక్తిగత రీతిలో స్వీకరించి స్పందిస్తున్నారు. ''హేతువాది''లో వస్తున్న వ్యాసాలను ప్టిచూడండి. విమర్శకు గురైన విషయాన్ని మళ్ళీపునరుద్ఘాించడం లేదా విషయం విమర్శకులకు అర్థం కావటం లేదనడం జరుగుతుంది. విమర్శకులు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం వారినుండి రావడం లేదు. సురేంద్రబాబుగారి విమర్శల్లో కేవలం తప్పు ఎత్తిచూపడం కాక అది ఎలా  తప్పు అవుతుందో, ఏది ఒప్పవుతుందో కూడా స్పష్టంగా  మొదటనే రాస్తే సరిపోతుంది. అందువల్లనే పత్రికల్లో విషయాల్ని సాగదీసుకోవటం కంటె ముఖాముఖి చర్చలలోనే విషయాలు ఒక కొలిక్కి వస్తాయని నేనాంను.
8. హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందన్న సురేంద్రగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారో లేదో ముందు తెలియజేయండి. సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం నుండి వారు హేతువాద ఉద్యమంలోనే ఉన్నవారని ప్రమాణ క్షేత్రాలు తెలిసిన వారికి సులభంగానే అర్ధమవుతుంది. అనుమాన ప్రమాణం, హేతువాద క్షేత్రం సారూప్యాలే. కాని సంచిక 205లో వివరించినట్లు కేవలం హేతుబద్దాలోచన ద్వారా పొందిన జ్ఞానం సత్యాన్ని నిర్ధారించలేదు. ఆపై ప్రయోగము అంటే అనుభవము ఒక్కటే సత్యాన్ని నిర్ధారించగలుగుతుందని మండలి అభిప్రాయం.
ఆస్తికత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఆస్తికేతర జీవన విధానాన్ని పాించేస్తున్నారు. ఒక రకంగా అది నాస్తిక జీవన విధానమేనని నా అభిప్రాయం. కాని నాస్తికత్వాన్ని రుజువు చేయమని ఎవరైనా తనని అడిగినా, తాము ఎవరినైనా అడిగినా ప్రస్తుతము ఉన్న శాస్త్రీయ విజ్ఞాన పరిమితుల దృష్ట్యా అది వీలుకాదని చెబుతున్నారు. కాని తమ భావజాల ప్రాతిపదికల్లోని ముఖ్యాంశంగా ''పుట్టుకకు ముందుగాని, మరణించిన తరువాత గాని సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం అనవసరం'' అని ప్రచారం చెయ్యటం నాస్తికత్వం ప్రచారంలో భాగంగా అర్థం చేసుకోవాలి.
9.  సత్యాసత్యాల విషయంలో ఎలాిం ఇష్టాఇష్టాలకు, ఉద్వేగాలకు తావివ్వకూడదు. ధర్మాధర్మాల విషయంలో వీలైనంతవరకు వాిని తమ అదుపులో ఉంచుకోవాలి. పూర్తిగా విముక్తిపొందటం అంటే కేవలం ఆదర్శంగా చెప్పుకోవడం వరకే.


No comments:

Post a Comment