Thursday, October 1, 2015

హేతువాద సంఘం vs సత్యాన్వేషణ మండలి

హేతువాద సంఘం v/sసత్యాన్వేషణ మండలి
(రావిపూడి వెంకాటాద్రి v/s పుట్టా సురేంద్ర బాబు)
- యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు
(గత సంచిక తరువాయి)

 మరి మారనిది సత్యము కాదు. అని కూడా ప్రకించారు. హేతువాద సంఘం వారు అది ఆవేశంగా వ్రాశారో లేక అవగాహనతో వ్రాశారో గాని ఆ విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు ప్రకించుతున్నాను. నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.
ఎ. భూమి బల్ల పరుపుగా ఉంది - అది ఒకప్పి సత్యం అనుకుంటే, భూమి గోళాకారంగా ఉంది - అది ఇప్పి సత్యం అనుకుంటే సత్యం మారుతుంది అని తేలిపోయినట్లేనని అనిపిస్తుంది. మరి మారనిది సత్యమే గాదు అని ఈ విషయంలో ఋజువు కావాలంటే ఏం జరగాలి? భూమి బల్ల పరుపుగానూ గాక, గోళాకారంగానూ కాక మరోలా ఉంది అనిపించాలి. అంటే ఒకప్పి సత్యం, ఇప్పి సత్యంగా మారినట్టే, ఇప్పి సత్యం భవిష్యత్‌లో మరో సత్యంగా ప్రకించబడుతుంది. లేకపోతే ఇప్పి సత్యం కూడా సత్యం కాకుండా పోతుంది. దీన్ని బ్టి భూమి వాస్తవంగా ఏ ఆకారంగా ఉన్నప్పికీ, నిజానికి దాని ఆకారంలో ఏ మార్పూ రానప్పికీ, దానితో నిమిత్తం లేకుండా మన అవగాహన మారినప్పుడల్లా సత్యం మారింది అనాలన్నమాట.

అసలు భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నది వాస్తవానుగుణ్యత కల్గిన జ్ఞానమేనా?
బి. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. అది ఒకప్పుడు సత్యం అనుకుంటే, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది- అన్నది ఇప్పి సత్యం అనుకుంటే సత్యం మారుతుంది అని తేలిపోయినట్లే అనిపిస్తుంది. మరిమారనిది సత్యమేకాదు అని ఈ విషయంలో ఋజువుకావాలంటే ఏం జరగాలి? ఏది దేని చుట్టూ తిరిగితే గాని ఇప్పి సత్యమూ మారినది అని ప్రకించగలం? వాస్తవాను గుణ్యతతో సంబంధం అక్కడ లేదనుకుంటే ఎవరు ఏమి చెప్పినా సత్యమేననాల్సిందే కదా!
సి. రాహు కేతువులు అనే గ్రహాలు సూర్యచంద్రుల్ని మింగటం వల్లనే సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి. అది ఒకప్పుడు సత్యం అనుకున్నాము. కాని నిజానికి రాహుకేతువులు అనే గ్రహాలేలేవు. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం మరియు సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి నీడపడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తాయి. అది ఇప్పి సత్యం అనుకుంటే సత్యం మారుతుంది అన్నది తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. మరి మారనిది సత్యం కాదు అని చెప్పాలంటే ఏం జరగాలి?
అదిన్నీ వాస్తవానుగుణ్యత గలిగే ఉండాలా? ఉండక్కర్లేదా? అనేది వెంకాద్రిగారే వివరణ ఇవ్వాలి.
డి. పదార్థంతో సంబంధం లేకుండా చైతన్యం స్వతంత్రంగా ఉంది - అది ఒకప్పుడు నాకు సత్యం (నేను ఆస్తికుడిగా ఉన్నప్పుడు)
పదార్థజనితమే చైతన్యం (ఇది శాస్త్రీయంగా ఋజువయిందనుకుంటే) - అది ఇప్పి సత్యం (నేను భౌతిక వాదిగా మారినప్పుడు)  సత్యము మారిందని తేలినట్లే అనిపిస్తుంది. మరి మారనిది సత్యమేకాదు అని ఈ విషయంలో ఋజువుకావాలంటే ఏం జరగాలి? చైతన్యం పదార్థ జనితము  అన్నది కూడా మారిపోవాలి. సత్యం మారుతుంది అనేవారు దీనిని అంగీకరిస్తారా?
అసలు ఎందుకింత గందరగోళం? వాస్తవానుగుణ్యత గల్గినదే సత్యము అనే నిర్వచనాన్నే కాదనుకునే స్వేచ్ఛ మనకుండగా ఆ నిర్వచనాన్ని వదిలేస్తే పోలా. ఆ దృష్ఠితోనే ఒకే నిర్వచనాన్ని చెప్పుకుని దాన్ని సమర్థించుకుంటూ కూర్చొనేది మతపద్దతి అన్నారేమో. కాని శాస్త్రీయ విధానం ఒకే నిర్వచనాన్ని చెప్పమని అడగదు, అంగీకరించమని వత్తిడీ చేయదు. ప్రతిపాదకుడు ఎవరైతే వారు తమ ప్రతిపాదనను ఋజువు చేసుకునే సందర్భంలోనే ప్రతిపాదనలోని పారిభాషిక పదాలకు నిర్వచనము ప్రసక్తివస్తుంది. వారి స్వంత నిర్వచనం అయినా దోషరహితంగా చెప్పగలిగితే చెప్పాలి లేదా వివరణలోకీ వెళ్ళవచ్చు. ఎందుకంటే నిర్వచనాలు (దోషరహితంగా) తయారు చేసుకుని చెప్పటం అంతసులువుకాదు. అలా అని నిర్వచనమే అడగకూడదు అనీ, అడిగిన వాడికి ఏవో ముద్రలు అంటకట్టడం ఉచితం కాదు.
నిజానికి వెంకాద్రిగారూ నిర్వచనాల అవసరాన్ని గుర్తించారు. ఎందుకంటే ఆయనే తన నాస్తికత్వం గ్రంథంలో 64 వ పేజీలో - ''దేవుడి కుదురు మీదుగా బయల్దేరిన వాళ్ళకు కూడా దేవుడంటే ఏమిో స్పష్టమయిన అభిప్రాయం ఉన్నట్లు కనబడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్వచించారు.'' అని వ్రాశారు. మరి సురేంద్రబాబుతో జరిగిన సంవాదంలో నిర్వచనాలక్కర్లేదనీ తమ కుర్రాళ్ళు నిర్వచనాల స్టేజీ ఎప్పుడో దాి వచ్చేశారనీ, నిర్వచనాలు అడిగేవారికి అసలు ప్రశ్నించేస్థాయి, అర్హతలే లేవనడానికీ ఒకటే కారణం. నిర్వచనాల్ని అప్పికప్పుడు చెప్పడం కష్టం కనుకే. అప్పికప్పుడే కాదు. వారి అనేక గ్రంథాలలోనూ పారిభాషిక పదాల నిర్వచనాలు చాలా అరుదుగా వుాంయి. అందువలన వారికి నిర్వచనాలపై ఆసక్తి, వాి ఆవశ్యకత గురించిన అవగాహన లేదనవచ్చు. ఇలాిం కష్టం హేతువాద సంఘ సభ్యులకేకాదు. అనేక ఉద్యమ కారులకూ ఉంది. నిర్మొగమాటంగా చెప్పాలంటే సత్యాన్వేషణ మండలి సభ్యులలో చాలా మందికి, ఇప్పికీ ఈ విషయంలో అవసరమైనంత నిపుణత లేదు. అలా అని వారు నిర్వచనాల అవసరాన్ని తృణీకరించటం గాని, వాిలో ఏనాడో నిష్ణాతులమయ్యామని చెప్పే సాహసం చేయటం లేదు. ఇతర సిద్దాంతానుయాయులతో జరిగే చర్చల్లోనైనా, నిర్వచనాల అవసరం కల్గినప్పుడు, వారితో కలసి అవసరమైన పారిభాషిక పదాల నిర్వచనాల్ని తయారు చేసుకోానికి ప్రయత్నిస్తారు. కాని నిర్వచనాలపైనే నొక్కి పెడుతూ చర్చలు కొనసాగాలంటే మండలి ఉద్యమనినాదం 'కలసిపో, కలుపుకుపో' ఆచరణలో కష్టసాధ్యం. 
2. హేతువాద సంఘం వారు హేతువాదం అంటే ఒక వాదమూ కాదు. సిద్దాంతమూ కాదు. అది ఒక ఆలోచనా విధానం అని అనేకసార్లు ప్రకించారు. అంతేకాదు పేరులో వాదం ఉన్నంత మాత్రాన అది సిద్దాంతం కాదు కాని అనువాద సౌలభ్యం కోసమే దాన్ని తెలుగులో వాదంగా వ్రాస్తున్నామని, పిలుస్తామని చెప్తున్నారు. ఇది పెద్దగా వివాద పడవలసిన అంశంకానప్పికీ మండలి దానిని సిద్దాంతం అనడం ద్వారా దాని హేతువాదం పరిధిని మరింత విస్త్రృత పరుస్తున్నారు. హేతువాద సంఘం ప్రకారం అది కేవలం హేతుబద్ద ఆలోచనా విధానం కాగా, సత్యాన్వేషణ మండలి ప్రకారం అది ఒక సిద్దాంతం, అందులో హేతుబద్దాలోచనా విధానం ఒక భాగం మాత్రమే. ఆ ఆలోచనా విధానమే కాక మరిన్ని ముఖ్యమైన అంశాలు కూడా హేతువాదంలో స్థానం పొందాయని, తద్వారా దానికి సిద్దాంత రూపం కలిగిందని మండలి భావిస్తోంది. హేతువాదం సిద్దాంతమని ఒకరు కాదని మరొకరు అంటున్నప్పుడు మొదట సిద్దాంతమంటే ఏమి? హేతువాదం అంటే ఏమి? అని స్పష్టీకరించుకుని హేతువాదం సిద్దాంతం ఎందుకు అవుతుందో లేదా ఎందుకు కాదో నిర్ణయించడం సరైన పద్దతి.
హేతువాద సంఘం ప్రకారం సిద్దాంతమంటే హేతువు అనే సాధనం ద్వారా సాధించబడేది (సాధ్యం) హేతువాదం అంటే హేతుబద్దాలోచనా విధానం. హేతువాదం (హేతుబద్దాలోచనా విధానం) ద్వారా ఇతర సిద్దాంతాలను పరీక్షిస్తారు. సాధిస్తారు తప్పితే దానికదే సిద్దాంతము కాదు అంారు. హేతువాదం అంటే కేవలం హేతుబద్దాలోచనా విధానం అంటే మాత్రం పై వివరణ ప్రకారం హేతువాదం సిద్దాంతం కానక్కర్లేదు.
కాని సత్యాన్వేషణ మండలి వారు అది కేవలం హేతుబద్దాలోచనా విధానమే కాదని ఆ విధానానికీ, వ్యక్తిజీవితానికీ, సామాజిక గతికి, ప్రకృతికి ఉన్న సంబంధాల్నీ, దానితో వివిధ వైజ్ఞానిక క్షేత్రాలకు గల సంబంధాన్నీ, సత్యాన్వేషణలో ఆ విధానానికి ఉన్న స్థానము, సక్రమాలోచన చేయవల్సిన అవసరాలు, చేయకుంటే జరిగే అనర్థాలు, ఇప్పికే జరిగిన అనర్థాలు, ఇలా బహువిస్తారమైన క్షేత్రపరిధిని ఆవరించుకుని ఉన్న, మంచి సమాజం ఏర్పడాలన్న సామాజిక దృక్పథం గల భావ విప్లవం లక్ష్యంగా, అందుకు అవసరమైన భావజాలంతో కూడి ఉన్న సిద్దాంతము అనాంరు. అంతేకాదు వారు సిద్దాంతమంటే ఏదేని ఒక విషయంపై నిర్థిష్ట రూపంలో చేయబడిన ప్రతిపాదనగా చెప్తారు. అలాిం ప్రతి పాదనలనేకం కూడా ఉన్న ధోరణినీ సిద్దాంతం అనాల్సిందే. సిద్దాంతాల పేరున చలామణి అవుతున్న వాిని పరిశీలిస్తే అది నిజమేననిపిస్తోంది కదా!
సిద్దాంతము అనే పదానికి ఇరు సంస్థలూ తమ తమ అర్థాలతో భిన్నంగా ఉన్నప్పుడు ఎవరిది వారిదే సరియైనది అనిపిస్తుంది. నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం మంచిది.
హేతువాద సంఘం వారు 'తర్కం' పట్ల తరచుగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుాంరు గాని, తర్కం అంటే క్రమబద్దమైన ఆలోచన చేయటం అనే అర్థం. అంటే పరోక్షంగా హేతుబద్దాలోచనా విధానమేనన్నమాట. కనుకనే తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తర్కశాస్త్రంలో తర్క శాస్త్రాన్ని గురించి వివరిస్తూ ఆలోచనా నియమాల శాస్త్రం అనే అర్థం చెప్పారు. హేతువాద సంఘం వారు తర్కాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి సందర్భంలోనూ తర్కం అంటే కేవలతర్కం అనే అర్థమే చెపుతారు. కాని తర్కం కేవలతర్కమనీ, అనుభవాంగతర్కమనీ రెండు రకాలనంటూ సత్యాన్వేషణ మండలి కేవలతర్కాన్ని అనుసరించకూడదనే తన భావాన్ని వ్యక్తం చేసింది. అంటే కేవలతర్కాన్ని ఇరుసంస్థలూ వ్యతిరేకిస్తుండగా తర్కమంటే కేవల తర్కంగా హేతువాద సంఘం భావించి అసలు తర్కాన్నే వ్యతిరేకిస్తున్నారు. కాని నిజానికి, రాతలలో అలా వ్యతిరేకించినప్పికీ వారు అసలు ఏమి తర్కించకుండా అటు హేతువాదాన్ని ప్రచారం చేయడమే కాదు, ఇటు స్వీయ జీవితాన్ని గడపడమూ అసాధ్యం. గోరాగారి నాస్తికత్వం పై వెంకాద్రి గారు వ్రాసిన ''నాస్తికత్వం - నాస్తితత్వం''లో గోరాగారు హేతువాదాన్ని, తర్కశాస్త్రాన్ని వ్యతిరేకించడాన్ని విమర్శించడం గమనార్హం. గోరాగారి భావజాలాన్ని తూర్పారపట్టెప్పుడు వెంకాద్రి గారు అనుసరించిన విధానం తర్కంకాక మరేమి? అసలువారు వారు అనుసరించే విధానంలో మనందరికీ వినపడే ఏమి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎంత లాిం ప్రశ్నలు తర్కంలో భాగమే. అందువలనే మండలి తన భావజాలంలో ప్రశ్నించే ప్రక్రియకు, ప్రశ్నించబడినపుడు జవాబిచ్చే ప్రక్రియకు కొన్ని నియమాలు అవసరమన్న మాటలనూ జతచేసింది. 
3. హేతువాదానికి బ్రిష్‌ రేషనలిస్టు ప్రెస్‌ అసోసియేషన్‌ వారు చేసిన నిర్వచనాన్ని అంగీకరిస్తూ దానిలోని - హేతువాదం హేతువు యొక్క సర్వాధిక్యతను నిర్నిబంధంగా ఆమోదిస్తుంది అని హేతువాదం గ్రంథంలో వ్రాయబడింది. కాబ్టి హేతువాద సంఘవారే తాము 'హేతువు' అనే పదానికి ఇచ్చుకున్న కారణము, లయ, నియమము లాిం అనేక అర్థాలను అన్వయించి దాని సర్వాధిక్యతను చూపగలగాలి. కేవలం ఆలోచన అవసరమైన సందర్భాలలో తప్ప ప్రత్యక్ష జ్ఞానర్జన ప్రక్రియలో హేతువుతో పనేమి లేదని సత్యాన్వేషణ మండలి అభిప్రాయ పడుతోంది. అంటే హేతువు అన్ని చ్లోా ఆధిక్యతను కలిగి ఉండదు కొన్ని చోట్ల దాని అవసరమూ ఉండదు. అని వారి అభిప్రాయం. ఉదా|| ఎదురుగా ఒక వస్తువు కనబడుతుంది. దానిని భాషలో ఏమాంరో తెలియకున్నా, దాని జ్ఞానం కలగడానికి ఇబ్బందేమీ లేదు కదా! హేతువుకు మనం ఎలాిం అర్థాలు ఇచ్చుకున్నా వాి అవసరం ఇక్కడలేదు.
సత్యాన్వేషణ మండలి ప్రకారం హేతువు అంటే, ప్రత్యక్షంగా ఉన్న ఆధారంతో దానితో ముడిపడి, పరోక్షంగా ఉన్న మరొక దానిని ఊహించే ప్రక్రియలో, ప్రత్యక్షంగా ఉన్న దానిని హేతువు అనీ, పరోక్షంగా ఉండి ఊహించబడిన దాన్ని సాధ్యము అనీ అంారు. అంటే అక్కడ కొంత ఆలోచనా ప్రక్రియనడుస్తుందన్న మాట. కాని ప్రత్యక్ష జ్ఞానం నేరుగా కలిగే సందర్భాలలో, ఊహకుతావేలేని సందర్భాలలో ఆలోచన అవసరం లేనప్పుడు హేతువుకు సర్వాధిక్యతేగాదు అసలు హేతువుతో పనేమి ఉంటుందని మండలి ప్రశ్నిస్తోంది. అలాగే హేతుబద్దాలోచన ద్వారా చేసుకున్న నిర్ణయాలు సరైనవో కాదో నిర్ధారించుకోడానికి, తెలుసుకోడానికి ప్రయోగం తప్పనిసరికదా! అనీ అంోంది. 
అంతేకాదు మండలి ప్రకారం మనిషి ఉనికిలో లేకున్నా, లేక మనిషి గమనించకున్నా, కార్యకారణాలు అనడానికి తగిన సంబంధాలు ప్రకృతిలో ఏర్పడుతూనేఉంాయి. కాని హేతుబద్దాలోచన మాత్రం మెదడున్న ప్రాణుల్ని అంిపెట్టుకుని మాత్రమే ఉంటుంది. మెదడు లేకుంటే ఏ ఆలోచనా ఉండదు. ఆలోచనకు అవసరంలేని, అవకాశంలేని సందర్భాలలో హేతుబద్దాలోచన అన్నమాటే పుట్టదుగదా! 
అలా అని హేతుబద్దాలోచనకు జ్ఞానార్జన క్షేత్రంలో ఏ మాత్రం స్థానం లేదనం. మనిషి జీవితంలో దానికి అత్యంత ప్రముఖస్థానం ఉంది. కాని దానిది సర్వాధిక్యమనదగ్గ స్థానం మాత్రం కాదు. అని మండలి అభిప్రాయం.
(4) హేతువు అంటే కారణము, లయ, నియమము, అని హేతువాద సంఘం భావిస్తోంది. ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా, ఒక ఉదాహరణ (నిర్వచనం కాదు) ద్వారా హేతువు అని ఫలానా దాన్ని అంానికి వీలవుతుంది అని వివరిస్తే బాగుండేది. ఎందుకంటే హేతుబద్దాలోచనాధోరణి (హేతువాదం) గురించి మనం ఏం వ్రాసినా అది పాఠకునికి లేదా అధ్యయనపరులకు అర్థం కావాలి గదా.
మండలి ప్రకారం 'హేతువు' అన్న పదం, సందర్భాన్ని బ్టి కార్య కారణాల్ని రిెంనీ సూచిస్తుంది. పైగా హేతుస్థానంలో కారణం కంటే కార్యం ఉన్న సందర్భంలోనే బలమైన ఊహ చేయడానికి అవకాశం ఉంటుంది.
3వ అంశం వివరణ పై మండలి హేతువుకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒక ఉదాహరణ రూపంలో చూద్దాం. (1) ఒక విధంగా తడిసిన మ్టి నేలను చూసి అంతకు ముందు ఆ ప్రాంతంలో వర్షం కురిసిందని ఊహిస్తే నేలతడిసిందన్న దాన్ని హేతువుగా చెప్తాం (2) నల్లని బొగ్గులతో, మసి మసిగా ఉండే నివాస ప్రాంతాన్ని చూసినపుడు అంతకు పూర్వం ఏదో అగ్ని ప్రమాదంలో ఇల్లు తగలబడిపోయి ఉండవచ్చని ఊహిస్తాం. నల్లగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని 'హేతువు'గా స్వీకరిస్తాం. (3) రోడ్డు మీద పెద్ద రక్తపు మడుగుచూసి, అంతకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరో/ఏదో గాయబడి వుండవచ్చని ఊహిస్తాం. ఈ సందర్భంలో ఆ రక్తపు మడుగును 'హేతువు'గా తీసుకుాంం.
ఇలా ఏదైనా ఉదా|| చెప్పి దానిలో హేతువు ఫలానాది అని బోధిస్తూ, కారణంగానో, లయగానో, నియమంగానో హేతువాద సంఘం వారు అన్వయం చేసి చేప్తే అర్థం చేసుకోవానికి అవకాశం ఉంటుంది.
5. హేతువాద సంఘం ప్రకారం -పదార్థం ప్రకించే ధర్మాలను, గుణాలను దాని లక్షణాలుగా గుర్తించాలి. ఆ ధర్మాలను, గుణాలను ఆ పదార్థంన్నుండి విడగ్టొి వాికి గుణ పదార్థమనీ, క్రియా పదార్థమనీ, సంబంధ పదార్థమనీ పేర్కొనడం అవివేకం. ఎందుకంటే అది, ఆయా గుణాలు పదార్థానికి భిన్నంగా అస్తిత్వాన్ని కలిగుాంయనే భ్రమను కలిగిస్తుంది కాబ్టి.
కాని పదార్థాన్నుండి ధర్మాలను, గుణాలను విడగొట్టడం సాధ్యమా? ఒకవేళ అదే జరిగితే దాన్ని అదే పదార్థంగా భావిస్తామా? ద్రవ్యాన్ని మాత్రమే పదార్థంగా భావిస్తున్నారు గనుక గుణ పదార్థాలను, క్రియా పదార్థాలను 'పదార్థం' నుండే మండలి విడగ్టొి చూస్తుందని వాఖ్యానిస్తున్నారు. పదము దేనిని సూచిస్తుందో అది పదార్థం అంటూ మండలి చెబుతున్న దానిని వారు అర్థం చేసుకోలేదని చెప్పవచ్చు.
మండలి పదార్థాలను (భాషా పదాలు సూచించేవాిని) ద్రవ్య, వస్తు, గుణ, క్రియా, సంబంధాలుగానూ, భౌతిక, భావ పదార్థాలుగానూ వర్గీకరించింది. భాషలో భౌతిక పదార్థాలనే (ద్రవ్యాలనే) కాక ఇతరాలను సూచించే అనేక పదాలు కూడా ఉండడం వాస్తవం. వాిని అందరం వాడుకోవడమూ వాస్తవమే. భావాలను సూచించానికి వాడే పదాలను అవగాహనా సౌలభ్యం కోసం భావ పదార్థాలుగ మండలి చెప్తుంది. దాన్ని అంగీకరించనివారు, భాషలో మనం వాడుకునే ఏ పదం అయినా భౌతిక పదార్థాన్నే సూచిస్తుందని రుజువు చేయగలగాలి. సాధ్యపడుతుందేమో ప్రయత్నించండి.
మరొక కోణంలో ఆలోచిస్తే భాషలోని పదాలను విభాగములగ చూడటం వ్యాకరణం తెలిసిన ప్రతి ఒక్కరికి అనుభవమే. నామవాచకము, సర్వనామము, క్రియా, విశేషణం, అవ్యయం లాిం వర్గాలుగా భాషలోని పదాలను విడగ్టొి చదువుతాం. ఇది కేవలం అవగాహన సౌలభ్యం కోసమేనని గ్రహించాలి. అంతేకాని 'రాముడు' అనే మనిషి పేరు నామవాచకంగానూ, 'అతడు' అని పేర్కొన్నప్పుడు సర్వనామముగను, అతడు చేసే పనులను క్రియలుగను, అతని లక్షణాలను విశేషణంలుగాను చెప్తున్నామంటే అవగాహనా సౌలభ్యం కోసమే గాని రాముడు నుండి అతడును అతని గుణాన్ని విడగొట్టగలమనీ కాదు గదా? ఇలా భాషకు చెందిన వ్యాకరణ సూత్రాలననుసరించి సరళంగా అర్థం చేసుకోడానికి వీలున్నదానిని, జఠిలం చేయడం, గందర గోళ పరచడం అనవసరమనిపిస్తోంది. ఉదా|| :- పులుపు వేరు, తెలుపు వేరు, గ్టి - మెత్తన, ఎత్తు, పల్లము, సువాసన - దుర్వాసన ఇలాివన్నీ వేరు వేరు అంటున్నామంటే స్థలంలోనే వేరు వేరుగా ఉన్నాయని అంటున్నట్లు కాదు.                     (సశేషం)

1 comment: