Monday, April 25, 2016

222

సత్యానేషణ మండలి పిలుపు
యోచనాశీలురూ, మిత్రులూ అయిన ఫజలుర్‌ రహమాన్‌ గారికి !
సత్యాన్వేషణ లోనికి, సత్యాన్వేషణ మండలి కార్యక్రమాలలోనికి రావలసినదిగా మిమ్ము నిజాయితీగా, మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నాకు తెలిసినంతలో మానవత్వపు ఛాయల్లోకి వచ్చిన వారుగానీ, మానవీయ విలువలను అంగీకరించగలవారు కానీ, మతంలో ఉండలేరు. అందులోనూ ముఖ్యంగా గుర్తింపబడుతున్న హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలకు సంబంధించిన భావజాలాన్ని పై దృష్టితో పరిశీలించగలిగిన వారు అందులో ఉండలేరు. నా వరకు నేను సత్యాన్వేషణ పద్ధతులనెరిగి ఉండి నా కొరకే మతం నుండి బయికి వచ్చాను. మండలి భావజాలమూ, కార్యాచరణలో సాధనలు- సాధ్యాలు కూడా ఈ లోకానికి పరిమితమైనవేననీ విష్పష్టంగా ప్రకించే ఉన్నాను. అలౌకిక, అభౌతిక శక్తుల ఉనికి అనిర్ధారితమనీ, అనిర్థారణీయమనీ కూడా ప్రకించాను. అలా ప్రకించాక గత 30 ఏండ్లుగా అదే చెబుతూ వస్తున్నాను. నాతో పరిచయమేర్పడిన నాినుండి నేనీ విషయాలను ఇలాగే చెబుతుండటం మీరు పలుమార్లుగా వింటూనే ఉన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను నా కొరకుగా ఏది సరైనది, హితకరమైనది అని అనుకుంటున్నానో, నా వాళ్ళనుకుంటున్న వాళ్ళకు గత 4 థాబ్దాలుగా ఏమి చెబుతూ వస్తున్నానో, అదే మీకు చెబుతున్నానీనాడు అన్న వాస్తవాన్ని మీకు గుర్తుచేయడానికే.

చిన్న జీవితాలు మనవి. ఉన్నన్నాళ్ళువుండబోము, మనకు తెలిసిన విషయాలు ఇతరులకు తెలపడమూ, తెలియని విషయాలను తెలియనివని తెలపడమూ అన్ని విధాలా మనకూ, ఇతరులకూ కూడా మేలు కలిగించగలుగుతుంది. అంతేగాని, నిజంగా మనకు తెలియనివి, పైగా మనకవి తెలియనివేనని స్పష్టంగా తెలుస్తున్నవీ అయిన వాిని తలకెత్తుకుని, పదిమంది నెత్తికి ఎత్తడం ఏ రకంగా చూచినా సరైంది కాదు. కానీ మతం - ప్రతి మతమూ - తన పట్టులోకి వచ్చినవారందరి చేతా ఇదే పనిచేయిస్తోంది. వస్తుతః మంచివాళ్ళే అయిఉండీ పరస్పరం ఎి్ట అపకారము చేసుకోని వాళ్ళయి ఉండీ, కేవలం వేరువేరు మతస్తులం అన్న కారణంగా పరస్పరం పరాయి భావనను ఏర్పరచుకుంటున్నాము. ఎవరెన్ని చెప్పినా, పైకి ఎన్ని మ్లాడినా, అంతరంగంలోనూ, అంతరంగీకుల సమక్షంలోనూ, ఒకరినొకరు పరాయి భావనతోనే చూసుకుంటున్నాం, మ్లాడుతున్నాం. ఇవన్నీ నాకంటే ఆ క్షేత్రంలో నేరుగా సంబంధాలున్న మీకే బాగా తెలుసు.

మీకు భాషపైన నాకున్నంత పట్టులేకపోయినా చురుకైన బుర్ర ఉంది. పట్టుదలా ఉంది. అంగీకరించి పట్టుకున్న దాని విషయంలో క్రియాశీలంగా పనిచేసే నైజమూ ఉంది. ఇవన్నీ మంచి వ్యక్తిత్వాలలో ఉండే, ఉండాల్సిన లక్షణాలే. నా గురించి మీకు కొంత తెలిసే ఉన్నా, ఈ సందర్భానికి చెందిన వారి నాలుగు మాటలూ మీ దృష్టికి తేవడం మేలనిపిస్తోంది. నే భాషమీద పట్టున్న వాణ్ణి, సిద్ధాంత గ్రంథాలనెలా అధ్యయనం చేయాలో తెలిసిన వాణ్ణి కూడాను. ఖురానును విమర్శనా దృష్టితో పలుమార్లు చదివి ఉన్నాను. ఆ పక్షానికి చెందిన పలువురితో మ్లాడీ ఉన్నాను.
ఖురాను దృష్టికోణము ఏమిటన్న దాని విషయంలో భాష తెలిసిన వారెవరూ కాదనలేనంత స్పష్టత ఉంది నాకు. ఏదో ఒక అంశం దగ్గరైనా మీరు దానిలోని అపసవ్యతను చూడగలిగితే ఇహ అటుపిమ్మట దానిని విశ్వాసంతో కాక పరిశీలనా దృష్టితో చూడగలుగుతారన్నది నా భావన. కొంత కాలహరణం జరిగినా మొన్ని సమావేశంలో మనం ఒక ముగింపుకు వచ్చేసినట్లే అయ్యింది. శాస్త్రీయ విచారణా పద్ధతిలో పునర్విచారణ చేసిచూడడం అన్న మెట్టూ ఉంది కనుకనే విషయం నిజానికి ముగిసినా, మరొక్కసారి చూచుకుందాం అన్నమాటన్నాను నేను.
1. 18:80 :- భవిష్యత్తులో విశ్వాసులకు అపకారం చేస్తాడేమో అన్న భయంవల్ల అదీ అతడొక బాలుడైనా సరే చంపేయడం నూికి నూరుశాతం అన్యాయం, అమానుషం, క్రూరం కూడా. అలాింది విన్నప్పుడు మన మనస్సుకు గాయం కావాలి, మనసుంటే.
2. 2:54 :- ఆవు దూడను ఆరాధ్యంగా చేసుకున్న ఘోరకృత్యానికి శిక్షగా వారిని (వారు తమలోని వారైనా) వధించండి అని అల్లా ఆజ్ఞ. దానిని వారు పాించి తమలోని వారినే చంపారు. మీరు ఇంతకాలంగా బలంగా వాదిస్తున్నదీ, నన్ను చూపమని అడుగుతున్నదీ, తను అవిశ్వాసులను చంపమన్నదీ, చంపిందీ నిజమే కానీ, అవిశ్వాస కారణంగానే చంపమన్నాడని తేలాలి అన్నదే కదా. ఈ వాక్యంలో మరింకేరకమైన వాదన చేయడానికీ వీల్లేనంత స్పష్టంగా ఉందావిషయం. మీరు మాిమాికీ, చంపమన్నది తమపై దాడిచేసిన వారినీ, తమను చంపనున్న వారిని మాత్రమే. అది యుద్ధ సంబంధమైన ఎత్తుగడలో భాగం. ఆ చంపడానికి వెనుకనున్న ఆనాి పరిస్థితుల్ని పరిగణనలోనికి తీసుకుని చూడాల్సి ఉంటుంది అంటూ వస్తున్నారు మీరు. నిజానికి ఆ సందర్భాలలోనూ అవిశ్వాస కారణంగానే వారిమధ్య శతృత్వం అదీ, వారు (అవిశ్వాసులు) మీకు మిత్రులు కాకూడదు. వారు శతృవులుగా ఉండాల్సిందేనన్న ఆదేశాలననుసరించి ఏర్పడ్డది మాత్రమే. అదలా ఉంచితే ఈ ఆయతులోని సంఘటనలో అలాిం పరిస్థితేమీ లేదు. ఇక్కడ చంపబడ్డ వారు బయినుండి వచ్చిన శతృవులు కాదు. వీరిపై(విశ్వాసులపై)నా కత్తి ఎత్తలేదు.
''ఎవరిష్టమొచ్చిన విశ్వాసాన్ని వారు కలిగి ఉండవచ్చు. దానిని వారు ప్రచారం చేసుకోవచ్చు. అి్టవారిని రెండోవారు ఏ రూపంలో అటకాయించినా అది అమానుషం'' అని మీరు చాలా స్పష్టంగా, ఒక మానవత్వమున్న వివేకవంతుడు చెప్పదగిన మాట మీరు చెప్పారు. ఆ మాట మీరన్న క్షణంలోనే, హమ్మయ్య ఫర్వాలేదిక రెహమాన్‌ గారు మతం నుండి బయటకి రావడానికి దారి తెరుచుకుంది అనుకున్నాను. ఆ మాటను ఆసరా చేసుకునే ఈ లేఖద్వారా అక్కడ నుండి బయికి రండి మిత్రమా! అని చెప్పగలిగాను. మీకు తెలుసు ఆ రోజు ఆవు దూడను పూజించారన్న కారణంగా వారిలో చంపబడిన వారి సంఖ్య హదీసుల ప్రకారం 60, 70 వేల మంది. ఆ ఘటనను ఒక్కసారి ఊహించుకుంటేనే మనస్సు అదోలా అయిపోతుంది. ఆ దృశ్యాన్ని గనుక మన కళ్ళముందు జరిగిందనుకుంటే అదెంత భీభత్సంగా ఉంటుందో, భయానకంగా ఉంటుందో ఊహించుకోండి. అప్పివరకూ మనవారిగానే ఉన్న తాతలు, తండ్రులు, తల్లులూ, పెళ్ళాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇరుగుపొరుగు వారు, మిత్రులూ ఒక 60 వేలమంది శవాలు మన ఎదుట గుట్టలుగా పడిఉన్నాయి. కత్తిచేతనే చంపబడే అవకాశం ఉంది కనుక అంతమంది శరీరాల నుండి కారిన రక్తం అక్కడ పడిఉంది. ఆ కత్తివాత పడిన తరువాత ప్రాణం పోయేలోపు వారు చేస్తున్న ఆర్తనాదాలు, గిలగిలా కొట్టుకోడాలు! ఎంత భయానక దృశ్యమది. పైగా ఆ సన్నివేశంలో అవతలివారు ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు. ఎదురు తిరిగి పోరాడినట్లు ఖురాను చెప్పడం లేదు. గొంతు కోయడమో, తెగనరకడమో, పొడవడమో జరిగి ఉండాలి.
18:80 లోని ఘటన కంటే, చాలా పెద్దదీ, భయంకరమైనదీ, క్రూరమైనదీ కూడా ఈ ఘటన. వారు విగ్రహాన్ని పూజించిన కారణంగా, తనను నమ్మక మరో నమ్మకాన్ని పెట్టుకున్న కారణంగా చంపమని చెప్పిన వానిని అనంతకరుణామయుడు అనడం ఎలా సాధ్యమవుతుంది?
ఒక్క మాట మిత్రమా! ఖురాన్‌లో అవిశ్వాసులపట్ల కరుణ చూపిన సంబంధాలున్నాయేమో చూడండి. అది కరుణకు సంబంధించినదైయుండాలి. తార్కికంగా చూస్తే అది అసాధ్యమని తేలుతోంది. అవిశ్వాసుల్ని వధించండి అన్న ఆదేశం ఉందని, చంపారని, ఇరువురం గమనించాం. అంగీకరించాం కూడా కదా. ఇక వారి విషయంలో కరుణ ఉంది అనడం ఎలా?
4. 84:58 :- అవిశ్వాసుల విషయంలో బుఖారిలోని 84:58 వాక్యం ఇస్లాం స్వీకరించి తిరిగి అవిశ్వాసి అయినవాణ్ణి, వధించడం వినా మరోమాటే లేదని సూిగానే చెప్పింది. అది నిజమేనని, అది నేను చూపినరోజే, అది 100శాతం నిజమేనని మీరూ అంగీకరించారు. దానర్ధం ఒక ముస్లిం తన ఇష్టప్రకారం ఇస్లాంను విడిస్తే చంపేయమనే కదా! అది అమానుషమనే కదా మీరూ అంటున్నారు. అల్లాను విశ్వసించని వారిని చంపేయండని ఇబ్నంషాక్‌ 992 లోనూ స్పష్టంగా ఉంది.
రహమాన్‌ గారూ ! మీరు భాషపై నాఅంత పట్టున్న వారు కాకపోయినా, మరీ అంత అర్థం చేసుకోలేని వారు కాదు. ఆ విషయం మీకూ తెలుసు. మన పరిచయం మొదలైనాక ఒక థలో మీలోనూ ఘర్షణ మొదలైందని, విశ్వాసాన్ని విడిస్తే అవినీతిలోకి జారిపోతానేమోనన్న భయం ఏర్పడిందనీ, మీరే అన్నారు. ఆమాట మీలోని ఒక బలహీనతను, ఒక మంచితనాన్ని ప్టిస్తోంది. నీతివంతుడుగా ఉండలేను ఏదో ఒక భయం లేకుంటేను అన్నది మీ బలహీనత కాగా, నీతివంతుడుగా ఉండాలి మనిషి అన్నది మీ వ్యక్తిత్వంలోని మంచితనం. మనమూ నీతివంతంగా ఉండాలి. ఇతరులూ నీతివంతంగా ఉండాలి అని కోరుకోవడం అన్నదే మంచి సమాజం ఆశించే వాళ్ళందరికీ ఆరంభస్థానం.  ఆపై అందుకు చేతనైనంత కృషిచేస్తూ ఉండాలి మనమందరం. ఆ దిశగా పనిచేద్దాం రండనే నా యీ పిలుపు. ఒక్క నిజం చెప్పాలి ఇక్కడ. 100 శాతం మంచిగా ఉండగలనని నేనూ అనుకోవడంలా. నా బలహీనతలు నాకూ ఉన్నాయి. నా లెఖ్ఖ ప్రకారం విశ్వాసపు పొర మిమ్మల్ని వాస్తవం చూడనీయడం లేదు. ఏదోరకంగా ఆ పొర తొలిగితే, ఖురాన్‌ మానవత్వమున్న బుద్ధిమంతులు అంగీకరించదగిందిగా లేదనీ, అది మానవుల మధ్య హింసను రగిలిస్తూనూ, ప్రేరేపిస్తూనే ఉంటుందనీ, నిజానికి ఖురానే గాక మిగిలిన మతాలూ ఈనాి, రేపి సమాజ అవసరాలు తీర్చలేవని ఇట్టే తెలిసిపోతుంది. మీ విషయంలో మీలాి మంచి నాకాంక్షించే వారి విషయంలో, నా యత్నమూ, నిరీక్షణా కూడా ఆ పొర తొలగించడమెలా అన్నదే. అది భౌతికంగా, అంటే చేతుల్తో లాగేసేదైతే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి. కాని అది మానసిక భావన. ఎవరికి వారు తీసేసుకోవడానికి సిద్ధపడి తీసేస్తే తప్ప పోదు.
ఈ విషయంలో మిమ్మల్ని కదిలించడానికి, వత్తిడి పెట్టడానికీ నాకున్న మరో అవకాశం ఖురాను నుండి ఈ లోకానికి సంబంధించి మనం రుజువుకు పెట్టగల అంశాలను ఎన్నుకొని పరీక్షించి చూడడం. ఇక్కడ ఆ అంశాలనే మూడుగా చెప్పుకుంటున్నాం. వ్యక్తి - సమాజమూ - ప్రకృతి అన్న వాి గురించి ఖురాను ఏమంటున్నదో చూసి, అది సరైందో కాదో తేల్చడం. వాిగురించి ముందుగా ఒక్కోదాని విషయంలో ఒక్కో ఉదాహరణ మీ ముందుంచుతాను. అందులో ఖురాన్‌ పక్షం సరైంది కాదన్నదే నా అభిప్రాయం.
1. వ్యక్తి :- మనిషి పుట్టుక గురించి ఖురాను 5,6 రకాల మాటలు చెప్పింది.
ఎ) మ్టి నుండి మనిషి ప్టుాడు (మ్టితో చేయబడ్డాడని)
2బి) నీితో చేయబడ్డాడు (ప్రతి ప్రాణీ నీితోనే చేయబడింది).
సి) కక్షుద్రమైన వీర్యబిందువుతో చేయబడ్డాడు.
డి) ఇక 23 : 12 లోనైతే ఎలా మొదల్టెి, ఎన్ని రకాలుగా మనిషిని ప్టుించిందీ ఒక క్రమం వర్ణించబడింది.
ఇ) పురుషునితో పని లేకుండానే స్త్రీ బిడ్డను కనగలదు అల్లా తలిస్తే.
రహమాన్‌ గారూ! పై వాిలో దేనిని పరీక్షించుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. నాకు తెలిసి వాిలో ఏదీ ఈ నాి వైజ్ఞానిక పరీక్షకు నిలవదు. తప్పు అనే తేలుతుంది. మాటవరసకు అన్నింని తప్పులని నేనుగానీ, మరొకరు గానీ రుజువు చేయలేక పోయినా, ఏదోఒక్కటైనా తప్పని రుజువైతే అదిచాలు ఖురాను దైవ గ్రంథం కాదనడానికి. నిజానికి ఈ విషయాలన్నీ పరీక్షాకేంద్రం దగ్గర తేల్చుకోవాల్సిందే. అయినా కొంత సమాచారం ఇస్తాను, ఖుద్దూస్‌ను వివరాలివ్వు ముందు అని అడిగారు కనుక.  సరైన పద్ధతైతే ఇక్కడ వివరాలివ్వ వలసిన పనిలేదు. ఇచ్చినా, నీవు రాసి పంపిన సమాచారం సరైనదే అని రుజువు చేయి అని అడిగే అవకాశం అప్పుడూ మీకుంటుంది. చివరికి ప్రయోగశాల దగ్గరే ఇది ముగుస్తుంది. కనుక పరీక్ష చేయడమే సరైందవుతోంది.
ఓ మ్టితో చేయడం : 1. ఇది జరిగిందో లేదో ఈనాడు మనం నిర్ధారించలేము (అది మొది మనిషికి చెందింది కనుక అని మీరంటేనే సుమండి). ఈ నాికీ మనిషి మ్టితో చేయబడ్డవాడేనని గానీ మీరంటే అది తప్పని రుజువు చేస్తాను నావైపు నుండి. కానీ నిజానికి రుజువు చేయాల్సింది మీరే, మీరు మాత్రమే, ప్రతిపాదన మీదే కనుక. ఈ నియమం అవసరమైందనీ, సరైందనీ మీకూ తెలుసు. మరో మాట! ఏ మ్టితో బడితే ఆ మ్టితో నని ఖురాన్‌ చెప్పడం లేదు. ఫలాని రకమైన మ్టితోనని స్పష్టంగా చెబుతోంది. అగుము అంటే అయ్యేలా చేయగల అల్లాకు దొరికిన దేనితో పడితే దాంతో చేయగల అల్లాకు, బాగా మాగిన, కుళ్ళిన, ఎండి గలగలమనే బంకమన్ను ఎందుకో ఆలోచించండి. మొండిగా, బండగా, గుడ్డిగా, అది ఆయనిష్టం అని మాత్రం అనకండి. దానినే ''విశ్వాసపు పొర'' అని నేనన్నది. అది తొలగితే గానీ, ఇంగితం పనిచేయడం ఆరంభం కాదు.
వ్యక్తి గురించి :-
2. ఖుద్దూస్‌ ఎంచుకున్న అంశమూ, ఖురాన్‌ అవగాహన తప్పనడానికి సరిపోయేదే. అది 86:57 లోనిది.
ఓ  1. మనిషి వెన్నుముక, ఛాతీ భాగం మధ్యనుండి వెలువడే నీితో ప్టుించబడ్డాడు. ఈ ఆయతును ఆంగ్లంలోకి, తెలుగులోకి అనువదించేవారు ఒక రకమైన ద్రవంతో నని (ఎ ఫ్లూయిడ్‌), నీితోనని, రెండుగా అనువాదం చేశారు. ఇక్కడ అరబ్బి పదం మా, ఇన్‌. అది నీరు అన్న అర్ధాన్నిచ్చేదే.
ఓ  2. మనిషి 'వెన్నెముక - ఛాతీ భాగం' అని కొందరు చెప్పగా, పురుషుని వెన్నెముక భాగం నుండి కొంత ద్రవమూ, స్త్రీ ఛాతీ భాగం నుండి కొంత ద్రవమూ నని 'మౌలానా మహమ్మద్‌ జునాగడీ' వారి అనువాద గ్రంథం 86:6 వివరణ 5లో చెప్పారు.
ఓ  3. డాక్టర్‌ అబ్దుల్‌ రహీం బిన్‌ మొహమ్మద్‌ మౌలానా గారి అనువాదంలో 'విసర్జింపబడే ద్రవపదార్థం'తోనని ఉంది. అది పురుషుని వెన్నెముక - రొమ్ము మధ్యభాగం నుండి వస్తుందని అనువదించారు.
ఓ  4. జునాగఢీ వారిదే ఉచితంగా ఇస్తున్న పుస్తకంలో, సూిగా, ఎగసిపడే నీితో సృష్టించబడ్డాడు అనే ఉంది. అది వెన్నెముక - ఛాతీ మధ్యభాగం నుండి వెలువడుతుంది అని ఉంది.
ఓ  5. ఖురాన్‌ భావామృతంలో వెన్నెముకకు - పక్కటెముకలకు మధ్యనుండి దూకుడుగా వెలువడే ద్రవంతో ప్టుించబడ్డాడని ఉంది.
6. అహ్మదీయ ముస్లిం మిషన్‌ వారి అనువాద గ్రంథంలో అనువాదకుడు (షేక్‌ ఇబ్రహీం నాసిర్‌) 'ఎగురు న్టి నీితో' అని ఉంది.
7. హమీదుల్లా షరీఫ్‌ గారి అనువాదంలో వెన్నెముకకు - ప్రక్క టెముకలకు మధ్యనుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్థంతో అతడు ప్టుించబడ్డాడు అని ఉంది. దానికి వివరణలో, స్త్రీ పురుషుల సంతానోత్పత్తి ద్రవాలు మనిషి వెన్నెముక, ప్రక్కటెముకలకు మధ్యనుండే శరీరభాగం నుండి ప్రవర్తిస్తాయి అని ఉంది.
ఓ  జునాగఢీ వారి వివరణ భాగంలో - 'తారాయిబ్‌' అనే అరబ్బీ పదానికి స్త్రీ మెడలో ధరించే నగ. ఛాతీ భాగాలలో వేలాడే స్థానం అని రాశారు.
ఓ  యూసఫ్‌ ఆలీ గారి ఆంగ్లానువాదం దగ్గర వివరణలో (6070-6071) 76-2 మరియు దాని వివరణగా 5832 లను కలిపి చదువుకోమని చెప్పారు. అక్కడ స్త్రీ నుండి అండము, పురుషుని నుండి వీర్యము అంటూ ఈనాి సైన్స్‌ మాటలను ఖురానుకు అంటగ్టారు. (పులిమారు).
ఇలా ఆ ఒక్క మాటకు ఇన్ని అర్థాలు క్టబ్టెారు. ఏమి చెబుతున్నారో ప్టించుకోకుండానూ, అది సరిగా ఉందో లేదో పరీక్షించుకోకుండానూ,  పారాయణ గ్రంథంలా చదువుకెళ్ళేవారి కేమీ అనిపించదు కానీ, పరిశీలనాత్మకంగా చదవదల్చుకున్న వారికి గందరగోళంగానూ, పరీక్షంచగలిగిన వాి విషయంలో పరీక్షించుకున్న వారికి తప్పుభావన గానూ అనిపిస్తుంది. తేలిపోతుంది.
ఈ విషయంలో ఆధునిక విజ్ఞాన శాష్ట్రం (శరీర శాష్ట్రం, పిండోత్పత్తి శాష్ట్రం) ఏమోంంది?
1. పిండం ఎలా ఉత్పత్తి అవుతోంది.
2. పిండం ఏర్పడడానికి కావలసిన పదార్థాలేమి? అది స్త్రీ పురుషులలో ఎవరి శరీరం నుండి ఏర్పడతాయి? పురుషఫుడి నుండేనా? ఇరువురి నుండీనా ?
3. అవి శరీరంలో ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఏ మార్గం ద్వారా గర్భాశయంలోకి చేరతాయి?
4. నీితో సృష్టించడమంటే ఏమి? వీర్య బిందువుతో సృష్టించడమంటే ఏమి? కక్షుద్రమైన ద్రవంతో సృష్టించడమంటే ఏమి? ఆ మాటలు తప్పో ఒప్పో నిర్ణయించేందుకు ఈనాడు మనం ఏమిచేయాలి? ఆ పరిశీలన చేయాల్సిన పరీక్షా కేంద్రం ఏది?
కార్యకారణ నియమాన్ని గురించి ఈ విషయాలు పరిశీలించే సందర్భంలో పరిశీలించే వారు స్పష్టంగా తెలుసుకొని ఉండడం తప్పనిసరి. ఈ వివరాలిప్పికే మీకు తెలిసి ఉంటే సరే. లేకుంటే ముఖ్యమైన సమాచారం కొంత వరకు అందిస్తాను. పరిశీలించుకోండి.
ఓ  1. ప్టుింది, ప్టుించబడిందీ, ఏర్పడిందీ, తయారైంది, తయారు చేయబడింది, సృష్టించబడింది, సృజించబడింది, రూపొందింది, రూపొందించబడింది, ఉనికిలోకి వచ్చింది, ఉనికిలోకి తేబడింది, కూర్చబడింది, కూడింది, నిర్మించబడింది, కట్టబడింది (ఇంకా మరికొన్ని పదాలు మీ దృష్టికొస్తే వాినీ జతచేసుకోవచ్చు) పై పదాలన్నీ ఒక కాలంలో ఉనికిలో లేక, ఏదో ఒకనాడు ఉనికిలోకి వచ్చినవి అన్న అర్థాన్ని తెలిపిేవిగా ఉన్నాయి. దేనినైనా ఒకదానిని కార్యకారణ నియమంలోని 'కార్యం' అనాలంటే అది ప్టుిందై ఉండాలి. ఉనికిలోకి రావడం దానంతట అదిగా, ఎవరో ఒకరు అనుకుని చేయగా అన్న రెండు రూపాలలో ఉంటుంది (ఉండవచ్చు) అని ఆ పదాలు, వాి అర్థాలను బ్టి తెలుస్తోంది. ఈ కార్యకారణ క్షేత్రంలోని విజ్ఞులు 'కార్యం' అన్న మాటను ఇలా నిర్వచించారు.
1. ఉత్పత్తిమత్వం వినాశిత్వం కార్యస్య లక్షణం, కార్యం అన్నది పుట్టడం, చావడం అన్న రెండు ధర్మాలు కలిగి ఉంటుంది.
2. సావయవత్వం, పరిమితత్వం కార్యస్య లక్షణం. అప్పికే ఉన్నవి కొన్ని కూడితే ఏర్పడేది. స్థలంలో పరిమిత ఆవరణం కలది (ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమించ గలిగింది). పరిమిత పరిమాణం కలది కార్యం అవుతుంది.
3. కార్యం ప్రాగభావ ప్రతియోగి. అంటే, ఒక కాలంలో లేనిది ఉనికిలోకి రావడం (పుట్టడం) అని.
2. కారణం :- కారణాలు రెండు రకాలు. 1. కార్యరూపాన్ని ధరించింది, 2. కార్యరూపాన్ని ధరింపజేసింది. అని. కార్యరూపంలో ఉన్నదాన్ని ఆ కార్యానికి అంతర్గత కారణం లేదా ఉపాదాన కారణం అని అంారు. మెీరియల్‌ కాజ్‌ అని ఆంగ్లంలోనూ, సమవాయి కారణం అని మరోమాట ద్వారా తెలుగులోనూ చెబుతున్నది దీనినే. ఒకి రెండు ఉదాహరణలనిస్తాను. మ్టికుండ కార్యమైతే, ఆ మ్టికుండలో ఉన్న మట్టే ఆ కార్యానికి ఉపాదాన కారణం అవుతుంది. మ్టి కుండలో లేని - బయటున్న మ్టి - ఆ మ్టి కుండకు కారణం అనకూడదు. అందుకే కార్యకారణాల అవగాహన ఉన్నవాళ్ళు ఉపాదాన కారణమంటే కార్యం ఏర్పడక పూర్వం ఉండి, కార్యం ఏర్పడడానికి అవసరమైందీ, కార్యం ఏర్పడ్డాక కార్యంలోనూ ఉన్నదీ, ఒకవేళ కార్యంగాని నాశనమైతే, కార్యనాశనం తరువాతనూ ఉండగలది ఏదో ఆ పదార్థం - (పదార్థాలు) మొత్తం మాత్రమే ఆ కార్యానికి ఉపాదాన కారణం అవుతాయి అని చెప్పారు. ఏ వస్తువుకైనా (కార్యమనదగ్గ దేనికైనా) ద్రవ్య కారణం, ఆ వస్తువులో ఉన్నవే అవుతాయి అన్నదే ఆ కార్యానికి ఉపాదాన కారణం ఏదన్నదానిని నిర్థారించగల ఏకైకసూత్రం. ఇది అర్థమైతేనే, ఆయా ప్రతిపాదనలు చెబుతున్నది కార్యకారణాల పరంగా తప్పో ఒప్పో నిర్ణయించటం కుదురుతుంది.
ఓఓ  ఇక్కడ నాన్చుడు ఉండకూడదు. డొంకతిరుగుడు ఉండకూడదు. అనవసరపు వాగ్వివాదాలు ఉండకూడదు. గ్రంథంలో చెప్పబడ్డట్టే ఒకరు చేసిన ప్రతిపాదనకు తగినట్లే వాస్తవం ఉందా? లేదా? చూడడమే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇంకేమీ చేయకూడదు. ఇంకేదైనా చేద్దామంటూ తాత్సారం చేయడం గానీ, పరీక్షను దారిమళ్ళించడం గానీ చేయకూడదు. నిజనిర్ధారణ సందర్భంలో ఇది అనుల్లంఘనీయం. ముఖ్యంగా రహమాన్‌ గారికి వారితోపాటు ముస్తాక్‌ గారికి ఆ తరువాత ఈ వ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏదో ఒక థోరణికి చెందిఉండి ఇలాి కార్యకారణ సంబంధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నవాళ్ళకి దీనిని స్పష్టంగా గమనించండని సూచన చేస్తున్నాను. ఈ విషయంలో కార్యకారణ నియమాన్ని, దాని అన్వయ విధానాన్ని తెలుసుకోగోరుతున్న వారూ, ఈ విషయంలో నా అవగాహనను పరీక్షించదలచుకున్న వారుకూడా దీనిని నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవలసి ఉంది.
2. కార్యోత్పత్తికి మరో కారణమూ ఉంటుందని చెప్పాను కదా! దానిని నిమిత్త కారణం,  లేదా బాహ్య కారణం అంారు. ఎఫీషియ్‌ం కాజ్‌ అని ఆంగ్లంలో అంటున్నారు. దేని ప్రమేయంతో ఒక కార్యం ఏర్పడిందో లేదా ఉపాదాన కారణంగా ఉండగలదానిని ఏ బాహ్య శక్తి కార్యరూపం దరింపజేసిందో ఆ శక్తిని, శక్తిని వినియోగించిన దానిని నిమిత్త కారణం అని అంారు. దీని అన్వయాన్ని మరోసారి పరిశీలిద్దాం. మన ప్రస్తుత సందర్బం మనిషి దేనితో తయారైనాడు - తయారు చేయబడ్డాడు - అని ఖురాను (బైబిలుగాని, మరో థోరణి వారుగానీ దీని విషయంలో ఏదైనా ప్రతిపాదన చేసి ఉంటే అది) ప్రతిపాదిస్తున్నదో అది సరైనదేనా? కాదా? అన్నది పరీక్షించటమన్నదే.
1. ఖురాను : మనిషిని కుళ్ళి, ఎండిపోయి, గలగలమంటున్న బంకమ్టితో చేశాడు అల్లా అని అంోంది 15:26.
అది తప్పో ఒప్పో చూడాలంటే మనిషి అన్న కార్యరూపంలో కుళ్ళి ఎండిన బంకమ్టి ఉందో లేదో చూడడమే చేయాల్సిన పని. ఉంటే ఖురాను నిజమే చెప్పింది. లేకుంటే ఖురాను తప్పు చెప్పింది అనాల్సిందే.
2. జిన్నులు ఉష్ణవాయువుతో కూడిన అగ్ని వాయువుతో చేయబడ్డారు అంోంది ఖురాను 15:26.
3. నీితో చేయబడ్డాడు : అన్నది నిజమో కాదో చూడాలంటే నీరే శరీరంగా కల మనిషి దొరకాలి. లేకుంటే కార్యకారణ నియమాన్ని బ్టి ఆ వాక్యం సరైందో కాదో చూడడం చేయడం లేదని గాని, చూస్తే వాక్యం తప్పని తేలిందని గానీ చెప్పాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక : 'మనిషి పుట్టుక ఎలా జరిగింది? దేనితో తయారైందా శరీరం?' అన్న విషయంలో ప్రపంచంలో ఎవరేది ప్రకించినా దానికిదే సూత్రాన్ని వర్తింపజేసి అది తప్పో ఒప్పో తేల్చాసిందే. ఉదాహరణకు : ఎ) బైబిలూ, మనిషిని మ్టినుండే చేశాడు యెహోవా అని చెబుతోంది. బి) పాంచభౌతికం శరీరం అని హిందూ గ్రంథాలలో ఒక థోరణి అంోంది. సి) భావమే ముందుంది. ఆ భావం యొక్క అభివ్యక్తే జగత్తంతా అని భావవాదులంటున్నారు.
4. కక్షుద్రమైన వీర్యబిందువుతో మనిషి చేయబడ్డాడని ఖురాన్‌ మరోచోట చెప్పింది (77:24, 80:19).
గమనిక :  మనిషిని ప్టుించడానికి వీర్యం అవసరమని దేవుడు చెప్పనక్కరలేదు. అది సామాన్యుడికి కూడా నిత్య జీవితావసరాల నుండి తెలుసుకోగలిగిన విషయమే. అదలా ఉంచి వీర్యమంటే ఏమి? వీర్య బిందువుతో మనిషిని సృష్టించడం వాస్తవమా. మనిషి పుట్టడానికి స్త్రీ శరీరం నిర్వహించిన పాత్ర ఏమి? ఇలా పిండోత్పత్తికి కారణాలేమి అంటే ఉపాదాన కారణం ఏమి? పిండం పెరిగి పూర్తి ఆకారంలో తల్లి శరీరం నుండి వేరుపడే లోపల జరుగుతూ వచ్చిందేమి? అన్న విషయంలో ఈనాడు ప్రయోగాలు ఏమి తేల్చాయి. ఖురాను - మిగిలిన గ్రంథాలేవైనా ఏమని చెబుతున్నట్లు? రిెంకీ తేడా ఉందా లేదా? దీని విషయంలో ఏది ఒప్పో, ఏది తప్పో తేల్చుకొనే ప్రయోగం చేయగలం కదా ఈనాడు. ఆ పని చేయవచ్చుకదా? ఇందులో వాదులాడుకోవలసిన అవసరం ఏదీ లేదుకదా!
5. 23:12లో చెప్పబడిప క్రమంలోనే మనిషి పుడుతున్నట్లు ఆ పక్షంవాళ్ళు రుజువు చేయాలి కదా!
గమనిక : ఇక ఆ నీరో, వీర్యమో, అదోరకమైన ద్రవమో, ఛాతీకి, వెన్నుపాముకు మధ్యనుండి బయటకు చిమ్మబడుతున్న దానినేమి చేద్దాము. కొద్దిపాి శరీర నిర్మాణ శాష్ట్రం చదువుకున్న వారికైనా వీర్యోత్పత్తి స్థానం రెండు తొడలమధ్య స్థలంలో అమరి ఉన్న వృషణాలని తెలిసే ఉంటుంది. అది రతి సమయంలో జివ్వునో, రివ్వునో ఎగచిమ్మేది పురుషాంగపు మూత్రనాళం గుండానని తెలుసు. మరికాస్త లోతుగా, విశేషంగా ఆ శాస్త్రాన్ని చదివిన వారికీ, ఆ మేరకు పరీక్షించటం చేతనైన వారికీ వీర్య బిందువుతో కాదు శరీరం తయారమ్యేది. వీర్యం అనేక రసాయనాల సమ్మేళన ద్రవం, ఆ ద్రవంలో పురుష జీవాణువులు కోట్లు ఉంాయి, అందులో ఏ ఒక్క పురుష జీవకణం స్త్రీకి చెందిన గుడ్డు అన్న దానిలోకి ప్రవేశించినా పిండం ఏర్పడుతుంది. అప్పుడు కూడా స్త్రీ శిశువు జన్మించడానికి, పురుష శిశివు జన్మించడానికి అవసరమైన ఉపాదాన కారణం, పురుషుని నుండి వచ్చే జీవకణ రూపంలోనే ఉంటుందని, స్త్రీ నుండి ఉపాదాన కారణంగా రావలసిన పదార్థం + పురుషుని నుండి ఉపాదాన కారణంగా రావలసిన పదార్థం రెండూ కలిసే పిండానికి ఉపాదాన కారణం అవుతాయన్నదే కార్యకారణ నియమం చెప్పే శాస్త్రీయ వాక్యం. అది ఈనాడు రుజువుకు ప్టిె చూసుకోగలిగిన థలోనూ ఉంది. ఆ పని చేశాకే మనం ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించుకుందాం. ఏ థోరణికైనా విధానమిదే.
ఓ  ఉదాహరణ : ఆర్యసమాజ సిద్ధాంతంలో దయానంద సరస్వతి అష్టవసువుల గురించి వివరిస్తూ పృధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములను అష్టవసువులుగా పేర్కొని వాటన్నింలోనూ ఆయా పదార్థాలతో చేయబడిన శరీరాలు కల జీవులుాంరని చెప్పారు. దానర్ధం అగ్ని శరీరులు, వాయు శరీరులు, జల శరీరులు వగైరాలుాంయనే కదా? మరి ఆ మాట సరైందో కాదో పరీక్షించుదామనుకుంటే, పరీక్షకు సిద్ధపడి దానిని రుజువుపరచాల్సింది వారే కదా. ఉదాహరణకు, సూర్యలోకంలోని జీవులు అగ్ని శరీరం కలవారుగా ఉండాలి. లేదా ఏ ద్రవ్యం ఉపాదానంగా కలిగి వారున్నారో, ఆ విషయం దయానందుల వారికి ఎలా తెసిసిందో, దయానందులు చెప్పింది ఈనాడు అది సత్యమనే వారికి ఎలా తెలిసిందో, ఆ వివరాలు ఆయా పక్షాల వారే ఇవ్వాల్సి ఉంది. మళ్ళీ మనం ఖురాను విషయానికి వద్దాం.
5. మేము మానవుణ్ణి ఒక మిశ్రమ బిందువుతో ప్టుించాము (76 :13). ఈ వాక్యం ఏమాత్రం శాస్త్రీయ స్థాయి కలిగింది కాదు. పరీక్షించేందుకు వీలు లేనంత బలహీనంగా ఉందిది. అస్పష్టార్థ బోధకంగా ఉంది. శాస్త్రజ్ఞుడైతే ఫలాని పదార్థాల మిశ్రమంతో ప్టుించామనీ, ఆ పదార్ధాల నిష్పత్తులివి అని ప్రకించి ఉండేవాడు. ఖురానులోని ఇలాి వాక్యాలెన్నో మామూలు మానవుని అనుభవాల నుండి గ్రహించడానికి వీలైన రీతిలోనే చెప్పబడ్డాయి. అసలు విషయం తెలియక, మామూలుగా బయికి కనిపించే రీతిలోనో, కనిపించే వాిని బ్టి ఊహించగల రీతిలోనో మాత్రమే ఆ భావాలున్నాయి.
6. ఖురానులో ఏసు జననం, అల్లా సామర్థ్యానికి సూచనగా ఉండాలని తలంచి పురుషునితో పనిలేకుండానే యేసును ప్టుించినట్లు ఉంది. ఇది విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాలకు విరుద్ధమా కాదా? రహమాన్‌ గారూ ఈ వాక్యాలలోని అభిప్రాయాలు సరైనవో కాదో పరీక్షించడానికి ఆధునిక మానవ శరీర విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాల దగ్గరకు రావడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇస్లాం పక్షాన ఎవరైనా సిద్ధపడతారేమో తరువాత చూద్దాం.
సైన్సు సమాచారం ప్రకారం ఓ  పురుష బీజకణాలు వృషణాలలో తయారవుతాయి. అక్కడికి దానిని వీర్యం అనరు. అది అక్కడ నుండి నాళం ద్వారా పురుషాంగంలోని మూత్రనాళంతో సంధింపబడి, మూత్రనాళం ద్వారా బయటకు వెలువడతాయి. ఈ వీర్యోత్పత్తికి గానీ, అది బయటకు రావడానికి గానీ, వెన్నుపాము, ఛాతీల మధ్యభాగంతో పనిలేదు. ఇది ప్రసూతి కేంద్రాలలో పనిచేసే వారిని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. విద్యాలయాలు, జననేంద్రియ వ్యవస్త గురించి సైన్స్‌ ఉపాధ్యాయులెవరైనా ఈ వివరాలు తెలుపగలుగుతారు. అక్కడకి సంతృప్తి చెందకుంటే నేరుగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రక్రియనంతినీ ప్రయోగరూపంలోనే చూడవచ్చు.
ఇక మగబిడ్డ పుట్టడానికి, ఆడబిడ్డ పుట్టడానికి కారణాలేమిోనూ, ఈనాి సైన్స్‌కు తెలుసు. గర్భంలో ఉన్నది మగనో, ఆడనో కూడా నేరుగానే చూడగలము ఈనాి సాంకేతిక విజ్ఞానం సాయంతో.
ఓ  రక్తం అంటే ఏమి? ఎలా తయారవుతుంది? దానికి ఉపాదాన కారణాలేమి?
ఓ  అలాగే మాంసం, ఎముకలు, కొవ్వు, మెదడు, నరాలు వగైరాలు ఏఏ పదార్థాలతో చేయబడ్డాయి లాి ప్రశ్నలన్నీ  వేసుకుని, వాిని గురించి ఆయా మత గ్రంథాలేమంటున్నాయో, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమంటుందో, వాిలో ఎంతవరకు ప్రయోగం ద్వారా సరిచూసుకోగలమో తెలుసుకుని, పరీక్షించగలిగిన వాిని పరీక్షించేసుకుంటే సరిపోతుంది. ఒక పనైపోతుంది. ఎటువిం గుంజులాట లేకుండా స్పష్టత ఏర్పడుతుంది.
సమాజం : 1. ఖురాను ప్రకారం మానవులందరూ సమానులు కారు. 2. విశ్వాసులు - అవిశ్వాసులు, బానిసలు, స్త్రీలు అన్న నాలుగు సముదాయాల మధ్య వివిధ అసమానతలున్నాయి. 3. విశ్వసించి ధర్మకార్యాలు చేస్తే పరలోకంలో స్వర్గం వస్తుంది. 4. ఆ స్వర్గంలోనూ సుమారు 100 రకాల స్థాయా బేధాలున్నాయి. 5. విశ్వసించని వారు ఎన్ని మంచి పనులు చేసినా వారికి నరకమే గతి. 6. ఎన్ని తప్పుడు పనులు చేసినా ఆఖరి విషయంలో అల్లాను విశ్వసించి ఇస్లాం స్వీకరిస్తే అతడి దుష్కర్మలన్నీ క్షమింపబడతాయి. స్వర్గం వస్తుంది ఏదో ఒక స్థాయిలోనైనా. 7. విశ్వాసులు వర్తక బిడారాలపై బడి దోచుకోవడాన్ని తప్పనడం లేదు. పైగా దానిలో ప్రవక్త వా, అల్లా వా ఉండాలోంంది. 8. ఇస్లాం రాజ్యంలో అవిశ్వాసి ధన, మాన ప్రాణాలకు రక్షణ ఉండాలంటే అందుకొరకే 'జిజియా చెల్లించాలి'. అలా నిర్ణీత అవధులలో ప్రతి సంవత్సరం చెల్లిస్తూనే ఉండాలి. 9. కఠినమైన శిక్షలుండడం అవసరమేగాని, మరీ క్రూరం అనిపించేలాి శిక్షలుండడం సరికాదు.
గమనిక : ఇలా సమాజ సంబంధమైన మరిన్ని విషయాలనూ పరిశీలించవచ్చు కావాలంటే.
ప్రకృతి గురించి ఖురాను వ్యక్తీకరించిన అభిప్రాయాలు.
1. భూమి :
ఓ  15:19 : మేము భూమిని పరచి, దానిమీద పర్వతాలను పాతాము.
ఓ  16:03 : ఆయన భూమ్యాకాశాలను సత్యం ప్రాతిపదికన సృష్టించాడు.(అర్థం కావడంలేదిది)
ఓ  16:14 : భూమి దొర్లిపోకుండా ఉండడానికి, ఆయన దానిపై పర్వతాలను పాతాడు.
ఓ  30:18 : భూమి మృతప్రాయమై ఉన్నప్పుడు ఆయనే దానికి జీవం పోస్తున్నాడు (అర్థం కాలా).
ఓ  39:05 : ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్దంగా నిర్మించాడు. (అర్థం కాలా)
ఓ 21:30 : భూమి, ఆకాశాలు కలిసి ఉన్నప్పుడు మేము వాిని విడదీయటం వారు చూడలేదా?
ఓ  21:31 : భూమి దొర్లిపోకుండా ఉండేందుకు దానిపై పర్వతాలను మేకుల్లా పాతాము.
ఓ  35:09 : వర్షం కురిపించడం ద్వారా మృతప్రాయమైన భూమిని బ్రతికిస్తున్నాము.
ఓ  35:41 : భూమ్యాకాశాలు దొర్లకుండా స్థిరంగా ప్టిఉంచిన వాడు ఆయనే.
ఓ  40:64 : భూమిని నివాస స్థలంగా, ఆకాశాన్ని పందిరిలా చేసింది దేవుడే.
ఓ  41:9-12 : భూమిని రెండు రోజుల్లో సృష్టించాడు.
విచారణ : రహమాన్‌ గారూ ! మరియు వివిధ థోరణులకు చెందిన పాఠక మిత్రులకు - భూమి గురించి ఖురాన్‌ ప్రకించిన అభిప్రాయాలు ఆధునిక భూవిజ్ఞాన, ఖగోళ విజ్ఞాన శాస్త్రాలందిస్తున్న సమాచారంతో సరిపోతున్నాయా? ఈనాడు మనం ఈ విషయాలపై సత్యాసత్య విచారణ చేయబూనుకుంటే 1. వేి వేిని ప్రయోగ రీత్యా పరీక్షించగలం? 2. మరి వేిని అనుమాన ప్రమాణం ద్వారా, ఎంతమేర కనుగొనగలం. (హేతుబద్ద నిర్ణయాలకు రాగలం) సైన్స్‌ క్షేత్రాలలో అి్టవాికి సంబంధించిన ఆధారాలేమి - అంచనాలేమి? ఖురాను చూపుతున్న ఆధారాలేమి - అంచనాలేమి? 3. మరి ఏవేవి, విని ఊరుకోవడం మాత్రమే చేయగలం అన్నది నిర్ణయించుకోవాలి.
2. ఆకాశం :
ఓ  16:3 : ఆయన భూమ్యాకాశాలను సత్యం ప్రాతిపదికపై నిర్మించాడు.
సురేంద్ర : ఇంతకూ ఆకాశమంటే ఖురాను చెప్పే అర్ధమేమి?
ఓ  21:30 : భూమి ఆకాశాలు కలసి ఉన్నప్పుడు మేము వాిని విడదీయడం వారు చూడలేదా?
సు : అర్థం కావడం లేదు. భూమి ఆకాశాలను విడదీయడమేమి? వారు చూడలేదా అంటున్నాడు అల్లా. భూమి ఆకాశాలను విడదీయడాన్ని 'బిగ్‌బ్యాంగ్‌' గా వివరించారు. 1. ఆల్‌ ఫలక్‌ పబ్లిషర్స్‌ ప్రచురించిన డా|| అబ్దుల్‌ రహీం మొహమ్మద్‌ మౌలానా గారి అనువాదంలో వివరణ దగ్గర ఖురానులో సుమారు 1000కి పైగా సైన్స్‌ విషయాలున్నాయని, బిగ్‌ బ్యాంగ్‌కు ముందే విశ్వమంతా ఒక్క హైడ్రోజన్‌తో నిండి ఉండేదని, విశ్వమంతా దానితోనే సృష్టించబడిందనీ ఈ 21:30కి వివరణ చేశారు. హైడ్రోజన్‌ పరమాణువులు గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఒక్కిగా కలుపబడి, అనంతరం పగలగొట్టబడిందని, ఆ పని చేసింది అల్లానేనని వ్రాశారు.
2. అబుల్‌ ఇర్ఫాక్‌ గారి ఖురాను భావామృతంలో ఈ ఆయుతుకు, 41:12కు కలిపి వివరణ చేశారు. (21 :30) అప్పుడు విశ్వ పదార్థం (మాస్‌) రూపంలో ఉండేది (41:12 పాదసూచిక 2) మొదట పొగరూపంలో ఉన్న విశ్వం గ్రహాలుగా, నక్షత్రాలుగా, మరెన్నో రోదశీ వస్తువులుగ మారడానికి రెండు రోజులు ప్టింది. ఈ రెండు రోజుల ప్రక్రియలో భూమికూడా చేరిఉంది. తరువాత భూమిపైన (మరికొన్ని ఇతర గ్రహాలపైన కూడా) నీరూ, గాలి, వృక్షజాతి, జీవరాశి వగైరా ఏర్పడడానికి మరో 4 రోజులు ప్టింది. ఇక్కడ దేవుడు భూమండల నిర్మాణానికి రెండు రోజులు ప్టిందని, దానిపై ఆహారం తదితర ఏర్పాట్లు జరగడానికి 4 రోజులు ప్టిందని 9,10 సూక్తుల్లో చెప్పాడు. ఆ విధంగా భూమి జీవరాశికి నివాసయోగ్యం కావడానికి మొత్తం 6 దినాలు ప్టింది. ఈ 6 దినాలలోనే మొత్తం విశ్వ వ్యవస్థ ఏర్పడింది.
11,12 సూక్తులలో దేవుడు, విశ్వ నిర్మాణానికి ముందున్న పరిస్థితిని వివరిస్తూ అప్పుడు ఈ విశ్వం పొగరూపంలో ఉండేదని అన్నాడు. నేి సైన్స్‌ భాషలో దీనిని నీహారిక (నెబ్యులా) అంారు. కోట్ల సంవత్సరముల క్రితం ఒకచోట గుమికూడి ఉన్న పదార్థం పెద్ద ప్రేలుడు సంభవించి ముక్కలు ముక్కలై పోయిందనీ, అవి క్రమంగా విస్తరించి లక్షలాది సంవత్సరముల తరువాత నేి గ్రహాలుగా, నక్షత్రాలుగా రూపొందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖురానులో దేవుడు, పొగరూపంలో ఉన్న భూమ్యాకాశాలను ఉద్దేశించి ఉనికిలోనికి రండని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఆయన రెండు రోజుల్లో 7 ఆకాశాలు నిర్మించాడు. ఇందులో భూమికూడా చేరిఉంది.
ఈ విధంగా దేవుడు భూమ్యాకాశాలను 6 దినాలలో సృష్టించాడని ఖురాన్‌ చెబుతోంది. ఆ దినాలు మనం ప్రమాణంగా తీసుకొనే దినాలు కానవసరం లేదు. ఖురానులో ఒకచోట ఒకరోజు అంటే 50వేల సం||లు అని ఉంది.
ప్రకృతి గురించి ఖురాను :
ఓ  35:41 : భూమి ఆకాశాలు దొర్లకుండా స్థిరంగా ప్టిఉంచిన వాడు దేవుడే.
ఇది సరిగా అర్థం కావడం లేదుకదా! భూమి దొర్లకుండా ప్టిఉంచడమేమి? ఆకాశాన్ని దొర్లకుండా ప్టిఉంచడమేమి? సామాన్య వివేకానికి సమంజసమనిపించటం లేదది. సైన్స్‌ సమాచారం ప్రకారం తప్పు అనాల్సిందే. ఇంతకూ 'ఆకాశం' అన్న మాటకు ఖురాను అంగీకరించే అర్థమేమి?
ఓ  40:64 : భూమిని నివాస స్థలంగా, ఆకాశాన్ని పందిరిగా చేసింది దేవుడే.
ఇక్కడ కూడా 'ఆకాశం' అంటే ఖురాను ఏమనుకుంటుందో, ఖురాను పక్షం వాళ్ళే అర్థం చెప్పి, ఆ అర్థం ఖురానులోగాని, హదీసుల్లో గానీ ఎక్కడుందో చూపించాలి. ఇంతకూ ఆకాశమంటే (ఐదిగి. కలిబిఖీలిదీ, ఆజిబిబీలి, ఐచీబిబీలి) అన్న వాిలో దేనికి సమానార్థకం అంారు ఖురాను పక్షం వాళ్ళు?
1. మనం పైకి చూస్తే నీలంగా, 'డోమ్‌'లా కనపడే దానినా? స్వర్గం లేక దివి అన్న దానినా? స్థలాన్నా? ప్రదేశాన్నా మరింకేదైనా పదార్థాన్నా?
ఓ  పందిరిగా చేశాము అన్నది అర్థం కావాలంటే అది ఏదో ఒక పదార్థంతో చేయబడిందై ఉండాలి. మందం తక్కువగా కప్పులా విస్తరించి ఉండాలి. ఏ అర్థం చెప్పినా ప్రదేశము - స్పేస్‌ అనడానికి సరిపోవడం లేదు.
ఓ  35:13 : సూర్య చంద్రులు తమతమ పరిధిల్లో తిరుగుతున్నారు.
ఓ  భూమి చుట్టూ వారు తిరుగుతున్నారా? ఛూమి చంద్రునితో సహా సూర్యునిచుట్టూ తిరుగుతుందా? ముందు ఖురాను ఏమంటుందో తేల్చు. అది తప్పో ఒప్పో తరువాత చూద్దాం.
ఓ  42:5 : దేవుని కించపరచే చేష్టల వల్ల ఆకాశం బద్దలై పడిపోవచ్చు.
ఓ  ఇక్కడా ఆకాశమంటే అదేదో పదార్థంతో భూమికి కప్పుగా చేయబడినదనే అర్థం వస్తోంది.
'ఒజోన్‌ పొర - దానికి రంద్రాలు పడటం' అన్న దానికి దీనిని సరిప్టోలని భావిస్తున్నారు కొందరు ఇస్లాం వివరణకర్తలు, అి్ట వారికి, అటు ఖురాను తెలియదు, ఇటు ఖగోళ విజ్ఞానశాస్త్ర సమాచారము తెలియదు. ఎందుకనంటే ఓజోను పొర అన్నది భూమికి సంబంధించింది. భూమి అంటేనే భూగోళము - దానిచుట్టూ ఆవరించి ఉన్న వాతావరణము కలిపి అని అర్థము. కనుక ఓజోను పొర భూమిలో భాగమే. సూర్యుడు, చంద్రుడు ఓజోన్‌ పొరకు చాలా దూరంగా ఉన్న వేరే గోళాలు. ఇక నక్షత్రాల సంగతి చెప్పనే అక్కరలేదు. ఖురాను చెబుతున్న ఒకటవ ఆకాశం ఓజోన్‌ పొరే అనడమంత అజ్ఞానం మరోి ఉండదు. అన్ని నక్షత్రాలూ కూడా ఖురాను ప్రకారం 1వ ఆకాశంలోనే అలంకరింపబడ్డాయి. ఈ వివరాలున్నూ ఒకదానికి ఒకి పొసగనే పొసగవు.
సూర్యుని గురించి, సూర్యకుటుంబం గురించి, ఈనాి సైన్స్‌ చెబుతున్న దానిలో ప్రాథమిక అవగాహన కలిగిఉన్నా, ఖురానుకు సైన్స్‌కు తేడా ఉందన్నంత వరకు అంగీకరించేస్తాడు. 'ఖురాను వాక్యాలు సైన్స్‌కు విరుద్ధంగా ఉండవు' అనదల్చుకున్న వాళ్ళు, అంటున్న వాళ్ళు వీిని రిెంనీ చూపించి తేడాలేదని నిరూపించాల్సి ఉంటుంది.
ఓ  42:28 : ఆకాశంలోనూ జీవులున్నారు.
ఓ  దీనినీ వివరించి రుజువుచేయాల్సిన బాధ్యత ఖురాన్‌ పక్షం వారిపైనే ఉంది. ఎందుకంటే సైన్స్‌ ప్రకారం ఆకాశంలో జీవులుండరు. వారికి (జీవులకు) భూమిలాి మరో గోళం ఉంటేనే ఉండగలుగుతారు. ఆ విషయములో సైన్స్‌కు ఇప్పికి చూడగలిగినంతలో జీవులున్నట్లు ఆధారాలు దొరకలేదు. ఖురాను ప్రతినిధులు ఏవైనా ఆధారాలు చూపగలరేమో చూడాలి.
ఓ  81:1 : సూర్యుడు నిస్తేజమై చ్టుివేయబడతాడు. నక్షత్రాలు చెదిరి కాంతి కోల్పోతాయి. పర్వతాలు కదలి నడుస్తాయి. సముద్రం ప్రజ్వరిల్లుతుంది.
ఓ  ఏమి అర్థమవుతోంది రహమాన్‌ గారూ! సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని అంగీకరిస్తారా? అంగీకరించరా? ఇక్కడ మనకు రెండు రకాలుగా తెలుసుకొనే వీలుంది. 1. నేరుగా మనకు కలుగుతున్న అనుభవం. సూర్యుడు నుండి కాంతి వేడి మనకు వస్తున్నాయన్నంత వరకు మనందరి అనుభవంలో ఉన్న విషయమే. దానర్థం అది గుండ్రంగా ఉన్న మంట అని తెలుస్తున్నట్లు.
2. దానిని శక్తివంతమైన పరికరాలు - విధానములు ననుసరించి పరిశీలించిన పరిశొధకుల ప్రకారం దానినుండి కాంతి, ఉష్ణము వస్తున్నదన్న దానితో పాటు అక్కడ పరమాణు సంయోజనం అన్న ప్రక్రియ ద్వారా     అణుశక్తి విడుదల అవ్వడం వల్ల ఆ కాంతి, ఉష్ణము వెలువడుతున్నాయనీ తెలుసు.
ఖురానుకు సూర్యుని గురించి ఏమితెలుసో గమనించాలి ముందు. అందులో ఒక వాక్యం, సూర్యుడు నిస్తేజమై చ్టుివేయబడతాడని అంోంది. ఏమిచేద్దామా విషయాన్ని?
ఓ  సూర్యుని గురించి, నక్షత్రాల గురించి చెప్పే సందర్భంలో పర్వతాల గురించి, సముద్రం మండడం గురించి ఎందుకు ప్రస్తావించినట్లు? 'సముద్రం మండుతుంది' అన్న మాటకు ఏమర్థమొస్తున్నట్లు. నీళ్ళు మండుతాయనే కదా? ఇది ఒప్పుకోదగిందేనా?
ఓ  18:86, 18:90 : సూర్యుడు అస్తమించే ప్రదేశానికి జుల్‌కర్‌నైను చేరుకుాండు. సూర్యుడు బురద చెలమలోకి అస్తమిస్తుండగా చూశాడు.
ఓ  38:18 : మేము కొండలను దావూద్‌ అధీనంలో ఉంచాము. అవి అతనితో పాటు నిత్యం ప్రొద్దునా, సాయంత్రమూ జపం చేస్తుండేవి.
రహమాన్‌ గారూ! మిగిలిన మిత్రులారా ! ఈ వాక్యం మన ఇంగిత జ్ఞానం అంగీకరించేదిగా ఉందా?
ఓ  16:68,69 : తేనెీగలు పండ్ల రసాన్ని తాగుతాయి. వాి శరీరం నుండి రంగురంగుల పానకం వెలువడుతుంది.
ఓ  ఈ రెండు అభిప్రాయాలు తప్పుడువే అనగలను. ఆ మాటెందుకులే అనుకుంటే, ఈనాడు తేనె, తేనెీగల గురించిన చాలా సమాచారం ప్రయోగాల ద్వారా తెలుసుకున్నది మనకందుబాటులో ఉంది. ఆ సమాచారాన్ని ప్రక్కనుంచి మనమే నేరుగా వాిని పరిశోధించవచ్చు. ఒక వ్యవసాయదారునిగా, తేనెపట్టులను జాగ్రత్తగా పరిశీలించిన వానిగా ఒకి రెండు మాటలు చెబుతాను.
తేనెీగలు పండ్ల రసాలను తాగవు. పూవులలోనున్న అత్యంత అల్ప పరిమాణంలోని మధువును, పుప్పొడిని సేకరించి భద్రపరుస్తాయి. తేనె అంటే పూవులనుండి సేకరించిందే గాని, తేనెీగలు పండ్ల రసం తాగి విసర్జించింది కాదు. తేనెీగల శరీరంలోనుండి రంగురంగుల పానకం రావడమేమి? దీనిని ఎప్పుడుబడితే అప్పుడు, ఎన్నిసార్లయినా పరిశోధించి చూసుకోవచ్చు.
కొన్ని వైరుధ్యాలను చూపుతాను గమనించండి. 
ఇప్పికి ముగింపు.
1. ఖురాను నుండి గాని, బైబిలు నుండిగాని, వేదం లేదా హిందూ ఆస్తిక గ్రంథాల నుండి గాని, మరేదైనా మత గ్రంథాల నుండైనా (బౌద్ధ, జైన, సిఖ్కు, చార్వాక వగైరాల నుండి గానీ) వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్నవాి గురించిన వివరాలేమున్నాయో వెలికి తీసి, వాి సబబు బేసబబులను పరీక్షించి చూడడానికి సత్యాన్వేషణ మండలి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పరీక్షలో తేలిన విషయాలను అంగీకరించి, స్వీకరించి, ప్రచారం చేయడానికీ సిద్ధంగా ఉంటుంది. 'మా గ్రంథాలలో ఉన్నదంతా సత్యమే' అన్న నిర్ణయంలో ఉన్న వారందరినీ, వారేగ్రంథ ప్రజలైనా మండలి సత్యస్థాపన దృష్టితో సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. సత్యాసత్య నిర్ణయానికై నిజాయితీగా పూనుకునే వాళ్ళు, వాస్తవానికి ఎవరికెవరూ శతృవులు కారు, ప్రతికకక్షులూ కానక్కరలేదు. సత్యాన్వేషులైతే చాలు. మిత్రులంగా ఉంటూనే నిజానిజాలు తేల్చుకునే పని చేయవచ్చు.
మిత్రులై ఉండడం, నా విషయం తెలిసిన వారై ఉండడం, అప్పుడప్పుడూ నేను పెట్టే వత్తిడిని తట్టుకోగలిగి ఉండడంతో ఆయనను అడ్డుపెట్టుకొని సమాజంలోని ఆలోచనాపరులందరినీ ఉద్దేశించే ఈ లేఖ (వ్యాసం) రాశాను. రహమాన్‌ గారి పేరున్న ప్రతిచోా ఎవరైనా వారిపేరుంచుకొని వారినే నేను సంభోధించినట్లు భావించి పై విషయాలలో విచారణకు సిద్ధం కావచ్చు - మండలి పక్షం నుండి నేను (మేము) సిద్ధంగా ఉన్నాము.
వైరుధ్యాలు
ఓ  1. 7:54 : ఆయన ఆకాశాలను, భూమిని 6 రోజులలో సృష్టించాడు. తరువాత సింహాసనంపై ఆసీనుడైనాడు.
- ఆయన అంతా వ్యాపించి ఉన్నవాడు.
- నీ కంఠ నాళం కంటే నీకు దగ్గరగా ఉన్నవాడు.
ఓ  2. నీ లెఖ్ఖ రాయడానికి ఇద్దరు దూతలను నీకు అటూ ఇటూ నియమించాడు.
ఓ  3. అంతా రాసిప్టిెనట్టే జరుగుతుంది.
- అతనికి స్వేచ్చనిచ్చి పరీక్షచేసి చూస్తాము.
- బుఖారి 4-54-430 : అతనికి ఏమి వ్రాయబడి ఉందో అదే అతని ప్రవర్తనను నిర్ణయిస్తుంది.
గమనిక : స్వేచ్చనిచ్చాము అన్న అర్థాన్నిచ్చే వాక్యాలూ - ముందే వ్రాసిపెట్టబడి ఉంది అన్న అర్థాన్నిచ్చే వాక్యాలూ ఇంకా కొన్ని ఉన్నాయి ఖురానులో. ఉన్నాయో లేదో ఖురాన్‌ పక్షం వాళ్ళు చెప్పాలి. లేవనేట్లయితే మేము చూపిస్తాము. ఖురానులో ఉన్న వాిని గనుక లేవనేట్లయితేనూ, అల్లా చెప్పని వాిని చెబితేనో అల్లా ఏం చేస్తానంటున్నాడో ఖురాను చదివిన వాళ్ళందరకూ తెలిసే ఉంటుంది. ఆ పని ప్రవక్త చేసినా, కంఠనాళం కోసేస్తానంటున్నాడు అల్లా.
ఉదా : 18:28 : ఇది మీ ప్రభువు దగ్గర నుండి వచ్చిన పరమసత్యం. ఇది ఇష్టమైన వారు స్వీకరించ వచ్చు. ఇష్టం లేకుంటే తిరస్కరించవచ్చు. 53:29 : 86:16,17 : ఇంకా 39:22, 35:8.
ఓ  4. అతనిని ప్టుించి అతని మెడలో అతని జాతకాన్ని వేలాడదీశాం.
- అతడు చేసే ప్రతి పనిని లిఖించడానికి ఇద్దరు దూతలను నియమించాం.
ఓ  5. అపారకృపాశీలుడు, అనంతకరుణామయుడు అయిన అల్లాః
- చంపండి, నరకండి, ఎక్కడబడితే అక్కడ! మాటువేసి ఉండండి.
- కంఠనాళం కోస్తా, నేను చెప్పని మాటలు నావిగా చెపితే.
- అన్యదేవతారాధన చేసినందుకు, బహుదేవతారాధన చేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు
(దీనర్థం అల్లాను కాదని మరొకరిని పూజించినందుకనే) జాతులకు జాతుల్ని తుడిచిప్టిెన అల్లా.
ఓ  6. మద్యనిషేధం, సుఖాలకు, సంపదలకు, భోగాలకు లొంగకండి.
- కావల్సినంత మద్యం, కావలసినంత స్త్రీ సుఖం, భోగాలు, బంగారు, వెండి గోడలు గల ఇండ్లు, పట్టు పాన్పులు
- సేవకులుగా చిన్న పిల్లలు.
ఓ  7. 30:1-6 : ఖురాను ఒక జాతి ప్రజల కొరకు, వారి తాతముత్తాతలను హెచ్చరించడం జరగనందుకు వారిని హెచ్చరించడానికి పంపిన గ్రంథం.
38:88 : ఖురాను సర్వ మానవాళి కొరకు వచ్చిన గ్రంథం.
ఓ  8. ఒక మనిషిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే.
- ప్రతి ఒక్కరితో అల్లా మార్గంలో పోరాడండి. మరియు అల్లాను విశ్వసించని వారిని చంపివేయండి.
- నీవు ఈ లోకపు కోర్కెలనే కోరుకుంటున్నావు. అల్లా ఇస్లాం స్థాపన కోసం వారిని చంపమనే కోరుకుంటున్నాడు.
ఓ  9. అల్లా ఏ అవసరమూ లేనివాడు. ఎవరి సాయమూ అక్కరలేనివాడు.
- అల్లాకు సాయం చేసిన వారికి అల్లా సాయం చేస్తాడు.
గమనికలు : 1. ఇలాి వాక్యాలు మరికొన్నీ దొరుకుతాయి జాగ్రత్తగా పరిశీలిస్తే. ఎవరైనా ముస్లిం గాని, ఇతరులుగాని సిద్ధపడితే మండలి అందుకు సిద్ధంగా ఉంటుంది.
ఈ వ్యాసంలో నేను ఉట్టంకించిన, ప్రకించిన వాక్యాలు ఖురాను లోనివీ, ఖురాను అంగీకరించేివీ అవునా? కాదా? మీలో ఎవరు గాని నాతో విబేధించే వారుంటే, మరింత జాగ్రత్తగా, నిష్పాక్షికంగా ఖురానును పరిశీలించడానికి కూర్చుందాం. సిద్ధపడి రండి.
ఓ  3:154 : వధించబడడం అన్నది ముందే రాసిప్టిె ఉంటే, మీ అంతట మీరే వధ్యస్థలాలకు వచ్చితీరుతారు.
17:16 : మేము ఒక పట్టణాన్ని నాశనం చెయ్యదల్చుకున్నప్పుడు (వారు చేయలేనివి చేయమని చెప్పి) అవిధేయత కారణంగా దానిని సర్వనాశనం చేస్తాము.
అబద్దపు ప్రచారకులు - అబద్దపు ప్రచారాలు
శ్రీ అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ గారి లేఖ ప్రతి
మిత్రులు ఫజులూర్‌ రహమాన్‌ గారి ద్వారా మీరు పంపిన లేఖ చేరింది. విషయములు విదితములు. ఆ లేఖ యథాతథం వివేక పథంలో ప్రచురించి దానికి సమాధాన రూపమైన ఈ లేఖను రాస్తున్నాను. ఈ వివేకపథాన్ని ఈ సందర్భంలో ముడిపడి ఉన్నారనిపించిన వారికీ పంపుతాను. మరి కొందరికెవరికైనా మీరు పంపమంటే వారికీ పంపుతాను. నాకు తెలిసిన మరియు నాకవసరమనిపించిన మాధ్యమాలు కొన్నింకీ వివేకపథం పంపుతాను.
ముందుగా నన్నొకి చెప్పనివ్వండి. మీ లేఖ చూడగానే 1. భాష మీద మీకంత పట్టులేదనీ, 2. వాద పద్ధతులు తగినంతగా తెలిసిన వారు కాదనీ, 3. 'ఛాలెంజి' స్వరూప స్వభావాల పైనా అవగాహన కలవారు కాదని, 4. ఒకింత వ్యంగ్యంగానూ ఉంటుంది మీ శైలి అని, మీ గురించి  నాకు అనిపించింది. ఈ నాలుగు మాటలూ స్పష్టమైన అవగాహనతోనే, కావాలనే వ్రాతమూలకంగా నమోదుచేస్తున్నానిక్కడ.
1. ''చర్చకు సిద్ధమైనందుకు కృతజ్ఞతలు''. ఏమిటండీ ! అంటే గింటే 'సంతోషం' అనో, తెలిసీ తెలియక ఓటమికి సిద్ధమైనందుకు విచారిస్తున్నాననో, నీకు, నా సానుభూతి అనో అనుంటే పాత్రోచితికి తగినట్లుండేది.
2. మీరు ప్రస్తావించిన దాన్లో చాలావాికి రుజువులూ లేవు, తార్కిక నియమాలను పాించిందీ లేదు.
3. మీ గ్రంథాన్ని మొత్తంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ వ్రాతమూలకంగా నా తర్కాన్ని వివరిస్తూ డాక్యుమెంటు చేసి మీకు - మీ పరిశీలనకు - పంపమన్నారు. నిజానికి, అవసరమైనంత వరకు నా లేఖల ద్వారా, వివేకపథం ద్వారా వాిని వ్రాతమూలకంగానే మీకు చేర్చాను. కాని మీకవి కనిపించలేదా? అర్థం కాలేదా?
4. క్రమంగా, మీరు రాసిన క్రమంలోనే ప్రతి అంశాన్ని తీసుకొని నా వాదనను, తర్కాన్ని, ఆధారాలను కలిపి డాక్యుమెంటు చేసి మీకు పంపితే, దానిని పరిశీలించి గాని చర్చకు రాననడం, చూశాకనే, మీకు వాద నియమాలు గాని, ఛాలెంజి నియమాలు గాని, తత్వ చర్చావేదిక నియమాలుగాని అంతగా తెలియవనిపించింది.
ఓ  గతంలో నేను, తత్వచర్చా వేదిక నిబంధనలను రూపొందించి, ప్రసిద్ధ తాత్విక థోరణులను ఎన్నింనో ఆ వేదిక ద్వారా విచారణకు ప్టిె, నిర్వహణ బాధ్యతనూ స్వీకరించి ఉన్నాను. ఆ సందర్భంలో చర్చలో పాల్గొనే అన్ని పక్షాలకూ చర్చావేదిక నియమ నిబంధనలను ముందుగనే అందించి, అందరి అంగీకారంతోనే విచారణలను సాగించేవారం. కనుక ఆ నియమనిబంధనల గురించి తగినంత అవగాహన ఉన్నవాణ్ణే నేను.
ఓ  మీరు దేశానికంతికీ ఛాలెంజి అంటూ ఒక బహిరంగ ప్రకటన చేశాక, దానిని అందుకొని తిరిగి ఛాలెంజి చేసినవాడూ, మీరూ తారసపడాల్సింది బరిలో మాత్రమే. అక్కడ కూడా యోగ్యమైన నియమాలు, నిర్ణేతల సమక్షంలోనే. మధ్యలో మనం మ్లాడుకోవలసిందల్లా బరికి స్థలకాలాలేమిటన్నదీ, నిర్ణేతలెవరన్నదీ మొదలగు ఏర్పాట్ల గురించి మాత్రమే. ఈ విషయంలో నా వ్యూహం ఏమిో, ఏఏ విషయాలలో ఏ రుజువులతో - ఆయుధాలతో - మీపై దాడి చేయబోతున్నానో, ఒక్కొక్కిగా, విడమరచి మరీ మీకు చెప్పాలనడం, ఎంత హాస్యాస్పదంగా ఉందో మీకర్థం కాకున్నా, వాదనకు సంబంధించిన మరియు ఛాలెంజికి సంబంధించిన విధివిధానాలనెరిగిన వారికి అర్థమవుతూనే ఉంటుంది. ఇరు పక్షాలను స్వీకరించిన న్యాయవాదుల్లో ఒకరు (మీరు) మీ ప్రతి పక్షాన్ని స్వీకరించిన న్యాయవాదితో, కోర్టుకు రాకముందే నన్నెక్కడెక్కడ తప్పుబట్టబోతున్నావు? ఏఏ ఆధారాలతో అన్నీ అంశాల వారీగా నా ఇంికి పంపన్నా, వాిని చూసుకుని కోర్టుకు వచ్చి నీతో వాదిస్తాను, అంటున్నారన్న మాట ! బాగుంది కదూ! ఎత్తుగడ ?!
ఇప్పికింకా మిమ్ములను శతృపక్షంగా భావించకపోవడం వల్లా, రహమాన్‌ గారు మీ విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయం వలన, ఒక హితసూచన చేస్తాను. అర్థం చేసుకుని స్వీకరించగలరో లేదో నిర్ణయించుకోండి. ఇలా సందర్భానికి తగని, పసలేని, మాటలు రాతరూపంలో మ్లాడి విజ్ఞుల ముందుగానీ, రేపు జరగబోయే చర్చావేదిక నిర్ణేతల ముందుగానీ చిన్నబుచ్చుకొనే పరిస్థితి కల్పించుకోకండి.
ఓ  నా వాదనను ప్రకించకుండా, మిమ్ములను పిలవడం న్యాయమనిపించడం లేదనీ, అది 'వివేక పథం' అసలే కాదని, ఒక కొసమెరుపు. కించిత్తు వ్యంగ్యమూ కలగలిపి మెరిపించారు.
ఇలా కొంచెం బరువైన అభిప్రాయ ప్రకటనలు చేసేముందు, వెనుకా ముందు ఆలోచించుకోవడం మంచిది. కోర్టు సమక్షంలో తప్ప ఇరు పక్షాల న్యాయవాదులు కోర్టు బయటే ఒకరి వాదం ఒకరు, ఒకరి ఎత్తుగడలు ఒకరు చెప్పుకొనే దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోగలిగితే ఊహించుకోండి. అదెంత న్యాయసమ్మతంగా, వివేకులనుసరించేదిగా ఉంటుందో మీకూ తెలుస్తుందనే అనుకుంటున్నాను.
నిజానికి ప్రతి సవాలు చేసిన నేను నా వాదాన్ని గురించి వేదిక ఏర్పడక ముందు ఒక్క ముక్కా బయటపెట్ట కూడదు. అయినా గెలిచేది నేనేనన్న గ్టి నిర్ణయం ఉండడంతో, ఇదిగో ఇలా కొట్టబోతున్నాను, కాచుకోగలిగితే కాచుకో అన్న అర్థం వచ్చేలానూ, క్రైస్తవాన్ని విడవడానికి సిద్ధపడే చర్చకు రమ్మనీ సూచనామాత్రంగా తెలిపాను నా గత లేఖల ద్వారా.
ఓ  ఖురాను, బైబిలు పరిశీలన సమావేశంలో వివిధ పక్షాలున్న సందర్భంలోనే 'భువనశ్యనాభి' అన్న అంశంపై నా పక్షాన్ని, మీ ప్రకటనలను, దాశరథి అనువాదాన్ని, ఇతర భాష్యకారుల వక్తవ్యాలను అందరికీ చూపి, ఓఫీర్‌ గారి వాదన తప్పా ఒప్పా అని అడిగి, అందరిచేతా తప్పని అంగీకరింపజేశాను. ఆ సమావేశంలో మీ 'జగదీష్‌' ఉన్నారు. ఆనాడే వారికి చెప్పాను. మీరున్నారనే ఈ విషయాన్ని విచారణకు ప్టోను. ఇక్కడ జరిగిందాన్ని ఓఫీర్‌ గారికి చెప్పండి అని.
ఇక మీకు నేను రాసిన రిజిష్టరు ఉత్తరాలలోనూ, నా థోరణి కొంత మీకర్థమయ్యేందుకు తగిన కొంత సమాచారాన్ని పొందుపరచాను. అదంతా అలా ఉంచుదాం! ఇప్పుడు మచ్చుకు ఒకి రెండు మీ అంశాలను ప్రస్తావించి అవెలా సరైనవి కావో చెబుతాను. పరిశీలించగలిగితే పరిశీలించండి.
'హైందవ క్రైస్తవం' అన్న గ్రంథంలోని అంశాలు - విశ్లేషణ : మచ్చుకు మాత్రమే
1. ముఖ చిత్రం : ఏమాత్రం రాజ్యాంగ స్పూర్తి, రాజ్యాంగ అవగాహన, దేశభక్తి, జాతీయ పతాకాన్ని గురించిన అవగాహనా ఉన్నవారైనా, ఒక పుస్తకానికి ఆకర్షణను, విలువను ఆపాదించడానికీ, దాన్ని చలామణి చేయడానికి, జాతీయ పతాకాన్ని వాడుకోరు. దుర్వినియోగం చేయరు. ఓఫీర్‌గారా పని చేయగలిగారు. ఇది తప్పుకాదా? పన్నాగంలో భాగం కాదా? పరిశీలకులూ, నిర్ణేతలు న్యాయం చెప్పండి. అని రేపు మనం తారసపడే వేదికలోని అన్ని పక్షాలనూ సూిగా ప్రశ్నిస్తాను.
2. మీ పుస్తకం తెరవగానే ''సత్యమహం గంభీరః'' అన్న మాట కనపడుతుంది. దాని వివరణ అదే పుస్తకం 67 పుటలో సత్య విజయం!! అన్న శీర్షిక క్రింద ఉంది.
''సత్యమహం గంభీరః - నేను సత్యమును, గంభీరుడను, వేదకార్యమున, వేద జన్మమున అగ్నిని అయినాను. నేను ప్రారంభించిన సత్కార్యమును ఆర్యులుగానీ, దస్యులు గానీ ఆటంకపరచజాలకున్నారు''..... దేవుడు మ్లాడుతున్నాడు. నేను సత్యాన్ని అంటున్నాడు. నేను గంభీరుడను అంటున్నాడు ఆయన. అంటే, ఆయనను మనం ఆషామాషీగా తీసుకోడానికి వీలులేదన్న మాట! నేను అగ్నిని అయినాను అనికూడా చెబుతున్నాడు ఆయన..... ఏదో ఒక దైవకార్యం సాధించడానికి 'సత్యం' అయిఉన్న పరమాత్ముడు అగ్ని దేవుడైనాడు అన్నారు. దీనికి ముందు వాక్యంలో, వేదాలు చెపుతున్న మాటలు వినడానికిష్టపడని ''దురద చెవులు'' నా సోదర భారతీయులు ఎవరికీ లేవని నమ్ముతున్నాను, అనీ ముక్తాయించారు.
ఇవండీ అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ గారూ ఆ అంశానికి సంబంధించి మీరన్న మాటలు. నా పక్షం వినండిక.
విచారణ వేదిక పెద్దలారా ! వేదాల మాటలను వినడానికి ఇష్టపడనివన్నీ దురదచెవులనడం తప్పు. అది అడ్డగోలు తనం అంాను. ఎందుకంటే గతంలోని వివిధ సాంప్రదాయాలను ప్టిచూసినా, ఈనాి రాజ్యాంగాన్ని ప్టిచూసినా ఎవడైనా వేదాలు విననంటే వానివి దురదచెవులనడం, నోిదురద ఉండటం వల్లనే జరుగుతుంది. మీరేమాంరు?
వాదన కొరకు ఓఫీర్‌ గారి మాటను అంగీకరించామనుకుంటే నా మాటేమిటంటే, వేదాలను ఎలా వినాలో అలా వినడానికి ఇష్టపడని దురదచెవులు ఓఫీర్‌ గారికే ఉన్నాయని బల్లగుద్ది చెప్పగలను. మీరు అనుమతిస్తే రుజువు చేయగలను కూడా. పరిశీలకులూ, నిర్ణేతలు రుజువు చేయమంటే ఆ పని మొదలెడతాను.
ఓఫీర్‌ గారు వ్రాసిన సత్యమహంగంభీరః - మాట చూడగనే ఈయన కనీసం ఈ మంత్రం వరకైనా వేదాన్ని చూడలేదని తేలిపోయింది నాకు. ఇదిగోనండీ ఆ మంత్రం.
మంత్రం :     సత్యమహం గంభీరః కావ్యేన సత్యం జాతే నాస్మిన్‌ జాత వేదాః |
        నమేదాసో నార్యో మహిత్వా వ్రతం మీమాయ యదహం ధరిష్యే ||
ఓ  ఇది అధర్వణ వేదం 5వ కాండం, 3వ అనువాకం, 11 వ సూక్తం, 3 వ మంత్రము.
1. సత్యమహం గంభీరః కాదు. గభీరః  అని ఉంది వేదంలో. రెండు పదాలకు అర్థం ఒకటే అయినా పదం గభీరఃనే.
2. ఇది పరమాత్మ (దేవుడు) అంటున్నాడని ఓఫీర్‌గారంటున్నారు. కానీ వీరు ప్రామాణికంగా తీసుకున్న అనువాదంలో, దాశరథి రంగాచార్యుల వారు దీనిని 2వ మంత్రంతో ముడిప్టిె చెప్పారు. ఆ వాక్యాలివిగో.
మంత్రం- 2 :     నేను కోరినంత మాత్రమున ధనికుడను కాజాలకున్నాను. సుఖములు ప్రసాదించమని సూర్యుని ప్రార్థించియే సుఖవంతుడనగుచున్నాను. అధర్వ వేద రుత్విజా! ఏ కార్యమున, ఏ జన్మవలన నీవు అగ్నిఅంతి వాడవు కాగలిగినావు? అని అధర్వ వేద రుత్విజుణ్ణి ఒకరు అడిగిన దానికి రుత్విజుడు చెప్పిన సమాధానమే 3వ మంత్రం. కనుకనే దాశరథి గారు, ''రుత్విజ ఉవాచ'' = రుత్విజుడు చెప్పుచున్నాడు అని మొదల్టెారు.
ఓ  గమనిక : ఈ సందర్భంలో సదస్యుల అవగాహన కొరకు ఈ రుత్విజుడెవరు? అతణ్ణి అడిగిందెవరు? అన్న విషయాలు వివరిస్తే బాగనే ఉంటుందిగానీ, రంజిత్‌ ఓఫీర్‌ గారికి మచ్చుచూపే సందర్భంలో అంత వివరం అనవసరం. నిజానికి, ఇక్కడ దాశరథి గారి అనువాదాన్నే ప్రశ్నించాల్సి ఉంది. మాటలను యధాతధంగానే పేర్చి అనువాదం అయ్యిందనిపించారాయన. సంస్కృత పదాలు చదివితే ఎంత అర్థమయిందో, అనువాదం చదివాకనూ అంతే అర్థం అయిందనుకోండి, అనువాద ప్రయోజనమే దెబ్బతిోంంది. దాన్నలా ఉంచుదాం.
నా ప్రతిపక్షి ఓఫీర్‌ గారు ఆ సందర్భంలో వేదం చెప్పని అర్థాన్నీ, ఆయన ప్రామాణికంగా తీసుకున్న దాశరథి గారు చెప్పని అర్థాన్నీ, 'దేవుడీ మాటలంటున్నాడంటూ' దాన్నెత్తిన ప్టోరు. దాశరథి గారు స్పష్టంగా ప్రకించిన అధర్వ వేద రుత్విజా! నీ వింతి వాడివెలా అయినావన్న మాటనుగాని, రుత్విజుడు చెబుతున్నాడన్న మాటను గానీ దాచేశారు. సదస్యులారా! నాయీ మాటలు సరైనవే కనుక, సరైనవే ననడానికి తగిన ఆధారం చూపాను కనుక ఓఫీర్‌గారిక్కడ కుిల పన్నాగంతో అన్యార్థకల్పన - ఛలం - చేశారని చెబుతున్నాను. నిజమో, కాదో నిర్ణయించండి.
3. అట్ట చివరి పేజీలోని రంజిత్‌ గారి గురించి చెప్పిన వాక్యాలు - ఇంగిత జ్ఞానం అంగీకరించేవేనా?
1. ఓఫీర్‌ గారు '6' సంవత్సరముల పసి వయస్సులోనే రామాయణాన్ని చదివి 12 సం||ల వయస్సు వచ్చేసరికి మహాభారతం, భాగవతం మొదలైన భారతీయ సనాతన గ్రంథాలెన్నో చదివి జీర్ణించుకున్నారు.
2. 30 సం||ల తపస్సుకు ఫలితంగా, ఆ పరాత్పరుడు ఓఫీర్‌ గారికి బయలుపరచిన సత్యాన్నే ఈ గ్రంథం ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారు.
3. ఇందులోని సమాచారం భూమిమీద ఉన్న ఏ గ్రంథంలోనూ లేదు. ఇది నేరుగా సత్యలోకం నుండి వచ్చింది.
ఓ  ఈ వాక్యాలు పరిచయకర్తవిగా అనిపిస్తున్నాయి. అన్న దానిని ఆధారం చేసుకుని అవి నా మాటలు కావుకదా! అనిగాని ఓఫీర్‌గారు అంటే, అది వారిలోని నిజాయితీ లేనితనాన్ని, దిగజారుడు తనాన్ని ప్టిస్తుందంతే. తెగబడి ఆమాట అని మరిన్ని చిక్కులు తెచ్చుకోరనే అనుకుంటున్నాను.
1. '6' సం|| ప్రాయంలో రామాయణం చదివి జీర్ణం చేసుకోవడమేమిటండీ! విడ్డూరంగా లేదా? అని నా ప్రశ్న. విడ్డూరాల సంగతి మీకెందుకు? ఆయన అర్థం చేసుకున్నానంటున్నాడు, అది తప్పని రుజువు చేయగలిగితే చేయి అని గనక నిర్ణయ వేదిక అడిగితే వేదికలోనే సూిగా రామాయణానికి సంబందించిన నాలుగైదు అతి కీలకాంశాల గురించి ప్రశ్నించి ఆయన సమాధానాలు చెప్పాక, రామాయణం ప్రకారం అవెలా తప్పో రుజువు చేస్తాను. ఆ అంశాల కిటుకు ఇప్పుడు చెప్పను. ఇదైనా ముందస్తుగా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఈ వత్తిడితో మరింత శ్రద్ధగా మళ్ళీ  దానిని చదివినా నేననుకుంటున్న కీలకాంశాలను ఆయన పట్టుకోలేరనే ధీమాతోనే. ట్రైచేయండి ఒఫీర్‌ గారూ! మరోమారు ట్రై చేయండి. పుస్తకాలు ఒకికి పది సార్లు ... 60 సార్లు చదివే అలవాటు, పట్టుదల ఉన్నవారేనాయె. మరోమారు చదివి చూడండి.
ఓ మరొక్క మాట చెప్పి ఇప్పికి ఆగుతాను. రామాయణంపై గ్టి పట్టున్నవాళ్ళుగా ప్రసిద్ధినొందిన వాళ్ళూ, పట్టున్న వాళ్ళే ననుకోవడానికి తగిన రచనలు చేసినవారూ అయిన ఇద్దరు ఉద్దండులు రామాయణం నీకెంత తెలిసిందంటే నీకెంతగా తెలిసిందని ఏకాంతంగా ముచ్చించుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తానిక్కడ.
1. రామాయణాన్నే, 4 పేర్లతో 4 రచనలు చేసిన దాశరథి రంగాచార్యుల వారు ఆ ఇద్దరిలో ఒకరు. 2. మరొకరు, రామాయణ కల్పవృక్షమన్న గ్రంథాన్ని రచించి ప్రసిద్ధినొందిన విశ్వనాథ సత్యనారాయణ గారు. 3. సందర్భము - రామాయణాన్ని అనువదించినందుకు దాశరథి రంగాచార్యులను, విశ్వనాథ వారు సన్మానించే సమావేశంలో వారిరువురి మధ్యా జరిగిన సంభాషణ.
ఓ  ఆ సమావేశంలో సన్మానం పొందుతున్న రంగాచార్యులను, రామాయణం విషయంలో రంగాచార్యుల కంటే పెద్దవారు అనదగ్గ విశ్వనాథవారు కౌగలించుకుని, చెవిలో మూతిప్టిె నెమ్మదిగా రంగాచార్యులు నిజంగా రామాయణం నీకు అర్థమైందీ? అని అడుగుతారు. అప్పుడు రంగాచార్యుల వారు, గురువుగారూ! నాకింకా అర్థం కాలేదు నిజంగా అని సమాధానం చెబుతారు.
సురేంద్ర : ఇక్కడితో సంభాషణ ఆగిఉంటే మన సందర్భానికి అవసరమైన బలం చేకూరిందా? లేదా? అని పరిశీలించుకోవలసిన అవసరం ఉండేదేమో! కానీ అనంతరం జరిగిన సంభాషణ మన సందర్భానికి తగిన స్పష్టతను, బలాన్ని చేకూర్చింది. అప్పుడు రంగాచార్యుల వారితో విశ్వనాథ వారు ఇలా అన్నారు.
''నిజమే. 30 యేండ్ల నుండి పడుతున్న వాణ్ణి నాకే అర్థం కాలా! నీకేమర్థమవుద్ది''.
వింటున్నారా ఓఫీర్‌ గారూ! మరి మీరేమో 6 సం||ల పసిప్రాయంలోనే దానిని జీర్ణం చేసుకోవడమూ అయ్యిందంటున్నారు. ఏమి చేద్దాం?
అవన్నీ నాకెందుకయ్యా! నాకర్థమయింది. మిగిలిన వారితో నాకు అనవసరం అనేమాట అనే అవకాశం మీకింకా మిగిలి ఉంది. కనుక, ఏమి అర్థమైందో పరీక్షించడమే సబబు.
4. ప్రమాదకరమైన మీ పోకడను గురించి మరొక్క అంశాన్ని చెప్పి నా వాదనా రీతి ఎలా ఉంటుందన్న 'మచ్చుకు' అన్న భాగాన్ని ముగిస్తాను. పుస్తకం చివరి పేజీలో వివేకానందుని బొమ్మ ముద్రించి 'పరబ్రహ్మ తత్వమును మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యెను' అని వివేకానందుడు అన్నట్లు వ్రాశారు. మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా వివేకానందుడామాట ఎక్కడన్నాడో అక్కడే ప్రకించి ఉండేవారు. పొరపాటున ముద్రించలేదు అనే అవకాశం ఉందిగనుక వెంటనే ఫోనుద్వారా అయినా నాకా రిఫరెన్సునివ్వండి. అంతవరకు సమాచారం ఇచ్చినా, ఆ మాట సత్యమా కాదా అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. వివేకానందుడన్నది నిజమేనని నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఆ పనికిగాని మీరు సిద్ధంగాకుంటే ఇదంతా హిందువులను మతం మార్చడానికి క్రైస్తవంలోకి లాక్కెళ్ళడానికి మీరు పన్నిన దుర్మార్గపు పన్నాగం తప్ప మరోి కాదని అనాల్సి వస్తుంది.
ఓ  మీకీ విషయం తెలుసో లేదో గాని, సాంప్రదాయ ఆస్తిక పండితులలో వివేకానందుని అంగీకరించని వారు తట్టెడుమంది ఉన్నారు. నావరకు నాకూ, వివేకానందునిలో తాత్విక గందరగోళం చాలాఉందన్న అభిప్రాయం ఉంది. ఇది విని తెగ ఆవేశపడిపోయి నన్ను తప్పుబట్టే వాళ్ళుంటే, వివేకానందుని భావజాలాన్ని విచారణకు స్వీకరించడానికీ నేను సిద్ధం. అసలింతకూ వివేకానందుని ప్రామాణికునిగా ఉట్టంకించిన మీరు మిగిలిన వివేకానందుని భావాలను ప్రామాణికాలుగా స్వీకరించడానికి సిద్ధపడే నిజాయితీని చూపించగలరో లేదో తేల్చి చెప్పండి.
ఓ  ఈ లేఖకు సంబంధించినంతలో చివరగా రెండు మాటలు
1. హైందవ క్రైస్తవంపై మీ సవాలుకు ప్రతి సవాలు చేసిన నాకు, మీ నుండి సమాధానం ఇప్పించే విషయంలో బాధ్యత తీసుకుని శ్రమకోర్చి ఆ పని పూర్తిచేసిన మిత్రులు ఫజులూర్‌ రహమాన్‌ గారికీ ఈ లేఖ ప్రతి అందుతుంది గనుక, దీనిలోనే వారికీ, మరికొందరికీ ముడిపడి ఉన్న రెండు మూడు విషయాలనూ ఇందులోనే ప్రస్తావిస్తాను.
ఓ  రహమాన్‌ గారూ ! ఈ విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధకు అభినందనలు చెప్పితీరాలి.
ఓ  ఒక్క మాట సూిగా అడుగుతున్నాను. అంతే సూిగా సమాధానం చెప్పండి. మీకు నిజమనిపించినంత వరకైనా. ఎందుకంటే మీరటు క్రైస్తవాన్ని ఇటు ఇస్లాంను నిజాయితీగా పరిశీలించిన వారే కనుక.
1. బైబిలు ప్రకారమూ యేసు దేవుడు కాదు. ఖురాను ప్రకారమూ యేసు దేవుడు కాదు. నిజమా? కాదా?
2. ఖురాను వెలుగులో హైందవ క్రైస్తవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, 1. ఓఫీరు గారు పెద్ద భ్రమలోనే ఉన్నారనైనా అనాలి. 2. కపట విశ్వాసి అనైనా అనాలి. రిెంలో ఏదన్నది మీరో నేనో వెంటనే తేల్చలేక పోయినా, అతడు చెబుతున్నది నిజం కాదని, అబద్దమని చెప్పితీరాలి. ఇది నిజమా? కాదా?
3. ఆయన్ను మనం - ముఖ్యంగా మీరు - మిత్రునిగా తలంచుతున్నట్లయితే, అతడుపోతున్న ప్రమాదకర పోకడ నుండి బయటకు రమ్మని చెప్పడం కనీస మిత్ర ధర్మం. నిజమా? కాదా?
ఓఫీర్‌ గారికి ! మీరాక్రైస్తవం ఉచ్చునుండి బయటకి రావడానికి, మీకుగాని, చూడగలిగే వడుపు ఉంటే, నే చూపిన మచ్చులు సరిపోతాయి. చాలవనుకుంటే సవాలు వేదికకు సిద్ధం కండి. సవాలు సందర్భంలో ఎదురుపడినప్పుడే చూపాల్సిన నా ఎత్తుగడలూ, వగైరాలను ముందే మీకు చూపించమని చిన్నపిల్లవానిలా మ్లాడకండి. అది విజ్ఞులు మెచ్చరు. 'వివేక పథము' అంగీకరించదు. ఇదంతా కాదని నేనన్నవి తప్పనిగానీ, మీరన్నవే ఒప్పని గానీ వేదిక నిర్ణయిస్తే, వినమ్రంగా మిమ్ములను నా కళ్ళుతెరిపించిన వానిగా బహిరంగంగా ప్రకించి మీనా సవాలు నిబంధనను 100% పాించి మీ వెంట నడుస్తాను. నా పక్షమే సరైందని నిర్థారణైతే సత్యాన్వేషణ పథంలో పయనించడానికి సిద్దం కండి. మన ఇరువురి పక్షాలలో ఏది సరైందో తేల్చుకోడానికి ఎప్పుడు ఎక్కడ కలుద్దామో అన్నదొక్కటే మ్లాడండి.
మరొక్క మాట చెబితే ఈ లేఖకు నిండుదనం వస్తుంది.
వ్యక్తిగతంగా మీరుగాని, మిమ్ములను ఓడించడం (నేను గెలవడం) గాని నాకు లక్ష్యం కాదు. మీరనుసరిస్తున్న విధానం, అది మీరేగాక ఎవరనుసరిస్తున్నా వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, కడకు హిందువులైనా సరైంది కాదన్నదే నా పక్షం. కనుక ఈ లేఖను వివేకపథంలోనూ ముద్రించి ఈ విధానాన్ని అనుసరిస్తున్న వారందరికీ అందజేసి ఈ తప్పుడు విధానాన్ని వదులుకోండి లేదా మీరు మీరంటున్నది సరైందేనని ఓఫీరు గారిలా ఛాలెంజి ప్రకటన చేసి నిజనిర్థారణకు సిద్ధంకండి, అని మిమ్ములను ఆధారం చేసుకొని మిగిలిన వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. తమకే తెలియని విషయాలను మంది నెత్తిన పెట్టడం కాని, తప్పుభావాలను మందినెత్తిన పెట్టడం గాని అనైతికము, ప్రమాదకరము, దుర్మార్గము కూడా.
సత్యాన్ని స్వీకరించడానికీ, అసత్యాన్ని విడవడానికీ సిద్ధంగా ఉండడం మనందరి కనీస నైతిక బాధ్యత.
ఓఫీరు గారూ! వ్యక్తిగా మిమ్ము ఈ అపసవ్యపు పోకడను విడవండని వత్తిడిచేయడమే నేను చేయాలనుకుంటున్నది. మీరే ఒక ప్రసంగంలో ఈపని, నేనొక్కడ్నే కాదు నాకంటే ముందు మరెందరో చేశారు. వారినేమీ అనకుండా నన్నే ఎందుకంటున్నారు? అని మ్లాడి నా యత్నం శక్తివంతంగా ఉంది కనుక అని సమాధానం చెప్పారు. ఇక్కడ నా వైఖరి, ఈ విధానం తప్పుడుది, ఇది అజ్ఞానంతో కూడిందిగానీ, కపటంతో కూడింది గానీ తప్ప మరోి కావడానికి వీలులేనిది. అంటే ఇది సరైన విధానం కాదు. నిజం కాదు అని తెలీకైనా చేస్తుండాలి, లేదా తెలిసే చేస్తుండాలి. మరో కారణం లేదు. కనుక ఎవరు, ఎంతవారు చేస్తున్నా ఈ పని తప్పుపనేనన్నది ముమ్మాికీ నిజం అన్నదే.
నా వరకు నేను, ఈ పని చేస్తున్న వారందరినీ వారనుసరిస్తున్న ఈ విధానమును నా శక్తిననుసరించి అడ్డుకుాంను. అడ్డుకుంటూనే ఉంాను. అందుకనే ఇప్పికి నా దృష్టికి వచ్చిన, ఇదే పోకడ పోతున్న వారందరికీ కూడా ఈ లేఖను పంపుతాను. గుండాబత్తిని, పరవస్తు, కణితి, రొంపిచర్ల, యు.ప్రసాదరావు, జేమ్సు జైశీల్‌, ఇస్లాం నుండి ము.ఫారుఖ్‌ నద్వీ, ము.జహ్ఫల్లా, పి.ఎస్‌.గౌతమ్‌, లక్ష్మీశంకరాచార్య, అహమ్మదాలి, ముస్తాక్‌ అహ్మద్‌ మొదలగు వారు.
ఓ  హిందూ గ్రంథాలలో యేసున్నాడు, మొహమ్మద్‌ ఉన్నాడు, బైబిలు, ఖురానులలోని వాక్యాలు సత్యాలేనని అవి సాక్ష్యమిస్తున్నాయి లాివి మ్లాడే, ప్రచారం చేసే క్రైస్తవ, ఇస్లాం పక్షీయులారా! ఆ పెడ పోకడను విడనాడండి. లేదా అదిపెడపోకడ ఔనో కాదో నిర్ధారించుకోడానికి, మూడు మతాలకు చెందిన, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన పండితులు, మేథావులతో నిజనిర్థారణకు నిజాయితీగా సిద్ధం కండి. విచారణ వేదికను నేను ఏర్పాటుచేస్తాను. లేదా సత్యం స్థాపించబడాలన్న లక్ష్యంతో ఎవరు ముందుకు వచ్చినా వారితో కలిసైనా పనిచేస్తాను. విచారణలో సత్యమని తేలిన పక్షాన్ని స్వీకరించి, ప్రచారం చేస్తాను. సత్యం తేల్చుకోడానికీ, స్వీకరించి అందరికీ అందించడానికీ అభ్యంతర పడని, సిద్ధపడేవారందరితో కలసి ఒక ఐక్యవేదికగా మేలుకొలుపుకు పూనుకుందామన్నా నేను సిద్ధము. మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ఓఫీరు గారితో జరిగే, జరగాల్సిఉన్న విచారణ వేదికలో మీరంతా పాలుపంచుకుని మీ మీ అభిప్రాయాలను సరైనవేనని నిరూపించేందుకు సిద్ధపడండి. మీమీ రచనల నుండి మీరు చెబుతున్నది సరికాదనడానికి తగిన వ్యక్తీకరణలను చూపి విమర్శిస్తాను, పరిశీలించండి.
ఒక ప్రక్క అల్లా తాను పంపిన గ్రంథాలలోనే తాను చెప్పనివి కొన్ని కలిపి గ్రంథాన్ని కలగాపులగం చేశారంటూ, ఆ కారణంగా వాిని విడిచి ఖురాను వద్దకు రండని గ్రంథావహులను హెచ్చరిస్తూ, హెచ్చరించమని ముస్లింలకు వహీ ద్వారా సందేశాలు పంపుతుండగా, ఖురానుకు వ్యతిరేకంగా వందలాది వాక్యాలున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను ప్రామాణికాలుగా చూపుతూ మొహమ్మదు సందేశహరుడేనని నమ్మించాలనుకోవడమంత తెలివితక్కువతనం మరోి లేదు. అనేకాంశాలు సమానంగా ఉండి, అవి తాను పంపిన గ్రంథాలేనని అల్లానే చెబుతూ ఉండి, ఒకీ అరా వాక్యాలు మార్పిడి చేయబడ్డాయన్న నెపంతో వాిని విడువండి. వాిని పట్టుకున్న వారిని విడువండి. అి్ట వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి. రాకుంటే వారితో శతృవైఖరినవలంబించి పోరాడండి. చంపండి. ఆఖరి యూదుడు చంపబడే వరకు పోరాడుతునే ఉండండి అని అల్లా ఆదేశాలుండగా, సాగదీసినా, దోపినా సరిపోని ఒకీ అరా మంత్రాలు, శ్లోకాలను పట్టుకుని అమాయక హిందువులను ఇస్లాంలోకి మరలించాలనే యత్నాలను చేస్తున్న వారిని కపటులని కాక నిజమైన విశ్వాసులని గాని, నిజాయితీపరులని గాని ఎలా అనగలం? ఇస్లాంలోకి ఆహ్వానించడానికి ఖురాను వాక్యాలుగాని, మహమ్మదు సూక్తులు గాని సరిపోవడం లేదు. అందుకు హిందువులంగీకరించే గ్రంథాలే బలంగా పనిచేస్తాయి అన్న పోకడ ఖచ్చితంగా ఖురాను పట్ల అతని విశ్వాసం సన్నగిల్లిందనడాన్ని రుజువుచేస్తుంది.
సందేశాన్నందించడమే నీ పని, ఎవరు మారాలి? ఎవరు మారకూడదు? అన్నది ముందే నిర్ణయింపబడి ఉంది. లేదా అల్లా ఇష్టాన్ని బ్టి ఉంటుంది అని ఖురాను చాలా స్పష్టంగా, అనేకసార్లు మొహమ్మదునే హెచ్చరించిన వాక్యాలుండగా, కనపడ్డ గ్రంథాలన్నింలోనూ మొహమ్మదును చొరప్టోలనుకోవడం ఖురానుకు వేరైన గ్రంథాలు ప్రామాణికాలనడం - అవిశ్వాసం క్రిందికి రాదా? నాకు తెలిసిందాన్ని బ్టి అది అవిశ్వాసం క్రిందకే వస్తుంది. పైగా పూర్తి అవిశ్వాసుల కంటే, ముస్లింగా ఉంటూ అరకొర విశ్వాసిగా ఉండడం క్రిందికి వస్తుందది. సంపాదన కొరకో, సంస్థ కొరకో, పేరు కొరకో ఈ మార్గం ప్టిన వారికి ఖురాను ప్రకారం జరిగేదేమిటన్నది తెలిసిన నేను, వారిపట్ల జాలిపడగలను. చిన్నపాి హెచ్చరిక చేయగలను. అంతే.
నా హెచ్చరిక : తెలిసో తెలీకో ఈ విధానాన్ని ఎంచుకున్న, ఈ మార్గం ప్టిన ఇస్లాం మిత్రులారా ! తక్షణం ఈ విధానాన్ని వదలండి. ఖురాను పట్ల నిజమైన విశ్వాసము, భయమూ ఉంటే పశ్చాత్తాప 'ప్రార్థన' ఒక్కసారి కాదు మాిమాికీ చేస్తూనే ఉండండి. మరొక్కమారు ఖురానును ధృవీకరించేందుకు ఇతర గ్రంథాలను ఉదహరించే, ఆధారం చేసుకొనే తప్పుపని చేయకండి. ఈ పోకడ తప్పుడు పోకడేనన్న నిజం మీకు తెలియడానికి వీలుగా ఒకి రెండు విషయాలు ప్రస్తావించి విశ్లేషిస్తాను, పరిశీలించండి.
1. పుస్తకం : హిందూ ధర్మ గ్రంథాలలో మొహమ్మద్‌. రచయిత : ము.సర్వర్‌ పారూఖ్‌నద్వీ. అనువాదం : కె.ఎం.అబ్దుస్సుబహాక్‌. సామాజిక అధ్యయన వేదిక, నెల్లూరు.
'మామాట' అన్న దగ్గర ప్రకాశకులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గీత మొదలగు గ్రంథాలను భారతీయ సమాజం దైవిక గ్రంథాలుగా స్వీకరిస్తుంది. పుట 3లో.
సురేంద్ర విమర్శ : ఇది బండ తప్పు. భారత దేశ పండితుందరూ వేదం ఈశ్వరీయం, మిగిలినవన్నీ ఋషి, ముని కృత గ్రంథాలు అనే అంగీకరిస్తారు. అక్కడ కూడా ఈ సాంప్రదాయం, ఇతిహాస పురాణాలు, నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదం (సంహిత) లన్నవి ఉత్తరోత్తరా అధికతమ ప్రామాణికాలు. వేదం స్వతఃప్రమాణము. మిగిలినవన్నీ వేదానుకూలతయా ప్రమాణాలు. అంటే పరతః ప్రమాణాలు అని మాత్రమే అంగీకరిస్తుంది. ఇవేమీ ప్రకాశకులకు తెలియదు.
2. రచయిత మాట :  సృష్టికర్తయైన అల్లా మానవునికి అనంతమైన, వైవిధ్యభరితమైన వరాలను ప్రసాదించాడు... వాిలో అత్యంత విలువైనది, వాస్తవిక జ్ఞానం (పుట 7)
సురేంద్ర విశ్లేషణ : ఇదొక అబద్దం, ఖురాను ప్రకారమే అల్లా తొలి ప్రణాళికలోనే కొందరు నరకానికి, కొందరు స్వర్గానికి గాను నిర్ణయింపబడ్డారు మానవుని వాస్తవిక జ్ఞానం వరంగా ఇచ్చిఉంటే లోకంలో అజ్ఞానమనే దానికి ఉనికే ఉండేది కాదు. ప్రవక్తలను పంపుతూ, వారు చెప్పింది వినని వారిని (తనను విశ్వసించని, తనమాట వినని వారిని) చంపుతూ, చంపిస్తూ ఉండాల్సిన పరిస్థితే రాదు. కనుక రచయితయొక్క ఈమాట అబద్దం.
మానవులందరూ సరేలే ! ముస్లింలలోనే ఎక్కువ మంది ఈనాికీ ఇతరులు పొందినంత జ్ఞానాన్ని పొందని, అందని స్థితిలోనే ఉన్నారన్నది నిత్యం మనందరి అనుభవంలోని విషయం.
3. వేద గ్రంథాలు అనేక ప్రక్షిప్తాలకు, మార్పులకు లోనైనాయి (పుట 1-9).
సురేంద్ర విశ్లేషణ : ఎంత బుద్దిలేనితనమిది ? వేదాలను గురించి తూర్పూ పడమర తెలియని ఈ గ్రంథ రచయిత, అమాయక, అజ్ఞాన జనులను మోసగించడానికి వాడిన మాటేఇది. వేదాలకు సంబంధించినంతవరకు పది రకాల పఠన, పాఠన పద్ధతి ఉంది. వేదార్థం విచారణీయం  అనంటే కొంతవరకు ఆలోచించదగిందే అనవచ్చుగాని, వేదంలో ఏదీ తీసేయడానికీ, చొప్పించడానికీ ఒక ప్టాన వీలుగానంత, వ్యాకరణ, చందోబద్దమైన రచనా ప్రక్రియతో ముడిపడి ఉందది. క్రమాంతస్వాధ్యాయం నుండి ఘనాంత స్వాధ్యాయం వరకు ఆ వాజ్ఞ్మయాన్ని రక్షించడానికై రూపొందించిన అద్భుత, అనితర సాధ్యమైన ప్రక్రియ అది. వివరాలు మరెప్పుడైనా వివరంగా చెప్పుకొందాం.
4. ''నరాశంస'' అన్న పదం వేదంలో ''31'' సార్లు ప్రస్తావించబడి ఉంది. అది ప్రవక్త గారిని ఉద్దేశించిందే. ప్రవక్తగారి పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు, వారి జన్మస్థలం వగైరాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి.
సురేంద్ర విశ్లేషణ : రచయితకు నా సవాలు ఏమిటంటే ముందుగా మీరు ''నరాశంస'' అన్న పదంలో కూడిన ఆ 31 మంత్రాలను, అవి ఉన్న సూక్తాల, మంత్రాల సంఖ్యతో సహా ఒకేచోట ప్రకించండి. దానికి ఇప్పి వరకు సాంప్రదాయకంగా వస్తున్న వేదభాష్యకారులెవరెవరు ఏ అర్థాలు చెప్పారోనూ వివరించండి. నరాశంస అంటే మహమ్మదేనని నిరూపించండి. ఈ పని చేయకుండా విషయాన్ని వేదవేత్తల మరియు/లేక, వేద సంస్కృతాన్నీ, వేదార్థ నిర్ణయానికి అవసరమైన వేదాంగాలను ఎరిగి ఉన్నవారి ముందు పెట్టకుండా, తట్టెడు కల్మషాన్ని, కుట్రను మనస్సులో పెట్టుకొని డబ్బుందిగదా అని పుస్తకాలు వేసి అమాయకుల్ని మభ్యపెట్టబూనటం కపటం, నయవంచన, సత్యతిరస్కారం కూడా. నేను పండిత సభను ఏర్పరుస్తాను, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా నీవన్నది నిజమని నిరూపించు. ఆ పని నీవల్ల కాకుంటే ఒకి రెండు విషయాలను సభముందుంచి, నీవన్నది అబద్దమని నేను రుజువుచేస్తాను.
గమనిక : నీవు ఏడవలేక ఈ విషయాలన్నీ అతనెవరో వేదప్రకాష్‌ ఉపాధ్యాయ అన్నాయన వివరించాడని, రుజువుపర్చారని ప్రలాపించావు. వివరించడానికీ, రుజువు చేయడానికీ నీకు తేడా తెలియదని అర్థమవుతూనే ఉంది. నీవు రాగలిగితే రా! మందినెత్తిన ఈ అబద్దాల బండ ప్టిెన నీదే ఆ బాధ్యత. నీకంత గుండె లేకుంటే, నీ వెంటపెట్టుకు రాగలిగిన వాడ్ని పెట్టుకొచ్చుకో. వాడెవడో ఒకింత సంస్కృతం తెలిసి నైతికతను విడచి దేనికోదానికి అమ్ముడుపోయిన వెధవ రాసిందాన్ని పట్టుకొచ్చి, వాడాడిన తప్పుడు కూతల్ని సత్యాలంటూ ప్రచారం చేసే మిమ్ముల్నేమి చేయాలి ? రాజ్యం దుష్టశిక్షణకు పూనుకోక పోవడమే దీనికి ప్రధాన కారణం. సమాజం ప్టిెంది తిని, శ్రమలేని జీవితాన్ని గడుపుతూ కనీసం ఇలాి స్వధర్మానికి కీడుజరిగే సందర్భాలలోనైనా గింత పనికి సిద్ధపడని నిద్రావస్తలో ఉన్న ధర్మాచార్యుల ఉదాసీనత మరో కారణం. మహమ్మదు వైదిక విధిని పాించండన్నాడని ఒక సంస్కృత శ్లోకాన్నో, ఒక అరబ్బులో హదీసునో తయారుచేసి మీముందుకు తెస్తే ఏమాంరు మీరు ? ఎవరి మత గ్రంథాలను వారు పట్టుకొని వారు పోదలచిన దారిన వారు పోకుండా, దుర్మార్గపు బుద్ధితో ఇతర మతగ్రంథాలలో తమవారున్నారని, అమాయక జనాన్ని మభ్యపెట్టడం వంచన, దుర్మార్గం కాదాంరా?
రెండు మంత్రాలను వివరిస్తాను.
1. ''అహమిద్ది పితుష్పరి మేథామృతస్య జగ్రభః| అహం సూర్య ఇవాజని'' హిందూ ధర్మ గ్రంథాలలో మొహమ్మద్‌ అను పుస్తకంలో 21వ పుటలో (ఋగ్వేదం 8:6:10) సామవేదం, ప్రతిసర్గ - 4వ అధ్యాయం 1500 అన్న ఉట్టంకింపు ఉంది. దాని అర్థం : ''మేఘములు లేని ఆకాశంలో సూర్యుడు ప్రకాశించునట్లు అహమద్‌ యొక్క యశస్సు ప్రకాశింపబడుతుంది'' అని వ్రాశాడీ పుస్తక రచయిత.
సురేంద్ర విశ్లేషణ : గింత సంస్కృతము, ఒకింత వ్యాకరణము తెలిసిన వారెవరైనా ఆ మంత్రము నుండి పై అర్థం రాదని, ఎవరో దౌర్భాగ్యుడు దేనికో ఆశపడి, ఈ చెడ్డ అర్థాన్ని దానికింంచాడనీ ఇట్టే చెప్పేయగలరు. ఎందుకంటే పద్యాలకు, వాక్యాలకు అర్థాలు చెప్పాలంటే, పదవిభాగము, సంధులు, సమాసాలు, సందర్భము వగైరాలనెన్నింనో పరిగణించాలంటుంది భాషాశాస్త్ర నియమావళి. పై మంత్రములోని పద విభాగం ఇదిగో.
అహం - ఇత్‌ - హి -పితుః, పరి; మేథామ్‌, ఋతస్య, జగ్రహ! అహం సూర్యః, ఇవ, అజని!
ఓ  ఈ మంత్రం ఉన్న సూక్తానికి ఇంద్రుడు దేవత, వత్సుడు ఋషి. అంటే ఇంద్ర దేవత సంబంధ విషయం గురించి చెప్పబడుతోంది. చెప్పినవాడు వత్సుడు అనే ఋషి.
1. నేను నిశ్చయముగనే పాలనకర్తయగు తండ్రి, ఆచార్యుడు, పరమేశ్వరునిచే జ్ఞానమునూ, సత్యాచరణకై (తగిన) బుద్ధిని పొందాను. సూర్యుని వలెనే తేజోవంతుడనైనాను (దయానంద సరస్వతి).
2. నేను సత్యమునకు తండ్రివిం ఇంద్రుని అనుగ్రహమున చేరినాను. నేను సూర్యునివలే ప్రకాశించుచున్నాను. (వివరణ : ఇంద్రానుగ్రహమున సూర్యునివలె వెలుగొందినాను).
విచక్షణాశీలురైన పాఠక మిత్రులారా ! పై మంత్రములోని 'అహమిద్ది' అన్నది 'అహం-ఇత్‌-హి' అన్న మూడు పదాల సమాహారం. 'హి' అన్నది నిశ్చయార్థకం, అహం = నేను, హి = నిశ్చయంగా, అన్నతరువాత మిగిలిన మంత్ర అర్థాన్ని జతచేయాలి. ఇందులో 'అహమద్‌' ఎక్కడ ఉన్నాడో ఆ బుద్ధిహీనుడే చూపించాలి. చూపేదాకా సత్యాకాంకక్షులంతా వాడిని సాగదీయాలి.
2. ''వేదాహ మేత్‌ పురుష మహాన్‌ త మందిత్త
   యవర్గ తమసః - ప్రస్తావయ నామ'' (యజుర్వేదం 31:18) అన్న మాటలు పుట 21లో ఉన్నాయి. దానికి అర్థమంటూ ఇలా వ్రాయబడి ఉందక్కడ. అనగా ''వేద అహమద్‌ అనబడే ఈ వ్యక్తి మహోన్నతుడు, సూర్యునిలా ప్రకాశించి చీకిని పారద్రోలేవాడు. ఆయనను తెలుసుకోవడం ద్వారానే, ముక్తి పొందగలం. ఇదితప్ప ముక్తికి మరోమార్గమే లేదు''.
సురేంద్ర విశ్లేషణ : ముందుగా ఒక్క మాట చెప్పాలి. ఈ పుస్తకం రాసిన మూల రచయితకు గానీ, అనువాదకునికి గానీ, ప్రచురణకర్తలకు గానీ సంస్కృతం విషయంలో పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. ఎలా చెప్పగలిగానంటే వారు ప్రచురించిన దాన్లో ఆ రెండులైన్లలోనే ఎన్నో బండబూతులున్నై. ఆ మంత్రం అసలురూపమిదిగో.
మంత్రం : వేదాహమేతమ్‌ పురుషం మహాన్తమ్‌ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ |
    తమేవ విదిత్వా తి మృత్యుమేతి నా-న్యపంద్దా విద్యతేయనాయ | (యజు 31:18)
పద విభాగః - వేద - అహం - యేతం - పురుషమ్‌ - మహన్తమ్‌ - ఆదిత్యవర్ణం
తమసః - పరస్తాత్‌ - తమ్‌ - ఏవ - విదిత్వా - అతి - మృత్యుమ్‌ - ఏతి
న - అన్యః - పంద్దాః - విద్యతే - అయనాయ
1. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును నేను తెలుసుకున్నాను. అతనిని తెలుసుకున్న వాడే మృత్యువును జయించగలడు. అదితప్ప గత్యంతరం లేదు (యజు.పుట.306). (దాశరథి రంగాచార్య)
ఒక్కమాట - ఈ మంత్రాధి దేవత - ఆదిత్యుడు. ఇందలి పురుష శబ్దం పరమేశ్వరుని సూచిస్తుంది. ఋషి ఉత్తర నారాయణుడనువాడు.
2. మానవులు ఇహలోక, పరలోక సుఖములు కాంక్షించినట్లయిన, సర్వోన్నతుడు,  స్వయంప్రకాశడు, ఆనందరూపుడు, అజ్ఞానం లేశమాత్రం లేనివాడు అయిన పరమాత్మను తెలిసికొనియే మరణాది అగాధ దుఃఖసాగరము నుండి వేరుకాగలుగు చున్నాడు. ఇదియే సుఖదాయకమగు మార్గము. ఇందుకు భిన్నముగా మానవుల ముక్తికి వేరుమార్గం లేదు. (దయానంద భాష్యం).
సురేంద్ర : నిజానికి ఈ మంత్రం దీనికి ముందు మంత్రానికి కొనసాగింపు రూపమై ఉంది. ఆ విషయం 'వేదాహమేతం పురుషం మహాన్తమ్‌' అన్న మాటల్లోని 'ఏతం' అన్న పదం సూచిస్తుంది. 'పైన తెలిపిన్టి' అన్న అర్థాన్నిస్తుందా మాట. కనుక 31-1 వ మంత్రం నుండి వరుసగా చదివి వాితో కలిపి అర్థం చెప్పుకోవాలి. ఈ అధ్యాయమంతా పురుషుని (పరమేశ్వరుని) గురించే చెప్పబడింది. 'సహస్ర శీర్షా పురుషః'తో ఆరంభమైందీ అధ్యాయం. వాక్యార్ధాన్ని నిర్ణయించడానికి పూర్వాపర సంగతి - అంటే ఆ వాక్యానికి వెనక ముందు వాక్యాలనూ చూడడం, వాిలో క్రమం ఉండడం అవసరమన్న భాషా నియమాన్ని గానీ, గ్రంథం చెప్పదలుచుకున్నది గ్రహించేయత్నం చేయాలేగాని, దాని నెత్తిన మన గబ్బునంతా పులమకూడదన్న కనీస నైతిక బాద్యతను కూడా ప్టించుకోని ఈ రచయిత, ఖురాను ప్రకారం, కుడిచేయి పట్టుకుని కంఠనాళం కోసేయాల్సినంత తప్పుచేశాడు. ఖురానులో అల్లా, తాను చెప్పనివి తనపేరున ప్రవక్త చెప్పినా, ప్రవక్త అనికూడా చూడకుండా అతని కంఠనాళం కోసేవాణ్ణి అన్నాడు. నా సూి ప్రశ్న? పై రెండు మంత్రాలలో మమమ్మద్‌ ఎక్కడున్నాడో చూపించండి?
ఖురాను ప్రకారం, అసత్య ప్రచారం చేస్తే సాతాను బచ్చానే అవుతారు.
3. అదే పుస్తకం 21,22 పుటలలో డా||ఎం.ఎ.శ్రీవాత్సవ అన్న ఒక బుద్ధిహీనుడు వ్రాసిన 'వేదిక్‌ ఏక్‌ వివేచన్‌' అన్న పుస్తకంలోని 101 వాక్యంలో ఇలా ఉందంటూ ఈ పుస్తక రచయిత 'అల్లోపనిషత్తు' పేరున రాయబడ్డ వాక్యాలను ఉదహరించారు.
1. అల్లోపనిషత్తు : ''అస్మల్లాం ఇల్లే మిత్రావరుణ దిష్యాని హత్త ఇల్లల్లే. వరుణో రాజా పునుద్రుదః హయామిత్రో ఇల్లాం ఇల్లల్లే ఇల్లా వరుణోం. మిత్రస్‌ తేజస్‌ కామ''. ఇది చదివాక వెంటనే తెనాలి రామలింగని తిట్టు పద్యం ఒకి గుర్తుకొచ్చింది.
సురేంద్ర విశ్లేషణ : గంజాయి తిని తురకల జంఘాటముచే.... లం... కొడక! ఎచ్చి కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌|| అన్నట్లు, ఇదెక్కడి ఉపనిషత్తు? 10 ఉపనిషత్తుల్లోనిదా? 32 ఉపనిషత్తుల్లోనిదా? 64 ఉపనిషత్తుల్లోనిదా? 108 ఉపనిషత్తుల్లోనిదా? దీనిని ఏ వేద భాగానికి అనుసంధానింపబడిందిగా సాంప్రదాయం అంగీకరించింది ? సాంప్రదాయ వేద, ఉపనిషద్‌ భాష్యకారులెవరైనా దీనిని గతంలో భారతీయ వేదాంత విచారణ సందర్భంలో ఉట్టంకించారా? త్రిమతాచార్యులు వారి ప్రస్థానత్రయ భాష్యాలలో గాని, దయానందుని భాష్యాలలో గాని ఇదెక్కడైనా ప్రస్తావించబడి ఉందా?
2. ఉపనిషత్‌ అన్న తోక తగిలించగానే విషయాన్ని ప్టి చూడకుండానే తెగ తలలాడించే మంద ఈ దేశంలో తగలడి చచ్చారు గనుకనే ఈ దిక్కుమాలిన సంత ఇలా తెగబడి ఏదిబడితే అది రాసేస్తున్నారు. ఆపై అమాయకుల దగ్గర చలామణీ చేస్తున్నారు కూడా. అది సరే! ఇంతకూ ఈ అల్లోపనిషత్తు వాక్యాలలోని భాష 1. సంస్కృతమా? హిందీనా? ఉర్దూనా? అరబ్బీనా? ఇంకేదైనా కూడా కలసిన పంచకూళ్ళ కషాయమా? రాసినోడు నీతి - జాతి లేని వాడని తెలుస్తూనే ఉంది. తీసుకొని నెత్తినెత్తుకునే వాడికింత వివేకం ఉండొద్దా? ఏ భాషో కూడా నిర్ణయించడానికి వీల్లేని, దాని అర్థమేమిోనూ గ్రహించడానికి వీల్లేని దానిని పట్టుకొని మీ వేదాల్లో మా ప్రవక్త, మా అల్లా అనడానికి తెగించిన వాళ్ళనేమనాలి? ఏమి చేయాలి?
ఇస్లాం పక్షంలో ఉంటూ హిందూ సాంప్రదాయానికి చెందిన గ్రంథాలలో మొహమ్మదున్నాడు, అల్లా ఉన్నాడు లాి అబద్దాలు తెలిసి గానీ, తెలియకనే గాని మ్లాడసాహసించే వాళ్ళందరకూ 1. సత్యాన్వేషణ తత్పరతతో మిత్రులుగా సత్యస్థాపన కొరకు గానీ, ప్రతి కకక్షులుగా నిజనిర్థారణకు గానీ, సత్యాన్వేషణ మండలి సిద్ధంగా ఉందనీ, మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, నిజాలకు పెద్ద పీట వేసే సంసిద్ధత ఉన్నా అందుకు సిద్ధంకండని ఆహ్వానిస్తున్నాను. ఇస్లాం పక్షం వైపున ఇి్ట పనిచేస్తూ మా దృష్టికి వచ్చిన వారి జాబితా ఈ సంచికలోనే ప్రచురించాను. మా దృష్టికి రానివారెవరైనా మీకు తెలిసిన వారుంటే మీలో ఎవరైనా వారికి ఈ సమాచారం అందించండి. వారిని మీరు మా తరపున ఆహ్వానించినట్లే వారిని స్వీకరించగలను. ముస్తాక్‌ అహ్మద్‌ గారు, ఫజులూర్‌ రహమాన్‌ గారి లాి వారు మా మిత్రబృందానికి చెందిన వారే అయినప్పికీ, విషయ విచారణ సందర్భంలో స్వపర బేధాలు ప్టించుకోకూడదన్న నియమం ఉండడంతో వారి వ్యక్తిత్వాల పట్ల మాకు సదభిప్రాయము ఉన్నా, ఈ అపసవ్య విధానం వారికీ అంటుకోవడంతో వారినీ జాబితాలో చేర్చక తప్పింది కాదు.
వేదంలో మహమ్మదు ఉన్నాడనడానికి ప్రధానంగా 'నరాశంసః' అన్న పదాన్నే ఎంచుకున్నారు ఆ పోకడపోయిన వాళ్ళు. 'ప్రజలలో ప్రశంసనీయుడు' అన్న అర్థాన్ని మహమ్మదుకు అంటగట్టడమంత అన్యార్థకల్పన మరోి లేదు. నిజాయితీ ఉండిగాని, దమ్ముండిగానీ, వేదికమీదికి వస్తే అది భాషా నియమాలననుసరించి, తార్కిక నియమాలననుసరించి 'ఛలం' క్రిందికి వస్తుందని నిరూపిస్తాను.
ఇక కల్కి పురాణం, భగవత్‌ పురాణం, అపర్యోపనిషత్తు, అల్లోపనిషత్తు (కుళ్ళోపనిషత్తుల)లాి వన్నీ సిద్ధాంత చర్చకు పనికొచ్చే స్థాయికల గ్రంథాలు కావు.
2. గుండా బత్తిని వారి వేదాలలో యేసుప్రభువు దర్శనము :
1. గుండాబత్తిని వారి నివేదిక : ఎ) నాకు తెలిసిన దానిని నేర్పిస్తాను. నాకు తెలియని దానిని ఎవరైనా నేర్పితే నేర్చుకుాంను. బి) నేను వేదాధ్యయనం చేసి ''వేదాలలో యేసుప్రభువు దర్శనం'' అను ఈ చిరు గ్రంథం వ్రాశాను. సి) నా ఈ పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించి తమరి అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాను. (పుట -7)
ఓ  సురేంద్ర : ఏమండీ గుండాబత్తిని వారూ ! వేదాలను అధ్యయనం చెయ్యడమంటే ఏమిటండీ! దాశరధి రంగాచార్యుల తెనుగు వచనమో, దయానందుల వారి మార్గంలో ప్రయాణిస్తూ వేదాలను తెనుగులోకి తేవాలని కృషిచేస్తున్న మర్రి కృష్ణారెడ్డి గారి, చతుర్వేద సంహితలోని మంత్రాలను చదవడమోనోనా? బాగుంది, గొప్ప అధ్యయనమే. ఇంతకూ, దాశరధి గారి తెనుగు అనువాదమె సరిగ్గా అర్థంకాని స్థితిలో ఉన్న మీకు, తెలుగు లిపిలో ఉన్న వేదమంత్రాలకు అర్థం ఎలా తెలిసిందండీ! ఇకపోతే మీ ఇంగ్లీషు అనువాదం ఎవరిది? అది చదివితే వేదం అర్థమయినట్లవుతుందని ఎలా అనుకున్నారు? ఎవరన్నారు?
అవన్నీ అలా ఉంచి, సరిగా అర్థంకాని దాశరధి రచన, అసలే అర్థం కాని తెలుగు లిపి సంస్కృత వేదం, ఆంగ్లానువాదం అన్న మూినీ పిండి యేసునెలా దర్శించి, వెలికితీశారు తండ్రీ!
2. వేదాలలో నుండి రకరకాల దర్శనాలను పండితులు ప్రతిపాదించారు గానీ, అవేవీ నిలబడక చివరికి 6 దర్శనాలు మాత్రమే నిలబడ్డాయి. వాినే షడ్దర్శనాలాంరు (పుట -10).
ఓ  సురేంద్ర : గుండాబత్తిని వారూ! మీ పైమాటను బ్టి, మీకటు వేదమూ తెలియదు, ఇటు షడ్దర్శనాలూ తెలియవని నాకైతే తేలిపోయింది. బైబిలును పట్టుకున్నాయనవు, దాన్ని పట్టుకుని పోక, తెలియని వాిని గురించి తెలుసనుకుంటూ, మరి కొందరు తెలియని వాళ్ళకు దారిచూపబోవడం ఎంత ప్రమాదకరం?!
ఓ  3. వేదాలలో యేసుప్రభువు దర్శనం కూడా ఉందని ప్రపంచానికి తెలియదు. వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన వారూ వేదాలలో ఉన్న యేసుప్రభువు దర్శనాన్ని పట్టుకోలేక పోయారు.
ఓ  వేదాలలో దేవుని దర్శనం ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ యేసుప్రభువు దర్శనమును పట్టుకోవడం కష్టం.
ఓ  నేను ఈ సత్యాన్ని స్థాపిస్తే, పండితలోకం ఎంతవరకు ఆమోదిస్తుందో తెలుసుకోవాలనుకొని ఎ) ఆంధ్రలోని అన్ని హిందూ దేవాలయాలకు, బి) అన్ని జిల్లాల కలెక్టర్లకు, సి) విశ్వ విద్యాలయాలకు, డి) ఎమ్మెల్యేలకు, మంత్రులకు మొదలగు ఉన్నత వర్గాలకు పంపాను. అలాగే హిందీలోకి అనువదించి అనేకులకు పంపాను. అనేకుల నుండి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ఒక్కరూ నా వాదాన్ని ఖండించలేదు.
ఓ  సురేంద్ర విశ్లేషణ : ఒక్కందుకు మెచ్చుకోవాలి మిమ్మల్ని. వేదాలను సాంగోపాంగంగా, సాంప్రదాయబద్దంగా చదివిన వారికి గానీ, దానికి భాష్యం, వ్యాఖ్యానం సిద్ధం చేసిన వారికిగానీ, అందులో యేసు దర్శనం కనపడలేదన్న నగ్నసత్యాన్ని అంగీకరించినందుకు మెచ్చుకోవాలి మిమ్ము. అందుకోండి అభినందనలు. వారంతా వేదంలోకి చూడగలిగిన సత్తా ఉన్నవారు కనుకనే, అందులో ఏది ఉందో అదే కనపడింది. ఏది లేదో అది కనపడలా. సరిగా చూడలేని వాళ్ళకే, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టూ కనపడుతుంది. మీ పరిస్థితి అదే.
ఓ  ఇక మీరు పంపిన వాళ్ళలో వేదవేత్తలెవరూ ఉన్నట్లు కనపడడంలా. మరి వారెలా మీదానిలో తప్పొప్పులు చెప్పగలుగుతారు? ఈ విషయంలో మీలో ఏమాత్రం నిజాయితీ మిగిలిఉన్నా నేనేర్పాటుచేస్తాను వేదార్థం తెలిసిన వాళ్ళతో మీకు భేీ. సిద్ధపడండి.
ఓ  ఇక, మీ పుస్తకానికి అభిప్రాయాలు పంపినవాళ్ళంతా నిజానికి నిందనీయులే. తగుదునమ్మా అని తమకు ప్రవేశం లేని విషయాలలో, తమకున్న ప్టాలను ప్రకించుకుంటూ అనుకూలాభిప్రాయాలు రాయడం వల్ల ఎంతమంది అమాయకుల్లో తప్పుభావనల్ని కలిగిస్తుందోనన్న ఇంగితం కూడా కొరవైనందుకు వారందరినీ నిందించాలి. ఒకవంక రకరకాల ప్రలోభాలకు లోనుచేస్తూ అమాయకుల్ని, క్రైస్తవంలోకి, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైన పన్నాగాలతో మతమార్పిడులు చేస్తుండడాన్ని గమనిస్తూనూ, ఇలా నిజంగా తమ విషయంలో సరైన అభిప్రాయాన్ని ప్రకించగలంత అవగాహన లేదని ఎరిగి కూడా ఇలా రాసెయ్యడాన్నేమనుకోవాలి.
వారంతా గానీ, వారిని కలుపుకొని మీరుగాని విచారణకు సిద్ధపడితే వేదికనేర్పరచి ఆ వేదికపైనే వారి వ్యక్తీకరణలు అనర్హమైనవని రుజువుచేస్తాను. నిజాయతీ, నిజాయతీ, నిజాయతీ ఇదే ఇప్పుడు మనముందున్న ప్రధానాంశం. మనమంతా కలిగి ఉండాల్సిన, చూపించాల్సిన, పాించాల్సిన అంశం.
గుండా బత్తిని వారు వేదమంత్రాలకు - యేసును పులిమిన విధానం
1. రుగ్వేదంలో 10వ మండలం 90వ సూక్తంలో చెప్పబడిన పురుషుడు యేసు ప్రభువేనని గుండాబత్తిని వారు ప్రకించారు. అది నిజమో, అబద్దమో తేలాలి. అది నిజమేనని నిరూపించాల్సింది ఆయనే. ఒకరోజు ఆయనకు ఫోనుచేసి మీరు రాసిన రాతలు సరైనవేనని నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంది, అందుకు సిద్ధపడండి. సమావేశం ఏర్పాటుచేస్తానని అడిగాను. అందుకాయన, నాకు తోచింది నేను రాశాను. నచ్చితే తీసుకోండి, నచ్చకుంటే విడిచిపెట్టండి. దీనిమీద చర్చించేదేమీలేదని అన్నారు.
పాఠకులారా ! ఇలా ఎవరికి వారు, వారికి తోచిందల్లా కలం ఉందిగదా అని రాసేసి మందినెత్తిన అబద్దపు భావాలుపెట్టడం అనైతికమూ, కుిలపన్నాగరూపమైన మతప్రచార ఎత్తుగడ కాదాంరా? మత ప్రచార స్వేచ్ఛకు సంబంధించిన అధికరణంలో భారత రాజ్యాంగం స్పష్టంగా, నైతికతను కలిగి ఉండాలని, విషయాన్ని బహిర్గతపర్చడమే గాని, వ్యక్తుల్ని అన్యత్రా ప్రభావితులను చేసే అంశాలు ప్రచారంలో చొప్పించగూడదని పేర్కొంటుంది. మీ క్రీస్తునో, యెహోవానో ఆ గ్రంథంలో ఉన్నవాిని ఉన్నట్లు ప్రచారం చేసుకోవాలి గాని, నిజానికి వేదం ఏమి చెబుతోందో తెలియకుండానే వారో, వీరో రాసిన వాిని ఉట్టంకిస్తూ, వాికి తాననుకున్న అర్ధాలు పులమడం ఎంత దుర్మార్గం ? మచ్చుకు ఒకి రెండంశాలు వివరించి ఇప్పికి ఆగుతాను. ఈ విషయంలో గుండాబత్తిని వారిని మీలో ఏమాత్రం నిజాయితీ, నిర్భీతి ఉన్నా, సత్యాసత్య విచారణకు సిద్ధంకమ్మని పిలుస్తున్నాను.
1. వేదాహ మేతం పురుషం మహన్తమ్‌ | ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్‌ |
  తమేవ విదిత్వా తి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే-యనాయ || (శ్వేతాశ్వతర -3-8)
''సకలమైన అంధకారానికీ అతీతమై, సూర్యకాంతితో వెలిగే ఆమహాపురుషుని నేను దర్శనం చేసుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మరణం నుండి తప్పించుకోగలడు. మరణం నుండి విడుదల పొందడానికి ఆయన తప్ప మరొక దారిలేదు'' అని అర్థం చెప్పి దానికి వివరణగా, శ్వేతాశ్వతర మహర్షికి ఒకరోజు పరలోక దర్శనం కలిగింది. పరలోకంలో ఈయన ఒక మహాపురుషుని చూశారు. పరలోకంలో ఏ విధమైన చీకీ లేదు. మహాపురుషుడు సూర్యునివలే ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మరణమను మాటకు నరకమని భావము. నరకానికి వెళ్ళకుండా మానవులను రక్షించగలిగేది ఆ మహాపురుషుడొక్కడే. ఈయనే మోక్షానికి ఏకైక మార్గము.
మహర్షికి దర్శనములో కనిపించిన ఆ మహాపురుషుడు యేసుప్రభువు, ఆయనను యోహాను అపొస్తులుడు కూడా దర్శనములో మహర్షి చూసినట్లుగానే చూశారు. యోహాను తాను చూచిన ప్రభువును బైబిలు గ్రంథములో క్రింది విధముగా వర్ణించాడు.
''ఏడు సువర్ణ దీప స్థంభములనుపా దీప స్థంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు ద్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు, వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమువేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహము వలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోినుండి రెండంచులు గల వాడియైన ఖడ్గమొకి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను'' (ప్రకటనలు - 1:13-16) (పుట 98-99).
సురేంద్ర విశ్లేషణ : గుండాబత్తిని వారి పుస్తకాలలో ఇంకా చాలా ఉన్న పులుముడునంతా బయటపెట్టడానికి అంశాల వారీగా రాయాలంటే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఒక్క విషయాన్ని విశ్లేషించి ఆయన రాతలు ఎంత తప్పుడివో చూపిస్తాను.
1. పై మంత్రం యజుర్వేదం 31వ అధ్యాయం (18వ మంత్రం)లో ఉంది. అందుండి శ్వేతాశ్వతరోపనిషత్కారుడు సంగ్రహించాడు. ఈమాట ఎలా చెబుతున్నానంటే, వేదంలో ఆ మంత్రద్రష్ట నారాయణుడనే రుషి. నిజానికీ మంత్రం పురుష సూక్తంగా ప్రసిద్ధమైన రుగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలోనిది. రుగ్వేదంలోనిదే యజుర్వేదంలోనూ పొందుపరచబడి ఉంది. ఈ మంత్రములోని 'పురుషుడు' ఎవరన్నది దీనికి వెనుక మంత్రాలను కలిపి చదువుకొంటేగాని అర్థం కాదు. ఈ పురుషునికి ముఖమేది, బాహువులేవి? తొడలేవి? పాదములేవి? అని ప్రశ్నించుకొని, నిజానికి అవ్యక్తుడైన ఆ పురుషునికి రూపకల్పన చేయబడుతోంది. అదే సూక్తం 10వ మంత్రంలో ఉంది. 11వ మంత్రంలో బ్రాహ్మణో-స్య ముఖమాసీత్‌ అంటూ ఆ కల్పన రూపం ప్రస్తావించబడింది. ఆ విషయం భారతదేశమంతా విస్తారంగా, బ్రాహ్మణుడు ముఖము నుండి... శూద్రుడు పాదాల నుండి అంటూ వివరింపబడి బహు విమర్శలకు లోనైఉంది. అదిగో అి్ట పురుషుణ్ణి నేనెరుగుదును అంటున్నాడు ఆ సూక్త ద్రష్ట అయిన నారాయణ రుషి. అదీ అసలు సందర్భం. దానినే శ్వేతాశ్వతరోపనిషత్తు రుషి తాను వాడుకున్నాడు. నిజమిది గనుకనే, వేదాన్ని, ఉపనిషత్తులను సాంప్రదాయబద్దంగా అధ్యయనం చేసినవారెవరికీ అందులో బైబిలు యేసు గోచరం కాలా. వారెవరికీ వేదాల్లో యేసుకనపడని మాట నిజమేనని గుండాబత్తిని వారూ ఒప్పుకుంటున్నారు. వేదాలను పద్ధతి ప్రకారం నేర్చిన వారెవరికీ గోచరించని, నిజానికి అందులో లేని యేసు, వాిని స్వయంగా అర్థం చేసుకునే సామర్ధ్యంలేని వీరికి ఎలా కనపడ్డారన్నది ఏమాత్రం ఇంగితం పనిచేస్తున్న వారికైనా ప్టుితీరాల్సిన ప్రశ్న. ఈయన గారికీ ఎంతోకొంతైనా ఇంగితం పనిచేస్తూనే ఉంటుంది కదా! అది లేకుండా మనిషెలా జీవించగలడు? ఇంగిత జ్ఞానం ఇది తప్పురా అని హెచ్చరిస్తున్నా దాన్ని అణచిప్టిె, దాని గొంతునొక్కి తాను పులమదల్చుకున్నదంతా పులిమి మందిమీదికి విసిరేశారన్న మాట ఈ గుండాబత్తిన వారు! ఏమి క్రైస్తవమో?! ఏమి క్రీస్తు అనుకరణో?! ఏమి నైతికతో? నాకైతే అర్థం కావడంలేదు.
ఎంతో పచ్చిగా, ఈ మంత్రాలలో చెప్పబడ్డ పురుషుడు - ప్రకటన గ్రంథంలో యోహాను వర్ణించిన పురుషుడు ఒక్కడేనని బరితెగించి ప్రకించేశారు గుండాబత్తిని వారు. యోహాను ప్రకించిన యేసు వివరాలు పైన వ్రాశాను. కనీస ఇంగితమున్న ఎవరిముందైనా  గింత భాషా పరిజ్ఞానం ఉన్న ఎవరి ముందైనా, ఎందరి ముందైనా ఈ రెండు గ్రంథాల సమాచారాన్ని పెడదాం. రిెంలో చెప్పబడింది ఒక్కరి గురించేనా? వేరువేరు వాళ్ళను గురించా అన్నది తేల్చుకుందాం. ఒక్కరి గురించి కాదని తేలితే గుండాబత్తిని వారు తాను చేసిన మహాపరాధానికి ప్రాయశ్చిత్తంగా తప్పుచేశానని బహిరంగంగా ప్రకించి, పూర్వ ఆ గ్రంథాలను ఉపసంహరించుకోవాలి. క్రైస్తవాన్ని విడచి సత్యాన్వేషణ మార్గంలోకి మరలాలి. ఆయన ఏ మాత్రం నీతిమంతుడైనా మాటలు మాని, చేతలకు సిద్ధం కావాలి.
ఓ  పెద్ద అడ్డగోలు విషయమేమంటే, ఇదే మంత్రాన్నుట్టంకించి ఒక ముస్లిం, ఈ మంత్రం మహమ్మదును గురించి తెలియజేస్తోంది, అని తెగబడి అనేశాడు.
ఓ  ఇదే సూక్తాన్ని పట్టుకొని మరో యేసు భక్తుడు అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ అన్నాయన, హైందవ క్రైస్తవంలో 'విర్‌ాపురుషుడు' పుట 30లో ఆయన పులమాలనుకున్నది ఆయన పులిమాడు.
వీరందరికీ నా సూచన, హెచ్చరిక, మరో రకంగా సవాలు ఒక్కటే. తెలీనోళ్ళు తెలీనట్లుండక, ఆ మంత్రానికి రాని అర్థాన్ని, దాని నెత్తినపెట్టే కుిల పన్నాగాలు మీకెందుకు? నిజంగా మీకెవరికైనా మీమీ గ్రంథాలు సూచిస్తున్నాయంటున్న దేవునిపైనా, ఆయన అనుసరించమంటున్న సత్యసంధతపైనా నిజాయితీతో కూడిన నిబద్దత ఉంటే, ఈ క్షణం తప్పును తెలుసుకొని, అంగీకరించి, పశ్చాత్తాపపడాలి. లేదా మీది సరైన ప్రకటనేననుకుంటే నిజనిర్ధారణకు సిద్ధపడాలి. రిెంలో ఏదో ఒకి చేయకుంటే మీరు అబద్దీకులనిగాక మరో నిర్ణయం చేయడం సాధ్యపడదు. ఈ రకం వారంతా తెలిసే తప్పుచేస్తున్నారన్నదే నా నిర్ణయం.
గుండాబత్తిని వారూ! ప్రకటన గ్రంథంలోని వ్యక్తి వర్ణనకూ, ఈ సూక్తంలోని పురుషునికీ ఎి్ట సంబంధమూ లేదన్నది కళ్ళకు క్టినట్లు కనపడుతోంది. మీకెందుకు అర్థం కావడంలేదు?!
సవాలు : మీరు రాసినవన్నీ ఒప్పులని రుజువుచేయండి, లేదా అందుకొన్నైనా తప్పులని నేను రుజువు చేస్తాను. నిజనిర్థారణకు, సత్యస్థాపనకు సిద్దంకండి. ఇదే మీకూ మీలాి వంకర పోకడ పోయిన ఎవరికైనా నేను చేస్తున్న సవాలు. ఎవరు సిద్ధమన్నా వేదికనేర్పాటుచేస్తాను.
3.కణితి అబ్రహాం గారి - వేదాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షం - పుస్తకం
1. వేదగ్రంథాలలో యేసు ప్రత్యక్షమైనట్లు బైబిలు గ్రంథం సాక్ష్యమిచ్చుచున్నది. పుట-1.
సురేంద్ర : అబ్రహాం గారూ! అడ్డగోలు సాగతీతలు లేకుండా ఒక్క మాట అలాిది చూపండి బైబిలులో. ఈ మాట క్రింద మీరు చూపిన (మీకా 5:2) వేదాలలో యేసున్నాడని బైబిలు అంోంది అన్నది కానేకాదండీ! పులిమే, దోపే, సాగదీసి సరిపెట్టే పని మీకెందుకండీ!
2. యేసుక్రీస్తంటే ఎందుకింత వ్యతిరేకత?
క్రైస్తవ ఉపదేశానికి ఈమధ్య బాగా వ్యతిరేకత పెరిగిపోయింది..వేద వాజ్ఞ్మయంలో క్రీస్తును గురించి చాలా సంగతులున్నాయి. పుట-2.
సురేంద్ర : నిజానికి యేసంటే వ్యతిరేకత కంటే, యేసునడ్డం పెట్టుకొని అబద్దాలాడే లేదా తెలిసీ తెలియని తప్పు భావాలు అమాయకుల నెత్తినప్టిె, జీవితాన్ని సాగించే వారంటేనే వ్యతిరేకత! నాలాిం వారికైతే మంట కూడా! ఏదో ఒకి సత్యం పేరున, సువార్త పేరునా రాసేస్తారు. అది నిజం కాదంటే వదులుకోరు. నిజమో కాదో పరీక్షించుదామంటే సిద్ధంకారు. తెలియనివి తెలిపితే తెలుసుకుాంనని దొంగమాటలు మాత్రం తెగ వినయం ఉన్నట్లు మ్లాడతారు. మీ కథా (పోకడా) దీనికి వేరుగా ఉంటుందని అనుకోను, ఆచరణలో వేరుగా ప్రవర్తిస్తే అంగీకరిస్తాను.
3. వేదాలు చక్కగా పరిశీలిస్తే (పఠిస్తే) క్రీస్తు దర్శనం కూడా వేదాలలో ఉందని అర్థమవుతుంది.
సురేంద్ర : నిజమా కణితి గారూ! వేదాలు చక్కగా పఠిస్తే క్రీస్తు దర్శనం కూడా ఉందని తెలుస్తుందన్నారు.
ఎ) వేదాలను చక్కగా పఠించడమంటే ఏమిటండీ! వైదిక సంప్రదాయం నిర్ణయించిన నియమనిబంధనలు పాిస్తూ పఠించడమనా? గుండాబత్తిని వారో, పరవస్తు వారో, ఫ్రాన్సిస్‌ గారో రాసిన పుస్తకాలను బ్టీపెట్టడమో, కాపీ కొట్టడమోననా? అసలు పఠించడానికీ, అధ్యయనం చేయడానికి ఉన్న తేడా మీకు తెలుసా? తెలియదా? పఠనము, పారాయణము, అధ్యయనము, శోధన అన్న వాి స్వరూప స్వభావాలు మీ ఎరుకలో ఉన్నాయా?
ఓ  వేదం వరకు తీసుకుంటే వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేయాలని సాంప్రదాయం చెబుతోంది. నిజానికి ఆ పని మన ఇరువురి వల్ల ఇప్పికి జరగలా. ఇక ముందయ్యేదీ కాదు.
బి) క్రీస్తు దర్శనం కూడా అందులో ఉందని తెలుస్తుందన్నారంటేనే అందులో ఇంకేవో దర్శనాలు కూడా ఉన్నాయని మీరనుకుంటున్నారన్న అర్థం వస్తుంది. ఇంతకూ మీరనే వేదంలో (వేదాలు 4 పేర్లతో ఉన్నాయి. అందులో దేనిని దృష్టిలో పెట్టుకొని ఈ మాటన్నారు? అన్నింనీ కలిపి అన్నారా?) ఏ యే దర్శనాలున్నాయో వాిపేర్లు ముందు చెప్పి వీలుంటే కొంత సమాచారాన్ని ఇవ్వండి.
సి) యేసుని గూర్చి పాత నిబంధనలో సవిస్తరంగా వ్రాయబడి ఉన్నా యూదులకు వారి గ్రంథాలలో యేసు ప్రభువు ప్రత్యక్షత అర్థం కాలేదు. అన్నారు. మనకిప్పుడు ఆ సంగతులెందుకు గానీ, వేదాలలో యేసు దర్శనం గురించి మ్లాడుకోడానికి మాత్రం పరిమితమవుదాం. లేకుంటే స్పష్టత రాదు.
ఏమాత్రం నిజాయితీ, సామాజిక బాద్యత ఉన్నా ఇలాి రచనలు చేసిన వారిని వారి రచనలను ముందుగా వెనక్కి తీసుకోవలసిందిగానూ, ఆపై విజ్ఞుల సమక్షంలో నిజనిర్ధారణకు కూర్చోడానికి సిద్ధం కావలసిందిగానూ విజ్ఞప్తిచేస్తూ ముగిస్తున్నాను.                        
 - సత్యాన్వేషణలో మీ సురేంద్ర.
జన్మ రహస్యం : పుట 3లో.
1. అధిక పురుష శుక్లం వలన మగబిడ్డ, అధిక స్త్రీ షోణితమున ఆడబిడ్డ, శుక్లషోణితములు సమానమైన నపుంసక శిశువుగాను, కామప్రేరణ జరిగిన వెంటనే రతి జరిపినప్పుడు కవల పిల్లలుగానూ జన్మిస్తారు.
సురేంద్ర : పై మాటలు వ్రాస్తూ (కీర్తన 139:15) అని రాశారు. అందులో మీరన్నవేవీ లేవు కదా! ఆ వాక్యం నేను రహస్యమందు ప్టుిన నాడు, భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. నాకు కలిగిన ఎముకలనూ, నీకు మరుగై ఉండలేదు అని మాత్రమే ఉంది. మరి మీరేమి ఆ వాక్యం నెంబరిచ్చి ఏదేదో వ్రాసేశారు. బైబిలు చెప్పంది బైబిలు పేరున చెప్పనే కూడదన్నంత వరకైనా నిజాయితీగా విశ్వసించి పాించకుంటే, మీరెలా విశ్వాసి క్రిందికి వస్తారు? అబద్దపు ప్రవక్తల, అబద్దపు క్రీస్తుల గురించి యేసు హెచ్చరించింది ఇంతకు ఎవరినాంరు? ఆలోచించండి, ఆలోచించగలిగితే.
ఓ  అదలా ఉంచుదాం! పైన మీరన్న విషయాలు మీకెలా తెలిశాయండీ, కణితివారూ! దానినిండా అజ్ఞానమే ఉంది. అందులో ఒక్కమా సరైంది కాదు. ఎందుకు అనవసరంగా ఆ బండనెత్తికెత్తుకున్నారు.
2. ''జాతస్య హిదృవం మృత్యుదృవం జన్మ మృతస్యచ'' (భగ.గీత. 2:27).
ప్టుిన వానికి మరణం - మరణించిన వానికి జననం తప్పదు అని వ్రాశారు.
సురేంద్ర : కణితి అబ్రహాం గారూ! భగవద్గీత నెందుకు ముట్టుకున్నారు తండ్రీ! అది బైబిలు పట్టుకున్న వాళ్ళను కాల్చుతుంది. అది పూర్వజన్మ - పునర్జన్మల పరంపరలను అంగీకరిస్తుంది. దానిని ప్రమాణమన్నారంటేనే బైబిలు పునాదులు కదిలిపోతాయి. గీత ప్రకారం శాశ్వత స్వర్గ నరకాలు పొందడమన్నది లేదు. జీవుడు పుట్టేవాడు కాడు. చచ్చేవాడూ కాడు. ఆత్మంటే జీవవాయువు కాదు. దాని జోలికెళితే అంతా కొరికేస్తుంది. అటెళ్ళి ఎందుకు తిప్పలు తెచ్చుకుాంరు?! దానినలా వదిలేయండి. ఎలాగూ పట్టుకున్నారు గనుక ఒక్క ముక్క చెప్పాలి. మీరు ప్రచురించిన అర శ్లోకంలోనే అనేక తప్పులున్నాయి. మీకు సంస్కృతం రాదనేగాక ఫ్రూపులు దిద్దినవానికీ రాదని, కనీసం ఆ శ్లోకాన్ని దగ్గరెట్టుకునైనా ఫ్రూపులు దిద్దాలన్న సోయకూడా అతనికి లేదని సానుభూతితోనే చెబుతున్నాను.
శ్లో||    జాతస్య హిధ్రువో మృత్యుః | ధ్రువం జన్మ మృతస్యచ |
    తస్మాదపరిహార్యే-ర్థే నత్వం శోచితు మర్హసి || భ.గీ. 2:27.
3. యేసు క్రీస్తు అవతారం ( పుట -6)
మంత్రం : ''విహ్వ్యా గోప్తారం మహ క్యాదదిన హవ్యాయాన పర్యాతాసీన్‌''
భావం : అవతరించబోవు వాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించును.
సురేంద్ర : కణితీ ! ఇదేమి మంత్రము? ఎక్కడిది? ముందూ వెనుకలుండవా? ఉట్టంకించేటప్పుడు అదెక్కడ ఉందో చెప్పవద్దా? ఇంతలేసి వంకర పోకడలు పోతూ పైగా మంత్రములోని 'మధ్య ముక్కకు అర్థం అవతరించేవాడు కన్యకకు పశువుల కొట్టంలో పుడతాడు'' అని చెబుతారా? ఇలాిం మురికిని తలకెత్తుకుని మందికి పూద్దామనే ఆవేశం మీకెందుకండీ! మీ బైబిలేదో మీరు చెప్పుకోవచ్చుకదా?!
యోచనాశీలురైన పాఠక మిత్రులారా ! ఇంకా మరికొంత మందివీ ఇలాిం గబ్బు రాతలున్నాయి. వారందరికీ ఈ సంచిక పంపుతాను. తెలీని విషయాలు చెప్పకూడదనీ, తప్పు భావాలు సమాజంలోకి వదలడం శిక్షార్హమైన నేరమని, మనుషులను అపమార్గానికి మళ్ళించడం క్రూరమైన పని అని అందరం గమనించుకుంటే మంచిది. సంచిక ఇప్పికే పెద్దదైంది. స్థలాభావం రీత్యా ఇప్పికి దీనిని ఆపుతున్నాను. ఏమాత్రం నిజాయితీ, సామాజిక బాద్యత ఉన్నా ఇలాి రచనలు చేసిన వారిని వారి రచనలను ముందుగా వెనక్కి తీసుకోవలసిందిగానూ, ఆపై విజ్ఞుల సమక్షంలో నిజనిర్ధారణకు కూర్చోడానికి సిద్ధం కావలసిందిగానూ విజ్ఞప్తిచేస్తూ ముగిస్తున్నాను. నిజనిర్ధారణ వేదికలో ఎలా నిర్ధారణ అయిందో అలా స్వీకరించడానికి నేను సిద్ధం. మీరేమిో తేల్చండి ముందు.
- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

No comments:

Post a Comment