Monday, April 25, 2016

శాస్త్రీయ దృక్పథంపై చర్చాపత్రం - యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు

శాస్త్రీయ దృక్పథంపై చర్చాపత్రం

భారత రాజ్యాంగలోని అధికరణం 51(ఎ)హెచ్‌ ప్రకారం ''శాస్త్రీయ స్పృహను, కలిగి ఉండడంలో స్థిరత్వాన్ని (గ్టితనాన్ని) కలిగి ఉండడం. మానవవాదాన్ని, పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం ప్రతి భారత పౌరుని విధి'' అని వ్రాయబడి ఉంది. శాస్త్రీయ స్పృహను, పరిశీలనా తత్వాన్ని కలిగి ఉండడమంటేనే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం అని అర్థం. 'దృక్పథం' అంటే చూసే తీరు. 'శాస్త్రీయ' అంటే సరైన అని అర్థం. అంటే 'శాస్త్రీయ దృక్పథం' అన్నదానికి సరిగా చూసేతీరు అని అర్థము అన్నమాట. 'సరిగా' అంటే 'ఉన్నది ఉన్నట్లుగా' అనే అర్థమే కాని మంచిని చూడడం, మంచిగా చూడడం అని కాదు. సరిగా చూడడం అంటే వాస్తవాలనాధారంగా చేసుకొని చూడడం. అలా చూడడానికి, నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధపడే వైఖరినే శాస్త్రీయ దృక్పథం అనాలి. శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా తత్వము లోపించినందువలననే ప్రజలు మూఢనమ్మకాల ప్రభావానికి గురఅవుతున్నారని చాలామంది అభ్యుదయవాదుల అభిప్రాయం. నా అభిప్రాయంలో కేవలం మూఢనమ్మకాల వ్యాప్తియే కాక, సమాజంలో మనిషి తనకు తానే కొనితెచ్చి పెట్టుకుంటున్న మరియు సాి మనుషులకు కూడా కలిగిస్తున్న సమస్యలన్నింకీ కూడా సమాజంలో ఈ శాస్త్రీయ దృక్పథము  లోపించడమే కారణం. అందువలన దీనియొక్క అవసరము ఆస్తికులు, నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, సామ్యవాదులు అనే కొంతమందికే పరిమితముగా కాక మానవులందరికీ అవసరమైనదిగా చెప్పవచ్చు. ఏమతమును అనుసరిస్తున్న వాడు? అసలు ఏ మతాన్నైనా అనుసరిస్తున్న వాడా లేదా అన్న దానితో నిమిత్తమే లేకుండా ఈ శాస్త్రీయ దృక్పథము యొక్క ఆవశ్యకత విస్తృతమై ఉంది. కాని మతస్తులలోను, ఆస్తికులలోను ఈ దృక్పథము లేనందువల్లనే సమస్యలన్నింకీ మూలకారణమని అభ్యుదయ వాదుల అభిప్రాయము. కాని ఈ విషయములో సమాజ అభ్యున్నతి సాధించాలంటే అందరం కలసి పనిచేయాలని, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని ఐకమత్యంతో పెంపొందించాలనే నిర్ణయానికి రాలేకపోవడానికి ప్రధాన కారణం ఈ అభ్యుదయవాదుల్లోనూ శాస్త్రీయ దృష్టి లోపించడమే కాదా?

ప్రజల్లో మూఢనమ్మకాలను పోగ్టొాలనే హేతువాదులు, నాస్తికులు, సామ్యవాదులు, ఇతర భౌతిక వాదులు కలసి కార్యక్రమాలు చేయలేకపోవడానికి కారణం వారు ఒకరినొకరిని చూసేతీరులో శాస్త్రీయత లేకపోవడమే. ఉదాహరణకు : ఆంధ్రప్రదేవ్‌ హేతువాద సంఘాలు రెండుగాను, తెలంగాణాలో హేతువాద సంఘాలు రెండుగాను, జన విజ్ఞాన వేదికలు మూడుగాను, నాస్తిక సంఘాలు 3, 4 గానో చీలిపోవడానికి శాస్త్రీయ దృష్టి కొంతమంది ఉద్యమకారుల్లో లోపించటం కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ లోపం కేవలం అభ్యుదయ వాదులకే పరిమితం కాదు. రాజకీయ పార్టీలు అంతే. సంప్రదాయ రాజకీయ పార్టీల సంగతి అటుంచితే, సమాజంలో మంచి మార్పుకోసం ప్టుిన లోక్‌సత్తా పార్టీ కూడా రెండు ముక్కలవానిఇి ప్రధాన కారణం శాస్త్రీయ దృక్పథం లోపించడమే. ఇక వామపక్షాల సంగతి చెప్పనే అక్కరలేదు. ఎన్ని ముక్కలుగా మనుగడ సాగిస్తున్నాయో, అసలు మనుగడే లేకుండా పోయినవెన్నో చెప్పలేము. ఇలా సమాజాన్ని ముక్కలు ముక్కలుగా మనమే విడగొట్టుకుంటూ ఎవరికి వారు గిరిగీసుకుంటూ తమ 'వాదాలే' శాస్త్రీయమైనవి అనే అభిప్రాయంతో ఉంటే ఆశిస్తున్న మార్పు ఎలా వస్తుంది? ఎవరి వాదం శాస్త్రీయమో, ఎవరి వాదం అశాస్త్రీయమో తేల్చుకోవడానికి ఏ ప్రమాణాలను అనుసరించాలి? అంగీకరించాలి. ఆ కొలతల విషయంలో ఒకరికొకరికి అంగీకారం కుదరనంతవరకు, ఐకమత్యంతో కార్యక్రమాలు నిర్వహించుకోవడం కష్టమవుతుంది. అడపాదడపా అంటే దభోల్కర్‌ లాిం వాళ్ళు హత్యలు చేయబడితేనో, మురుగన్‌ లాిం వారిమీద దాడి జరిగిందనో, నరిశ్టెి కోమల, తస్లీమా నస్రీన్‌ లాిం వారి మీద దాడి జరిగిందనో విషయాలపై కొంతమంది తమకుతామే ఒక ప్రత్యేక ఆవరణలో పరిమితంగా సమావేశాలవుతూ, అటువిం సంఘటనలను ఖండిస్తూ, పత్రికా ప్రకటనలిస్తూ అవే 'ఉద్యమంగా' భావిస్తుాంరు. కానీ అవి ఉద్యమంలో చాలా చిన్న బాగం మాత్రమే. కేవలం ఉద్యమకారుల్ని అభివృద్ధి నిరోధక శక్తుల్లో కలవకుండా ఆపగల ప్రభావం మాత్రమే ఆ కార్యక్రమాలు చేయగలవు. కాని సమాజంలో అభ్యుదయం రావాలంటే చేయవలసింది ఎంత పెద్ద కార్యక్రమమో, దానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని వనరులు సమకూర్చుకోవాలో, ఎలాిం కార్యక్రమాలు జరపాలో, ఏమేరకు కలసి పనిచేయాలో అనే వాిపై మనకు సరైన అవగాహన లేకుంటే మనలోనూ శాస్త్రీయ దృక్పథం లోపించిందనేది ఒక చేదునిజం.
కాస్మోపాలిటన్‌ హ్యూమనిజం కావాలనుకొనేవారు, ప్రపంచ కార్మికులారా! ఏకంకండి అని నినదించేవారూ, వసుదైక కుటుంబం కోరుకొనేవారు కూడా వాస్తవంలో  ఒకరికి ఒకరు దూరం జరిగిపోవడానికి ప్రధాన కారణం, తమలో తమకు ఒకరిపట్ల ఒకరికి సరైన అభిప్రాయం లేకపోవడమే. శాస్త్రీయ దృక్పథం గురించి వ్రాయ మొదల్టెి అంతర్గత విభేదాల గురించి గాని, అనైకమత్యం గురించి వ్రాసినట్లనిపించినా ముందుగా మనం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని, అంతర్గత విభేదాలను పరిష్కరించుకొని లేదా కనీస స్థాయికి తగ్గించుకొని ఐకమత్యంగా సమాజంలో 'శాస్త్రీయ దృక్పథాన్ని' పెంపొందించు కార్యక్రమం చేప్టాలన్నదే ఈ వ్యాస సారాంశంగా చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం.                                                                  'శాస్త్రీయ దృక్పథం' అంటే విషయాన్ని సరిగా చూసేతీరు అని అర్థం చెప్పుకున్నాం కదా! మరి మనలో శాస్త్రీయ దృక్పథం లోపిస్తున్నది అంటే మనం సరిగా చూడలేకపోవడం, అర్థంచేసుకోలేక పోవడం జరుగుతున్నదన్నమాట. అలా అంటే ఒకప్టాన ఒప్పుకోబుద్ది అవదు. కారణం మనకు ఉన్న జ్ఞానేంద్రియాలు అన్నీ చక్కగానే పనిచేస్తుంటే సరిగా చూడలేకపోవడమేమి? అనే ప్రశ్న పుడుతుంది. కానీ మన జ్ఞానేంద్రియాలు విషయాల్ని కేవలం చూపించడం వరకే చేస్తాయి. చూసిన విషయాల్ని సరిగా విశ్లేషించుకుంటేనే ఆ విషయాల మధ్య సంబంధము, వాితో మనకున్న సంబంధము సరిగా బోధపడుతుంది. ఆ విశ్లేషణ ఆలోచనా భాగానికి సంబంధించింది. మనం పైన చెప్పుకున్నట్లుగా జ్ఞానేంద్రియాలు ఆలోచించేవి కావు. అవి ఆలోచనకు మూలమైన, అవసరమైన విషయాల్ని మనసుకు ప్టించేవే. కావున ఒక్కమాటలో చెప్పాలంటే మన జ్ఞానేంద్రియాలు ఎంత చక్కగా పనిచేస్తున్నా, మానసిక వ్యాపారం సరిగా లేకుంటే శాస్త్రీయ దృక్పథం అలవడదు. అనగా శాస్త్రీయ దృక్పథం అంటే ఆలోచించే, విశ్లేషించే, నిర్ణయించే తీరుల సమన్వయం అనుకోవచ్చు. అది మానసికం.
సక్రమ ఆలోచన, దానిలో భాగమైన పరిశీలనా విశ్లేషణలు మనకు తెలియనంతవరకు మన ఆలోచనలో శాస్త్రీయత ఉండదు. స్వతంత్రత ఉండదు. ఎదుి వ్యక్తులపైనా, విషయాలపైనా పరిశీలనకు ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాని నేపధ్యంలో చూసేవారు సరైన నిర్ణయాలకు రాలేరు. ఈ విషయాల్ని పరిశీలించే సమయాన ఆయా విషయాలపట్ల, వ్యక్తులపట్ల మనకున్న పూర్వ నిశ్చితాభిప్రాయాల్ని ప్రక్కనప్టోలి. ఆ విషయాలపైన వ్యక్తులపట్ల మనకున్న రాగద్వేషాలకతీతంగా వాిని పరిశీలించాలి. అప్పుడే మనకు వాస్తవం అర్థమవుతుంది. లేకుంటే తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది.
'శాస్త్రీయ దృక్పథం' అనగానే సాధారణంగా అది విజ్ఞాన శాస్త్రమునకు చెందిన ప్రయోగాలు, వాి ఫలితాల ఆధారంగా మనం ఏర్పరచుకోవలసిన ఒక వైఖరిగా అర్థం చేసుకుాంం. అంటే శాస్త్రీయ పద్ధతిలో పరిశీలన, ప్రయోగం జరిపి, వాి ఫలితాలను విశ్లేషించుకొని, నిర్ణయించుకొనే వైఖరి అనుకుాంము. కాని శాస్త్రవిజ్ఞానం, లేబరేటరీ ప్రయోగాలు, ఫలితాలు మాత్రమే కాకుండా సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని చూసేటప్పుడు శాస్త్రీయ దృష్టినే కలిగి ఉండాలి. ఇది అట్లుంచితే మతానుసారుల్ని, మూఢనమ్మకాలను అనుసరించేవారిని కలుపుకు పోయి వారిలో సరియైన అవగాహన పెంపొందించానికి బదులుగా వారిని తీవ్రంగా విమర్శిస్తూ, దూషిస్తూ, వారికి దూరంగా ఉంటూ వారు మారాలని ఆశించటం వింవి ఉద్యమం పట్ల ఉన్న అశాస్త్రీయ దృక్పథ ఫలితాలే.
అంతేకాదు ఉద్యమకారుల్లో అధికశాతం మందికి సమయపాలన పట్ల ఉన్న దృక్పథం కూడా అశాస్త్రీయమైనదే. ఇండియన్స్‌ పంక్చువాలి అంటే ఏ పనీ కూడా చేయవలసిన సమయంలో చేయకపోవడం అనే అర్థం స్థిరపడిపోయిందంటే ఉద్యమకారులకు కూడా నిర్ధిష్ట సమయం పట్ల ఎలాిం దృక్పథం ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశాలకు వచ్చేవారిలో అధికశాతం మంది  రావలసిన సమయం కంటే కనీసం ఒక గంట ఆలస్యంగా వస్తుాంరు. మరి నాయకులైతే అసలు ఏ టైముకు వస్తారో ఎవరికి తెలియదు. ముందుగా వచ్చినవారైనా నాయకులు వచ్చేదాకా అనుకున్న సమయం ప్రకారం కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. ఆ నాయకులు కూడా కార్యక్రమమంతా ఉంారా అంటే అదీ చెప్పలేము. 10% సమయాన్ని గడిపి వెళ్ళిపోతారు. వారితోపాటే వచ్చిన వారు వారి దర్శనం కోసం వచ్చినవారు కూడా వారితోబాటే వెళ్ళిపోతారు. అంతా మొక్కుబడి వ్యవహారమే. కార్యక్రమ నిర్వాహకులు ఒకికి పదిసార్లు ఫోన్లు చేస్తేనే హాజరవుతూ ఆ తరువాత భవిష్యత్‌ కార్యక్రమాల గురించి ఏ మాత్రం ప్టించుకోని వారికి ఉద్యమం అంటే శాస్త్రీయ దృక్పథం ఉందని ఎలా అనుకోగలం.
సామాజిక వ్యవహారాల్లో మనకు కనిపించే ఈ అశాస్త్రీయ దృక్పథం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన పద్ధతిలో సాధారణంగా ప్రయోగశాలలో ప్రయోగాలు, పునఃప్రయోగాలు ఉన్నట్లుగా సామాజిక ఉద్యమాలలో జరగదు. అంతేగాక అవి సామాజిక ఉద్యమకారుల పరిధిలోకి రావు. వారిపని ఆయా శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలను సామాజిక తత్వశాస్త్రానికి అన్వయించుకొని సమాజంలో మార్పుకోసం ప్రయత్నించడమే. అంతేకాదు శాస్త్ర విజ్ఞానానికే పెద్దపీట వేయాలనే వారుకూడా కొన్ని సందర్భాలలో శాస్త్రీయ దృక్పథాన్ని విడిచిపెడతారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు ఒక్క ఉదాహరణ చూద్దాం. మతాలు మార్పుని అంగీకరించవు. పైగా ప్రతిఘిస్తాయి. కాని (విజ్ఞాన శాస్త్రం) ప్రయోగం, పునఃప్రయోగాల ద్వారా అవసరమైతే తన పూర్వనిర్ణయాలని మార్చుకుంటుంది అనిచెప్తాం, వాస్తవానికి అనుగుణంగా అవసరమైతే మన నిర్ణయాలను మార్చుకోవడం శాస్త్రీయ పద్ధతి. అలా మార్చుకోవడానికి సంసిద్దులై ఉండడం శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం. అలా లేకుంటే ముఖ్యంగా అధికారంలో ఉండే నాయకులు వారిచేత పాలింపబడే ప్రజలందరూ ఆ అశాస్త్రీయ వైఖరి ఫలితాలను అనుభవించక తప్పదు. ఉదా: రాష్ట్ర విభజన జరిగి రాజధానిని నిర్ణయించే సందర్భంలో ముందుముందు జరగబోయే అభివృద్ధి శాస్త్రీయంగా ఉండాలి. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అబివృద్ధి అంతా హైదరాబాద్‌ ప్రాంతంలో జరిపి కొనితెచ్చుకున్న ముప్పు మరలా రాకూడదు. అంటూ శివరామకృష్ణన్‌ కమిీని వెయ్యటం జరిగింది. కాని ఆచరణలో ఆ కమిీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి 'వాస్తును' ఆధారంగా చేసుకుని 'అమరావతి' ప్రాంతంలో రాజధానిని ఎంపికచేయటం జరిగింది. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమయ్యేట్లుగా సుమారు 35,000 ఎకరాలు పంటపొలాలు రైతుల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా సమీకరించడం జరిగింది. లోగుట్టుగా రాజకీయ నాయకుల వ్యక్తిగత లబ్దిలు ఉన్నప్పికీ 'వాస్తు' అనే మూఢనమ్మకము మీద ఆధారపడి తీసకున్న నిర్ణయము ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరిమీద శాశ్వత ప్రభావమును చూపబోతోంది. అదేమాదిరిగా పాలకుల నమ్మకాల కొరకు ప్రజాధనం ఖర్చవుతూనే ఉంది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, వారి కుటుంబాలతో, సిబ్బందితో లెక్కలేనన్ని సార్లు దేశంలోని దేవాలయాల్ని దర్శించినందువల్ల కోట్లరూపాయల వ్యయం అవుతోంది. 'లౌకిక' రాజ్యాంగం అన్నపేరేకాని భూమిపూజలు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కార్యాలయాల నిర్మాణాలు, పదవీస్వీకారోత్సవాలు, ప్రమాణస్వీకారోత్సవాలు అన్నీ 'హిందూమత విశ్వాసాల' ఆధారంగానే నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. ఇదేకాకుండా సమ్మక్క, సారక్క జాతర్లకు, బతకమ్మ పండగలకు, గణేష్‌ ఉత్సవాలకు, భద్రాచలం రాముని కళ్యాణానికి, యాదగిరి నరశింహస్వామి కళ్యాణానికి ప్రభుత్వం ఖర్చుపెడుతున్నదంతా ప్రజాధనమే. ఇంకా చెప్పాలంటే శబరిమలై యాత్రికులకు, భవానీ భక్తులకు, హజ్‌ యాత్రికులకు, అమరనాథ్‌ యాత్రికులకు, పుషర్రాల ఏర్పాట్లకై ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది ప్రజాధనమే. ఎంత ధనం? ఎంత ఇంధనం? ఎంత సిబ్బంది? వారి జీతభత్యాల రూపంలో కలిపి సుమారు ప్రతి ఏడాది వేలకోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తెయితే కేరళ ప్రభుత్వం 'మకరజ్యోతి' ముసుగులో భక్తులకు చేస్తున్నది మోసమే. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే దూరపు కొండల్లో మంటలు వెలిగించి అదే మకర జ్యోతి అనే భ్రమలు కల్పించి భక్తిపేరుతో ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును వృధాపర్చటం విం అకృత్యాన్ని పోల్చడానికి భాషలో పదాలు చాలవు. ప్రతి సంవత్సరము ఉగాదినాి పంచాగం శ్రవణాలు విన్న ఎవరికైనా అవి ఎంత భాజు శాస్త్రాలో అర్థమైపోతాయి. వాి నిర్వహణకూ ఫ్రభుత్వ ఖర్చే. ఈ ఖర్చుల్లో అయినా నిజాయితీ, నిజమైన భక్తీ ఉంాయని ఆశించడం మన అమాయకత్వం.
దేవాలయాల వద్ద అమాయకపు భక్తులను మోసం చేసినట్లే ఈ భక్తి కార్యక్రమాల నిర్వహణలో కాంాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకుడు దేవుని కనుసన్నలలోనే ప్రజలసొమ్ము బొక్కేస్తుాంరు. వారునమ్మే దేవుణ్ణి గుడ్డివాడు అనటం కంటే నిర్వికారుడని చెప్పవచ్చు. ఏం జరుగుతున్నా ఏమీ ప్టించుకోడని భక్తులకు తెలుసు, పూజారులకు తెలుసు, ఆలయ నిర్వాహకులకు తెలుసు. అయినా సామాన్య ప్రజలు నోరెత్తకపోవడానికి కారణం వారిలో శాస్త్రీయ దృక్పథం లోపించడమే. కానీ దీనిని ప్రతిఘించాల్సిన అభ్యుదయవాదులు కూడా మౌన ప్రేక్షకపాత్ర వహిస్తారు. కారణం వారిలోనూ ఐకమత్యం లేకపోవడమే. దానికి కారణం దృక్పథాల్లో అశాస్త్రీయత చోటుచేసుకోవడమే.
బూటకపు స్వస్తత కూాల నిర్వహణతో మతమార్పిడికి పాల్పడుతోంది ఒకమతం. ఉగ్రవాద దాడులతో ఒకవైపు, ఇతర మతాలను విమర్శిస్తూ మరోవైపు ప్రపంచమంతా తమమతమే ఉండాలనే ఉన్మాదంతో మరొక మతం రెచ్చిపోతుంటే ప్రపంచం మారణహోమం వైపుకు క్రమంగా దగ్గరవుతోంది. దేశంలోనూ అనేక చోట్ల మత ఘర్షణలు చోటుచేసుకొంటున్నాయి. రాజకీయాల్లో ధనం, కులం, మతం పాత్రే ఎక్కువగా ఉంోంది. వాస్తవం ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితులు మారితే అన్నీ సర్దుకుాంయన్నది ఒక సిద్ధాంత దృక్పథమైతే, నాస్తికత్వమే సర్వరోగ నివారిణి అన్నది మరొక దృక్పథం. ప్రజాస్వామ్యం ద్వారానే మార్పు సాధ్యమన్నది ఒక దృక్పథమైతే, సాయుధ పోరాటం ద్వారానే శాంతి నెలకొల్పవచ్చనేది మరొక దృక్పథం. ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా మార్పు సాధ్యమన్నది ఒక దృక్పథమైతే అధికారం ద్వారానే మార్పు సాధించవచ్చన్నది మరొక దృక్పథం ఇలా అనేక రకాల సామాజిక దృక్పథాలలో ఏది శాస్త్రీయమో తేలనంతకాలం, తేల్చుకోనంతకాలం మేథావుల అంటే ఆలోచనాపరుల ఆచరణంతా బలహీనంగానే సాగుతుంది. వాస్తవికతల ప్రాతిపదికలపై ఆధారపడి ఏది శాస్త్రీయమో మరియు ఆచరణ సాధ్యమో అలాిం కార్యక్రమాల్ని ఎంచుకుని మరి కలిసికట్టుగా నిర్వహించుకొని ఆశించిన ఫలితాల్ని సాధిద్దాం.
 - యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు, 9490880543

No comments:

Post a Comment