Friday, July 15, 2016

హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 7

హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 7

యోచనాశీలురైన మిత్రులారా! వివేకపథం 198లో 'హేతువాద ఉద్యమావశ్యకత - ఒక పరిశీలన' అన్న శీర్షికతో నేను ఒక వ్యాసం వ్రాశాను. అందులో, హేతువాదికి ఏ గ్రంథమూ, ఏ సైద్దాంతికుడూ ప్రమాణంకారాదు అన్న విషయంలో వెంకటాద్రి గారితో నాకు భావసారూప్యత ఉంది అన్నాను. అంతేగాక, ప్రశ్నించడానికీ, ప్రశ్నింపబడడానికీ కూడా హేతువాది సిద్దంగా ఉండాలి, అనీ వ్రాశాను.

నిజానికి హేతుబద్దాలోచన అన్నది ప్రతి వ్యక్తికీ నిత్యజీవితావసరం. అలాగే హేతువాద ఉద్యమం అన్ని ఉద్యమాలకు ఊతాన్నీ, బలాన్నీ ఇవ్వగల పునాది ఉద్యమం. యోచనాశీలురైన ఆయా సైద్దాంతికులకు 'హేతుబద్దాలోచన' అన్నది గాని లేకుండుంటే, ఏ సిద్దాంతాలూ పుట్టుండేవి కావు. వైజ్ఞానిక క్షేత్రాలు, హేతుబద్దాలోచనా సామర్థ్యంతోనే పరికల్పనలను రూపొందించుకుంటాయి. ఆ పైన ప్రయోగరీత్యా వాటిని పరీక్షించి సరిచూసుకుంటుంటాయి. కనుక ప్రతి వైజ్ఞానిక ప్రయోగం వెనుకా హేతుబద్దాలోచన అన్నది అనివార్యంగా చోటు చేసుకుని, ఆద్యంతమూ - ప్రయోగపు ఆరంభం నుండి ముగింపు పర్యంతమూ పని చేస్తూనే ఉంటుంది. హేతుబద్దాలోచనలేని జీవితాన్ని ఊహించడమే సాధ్యపడదు. వర్తమానంలో నుండి భవిష్యత్తులోకి కదలాలన్నా, గతంలోకి తొంగి చూడాలన్నా మనిషికి హేతుబద్దాలోచన తప్ప గత్యంతరం లేదు. కనుక మనిషి బ్రతికున్నంతవరకూ; నిజానికి జంగమాలైన - కదిలే - ప్రాణులన్నింటికీ, హేతుబద్దాలోచనతో పని ఉంటుంది.

సమాజపునర్నిర్మాణ కార్యక్రమం తలలను సంస్కరించుకోవడం, సంస్కరించడంతోనే.. మొదలవ్వాలి. ఆ పనికై హేతువాద ఉద్యమం తనవంతుగా మార్గదర్శక పాత్ర పోషించాల్సి ఉంది. అనీ వ్రాశాను. 1984 ప్రాంతాల నుండి ఈ నాటివరకు హేతువాద ఉద్యమాన్ని పరిశీలిస్తుండడం, కొంతకాలం హేతువాద ఉద్యమ ప్రముఖులతో అతి సన్నిహితంగా కలసి ఉంటూ అనేక కార్యక్రమాలనూ చేసి ఉండడం, గుత్తా రాధాకృష్ణగారు, వారి బృందంలోని ముఖ్యులతోనూ, ఎన్‌.వి. బ్రహ్మంగారు వారి మిత్రులతోనూ, వెంకటాద్రిగారి బృందంలోని అనేకులతోనూ అనేక విషయాలపై చర్చలు, సంభాషణలు చేసి ఉండడం, గుత్తా రాధాకృష్ణ గారూ హేతువాద ఉద్యమం క్రమంగా బలహీనపడిపోతోందని పలుమార్లు నాతో అని ఉండడం. ఆయన మరణానంతరం ఒక హేతువాద సంస్థ సంస్థగాస్థబ్దతకులోనై పోవడం, ఆ విషయాన్ని ఆపక్షంలోని ప్రముఖులే నాతో అని ఉండడం, ఇటు వెంకటాద్రి గారి మిత్రులతో సహచరులతో కూడిన హేతువాద సంఘంలోని అంతర్గత విభేధాలను నేను ప్రత్యక్షంగా గమనించడం, నేరుగా ఆయా వ్యక్తులే నాకు చెప్పడం, ఇలాటివే మరికొన్ని వాస్తవాలనూ క్రోడీకరించుకుని నేనో అభిప్రాయానికి వచ్చాను. దానినే 198 సంచికలో ''హేతువాద ఉద్యమం తిరిగి కోలుకోలేనంతగా పడకనపడిందన్న నిర్ణయానికి వచ్చాను నేను'' అని రాశాను.
''మరల మరో గెలుకులాటా'' అన్న శీర్షికతో మేడూరి సత్యన్నారాయణగారు హేతువాది(337)లో ఒక వ్యాసం వ్రాశారు. అందులో వారు ఒకింత దూకుడుగా, వ్యక్తిగత విమర్శకూ దిగడంతో వివేకపథం -201లో

గమనిక :- హేతువాద పునరుజ్జీవన యత్నాలపై కామెంట్‌ చేసిన హేతువాద మిత్రులకు ఒక సూచన అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగక, విషయపరంగా ఎంత చర్చిస్తే అంత విషయావగాహన పెంపొందించుకునే వీలుంటుంది. కనుక విషయ పరంగా విమర్శ చేయండని ప్రకటించాను.

దీని విషయంలోనే, హేతువాది, వివేకపథం అన్న రెండు పత్రికలనూ శ్రద్ద పెట్టి చదువుతుంటే వారూ, తనను హేతువాదిగనే భావించుకుంటుండేవారూ అయిన రాజేంద్రప్రసాద్‌గారున్నూ, ఇలాటి విమర్శలు ఉద్యమానికి మేలు చేయవనీ, ఆయనలా రాయడం తన్ను కలవరపరచిందనీ వ్రాశారు. వివేకపధం -202 సంచికలో ఆ వివరాలున్నై.

ఆ సంచికలోనే హే.పు యత్నాలు -4 అన్న వ్యాసంలో, హేతువాదోద్యమ సాఫల్యతంతా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనా శీలత కలిగిన వారినిగా రూపొందించడం దగ్గరే ఉంది... అది నెరవేరాలంటే వ్యక్తి (హేతువాది); వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్నవాటికి సంబంధించి శాస్త్రీయమైన - సరైన - సమాచారాన్ని ఆర్జించుకుని ఉండాలి. ఆ పని సవ్యంగా జరగాలంటే అధ్యయనం తప్పని సరి.

ముందు మన తలలోని బూజు దులుపుకోకుండా, సరైన సరుకులు నింపుకోకుండా, సమాజానికి దీని నందించాలన్న తపనలేకుండా మనలో ఏ వ్యక్తీ యోగ్యమైన హేతువాదిగా మనలేడు. కనుక మిత్రులారా! అధ్యయనపరులుకండి అంటూ వ్రాశాను. అదే సంచికలో హేతువాద ఉద్యమ గీతం రూపంలో హేతుబద్దాలోచన అవసరమేమిటో... జీవితంలో (సమాజంలో) అది నిర్వహిస్తున్న పాత్రేమిటోనూ, నా పక్షాన్ని స్పష్టంగా వెలిబుచ్చాను. 198 సంచికలో ప్రస్తావించిన ముఖ్యమైన పదాలకు అర్ధాలు నిర్వచనాత్మకంగానూ, కొన్నింటికి వివరణాత్మకంగానూ వ్రాశాను.

దానిపై హేతువాది - నవంబరు సంచిక - 340లో రావిపూడి వారి మూడు వ్యాసాలు వచ్చాయి. 1) జ్ఞానము, సత్యము - సాపేక్షకత, 2. హేతుత్వం - సంకల్పం 3) హేతువాదం - కార్యకారణత - జ్యానం - సత్యం - స్వేచ్చ వాటిని చదివాక వివేకపథం - 203లో, హేతువాది 340 ఎడిటోరియల్‌ పై ఒక అభిప్రాయాన్ని ప్రకటించాను. ఆ హేతువాదిలో, నాకంగీకారమైన భావాలూ, అంగీకారం కాని భావాలూ, కొన్ని భాషాదోషాలు, నన్ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు దూకుడును కనబరుస్తూ వ్రాసిన వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అన్నదే ఆ వాక్యం. ఆ నా మాటలకు ఆధారాలు చూపడం నా బాధ్యతే కనుక, రావిపూడి వారి వ్యాసస్థ విషయాల్ని అక్కడే కొంత మేర విశ్లేషించాను.

ఒక్కమాట! ఆ నా వ్యాసంలో విషయపరంగా వెంకటాద్రిగారి రచనను విశ్లేషించే పని చేశానేగాని, వ్యక్తిపరంగా ఒక దుందుడుకు మాటా అనలేదు నేను. ఇక్కడికిది నిజమో కాదో వాటినిచూసి గమనించండి. ఆ సంచికలోనే;

''హేతువాద సంపాదకవర్గానికి మరోసారి విజ్ఞప్తి'' అన్న ఉపశీర్షికన వారికి మరోసారి విజ్ఞప్తి చేశాను. 'మరల మరోగెలుకులాటా అంటూ శీర్షిక పెట్టి మీరు ప్రచురించిన వ్యాసం చూసిన వెంటనే వ్యంగ్యొక్తులూ, వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా విషయ పరమైన విమర్శకు సిద్దపడడం సరైందవుతుంది, అలాటి విమర్శకు పూనుకోండి, అని మీకు తెలియజేశాను. ఈ సంచిక చూశాక, మీరు ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదని అర్ధమైంది. అయినా దీనినీ పట్టించుకోకుండా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంచికలో వెంకటాద్రిగారి పేరున వచ్చిన రెండు రచనల్లోనూ వ్యంగ్యంతో కూడిన విసుర్లు చాలాఉన్నాయి. సంపాదకీయంలో; సత్యానికి అర్థమేమిటి? శంకరాచార్యుని సత్యానికి అర్ధమేమిటి? పెళ్ళాం బిడ్డల్ని అమ్ముకుని అప్పుతీర్చాడన్న పొర్జరీ హరిశ్చంద్రనాటకంలోని సత్యానికి అర్థమేమిటి. సత్యాన్వేషణ పేరుతో నానాతంటాలు పడుతున్న వారి సత్యానికి అర్థమేమిటి? సత్యంగోపన్న గొంగళికాదు. నాటకాలతో బూటకాలతో దానికి తెరలేవదు. అన్నమాటలున్నాయి.

సత్యమంటే ఏమిటన్న విషయంలో మీరుగాని, నేనుగానీ, మరెవరు గాని చర్చించకుకోడానికి ఇలాంటి భాష అవసరమా? విమర్శ, విమర్శకుడూ రచయితకు మిత్రుడేనన్న గతంలోని మీ మాటలకు, ఈ రాతలకు అనుగుణ్యత ఉందా ఏమైనా?!

విజ్ఞప్తి : వ్యంగ్యం మనకొద్దు. వ్యక్తిగత విమర్శలూ అనవసరం. విషయ విమర్శ ఎంత ఘాటుగా, సూటిగా ఉన్నామేలే అన్న అభిప్రాయాన్ని ప్రకటించాను అక్కడే.

ఆ తరువాత హేతువాది సంచిక 342లో రాయ్‌ని దృష్టిలో పెట్టుకుని రావిపూడి మూడు వ్యాసాలు వ్రాశారు. అందులోనూ నాకు అంగీకారమైన భావాలు కొన్ని ఉన్నాయి. అంగీకారం కానివి కొన్ని, విచారించాల్సినవి మరి కొన్ని ఉన్నాయి. అందులో విచారించాల్సిన భాగంలో, మండలి కార్యక్షేత్రంలో ప్రధానంగా చూడబడుతున్న జ్ఞాన సిద్దాంతం పేరున ఆయన వెలిబుచ్చిన అంశాలూ ఉన్నాయి. జ్ఞాన సిద్దాంతాన్ని రాయ్‌ శాస్త్రీయ స్థాయిలో వివరించాడన్నారు. ఆ వివరాలెక్కడున్నాయో చూడాల్సి ఉంది.

అదే సంచికలో భావవిప్లవం అన్న వ్యాసంలో, కొందరు అతితెలివి కలవాళ్ళు, లేని దేవుణ్ణి లేడని రుజువు చేయమని సవాళ్ళు విసురుతారు. అన్నారు. ఈ మాట సాధారణీకరించి అన్నదా? ఖచ్చితంగా ఆ మాటలు ఆయనతోనే ఎవరో అని ఉండి, వాళ్ళనుద్దేశించి అన్నదా? రావిపూడి వారే చెప్పాలి. ఈ మాట ఆయన ఎవరినుద్దేశించి అన్నా వ్యంగ్యంగా అన్నది మాత్రమే. ఆ పేరాలోనే నిజానికి దేవుడున్నాడంటున్నవాళ్ళే అతడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో రుజువు చేయాలి. అనీ అన్నారు. ఈ మాట నాకు 100% ఆమోదయోగ్యమైనదే. ఎందుకంటే నిర్ధారణ నియమాలకు సంబంధించిన నియమం అది. ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని నిరూపించే బాధ్యత వహించాలి అన్నదే ఆ నియమం. ఆ నియమం ఉన్నాడన్న వాళ్ళకే గాక, లేడంటున్నవాళ్ళకూ వర్తిస్తుంది. ఇంకా సరిగా చెప్పాలంటే ఏ సిద్దాంతాలకైనా వర్తించే సాధారణ నియమం అది.

లేదనేవాళ్ళను లేదని రుజువు చేయమనే అజ్ఞులను దగాకోర్లని అర్థం చేసుకోవాలా? లేదా? అన్న మరో వాక్యమూ ఉంది అక్కడే. ఇది నాలెఖ్ఖన ఆయనతో మాట్లాడాక నిర్ణయించాలి. విచారణకు వారు సిద్ధపడితే భాషా దోషమో, భావ దోషమో ఏదో ఒకటి చోటు చేసుకుని ఉందిక్కడ అని తేల్చగలను.

ఇక వివేకపథం - 204 సంచికలో అటు శాస్త్రీయ దృక్పథం అన్న దానిపైనా, ఇటు హేతువాదం సిద్దాంతమే అన్నదానిపైనా, నా దృష్టి కోణం నుండి అనేక వివరాలు పాఠకుల ముందుంచాను. ఆఖరున ఆ సంచిక 16వ పేజీలో మళ్ళీ మరో మారంటూ ఇలా వ్రాశాను.

ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అసలు విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో ఒకటి మాట్లాడేయడం ఎక్కువలో ఎక్కువ మందికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.. హేతువాదమన్నది తాత్విక స్థాయికలిగిన సామాజిక దృక్పధాన్ని తెలిపే సిద్దాంతమంటూ నేనిచ్చిన వివరాలలోని దోషమేమిటో నిర్ధారించనైనా నిర్ధారించండి. లేదా మీ పక్షంగా సిద్దాంతమంటే ఏమిటో, హేతువాద మంటే ఏమిటో చెప్పి, హేతువాదం ఎందుకు సిద్దాంతం కాదోనన్నదైనా నిర్ధారించండి. భావ విప్లవం రావాలంటుండే మనం - ఎవరైనా - దోషసహితమైన, లోప సహితమైన భావాలను వదులుకోవడానికీ, సరిచేసుకోవడానికీ, సరైన భావాలను చేర్చుకోవడానికీ నిరంతరం సంసిద్దంగా ఉండాలి. ఎలాటి భేషజాలూ, పొరపొచ్చాలు లేకుండా మంచి భావాలను స్వీకరిస్తుండాలి. అన్నదే ఆ ప్రకటన.

ఆ సంచికలోనే డా|| బి.వి. పట్టాభిరాం గారిపైనా, జ్ఞానానంద అన్నాయనపైనా ఒకింత కటువుగా మాట్లాడాను. వారి అభిప్రాయాలను ఖండించాను. ఆ విషయమై, ఇలా రచయిత పోకడను వేలెత్తిచూపి గమ్మునుండడం బాధ్యతా రాహిత్యమే అవుతుంది నాకైనా, ఎవరికైనా కనుక నా ఈ అభిప్రాయాలు సరైనవేనని నిరూపించే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను అనీ ప్రకటించాను. (204 పి 21-22 చూడండి)

ఇదంతా అయ్యేటప్పటికి హేతువాది ఫిబ్రవరి 2014 సంచిక 343 అందింది. దాన్లో సూటిగా నాతో ముడిపడి ఉన్న అంశాలనూ, నన్ను కూడా పేర్కొంటూ, ప్రతిసారీ నేనేది వద్దంటూ వస్తున్నానో, ఆ పోకడనే మళ్ళీ మరింత ఉధృతంగా మొదలెట్టారు రావిపూడి వారు. అనవసరపు రగడలు రగులుకోకుండ సహనం వహించడానికీ ఒక హద్దుంటుంది. కనుక ఈ వ్యక్తిగత విమర్శలు, వ్యంగ్యోక్తులు, నిందలు, అవహేళనలను  ఇంతటితోనైనా ఆపుజేసి, విషయ విమర్శకు పూనుకోవలసిందిగా మరోమారు రావిపూడి వారికీ ఆ పక్షంలోని ఇతరులకూ కూడా కడసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సంచికలోని రావిపూడి వారి మాటలివిగో,

1)     'ఇదేమి చాపల్యం' అంటూ మొదలెట్టారా వ్యాసాన్ని రావిపూడివారు.

2)     సత్యాన్వేషణ ముసుగేసుకున్న సురేంద్రగారూ, ఇదంతా మిమ్మల్ని ఉద్దేశించి వ్రాస్తున్నదే.

3)     ఒక రచయిత ఒక పదాన్ని ఒక చోట ఏ అర్థంతో వాడాడో ఆ పదాన్ని అలా అర్థం చేసుకోకుండా పెడర్థాన్ని లాగడం చాపల్య మవుతుందే గాని విమర్శకాదు.

4)     పారలాక్సు దోషం లాంటి దోషం మన అవగాహనలో దొర్లితే దాన్ని అవగాహనా చాపల్యమనీ, అన్వయంతో దొర్లితే అన్వయ చాపల్యమనీ అంటాం.

5)     నా రచనల్లోని భావాలను విమర్శించమన్నానంటే, ప్రతి పదాన్ని విరుచుకొనేదీ, విరవమనేది, రచయిత భావాన్ని వంకర తిప్పేదీ విమర్శకాదు.

6)     బొక్కలు లేనిచోట బొక్కలు తవ్వుకుంటూ కూర్చుంటే అది ఛలప్రాయమవుతుంది కాని విమర్శకాదు.

7)     అసలు విషయాన్ని విడచి, పద నిర్వచనాల వాగులో పడి కొట్టుకుపోతూ, పక్కదారులు తొక్కే డుబు డుక్కుల మేళం విమర్శ కాబోదు. అదోక తరహా ఛలచాపల్యం.

8)     విమర్శకులు పదాల అర్థాన్ని అడుక్కునే చాపల్యం నుండి, అర్థం చేసుకోగల వివేకదశకు ఎదగాలి.

9)     కొంటె మాటలతో, కుయుక్తులతో కాసేపు నన్ను పొగొడుతూ, మరికాసేపు తెగడుతూ పేజీలు నింపడం గిల్లిజొలపాడి నట్లుంటుందిగాని, విమర్శకాబోదు.

10)     మీరు సత్యాన్వేషణ పేరుతో నానాతంటాలు పడుతుంటారని నేననడంలో వ్యంగ్యమేముంది? అది నిజమే కదా!

11) 203 వివేక పథంలోని పాయింట్ల వారీ దోకుడంతా అన్వేషణలో భాగమేకదా?

12) నా రచనలో వ్యంగ్యంతో కూడిన విసుర్లు కొన్ని చోటు చేసుకున్నాయని బాధనటించడమెందుకు? నాలి ముచ్చుభాష నాకు అలవాటు లేదు.

13) మీరు మీ దుకాణానికి సత్యాన్వేషణ మండలి అని పేరైతే పెట్టుకున్నారుగాని అందులోని పదాలకు నిర్వచనాలు చెప్పినట్లు గానీ, అర్థాన్వేషణలో పాటుపడినట్లుగానిలేదు.

14) మీరు వాడిన పదాలకు అర్థాలు చెప్పరుగానీ, ఇతరులను మాత్రం అర్థాలు చెప్పమని డిమాండు చేస్తారు.

15) ఒకవేళ మీరింకా అలాంటి పదాలు అర్థం చేసుకోలేని అజ్ఞాన దశలోనే కుమిలిపోతున్నారా?

16) జ్ఞానమెలా కలుగుతుందో నాకు అవగతం కాలేదని... మీరు అనర్థ విసుర్లు గుప్పించారు.

17) ఆ రెండు పేజీల ఎడిటోరియల్‌ శీర్షికనే అర్థం చేసుకోలేని మీరు అర్థాలడుక్కోవడం తప్ప మరేమి చేయగలరు?

18) ఎంతగా అర్థాలు వివరించి చెప్పినా, మరల ఆ 'పదార్థాల' మీద మీ ప్రశ్నల ఈగలు వాలకుండా ఉంటాయా?

19) మీ ప్రశ్నించే వైఖరి సినీహాస్యనటుల నోట వినిపిస్తుంది.

20) సందర్భాన్ని బట్టి అందరకూ అర్థం కాగల పదాలకు కొత్త అర్థాలు కూరుస్తూ కూచుంటే భావవ్యక్తీకరణ రొచ్చులో పొర్లించినట్లవుతుంది. ఔగదా?

21) 'పరమం' అంటే ఏమిటో నేను చెప్పలేదని గొణుగుతున్నారు.

22) మీ కొంటె బుద్ధి, కుంటి బుద్ధి ఒక పదానికి సరిపడే అనువాద రూప ఆంగ్ల పదాన్ని వాడితే అది పదానికి అర్థం చెప్పినట్లు కాదుకదా అనే ప్రశ్న వేసింది. అలాంటివి జ్ఞానం లేని మీ వంటి వారి కొరకు వ్రాసినవికావు.

23) మీకు జ్ఞానమంటే, సిద్దాంతమంటే ఏమిటో తెలియవు.

24) మీ వరసంతా బుడుబుక్కుల మేళమే కదా!

25) మీరు నా మొదటి వాక్యాన్నే పట్టుకుని పీకులాడారు. ఆ పీకులాటనే విమర్శ అని భ్రమపడుతున్నారు.

26) నాకు రచనా నైపుణ్యాన్ని నేర్పాలని తంటాలు పడుతున్నారు.

27) 1978 నాటి నా హేతువాద గ్రంథం మీకర్థమైయ్యుంటే, నా ఎడిటోరియల్‌ మొదటి వాక్యం పై ఇంతగా తెగబడే వారుకాదు.

28) జ్ఞానం ప్రారంభమయ్యే రీతిని నాకు నేర్పడానికి సాహసించే గెలుకులాట రాయుళ్ళ కోసం అది ఉద్దేశింపబడలేదు. అది మీ అళీక పాండిత్యానికి అందేది కూడా కాదు.

29) జ్ఞానానికి ఇంత అంత అంటూ హద్దులేర్పరచి పిట్టం కట్టించడం

30) సరళంగానే అర్థమవుతుండే విషయాలను గుర్తించే విధం, రంధ్రాన్వేషుల పథంలో ఉండదు.

31) భావదారిద్య్రాన్ని దాచుకోడానికి భాషావైకృతినో, ప్రశ్నల దురదనో ఆశ్రయించడం సరైందికాదు.

32) ప్రశ్నలు వేయడానికైనా తత్సంబంధ జ్ఞానం ఉండాలని మీదురాలోచన పరిధిలోకి రాదు.

33) 'నవాబు - బంటు' కధలోలాగా 'ఫిర్‌ - తుర్‌' ఉదంతం లాగా మీ తీరు రూపుదిద్దుకుంది.

34) మీ అంగడిలో మీతోడ్పాటు వారితో కలసి హేతువాద - సిద్ద - అంతం తయారు చేసే కృషిలో ఉన్నారు కదా!

35) హేతువాద ఉద్యమం పడకనపడిందనే సిద్ద అంతాన్ని తయారు చేస్తున్నారు కదా?

36) రాద్దాంతాలు మానుకుని మీ వంటకాలను పూర్తిచేసి కావలసిన వారికి వడ్డించండి.

37) అస్తిత్వానికి బదులు అస్థిత్వమని పదే పదే గెలికే మీకు పదాల విలువ ఎలా తెలుస్తుంది?

38) 'ఇంద్రియార్థ సన్నకర్షణ' అనే న్యాయ సూత్రాన్ని మీరు కాపీ కొట్టినంత మాత్రాన జ్ఞానమెలా కలుగుతుందో మీకు తెలిసినట్లు కాదు.

39) అలాటి అల్పత్వాన్ని నాకు నేర్పడానికి యత్నించడం మరింత అల్పత్వం అవుతుంది.

40) పంచేంద్రియ జ్ఞానం పశువుల సొంతం. భావాలతో ఉద్దీపనకాని జీవితాలు పశుప్రాయాలు.

41) మీ నమో బ్రహ్మాదిభ్యోలను హేతువాది పత్రిక ఏకిపారేసిన తరువాత, మీమేలుకొలుపు పత్రిక పేరు వివేకపథంగా మార్చారు.

42) మీరు మారాలి కాని కుమారిలుడిలా వేషం మారిస్తే చాలదు.

43) మీ వింత పోకడలనే విమర్శలుగా భ్రమించకండి.

యోచనశీలురైన పాఠక మిత్రులారా! రావిపూడి వారు ''ఇదేమి చాపల్యం'' పేరుతో వ్రాసిన 8 పేజీల వ్యాసంలో నాగురించి చేసిన వ్యాఖ్యలివి. ఇంతకూ 203 సంచికలో నేనేమి రాశానో, దానిపై వారి ఈ స్పందన ఎలా సమంజసమవుతోందో మీరూ విచారించండి. ఆ ఒక్క సంచిక చాలదనుకుంటే హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాల పేరిట 198 నెం వివేకపథం నుండి 203వరకు జాగ్రత్తగా పరిశీలించండి. పట్టు బట్టి పరిశీలిస్తాను అనే వాళ్ళకు, విచారణకు సిద్ధపడేవాళ్ళకు, ఆ సంచికల సంపుటిని పంపిస్తాను.

ముఖ్యగమనిక :- హేతువాదాన్ని సిద్దాంతమనే అనాలి అనంటున్నది నేనొక్కణ్ణే కాదు. అనేక మంది ఆలోచనా పరులు ఆ మాటన్నారు. అలా, హేతువాదం (రేషనలిజమ్‌) సిద్దాంతమేనంటున్న వాక్యాలు కొన్ని వ్రాస్తాను పరిశీలించండి.

1)         ఎం.వి. రామూర్తి గారు, రావిపూడి వారి 'హేతువాదాన్ని' ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ అన్న పేరున అనువదిస్తూ అనువాదకుని మాటంటూ వ్రాశారు. అందులో రామూర్తి గారు హేతువాదం ఒక సిద్దాంతమేనన్నారు. ఇవిగో ఆ మాటలు

       The role and Ramifications of Reason are to be delineated. The essence and nature of reason have to be under stood.
2)         Definition of rationalism by the free on line dictionary thesaurus and encyclopedia.
    a)     Philosophy : the theory that the exercise of Reason, rather than experience anthority or spiritual revelation, provides the primary basis of knowledge
3)         collins english dictionary :- Rationalism :- Philosophy
    a)     The doctrine that knowledge about reality can be obtained by reason alone without recourse to experience.
    b)     The doctrine that human knowledge can all be encompassed within a single, usually deductive system.
4)          Random house kemerman webster's college dictionary
    a)     a philosophic doctrine that reason alone is a source of knowledge and is independent of experience.
    b)     a doctrine that all knowledge is expressble in self evident propositions or their consequences.
    c)     a doctrine that human reason, unaided by divine revelation...
5)     1)     The doctrine that knowledge is gained only through the reason, a faculty independent of experiance.
    2)     The doctrine that all knowledge is expressble inself evident...
6)     1)     The rational investigation of questions about existence and knowledge and ethics.
    2)     philosophical doctrine, philosophical theory - a doctrine accepted by adherents to a philosophy.
7)         Rationalism :
    a)     the theological doctrine that human reason rather than
    b)     theological doctrine.
8)     a)     the doctrine that reason is the right basis for regulating conduct.
    b)     doctrine; ism; philosophical system, philosophy, school of thought
9)         Oxford dictionary of philosophy Rationalism : Any philosophy magnifying the role played by unaided reason, in the acquisition and Justification of  knowledge.
10)         A teaching in the theory of knowledge according to which universality and necessity. The logical attributes of true knowledge. cannot be deduced  from experience and its generalisation.  They may be deduced only from the mind itself; either from concepts innovate in the mind (Theory of innovate ideas).
11) a) Rationalism is the philosophical view that regards reason as the chief source and test of knowledge. Rational thinking is the soul factor in rationalism. Rational thinking means thinking with the support of valid suitable  evidence or knowledge or reason with out any projudices.
    b)     Rationalism advocates acceptance of true knowledge and elimenation of beliefs based on the nature of beliefs.
    c)     Rationalism advocates the following principles.
        1.......... 2...... 3........ 4..... 5..... etc
12)         The acceptance of the theory that, all behavior, attitude

యోచనాశీలురైన మిత్రులారా! లోకంలో హేతువాదాన్ని సిద్దాంత మనాల్సిందేనంటున్నది నేన్కొణ్ణే కాదనీ, అనేక నిఘంటువులూ, పెక్కురు తాత్వికులూ ఆ మాటే అన్నారని మీ దృష్టికి తేవడానికే ఈ కొద్దిపాటి వివరాలిక్కడ ఉట్టంకించాను. వాటితో బాటు వెంకటాద్రిగారి 'హేతువాదం అన్న రచననే అనువాదం చేసిన ఎం.వి రామూర్తిగారన్న మాటనూ మీ ముందుంచాను. మీలో ఈ విషయంపై మరింత లోతైన, స్పష్టమైన అవగాహన కలిగించుకోవాలనుకుంటున్నవాళ్ళు, ఇంటర్‌నెట్‌ (అంతర్జాలం)లోకి వెళ్ళి చూడవచ్చు. ఒక్కమాట ! పై ఆధారాలను పట్టిచూస్తే వెనుకటి వాళ్ళలోనూ ఈ విషయమై ఒకింత విచారణ, విశ్లేషణ జరిగిందనే అనిపిస్తోంది. ఇంకో విషయాన్నీ మీరు గమనించడం అవసరం. దీనిని మెథడాలజి (విధానం) అంటున్నవాళ్ళూ ఉన్నారు. ఈ విషయం మీదలాగే, మార్క్సిజం పైనా, 'మార్క్సిజం సిద్దాంతమా? విధానమా?' అన్న చర్చ జరిగింది. గతంలో కొందరు అది సిద్దాంతంకాదు. విధానమేనన్న భావాన్ని వెలిబుచ్చారు. మరి కొందరు సిద్దాంతమన్నారు దానినే. అలా రెండభిప్రాయాలూ ఉన్నాయి గనుకనే వీటి విషయంలో మరింత విచారణ అవసరమైంది

ఇక రాజేంద్రప్రసాద్‌ గారిలాటి వాళ్ళు, ఈ అంశాన్ని మరో కోణం నుండి ఆలోచిస్తున్నారు. వారు దాన్ని సిద్దాంత మంటేనేమి? విధానమంటేనేమి? పేరు సంగతలాఉంచి, విషయాల (అందులోని భావాల) బాగోగుల్ని విచారించుకోవచ్చు కదా! అంటున్నారు. ఈ పోకడ ప్రమాదకరమా? కాదా? అన్నదలా ఉంచితే, సైద్దాంతిక విచారణల సందర్భంలో తప్పని సరిగా నెలకొని ఉండాల్సిన నిక్కచ్చితనం లోపించిందీ వైఖరిలో అనాల్సిందే. సిద్దాంతం కానిదాన్ని సిద్దాంతమేననో, సిద్దాంతాన్ని సిద్దాంతం కాదనో అంటే ఏమిలే! అనుకోవడం ఏ రకంగానూ సరికాదు గదా. అదిన్నీ కాక మనం (హేతువాద పునరుజ్జీవన యత్నాలు చేద్దామనుకుంటున్నవాళ్ళం) ఇప్పుడు హేతువాదం క్రింద ఏమేమి చెప్పాల్సి ఉంటుందో వాటన్నంటినీ గుదిగుచ్చే పని చేద్దామని గదా పూనుకున్నాం? అంటే హేతువాదం క్రిందికి చేరే భావ సంపుటిని (రీలిశి ళితీ రిఖిలిబిరీ ను) తయారు చేద్దామనే కదా! సిద్దాంతమంటే లోకం అంగీకరిస్తున్న, వివిధ వైజ్ఞానిక క్షేత్రాలలో వినియోగంలో ఉన్న అర్థాన్ని బట్టే కదా మనం దీనిని సిద్దాంత మనాలో, అనకూడదో నిర్ధారించాల్సింది? కనుక ముందుగా సిద్దాంత మన్న మాటకున్న అర్థమేమిటో నిర్ధారించుకోవాలి. ఏకాభిప్రాయానికి రాగలగాలి. అప్పుడుమాత్రమే మన మధ్య భావ ప్రసారం, అంటే ఒకరన్నది మరొకరికి అర్థం కావడం సాధ్యపడుతుంది. కనుకనే ముఖ్యమైన పదాలవరకైనా అర్థాలు చెప్పుకోవడం తప్పనిసరి అంటున్నాను. ఈ విషయంలో వెంకటాద్రిగారు, తొలి నుండి అందరికీ అర్థమయ్యే పదాలకు అర్థాలు చెప్పమనడం అనవసరపు పని అన్న ధోరణిలోనే ఉంటున్నారు. కనుకనే ఈ విషయంలో ఏది సరైన విధానమో తెల్సుకునే దిశగా ఒక ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకు పూనుకునేవారికి ముందుగ నేను సూచిస్తున్నదేమిటంటే, నేను అందరికీ అర్ధమయ్యే పదాలన్నింటికీ నిర్వచనాలు, అర్థాలు చెప్పాల్సిందేనని ఎక్కడైనా, ఎప్పుడైనా అన్నానా? సైద్దాంతిక విషయాలకు చెందిన కీలకమైన పదాల వరకు స్పష్టమైన, నిర్థిష్టమైన రీతిలో అర్థాలు చెప్పుకోవాలన్నానా? ఇక్కడ గాని మీరు యథార్థాన్ని పట్టించుకోకుంటే మా యిరువురి పోకడల్లో లోపమో, దోషమో, ఎవరి పక్షంలో ఎక్కడ చోటు చేసుకుని ఉందో గమనించడం కుదరదు. ఇలాటి తాత్విక విచారణల్లో నిస్పాక్షిక దృష్టితో పాటు, నిశిత పరిశీలనాశక్తి, ఆసక్తి అన్నవి కూడా జతపడినప్పుడే, విచారణ జరగాల్సినంత స్థాయిలో జరుగుతుంటుంది.

కానీ విషాదమేమంటే, సూటిగా, నిర్మొగమాటంగా, నిశితంగా, పట్టుదలతో విచారణకు పూనుకునే వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉంటోందీనాడు. నచ్చినా, నచ్చకున్నా, తప్పనిపిస్తున్నా, ఒప్పనిపిస్తున్నా అందునుగుణ్యంగా స్పందించడంలేదు పాఠకులు. ఎక్కువలో ఎక్కువ మంది ఏదో చదివాంలే అనిపించేట్లు చదవడం, ఆలా పారేయడం జరుగుతోంది ఎక్కువసార్లు. మొదలేపట్టించుకోము. ఒకవేళ పట్టించుకున్నా, పట్టుదలగా ఆవిషయంలో ఒక ముగింపుకు వచ్చేదాకా పరిశీలన కొనసాగించము. వివేక పథం పాఠకుల నుండి అవసరమైనంత లేదా తగినంత స్పందన ఉండడం లేదన్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు అనుకోవడం జరిగింది. సుమారు 1000 మందికి వెళుతోంది పత్రిక. దాని విలువ తెలిసి చదివేదెంత మంది? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంటోంది. మరొక్కసారి పత్రికను పంపడం ఆపి, పత్రిక కావాలన్నవారికే పంపుతాం అన్న ప్రకటన చేయడం, దానిని అమలు చేయడం అవసరమనిపిస్తోంది.

భావ విప్లవ క్షేత్రాలలో లేదా తాత్విక స్థాయిలో, వస్తున్న రచనలుగానీ, వాటిని చదువుతున్న పాఠకులుగానీ, నిర్థిష్టత, నిర్థుష్టతలేని భావాలను రాకుండా చూచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కలగాపులగం రచనల్ని ఆహ్వానించి, రచయితల భావాలతో, అభిప్రాయాలతో ప్రచురణకర్తలకు సంబంధం లేదనో, వాటితో మాకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరంలేదనో ఒక చిన్న ప్రకటన చేసి ఊరుకోవడం ఒక వరవడిగా వస్తోంది. ప్రత్యేక లక్ష్యంతో ఆరంభించని పత్రికల విషయంలో ఈ విధానం అవసరమైందీ, సరైందీ కూడా అయినా, సైద్దాంతిక స్థాయి కలిగి, సరైన భావాలనే సమాజానికందించాలన్న లక్ష్యంతో మొదలైకొనసాగే పత్రికలకు మాత్రం ఈ విధానం అనుసరించదగింది కానే కాదు. తాము వెళ్ళడించిన భావాలు సరైనవేనని నిర్థారించే బాధ్యతను స్వీకరించే వారి రచనలనే ప్రచురించడం, అలాటి బాధ్యతను స్వీకరించడానికి సిద్దపడేవారే రచనలు పంపండని ప్రకటించడం, ప్రచురణకర్తలు తామంగీకరించని భావాలు చోటు చేసుకున్న రచనలపై నిస్పాక్షక దృష్టితో విమర్శనూ ప్రచురించడం, విమర్శలను ఆహ్వానించడం చేయగలగాలి. పత్రికల వైఖరులోని ఈ వ్యత్యాసంగాని తెలియకుంటే కాలక్షేపానికి పుట్టుకొచ్చిన పత్రికలకూ, భావజాల సంస్కరణ లక్ష్యంతో మొదలెట్టిన పత్రికలకూ తేడా లేకుండా పోతుంది.

ఉదాహరణకు; ఇటు వివేక పథంగానీ, అటు హేతువాదిగాని చదివే పాఠకుల సంఖ్య రెండు వేలకు పైగా మూడు వేల వరకు ఉండవచ్చు. గత ఆరేడు నెలలుగా రెండు మూడంశాలపై రెండు పత్రికల్లోనూ, భిన్నాభిప్రాయాలు వెళ్ళడవుతూ వస్తున్నేౖ. పరస్పరం ఒకింత ప్రతికూల వైఖరీ కనబరుస్తూ వస్తున్నాయవి. కానీ ఆ పత్రిక పాఠకులనుండి గానీ, ఈ పత్రిక పాఠకుల నుండి గానీ కనీస స్పందనలు కూడా రావడం లేదు. ఇతరేతర ధోరణుల వారి మాటెలా ఉన్నా, హేతువాద తాత్విక ధోరణికి చెందిన వాళ్ళమనుకుంటుండే వారివరకైనా, ప్రశ్నించడాన్ని సమాజానికి నేర్పాలి, విమర్శను ఆహ్వానించాలి. అనంటూ, విమర్శకుడు మిత్రుడవుతాడేగాని, శతృవుకాడు అని చెప్పుకుంటుండే వాళ్ళవరకైనా, ఈ రకమైన తేడాలను పట్టించుకోవడం, పాటించడం చేయగలగాలి. హేతువాది అనడానికి తగినవాడు, వ్యక్తుల్ని (గ్రంథాన్ని) ప్రామాణికంగా తీసుకోరాదు.  విమర్శించడానికిగాని, విమర్శింపబడడానికి గానీ వెనుకాడకూడదు. సిద్దంగా ఉండాలి, పూనుకోవాలి, అన్నది చాలా కీలకమైన భావన. దీనిని మనలో ప్రతివక్కరం ఖచ్చితంగా, తప్పనిసరిగా అలవరచుకోవాలి. వీలయినంత మందికి అలవరచాలి. ఎందుకంటే దానిసరైన అర్థంలో విమర్శ చేయాలంటే, విషయం పట్లలోతైన అవగాహనతో పాటు, రాగద్వేషరహితంగా ఉండగలగడమూ అవసరపడతాయి. ఆ అవసరపు ఒత్తిడే అతణ్ణి అధ్యయన పరుణ్ణి ఆత్మ నియంత్రణ పరుణ్ణిగా తీర్చిదిద్దుతుంది.

విమర్శ - ఖండన -  నింద

మిత్రులారా! పై మూటి అర్థాలు వేరు. అవి వాడవలసిన సందర్భాలూ వేరు వేరే. ఈ విషయంలో మనందరికీ స్పష్టత ఉండడం అవసరం.

విమర్శ : విమర్శించడమంటే లోపాలు, దోషాలు ఎత్తిచూపడం, తప్పులెన్నడం, ఖండించడం, తిట్టడం తిరస్కరించడం అన్న అర్థాలే ప్రధానంగా వాడుకలో ఉంటున్నాయి. నిఘంటువుల్లో (పర్యాయ పదకోశాలలో) ఆ అర్థాలూ ఉన్నప్పటికీ, సైద్దాంతిక స్థాయి కల విషయాలనుగాని, శాస్త్రీయాంశాలనుగాని విమర్శిచడమంటే; భావజాల క్షేత్రాలలో విమర్శచోటు చేసుకోవడమంటే, ప్రస్తావితాంశాలలోని సబబు బేసబబుల్ని వేరు చేసి చూడడం - చూపడం - అన్నమాట. దోషాదోషాలను, లోపాలోపాలను ఎత్తిచూపడమన్నమాట, ''ప్రకరణస్థ గుణదోష పరామర్మో విమర్శః. విమర్శా గుణ దోషవిచారణమ్‌ ! గుణ దోష విచారణ అన్నదేే విమర్శనమన్న మాటకు సరైన అర్థం. లేదా మనలాటి విచారణ క్షేత్రాలు స్వీకరించాల్సిన అర్ధం. అలాటి విమర్శలో ఉన్నది ఉన్నట్లు చూడడం, చూపించడం అన్నదే ప్రధానాశయంగా ఉండాలి. ఉంటుంది కూడా. సరైన విమర్శలో ఎక్కువ చేయడం, తక్కువ చేయడం ఉండకూడదు. 'స్తుతి - నింద' 'పొగడ్త - తెగడ్త' అన్నవి విమర్శలో తప్పని సరైనవి కానేకాదు. కొన్ని అసాధారణ పరిస్థితుల్ని మినహాయించితే అలాటివి అనవసరమైనవి కూడా. ఈ విషయాల్ని చాలాకాలం క్రితమే నేను స్పష్టంగా గమనించి, ఇష్టపడ్డానుగనకనే, సత్యాన్వేషణ మండలి తనకు తాను చెప్పుకునే నియమాలలో, పొగడొద్దు పొగిడించుకోవద్దు - తెగడొద్దు, తెగిడించుకోవద్దు అన్న దానినీ చేర్చుకున్నాము.

విమర్శ :-Criticism  ఆన్న దానికి పలు నిఘంటువులు ఏమి అర్థం - నిర్వచనం - చెప్పాయో చూద్దాం.

I)     Criticism :- The analysis and Judgment of the merits and faults of a literary or artistic work.
    Synonyms : evaluation, essessment, examination, appreciation appraisal, analysis, Judgement.
2)     The expression of a disapproval of some one or something based on perceived faults and mistakes.
3)     The scholary investigation of literary and historical tests to determine their origin or intended form.
4)     Criticism is the practice of judging the merits and faults of some thing or some one in an intelligible way.
5)     In the 20th century all these meanings continued but criticism aquired the more general connotation of voicing an objection, or of appraising the pros and cons of some thing.

సారాంశం :- మిత్రులారా! ఇంటర్‌నెట్‌లోకి వెళ్ళిచూస్తే ఇలాటి నిర్వచనాలు అనేక నిఘంటువుల నుండి ఎత్తి రాసుకోవచ్చు. దాదాపు అవన్నీ, విమర్శ అంటే బాగోగుల 'విశ్లేషణ, నిర్ధారణ' చేసే పద్దతేనని చెపుతున్నాయి. మరోమాట! ఆ నిఘంటువుల్లోని ఒకటి సరైన విమర్శ ఎలా గుండాలంటే అంటూ ఇదిగో ఈ మాటలు చెప్పింది

A good criticism should be.
1) Timely : not too early not too late.
2) brief and succinct : (but sufficiently detailed) with a clear start and finish, not endless.
3) relevent and to the point : not misplaced
4) clear, specific, and precise :- not vague
5) well researched :- not based on hear - say or speculative thought
6) Sincere and possitively intended :- not malicious
II Techniques of constructive criticism
1) It aims improve the behavior or the behavioral results of a person, while consciously avoiding personal attacks and blaming.  This kind of criticism is carefully formed in language aceeptable to the target person, often acknowledging that the critics themselves could be wrong, insulting language and hostile language are avoided, and phrases are used, "I feel", and it is my understanding that and soon. Constructive critics try to stand in the shoes of the person criticized and consider what things would took like from their perspective.

సారాంశం :

1)    1)     అవసరంరానప్పుడుగానీ, అవసరం తీరాకగానీ విమర్శ నిష్ప్రయోజనం.

    2)     క్లుప్తంగా ఉండాలి అయినా తగినంతా ఉండాలి. ఆరంభము, ముగింపు స్పష్టంగా ఉండాలి. ముగింపు లేకుండా ఉండకూడదు.

    3)     సందర్భోచితంగా ఉండాలి. అపసవ్యత ఉండకూడదు.

    4)     స్పష్టత, నిర్థిష్టతతో కూడిన ఖచ్చితత్వం ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.

    5)     చక్కగా శోధించబడినదై ఉండాలి. గుంజులాట 'ద్వైదీభావన' ఉండకూడదు.

    6)     నిజాయితీతో కూడి అనుకూల దృష్టి కలిగి ఉండాలి. పగ, ద్వేషంలాటి వ్యతిరేకత ఉండకూడదు.

2)     1)     విమర్శ మేలు కలిగించగలిగిందిగా, ప్రవర్తనను మెరుగుపరచగలిగిందిగా ఉండాలి వ్యక్తిగత దాడిని, అవమానించడాన్ని చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎవరిని ఉద్ధేశించి ఈ విమర్శ చేస్తున్నామో అతని విషయంలో మాటలు జాగ్రత్తగా వాడాలి. అవమానకరమైన, హేళన పూర్వకమైన పదజాలాన్ని (భాషను) విడిచిపెట్టాలి. వీలయినంతలో అతన్ని నొప్పించకుండా ఉండే భాషనే వాడాలి.

పాఠక మిత్రులారా! మంచి విమర్శ ఎలా ఉండాలో, నిర్మాణాత్మకమైన మేలు కలిగించగల - విమర్శ కొరకు ఎటువంటి మెలకువల్ని పాటించాలో ఎంత చక్కగా చెప్పారు?!

ఖండన :- ఒక విషయాన్ని గురించిగానీ, వ్యక్తిని గురించిగాని చక్కగా శోధించినప్పుడు - పరిశీలించినప్పుడు - అందులోని మంచి చెడులు (గుణాలు - దోషాలు) తెలియబడతాయి. అలా తెలిసిన వానిలోని దోషాలను ఎత్తిచూపుతూ వాటిని నిరసించడాన్ని, అతణ్ణి నిరసించడాన్ని ఖండన అంటారు. విమర్శలోని గుణదోషాల్ని ఎత్తిచూపే సందర్భంలో మంచిని చూపించడాన్ని పొగడ్త అని గానీ, చెడ్డను చూపించడాన్ని తెగడ్త - ఖండన - అనిగాని అనరు. విమర్శలో, అవి ఉన్నాయని తెలపడం మాత్రమే ఉంటుంది. అందులోని ఉండకూడని వాటిని వ్యతిరేకించడాన్ని తొలగించడాన్ని తొలగించుకోమని చెప్పడాన్ని ఖండన అంటారు. ఉన్న మంచిని చూపి అతిగా ప్రశంసించడాన్ని పొగడడం అంటారు. విమర్శలో మంచి చెడుల ప్రస్తావనే ఉంటుంది. దాని తరవాతవి పొగడడమో - తెగడడమో అన్నవి.

ఖ నింద :-

ఇక నింద అన్నది ఈరెండు క్షేత్రాలకూ అవతలిది. అది తిట్ల రూపంలో ఉంటుంది. అవమానించడం, హేళనజేయడం, సందర్భానికి తగని పరుష భాషణం చేయడం, సంస్కారహీనంగా మాట్లాడడం వగైరాలన్నీ నింద క్రిందికి వస్తాయి. విమర్శలతో ముడిపెట్టి కొంతవరకు ఖండన అవసరమవుతుంది. ప్రశంసాఅవసరపడుతుంది. పొగడ్త అనవసరం. గుణాన్ని గురించి తగినంత చెప్పడాన్ని ప్రశంస అనవచ్చు. అతిగా చెప్పడాన్నే పొగడ్త అంటారు. పొగడ్తలో అతి ఉంటుంది. నింద (తిట్ల పురాణం) ఈ రెండూ కానిది, విమర్శతో ముడిపెట్టాల్సిన అవసరం లేనిదీ, నష్టదాయకమైనదీ కూడా. కనుక భావజాల క్షేత్రంలో నిందకు చోటీయరాదు.

1) నిజానికి, హేతువాద పునరుజ్జీవన యత్నాల పేరున నేను రాసిన వ్యాసాలలో ఎక్కడా వెంకటాద్రిగారిని నిందించలేదు. ఇది నిజమో కాదో తేల్చుకోండి.

2) ఆయన్ను పొగడనూ లేదు, తెగడనూ లేదు. కొన్ని విషయాలలో కొంత ప్రశంసాత్మకంగా మాట్లాడాను.

3) విమర్శ అంటానికి తగిన రీతిలో విచారణా చేయలేదు. విచారణకు ముందు చేయాల్సిన, ఆయన భావాలను విడగొట్టి ఉట్టంకించాను. అందులో కొన్ని నాకంగీకారమైనవి ఉన్నాయన్నాను, కొన్నింటితో నేను విభేదిస్తున్నానన్నాను. మరి కొన్నింటి విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదని వ్రాశాను.

అంగీకరించిన వాటిని ఎందుకంగీకరిస్తున్నానో, అంగీకరించని వానిని ఎందుకంగీకరించడం లేదో కొన్నింటి విషయంలో నిర్ణయానికి ఎందుకు రాలేదో వివరించి అందుకు ఆధారాలూ చూపితే విమర్శించినట్లు అవుతుంది. కనుక నేను ఆయన్ను నిందించలా, పొగడలా - తెగడలా, ఇంకా సరిగా విమర్శించనూలేదు. ఇది నిజం.

మరి రావిపూడి వారు, కొన్నిచోట్ల పొగిడాననీ, కొన్నిచోట్ల తెగిడానని, అది గిల్లిజోల పాడినట్లుందని, అలాటి నాలిముచ్చు పనులు తనవల్ల కావనీ అనేశారు. అంతటితో ఆగక, గతాన్నీ త్రవ్వి రకరకాల నిందాత్మక పదాలు వాడేశారు. వాటిని నేనుగానీ, పాఠకులుగానీ అంతగా పట్టించుకోరేమోననుకుని కాబోలు, సురేంద్రగారూ! ఇవన్నీ మీ గురించేనండీ! అని ఒక ముక్తాయింపూ ఇచ్చారు. హేతువాది 343 సంచికలోని ఆ వ్యాసంలో సుమారు 40, 45 తిట్లు తిట్టారు. అప్పటికిగాని ఆయన గారి ఆకారణావేశం చల్లారినట్లు లేదు. ఈ సందర్భంగా నేను హేతువాదుల్ని, హేతువాది పాఠకుల్ని, ఈ అంశాల్ని గుర్తించిన వివేకపథం పాఠకుల్నీ అడుగుతున్నదేమంటే, తప్పును తప్పన గల ధైర్యము, స్వభావము మీకున్నట్లైతే నేనేమి తప్పు మాట్లాడానో నాకు చెప్పండి. వివేకపథం - స్పందనకూ ఆ వివరాలు పంపండి. పత్రికలో వేస్తాను. అలాగే ఆయనేమి తప్పు మాట్లాడారో ఆ వివరాలు వారి పత్రికకూ, మా పత్రికకూ పంపండి.

ఖ    వెంకటాద్రి గారికి :-

మన మధ్య వ్యక్తిగత విమర్శలుగానీ, హేళనాత్మక పదాల ప్రయోగాలు గాని ఇప్పటికీ అనవసరమనేనా అభిప్రాయం. ఆ పోకడను ఇంతటితోనైనా ఆపేయండి. విషయపరంగా నేను నావిగా ప్రకటించిన అభిప్రాయాలను నిర్థాక్షణ్యంగా విమర్శించండి. గుణాలు - దోషాలు ఎత్తిచూపండి. కేవలం దోషాలవరకు ప్రస్తావించినా నాకభ్యంతరం లేదు. రోషావేశాన్ని రగిల్చే పదాల ప్రయోగాలు పాఠకులకు అనవసరం, మనకూ అనవసరమే.

ఇక క్రమంగా హేతువాదం క్రిందికి వచ్చేవిగా మీరు వెలిబుచ్చిన భావాలను, అభిప్రాయాలను పరిశీలించే, విశ్లేషించి విమర్శించే పని కొంతకాలం సాగిస్తాను. ఏమి జరుగుతుందో చూద్దాం.

ఇక సిద్దాంతం గురించి :-

సిద్దాంతాలు తయారు చేయడానికి అవసరమైన విధానమే హేతువాదమంటే. కనుకనే దానిని మెథడాలజీ అన్నాను, అనన్నారు మీరు. ఒక్కమాట! హేతువాదం విధానమా? సిద్దాంతమా? అన్నదలా ఉంచుదాం. విధానాలగురించిన సిద్దాంతాలూ ఉంటాయన్నది నా పక్షం. నెట్‌లోకి వెళ్ళి, theories on methodology  అనే భాగాన్ని తెరిచాను. మెథడాలజీ మీదా, వివిధ సిద్దాంతాలున్నాయి. వివిధ మెథడాలజీలకు చెందిన సిద్దాంతాలూ ఉన్నాయందులో. theories on scientific method అన్న శీర్షికతోనూ సమాచారం ఉంది. ధీయరీ ఆఫ్‌ సైంటిఫిక్‌మెథడ్‌ అన్న సమాచారమూ ఉందందులో. కనుక ఒకవేళ మీరనుకుంటున్నట్లు ఏదో ఒక విధానానికే హేతువాదమన్న పేరు పెట్టుకున్నాము మేము' అనన్నారనుకున్నా, ఆ విధానాన్ని గురించిన మీ సిద్దాంతమేమిటోనైనా వివరించాల్సి ఉంటుంది మీరు.

ఎలాగంటే, జ్ఞానమేర్పడుతున్న క్రమమేమిటి? అన్న ప్రశ్నను అనేక చింతకులముందుంచామనుకోండి! అందులో, ఆ క్రమాన్ని ఆస్థికులు ఒకరకంగా, వైజ్ఞానికులు మరో రకంగా వివరించారనుకుంటే, జ్ఞానమేర్పడుతున్న విధానం ఏమిటన్నదానిపై రెండు సిద్దాంతాలున్నట్లు అవుతుంది. వాస్తవంలోనూ ఇప్పటికి ఆ రెండు సిద్దాంతాలూ ప్రకటింపబడ్డాయి. ఆస్తికుల సిద్దాంతం ప్రకారం ఆత్మ మనస్సుతోనూ, మనస్సు ఇంద్రియాలతోనూ సంయుక్తమై, వస్తువును చేరి వస్త్వాకారాన్ని పొందడం ద్వారా ఆ వస్తువు తెలియబడుతుంది. అదే మరి ఈ నాటి వైజ్ఞానికుల ప్రకారం, విషయాలకు చెందిన సమాచారం ఆయా ఇంద్రియాలకు అందడం వల్ల, ఇంద్రియాలు వాటి వాటి సామర్థ్యాలననుసరించి ఆ విషయాలను పట్టుకుని, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంటుంది. ఇది ఆ రెండు క్షేత్రాల వారి సిద్దాంతాలను చూసినవారెవరికైనా తెలిసున్న విషయమే.

అంతేకాదు, ప్రతిమతమూ, తననంగీకరించాల్సిన వారు అనుసరించాల్సిన జీవన విధానం గురించి నిర్థిష్టంగా ప్రకటిస్తుంటుంది. అవన్నీ ఆయా జీవన విధానాలకు సంబంధించిన సిద్దాంతాలే. కనుక సిద్దాంతమన్నమాట ఏ అర్థంలో లేదా ఏయే అర్థాలలో వివిధ క్షేత్రాలలో వాడుకలో ఉందో తెలుసుకోవడమో, తేల్చుకోవడమోనన్నదే ఈ విషయంలో మనముందున్న ప్రశ్న.

నా అభిప్రాయం ప్రకారం, ఏదేని ఒక విషయానికి సంబంధించి నిశ్చితరూపంలో ప్రకటింపబడ్డ అభిప్రాయాన్ని సిద్దాంతమంటారు. అలా ఒక్కో విషయంపైనా ఏర్పడ్డ అభిప్రాయాలన్నింటినీ కలిపే అంటే భావజాల సంపుటినే సిద్దాంతమంటున్నారు. నిర్థారింపబడ్డ అభిప్రాయాలు. ఇంకా నిర్థారింపబడకుండా ఉన్న అభిప్రాయాలూ, తప్పులుగా నిర్థారింపబడ్డ అభిప్రాయాలూ, పరికల్పనల రూపంలో ఉన్న ప్రతిపాదనలూ, కూడా సిద్దాంతాల పేరుతోనే చెప్పబడుతున్నాయి.

Theory :- 1) A formal set of ideas that intended to explain why some thing happens or exists.
2) A branch of science, consisting of its explanatary statements, accpted principles and methods of analisis
Theory : Theory is a system of ideas entended to explain something, such as a single or collection of fact(s), event (s), or phenomen ....... a theory often based on genaral principles that are indipendent of the thing being explained


సిద్దాంతము : తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతం ః!

ఏదైనా ఓ విషయానికి సంబంధించి నిశ్చయరూపంగా ప్రకటింపబడ్డ అభిప్రాయము - ప్రతిపాదన - సిద్దాంత మనబడుతుంది.

అభ్యుపగమ సిద్దాంతం :- ఒక విషయంపై ప్రకటించిన అభిప్రాయమును పరిశీలనకు స్వీకరించిన స్థితిలో, ఆయభిప్రాయమునూ సిద్దాంతమనే అంటారు. అయితే అట్టి దానిని పరిశీలన కొరకు స్వీకరించిన సిద్దాంతమని - అభ్యుపగమ సిద్దాంతమని- అంటారు.

పాఠమిత్రులారా! ఇప్పటి కాగుతాను. దీనిలో 1) వెంకటాద్రిగారు నా గురించి మాట్లాడిన మాటలూ; 2) హేతువాదం ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ అన్నదానికి పలు నిఘంటువులలోని వివరణలు 3) విమర్శ, ఖండన నింద, పొగడ్త - తెగడ్తలన్న వాటి అర్థాలు 4) సిద్దాంతం (ఊనీలిళిజీగి) అన్నదాన్ని గురించి నావి, ఇతరులవీ అయిన అభిప్రాయాలు వ్రాశాను. జాగ్రత్తగా పరిశీలించండి. మీరేమిటో తేల్చుకోండి.

తప్పొప్పులు చూడగలిగేవాళ్ళు, తప్పును తప్పనీ, ఒప్పును ఒప్పనీ అనగలిగేవాళ్ళు అరుదైపోతున్నారు. భావజాల క్షేత్రంలో కృషి చేస్తున్నవారు ఎంత శ్రద్దగా వాటిని పరిశీలించాలో, వాటి బాగోగులను విచక్షించాలో, వాటి వాటికి ఎంతెంత విలువనివ్వాలో నన్నదీ అంతగా పట్టించుకునేవారూ తగ్గిపోతున్నారు.

రాబోయే సంచిక నుండి, వెంకటాద్రి గారూ, వారిననుసరిస్తున్నవారు హేతువాదం పేరున వెళ్ళడించిన అభిప్రాయాలను క్రమంగా విశ్లేషించి సమీక్షించే పని మొదలెడతాను. ఈ విచారణలో పాలు పంచుకోదలచిన వాళ్ళు నాకు తెలియజేస్తే బాగుంటుంది.

ఖ  వెంకటాద్రిగారికీ, హేతువాదం ఒక మెథడాలజీనే అంటున్నవారికీ :

ఏ విధానానికైనా, కొన్ని పరికరాలతో కూడి ఒక దగ్గర ప్రారంభమై, ఒక దగ్గర ముగిసే క్రమబద్దమైన పని ఉంటుంది. ఇది ఎవరూ కాదనకూడని అభిప్రాయం (సిద్దాంతం). కనుక, మీరంటున్న హేతువాదమనే పద్దతిలో పని చేసే పరికరాలు - దాని ప్రారంభము - ముగింపులతో కూడిన క్రమ విధానము అన్నవాటిని నిర్థిష్ట రూపంలో ప్రకటించండి. ఆలోచించి చూస్తాను. అలా నిర్థిష్టరూపంలో హేతువాదమన్నది ఇదిగో ఈ విధానాన్నే అని మీరు ప్రకటించగలిగితే అప్పుడది హేతువాదమనే విధానాన్ని (పద్థతిని)  గురించి మీరంగీకరించే అభిప్రాయం - సిద్దాంతం - అవుతుంది.

గమనిక :- హేతువాదం పైసాగనున్న విచారణలో పరిశీలకులకు అవసరమైన కొన్ని కీలకాంశాలను ఈ సంచికలో ప్రస్తావించాను. వాటిని పట్టించుకోగలిగితేనే అనంతర విచారణలో సక్రమంగ పాల్గొనగలుగుతారు. నా ఈ సూచనను గమనించండి.

No comments:

Post a Comment