మిత్రులు ఫజులుర్ రహ్మన్ గారికి
ఖురాన్ వాక్యాలాధారంగానే, అల్లా చేసిన, చేయించిన అవిశ్వాసుల హత్యాకాండ చాలా పెద్దదని రుజువు చేయవచ్చు. దానికి పెద్ద తార్కిక సామర్ధ్యంగానీ, వాదనాపటిమగానీ అక్కరలేదు. ఉన్నమాటల్ని ఉన్నట్లుగా చూడగలిగితే చాలు. ఇక మహమ్మద్ జీవితాన్ని చదివినా, మత ప్రచారం మొదలెట్టిన నాటి నుండి ఖలీఫా అయ్యే వరకూ, అనంతరం చనిపోయే వరకూ కూడా అతని ప్రధాన కార్యక్రమం ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లామేతరులతో యుద్దము అన్నదే. అవిశ్వాసుల, అన్యమతారాధకుల సొత్తు దోచుకోవడం, దేవుని ఆదేశం మేర భాగాలు పంచుకోవడం ధర్మ సమ్మతమే అంటోంది ఖురాను. ఇంకొక మాట చెప్పాలి. ఇతర దేవతా మందిరాల ధ్వంస కార్యక్రమం మొదలెట్టింది మహమ్మదే. మక్కాలోని 360 మందిరాలను ధ్వంసం చేశాడతడు. కడకు 5,6 రోజులలో చనిపోతాడనగా ప్రధాన సూచనొకటి చేస్తాడు. చిత్రాలుంటే చెరిపేయిండి చించేయండి. ప్రతీకలుంటే (నేలపై ఎత్తుగా విగ్రహంలాటిదేది ఉన్నా) నేల మట్టం చేయండి అన్నదే ఆ సూచన.
మీరు ఖురానులో చంపమని ఉన్నది తమపై దండెత్తిన అవిశ్వాసులను మాత్రమేనని మాటిమాటికీ అంటూ వచ్చారు. అప్పుడు నేను అది తప్పుడు వివరణ చేయడమేననీ, దండెత్తిన వారితో పోరాడడం, పోరాటంలో ఒకరినొకరు చంపుకోవడం యుద్ధ నీతి క్రిందికే వస్తుంది గనక అది ఇరుపక్షాల సైనికులకూ న్యాయమే అవుతుందని అంటూ, కానీ ఖురానులో జరిగింది అదొక్కటే కాదనీ, అలా యుద్దంలో జరిగిన మారణకాండకు దారితీసిన కారణాలేమిటి? అంటే అసలా యుద్ధం ఎందుకు ఏర్పడింది? అన్న దానిని బట్టే, జరిగింది మతపరమైన శతృత్వంవల్ల జరిగిన మారణకాండనా? ఈ లోకసంబంధమైన ధర్మాధర్మాల సంబంధంగా జరిగిన మారణ కాండనా అన్నదే నిజమేమిటో నిర్ధారించడానికి ఆధారము అవుతుందనీ చెప్పాను. మరో మాట... ఇస్లాం స్వీకరణ విషయంలో నిర్భంధమేమీ లేదంటోంది ఖురాను అని ముస్లిం పక్షాన మాట్లాడే పండితులంతా అంటుంటారు. అయితే అది ఏ సందర్భంలో అన్నమాటో, దాని అర్ధమేమిటో, దేనికి అన్వయించాలో గమనించడం చాలా అవసరం. ఎందుకంటే మహమ్మద్ ఖలీఫాగా తనని ప్రకటించుకున్నాక, తనకంటే పెద్దరాజులైన ఇస్లామేతరులైన అనేక రాజులు, చక్రవర్తులకూ ఒక తాకీదు పంపుతాడు. ఇస్లాం స్వీకరిస్తారా? యుద్దానికి సిద్దపడతారా? అని, ఇది పురాణ కల్పనలాటికధ ఏమీ కాదు. చరిత్రే. ఈ పని ఇస్లామేతరులపై నిర్భందాన్ని సూచించేది కాదన్నమాట. ఇస్లాం స్వీకరించడమో, పోరాటానికి సిద్దపడడమో తేల్చుకోండనడం నిర్భంధం కాదన్న మాట! అది స్వేచ్చనివ్వడమన్నమాట! గొప్ప వివరణే మహాగొప్ప భాషా పరిజ్ఞానమే ఇస్లాం పండితులది!?
నిజానికి, ఒక గ్రంధం ఏమి చెపుతుందన్నది నిర్ధారించాల్సిన సందర్భంలో ఆ గ్రంధ పక్షం వహించినవాళ్ళు గానీ, దాని వ్యతిరేక పక్షం వహిస్తున్నవాళ్ళు గాని చేసే నిర్ణయాలకు ప్రామాణికత, సాధికారత ఉండదు. ఎందుకంటే గ్రంధం ఏమి చెపుతుందన్న విషయంలో వారు వాదప్రతివాదులుగ ఉంటున్నారు కనక. అందులో ఒకరు చెప్పింది నిజమయ్యే అవకాశం ఉన్నా అది నిర్ణయించాల్సింది, ఏ పక్షానికీ చెందని వారూ ఆ గ్రంధాన్ని విచారణకు తీసుకున్నంత వరకైనా క్షుణ్ణంగా చదివినవారు లేదా విచారణ సందర్భంలో అప్పుడైనా సరిపడినంతా చూడడానికి సిద్దపడినవారు, ఆ గ్రంధపు భాషలో తగినంత భాషాపటిమ కలవారు మాత్రమే. అట్టి వారినే చర్చావేదికలలో గాని, వాద ప్రతివాదుల వేదికలలోగానీ, నిర్ణేతల పక్షం అనంటున్నాము. ఇది ఎవరూ అభ్యంతరపెట్టగూడని, పెట్టజాలని సార్వత్రక నియమం.
సూత్రము :- వాద ప్రతివాదు లిరువురకూ న్యాయా న్యాయాల నెరిగే సామర్ధ్యం ఉండవచ్చేమోగాని, న్యాయ నిర్ణయం చేసే అధికారం ఉండదన్నదే ఆ నియమం మాత్రం.
ఖురాను వాక్యాలు, మహమ్మదు చేసిన కార్యాలను అలా ఉంచుదాం. భారత దేశం పైకి ఇస్లాంను అనుసరిస్తున్న అనేక విదేశీ రాజులు దాడులు చేశారు. కొందరు ఇక్కడి సంపదను దోచుకుని తిరిగి వెళ్ళిపోయారు. మరి కొందరు మళ్ళామళ్ళా దాడులు చేస్తూ, దోచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో హత్యలూ, మానభంగాలు మత మార్పిడులు, స్త్రీలను ఎత్తుకెళ్ళడాలు, పురుషులనూ ఎత్తికెళ్ళడాలు, వారిని బానిసలుగా చేయడాలూ ఇదంతా జరిగిన చరిత్రేనండీ రహమాన్ గారూ! ఈ క్రమంలో దేవాలయాలను ధ్వంసం చేయని ముస్లిం రాజులు లేరు. ఇక మరో రకం దండయాత్రలు జరిగాయి. ఆ రకం దాడులు చేసి ఇక్కడి రాజులను చంపి, తామూ ఇక్కడే స్ధిరపడటమో, తమ వారసుణ్ణో ప్రతినిధినో ఇక్కడ పాలకునిగ నియమించడమో జరిగింది. దాంతో దాడులు దోపిడీ కొరకన్నది పోయి, రాజ్యం కొరకు అన్నది వచ్చి ముస్లిం రాజుల పాలన మొదలైంది.
రహ్మాన్‌గారూ! ఆ తర్వాత ఇక్కడ జరిగిందంతా ఇక్కడి వారిని ఇస్లాంలోకి మార్చడం, విగ్రహాలను విగ్రహారాధకుల్ని నిర్మూలించడం అన్నదే చరిత్రలో ఎంతో ఉదారునిగా, మత సామరస్యం కలిగినవానిగా పేర్కొనబడిన అక్బర్ చక్రవర్తి కూడా అనేక వందల హిందూ మందిరాలను పడగొట్టించాడన్నది చారిత్రక వాస్తవం. అతడు హిందువుల స్త్రీలను జనానాకు చేర్చుకున్నాడేగాని, హిందూ పురుషులకు ముస్లిం స్త్రీల నిచ్చి వివాహాలు జరిపించలా, తాను హిందువుగానూ మారలా, చాలా మందిని ముస్లింలుగ మార్చాడు కూడా.
ఆనాడే కాదు. ఈనాటికీ ఇస్లాం అదే వరవడి కొనసాగుతోంది. ఒక హిందూ స్త్రీని ముస్లిం వివాహం చేసుకుంటే ఆ స్త్రీ ఇస్లాం స్వీకరించాల్సిందే. అలాగే ఒక హిందూ పురుషుడు ముస్లిం స్త్రీని వివాహమాడాలంటే అతడూ ఇస్లాం స్వీకరించాల్సిందే. మీరూ అలా మారినవారే. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ముస్లిమేతరులతో చేయాలని మీరూ యత్నంచారు. మీ పిల్లలు పెళ్ళి చేసుకున్న వారి మతాన్ని స్వీకరించడానికై మీరేమీ సిద్దపడలా. పైగా వారికి ఇస్లాం పద్ధతినే పెళ్ళిళ్ళు జరిపించాలన్న షరతు పెట్టారు. ఇస్లాం ఇస్లామేతరుల పట్ల ఇంత వివక్ష పెట్టుకుని, పిల్ల పెండ్లిండ్లనూ మత మార్పిడికి సాధనంగా వాడుకున్నారు ముస్లింలు. కానీ మీరు ఒక మతం మరో మతాన్ని కెలకకూడదు, ఎవరిష్టానికి వాళ్ళని ఉండనివ్వాలి, వారి ఇష్టం విషయంలో ఎలాటి వత్తిడిని కలిగించినా అది అమానుషమే, ఇస్లాంలో అలాటివైఖరి ఉంటే దానిని వదిలేస్తాను లాటిమాటలెన్నో మీ ప్రతిపాదన క్రింద మాట్లాడేశారు.
మొన్న మీరు నరసింహులు, నిన్న విజయ్‌కుమార్ గారు ఈ రోజు రహ్మాన్‌గారుగా ఉన్నారు. హిందువులూ మిమ్మేమి అనలా. క్రైస్తవులూ మిమ్ము ఏమీ అనలా. మీరు ఇస్లాం నుండిబైటికి రండి ముస్లింలు మిమ్మేమైనా అంటారో అనరో చూద్దాం! ఒక వేళ భారతదేశంలోని ముస్లింలు ఇక్కడి సంస్కృతికి అలవాటుపడి ఉండడం వల్లనో, భారత రాజ్యాంగం ఊరుకుకోదన్న భయం లేదా అవగాహన వల్లనో మిమ్మేమి అనకపోవచ్చుగానీ, అసలు గ్రంథమే అలాటివాణ్ణి 'ఏసెయ్' (చంపేయ్) అని అంటున్న మాట 100% నిజమేనని మీరే అంగీకరించారుకదా!
రహ్మాన్ గారు 1) ఖురాన్ అవిశ్వాసులపట్ల కౄరవైఖరి కలిగి ఉంది. దానిన అమలు పరచడం సాధ్యంకాని పరిస్థితుల్లోగానీ, అవిశ్వాసుల్ని ఇస్లాంలోకి మార్చేయత్నాలు చేస్తున్న పరిస్థితులలో గానీ మాత్రమే ఎత్తుగడగా అవిశ్వాసుల్ని తాత్కాలికంగా చంపకుండా ఊరుకుంటుంది.
2) ఖురానులోని సామాజిక కట్టుబాట్లు వివేకవంతులు అంగీకరించదగినవిగా లేవు. వాటిలో కొన్ని అమానుషాలుకాగా, మరికొన్ని కాలం చెల్లినవి (ఈనాటికి పనికిరానివి)
3) వ్యక్తి గురించి, సమాజంగురించి, ప్రకృతి గురించి ఖురాను చెప్పినవెన్నో ఈ రోజు ప్రయోగరీత్యా తప్పులని రుజువు చేయవచ్చు.
4) ఖురాను చెప్పిన స్వర్గాన్ని కోరుకునే వ్యక్తిని వివేకవంతుడని గాని విజ్ఞుడు అని గాని అనలేము. ఎందుకంటే, అందులో అలుపూ సొలుపూ లేకుండా తినడం, తాగడం, అనేక స్త్రీలతో పండడం అంతే ముప్పాతికమూడొంతులు, అవి అసహ్యం, జుగుప్స కలిగించేవిగానూ ఉన్నాయి. బహిరంగంగా అందరిముందూ వాటిని చదివి వినిపించుదామంటే నాకేమీ అభ్యంతరం లేదు. వారు వినగలరో లేదో, మీరు వినిపించగలరోలేదో చూడండి.
అంత భయంకరమైన పోకడలున్నా ఖురానును మంది నెత్తికెత్తే పని మాకెందుకండీ! ఇంతకూ ఈ చాకిరంతా మీరూ ఆ స్వర్గాన్ని అనుభవించాలనేనా? ఇంకేమైనా ఆలోచన ఉన్నదా?
రహ్మన్ గారూ! ప్రతిదినం ప్రపంచంలో ఏదో మూల జరుగుతున్న మత ఉగ్రవాద మారణకాండకు సంబంధించిన వార్తలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతూనే ఉన్నై. వాటిలో 99% ఇస్లాం విశ్వాసులుగ ఉంటున్నవాళ్ళు, ముస్లింలమంటున్నవాళ్ళు సాగిస్తున్నవే, పాశవికంగా కౄరంగా, రాక్షసంగా వారు సాగిస్తున్న మారణకాండ లేవీ మీకు కనిపించడం లేదా? వాళ్ళుచేస్తున్నవన్ని ఖురానుకు వ్యతిరేకమైనవీ, సత్య తిరస్కారులు మాత్రమే చేస్తున్నవీ అని మన స్ఫూర్తిగా (త్రికరణ శుద్ధిగా) ప్రకటించగలరేమో ఆలోచించండి. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న అలాటి ఘటనలకన్నింటికి ఖురాను విశ్వాసులే ఎందుకు కారణమవుతున్నారంటారు? 30-6-2016 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇదే విషయం మొదటి పేజీలో ప్రచురితమైంది. ఇలాటివి జరిగినప్పుడల్లా మానవ హృదయం వేదన చెందాలి. ఇతరమైన ఏ మత ధోరణుల వారి వల్లా ఇంతటి ఘోర కృత్యాలు జరగడం లేదన్నది నిజం కాదా?
- భారతీయ ముస్లింలు దీనిపై స్పందించాల్సి ఉంది.
సత్యాన్వేషణలో - మీ సురేంద్ర
No comments:
Post a Comment