ఐక్య వేదిక జెండా పాట
ప:- ఎగురుతోంది ఎగురుతోంది ఐక్యవేదిక జెండా
రెప రెప రెపరెప మంటూ నింగినేల నిండా||
అ.ప : అందరమూ ఒకటవుదము అరమరికలు లేకుండా
ఆ భావనె నింపుకొండనంటు గుండె నిండా .... ||ఎగు||
1) ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రథమ ధ్యేయమంటూ
సమసమాజ నిర్మాణపు కలనిండుగ కంటూ
కలలు నిజము చేసికొనగ కదలుదామురండంటూ
కలిమి బలిమి కంతటికీ ఐక్యతయే మూలమంటు .... ||ఎగు||
2) పెద్దలు నడచిన బాటనెనడచి చూపుదామన్నా
భవ్య భారతికి మనమే బాటలు వేద్దామన్నా
జనసామాన్యమునంతా మేలు కొలుపు దామన్నా
మేలుకున్న జనులే యజమానులింక నిజమన్నా .... ||ఎగు||
3) సత్యము ధర్మములన్నవె విత్తనాలు మనకంటా
నీతి, న్యాయములన్నవి వాటి మొలకలేనంటా
దేశభక్తే మనకందర కూపిరిగా నుండునంట
ప్రజలందరు ఒకరికొకరు అన్నదమ్ము లేనంటా.... ||ఎగు||
4) దేశ ప్రగతిబాటలోన జనులందరు నడవంగా
రాశిపడిన సంపదతో దేశమంత నిండంగా
నేను నాది అన్నమాట జనమంతా విడువంగా
మనము మనది అన్నమాటే గుండెలన్ని నిండంగా .... ||ఎగు||
No comments:
Post a Comment