Sunday, May 6, 2018

మేలుకొలుపు 1-4


                               మేలుకొలుపు
సంపుటి – 1                                   సంచిక 4                        15-6-1991
                                        గతస్పూర్తి     -     అవశ్యం భావి
ఆర్యులారా; పరిణామశీలమైన జగతిలో చేతన పదార్థానికో ప్రత్యేకత ఉంది. ఆది విషయ గ్రహణమే. ఇది మూడు రూపాలలో వినియోగంలో ఉండి వ్యక్తమవు తున్నది.1) గ్రహణమూ, 2) అట్టి పెట్టుకోవడమూ, 8) వినియోగించు కోవడమూ. వీటి క్రమం కూడా పై సంఖ్యాకమంలోనే. ముందుగా గ్రహించిన గాని అట్టి పెట్టుకోలేము. చక్కగా నిలువ యున్న గాని వినియోగించుకోలేము. ఈ మూటినీ సాధారణ దృష్టినుండి జ్ఞానమన్న పదంతోనే, వ్యవహరిస్తున్నా, జ్ఞానము, స్మృతి, స్మరణము అన్న పదములు ఆయా స్థితులకు నిర్దిష్ట సంకేతము లౌతాయి. అయితే, జ్ఞానోత్పత్తి కాధారమేమి? అనుభవమే. అది యింద్రియార్థ సన్ని కర్షవల్ల (ప్రమాణముచే) ఏర్పడుతుంది. ఆ యనుభవాలనే గ్రహిస్తున్నాము. గ్రహింపబడి నిలువయున్న యనుభవాల (విషయముల) ఆధారముగనే వర్తమానము నుండి భవిష్యత్తు వైపు కదులుతున్నాము. గ్రహింపబడుతున్న యనేకానేక యనుభవ పరం పరల మధ్య అనివార్యముగ ఏర్పడుతున్న సారూప్య వైరూప్యతల వలన అనుకూల, ప్రతికూల పరిస్థితు లేర్పడుట, అందుండి యిష్ట ఫలములూ, అనిష్ట ఫలములూ భోగింపబడుట జరుగుచున్నది. ఇది సర్వులకూ నిత్యానుభవమే..
అట్లు ఇష్ట ఫలాప్రాప్తి, అనిష్ట ఫలప్రాప్తి (కావాలనుఈన్నవి లభించక పోవుట, వద్దనుకున్నవి వచ్చి పడిపోవుట) అన్న యవాంఛనీయ స్థితులేర్పడుటకు కారణమేమి? ఆది తొలగించుట ఎట్లు? అన్నది మీమాంస (పరిశీలన లేక విచారణ) చేయదగియున్నది. అందువల్లనే ప్రతి మానవునకూ, తన కేర్పడుతున్న యనుభవ పరంపరల పట్ల సరైన యవగాహన అవసరమగుచున్నది. జీవితం పట్ల అనగా వ్యక్తి, సమాజమూ, ప్రకృతి వీటి మధ్యనున్న అనుకూల, ప్రతికూల సంబంధాలూ, జీవిత ధ్యేయమూ, తత్సద్ధికైన సాథన క్రమమూ వీటి పట్ల సమగ్రమైన యవగాహన యున్నగాని అతని జీవితము సక్రమముగ నడువజాలదు. కనుకనే జీవ నానికి అనేకానేక మార్గములను (కూటి కొరకు కోటి విద్యలు) ఎవరెవరి యిష్టమూ, సామర్థ్యమూ ననుసరించి వారు వారు ఆయా విద్యలనూ, వృత్తులను స్వీకరించినప్పటికీ, ఆధ్యాత్మ విద్య (నేనూ, నాది యన్న విషయములను బోధపరచు విద్య) మాత్రము సార్వత్రికమూ, సార్వజనీనమూనై యున్నది.
ఏ విద్య పొందబడిన (ఎట్టి జ్ఞానము పొందబడిన) మరెన్ని విద్యలు పొంద బడక పోయిననూ ప్రమాదం లేదో, ఏది పొందబడక మరెన్ని విద్యలు పొందబడి ననూ- నష్టం పోదో అట్టి ఆధార విద్యయే ఆధ్యాత్మ విద్య. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించినారు గనుకనే పూర్వీకులు జీవితం పట్ల అవగాహనను కలిగించు విద్యను అందరకూ, ఆపై జీవనాని కుపకరించు నానా విద్యలను వారి వారి స్థితిగతుల ననుసరించి బోధించు విధానము నవలంభించినారు. అయితే ఆధ్యాత్మ విద్యను గ్రహించజాలని స్థితిలో నున్న అల్ప మేధస్కులకు ఆ విద్య బోధించు చున్న జీవన క్రమాన్ని మాత్రం అభ్యాస రూపంలోనూ, ఆచారాల రూపంలోనూ (వాటిలో కొన్ని నేడు కాలం చెల్లి నవిగా ఉన్నా యన్నది గమనార్హం) ప్రకట పరచి వారినీ తమతో సహజీవన యాత్రికులుగా చేసి కొనినారు. మరో వంక సమాజాన్ని శాసించు-నడిపించు - శ్రేష్టులనదగ్గ-వారలకు మాత్రం పై రెండు క్రమాలూ (ఆధ్యాత్మ విద్య- అది బోధించు జీవన విధానము అన్నవి) అభ్యసించుట విధిగా స్వీకరించదగినవిగా చెప్పినారు. అప్పటి సమాజ వ్యవస్థా రూపాన్ని బట్టి బ్రాహ్మణ, క్ష తియ, వైశ్యులకు అది విధిగా ఏర్పడింది. ఎందుకనగా తెలిసికొనుట, తెలియ జేయుట యనునవి బ్రాహ్మణుల స్వాభావిక కర్మలుగా నాడు భావింపబడింది.అధ్యయనం అధ్యాపనం బ్రాహ్మం కర్మ స్వభావిజం" 2) ధర్మబద్ధంగా జీవించుట, సమాజమున్నూ అట్లే జీవించునట్లు శాసించుట, తద్భిన్న క్రమాన్ని (అధర్మంగా జీవించువారిని శిక్షించుట క్షాత్ర కర్మగా చెప్పబడింది. 3) విలువలను కూడ బెట్టుట (కృషి, గోరక్ష వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావిజం] అర్ధ సంచయము-పంపకము అన్న కార్యక్రమం వైశ్యులనబడే వాళ్ళకు విధింప బడింది.
ఈ మూడు వర్గాలూ సమాజం మొత్తం పట్ల బాధ్యత కలిగి యున్న దగుటచే వీరలకు ఆధ్యాత్మ విద్యా వివేకమూ- తదనుగుణ్య ఆచరణ అవశ్యమని చెప్పబడింది. ఇచ్చట ఆధ్యాత్మ విద్యా వివేకమనగా తనను గూర్చీ, తనతో సమాజానికీ, ప్రకృతికీ గల సంబంధాలను గూర్చి వాటియెడ తాననుసరించదగిన తీరును గూర్చిన వివేక మనియే. నిజంగా జీవితాన్ని సమగ్రంగా చూడగలిగిననాడు, ఈ మూడు విధములైన వ్యవస్థలూ-కాలానుగుణ్యముగ, లేక భాగా సౌలభ్యము ననుసరించీ ఏయే, పేరులతో పిలువబడ్డా ఏ కాలములోనైనా, ఏ దేశములోనైనా ఉండక తప్పదని అవగతం కాగలదు. మానవ సమాజములో ఎన్ని రకములైన మార్పులూ, కూర్పులు జరిగినప్పటికీ, ఈ మూడు రూపాలూ, వీటి వీటి కార్య క్రమాల నమలు పరచుటకై ఆయా క్షేత్రాలలో కావలసియున్న భౌతిక శక్తి లేక క్రియా శక్తి రూపమైన మరొక వర్గమూ, అవశ్యంగా కావలసి ఉంది. శూద్రులన్న పేరున ఆ వర్గమే సూచింపబడింది. విరా ట్రూపంలో పాద స్థానం వారికీయబడ్డది. అది గమన సంకేతం. సామాజిక కార్యాలకు ఆధార స్థానం.
గమనిక :- ఈ విషయం అనేక విమర్శలకు (అనుకూలంగానూ, ప్రతి కూలంగానూ) లోను చేయబడింది. చేయబడుతుంది, చేయబడవలసి కూడా ఉంది. కనుక విపుల పరిశీలన అవసర మైన ఈ యంశాన్ని మరొక తూరి ప్రత్యేకించి ప్రస్తావిస్తాను.
ఈ చతుర్వూహ వ్యవస్థలో గానీ, వ్యవస్థాంతర్గత వ్యక్తుల విధి నిర్వహణలో గానీ ఏ భాగంలో (వివేకం లోపించినా) లోపమేర్పడ్డా అధర్మం పుట్టుతుంది. ఇక్కడ అధర్మం అన్న పదం వాడడం వెనుక నా వుద్దేశము అపాత ఫలజనకం అని మాత్రమే. దానితో సమాజంలో ఎక్కడో ఒక చోట పొందగూడనిది, పొంద బడడమూ, పొందవలసినది పొందబడక పోవడమూ అన్న స్థితి ఏర్పడుతుంది. వెంటనే అట్లు పొందగూడనిది పొందిన వారినుండి లేక పొందవలసినది పొందలేక పోయిన వారినుండి ప్రతిఘటన ఏర్పడుతుంది. అట్లా ప్రారంభింపబడి శాఖోప శాఖలుగా విస్తరింపబడి నట్టిదే నేడు నానా విధ అస్తవ్యస్థతలతో కానుపించు సామా జిక వికృత రూపం. ఇది తరచుగా సామాజిక నాయకుల చేతనూ, సాంప్రదాయ ప్రవర్తకుల- ప్రచారకుల -చేతనూ కూడా మాటి మాటకీ చెప్పబడుతున్న విషయమే.
అయితే విచారించదగ్గ విషయ మేమంటే నేడు వినబడుతున్న ఆయా నినాదాల వెనుక, పూర్వీకులలో జాలు వారిన హృదయగత లోక కళ్యాణ కాంక్ష, దానిని సాధించుటకై వారు పడిన తపన మృగ్యమై, మంచివాడుగా గుర్తింపు పొందాలనో, మరో విధమైన స్వార్థపూరిత ఫలకాంక్ష ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుని ఉంటున్నది ఎక్కువమందిలో. ఈ నాడు లోక హితైషలూ, మేధావులూనైన వారలను అమితంగా కలవరపరుస్తూన్న యంశ మేమో ఆలోచించగలరా? అధర్మమూ, స్వార్ధమూ, భద్రతా రాహిత్యమూ పెచ్చుపెరిగినవనీ, ముందు ముందు మరింకనూ బలపడి క్రమపరచలేని స్థితి ఏర్పడవచ్చునన్నదే ఆ యంశం.
అయితే ఆయా సంఘాలలోని ధార్మిక లూ, లోకహితైషులూ వారి వారికి తోచిన రీతిలో సంస్కరణకై యత్నిస్తూనే యున్నారు. వారు హితాభిలాషలేనివారని యనము గానీ పై యవాంఛనీయ స్థితులన్నిటికీ గల కారణాన్ని - మూల కారణాన్ని అనైనా యనోచ్చు- గమనించి కారణ నాశాన్నే లక్ష్యంగా కలిగి అందుకు తగిన ప్రణాళిక నేర్పరచుకుని అమలు పరచుచున్నారా? అన్నది పరిశీలనాంశమని  చెప్పుచున్నాము.
 ప్రాచీన (తాత్విక ధార్మిక పరమైన) మేధావులకో ఈ విషయమై యన్వేషణ నిశితంగానూ లోతుగానూ చేయబడిందని చెప్పగలము. అదే స్థాయికి చెందిన వివరణాత్మకమైన, సారభూతమైన వివేకం కలవారు నేడు అసలు లేరని చెప్పలేము గానీ, అట్టి జ్ఞానము సమాజాన్ని ప్రభావితం చేయగల రూపంలోనూ, స్థాయిలోనూ (సంస్థల, వ్యక్తుల సంఘటనా శక్తి) నేడులేదని చెప్పగలము. ఎందువల్ల నేడు ఆ విద్య దుర్బలమై ఉంది ?
ఈ విషయాన్ని పరిశీలించే ముందు మరొక అంశాన్ని గమనించవలసి యుంది. మానవ జీవితాన్ని చూస్తే జీవనయాత్రలో ఏ రూపమైన యత్న మైనా ఫల వంతం కావడానికి అవశ్యంగా జ్ఞానశక్తీ, క్రియాశక్తీ తగినంత సామర్ధ్యము కలిగి - ఉండడమూ, అవి పరస్పరం సహక రించుకుంటూ పని చేయడమూ జరుగ వలసియుంది.అగ్రత: చతురో వేదాక్, పృష్ఠతః సశరం ధన:" అన్న సూక్తి ఈభావానికి చెందినదే. ఇది తాత్విక విలువ కలిగిన యంశము కూడా. ఈ విషయాన్నే "వివరణాత్మకంగా యిలా చెప్పుకోవచ్చు. కర్త, ఉద్దేశము, పరికరాలు, విధానమూ "అన్న నాలుగింటి సమాహారమే ఏ ప్రయత్నం యొక్క ఫల ప్రాప్తికిగానీ హేతువు ఆధారముకాగలదు. కర్తయనగా స్వతంత్రం కలిగి యుండడమూ,  ఉద్దేశస్టానములో సాధ్యము విషయ మైన కోర్కె, క్రియోన్ముఖత్వ స్థాయిలో తీవ్రత కలిగి యుండడము పరికరాలు, చేయాలనుకున్న పనికి చెందినవిగానూ, శక్తివంతమైనవి  గానూ ఉండడమూ, విధానమన్న దాని పరికరాలను క్రమపరచగల, శ క్తివంతం చేయగల మరియు ఫలోత్పత్తి (పని పూర్తి అయ్యే వరక) పర్యంతం పని చేయించగల జ్ఞానం కలిగి యుండడమూ, పై నాలుగూ యిలా సమకూడినప్పుడు మాత్రమే ఏ కార్యమైనా ఫలవంతం కాగలదు.
 పెన పేర్కొన్న సామాజిక రుగ్మతకు కూడా (ఉండవలసిన స్థితి ఉండక  పోవడానికి లేక రాక పోవడానికి, అట్లే అక్కర లేనిది ఉండడానికి పోక పోవడానికి) ఈ నాలుగూ లేకపోవడమో, కొన్ని లేకపోవడమో, ఉన్నా తగిన స్థాయిలో లేకపోవడమో కారణమౌతుంది. చూడవలసింది, సరిచేయవలసిందీ యిక్కడే. చూడ లేక పోవడమో, చూసినా అనేక ప్రభావాల వలన సరి. చేయబడక పోవడమో అన్నదే నేటి బలహీనత. ఇది వెనుకటి వాళ్ళు చెప్పినట్లుఏరుదాటదలచిన ఒక కుంటి వాని, ఒక గ్రుడ్డి వాని" కధను పోలి ఉన్నది.
నేడు సమాజంలో ప్రవర్తిల్లుతున్న సంస్కరణాభిలాషకలవిగా చెప్పబడుతున్న సంఘాలలో (ఎక్కువ భాగం) మేము చూచినంత దనుక ఈ రెండు రూపాలలో ఎక్కడో ఒక చోటనో, మొత్తంగానో, బలహీనత గోచరించింది. అంటే సరైన వివేకం-సమ్యదృష్టి- లేకపోవడమో, బోధనలు, ఆచరణ శూన్యంగా ఉండడమో జరుగుతున్నది. ప్రధానంగా సరిచేయబడవలసిన విషయమిదే అయినా, ఆప్రదానంగా చూడబడుతోంది. బుద్దిచే నియంత్రించబడ్డ , కోరికలు (మనస్సు), దానిని అమలుపరుప గలిగిన, అదుపులో నున్న శక్తి వంతమైన యింద్రియాది సంఘాతము-క్రియాశక్తి, కర్మణ్యత (పనిచేయవలెనను బుద్ది) ఇవే ఫలసిద్ధికి పాలు పంచు కోదగిన యంశములు (వ్యక్తి నిర్మాణమన్న మాటకు అర్థం కూడ యిదే. కఠోపనిషత్ యిట్టి వ్యక్తినే విజ్ఞాన వాన్ అని ప్రస్తుతిస్తున్నది.)
 పూర్వీకులచే యీ విషయం గమనింపబడిన పిదపనే ఆధ్యాత్మ విద్య-జీవితం పట్ల సరైన యవగాహన కలిగించు విద్య-ఆధారవిద్యగానూ, బ్రహ్మ-బృహత్ -విద్యగానూ స్వీకరింపబడి, ప్రకట పరుప బడింది. మిగిలిన విద్యలన్నియూ దీనికి ఆనుసరించదగి యున్నవి. ఈ విద్య కూడ ఒక క్రమానుగత అభ్యాసం [యో? కర్మ) వలననే సాధింపబడుతుంది. దీనికి మించి వ్యవస్థ సరి చేయ బడడానికి తగిన మార్గాంతరం లేదు. ఇదిన్నీ మరల రెండు కోణాలలో ప్రణాళికా బద్దం చేయబడిన గాని సమాజం మొత్తానికి అనువర్తించజాలదు. అవి[1] స్వీయ నియంత్రణ (వివేక బలంచే తన మీద తన అదుపు కలిగి ఈ క్రమాన్ని పాటించడం (సమాజంలో కొంతభాగం మాత్రమే అట్టి సామర్థ్యం కలిగి ఉంటారు. [2] అట్టి స్వా ర్ధ్యంలేని సాధారణ వ్యక్తులపై సమిష్టి అదుపు (అది చట్టమూ, న్యాయ వ్యవస్థ రాజ్యాంగము, పౌరుల బాధ్యత అన్న వాటి నుండి ఏర్పడుతుంది) వలన వారి పాటింపబడుతుంది.
వ్యక్తి నిర్మాణమే సహజ నిర్మాణానికి ఆలంబన. వ్యక్తుల ఫలసిద్ధితో సమిష్టి ఫలసిద్ధి ఔతుంది.భారతీయమైన (తాత్విక ధార్మిక రూపమైన) ఆలోచ ఆచరణలలో ఈవిషయం ప్రస్పుటంగానూ, ప్రముఖంగానూ, ప్రతిపాదింపబడినా ఈనాడు మరుగునపడివున్న అంశమిది. అయితేనవీన మేధావులకీ మౌలికమునైన ఆంశంగా దీనిని గమనించిన వారిలో R. S.S స్థాపకులు డాక్టర్ జీ ఒకరు. ప్రస్తుతం మనం చేయవలసింది కూడా  దీనిని యవగాహన చేసికొని ఆచరణ రూపం లోనికి మార్చు కొనడమే.
 సాంప్రదాయేతర సంఘాలలో ఈ విషయం (వ్యక్తి నిర్మాణం) చాలవరకు అప్రధానంగా ఉంటున్నది. మరి ఆయా సంస్థల ప్రవర్తనలలో ఈ విషయం అత్యవసరమైన విషయంగా ఎందువల్ల చోటు చేసికొన లేక పోయింది? ఎందుకు ప్రాధాన్యతను కోల్పోయింది? దీనిని రెండు కోణాల నుండి గమనించ వలసియుంది. [1] విషయము ఎడల సమగ్రమైన యవగాహన (వివేకం] లోపించడం. [2] , ప్రతి వ్యక్తికీ అతని జ్ఞానాని కవసర మైన సంవేదనలు సమాజమూ, ప్రకృతి నుండే వస్తున్నాయి. ఈ విషయంలో ప్రవర్తకులకున్నూ, జ్ఞానం సమకాలీన ప్రపంచం నుండీ చరిత్రాధ్యయనం వలన ఏర్పడుతున్నది కదా! అతను గమని స్తున్న సమాజంలో వ్యక్తి నిర్మాణం అత్యవసరమని ఘోషిస్తున్న, సాంప్రదాయక సంఘాలు చాల వరకు నిర్వీర్యంగానూ, అంధవిశ్వాస ప్రాభవాలుగానూ, కేవల వాచా మాత్ర ప్రతిభ (మాటలు కోటలు దాటుతాయంటారే అలా అన్నమాట) కలవి గానూ, మరోవంక సోమరితనానికి, లేని గొప్పదనాలు ప్రకటించుకోడానికి కేంద్రాలు గానూ కనుపిస్తున్నాయి.
గమనిక:-ఈ విషయమై మా పరిశీలనలోనూ ఎక్కువ భాగం యిట్టి యనుభవాలే ఎదురై నాయి. ఆయా ఆశ్రమాల, సంస్థల అధిపతులలో కూడాలేనంత అహంకారమూ తాము అసాధారణ వ్యక్తులమన్న భావన, - విద్యలోనూ, సాధనలోనూ, నిష్ణాతుల మన్న భ్రమ ప్రముఖంగా అనుయాయులైన వారిలో గోచరించినాయి. నిజంగా యివి అభ్యాసకులను భ్రష్టు పట్టించడానికి, విద్యలో అభివృద్ధి నిరోధానికి కారణాలుగా ఉండగలవు. కానీ యివి గురువులచే గానీ, అనుయాయులచే గానీ కూడా గమనింప బడుటలేదు.
ఈ యనుభవాల నుండి ఏర్పడిన జ్ఞానం సాంప్రదాయేతర సంఘాల వారిలో ఆస్థిక సంఘాలపై చిన్న చూపునూ, వ్యతిరేక దృష్టినీ సృష్టించింది. ఆపై పోరు ప్రతి క్రియాత్మకంగా వ్యతిరేక దృష్టినుండి ప్రణాళికల నేర్పరచుకుని ఆవేశాత్మకంగా యుంటున్నారు. ఆలోచన-వివేకం, ద్వితీయ స్థానానికి పడిపోయింది. అయితే ఆవేశాలు సమస్యలతో పరిష్కారాలు లేవన్నది ఒక వాస్తవం. దానిని అందరం గమనించాల్సి ఉంది. ఇచ్చటనే మరొక సూక్షమూ, సున్నితమూనైన అంశముంది. ఆయా సంస్థల స్థాపకులందరూ వారు ఏయే వేదికల నుండి పనిచేస్తున్నా సమాజ శ్రేయస్సు కాంక్షించే వాళ్ళే నన్నదే ఆ విషయము.
వారెవ్వరూ సమాజాన్ని చెడగొట్టాలన్న భావన కలవారు మాత్రం కాదు. ఇకపోతే అందులో నున్న కపటులూ, స్వార్ధపరులూ అందామా! అట్టివారు మన సంఘాలలో మాత్రం తక్కువేం లేదు. అదీకాక నాస్తిక, హేతువాది సంఘాలు ఆస్తిక సమాజం యొక్క వికృత రూపానికి, దాని ప్రవర్తనకు ప్రతి క్రియాత్మకంగా ఏర్పడినవే నన్నది ఒక చారిత్రిక వాస్తవం. మంచిని ఎక్కడ నుండైనా స్వీకరించడం, స్వకీయమైన బలహీనతలను వదులుకునే యత్నం నిజాయితీగా చేయడం మానవతకు, వికాసానికి ఆధార శిల వంటిది.
సమాజాన్ని అస్తవ్యస్తంచేస్తున్న వర్గం తమలో కూడా బలీయంగానే ఉందన్న విషయాన్ని నాటి ఋషులు చాలా చక్కగా గమనించారు. ఉదాహరణకు " అ విద్యాయామంత రే వర్తమానాః స్వయం ధీరాః పండితమ్మన్యమానాః దంద్రమ్యమానాః పరియన్తి మూడా? అంధేనైవ నీయమానా యదాంధాః" నడిపేవారూ, నడిపింప బడేవారూ యిద్దరూ గడ్డివారే అయినా, వారు తమ తామే వేత్తల మనుకుంటూ అజ్ఞానంలో- భ్రమలో మునిగి-చరిస్తున్నారు. తిట్టునుకూడా ఎంతో వివేకవంతంగా పలకడంలోనే వారి ఔన్నత్యం గోచరిస్తుంది. ఇది ఎంత వా స్తవమంటే ఈ నాటి ఆస్థిక-నాసిక సంఘాలలో కూడా సంఘాలలో నూటికి డెబ్బది ఐదు మందికి వరిస్తుంది ఈ శ్లోకభావం. ఆపై పాతికలో కూడా మరికొందరు తేలవచ్పు నిశిత పరిశీలనలో. ఎందుకలా అనగలిగానంటే ఆస్టిక, నాసిక భావాలకు చెందిన వారుగానే గదా సమాజం ఉన్నది. ఆ సమాజం అధార్మికంగా ఉందన్నది యిరుపక్షాలు ఘోషిస్తున్న అంశమే. కాకంటే ప్రతివర్గమూ తను ఎదుటి వర్గంలోని దోషాలను ఎత్తి చూపుతోంది. కనుక యిరు పక్షాలూ తమతమ పక్షంలోని అధార్మికులను సంస్కరించడమో, యిరువురూ కలసి సమాజం లోని అధార్మికతను తొలగించడమో చేయవలసి ఉంది. అదే సరైన సంస్కరణ కాగలదు.
అయితే ఆ సంస్కరణ-అంతటి గుణాత్మకమైన మార్పు ఎలా సాధ్యం?
సాంప్రదాయకలు తాము చెపుతున్న వ్యక్తి నిర్మాణరూపమైన సాధనను త్రికరణశుద్ధిగా ఆచరించి ఆవిషయములో యితరులకు స్పూర్తిదాయకం కాగలిగిన వ్యక్తిత్వాన్ని సముపార్జించుకోవాలి. అట్లే, ప్రతి క్రియాత్మకంగా ఏర్పడి ఉద్రేకాలలో కొట్టుకు పోతున్న సాంప్రదాయేతర సంఘాలు కూడ తమ సంఘములలో వ్యక్తి నిర్మాణరూపమైన సాధనను ప్రవేశ పెట్టగలగాలి. ఈ ప్రక్రియ ఒక్కదానివలన మాత్రమే ఆ గణాత్మకమైన మార్పు సాధ్యం కాగలదు. ఈ విషయమే ఒకింత గోప్యంగానైనా స్థితప్రజ్ఞస్యకాభాషా...యిత్యాది శ్లోకాలలో వ్యక్తం చేయబడ్డది. మిగిలిన ప్రక్రియలన్నీ నేలవిడచిన సామువంటివే. వివేకవంతులీ క్రమాన్నిపాటిస్తూ, సామాన్యులచే పాటింపచేయాలి. యద్యదాచరతి (శ్రేష్ఠః తత్తదేవేత రోజనః అన్నది మానవ స్వభావానికి చెందిన వాస్తవము గదా!
 ఏతావాతా, సమాజ శ్రేయస్సుకు తగిన ప్రక్రియ, ఆయా సంస్థలు వ్యక్తి నిర్మాణం వైపు అభ్యాసరూప కర్మారంభం చేయడంలోనే యిమిడి ఉంది. ఒకరు మరొకరిని విమర్శించుకుంటూనో, వ్యతిరేకించుకుంటూనో పట్టించుకోకుండానో కాలం గడపటం అవివేకం. ఈ విషయంలో ఎవరికి వారు ప్రథమంగా తమ వైపు నుండి మార్పురావలసి యున్నదనుకంటూ యత్నారంభం చేయాలి. ఆ మార్పుకై న యత్నం అన్నది కేవలం ఏదో ఒక కోణం నుండిగాక విప్లవాత్మకంగా (మౌలికమైన, గుణాత్మకమైన మార్పు తేగల విధంగా) సమగ్రంగానూ, మహోధృతంగానూ సాగవలసి ఉంది. ఆత్మవిమర్శా, సమ్యగ్యత్నమూ నన్నదే నే సూచించ దలచుకున్న పరిష్కార మార్గము. అప్పుడు మాత్రమే జ్ఞానం వివేక - రూపాన్నీ, యత్నం యోగరూపాన్నీ సంతరించుకుంటుంది. ఇంతకు మించి  మార్గాంతరం లేదు,
ఇందుకై ఆయా సంఘాల వారందరు పరస్పరావగాహన, యోజనల కొరకై ముందుగా ఒక వేదిక నేర్పాటు చేసికొనవలసి యున్నది. వైయక్తి  కాధిపత్యాల నావలనుంచి, కాగల కార్యానికై దృఢ దీక్షతులు కాగలగాలి. ఇది ఇష్టం కంటే వివేకం పర్యవేక్షణలో జరుగవలసి యుంది. దీనికై అహంకార సూన్యత, మేధావిత్వమూ, త్యాగనిరతి ఆన్న సుగుణ సంపత్తికల వ్వక్తలు ముందుగా, ముందుకు రావలసియుంది. అప్పుడే తగిన కదలిక వస్తుంది. ప్రతిపక్షి, సద్విమర్శ డై న పక్షంలో అతను విమర్శించలేని ఆచరణా, వివేకమూ కలబోసిన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయవలసింది. ఈ విషయమై మనందరం కలసి కదలాలన్నదే నా యోచన. ఈ ప్రయత్నానికిన్నీ పేరణ అదే.
ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందించడం అన్నది చేతన పదార్త స్వభావం, స్పందించలేక పోవడం చైతన్యంయొక్క బలహీనతఈ సూచన కాగలదు. ఉంటాను. సెలవ్, నమస్సులతో.   సత్యాన్వేషణలో. మీ సురేంద్ర.
ఈ మూడవవర్గంలో మరల రెండు స్థాయిలకు చెందిన (సాధారణులు, అసాధారణులు, - అనదగ్గ వ్యక్తులు) ఉంటారు. సాధారణులున్నూ పదిమంది ఉపయోగించు " కార్య క్రమాలు చేస్తుంటారు గానీ, ఆ పనుల వెనుక కీర్తి ప్రతిష్టలు ప్రధానంగా ఉంటాయి. అట్టివారి నుండి ఏర్పడినదే వ్యక్తారాధన యన్నది. అయితే వీరూ శ్రేయోదాయకులే. ఇకపోతే 3వ వర్గంలోని అసాధారణులున్నారే వీరినే మేధావులూ, సంఘ హితైషులూనైన మహాత్ములని యంటాము. సమాజంలో ఒకటవ వర్గం ప్రబలి బలీయంగా నున్నప్పుడు (అథర్మం పెచ్చు పెరిగినప్పుడు) దాని బారినుండి సమాజాన్ని ఉద్దరించు యత్నం చేస్తుంటారు వీరు. 3వ వర్గంలోని రెండు స్వభావాలకు చెందిన వ్యక్తులూ సామాజి కావసరాలను తీర్చే కార్య క్రమంలోనే ఉంటారు గనుక రెండు రకాల వారినీ మంచివారనీయని తీరాలి. ఈ దృష్టి నుండైనా బాబాకూడా 3వ వర్గానికి చెందినవారే.
3) సం|| కొందరు మీకు నేను చేయగల సహాయ సహకారములుంటే  తెలుపండి అని వ్రాశారు.
ప్రతి స్పం|| మేలుకొలుపుకు అండదండలుగా ఉండడమంటే ప్రధానంగా - మేలుకొలుపు కార్యక్రమాన్ని మీరూ నిజాయితీగా స్వీకరించడమే. ప్రతి వ్యక్తి అర్హులైన మరికొందరు ఈ పత్రిక నందించుట, వీలయినంతమందితో వెంటనే అధ్యయన, సాధన రూపమైన సత్సంగముల నేర్పాటు చేయుట, అందరమూ అప్పుడప్పుడూ కలసికొని పరస్పర భావాల మార్పిడి . సత్యజ్ఞానార్జనా, సాథనల కొర కైన సాధన శిబిరములను నడపుకొనడమూ చేయవలసి ఉంది. ఇదే మేలుకొలుపు మీ నుండి కోరుతున్నది. అస్తు.
4) స్పం! మానవ ధర్మరక్షణ సంస్థ సంస్థాపకులు , డాII M, కృష్ణ - - స్వామిగారు మేలుకొలుపు ఈ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ వ్రాశారు......
ప్రతి సం  ప్రత్యభినందనలతో మేలుకొలుపు వారినుండి మరింత స్పందనను కోరుతోంది.
5) స్పంII A, మహేశ్వర్ హైద్రాబాద్, వారన్నూ పత్రిక లక్ష్యమూ, ప్రస్తుతం దాని అవసరమూ అన్న విషయంలో తమ అమోదాన్నీ, ఆనందాన్నీ తెలుపుతూనే సిద్ధాంతమూ ఆచరణ పక్షమూ రెండూ అవసరమైనప్పుడు సత్యనిర్దారణకు లోను చేయబడాలన్న నా వాక్యాన్ని ఉటంకిస్తూ ప్రతిపాదన బాగున్నా అట్టిది చాల కష్ట సాధ్యమనిన్నీ ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం వాగ్వివాదాలతో గడచిపోతుందనిన్నీ వ్రాశారు.
ప్రతి స్పంII వారన్నట్లు కొంత సమయం తీసుకుంటుందన్న మాట అసత్యం కాదుగానీ నిజ నిర్ధారణకు సిద్ధం కాని పక్షాలు సమాజానికి బహు కాలంగా ఎంతో కొంత అపకారం చేస్తూనే వస్తున్నాయి. ఆ యనుభవాల నుండి చూస్తే పై ఋజువు కొరకైన చర్చా, దాని కొరకై వినియోగించిన శక్తీ, కాలమూ, దురుపయోగమనో, నిరుపయోగమనే చెప్పుట కుదురదు, సత్య నిర్ధారణకు తగిన వేదిక లేక పోవుటయే నేడు ఆయా చర్చలు ఒక కొలిక్కి రాక పోవడానికి కారణంగా ఉంది. కనుకనే ఆ విషయాలను కూడా క్రమంగా మేలుకొలుపు మీ ముందుంచబోతోంది. నిర్మల, నిష్కలంక హృదయమూ, నిశితమూ, ఏకాగ్రమూ నైన బుద్దితో సంచికాంతర్గత విషయాలలోని లోపాలోపాలను అధ్యయనశీలు లెల్లరూ వెళ్ళడించగలరని ఆశిస్తాను.  మీ సురేంద్ర.
మేలుకొలుపు గత సంచిక తరువాయి 56. ఊర్వశి శారద మద్రాసు,57. G. S. రాజు (సిరీస్ రాజు). విజయవాడ, 58. బొమ్మసాని కృష్ణమూర్తి గొల్లపూడి, 59. K.RC.U. శేషాచలం           (పిన్సిపాల్) విజ్ఞానవిహార్, 60. K. ప్రసాద్ నర్సరావుపేట, 61. P.O నారాయణ నర్సరావుపేట, 62. K. కోటేశ్వర శర్మవిజయవాడ, 63. G. సూర్యనారాయణ మూర్తి ఏలూరు, 64. నేరేళ్ళ రఘునాధరావు విజయవాడ, 65. K. సాంబశివరావు సీతానగరం.
(సశేషం)
15–6–91 Book Post
మా చిరునామా : మేలుకొలుపు C/O సత్యాన్వేషణ మండలి సీతానగరం, పోలకంపాడు (P.0) తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పిన్-522 515

No comments:

Post a Comment