Wednesday, May 1, 2019

తిరుపతిలో మార్చి 30న జరగని బైబిలుపై సత్యాసత్య విచారణ వివరాలు


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
బైబిలు దైవ గ్రంథమా? కాదా? అన్న అంశంపై మల్లెం దేవసహాయం గారికి, ప్టుా సురేంద్రబాబు అను నాకు మధ్య సత్యాసత్య విచారణ దృష్టితో విచారణ యత్నాలు జరుగుతున్న విషయం మీకూ తెలిసున్నదే. మార్చి 30న ఆ విచారణ జరపాలనుకోవడం జరిగింది. గత సంచికలో దీనికి సంబంధించి కొన్ని వివరాలు మీ ముందుంచాను. వాిలో అత్యంత ప్రధానమైన వాి వరకు స్ఫష్టంగా గుర్తుంచుకోవటం కొరకుగా మళ్లా ఒకసారి గుర్తుచేస్తాను.
1. గతంలో ఇరువురము ఒకింత ఆవేశాత్మకంగా, నీవెంతంటే నీవెంతన్నట్లు ప్రకటనలు చేసుకున్నాం.
2. నేను లోకంలో '3' రకాల వాళ్లు తారసపడుతుాంరు. అందులో రెండు రకాల వాళ్లతోనే నేను చర్చకు - విచారణకు - సిద్ధపడతాను. '3'వ రకం అలగా రకం. అల్లరి చిల్లరి రకం. వారితో మాటలాడానికే నేను సిద్ధపడను అని చాలా స్ఫష్టంగా ప్రకించాను.
3. దేవసహాయం గారు అనుసరిస్తున్న - మ్లాడుతున్న - తీరుననుసరించి, నా లెఖ్ఖప్రకారం వారు రెండవ రకానికి చెందిన వారవుతున్నారు. కనుక, రెండవ గ్రూపుకు వర్తించాలన్న నియమనిబంధనలకు వారు సిద్ధపడితే చర్చకు నేను సిద్ధం అని, అంతే స్ఫష్టంగా ప్రకించాను. ఆరంభంలో వారూ అందుకు సిద్ధమేనన్నారు.
ఓ  రెండవ గ్రూపు షరతులలో 1. ఎవరి పక్షం సరైనది అన్న అంశంతో పాటు, విచారణలో ఒక్కోవిషయంపై ఎవరి పక్షం సరైందికాదని తేలితే వారిని రెండో పక్షంవారు చెప్పుతో క్టొాలి. 2. చర్చ ఆసాంతం ముగిశాక ఓడిన వారు గెలిచిన వారికి కోి రూపాయలు పందెపు ధనాన్ని ఇచ్చుకోవాలి.
4. ఈ థలో బత్తిన మణికుమార్‌ గారు, రాధాకృష్ణగారు చేసిన యత్నాల వల్ల మల్లెం దేవసహాయం గారే చొరవతీసుకొని, మనం 1వ గ్రూపుకు చెందిన వారంగా స్నేహ సుహృద్భావ వాతావరణంలో సత్యాసత్య విచారణకు కూర్చుందాం అన్న ప్రకటన చేశారు.
ఈ సందర్భంలో ఒక్కమాట చెప్పుకోవాలి. గత పదేండ్లు పైబడి, నాతో సత్యాసత్య విచారణ పద్ధతుల అధ్యయనం విషయంలో సన్నిహితంగా మెలగిన మణికుమార్‌ గారు, నా గురించీ, సత్యాన్వేషణ మండలి స్వభావాన్ని గురించీ, విపులంగా దేవసహాయంగారితో మ్లాడడం ద్వారానే, దేవసహాయంగారు నాతో 1వ గ్రూపుకు సంబంధించిన పద్ధతులననుసరించే, బైబిలుపై విచారణకు కూర్చోడానికి సిద్ధమైనారు. అంతమంచి కృషి చేసినందుకు మణికుమార్‌ గారిని అభినందించడం సమయోచితం. సందర్భోచితం కూడా. అందుకనే ఆనాడే వారికి అభినందనలు తెలియజేసాను.
5. ఈ యత్నాలన్నిం పర్యవసానంగా, విజయవాడలో ఒకసారి, తిరుపతిలో రెండవసారి ఇరుపక్షాల వారమూ సమావేశమై విచారణ వేదికకు అవసరమైన నియమావళిని రూపొందించుకొని వాిననుసరించే విచారణ పూర్తిచేయాలన్న అంగీకారానికి వచ్చి ఒప్పందపత్రము వ్రాసుకుని సంతకాలూ చేసుకున్నాం.
6. అందులో చాలా స్ఫష్టంగా 1) ఇది 1వ గ్రూపు తరహా సత్యాసత్య విచారణ వేదిక మాత్రమేనని వ్రాసుకున్నాం. 2) వాదప్రతివాదాలుండవు. బైబిలు ప్రకించిన అభిప్రాయాలు సరైనవో, కావో పరిశీలించడమే జరుగుతుంది, అని వ్రాసుకున్నాం. 3) బైబిలు పక్షాన దేవసహాయం గారు బైబిలు ప్రకించినవన్నీ సరైనవేనని రుజువుచేయాలి. 4) బైబిలులో చెప్పినవి తప్పులు అని నేను రుజువు చేయాల్సిన పని లేదు. 5) లోతైన పరిశీలనకు అవసరమైన ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తడమే నేను చేయాల్సిన పని అనీ స్పష్టంగా చెప్పుకున్నాం. 6) దేవసహాయం గారి అభీష్టం మేరకే, విచారణ నేను వివేకపథం 239, 240 సంచికలలో లేవనెత్తిన 274 ప్రశ్నలతో మొదల్టెాలని, అంశాలను కూడా ఆ ప్రశ్నలున్న క్రమాన్ననుసరించే సాగించాలనీ అంగీకరించుకున్నాం. 7) ఇతరేతరమైన విషయాలను ఎవరమూ లేవనెత్తకూడదు, వ్యక్తిగతాంశాలను అస్సలు మ్లాడకూడదు అనీ నిబంధనల్లోనే పొందుపర్చుకున్నాం.
ఆరంభ సమావేశంలోనూ, అంతకుముందు ఇరువురమూ ఒకింత ఆవేశంగా మ్లాడేసుకున్న సందర్భంలోనూ కూడా, 'నా సిద్ధాంతాన్ని పరీక్షకిస్తాను, పరీక్షించండి. మీ సిద్ధాంతాన్ని పరీక్షకివ్వండి, పరీక్షిస్తాను' అని నేను ప్రకించి ఉన్నాను. దానికి మల్లెం దేవసహాయం గారు మీ సిద్ధాంతంతో పనిలేదులేండి. బైబిలును విచారణకు స్వీకరించుదాం. బైబిలు పక్షాన నేనుాంను. బైబిలు చెప్పినవన్నీ సత్యాలేనని నిరూపిస్తాను. బైబిలులో ఒక్క దోషమున్నా బైబిలును విడిచిపెట్టేస్తాను అని స్పష్టంగా ప్రకించియున్నారు.
ఆయనగారు చేసిన ఆ సాహసిక ప్రకటనను, సత్యంపట్ల ఆయనకున్న దృష్టిని ఆనాడే నేనూ ప్రశంసించాను. ఆనాి సభలోనున్న వారిలో పెక్కురూ ఆయనను అభినందించారు.
జరిగినదాన్నంతినీ బ్టి మేమిరువురమూ ఈ విచారణ పూర్తంయ్యేంతవరకూ, పూర్తయ్యాకనూ, 1వ గ్రూపువారిలానే మసలుకోవాలి.
ఏర్పరచుకున్న నియమనిబంధనలను అతిక్రమించరాదు. అందులోనూ 1) విచారణ నుండి అర్థాంతంరంగా విరమించుకోరాదు. 2) అన్యవిషయాలు వ్యక్తిగతాంశాలు ప్రస్తావించరాదు. 3) విషయాలను, వాిపై జరిపిన విచారణను నిర్ణేతలముందుంచి వారి తీర్పులను స్వీకరించాలి.
కానీ, సోంప్రకాష్‌ గార్లిోం గతంలో జడ్జీలకు మేము ఏర్పరచుకున్న నియమనిబంధనలను గురించి వివరించడానికి ఏర్పరచుకున్న సమావేశంలోనూ, మొన్న మార్చి '30'న కమ్యూనిస్టు పార్టీ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన సమావేశంలోనూ దేవసహాయం గారు ఏర్పరచుకున్న నియమాలను ప్టించుకోకుండా, వాిని పలుమార్లు అతిక్రమిస్తూ మ్లాడారు. అందులోనూ కొన్ని ముఖ్యమైనవి ఇవిగో, ఇలాఉన్నాయి.
1. వ్యక్తిగతాంశాలను ప్రస్తావించడం - ఇది రెండు రూపాలలో చేశారాయన.
  ఎ) బైబిలు మీకు ఇసుమంతకూడా అర్ధంకాలేదు.
  బి) బైబిలు మీద అదేపనిగా బురదజల్లేపని మీరు చేశారు.
2. 2వ గ్రూపు విధానం ప్రకారం చర్చకు రాగలరా? రండి, అని అనేకసార్లు రెచ్చగొట్టడం.
  ఎ) నేను బైబిలు సత్యమన్న పక్షాన నిలబడి అవన్నీ సరైనవేనని రుజువుచేస్తాను.
  బి) మీరు బైబిలులో దోషాలున్నాయని రుజువుకు నిలబడతారా?
  సి) ఆ దమ్ము, ధైర్యము మీకున్నాయా? మరందుకు రాగలరా?
3. ఎ) అభౌతిక శక్తులున్నాయని మీరు నిరూపించమంటున్నారు. అవి ఏ మనిషికీ సాధ్యపడవు కదా! అలా అసాధ్యమైన వాిని నిరూపించమనడం తప్పుకదా!
   బి) అభౌతిక శక్తుల జాబితాను తొలగించాలి. వాిని విచారణకు తీసుకోకూడదు.
4. అసలు బైబిలుపై మ్లాడడానికి మీకెవరిచ్చారండీ అధికారం. మీకా అధికారం లేదు, అర్హతా లేదు.
5. నియమనిబంధనావళిలో కొన్ని సవరణలు చేసుకోవాలి. అలా చేసుకోవచ్చని, ఒప్పందపత్రంలోనే చివరిలో ముఖ్యగమనిక అన్నదానిలో చెప్పబడి ఉంది.
6. మీరు ఏదో వంకన విచారణ జరగకుండా చేయాలనుకుంటున్నట్లుగా ఉంది సురేంద్ర గారూ, అవునా?
ఏర్పరచుకున్న నియమావళిని అతిక్రమిస్తూ ఇలా 5, 6 అంశాలలో దేవసహాయం గారు అనేకసార్లు మ్లాడేస్తూ వచ్చారు.
నావరకు నేను, ఆయన, వ్యక్తిగతాంశాలను ప్రస్తావించినప్పుడూ, రెండో గ్రూపు పద్ధతిన చర్చకు రమ్మని ఆవేశంగా మ్లాడినప్పుడూ, బైబిలు మీకేమీ తెలియదంటూ తీసేసి మ్లాడినప్పుడూ, చర్చజరగకుండా తప్పించుకోవాలని చూస్తున్నారా? అని అసత్యారోపణ చేసినప్పుడూ, ఇలా ఆయన పద్ధతిని విడిచిప్టిెన ప్రతిసారీ, నేను, మనం ఏర్పరచుకున్న నియమాలను విడచి ఏ పనికీ సిద్ధంకానని చెప్పాను. సమావేశంలో ఉన్న అందరినీ ఉద్దేశించి, ఆయన నియమాలనతిక్రమించి, అన్యవిషయాలను లేవనెత్తుతుంటే ఒక్కరూ అదేమినరేమని అడిగాను. అధ్యక్షస్థానంలో ఉన్న మణికుమార్‌ గారినైతే మాిమాికీ, దేవసహాయం గారు అనకూడని మాటలంటున్నారు. వారిని నియంత్రించండి. ఆ మాటలను ఉపసంహరించుకోమనండని హెచ్చరిస్తూ వచ్చాను.
ఒకి రెండు సార్లైతే, నియమాలను ఉల్లంఘించిన విషయాన్ని దేవసహాయంగారే అంగీకరించినట్లు నిర్ధారణయ్యే మాటలు ఆయనే పలికారు. అవేమంటే; నియమ నిబంధనలను పాించాల్సింది రేపి విచారణ వేదికలో మాత్రమే. ఈ సమావేశాలలో కాదు అని దేవసహాయం గారే అనేశారు. అంటే ఈ సమావేశాలలో ఆ నియమాలను పాించకపోవడం తప్పుకాదని అంటున్నట్లే కదా.
నిజానికి, మేమంతా మార్చి '30' సమావేశం, ప్రధానమైన విచారణ వేదిక కొరకు అనుకునే హాజరైనాము. విచారణకు ఒక్కరోజు సరిపోకపోవచ్చు కనుక 29, 30 రెండు రోజులు పెట్టుకొంటే బాగుంటుందని ముందుగానే వారి దృష్టికి తెచ్చాము. మొద్లో వారి అధికార ప్రతినిధిగారు దేవసహాయం గారిని కనుక్కొని చెబుతానని చెప్పి, అలాగే రెండు రోజులు పెట్టుకుందాం అని అంగీకారాన్ని తెలిపారు. దానిననుసరించే మా పక్షం నుండి సమావేశానికి రావలసిన వారందరం 29, 30 తేదీలు తిరుపతిలో ఉండడానికి వీలుగా రైల్వే రిజర్వేషన్లు చేసేసుకున్నాం కూడా. నిర్ణేత పక్షానికీ ఈ సమాచారం అందించాల్సిందిగా సోం ప్రకాష్‌ గారికి తెలియజేశాము. దానిననుసరించే ఆయనా, మాకు తిరుపతి విష్ణు నివాసములో రూములు ఏర్పాటుచేసి వుంచారు. ఇదంతా అయ్యాక, దేవసహాయం గారి ప్రతినిధుల నుండి '29'న వారికి వేరే పనులున్నాయని, కనుక 29న రావడం కుదరదని, '30'న ఒక్కరోజు మాత్రమే సమావేశమని మాకు కబురందింది. చేసేదేమీ లేకపోవడంతో, ఆ ఒక్కరోజైనా వీలైనంత ఎక్కువ సమయం విచారణలో కూర్చోగలిగితే బాగుంటుందనీ, కనుక '9' గంటలకల్లా ఆరంభించుకుందామని వారికి తెలియజేశాము.
అనుకోని అవాంతరం
నిర్ణేతల పక్షంలో పాలుపంచుకోవలసిన విశ్రాంత న్యాయమూర్తి గురప్ప గారి, సమీప బంధువులలో ఎవరొ ఒకరు 29 నాడు హత్యచేయబడ్డారు. కనుక '30' సమావేశానికి సకాలంలో నేను రాలేకపోవచ్చు. వీలయినంత త్వరలో రావడానికి యత్నిస్తాను అని గురప్పగారి నుండి సోంప్రకాష్‌ గారికి ఆ రోజు ఉదయం కబురందింది. ఇక ఆ రోజు విచారణ వేదిక సమావేశం దాదాపు జరక్కపోవచ్చు అన్న అంచనాకు నేను వచ్చేశాను. అయినా మిగిలిన ఇద్దరు నిర్ణేతలు వస్తే ఇరుపక్షాలూ అంగీకరిస్తే డా|| బ్రహ్మారెడ్డి గారిని మూడో నిర్ణేతగా కూర్చోబెట్టుకుంటే ఎలాఉంటుందని అప్పికి అక్కడున్నవారితో అన్నాను. మీ ఇరుపక్షాలూ అంగీకరిస్తే బాగానే ఉంటుంది అన్నారు వాళ్ళున్నూ.
సమయం పదిన్నర అయింది. దేవసహాయం గారి బృందం రాలేదు. నిర్ణేతల పక్షంలో రావలసిన విశ్రాంత న్యాయమూర్తులూ అప్పికి రాలేదు. 11 గంటలు దాక దేవసహాయంగారు, వారి బృందమూ వచ్చారు. వారే నిర్ణేతల పక్షంలోని దాసప్ప గారినీ తోడ్కొని వచ్చారు. మరో న్యాయమూర్తి రాలేదు. రాగలనో లేదో చెప్పలేను, అనుకోని పనులు వచ్చిపడ్డాయని కబురు చేశారు.
ఇహనేం! సమావేశం జరగదని తేలిపోయినట్లే. ఏమిచేద్దామంటే ఏమిచేద్దామనుకున్న తరుణంలో మల్లెం దేవసహాయంగారో బాంబు పేల్చారు. అసలీ సమావేశం విచారణకొరకు ఉద్దేశించింది కాదు. గత సమావేశంలోనే, నేను లేవనెత్తిన అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు కదా! వాిని తేల్చుకోకుండా విచారణ ఎలా మొదలెడతాము? అభౌతికాంశాలను మినహాయించే, విచారణీయాంశాలుండాలి. అంతవరకే విచారణ జరగాలి. దానికి మీకంగీకారమైతేనే విచారణ, అని అన్నారాయన.
ఆ బృందం తప్ప, మిగిలిన వారందరికీ, ఇది ఊహించని సంఘటనే. వారి వెంట వచ్చిన న్యాయమూర్తి దాసప్పగారూ మా వైపు నుండి వచ్చిన డా|| బ్రహ్మారెడ్డి గారు కూడా ఇది ప్రధాన విచారణ కొరకు పెట్టుకున్న సమావేశమేనని తాము అనుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. ఇదంతా మీకు అసమంజసంగా ఉందనిపించినా, న్యాయమూర్తులిరువురు లేరుగనుక, ఈరోజు విచారణ ఎలాగూ సాగదు కనుక, ఆ తేల్చుకోవలసిన అంశాలపై మ్లాడుకుంటే ఈసారి సమావేశానికి ఏ అభ్యంతరాలు ఉండవుకదా అనుకొని, సందర్భాంశాన్ని చర్చకు పెట్టుకుందామనుకున్నాం.
విచారణ విషయంలో దేవసహాయం గారు లేవనెత్తిన అభ్యంతరం
అభౌతికాంశాలను విచారణకు తీసుకోవద్దు. వాిని ప్రపంచంలో ఎవరూ రుజువుచేయలేరు. కనుక ముందుగా మనమిరువురమే అలాిం అంశాలను గుర్తించి వాిని విడచి మిగిలిన అంశాలనే విచారణకు తీసుకోవాలి.
దానిపై నేను వెలిబుచ్చిన అభిప్రాయం.
అలా అయితే బైబిలుపై విచారణే సజావుగా చేసినట్లు కాదుగదా! కనుక వాిని కూడా వేదికలో ప్రస్తావించాల్సిందే. వాిపై అవి అభౌతికాంశాలు గనుక నిరూపించటం కుదరదు అని ప్రకించండి. దానిపై న్యాయనిర్ణేతలు మీ అభిప్రాయం ఏమిటని నన్నడుగుతారు. అది వాస్తవమే. అభౌతికాంశాలు అనిర్ధారితాల జాబితాలో చేర్చాల్సిందేనంటూ నా సమ్మతిని తెలుపుతాను. అప్పుడు నిర్ణేతల పక్షం ఇరుపక్షాలు చెప్పినదాన్ని బ్టి అి్టవాిని అనిర్ధారితాంశాలుగా తీర్పునిస్తారు.
ఎందుకంటే, బైబిలు చెప్పినవన్నీ ఎంపిక చేసుకున్న అంశాలు. క్రమముననుసరించి విచారణకు లోనుచేయాల్సిందే కనుకనూ, అది సత్యమా? అసత్యమా? అనిర్థారితమా? అని నిర్ణయించాల్సింది మనం కాదుగనుకనూ, నిర్ణేతల పక్షమే గనుకనూ అని నా పక్షాన్ని వినిపించాను.
దానికి దేవసహాయం గారు, ససేమిరా! అంగీకరించలేదు. అనిర్ధారితాంశాలని విచారించి వేదికే తీర్మానం చేస్తే, అది మా సంస్థ ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది అని, దానికి మేమంగీకరించము అని పట్టుబ్టారు. లోకంలో ఎవ్వరూ రుజువుచేయలేని వాిని రుజువుచేయమాంరేమిటని నన్ను ఆక్షేపించారు.
అి్ట వాిని రుజువుచేయమని నేననడం లేదు. పైగా అభౌతికాంశాలు అనిర్ధారితాలని గత '30' ఏండ్లుగా నేను చెబుతూ వస్తున్నాను, అని నేను స్పష్టంగా చెప్పాను. మనం ఏర్పరచుకున్న నియమావళిననుసరించి బైబిలులో ఎంపికచేసుకున్న విషయాలన్నింని, 274 ప్రశ్నలతో మొదల్టెి ఒక క్రమంలో విచారణ పూర్తిచేసి, అప్పుడు చెప్పాలి. అవి ఒప్పులో, తప్పులో, అనిర్ధారితాలో అన్నది, అని నేను గ్టిగా చెప్పాను.
మా వాదన చాలాసేపు ఎటూ తేలకపోవటంతో న్యాయమూర్తి దాసప్పగారు మీరిరువురూ వింనంటే నేనొక సూచనచేస్తానన్నారు. చెప్పండన్నాను నేను.
ఈ అంశాన్ని నిర్ణేతల నిర్ణయానికి వదిలెయ్యండి. మేము ముగ్గురం కలసి ఆలోచించుకొని, అభౌతికాంశాలను విచారించి అనిర్ధారితాలుగా నిర్ణయించడం సరైందో, ముందే వాిని విచారణీయాంశాల జాబితా నుండి తొలగించి, మిగిలిన అంశాల వరకే విచారించడం సరైందో నిర్ణయం చేస్తాము. అి్ట మా నిర్ణయాన్ని మీ రిరువురూ అంగీకరించి తీరాలి అని సూచించారు.
దేవసహాయం గారు, వాిని విచారణకు తీసుకొనే కూడదు అని పట్టుబ్టి కూర్చోనుండడంతో, నేను ఆలోచించుకొని, విచారణ జరిగితీరాల్సిందే అన్న దృష్టితో, దాసప్ప గారితో, నేనొక మెట్టు దిగి మీ సూచనను అంగీకరిస్తున్నాను. నిజానికి మా ఒప్పందం ప్రకారమైతే అన్ని అంశాలూ విచారణకు పెట్టే నిర్ణయాలకు రావలసి ఉంది అని చెప్పాను.
దానికీ దేవసహాయం గారు అంగీకరించలేదు. పైగా ఒక థలో ఏ అంశాలు విచారించాలో, ఏది విచారించక్కరలేదో నిర్ణయించాల్సింది మేమే గాని, నిర్ణేతల పక్షం వారు కాదు. అందులో మీ ప్రమేయం అనవసరం అనేశారు. దాసప్పగారూ మౌనంగా ఉండిపోయారు.
ఈ థలో బ్రహ్మారెడ్డి గారు మాత్రం ఒకి రెండు సార్లు దేవసహాయం గారి మాటలు ఇరువురూ కలసి రూపొందించుకొన్న ఒప్పందంలోని నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి కదా అని సూచించారు. ఎవరేమి చెప్పినా దేవసహాయం గారు మాత్రం, తాము చెప్పిందానికి అంగీకరిస్తేనే విచారణ ప్రక్రియ ఆరంభమవుతుంది. లేకుంటే లేదు అన్న దగ్గరకు వచ్చేశారు.
నేను చాలాసేపు ఆలోచించుకొని, మరో మెట్టు దిగి ఒక సూచన చేస్తున్నాను. దేవసహాయంగారు చెప్పినట్లే అభౌతికాంశాలను ప్రక్కన ప్టోలన్నా ముందుగా 'అభౌతికం' అంటే ఏమిో ఇరుపక్షాలూ, వేదిక ఖరారు చేసుకోవాలి కదా? ఇది జరక్కపోతే రేపు మళ్లా అభౌతికాంశాల క్రిందికి ఏవి వస్తాయి? ఏవి రావు అన్న విషయంలో వివాదం ఏర్పడుతుంది. కనుక 'అభౌతికం' అంటే మీరేమనుకుంటున్నారో ప్రకించండి. నేనూ ప్రకిస్తాను. ఆ విషయంలో ఒక సరైన నిర్ణయానికి వచ్చి, ఆ కొలతననుసరించి కొన్ని అంశాలను విచారణాంశాల జాబితా నుంచి మినహాయించుకోవచ్చు అన్న సూచన చేశాను.
దేవసహాయం గారు, 'కింకి కనిపించనిది, అదృశ్యరూపమైనది ఏదో దానిని అభౌతికం' అంారని చెప్పారు. మీరు చెప్పదలచింది వ్రాతరూపంలో కాగితంపైన పెట్టండి. నేనూ అలానే వ్రాస్తాను అని చెప్పాను. ఇరువురమూ వ్రాశాము. వాిని నిర్ణేతలకిచ్చి ఎవరు చెప్పింది సరిగా ఉందో నిర్ణయించమని అడగాలనుకున్నాం. ఈ విషయంలో అవసరమైతే భాషావేత్తలనూ సంప్రదించవచ్చు అనుకున్నాం.
ముగింపు
మార్చి 30 నాి సమావేశంలో చివరాఖరుకు క్రింది నిర్ణయాలకు వచ్చాము.
1. మలి సమావేశం జూన్‌ 18న విజయవాడలో జరుపుకోవాలి.
2. సమావేశం అయిన వెంటనే, అభౌతికానికి ఇరువురం అంగీకరించుకున్న అర్ధాన్ని బ్టి అభౌతికాంశాలను గుర్తించి అవి రుజువు చేయలేనివి గనుక మినహాయించాలి.
3. మిగిలిన అంశాలపై విచారణ సాగించి సత్యాసత్యాలను కనుగొనాలి.
4. ఈ లోపునే 'అభౌతికం' అంటే ఏమిో దేవసహాయం గారు తెలుసుకొని మాకు తెలియజేయాలి.
5. విచారణ వేదికలో శ్రోతలు - వీక్షకులు, ఎక్కువ మంది ఉండరాదు. ఎంపిక చేసుకున్న కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.
6. జరిగేదాన్నంతినీ రికార్డు చేసుకోవచ్చు. కావాలనుకుంటే 'లైవ్‌ టెలికాస్ట్‌' చేసుకోవచ్చు.
గమనిక : మా వివాదాన్ని గురించి తెలిసిన వారెందరో ఏమైంది? ఏమైందంటూ అడుగుతుండటంతో జరిగిందాన్ని క్లుప్తంగా వివరించానిక్కడ, గమనించగలరు.
ఒక సంతోషకరమైన వార్త
సత్యాన్వేషణాతత్పరులైన వారంతా సంతోషించదగిన ఒక వార్త పాఠకులందరికీ, ముఖ్యంగా మండలి సభ్యులందరకు తెలియజేస్తున్నాను. సుమారు థాబ్దకాలం పైబడి నాతోను, మండలి సభ్యులతోను మిత్రులుగా కొనసాగుతూ వస్తున్న ప్రాతూరు రాధాకృష్ణగారు మొన్న ఏప్రిల్‌ 13న మండలి త్రైమాసిక సమావేశాలలో ఒక సాహసికమైన, సంతోషకరమైన బహిరంగ ప్రకటన చేశారు.
ఆయనగారు, దయానంద సరస్వతి ప్రవచిత ఆర్యసమాజ - వైదిక - సిద్ధాంతం సరైందన్న దృఢాభిప్రాయంతో కొనసాగుతూ వస్తున్నారు. అయినా నాతో పరిచయం అయిన దగ్గర నుండి మండలికి చెందిన ప్రమాణ విద్యను తెలుసుకొనే, నేర్చుకొనే పనిని, వివిధ తాత్విక ధోరణులను తులనాత్మక విచారణ చేసే పద్ధతినీ అభ్యాసం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో నాకూ, వారికీ మధ్య పలుమార్లు, ఆర్యసమాజ సిద్ధాంతాన్ని మండలి విధానాన్ననుసరించి విచారణకు లోనుచేయాల్సి ఉందన్న మాటలు జరుగుతూ ఉండేవి. ఆయనగారూ, ఆ అవసరం ఉందిగాని, అందుకుగాను నేను మరికొంత వాదనైపుణ్యాన్ని సమకూర్చుకోవలసి ఉంది, అంటూ అంటుండేవారు. నేను అప్పుడప్పుడూ వారిని మరికొంత వత్తిడిపెడుతూ, సత్యాన్వేషిగా ఉండడం, సత్యస్థాపనోద్ధతి కలిగి ఉండడం ఒక ప్టాన అయ్యేపని కాదని, దానికి చాలా తెగువ ఉండాలని అంటుండే వాణ్ణి. ఆ నా వత్తిడిని ఎంతో సహనంతో భరిస్తూనే క్రమంగా వైదిక సిద్ధాంతంపై నాతో విచారణకు మానసికంగా తయారవుతూ వచ్చారు. ఆ సంసిద్ధతే మొన్న ఆయనగారిచేత అలా బహిరంగ ప్రకటన చేయించగలిగింది. ఆయనగారి ప్రకటన సారాంశమిది.
1. ఆర్యసమాజ సిద్ధాంతపక్షాన సురేంద్రతో సత్యాసత్య విచారణకు నేను సిద్ధపడుతున్నాను.
2. విచారణకు పెట్టడానికి ఇప్పికీ కష్టమనుకున్న కొన్ని అంశాలను ప్రస్తుతానికి ప్రక్కనుంచి విచారణకు పెట్టగల అంశాలలో విచారణను ప్రారంభించుకుందాం.
3. రెండునెలలలోపు ఒక తేదీని ఖరారు చేసుకొని విచారణ మొదలెట్టుకుందాం.
4. ఏఏ అంశాలపై చర్చించాలన్నది సుస్పష్టంగా ప్రకించకపోయినా, స్పష్టాస్పష్టంగా కొంత వివరించారు.
ఎ) దయానందుని ప్రమాణాలపై విచారణ.
బి) భౌతికాంశాల సంబంధంగా, పంచభూతాల విషయం, యజ్ఞం - దాని ప్రయోజనం.
5. విచారణ ప్రక్రియంతా నియమనిబంధనలననుసరించి జరగాలి. నిర్ణేతలనూ ఎంచుకోవాలి.
వారి ప్రకటనపై నా స్పందన
మిత్రులు రాధాకృష్ణ గారికి, అభినందనలు మిత్రమా!
చాలా సమయం తీసుకున్నా సరైన నిర్ణయానికి వచ్చినందుకూ, సత్యాన్ని స్వీకరించానికీ, అసత్యాన్ని విసర్జించానికీ సర్వదా సంసిద్ధంగా ఉండాలన్న దయానందుల వారి మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ఒక నిజాయితీగల ఆర్య సామాజికునిగా ప్రవర్తించినందుకూ మీకు నా అభినందనలు. మీరన్నట్లే ఎక్కడో ఒకచోట మొదల్టెి సత్యాసత్య విచారణ సాగించుదాం.
మనం 1వ గ్రూపుకు చెందిన వాళ్లంగా ప్రవర్తించగల మానసిక సన్నిద్ధత ఉన్నవాళ్లమే గనుకనూ, చర్చావేదిక నియమనిబంధనల విషయమై దాదాపు ఏకాభిప్రాయం కలిగిఉన్నవాళ్లమే గనుకనూ, విచారణ ప్రక్రియలో అవాంతరాలకు అంతగా తావుండకపోవచ్చు. మన ఈ ప్రయత్నం మన పరిచయస్తులలోని మరికొందరు సత్యస్థాప నోద్దతులకూ ప్రేరణ కల్గించాలని ఆశిద్దాం. కనుక ఏ రకంగా చూసినా ఇది అభిలషణీయమే.
మరోమాట
మీరు నాకు  పరిచయం అయ్యేనాికే మీతో మిత్రులుగా ఉంటూ ఉన్న క్రైస్తవ, ఇస్లాం, హైందవ పక్షాలకు చెందిన వారిలోనూ ఇలాి కదలిక వస్తే బాగుంటుంది. ముఖ్యంగా మణికుమార్‌ మాస్టారు, ముస్తాక్‌ గారు కూడా వారు వారు స్వీకరించి అనుసరిస్తున్న బైబిలు, ఖురాను సిద్ధాంతాలపై సత్యాసత్య విచారణకు సిద్ధపడాలన్నది నా అభిలాష.
చిన్న జీవితాలు మనవి. ఉన్నన్నాళ్లు ఉండబోము. నలుగురూ బాగుండాలన్న పెద్దల మనస్సును అంతో ఇంతో అర్ధం చేసుకొని, ఇష్టపడుతున్న వాళ్లంగానే ఉన్నవాళ్లం మనం. సత్యాన్ని కనుగొని, దానిని స్వీకరించి, సమాజానికీ అందించటం వల్ల పోయేదేమీ ఉండదు అజ్ఞానం తప్ప.
కనుక, మీరు చూపిన ఈ చొరవను ఆసరా చేసుకొని వారిరువురకూ, అదే స్వభావం కల వివిధ థోరణులకు చెందిన మిత్రులు, పరిచయస్తులకూ ఈ ముఖంగా ఒక బహిరంగ ఆహ్వానం పలుకుతున్నాను.
రండి! నిజాయితీగల సత్యాన్వేషులముగా కలసి కూర్చొని మనం మన సిద్ధాంతాలను ఒక్కొక్కిగా విచారణకు లోనుచేసి, తేలిన విషయాలను అందరమూ స్వీకరించి, సమాజానికి అందించే పని చేస్తూ జీవితాలను సాగించుదాము. మీ అందరికీ మరోసారి మండలి సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది. రండి! సత్యాన్ని ఆవిష్కరించుకొని, స్వీకరించి, ఆచరించుకొందాం రండి. అందరం వివేకపథికులం కావాలన్నదే నా ఆకాంక్ష.
నా యీ ప్రకటన సమాజంలో ఈనాికీ మనుగడలో ఉన్న అన్ని ధోరణులకు సమానంగా వర్తిస్తుంది. జ్ఞానక్షేత్రమంతికీ ఆయువు పట్టైన సత్యావిష్కరణ లక్ష్యంగా శ్రమించుదాం రండి.

No comments:

Post a Comment