Wednesday, May 1, 2019

విజయకుమార్‌ గారి క్రొత్త తరహా ప్రసంగం


పి.డి.సుందర్రావు గారి 'భూతలక్రిందులు' పత్రికపై విమర్శనాత్మక విశ్లేషణ చేస్తూ విజయకుమార్‌ గారు, పి.డి.సుందర్రావు గారి బైబిలు అవగాహనలో లోపముందనీ, అపో. 17 :6, వచనంలోని, భూలోకమును తలక్రిందులు చేయువారు క్రైస్తవులు కారనీ, వారు సాతాను ప్రతినిధులేనని వివరించారు. దానిపై పి.డి.సుందర్రావు గారి బృందమూ, బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిీ ఇంటర్నేషనల్‌ వారిని అభిమానించే అనేక మంది బైబిలు విశ్వాసులూ, విజయకుమార్‌ గారిని వివిధ రకాలుగా దూషిస్తూ, నిందిస్తూ సోషల్‌ మీడియాలో మ్లాడేశారట. ఆ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విజయకుమార్‌ గారు, 'విశ్వాసులకు వి.కె.ఆర్‌. విన్నపం' అంటూ మరో వీడియో ప్రసంగం చేశారు. అందులో విజయకుమార్‌ గారు అనేకానేక వాస్తవాలను రాసిపోసేశారు. ఒక ప్రసంగంలో విజయకుమార్‌ గారు ఇలా, ఇన్ని వాస్తవాలను, ఇంత సంయమనంతో మ్లాడడం గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో గాని, నా దృష్టికి రాలేదు. ఏమాత్రం విచక్షణా జ్ఞానం, విజ్ఞత పనిచేస్తున్న వారైనా వారి ఈ ప్రసంగాన్ని మెచ్చుకొని తీరాలి. ఆయన అలా, నిర్భయంగా, నిజాయితీగా, నిబ్బరంగా అనేక విలువైన భావాలను వెల్లడించడం, నావరకు నాకు ఆపుకోలేనంత సంతోషాన్ని కలిగించింది. అదిగో ఆ సంతోషాన్ని నలుగురికీ పంచాలనుకునే ఇలా ఈ వ్యాసాన్ని మీ ముందుకు తెచ్చాను.
గమనిక : నేరుగా ఆయన వీడియో ప్రసంగాన్నే గమనించదలచుకున్న వారు ఖీ.ది.జీ.జిరిఖీలిశి.ఖీ అని సెర్చిచేయండి. అక్కడది మీకు దొరుకుతుంది.
ఆయనగారు వెలిబుచ్చిన అభిప్రాయాలు :
1. పి.డి.సుందర్రావు గారు ఎంత మేథావి అయినా, బైబిలు అవగాహన విషయంలో, వారి వివరణలు అక్కడక్కడా వాక్య విరుద్ధంగా ఉంటున్నాయి.
2. బైబిలు ఓపెన్‌ యూనివర్సిీకి చెందిన కొందరు సంస్కార హీనంగా మ్లాడుతున్నారు. అది వీరి దోషం కాదు. ఆ బడిలో చదువుకున్న వారందరికీ, ఆ శిక్షణలో భాగంగానే ఆ దురుసుతనం అలవాటవుతుంది.
3. వారి బోధనా శైలిలోనే, మనని మనం తగ్గించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి లాి మాటలు అలవర్చటం ఉండదు. డాంబికంగాను, దురుసుతనంతోనూ కూడా ఉంటుందా బోధన. కనుక అక్కడ చదువుకున్న వారందరిలోనూ అదే ఒరవడి కనపడుతుంది.
4. నేను అనేక సంవత్సరాలుగా బైబిలును అధ్యయనం చేస్తూ తయారు చేసుకున్న న్స్‌ో నుండి, ఏది సత్యమో దానిని ప్రజల ముందు పెడుతున్నాను. ఇకముందూ పెడుతూనే ఉంాను.
5. భూమ్మీద నాకెక్కువ ఇష్టమైన వ్యక్తి జయశాలి గారే. కాకుంటే ఆయన బైబిలు పైన మ్లాడిన వాిలో కొన్ని వాక్యవిరుద్ధంగా ఉన్నాయి గనుకనే చెప్పవలసి వచ్చింది.
6. బైబిలు ఓపెన్‌ యూనివర్సిీలో చదువుకున్న వారందరికీ, ఈ సంస్కార హీనమైన, రెచ్చిపోయి మ్లాడే అలవాటుంటుంది. ఇది నేను వారిపై వేస్తున్న అభాండం కాదు. అనుభవంతో చెబుతున్న మాటే. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ గూిలోని వాణ్ణే కనుక.
7. క్రైస్తవుణ్ణి ఎవరైనా నిందించి, దూషించి, హింసించితే సంతోషించండి. పరలోకంలో ఆ నిందపడిన వాడిపని మెరుగవుతుంది అంోంది బైబిలు.
8. కొందరు ఇలా బహిరంగంగా మ్లాడటమెందుకు నేరుగా బైబిలు యూనివర్సిీ కేంద్రానికి వెళ్లి వారితోనే ఈ విషయం చెప్పొచ్చుగా అన్న సలహా ఇస్తున్నారు. అక్కడికి వెళితే వారు మన సలహాలను వినకపోగా మూకుమ్మడిగా దాడిచేసే ప్రమాదమూ ఉంది.
9. మరి కొందరు, నువ్వక్కడున్నప్పుడు ఈ విషయం తెలియలేదా, అంటూ వ్యంగ్యంగా మ్లాడుతున్నారు. వ్యంగ్యంగా మ్లాడినా వారన్నది నిజమే. నేనూ అక్కడున్నంత కాలం ఆయనమీద అభిమానంతో, అదంతా వాస్తవమేనని గుడ్డిగా అనుకుంటూ వచ్చాను.
10. అయినా ఒక్కనిజం చెప్పాలి. ఎవరికైనా అప్పి వరకు తాము సరైందేనని అనుకుంటూ వచ్చిన విషయం తప్పని తెలిసినప్పుడు మార్చుకోవడం చాలా ముఖ్యమైనది. బైబిలు ప్రకారం చూసినా, అలా మార్చుకోలేకపోతే నరకానికి జారిపోతాము.
11. గతంలో నేర్చుకున్న దానిలో దోషాలున్నాయి అని మన పరిశీలనలో తేలినప్పుడు, నేర్చింది ఎంతవారి దగ్గరైనా తప్పును విడచి, ఒప్పును స్వీకరిస్తే దేవుడూ సంతోషిస్తాడు.
12. ఈ విషయాలు ఒకప్పుడు నీకు తెలియలేదా? అంటే, నిజంగానే అప్పుడు నాకవి తప్పులని తెలియలేదు. ఆ నిజాన్ని స్వయంగా నేనీనాడు అంగీకరిస్తున్నాను.
13. ఒక వ్యక్తినెవరినైనా పిచ్చిగా అభిమానిస్తే అతనిలోని లోపాలు ఆ థలో కనపడవు మరి.
14. తన అవగాహనలో లోపాలున్నాయని తేలితే, ఎవరైనా, అతడెంతి వాడైనా వాిని సరిచేసుకొని తీరాలి. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులుండవు.
15. ఒక ఉదాహరణ : 20వ శతాబ్దపు సంచలనాలు. ముఖచిత్రం - మరో పుస్తకంలోని ముఖచిత్రం మధ్య వ్యత్యాసాలు చూపుతూ సుందర్రావు గారి అవగాహన లోని ఒక లోపాన్ని రుజువుగా చూపారు.
16. అప్పికి మనకున్న అవగాహనలో తప్పుందని గమనిస్తే బ్రతికుండగానే తానే సరిచేసుకుంటే మేలు.
17. 666 గురించి పి.డి.సుందర్రావు గారు చెప్పింది, ఆయన కుమారుడైన ప్రసన్నబాబు గారు చెప్పింది పరస్పరం పూర్తి వ్యతిరేకంగా ఉంది. మరి రెండూ రైట్లు కావుకదా. ఎవరిది ఒప్పన్నట్లు.
18. బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిీ వారు బైబిలును అర్థం చేసుకోవడంలో పొరబడిన అంశాలెన్నో ఉన్నాయి.
19. నిజమైన విశ్వాసి, అసత్యాలనుండి బయటపడానికి సిద్ధంగా ఉండాలి లేకుంటే పరలోకం తప్పిపోద్ది.
20. పి.డి.సుందర్రావు గారి బృందం నోరు ఎంత దురుసో చాలా బాగా చెప్పారు విజయకుమార్‌ గారు. వారు ప్రేమతో చెబితే వినే రకం కాదు. ఛాలెంజ్‌ అంారు. కబడ్దార్‌ అంారు. వేసేస్తామాంరు, చించేస్తామాంరు, ఈడియ్‌ అంారు, లుచ్చా అంారు, బచ్చా అంారు, డర్టీ ఫెలో అంారు ... ఇలా ఎన్నెన్నో అంారు. ప్రక్కనున్న ఆయన బృందమూ చప్పట్లు కొడతారు. చంకలు బాదుకుాంరు.... అంతేగాని సత్యాన్ని మాత్రం గ్రహించరు.
21. అందరికీ అన్ని విషయాలు తెలియవు. మరొక్కసారి చెబుతున్నాను. భూమిమీద బ్రతికున్న సేవకులలో ఎవరూ బైబిలులో పరిపూర్ణులు కారు. ఎ టు జడ్‌ బైబిలంతా ఎవరికీ తెలియదు.
22. ఒక్కొక్కరికీ కొన్నికొన్ని తెలుస్తాయి, కొన్నికొన్ని తెలియవు. ఒకరినుండి మరొకరు తెలుసుకుంటుండాల్సిందే. ఈమాట పలుమార్లు నొక్కిచెప్పారు విజయకుమార్‌ గారు.
23. ఈమధ్య కాలంలో గుర్తింపులోకి వచ్చిన తమ్ముళ్లు కొందరున్నారు. శాంసన్‌, జేమ్స్‌ లాిం వాళ్లు. వాళ్లు అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు. వారు చెబుతున్న విషయాలు కొన్ని నాకు తెలియనివి ఉంటున్నాయి. కనుక అందరికీ అన్నీ తెలియదన్న నిజాన్ని అందరం అంగీకరించాలి.
24. అంతా నాకేతెలుసన్న భ్రమలో ఎవరూ ఉండకూడదు. ఒకరినుండి ఒకరు నేర్చుకుంటూనే ఉండాలి.
25. అలా అందరూ నేర్చుకుంటున్నారాంరా? అని అడుగుతారేమో. అందరి సంగతేమో గాని నేను మాత్రం నేర్చుకొంటూనే ఉన్నాను. నాకంతా తెలియదు. నిజంగానే చెబుతున్నాను. బైబిలు నాకు అంతా తెలియదు. ఇంకా సరిగా చెప్పాలంటే 10శాతం కూడా తెలియదు.
26. చాలా సంవత్సరములు వృధాచేశాను. ఇప్పుడు శ్రద్ధగా బైబులు చదువుతుంటే చాలా సంగతులు దేవుని కృపతో తెలుస్తూ వస్తున్నాయి.
27. నేను చెప్పే సంగతులు వింటున్నారు, నేను చెప్పిన సంగతులు మాత్రమే వింటే వారు జ్ఞానులు కారు. అక్కడితో ఆగిపోతారు. అలాగే ఆయా బోధకులను అనుసరిస్తున్న వారు, కేవలం వారొక్కరి బోధనలతోనే సరిపెట్టుకొంటే వారెప్పికీ పూర్ణులు కాలేరు.
28. ఈరోజు చాలామంది విశ్వాసులు వారివారి బోధకులే సర్వజ్ఞులనుకుంటున్నారు. ఇలా వ్యక్తుల్ని అభిమానించి అనుసరించటం వలన మీరెప్పికీ జ్ఞానులు కాలేరు. చచ్చేంతవరకు బైబిలును తెలుసుకుంటుండాల్సిందే.
29. వ్యక్తులపై అభిమానం పెంచుకుని వారితోనే ముగించుకుంటే నష్టపోయేది మీరే.
30. ఈనాి బోధకులలో చాలామంది తన అనుయాయులకు, మీరు ఇతర బోధనలేవీ వినకండి అని కట్టడి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విశ్వాసులు పరిపూర్ణులు కాకుండా అయిపోతున్నారు.
31. నేననేదేమంటే, విశ్వాసులు ఎవరికి వారుగానూ బైబిలును శ్రద్ధగా చదువుతుండాలి.
32. ఉదా : పౌలు శరీరంలో ముల్లు - అన్న మాటకు రకరకాల అర్థాలు చెప్పారు. అందరూ ఒకేమాట ఎందుకు చెప్పలేక పోయారు? పోనీ అందరూ సమావేశమై ఏదో ఒకే అర్థాన్ని చెప్పాలని నిర్ధారించుకోవచ్చు కదా. అబ్బే అలా ఎన్నికీ రారు.
33. పొరపాటుగా వివరించామని తెలిసొచ్చాకనూ, దానిని ఒప్పుకొని మార్చుకోడానికి, ఈనాి బోధకులలో ఎక్కువమంది సిద్ధంగా లేరు.
34. మనల్ని మనం తగ్గించుకొని, పొరపాట్లు జరిగితే ఒప్పుకొని సరిచేసుకోడానికి సిద్ధంగా వుండాలి. అలా తప్పులు సరిచేసుకోడానికి సిద్ధపడకుంటే విశ్వాసులైన మీరందరూ కూడా నాశనానికి వెళ్లిపోతారు.
35. మాలాిం బోధకుల నుండి విశ్వాసులైన మీరు నేర్చుకుంటేనే, నేనే తప్పు చెప్పానని మీరు గమనించిన రోజున నాకైనా ఇది తప్పని చెప్పడానికి మీరు వెనుకాడకూడదు.
36. మమ్మల్ని సరిచేసేందుకైనా సిద్ధంగా ఉండాలి. మీరు బైబిలును స్వయంగా చదివనంతకాలం, కేవలం వ్యక్తుల ప్రసంగాలపైనే ఆధారపడినంతకాలం మీకు బైబిలు అర్ధం కాదు. మీరు పరిపూర్ణులు కారు.
37. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నదిగా కాక దేవుని శక్తిని ఆధారం చేసుకున్నదై ఉండాలి.
38. బైబిలు అందరూ చదవాలి. నిశితంగా పరిశీలించాలి. ఏ విశ్వాసి అయినా, ఏ బోధకుడు చెప్పిన వాినైనా, బైబిలు అలానే చెబుతోందా? లేదా? అన్నది ఖచ్చితంగా బైబిలులో చూడాలి. ఎవరైనా తప్పుచెబితే, విశ్వాసి అయినా బోధకుణ్ణి సరిచేయాల్సిందే.
40. బోధకునికి మించిన జ్ఞానం విశ్వాసికి ఉండకూడదన్న రూలేమైనా ఉందా? అి్టది లేనేలేదు.
41. గురువుకి కృతజ్ఞత చూపకుండా గురువుని తప్పుపట్టడం తప్పుకదా! అంటూ ఒక సోదరుడు వాయిస్‌ మెసేజ్‌ ప్టోడు. నేననేది ఏమంటే అసత్యం ఎవరు బోధించినా గమనించిన వాళ్లు నోరు విప్పి చెప్పాలి. నేను అసత్యం బోధించినా మీరు నిర్భయంగా నోరు విప్పండి.
42. అదేమిటన్న వారందరూ దొంగలూ, తోడుదొంగలూ అంటే ఎలా? బైబిలు, తప్పును ఖండించానికి, గద్దించానికి, సరిచేయానికి అధికారమిచ్చింది. దుర్భాషలాడానికి, నిందించానికి అధికారమివ్వలేదు. ఎవడైనా దూషించాడంటే అతడు క్రైస్తవుడే కాదు, బోధకుడూ కాదు.
43. దూషణొద్దు, బూతులొద్దు, మేమే సర్వజ్ఞులం అన్న అహంకారం అసలే పెట్టుకోవద్దు.
44. గురువు చెప్పినా, ఎవరు చెప్పినా సత్యమైనంత వరకే వారిని అనుసరించాలి. ఈ సామర్ధ్యం మీకు కలగాలంటే మీరు ఎవరికి వారుగా బైబిలు బాగా చదవండి.
45. బోధకుల్ని బైబిలు కంటే గొప్పవారినిగా తలంచవద్దు. అనుసరించాల్సింది వాక్యాన్ని గాని బోధకుణ్ణి కాదు. అలా చేస్తే ఆ తప్పు వలన బోధకునితో పాటు నీవూ నరకానపడే ప్రమాదముంది.
46. మీరు ఏ బోధకుని శిష్యులుగాను ఉండకూడదు. అది ప్రమాదకరం. మీరు, మేమూ కూడా క్రీస్తు శిష్యులం మాత్రమే. (1వ కొరింధీ 3:5).
47. మీరు క్రీస్తువారిగా ఉండండి. వ్యక్తులనభిమానించే వారిగా ఉండకండి.
48. ఎవరికి వారు మాకే అంతా తెలుసని గాని, మా బోధకునికే అంతా తెలుసని గాని అనుకోవడం తప్పు.
49. వాక్యాన్ని ప్రేమించే వారుగా ఉండండి. వ్యక్తుల్ని ప్రేమించే వారుగా ఉండకండి. నేను చెప్పే ఏ వాక్యమైనా బైబిలుకు విరుద్ధంగా ఉందంటే నేరుగా నా దృష్టికి తేండి. నేను మార్చుకుాంను. ఆ మాట బహిరంగంగా చెబుతాను.
50. తప్పొప్పులను నిష్కర్షించండి. ఒప్పులను స్వీకరిద్దాం. తప్పుల్ని సరిచేసుకుందాం. దూషణలు వద్దనే వద్దు.
విజయకుమార్‌గారి ఈ ప్రసంగంపై నా మాటలు
సహజంగా లేదా స్వభావతః మనిషి హేతుబద్ద యోచనాశీలత కలిగిన వాడు అన్నది విజ్ఞుల మాట. అది మనందరి అనుభవం కూడా. కానైతే తనకు తెలియని విషయాలతో ముడిపడి ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, అతడు మరొకరి మాటపై ఆధారపడుతుాండు. దీనినే జ్ఞాన సిద్ధాంతంలో 'శబ్ద ప్రమాణం ఆధారంగా' అనాంరు. నిజానికి మత విశ్వాసాలన్నీ గ్రంథాన్ని ఆధారం చేసుకొనే ప్రవర్తిస్తుాంయి.
మన విజయకుమార్‌ గారి ప్రసంగంలో ప్రధానంగా 3 అంశాలు చోటుచేసుకున్నాయి.
1. విన్న మాటలు సరిగనే ఉన్నాయో లేదో అనుభవంతో గాని, వాస్తవంతో గాని సరిచూసుకొనే అంగీకరిస్తుండాలి. అదే సరైన విధానం.
2. విన్న మాటలను గుడ్డిగా అంగీకరించకుండా ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి.
3. ఎంతి వారైనా పొరపడే అవకాశం ఉంటుంది కనుక, పరిశీలించుకునే స్వీకరించడమో, విడిచి పెట్టడమో చేయాలి.
ఒక నిజాయితీ గల, సత్యానికి పెద్దపీట వేయాలనుకునే వ్యక్తి ఎలా మ్లాడాలో అలా ఉందాయన గారి ఈ ప్రసంగం. విశ్వాసాలు, బైబిలుకు సంబంధించిన అనేకాంశాలపరంగా మా మధ్య తేడాపాడాలెన్నో ఉన్నా, ఈ ప్రసంగంలో ఆయన మ్లాడినవిగా నేను వ్రాసిన 50 అంశాలలో చాలా వరకు నేను కాదు, బుద్ధిమంతులందరూ అంగీకరించదగినవిగా ఉన్నాయి. అందులో కొన్నైతే నాకు అత్యంత కీలకమైనవనిపించాయి. చాలా కాలంగా నేనూ ఆ భావాలనే ప్రకిస్తూ వస్తున్నాను కూడా.
విజయకుమార్‌గారూ! ఇంతి తూనికైన ప్రసంగం చేసిన మీకివే నా అభినందనలు. అందులోని అందరికీ వర్తించే వాిని అందరం స్వీకరిస్తే మేలు.
నగ్నసత్యం
విజయకుమార్‌ గారి విశ్వాసులకో విన్నపం ప్రసంగం నుండి గానీ, పలువురు క్రైస్తవ ప్రసంగీకులూ, సంఘకాపరులుగా పిలవబడుచున్న వారూ, బోధకులుగా చలామణి అవుతున్న వారు మ్లాడిన మాటలనుండిగానీ, వ్రాసిన వ్యాసాలనుండి గానీ వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు ప్రకింపబడినట్లు, వారిలో కొందరైనా, ఒకరినొకరు, నీకు బైబిలు పట్ల సరైన అవగాహన లేదనిగానీ, నీ వివరణ వాక్యవిరుద్ధంగా వుంది అనిగానీ మ్లాడినట్లు రూఢీగా తేలిపోతుంది. ఈ అంశం వరకు ఎవరు ఎప్పుడు కావాలన్నా ఆయా వ్యక్తుల ప్రసంగ పాఠాలను నిజనిర్ధారణకు తీసుకొని రుజువుచేసుకోవచ్చు.
అబద్దపు బోధకులు, వ్యాపారస్తులూ సంఘంలో జొరపడతారన్న హెచ్చరిక యేసు కాలం నుండే వుంది. అనంతరం అపోస్తలులూ ఈ విషయమైన హెచ్చరిక చేశారు కూడా. ఇక ప్రొటెస్టెంటు ఉద్యమపు పుట్టుకే, బైబిలుకు విరుద్ధంగా కేథలిక్కులు ప్రవర్తించారనుకోవడం వల్లే జరిగిందే. ఈనాడైతే ఒక పెద్ద విశ్వాసుల సమూహమే, క్రైస్తవం పేరున అబద్ద ప్రచారకులు దండిగా పుట్టుకొచ్చేశారని, వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా ప్రకించటం కళ్లకు క్టినట్లు అగుపడుతూనే ఉంది. బైబిలుకు సంబంధించినంతలో, అన్నింకంటే పెద్ద సమస్య బైబిలు దేవుడెవరన్నదే. యెహోవా దేవుడు కాదని ఎవరూ అనరనే అనుకుాంను. సమస్యల్లా యేసు దేవుడా? కాదా? అన్నదే.
మొత్తం మొత్తంగా బైబిలును విశ్వసించే వాళ్లలోనే ఈ విషయంపై వివిదాభిప్రాయాలున్నాయి.
ఎ) యూదులు యేసును దేవుడని అంగీకరించక పోవడమే గాక తాము ఎదురు చూస్తున్న మెస్సియాగానూ యేసును అంగీకరించరు.
బి) ఎలా యెహోవా ''నేనే దేవుణ్ణి, నాకు వేరుగా మరొక దేవుడు లేడు, వుండడు అన్నట్లు సూిగా యేసు తానే దేవుణ్ణని ఎక్కడా ప్రకించలేదు''.
సి) ''వాక్యము దేవుడై యుండెను'' అన్న మా ; నన్ను ఎరిగిన వాడు నా తండ్రినీ ఎరిగిన వాడేనన్నమాట; '' ఇంతకాలంగా నన్ను చూస్తూనే దేవుని ఎప్పుడు చూస్తామని అంటున్నారేమి?'' అన్నమాట, ''తండ్రి నేను ఏకమైయున్నాము'' అన్న మాట ;.... ఇలాి మాటలను సాగదీసి, సరిప్టిె ఇదిగో యేసు దేవుడనానికి వాక్యాధారాలంటూ వివరించడమే గాని, యేసే దేవుడనానికి తగిన ఒక్క సూటైన మాట క్రొత్త నిబంధనలో లేదు.
డి) పాత నిబంధనలోనైతే నేరుగా యేసు ప్రస్తావనే లేదు. యేసు, అనంతరపు వారలు కూడా లేఖనములు (పాత నిబంధన వచనాలు) యేసును గురించి ప్రస్తావించాయి అన్న క్రొత్త నిబంధన వచనాలు కొన్ని ఎత్తిచూపుతుాంరు ఈనాి యేసు దేవుడేననే పక్షం వాళ్లు.
ఇ) కానీ క్రైస్తవులలోని వారే అయిన కొందరు  యేసు దేవుడు కాడు, దేవుని ఆదేశానుసారం ఈ లోకాన కొన్ని కార్యాలు నెరవేర్చడానికి వచ్చిన వాడు మాత్రమే అని ఘాంపథంగా చెబుతారు.
ఎఫ్‌) మూడైన ఒక్కడు / ఒక్కటైన ముగ్గురు / ముగ్గురూ ముగ్గురే, ఇలా యేసు, పరిశుద్ధాత్మతో ముడిప్టిె, మ్లాడే వర్గమూ ఒకటుంది.
ఇలా బైబిలు అర్థమైందనుకుంటున్న ప్రసంగీకులు, కాపరులు, బోధకులలోనే కొన్ని ముఖ్యాంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్నది వారంతా అంగీకరించిన వాస్తవమే.
కనుక, క్రైస్తవ పక్షాన ఉంటున్న యోచనాపరులందరి ముందున్న ప్రధాన సమస్య ఆయా విషయాల పట్ల బైబిలు అసలభిప్రాయం ఏమిో తేల్చుకోవాలన్నదే. ఏమాత్రం నిజాయితీ, నిబద్దత, సత్యసంస్థాపనోద్ధతి కలిగివున్నవారైతే, ఇది ప్రధానంగా వారి అంతర్గత సమస్య. దానిని తేల్చుకుని ఇంతకూ అి్ట విషయాలలో బైబిలు ఏమి చెబుతోందన్నది ఖరారుచేసే ప్రజలకు బోధించాల్సిన బాధ్యత వారిపై వుంది.
నేననేదేమంటే, బైబిలును ఖండించదలచుకున్న వారిపైనా ఈ బరువు బాధ్యతలున్నాయి. బైబిలు ఏమి చెబుతుందో తేల్చకుండా దానిని ఖండించటం కూడా సరైంది కాదు. సాధ్యపడదు కూడా. కనుక, ఇంతకూ బైబిలు ఏమి చెబుతోందో నిర్ధారించి అటుపిమ్మట అది సరైందేనని నిరూపించాల్సిన బాధ్యత దాన్నెత్తికెత్తుకుని మంది నెత్తికీ ఎక్కించజూసే ఆ పక్షం వారందరిపైనా ఉందాంను. ఇది సబబో, కాదో నిష్పాక్షిక దృష్టితో నిష్కర్షించండి.

No comments:

Post a Comment