Wednesday, May 1, 2019

ఇంతకూ బైబిల్‌ ఏమిచెబుతోంది - 5

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
ఈ శీర్షిక ఎంత కీలకమైనదో, ఎంత మౌలికమైనదో, ఎంత గంభీరమైనదో మొదట గమనించండి. ఎంచుకున్న సందర్భాన్ని బ్టి 'బైబిలు' అన్న పదం వాడానే గాని, ఈ శీర్షిక అంశం నిజానికి ప్రతి సిద్ధాంత అధ్యయనంలోనూ, విచారణలోనూ ప్రధానాంశంగానే ఉంటుంది. ఏదైనా ఒక సిద్ధాంత  భావజాలాన్ని శాస్త్రీయ విచారణకు లోనుచేయాలంటే, మొట్టమొదట సుస్ఫష్టంగా నిర్ధారణ కావలసింది, ఇంతకూ ఆ విషయంలో ఆ సిద్ధాంతం ఏమి చెబుతోందన్నదే. అవునా? కాదా? ఎందుకంటే, ఏమిచెబుతున్నదో తేలకుంటే దేనిని విచారణకు లోనుచేయాలన్నదే ఖరారు కాదుకదా. కనుకనే, విచారణ నియమాలలో దీనికి సంబంధించిన నియమం ఒకి ఏర్పడింది.
నియమం : వక్త హృదయం ఇదేనని నిర్ధారణ అయినాకనే దాని సబబు బేసబబుల గురించి ఆలోచించాలి. దీనినే మనం ఆ సిద్ధాంత ప్రతిపాదన లేదా ప్రకితాభిప్రాయము అనంటున్నాం. తార్కికంగా దీనిని 'ప్రతిజ్ఞ' అంారు. 'వాదము' అనీ అనవచ్చు. ప్రకించాలనుకున్న దానిలో ఎటువిం సందిగ్దతకూ చోటుండకూడదు. అభిప్రాయప్రకటన నిర్ధిష్ట రూపంలో ఉండాలి. అప్పుడు కూడా, ఆ సిద్ధాంత పక్షం వారు చెప్పిన వాక్యార్ధం ఇదేనని ఇదమిద్దంగా ఖరారు చేసుకున్నాకనే, విచారణ మొదల్టెాలి.

కనుక, వక్త హృదయం ఇదేనని నిర్ధారించుకోవడం అన్నదే విచారణంతికీ ఆరంభస్థానం (ప్రవేశ ద్వారం) అవుతుందన్న మాట. ఇక్కడ గాని శ్రద్ధతీసుకోకుంటే ఆ పై చేసే విచారణంతా నేలవిడిచిన సామువిందవుతుంది. చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు విందవుతుంది.
ఇంతకూ బైబిలేమి చెబుతోందన్న శీర్షికలోని 'బైబిలు' అన్న దగ్గర ఖురాను, భగవద్గీత, వేదము, బౌద్ధము, మార్క్సిజము... ఇలా దేనినైనా పెట్టుకోవచ్చు. ఈ నా మాటను బాగా గుర్తుంచుకోండి.
ఏదైనా ఒక్క విషయంపైనే ఆ సిద్ధాంతం అనేకాభిప్రాయాలు ప్రకించినట్లు ఆధారాలు దొరికినా, ఆ సిద్ధాంతాన్ని వివరించే లేదా ప్రతిపాదించే స్థానంలో ఉన్నవారు అందులోని వాక్యాలకు వేరువేరు అర్ధాలు చెప్పినా, ఇక విచారణ ఆరంభించటమే కష్టమవుతుంది. ఎందుకో అర్థమవుతోందా? ఇంతకూ ఫలానా విషయంపై ఆ గ్రంథం (సిద్ధాంతం) ఏమంటుందోనే తేలలేదు కనుక.
ఒకవేళ, ఆ సిద్ధాంత కారుడే, తాను చెప్పదలచుకున్న దానిని సూటైన భాషలో చెప్పకుండా, ఉపమానాల ద్వారా గానీ, మార్మిక భాషలో గానీ అంటే ద్వందర్ధాలనిచ్చే భాషలోగానీ మ్లాడి ఉంటే, ఇక అతడు చెప్పదలచుకున్నది ఏమిటన్నది ఈనాి మనకు నిర్ణయించడమే దాదాపు అసాధ్యమైపోతుంది.
అందుకనే అలాి సందర్భాలలో పొరపాట్లు జరక్కుండా ఉండేందుకని విచారణకు మేలుచేకూర్చే భాషాపరమైన ఒక నియమాన్ని రూపొందించుకున్నాము.
ఎ) చక్కగా వినాలి (చదవాలి), విన్నమాటలకు అర్థాన్ని అన్నవారినుండే గ్రహించాలి. అన్నవారూ తానన్న మాటలకు అర్థం చెప్పే బాధ్యతవహించి తీరాలి. అన్నదే ఆ నియమం. పులుముడు, దోపుడు, సాగదీసుడు, సరిపెట్టుడు అన్న పనులు ఎవరమూ చేయరాదన్నది మరో ముఖ్యాంశము.
మరో ముఖ్యమైన సూచన వుంది. ప్రసంగాలు చేయడమన్న విధానంలో విషయ విచారణ లోతుగా చేయడం సాధ్యపడనే పడదు. ఎంపిక చేసుకున్న అంశం, దానిపై ఆ సిద్ధాంతం ఏమంటుందో అన్న ఖచ్చితమైన ప్రతిపాదన, దానిపై విచారణ పూర్తయ్యేంతవరకు మరో అంశాన్ని స్పృశించకుండా ఉండగల నిపుణత అన్నది సమకూరితేనే విచారణ లోతుగా సాగుతుంది. ఈ విధానం తప్ప మరే విధానంలోనూ విచారణ సజావుగా సాగదు. ఒక సరైన ముగింపుకు చేరనూ చేరదు.
1. ఫలాని విషయంలో గ్రంథమేమి చెబుతోందన్నది మునుముందుగా నిర్ధారించుకో గలిగితేనే విచారణ సరైన రీతిలో మొదలవుతుంది. నిజమా? కాదా?
2. ఎ) గ్రంథంలోనే ఆ విషయంపై అనేకాభిప్రాయాలు వెల్లడైయున్నా, బి) గ్రంథం ఇదిగో ఇలా చెబుతోంది అంటూ ప్రవచించే వ్యక్తులు గ్రంథంలోని వాక్యానికి వేరువేరు అర్థాలు చెప్పటం జరిగినా.
ఇంతకూ గ్రంథం ఏమి చెబుతోందన్నది అప్పికి అనిర్ధారిత స్థితిలో ఉన్నట్లే. నిజమా?. కాదా?
3. అలాి సందర్భాలలో, ఆ అనేకాభిప్రాయాలన్నీ ఒప్పులయ్యే అవకాశం మాత్రం లేదు. అందులో ఏదో ఒకి ఒప్పయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది. అవన్నీ తప్పులై, అస్సలు మరోటయ్యే వీలూ ఉంది. ఇది నిజమా? కాదా?
ఈ గడ్డు సమస్యను దాలంటే (పరిష్కరించుకోవాలంటే) ఇంతకూ గ్రంథమేమి చెబుతోందన్నది ఎలా తేల్చుకోవాలో ఆ విధి విధానాలను ఖరారు చేసుకోవాలి.
అలాగే, గ్రంథం చెబుతోందిది అని నిర్ధారించుకున్నాక విచారణ ఆఖరు మెట్టైన అది చెప్పింది సత్యమా? అసత్యమా? అన్నది నిర్ధారించే విధి విధానాలను రూపొందించుకొని ఆ విధానంలో పరిశీలన సాగించి తప్పొుప్పులు తేల్చుకోవాలి.
ఈ విధానంలో తేలిన తప్పొుప్పుల్ని ; ఎి్ట భేషజాలకూ పోకుండా, అంగీకరించి, స్వీకరించేందుకు అన్ని పక్షాలూ సిద్ధంగా వుండాలి. అి్టవాినే యోగ్యమైన వేదికలాంరు. అి్టవారినే సత్యసంస్థాపనాభిలాషులు, సత్యసంధులు అనాంరు. మీరేమాంరు.

No comments:

Post a Comment