Saturday, May 7, 2022

252 సంచిక

 

కరోనా

    యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

    చాలా కాలమైంది మాట్లాడుకుని.... మన పత్రిక వివేకపథం 1991లో మొదలైన నాటినుండి ఈనాటి వరకు గడచిన  30 సంవత్సరాల కాలంలో, ఇలా, ఇంతకాలం ఆగడం ఎప్పుడూ జరగలేదు. ఏమి భయాందోళనలకు, అభద్రతా భావానికి గురిచేసింది జీవి  నిర్జీవి కానీ ఒక వైరస్. 

    ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసి వేసింది, చేసేస్తోందింకా. ఒక విచిత్ర  విషాదకర వాస్తవం ఏమిటంటే అటు ప్రభుత్వాలు గానీ, ఇటు ప్రజలు గానీ అవకాశం  ఉన్నంత, అవసరమైనంత అప్రమత్తంగా లేకపోవడం, ఉండలేక పోవడం జరిగింది, తీసుకున్న జాగ్రత్తల నివారణ, నిరోధ చర్యల మేరకు చూసుకున్నా గత వందేళ్లలో  ఎదుర్కొనని సంక్షోభాన్ని ఎదుర్కొంది సమాజం. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమై  పోయింది. పాలనా వ్యవస్థ విపరీతమైన ఒడిదుడుకులనెదుర్కొంటూ వస్తోంది. మానవ జాతి మొత్తం ఏకోన్ముఖంగా ఈ ప్రమాదం నుండి బయట పడేందుకు గట్టిగా  ప్రయత్నించాల్సిన విపత్కర అత్యవసర పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితులలో  అప్పటికి నెలకొని ఉన్న ఏ రకమైన విభేదాలనుగానీ, ప్రక్కన పెట్టేయడమే వివేకవంతం.  చివరకు, ప్రధాన శత్రు దేశంగా ఉన్న పాకిస్తాన్ విషయంలోనూ, అనంతరం శత్రుదేశంగా  ఉంటున్న చైనా విషయంలోనూ పై సూత్రాన్ని అమలు పరచడమే సరైన విధానం  అవుతుంది. వివేకవంతమైన ఏ సమాజమైనా, మనిషిని మనిషిగా చూడడం కంటే, 

లేకపోవడం. 2. ఎవరికి వారికి, ఏ దేశానికాదేశానికి వారి వారి సొంత ప్రయోజనాలే  ప్రధానంగా అనిపిస్తుండడంతో చోటు చేసుకున్న నిర్లక్ష్యం, అలసత్వం. 3. అప్పటికే దేశాల  మధ్య ఏర్పడి ఉన్న వైమనస్యత కారణంగా ఎదుటి దేశానికి, సమాజాలకు అపకారం  జరిగినా పర్వాలేదు అన్న దృష్టి ఏర్పడి ఉండడం. 4. అవకాశం వస్తే ఇలాంటి వాటిని  తామే సృష్టించి మరీ ఎదుటి దేశాలపై ప్రయోగించాలన్న క్రూరమైన భావనలూ కొందరిలోనైనా చోటు చేసుకుని ఉండడం అన్న వన్నీ ఈ వైరసను గుర్తించి, తగినంత జాగరూకత వహించలేక పోవడానికి కారణాలయ్యాయి.   గతం గతః  అయ్యింది ఏదో అయ్యింది. దాని గురించి విచారిస్తూ మీనమేషాలు  లెక్కిస్తూ కూర్చోవడం కూడని పని. చాలా చాలా అవివేకవంత మైనది కూడా.

    ఈ సమస్యను రెండు భాగాలుగా చూడడం అవసరం 1. తక్షణం చేయాల్సిన  పనులు 2. అనంతరం శాశ్వత పరిష్కారం కొరకు చేయాల్సిన పనులు.

తక్షణం చేయాల్సిన పనులు : 1. రోగ వ్యాప్తిని నిరోధించడం. 2. వ్యాధి సోకిన  వారిని రక్షించడం. 3. అత్యవసర జరుగురు కార్యంగా ఔషధాన్ని కనుగొనే యత్నాలకు  ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆరంభించడం.

ప్రభుత్వం చేపట్టాల్సినవి. 2. పౌరులు తమకు తాముగా పాటించాల్సినవి. అయితే ప్రభుత్వం చేపట్టేవన్నీ, అందరికీ వర్తించేవిగా సాధారణ రూపంలో మాత్రమే ఉంటాయి, ఉండగలవు. వాటిని అమలు పరిచే సందర్భంలోనూ, కనీస అవసరాలు తీరేందుకు ఒకింత వెనకా ముందుగా అన్ని దేశాలూ ఈ జాగ్రత్తలు తీసుకున్నాయి. మన దేశం వరకు చూసుకుంటే, ప్రభుత్వాలు ఒక వంక ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా, ఒక  మేరకు ఈ జాగ్రత్తలు తీసుకుందనే చెప్పవచ్చు. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు,

    చేయగలిగినంత చేస్తూనే ఉన్నారు అన్నది అంగీకరించి తీరాలి.

1. రవాణా వ్యవస్థ అంతా స్తంభింపజేశారు. నలుగురు గుమిగూడే అవకాశం ఉ  న్న అన్ని వ్యాపార కేంద్రాలపై నిషేధాలు విధించారు. ఎదురు పడుతున్న  అనుభవాలాధారంగా, ఆయా పనులపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మిగిలి ఉంది. ప్రధానంగా వ్యక్తులు వ్యక్తిగతంగా తీసుకోవలసిన జాగ్రత్తలన్నవే..

2. ముఖ్యంగా తాకటం ద్వారా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది.

3. వ్యక్తులు పరస్పరం అతి దగ్గరగా ఉండటం ద్వారా అదిన్నీ ప్రధానంగా నోటి  తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది.

4. ఒకరి నుండి వెలువడిన వైరస్ క్రిములు, పోటీ ద్వారా, ముక్కు ద్వారా  ఊపిరితిత్తులకు చేరుతుంది.

5. అంటించే వాడూ, అంటించుకునే వాడూ కూడా నోటిని, ముక్కును కప్పి ఉ  ంచుకోవాలి.

6. అలా నోటి నుండి ముక్కు నుండి వెలువడే వైరస్ నేరుగా మనని తాకనంత 

7. ఎప్పటికప్పుడు ఇతర వస్తువులను, వ్యక్తులను, తాకిన సందర్భాలలో వ్యాధి . నిరోధకాలలో కూడిన నీటిలో ఆయా భాగాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 

8. బహిరంగ స్థలాలకు వెళ్లి వచ్చినప్పుడు, ముఖ్యంగా మరికొందరికి దగ్గరగా ఉ ండాల్సి వచ్చిన పరిస్థితులలో తిరిగి వచ్చాక 1. బట్టలు ఉతికించడం, 2. స్నానం 

9. వీటన్నింటికంటే నిరోధక రూపంలో, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లకుండా ,

1. బయటకు వెళ్లకండి. 2. భౌతిక దూరాన్ని పాటించండి. 3.ముఖాచ్చాదన  (మాస్క్) ధరించండి. 4. వేటినీ తాకకండి. 5. చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటుండండి,  ఇంటికి తెచ్చుకున్న వస్తువులనూ శుభ్రం చేసుకునే వాడుకోండి. నిజానికి ఇవి ప్రభుత్వం  చేయించగల పనులు కావు. వ్యక్తులు ఎవరికి వారు శ్రద్ధగా పాటించవలసినవి మాత్రమే.

ప్రస్తుత దశలో మ్రోగుతున్న ప్రమాద ఘంటికలు

 ఎవరేమనుకున్నా, ఏపార్టీల ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేయగలిగింది కొంతవరకే.  ముఖ్యంగా దీని వ్యాప్తిని ఆపగలిగింది. ఆపవలసింది వ్యక్తులే. అవగాహనా లోపం  వల్ల గానీ, నిర్లక్ష్యం వల్ల గానీ, ఆత్మ నియంత్రణ లేకపోవడం వల్ల గానీ, ఆయా   వ్యక్తుల, సంస్థల విచ్చలవిడితనం వల్లనే, ప్రస్తుత దశలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  వ్యక్తులలో తమపై తమకు అదుపు లేక పోవడానికి కారణం ఏమిటి? అన్నది చాలా కష్టం.వర్తమానంలో మనిషి జీవితం నిద్రలేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఉరుకులు పరుగులతోనే ఉంటుంది. ప్రతి మనిషి అలా పనులు ఒత్తిడిలో బిగా ఉండడానికి అలవాటు పడిపోయాడు. కాలం పరుగు పెట్టడమే అతనికి తెలిసిన విషయం. కానీ  ఈ కరోనా వైకస్ రంగం మీదికి రావడంతో హఠాత్తుగా రోజువారి జీవన రీతంతా   స్తంభించిపోయింది. కాలం పరిగెడుతోందన్నది. తిరగబడి, కాలం గడవడమే కష్టం  అయిపోయింది. అలవాటు లేని దీనివల్ల మనిషికి పిచ్చెక్కినట్టు అయిపోయింది. కనుకనే   సామాజికంగా ఎన్ని అడ్డంకులున్నా ఏదో ఒక నెపాన, ఇతరులతో కలవడానికి రకరకాల   దారులు వెతుక్కుంటూ, ఆ ప్రకారం ప్రవర్తిస్తూ వస్తున్నారు వ్యక్తులు. ఇదే ఈ ఒక్క అంశమే ఈనాడు ప్రధానంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణం అవుతూ వస్తోంది.  ఉన్న ఒత్తిడి పనులు, ఊరకుండలేక కల్పించుకున్న ఒత్తిడి పనులు, వీటి వెనుక,  తనకి ఏమీ కాదులే అన్న భరోసా, అతివిశ్వాసం, (సాహసం) ముప్పిరిగొని మనిషిని  నలుగురిలో తిరిగేటట్లు చేస్తున్నాయి. ఇదే ఈ దశలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం   అవుతుంది.

ఈ సందర్భంలో వెనుకటి తాత్వికులు చెప్పిన సూక్తి ఒకటి గుర్తుకొస్తోంది.  ....వివేకో నరాణా మదికో విశేషః తదేక హీనః పశుభిః సమానః  “వివేకం"   (యుక్తాయుక్త విచక్షణ) లేని మనిషి పశువుతో సమానం అని దాని అర్థం.  .... ధర్మం నరాణామది కో విశేషః తదేక హీనః పశుభిః సమానః" అన్నదీ ఉ

 ప్రాయుడే.

కొన్ని పరిష్కారాలు అంటించు కోవద్దు  అంటించవద్దు : నిరోధ ప్రక్రియలన్నింటిలోకి ఇదే అత్యంత కీలకమైనది. మౌలికమైనది. అయితే 

 1. బయటకి వెల్లవద్దు. 2. తప్పక వెళ్లాల్సి వస్తే భౌతిక దూరాన్ని పాటించు. 3.   ముఖానికి ఆచ్చాదన మాస్కు పెట్టుకో. 4. పరిశుభ్రతను పాటించు. 5. ఇంట్లోనే పని కల్పించుకో, ఉదాహరణకు వ్యాయామం మొదలెట్లు, అధ్యయనము మొదలెట్టు, తోటపని   మొదలెట్టు.  తొలి దశలో ప్రభుత్వం నలుగురు కూడకుండా ఉండేలా కట్టడి చేసింది. కరోనా  1 వ్యాప్తి దాదాపు నిలిబిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయనిపించింది. సంభించిన   జనజీవితాన్ని సరిచేయడానికి కుదేలైన ఆర్థిక వ్యాపార పరిస్థితులను కనీని స్థాయికైనా   తీసుకు రావాలన్న తప్పనిసరి పరిస్థితుల్లో, అదీగాక కరనా విషయంలో జనాన్ని

అప్రమత్తం చేయగలిగాం అన్న దృష్టితో కొంత సడలింపు చేసింది ప్రభుత్వం. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి. భారతదేశంలోని 135 కోట్ల మందికీ, కరోనాని   గురించిన సమాచారం అందించింది అన్నది ఒక నిజం. ప్రజలే జాగ్రత్త పడతారులే   అనుకోవడంలోనే పొరపాటు జరిగింది. ఈనాడు కరోనా ఉధృతంగా వ్యాపించడం ఈ విషయంలో ప్రధాన దోషం, వ్యక్తులదే. వారు గాని ప్రభుత్వ సూచనలనూ, శాస్త్రజ్ఞుల  సూచనలను పాటించకుంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. అనుభవించాల్సిందే.   లేదా జనం పసుప్రాయులనే అని నిర్ధారించుకుని, బందిఖానాలలో ఉంచినట్లు మరలా  పూర్తి నిషేధాజ్ఞలు విధించాలి. ,  యోచనాశీలురైన పాఠక మిత్రులారా  మీరంతా ఎవరికివారుగా, మీ వంతు సామాజిక   బాధ్యతగా అప్రమత్తులు కండి. పైన చెప్పిన నాలుగైదు మార్గదర్శకాలను పూర్తిగా, శ్రద్ధగా ఈ పాటించండి. మీకు అవకాశం ఉన్నమేర, శక్తివంచన లేకుండా ఇదే విషయాన్ని విస్తృతంగా  ప్రచారం చేయండి. సన్నిహితులకు, పరిచయస్తులకు మరింత గట్టిగా తెలియజేస్తూ, వారినీ   వారికి తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియజేయమని చెబుతూ ఉండండి.

1. బయటికి రాకండి. 2. వస్తే దూరాన్ని పాటించండి. 3. మాస్కు ధరించడండి.  4. పరిశుభ్రతను పాటించండి.

పరిశుభ్రత విషయానికి వస్తే, ఎ) చేతులను కడుక్కుంటూ ఉండడం. బి) బట్టలు   మార్చుకోవడం, విడిచిన బట్టలను ఉతికి వేయడం, సి స్నానం చేయడం. డి) ఇంటికి  • తెచ్చిన వస్తువుల్ని కడిగి వాడుకోవడం.

5. రోజులోని సమయాన్ని మంచి అలవాట్లు చేసుకోవడానికై ప్రణాళిక వేసుకోండి.   ఎ) శారీరక వ్యాయామానికి, బి) అధ్యయనానికి సి) పెరటి తోట పనులకు ఇంకా   ఇలాంటి వీలున్న పనులకు నిత్యం నిర్ణీత వేళల్లో కొంత సమయాన్ని కేటాయించుకోండి.   6. విటమినులు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకునే   అలవాటు చేసుకోండి. మీ కుటుంబమంతా వివేకవంతమైన జీవనశైలిని అలవరచుకోండి.  మత విశ్వాసుల చాదస్తాలు కపట విశ్వాసుల కుతంత్రాలు.  ఏ మత సాహిత్యాన్ని తీసుకున్నా అందులో దైవ విశ్వాసంతో పాటు, నాకు నిర్దిష్ట   రూపంలో రుజువుకురాని రకరకాల విశ్వాసాలు చోటుచేసుకునే ఉంటున్నాయి. అట్టి  విశ్వాసాలు కొన్ని కొన్ని సందర్భాలలో విశ్వాసుల జీవితాలలో పెను ప్రమాదాలకూ  కారణమవుతున్నాయి. వ్యక్తులలో ఉన్న ఈ అంధప్రాయపు పోకడలోని బలహీనతను   ఆసరా చేసుకుని ఆయా మత క్షేత్రాలలోనే ఉన్న కొందరు కపట విశ్వాసులు సాధారణ   విశ్వాసులను దోచుకుతింటున్నారు. ఈ రకం కపటులు ముఖ్యంగా ఆయా మత   సముదాయాలలో బాగా తెలిసిన వారల్లో ప్రచారం చేసుకుంటారు. ప్రసిద్ధిలోకీ  వస్తూంటారు. ఈ రకం కుటిలుల గురించిన ప్రస్తావన ఆయా మత గ్రంథాలలోనే  హెచ్చరిక రూపంలో చోటుచేసుకుని ఉంది. అంతేగాక, జాగ్రత్తగా గమనించగలిగితే,  ప్రతి కాలంలోనూ ఇట్టి వారిని గురించిన ఆధారాలు కనపడతాయి. వర్తమానంలోనూ  ఈ రకం దొంగ మందను, కపట మేధావులనూ ప్రతి మతచ్చాయలలోనూ  గమనించవచ్చు.

సామాన్య జనంలోని అమాయకంగా నమ్మే స్వభావాన్ని, వారిలోని ఆశా భయాలను,

 అనుభవించటం అన్న రెండే పరమార్థంగా సాగుతుంటుందీరకం దొంగమందల   పోకడంతా.

సమాజాన్ని బెంబేలెత్తిస్తున్న 'కరోనా' మహమ్మారినీ ఈ మంద పెట్టుబడిగా   వాడేస్తున్నారు. హైందవ విశ్వాస క్షేత్రాలలో ఉన్నవారు కరోనాను పోగొట్టడానికి యజ్ఞాలు   హెూమాలు మొదలెట్టారు. మరికొందరు క్రతువులు, జపాలు చేయసాగారు. సోషల్  మీడియా పుణ్యమా అని ఏ మూల ఏ కార్యక్రమం జరిగినా నలుగురికీ తెలిసేట్లు ,  చేయడం సాధ్యపడుతుంది. ఇవి చాలవన్నట్లు, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశారు చిల్లర   వైద్యులూ, అల్లం తినంటాడొకడు. మిరియాలు, సొంటి కషాయంతో కరోనా మాయం   అంటాడు ఇంకొకడు. ఈ ఒక్కటి చేయి కరోనా రాదంటాడు మరొకడు. వైద్యం, గృహవైద్యం,   మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం ఇలా ఎన్నెన్నో.

జూలై 26, సాయంత్రం టివి 5 లో మూర్తి యాంకరుగా 'కరొనా తంత్రాలు' అన్న  పేరున ఒక చర్చా కార్యక్రమం జరిగింది. హైందవం తరఫున లలిత కుమార్ అన్నాయనా,   జెవివి తరుపు నుండి టీ.వీ.రావు, క్రైస్తవ పక్షం నుండి జానా బాబు గార్లు పాల్గొన్నారు.   చర్చలో హిందువులలోని ఒకరు ఎవరో “హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.  కరోనాను పారద్రోలండి" అన్నట్లు ముస్లిం విధానంలో కరోనా రోగాన్ని నయం   చేస్తానని ఒక బాబా ప్రవర్తిస్తున్నట్లు, క్రైస్తవ పక్షం నుండి శ్యామ్ కిషోర్ అనే అతను   కరోనా గాని ప్రార్థన చేసి పోగొడుతున్నట్లు  ఆ కార్య క్రమంలో సమాచారం   అందించారు. అదే సందర్భంలో సజీఎం మినిస్ట్రీస్ విజయ్ కుమార్ అనే ఆయన  కరోనా గురించి మాట్లాడిన ఒక ప్రసంగం విషయం ప్రస్తావనకు వచ్చింది. అందులో   విజయకుమార్ గారు....

1. కరోనా చైనాలో రావడానికి కారణం క్రైస్తవుల దేవుడేనని, చైనీయుల అవిశ్వాసానికి   శిక్షగా దానిని వారిపైకి తమ దేవుడు రప్పించాడనీ, మాట్లాడిన మాటలు ఉన్నాయి.

2. ఇండియాలో కూడా అవిశ్వాసుల పని పట్టనున్నాడనీ, ఇప్పటికైనా ఈ దేశస్తులు   బైబిలు విశ్వాసంలోకి వస్తే రక్షింపబడతారనీ, కావాలంటే అందుకు ఋజువుగా తాను   ఒక సవాలు చేస్తున్నానని, తెలుగు ప్రాంతం వారే అయిన లలితకుమార్, హమారా   ప్రసాద్, కరుణాకర్ అన్న వాళ్ళుగాని, మోకాళ్ళ మీద కూర్చుని ఏసుని ప్రార్థిస్తే, ఇక్కడ   కరోనా లేకుండా పోతుందనీ అలా జరక్కుంటే తాను క్రైస్తవ విశ్వాసాన్ని విడిచి, హిందూ   విశ్వాసిగా మారతానని, ఇది తన సవాలని అర్థం వచ్చేట్లుగా మాటలు అందులో ఉ  న్నాయి. ఈ తరహా వాటిని కూలంకషంగా విచారించాలంటే ఈ మాస పత్రికలకు  సాధ్యపడదు. దానికి వేరే వేదిక అవసర పడుతుంది. నేను గమనించినంతలో   విజయకుమార్క నోటి దురుసు తనం ఎక్కువ. అలాగే ఆత్మ ఆధిక్యతా భావమూ    అతిగనే ఉంది. కపటి అని నాకైతే అనిపించలా.

అవెలాగున్నా, ఈ ప్రకటనలు ఎందుకు చేశారో, అది ఇటు తనని, అటు క్రైస్తవాన్ని   కూడా అభాసుపాలు చేస్తుందన్న సోయ లేకుండా పోయింది, ఎందుకనో నాకైతే అర్థం  కాలా. అతని ఈ ప్రకటనను ఇతరేతర క్రైస్తవ సంఘాలలోనే విచక్షణ గల వారు   ఎవరూ అంగీకరించరు. ఖండిస్తారు కూడా. లలిత కుమార్ ఆ విషయాన్ని గట్టిగానే ,  పట్టుకున్నాడు. టీవీ మూర్తి గారు కూడా. నీవడిగిన ముగ్గురినీ నేను రిక్వెస్ట్ చేసి హాజరు  • పరుస్తాను, మీరు అన్న మాటకు కట్టుబడి ఉండగలరా? అని టి.వి. ద్వారానే విజయ్   కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. విజయ్ కుమార్ గారి నుండి సమాధానం లేదు. ఈ  అట్టివి సరైనవి కావని మేము చెబుతున్నాం, అని జానా బాబు గారూ అన్నారు.   ఇక శ్యామ్ కిషోర్‌ లాంటి వారిని వెంటనే నిర్బంధించి, మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్   క్రింద బంధించాల్సి ఉంది. ఇంతటి ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఆయనంత   నిర్భయంగా వీడియో రికార్డు చేస్తూ, మరీ అలాంటి పిచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటేనూ 

 వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపవలసిన అవసరం ఉంది. అలాగే కరోనా   విషయమున్నూ

ఇక హిందువులలోనూ సాగుకున్న చాలీసా చదివితే కరోనా రాదు. వచ్చినా పోతుంది.  కరోనాను పోగొట్టడానికి ఏరామాలు, జపాలు, క్రతువులూ చేయదు లాంటి వాటిని   అడ్డుకోవలసన అవసరం ఉంది. లేదా ప్రయోగం చేద్దాం రమ్మని అయినా ఒత్తిడి కరోనా నిరోధానికి అవసరమైన ముందు జాగ్రత్తలూ, నివారణకు అవసరమైన   శాస్త్రీయమైన 'చికిత్స' అన్న రెంటినీ తప్ప, వేటినీ ప్రచారం కాకుండా చూడడం అవసరం.   కరోనా విషయంలో రెండు రకాల తప్పులు జరుగుతున్నాయి. ఒకటి అక్కర లేనంత ఆ భయం కాగా, రెండోది ఆ ఏమీ కాదులే అన్న నిర్లక్ష్యం. ఈ రెండు ద్రుష్టుల వల్లా నష్టం   జరగకూడనంత జరిగిపోతూనే వుంది. కనుక,

మరొక్కమారు : అంటించ వద్దు, అంటించుకోవద్దు.

ఇంటికే పరిమితం కండి. నలుగురికి మేలు కలిగే పనులు కల్పించుకోండి. అలాగే ,  బయటకి తప్పక వెళ్లాల్సి వస్తే భౌతికంగా దూరాన్ని పాటించటం అలవాటు చేసుకోండి. 

ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుని సాగుతున్న 

 పోవడమే గాక, కొన్ని సందర్భాలలో దానికి వ్యతిరేకంగా కూడా ఉండడంతో రాష్ట్ర 

 అవగాహన లేకపోవడం, ప్రజాస్వామ్యం అమలవ్వాలన్న అభిలాష లేకపోవడం ,  అన్నదేననాలి.  కొద్దిమందికి ఒకింత అవగాహన ఉందనుకున్నా, దాని అమలు విషయంలో తగినంత   మక్కువ లేదు. ఇకపోతే వారిలో ఒకరో ఇద్దరో ప్రజాస్వామ్యవాదులున్నా వారికి  ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహారాలను నడిపించే సామర్థ్యం లేదు. సానుకూల పరిస్థితీ  లేదు.

ఇది రాలదన్నట్లు అటు నాయకులలోను, ఇటు పౌరులలోనూ తమకు  పైస్థానాల్లో నున్న వ్యక్తుల పట్ల ఆరాధనా భావం, విధేయతా భావం బలంగా నెలకొని  వుంది. కొద్దిమందికి స్వతంత్రంగా ఉండే లక్షణం ఉన్నా, అట్టివారిని క్రమంగా ' విధేయులుగా ఉండేలా వత్తిడి పెట్టి మరీ లొంగ తీసుకోవటం జరుగుతోంది.

 అత్యంత ప్రధానమైన సమస్య, ఎక్కడికక్కడ నాయక స్థానాలలో ఉన్న ప్రతి ఒక్కరూ   వారివారి పరిధిలో తాను చెప్పిందే జరగాలి అన్న వైఖరి కలిగి ఉండడమే. అంటే తన   పరిధిలో తానే సుప్రీమ్ అన్నమాట. నియంత స్వభావం లేని రాజకీయులు ఈనాడు ని చాలా చాలా అరుదుగా మాత్రమే తారసపడతారు. అట్టివారూ వ్యవస్థ నడకలో ఎక్కడో   ఒక మూలకు నెట్టివేయబడి కొనసాగుతూ ఉంటారు.

 రాజ్యాంగ ప్రతిని తయారు చేసే పనిలో అత్యంత ప్రధాన భూమికను వహించిన  డాక్టర్ అంబేద్కర్ దానిని రాజ్యాంగ నిర్మాణ సభకు అందజేసే సందర్భంలో చాలా   విలువైన సూచనలు, హెచ్చరికలతో కూడిన ప్రసంగం చేశారు. రెండు విషయాల   గురించి తనకు ఆందోళన కలుగుతోంది అన్నాడు.

 దేశ స్వాతంత్ర్యానికి ఏమి జరగనుంది? ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటుందా?  మళ్లీ పోగొట్టుకుంటుందా? ఇది నా మనస్సులోకి వచ్చిన మొదటి ఆలోచన. ఈ  దేశం.... తనకున్న స్వాతంత్ర్యాన్ని ఒకసారి పోగొట్టుకుంది. మరోసారి కూడా దీనిని   పోగొట్టుకుంటుందా? ఈ దేశ భవిష్యత్తును గురించిన ఈ ఆలోచన నన్ను చాలా  • కలవరపరుస్తోంది. నన్ను బాగా బాధిస్తున్నదేమంటే, ఇండియా తన స్వాతంత్ర్యాన్ని  1 లోగడ ఒకసారి కోల్పోయిందన్నది కాదు. తన ప్రజలలోనే కొందరు చేసిన ద్రోహం,  అవిధేయతల వల్ల స్వతంత్రాన్ని కోల్పోవడం.

 ఉదహరించాడాయన. 11. మహమ్మద్ ఖాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించినపుడు దాహర్ రాజు యొక్క  సేనాధిపతులు మహమ్మద్ చినకాశం ఏజెంట్ల నుండి అంచాలు తీసుకున్నారు. రాజు  తరఫున పోరాడటానికి నిరాకరించారు.

2. మహమ్మద్ ఘోరీని ఇండియాను ఆక్రమించమనీ, పృథ్వీరాజుతో పోరాడమనీ,  దానికి సోలంకి రాజుల సహాయము , తన సహాయమూ అందిస్తానని ఆహ్వానించాడు   జై చందు. 13. శివాజీ హిందువుల విముక్తి కారకు పోరాడుతుంటే ఇతర మహారాష్ట్ర పెద్దలూ,   ఇతర రాజపుత్ర రాజులు మొగలాయి చక్రవర్తుల తరపున యుద్ధం చేశారు.

 4. బ్రిటీషువారు సిక్కు ప్రభువుల్ని నాశనం చేస్తూ ఉంటే, సిక్కుల ప్రధాన సేనాపతి   గులాబీ సింగ్ మౌనంగా ఊరుకున్నాడు. సిక్కుల రాజ్యాన్ని కాపాడడానికి ఏమాత్రం   సాయపడలేదు.  5. 1857లో భారతదేశంలో చాలా భాగం ఆంగ్లేయులపై స్వాతంత్ర్య యుద్ధాన్ని  • ప్రకటిస్తే సిక్కులు మౌన ప్రేక్షకులుగా నిలబడి వేడుక చూశారు.  చరిత్ర పునరావృతం అవుతోందా? ఈ ఆలోచనే నాకు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆ  ఎందుకంటే కులాలు, తెగల రూపంలో ఉన్న మన పాత శత్రువులతో బాటు వివిధమైన,   పరస్పర విరుద్ధమైన రాజకీయ తత్వాలతో కూడిఉన్న అనేక రాజకీయ పార్టీలను చూస్తూ ,  ఉన్నాం. ఈ వాస్తవం నన్ను మరీ కలచి వేస్తోంది.  “భారతీయులు తమ తమ తత్వాలకు అతీతంగా (మించిందిగా) దేశాన్ని చూస్తారా?  : లేక దేశానికి అతీతంగా తమ తత్వాలను (ముఖ్యంగా) చూస్తారా? నాకు తెలియడం   లేదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం. దేశానికి అతీతంగా పార్టీలు తమ తత్వాలను   చూసినట్లయితే మన స్వాతంత్ర్యం తప్పక కోల్పోతుంది. ఇది నిశ్చయం. స్థిర నిశ్చయంతో   మనం ఈ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవాలి. మన చివరి రక్తపు బొట్టు వరకు 

 “జనవరి 26, 1950 నుండి మనది ప్రజాస్వామిక దేశం కానున్నది అంటే ఈరోజు   నుండి ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ఇండియా కలిగి ఉ సంటుందని అర్థం. ఇదే ఆలోచన నా మనస్సుకు వచ్చింది. (ఈ దేశంలో) తన ప్రజాస్వామిక   రాజ్యాంగానికి ఏమి జరుగుతుంది. దీనిని మన దేశం నిలబెట్టుకోగలదా? దీనిని   మళ్ళీ కోల్పోతుందా? ఇదే నా మనస్సులోనికి వచ్చిన రెండో ఆలోచన. మొదటి ఆలోచన  కలిగిస్తున్నంత ఆందోళనా ఇదీ నాకు కలిగిస్తోంది.

• గతంలో ఒకప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండేవి... బుద్ధుడు అట్టి ,  వాటి నుండే తన భిక్షు సంఘ నియమాలను రూపొందించి ఉండాలి. ఈ ప్రజాస్వామిక   విధానాన్ని భారతదేశం ఒకసారి కోల్పోయింది. రెండోసారి కూడా ఇప్పుడు మరల) 

దీనిని కోల్పోతుందా? నాకు తెలియదు. ఇండియా వంటి దేశంలో ఇది అసాధ్యం  కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం చాలాకాలంగా అమలులో లేని మూలంగా ఇది ఏదో 

 కొత్తగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారి తీసే ప్రమాదం ఉంది.   (తిరిగి) ఇప్పుడే పుట్టిన మన ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అలా ఉంచుకునే ఆచరణలో   నియంతృత్వానికి దారి తీయవచ్చు.  ఈ దిగజారుడు గాని ప్రారంభమైతే  ఏర్పడే రెండో ప్రమాదం మరీ పెద్దదిగా 

ఉంటుంది.  స్వరూపం లోనే కాదు, ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో కూడా మనం కాపాడు కోవాలంటే 

 నా దృష్టిలో మొట్టమొదట మనం చేయవలసింది, మన సాంఘిక, ఆర్ధిక లక్ష్యాలను  • సాధించుకోడానికి మనం రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండడమే.

2. సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి పద్ధతులను   విడిచిపెట్టాలి. సాంఘిక ఆర్ధిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగ పద్దతులు   అందుబాటులో లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతులను అవలంబించడంలో అర్థం ఉ   0ది. కానీ రాజ్యాంగ పద్ధతులు అందుబాటులో ఉండగా రాజ్యాంగేతర పద్దతుల్ని   అవలంబించడంలో అర్థం లేదు. ఈ రాజ్యాంగేతర పద్ధతులు అరాచకత్వానికి వ్యాకరణం 

మనం చేయవలసిన రెండో పని..... వ్యక్తులు (పౌరులు) తమ తమ స్వాతంత్ర్యాలను  ఏ గొప్ప మనిషి (ఎవరి)పాదాల వద్ద సమర్పించ కూడదు. తమ సంస్థలన్నింటినీ   తిరగబెట్టగలిగే అధికారాలను అతనికి ఇవ్వకూడదు. దేశానికి జీవితాంతం సేవలు చేసిన  కొన్ని హద్దులు ఉంటాయి.

ఐరిష్ దేశభక్తుడు డేనియర్ ఒకాన్నెల్ చెప్పినట్లు, తన ఆత్మ గౌరవానికి భంగకరంగా  ఆ కృతజ్ఞత ఉండకూడదు. తన శీతానికి భంగం కలిగేలా ఏ స్త్రీ కృతజ్ఞురాలుగా ఉండకూడదు. ఈ హెచ్చరిక ఇతర దేశాల విషయంలో కంటే మన దేశం విషయంలో   చాలా అవసరం. ఎందుకంటే ఇండియాలో భక్తి లేక భక్తిభావం లేదా వీరపూజ   రాజకీయాలలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాల  : రాజకీయాలలో అది పోషించే పాత్ర కంటే, మన దేశంలో దాని పాత్ర చాలా ఎక్కువ.  మత విషయాలలో భక్తి ఆత్మ విముక్తికి ఒక మార్గం కావచ్చు నేమో గాని,   రాజకీయాలలో భక్తి లేదా వీరపూజ (అతి విధేయత) దివాళా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికి సూటి దారి (దగ్గర దారి).  మనం చేయాల్సిన మూడవ పని ఏమంటే, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో  : మనం సంతుష్టిపడరాదు. మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాంఘిక ప్రజాస్వామ్యం  చేయాలి. సాంఘిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే  రాజకీయ స్వాతంత్ర్యం   నిలబడదు.  సాంఘిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? స్వతంత్రం, సమానత్వం, సోదరత్వములను   జీవన సూత్రాలుగా గుర్తించిన జీవనశైలే సాంఘిక ప్రజాస్వామ్యం అంటే. స్వతంత్ర,  స సమానత్వ, సోదరత్వం సూత్రాలను విడివిడిగా చూడకూడదు. ఈ మూడింటి సమన్వయ   రూపమే సాంఘిక ప్రజాస్వామ్యం. (వీటిని గాని) ఒకదాని నుండి మరొక దానిని  నుండి ఎన్నడూ వేరు కాలేదు. అలానే సమానత్వం కూడా స్వతంత్రం నుండి వేరు   కాలేదు. అదేవిధంగా స్వతంత్ర సమానత్వాలు సోదరత్వం నుండి వేరుకాలేవు. సమానత్వం 

 కానీ భారత దేశంలో వీటి అమలు చాలా కష్టంతో కూడుకున్నదిగా ఉంది. ఎందుకంటే  • సాంఘిక రంగంలో అసమానతల శ్రేణి అనే సిద్ధాంతం పై మన సమాజం ఏర్పడివుంది. ఆ  దీనివల్ల (సహజంగానే) కొందరికి ఔన్నత్యం కొందరికి అధమత్వం ప్రాప్తిస్తోంది. ఇక   ఆర్థిక రంగంలో కొద్ది మంది మహా ధనవంతులు. చాలా మంది మహా దరిద్రులు ఉ  న్న సమాజం మనది. (ఈ నేపథ్యం ఉండడం ద్వారా) జనవరి 26 1950 న మనం 

 రాజకీయాలలో మనం (సూత్రప్రాయంగా) సమానత్వాన్ని కలిగి ఉంటాము. సాంఘిక,  : ఆర్థిక జీవితంలో అసమానతను కలిగి ఉంటాము.  రాజకీయాలలో ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ అన్న సూత్రాన్ని  గుర్తిస్తారు. అదే సమయములో సాంప్రదాయంగా నెలకొని వున్న సాంఘిక, ఆర్థిక   వ్యవస్థ కారణంగా సాంఘిక, ఆర్థిక జీవితంలో ఒక మనిషికి ఒక విలువ అన్న సూత్రాన్ని   నిరాకరిస్తూనే ఉంటాము....



 ఈ వైరుధ్యాన్ని గనుక ఇలాగే కొనసాగిస్తే అసమానతలతో బాధపడేవారు ఈ   రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేస్తారు. ఈ రాజ్యాంగ సభ ఎంతో  మనలో లేని మరో అంశం; సోదరత్వ సూత్రానికి గుర్తింపు. సోదరత్వం అంటే   భారతీయులందరి మధ్యా ఒక సమష్టి సోదరభావం అనే. అంటే భారతీయులందరూ 

.... మనమంతా ఒకే దేశం అని అనుకుంటూ పెద్ద భ్రమకు లోనవుతున్నామని నా 

 సాంఘిక, మానసిక రంగాలలో మనమింకా ఒకే దేశంగా లేమని ఎంత త్వరగా   గ్రహిస్తే అంత మంచిది. అప్పుడు మాత్రమే మనం ఒకే దేశంగా వుండవలసిన ఆవశ్యకతను   అర్థం చేసుకోగలుగుతాము. ఈ లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా కష్టమే. ఇందుకు

 మారాలంటే (మనగలగాలంటే) ఈ కులాలు అంతర్జాలు అన్నింటినీ అతిగమించాలి.   ఒకే దేశం అన్నప్పుడు అక్కడ సోదరత్వం ఉండాలి. సోదరత్వం లేకపోతే సమానత్వము,   స్వాతంత్ర్యము అనేవి పై రంగు పూతలు మాత్రమే.  ఇవి నా భావాలు. ఇవి కొందరికి రుచించకపోవచ్చు. ఈ దేశంలో రాజకీయ అధికారం   చాలాకాలంగా కొందరికి ఏకస్వామ్యంగా ఉందనడంలో అబద్దం లేదు. అలాగే చాలామంది  బరువులు మోసే పశువులు గానే కాదు, బలిపశువులుగానూ ఉన్నారనడంలోనూ అబద్ధం :

.... ఇలా అణగదొక్కబడిన వర్గాలు పాలితులుగా వుండి వుండి అలసిపోయాయి.  తమని తాము పాలించుకోవాలని చాలా అసహనంగా ఉన్నాయి. ఈ అణగదొక్కబడిన వర్గాలలో తమ సొంత గుర్తింపుకై పడే ఆరాటం, ఒక రకపు పోరాటంగాగాని, వర్గపోరాటంగా గానీ మారనివ్వకూడదు. అది మన ఇంటిని ముక్కలు చేయడానికి  దారితీస్తుంది. అది నిజంగా ఒక ప్రయ దుర్ముహూర్తం అవుతుంది. అబ్రహంలింకన్ చెప్పినట్లు ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా తానే చీలికలు అయితే అది ఎక్కువ కాలం నిలబడలేదు.

మేము రాజ్యాంగంలోనే ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత నడపబడే  1 ప్రభుత్వ సూత్రాన్ని పొందుపరచడానికి ప్రయత్నించాము. అలాంటి ఈ రాజ్యాంగాన్ని  కాపాడుకోవాలంటే ఈ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అవరోధాన్ని గుర్తించడంలో )  ఆలస్యం చేయకూడదు.  ప్రజల చేత నడపబడే ప్రభుత్వానికి బదులుగా ప్రజల కొరకు నడుపబడే ప్రభుత్వాన్ని   కోరుకునేలా చేస్తుంది. ఇది జరగకుండా చూసుకునే విషయంలో మనం ఎంత మాత్రం   బలహీనంగా ఉండనే కూడదు. దేశానికి సేవచేసే మార్గం ఇదొక్కటే. ఇంతకు మించి మరో  దారి నాకు కానరావడం లేదు.

సమాజ హితకాంక్షలైన ఆలోచనాపరులరా ఒకటి, రెండు అంబేద్కర్ మాటలను ఉ టంకిద్దామనుకుంటూ.... మొదలెట్టిన నాకు, అవి ఉన్న. ఈ భాగాన్ని చూశాక, ఇందులో  అనవసరమైన ఒక ముక్కా కనపడక పోవడమే గాక, ప్రతి వాక్యమూ ఇప్పుడు జరుగుతున్న  ప్రమాదకర పోకడలను చూపించేది గానూ, కనపడటంతో ఆ భాగాన్ని యధాతధం

మీకందించాను. ఒకటికి పది సార్లు చదివి అర్ధం చేసుకుని, అడుగులు వేయాల్సిన   కరదీపిక లాటివవి. ఈ భాగం అర్థం అయితే గాని ప్రస్తుతం రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో )  ఉందన్న నామాట ఎంత సత్యమో బోధపడదు.

 ఈ దేశ ప్రజల పట్ల ఎంతటి సమష్టి భావన? కుల మతాల కతీతమైన అకళంక   దేశభక్తుడు అతడు. ఆ మనీషాపంతుని మరికొన్ని పలుకులూ ఆలకించండి. ఇవీ   ఆనాటి ప్రసంగంలోనివే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజానికానాటి ప్రసంగంలోని   ప్రతి పదమూ విలువైనదే. ప్రతి ఇంటా ఉండవలసిన, నిత్యం గుర్తుంచుకోవలసిన  విలువైన ప్రసంగం అది.

నిజానికానాటి రాజ్యాంగంపై రెండు పక్షాల నుండి ఆక్షేపణలు వచ్చాయి. ఒకటి   కమ్యూనిస్టు పార్టీ , రెండు సోషలిస్టు పార్టీ. వీరిరువురు రాజ్యాంగాన్ని ఎందుకు  ఖండిస్తున్నారు? ఇది నిజంగా చెడ్డ రాజ్యాంగం అవ్వడం కారణం గానా? అంటే  'అందుకు కాదు' అని చెప్పడానికి సాహసిస్తున్నాను.

రాజ్యాంగం కావాలంటున్నారు. ఇదేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆధారపడిన  రాజ్యాంగం కాబట్టి వారు దీనిని ఖండిస్తున్నారు.

2. ఇక సోషలిస్టులకు రెండు అంశాలు కావాలి. మొట్టమొదటి వారు కోరుకునేది,  వారు అధికారంలోకి వస్తే ప్రైవేటు ఆస్తులన్నింటిని పరిహారం చెల్లించకుండానే సంఘపరం   కానీ, జాతీయం కానీ చేసే స్వేచ్ఛ రాజ్యాంగం వారికి ఇవ్వాలి. వారి రెండో కోరిక   రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా ఉండాలి. వాటిపై ఏ విధమైన , పరిమితులు ఉండరాదు. అలాగైతేనే వారు అధికారంలోకి రాకపోయినా అంతులేని స్వేచ్చ కలిగి ఉంటారు. అది కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే కాదు. దానిని   తిరగపెట్టడానికి కూడా పనికొస్తుంది అది.

మిత్రులారా ఆ రెండు పక్షాల వారు అన్నట్లు అటు కార్మికవర్గ నియంతృత్వ స్వభావపు   రాజ్యాంగాన్ని, ఇటు పౌరులకు సంపూర్ణ స్వేచ్చ గల రాజ్యాంగాన్నో ఏర్పరిచి ఉంటే   వాటిని అమలు పరిస్తే ఆ సమాజ చిత్రం ఎలా ఉంటుందో ఊహించితే ఊహించండి. 

 తాము సిద్ధం చేసిన రాజ్యాంగం సంపూర్ణమైందని గానీ, లోప రహితమైందని గానీ   అనలేదు. పైగా దానిలోనివన్నీ, ఈతరం వారి అభిప్రాయాలు మాత్రమేనని, అందుకనే   అవసరమైన సవరణలు చేసుకోడానికి సరళమైన విధానాన్ని అందులోనే పొందుపరచామనీ   చెప్పాడు, ఆ సందర్భంలోనే.

రాజ్యాంగాన్ని ఎంత ఎక్కువగా సమర్ధించవచ్చో అంతగానూ నా మిత్రులు అల్లాడి   కుప్పుస్వామి అయ్యరు గారూ, టి.టి.కృష్ణమాచారి గారు సమర్థించారు. కనుక దీని   యోగ్యతల గురించి నేను మాటాడను. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది.  “రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు పరచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది   కూడా చెడ్డది అయిపోవడం ఖాయం. అదే మరి రాజ్యాంగం ఎంత చెడ్డది అయినా దానిని  అమలు పరచేవాళ్ళు మంచివాళ్ళు అయితే అది మంచిది కావడం కూడా అంతే ఖాయం"   ఎందుకంటే...  రాజ్యాంగం పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపంపై మాత్రమే ఆధారపడి ఉండదు.  అది దేశానికి శాసన నిర్మాణ, కార్య నిర్వహక, న్యాయశాఖలను మాత్రమే అందించగలదు.

ఈ మూడు శాఖలూ ప్రజలపైనా, వారు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీల పైనా  ఆధారపడి పని చేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజల కోరికలకూ, వారి రాజకీయాలకూ  • పనిముట్లుగా ఉంటాయి.  భారత ప్రజలూ, వారి పార్టీలు ఎలా నడుచుకుంటాయో ఎవరు చెప్పగలరు? అవి   తమ ఆశయాలను సాధించుకోడానికి రాజ్యాంగ విధానాలను అనుసరిస్తాయా,   రాజ్యాంగేతర విధానాలను అనుసరిస్తాయా? రాజ్యాంగేతర విధానాలను అనుసరిస్తే   గనుక రాజ్యాంగం ఎంత మంచిదైనా అది విఫలం అయిపోతుంది అని చెప్పడానికి ఏ జ్యోతిష్యుడూ అవసరం లేదు. ప్రజలు వారి పార్టీలూ ఎటువంటి పాత్ర పోషిస్తాయో   తెలియకుండా రాజ్యాంగంపై తీర్పు చెప్పడం వృధా.

ప్రియ చదువరులారా పై అంబేద్కర్ వెలువరించిన భావాల వెలుగులో ఇప్పటి    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును పరిశీలిద్దాం.

 ఈనాడు (నిజానికి ఆనాటి నుండి ఈనాటి వరకూ అనైనా అనవచ్చు) అటు   కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ ఎక్కువలో ఎక్కువ కాలం అమలవుతూ వచ్చింది, 

: వ్యవస్థ చట్రం నుండి బయటపడనే లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ సూత్రీకరణలననుసరించి,

మహారాజు, చక్రవర్తిలాటి పేరులు లేకుండాపోయాయే గాని, కేంద్రంలో ప్రధానమంత్రి,   రాష్ట్రంలో ముఖ్యమంత్రులూ చక్రవర్తి, రాజుల స్వభావాన్నే కలిగి ఉంటున్నారు. ప్రజలూ  వారినలానే చూస్తున్నారు. మిగిలిన ప్రజా ప్రతినిధులున్నూ ప్రధానమంత్రికీ,  ముఖ్యమంత్రులకూ ప్రజాప్రతినిధులుగా గాక అనుచరులుగా మాత్రమే  పార్టీ స్వామ్యం ఎప్పటికీ ప్రజాస్వామ్యానికి సరైన రూపం కాదు. కాలేదు. ఇక   పార్టీలలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడం లేదు. ఎక్కువసార్లు ఏకనాయకత్వమే   అమలవుతూ వుంటుంది. మహా అయితే నెంబర్ 2 లేక నెంబర్ 3 గా ఒక చిన్న  బృందం ఉండవచ్చు. ఫైనలైజేషన్ మాత్రం నెంబరు ఒకటిదే. మిగిలిన వారూ, వెనుకటి  రాజరిక వ్యవస్థలో రాజు గారి సలహా మండలి (మంత్రుల) పాత్ర వహించే వారే.  నిజానికి ఓటు వేయడం అంటే వ్యక్తి అవగాహన పూర్వకమైన విచక్షణా జ్ఞానాన్ని  ప్రజాస్వామ్య స్వభావానికి అనుగుణంగా పనిచేయగలడని తాను భావించిన వానిని  గెలిపించడం అని అర్థం. ఇది నిజమా? కాదా? ఆలోచించండి. ఓటర్లు ఏనాడు   ఇంతటి అవగాహనతో ఓటు వేయలేదుగా అన్నది మనందరికీ తెలుస్తున్నదే. 

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు లాటి సూత్రీకరణ ఒకటుంది.

ఎంతకాలం వరకు పౌరులు అవగాహనాపరులు, పనిమంతులూ,  : నీతిమంతులూ కారో అంతకాలం వరకు ప్రజాస్వామ్యం దాని అసలైన అర్థంలో ఆచరణకు  ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల విధానంలోనే ఒక పెద్ద దోషం ఉంది. ఒక   నియోజకవర్గంలో నిలబడ్డ అభ్యర్థులలో ఒకనికి ఒక లక్ష ఓట్లు వచ్చాయి. మరొకరికి   లక్ష పైన ఒక ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు అదనంగా వచ్చిన అభ్యర్థి ఎన్నికైనాడు. 5 లక్ష ఓట్లక విలువ లేకుండా పోయింది. ఇదే కదా ఇప్పుడు జరుగుతున్న విధానం.  ఈ దోషాన్ని గమనించాక అనేక దేశాలలో ఎన్నికలను దామాషా పద్ధతిన అభ్యర్థుల   ఎంపిక విధానాన్ని అమలు చేసుకోవడం మొదలు పెట్టాయి. ఆ విధానంలోనూ కొన్ని   లోపాలున్నా ఇప్పుడు నడుస్తున్న విధానం కంటే ఎన్నో రెట్లు మెరుగైనదది. ముఖ్యంగా   ప్రతి ఓటుకూ సమాన విలువ ఉంటుంది. తద్వారా మొత్తం ఓటర్లకు చెందిన ప్రతినిధులు   ఎంపికయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇది అర్థం కావడానికి మొన్న 2019లో జరిగిన  ఎన్నికల నే అన్వయిస్తాను చూడండి.

1. ఎన్నికల నాటికి ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు. 3,93,45,717. 2. ఎన్నికలలో పోలైన ఓట్లు 3,13,00,000. 3. వై.సి.పి పార్టీకి వచ్చిన కుట్లు = 50%. 1,56, 50,000 4. టి.డి.పి పార్టీకి వచ్చిన ఓట్లు = 40%, 1.25.20,000.వై.సి.పి 151, + టి.డి.పి  23  జనసేన  1 = 175. + దామాషా పద్దతిన వచ్చిన ఓట్లను ఆయా పార్టీలకు పంచితే వాటికి రాగల 

 సీట్లు.

1

1. ఒక్క సీటుకు అవసరమైన ఓట్లు : 3,13,00,000 + 175 = 1,79,0001  సుమారు.

2. వై.సి.పి కి రావలసిన సీట్లు 1,56,50,000  1.79 = 88 సీట్లు 3. టిడిపికి రావలసిన సీట్లు 1. 25 20,0001179  నీట్లు 4. జన సేన కు రావలసిన సీట్లు 18,00,000 : 1.19 = 10 సీట్లు 5. మిగిలిన పార్టీలకు :12,00,0004 1.19  7 పిట్లు... మిత్రులారా ప్రతి ఓటుకు విలువ ఉండాలి. అది సమానమైన విలువ ఉండాలి 

 అన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కచ్చితంగా అమలు చేస్తే మొన్న ఎన్నికలలో వచ్చిన ఓట్లనుబట్టి   ఆయా పార్టీలకు ఇదిగో ఇలా సీట్లు వచ్చి ఉండేవి. ఈ లెఱ్ఱును ఇలా ఉంచండి. ఇప్పుడు   నడుస్తున్న విధానాన్ని బట్టి చూసినా మొత్తం ఓట్లలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ,  శాతం ఎంతో చూద్దాం.

1. 2019 ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లు = 3,93,45,717 మంది. 2. వై.సి.పి కి వచ్చిన ఓట్లు 1,56,50,000 = 39.7 =40% 3. టి.డి.పి కి వచ్చిన ఓట్లు 1,25,20,000 = 31.8 = 32% 4. జనసేన కు వచ్చిన ఓట్లు 18,00,000 = 4.57 = 4.5% 5. మిగిలిన వారందరికీ కలిపి వచ్చిన ఓట్లు 12,00,000 = 3.09 = 3% 

ఈ లెఱ్ఱలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం రెండు ప్రధాన పార్టీలనూ   మెజారిటీ ఓటర్లు తిరస్కరించారన్నదే. వైసి.పి నీ 60% ఓటర్లు తిరస్కరించగా, టీ.డి.పిని ,  68% ఓటర్లు తిరస్కరించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పెద్ద విషాదం ఏమంటే   ఈ 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ మెజారిటీ ప్రజలు ఏ పార్టీని ఎంపిక చేయలేదు. అన్ని  సార్లూ ఎన్నికల విధానంలో ఉన్న మౌలికమైన దోషం కారణంగా మైనారిటీ 

ఇదంతా ఇప్పుడెందుకు?  1. ఎందుకు చెబుతున్నానంటే వై.సి.పి పార్టీ నాయకులంతా ముఖ్యంగా  ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి గారు మాటి మాటికీ 151 సీట్లు ఇచ్చి ప్రజలు  మాకు అధికారం కట్టబెట్టారు, అంటూ మిగిలిన పార్టీ ప్రతినిధులనే గాక, రాజ్యాంగ  వ్యవస్థలను కూడా లెబ్బలేనట్లు మాట్లాడుతున్నారు. నిజానికి ఓటర్లలో 60 శాతం 

2. అదలా ఉంచి ప్రతి ఓటుకూ సమాన విలువ అన్న రాజ్యాంగ ఆ దేశాలను బట్టి ,  లెక్కలు వేస్తే వై.సి.పి.కి 88 సీట్లకు సరిపడా ఓట్లే వచ్చాయి. అదే సమయములో  టి.డి.పి కి 70 సీట్లకు సరిపడాఓట్లు వచ్చాయి. మిగిలిన వారినీ కలుపుకుంటే  పాలకపక్షానికి , ప్రతిపక్షాలకు 8 పిట్లు అవుతున్నాయి. అంటే మెజారిటీని   నిరూపించుకోవడానికి తప్పని సరైన ఒక్కసీటు మాత్రమే అదనంగా వచ్చినట్లున్నమాట. 

ఎన్నికలలో ఓట్లు లెక్కించే విధానం గనుక ప్రజా స్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వుండుంటే  • ఏర్పడే వాస్తవ చిత్రమిదే.

 ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా ప్రస్తుతం అమలవుతున్న ఈ విధానం మాత్రం   ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనదే. గతంలో రాజశేఖరరెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 

అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇలాంటి చిత్రమే ఏర్పడింది. నా దగ్గర ఖచ్చితమైన లెక్కలు ,  ప్రస్తుతం లేవుగానీ, ఆ ఎన్నికలలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) కాంగ్రెసుకు 56, 57 సీట్లు 1  రాగా, టి.డి.పి కి 187 దాకా సీట్లు వచ్చాయి. అయితే ఆ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల 

మధ్య తేడా అత్యల్పంగా సుమారు రెండు లక్షల లోపే ఉంది. దామాషా పద్దతిన గాని  లెక్క కట్టి ఉంటే కాంగ్రెస్ కు 100 పైనా, టి.డి.పి కి 120 వరకు వచ్చి ఉండేవి. అంటే  ఎక్కువ స్థానాలలో వేయి, రెండు వేల ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు 

ఎన్నికలు జరగాల్సిన తీరేమిటి? జరుగుతున్న తీరేమిటి?

ఒక ఓటరు ఓటు వేయడం అంటే ఏమిటో వెనక పేజీలలో చెప్పుకున్నాము. దానిని  గుర్తుచేసుకోండి. ఎన్నికల నియమావళిలో ఓటరును ఏ రకంగానూ ప్రలోభ పెట్టకూడదు.  అతని స్వేచ్ఛను ప్రభావితం చేయరాదు అన్నది అత్యంత కీలకమైనది.

ఒక ఓటరును అతని మానాన అతణి వదిలేస్తే అతడు ఎవరికి ఓటు వేసేవాడో  అన్న దానిని సాధారణ కొలతగా తీసుకుని, ఆ నిర్ణయం మార్చుకోవడానికి, ఇతరులు 1  ఎలాంటి ప్రభావాన్ని (బ్రతిమిలాడో, భయపెట్టి, ఆశపెట్టో, నచ్చజెప్పే పనిచేయడానికి)   కలిగించినా అతని ఓటును అతడు వేసుకోకుండా అడ్డుపడ్డామని అర్థం. ఏ రకమైన , : ఇతర ప్రభావాలకు లోనై అతడు ఓటు వేసినా, అది అతడు వేసిన ఓటు కాదన్నట్లే. 1  ఎన్నికల ప్రక్రియలో ఓటు వ్యక్తిగత స్వేచ్ఛను, సొంత అభిప్రాయ ప్రకటనకు   సంబంధించింది కనుకనే ఓటు పవిత్రమైందన్న మాట వచ్చింది. ఈ సాధారణ 

అవగాహనను గుర్తుంచుకుని ఎన్నికల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ   పార్టీల పోకడను గమనిద్దాం.  . ఎన్నికలన్నవి నిష్పక్షపాతంగా, రాగద్వేషాల కతీతంగా, యోగ్యతల ప్రాతిపదికన }  అభ్యర్థులను  తనకు ప్రతినిధిగా ఓటరు నిర్ణయాన్ని ప్రకటించడానికి ఉద్దేశించినవి   మాత్రమే

ఓటరు ఎన్ని రకాలుగా ప్రభావితం చేయబడుతున్నాడు..? 1. పార్టీ పెట్టి పార్టీ లోకి సభ్యులుగా చేర్చుకోవడం 2. కుల ప్రాతిపదికన ఓటర్లను సముదాయముగా కట్టగట్టడం.  3. మత ప్రాతిపదికన ఓట్లు అడగడం .  4. ప్రాంతీయ అభిమానాలను రగుల్కొల్పడం.

5. స్థానిక నాయకుల్ని కొనేయడం. 6. ఓటుకింతని ధర నిర్ణయించి పోటీపడి కొనడం. 7. మద్యాన్ని ఏరులా పారించడం. 8. విపరీతంగా వార్టనాలు కురిపించడం. 9. ఎన్నికల నాడు ఓటరును ఇంటికెళ్లి మరీ వాహనాలలో పోలింగ్ బూతులకు ,

+ ఇవన్నీ ఎన్నికల సమయంలో దాదాపు అన్ని పక్షాలు అనుసరిస్తున్నవేనని   మనందరకు తెలుసు. అయితే ఆయా పార్టీల వ్యక్తుల బలాబలాలననుసరించి ఎవరెవరు   ఏఏ అంశాలను ఎంతెంతగా వాడుకుంటున్నారన్న దాంట్లో తేడాపాడాలుంటుంటాయంతే. 

2019 ఎన్నికల నాటికి, ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకారం ఒక్క అసెంబ్లీ   నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి ఎన్నికల ఖర్చు రెండు లక్షలకు మించకూడదు.

కానీ   మొన్నటి ఎన్నికల్లో జరిగిందేమిటి? ప్రధాన పార్టీలు రెండూ ఒక్కో అభ్యర్థి పరంగా 15 1 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా బహిరంగంగా ప్రకటించింది. అదే మరి గట్టిపోటీ ఉ   న్నచోట్ల అయితే 50 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వార్తలున్నాయి. మొత్తం మీద రెండు   ప్రధాన పార్టీలు కలపి ఎన్నికల్లో వెచ్చించిన మొత్తం ఎనిమిది వేల నుండి పదివేల కోట్ల   వరకు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. 25, 30 లక్షలెక్కడ? 20, 30 కోట్లు   ఎక్కడ? నిజానికి రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలను నిశితంగా  పరిశీలిస్తే ఒక్క సభకే 25 లక్షల నుండి కోటి వరకూ కూడా ఖర్చు అవుతుందని   తెలిసిపోతుంది. సభలకు జనాన్ని డబ్బిచ్చి తోలుకు రావడం అన్నది ఆనవాయితీగా  మారిపోయింది. తాగినంత మందూ తిన్నంత భోజనం, మూడు రోజుల కూలీ ఇది  సాధారణ లెక్క మొన్నటి ఎన్నికల్లో ఓటుకు వెయ్యి నుండి 20వేల వరకు పెంచినట్లు ,

 ఒక ఓటరు చేత ఓటు వేయించుకోవడానికి అతనికి ఆ అభ్యర్థి తరఫున గానీ, ఆ ఆ పార్టీ తరపున గానీ ఏ రూపంలో ఏది ఇచ్చినా అతడు స్వేచ్ఛగా ఓటు వేయనట్లే. 1  ప్రతిఫలం తీసుకుని ఓటు వేసినట్టే. అధివన్నీ ఓట్లను కొనడం క్రిందకే వస్తాయి. ఈ విధం ,  తెలిసిన వాళ్ళలో ఇది నిర్వివాదాంశం. ,

2019 ఎన్నికలలో వై.సి.పి.కి ఓట్లు రావడానికి దోహదపడిన కారణాంశాలు. ఈ అంశాన్ని రెండుగా విడదీసి అర్థం చేసుకోవలసి ఉంటుంది.      

 

     1. సమాజంలో రాజకీయంగా నెలకొని ఉన్న పరిస్థితులు. 2. ఓటర్లను ఆకర్షించడానికి పనికొచ్చిన పనులు. అంశాలు. ఈ అసాధారణ రీతిలో విజయాలు సిద్ధిస్తుంటాయి. అందుకు కారణం ఆ సమయానికి ఆ  ప్రాంతంలో కొన్ని అసాధారణ పరిస్థితులు నెలకొని ఉండడమే. మొన్నటి 2019 ఎన్నికల   నాటికి ఆంధ్రాలోనూ అలాంటి అసాధారణ పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఆ  ఆ వివరాలివిగో.

1) ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెసు నామమాత్రావశిష్టంగా మారిపోవడం. 

3) ఆ రెండు పార్టీలలో కాంగ్రెసు టి.డి.పి కి సాంప్రదాయకంగానే వ్యతిరేకంగా   ఉండడం, అంత వరకు మిత్రపక్షంగా ఉన్న బి.జె.పి కూడా టి.డి.పి కి శత్రుపక్షంగా   మారడం.

4) ఇక కామ్రేడ్ల పరిస్థితి అయితే వునికి పోరాటానికే పరిమితమై ఉండటం.  లేకపోవడం.

6) వీటన్నింటికంటే కీలకమైనది, వై.సి.పి  టి.డి.పి ల మధ్య అసలు పోరంతా   అని తేలిపోవడం, ఆ రెండూ రాజకీయ ప్రతిపక్షాలుగా కాకుండా, శత్రుపక్షాలుగా   తాడోపేడో, చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఇప్పుడు గాని పట్టు కోల్పోతే భవిష్యత్తే   అగమ్య గోచరమైపోతుందనుకొని తలపడటం. ఇదో రకమైన అసాధారణ పరిస్థితి.  పాదయాత్ర వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితి.

1.వై.ఎస్.ఆర్ మరణం. జగన్ పాదయాత్ర అన్న వాటి కారణంగా సామాన్య ,  ప్రజానీకంలో సానుభూతి ఉప్పెననూ పొంగుకొచ్చింది. అంతగా సానుభూతి రావడానికి  కారణాలు రెండు. ఎ) నిరంతరాయంగా 400 రోజులు నిత్యము సామాన్య జనానికి

దగ్గరగా, వారితో కలసిమెలసి మసలుకోవడం, ఆ ఆ యాత్ర సమయంలో అదే  పనిగా, రేపు రాబోయేది మన ప్రభుత్వమే, రేపు అధికారంలోకి రాగానే మీకు ఒక                    

 అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, అన్నింటికీ నేనే ఉంటాను అంటూ చెబుతూ రావడం. 

2.టి.డి.పి ఎం.ఎల్.ఎల అవినీతి పోకడలపై ప్రజలలో నెలకొన్న విపరీతమైన

3. సాధారణంగా రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో 60,65% ఓట్లు మాత్రమే పోలవుతాయి

తెలుసు. ఓట్ల శాతం పెంచకపోతే టి.డి.పి గెలవడం అసాధ్యం అని వారెరుగుదురు.

అందుకే వై.సి.పి వ్యూహం అంతా కాంగ్రెస్ బీ.జే.పీ ఓటర్లను ఓటు వేయకుండా  స్థబ్దంగా ఉండే ఓటర్లను ఏదోరకంగా పట్టుకొచ్చి ఓటు వేయించడం అన్నదాని చుట్టూ  అల్లుకుని ఉన్నది. ఈ విషయంలో కాంగ్రెసుకు వైయస్సార్ తమ వాడేనన్న అభిమానం • నివురుగప్పిన నిప్పులా వుంది. మొన్నటి వై.సి.పి విజయానికి ఈ రెండు అసాధారణ  పరిస్థితులే కారణం. అందులోనూ 80% ఓటింగు జరగడం ద్వారా 65% ఓట్లలో ఉ  న్న కాంగ్రెసు, బిజెపి ఓట్లు 80కి పెరిగిన వాటిలోని 1015% ఓట్లు కలవడమే 1

 టి.డి.పి ఏమాత్రం బలహీన పడలేదు. పైగా బలపడింది కూడా. ఇన్ని వ్యతిరేకతల 

మధ్య కూడా అది మొత్తం ఓట్లలో 32 , పోలైన ఓట్లలో 40%ఓట్లు సంపాదించ  గలిగింది. దానర్థం టి.డి.పి ఎప్పటిలాగానే దృఢంగా ఉందని.

ఈ నిజాన్ని చాలా స్పష్టంగా చూడగలిగారు. గనుకనే రాజకీయ విశ్లేషకుల్లో   పితామహునివంటి వారైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వై.సీ.పీ పార్టీ వారికి ఒక

 బ్రమ పడకండి. అది ఏమాత్రం బలహీన పడలేదు. అలాగే మీకు వచ్చిన 151  సీట్లను చూచి అదంతా మీ బలమే అనుకోకండి. అది మీ బలం కాదు. తాత్కాలికంగా

 అనేంతవరకు సూటిగా చెప్పేశారాయన.  ఎన్నికల తీరు తెన్నులకు సంబంధించి మరికొన్ని మాటలు  నిజంగా రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికలు  • జరిగితే ఎన్నికల అతి ఎలా ఉంటుందంటారు?

1. పౌరుల ఓటర్ల  ఎప్పటిలాగానే ఓటు విలువ, ఎన్నికల ఉద్దేశము సరిగా   తెలియని స్థితిలోనే ఉన్నారు.


2. ఎన్నికల కమిషన్ వ్యక్తిగత ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. దాని ప్రకారం  13. పార్టీలు వారి వారి ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసి ఊరుకుంటాయి.  4. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ప్రచార వేదికల నుండి రెండు సార్లో, మూడు సార్లో  ఆయా పార్టీలు ఎంపిక చేసిన పార్టీ అధికార ప్రతినిధులే తమ పార్టీ ప్రణాళికను  వివరిస్తారు.  5) ఎక్కడ ఏ రకమైన ప్రచారాలు ఉండవు. పోలింగ్ బూతుల కు ఓటర్లను

6) డబ్బుగానీ, మద్యంగానీ, మరోటిగానీ పంచడం అసలే ఉండదు.

 పోలింగ్ శాతం ఎంత ఉంటుందో చెప్పగలరా?

నా అంచనా ప్రకారం అది 40% నికి మించదు. ఇందులో వైపు వై.సి.పి (జగన్  గారికి) ఎంత శాతం ఓట్లు రావచ్చు? 15%నికి మించి వచ్చే అవకాశమే లేదు.  ఎందుకంటే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు అతని గురించి తెలిసింది చాలా తక్కువ. • తెలిసినంతలో వైఎస్సార్ కుమారుడు. ఇంకాస్త తెలిస్తే అవినీతి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కుని జైలుకు వెళ్లి వచ్చిన వారు

ఇక చంద్రబాబు నాయుడు గారికి (టీ.డి.పి కి) కూడా 15 నుండి 18 శాతం   లోపు ఓట్లు రావచ్చు. ఎందుకంటే చాలా కాలంగా అతడు ప్రజలకు తెలుసు గనుక.

కాంగ్రెసు కైతే 6 లేక 7 శాతం వరకు వచ్చేందుకు వీలుంది. కాంగ్రెస్ పార్టీకి   ఆ మేరకు సాంప్రదాయక ఓటర్లు ఉన్నారు గనుక మిగిలిన నాలుగు, ఐదు శాతం   మిగిలిన వారికి వచ్చేవి.

ఎట్టి ఒత్తిడులూ, ఆశలూ, భయాలు, ప్రయోజనాలు లేని వాతావరణంలో ఎన్నికలు  • నిర్వహించి, ఇప్పటి ఓటర్ల మానసిక స్థితిని అనుసరించి, స్వచ్చందంగా పోలింగ్ బూత్   లకు వచ్చి ఓట్లు వేసే వారు 40% మించి ఉండనే ఉండరు. ఆ మేరకు పోలింగ్   జరిగినా కొంతవరకు ప్రజలలో కదలిక ఉన్నట్లే..  మొన్న అన్నికలలో వాస్తవంగా జరిగిందేమిటి?

1. ఎన్నికలకు రెండు సంవత్సరముల ముందు నుండి కులం పేరునా, మతం  ఆ పేరునా, వై.ఎస్.ఆర్ మరణం పేరునా ఓటర్లను రాబట్టుకోవడం మొదలైంది.  2. ముఖ్యంగా మతం పేరున గుండుగుత్తగా ఓట్లు పడ్డాయి.

                         3. ఏలాగు కుల రాజకీయాలు ఎప్పటినుండో నడుస్తూనే ఉన్నాయి గనుక ఆ ఓట్లు 

14. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచరులుగా ఉన్న,   ఆయన వల్ల లబ్ది పొందిన వారు పోగేసిన ఓట్లు పడ్డాయి. 5. కాంగ్రెసు, బి.జె.పిల ఓట్లు పెద్ద భాగం వీరికే పడ్డాయి..

6. వీటికితోడు వరదలా పారించిన డబ్బు తెచ్చిన ఓట్లు జతపడ్డాయి.

 జాయింపుగానైనా లెక్కగట్టగలిగితే లెక్కకట్టండి. అవన్నీ మినహాయించి మిగిలిన ఓట్లే   జగన్ గారికి వై.సీ.పీ కి సొంతంగా రాగలిగిన ఓట్లు. ఇవన్నీ అందాజుగా అయినా 

లెక్క చూశాకనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు...  151 సీట్లు రావడం బలం కాదు. వాటి కోసం వచ్చిన ఓట్లూ మీ బలంకాడు అని   అనేశారు. ఎన్నికల రీతి రివాజులకు సంబంధించి చాలానే మాట్లాడుకున్నాం. దీనిని ఇక్కడితో ఆ  ఆపుదాము .

 మాట్లాడదాం .  జగన్మోహన్ రెడ్డి గారు నియంత అన్నది స్వపక్షీయులు ఇతరులు కూడా అంగీకరించే ,  విషయమే. ఏమాటకామాటే చెప్పుకోవాలి చంద్రబాబునాయుడు గారు నియంతే. ఇంకా 

 కలుగుతోంది అన్నది దీని గురించే. అలాగే, కొందరు వ్యక్తుల పట్ల వీరవిధేయత  చూపడమూ నియంతృత్వానికి దారి తీస్తుందన్నదీ ఇలాంటి పరిస్థితులను ఊహించే  ఈనాడు వై.సి.పి పార్టీలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులే గాక ఎన్నికైన వారూ,

మంత్రి పదవులధిష్టించిన వారు కూడా జగన్ గారి పట్ల వీర విధేయతనే  కనపరుస్తున్నారన్నది. అనేక సందర్భాలలో దాదాపు ప్రతి సందర్భంలోనూ)మనం ప్రత్యక్షంగా చూస్తున్నది. కడకు అసెంబ్లీ స్పీకర్ గారు కూడా వీరవిధేయతను బహిరంగంగా   ప్రదర్శించడం జగన్ గారి విషయంలో కొసమెరుపు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు   అపాయింట్మెంట్ కావాలంటే పడిగాపులు పడి ఉండాల్సిందేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దేశ రాజకీయాలంతటా ఇదే ఒరవడి నడుస్తోంది. ఆయా స్థానాలలో ఒకటవ  స్థానంలో ఉన్న వారంతా అరుదుగా తప్ప సాధారణంగా నియంతలుగానే ఉంటున్నారు.

ఈ సంవత్సర కాలంగా జరుగుతూ వస్తున్న పాలనా విధానాన్ని చూడగలిగితే జగన్ గారు చేస్తున్న పనులన్నిటి లక్ష్యమూ రేపు 2024 ఎన్నికల నాటికి ఖచ్చితంగా గెలవడానికి, అది తిరుగులేని మెజారిటీతో గెలవడానికి అవసరమైన ఓటు బ్యాంకును సమకూర్చుకోవటమన్నది మాత్రమే. అందుకు జగన్ గారికి రాజకీయ సలహాదారులుగ 

లక్షా ఉన్నారు. ప్రజా ధనంతో వీరికి వేతనాలు అందుతాయి. వీరంతా పార్టీ కార్యకర్తలుగా పని చేసేలా తర్ఫీదు ఇవ్వబడుతుంది. ఏ కొద్దిమందో ఈ పోకడను అంగీకరించని వారు ఉంటే, వారిని గెంటివేయటమో, లొంగదీసుకోవడమో, పొగబెట్టి వారే పోయేలా  చేయడమో బయట ప్రపంచానికి తెలియనీయకుండానే చేసేస్తుంటారు. ఇలాంటివి  4,5 కేసులు పత్రికల్లోకి వచ్చాయి కూడా.

 పార్టీల ఓటర్లు అన్న కుటుంబాలను నెమ్మది నెమ్మదిగా ఆకట్టుకోవడం మీదే ఉ  ంటుంది. అదేసమయంలో ఎవరికీ ఓటేయని ఉదాసీనులను కనుగొని వారినీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికే విసుగూ విరామం లేకుండా యత్నించే పని చేస్తుంటారు. 2024 నాటికి ఓటర్ల సంఖ్య నాలుగున్నర కోట్ల నుండి ఐదు కోట్ల మధ్య ఉండవచ్చు. కచ్చితంగా రెండు కోట్ల మందిని సొంత ఓటర్లుగా మార్చుకుంటే ఇక తమకు మిగిలిన : తలపెట్టిన రకరకాల పథకాల పరమార్థం. జగన్ గారికి తెర వెనక నుండి వ్యూహరచన

చేస్తున్న వారు చాణక్య తంత్రములో పెట్టి లేననుకోవాలి. తాయిలాలు, ఉచిత పందేలు,  ఎన్ని రూపాలలో ప్రతి ఇంటింటికీ చేరవేయాలో అన్ని రకాల పథకాలను రూపొందిస్తూ

సామాన్య ప్రజల నాడిని పట్టి ప్రవర్తిస్తున్నారు. ఆ పథకాల వివరాలన్నీ ఇక్కడ పొందు  పరచడం సాధ్యం కాదు గానీ మచ్చుకు కొన్నింటిని ప్రస్తావిస్తాను.             

1) కంటి చికిత్సలు, కళ్ళజోళ్ళ పంపిణీ. దీని విషయమై జగన్ గారే స్వయంగా ఈ   లబ్దిదారుల సంఖ్య 54 లక్షల పైనేనని ప్రకటించారు.

2) ఇళ్ల స్థలాల పంపిణీ పథకం క్రింద లబ్ధిదారులు 35 లక్షల మందిని చెబుతున్నారు.

. ఇలా రకరకాల పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం, అందించాల్సిన

ఇలా ప్రతి కుటుంబానికీ ఏదో రూపంలో ఆర్థిక సాయం అందేలా చూడటమే ఈ  పథకాలన్నింటి లక్ష్యం. ఈ ఎంపికలో తన పర అన్నది పట్టించుకోకపోవడమే గాక, ఇతర పార్టీల వారికే మొదటి స్థానం ఇస్తున్నట్లు కనిపించేలా ప్రణాళిక ఉంటుంది. ఆంతరంగిక సమావేశాలలో తమ సొంత వాళ్లకు ఇదంతా వాళ్ళ ఓట్లు రాబట్టడనికి గాని మిమ్మల్ని అప్రధానం చేయడానికి కాదు అన్న అవగాహన కలిగిస్తూనూ ఉ  ంటారు. ఈ వ్యూహం దానికదే ఒక గొప్ప వలలాంటిది. సామాన్యజనం అల్పసంతోషాలు,

సాయం చేసిన వారి పట్ల వీరాభిమానం పెంచుకునే నైజం కలిగి ఉంటారు. అదిగో  దానినే వీరు సొంతం చేసుకో చూస్తున్నారు.  లక్ష మంది పాస్టర్లకు నెలవారీ వేతనాలు.  ఇంతటి నిర్లజ్జతో కూడిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పని స్వతంత్ర భారత  చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదు. రాష్ట్రంలో ఉన్న గ్రామాలే సుమారు పదకొండు  వేలు. వాటిలో లక్షమంది పాస్టర్లు. ఎంపిక చేసిన వారే లక్షమందయితే, రాష్ట్రంలో  ఎంపిక చేయని పాస్టర్లు ఇంకెంతమంది ఉండవచ్చు? ఎంపికైన వారే సగటున గ్రామానికి  910 మంది వరకు అవుతున్నారు. జీతాలు తీసుకుని వీరు చేసే పని ఏమిటంటా?

మరింత మరింతగా క్రైస్తవ మత ప్రచారం మొదలు పెడతారు. అమాయక జనాన్ని  క్రమంగా క్రైస్తవంలోకి తరలిస్తూ ఉంటారు. దీనివల్ల వారికి వ్యక్తిగతంగా రెండు  ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అప్పటికి ఉన్న సంఘం సంఖ్య పెరుగుతుంది. కనుక రాబడి  (దశమ భాగాలు) పెరుగుతుంది. తనను అనుసరించే మంది బలం పెరుగుతుంది.

ప్రభుత్వ వత్తాసు ఉంది కనుక పలుకుబడి పెరుగుతుంది. ఒక స్తాయి పాస్తరు వ్యక్తికి ఇంతకంటే కావలసింది మది + దీనివల్ల జగన్ గారికి వైసీ.పీకి కలిగే లాభం ఏమిటి?

1) ఆ పాస్టర్లు జగన్ తమకు చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వీర   విధేయులైపోతారు. తన సంఘ కుటుంబాలనే గాక, తన పరిచయ కుటుంబాలనూ  గొప్పగా పని చేస్తుంటారు.

+ దీనివల్ల జగన్ ప్రధాన లక్ష్యమైన ఓటు బ్యాంకు ఖాతా లో జరిగే మార్పేమిటి?   ఒక మాదిరి ఆలోచనాపరులకు కూడా అందనంత ఓటర్లు ఖాతాకు జమ అవుతారు.  అదెలాగంటే ఒక్క పాస్టరుకు కనీసం 50 మంది సంఘ సభ్యులు ఉన్నారనుకుందాం.  అప్పటికే లక్ష మంది పాస్టర్ల అజమాయిషీలో 50 లక్షల మంది జనం ఉన్నారన్న  • మాట. ఇక ప్రతి పాస్టరూ రానున్న నాలుగు సంవత్సరముల కాలంలో కనీసం మరో  150 మందినైనా ప్రభావితం చేయగలిగితే, ఆ సంఖ్య ఒక కోటికి చేరుతుంది. ఆ దశలో   ఈ పాస్టర్లు తమ సభ్యుల నెత్తిన బైబిల్ పెట్టి ఏసు పేరున చెప్పండి, ఒక క్రైస్తవుడు  పాలన చేయడానికి అనుకూలంగా ఓటేస్తారా? ప్రతికూలంగానా అని గనక అంటే,  దాదాపు అందరూ యేసును నమ్మిన వానికే మా ఓటు అనేస్తారు. దీనికి చాలా అత్యల్ప   సంఖ్యలోనే మినహాయింపు ఉండే అవకాశం ఉంది. .

 సిద్ధమైందో తెలుసా?

1) ఎన్నికల నాటికి ఉన్న అవది యాభై నెలలు అనుకుందాం. లక్ష x 5000 x 50   = 2500కోట్లు అన్నమాట. ఇంత ప్రజాధనాన్ని నెలవారీ జీతాలు పేరిట క్రైస్తవుల   ఓట్లు కోసం ఖర్చుపెట్టేస్తానికి పథక రచన చేసి పని మొదలు పెట్టేశారు అన్నమాట.

రాష్ట్రం మొత్తం నుండి వివిధ కులాలకు చెందిన క్రైస్తవ మతం పుచ్చుకున్న వారి  నుండీ వారి చేత ప్రభావితం చేయించగలిగే వారినీ కలుపుకొని 'ఒక కోటి' గమనించారా  అక్షరాలా ఒక కోటి మంది ఓటర్లను ఓటు బ్యాంకు ఖాతాలో జమ వేసుకోవాలని  అనుకుంటున్నారు అన్నమాట.

అతిశయోక్తి లేనే లేదు.  ఇదేవిధంగా గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అయ్యే ఖర్చు   ఎంతో చూద్దాం

1) గ్రామ వాలంటీర్లు 1,10,000 మంది నెలకు ఐదు వేలు జీతం కిం నెలలకు,  1 1,40,000 x 5000 = 50 = 3,500కోట్లు . వెరసి 2,500+3,500+10,50016,500కోట్ల ప్రజాధనాన్ని తనకు నాలుగేళ్లపాటు  కార్యకర్తలుగా పనిచేసేవాళ్లు కొరకు కేటాయించేశారన్న మాట.  చిల్లర మల్లర విషయాలపైన నానా యాగి చేస్తుండే ఇతర పార్టీల నాయకులు  గానీ, ప్రసార మాధ్యమాలు గానీ, పట్టించుకున్న పాపానపోలేదు. నా లెక్కన అసలు  ప్రమాదం ఈ 16,500 కోట్లు ఖర్చు అయిపోవడం కానే కాదు. రాబోయే ఎన్నికలలో  ఎట్టి అడ్డంకులూ లేకుండా తానే గెలిచి మరో ఐదేళ్ల పాటు రాష్ట్రం నెత్తిన కూర్చోవడం  అన్నదే అసలు ప్రమాదం. ఏదో రకంగా దీనిని ఆపకుంటే, వారి గెలుపు అన్నది స్పీడ్

 ప్రభుత్వపు ఆలోచనలో కపట వ్యూహమూ ఉందని చెప్పుకోవడమే సరైందవుతుంది. ఈ  ప్రతిపాదన ఎందుకు చేస్తున్నామంటే అంటూ వారు చెబుతున్న ప్రధానాంశాలు రెండే  రెండు ఉన్నాయి.

1) రాష్ట్రమంతా సమానాభివృద్ధి జరగాలి (మూడు ప్రాంతాలు). 2) అధికార వికేంద్రీకరణ జరగాలి.

రాజ్యాంగాన్ని గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా సమష్టి హితం కోరే నైజం  ఉన్నా, ప్రజాస్వామ్యం అమలవ్వాలన్నా, ఈ రెండింటిని రాష్ట్రం సాధించుకోవలసి వుందనే  తేలిపోతుంది. కనుక వారు చెబుతున్నది ఎవరూ కాదనడానికి వీల్లేని లక్ష్యాల గురించే.

 మూడు రాజధానులను ఏర్పరిచి పాలన వికేంద్రీకరణ చేస్తాము అనే కదా పాలనను   వికేంద్రీకరించడం వల్ల అన్ని జిల్లాలూ సమానంగా ఎలా అభివృద్ధి చెందుతాయో,  అధికార వికేంద్రీకరణ ఎలా జరుగుతుందో ఒక్క మాట చెప్పరు. రకరకాల సమస్యలపై  విమర్శలు రేషణలు కుప్పలు తెప్పలుగా కుమ్మరించే ప్రతిపక్షాలు గాని మేధావులు  ఈ ఒక్క అంశాన్ని లేవనెత్తి నిగ్గదీయరు.

అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటో రాజ్యాంగమే చాలా స్పష్టంగా సూచించింది.  అధికారాలు, విధులు కేంద్రీకృతం కాకుండా ఏ స్థాయి పాలనా నిర్వహణలకు చెందిన

 పంచేయాలనీ, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరుగుతుందనీ, చేయాల్సిన ఈ పని  చేయకుండా చట్టబద్ధంగానే ఎంపికై నిర్మాణంలో ఉన్న అమరావతి నిర్మాణానికి  తిలోదకాలిచ్చే తమకు ఎక్కువలో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చి పెట్టగల విశాఖకు పెద్దపీట వేశారు. రాయలసీమ వాసుల అసహనాన్ని శాంతింప జేయడానికి రాజ్యాంగం మూడంచెల పాలనా వ్యవస్థ ఉండాలి అని ఎన్నడో చెప్పినా కేంద్ర   రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్థానిక సంస్థలకు అధికారాలను గానీ, నిధులను గానీ  రాజ్యాంగం చెప్పిన చొప్పున విడుదల చేయడానికి సిద్ధంగా లేరు. అటు అధికారులు   ఇటు నిధులూ తమ చేతిలో ఉండాలనే వారు కోరుకుంటున్నారు.

ఏ గ్రామానికాగ్రామానికీ, ఏ మండలానికామండలానికీ, ఏ జిల్లా కా జిల్లాకు,  జిల్లా ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం నిధులను, అధికారాలను కట్టబెట్టినప్పుడే  అధికార వికేంద్రీకరణ జరిగినట్లు. ఈ వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే వై.సీ.పీ  ప్రభుత్వం చేస్తానంటున్నది అధికార వికేంద్రీకరణ కాదన్న నిజం అర్థం కాదు.  మూడు రాజధానులు ఏర్పడ్డాయి అనుకుందాం. మూడు చోట్లా అధికారాలు  చెలాయించేది ఎవరు? వైసీ.పీ ప్రభుత్వమేనా, స్థానిక ప్రభుత్వాలేమైనా ఏర్పడి, అధికారాలు, • నిధులు పంచ పడతాయా?  మూడు చోట్లా పాలనాధికారం జగన్ గారి చేతుల్లోనే ఉంటుంది.

రాష్ట్రానికి చెందిన

కోర్టును తరలిస్తే అది రాజధాని ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో, తలకాయి

 సంవత్సరంలో 45 రోజులు మాత్రం సమావేశాలు జరుపుకునే అసెంబ్లీ భవనాలు  ఏర్పరిచిన నాటు రాజధాని ఎందుకు అవుతుందోనూ వారి వివరించాలి. రాష్ట్ర  సచివాలయం ముఖ్యమంత్రి నివాసం ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వంలోని

మంత్రుల నివాసాలు, కార్యాలయాలు విశాఖలో ఉండగా మరో దానిని రాజధాని  అన్న వెనక నిజాయితీ, సత్యసంధత ఉందనగలమా?

 కుటిలత్వాన్ని బహిర్గత పరచడానికి, నేను ఒక ప్రత్యామ్నాయం చూపుతాను. దాన్ని జగన్ బృందం అంగీకరించగలరేమో చూద్దాం. వారు విశాఖకు తరలిస్తానన్న భాగాన్ని

అమరావతికి కేటాయించాలి. అసెంబ్లీ సమావేశాల విభాగాన్ని కర్నూలుకు ఇచ్చి, హైకోర్టు  విభాగాన్ని విశాఖలో పెట్టాలి. ఈ రకంగా చేయగలిగితే అమరావతి ప్రజలు

అంగీకరిస్తారు. రాష్ట్రమంతటికీ పాలన, నిర్వహణ విభాగం సమానమైన దూరంలో ఉ ంటుంది కనుక మిగిలిన రెండు ప్రాంతాలవారూ అడ్డు చెప్పరు.

రాయలసీమ వాళ్లయితే  స్వాగతిస్తారు కూడా.

ఇక శాసనసభ విభాగాన్ని రాయలసీమకు ఇవ్వడం ద్వారా, హైకోర్టును ఇచ్చిన  దానికంటే ఎక్కువగా తృప్తి కలుగుతుంది సీమ ప్రజలకు. ఇక హైకోర్టు తమకి రావడం  ద్వారా విశాఖ వాసులకు అభ్యంతరం ఉండదు. ఎందుకంటే రాజధాని తమ జిల్లాలోనే  ఉండాలని వారెన్నడూ కోరుకోలేదు. అది జగన్ కూటమి రేకెత్తించిన ప్రతిపాదన  మాత్రమే. పైగా మేధావులలో సింహభాగం ఈ రాజకీయులంతా ఇక్కడ తిష్ట వేస్తే  ఏమేమి రచ్చలు, రగడలు వస్తాయోనన్న ఆందోళనలోను ఉంటున్నారు.  1. వై.సి.పి ఈ మార్పు ప్రతిపాదన చేయగానే అప్పటి వరకు ఎంతో వేగంగా  విస్తరిస్తూ ఉన్న అమరావతి రాజధాని ప్రాంతమూ దానిలో అనుసంధానింపబడిన విజయవాడ  గుంటూరు  తెనాలి నగరాలూ కండరాలు చచ్చుబడిన మనీషివలే కుప్పకూలిపోయాయి.

13. వాస్తవానికి రాజధానిని విశాఖకు తరలించాలనుకుని ఈ దొంగాటకాలాడటం  వెనుక నిజాయితీలో లోపం తప్ప మరోటి ఉందని అని అనలేము.

ముగింపుగా  ఇలా ప్రతి అంశాన్ని విడమరచి చెప్పుకోవడానికి సమయమూ చాలదు. స్థలాభావం  రీత్యా పత్రికకు సాధ్యపడదు. కనుక ఒకటి రెండు సూచనలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

రాజ్యాంగం పై తగినంత అవగాహన కలిగి ఉన్నంతలో నిష్పాక్షిక దృష్టి కలవారుగా కనపడుతూ రాజకీయ విశ్లేషకులుగా ప్రజల బాగు కోరే వారిగా  ప్రసిద్ధులైయుండి చెప్పదలుచుకున్న విషయాన్ని ఎట్టి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు         

 అనిపించే నలుగురు మేధావుల పేర్లు చెబుతాను. వారందరూ కలసిగానీ, ఎవరికివారుగా

గానీ జగన్ ప్రభుత్వం నడక తీరు రాష్ట్ర పురోభివృద్ధిని చేకూర్చి పెట్టేదిగానే వుందని " చెప్పగలరేమో చూద్దాం.  1) జయప్రకాష్ నారాయణ గారు 2) ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 3)  ఉభయ రాష్ట్రాలలో మరెంతో మంది ఈ పని చేయగల వారు ఉండవచ్చు. అయినా  ఈ నలుగురూ మనం చేయమన్న పని చేయడానికి అనర్హులనడం గానీ, అసమర్ధులనటం

 చివరి మాట: జగన్ ప్రభుత్వంలో, నిర్ణయక పాత్ర పోషిస్తున్న బృందం అటు  పూర్తిగా తెలిసిన వారు గానీ, ఏమీ తెలియని వారు గానీ, కాకపోవడమే రాష్ట్రం  ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం.


మన విధానం : సత్యపక్షాన నిలవడం, ధర్మబద్ధంగా జీవించడం.


No comments:

Post a Comment