Showing posts with label 182. Show all posts
Showing posts with label 182. Show all posts

Tuesday, November 1, 2011

సంపాదకీయం : లక్ష్యాలు, ఉద్దేశ్యాలకు - సంబంధించిన తీర్మానం :



యోచనాశీలత మాత్రమే కాక, సమాజహితకాంక్ష కల వారందరికీ వివేకపథం ఉద్యమాభినందనలు తెలుపుతోంది. కొన్ని సాంకేతిక కారణాలవల్ల పత్రిక ప్రచురణ రెండు మాసాలు వాయిదాపడింది. ఆలోటును పూడ్చుతూ, దేశమంతా నిరంతరం మననం చేసుకోవలసిన ఎంతో విలువైన భావజాలంతో ఇదిగో మళ్ళీ విూచేతిలో ఉంది పత్రిక. శ్రద్దతో మనస్సుపెట్టి ఈదేశసంక్షేమంకోసం తపించిన వెనకటి వారి హృదయాన్ని అందుకునేందుకు సిద్దపడండి.
   1. If you want to destroy a nation destroy its history first"  అది వలసపాలకుల తెలివైన సూత్రీకరణ. ఒకజాతిని (దేశాన్ని), నాశనం చేయాలంటే ముందుగా ఆ దేశచరిత్రను నాశనం చెయ్యాలి. అది ఆ దేశప్రజల్ని చరిత్రహీనుల్ని చేయడమన్నమాట.
2. ''పురోభివృద్దిని కోరువారు పూర్వవృత్తాంతమును మరువరాదు'' ప్రతివ్యక్తీ నిరంతరం గుర్తుంచుకోతగినంత విలువగల తాత్వికసూత్రీకరణ ఇది.